
ప్రైవేటు డిగ్రీ కళాశాలల సమస్యలు పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గుండారెడ్డి కోరారు. కడపలోని హరిత హాటల్‌లో బుధవారం వైవీయూ ప్రైవేటు డిగ్రీ కాలేజీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఐదు సంవత్సరాలు అఫ్లియేషన్ ఇవ్వాలని కోరారు. జీఓ నంబరు 22 రద్దుచేసి డిగ్రీ ఫీజు నిర్ణయ విధానం పాత పద్ధతిలో కొనసాగించాలన్నారు. అధ్యక్షుడు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాం, నాయకులు శౌరీలురెడ్డి, జి.వెంకటరెడ్డి, సురేంద్ర రెడ్డి, మహానందయ్య, సుబ్బారెడ్డి, వివిధ కళాశాల యాజమాన్యాలు పాల్గొన్నారు.