ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ సీజ్
చంద్రగిరి: ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ సమీపంలో జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న చాణక్య అనే యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ అధికార పార్టీ నేతకు చెందినది కావడంతో దాన్ని తప్పించేందుకు టీడీపీ నేతలు పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ను సీజ్ చేయడంలో పోలీసులు వెనుకంజ వేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చేసేది లేక పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment