కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌కు అర్జీదారులు పోటెత్తారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్‌తో కలిసి అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 265 అర్జీలు రాగా.. అందులో 172 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.
సమస్యలే సమస్యలు
● గిరిజన యానాది కాలనీల్లో పలువురు పిల్లలతోపాటు పెద్దలకు ఆధార్‌కార్డులు లేవని ఏపీ యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బీఎల్ శేఖర్, జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
● కేవీబీపురం మండలం, ఎస్‌ఎల్‌పురం గ్రామంలోని స్కూల్‌లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను 2.5 కి.మీ దూరంలోని పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, వారిని కళత్తూరు పాఠశాలకు మార్పు చేయాలని కోరారు. పలువురికి ఇంటి పట్టాలిచ్చినా స్థలాలు చూపించలేదన్నారు.
● బైరాగిపట్టిడిలోని మద్యం షాపును మరోచోటుకు మార్పు చేయాలని పలువురు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు.
● అవిలాల చెరువును రక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
● వరి ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచాలని పలువురు రైతులు కోరారు. అలాగే సకాలంలో బిల్లులు ఇవ్వాలన్నారు.
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
Comments
Please login to add a commentAdd a comment