
చేబ్రోలు కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
వేంపల్లె : చేబ్రోలు కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వేంపల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీటీసీలు పేర్కొన్నారు. శనివారం స్థానిక వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్త, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌హన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి గురించి నీచాతి నీచంగా మాట్లాడం దారుణమన్నారు. అతను మాట్లాడిన తీరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందన్నారు.
పొలాల్లో స్టార్టర్ల వైర్ చోరీ
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లె గ్రామ పొలాల్లో 15 వ్యవసాయ బోర్లకు చెందిన స్టార్టర్లు, సర్వీస్ వైర్లను దుండగులు చోరీ చేశారు. శనివారం ఉదయం రైతులు మోటార్ ఆన్ చేసేందుకు పొలాల వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ వైర్లు, సర్వీస్ వైర్లు లేకపోవడం గమనించారు. పరిసర పొలాల్లోని 15 బోర్లకు సంబంధించిన స్టార్టర్లు, సర్వీస్ వైర్‌ను శుక్రవారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లినట్లు రైతులు గుర్తించారు. గ్రామానికి చెందిన భూమిరెడ్డి పెద్ద వెంకటసుబ్బయ్య, దండు చిన్న మునెయ్య, దాసరి వెంకటసుబ్బయ్య, నడిపి సుబ్బన్న, చిన్న సుబ్బన్న, పుల్లారెడ్డి గారి శివ, రమేష్, వెంకటసుబ్బయ్య, భూమిరెడ్డి వెంకటసుబ్బయ్య, భూమిరెడ్డి నారయ్య తదితర రైతులకు చెందిన వైర్లు చోరీకి గురయ్యాయి. ఈ వైర్ల విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని రైతులు తెలిపారు. వైర్లు చోరీకి గురైన పొలాల్లో అరటి, మిరప తదితర పంటలు సాగు చేశారు. పొలాలకు నీరు కట్టేందుకు వైర్ల చోరీతో ఆటంకం కలగడమే కాక పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టార్టర్లు, సర్వీస్ వైర్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత రైతులు తెలిపారు.

చేబ్రోలు కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి