
మరింత ఉత్తమ ఫలితాలను సాధించేందుకు...
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో వచ్చే ఏడాది మరింత ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాం. గతేడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫలితాలు మెరుగయ్యాయి. ముఖ్యంగా నేను ప్రిన్సిపాల్‌గా పనిచేసే పులివెందుల గర్ల్స్ జూనియర్ కళాశాలల్లో అన్ని గ్రూపులకు చెందిన విద్యార్థులను టాపర్స్‌ను నిలిపాం. ముఖ్యంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించిన హెచ్‌ఈసీలో సునిత అనే విద్యార్థిని 500లకు 485 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సెకెండ్ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది.
– బండి వెంకటసుబ్బయ్య,
ఆర్‌ఐవో, ఇంటర్ విద్య