తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో చెప్పినట్టు ఎంపీ వివేక్ తెలిపారు. గతంలో చంద్రబాబుపై సీమాంధ్రలోనే మావోయిస్టుల దాడి జరిగిందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం మినహా ప్యాకేజీలకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. గతంలో ప్రత్యేక కమిటీలు, ప్యాకేజీలు ఫెయిలయ్యాయన్నారు. నీటి సమస్యపై చట్టబద్దంగా ముందుకెళ్లొచ్చని సూచించానన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర ఆస్తులపై దాడులు జరగలేదన్నారు. రాష్ట్రం విడిపోవాలని సీమాంధ్రులు కూడా కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ అబద్ధపు ప్రచారంపై షిండే నివేదిక ఇచ్చానని వివేక్ వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. మీరే పార్టీలో ఉన్నారన్నదానికి ఎంపీ వివేక్ సూటిగా జవాబు ఇవ్వలేదు. సోనియా గాంధీకి తానెప్పుడో రాజీనామా లేఖ ఇచ్చానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాంగ్రెస్ నుంచి విడిపోయానని చెప్పారు. టి.కాంగ్రెస్ ఎంపీలందరూ తనకు స్నేహితులేనని వివేక్ అన్నారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరతానన్న వార్తలు ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు.
Published Tue, Jul 23 2013 3:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement