ఏపీకి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత‍్తారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా గురించి వైఎస్ జగన్ శాసనసభలో మాట్లాడితే మీకేం తెలుసని చంద్రబాబు గద్దించారు. ఇక వైఎస్ జగన్ యువభేరి సదస్సులకు హాజరైతే కేసులు పెడతామని విద్యార్థులు, యవకులను సైతం బెదిరించారు. బంద్ జరిగితే విఫలం చేయడానికి కుట్రలు పన్నారు. బంద్‌లో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం మోపారు, కేసులు పెట్టారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా వద్దని...ఇప్పుడు మళ్లీ కొత్త రాగం ఆలపిస్తున్నారు. ఇన్నాళ్లు తాను తప్పు చేశానని చంద్రబాబు ఎందుకు అంగీకరించడం లేదు. హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. ప్రజలు తంతారనే చాటుమాటుగా మాట్లాడుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయండి.