
ప్రశాంతంగా పది పరీక్షలు
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా 162 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదోతరగతి పరీక్షలు కావడంతో విద్యార్థులు పలు దేవాలయాల వద్ద కిటకిటలాడారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లాలోని 26,670మంది విద్యార్థులు హాజరవ్వాలి ఉండగా వారిలో 269 మంది గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ విద్యార్థులు 133 మందికి గాను 30మంది గైర్హాజరయ్యారు. వివిధ కారణాలతో పరీక్ష రాయలేని విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్‌కు అనుమతి ఇచ్చారు.
పటిష్ట బందోబస్తు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. బయటి వ్యక్తులు లోనికి వెళ్లకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పరీక్ష నిర్వహణాధికారుల సెల్‌ఫోన్లను కేంద్రాల్లోకి నిషేధించారు.
ఆకస్మిక తనిఖీలు
కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రెండు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈఓ కేవీఎన్.కుమార్ మూడు పరీక్షా కేంద్రాలను, జిల్లా స్థాయి పరిశీలకులు 10 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మరో 10 మంది పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అలాగే సమస్యాత్మక 30పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ విధులు నిర్వహించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించినట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు.

ప్రశాంతంగా పది పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment