
బైక్ రేసర్లపై పోలీసుల ఉక్కుపాదం
బీచ్‌రోడ్డు: నగరంలో అర్ధరాత్రి బైక్ రేసులు నిర్వహిస్తున్న యువకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారం రోజుల కిందట 38 మంది యువకులను అరెస్ట్ చేసి వారి బైక్‌లను సీజ్ చేసిన పోలీసులు.. తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ విభాగం అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. అర్ధరాత్రి నగరంలో రోడ్లపై హల్‌చల్ చేస్తూ పాదచారులు, వాహన చోదకులను బైక్ రేసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు జోన్–1 ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవరావు పర్యవేక్షణలో త్రీటౌన్, ద్వారకా, నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 16 మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసి, 16 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి విధించే శిక్షల్లో సమూల మార్పులు చేసినట్లు వెల్లడించారు. కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.
16 మంది అరెస్ట్, బైక్‌ల సీజ్

బైక్ రేసర్లపై పోలీసుల ఉక్కుపాదం
Comments
Please login to add a commentAdd a comment