గంజాయి నిర్మూలనే లక్ష్యం
–8లో
అరకొరగా హోమియో మందులు
జిల్లా ప్రజలను హోమియో మందుల కొరత
వెంటాడుతోంది. వివిధ ఆరోగ్య సమస్యలను నివారించే మందులు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రాజాం సిటీ: జిల్లాలో గంజాయి నివారణే లక్ష్యంగా పనిచేయాలని, గంజాయి కేసుల్లో ప్రధాన మూలాలు ఛేదిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో సీజ్‌చేసిన వాహనాలను పరిశీలించి ఆరా తీశారు. కేసుల దర్యాప్తుపై స్టేషన్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూతగాదాలు, గొడవలు, రాజకీయ పార్టీల గొడవలు, పాత నేరస్తుల, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ఎప్పటికప్పడు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలని కోరారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఏటీఎం మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సచివాలయ మహిళా సంరక్షణ పోలీసులతో ఎస్పీ సమావేశమయ్యారు. మహిళా సంరక్షణ పోలీసులు, దత్తత గ్రామాల పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం బదిరిలపాఠశాల విద్యార్థులకు నూతన వస్త్రాలను అందజేశారు. మెయిన్ రోడ్డులో గతంలో పడగొట్టిన పోలీసు క్వార్టర్స్ స్థలాన్ని పరిశీలించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్రరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సిబ్బంది పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షణతోనే నేరాల
నియంత్రణ
ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment