హైదరాబాద్ మైసమ్మగూడ ప్రాంతంలోని ఓ హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి జారి పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా జూలురుపాడుకు చెందిన ఎల్లంకి సాయికిరణ్(19) మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతూ అదే ప్రాంతంలోని సాయి బాలాజీ హాస్టల్‌లో ఉంటున్నాడు.