
ఆపద వేళ అత్యుత్సాహమా?
జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కోట వినుత జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలో కార్యకర్తలు అత్యుత్సాహం కనబరిచారు. ఇందులో భాగంగా వాహనాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 108 వాహనం చిక్కుకుపోయింది. 108 వాహనానికి దారి ఇవ్వకుండా కార్యకర్తలు ముందుకు వెళుతూనే ఉండడం విమర్శలకు తావిచ్చింది. చేసేది లేక 108 వాహనం ర్యాలీ వెనుకే వెళుతుండడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకోవడం కనిపించింది. ఇదేం పని అంటూ శాపనార్థాలు పెట్టారు.
– శ్రీకాళహస్తి
ట్రాఫిక్‌లో చిక్కుకున్న 108 వాహనం
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురు వారం అర్ధరాత్రి వరకు 58,227 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,951 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైలోకి వెళ్లాలని టీటీడీ సూచింది.