వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి అసిస్టెంట్ లైన్‌మన్ దండు వీరశేఖర్‌పై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వీధి రౌడీని మరిపిస్తూ ఆదివారం మధ్యాహ్నం దాడి చేసి గాయపరిచారు. బాధితుని కథనం మేరకు... పోట్లదుర్తిలోని సత్యనారాయణ కాలనీలో విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మలు తగులుతుండటంతో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది.