మహిళలు వ్యాపారాల్లో రాణించాలి | Sakshi
Sakshi News home page

మహిళలు వ్యాపారాల్లో రాణించాలి

Published Sat, May 4 2024 4:10 AM

-

సంగెం: మహిళలు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకుని కుటీర పరిశ్రమలు, వ్యాపారాల్లో రాణించాలని సెర్ప్‌ సంస్థాగత నిర్మాణ డైరెక్టర్‌ నవీన్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని శాంతి మండల సమాఖ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. మోడల్‌ సీఎల్‌ఎఫ్‌, మండల రిసోర్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మండల సమాఖ్య నెలవారీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తోందని, పాత వ్యాపారాలకు తోడుగా కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మేనేజర్‌ తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు, విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మహిళలను చైర్‌పర్సన్లుగా నియమించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేవిధంగా కృషి చేయాలని సూచించారు. అడిషనల్‌ డీఆర్‌డీఓ రేణుకాదేవి, డీపీఎంలు దయాకర్‌, సరిత, భవాని, చంద్రశేఖర్‌, ఏపీఎం కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement