నెలాఖరులోపు సీసీ రోడ్ల నిర్మాణం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణాలను నెలాఖరులోపు పూర్తిచేస్తామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగలో భాగంగా జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 55.37 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల పనులు ప్రారంభించగా 53.54 కిలోమీటర్ల మేర నిర్మాణాలు పూర్తిచేశామన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు, గోకుల్ షెడ్ల నిర్మాణాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కె.శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సర్వేలను వేగిరపర్చాలి
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న పలు సర్వేలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వర్క్ ఫ్రం హోం, మిస్సింగ్ సిటిజన్స్, ఎన్‌పీసీఐ, ఈకేవైసీ, పిల్లల ఆధార్ నమోదు, జియో ట్యాగింగ్ అంశాలపై మండలాల వారీగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టర్ సీహెచ్ నాగరాణి