రెండు రోజుల క్రితం ఆసీస్‌తో జరిగిన టీ 20 ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ముక్కోణపు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ క్రీడా స్ఫూర్తిని మరిచాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో కరాచలనం చేసే క్రమంలో మ్యాక్స్‌వెల్ అతిగా ప్రవర్తించాడు. అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన మ‍్యాక్స్ వెల్.. అదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కరాచలనం చేయడానికి ఆసక్తికనబరచలేదు. సర్ఫరాజ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా మ్యాక్సీ పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.