
ఉనికిలి.. పేకాట వాకిలి!
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : పగలూ రాత్రీ తేడా లేకుండా పేకాట, కోడిపందేలు యథేచ్ఛగా సాగుతున్నా యి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏలూరు జిల్లా మండవల్లి మండలం ఉనికిలి గ్రామంలో ఓ టీడీపీ నేత పేకాటయ్య అవతారం ఎత్తాడు. తన ఇంటినే జూదశాలగా మార్చేశాడు. ఫోన్లు చేసి ఊ.. కొడతారా.. ఉనికిలికి పేకాట, కో డిపందేలకు వస్తారా.. అంటూ ఆహ్వానాలు పంపుతున్నాడు. కైకలూరు నియోజకవర్గంలో పేకా ట, కోడిపందేలకు ఉనికిలి గ్రామం కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒకప్పుడు సర్పంచ్‌తో సహా వార్డు సభ్యులు అందరూ మహిళలే కావడంతో ఆదర్శ గ్రామంగా ఉనికిలి నిలిచింది. నేడు జూదశాలగా పేరు రావడంపై గ్రామస్తులు మధనపడుతున్నారు.
అధికారం మాది అన్న ధోరణిలో..
ప్రశాంత పల్లె వాతావరణానికి మారుపేరు ఉని కిలి గ్రామం. మొత్తం 10 వార్డులు ఉండగా 6 వా ర్డులు ఉనికిలిలో, సుబ్బరావుపేటలో 2, మూలపేటలో 2 వార్డులు ఉన్నాయి. సుమారు జనాభా 2,000 పైనే ఉంది. గ్రామంలో ఒక పెద్ద కుటుంబానికి చెందిన కోటీశ్వరుడిగా పేరు పొందిన వ్యక్తి గ్రామం మొత్తానికి చెడ్డ పేరు తెస్తున్నాడు. అధికారం మాది.. పాలించేది మా వాడే అన్న ధోరణిలో చెలరేగిపోతున్నాడు. ఇటీవల వరదల సమయంలో పర్యటనకు వచ్చిన కూటమి నా యకులకు విందు భోజనం వడ్డించి ఆకట్టుకున్నా డు. పేకాట, కోడిపందేలకు మూలస్తంభంగా ని లిచే భైరవపట్నం ఐస్ ఫ్యాక్టరీ యజమాని ఆశీస్సులు దండిగా నిర్వాహకుడికి ఉండటంతో ఆడిందే పేకాట, కాలు దువ్విందే కోడిపందేలుగా వ్యవ హారం మారింది. జూద నిర్వాహకుడి చేతికి దెబ్బతగిలినా లెక్కచేయకుండా జూదాలు ఆడిస్తున్నాడు.
నందివాడ టూ ఉనికిలి
మండవల్లి మండలం ఉనికిలి గ్రామానికి సమీపంలో గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో రుద్రపాక, పోలుకొండ గ్రామాలు ఉన్నా యి. అక్కడ నుంచి ఉనికిలి గ్రామానికి రోజూ కోడిపందేలు, పేకాట ఆడటానికి బడాబాబులు వస్తున్నారు. పండుగల వేళ ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఉగాది రోజంతా ఉనికిలిలో ప్రధాన నిర్వాహకుడి ఇంటి పక్కనే కోడిపందేలు, పేకాట యథేచ్ఛగా జరిగాయి. జూదాల కోసం ప్రత్యేక షెడ్డును కూడా ఏర్పాటుచేశారు. పేకాటతో పాటు కోరుకున్న మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. గ్రామంలోని బ్యాంకు వీధిలో జూద నిర్వాహకుడి ఇల్లు శివారున ఉండటం అతడికి కలిసొచ్చింది.
పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు
జూదాలు ఇంతలా నిర్వహిస్తున్నా పోలీసులు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. మండవల్లి ఎస్సై సాహసించి వెళ్లినా భైరవపట్నం ఐస్ ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వెళ్తుంది. పెద్దాయనతో చెప్పమంటారా? ఉద్యోగం చేయాలని ఉందా? వెళ్లిపోతారా.. అనే ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఎస్సై కంటే పై అధికారి పట్టించుకుంటారా అంటే అదీ లేదు. ఇటీవల వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు తలనొప్పిగా మారిన గడ్డం బాబు ఏకంగా మండవల్లి ఎస్సై మీదకు గొడవకు వెళ్లాడు. ఇంత జరిగినా ఆయన్ను పోలీసు అధికారులు ఏం చేయలేని పరిస్థితి. తీవ్ర ఒత్తిళ్లతో మండవల్లి మండలంలో పోలీసులు విధులు నిర్వహించలేక సతమతమవుతున్నారు.
టీడీపీ నేత అడ్డాలో పేకాట, కోడిపందేలు
గుడివాడ నియోజకవర్గం నుంచి జూదరులు
యథేచ్ఛగా జూదాల నిర్వహణ
కన్నెత్తి చూడని ఖాకీలు