
వివరాలు వెల్లడిస్తున్న విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు
అల్లిపురం: గత ఏడాది కాలంలో జిల్లా కోర్టులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు అన్నారు. రూ.35 కోట్లతో నిర్మించిన నూతన కోర్టు భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, బార్ అసోసియేషన్ కమిటీ సభ్యుల సహకారంతో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దీరేంధ్ర సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కోర్టుకు వచ్చే న్యాయవాదులకు, కక్షిదారులకు మెరుగైన సౌకర్యాలు అందజేయడమే ధ్యేయంగా కమిటీ పనిచేసిందన్నారు. చీఫ్ జస్టిస్ సహకారంతో జిల్లా కోర్టులో 230 ఏసీలు, ఫర్నీచర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్ల క్రికెట్ ప్రతినిధులతో టోర్నమెంట్ నిర్వహించామన్నారు. ఈ ఏడాదిలో పది నెలల పాటు జూనియర్, సీనియర్ న్యాయవాదులకు లా కాలేజీ ప్రాఫెసర్లతో న్యాయసలహాలు, క్లాసులు ప్రతి శుక్రవారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ట్రెజరర్ చింతా భాస్కర్‌రావు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆడారి అప్పారావు ఇతర కమిటీ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు సహకారంతో అసోసియేషన్ అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. త్వరలోనే క్రిమినల్ కోర్టు భవనంలో రెండు కొత్త లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ సెక్రటరీ ధర్మాల దుర్గాప్రసాద్, లేడీ రిప్రజెంటేటివ్ కే లక్ష్మీ దుర్గా నాగశ్రీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ చవిటిపల్లి బాలరాణి, జానియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఈగల పద్మలత, కరకాని వరప్రసాద్, పి.శ్రీధర్, మణికంఠ పాల్గొన్నారు.
జూనియర్ న్యాయవాదులకు ప్రతీ శుక్రవారం తరగతులు
విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment