ఎన్నికల ప్రచారంలో ఏయూ ప్రొఫెసర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో ఏయూ ప్రొఫెసర్‌

Published Sun, May 5 2024 4:30 AM | Last Updated on Sun, May 5 2024 7:16 AM

ఎన్నికల ప్రచారంలో ఏయూ ప్రొఫెసర్‌

ఎన్నికల ప్రచారంలో ఏయూ ప్రొఫెసర్‌

టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌ సతీమణి లావణ్యదేవి ప్రచారం 

 ఆమె ఏయూలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌ 

 తన భర్తను గెలిపించాలని టీడీపీ తరఫున ఓటర్లకు అభ్యర్థన 

విశాఖ సిటీ: ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌. కానీ నిబంధనలకు విరుద్ధంగా గాజువాకలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో రోడ్డెక్కారు. ఇంటింటికీ తిరుగుతూ టీడీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఒక ప్రొఫెసర్‌ అయి ఉండి బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో పొల్గొనడం విశేషం. ఆమె ఎవరో కాదు.. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సతీమణి పి.లావణ్యదేవి. గాజువాకలో గెలుపు కోసం పల్లా తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

ఒకవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు ధీమాతో ఉన్న పల్లా శ్రీనివాసరావుకు.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ గాజువాక నుంచి పోటీకి దిగడంతో చెమటలు పడుతున్నాయి. గుడివాడ అమర్‌ ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. దీంతో ప్రచారంలో వెనుకబడిన పల్లా తన కుటుంబ సభ్యులను అందరినీ ప్రచారంలోకి దింపారు. ఇందులో అతని సతీమణి ఏయూలో ప్రొఫెసర్‌ అయిన పి.లావణ్యదేవి కూడా ఉన్నారు.

ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు సైతం రాజకీయ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి ఉంది. అయినప్పటికీ పల్లా సతీమణి లావణ్య మాత్రం గాజువాకలో బహిరంగంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. తన భర్తను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement