
జగన్ హయాంలోనే మహిళా సాధికారత
● మాజీ మంత్రి గుడివాడ్ అమర్‌నాథ్ ● వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే మహిళా సాధికారత, స్వావలంబన లక్ష్యంగా పాలన సాగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కె.భాగ్య లక్ష్మి, శోభా హైమావతి అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమర్‌నాథ్ కేక్ కట్ చేసి.. రమణికుమారికి తినిపించారు. మహిళలంతా స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీలో కీలకంగా పనిచేస్తున్న మహిళలను సత్కరించారు. తర్వాత అమర్‌నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాల నలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలకు సంబంధించిన డబ్బు లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతంకుపైగా మహిళలకే కేటాయించారని, చట్టసభల్లో, మంత్రి పదవుల్లో, రాజకీయ పదవుల్లో అన్నింటా మహిళలకే పెద్దపీట వేశారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని మహిళలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మేయర్ హరివెంకటకుమారి, మాజీ ఎంపీ మాధవి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఆసరా వంటి పథకాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ వైఎస్‌జగన్ దిశ చట్టం ద్వారా మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించారన్నారు. అనంతరం అతిథులను ఆమె ఘనంగా సత్కరించారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో బండి ప్రియను, అధునాతన కాస్మో టాలజీ అండ్ ట్రైకాలజీ క్లినిక్ విభాగంలో రాజ్యలక్ష్మి, బొటిక్ షాపు యాజమాని కోశెట్టి రాజ్యలక్ష్మి, పార్టీ కార్యాలయంలో పని చేసే మీసాల సంధ్యను సన్మానించారు. పార్టీ సమన్వయకర్తలు కేకే రాజు, తిప్పల శ్రీనివాస్ దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు తోట పద్మావతి, ముర్రువాణి, సాడి పద్మారెడ్డి, మహిళా నేతలు బి.పద్మావతి, శ్రీదేవీవర్మ, పిల్లి సుజాత, సత్యాల సాగరిక, పల్లా చిన్న తల్లి, అడ్డాల కృపా జ్యోతి, బయవరపు రాధా, డా.మంచా నాగ మల్లీశ్వరి, సలాది భాను, రాజేశ్వరి, జోష్ణ, బంగారమ్మ, రత్నం, కాకి పద్మ, రోజారాణి, మళ్ల ధనలత, రజనీ, రామలక్ష్మి, పి.వి.లక్ష్మి, సంషాద్ భేగం, నీలాపు లక్ష్మి, అమ్మాజీ, రేణుక, నాగమణి, పద్మ, రాజీ, సునీత, కుమారి, పద్మ, జోత్స్న, చందక రత్నం, శిరీష, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment