Assistant Commissioner of Police (ACP)
-
ఏసీబీ కస్టడీలో ఏసీపీ
-
అర్ధరాత్రి భార్య, మేనల్లుడిని చంపి.. గన్‌తో కాల్చుకున్న ఏసీపీ.. ఏం జరిగింది?
పూణే: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి.. తన భార్య, మేనల్లుడిని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి.. అనంతరం తనను తాను కాల్చకుని చనిపోయాడు. ఈ ఘటన పూణేలో చోటుచేసుసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. అమరావతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకంటే ముందు తన భార్య మోని (44), మేనల్లుడు దీపక్ (35)లను తుపాకీతో కాల్చి చంపాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, గైక్వాడ్ భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. గైక్వాడ్ అమరావతి ఏసీపీగా విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన తర్వాతే ఇలా జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. ఆ ముగ్గురినీ జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కాల్పులపై కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Tragic Murder-Suicide in Pune: Senior Cop Kills Wife and Nephew before taking own Life; Motive not disclosed.#feedmile #BharatGaikwad #ACP #maharashtra #pune #shot #wife #nephew #gun #shooting #breakingnews pic.twitter.com/o8Bb13i3y3 — Feedmile (@feedmileapp) July 24, 2023 ఇది కూడా చదవండి: ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని... -
నరసింహ రెడ్డి కేసులో మరో 8 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్ గిరి ఏసీపీ నరసింహ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు ఈ కేసుకు సంబంధించి మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరంతా పలు సందార్భాల్లో నరసింహ రెడ్డికి సాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్‌లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో నరసింహ రెడ్డి జోక్యం చేసుకోవడమే కాక బినామీల పేర్లతో మాదాపూర్ భూమిని దక్కించుకున్నాడు. మార్కెట్ విలువ ప్రకారం ఆ ల్యాండ్ దాదాపుగా 50 కోట్ల విలువ చేస్తుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్ధారణయ్యింది. దాంతో అధికారులు నరసింహ రెడ్డికి సాయం చేసిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్ ఖాళీ) -
మేరే పీచే బాస్ హై!
సాక్షి, హైదరాబాద్: భూ దందాలకు పాల్పడుతున్న అవినీతి అనకొండలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ తరువాత ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగలం దొరికింది. విధినిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అలా సంపాదించిన డబ్బుతో రెండు తెలుగు రాష్ట్రా ల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మల్కాజిగిరి ఏసీ పీ నరసింహారెడ్డిపై బుధవారం దాడులు చేశా రు. తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీ బీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేసి నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఉంటుంద ని సమాచారం. రెండు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో... 25కు పైగా ప్రత్యేక బృందాలు ఏకకాలంలో నరసింహారెడ్డి, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ సరసింహరెడ్డి నివాసంలో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడ సోదాలు జరిగాయంటే..! ఏసీపీ స్థాయి అధికారి కోసం 25 కంటే ఎక్కువ బృందాలు రంగంలో దిగడం ఈ కేసుపై ఏసీబీ ఏస్థాయిలో దృష్టి పెట్టిందో తెలుపు తోంది. నరసింహారెడ్డి అవినీతి విస్తరణకు అద్దం పడుతోంది. బుధవారం ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్‌లతోపాటు జన గామ జిల్లాలోని లింగాలఘణపురం మండ లం వడిచర్లలో, బచ్చన్నపేట, రఘునాధపల్లి మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా గంగాధర, నల్లగొండ జిల్లా, ఏపీలోని అనంతపురం జిల్లాలో కలిపి మొత్తం 25 ప్రాంతాల్లో దాడు లు జరిగాయి. నర్సింహారెడ్డి అత్తగారి ఊరైన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని వడిచర్లలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ఏసీపీ మామ మోతె నర్సింహారెడ్డి అక్కడే ఉన్నారు. కుర్చపల్లి గ్రామంలోని పోరెడ్డి తిరుపతిరెడ్డి అనే బంధువు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదా చేశారు. అలాగే కొన్నె గ్రామం వద్ద సాగు భూమిని పరిశీలించారు. ఈ భూమిని బినామీ పేరిట ఏసీపీ కొన్నారని సమాచారం. మియాపూర్, బేగంపేట్, ఉప్పల్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా.. చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నర్సింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరిల్లో భూవివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అసైన్డ్ భూముల వివాదాలే కారణమా? పలు భూవివాదాల్లో తలదూర్చేవాడన్న ఆరోపణలున్న ఏసీపీని చివరికి అవే వివాదాలు ఏసీబీకి పట్టించాయని సమాచారం. హైదరాబాద్‌లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ ప్ర జాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధా లు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. కొండాపూర్‌లోని అసైన్డ్ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఎదుట ఆయనే అంగీకరిం చారని సమాచారం. ఈ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఏసీపీ నరసింహారెడ్డి వెల్లడించారని తెలిసింది. జగిత్యాల జిల్లా గంగాధరకు చెందిన ఎంపీపీ మధుకర్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏసీబీ అధికారులను చూసి మధుకర్ పారిపోయినట్లు తెలిసింది. అసలు ఈ వివాదమే.. వ్యవహారాన్ని ఏసీబీ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. వీటితోపాటు ఘటకేసర్ సమీ పంలోని యమ్నంపేట్లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఈ భూమిని రాజకీయ నేతలతో కలిసి కొన్నార ని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. మధుకర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మధుకర్ ఆచూకీ దొరికితే.. అతని వెనక ఉన్న ఆ బడా రాజకీయ నేత లెవరు? ఇంతవరకూ వీరు కొనుగోలు చేసిన అసైన్డ్ భూవ్యవహారాలపై స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..! అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయభూమి, మాదాపూర్‌లోని సైబర్‌టవర్ ఎదుట 1,960 చదరపు గజాల నాలుగు ప్లాట్లు, హఫీజ్‌పేటలో మూడం తస్తుల భవనం, రెండు ఓపెన్ ప్లాట్లు, మరో రెండు ఇళ్లను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల నగదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టినట్లు సోదాల్లో అధికారులకు ఆధారాలు లభించాయి. రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. ఈ ఆస్తుల విలువ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. రూ.7.5 కోట్లు ఉంటుందని, అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరుగుతూనే ఉండటం గమనార్హం. మేరే పీచే బాస్ హై! సాక్షి, హైదరాదాబాద్: ‘నా మీద ఎన్ని ఆరోణలు వచ్చినా.. నాకేం కాదు. నా వెనక డీజీపీ ఉన్నారు.. ఆయనే నాకు గాడ్‌ఫాదర్’ అంటూ ఏసీపీ వై.నరసింహారెడ్డి పలువురి వద్ద గొప్పలకు పోయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ బాస్ దీన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే రహస్యంగా అంతర్గత విచారణ జరిపించారు. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో నెలరోజుల ముందే నరసింహారెడ్డి ఏసీపీ ఉన్నతాధికారుల నిఘాలోకి వెళ్లాడని సమాచారం. వాస్తవానికి వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయినప్పటి నుంచే ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అప్పటి నుంచే పక్కాగా విచారణ చేసిన ఏసీబీ అదును చూసి దాడులు చేసింది. ఉప్పల్ ఠాణాలో పనిచేసిన సమయంలో ఎస్సై లింగంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా నరసింహారెడ్డి అతన్ని రక్షించే ప్రయత్నం చేశాడన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్న సదరు ఎస్సై లింగం భూవివాదంలో తలదూర్చడంతో హెచ్చార్సీలో కేసు నమోదవడం గమనార్హం. బినామీగా బార్ ఓనర్! ఏసీపీ నరసింహారెడ్డికి నగరంలోని అశోక్‌పాటిల్ అనే ఓ బార్ యజమానితో సాన్నిహిత్యం ఉందని, అతనే బినామీగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఏసీపీ అక్రమ సంపాదనను అతడే మేనేజ్ చేసేవాడని సమాచారం. పోలీసుశాఖలో పని చేసే ఓ ఉన్నతాధికారికి నగరంలో కోట్ల రూపాయల విలువైన బంగళాను ఏసీపీ కానుకగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ బంగళాను బినామీ అశోక్‌పాటిల్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ తహసీల్దార్ ఓ కేసు విషయంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీపీని ఉన్నతాధికారులు మందలించారని సమాచారం. -
ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
-
మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: మల్కాస్‌గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. -
ఏసీపీ బాలుజాదవ్ మృతి
సాక్షి, కూసుమంచి(నిజామాబాద్): మండలంలోని లోక్యాతండాకు చెందిన వడిత్య బాలుజాదవ్ (54) నిజామాబాద్ జిల్లాలో ఏసీపీగా (ఎన్ఐఏ విభాగంలో) విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో గత నెల 28న రాత్రి తన ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తూ మండలంలోని జీళ్లచెరువు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన సొంత గ్రామమైన లోక్యాతండాకు తరలించారు. దీంతో తండా ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుజాదవ్‌కు భార్య భాగ్యవతి, కుమారులు రాఫాప్రతాప్, అశోక్, కుమార్తె సంధ్య ఉన్నారు. అంచలంచెలుగా ఎదిగి.. మృతిచెందిన బాలుజాదవ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా కష్టపడి చదివి ఎస్ఐగా అదిలాబాద్ జిల్లాలో ఉద్యోగం పొందారు. అక్కడి నుంచి విధి నిర్వహణలో నిబద్ధత చూపిస్తూ ఉత్తమ అధికారిగా మన్ననలను పొందుతూ ఏసీపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అవినీతిపై విచారణ అధికారిగా ఆయన్ను నియమించారు.పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రాథమిక ఆధారాల తర్వాతే నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘పంజాగుట్ట అత్యాచార కేసు’లో దర్యాప్తు నకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ కేసు నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఈమె శనివారం బాధితురాలితో మాట్లా డారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తానంటూ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. తనపై 11 ఏళ్ళుగా 143 మంది అత్యాచారానికి ఒడిగట్టారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొం టున్న వారికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే వారిపై తదుపరి చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరోపక్క బాధితురాలితో ఫిర్యాదు చేయించిన గాడ్ పవర్ ఫౌండేషన్‌కు చెందిన రాజా శ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్ వ్యవహారమూ ఈ కేసులో కీలకంగా మారింది. 4నెలల కిందట స్వచ్ఛంద సంస్థగా దీన్ని రిజిస్టర్ చేయించిన అతడు సోమాజిగూడ కేంద్రంగా నిర్వహి స్తున్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత యువతి ఫిర్యాదులోని అంశాల ఆధారంగా జాబితాలోని నిందితులకు కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వారిని ఇతడు బెదిరించినట్లు కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో ఈ కేసులో డాలర్ భాయ్ పాత్రపై పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. బాధితు రాలు ఫిర్యాదు చేసేందుకు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేందుకు సహకరి స్తున్నట్లు నటిస్తూ తన స్వలాభం చూసుకు న్నాడా? అనే కోణంలో పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిం చారు. అక్కడ పోలీసులకు కొందరు యువతుల సర్టిఫికెట్లు, బయోడేటాలు లభించాయి. దీంతో ఇతడి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ సంస్థ కార్యాలయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సర్టిఫికెట్లు, బయోడేటాల్లోని వివరాల ఆధారంగా యువతుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీ లభించిన తర్వాత మాట్లాడితేనే డాలర్ భాయ్‌కి సంబంధిం చిన మరిన్ని కోణాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే కార్యాల యంలో కొన్ని ఆడియో, వీడియో టేపుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించినవే అని అనుమానిస్తున్నారు. కాగా, డాలర్ భాయ్‌పై అతని భార్య గతంలోనే సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యి చార్జిషీటు కూడా దాఖలైంది. ఇప్పుడు ఆ కేసు స్థితిగతుల్నీ అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఆపరేషన్ బ్యాంకాక్
‘వైల్డ్ డాగ్’ చిత్రం కోసం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మగా మారారు నాగార్జున. డిపార్ట్మెంట్లో అందరూ ఆయన్ను వైల్డ్ డాగ్ అంటుంటారు. ప్రస్తుతం ఓ సీక్రెట్ ఆపరేషన్ మీద ముంబైలో ఉన్నారు. నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అహిషోర్ సాల్మాన్ రూపొందిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘వైల్డ్ డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత మార్చి 5 నుంచి బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ ఆరంభించాలనుకుంటున్నారట టీమ్. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించ నున్నారట. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్, డైలాగ్స్: కిరణ్ కుమార్. 83ని సమర్పించడం సంతోషంగా ఉంది: నాగార్జున 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేశారు. విష్ణు ఇందూరి నిర్మాత. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సమర్పించనున్నారు. ‘‘1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలిచింది. ఆ సంఘటనను ఎప్పుడు తలుచుకున్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెలుగులో ఈ సినిమాను సమర్పించడం సంతోషంగా ఉంది’’ అన్నారు నాగార్జున. ‘‘అన్నపూర్ణ సంస్థతో కలిసి ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈవో షిబాసిస్ సర్కార్ అన్నారు. ‘83’ చిత్రాన్ని తమిళంలో కమల్‌హాసన్ సమర్పిస్తున్నారు. -
రాకేష్ రెడ్డి నా దగ్గరకొచ్చి మాట్లాడాడు: సీఐ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు బుధవారం విచారణకు హాజరు అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్ ఇవాళ విచారణకు వచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి ...జయరామ్ హత్యకు ముందు, అనంతరం పోలీస్ అధికారులతో ఫోన్లలో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ఓ పోలీస్ అధికారి నిందితుడికి సలహా ఇవ్వడంపై విచారణ అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. మొదట జయరామ్ కేసును పరిచయమున్న పోలీసు అధికారుల సాయంతో రాకేష్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకున్నప్పటికీ.. అది కుదరకపోవడంతో జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లోనే హత్య చేశాడు. మరోవైపు కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం నిందితులతో క్రైమ్ రీ–కన్స్ట్రక్షన్ నిర్వహించారు. (స్టేషన్లోనే సెటిల్ చేద్దామనుకుని!) రాకేష్ రెడ్డి నా దగ్గరకొచ్చి మాట్లాడాడు: సీఐ శ్రీనివాస్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ శ్రీనివాస్... రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చి మాట్లాడినట్లు అంగీకరించారు. అయితే జయరామ్ హత్య విషయం తనతో చెప్పలేదని అన్నారు. గతంలో ఉన్న పరిచయంతోనే రాకేష్ రెడ్డి తన దగ్గరకు వచ్చాడని, అయితే తాను తర్వాత మాట్లాడతానని చెప్పడంతో వెళ్లిపోయినట్లు సీఐ తెలిపారు. ఆ తర్వాత తనతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. -
ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయనను అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్(సీఏఆర్) హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం బాధ్యతల్ని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అప్పగించారు. జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డికి మృతదేహం తరలింపునకు సంబంధించి సలహాలిచ్చినట్లు నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో పాటు మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. శ్రీనివాసులును సోమ వారమే బదిలీ చేసిన విషయం విదితమే. రాకేష్, మల్లారెడ్డి మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు జరిగాయని, జయరామ్ హత్య జరిగిన తర్వాతే ఈ కాల్స్ చేసుకున్నట్లు నందిగామ పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి పూర్తి నివేదిక వచ్చాక మల్లారెడ్డి, శ్రీనివాసులుపై విచారణ చేపట్టనున్నారు. ఆదిభట్లలో కేసుతో పరిచయం... కొంగరకలాన్ సమీపంలోని తన భూమి హద్దు రాళ్లు, కడ్డీలను తొలగించి ఆక్రమించుకునేందుకు ప్రయ త్నించారని రాజేందర్‌రెడ్డి జూన్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడిగా జితేందర్ రెడ్డి, రెండో నిందితుడిగా రాకేష్‌రెడ్డిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసు విచారణ సమయంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో రాకేష్‌రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో తరచూ ఫోన్‌కాల్ చేసే రాకేష్‌రెడ్డి జయరామ్ హత్య తర్వాత కూడా మల్లారెడ్డితో ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు తేలింది. జయరామ్ హత్య కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన రాకేష్‌రెడ్డి చెప్పిన వాంగ్మూలం ప్రకారం కూడా మల్లారెడ్డి పేరు వినిపించడంతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బదిలీ వేటు వేశారు. 2012లో పోలీసు విభాగంలోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పెద్దపల్లి, ఉట్నూరు, ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లోనూ వివాదాస్పదుడిగా ముద్రపడిన మల్లారెడ్డి బడా కేసులను సెటిల్ చేశారనే ఆరోపణలున్నాయి. పాత కేసులో పరిచయంతోనే ఫోన్ కాల్... రాకేష్‌రెడ్డి పాత కేసులో నిందితుడిగా ఉండటంతో ఏర్పడిన పరిచయంతోనే ఫోన్‌కాల్ చేశాడని ఏసీపీ మల్లారెడ్డి వివరిస్తున్నారు. తన ఇంట్లో ఇద్దరు కొట్టుకున్నారని, ఒకరికి గాయాలయ్యాయని ఫోన్ చేసి చెప్పాడన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారు చెప్పిన ప్రకారం నడుచుకోమని చెప్పానని మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ తతంగం జరిగింది ఈ నెల 1వ తేదీ కాగా... మంగళవారం వరకు ఆయన మిన్నకుండిపోయారు. ఆయనపై ఆరోపణలు మొదలైన తర్వాత తప్పించుకునేందుకే కొత్త వాదన వినిపిస్తున్నారని ఏపీ పోలీసులు అంటున్నారు. ఆయన చెబుతున్న విషయాలు వాస్తవమైతే శనివారం నుంచి రాకేష్ పేరు మీడియాలో వస్తోందని, జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసీ ఫోన్ కాల్స్ విషయం నందిగామ పోలీసులకు గాని, స్థానిక పోలీసులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును జయరామ్ హత్య కేసులో అనుమానితులుగా చేర్చి విచారించే అవకాశం ఉంది. -
టీడీపీ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న పోలీసు దొర..
‘పోలీస్ కమిషనరా.. అయితే ఏంటి?.. సిటీకి సీపీలు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్’.. 17 ఏళ్ల క్రితం ఓ సినిమాలో పేలిన ఈ పూరీ జగన్నాథ్ మార్కు డైలాగ్.. ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంది.ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. మన వైజాగ్ వరకు ఈ డైలాగ్ కాస్త మార్చి చెప్పుకోవాలేమో అనిపిస్తోంది.. అదెలా అంటే..పాతికేళ్లుగా సిటీకి సీపీలు వస్తున్నారు, పోతున్నారు.. అయితే ఏంటి?.. షాడో సీపీ మాత్రం ఒక్కడే.. ఇక్కడే..!కానీ సినీ డైలాగ్‌లో చెప్పినట్లు సదరు షాడో సీపీ లోకల్ కూడా కాదండోయ్.. సిక్కోలు నుంచి వచ్చి ఇక్కడే పాతుకుపోయారు..ఇంతకీ ఆ షాడో సీపీ ఎవరంటారా.. అతడే కేపీ.. అదేనండి కింజరాపు ప్రభాకర్..ప్రస్తుతం ఏసీపీగా ఉన్న ఈయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల సోదరుడే ఈయనగారు.ఎస్సైగా, సీఐగా, ఏసీపీగా.. పోస్టు ఏదైనా.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడే బిచాణా వేసేశారు. బహుశా ఇంత అడ్డగోలుగా పాతుకుపోయిన పోలీసు అధికారి బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మరొకరు లేరేమో! ఒకేచోట మూడేళ్ల సర్వీసు దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలూ ప్రభాకర్ విషయంలో పని చేయలేదు.ఇటీవలే కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సహా చాలామంది బదిలీ అయినా.. మంత్రి సోదరుడు మాత్రం ఇక్కడే పాగా వేసేశారు.సరే.. వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఇలా పాతుకుపోయి.. తన పని తాను చూసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు.కానీ సదరు ప్రభాకర్ మాత్రం పూర్తిస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాదిరిగా పని చేస్తుండటమే వివాదాస్పదమవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రులు, అధికార పార్టీ నేతల కుటుంబీకులు, రాజకీయ నాయకుల బంధువులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదా..!?.. అయ్యో ఎందుకు చేయకూడదు.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తమ ఉద్యోగ ధర్మాన్ని, రాజకీయాలతో ముడిపెట్టకుండా చేయాలి. రాజకీయాలకతీతంగా పనిచేయాలి. అలా పని చేస్తున్నవారెందరో ఉన్నారు. కానీ రాజకీయాలతో అంటకాగుతూ.. అధికార పార్టీ మనిషిగా ముద్ర వేసుకుని మరీ హల్చల్ చేసే ఏసీపీ కింజారపు ప్రభాకర్ వంటి కొందరు కూడా ఉంటారు. కింజారపు ప్రభాకర్‌కు నిబంధలేమిటి?.. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలకు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోగా ఎన్నికల బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఏ పోస్టులో పనిచేసినా మూడేళ్ల పాటు జిల్లాలో పనిచేసిన వారికి స్థానచలం తప్పదని, అదేవిధంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులను సైతం బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ మేరకు బదిలీల ప్రక్రియను గడువులోగా ముగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరేళ్లుగా ఇక్కడే పనిచేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఇక జిల్లా స్థాయిలో కూడా బదిలీలకు అర్హులైన అధికారుల జాబితాలను సిద్ధం చేసి సీసీఎల్ఏ, పంచాయతీరాజ్ కమిషనర్లకు పంపించారు. అదేవిధంగా పోలీసుశాఖ పరిధిలో మూడేళ్లకుపైగా నగరంలోనూ, జిల్లాలోనూ పనిచేస్తున్న సీఐలు, ఏసీపీలను కూడా బదిలీ చేశారు. కానీ ఒక్క కింజారపు ప్రభాకర్‌ను మాత్రం మినహాయించేశారు. మూడున్నరేళ్ళుగా ట్రాఫిక్ ఏసీపీగా ఇక్కడే తిష్ఠ వేసిన ఆయన్ను సరిగ్గా నెల కిందట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం జిల్లా దాటించాలని ఉన్నా... కీలకమైన స్పెషల్ బ్రాంచ్‌కు వేయడం చూస్తేనే.. మంత్రి సోదరుడి విషయంలో నిబంధనలు ఎలా నీరుగారిపోయాయో అర్ధమవుతుంది. షాడో సీపీగా హల్చల్ తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలకంగా ఉంటూ చీటికీ మాటికీ అధికారులపై, ప్రజలపై నోరేసుకుని పడిపోయే మంత్రిగా అచ్చెన్నాయుడుకు పేరుంది. అలాంటి అచ్చెన్నాయుడికి స్వయానా సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడుకు చిన్నాన్న... ఇంతకంటే బ్యాక్‌గ్రౌండ్ ఏం కావాలి?!.. అందుకే ప్రభాకర్ ఏం చెబితే అదే పోలీసుశాఖలో నడిచిపోతుంది.. కాదు కాదు పరిగెడుతుందనే చెప్పాలి. ఈ బ్యాక్ గ్రౌండ్ చూసుకునే సదరు ప్రభాకర్ పోలీస్ కమిషనర్ సహా పై అధికారులెవ్వరినీ లెక్కచేయని తనంతో వ్యవహరిస్తూ మంత్రులు, రాజకీయ నేతలతో మాత్రం సన్నిహితంగా ఉంటుంటారు. ఇక ప్రభాకర్ ఇటీవలి కాలంలో స్పెషల్ బ్రాంచ్‌లోకి మారిన తర్వాత షాడో సీపీగా హల్చల్ చేస్తున్నారన్న వాదనలు స్వయంగా పోలీసు అధికారవర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలపై కన్ను తెలుగుదేశం నేతలతో ఏసీపీ కింజారపు ప్రభాకర్ ఎంత సన్నిహితంగా ఉంటారనేది ఎవరూ చెప్పనక్కరలేదు. ఆయన ఫేస్ బుక్ చూసినా అర్థమైపోతుంది. టీడీపీ కార్యకర్త మాదిరి నారా లోకేష్‌బాబుతో ఫొటోలు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు సహా పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో దిగిన ఫొటోలను ఫేస్బుక్లో పెట్టుకుని హల్చల్ చేయడం చర్చనీయాంశమవుతోంది. సరే.. ఇదంతా ఆయన వ్యక్తిగతం అనుకున్నా.. ఆయన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి టీడీపీ పెద్దలకు పంపించడం వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధమైనా.. ఓ విధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు చేసే పనిని ప్రభాకర్ నెత్తికెత్తుకోవడం, కేవలం టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రెండు మూడేళ్లు మినహా.. ♦ 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఈయన విశాఖ నగరంలోని దాదాపు అన్ని పోలీస్స్టేషన్లతో పాటు రూరల్ జిల్లా పరిధిలోని జీకేవీధి, అనకాపల్లి స్టేషన్లలోనూ ఎస్సైగా పనిచేశారు. ♦ 2002లో సీఐగా పదోన్నతి పొందిన ప్రభాకర్ మొదట కంచెరపాలెం స్టేషన్లో.. తర్వాత ట్రాఫిక్, విజిలెన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. ♦ 2011లో డీసీపీగా పదోన్నతి పొందిన ఈయన కొంతకాలం హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2014లో విశాఖలోని పోలీసు శిక్షణాకేంద్రం ఏసీపీగా తిరిగి వచ్చేశారు. 2014 నవంబర్ నుంచి ట్రాఫిక్ ఏసీపీగా చేసిన ప్రభాకర్ ఈ మధ్యనే స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అంటే మధ్యలో కొద్ది కాలం మినహా దాదాపు 25 ఏళ్లపాటు విశాఖలోనే పనిచేసిన అధికారిగా కింజారపు ప్రభాకర్ ఓ రికార్డు సృష్టించారనే చెప్పాలి. సిక్కోలు ఖాకీ బదిలీలన్నీప్రభాకర్ కనుసన్నల్లోనే ఇక సొంత జిల్లా, తమ్ముడు మంత్రిగా, అన్న కొడుకు ఎంపీగా ఉన్న సిక్కోలులో పోలీసుల బదిలీలన్నీ స్వయానా ప్రభాకరే చూస్తుంటారనేది పోలీసు వర్గాలే లోపాయికారీగా అంగీకరిస్తున్న వాస్తవం. ఎస్సైలు మొదలు.. డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీల వరకు అన్నీ ప్రభాకర్ కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా సిక్కోలుకు అను‘కూల’ అధికారులను పోస్టింగ్‌లు ఇప్పించడంలో ప్రభాకర్ చక్రం తిప్పారని అంటున్నారు. 1991 బ్యాచ్‌కే చెందిన వివేకానంద, కృష్ణవర్మ, ఏవీ రమణలను శ్రీకాకాళానికి బదిలీ చేయించడంలోనూ ప్రభాకర్ ప్రమేయం ఉందన్న వాదనలు పోలీసువర్గాల్లోనే వినిపిస్తున్నాయి. -
ఏసీపీ బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ ప్రధాన కార్యాలయం భవంతి ఏడో అంతస్తు నుంచి ఏసీపీ ర్యాంక్ అధికారి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పోలీసులు హుటాహుటిన ఏసీపీ ప్రేమ్‌వల్లభ్ (55)ను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్, క్రైమ్ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. కాగా,అత్యున్నత సేవలు అందించినందుకు గాను ప్రేమ్వల్లభ్కు 2016లో పోలీస్ మెడల్ లభించడం గమనార్హం. గురువారం ఉదయం పదిగంటలకు తన కార్యాలయం కిటీకిలో నుంచి ఆయన కిందకు దూకినట్టు అధికారులు తెలిపారు. కాగా ప్రేమ్‌వల్లభ్ గత కొద్దిరోజులుగా గురు తేజ్ బహుదూర్ ఆస్పత్రిలో డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. -
ఏసీపీ వేధిస్తున్నాడు
కృష్ణరాజపురం : తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ వైట్‌ఫీల్డ్ ఏసీపీపై దివంగత మాజీ ఉపరాష్ట్రపతి బీడీ జత్తి కుమారుడు, కోడలు సోమవారం వైట్‌ఫీల్డ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. వివరాలు... మాజీ ఉపరాష్ట్రపతి బీడీ జత్తి కుమారుడు డీజీ జత్తితో పాటు అతడి భార్య లక్ష్మీ జత్తిపై కొద్ది కాలం క్రితం అట్రాసిటీ కేసు నమోదైంది. కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన వైట్‌ఫీల్డ్ ఏసీపీ సుధామనాయక్, ఎస్ఐ సోమశేఖర్లు కేసును కొట్టివేస్తామని అందుకు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని జత్తి దంపతులు ఆరోపించారు. దీంతో కొద్ది కాలం క్రితం ఏసీపీ సుధామనాయక్‌కు రూ.5 లక్షలు, ఎస్ఐకి రూ.2 లక్షలు లంచం ఇచ్చామని పేర్కొన్నారు. అయినా కూడా తమ ఇంటికి రోజూ ఫోన్ చేస్తూ మానసికంగా ఏసీపీ సుధామనాయక్ వేధిస్తున్నారని జత్తి భార్య లక్ష్మీ జత్తి ఆరోపించారు. రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో ఆయన కాల్స్‌ను స్వీకరించడం మానేసామన్నారు. దీంతో ఒకరోజు తాము ఉంటున్న విల్లాకు వచ్చి తాను కూడా ఇక్కడే విల్లా తీసుకోవాలనుకుంటున్నానని, అందుకు సహకరించాలని మాట కలిపే ప్రయత్నం చేసారని లక్ష్మీ ఆరోపించారు. దీంతో సీనియర్ పోలీస్ అధికారి సీమంత్ కుమార్ ఆదేశాల మేరకు వైట్‌ఫీల్డ్ డీసీపీ అబ్దుల్ వహాద్‌కు ఫిర్యాదు చేసామన్నారు. -
ఏసీపీ మాధవ్ వస్తున్నాడు
మోహన్‌లాల్ హీరోగా మేజర్ రవి దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమా తెలుగులో ‘మండే సూర్యుడు’ పేరుతో విడుదల కానుంది. వాయాలా శ్రీనివాసరావు, కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్ నిర్మాతలు. ఇందులో ఏసీపీ మాధవ్ పాత్రలో మోహన్‌లాల్ కనిపిస్తారు. ‘‘డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. మరి.. ఏసీపీ మాధవ్ పాత్రలో మోహన్‌లాల్ విలన్స్‌ను ఎలా రఫ్పాడించాడన్న విషయం వచ్చే నెలలో తెలుస్తుందన్న మాట. ఈ చిత్రానికి పర్యవేక్షణ: కాకర్లమూడి కృష్ణ, పాటలు: శశాంక్ వెన్నెలకంటి, మాటలు: సాయిశ్రీ. -
సీపీ సీరియస్?
విశాఖసిటీ: ఓ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్‌పై నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా సీరియస్ అయినట్లు తెలిసింది. ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన ‘పచ్చ సేనలో ఖాకీ చొక్కా’ అనే శీర్షికపై ప్రచురితమైన కథనం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ మహేస్ చంద్ర లడ్డా.. ఏసీపీ ప్రభాకర్‌ను కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రాజకీయ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనం ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. బాధ్యతాయుతంగా వ్యవహరించి.. అన్ని వర్గాల పట్ల ఒకే వైఖరితో మెలగాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. -
చుట్టూ పచ్చచొక్కాలు.. మధ్యలో ఓ ఖాకీ చొక్కా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక్కసారి ఈ ఫొటో పరికించి చూడండి. చుట్టూ పచ్చ చొక్కాలు.. నడిమధ్యలో ఓ ఖాకీ చొక్కా కనిపిస్తోంది కదూ.. సదరు ఖాకీ దొర విశాఖ నగర ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్.. అంతే కాదండోయ్.. ఈయనగారు కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు స్వయానా సోదరుడు. అయితే ఏంటి.. మంత్రులు, రాజకీయ నేతల కుటుంబీకులు ఉద్యోగాలు చేయకూడదా? అని అంటారేమో!.. ఎందుకు చేయకూడదూ.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తన ఉద్యోగ ధర్మానికి, రాజకీయాలను కలగలిపేయకూడదన్నదే ఇక్కడ ప్రస్తావనాంశం.. ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం.. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు పూర్తి విరుద్ధమన్నదే ఇక్కడ చర్చనీయాంశం. విమర్శలకు తావిస్తున్న అంశం కూడా.. ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీబీఎన్ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా ఫక్తు రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగేళ్లుగా విశాఖ నగరంలోనే ఏసీపీ ప్రభాకర్ తిష్ట వేశారు. అంతేకాదు.. మధ్యలో ఒకట్రెండేళ్లు తప్ప గత పాతికేళ్లుగా పెద్దగా బదిలీలు లేకుండా ఈ ప్రాంతంలోనే పాతుకుపోయారు. సర్వీస్‌లో ఎలాంటి ఘనకార్యాలు లేకుండానే ఈయనకు ఇండియన్ పోలీస్ మెడల్ ఇచ్చిన సందర్భంలోనూ అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రభుత్వాధికారి అయి ఉండీ.. పచ్చచొక్కా కార్యక్రమాలకు చెందిన పోస్టర్లను ఆవిష్కరించడమేంటని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన సదరు పోలీస్ అధికారి.. అ«ధికార టీడీపీకి ఎంతటి వీరవిధేయత చూపుతున్నారో ఈ ఫొటోతోనే స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఇలా చెయ్యడమేంటని విమర్శలు జోరందుకుంటున్నాయి. -
నయీం కేసులో ఆ ముగ్గురికి ఊరట
సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మరో ముగ్గురు అధికారులపై రాష్ట్ర పోలీస్ శాఖ సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సస్పెన్షన్‌లో ఉన్న ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్‌వలీ తిరిగి విధుల్లో చేరారు. ఏసీపీ చింతమనేని శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేశారు. అదే విధంగా ఇన్స్పెక్టర్ రాజగోపాల్ నార్త్‌జోన్ ఐజీ కార్యాలయంలో, మస్తాన్‌వలీ వెస్ట్‌జోన్ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. సస్పెన్షన్‌కు ముందు ఏసీపీ శ్రీనివాస్ నగర కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో పనిచేయగా, రాజగోపాల్ కొత్తగూడెం ఇన్స్పెక్టర్గా, మస్తాన్‌వలీ సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. కొద్ది రోజుల క్రితమే అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన పోలీస్ శాఖ.. తాజాగా మిగిలిన ముగ్గురిపై ఎత్తివేయడంతో మొత్తం ఐదుగురు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరిలో ఎవరికి కూడా ఇప్పటివరకు పోస్టింగ్‌లు కేటాయించలేదు. వీరితో పాటు అదనపు ఎస్పీ సునీతారెడ్డి సైతం ఇటీవల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసి వెయిటింగ్లో ఉన్నారు. పోలీస్ శాఖ వీరందరికీ త్వరలోనే పోస్టింగులు కల్పించనున్నట్లు తెలిసింది. -
చిన్నారి.. చేతన
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. బాలికల విద్యాశాతాన్ని పెంచడానికి ఇదో ఉత్తమ కేస్‌స్టడీగా మారాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన అంజనీకుమార్ శిశువు తల్లికి పుష్పగుచ్ఛం అందించారు. బీదర్‌కు చెందిన మహిళగానే అనుమానం... చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ బీదర్‌వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్ బస్టాండ్‌లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్ స్టాప్‌లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది. పోలీసులు బీదర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సోమవారంరాత్రి డ్యూటీ అధికారిణిగా ఏసీపీ చేతన ఉన్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయానికి ఆపరేషన్ బీదర్‌కు మారడంతో డీసీపీ ఎం.రమేశ్ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లి పర్యవేక్షించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్‌రావు తన డ్రైవర్‌ను ఇచ్చి బీదర్‌కు అంబులెన్స్ పంపారు. ఏసీపీ చేతన గురువారం తెల్లవారుజామున చిన్నారిని తీసుకువచ్చి తల్లిఒడికి చేర్చారు. త్వరలో భద్రతాచర్యలకు సిఫారసులు.. ఆస్పత్రులు తీసుకోవాల్సిన భద్రతాచర్యల్ని నిర్దేశించడానికి అధ్యయనం చేస్తున్నట్లు కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన వీటిపై రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. చిన్నారికి తన పేరు పెట్టడం ఆనందంగా, గర్వంగా ఉందని చేతన అన్నారు. చిన్నారికి కామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తామంటూ కుటుం బీకులు వైద్యుల్ని కోరినా కమిషనర్ వస్తున్నారంటూ వారు తరలించడానికి అంగీకరించలేదు. దీంతో చిన్నారి తండ్రి నారీ బయటకు వచ్చి పోలీసులతో పాటు మీడియాపై అసహనం ప్రదర్శిస్తూ చిన్నారి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఆస్పత్రి వర్గాలు చిన్నారిని బంధువుల సంరక్షణలో అంబులెన్స్‌లో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
కలాం, సచిన్‌లు నాకు స్ఫూర్తి..
అనకాపల్లి : నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లి దూరమైంది. సంతల్లో వ్యాపారం చేసుకునే తండ్రి వ్యాపార పరంగా పని ఒత్తిడిలో ఉండడంతో పొరుగింటి వారి ప్రేమానురాగాలు ఆ బాలుడుపై పడ్డాయి. ఎన్నో కష్టాలను చూసిన ఆ బాలుడికి సేవాతత్పరత కలిగిన కుటుంబం చదువులపరంగా అండగా నిలిచింది. దీంతో చదువులో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఉన్నతోద్యోగిగా విధి నిర్వహణలో భాగంగా దేశంలో పలు కీలకమైన కేసుల్లో పనిచేస్తున్నారు. అతనే అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చియ్యనాయుడు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన దేశంలో మాదకద్రవ్యాల ప్రభా వం యువతపై ఎక్కువగా ఉన్నందున పది సూచనలు ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదించి మంచి గుర్తింపు పొందారు. పశ్చిమబెంగాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు చేస్తున్న 12 మంది నైజీరియన్లను పట్టుకునే కేసులోనూ, ఢిల్లీలో నలుగురు అమ్మాయిలను వేధించిన కేసును దర్యాప్తు చేసి గుర్తింపు పొం దారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఉన్న అచ్చియ్యనాయుడు అనకాపల్లి వచ్చిన సందర్భంగా స్థానిక మీడియాను కలిసి తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన విషయాలను ఆయన మాటల్లోనే... వైద్యుడిని కాబోయి... నా తల్లి నాలుగేళ్ల వయస్సులో చనిపోయింది. తండ్రి సంతల్లో వ్యాపారం చేసుకునేవారు. పొరిగింటి బుద్ద జగ్గ అప్పారావుతోపాటు అతని కుమారులు శశిధర్, చక్రవర్తి నిరంతరం ఇచ్చిన స్ఫూర్తి, సూచనలు చదువుల్లో ఆర్థిక సహాయం నన్ను ఉన్నత స్థాయికి తీసుకొచ్చాయి. వారి రుణం తీర్చుకోలేనిది. కలాం, సచిన్‌లే నాకు స్ఫూర్తి. మొదట్లో వైద్యవృత్తిలోకి రావాలనే ఉద్దేశంతో శ్రమించా ను. పట్టణంలోని రాయల్‌కాన్వెంట్‌లో ఎలిమెంటరీ, జేఎల్ స్కూల్లో పదో తరగతి వరకు, విశాఖ నారాయణలో ఇంటర్మీడియట్ చదివి ఎంబీబీఎస్ రాయగా మంచి సీటు రాకపోవడంతో హిమశేఖర్ సీఎంబీబీ కోర్స్ చదివాను. కోచింగ్ లేకుండానే పోస్టు సాధించా... హైదరాబాద్‌లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నప్పుడు ఎంఏ ఎకనమిక్స్‌కు చెందిన మేఘనాథరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో 2015లో గ్రూప్–ఎ రాయగా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌గా ఉద్యోగం వచ్చింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్ టైఅప్‌తో యూ పీఎస్సీలో పోస్టులు పడగా నాలుగున్నర లక్షల మంది పోటీపడ్డారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎంపికైన నలుగురిలో నేను ఒకడిని. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నన్ను ఎంపీసీ చదవమని పట్టుబడితే నేను మాత్రం బైపీసీ చదివాను. ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదివాక జర్మనీలో ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేకపోయా. తర్వాత ఎటువంటి శిక్షణ లేకుండా గ్రూప్ –ఎలో ఉద్యోగం సాధించా. అనంతరం యూపీఎస్సీ ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఏసీపీ కేడర్ పోస్టు వచ్చింది. సిలబస్‌పై అవగాహన పెంచుకొని చదవాలి: సివిల్సే కాకుండా ఏ పోటీ పరీక్షకైనా, ఇటువంటి కష్టతరమైన ఎంట్రన్స్‌లకు పోటీ పడినప్పుడు దానిలో ఉన్న సిలబస్‌ను ఆకలింప చేసుకొని చదవాలి. దీనికి తోడు సరైన మార్గనిర్దేశం కూడా అవసరం. అప్పుడే విజయవం సొంతం చేసుకోగలం. -
ప్రజల సహకారంతోనే నేరాలు అదుపు
కోల్‌సిటీ(రామగుండం) : ప్రజల సహకారంతోనే నేరాలను అదుపు చేయవచ్చని గోదావరిఖని ఏసీపీ రక్షిత కె.మూర్తి అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక అడ్డగుంటపల్లిలోని సిరిఫంగ్షన్‌హాల్‌లో ‘షీటీం’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... బాల్యవివాహాలను ప్రోత్సహించవద్దని సూచించారు. పిల్లలు చదువుపై శ్రద్ధ వహించేలా తల్లిదండ్రులు దృష్టిసారించాలని కోరారు. పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. మహిళలు, యువతులను ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్తీల్లో ఎవరైనా అనుమానితులు కలిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, షీటీం వాట్సాప్‌తోపాటు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. మఫ్టీలో పోలీసులు నగరంలో రోజూ తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. షీటీం, గ్రామ రక్షణ దళాలు, పరివర్తన్, హాక్ ఐ తదతర వాటిపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ మహేందర్, ఎస్సై తోపాటు పోలీసు సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు. -
కన్నవారే కడతేర్చారు
ఇబ్రహీంపట్నం: నవమాసాలూ మోసిన కన్న తల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుదేవతైంది. అల్లరి చేస్తోందనే కారణంతో దివ్యాంగురాలనే కనికరం కూడా చూపకుండా ఆ తల్లి కన్నకూతురికే మరణ శాసనం రాసింది. కన్న తల్లి కూతుర్ని ఇటుకతో కొట్టి చంపితే.. కన్న తండ్రి ఆమె మృతదేహాన్ని బూడిద కుప్పలో పూడ్చేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తమ కుమార్తె అదృశ్యమైందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న ప్రేమకే మచ్చతెచ్చిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. అల్లరి చేస్తోందని.. ఒడిశాకి చెందిన భార్యాభర్తలు బల్లటి ఛత్రియ, హేతురాం యాచారం మండల పరిధిలోని చింతుల్ల శివారులోని బీఎన్సీ ఇటుక బట్టీలో 5 నెలలుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. మూడో కుమార్తె ఊర్మిళ(7) పుట్టు మూగ, చెవుడు. ఊర్మిళ అల్లరి ఎక్కువగా చేసేది. తరచూ పొరుగువారితో గొడవ పడుతుండేది. దీంతో తల్లి ఛత్రియ(39) తన కూతురును చంపాలని నిర్ణయించుకుంది. 26వ తేదీ మధ్యాహ్నం ఊర్మిళ గుడిసెలో నిద్రిస్తుండగా ఇటుకతో ఆమె తలపై కొట్టి చంపింది. గుడిసె బయట నిద్రిస్తున్న భర్త హేతురాంను లేపి విషయాన్ని చెప్పింది. మృతదేహాన్ని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. దీంతో సమీపంలోని ఇటుకబట్టీల్లో కాల్చేసిన బూడిద పొట్టు కుప్పను తవ్వి అందులో మృతదేహాన్ని హేతురాం పాతిపెట్టాడు. అనంతరం చిన్నారి తప్పిపోయిందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించారు. ఇటుక బట్టీ యజమాని ఆ చిన్నారి తల్లిదండ్రులతో కలసి 27న యాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ కృష్ణంరాజుకు తల్లిదండ్రులపైనే అనుమానం కలిగింది. ఇటుక బట్టీ ల వద్ద దుర్వాసన వస్తుండటంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఛత్రియను బిడ్డ ఎక్కడుందో చెప్పాలని నిలదీయగా వాస్తవాన్ని వెల్లడించింది. పోలీసులు ఘటనాస్థలంలో తవ్విచూడగా మృతదేహం లభ్యమైంది. విచారణ చేపట్టిన పోలీసులు తల్లిదండ్రులే ఆ చిన్నారిని హతమార్చారని తేల్చారు. ఛత్రియ, హేతురాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వివాహితను హత్యచేసి తగలబెట్టారు..
సాక్షి, విశాఖపట్నం : ఓ వివాహితను దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని నరవకొత్తపాలెం నరవలో చోటుచేసుకుంది. వివరాలివి.. దుండగులు ఓ మహిళను హత్య చేసి, గుర్తు పట్టకుండా తగలబెట్టేశారు. ఆమె మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. అప్రమత్తమైన గ్రామస్తులు విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ ఇంతవరకూ మహిళ ఎవరనేది పోలీసులు గుర్తించలేదు. సంఘటన స్థలాన్ని ఏసీపీ అర్జున్ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ.. నరవలో జరిగిన మహిళ దారుణ హత్యకు నిరసన తెలుపుతూ తాటిచెట్ల పాలెంలో ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంతేకాక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో ఏసీపీ
సాక్షి, చెన్నై: చెన్నై తిరుమంగళం ఏసీపీ కమిల్ బాషా ఏసీబీ వలలో పడ్డారు. ఆయన కార్యాలయంలో జరిగిన సోదాల్లో రూ.5 లక్షల మేరకు నగదు బయట పడింది. స్థల వివాదం సెటిల్ మెంట్లో భాగంగానే ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటూ అవినీతి ఏసీపీ ఏసీబీకి చిక్కారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల కాలంగా పనిభారం, మానసిక ఒత్తిడి కారణంగా పోలీసు విభాగంలోని కింది స్థాయి సిబ్బంది బలవన్మరణాలకు పాల్పడుతూ రావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలీసు బాసుల మీద అవినీతి ఆరోపణలు క్రమంగా పెరుగుతూ రావడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో తిరుమంగళం ఏసీపీ కార్యాలయంలో సోదాలు సాగడం పోలీసుల్ని కలవరంలో పడేసింది. తిరుమంగళం పరిసరాల్లో ఇటీవల కాలంగా నిర్మాణాలు జోరందుకోవడంతో పోలీసు సెటిల్మెంట్లు సైతం పెరిగినట్టుగా అందిన రహస్య సమాచారంతో నిఘా వేసి మరీ అవినీతి భాషాను తమ వలలోకి ఏసీబీ వర్గాలు వేసుకున్నాయి. అవినీతి బాషా : తిరుమంగళం ఏసీపీ కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో జేజే నగర్ ఏసీపీ కార్యాలయంలోనే తిరుమంగళంకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏసీపీగా కమిల్ భాషా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమంగళం ఏసీపీ కార్యాలయంలో పంచాయితీలు పెరిగినట్టు, సెటిల్ మెంట్లు జోరందుకున్నట్టుగా ఏసీబీకి సమాచారం అందిందింది. దీంతో ఏసీబీ వర్గాలు నిఘా వేశాయి. శుక్రవారం రాత్రి పద కొండుగంటల సమయంలో తమ నిఘాకు తగ్గట్టుగా ఆధారం చిక్కడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కొడుంగయూరుకు చెందిన కాంట్రాక్టర్ సెల్వం ఏసీపీ కమిల్ భాషా గదిలో సుదీర్గ చర్చలో ఉన్నట్టు సమాచారం ఏసీబీకి అందింది. ఏసీబీ ఏఎస్పీ కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. వచ్చి రాగానే నేరుగా ఏసీపీ గదిలోకి ఈ బృందం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ సెల్వం, కమిల్ బాషాఏదో విషయంగా సుదీర్ఘ చర్చలో మునిగి ఉండడం, ఏసీపీ టేబుల్ మీద నోట్ల కట్టలు ఉండటాన్ని ఏసీబీ గుర్తించింది. ఏసీబీ వర్గాల ప్రవేశంతో కమిల్ బాషా, సెల్వంలకు షాక్ తప్పలేదు. ఆ టేబుల్ మీదున్న 2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, ఆ నగదు ఎక్కడిదని ఏసీబీ విచారణ మొదలెట్టింది. తన మిత్రుడి వద్ద అప్పుగా తీసుకున్నది అని కమిల్ బాషా పేర్కొనడం తక్షణం, పక్కనే ఉన్న సెల్వం వద్ద ఉన్న బ్యాగ్‌లో తనిఖీ చేయగా అందులో నుంచి రెండున్నర లక్షలకు పైగా నగదు లభించడంతో తమ విచారణను ముమ్మరం చేశారు. ఆ ఇద్దరు పొంతన లేని సమాధానం ఇవ్వడంతో రాత్రంతా విచారణ సాగింది. శనివారం ఉదయాన్నే విచారణను ముగించిన ఏసీబీ వర్గాలు, ఆ నగదును సీజ్ చేశారు. సరైన వివరణ ఇవ్వని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించి, ఆ ఇద్దరికి కొంత సమయం ఇచ్చి వెళ్లారు. కమిల్ బాషా ఏసీబీకి చిక్కిన సమాచారం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది. ఇంత పెద్ద మొత్తం సెటిల్ మెంట్ సాగుతున్న నేపథ్యంలో ఇందులో వాటా ఒక్క కమిల్ బాషాకే కాదు, మరి కొందరికి సైతం ఉండ వచ్చన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో జేజే నగర్ ఇన్స్పెక్టర్ పాండియరాజన్‌ను సైతం విచారణ వలయంలోకి ఏసీబీ తీసుకొచ్చింది. స్థల వివాదం పరిష్కారంలో భాగంగా ఎనిమిది లక్షలకు బేరం సాగినట్టు, ఇందులో అడ్వాన్స్ తీసుకుంటున్న సమయంలో ఏసీబీ రంగంలోకి దిగినట్టుగా జేజేనగర్ పోలీసు స్టేషన్లో చర్చ సాగుతున్నది. ఈ అవినీతి వెనుక ఒక్క కమిల్ బాషానే కాదు, మరెందరో ఉన్నారని, మరెందరో ఉన్నతాధికారులకు సైతం వాటాలు తప్పనిసరి అన్నట్టుగా కింది స్థాయి సిబ్బంది పెదవి కొరుకుతుండడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి లోతైనా విచారణ సాగించేనా లేదా, ఈ తనిఖీలతో మమా అనిపించేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇది వరకు చెన్నైలో ఐపీఎల్ బెట్టింగ్ వెలుగులోకి రాగా, కమిల్ భాషా నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే, చెన్నైలో ఏదేని కీలక కేసుల విచారణలో ప్రత్యేక బృందంగా కమిల్ బాషా టీం గుర్తింపు పొంది ఉండం గమనార్హం. -
బైకుతో ఢీకొట్టి.. ఆపై కొట్టించి..
సాక్షి, మొయినాబాద్ (చేవెళ్ల): ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన యువకుడితోపాటు మరికొంత మంది వచ్చి గాయాలైన యువకుడితోపాటు ప్రమాద ఘటనను ఆగి చూస్తున్న వ్యక్తిపైనా దాడి చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ సురంగల్ గ్రామస్తులు మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి.రాజు బుధవారం రాత్రి సురంగల్ నుంచి మొయినాబాద్ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన జావీద్ బైక్‌పై సురంగల్ వైపు వెళ్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అయితే జావీద్ తన మామ షరీఫ్‌కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన విషయం చెప్పాడు. షరీఫ్ తన స్నేహితులైన వాజిద్, రజాక్, ఫిరోజ్‌తోపాటు మరో ఇద్దరితో కలిసి ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాడు. ప్రమాదంలో గాయపడ్డ రాజుపై దాడి చేశారు. అదే సమయంలో సురంగల్ గ్రామానికి చెందిన ఎల్గని భూషణ్ పిల్లలను ఆసుపత్రిలో చూపించేందుకు ఆటోలో తీసుకుని మొయినాబాద్ వైపు వస్తున్నాడు. ప్రమాదం జరిగిన చోట మంది గుమిగూడి ఉండటంతో ఆటో ఆపి కిందకు దిగాడు. రాజుపై దాడిచేస్తున్న వారు భూషణ్పైనా దాడి చేసి కొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్‌స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన దాడికి పాల్పడిన వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో గురువారం ఉదయం బాధితుడు భూషణ్‌తోపాటు సురంగల్ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. రోడ్డు ప్రమాదం, దాడికి సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై నయీముద్దీన్ తెలిపారు. -
మద్యం తాగి నడిపితే జైలుకే
మంచిర్యాల క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సిందేనని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాల్లో గురువారం డ్రంక్అండ్డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు, వారి కుటుంబం సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతన్నాయన్నారు. ప్రమాదాల్లో మృతి చెందినవారు ఎక్కువశాతం తలకు బలమైన గాయాలు తగలడం వల్లనేనన్నారు. తలకు హెల్మెట్ వాడటం వల్ల రక్షణగా ఉంటుందని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపిన వారు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు తప్పనిసరి ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు సార్లు పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మూడోసారి దొరికితే లైసెన్స్ రద్దు చేసేందుకు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సతీశ్, ఎస్సై, ఏఎస్సై భవానీ పాల్గొన్నారు. -
అడ్డంగా బుక్కైన బేగంపేట్ ఏసీపీ
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ ఏసీపీ రంగారావు తీరు వివాదాస్పదంగా మారింది. ఓ మహిళపై మీడియా ముందే చెయ్యి చేసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 9వ తేదీన బొల్లారం పయొనీర్ బజార్‌లోని ఓ జ్యువెల్లరీ షాపులో దొంగతనం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ముగ్గురు మహిళలను, దొంగసొత్తును అమ్ముతున్న మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆపై జర్నలిస్టుల ముందే ఏసీపీ రంగరావు మహిళ దొంగపై చెయ్యి చేసుకున్నారు. ఈ వీడియో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. -
మహిళపై చెయ్యి చేసుకున్న బేగంపేట్ ఏసీపీ
-
‘కాలేజ్ పోరగాళ్లు’ సినిమా చిత్రీకరణ
మంచిర్యాలఅర్బన్ : సింగరేణి కార్మికుల పిల్లలు హైదరాబాద్‌కు పై చదువులకు వెళ్లి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నారా లేదా అనే అంశంతో మంత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న కాలేజ్ పోరగాళ్లు సినిమా చిత్రీకరణ మంగళవారం పట్టణ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. దర్శకుడు, నిర్మాత, కథ మాటల రచయిత అన్నం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ఏసీపీ గౌస్‌బాబా క్లాప్ కొట్టారు. మరో నాలుగు రోజుల పాటు మంచిర్యాల గోదావరి నది, క్వారీ తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు అన్నం చంద్రశేఖర్ తెలిపారు. -
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి
కాసిపేట : విద్యార్థులు, యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఏసీపీ బాలుజాదవ్ సూచించారు. వివేకానందుడి జయంతోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ వివేకానందుడి భావాలు ప్రతి ఒక్కరికీ ఆలోచనలు కలిగేలా ఉంటాయన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంశీధర్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు రౌతు సత్తయ్య, ఎంపీడీవో అబ్ధుల్ హై, డీటీడీవో గంగారాం, ఎంఈవో దామోదర్, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, పీడీ రవి, ప్రెస్‌క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పుట్టినగడ్డ వీడి.. పుట్టెడు దుఃఖం మిగిల్చి..
పండుగ నవ్వులు వారి పెదవులపై ఇంకా చెదిరిపోలేదు.. అందరూ ఒక్క చోట చేరిన వేళ పంచుకున్న తల్లీబిడ్డల మమకారం, అక్కా చెల్లెళ్ల అనురాగం మాసిపోలేదు. మిత్రులు, కుటుంబ సభ్యుల కోలాహలం వారిని వీడిపోలేదు.. మూడు రోజుల తర్వాత సంక్రాంతి సంబరాలను గుండెల్లో పదిలంగా దాచుకుని బాధ్యతలు పెంచిన దూరాలకు పయనమయ్యారు నరసరావుపేటకు చెందిన అన్నదమ్ముల కూతుళ్లు. సొంత గడ్డపై నుంచి బయలుదేరి 24 గంటలు తిరగకుండానే తెలంగాణలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులయ్యారు. ముచ్చటైన వేడుకల్లో మునిగిన కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచెత్తారు. ఆ కుటుంబ సభ్యులంతా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం కర్ణాటక, పూణె ప్రాంతాల్లో ఉంటున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకలు జరుపుకునేందుకు సొంత ఊరైన నర్సరావుపేటకు వచ్చారు. ఐదు రోజులపాటు పట్టణంలోనే ఆనందోత్సాహాల నడుమ పండగను జరుపుకున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి తమ సొంత కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. మరో ముగ్గురిని ఆస్పత్రిపాలు చేసింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చౌటుప్పల్(మునుగోడు)/ నరసరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ (49) అక్కడే ఎస్ఎస్ఎన్ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈమె కుమారుడు రామచంద్రారెడి, కుమార్తె వాసంతి కర్ణాటకలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరితోపాటు పద్మజ, ఆమె బాబాయి కూతురు లక్ష్మీప్రియాంక (28) హైదరాబాద్ బయలుదేరారు. లక్ష్మీప్రియాంక పూణెలో పీడియాట్రిక్ చదివింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. వీరందరూ కలిసి కారులో బయలుదేరారు. పిల్లలు ముగ్గురిని హైదరాబాద్ నుంచి పంపించేందుకు పద్మజ డ్రైవర్ కృష్ణారెడ్డి(27)ని తీసుకొని వస్తున్నారు. లక్ష్మీప్రియాంక విమానంలో పూణెకు, వాసంతి, రాంచంద్రారెడ్డిలు బస్సులో కర్ణాటకకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చి సాయంత్రం వరకు బంధువుల ఇంట్లో ఉండి సాయంత్రం పిల్లలను పంపించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైకును తప్పించే క్రమంలో.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి 25 మంది ప్రయాణికులతో మిర్యాలగూడకు బయలుదేరింది. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి ఈ బస్సు వెళ్తుంది. ఇదే సమయంలో పంతంగి గ్రామ స్టేజీ వద్ద ఓ ద్విచక్ర వాహనం ఒక్కసారిగా బస్సులకు అడ్డుగా వచ్చింది. ముందున్న బస్సు బైకును తప్పించుకుని వెళ్లాడు. వెనుక ఉన్న ఈ బస్సుకు తప్పించే అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక డ్రైవర్ జావిద్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా జంక్షన్ నుంచి బస్సును అదే వేగంతో హైదరాబాద్ వెళ్లే మార్గంలోకి మళ్లిం చాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న కారు బస్సుకు ఢీకొట్టింది. బలంగా తగలడంతో కారు బస్సు కిందకు ఇరుక్కుపోయింది. అందులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదే వేగంతో రోడ్డు కిందకు దూసుకుపోయింది. బస్సులోని ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా బయటపడినప్పటికీ భయభ్రాంతులకు గురయ్యారు. ఐదుగురిలో ఇద్దరు దుర్మరణం ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో కూర్చున్న రామచంద్రారెడ్డిలతో పోలిస్తే వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. వారిని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నం చేసి క్రేన్ సాయంతో బయటకు తీశారు. హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించగానే పద్మజ మృతి చెందింది. మిగతావారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. వారిలో లక్ష్మిప్రియాంకను కామినేని ఆస్పత్రికి, మిగతా ముగ్గురుని సన్‌రైజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించగానే కామినేని ఆసుపత్రిలో లక్ష్మిప్రియాంక సైతం మృతి చెందింది. మిగతా ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మిప్రియాంకకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ రమేష్ ఏసీపీ రామోజు రమేష్, సీఐ వెంకటయ్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కారును క్రేన్ సాయంతో బస్సు కింద నుంచి తప్పించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పద్మజ భర్త శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శిక్షణలో స్నేహం, వివాహం..
నర్సంపేట: చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్ పూర్తి చేశా. 2012 లో గ్రూప్–1కు ఎంపికై పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ అన్నారు. మంగళవారం ఆమె ‘సాక్షి’ ఇంటర్వూ్యలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్. మేము నలుగురం సంతానం. అక్క, అన్న, చెల్లెలు కూడా ఉన్నత చదువులు చదివారు. నాన్న సోమశేఖర్ కోరిక మేరకు నేను గ్రూప్–1కు ఎంపికయ్యా. 2012లో నాకు మొదటి పోస్టింగ్ నల్లగొండ సీసీఎస్‌లో ఇచ్చారు. రెండో పోస్టింగ్ సూర్యాపేట డీఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివి. మూడో పోస్టింగ్ నర్సంపేట ఏసీపీగా వచ్చా. భర్త చంద్రమోహన్‌తో ఏసీపీ సునీతామోహన్ శిక్షణలో స్నేహం, వివాహం.. గ్రూప్–1కు ఎంపికైన తర్వాత శిక్షణ సమయంలో మా బ్యాచ్‌కు చెందిన ఆదిలాబాద్ జిల్లా వాసి చంద్రమోహన్‌తో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి వివాహం వరకు వెళ్లింది. మా ఇద్దరి అభిప్రాయాలను తల్లిదండ్రులు అంగీకరించారు. 2013 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నం. చంద్రమోహన్ ప్రస్తుతం కరీంగనర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. చాలెంజ్‌గా తీసుకుంటా.. విద్యా, ఉద్యోగాల్లో మహిళలు కూడా రాణించడం సంతోషకరం. పోలీస్ శాఖలో మహిళలు రాణించాలంటే ప్రత్యేక ప్రణాళికలు అవసరం. ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్తా. ఒత్తిడికి గురికాకుండా పోలీస్ ఉద్యోగాన్ని చాలెంజ్‌గా తీసుకుంటా. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటా. యువత లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. ఇది వరకు ఏదైనా రంగంలో పనిచేసిన వారు ఆదర్శనీయులుగా ఉండడం సహజమే. ఏ రంగంలో లేని వారు కూడా మంచి పనులు చేస్తూ గుర్తింపు పొంది ఆదర్శవంతంగా ఉంటారు. యువత ప్రత్యేక లక్ష్యాన్ని ఎంచుకుని తల్లిదండ్రుల ఆశయలను నెరవేర్చాలి. ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలి. చెడు మార్గంలో పయనించి సమాజానికి చేటును తెచ్చే వారు తల్లిదండ్రులను కూడా ఇబ్బందిపెట్టిన వారు అవుతారు.. -
బెజవాడ కిడ్నాప్ డ్రామాకు తెర..
సాక్షి, విజయవాడ: బెజవాడ కిడ్నాప్ కేసుకు పోలీసుల తెర దించారు. స్థానిక సింగ్‌నగర్ వద్ద జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆర్థిక వ్యవహారాలే ఈ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాలివి.. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన నర్సింగ్, విజయవాడకు చెందిన ఓ వ్యక్తితో కలిసి బాజీ అనే వ్యక్తి కలిసి పంచలోహ విగ్రహాల వ్యాపారం చేశాడు. బెంగళూరు చెందిన వ్యక్తికి విగ్రహాల కోసం లక్షల్లో డబ్బు చెల్లించి మోసపోయారు. అయితే, తన తండ్రిని మోసం చేశాడని బాజీపై నర్సింగ్ కొడుకు కళ్యాణ్ కక్ష గట్టాడు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి ఇచ్చిన సొమ్మును చెల్లించాలంటూ బాజీని కళ్యాణ్ పలుసార్లు హెచ్చరించాడు. అయినా అతను పట్టించుకోక పోవడంతో కళ్యాణ్ గత రాత్రి ఏడుగురితో కలిసి కిడ్నాప్ చేసేందుకు సిద్దపడ్డాడు. బాజీ తన స్నేహితుడు అన్వర్‌తో కలిసి ఆంధ్రప్రభ కాలనీ నుంచి సింగ్ నగర్ వెళ్లుతున్న సమయంలో ఇన్నోవా కారులో వచ్చి వారి బైక్‌ను అడ్డగించారు. వెంటనే బాజీ, అన్వర్‌లను కారులో ఎక్కించుకుని గుంటూరు వైపు వెళ్ళిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ చేసిన వారిని దారి మధ్యలో నిందితులు డబ్బు కోసం చితకబాదారు. బాకీ ఉన్న రూ. 60 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజాము 5గంటల ప్రాంతంలో చిలకలూరిపేటలో కిడ్నాపర్లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి చెర నుంచి బాధితులను విడిపించారు. కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని విజయవాడ నార్త్ ఏసీపీ వీవీ నాయుడు తెలిపారు. -
భార్యపై కోపంతో పీఎస్‌కు వెళ్లి.. ఏసీపీకి పంచ్!
జైపూర్: 'గయ్యాళి' భార్య నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా ఎంత దూరం వెళుతారు?.. జైపూర్‌లో ఓ వ్యక్తి ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. వెళ్లి తనను జైలులో పెట్టాలని ప్రాథేయపడ్డాడు. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. అంతే అతనికి కోపం వచ్చేసింది. ఏకంగా ఏసీపీకే గట్టి పంచ్ ఇచ్చాడు. దెబ్బకు మనోడు జైల్లో పడ్డాడు. కోరిక నెరవేరి ఆనందంగా కటకటాలు లెక్కిస్తున్నాడు. భార్యకు దూరంగా ఉన్నందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది. 30 ఏళ్ల యోగేశ్ గోల్యా అనే వ్యక్తి గురువారం షిప్పాపాత్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. 'నేను జైలుకు వెళ్లాలనుకుంటున్నా. నా భార్యను కొట్టాను. దయచేసి నన్ను జైల్లో పెట్టండి' అని పోలీసులను వేడుకున్నాడు. దీంతో బిత్తరపోవడం పోలీసుల వంతైంది. కాసేపటికే అతని భార్య కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తనను కొట్టాడని భర్తపై కేసు పెట్టాలని కోరింది. ఇది కుటుంబ గొడవగా భావించిన పోలీసులు సామరస్యంగా పరిష్కరించాలని భావించారు. మాన్సరోవర్ ఏసీపీ దేశ్రాజ్ యాదవ్ ఇద్దరిని కూచోబెట్టి సద్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆయన తన చేతిని యోగేశ్ భుజంపై వేసారు. అనూహ్యంగా యోగేశ్ ఎదురుతిరిగి ఏసీపీకి ముఖం మీద ఒక గట్టి పిడిగుద్దు విసిరారు. అంతే.. ఏసీపీ పెదవి చిట్లి రక్తం వచ్చింది. ఈ అనూహ్య ఘటనకు ఏసీపీతోపాటు పోలీసులు బిత్తరపోయి వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భార్యాభర్తలిద్దరూ ఒకరిమీద ఒకరు కేసు పెట్టుకోవడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో రాజీ కోసం ఏసీపీ ప్రయత్నిస్తుండగా.. ఆయన ముఖంపై పంచ్ విసిరిన యోగేశ్.. 'ఇప్పటికైనా నేను జైలుకు వెళుతాను. నా భార్య నన్ను ఎంతో ఇబ్బంది పెడుతోంది' అని పదేపదే పేర్కొన్నట్టు వివరించారు. -
సెటిల్మెంట్ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కి..
- ఇద్దరు జనశక్తి నేతల అరెస్ట్ - పార్టీ పునర్నిర్మాణ యోచనలో సభ్యులు సిద్దిపేట రూరల్: జనశక్తి పునర్నిర్మాణంలో భాగంగా ఇద్దరు సభ్యులు ఓ సెటిల్ మెంట్లో పట్టుబడ్డారు. సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ వాసి మూర్తి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ యాదన్న జనశక్తి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. పార్టీ వ్యవస్థాపకుడు కూర రాజన్న అలియాస్ కేఆర్, సభ్యులు కూర దేవేందర్ అలియాస్ అమర్, నర్సిరెడ్డి అలియాస్ విశ్వనాథం, భీంభరత్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి 60 మందితో చేవెళ్లలో జూన్ 24 నుంచి 26 వరకు ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి అవసరమైన ఆయుధాల కోసం డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి వాసి మన్వాడ వసంత్ గతంలో పార్టీ నేత. యాదన్న అతన్ని కలసి కొంత డబ్బు ఇవ్వగా ఒక పిస్తోల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు ఇచ్చాడు. వీటితో దళాన్ని ఏర్పాటు చేసి, ప్రజాపోరాటం చేయాలని నిర్ణయించారు. యాదన్నకు అతని సోదరుడు అశోక్‌రెడ్డికి మధ్య భూ వివాదం నెలకొంది. యాదన్న వసంత్‌ను కలసి మరో పిస్తోలు, ఐదు రౌండ్ల బుల్లెట్లు కొనుగోలు చేశాడు. ఇది తెలుసుకున్న అశోక్‌రెడ్డి.. తనకు యాదన్న నుంచి ప్రాణ భయం ఉందని పోలీసులను కలిశాడు. ఈ నెల 5న గంగాపూర్ వచ్చిన యాదన్న, వసంత్‌లను పోలీసులు పట్టుకున్నారు. వీరు గతంలో దేవుని పల్లి, దోమకొండ, మాచారెడ్డిలలో కూడా బెదిరిం పులకు పాల్పడినట్లు తెలిపారు. వీరి వద్ద ఒక పిస్టల్, ఐదు రౌండ్లు, ఒక రివాల్వర్, 11 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
గోపాలపురం ఏసీపీపై వేటు
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాహనాన్ని అడ్డుకున్న గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావుపై వేటు పడింది. ఆయన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 9న మహంకాళి అమ్మవారి దర్శనానికి దత్తాత్రేయ కుటుంబసమేతంగా వచ్చారు. అయితే దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఏసీపీ శ్రీనివాసరావు ఆలయానికి కొద్దిదూరం ముందే నిలిపివేశారు. తన సతీమణి అనారోగ్యం కారణంగా నడవలేదని దత్తాత్రేయ చెప్పినా ఆయన వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక కేంద్రమంత్రి వాహనం దిగి నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో హైదరాబాద్ పోలీసు కమిషన్ మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. -
దత్తన్న ప్రొటోకాల్ వివాదం: ఏసీపీపై వేటు
సాక్షి, హైదరాబాద్: మహంకాళి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రొటోకాల్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్‌రావుపై బదిలీ వేటు పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దత్తాత్రేయ వాహనాలను నిలిపివేసినందుకు గాను బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర మంత్రి ప్రొటోకాల్‌ను పాటించకుండా పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై దుమారం రేగింది. ఈ వ్యవహారంపై నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అదనపు కమిషనర్ వీవీ శ్రీనివాస్‌రావుతో విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో గోపాలపురం ఏసీపీని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు వెలువడినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి -
త్వరలోనే దోషులను పట్టుకుంటాం: ఏసీపీ
హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో జరిగిన దోపిడీకి యత్నించిన ముఠాను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులు బంటి, సర్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ఉన్నారన్న సమాచారంతోనే ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో సోదాలు నిర్వహించామన్నారు. మొత్తం ఆరుగురు ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించినట్లు గుర్తించామన్నారు. చోరికి నెల రోజులుగా ముఠా రెక్కీ నిర్వహించినట్లు గుర్తించామన్నారు. వీరంతా ముంబైకి చెందిన అర్జున్వెట్టి గ్యాంగ్ సభ్యులుగా ఏసీపీ వెల్లడించారు. ఎక్కువ బంగారం దొరుకుతుందనే ముత్తూట్‌ను టార్గెట్ చేసి ఉంటారని, త్వరలోనే దోషులను పట్టుకుంటామన్నారు. టవేరా వాహనంలో యాక్సిల్ బ్లేడ్, వేట కొడవలి, ఫేక్ నంబర్ ప్లేట్, ఓ పెద్ద బ్యాగు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టవేరా వాహనం గుజరాత్‌కు చెందినదిగా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. మొత్తం ఎనిమిది బ్లాక్‌ల్లో తనిఖీలు చేశామని,ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు క్లూస్ టీమ్ పూర్తి ఆధారాలు సేకరిస్తోందని అన్నారు. దుండగుల వద్ద ఆయుధాలు ఉండటం వల్లే ఎవరికీ ప్రాణనష్టం జరగకూడదనే ఆక్టోపస్‌ను రంగంలోకి దింపామన్నారు. మరోవైపు పోలీసు శునకాలు దుండగుల వాహనం దగ్గరి నుంచి.. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 171 దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో కొందరు దుండగులు వేరే వాహనాల్లో వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వారు హ్యపీహోమ్ అపార్ట్మెంట్లో ఉండొచ్చనే యోచనతో అణువణువునా తెల్లవారు జాము 3 గంటల వరకూ తనిఖీ చేశారు. -
ప్రహరీ కూల్చివేత.. అడ్డుకున్న ఎమ్మెల్యే!
- రోడ్డుకు అడ్డంగా ఉండటంతో పడగొట్టిన జీహెచ్ఎంసీ - అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే కౌసర్... ఉద్రిక్తత - హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘటన హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం.3లో రోడ్డుకు అడ్డుగా నిర్మించిన ప్రహరీ కూల్చివేత... ఎమ్మెల్యే జోక్యంతో ఉద్రిక్తంగా మారింది. సోమవారం జీహెచ్ఎంసీ సర్కిల్-10(బి) టౌన్‌ప్లానింగ్ ఏసీపీ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో సిబ్బంది గోడను పడగొడుతుండగా... కార్వాన్ ఎమ్మె ల్యే కౌసర్, మాజీ మేయర్ మాజిద్హుసేన్ అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. ఇది పబ్లిక్ రోడ్డు కాదని, అలాంటప్పుడు ప్రహరీని ఎలా కూలుస్తారంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అక్కడున్న కొందరు ఆయనకు మద్దతు పలికారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు వాదోపవాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, పనులు నిలిచిపోయాయి. చివరకు జీహెచ్ఎంసీ అధికారులు... భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి గోడను నేలమట్టం చేశారు. పబ్లిక్ రోడ్డు.. అందుకే కూల్చేశాం: ఏసీపీ జగన్మోహన్రావు ఇది పబ్లిక్ రోడ్డని, ముందుగా నోటీసులు ఇచ్చిన తరువాతనే ప్రహరీ కూల్చామని ఏసీపీ జగన్మోహన్రావు తెలిపారు. గతంలో గ్రూప్ హౌసింగ్ కింద ఇంటర్నల్ కాంపౌండ్ వాల్ కట్టబోమనే షరతుతో అనుమతి తీసుకు న్నారని, అనంతరం ఎవరికి వారే వ్యక్తిగత నివాసాలకు ప్రహరీ నిర్మించుకున్నారని చెప్పారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. వెనుక ఉన్న స్థలం యజమాని ఇంటి అనుమతి ప్లాన్‌లో ఇది అప్రోచ్రోడ్గా ఉన్నందున, ఈ ప్రహరీని కూల్చివేసి అప్రోచ్ రోడ్డు వసతి కల్పించామని తెలిపారు. మా ఇంటికి దారి చూపించాలి కదా.. 2010లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ృ3లో ఆరు వేల గజాల స్థలాన్ని నా భార్య ఝాన్సీ పేరిట కొన్నాం. అప్పటి సేల్ డీడ్లోనూ ఇది పబ్లిక్ రోడ్డనే ఉంది. 2012లో ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. వారు కూడా దీన్ని పబ్లిక్ రోడ్డుగానే నిర్ధారించారు. కాలనీవాసులను గోడ తియ్యమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో జీహెచ్ఎంసీని సంప్రదించాం. ఇటీవల అక్కడ విల్లాలు కూడా కట్టడంతో మాకు దారి లేకుండా పోయి ఇంటి నిర్మాణం ఆగిపోయింది. - పొట్లూరి వరప్రసాద్ (సినీ నిర్మాత, పీవీపీ వెంచర్స్ అధినేత), లోపలున్న స్థల యజమాని స్థలం కొన్నప్పుడే ఆ గోడ ఉంది... 1984ృ85లో ఐదుగురం కలిసి 7,200 గజాల స్థలాన్ని కొన్నాం. అప్పుడే ఈ గోడ ఉంది. గ్రూప్ హౌసింగ్ కింద 1987లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశాం. 30 ఫీట్ల ఇంటర్నల్ ప్రైవేట్ రోడ్డు అని చూపించి అనుమతులు తీసుకున్నాం. పర్మిషన్ కాపీలో కూడా ఈ గోడ ఉంది. గ్రూప్ హౌసింగ్ కింద అనుమతులు తీసుకున్నాక.. 1994ృ95లో జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో రివైజ్డ్ ప్లాన్ దరఖాస్తు చేసిన మాట నిజమే. కానీ రివైజ్డ్ ప్లాన్‌లో కాలనీ రోడ్డు ఉందని ప్రస్తావించాం తప్ప, దాన్ని పబ్లిక్ రోడ్డుగా చూపించలేదు. - బెజవాడ కృష్ణారెడ్డి, సునీల్ చంద్రారెడ్డి, కాలనీలోని స్థల యజమానులు -
గుప్త నిధుల తవ్వకాల కేసులో..
► ఎనిమిది మంది అరెస్ట్.. ► పరారీలో మరో ముగ్గురు.. భువనగిరి, అర్బన్ :గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం భువనగిరిలోని డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏసీపీ ఎస్.మోహన్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలను వెల్లడిం చారు. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రా మ శివారులో ఉన్న మైసమ్మ ఆలయం పక్కనే ఉన్న దానంబండను స్థానికులు పవిత్రంగా కొలుస్తు పూజ లను నిర్వహిస్తారు. దానంబండ కింద గుప్త నిధులు ఉన్నట్లు ఈ నెల 24న అదే గ్రామానికి చెందిన కురిమండ్ల శ్రీనివాస్‌గౌడ్, ఈదులకంటి సంజీవరెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, ఉప్పునుతల రామ్‌దాస్, సంగి సుదర్శన్, చౌదరపల్లి గ్రామానికి చెందిన పక్కీరు ధర్మారెడ్డి, గుండెబొయిన కృష్ణ(జేసీబీ డ్రైవర్), పక్కీర్‌గూడునికి చెందిన గంగదేవి నర్సింహ్మ, కరీంనగర్ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు రాజు, సోమయ్య, గుర్తు తెలియని మరో వ్యక్తి జేసీబీ సాయంతో దానంబండ కింది భాగంలో తవ్వకాలు జరిపారు. వీరికి ఎలాంటి గుప్త నిధులు లభించ లేదు. అదే గ్రామానికి చెందిన తూంకుంట విఠల్ 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో గుర్తించిన 11 మంది నిందితులలో 8 మందిని అరెస్టు చేసినట్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన క్షుద్ర పూజారులు పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీ, బైకును వారి నుంచి స్వాధీనం చేసుకునట్లు తెలి పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో భువనగిరి రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ కె. వెంకటేష్ పాల్గొన్నారు. 3 -
దూల్మిట్ట సర్పంచ్ భర్త అరెస్ట్
మద్దూరు (హుస్నాబాద్): మండలంలోని దూల్మిట్ట గ్రామ సర్పంచ్ భర్త నాచగోని లక్ష్మణ్‌గౌడ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సోమవారం మద్దూరు పోలీసులు అరెస్ట్ చేశారని గజ్వేల్ ఏసీపీ గిరిధర్ తెలిపారు. దూల్మిట్ట గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై నవంబర్ 19న విచారణ అనంతరం సర్పంచ్ భర్త నాచగోని లక్ష్మణ్ గౌడ్, కుమారుడు వెంకట్‌గౌడ్‌లు కులం పేరుతో దూషించారని అదే గ్రామానికి చెందిన మెర్గు రమేష్ చేసిన ఫిర్యాదు మేరకు నవంబర్ 20న కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నాచగోని లక్ష్మణ్ గౌడ్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
తనకు దక్కదన్న అనుమానంతో...
సిద్దిపేట రూరల్ : తాను పెట్టుకున్నది అక్రమ సంబంధమే కాకుండా అమ్మాయి ఇతరులతో సన్నిహితంగా మాట్లాడుతోందన్న చిన్న అనుమానంతో ఒక కిరాతకుడు ఆ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. తనతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ మరొకరితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మహిళను హత్య చేసిన ఘటనను పోలీసులు చేధించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన దండ్ల లావణ్య (28) ఈ నెల 9 న దారుణ హత్యకు గురైంది. లావణ్య భర్త కొంతకాలంగా గల్ఫ్ దేశంలోని ఖత్తర్‌లో కూలీ పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇంటి వద్దనే ఉంటున్న లావణ్యకు అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములు గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా వారిమధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. గత కొంత కాలంగా లావణ్య తనను పట్టించుకోవడం లేదనీ, ఇతర వ్యక్తులతో మాట్లాడుతోందన్న అనుమానం పర్శరాములు పెంచుకున్నాడు. దాంతో పర్శరాములు, ఎలాగైనా లావణ్యను అంతం చేయాలన్ననిర్ణయానికి వచ్చి దానికో ప్రణాళిక వేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 9న లావణ్యకు ఫోన్ చేసి ఎప్పుడు కలుసుకునే స్థలానికి రావాలని సూచించాడు. అలాగే పతకం ప్రకారమే పర్శరాములు గొడ్డలి తీసుకొని అక్కడికి వెళ్లాడు. అప్పటికే లావణ్య అక్కడికి రావడంతో ఇరువురు మాట్లాడుతుండగా లావణ్యకు ఫోన్ వచ్చింది. ఫోన్ రావడంతో అనుమానించిన పర్శరాములు తనతో తెచ్చుకున్న గొడ్డలితో ఆమె మెడపై బలంగా నరకడంతో ఆమె కేకలు వేస్తూ అక్కడే కుప్పుకూలింది. ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకున్నాడు. కాళ్ల కడియాలు తీసేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో కాళ్ల పాదాలు నరికి వేరుచేసి వాటిని కూడా తీసుకున్నాడు. అనంతరం లావణ్య శవాన్ని ఆ ప్రాంతంలోని మొక్కజొన్న తోటలో ఉన్న చీరలో ఆమెను మూటకట్టి బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద ఓ గుంతలో పడేశాడు. ఊర్లో ఉంటే అనుమానం వస్తుందేమోనని పారిపోయాడు. ఇదిలా ఉంటే గురువారం రూరల్ సీఐ సైదులు, రాజగోపాల్‌పేట ఎస్ఐ శ్రీనివాస్‌లు ఎన్సాన్పల్లి శివారు వద్ద వాహానాలు తనిఖీ చేస్తుండగా దొమ్మాట వైపు నుంచి వచ్చిన పర్శరాములుగౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకొని పై విధంగా వివరాలు వెల్లడించినట్లు ఏసీపీ వివరించారు. గురువారం సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి తన కార్యాలయంలో నిందితున్ని రిమాండ్‌కు చూపిస్తూ మీడియాకు వివరాలను వెల్లడించారు. నిందుతుని వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు కళ్లకడియాలు స్వాదీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు పర్శరాములుపై 302, 376, 379, 201 సెక్షన్ల కింద కేసు నమోదు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. లావణ్య అతి కిరాతకంగా నరికి చంపిన పర్శరాములుపై రౌడీషిట్ ఒపెన్ చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
పదివేలకు మగశిశువు విక్రయం
- ఆర్థిక ఇబ్బందులతోనే అంటున్న కన్నతల్లి - కొనుగోలు చేసిన ఇద్దరు మహిళలతో పాటు తల్లి అరెస్టు హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఓ మహిళ కన్న పేగును కాదనుకుంది. రెండున్నర నెలల పసిగుడ్డును పదివేల రూపాయలకు అమ్ముకుంది. భర్త ఫిర్యాదుతో పోలీసులు తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని తుకారాంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తర మండల డీసీపీ కార్యాలయంలో శుక్రవారం గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు వివరాలను మీడియాకు తెలిపారు. తుకారాంగేట్ వడ్డెర బస్తీకి చెందిన రాజు కూలి పనులు చేస్తుంటాడు. ఇతని భార్య కవిత రెండున్నర నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెల 23న రాజు సెంట్రింగ్ పని నిమిత్తం యాదగిరిగుట్టకు వెళ్లి.. మూడు రోజుల క్రితం వచ్చాడు. ఇంటి వద్ద కవిత, బిడ్డ కనిపించలేదు. కవిత సెల్ స్విచ్ ఆఫ్ రావడంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం రాజును కలిసేందుకు వచ్చిన కవిత బిడ్డను పది వేల రూపాయలకు అమ్మానని చెప్పింది. దీంతో రాజు తుకారాంగేటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉండే బెల్లంపల్లికి చెందిన సుమతో కలసి బిడ్డను గోదావరిఖనికి చెందిన అంజలికి పదివేల రూపాయలకు అమ్మినట్లు పోలీసులకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొంది. దీంతో సుమను, అంజలిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో శిశువును శిశుహోమ్కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
2 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్: నమ్మకంగా పని చేస్తున్న ఓ వ్యక్తి తన యజమానిని మోసం చేశాడు. బంగారం వ్యాపారి వద్ద పని చేస్తున్న చేతన్ మాలి అనే వ్యక్తి తన యజమాని ఇచ్చిన 2 కిలోల బంగారాన్ని చేర్చాల్సిన చోటుకు చేర్చకుండా దొంగతనం చేశాడు. దీంతో బాధితుడు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు కిలోల బంగారం రికవరీ చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్య వివరాలు తెలిపారు. -
పక్కా ప్రణాళికతోనే హత్య
► రెండు రోజుల్లో రాజేష్ కేసును ఛేదిస్తాం : ఏసీపీ మల్లారెడ్డి ► నాలుగు బృందాలతో గాలింపు ►శ్యాంసుందర్రెడ్డిపైనే అనుమానం ఇబ్రహీంపట్నంరూరల్: గుంటిరాజేష్ హత్య కేసు ఛేదించి రెండురోజుల్లో నిందుతులను పట్టుకుంటామని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి అన్నారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్కు చెందిన గుంటి రాజేష్ హత్యపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. పాత కక్ష్యలే కారణం అని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్యకు పన్నాగం పన్నారని తెలిపారు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన విషయంలో అనుషారెడ్డి తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. కొతూ్తర్ గ్రామానికి చెందిన శ్యాం సుందర్‌రెడ్డితో వివాదమే రాజేష్ హత్యకు కారణమయి ఉండొచ్చని అనుమానించారు. మూడు బృందాలతో నిందుతుల కోసం గాలి ంపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హత్య జరిగిన సంఘటన స్థలం వద్ద రాజేష్‌తో పాటు వచ్చిన యుగేందర్ హత్య ఉదంతం, హత్యచేసిన పరిస్థితిని చూసి ముగు్గరులేదా నలుగురు వ్యకు్తలు హత్యలో పాలుపుంచుకున్నట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. రాజేష్‌పై హయత్‌నగర్‌లో 10చీటింగ్ కేసులు, సరూర్‌నగర్ పీఎస్‌లో రెండో భార్య కేసు వీటిన్నంటి పూర్వపరాల ప్రకారం కేసు విచారిస్తున్నామన్నారు. హత్య జరిగిన అరగంటలోపే శ్యాం సుందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పరారీలో ఉండడం, వారి సెల్‌ఫోన్ లొకేషన్లు వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చూపించడం బట్టి శ్యాంసుందర్రెడ్డే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. హత్య చేసిన తీరును బట్టి పది పదిహేను రోజులుగా రెక్కీ నిర్వహించి మాటుగాసి హత్య చేసినట్లు అంచనా అన్నారు. ఈ హత్యకు ఎవరెవరు సహకరించారు. దీనితో యుగేంధర్ పాత్ర ఏంటి అనే కోణంలో విచారణ సాగుతుంది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని రెండురోజుల్లో నిందుతులను అదుపులోకి తీసుకుని కోరు్టలో హాజరుపరుస్తామన్నారు. -
కోళ్లు రెడీ.. కొట్లాట లేదు! .
► నిఘా నీడలో శివపల్లి ►దశాబ్దాలుగా కోడి పందేలకు కేంద్రం ►రెండేళ్లుగా నిషేధం అమలు ►ఈయేడూ కట్టడికి పోలీసుల వ్యూహం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నదమ్ములే దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందేలను ప్రోత్సహిస్తున్నారు. పండుగ వచ్చిందంటే చాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పందెంరాయుళ్లు కారులో, జీపుల్లో గ్రామానికి చేరుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. విజయరమణారావు తండ్రి కాలం నుంచి గ్రామంలో పెద్దరికం కొనసాగుతుండగా, ఆ కుటుంబం కోడి పందేలకు అండగా నిలుస్తోంది. విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పం దేలు జోరందుకున్నాయి. వందల్లో ఉన్న పం దెంరాయుళ్ల సంఖ్య వేలకు చేరింది. తన పదవీకాలం ఐదేళ్లలో విజయరమణారావు ఏటా సంక్రాంతికి పెద్ద జాతరే నడిపించారు. రెండేళ్ల క్రితం పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఈ పందేలపై నిషేధం విధించింది. దీంతో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కోడిపుంజుల కొట్లాటను పోలీసులు కట్టడి చేశారు. గతేడాది పందెంరాయుళ్లను వారం రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు. కొట్లాటే లేదు జిల్లాలో చాలా గ్రామాల్లో నాటుకోళ్లు పెంచేవారంతా పందెం కోళ్లను పెంచుతున్నారు. నాటుకోడి మార్కెట్లో రూ.400 నుంచి రూ.500లకు లభిస్తుండగా, పందెం కోడికి రూ.2 వేలు పలుకుతోంది. దీంతో చాలా మంది గ్రామాల్లో పందెం కోళ్లను పెంచేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పందెం కోళ్లను నాగపూర్, చంద్రాపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన వారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గ్రామంపై ప్రత్యేక నిఘా జిల్లాలోని శివంపల్లిలో చాలా ఏళ్లుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ పందేలను ప్రభుత్వం నిషేధించింది. దీంతో పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా గ్రామంపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఊళ్లోకి వచ్చిపోయేవారిపై దృష్టిసారించాం. ఎవరైనా రహస్యంగా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు . – మల్లారెడ్డి, ఏసీపీ పందేలు నిలిపేసినం.. దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందేళు జరిగాయి. అందరూ ఇష్టంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంధ్రా ప్రాంతం మాదిరిగా రూ.వేలల్లో కాకుండా వందల్లో సరదాగా డిపాజిట్లు కొనసాగేవి. ప్రస్తుతం ఇలాంటి ఆటలు నిషేధించడంతో గ్రామంలో సైతం పందేలు ఆలిపేసినం. – శ్యామ్‌సుందర్‌రావు, సర్పంచ్ -
ప్రజలకు మరింత చేరువ
చేవెళ్ల రూరల్: సైబరాబాద్ పరిధిలో పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్య, డీసీపీ పద్మాజారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. చేవెళ్ల డీఎస్పీ కార్యాలయ స్థానంలో ఏసీపీ కార్యాలయం కొనసాగుతుందన్నారు. అంతకుముందు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, డీసీపీ పద్మాజారెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులతో సీపీ మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా నగరానికి కూరగాయలను తీసుకొని వెళ్తుంటారని, వారి వాహనాల్లో తిరిగి వచ్చే సమయంలో పోలీసులు జరిమానాలు విధిస్తున్నారని సీపీకి వారు వివరించారు. రైతులకు మినహారుుంపు ఇవ్వాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గంగారెడ్డి, శృతకీర్తి, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, జేడ్పీటీసీ సభ్యురాలు శైలజ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దేవుని విజయలక్ష్మి, శర్వలింగం, వైస్ చైర్మన్ మానిక్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
ఇబ్రహీంపట్నం: మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి (పాత జిల్లాలు) ఎన్ఎస్ఎస్ విద్యార్థినులకు వినోభానగర్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో 5 రోజుల పాటు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇచ్చారు. మంగళవారం ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణకు మహిళలు కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీమ్స్, 100 నెంబర్‌కు డయల్ చేయాలని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి.విష్ణుదేవ్, కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, డెరైక్టర్ వంశీకృష్ణ, ఏఓ వెంకట్, సీఐ స్వామి, కరాటే మాస్టర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. -
మందమర్రిలో 2కే రన్ ప్రారంభం
మందమర్రి(ఆదిలాబాద్ జిల్లా): మందమర్రిలో సదాసేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 2కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ, బెల్లంపల్లి ఏసీపీ రమణారెడ్డి ప్రారంభించారు. 2కే రన్ సింగరేణి పాఠశాల మైదానం నుంచి మార్కెట్ వీధుల మీదుగా పోలీసు స్టేషన్ వరకు సాగుతుంది. పరుగుపందెంలో గెలుపొందిన ముగ్గురికి బహుమతులు అందజేస్తారు. -
మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు కౌన్సెలింగ్
వరంగల్ : మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిలకు షీ టీం ఇన్చార్జీ ఏసీపీ ఈశ్వర్రావు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. గత కొద్దిరోజులుగా వరంగల్, హన్మకొండ, రంగశాయిపేట జూని యర్ కాలేజీ, కేడీసీ, జిజ్ఞాస జానియర్ కాలేజీ, బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్‌ల సమీపంలో గ్రూపులుగా ఏర్పడి కాలేజీలకు వచ్చిపోయే విద్యార్థినులను వేధింపులకు పాల్పడుతున్నట్లు షీ టీంకు సమాచారం అందిందన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వేధింపులకు పాల్పడుతున్న పస్తం నాగేశ్, ఎండి.హుస్సేన్, చిన్నపల్లి అఖిల్, కావటి కరుణాకర్, విష్ణు, గండి రాహుల్, పి.విఠల్, శివకందన్, ఎండీ అంజాద్, ఎండీ అన్వర్, బాసానీ అఖిల్, జూలూరి సాయితేజ, మండ బిక్షపతి, మోరె అని ల్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరికివారి తల్లిదండ్రుల ముం దు కౌన్సెలింగ్ నిర్వహించడమే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఈకేసులు నమోదైతే ప్రభు త్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణింపబడుతారని హెచ్చరించారు. కౌన్సెలింగ్ కార్యక్రమంలో షీటీం కానిస్టేబుళ్లు శ్రీని వాస్, బిచ్యానాయక్, రమణ, శ్రీనివాస్, రాజేశ్, వనజ, మోనికాలు పాల్గొన్నారు. -
ఐసీపీఎస్, శిశుగృహలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ చౌరస్తా : స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వరంగల్ కార్యాలయ పరిధిలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసేందుకు పలు ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 13, 2015 నాటికి అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల పైబడి 40 ఏళ్లలోపు వారై ఉండాలని, శిశుగృహలో ఖాళీగా ఉన్న సోషల్‌వర్కర్ పోస్టుకు జూన్ 13, 2015 నాటికి 25 నుంచి 40 ఏళ్ల వయసు కలి గి ఉండాలని, ఓసీలైతే 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన వా రు ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇవే పోస్టులకు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్, ఔట్రీచ్ వర్కర్, సోషల్‌వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆయా పోస్టులకు ఎంఎస్‌డబ్ల్యూ, బీకాం ఫైనాన్స్, బ్యాచ్‌లర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసి, గత అనుభవం ఉండాలని వివరించారు. పూర్తి వివరాలకు ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా స్త్ర్రీ, శిశు అభివృద్ధి సంస్థ వరంగల్ కార్యాలయం, ఇంటి నంబర్ 1–7–967, రాజ్‌హోటల్ ఎదురుగా, ఏకశిల సొసైటీ కాలనీ, హంటర్‌రోడ్, హన్మకొండ, 506001లో సంప్రదించవచ్చని తెలిపారు. -
సేవకు గుర్తింపు
హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో కాజీపేట ఏసీపీ జనార్దన్‌కు ఇండియన్ పోలీస్ మెడల్, మహబూబాబాద్ లీడింగ్ ఫైర్‌మెన్ ఐలుమల్లుకు ఉత్తమ సేవా పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. -
వెన్కెపల్లివాసికి ఇండియన్ పోలీస్ మెడల్
సైదాపూర్: మండలంలోని వెన్కెపల్లి గ్రామస్తుడు, వరంగల్ జిల్లా కాజీపేట ఏసీపీ బెదరకోట జనార్దన్ రాష్ట్రపతి అందజేసిన ఇండియన్ పోలీస్ మెడల్‌ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అందుకున్నారు. వెన్కెపల్లికి చెందిన బెదరకోట రామస్వామి–రాములమ్మ దంపతుల రెండోసంతానం జనార్దన్. ఉన్నతచదువులు పూర్తి చేసి 1989లో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. భూపాల్పల్లి, బచ్చన్నపేట, ఘన్పూర్, తొర్రూర్, సుబేదారి, మహబూబాబాద్‌లో విధులు నిర్వర్తించారు. 2003లో సీఐగా పదోన్నతి పొంది బయ్యారం, హసన్‌పర్తి, హన్మకొండలో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతితో మామునూర్ అసిస్టెంట్ కమాండెంట్, వరంగల్ఎస్బీ డీఎస్పీ, ప్రస్తుతం కాజీపేట ఏసీపీగా పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికచేసింది. ఈసందర్భంగా వెన్కెపల్లి సింగిల్ విండో ౖచెర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, వెన్కెపల్లి మాజీ సర్పంచ్ కొత్త నారాయణరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కూతురు విద్వాన్‌రెడ్డి,ౖ సెదాపూర్ సర్పంచ్ కనుకుంట్ల విజయ్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. -
కరాటే ప్రభాకర్ ఇంట్లో పేకాట
ప్రభాకర్‌తోపాటు ఆరుగురి అరెస్ట్ రూ.6.61 లక్షల నగదు స్వాధీనం ఏసీపీ సురేంద్రనాథ్ వెల్లడి వరంగల్: కాంగ్రెస్ నాయకుడు కొయ్యడ ప్రభాకర్ అలియాస్ కరాటే ప్రభాకర్ ఇంట్లో పేకాట ఆడుతుండగా ఏడుగురిని వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ నేతృత్వంలో మిల్స్‌కాలనీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఏసీపీ కథనం ప్రకారం... వరంగల్ అండర్ బ్రిడ్జి శివనగర్ సమీపంలోని కరాటే ప్ర భాకర్ ఇంట్లో మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఎస్సై రవీందర్, పీఎస్సై సాయన్న తనిఖీలు నిర్వహించారు. ఇంటి రెండో ఫ్లోర్లో మద్యం తాగుతూ పేకాట ఆడుతున్న కరాటే ప్రభాకర్‌తోపాటు వరంగల్ నగరానికి చెందిన కూర మధూకర్, గుజ్జ నరేష్, బోడకుంటి రవిశంకర్, అడువాల సూర్యనారాయణ, పోతి రెడ్డి పాపిరెడ్డి, సాటింపు నాగేశ్వర్రావును అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6లక్షల 61 వేల 910స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ట్లు ఏసీపీ తెలిపారు. కాగా కరాటే ప్రభాకర్ గతంలో శ్రీనివాస ట్రస్ట్ క్లబ్ పెట్టి నడిపిస్తుండగా ఇంతెజార్గంజ్ పోలీస్టేషన్లో బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీ సులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గొంతులో ఉన్నదేమిటి?
‘సాక్షి’ చేతికి శశికుమార్ పుర్రె ఎక్స్‌రే గొంతులో కనిపిస్తున్న బంతిలాంటి వస్తువు విశాఖపట్నం: ఏఎస్పీ శశికుమార్ మృతిలో సంచలనం కలిగించే అత్యంత కీలక ఆధారం ‘సాక్షి’ సేకరించింది. శశికుమార్‌ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేందుకు బలం చేకూర్చే ప్రధాన సాక్ష్యంగా మారే అవ కాశం ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు ఏదో రహస్యాన్ని దాస్తున్నారని ముందే పసిగట్టిన ‘సాక్షి’ ఆ దిశగా అడుగులు వేసింది. అత్యంత లోతుగా చేసిన పరిశోధనలో శశికుమార్ పుర్రె ఎక్స్‌రేలు సంపాదించింది. శవ పరీక్షకు ముందు ఫోరెన్సిక్ నిఫుణులు శశికుమార్ మృతదేహంపై గాయాలను పరిశీలించారు. అతని తలపై గాయం ఉండటంతో పుర్రెను ఎక్స్‌రే తీయించారు. సాధారణంగా శవ పరీక్షలకు ముందు ఎక్స్‌రే తీసే సంప్రదాయాన్ని ఫోరెన్సిక్ వైద్యులు పెద్దగా పట్టించుకోరు. కానీ శశికుమార్ మరణం అనుమానాస్పదం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఎక్స్‌రే తీశారు. దీన్ని చూసిన తరువాత మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి . శశికుమార్ కంఠముడి(గొంతు)లో ఒక బంతి వంటి వస్తువేదో ఉన్నట్లు ఈ ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపిస్తోంది. అతను చనిపోవడానికి ముందు మాట బయటకు రాకుండా ఆ వస్తువును గొంతులో కుక్కినట్లు అనిపిస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రిపోర్ట్‌ను రహస్యంగా నమోదు చేశారు. అదే విధంగా శశికుమార్ పుర్రెపై అనేక పగుళ్లు ఉన్నట్లు ఎక్స్‌రేలో వెలుగుచూసింది. బుల్లెట్ వల్లే అలా జరిగిందా లేక తలపై వేరే బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల పుర్రె పగిలిందా అనేది తేలాల్సి ఉంది. -
బలి తీసుకున్న తూటా
తనువు చాలించిన యువ ఐపీఎస్ అధికారి పాడేరు ఏఎస్పీ అనుమానాస్పద మరణం తలలోకి దూసుకెళ్లిన 9ఎంఎం పిస్టల్ బుల్లెట్ 2012లో పోలీసు శాఖలో చేరిక తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు రెండు నెలల్లో వివాహం.. అంతలోనే విషాదం సంఘటన స్థలంలో సూసైడ్ నోట్? గోప్యత పాటిస్తున్న పోలీసు యంత్రాంగం దుర్ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం ఉదయం సుమారు 6.30 గంటల సమయం.. అది పాడేరులోని ఏఎస్పీ కార్యాలయం.. పరిసరాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి.. ఉన్నట్టుండి ఏఎస్పీ చాంబర్ నుంచి తుపాకీ పేలిన శబ్దం ఆ ప్రశాంతతను చెదరగొట్టింది. బయట గదిలో ఉన్న హోంగార్డు తుళ్లిపడ్డాడు.. కంగారుగా లోపలికి పరిగెత్తుకెళ్లాడు.. లోపలి దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు.. కొద్దిసేపటి క్రితం.. తన ముందునుంచే లోపలికెళ్లిన తన బాస్ నెత్తుటిమడుగులో కుప్పకూలిన దృశ్యం చూసి భయకంపితుడయ్యాడు. వెంటనే పోలీసు అధికారులకు సమాచారమందించారు.బుల్లెట్ పొరపాటున దూసుకొచ్చిందో.. లేక ఆయనే దించుకున్నారో.. తెలియదు కానీ.. యువ ఐపీఎస్ అధికారి అయిన ఏఎస్పీ శశికుమార్ అర్ధంతరంగా తనువు చాలించారు. ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించిందని అంటున్నా.. ఎవరూ ధ్రువీకరించడం లేదు. అయితే రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉన్న ఆయన ఇంతలోనే తనువు చాలించాలని ఎందుకనుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా.. ఒక్కగానొక్క కొడుకు తమను ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోయాడని తమిళనాడు నుంచి వచ్చిన తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. విశాఖపట్నం/పాడేరు: రైతు కుటుంబం నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన యువ అధికారి, పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్‌ను తూటా బలి తీసుకుంది. అది పొరపాటున బలి తీసుకుందా.. కావాలని ఆయనే బలి అయ్యారా? అన్నది తేలకపోయినా.. పోలీసు శాఖను, జిల్లా ప్రజలను కుదిపేసిన ఈ దారుణ ఘటన గురువారం ఉదయం పాడేరులో జరిగింది. మన్యంలో ఇలాంటి సంఘటన తొలిసారి చోటు చేసుకుంది. ఏం జరిగింది? ఈ ఏడాది జనవరి 6న పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శశికుమార్(28) అవివాహితుడు. తమిళనాడుకు చెందిన ఆయన పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో ఒంటరిగా ఉంటున్నారు. నివాస గృహం, కార్యాలయం ఒకేచోట ఉన్నాయి. గురువారం ఉదయం 6 నుంచి 6.15 గంటల మధ్య ఏఎస్పీ తన ఆఫీస్ చాంబర్లోకి వచ్చారు. కొద్దిసేపటికే గదిలో నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దాంతో బయట గదిలో ఉన్న హోంగార్డు లోపలికి పరుగెత్తుకెళ్లాడు. తూటా గాయంతో కిందపడి ఉన్న ఏఎస్పీని గుర్తించి ఎస్సై సూర్యప్రకాష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన వచ్చి శశికుమార్‌ను పోలీసు జీపులో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఆయన అక్కడ తుది శ్వాస విడిచారు. కుడి చెవి పైభాగం నుంచి ఎడమచేతి దిగువ భాగం వరకు బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఐటీడీఏ పీవో హరినారాయణన్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి తదితరులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శశి కుమార్ మృతదేహాన్ని పీవో హరినారాయణన్, ఎస్సై సూర్యప్రకాష్లు విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. సంఘటన స్థలంలో కీలక ఆధారాలు సంఘటన జరిగిన ఏఎస్పీ చాంబర్‌ను నర్సీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ పరిశీలించారు. గోడపై బుల్లెట్ రంధ్రం పడిన ఆనవాళ్లు కనిపించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సంఘటన స్థలంలో ఏఎస్పీ శశికుమార్ ఉంచిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని, దాన్ని ఉన్నతాధికారులకు అందజేశారని సమాచారం. అయితే సంఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏఎస్పీ చాంబర్లోకి మీడియాను అనుమతించలేదు. క్లూస్ టీం వివరాలు సేకరించే వరకు లోపలికి వెళ్లరాదని కట్టడి చేశారు. పాడేరు పోలీసులు ఈ సంఘటనపై నోరు మెదపడం లేదు. సీఐడీ విచారణ ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. కేజీహెచ్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసు విచారణకు ప్రత్యేకాధికారిని నియమిస్తామన్నారు. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడును విచారణాధికారిగా నియమించారు. విషాదంలో కుటుంబ సభ్యులు శశికుమార్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగలం మండలం, రంగసముద్రం. ఆయనకు తల్లిదండ్రులు కుప్పుస్వామి, మైలమ్మాల్, సోదరి కవిత ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. విషాద వార్త తెలియగానే సోదరి కవిత తన భర్త పద్మనాభన్‌తో కలిసి చెన్నై నుంచి విశాఖ వచ్చారు. సాయంత్రానికి తల్లిదండ్రులు చేరుకున్నారు. కారు దిగుతూనే తల్లి మైలమ్మల్ బాధతో ముందుకు కదలలేకపోయారు. అతికష్టం మీద మార్చురీ వద్దకు వెళ్లిన ఆమె నిర్జీవంగా ఉన్న కుమారుడిని చూసి కళ్లుతిరిగి పడిపోయారు. మరో రెండు నెలల్లో ఆయనకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇంతలో ఇలా జరగడం వారిని తీవ్రంగా కలచివేసింది. అధికారుల సందర్శన ఏఎస్పీ మరణ వార్త తెలియగానే విశాఖ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, వుడా వీసీ టి.బాబూరావునాయుడు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, అడిషనల్ డీజీ సురేంద్రబాబు, ఐజీపీ (నార్త్ కోస్టల్ జోన్) కుమార్ విశ్వజిత్, ఐజీ బి.శ్రీనివాసులు, డీఐజీ శ్రీకాంత్, సీపీ యోగానంద్, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, జేసీపీ సత్తార్‌ఖాన్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ కె.రఘురామిరెడ్డి, విజయనగరం ఓఎస్డీ వెంకట అప్పలనాయుడు, పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్ధ కౌశిక్, పార్వతీపురం ఐటీడీఏ పీవో ప్రసన్న వెంకటేష్, పాడేరు సబ్ కలెక్టర్ శివశంకర్‌లతో పాటు ఉన్నతాధికారులు, సిబ్బంది కేజీహెచ్‌కు చేరుకున్నారు. దుర్ఘటనపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్భాంది వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన ఆయన బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కూడా వచ్చి తమ సహచరుడిని కడసారి చూశారు. వృత్తిలో నిబద్ధత శశికుమార్ ఆళ్లగడ్డలో పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలపై కఠినంగా వ్యవహరించారని పేరుంది. బదిలీపై పాడేరుకు వచ్చినప్పటి నుంచి ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై దృష్టి సారించారు. భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్కు చెందిన వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై కూడా రెండు రోజుల క్రితం కొత్తభల్లుగుడ గ్రామం వెళ్ళి విచారణ నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో, పాడేరులోని తన కార్యాలయంలో పని చేసే ఉద్యోగులతో కూడా ఆయన ఎంతో సామరస్యంగానే మెలిగేవారు. అలాంటి వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం డిపార్ట్మెంట్ను కలచివేస్తోంది. -
ఏసీపీ రవిబాబుపై సీపీకి ఫిర్యాదు
పెళ్లి చేసుకుంటానని మోసగించారంటూ దళిత మహిళ ఆరోపణ అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధి మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు తన భర్తతో విడాకులు ఇప్పించి, తనను భార్యగా స్వీకరిస్తానని మోసం చేశాడని పాయకరావుపేట మాజీ ఎంపీపీ, దళిత మహిళ కాకర పద్మలత ఆరోపించారు. ఈ మేరకు ఆమె నగర పోలీస్ కమిషనర్ అమిత్గార్గను కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏసీపీ దాసరి రవిబాబు యలమంచిలి సీఐగా పనిచేసే రోజుల్లో కొన్ని రాజకీయ గొడవలు కారణంగా అతనిని తాను కలవాల్సి వచ్చిందన్నారు. అదే అదునుగా అతను తనను అన్ని విధాలుగా భయాందోళనలకు గురి చేస్తూ, యలమంచిలి కోర్టు వద్ద గల గెస్ట్ హౌస్‌కు పిలిపించుకుని శారీరకంగా లోబరుచుకున్నాడని ఆరోపించారు. అప్పటి నుంచి అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయటంతో విధిలేక అతనికి సన్నిహితంగా ఉండాల్సి వ చ్చిందని తెలిపారు. ఒక రోజు తనను భార్యగా స్వీకరిస్తానని చెప్పి, తన భర్తతో బలవంతంగా విడాకులు తీసుకునేలా చేశాడని పద్మలత తెలిపింది. వివాహం విషయమై రవిబాబు వద్ద తాను ఒత్తిడి తీసుకురావడంతో ప్రస్తుత ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలోనే సెటిల్మెంట్ జరిగిందని వివరించారు. ఈ విషయం ప్రముఖ నేతలు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణకు, అప్పటి విశాఖ జిల్లా డీఐజీ జితేంద్రకు, రూరల్ ఎస్పీ మురళీలకు తెలిసునని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలని సీపీని కోరినట్లు ఆమె తెలిపారు. -
అజ్ఞాతంలోకి దళిత మహిళ
పెళ్లి పేరుతో ఏసీపీ లోబర్చుకున్నాడని డీజీకి బాధితురాలి ఫిర్యాదు స్వయంగా దర్యాప్తునకు ఆదేశించిన శాంతి భద్రతల అదనపు డీజీ దళిత మహిళను మోసం చేసిన ఏసీపీకి మంత్రి అండదండలు సాక్షి, హైదరాబాద్ : ఇది పోలీసు అధికారి అహంకారం, దౌర్జన్యానికి పరాకాష్ట. రక్షించాల్సిన స్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి మంత్రివర్యుల మాటకు విలువ ఇస్తూ న్యాయం చేయమన్న వారికే వెన్నుపోటు పొడుస్తున్న వైనం! హైదరాబాద్ వచ్చి స్వయంగా డీజీపీతోపాటు శాంతి భద్రతల అదనపు డీజీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేని దారుణం. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పాయకరావుపేట నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె పద్మలత ఈనెల 19న డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ శాంతిభద్రతల అదనపు డీజీకి ఈ అంశాన్ని అప్పగించారు. అదనపు డీజీ వినతిపత్రాన్ని పరిశీలించడమే కాకుండా పద్మలత వాదనలో వాస్తవం ఉందని గ్రహించి ఆ వినతిపత్రంపైనే విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు ఎండార్స్ చేసి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడి మంత్రి ఒకరు జోక్యం చేసుకుని ఏసీపీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించడంతో విశాఖపట్నం పోలీసు కమిషనర్ మిన్నకుండిపోయారనే ఆరోపణలున్నాయి. దీంతో పద్మలత ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాధితురాలి వినతిపత్రంలోని అంశాలు పద్మలత గతంలో ఎంపీపీగా పనిచేసిన సమయంలో కొన్ని రాజకీయ గొడవల కారణంగా యలమంచిలి సీఐగా ఉన్న రవిబాబును కలవాల్సి వచ్చింది. ఆ సమయంలో యలమంచిలి కోర్టు దగ్గరున్న గెస్ట్‌హౌస్‌కు తనను పిలిపించుకుని కేసుల పేరుతో భయపెట్టి శారీరకంగా రవిబాబు లోబర్చుకున్నారు. అప్పటి నుంచి రవిబాబుతో సాన్నిహిత్యం పెరిగింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తకు విడాకులు ఇప్పించారు. అనంతరం భార్యగా స్వీకరించకుండా సాకులు చెబుతూ వచ్చారు. దీంతో అప్పట్లో ఎంపీగా ఉన్న, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పప్పల చలపతిరావు సమక్షంలో రవిబాబు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. అప్పటి విశాఖజిల్లా డీఐజీ జితేంద్ర, రూరల్ ఎస్పీ మురళికి కూడా ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు రవిబాబు ఏసీపీ కావడంతో కొందరు పెద్దలను అడ్డంపెట్టుకుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. నేను ఇప్పుడు ఏసీపీని.. ఏమి చేసుకుంటావో చేసుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ గొంతు నొక్కుతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేసి ఏసీపీ రవిబాబు చేత భార్యగా స్వీకరింప చేయాలి. అలాగే బిడ్డకు తండ్రిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలి’ అని విన్నవించారు. శాంతి భద్రతల అదనపు డీజీ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా విశాఖ కమిషర్‌తో మాట్లాడాల్సిందిగా ఫోన్‌నంబర్ కూడా పద్మలతకు ఇచ్చారు. దీంతో పద్మలత కమిషనర్‌కు ఫోన్ చేయగా రక్షణ కల్పించే అంశాలు ఏవీ ప్రస్తావించకుండా మీరు ఎక్కడున్నారంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ప్రాణభయం ఉన్న ఆమెకు అనుమానం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తనకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, ప్రాణాలను రక్షించాలని అయినవారికి పద్మలత మొరపెట్టుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
హెల్మెట్ లేకుంటే పోలీసులపైనా చర్యలు
అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్ కుషాయిగూడ: ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలంటూ అల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫీక్, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రజలను జాగృతం చేసేందుకు చేపట్టిన హెల్మెట్ అవగాహన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా 110 మంది సిబ్బందికి హెల్మెట్లను అందజేసిన అనంతరం మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా హెల్మెట్ ధరించిన వారికి జరిమానాలు విధించే పోలీసులు ముందుగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి విధులు నిర్వహించాలనే ఉద్దేశంతోనే అందరికీ హెల్మెట్లను అందజేసినట్లు తెలిపారు. హెల్మెట్ ధరించకుండా విధులకు హాజరయ్యే పోలీసులపై చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం పైగా హెల్మెట్ ధరించక పోవడం వల్లే మరణిస్తున్నట్లు జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్న నిబంధనలను ఇక కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పోలీసులతో అవగాహన ర్యాలీని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలలో మరణించిన, వికలాంగులుగా మారిన వందల కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయి వీధిన పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూడాలనే చక్కటి ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి హెల్మెట్ ధరించాలని కోరారు. కార్యక్రమంలో డీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సైలు జగన్‌రెడ్డి, సుధీర్‌కృష్ణ, నర్సింగ్‌రావు, అనిల్, రవితో పాటుగా యువజన విద్యార్థి సంఘాల ప్రతినిధులు సురేష్‌గుప్త, లింగం తదితరులు పాల్గొన్నారు. -
మీడియాపై ఏసీపీ రమణ దురుసు ప్రవర్తన
విశాఖపట్నం: కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ పర్యటన సందర్భంగా మీడియాపై ఏసీపీ రమణ దురుసుగా ప్రవర్తించారు. అక్కడకు వెళ్లిన మహిళా జర్నలిస్టుల పట్ల సైతం దురుసుగా ప్రవర్తించడంతో ఆయన తీరుపై జర్నలిస్టులు తీవ్ర నిరసన తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల నియంత్రణ, ఏజెన్సీలో అభివృద్ధి పనులపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాజనాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప, చిఫ్ సెక్రటరీ, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. -
నేను చెప్పిన వారే కావాలి..!
పోలీస్ బదిలీల్లో నేతల హుకుం ఏసీపీ బదిలీలపై రాజకీయ రంగు మంత్రి, ఎమ్మెల్యేల హవా నేను చెప్పిన వారినే వేయండి. నా పనులు చేసేవారు కావాలి. లేదంటే కుదరదు.. ఇదీ పోలీస్ అధికారుల బదిలీలపై నేతల మాట. విజయవాడ నగరంలో ఏసీపీల బదిలీలపై ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నేరాలు అదుపు చేసే వారు అవసరం లేదు. చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చే ఏసీపీలు ఉంటే చాలు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కూడా ఇలాంటి వారే కావాలి. లేదంటే సీఎం వద్ద పంచాయితీ పెడతాం జాగ్రత్తంటూ హెచ్చరికలు..! విజయవాడ : నగరం రాజధాని కావడంతో జనాభా పెరుగుతోంది. పల్లెల నుంచి ఉపాధి కోసం వస్తు న్న వారు ఎక్కువయ్యారు. చిన్న నేరాల నుంచి పెద్ద నేరాల వరకు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ఏసీపీలు మెరికల్లా ఉండాలి. స్టేషన్లలో సిబ్బందిని పరుగులు పెట్టించి పనులు చేసేలా తయారు చేయాలి. ఏసీపీలే సరైన వారు లేకుంటే పనులు ఎలా జరుగుతాయనేది ఉన్నతాధికారుల ప్రశ్న. ఈస్ట్ ఏసీపీ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న అభిషేక్ మహంతి చిత్తూరుకు ఏఎస్పీ గా వెళ్లారు. ఆ పోస్టును భర్తీ చేయడం ఉన్నతాధికారులకు చేతకాలేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ జోక్యం ఎక్కువైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులను వేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. ఏంచేయాలో దిక్కుతోచని ఉన్నతాధికారులు పోస్టును ఖాళీ పెట్టారు. సెంట్రల్ ఏసీపీగా ప్రభాకర్‌బాబు ఉన్నారు. ఈయన కాస్త ముక్కుసూటి మనిషి. డెరైక్ట్ రిక్రూట్ కావడమే ఇందుకు కారణం. ఎవరు ప్రభావితం చేయాలన్నా పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ నేతలకు కంటగింపు గా మారింది. దీంతో నేతలు ఈయనను రెండు నెలల క్రితం బదిలీ చేయించారు. ఈ స్థానంలో సీఐడీలో ఉన్న ఎన్.సత్యానందంను వేశారు. అయితే ఈయననూ నేతలు రానివ్వలేదు. జాయిన్ కాకుండా ఆగిపోవాల్సి వచ్చింది. నెల రోజుల క్రితం వెస్ట్ ఏసీపీగా జి.రామకృష్ణను నియమించారు. రామకృష్ణకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆయన ద్వారానే పనులు సులువుగా సాగుతాయని నేతలు మాత్రం కోరుకున్నారు. అయిష్టంగా పని చేస్తే ఏదీ సాధించలేరు. వెస్ట్ ఏసీపీ విషయంలో ఉన్నతాధికారుల వద్ద ఇదే రిపోర్టు ఉంది. అయితే జాయినై నెలరోజులే అయినందున త్వరలోనే నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు. గతంలో ఇక్కడ శివరామశర్మ ఏసీపీగా పని చేశారు. ఐపీఎస్‌లు ఉంటే బాగుంటుంది.. నగరంలో ఏసీపీలుగా ఐపీఎస్‌లు ఉంటే చురుకుగా పనులు సాగే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నా రు. రాష్ట్రస్థాయిలో చర్చకు వచ్చిన కేసులు వీరు సులువుగా చేధించే అవకాశం ఉంది. కొత్తగా ముగ్గురు ఐపీఎస్‌లు విజ యవాడ వచ్చారు. ప్రస్తుతం వీరు అవసరమైనప్పుడు సీపీ సూచనల మేరకు వెళుతున్నారు. వీరినే నేరుగా ఏసీపీలుగా వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఉన్నతాధికారుల్లో ఉంది. పోస్టింగ్‌లు అడ్డుకున్న వైనం డీజీపీ స్థాయిలోనే ఏసీపీల బదిలీల పోస్టింగ్‌లు ఉంటా యి. ఆయనపైనే ఒత్తిడి తీవ్రంగా ఉందంటే రాజకీయం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలల క్రితం వీఆర్‌లో ఉన్న కనకరాజును ఈస్ట్ ఏసీపీగా వేశారు. అయితే నేతలు అడ్డు చెప్పారు. ప్రస్తుతం మహిళా పోలీస్స్టేషన్ల ఏసీపీ వి.వి.నాయుడు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈస్ట్ ఏసీపీ బాధ్యతలు కూడా చూడాలి. ఈస్ట్ పరిధిలోని పెనమలూరులో ఇటీవల భారతీయుడు అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధ్యులపై కేసు కట్టాల్సిందిగా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లి కోర్టు డెరైక్షన్ తెప్పించి కేసు నమోదు చేయించారు. ఇదే ఏసీపీ పర్యవేక్షణ ఉండి ఉంటే ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కాదని పోలీసు అధికారులు కొందరు చెబుతున్నారు. -
లంచం కేసులో ఏసీపీ అధికారి అరెస్ట్
జోదాపూర్: లంచం తీసుకుంటూ ఓ ఏసీపీ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు. అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్లో నమోదైన ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ. 70 వేల రూపాలయల లంచం తీసుకున్నందుగానూ ఏసీపీ అధికారిని శనివారం రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ శాఖ కథనం ప్రకారం.. తూర్పు జోదాపూర్ ప్రాంతం (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) ఏసీపీ అధికారి జగదీశ్ కుమార్ విష్ణోయ్.. అట్రాసిటీ కేసులో ఇరుకున్న ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్లో నమోదు అయింది. ఎఫ్ఐఆర్ నుంచి ఆ వ్యక్తి పేరును తొలగించే విషయంలో మధ్యవర్తి ద్వారా ఏసీపీ రూ.70వేలు లంచంగా డిమాండ్ చేశాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏసీపీని వలపన్ని పట్టుకున్నారు. కాగా లంచం తీసుకున్నట్టు నిర్థారణ కావడంతో ఏసీపీ అధికారి విష్టోయ్ను, మధ్యవర్తిగా వ్యవహరించిన దుంగార్దన్ ను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు. -
విద్యార్థుల చేతిలోనే దేశ భవిత
ఏసీపీ అభిషేక్ మహంతి ఈడుపుగల్లు (కంకిపాడు) : దేశ భవిత విద్యార్థుల చేతిలోనే ఉందని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ అభిషేక్ మహంతి అన్నారు. ఈడుపుగల్లు నలంద విద్యానికేతన్ వసంత క్యాంపస్‌లో బుధవారం వార్షిక క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించారు. క్రీడా సంబరాలను ఏసీపీ మహంతి ప్రారంభించారు. ఏసీపీ మాట్లాడుతూ క్రీడల్లోనూ, చదువులోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అకుంటిత దీక్షతో పాటుపడాలని కోరారు. విద్యార్థుల్లోని అంతర్గత సృజనాత్మకతను వెలికితీసేలా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాహుబలి చిత్రంలోని సన్నివేశాలను ఉదహరిస్తూ రూపొందించిన క్రీడా బాహుబలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు క్రీడల్లో విద్యార్థులు రాణించారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కంకిపాడు సీఐ రామ్‌కుమార్, ఎస్ఐ హనీష్, ప్రిన్సిపాల్ పద్మలత పాల్గొన్నారు. -
తల్లిఒడికి పసికందు
సికింద్రాబాద్: రైల్వేస్టేషన్ ఆవరణలో మూడు రోజుల క్రితం జరిగిన పసికందు కిడ్నాప్ కేసును గోపాలపురం పోలీసులు ఛేదించారు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు. కిడ్నాపర్ పరారీలో ఉండగా పసికందును కోనుగోలు చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏసీపీ శివప్రసాద్, గోపాలపురం ఇన్స్పెక్టర్ ఎస్.రామచంద్రారెడ్డితో కలిసి ఉత్తర మండలం అదనపు డీసీపీ పీవై గిరి తెలిపిన వివరాల ప్రకారం.... ఖమ్మం జిల్లాకు చెందిన టి.రమాదేవి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుని జీవిస్తోంది. చెత్తకాగితాలు సేకరిస్తూ జీవించే రమాదేవి 27 రోజుల క్రితం మగబిడ్డ (నాగాచారి)కు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా... టోలీచౌకికి చెందిన ఫాస్ట్ఫుడ్సెంటర్ నిర్వాహకుడు మహ్మద్ ఆరీఫ్ (25) సోదరికి పెళ్లై పదేళ్లు కావస్తున్నా సంతానం కలుగలేదు. సోదరి భర్త కోరిక మేరకు ఒక మగబిడ్డను వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు ఆరీఫ్. అదే ప్రయత్నంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న అతను ఆ ప్రాంతంలో చిల్లర పనులు చేసుకుంటూ జీవించే సురేష్‌ను సంప్రదించాడు. తనకు కొంత డబ్బు వస్తుందని ఆశించిన సురేశ్.. రమాదేవి దగ్గరకు వెళ్లి ఆమె కుమారుడిని విక్రయిస్తే రూ.5 వేలు ఇప్పిస్తానని చెప్పాడు. అందుకు రమాదేవి అంగీకరించలేదు. కాగా, సురేష్ ఈనెల 17న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కారు పార్కింగ్ ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తున్న రమాదేవి వద్దకు వెళ్లి మాటల్లోకి దింపాడు. ఆమె బాత్రూమ్కు వెళ్లిన సమయంలో సురేశ్ .. పసికందు నాగాచారిని అపహరించుకెళ్లాడు. రమాదేరి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన గోపాలపురం పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా సురేష్ బాలుడిని అపహరించి ఆల్ఫా హోటల్ వద్ద ఆరీఫ్‌కు అప్పగించినట్టు గుర్తించారు. ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... సురేష్‌కు రూ. 15 వేలు ఇచ్చి బాలుడిని కొనుగోలు చేసి తన సోదరికి ఇచ్చానని చెప్పాడు. పోలీసులు పసికందు నాగాచారిని స్వాధీనం చేసుకొని రమాదేవికి అప్పగించారు. ఆరీఫ్‌ను రిమాండ్‌కు తరలించి, పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు. -
ఏసీపీ సంజీవరావుపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కూకట్పల్లి ఏసీపీ సంజీవరావుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడటంతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారులు ...సంజీవరావును గురువారం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కూకట్ పల్లి కొత్త ఏసీపీగా భుజంగరావు నియమితులయ్యారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అనినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) సంజీవరావు నివాసంతో పాటు, కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ సోదాలు జరిపింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున నగదు, ఆస్తి పత్రాలు, లాకర్లలోని నగలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. -
కాల్చుకుని చనిపోయిన ఏసీపీ.. దూకేసిన భార్య
ఆయనో సీనియర్ పోలీసు అధికారి. ఏసీపీ స్థాయిలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో గానీ.. రివాల్వర్‌తో తనను తాను కాల్చుకుని చనిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య వాళ్లుండే అపార్టుమెంట్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ శివార్లలోని నోయిడాలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అమిత్ సింగ్, సరిత దంపతులకు 18 నెలల కుమార్తె కూడా ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత అపార్టుమెంట్లో ఉండేవాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. దంపతులను ఆస్పత్రికి తరలించగా, అమిత్ సింగ్ అప్పటికే మరణించారని, ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటో మాత్రం ఇంకా తెలియడం లేదు. అమిత్ సింగ్ ఓ గదిలోకి వెళ్లి, తలుపు వేసుకుని కాల్చేసుకున్నారు. ఆ శబ్దం వినగానే సరిత పరుగున వెళ్లి గార్డును, ఇరుగు పొరుగులను పిలిచింది. మృతదేహాన్ని చూడగానే ఆమె వెళ్లి బాల్కనీ లోంచి దూకేసింది. మూడేళ్ల క్రితం పెళ్లయిన ఈ దంపతుల మధ్య ఇటీవల తరచు గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. -
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి..
సాక్షి, హైదరాబాద్: ‘ఐఏఎస్‌లు చేసి.. ఐపీఎస్‌లు చేసి.. ముఖ్యమంత్రులై.. అవినీతి కూపాల్లో చొచ్చుకుపోయి, కుంభకోణాల్లో ఇరుక్కుపోయి, చంచల్‌గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో పడ్డారే... వాళ్ళంతా జాతికి ముద్దుబిడ్డలు కాదు... దుష్టశక్తులు...’.. అవినీతిపై ఇంత చక్కగా లెక్చర్ దంచినవ్యక్తి ఎవరో తెలుసా? ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శనివారం అరెస్టు చేసిన కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు!! ఆయనకు రూ.13 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడులు జరగడానికి కొన్ని రోజుల ముందు కూకట్పల్లి పరిధిలోని ఓ కాలేజీలో ఫ్రెషర్స్‌డే జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సంజీవరావు విద్యార్థుల్ని ఉద్దేశించి.. సుదీర్ఘ ప్రసంగం చేశారు. భరతమాతకు ముద్దుబిడ్డలుగా ఉండాలని.. ఉత్తచెత్త పౌరులుగా కాక.. ఉత్తమ పౌరులుగా నిలవాలని సంజీవరావు తన ప్రసంగంలో ఉద్బోధించారు. ఈసందర్భంగా కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అంటూ శ్రీశ్రీ కవితనూ ఉదహరించారు. ఏసీబీ దాడులు, ఆయన అరెస్టు నేపథ్యంలో సోమవారం ఈ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
కూకట్పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
♦ రూ. 2.9 కోట్ల విలువజేసే ఆస్తులున్నట్లు గుర్తింపు ♦ ఏసీపీ సంజీవరావు అరెస్టు సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూకట్పల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజీవరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆయన కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో శనివారం ఏకకాలంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 2.9 కోట్ల విలువైన ఆస్తులున్నట్టుగా గుర్తించారు. బాలానగర్ హస్మత్‌పేటలోని సంజీవరావు నివాసంతో పాటు హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే కూకట్‌పల్లిలోని ఏసీపీ కార్యాలయంలోనూ దాడులు చేశారు. ఈ సోదాల్లో బాలానగర్‌లోని హస్మత్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కార్ఖానాలోని ఓల్డ్ వాసవి కాలనీలో మూడు ఫ్లాట్లు, మెదక్ జిల్లాలోని ములుగు మండలం కొత్యాల గ్రామం ఆలీనగర్‌లో 36.09 ఎకరాల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని కేశవరంలో తొమ్మిది ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమితో పాటు ఓ ఫామ్‌హౌస్, వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేటలో 44.12 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీ10 ఏఎం 2277 నంబర్ గల స్విఫ్ట్ కారు, టీఎస్03 ఏడీ 3366 నంబర్ గల హోండా సిటీ కారు, 750 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.3.29 లక్షల నగదు ఆస్తులున్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆస్తుల విలువ మార్కెట్లో రూ.13 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు. అక్రమార్జనలో ఈ ఏసీపీ తీరే వేరు.... అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎస్హెచ్ఓల పరిధిలోని కేసుల్లోనూ తలదూర్చడమే కాకుండా ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడినట్లు కూకట్పల్లి ఏసీపీ సంజీవరావుపై ఎన్నో ఆరోపణలున్నాయి. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివాదాస్పద నిర్మాణాల్లో తలదూర్చి అందిన కాడికి దండుకునేవాడని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ఏసీపీ పరిధిలోనిది కావడంతో అనేక కేసుల్లో డబ్బులు డిమాండ్ చేసి రాజీకుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు కేసుల్లో ఈయనకు చెందిన ఓ బినామీ పాత్ర కీలకంగా ఉండటం గమనార్హం. ఫాంహౌస్‌లోనూ సోదాలు... శామీర్‌పేట్: మండల పరిధి కేశవరంలో సంజీవరావుకు సంబంధించిన ఓ ఫాంహౌస్‌లో ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. కూకట్పల్లి ఏసీపీకి సంబంధించిన భూములు బినామీ పేర్ల మీద కేశవరంలో ఉన్నాయని తెలిపారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 29లో సంజీవరావుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలోని గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సర్వే నంబర్ 29లో సుమారు 10 ఎకరాల భూమి గుర్తించామన్నారు. సదరు భూమి సంజీవరావు అత్త శశికళ, కుమారుడు సుశాంత్ పేర్లమీద ఉన్నాయని తెలిపారు. సోదాల్లో ఏసీబీ సీఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. అల్వాల్‌లోనూ... అల్వాల్ : అలాగే ఏసీబీ డీఎస్పీ సునీత ఆధ్వర్యంలో శనివారం అల్వాల్‌లోని సంజీవరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. అల్వాల్‌లోని జి+1 ఇంటితో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, 75 తులాల బంగారు నగలు, 3 లక్షల 29 వేల నగదు, 18 విదేశీ మద్యం బాటిళ్లు ఇంట్లో లభించాయని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా సంజీవరావు 1979లో ఎస్ఐగా పోలీసు విధులలో చేరి సీఐ, ఏసీపీగా విధులు నిర్వహించినట్లు తెలిసింది. మూట పడేశారు.... ఒక వైపు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, సంజీవరావు కుటుంబ సభ్యులు ఇంట్లో కిటికీ నుంచి ఓ మూట బయట పడేశారు. ఈ విషయాన్ని పాత్రికేయులు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మూటను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాసు బుక్కులు, ఇతరులకు సంబంధించిన స్థలాల పత్రాలు అందులో ఉన్నట్లు తెలిసింది. -
కూకట్పల్లి ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంట్లో శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. సంజీవరావుకు సంబంధించిన వివిధ ప్రాంతాలలోని ఆరు చోట్ల ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కూకట్ పల్లి కార్యాలయం సహా అల్వాల్ లోని ఇళ్లు, వరంగల్, కరీంనగర్‌లలో దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో 75 తులాల బంగారం, షాపింగ్ కాంప్లెక్స్, ఐటీ కాలనీలో రెండు ఇళ్లు, షామీర్ పేటలో ఓ ఫాం హౌజ్, తూప్రాన్‌లో 30 ఎకరాలు, మూలుగులో 10 ఎకరాలు, రామన్నపేటలో 10 ఎకరాల స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక కంటోన్మెంట్ వాసవీ కాలనీలో బినామీ పేర్ల మీద సంజీవరావు ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీపీ డీఎస్పీ సునీత వెల్లడించారు. సంజీవరావుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. సోమవారం బ్యాంకు లాకర్లను తెరవనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు రెండుకోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. -
పాఠశాలలో గ్యాస్‌లీక్?
♦ శ్వాస ఆడక విద్యార్థుల ఇబ్బంది ♦ అపస్మారక స్థితిలో నలుగురు.. హైదరాబాద్: తరగతి గదుల్లో రోజూలాగే విద్యార్థులు శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. అంతలోనే శ్వాస ఆడక కొందరు కుప్పకూలిపోయారు. ఏమవుతుందో తెలుసుకునే లోపే నలుగురు విద్యార్థులు అపస్మారకస్థితికి వెళ్లిపోయారు. ఈ ఘటన శుక్రవారం హైదరాబాద్ షేక్‌పేట్ గుల్షన్‌కాలనీ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చోటు చేసుకుంది. ఆ స్కూల్ మొదటి అంతస్థులో రోజులాగే శుక్రవారం తరగతులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్ర దుర్వాసన రావడం ప్రారంభమైంది. ఈ వాసన భరించలేక కొందరు విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటికి పరిగెత్తగా 5, 8, 9వ తరగతులలో విద్యార్థులు ఎక్కడి వారు అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో హతాశులైన పాఠశాల యాజమాన్యం బాధిత విద్యార్థులను టోలీచౌకిలోని క్యాండి పిల్లల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పది మంది విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇర్షాద్, గౌస్, షాహిద, అజీంలను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరికి ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన డీసీపీ, ఆర్డీఓ పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర్రావు ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషాతో కలసి పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసిఫ్‌నగర్ డివిజన్ క్లూస్‌టీం బి. భిక్షపతి బృందం ఆధారాలను సేకరించారు. కాగా సంఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాల సైన్స్ ల్యాబ్ నుంచి గ్యాస్ లీకైందని కొందరు అంటుండగా... పాఠశాల వెనుక గల చెట్ల నుంచి దుర్వాసన వచ్చిందని కరస్పాండెంట్ తన్వీర్, ప్రిన్సిపాల్ రుమాన అహ్మద్‌లు అంటున్నారు. సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాం శర్మ, షేక్‌పేట్ తహశీల్దార్ చంద్రకళ పాఠశాలను సందర్శించి, ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు. ఉమ్మడి రాష్ట్రాల మైనార్టీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్‌ఖాన్ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.. ఈ ఘటనలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు అన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. -
లక్డీకపూల్లో వ్యక్తి దారుణ హత్య
వెంటాడి దాడి చేసిన దుండగులు సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని వెంటాడి ఇనుప రాడ్లతో దారుణంగా చితకబాది హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి లక్డీకపూల్లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం మహ్మద్ సోహెల్‌గా అనుమానిస్తున్న వ్యక్తి అర్ధరాత్రి సమయంలో టీఎస్11ఈబీ5112 ద్విచక్ర వాహనంపై రంగారెడ్డి కలెక్టరేట్ వైపు వస్తున్నాడు. వెనుక నుంచి వాహనంలో వెంబడించిన దుండగులు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో సోహెల్ కిందపడిపోయూడు. వెంటనే వారు రాడ్లతో దాడి చేయడానికి రాగా అతను తప్పించుకుని ఎదురుగా ఉన్న సంధ్య రెస్టారెంట్లోకి పరుగులు తీశాడు. వెంటవచ్చిన దుండగులు రాడ్లతో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, డీఐ ప్రకాశ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని జేబులో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. మృతదేహం సమీపంలో సెల్‌ఫోన్ కూడా లభ్యమైంది. బండిలోని డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాలతో విచారణ చేస్తున్నారు. హోటల్ సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
స్థలం కనిపిస్తే అమ్మేస్తారు
ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఆరిలోవ(విశాఖ) : వివాదంతో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని అమ్మేస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరిని ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు మంగళవారం స్టేషన్ ఆవరణలో కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆదర్శనగర్‌కు చెందిన జె.రమేష్, గాంధీనగర్‌కు చెందిన సతీష్‌కుమార్, ఆరిలోవకాలనీకి చెందిన పి.రామారావు స్నేహితులు. వీరు ముగ్గురు నగ రు శివారులో పలుచోట్ల వివాదంలో ఉన్న స్థలాలను ముందుగా గుర్తిస్తారు. వాటిని ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మిస్తారు. అనంతరం వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఇలా పీఎంపాలెంలో ఓ స్థలం విక్రయిస్తామని మూడోవార్డు కార్పొరేటర్ నల్లూరి భాస్కరరావు నుంచి రూ.10 లక్షలు, మధురవాడ దరి మిథిలాపురి వుడా కాలనీలో స్థలం అమ్ముతామంటూ మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన నుంచి రూ.17 లక్షలు అడ్వాన్స్‌గా వసూలు చేశారు. వీటితోపాటు రుషికొండ దరి రామానాయుడు ఫిల్మ్ స్టూడియో వద్ద 2,000 చదరపు గజాల స్థలాన్ని చదును చేయించి హైదరాబాద్ చెందిన ఓ పార్టీకి అమ్మకానికి పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మూడోవార్డు పరిధి ఆదర్శనగర్‌లో ఓ స్థలం యజమాని హెన్స్ కుమార్ ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలో రూ. 10లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అక్రమాలన్నీ బయటపడడంతో వారిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. వారిలో రమేష్, సతీష్‌లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మూడో వ్యక్తి రామారావు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ధనుంజయనాయుడు, ఎస్ఐ కాంతారావు, ఏఎస్ఐలు బ్రహ్మాజీ, కాళీ ప్రసాద్ పాల్గొన్నారు. -
‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభం
గోల్కొండ: ఆసిఫ్‌నగర్ ఠాణాలో ‘లాకప్ డెత్’పై విచారణ ప్రారంభించారు. కేసు విచారణాధికారి, సీసీఎస్ ఏసీపీ సోమేశ్వర రావు సోమవారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన నేరుగా లాకప్‌లో వృతిచెందిన నక్కల పద్మ నివసించే భోజగుట్ట శివాజీనగర్ వెళ్లారు. వుృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు. పద్మ కుమారులు సాయి, రవిలతో సుదీర్ఘంగా మాట్లాడారు. పలు వివరాలను ఆయన సేకరించారు. చోరీ కేసులో ప్రధాన నిందితులైన మంజుల, లక్ష్మీలతో పద్మకు ఉన్న పరిచయంపై కూడా ఆయన వివరాలను ఆరా తీశారు. కాగా ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలు, పద్మ కుమారులు తెలిపిన వివరాలకు సబంధం లేనట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్న దీప్తిరాజ్ ఇచ్చిన ఫిర్యాదు కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి దీప్తిరాజ్ ఎఫ్ఐఆర్ను నిశితంగా పరిశీలించారు. సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ నాంపల్లి: ఆసిఫ్‌నగర్ ఠాణాలో చోటుచేసుకున్న నక్కల పద్మ లాకప్ డెత్ కేసును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. లాకప్‌డెత్ ఘటనపై సెప్టెంబరు 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో పాటుగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, హైదరాబాదు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని కోరింది. -
పట్టపగలే భారీ చోరీ
షాద్‌నగర్: రాత్రీ, పగలనే తేడా లేదు. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు దొంగలు తమ పని పూర్తి చేసుకుని వెళుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని విజయ్‌నగర్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైంది. మహబూబ్‌నగర్‌లోని డీసీసీబీ బ్యాంకులో డీజీఎంగా పనిచేసే లక్ష్మి మంగళవారం ఉదయం విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆమె భర్త ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్‌కు వెళ్లగా... తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల బీరువా తలుపులు కూడా తెరచి ఉన్నాయి. సమాచారం అందుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్ సిబ్బందితో కలసి సాయంత్రం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మధ్యాహ్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ జరిగిన ఇంటి వద్ద తచ్చాడుతుండగా చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. -
ఇద్దరు చైన్ స్నాచర్లకు రిమాండ్
అంబర్‌పేట(హైదరాబాద్): మహిళల మెడల్లో నుంచి గొలుసులు లాక్కు పోతున్న ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి పంపారు. సోమవారం డీసీపీ డాక్టర్ డి.రవీందర్, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించిన వివరాలివీ.. పహాడీషరీఫ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జహంగీర్ అలియాస్ పర్వేజ్ బాబా(30) కొంత కాలంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం హబ్సిగూడలో తనిఖీలు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు జహంగీర్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా ఘరానా చైన్ స్నాచర్ అని తెలింది. అతని నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 28.25 తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అలాగే, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వి.విష్ణువర్ధన్ అనే స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
బీరు బాటిళ్లతో ఫైటింగ్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
బంజారాహిల్స్: మద్యం సేవించిన యువకులు బీరు బాటిళ్లతో రోడ్డుపైనే యుద్ధాన్ని తలపించే రీతిలో ఘర్షణ పడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేసన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78లో నివసించే బిల్డర్ బి.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు రాజసింహారెడ్డి (18) లండన్‌లో చదువుతున్నాడు. వారం క్రితం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి తన స్నేహితులకు మాదాపూర్‌లోని ఓ పబ్‌లో విందు ఇచ్చారు. విందులో దాదాపు 37 మంది మద్యం సేవించారు. ఆ సమయంలో వారి మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్ద ఘర్షణగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని పెట్రోల్ పంప్ పక్కన ఉన్న బరిస్తా వద్దకు చేరుకుని బీరు బాటిళ్లతో హోరాహోరీగా తలపడ్డారు. గాలిలోకి బీరు బాటిళ్లు విసురుతూ వీధిపోరాటానికి దిగారు. బీరు బాటిళ్లు ముక్కలుముక్కలుగా రోడ్డుపై పడి కొన్ని వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొనే సరికి వారంతా పరారయ్యారు. ఈ దాడిలో రాజసింహారెడ్డికి తీవ్ర గాయాలు కాగా అతడిని శ్రీనగర్‌కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీధి పోరాటానికి దిగిన వారిపై ఐపీసీ సెక్షన్ 427, 324, 506ల కింద కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
రెండోసారి పట్టుబడితే జైలుకే..
- ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి - బైక్రేసర్లకు కౌన్సెలింగ్ బంజారాహిల్స్ : బైక్ రేసింగ్‌లో రెండోసారి పట్టుబడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బైక్ రేసర్లు, వారి తల్లిదండ్రులకు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 16 మంది బైక్‌రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారికి ఏసీసీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు, ఇంటికి ఎప్పుడు వస్తున్నారు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటూ తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి బైక్‌రేసర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడ్డ వారంతా టోలిచౌకి, కూకట్పల్లి, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. కార్యక్రమంలో సీఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్మార్ట్ టైల్స్ వచ్చేశాయ్!
మార్కెట్లోకి ఐక్యూ స్మార్ట్ టైల్స్ - ఏసీపీ ఎలివేషన్స్‌కు ప్రత్యామ్నాయం - తక్కువ ధర.. పర్యావరణహితం కూడా.. సాక్షి, హైదరాబాద్: కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనం కొద్ది రోజుల్లోనే మసకబారిపోతే.. దుమ్ము, ధూళి కారణంగా భవనాల గోడలు అందవిహీనంగా మారిపోతే.. కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవకుండా ఉండాలంటే భవనాలకు రక్షణ కవచం (ఫ్రంట్ ఎలివేషన్) అవసరం. ప్రస్తుతం దీనికోసం అల్యూమినియం కాంపోసైట్ ప్యానెల్ (ఏసీపీ) ఎలివేషన్స్‌ను వాడుతున్నారు. అయితే ఇది కాసింత ఖర్చుతో కూడుకున్న పని. పెపైచ్చు ఏసీపీలతో భవనం లోపల వేడెక్కువగా ఉంటుంది. ఇలాంటి చిక్కులేవీ లేకుండా తక్కువ ఖర్చుతో.. అందంగా, ఆహ్లాదంగా ఉండే ఐక్యూ స్మార్ట్ టైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. తెలంగాణలో ఏకైక ఐక్యూ స్మార్ట్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. - సాధారణంగా టైల్స్ 11-13 ఎంఎం మందం ఉంటాయి. కానీ ఐక్యూ టోన్ మాత్రం 8 ఎంఎం మాత్రమే ఉంటాయి. గట్టిదనంలో ఏమాత్రం తక్కువ కాదు. వీటిని ఇటాలియన్, స్పెయిన్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ప్రస్తుతం భవనాల ఎలివేషన్స్‌కు వాడుతున్న అల్యూమినియం కాంపోసైట్ ప్యానెల్స్ (ఏసీపీ)లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. దీంతో భవనం లోపలికి వేడి రాదు. ఫలితంగా ఏసీ, కూలర్ల వాడకం తగ్గుతుంది. విద్యుత్ బిల్లు మోత తప్పుతుంది. ఇతర భవనాలతో పోల్చుకుంటే ఐ క్యూ స్మార్ట్ టైల్స్ ఎలివేషన్స్ ఉన్న భవనాల్లో వేడి 20-25 శాతం తక్కువగా ఉంటుంది. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి కూడా. - 13 కిలోల బరువుండే ఈ స్మార్ట్ టైల్స్.. 2 ఎంఎం వరకు ఎటువైపంటే అటువైపు మళ్లుతుంది. దీంతో ఎలివేషన్స్ వాడకంలో వంపులుగా ఉన్న దగ్గర సులువుగా వంగుతాయి. వీటికి మెయింటెనెన్స్ అవసరమూ లేదు. వీటి ధర చ.అ.కు రూ.120-170 వరకు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంటినెంటల్ ఆసుపత్రిలో 6 వేల చ.అ.ల్లో ఫ్రంట్ ఎలివేషన్స్‌కు వీటినే వినియోగిస్తున్నారు. - క్యూ టోన్ అనే మరో రకం టైల్స్ కూడా ఉన్నాయి. ఇవి అహ్మదాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటి ధరలు వాల్ టైల్స్ అయితే చ.అ.కు రూ.75-300 వరకు, ఫ్లోర్ టైల్స్ అయితే చ.అ.కు రూ.80-200 వరకున్నాయి. - ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే స్టోన్ ఆర్ట్ టైల్స్ కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఒక్కో గదికి ఒక్కో టైల్స్ వేసుకోవటం ఫ్యాషన్‌గా మారింది కూడా. ఇవి నార్వే, ఇస్తాంబుల్, కెనడా, అమెరికా, ఆఫ్రికా, టర్కీ వంటి సుమారు 20 దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చినవే. వీటి ధర చ.అ.కు రూ.600-900 వరకుంటుంది. అన్ని రకాల సైజులుంటాయి. - స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వంటి అన్ని బ్రాండ్ల టైల్స్‌ను సరఫరా చేస్తున్నాం. పెద్ద మొత్తంలో కొనుగోళ్లకు విదేశీ టైల్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన రోజు నుంచి 45-60 రోజుల్లో, మన దేశ బ్రాండ్లయితే 10 రోజుల్లోపే డెలివరీ చేస్తాం. గతేడాది రూ.12 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఈ ఏడాది 30 శాతం వృద్ధి రేటును ఆశిస్తున్నాం. పూర్తిగా గ్లాస్‌తో తయారైన డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ కూడా ఉన్నాయి. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం వీటి ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గ ది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్ మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌస్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. ఇవి ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. అన్ని రకాల రంగుల్లో, సైజుల్లో లభ్యమవుతున్న డీక్రిస్టల్ టైల్స్ ధరలు చ.అ. కు రూ.800-1,600 వరకు ఉంది. -
'నాపై ఏసీపీ దౌర్జన్యకరంగా వ్యవహరించారు'
పాడేరు: వైఎస్సార్సీపీ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి అరెస్ట్ అక్రమమని, పోలీసులు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పూనుకుంటున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాడేరులో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి పూర్తిగా కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఇటీవల విశాఖ కలెక్టరేట్లో తాము ఆందోళన చేసి వినతిపత్రం ఇవ్వాలని వేచివుంటే మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఏసీపీ రమణ తనపై దౌర్జన్యకరంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రమేయం ఏమీ లేకున్నా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తెలుగుదేశం పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకు అండగా ఉంటున్నారనే అక్కసుతోనే వైఎస్సార్సీపీ నేతలపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. -
ర్యాగింగ్ పేరిట శృతి మించొద్దు : ఏసీపీ గిరిధర్
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : ర్యాగింగ్‌ల పేరిట విద్యార్థులు తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోకూడదని సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ సూచించారు. శుక్రవారం సుల్తాన్‌బజార్ హనుమాన్ టెకిడిలోని ప్రగతి మహా విద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ కౌన్సెలింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గిరిధర్ హాజరై ర్యాగింగ్ వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు తమ సరదాల కోసం ర్యాగింగ్‌ల పేరిట శృతి మించిన ఆగడాలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. తోటి విద్యార్థులను స్నేహపూర్వకంగా కళాశాలలోకి ఆహ్వానించాలే తప్ప ర్యాగింగ్‌ల పేరుతో వికృతచేష్టలకు పాల్పడవద్దని హితవు పలికారు. కళాశాలల యాజమాన్యాలు సైతం ర్యాగింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. -
జనఘోషతో హోరెత్తిన కలెక్టరేట్లు
ప్రజా సమస్యలే ఎజెండాగా వైఎస్సార్సీపీ ధర్నాలు ♦ పోటెత్తిన ప్రజలు... సర్కారు తీరుపై మండిపాటు ♦ పాలకపక్షం కళ్లు తెరిపించేలా సాగిన ఆందోళనలు ♦ విజయనగరంలో జాతీయ రహదారి దిగ్బంధం ♦ విశాఖలో మహిళా ఎమ్మెల్యేపై ఏసీపీ దౌర్జన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకపక్షం కళ్లు తెరిపించేలా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్రజేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజల సమస్యలపై పోరుబాట పట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలు జనఘోషతో దద్దరిల్లాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ సర్కారు తమను మోసం చేసిందని ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ జిలా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. చంద్రబాబు ఏరుదాటి తెప్ప తగలేసినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుపై కూడా ఏ1గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎడ్లబండ్ల ర్యాలీ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ టీడీపీ నేతలు జగన్‌పై బురద జల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తూర్పుగోదావరిజిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో భారీ ఎత్తున జనం హాజరయ్యారు. శ్రీకాకుళంలో జరిగిన ధర్నాలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ప్రసంగించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిసరాలు ధర్నాతో హోరె త్తాయి. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతపురంలో కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్వద్ద తమ వాదన విన్పించడంలో విఫలమవ్వడంతో రాయలసీమ రైతులకు నష్టం వాటిల్లుతుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసు దౌర్జన్యం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలను ఏసీపీ ఆర్.రమణ అడ్డుకున్నారు. కలెక్టర్ లేకపోవడంతో వినతిపత్రాన్ని గోడకు అంటించే యత్నం చేసిన నేతలను గెంటివేశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన డీఆర్వో కె.నాగేశ్వరరావు ముఖ్యనాయకులు తన గదిలోకి రావాలని కోరారు. అయినప్పటికీ ఏసీపీ వారిని డీఆర్వో దగ్గరకు పంపేందుకు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేయిపట్టుకుని బయటకు నెట్టి వేశారు. మహిళా ఎమ్మెల్యేనైన తనకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్ రైజ్ చేస్తామని ఆమె చెప్పారు. -
'అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసు ఇస్తా'
విశాఖపట్నం: ఎస్టీ శాసన సభ్యురాలైన తనపై ఏసీపీ రమణ దాడి చేయడం అమానుషమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తనపై ఏసీపీ రమణ దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన ఘటనపై గవర్నర్, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సంఘటనపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసులు ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా ఉంటే కాకీ చొక్కాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేయాలంటూ విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ పోలీసులకు సూచించారు. మహిళ కార్యకర్తలపై దాడి విషయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని గుడివాడ అమర్నాధ్ హెచ్చరించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. వైఎస్ఆర్ సీపీ ధర్నాపై కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కలెక్టరేట్‌లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్నతాధికారులు లేకపోవడంతో వినతి పత్రాన్ని ఆమె గోడకు అంటించారు. ఆ క్రమంలో ఏసీపీ రమణ దౌర్జన్యానికి దిగారు. ఇకపై ధర్నాలు ఎలా చేస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే, పార్టీ నేతలను ఏసీపీ రమణ హెచ్చరించారు. అనంతరం గోడకు అంటించిన వినతి పత్రాన్ని ఏసీపీ రమణ చింపేశారు. ఏసీపీ వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. -
'సీసీ కెమెరాలతో నేరాల నివారణ'
రంగారెడ్డి: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాలను నివారించవచ్చని ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు తెలిపారు. 'సీసీ కెమెరాల ఏర్పాటు-నేరాల నివారణ' అంశంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నాగోలులోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాలనీకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తు పట్టవచ్చని, నేరాల సంఖ్య తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ అండ్ సేఫ్ కాలనీగా మార్చుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో 28 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు కాలనీవాసులు ముందుకు వచ్చారు. -
అభివృద్ధికి సహకరించాలి
- మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి ఘట్కేసర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొర్రెములలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సైబరాబాద్ పోలీసులు దత్తత తీసుకొనేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రం వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించారు. అక్కడ చెత్తను తొలగించి గుంతల్లో మట్టి పోశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతామనే ప్రతిజ్ఞ అందరితో ఆయన చేయించారు. కార్యక్రమంలో సీఐ రవీందర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, ఎస్ఐలు వీరభద్రం, రాజు, బుర్రరాజు,ఏఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ బైరగాని నాగరాజ్, ఉపసర్పంచ్ నాగార్జున, మాజీ సర్పంచ్ పసుమాల కృష్ణ, వార్డు సభ్యులు భాస్కర్,నాయకులు తరిణే మహేంద్రాచారి, శ్రీహనుమాన్ రమేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మునికుంట్ల సంతోష్ ఇతర యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
'ఆ తండ్రి' తీర్పు కరెక్టే
- ఆత్మరక్షణకే వల్లభరావు ప్రతిదాడి - ప్రేమోన్మాది రాజు కేసులో ఏసీపీ వెల్లడి - హత్యకేసును తొలగించనున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఓ ప్రేమోన్మాది దాడినుంచి తన కుమార్తెతో పాటు ఇతర కుటుంబీకులను రక్షించుకునేందుకే బాధితురాలు నీరజ తండ్రి వల్లభరావు నిందితుడు రాజుపై దాడి చేశాడని ఏసీపీ సంజీవరావు శనివారం వెల్లడించారు. ఈ దాడి ఘటన గత నెల 17న జరిగిన సంగతి విదితమే. ఈ సంఘటనపై బాధితురాలి తల్లి తులసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో వల్లభరావుపై 302 హత్యానేరం,మల్లేష్ అలియాస్ రాజుపై 307, 448, 449, 462, 354 డి సెక్షన్ల కింద కేసు పెట్టామన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరైన రాజు చనిపోయాడనీ, మిగిలిన నిందితుడు వల్లభరావుపై దర్యాప్తు సాగించామన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే వల్లభరావు రాజుపై దాడి చేశాడని, ఉద్దేశపూర్వకంగా చంపలేదని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో వల్లభరావుపై ఉన్న హత్య కేసును త్వరలో తొలగిస్తామన్నారు. మా నాన్నే లేకుంటే... రాజు దాడిలో కత్తిపోట్లకు గురైన నీరజ ‘సాక్షి’తో మాట్లాడుతూ తన తండ్రి వల్లభరావు ధైర్యం చేసి ప్రతిదాడి చేయకుంటే తామెవ్వరమూ బతికేవారము కామని చెప్పింది. తన కుటుంబీలంతా మృత్యువాత పడి ఉండేవారమనీ తండ్రి తెగించి పోరాడి తమను కాపాడాడని తెలిపింది. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఖమ్మం: ఖమ్మం జిల్లా రిజిస్టార్ ఆఫీస్‌లో సీనియర్ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గణపతిరావు వాలిడిటి సర్టిఫికెట్ కోసం అర్జీ పెట్టుకున్న హైకోర్టు అడ్వకే ట్ సీతారాంరెడ్డిని రూ. 3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సీతారాంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అదికారులు అడ్వకేట్ నుంచి గణపతిరావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
టోకెన్ లేకపోతే ఆటో బయటకు వెళ్లదు
బస్‌స్టాండ్ ఆటోలకు రికార్డులన్నీ ఉండాలి ఈ విధానానికి ప్రజలూ సహకరించాలి ఏసీపీ చిదానందరెడ్డి బస్‌స్టేషన్ : పోలీస్ ఇచ్చే టోకెన్ లేకపోతే ప్రయాణికులతో ఉండే ఆటో బయటకు వెళ్లే పరిస్థితి లేదని ఏసీపీ(ట్రాఫిక్) చిదానందరెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నగరం రాజధాని అయిన నేపథ్యంలో పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్‌లో ఆటో ప్రీపెయిడ్ కంప్యూటరీకరణ చేయనున్న విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం ఆటో కార్మికులు, ఆటోస్టాండ్ తీరును ఏసీపీ స్వయంగా పరిశీలించారు. పలు ఆటోల రికార్డులను తనిఖీ చేశారు. కంప్యూటరీకరణ విధానాన్ని కృష్ణా సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించడంతో వారు కంప్యూటర్‌కు కెమెరాను అనుసంధానం చేసే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఆటో కార్మికునికి వాహనం రిజస్ట్రేషన్ చేసి ఉండటమే కాకుండా డ్రైవింగ్ లెసైన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అన్ని రికార్డులు ఉన్న ఆటోలను కంప్యూటరీకరణ విధానంలో ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు. కంప్యూటర్లో డ్రైవర్ ఫొటో, వాహనం వివరాలు పొందుపరచడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ విధానంలో ఉన్న ఆటోలకు టోకెన్ ఇవ్వడం జరుగుతుందని, ఆ టోకెన్‌ను బయటకు వెళ్లే మార్గం దగ్గర ఉన్న విధులు నిర్వహిస్తున్న పోలీసుకు చూపితేనే ఆటో బయటకు వెళుతుందని తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. పోలీసుల విధివిధానాలకు అనుగుణంగా నడుచుకుంటేనే భద్రతమైన ప్రయాణంతోపాటు పూర్తిగా క్రైం రేటు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అది సొరంగం కాదు: ఏసీపీ
శాలిబండ: చార్మినార్ కట్టడం సమీపంలోని బండి కా అడ్డా ప్రాంతంలో ఈనెల 12న తవ్వకాల్లో బయటపడ్డ నిర్మాణాల్లో సొరంగం లేదని చార్మినార్ ఏసీపీ కె.అశోక చక్రవర్తి స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ పోలీస్ బ్యారెక్స్ ఉండేవని, ప్రస్తుతం తవ్వకాలు జరుపుతుండగా బ్యారెక్స్ నిర్మాణాలు బయట పడ్డాయన్నారు. సొరంగం ఉందన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కాగా పోలీస్ క్వార్టర్స్ నిర్మాణ పనులు సోమవారం యథావిధిగా కొనసాగాయి. పురావస్తు అధికారులకు నో ఎంట్రీ...! బండికా అడ్డాలో ఆదివారం బయటపడిన భారీ గోతిని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ విజయ్ కుమార్ బృందానికి నిరాశ ఎదురైంది. స్థానిక పోలీసులు వారిని గోతి వద్దకు రాకుండా అడ్డుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అనుమతి లేనందున అక్కడికి వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. కాగా, నిర్మాణ పనులు జరుగుతున్న పోలీస్ క్వార్టర్స్ స్థలంలోకి పురావస్తు శాఖ అధికారులు అడుగుపెడితే వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారనే అనుమానంతోనే ఆ శాఖ అధికారులను పోలీసులు అడ్డుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది రహస్య స్థావరం: పురావస్తుశాఖ డీడీ సాక్షి,సిటీబ్యూరో: చార్మినార్ సమీపంలోని బండి కా అడ్డాలో బయటపడింది సొరంగ మార్గం కాదని తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డెరైక్టర్ జె.విజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం కోసం త్వకాలు చేపట్టగా భారీ సొరంగం ఆనవాళ్లు కన్పించాయని, అయితే, అది అందరూ అనుకున్నట్టు సొరంగం కాదన్నారు. ఇది శుత్రువుల దాడి నుంచి రక్షించుకొనేందుకు కుతుబ్‌షాహీల కాలంలో భూగర్భంలో నిర్మించిన రహస్య స్థావరం, సీక్రెట్ సెల్‌గా భావిస్తున్నామన్నారు. -
కంచే.. చేను మేస్తోంది..
రాజమండ్రి క్రైం :అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేరుచెబితేనే అవినీతి అధికారులు హడలెత్తిపోతారు. అలాంటి శాఖలో జిల్లాలో ఒక అధికారి ఆ శాఖ ప్రతిష్టనే మసకబారుస్తూ.. అవినీతికి పాల్పడే వారి జాబితా దగ్గర పెట్టుకుని, వారిని దాడుల పేరుతో బెదిరించి తానే అవినీతికి తెగబడుతున్నాడు. ఆ శాఖ ఉన్నతాధికారి విశాఖపట్నం నుంచి విధులు నిర్వహిస్తుండటం అతడి అవినీతికి ఆజ్యం పోస్తోంది. జిల్లాలో అతడి బారిన పడిన పలు శాఖల అధికారులు లబోదిబోమంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖకు రాజమండ్రిలో రేంజ్ కార్యాలయం ఉంది. ఈ రేంజ్‌కు డీఎస్పీగా 2014లో వెంకటేశ్వరరావు పని చేశారు. ఆయన బదిలీ అయ్యాక విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీ ఎన్.రమేష్‌కే 2014 నవంబర్ నుంచి రాజమండ్రి బాధ్యతలు కూడా అప్పగించారు. ఆయన విశాఖ కేంద్రంగానే విధులు నిర్వహిస్తూ ప్రాధాన్యం ఉన్న కేసులు ఉన్నప్పుడు జిల్లాకు వస్తుంటారు. దానిని ఆసరాగా చేసుకుని జిల్లాకు చెందిన ఆ శాఖ అధికారి అవినీతికి తలుపులు బార్లా తెరిచారు. ఈ విషయాన్ని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా చెప్పుకొంటున్నారు. డబ్బులు వచ్చే శాఖలపైనే గురి.. ఆ ‘అవినీతి’ అధికారి దృష్టంతా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలపైనే. జిల్లాలో రిజిస్ట్రేషన్, సేల్స్ టాక్స్, ఇరిగేషన్, విద్యుత్, ట్రెజరీ, తహశీల్దార్ కార్యాలయాలే లక్ష్యాలుగా వసూళ్ల దందా సాగిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకూ భయపెట్టి గుంజుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడి బారినపడిన అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఓ అధికారి ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు. గత వారం తన నుంచి రూ.లక్షన్నర గుంజినట్టు చెప్పారు. తాజాగా బుధవారం రాజమండ్రి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ వసూళ్ల దందా చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకూ కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, రంపచోడవరం, ఏలేశ్వరం, తుని తదితర ప్రాంతాల్లో ఇలా గుంజినట్టు పై అధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలుస్తోంది. ఇలా వ సూలు చేస్తారు.. సదరు అవినీతి అధికారికి సహకరిస్తూ.. ఇద్దరు దిగువస్థాయి సిబ్బంది వసూళ్ల తంతును చక్కబెడుతున్నారు. ముందుగా ఆ సిబ్బంది ఇద్దరు ఎంచుకున్న కార్యాలయానికి వెళ్లి, పథకం ప్రకారం ‘టార్గెట్’ చేసిన ఉద్యోగితో ముందస్తుగా మాట్లాడతారు. మీపై పలు ఆరోపణలు ఉన్నాయంటారు. ఆ మాటలకు భయపడి ముడుపులు సమర్పించుకుంటే సరేసరి. లేకుంటే ‘పై అధికారులు కార్యాలయం, ఇళ్లు, ఇతర ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేస్తారని బెదిరిస్తారు. వచ్చింది ఏసీబీ అధికారులు...చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం.. అని భయపడిన ‘అవినీతి అధికారులు’ వారు అడిగిన మొత్తం సమర్పించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలో బదిలీ కానున్నదనే సదరు అవినీతి అధికారి ఈ దందాకు పాల్పడుతున్నారంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అతడి అవినీతికి అడ్డుకట్ట వేయాలని పలు శాఖల అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. -
కిటికీ గ్రిల్స్ తొలగించి భారీ చోరీ
- 53 తులాల బంగారం, కిలోవెండి, రూ. 2 లక్షల నగదు అపహరణ - వివరాలు సేకరించిన ఏసీపీ రఫీక్, క్లూస్ టీం - కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు జవహర్‌నగర్: కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడిన దొంగలు 53 తులాల బంగారం, కిలో వెండితో పాటు రూ. 2 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ తులసి గార్డెన్‌లోని డూప్లెక్స్ నంబర్ 53లో నివాసముంటున్న ఓ వ్యాపారవేత్త కంపెనీ పనిమీద శుక్రవారం ఢిల్లీకి వెళ్లాడు. ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోని పైగదిలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి కిందిపోర్షన్ వెనక భాగంలోని కిటికీ గిల్స్ తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆమె కింది పోర్షన్లో ఉన్న బెడ్రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న 53 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 2 లక్షల నగదు పాటు విలువైన సామగ్రి చోరీ అయిందని ఆమె గుర్తించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ, క్లూస్‌టీం ఆదివారం ఆలస్యంగా సమాచారం అందుకున్న అల్వాల్ ఏసీసీ రఫీక్, సీఐ వెంకటగిరి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఇంటి పరిసరాల్లో పరిశీలించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పూర్తి వివరాలు వెల్లడించేందుకు బాధితులు నిరాకరించారు. దాదాపు 100 డూప్లెక్స్ ఇళ్లు ఉన్న తులసి గార్డెన్లో సీసీ కెమెరాలు అసలే లేవు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బెజవాడలో హోంగార్డ్ అభ్యర్థుల ఆందోళన
విజయవాడ : విజయవాడలో సీఐడీ హోంగార్డ్ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. దాంతో అభ్యర్థులు ఇందిరా స్టేడియం వద్ద శనివారం ఉదయం రాస్తారోకోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బందర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 32 పోస్టుల కోసం సుమారు 3500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూ వాయిదాపై తమకు ఎలాంటి సమాచారం లేదని, చివరి నిమిషంలో వాయిదా వేయటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ డౌన్ డౌన్ ...అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ లావణ్య లక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని, అభ్యర్థులకు నచ్చచెప్పారు. 32 పోస్టుల కోసం సుమారు 25వేల అప్లికేషన్లు వచ్చాయని, అయితే వాటిని ఇంకా వెరిఫై చేసే ప్రక్రియ పూర్తి కానందున ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని డిసెంబర్ 24న అన్ని దినపత్రికల్లో ప్రకటన ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు. అయితే అభ్యర్థులకు సమాచారం అందటంలో లోపం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆమె వివరణ ఇచ్చారు. ఇంటర్వ్యూలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలోనే వెల్లడిస్తామనివ లావణ్య లక్ష్మి తెలిపారు. దాంతో చేసేది లేక అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా చర్యలు
ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ ఇబ్రహీంపట్నం: నేరాల అదుపునకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ పి.నారాయణ పేర్కొన్నారు. ప్రజలు పోలీ సులకు సహకరిస్తే నేరాలను నియంత్రించవచ్చని ఆయన చెప్పారు. జనాలు పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. శనివారం ఆయనను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. సాక్షి: శివారు ప్రాంతాల్లో తరచూ అసాం ఘిక కార్యకలాపాలు వెలుగుచూస్తున్నాయి. మీ పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు..? ఏసీపీ: అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. సాధారణ పోలీ సులతో పాటు మఫ్టీ పోలీసులతో నిరంతరంగా నిఘా ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: ఇబ్రహీంపట్నం శివారు ప్రాంతాల్లోని కొన్ని గోదాంలలో అక్రమాలు జరుగుతున్నాయి..? అక్రమార్కులు కల్తీ ఆయిల్ తదితరాలు తయారు చేస్తున్నారు..? ఏసీపీ: ఇప్పటికే పౌర సరఫరాలు, విజిలెన్స్ శాఖ అధికారులకు సమాచారం అందజేశాం. అధికారులు చర్యలు తీసుకుంటారు. గోదాం లలో జరిగే అక్రమాలపై ప్రజలు కూడా పోలీసులకు సమాచారం అందిస్తే బాగుంటుంది. సాక్షి: కొన్ని కేసుల్లో రాజకీయ నాయకులు తలదూరుస్తున్నారు. దీంతో బాధితులకు ఇబ్బంది కలుగుతోంది..? ఏసీపీ: ప్రజలు కొందరు అవగాహన రాహిత్యంతో రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. మా పరిధిలో నాయకుల ప్రమేయం లేకుండా చూస్తున్నాం. బాధితులు నేరుగా పోలీసులను సంప్రదిస్తే న్యాయం చేస్తాం. సాక్షి: యువతను చైతన్యం చేసేందుకు ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా..? ఏసీపీ: ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో బెల్టు దుకాణాలు, సారా అక్రమ విక్రయాలు అధికంగా ఉన్నాయి. వాటిపై జనాల్లో అవగాహన తెస్తే కొంతమేర ప్రయోజనం చేకూరుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: పోలీసులంటే జనాల్లో భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టేందుకు మేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏసీపీ: పోలీసులంటే జనం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించాం. మా సిబ్బంది జనాలతో మమేకమై పనిచేస్తున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తే నేరాలను చాలా వరకు అదుపు చేయవచ్చు. సాక్షి: సారా విక్రయాలపై ఏవిధంగా స్పందిస్తున్నారు..? ఏసీపీ: సారా తయారీ, విక్రయాలు నేరం. సారా తయారీదారులు స్వచ్ఛందంగా తమ వృత్తి వదిలేసి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలి. ప్రజలు చైతన్యవంతమై సారా మహమ్మారికి దూరంగా ఉండాలి. సారా తాగితే అనారోగ్యం పాలవుతారు. ఇల్లు గుల్లవుతుంది. కుటుం బీకులు కూడా తీవ్ర ఇబ్బందులపాలవుతారు. -
అత్యాచార ఘటనలో నిందితులకు రిమాండ్
నిర్భయ చట్టం కింద కేసు నమోదు హైదరాబాద్: హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట శివార్లలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలి పిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన యువతి (22) నగరంలోని హాస్టల్లో ఉంటూ ‘లా’ చదువుతోంది. ఎల్బీనగర్కు చెందిన యువకుడు రెం డేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ సోమవారం మధ్యాహ్నం పెద్దఅంబర్‌పేటలోని శబరిహిల్స్ వెంచర్‌లోని ఓ పాడుబడ్డ గదిలోకి వెళ్లారు. ఇది గమనించిన నల్లబోలు శ్రీనివాస్‌రెడ్డి (32), బండి లింగారెడ్డి (27) తమ సెల్ఫోన్లో వారి ఏకాంత దృశ్యాలను చిత్రీకరించారు. తర్వాత యువకుడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ఫోన్లోని దృశ్యాలను యువతికి చూపించి బెదిరించారు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. యువతి ఫోన్ నంబర్ తీసుకొని పిలిచినప్పుడుల్లా వచ్చి తమ కోరిక తీర్చాలని లేకుంటే దృశ్యాలను బయట పెడతామని హెచ్చరిం చారు. మరుసటి రోజు నిందితులు యువతికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని వేధించారు. వారి వేధింపులు తాళలేక యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డిలను పెద్దఅంబర్‌పేట చౌరస్తాలో అరెస్టు చేశారు. గురువారం హయత్‌నగర్ 7వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా మేజి స్ట్రేట్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా మర్రిపెడ గ్రామం. కొన్నాళ్లుగా పెద్దఅంబర్‌పేటలో వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. లింగారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్నగర్ మండలం పెద్దవీడు. ప్రస్తుతం పెద్ద అంబర్‌పేటలో బైకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఫోన్లలో ఉన్న దృశ్యాలను తొలగించారని ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్కు వారి ఫోన్లను పంపించి ఆ దృశ్యాలు ఇంకా ఎవరికైనా పంపారా అనే విషయాలను తెలుసుకొని చర్యలు తీసుకుంటామన్నారు. శివారులోని నిర్మానుష్య ప్రదేశాలలో గస్తీని మరింతగా పెంచుతామని చెప్పారు. -
సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో గాయపడ్డ ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న వనస్థలిపురం వద్ద సీఎం కాన్వాయ్ ఢీకొనటంతో ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే హయత్‌నగర్ పద్మావతి కాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన సూర్య ప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడించారు. వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్య ప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ..
* ఏసీపీ వాహనాన్ని ఢీకొన్న బైక్ * ఇద్దరికి తీవ్ర గాయాలు ఆటోనగర్: సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ బైకుపై వచ్చిన ఇద్దరు, ఏసీపీ వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం... హయత్‌నగర్ పద్మావతికాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన సూర్యప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడిస్తున్నారు. వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్యప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హయత్‌నగర్ పోలీసుల నిర్లక్ష్యం... హయత్‌నగర్ శివారు లక్ష్మారెడ్డి పాలెం నుంచి సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ ఇద్దరు వ్యక్తులు దాదాపు 8 కిలోమీటర్ల వరకు బైకుపై వచ్చారు. సీఎం నగరానికి వచ్చే సమయంలో హయత్‌నగర్ పోలీసులు జాతీయ రహదారిపై భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. తీవ్రవాదులు ఇలాంటి ఘటనకు పాల్పడితే పరిస్థితి ఎలా ఉండేదని స్థానికంగా చర్చ జరుగుతుంది. -
బండ్ల గణేశ్ చంపేస్తానంటున్నాడు...
నిర్మాత బండ్ల గణేశ్‌పై ఏసీపీకి ఫిర్యాదు బంజారాహిల్స్: సినీ నిర్మాత బండ్ల గణేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తులసి ధర్మచరణ్ అనే విత్తనాల వ్యాపారి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. గబ్బర్‌సింగ్ సినిమా గుంటూరు హక్కులు తనకు ఇస్తానని రూ. 80 లక్షలు తీసుకున్న గణేశ్.. ఆ హక్కులను రూ. 4 కోట్లకు హరి అనే డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించడాని బాధితుడు తెలిపాడు. ఈ విషయంపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు పెట్టినందుకు సోమవారం రాత్రి నుంచి గణేశ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి ముంబై మాఫియాతో చంపించేస్తానని హెచ్చరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. తనకు రావాల్సిన డబ్బు గురించి అ ప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, కన్నా ఫణిల వద్ద పలుమార్లు సమావేశాలు జరిగాయని, అయినా డబ్బు ఇవ్వలేదని ధర్మచరణ్ తెలిపాడు. రెండు నెలల క్రితం మంత్రులు నాయిని, కేటీఆర్‌తో పాటు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వద్ద కూడా సమావేశం జ రిగిందని, వారు కూడా డబ్బులు ఇవ్వాలని గణేష్‌కు చెప్పినా పట్టించుకోకుండా తనను లేపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించా డు. గణేశ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. -
పోలీసు వలయంలో మాన్గార్ బస్తీ
నాంపల్లి: మంగళవారం తెల్లవారు జామున 2 గంటలకు పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 350 మంది పోలీసులు హబీబ్‌నగర్ ఠాణా పరిధిలోని మాన్గార్ బస్తీ, సమీపంలోని అఫ్జల్‌సాగర్, జవహర్‌నగర్‌లను చుట్టుముట్టారు. 36 బృందాలుగా ఏర్పడి కార్డన్ అండ్ సర్చ నిర్వహించారు. అన్ని ఇళ్లకు వెళ్లి నిద్రలో ఉన్న వారిని లేపి సోదాలు జరిపారు. ఉదయం 5 గంటల వరకు తనిఖీలు చేశారు. 56 మంది అనుమానిత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.40 తులాల బంగారం, కిలో వెండి, రూ.75 వేల నగదు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దాడులకు నిరసనగా ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో ముగ్గురు రెండు హత్య కేసుల్లో నిందితులని, మిగతా వారు వంద కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఏసీపీ కార్యాలయం కిటకిట... మాన్గార్ బస్తీ, అఫ్జల్సారగ్ బస్తీల్లోని కొందరిని నేరస్తులుగా అనుమానితులను పోలీసులు గోషామహల్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీపీ కార్యాలయం కిటకిటలాడింది. హబీబ్‌నగర్ పోలీసులు వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆధార్, రేషన్ కార్డులను తీసుకున్నారు. బయటి రాష్ట్రాల్లో బంగారం తాకట్టు... మాన్గార్ బస్తీలో ఉంటున్న నేరస్తులందరూ హైదరాబాద్‌తో పాటు నాందేడ్, గుల్బర్గా పట్టణాల్లో తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకున్నట్లు పోలీసులకు రసీదులు లభించాయి. పరారీలో ఉన్న రిసీవర్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. భారీగా మద్యం బాటిళ్లు లభ్యం... మాన్గార్ బస్తీలో ఉండే నేరస్తుల ఇళ్లల్లో భారీగా మద్యం బాటిళ్లు దొరికాయి. వీరందరూ వైన్ షాపులు బంద్ ఉన్న సమయాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ ఇక్కడ మద్యాన్ని అమ్ముతుం టారు. అంతేకుండా గుడుంబా, గంజాయి కూడా విక్రయిస్తుం టారు. ఈ మద్యం బాటిళ్ల వ్యవహారంలో ఓ ఎస్సై పాత్ర ఉన్నట్లు సమాచారం. అతడిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. వీడిన హత్యాయత్నం కేసు మిస్టరీ: ముగ్గురు బాలనేరస్తుల అరెస్టు కార్డన్ అండ్ సర్చ్‌లో ఓ హత్య కేసు మిస్టరీ వీడింది. 16-17 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు పాతబాలనేరస్తులను పోలీసులు విచారించగా హత్య విషయాన్ని బయటపెట్టారు. జల్సాలకు అలవాటుపడ్డ ఈ ముగ్గురూ ఫుట్‌పాత్‌పై నిద్రించేవారిని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసిన వ్యక్తి ముక్కు వద్ద వైట్నర్ ఉంచి అతడు మరింత మత్తులోకి వెళ్లేలా చేస్తారు. తర్వాత దాడి చేసి, డబ్బు దోచుకుంటారు. ఇదే క్రమంలో ఈనెల 11న గోకుల్‌నగర్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 45 ఏళ్ల వ్యక్తిపై వైట్నర్ ప్రయోగించారు. అతను అంతలోనే మేల్కోవడంతో తలపై బండరాయితో మోదారు. ఇది గమనించిన ఓ వ్యక్తి హబీబ్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి అపస్మారకస్థితిలో ఉన్న బాధితుడిని ఉస్మానియాకు తరలించగా.. చికిత్సపొందుతూ ఈనెల 15న మృతి చెందాడు. కాగా, మంగళవారం కార్డన్ అండ్ సర్చ్‌లో పోలీసులు సదరు ముగ్గురు బాలనేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈనెల 11న తాము ఓ వ్యక్తిని హత్య చేశామని వెల్లడించారు. దీంతో ముగ్గురినీ జువైనల్ హోంకు తరలించారు. -
చేతనైనంత చేయూత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు విభాగం ఆధునీకరణకు వీలైనంత సహాయం అందిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణకోసం నగరపోలీసు బల గాన్ని ఏవిధంగా ఆధునీకరించాలనే అంశంపై పోలీ సు ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమావేశం ముగిసిన అనంతరం రాజ్‌నాథ్ మీడియాకు తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు మరింత సమర ్థంగా, బాధ్యతాయుతమైన బలగాలుగా రూపొందాలంటే అం దుకు కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమని ఆయ న అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సమర్థంగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. వారికి సహకరిస్తే మరింత సమర్థంగా పనిచేయగలుగుతారని చెప్పారు. ఢిల్లీ పోలీసు ఆధునీకరణకు కేంద్రం సంపూర్ణ సహకారం అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హోం శాఖ మంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్. బస్సీ, ప్రత్యేక కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, ఏసీపీలు, డీసీపీలు ఈసమావేశంలో పాల్గొన్నారు. నగరాన్ని సురక్షితంగా చేయడం కోసం చేపట్టిన చర్యల గురించి ఈ సమావేశంలో పోలీసు అధికారులు హోం మంత్రికి వివరించారు. నగరంలో ప్రస్తుత శాంతి భద్రతల స్థితిగతులు, నేరాల శాతం తగ్గించడం, నిరోధించడం, ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయడం తదితరాలకు సంబంధించి తాము చేట్టిన చర్యలను అధికారులు ప్రత్యేక ప్రజెంటేషన్ ద్వారా హోం మంత్రికి వివరించారు. ఉగ్రవాద దాడులను నివారించడం కోసం తాము చేపట్టిన చర్యలతో పాటు, పోలీసు బలగాల స్థితిగతులను, వారి పనితీరును, వారి సామర్థ్యాన్ని ప్రజెంటేషన్ ద్వారా హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాగా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన దాదాపు రెండుగంటలపాటు గడిపారు. హోం శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. నగరంలో మహిళల భద్రత అంశం పై కూడా ఆయన అధికారులతో ఈ సందర్భంగా చర్చించారు. ఇందుకు తీసుకుం టున్న చర్యలను కమిషనర్ బస్సీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు ఈ సందర్బంగా వివరించారు. -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు
గుర్గావ్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీ సులు. ఎమ్జీ రోడ్లో ఉన్న డీటీ సెంటర్లో ఐదుగురు మహిళలతోపాటు, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఏసీపీ దల్బీర్ సింగ్ కథనం ప్రకారం... డీటీ సిటీ సెంటర్లోని రెండో అంతస్తులో ఉన్న ఓ స్పా అండ్ మసాజ్ సెంటర్‌కి ఓ వ్యక్తిని పంపారు పోలీసులు. 5 వేల రూపాయలు చెల్లిం చినవెంటనే అతనికి ఓ మహిళను కేటాయిం చారు నిర్వాహకులు. అతను అందించిన సమాచారం మేరకు మసాజ్ సెంటర్ లోపలికి ప్రవేశించిన పోలీ సులు ఐదుగురు మహిళలతోపాటు, మరో కస్టమర్‌ను పట్టుకున్నారు. ఆ పార్లర్ ఢిల్లీకి చెందిన మహిళా వ్యాపార వేత్తదని పోలీసులు తెలిపారు. ఐదుగురు మహిళలు మణిపూర్, నాగాలాండ్ కు చెందినవారు కాగా... కస్టమర్ గుర్గావ్ వాసిగా గుర్తించినట్టు చెప్పారు. ఎక్సైజ్ అధికారి భార్య హస్తం... ఈ రాకెట్ వెనుక ఉన్న మహిళా వ్యాపారవేత్తను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ట్యాక్సేషన్ అధికారి భార్య కాంతాశర్మగా గుర్తించామని పోలీసులు తెలిపారు. సెక్టార్ 29లోని పోలీస్ స్టేషన్ సందీ ప్ కుమార్ అందించిన వివరాల ప్రకారం... మెహ్రౌలీ-గుర్గావ్ రహదారిపైగా డీటీ సిటీ సెం టర్మాల్లోని రెండో ఫ్లోర్లో ఈ రాకెట్ నిర్వహిస్తున్నారు. ఈ స్పా కాంతాశర్మ నిర్వహిస్తున్నారని చెప్పారు. -
ఎసీపీగా పోసాని
అరుణ్, ఆర్య, ప్రజ్ఞ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎవరికి ఎవరు’. సాయికుమార్, నాగబాబు, పోసాని కృష్ణమురళి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ వెన్నెలకంటి దర్శకుడు. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సి.కల్యాణ్ కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కిషోర్‌కుమార్(డాలీ) గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సుభాష్‌ఘయ్ వద్ద దర్శకత్వ శాఖలో చేశాను. రాజకీయం, కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. కచ్చితంగా కొత్తగా ఉంటుంది. 40 రోజుల పాటు జరిగే సింగిల్ షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో ఏసీపీగా నటిస్తున్నానని పోసాని తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, ఛాయాగ్రహణం: జి.వెంకటేశ్వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవికాంత్ కౌశిక్.