
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
తడ: జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రామాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తమిళనాడు, గుమ్మిడిపూండి తాలూకా, ఆరంబాకం గ్రామానికి చెందిన కే రవి (57) లారీ క్లీనర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను తన సొంత పని పని నిమిత్తం తడ మండలం, రామాపురం గ్రామం వద్ద ఉన్న సిమెంటు షాపు వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లాడు. చైన్నె వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న రవిని అదే మార్గంలో వెళుతున్న ఐషర్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో రవి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు రవిని తమిళనాడులోని ఎళ్లావూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుని కుమారుడు శనివారం ఈ మేరకు తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొడపనాయుడు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment