వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. బిషూ వేసిన 106 ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించిన కోహ్లి కెరీర్‌లో 24వ టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి ఇది 17వ సెంచరీ కావడం విశేషం. ఇదే బిషూ బౌలింగ్‌లో పంత్ ఔటై సెంచరీ మిస్ చేసుకోవడం గమనార్హం.