గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
భీమవరం(ప్రకాశం చౌక్): బిడ్డకి జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని, వారి ఆరోగ్య అవసరాలపై సీ్త్ర శిశు సంక్షేమం, వైద్య శాఖల నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో కలెక్టర్ వైద్య, ఆరోగ్యశాఖ సీ్త్ర శిశు, సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ సీ్త్రల నమోదు, టీకాలు వేయించడం, పోషకాహార లోపంతో ఎంతమంది పిల్లల ఉన్నారో గుర్తించడం, ఏ లోపాలు ఉన్నాయో పరీక్షలు నిర్వహించడం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందితో ఇప్పటికే నాలుగు పర్యాయాలు సమీక్షించామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలు కాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాల నియంత్రణ లక్ష్యంగా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి డా.బి.భానునాయక్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డీఐఓ డా.డి.దేవసుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment