తన స్వార్థం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫార్ములా పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. కొత్త డీల్ వివరాలను ముఖ్యమంత్రి తప్పకుండా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా నిలదీస్తుంటే చంద్రబాబు మాత్రం బలహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.