
పరకాలలో బారులుదీరిన ఓటర్లు(ఫైల్)
పరకాల: పరకాల నియోజకవర్గంలో 84.61 శాతం పోలింగ్ నమోదైనట్లు పరకాల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పరకాల నియోజకవర్గంలో 2,21,436 మంది ఓటర్లుండగా.. వారిలో పురుషులు 1,08,280 మంది ఉన్నా రు. 1,13,154 మంది మహిళలున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,84,362 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా.. పురుషులు 91,917 మంది, మహిళలు 95,445 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇద్దరు థర్డ్ జెండర్స్ ఉన్నప్పటికీ వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నియోజకవర్గంలో అత్యధికంగా ఆత్మకూరు మండలం దుర్గంపేట గ్రామ పంచాయతీ జీపీ(113)లో పోలింగ్ 94.76 శాతం నమోదైంది. అంటే.. 706 మందికి 669 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా 63.23 పోలింగ్ శాతం నమోదైంది. పరకాలలోని బాలుర ఉన్నత పాఠశాల(45)లో 1,214 మందికి 830 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.