
10 నెలల్లో తొలగించిన పింఛన్లు
పింఛన్ల ఏరివేట కొనసాగుతోంది. ప్రతీ నెల పింఛన్ల సంఖ్య తగ్గుతోంది. సదరం సర్టిఫికెట్ల పరిశీలన, దివ్యాంగులను ఆస్పత్రులకు పిలిచి పరీక్షలు చేయడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే టీడీపీకి అనుకూలంగా లేరన్న అక్కసుతో స్థానిక నేతల ఒత్తిళ్లతో సామాజిక పింఛన్లు తొలగింపు వంటివి జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేనాటికి జిల్లాలో 1,65,891 పింఛన్లు ఉండగా.. ప్రతీ నెల కోత పెడుతూ ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 1,59,903 పింఛన్లు మిగిలాయి. ఈ పది నెలల కాలంలో 5,988 పింఛన్లు తొలగించారు.