అభివృద్ధికి ఆకర్షితులై... | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఆకర్షితులై...

Published Thu, May 9 2024 4:00 AM

-

చీపురుపల్లి: ఈ సైకిల్‌ మాకొద్దు మరి తొక్కలేం బాబూ.. అంటూ ఆ పార్టీని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీడుతున్నారు. అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు పార్టీలో తాము ఉండలేమంటూ గరివిడి మండలంలోని గొట్నంది గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీకి గుడ్‌బై చెప్పేశాయి. అందులో భాగంగానే చీపురుపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గొట్నంది గ్రామానికి చెందిన నక్క రవి, నక్క గౌరి, నక్క శివ, నక్క కృష్ణ, నక్క మనోజ్‌, బొత్స తిరుపతి, కల్లేపల్లి జాన్‌, కె.సూరిబాబు, నక్క రామకృష్ణ, నక్క రాంబాబు, దిలీప్‌, అజయ్‌, సింహాద్రి, ప్రసాద్‌, కిశోర్‌, పొట్నూరు అప్పారావు, తదితరులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్‌సీపీ గరివిడి మండల అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, లెంక శ్రీరాములు, రాళ్లపూడి గణేశ్‌, తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి భారీగా వలసలు

కుదేలవుతున్న టీడీపీ, జనసేన పార్టీలు

Advertisement
 
Advertisement