సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఏపీజేఏసీ అమరావతి నాయకులు
ఏలూరు (మెట్రో): ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఏపీజేఏసీ అమరావతి ఏలూరు జిల్లా అధ్యక్షులు కె.రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం ఏపీజేఏసీ అమరావతి నాయకులు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తమ డిమాండ్‌లను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజేఏసీ అమరావతి ద్వారా డిమాండ్‌ల సాధనకై 92 రోజులు ఉద్యమం చేశామన్నారు. తమ డిమాండ్‌లను మన్నించి కొన్నింటిని పరిష్కరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. రాష్ట్రంలో ఉన్న 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి క్యాబినేట్ ఆమోదించడం, కొత్తగా ఏర్పడిన జిల్లాల హెడ్ క్వార్టర్‌లకు 16 శాతం హెచ్‌ఆర్, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ కోసం రూ.3,600 కోట్లు, సీపీఎస్ ఉద్యోగుల 10 శాతం వాటా రూ.2,400 కోట్లు చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు.
అలాగే మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను దశల వారీగా రెగ్యులర్ చేయాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, సంవత్సర ఆదాయం రూ.1.40 లక్షలు కన్నా తక్కువ ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా చూడాలని సీఎంను కోరగా, సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment