ఉబెర్, ఓలా క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై శనివారం రెండో రోజు రవాణా శాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలు తమ సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి న్యాయం చేయలేకపోయాయని వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. సమస్యలకు కారణమైన ఉబెర్, ఓలా సంస్థలకు చెందిన ప్రతినిధులే చర్చలకు హాజరు కాలేదని, ఎలాంటి ఫలితమివ్వని చర్చలను తాము బహిష్కరిస్తున్నామని సీఐటీయూ ప్రతినిధి ఈశ్వర్, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సురేష్, సర్వేష్, లక్ష్మణ్ తదితరులు చెప్పారు.