ముగిసిన జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020పై జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా గత రెండు రోజులుగా జరిగిన జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సంస్కృత వర్సిటీ వీసీ శ్రీనివాస వర్కేడి, లాల్ బహుదూర్ శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీమనోహర్ పాఠక్, ఎన్‌ఎస్‌యూ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం వర్సిటీ అధికారులు అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. రాష్ట్రపతి సన్మానగ్రహీత, మాజీ అకడమిక్ డీన్ కొంపెల్ల రామసూర్యనారాయణ, వర్సీటీ వీసీ లక్ష్మీశ్రీనివాస్ పాండే, పలు వర్సిటీల మాజీ వీసీలు పరమేశ్వరనారాయణశాస్త్రి, అర్కనాథ చౌదరీ, సంస్కృత సంవర్థన ప్రతిష్టానం డైరెక్టర్ చాంద్ కిరణ్ సలూజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment