
రూ.2.5 లక్షలు!
● మామూళ్లు.. గమ్మత్తుగా!
ఒక్కో దుకాణానికి
● మద్యం షాపుల నుంచి నెలవారీ వసూళ్లు షురూ ● బెల్టు షాపులకు రూ.10 అధిక ధరకు అమ్మకం ● సమావేశం పెట్టి మరీ టార్గెట్ విధింపు ● వచ్చే ఏడాది నుంచి రూ.3 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు ● బెంగళూరు నుంచి వచ్చిన నేత ద్వారా కలెక్షన్లు
బెంగళూరుకు చెందిన వ్యక్తి ద్వారా..!
వాస్తవానికి సదరు నేతకు ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి ద్వారా అన్ని వ్యవహారాలు నడిపేవారు. అయితే సదరు వ్యక్తిపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ స్థానంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న మరో వ్యక్తిని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్టు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మద్యం సిండికేట్ల ద్వారా వసూలు చేసే మొత్తం కూడా సదరు బెంగళూరు వ్యక్తి చేతికి చేరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం సెజ్‌లోని ఒక కంపెనీలో సీసీ కెమెరాలను బిగించే పని ఇప్పించడం కోసం కూడా రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ తతంగమంతా కూడా బెంగళూరు వ్యక్తి ద్వారానే నడిచినట్టు సమాచారం. మొత్తంగా పీఏలు మారుతున్నారు తప్ప వసూళ్ల కార్యక్రమం మాత్రం తమకు తప్పడం లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బెంగళూరు వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ నేతలే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఇప్పటికే ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి నేత ఒకరు... ఇప్పుడు కలెక్షన్ల కోసం ఏకంగా బెంగళూరు నుంచి ఓ వ్యక్తిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా నియోజకవర్గంలోని మొత్తం మద్యం షాపుల నుంచి మామూళ్లు వసూలు చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మద్యం షాపు సిండికేట్లతో గత నెలలో సమావేశం ఏర్పాటు చేసి మరీ టార్గెట్లు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి మద్యం షాపు యజమాని ప్రతి నెలా రూ.2.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా సదరు ప్రైవేటు మద్యం దుకాణదారుడు బెల్టు షాపులకు ఎమ్మార్పీ మీద రూ.10 అధికంగా విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయా దుకాణాల పరిధిలో బెల్టు షాపులకు మద్యం సరఫరా బాధ్యత కేవలం వారికే దక్కేలా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయా మద్యం షాపులతో పాటు బెల్టు షాపుల జోలికి ఎకై ్స జ్‌శాఖ అధికారులు వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలా వసూళ్ల మొత్తం రూ.3 లక్షలకు పెంచనున్నట్టు కూడా ముందుగానే ప్రకటించినట్టు సమాచారం. మొత్తంగా ఒక ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శల నేపథ్యంలో దూరంగా పెట్టిన సదరు నేత.. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా వసూళ్లకు దిగడం చర్చనీయాంశమవుతోంది.
విచ్చలవిడిగా బెల్టు షాపులు!
ఇప్పటికే పేకాట, కోడి పందేల వ్యవహారంలో వార్తలకెక్కిన సదరు నేత.. ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పేకాట డెన్‌ల నిర్వహణలో కొంత మొత్తం వసూలు చేసేందుకు మరీ అనుమతి ఇచ్చారు. వాటి జోలికి వెళ్లకుండా కూడా కొద్దిరోజుల పాటు నియంత్రించగలిగారు. అయితే అంతర్గత విభేదాల కారణంగా ఈ వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. దీంతో తాత్కాలికంగా పేకాట శిబిరాలు మూతపడ్డాయి. ఇక కోడి పందేల శిబిరాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏకంగా మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. అధికారికంగా సదరు నేత పాల్గొనకపోయినా వారి అండతోనే ఈ వ్యవహారం నడిచింది. దీంతో అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. పైగా కోడి పందేల శిబిరాల ప్రాంతంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కూడా జరిగాయి. బహిరంగంగానే మద్యాన్ని విక్రయించారు. వీటి ఏర్పాట్లకు కూడా వేలం పాట నిర్వహించి మరీ వసూళ్లకు తెగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సదరు నేత నియోజకవర్గంలో భారీగా బెల్టు షాపులు వెలిశాయి. బెల్టు షాపుల కోసం వేలం పాట నిర్వహించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినా సదరు నేత అండదండలతో చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. కేవలం ఈ నియోజకవర్గంలోనే ఏకంగా వందకుపైగా బెల్టు షాపులు ఏర్పాటైనట్టు సమాచారం. మద్యం దుకాణదారులు ఆయా బెల్టు షాపులకు ఎమ్మార్పీకి రూ.10కి అధికంగా మద్యం విక్రయించుకుంటున్నారు. ఇందులో వచ్చే సగం ఆదాయాన్ని సదరు నేతకు ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment