రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తడ: జాతీయ రనహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పూడి గ్రామానికి చెందిన ఇరుగళం వినోద్(24) మృతి చెందాడు. ఎస్‌ఐ కొండపనాయుడు కథనం.. పూడి గ్రామానికి చెందిన వెట్టి భాస్కర్, వినోద్ బైక్‌పై తడవైపు బయలు దేరారు. కొద్ది సేపటికే రోడ్డుపై వెళుతున్న మరో బైక్‌ను దాటే క్రమంలో అదుపు తప్పి ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చుని ఉన్న వినోద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి మృత దేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
నయా మోసం!
● క్యూఆర్ కోడ్‌పై నకిలీ స్టిక్కర్
అతికించిన వైనం
తడ: నగదు స్కానింగ్ విషయంలో రోజుకో మోసం వెలుగులోకి వస్తోంది. తాజాగా తడలోని పలు దుకాణాల్లో కొత్త రకం మోసంతో వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల సమాచారం మేరకు.. టీ, మాంసం దుకాణాల్లో ఫోన్‌పే, గూగుల్ పే వంటి నగదు బదిలీల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు షాపులు బయట అతికించి ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఓ చికెన్ దుకాణం వద్ద వినియోగదారుడు నగదు బదిలీ చేసినప్పటికీ సదరు నగదు దుకాణ దారునికి చేరలేదు. దీనిపై ఆరాతీయగా అసలు స్టిక్కరుపై ఉన్న క్యూఆర్ కోడ్ వరకు కొత్తగా మరో స్టిక్కర్ ఉండడాన్ని గుర్తించారు. దుకాణ దారుడు మిగిలిన వారిని కూడా విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ క్యూర్ కోడ్ ఏ బ్యాంకుతో లింక్ అయిందో తెలుసుకునేందుకు పోలీసులు బ్యాంకులను సంప్రదిస్తున్నారు.
ఇంటర్ పరీక్షకు
375 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 25,107 మంది, ఒకేషనల్‌లో 1,037 మంది మొత్తం 26,144 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 375 మంది గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా మంగళవారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో జిల్లా వ్యాప్తంగా 86పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment