chief justice
-
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు!
ఢిల్లీ : హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yaswant Varma) ఇంట్లో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లోనే కాదు ఇంటి సమీపంలో చెత్త కుప్పలో కాలిన రూ.500 నోట్లు ప్రత్యక్షమవ్వడంతో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక మలుపు తిరిగినట్లైంది.హోలీ పండుగ (మార్చి 14)న ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం,ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.#WATCH | A sanitation worker, Inderjeet says, "We work in this circle. We collect garbage from the roads. We were cleaning here 4-5 days back and collecting garbage when we found some small pieces of burnt Rs 500 notes. We found it that day. Now, we have found 1-2 pieces...We do… pic.twitter.com/qnLjnYvnfe— ANI (@ANI) March 23, 2025 ఈ విచారణ నేపథ్యంలో,జస్టిస్ వర్మ నివాసానికి సమీపంలోని చెత్తను శుభ్రం చేస్తున్న సమయంలో కాలిన రూ.500 నోట్ల ముక్కలు కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కాలిన నోట్లు ఎవరివన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుడు ఇంద్రజిత్ మీడియాతో మాట్లాడుతూ.. మేం నాలుగైదు రోజుల క్రితం ఈ వీధిని శుభ్రం చేసే సమయంలో మాకు కాలిన నోట్ల కనిపించాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. శుభ్రం చేయడం మా పని. శుభ్రం చేసే సమయంలో ఇప్పటికీ కాలిన నోట్ల ముక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. మరోవైపు, తన ఇంట్లో డబ్బులు లభ్యమైనట్లు వస్తున్న ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ స్పందించారు. ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాశారు. ఈ ఘటనలో నిజా నిజాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ ‘సీజే’ బదిలీ..కొలీజియం సిఫారసు
సాక్షి,ఢిల్లీ:సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్లను మంగళవారం(జనవరి7) బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ముంబై హైకోర్టుకు,ముంబై హైకోర్టు చీఫ్‌జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యయ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేస్తూ కొలీజియం రాష్ట్రపతి సిఫారసుచేసింది.ప్రస్తుతం పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టుజడ్జిగా నియమించింది. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్‌లో ఎవరూ లేకపోవడంతో జస్టిస్ వినోద్ చంద్రన్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. -
రాజ్యాంగ పీఠికనూ పార్లమెంట్ సవరించొచ్చు
న్యూఢిల్లీ: 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత (సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ) అనే పదాలను చేర్చుతూ చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ మేరకు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు ముగించి, సోమవారం తీర్పు వెలువరించింది. ‘రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ, తీర్పు కానీ అవసరం లేదు. రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కుంది. సవరణకు ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు’అని తీర్పులో పేర్కొంది.‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. పైపెచ్చు ఆ అధికారాలను సవాల్ చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్‌కు ఉంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయని గుర్తు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేమని కూడా పేర్కొంది. ఎన్నో ఏళ్లు గడిచాక పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?అంటూ ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.పిటిషనర్ల అభ్యంతరం ఏమంటే..సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై చేరిక తనకూ సమ్మతమేనని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనల సందర్భంగా తెలిపారు. అయితే, ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడంపైనే తనకు అభ్యంతరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాల చేరికను ఇందిరాగాంధీ అనంతరం ఎన్నికైన జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్థించిందని ఇదే అంశంపై వేరుగా పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అయితే, 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ, 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో..ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాటిని చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ కేసులో మొట్ట మొదటిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థమే వస్తుందని వివరించింది. -
51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
-
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
CJI DY చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు వీడ్కోలు
-
సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్
న్యూఢిల్లీ: గత నెలలో తన నివాసంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. నాడు గణపతి పూజకు మోదీ రావడంపై చెలరేగిన వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి సమావేశాలలో న్యాయపరమైన విషయాలేవీ చర్చించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ముంబైలో లోక్‌సత్తా లెక్చర్ సిరీస్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణమని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సమావేశమవుతారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలను కలిస్తే.. ఇద్దరి మధ్యా ఏదో డీల్ కుదిరినట్టు భావించరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మా విధులు మాకు తెలుసు, రాజకీయ నాయకులకు కూడా వారి విధులు తెలుసని తెలిపారు. ఏ న్యాయమూర్తులు కూడా (భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తులు) ఏ ముప్పును కోరి తెచ్చుకోరని మనదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.‘‘ఈ సమావేశాలు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉండడంలోనే మన రాజకీయ వ్యవస్థ పరిపక్వత దాగి ఉంది.. ఇది తెలిసిందే. న్యాయవ్యవస్థకు కావాల్సిన నిధులను (బడ్జెట్) ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. కాబట్టే సీఎంలతో సమావేశాలు తప్పనిసరి. ఈ బడ్జెట్ న్యాయమూర్తుల కోసం కాదు. కొత్త కోర్టు భవనాలు, జిల్లా న్యాయమూర్తులకు కొత్త నివాసాలు అవసరం. దీనికి ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి సమావేశాలు అవసరం. ఇలాంటి సమావేశాలు న్యాయ నిర్ణయాలపై కాకుండా న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తాయి.తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ‘ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు వారు ముఖ్యమంత్రి ఇంటికి వెళతారు. అప్పుడు, ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ఇంటికి వస్తారు, ఈ సమావేశాలు ఎజెండాను నిర్ణయిస్తాయి. జడ్జిలతో జరిగిన సమావేశంలో ఏ సీఎం కూడా పెండింగ్ కేసుల ప్రస్తావన తేలేదు. జడ్జీలతో జరిగే మీటింగ్స్‌లో రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వతతో వ్యవహరించింది. దీని కోసం మీరు కలవాల్సిన అవసరం లేదా? కేవలం లేఖలు పంపి ఊరుకుంటే పనులు కావు. న్యాయమూర్తులు నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది.’ అని తెలిపారు. -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ గురువారం ఈ విషయం ‘ఎక్స్’లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సంప్రదించి నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నియామకం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త సీజేఐ వచ్చే నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన స్వల్పకాలమే పదవిలో ఉంటారు. 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్‌గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీíÙయల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. కీలక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్‌కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచి్చన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్ అసెంబ్లీ, సెనేట్లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్ కాజీ ఇసా స్థానంలో జస్టిస్ మన్సూర్ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది. -
DY Chandrachud: న్యాయ వ్యవస్థకు ప్రజా విశ్వాసమే కీలకం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. ప్రజల నమ్మకం చూరగొనేలా పని చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు నేరుగా ఎన్నుకోనప్పటికీ, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ న్యాయమూర్తులపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు. జడ్జిగా విశ్వసనీయత, తగిన గుర్తింపు పొందాలంటే ప్రజల ఆమోదం, నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. భూటాన్‌లోని ‘జేఎస్‌డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా కోర్టులు పరిష్కరిస్తుంటాయని పేర్కొన్నారు. అందుకే వారి విశ్వాసం పొందడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. ఏ దేశంలోనైనా ప్రజల మద్దతుతో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అక్కడ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన సజావుగా సాగుతుందని వివరించారు. ప్రజాభిప్రాయం అనేది న్యాయ వ్యవస్థలో అంతర్గత తనిఖీగా తోడ్పడుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు ప్రజలకు కనిపించాలని స్పష్టంచేరు. భారత్‌లోని కోర్టుల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. వర్చువల్ విచారణ, కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, కేసుల ఈ–ఫైలింగ్, ఆన్లైన్ కేసు సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధ(ఏఐ)తో కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం వంటి విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల కోసం సుప్రీంకోర్టు ప్రక్రియలను మరింత సులభతరం చేశామని చెప్పారు. -
DY Chandrachud: చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుందో?!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి అంకితభావంతో దేశానికి సేవలందించానని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తన పదవీ కాలాన్ని చరిత్ర ఎలా గుర్తు పెట్టుకుంటుందో అనే భయం, ఉత్కంఠ తనలో ఉన్నాయని తెలిపారు. భారతదేశ సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10వ తేదీన ముగియనుంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. బుధవారం భూటాన్‌లోని ‘జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ స్కూల్ ఆఫ్ లా’ మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘నా పదవీ కాలం ముగింపునకు వచి్చంది. భవిష్యత్తు, గతానికి సంబంధించి భయాలు, ఆందోళనలు నా మనసులో నిండిపోయాయి. ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తుతున్నాయి. నేను సాధించాల్సినవన్నీ సాధించానా? ప్రధాన న్యాయమూర్తిగా నా పదవీ కాలాన్ని చరిత్ర ఏ విధంగా నిర్ణయిస్తుంది? ఎలా గుర్తుపెట్టుకుంటుంది? చేయాల్సిన పనులు భిన్నంగా చేశానా? లేదా? భవిష్యత్తు తరాల న్యాయమూర్తులకు, న్యాయ నిపుణులకు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఎలాంటి వారసత్వాన్ని అందించబోతున్నాను? ఈ ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు నా నియంత్రణలో లేవు. బహుశా కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు కనిపెట్టలేనేమో! గత రెండేళ్లుగా అంకితభావంతో పనిచేశా. పదవికి పూర్తి న్యాయం చేయాలని ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే నిర్ణయించుకునేవాడిని. రాత్రి సంతృప్తితో నిద్రకు ఉపక్రమించేవాడిని. న్యాయవాద వృత్తి అనే ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడానికి, మనల్ని మనం పునఃసమీక్షించుకోవడానికి సంకోచించాల్సిన పనిలేదు. లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నానా? లేక నా వైపు నేను ప్రయాణిస్తున్నానా? అని న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రశ్నించుకోవాలి. భయాలు, సందేహాలు విడిచిపెట్టాలి. లక్ష్యం వైపు సాగే ప్రయాణాన్ని ఆస్వాదించాలి. భయాలను ఎదిరించడంలోనే మన అభివృద్ధి దాగి ఉంటుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆయన 2022 నవంబర్ 9న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. -
CJI DY Chandrachud: ఇది కాఫీ షాప్ కాదు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కాస్తంత మర్యాద తగ్గించి మాట్లాడిన పిటిషనర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం విచారణ సందర్భంగా ‘ఎస్’ అనడానికి బదులుగా ‘యా’ అని సమాధానమిచ్చిన పిటిషనర్‌పై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘‘యా. యా. యా’ అని అనకండి. ‘ఎస్’ అని మాట్లాడండి. యా అంటూ పిచ్చాపాటీగా మాట్లాడటానికి ఇది కాఫీ షాప్ కాదు. సుప్రీంకోర్టు. ‘యా’ అని పలికే వ్యక్తులంటే నాకు కొంచెం పడదు. మీ నుంచి ఇలాంటి మాటలను కోర్టు అనుమతించబోదు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ వెంటనే తన భాషను సరిదిద్దుకున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనను చట్టవిరుద్ధంగా విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయడాన్ని పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ రిట్ పిటిషన్‌ను సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గొగోయ్‌పై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టుకు నేరుగా అప్పీళ్లను అనుమతించే ఆర్టికల్ 32 కింద ఈ అప్పీల్ చేయొచ్చా? ఈ అప్పీల్‌ను ఆ ఆర్టికల్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే ప్రశ్నలను కోర్టు లేవనెత్తింది. న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్‌ను ఎలా దాఖలు చేశారు?’’ అని సీజేఐ ప్రశ్నించారు. దీంతో పిటిషనర్ స్పందిస్తూ.. ‘‘యా. యా. అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్. క్యూరేటివ్ దాఖలు చేయమని నాకు సూచించారు’’ అంటూ యథాలాపంగా సాధారణ భాషలో మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జస్టిస్ గొగోయ్ ఈ కోర్టు మాజీ న్యాయమూర్తి. ఒక న్యాయమూర్తిపై ఇలాంటి పిటిషన్ దాఖలు చేసి అంతర్గత విచారణ కోరలేరు. ఎందుకంటే గతంలోనే ఇదే విషయంలో మీరు కేసు ఓడిపోయారు’’ అని సీజేఐ అన్నారు. అప్పుడు పిటిషనర్ స్పందిస్తూ, ‘‘కానీ జస్టిస్ గొగోయ్ నేను సవాలు చేసిన ప్రకటనను బట్టి నా పిటిషన్‌ను తిరస్కరించారు. నా తప్పేమీ లేదు. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న ధర్మాసనం ముందు నా రివ్యూ పిటిషన్‌ను పరిశీలించాలని నాటి సీజేఐ ఠాకూర్‌ను కోరా. కానీ నా అభ్యర్థనను తోసిపుచ్చారు’’ అంటూ కేసు నేపథ్యాన్ని వివరించారు. సీజేఐ, పిటిషనర్ కొద్దిసేపు మరాఠీలో మాట్లాడుకున్నారు. తర్వాత ‘‘జస్టిస్ గొగోయ్ పేరును పిటిషన్ నుంచి తొలగించండి. అప్పుడు ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుంది’’ అని సీజేఐ సూచించారు. -
తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. అదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.ముందుగా ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజ స్తంభాన్ని స్పృశించి.. ఆలయ ప్రవేశం చేశారు.దర్శన అనంతరం ఆలయ విశిష్టతను జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు జస్టిస్ చంద్రచూడ్‌కు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. -
చంద్రబాబు దుష్ట రాజకీయం .. సుప్రీంకోర్టు సీజేకు జగన్ లేఖ
-
కోల్కత్తా డాక్టర్ కేసు విచారణ.. ‘1973’ భయంకర ఘటనను గుర్తు చేసిన సీజే
ఢిల్లీ: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ 1973 అరుణా షాన్‌బాగ్ సంఘటనను ప్రస్తావించారు. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతుందని.. వివక్ష కారణంగా మహిళా డాక్టర్లను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో అత్యాచార ఘటన జరిగే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అరుణా షాన్‌బాగ్‌కు జరిగిన అన్యాయం, వైద్య రంగంలోనే ఘోరమైన ఘటన అని సీజే తన తీర్పు సమయంలో గుర్తు చేశారు.42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా..1967లో అరుణా షాన్‌బాగ్ కేఈఎం ఆస్పత్రిలో సర్జరీ డిపార్ట్మెంట్లో చేరారు. డాక్టర్ సుందీప్ సర్దేశాయి వద్ద ఆమె పనిచేశారు. 1974లో ఆమె ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ 1973, నవంబర్ 27వ తేదీన ఆమెపై వార్డు అటెండెంట్ పైశాచికంగా దాడి చేశాడు. లైంగికంగా దాడి చేసి, ఆమెను తాడుతో కట్టేశాడు. దీంతో ఆమె మెదడుకు తీవ్రమైన గాయమైంది. 42 ఏళ్ల పాటు ఆమె అచేతన స్థితి(కోమా)లో ఉండిపోయింది. 2015లో ఆమె తుది శ్వాస విడిచింది.ఆమె జీవితంలో చీకటి నింపిన ఆరోజు:కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హల్దీపూర్కు చెందిన అరుణ షాన్‌బాగ్‌కు అప్పుడు 25 ఏళ్లు. రోగులకు సేవ చేసే నర్సింగ్ వృత్తి అంటే ఇష్టం. ఆ మక్కువే ఆమెను ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎంహెచ్) వైపు నడిపింది. నర్సుగా జీవితాన్ని ప్రారంభించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో కలివిడిగా ఉండే ఈమెపై అదే ఆసుపత్రిలో వార్డుబాయ్‌గా పనిచేసే సోహన్‌లాల్ భార్తా వాల్మీకి అనే దుర్మార్గుడి కన్ను పడింది. 1973, నవంబర్ 27 రాత్రి ఎప్పట్లాగే అరుణ విధులు ముగించుకుంది.రూమ్‌కి వెళ్లేందుకు బేస్మెంట్లోని ఓ గదిలో బట్టలు మార్చుకుంటోంది. ఇదే సమయంలో సోహన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. పశువులా ప్రవర్తించి పారిపోయాడు. అతడి దాడితో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరుణ అక్కడికక్కడే కుప్పకూలింది. కోమాలోకి వెళ్లిపోయింది. వెన్నెముక కూడా దెబ్బతింది. అప్పట్నుంచి అచేతనంగానే ఉండిపోయింది.కామాంధుడికి ఏడేళ్ల శిక్షతో సరి..సోహన్‌లాల్ పోలీసులకు చిక్కాడు. దోషిగా తేలాడు. కానీ అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు. ఈ హేయమైన రాక్షస క్రీడను న్యాయస్థానం దొంగతనం, దాడిగానే చూసింది. ఒక్కో కేసు(దొంగతనం, దాడి)లో ఏడేళ్ల శిక్ష విధించాయి. ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి సోహన్‌లాల్ బయటకొచ్చాడు. అరుణ కేసు.. న్యాయ చరిత్రలో ఓ మైలురాయి!ఒంటి నిండా పుండ్లు, కదల్లేని అవయవాలతో కేఈఎం ఆసుపత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వార్డు నంబర్ 4లో బెడ్‌పై ఏళ్లుగా అరుణ అనుభవిస్తున్న బాధ ఎందరినో కలచివేసింది. వారిలో ఆమె స్నేహితురాలు, జర్నలిస్టు పింకి విరానీ ఒకరు. సంవత్సరాల తరబడి పడుతున్న బాధ నుంచి విముక్తి చేస్తూ అరుణను కారుణ్య మరణం కింద చంపేసేందుకు అనుమతించాలంటూ ఆమె 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇది అప్పట్లో కారుణ్య మరణంపై దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. అరుణ పరిస్థితి తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం అదే ఏడాది మార్చి 7న కోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. విరానీ పిటిషన్‌ను తోసిపుచ్చినా.. కారుణ్య నియామకానికి పాక్షిక చట్టబద్ధత కల్పించింది. నయం కాని రోగంతో శాశ్వత అచేతన స్థితి (పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్) ఉన్న రోగులను చట్టపరమైన విధివిధానాలకు లోబడి ప్రాణరక్షక వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా తొలగించి, వారి మరణాన్ని వేగవంతం చేసే పరోక్ష కారుణ్య మరణానికి సానుకూలత ప్రకటించింది. తర్వాత కాలంలో అరుణ కన్నీటి జీవితంపై విరానీ ‘అరుణ స్టోరీ’ అనే పుస్తకం రాశారు. దత్తకుమార్ దేశాయ్ అనే మరాఠా రచయిత ‘కథ అరునాంచి’ అనే నాటకం రాశారు. ఈ నాటకం మహారాష్ట్రలో పలు చోట్ల ప్రదర్శితమైంది కూడా. -
బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా
బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు భగ్గుమన్నాయి. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు డిమాండ్ చేశారు. సీజేఐతోపాటు ఇతర న్యాయమూర్తులు పదవి నుంచి దిగిపోవాలంటూ భారీ ఎత్తున విద్యార్ధులు ఢాకాలోని కోర్టు వద్ద గుమిగూడి నిరసనలు చేశారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేశారు.వీటికి సీజేఐ అంగీకరించారు. తన పదవికి రాజీనామా చేస్తానని ఒబైదుల్ హసన్ వెల్లడించారు. కాగా ఒబైదుల్ హసన్ గత ఏడాదిలోనే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు విధేయుడిగా ఉండేవారు. అయితే దేశంలో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే సీజేఐ కూడా దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. గత ఆదివారం మరోసారి హింస చెలరేగి.. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి. బంగ్లాదేశ్‌లో ఎవరూ పర్యటించవద్దని హెచ్చరించాయి. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు. -
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ (ఫొటోలు)
-
చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదు
న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా రాణించాలంటే చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. మానవ జీవితాన్ని, మనుషుల సమస్యలను అర్థంచేసుకొని, పరిష్కరించే నేర్పు అలవర్చుకోవాలని, వారికి అదే అతిపెద్ద సాధనమని పేర్కొన్నారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేను సత్కరించారు. నూతన న్యాయమూర్తు నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య గరిష్టంగా 34కు చేరిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వారి అనుభవంతో సుప్రీంకోర్టుకు మంచి పేరు వస్తుందని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే మనల్ని గొప్ప న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా మారుస్తుందని స్పష్టం చేశారు. -
'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!
మహిళలు సున్నితమైన వాళ్లు అంటూ కొన్ని రంగాలకే పరిమితం చేయొద్దని గొంతెత్తినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అక్కడకి మహిళ సాధికారత పేరుతో చైతన్యం తీసుకొచ్చి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా చేయగలరని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది. పోనీ అంత కష్టపడ్డ లింగ సమానత్వపు హక్కు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఏదో ఒక పేరుతో వెనక్కిలాగేయడమే. ఆఖరికి ప్రభుత్వాలు కూడా 'నారీ శక్తి' అని మాటలు చెప్పడమే గానీ పదోన్నతుల విషయంలో నిబద్దతను చూపించడంలేదు. అందుకు ఉదహారణే కోస్ట్ గార్డ్‌లో మహిళకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కేసు. ఈ విషయమే సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి అక్షింతలు వేసింది. ఇంతకీ ఏంటా కేసు? ఎవరు దాఖలు చేశారంటే..? కోస్ట్ గార్డ్‌లో అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్సీ) అధికారిణులతో పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయడానికి అనుమతి లభించకపోవడంతో ప్రియాంక త్యాగి అనే అధికారిణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ప్రియాంక త్యాగి ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మహిళా సాధికారికత గురించి మాట్లాడే మీరు దాన్ని ఇక్కడ చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. అసలు కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్‌పై "పితృస్వామ్య" విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారంటూ కేంద్రానికి అక్షింతలు వేసింది. "మాట్లాడితే 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారు. ఇప్పడు ఇక్కడ ఎందుకు చూపించడం లేదు. ఈ విషయంలో నిబద్ధతను ప్రదర్శించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. అయితే ఆర్మీ, నేవీలో ఈ విధానం సాధ్యమయ్యినప్పుడు కోస్ట్‌గార్డ్‌లో ఎందుకీ వివక్ష?. అసలు కోస్ట్ గార్డ్ పట్ల ఎందుకంత ఉదాసీన వైఖరి.. ఈ విషయంలో మీరు చాలా అగాథంలో ఉన్నారు.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని మీరు రూపొందించాల్సిందే" అని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ధర్మాసనం. అంతేగాదు మహిళలు కోస్ట్‌గార్డ్‌లో ఉండలేరని చెప్పే రోజులు పోయాయని, వాళ్లు సరిహద్దులను రక్షించగలిగినప్పుడూ తీరాలను రక్షించగలరని సుప్రీం కోర్టు పేర్కొంది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ సదరు అదికారిణి త్యాగి ఆర్మీ, నేవీ కాకుండా తీర రక్షక దళంలో వేరొక డొమైన్లో పనిచేస్తున్నందున ఇది వర్తించదని వాదన వినిపించడంతో జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. అలాగే అధికారిణులకు 10% శాశ్వత కమిషన్ మంజూరు చేయవచ్చన్న విక్రమ్‌జిత్ బెనర్జీ వాదనపై కూడా దర్మాసనం మండిపడింది. అసలు మహిళలకు 10 శాతమే ఎందుకు?.. అంటే వారేమైనా తక్కువా? అని ధర్మాసనం చివాట్లు పెట్టింది. నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఉన్నప్పుడు కోస్ట్‌గార్డ్ అలా ఎందుకు చేయడం లేదని నిలదీసింది. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని రూపొందించాల్సిందే అని కేంద్రాన్ని ఉద్దేశించి స్పష్టం చేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం అనుసరించే విధానం సమానత్వ భావనకు విరుద్ధమని, లింగ సమానత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. అందువల్ల స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల వెలువరించిన ఏకగ్రీవ తీర్పు పట్ల వ్యక్తమవుతున్న విమర్శలపై స్పందించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నిరాకరించారు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే న్యాయమూర్తులు కేసులపై తీర్పులిస్తారని చెప్పారు. ఏదైనా కేసుపై చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సోమవారం పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచలేమంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పుపై మాట్లాడారు. ఏ న్యాయమూర్తి కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వరని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇచ్చిన తీర్పు కూడా జడ్జిల వ్యక్తిగతం కాదని అన్నారు. చాలా రకాల కేసుల విచారణ, తీర్పుల్లో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని గుర్తుచేశారు. ఒక జడ్జిగా ఏ కేసును, తీర్పునూ వ్యక్తిగతంగా తీసుకోలేదని చెప్పారు. అందుకు తనకు ఎలాంటి విచారం గానీ, ఫిర్యాదు గానీ లేదన్నారు. న్యాయమూర్తులు తీర్పు వెలువరించిన తర్వాత అది ప్రజల ఆస్తిగా మారుతుందని స్పష్టం చేశారు. దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రజలకుంటుందని పేర్కొన్నారు. తీర్పుపై విమర్శలను తిప్పికొట్టడం, సమరి్థంచుకోవడం సరికాదన్నారు. తీర్పు ఇచి్చన తర్వాత ఇక ఆ సంగతి పక్కన పెట్టాలన్నది తన ఉద్దేశమని వివరించారు. తీర్పుపై ఏ జడ్జికీ ఆధిక్యముండదు అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు దేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. ఈ తీర్పు రావడానికి కారణాన్ని ధర్మాసనంలోని ఏ ఒక్క సభ్యుడికో అపాదించలేమని పేర్కొన్నారు. ధర్మాసనంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా అయోధ్య తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఏ కేసులో అయినా ఇవ్వాల్సిన తీర్పును సంబంధిత జడ్జిలంతా కలిసి కూర్చొని, చర్చించుకొని నిర్ణయిస్తారని పేర్కొన్నారు. చివరకు అది కోర్టు తీర్పుగా మారుతుందని స్పష్టం చేశారు. తీర్పును నిర్ణయించే విషయంలో ఆధిక్యం ఏ ఒక్క జడ్జికో కట్టబెట్టలేమని తేలి్చచెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించే కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు అని విమర్శించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొలీజియంలో అంతర్గతంగా జరిగే సంప్రదింపులను కొన్న కారణాలతో ప్రజలకు తెలియపర్చలేమని సీజేఐ స్పష్టం చేశారు. -
న్యాయమూర్తులపైనే దాడులా? చీఫ్ జస్టిస్ సీరియస్
ఢిల్లీ: సమాజంలో న్యాయాన్ని కాపాడేవారు న్యాయమూర్తి. అలాంటి హోదా ఉన్న వ్యక్తి అంటే గౌరవం ఉంటుంది. కానీ అలాంటి జడ్జికే లైంగిక వేధింపులు ఎదురైతే? ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశంలో సహచర సీనియర్ న్యాయమూర్తులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళా జడ్జి ఆరోపించారు. స్థానికంగా న్యాయ పోరాటం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చనిపోవడానికి అనుమితి ఇవ్వాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు లేఖ కూడా రాశారు. ఉత్తరప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా జడ్జి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ' ప్రజలకు సేవలు చేసే న్యాయమూర్తి వృత్తిలో తక్కువ కాలంలోనే నాకు గొప్ప అగౌరవం జరిగింది. కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు' అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. 'ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎలాంటి చర్యలు లేవు. హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీని సంప్రదించాను. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. సాక్షులు ప్రభావితం కాకుండా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. కానీ నా అభ్యర్థనను కొట్టివేశారు. ఏడాదిగా ఈ బాధ అనుభవిస్తున్నా. నేను బతికుండి ప్రయోజనం శూన్యం. గౌరవప్రదంగా చనిపోవడానికి అనుమతినివ్వండి' అంటూ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించారు. ఈ అంశంపై స్టేటస్ అప్డేట్ కోరాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. తదనంతరం, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నుంచి కూడా నివేదికను కోరారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం (ఫొటోలు)
-
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం
-
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం
-
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రమాణం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్.. జస్టిస్ ధీరజ్‌సింగ్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ప్రమాణం చేసిన అనంతరం.. బాధ్యతల పత్రాలపై సంతకం చేశారాయన. ఆపై సీఎం జగన్ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్‌సింగ్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు,హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు బూడి ముత్యాలనాయుడు,తానేటి వనిత, అంబటి రాంబాబు, మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఉన్నతాదికారులు పాల్గొన్నారు. అనంతరం హై టీ కార్యక్రమంలో అంతా పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ నేపథ్యం.. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్‌సింగ్‌ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్‌సింగ్. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్‌కు పేరుంది. ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కోటా నుంచి న్యాయమూర్తులెవ్వరూ లేరు. కాబట్టి.. ఈలోగా ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఇకపై నంబర్ 2గా కొనసాగుతారు. త్వరలో ఆయన కూడా వేరే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశాలున్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డిపాజిట్ దారుల సొమ్ముపై సుప్రీం కోర్టు జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం
-
తెలంగాణ హైకోర్టుగా సీజేపగా అలోక్ అరాధే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణకు వచ్చారు. ఈమేరకు కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయ శాఖ గత వారం ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక నుంచి తెలంగాణకు... మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 1964, ఏప్రిల్ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో పేరు గడించారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016, సెప్టెంబర్ 16న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు. 2018, నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. నాలుగేళ్లలో ఆరో సీజే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన 2019, జనవరి 1న జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు సీజేలుగా పనిచేశారు. నాలుగేళ్ల కాలంలో సీజేలుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పనిచేశారు. జస్టిస్ అలోక్ అరాధే ఆరో సీజే కానున్నారు. వీరిలో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లారు. -
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ నవీన్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఒక్కరోజే సీజేగా కొనసాగనున్నట్లు కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ నవీన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే ఆ పదవిలో కొనసాగుతారు. మరుసటి రోజు నుంచి సీనియారిటీలో ముందు వరుసలో ఉన్న జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర న్యాయశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ లలిత, జస్టిస్ రమేశ్ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్‌ల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. ఏపీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ డి.రమేశ్‌ను, తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ లలిత కన్నెగంటిని బదిలీ చేయాలంటూ గత ఏడాది నవంబర్ 24న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. ఈ సిఫార్సును గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్వీట్ చేశారు. అలాగే ఈ అంశంపై న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: కేజీఎఫ్ స్టైల్లో వీడియో: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే -
SC: మాకు అపారమైన అధికారం ఉన్నా సరే..
సాక్షి, ఢిల్లీ: గత రెండు నెలలుగా అల్లర్లు, హింసతో రగిలిపోతున్న మణిపూర్ పరిణామాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకొని మరింత ఉద్రిక్తతలు పెంచలేరంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణకై ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో దాఖలైన పలు పిటిషన్లపై.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలు తమ పరిధిలోని అంశం కాదని.. అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహా ఈ పిటిషన్లను విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూకీ తెగ తరపున సీనియర్ న్యాయవాది కోలిన్ గోంజల్వేస్ బెంచ్ ముందు వాదనలు వినిపిస్తూ.. ‘‘దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని, ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తేవాలని కోరారు. అంతేకాదు ఇది ప్రభుత్వమే జరిపిస్తున్న అల్లర్లంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ.. మణిపూర్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచడానికి కోర్టును మీరు ఉపయోగించుకోలేరంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘అఫ్కోర్స్.. సుప్రీం కోర్టుకు అపారమైన అధికారమే ఉంది. కానీ, దానిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తాం. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మా పని కాదు. అది అక్కడి ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానిదేనని అన్నారు. ఇదిలా ఉంటే.. అడ్వొకేట్ కోలిన్ గోంజల్వేస్ మణిపూర్‌లోని బీజేపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయుధ వర్గాలను ప్రభుత్వమే వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో మళ్లీ జోక్యం చేసుకున్న సీజేఐ.. ఇది తీవ్ర సంక్షోభమేనని, చేతనైంతలోనే తామ చేసేది చేయగలమని, అంతేగానీ శాంతి భద్రతల పరిరక్షణ మాత్రం పర్యవేక్షించలేమని, అవసరం అనుకుంటే నిర్మాణాత్మక సూచనలతో రావాలని పిటిషనర్ల తరపు అడ్వొకేట్కు సూచించారు. ఈ క్రమంలో రేపు(మంగళవారం) మరోసారి పిటిషన్లపై సీజే బెంచ్ వాదనలు విననుంది. ఇదిలా ఉంటే మే నెల నుంచి ఇప్పటిదాకా.. మణిపూర్‌లో కుకీ-మెయితీ తెగల మధ్య వైరం 150 మంది ప్రాణాలను బలిగొంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఒక నివేదిక సమర్పించాలని మణిపూర్ సీఎస్‌ను సుప్రీం కోర్టు గతవారం ఆదేశించింది. అంతకాదు శరణార్థుల పరిస్థితిపైనా నివేదిక ఇవ్వాలని కోరింది. ఇదీ చదవండి: గులా‘బీ టీమ్’ గందరగోళం ఎట్లా? -
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిని నియమించింది న్యాయశాఖ. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ స్పెషల్ సెక్రటరీ రజిందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీ చేశారు. వెంకటశేషసాయి ఇప్పటివరకు ఏపీ హైకోర్టులో జడ్జిగా కొనసాగారు. తాజాగా ఆయనకు చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిదాకా హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యవహరించారు. మిశ్రాకు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రధాని మోదీ మెచ్చుకున్న టీనేజ్ గర్ల్.. అసలు ఎవరీ తనిష్క సుజిత్!
తనిష్క సుజిత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థి. 11 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసుకుని.. 15 ఏళ్లకే బీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. దీని అనంతరం లా కోర్పు చదివి భారత ప్రధాన న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో ముందుకు పోతోంది. 2020లో కోవిడ్‌తో తన తండ్రి, తాతలను కోల్పోయిన ఈ యువతి.. ఆ బాధను దిగమింగుకుని మనో ధైర్యంతో తన లక్ష్య సాధనవైపుగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కోసం రాష్ట్ర రాజధాని భోపాల్‌కు వెళ్లిన తనిష్క.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి దాదాపు 15 నిమిషాలు ముచ్చటించారు. తాను బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక యుఎస్‌లో న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నానని, ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి కావాలని కలలు కన్నానని ప్రధాని చెప్పినట్లు తెలిపింది. "నా లక్ష్యం గురించి విన్న ప్రధాని మెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ న్యాయవాదుల వాదనలు చూడాలని నాకు సలహా ఇచ్చారు. అది నా లక్ష్యాన్ని సాధించడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానిని కలవడం నాకు ఒక కల నిజమైంది" అని ఆమె చెప్పారు. దేవి అహల్య విశ్వవిద్యాలయం సోషల్ సైన్స్ స్టడీస్ విభాగాధిపతి రేఖా ఆచార్య మాట్లాడుతూ.. సుజిత్‌కు 13 సంవత్సరాల వయస్సులో విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రత్యేక ప్రతిభ చూపడంతో బీఏ (సైకాలజీ) మొదటి సంవత్సరంలో ప్రవేశం లభించిందని తెలిపారు. ఆమె ప్రతిభను మెచ్చిన యూనివర్శిటి యాజమాన్యం బీఏ (సైకాలజీ)లో ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. -
కోర్టులో పారదర్శకత ముఖ్యం.. ఏమిటీ సీల్డ్ కవర్ సంస్కృతి?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: మాజీ సైనికోద్యోగుల వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) తాలూకు రూ.28,000 కోట్ల బకాయిలను వచ్చే ఫిబ్రవరికల్లా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై గతేడాది తామిచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓఆర్ఓపీ బకాయిలపై భారీ మాజీ సైనికోద్యోగుల ఉద్యమం (ఐఈఎస్ఎం) పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. బకాయిల చెల్లింపునకు కాలావధిని ఖరారు చేసింది. దీనిపై కేంద్రం సీల్డ్ కవర్లో సమర్పించిన నోట్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సంస్కృతి సముచిత న్యాయ ప్రక్రియకు విరుద్ధమని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి తెర పడాలన్నారు. ‘‘వ్యక్తిగతంగా కూడా సీల్డ్ కవర్లకు నేను వ్యతిరేకిని. కోర్టులో పారదర్శకత చాలా ముఖ్యం. అంతిమంగా ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. అందులో రహస్యమేముంటుంది?’’ అని ప్రశ్నించారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్
-
సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు డిసెంబర్ 17 నుంచి వచ్చే జనవరి ఒకటో తేదీ దాకా శీతాకాల సెలవులని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనాలేవీ పనిచేయవని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు రోజుల తరబడి సెలవులు న్యాయార్థులకు ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని ప్రజలు భావిస్తున్నారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీజేఐ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. ఇదీ చదవండి: వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే... మేమున్నది: సుప్రీంకోర్టు -
త్రిపుర హైకోర్టు తాత్కాలిక సీజేగా తెలుగు వ్యక్తి
సాక్షి, న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ తొడుపునూరి అమర్నాథ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నవంబరు 11 నుంచి ఆయన తాత్కాలిక సీజేగా కొనసాగుతారంటూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ అమర్నాథ్ 1965లో హైదరాబాద్‌లో జన్మించారు. 2017 సెప్టెంబర్ 21న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 అక్టోబర్ 28న త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. -
ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి
ఇస్లామాబాద్: ఉగ్రవాదుల దాడిలో పాక్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి చెందారు. ఈ ఘటన బలూచిస్తాన్‌లో ఖరన్ ప్రాంతంలోని మసీదు వెలుపల చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కొంతమంది దుండగులు మసీదు వెలుపల ఉన్న మహ్మద్ నూర్ మొస్కాంజాయ్‌పై బహిరంగంగా కాల్పులు జరిపినట్లు ఖరన్ పోలీస్ సూపరింటెండెంట్ హలీమ్ తెలిపారు. తాము హుటాహుటినా మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాంటి ధైర్య సాహసాల గల న్యాయమూర్తి సేవలను మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులతో దేశాన్ని భయపెట్టలేరని, ఇవి పిరికిపందలు చేసే దుశ్చలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్వెట్టా బార్ అసోసీయేషన్(క్యూబీఏ) ప్రెసిడెంట్ అజ్మల్ ఖాన్ కాకర్ కూడా న్యాయమూర్తి మొస్కాంజాయ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి పాకిస్తానీ పౌరుడు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దేశంలో అధ్వాన్నంగా ఉన్న భద్రతా పరిస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. అదీగాక గత కొద్ది నెలలుగా పాక్‌లో ఉగ్ర దాడులు ఎక్కువవుతున్నాయని పాక్ న్యాయశాఖ మంత్రి షాహదత్ హుస్సేన్ అన్నారు. అంతేగాదు ఈ ఏడాదిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే అత్యధికంగా ఉగ్రదాడుల జరిగాయని ఇస్లామాబాద్‌కి చెందిన థింక్ ట్యాంక్ పేర్కొంది. పైగా ఈ హింసాత్మక దాడులు ఫటా, ఖైబర్ పఖ్తుంఖ్వాలలోనే దాదాపు 106 శాతం పెరిగిందని వెల్లడించింది. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
సుప్రీంకోర్టు 50 వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ చంద్ర చూడ్
-
తిరుమల శ్రీవారుని దర్శించుకున్న సీజేఐ లలిత్
-
పరిష్కార ప్రయత్నం
రెండున్నర నెలలు... అంతా కలిపితే 74 రోజులు. ఈ పరిమిత కాలంలో ఏ వ్యవస్థలోనైనా పెనుమార్పులు తీసుకురావడం సాధ్యమేనా? ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా, భారత సర్వోన్నత న్యాయాధిపతి (సీజేఐ)గా కొత్తగా నియుక్తులైన జస్టిస్ యు.యు. లలిత్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. న్యాయవ్యవస్థలో సమూల సంస్కరణలకు సిద్ధమవుతున్నారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం నుంచి పని ప్రారంభించిన లలిత్ కొన్నేళ్ళుగా సుప్రీమ్ కోర్ట్‌లో అశ్రద్ధకు గురైన వ్యవహారాలపై దృష్టి సారించారు. కోర్ట్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పాలనాపరమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని వార్తాకథనాల మాట. ఏడాది పొడుగూతా రాజ్యాంగ కేసుల్ని వినేందుకు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాలను పునరుద్ధరించాలనీ, అలాగే కోర్ట్ సమయాన్ని వృథా చేసే ‘పనికిమాలిన’ దావాలపై చర్యలు చేపట్టాలనీ లలిత్ భావన. ఆ ఆలోచన మంచిదంటూనే, ఆచరణలో కష్టనష్టాలపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికైతే, ఆగస్ట్ 29 నుంచి ప్రతిరోజూ వాదోపవాదాలు వినేందుకు గాను పాతిక రాజ్యాంగ ధర్మాసన అంశాలను లిస్ట్ చేస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు. ఈ ప్రకటన కీలకమైనది. కేవలం తన దాకా వచ్చిన అప్పీలుపై తీర్పు చెప్పడమే కాదు, రాజ్యాంగ అంశాలను కూలంకషంగా పరిశీలించి, వాటికి వ్యాఖ్యానం చెప్పడం సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన బాధ్యత. అనేక ఇతర పెండింగ్ అంశాల పనిలో పడిపోయి, కొంతకాలంగా అది విస్మరణకు గురైంది. 1960లలో సగటున ఏటా 134 రాజ్యాంగ ధర్మాసన తీర్పులు వెలువడితే, ఆ సంఖ్య నిరుడు 2కు పడిపోయింది. దీన్ని గుర్తించిన నూతన ప్రధాన న్యాయమూర్తి ఈ బాధ్యతను భుజానికెత్తుకోవడం హర్షణీయం. అపరిష్కృత కేసుల సమస్య దేశాన్ని చాలాకాలంగా పీడిస్తోంది. కరోనా దెబ్బతో ఈ సమస్య ద్విగుణం, బహుళం అయింది. 2017 నాటికి సుప్రీమ్‌లో 55 వేల పైచిలుకు కేసులు పెండింగ్. ఇప్పుడు వాటి సంఖ్య 71 వేలు దాటేసింది. ఇవన్నీ రాజ్యాంగేతర అంశాలకు సంబంధించినవే. న్యాయ సంస్కరణల్లో భాగంగా ఈ సమస్యను ఓ కొలిక్కి తేవడం ప్రధానం. తగినంత మంది న్యాయమూర్తులు లేరనడానికి వీల్లేదు. 2019 ఆగస్ట్ నాటికే సుప్రీమ్ జడ్జీల సంఖ్య 34కు పెరిగింది. ఎప్పటికప్పుడు జడ్జీల సంఖ్య పెరుగుతున్నా, 1950 నుంచి పెండింగ్ కేసులూ పెరుగుతూ పోతుండడం విడ్డూరం. దీనికి పరిష్కారంగా జోన్ల వారీగా కోర్ట్‌ను విభజించి, పదిహేనేసి మంది జడ్జీలతో 4 ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటు చేసి, సుప్రీమ్ కోర్ట్కూ – హైకోర్ట్లకూ మధ్య అప్పిలేట్ కోర్ట్‌గా సదరు బెంచ్‌లు పనిచేయాలని ఒక ప్రతిపాదన. దీనివల్ల రాజ్యాంగ అంశాలపై దృష్టి పెట్టడానికి న్యాయమూర్తులకు మరింత సమయం దొరుకుతుందని వాదన. కానీ, ఈ జోనల్ కోర్ట్‌ల ఏర్పాటు రాజ్యాంగకర్తల ఆలోచనకు విరుద్ధమంటూ 1974లోనే 58వ న్యాయ సంఘం కొట్టిపారేసింది. ప్రస్తుతం సుప్రీమ్ ఎదుట 492 రాజ్యాంగ ధర్మాసన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో దాదాపు 53 కేసులు ప్రభావశీల రాజ్యాంగ అంశాలకు సంబంధించినవి. పౌరసత్వ సవరణ చట్టం, ముస్లిమ్ వివాహ చట్టాల రాజ్యాంగబద్ధత, ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలకు విస్తృత ధర్మాస నాలు అవసరమైనవి. ఇవన్నీ కోర్ట్ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాయి. ఇలాంటి 53 కేసుల్లో ప్రస్తుతం 25 కేసులను వినే ప్రక్రియకు కొత్త సీజేఐ శ్రీకారం చుట్టారు. 1960లలో ఏటా సగటున వందకు పైగా రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటయ్యేవి. 2000 నాటికి వచ్చేసరికి వాటి సంఖ్య దాదాపు 10కి పడిపోయింది. సాధారణంగా అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఏడుగురు, తొమ్మిదిమంది జడ్జీలతోనూ ధర్మాసనాలు ఏర్పాటవుతుంటాయి. సుప్రీమ్ కోర్ట్ పని ఒత్తిడిని పరిమాణాత్మకంగా విశ్లేషించి చూస్తే, కోర్టు సమయంలో 85 శాతం దేశం నలుమూలల నుంచి వస్తున్న అప్పీళ్ళను వినడానికే సరిపోతోంది. ప్రస్తుతం 31 మందే ఉన్న నేపథ్యంలో ఈ కార్యభారం మధ్య విస్తృత రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు కొంత కష్టమని ఓ వాదన. అవసరానికి తగ్గట్టు జడ్జీల నియామకాలు పెంచుకోవడం దీనికి పరిష్కారం. ఇక శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు వల్ల కీలక అంశాలపై సత్వర నిర్ణయం సాధ్యం. కానీ, అదొక్కటే అన్ని సమస్యల్నీ పరిష్కరించలేదని గుర్తించాలి. ‘శాశ్వత’మనే ఆలోచన కొత్తదేమీ కాదు. 2019 సెప్టెంబర్‌లోనే అప్పటి ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటన చేసినా, ఆచరణలోకి రాలేదు. అయితే, కార్యనిర్వాహక వ్యవస్థతో పారదర్శక చర్చలతోనే శాశ్వత ధర్మాసనం సాధ్యం. ఇప్పుడు సమగ్ర న్యాయ సంస్కరణలు అవసరం. అవి ఎంత సమగ్రంగా ఉంటే, అంత సమర్థ పరిష్కారం లభిస్తుంది. ఆధునిక సాంకేతికతనూ, కృత్రిమ మేధ లాంటివీ వాడుకుంటే న్యాయ వ్యవస్థ పనితీరు మరింత మెరుగవుతుంది. పెండింగ్ కేసుల పరిష్కారం సుకరమవుతుంది. అనేక దేశాలు చాలాకాలంగా వర్చ్యువల్ సాంకేతికతతో సత్వర న్యాయం అందిస్తున్నాయి. కరోనా వేళ వర్చ్యువల్ దోవ పట్టిన మన కోర్టులు ఇకపైనా దాన్ని విస్తృతంగా అనుసరించాలి. కోర్టుల ఆధునికీ కరణ, డిజిటలీకరణకు ప్రాధాన్యమివ్వాలి. అదే సమయంలో ధర్మాసనాలు నిర్ణీత కేసుల్లో కీలక రాజ్యాంగ అంశాలపై స్పష్టతనిస్తే, దిగువ కోర్టులకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. అప్పీళ్ళ ప్రవాహా నికి అడ్డుకట్ట పడుతుంది. ఇక, కేసుల లిస్టింగ్‌లోనూ మరింత పారదర్శకత తెస్తానంటున్న లలిత్ మాటలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. -
సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా యూయూ లలిత్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. దీంతో ఆయన పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. కాగా ఈ నెల 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. తదుపరి సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ గత వారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అసోంకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 నెలల తర్వాత తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్, సీఎం..చిరునవ్వులు, ముచ్చట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 8 నెలల విరామం తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లడం రాజకీయంగా ప్రాధా న్యత సంతరించు కుంది. గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తారా..? లేదా అన్న అంశం చర్చనీ యాంశమైన సంగతి తెలిసిందే. ఆ చర్చకు తెరదించుతూ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైని ఆప్యాయంగా పలకరించి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంలు పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు క్లుప్తంగా సంభాషించారు. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తమిళిసైతో సీఎం భేటీ కాలేదు. గవర్నర్ తన అధికార పరిధిని అతిక్రమించి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలా పాలకు అడ్డాగా మార్చారని రాష్ట్ర మంత్రులు గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇందుకు ప్రతిగా.. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, మహిళ అని చిన్నచూపు చూస్తోందని గవర్నర్ తమిళిసై విమర్శించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై ఆమోదిం చకుండా పక్కన పెట్టడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేయడం, గవర్నర్ జిల్లా పర్యటనల సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడం, గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఐదు హైకోర్టులకు నూతన సీజేలను నియమించాలని, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేయాలంటూ మే 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ ఆదివారం పేర్కొంది. జస్టిస్ భూయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఆయనకు ఇదే కోర్టులో పదోన్నతి లభించింది. కాగా, 2021, అక్టోబర్ 11న తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయ్యారు. 1991లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. అస్సాంలోని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్ సీనియర్ న్యాయవాదిగా, అస్సాం అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్ భూయాన్ డాన్ బాస్కో స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కాటన్ కాలేజీలో ప్లస్ టూ, ఢిల్లీలోని కిరోరి కళాశాలలో డిగ్రీ చదివారు. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. అస్సాం బార్ కౌన్సిల్లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకున్నారు. ఇతర పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్‌లో ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్ కౌన్సిల్‌గా, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 2010, సెప్టెంబర్ 6న సీనియర్ అడ్వొకేట్‌గా నియమితులయ్యారు. అసోం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా, గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగారు. మిజోరాం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011, అక్టోబర్ 17న నియమితులయ్యారు. 2019, అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవలందించారు. 2021, అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు. నాలుగేళ్లలో ఐదో సీజే.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ రాష్ట్ర హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు. 2019, జనవరి 1న ఏర్పాటైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ వ్యవహరించిన విషయం విదితమే. -
హైకోర్టు సీజేతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈమేరకు న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు. -
‘అసామాన్యుడు’.. రిక్షా కార్మికుడి కుటుంబంలో పుట్టి.. బట్టల షాపులో పనిచేస్తూ..
సాక్షి, ఖమ్మం లీగల్ : ఇంట్లో మగపిల్లాడు పుట్టగానే సంతోషపడే వారున్నారు. కానీ ఆ పుత్రుడు వృద్ధిలోకి వస్తేనే తల్లిదండ్రులకు అసలైన సంతోషమన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం రిక్షా కార్మికుడైన ఓ వ్యక్తి విషయంలో అక్షరాలా నిజమైంది. రిక్షా నడుపుకునే వ్యక్తి తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపించగా... ఆ కుమారుడు ఏకంగా న్యాయమూర్తిగా ఎంపికై తన తండ్రికి పుత్రోత్సాహం కలిగించాడు.. నలుగురితో శభాష్ అనిపించుకున్నాడు. ఆయనే ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు. మా కుటుంబం పేదరికంలో ఉంది. మాకు సరైన వనరులు లేవు. అందుకే చదువుకోలేకపోయాం.. జీవితంలో సాధించలేకపోయాం అని బాధపడే ఎందరో యువతకు న్యాయమూర్తి జీవితం, ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పనిచేస్తూనే చదువు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో జల్లయ్య – నాగమ్మ దంపతులకు శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రిక్షా కార్మికుడు కాగా, తల్లి నాగమ్మ సాధారణ గృహిణి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాక, పదో తరగతి చదువుతున్నప్పుడు జాతీయ పర్వదినాల్లో ప్రముఖులు జాతీయ జెండా ఎగురవేయడం చూసిన ఆయన తాను కూడా జాతీయజెండా ఎగురవేసే స్థాయికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే అందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఒక బట్టల షాపులో పనికి కుదిరాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మరిచిపోకుండా ఒకవైపు పనిచేస్తూనే.. మరోపక్క చదువుకుంటూ అత్యధిక మార్కులతో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ఆయన న్యాయశాఖపై దృష్టి సారించారు. ఒక న్యాయమూర్తిగా న్యాయార్థులకు సేవలు అందించవచ్చని, అక్రమార్కులను శిక్షించవచ్చని భావించిన శ్రీనివాసరావు న్యాయశాస్త్ర పట్టా పొంది 1995లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. వృత్తిలో రాణిస్తూనే 2005లో మెజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. ఆత్మసంతృప్తికి తావ్వివక.. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించామనో, వ్యాపారంలో రాణించామనో ఓ స్థాయికి చేరుకున్నాక సంతృప్తి పడతారు. అయితే శ్రీనివాసరావు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. న్యాయమూర్తిగా తన విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే న్యాయపాలన, వివిధ దేశాల చట్టాలు తదితర అంశాలపై తులనాత్మక అధ్యయనం చేశారు. 2007 నుంచి 2017 వరకు 52 అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేశారు. ‘సత్వర న్యాయం’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన రాసిన వ్యాసాలు అనేక ప్రఖ్యాత జర్నళ్లలో ప్రచురితం కావడం విశేషం. అంతేకాకుండా ‘మోరాలిటీ ఇన్ లీగల్ సిస్టమ్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. సంచలనాత్మక కేసుల్లో తీర్పులు హైదరాబాద్‌లో సెషన్స్ జడ్జిగా పనిచేసిన కాలంలో శ్రీనివాసరావు ఎన్నో సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు. గోకుల్‌చాట్, లుంబినీపార్క్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుతో పాటు పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో పేలుళ్లు, అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి తదితర సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు శ్రీనివాసరావు. కాగా, ఉగ్రవాద సంబంధ కేసుల్లో తీర్పులు ఇచ్చిన ఆయన భద్రత కోసం ప్రభుత్వం అంగరక్షకులను నియమించింది. న్యాయశాస్త్రంలో చివరి అంచులను చూసి డాక్టరేట్ పట్టా పొంది జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నా ఆయన సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు. సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శ్రీనివాసరావు వృత్తి పట్ల నిబద్ధతతో ఉండడమే కాక సిబ్బంది సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఖమ్మంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వడం ప్రారంభించిన ఆయన, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు పూనుకున్నారు. కాగా, సమస్య ఎవరిదైనా తన పరిధిలో ఉంటే సకా రాత్మక ధోరణిలో పరిశీలించే శ్రీనివాసరావు, కేసుల సత్వర పరిష్కారంలో జిల్లాను ఆగ్రస్థానంలో నిలపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఆయన కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మంగళవారం సిఫార్సు చేసింది. తెలంగాణ సహా ఐదు హైకోర్టులకు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించింది. కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. 2021, అక్టోబర్ 11న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 1991లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. అసోంలోని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్ సీనియర్ న్యాయవాదిగా, అసోం అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్ భూయాన్ డాన్ బాస్కో స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కాటన్ కాలేజీలో ప్లస్ టూ, ఢిల్లీలోని కిరోరి కళాశాలలో డిగ్రీ చదివారు. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. అసోం బార్ కౌన్సిల్లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకున్నారు. పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను స్టాండింగ్ కౌన్సిల్‌గా, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 2010, సెప్టెంబర్ 6న సీనియర్ అడ్వొకేట్‌గా నియమితులయ్యారు. అసోం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా, గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగారు. మిజోరాం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011, అక్టోబర్ 17న నియామకమయ్యారు. 2019, అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవలందించారు. 2021, అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా భుయాన్ కొనసాగుతున్నారు. -
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న ఉన్న సతీష్ చంద్రమిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజియం బదిలీలను సిఫార్సు చేసింది. ►ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగి ►హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అంజాద్ సయీద్ ►రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్.షిండే ►గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రాష్మిన్ ఛాయ చదవండి: (AP: రాజ్యసభ అభ్యర్ధులపై కొనసాగుతున్న కసరత్తు) -
‘సత్వర న్యాయం’ దిశగా అడుగులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రసంగిస్తారు. ప్రారంభ సమావేశం తర్వాత సదస్సు ఎజెండాపై ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేలు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు చర్చలు జరుగుతాయి. దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలుచేశారు. న్యాయస్థానాల్లో సరైన మౌలిక సదుపాయాలు కొరవడి న్యాయపాలికల పనితీరు వెనుకబడిందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటే పరిష్కారమని సీజేఐ వ్యాఖ్యానించారు. అథారిటీ ఏర్పాటుతో కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. హైకోర్టులు, కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వారి అభిప్రాయాల కోసం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంపింది. త్వరగా కోర్టుల్లోని జడ్జి పోస్టులను భర్తీచేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి. దీనిపై సదస్సులో చర్చించనున్నారు. సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్(రిటైర్డ్) మధుకర్ హీరాలాల్ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్ 24న చివరిసారిగా సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్ మిషన్ ఫర్ జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. నేడు సీజేల సమావేశం సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల 39వ సీజేల సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం సైతం ఆరేళ్ల తర్వాత నిర్వహిస్తుండటం గమనార్హం. హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు, సిబ్బంది కొరత, దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల మధ్య నెట్వర్క్ సమన్వయం మరింత పటిష్టవంతం చేయడం వంటి ప్రధాన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. -
మూడు నెలల్లో.. ముగ్గురు సీజేలు!
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల స్వల్ప వ్యవధిలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతోంది. ఇద్దరు సీజేలు రిటైర్ కానుండటంతో ఈ అరుదైన సందర్భం రాబోతోంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 16తో ముగుస్తుంది. ఆయన తర్వాత జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నవంబర్ 8 వరకు దాదాపు రెండు నెలల పాటు సీజేగా కొనసాగుతారు. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్.. ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన రెండు సంవత్సరాల పాటు పదవీలో ఉంటారు. ఇంత తక్కువ వ్యవధిలో దేశం ముగ్గురు వేర్వేరు సీజేలను చూడటం ఇదే మొదటిసారి కానప్పటికీ.. ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలానికి సంబంధించిన సమస్య మరోసారి తెరమీదకు వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీకాలాన్ని కనీసం మూడేళ్లకు పెంచడంతోపాటు ప్రస్తుతం ఉన్న పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో ఇతర న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చేయబోతున్నందున సుప్రీంకోర్టులో మరిన్ని ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. న్యాయమూర్తుల పదవీకాలం తక్కువగా ఉండటం వల్ల పెండింగ్ కేసులు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఇప్పటికే 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా వచ్చిన సీజేలకు తగింత సమయం ఉండకపోవడంతో కొత్త మార్పులను సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రస్తుత వ్యవస్థను మరింత మెరుగ్గా నడిపించడానికి అవరసరమైన విధానాలను రూపొందించడానికి వీలు పడటం లేదు. చరిత్ర సృష్టించనున్న చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపట్టనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. తండ్రీకొడుకులు సీజేలు సేవలు అందించిన అరుదైన ఖ్యాతిని వారు దక్కించుకోనున్నారు. ఆయన తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్.. 1978, ఫిబ్రవరి నుంచి 1985, జూలై వరకు సీజేగా సేవలు అందించారు. (క్లిక్: రక్షణ వ్యయంలో ఆ మూడు దేశాలే టాప్!) రానున్న నెలల్లో భారీగా ఖాళీలు సుప్రీంకోర్టులో ప్రస్తుతం రెండు న్యాయమూర్తుల పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రానున్న నెలల్లో ఈ ఖాళీల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జస్టిస్ వినీత్ శరణ్ మే 10న, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జూన్ 7న, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ జూలై 29న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు మహిళా న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ ఇందిరా బెనర్జీ సెప్టెంబర్ 23న రిటైర్ కానున్నారు. జస్టిస్ హేమంత్ గుప్తా అక్టోబర్ 16న పదవీ విరమణ చేయనున్నారు. భారత్‌లోనే తక్కువ! ఇతర దేశాల్లోని న్యాయమూర్తుల పదవీకాలంతో పోలిస్తే భారతీయ న్యాయమూర్తుల పదవీకాలం తక్కువ. జడ్జిల పదవీ విరమణ వయసు యూకేలో 75, కెనడాలో 70 సంవత్సరాలుగా ఉంది. ఆస్ట్రేలియా, బెల్జియం, నార్వే వంటి దేశాలల్లోనూ న్యాయమూర్తులు 70 సంవత్సరాల వయస్సు వరకు పని చేస్తారు. అమెరికా, రష్యా, న్యూజిలాండ్, ఐస్లాండ్ దేశాల్లో న్యాయమూర్తులు జీవితకాలం సేవలు అందించే అవకాశముంది. (క్లిక్: అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే..) -
హైకోర్టు చీఫ్ జస్టిస్ మిశ్రాను కలిసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల భేటీ దృష్ట్యా సమావేశం అజెండాపై ఇరువురు చర్చించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు ఏప్రిల్ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితో పాటు, పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయ సహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ-కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటికి సంబంధించి రాష్ట్ర నుంచి నివేదించనున్న అంశాలపై ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చర్చించారు. హైకోర్టు ఉన్నత పరిపాలనా అధికారులు, రాష్ట ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సొంతూరులో సన్మానం కిక్కేవేరు
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అయినట్లు.. నేను ఎంత ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించినా ఈ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడినే.. న్యాయవాది రమణనే. సొంత ఊరిలో మర్యాద పొందడం అన్నది సామాన్యమైన విష యం కాదు... ఆ కిక్కే వేరు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టులో శుక్రవారం తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో చేపట్టిన సన్మానంపై ఉప్పొంగిపోయారు. గత స్మృతులను నెమరేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తనను రాజభవన్లో, వరం గల్లోనూ సన్మానించారని, తనను ఎంతో ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకున్న తెలంగాణ గడ్డకు కృతజ్ఞుడినని అన్నారు. తెలంగాణ హైకోర్టు తనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. భాష, మర్యాద, సంస్కా రం, సంస్కృతి, జీవితంలో పోరాటం, జీవించడం వంటివి నేర్పిందని గుర్తుచేసుకున్నారు. న్యాయ వాదిగా 17 ఏళ్లు, న్యాయమూర్తిగా 13 ఏళ్లు పని చేశానని, అందుకే ఈ ప్రాంగణంలోకి వస్తే భావోద్వేగానికి గురవుతానన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంతోషిస్తున్నా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు కొంత మంది ఎక్కువ క్రమశిక్షణతో కనిపిస్తున్నారని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిదర్శనమన్నా రు. ఐక్యతకు చిహ్నమని, అందుకే మీరు తెలంగాణను పోరాడి తెచ్చుకోవడం సామాన్య విషయం కాదన్నారు. ఆ తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించే వాడిలో తాను కూడా ఒకడినని చెప్పారు. తన పదవీకాలంలో ఏమి ఘన కార్యాలు చేసినా ఆ ఖ్యాతి తెలంగాణ హైకోర్టుదేనని, అపఖ్యాతి వస్తే మాత్రం ఆ బాధ్యత తనదన్నారు. కోర్టుల్లో వసతులలేమికి ఇక పరిష్కారం... తాను సీజేఐ అయ్యాక దేశ న్యాయ వ్యవస్థలో రెండు మౌలిక లోపాలను గమనించానని ఎన్వీ రమణ చెప్పారు. సామాన్యుడికి న్యాయం అందుబాటులో ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి తగిన సం ఖ్యలో కోర్టులు ఉండటం, సరైన సౌకర్యాలు ఉండ టం అవసరమన్నారు. అందుకోసమే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించానన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్రాల సీఎంలు, ప్రధాని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఈ అంశంపై చర్చిస్తామని, చర్చలు ఫలప్రదమైతే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సగం పోస్టులు భర్తీ చేశా.. ‘దేశంలోని హైకోర్టుల్లో 1,100 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఎప్పుడూ కనీసం 400 ఖాళీలు ఉంటాయి. నేను సీజేఐ అయ్యాక 198 హైకోర్టు జడ్జీల పోస్టుల భర్తీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపా. అందులో ఇప్పటిదాకా 130 భర్తీ అవగా మిగిలినవి కేంద్రం వద్ద పెండింగ్‌లోఉన్నాయి. మే నెలాఖరులోగా మరో 200 మంది న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపుతా. తెలం గాణ హైకోర్టులో 24గా ఉన్న జడ్జీల సంఖ్యను 42కి పెంచుకున్నాం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ మరిన్ని పేర్లు పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఖాళీల భర్తీలో సామాజిక, ప్రాంతీయ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సీజేఐ సూచించారు. మహిళా జడ్జీల తరఫున నినదించా... ‘ఢిల్లీలో ఇటీవల మహిళా జడ్జీలకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కార్ల్ మార్క్స్ నినా దాన్ని కాస్త మార్చి చెప్పా. మహిళలారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు... సంకేళ్లు తప్ప అనే నినాదం ఇచ్చా. కానీ ఈ విషయంలో కొన్ని సామాజిక మాధ్యమాలు నాపై దుమ్మెత్తిపోశాయి. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని కోరడం తప్పు అన్నా నేనేమీ లెక్కచేయను. కేవలం మహిళలకే కాదు... అన్ని ప్రాంతాలకు సమ న్యాయం ఉండాలి. అప్పుడే న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జూనియర్లకు ఆర్థిక చేయూత అందించాలి... ‘చిన్న, మధ్యతరగతి న్యాయవాదులు కోవిడ్ కాలంలో ఇబ్బందులు పడ్డారు. వృత్తిని వదిలేసి చేతివృత్తులు, ఆటోలు నడుపుకోవడం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నా. అలాగే జూనియర్లను న్యాయమూర్తులు కాస్త కనిపెట్టి ఉండాలి. న్యాయవాదుల శిక్షణకు అకాడమీని హైదరాబాద్‌లోనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అఖిల భారత జ్యుడీషియల్ డేటా మేనేజ్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించా. అలాగే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలి’ అని సీజేఐ సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మానవీయతని చాట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా తీవ్రత తగ్గడంతో న్యాయస్థానాలు ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. మీరు కూడా కరోనా భయం నుంచి బయటకు రండి. కోర్టు పనివేళలకన్నా అదనపు సమయాన్ని వెచ్చించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయండి. పెండింగ్ కేసుల పరిష్కారంలో మీ వంతు పాత్ర పోషించండి. వ్యవస్థలోని అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరచనిదే కార్యసిద్ధిపై హామీ ఇవ్వలేం. నిర్దేశిత లక్ష్యం, కేసుల సమర్థ నిర్వహణ ఈ విషయంలో ఎంతో వ్యత్యాసం చూపుతాయి. న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే పునాది. పునాది బలంగా ఉంటేనే వ్యవస్థ వర్ధిల్లుతుంది. ఈ విషయంలో మీరంతా న్యాయ వ్యవస్థ పతాకం ఎల్లప్పుడూ రెపరెపలాడేలా చూడండి. న్యాయవ్యవస్థ ఉన్నతిని నిలబెట్టేందుకు మీ వంతు కృషి చేయండి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ న్యాయాధికారులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు–2022ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్, తెలంగాణ, ఏపీ హైకోర్టు సీజేలు సతీష్‌చంద్ర శర్మ, ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవీయ కోణాన్ని చూడండి... సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ‘సమస్యలతో కోర్టుకు వచ్చే కక్షిదారుల్లో మైనర్లు, మహిళలు, బలహీన వర్గాలు, దివ్యాంగులకు ఉండే విభిన్న అవసరాలను గుర్తించి వారిని గౌరవించండి. మీ ఎదుట ఉండే సాక్ష్యాలను పరిశీలించే సమయంలో రాజ్యాంగ విలువలు పరిరక్షించే దిశగా స్వతంత్రంగా ఆలోచించండి. విధి నిర్వహణలో భయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా జడ్జీలపై పెరుగుతున్న భౌతికదాడులను నిరోధించేందుకు కోర్టు లోపలా, బయట భద్రత పెంచాలని మార్గదర్శకాలు జారీ చేశా. మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తూ తీర్పులు ఇవ్వండి. జడ్జీల ఆర్థిక అంశాలను త్వరలో పే కమిషన్ దృష్టికి తీసుకెళ్లి శుభవార్త వినిపిస్తా’ అని తెలిపారు. కోర్టుల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యత... ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభా వం చూపుతున్న మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీని ప్రధానాంశాలుగా తీసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టాం. మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణలో ఎనిమిదేళ్లుగా కోర్టులకు కొత్త భవనాలు వస్తున్నా ఇంకా చాలా చోట్ల రావాల్సిన అవసరం ఉంది. పెండింగ్ కేసులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టులో బెంచీల సంఖ్యను 24 నుంచి 42కు పెం చడంతోపాటు 17 కొత్త జడ్జీలను నియమించాం. గతంలో 12 పేర్లను జడ్జీలుగా ప్రతిపాదించగా పెండింగ్‌లో ఉన్న రెండు పేర్లను త్వరలో ఆమోదిం చేందుకు ప్రయత్నిస్తా’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2016లో ఈ తరహా సదస్సు జరిగిందని, న్యాయవ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరాలి’ అని సీజేఐ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు... సీఎం కేసీఆర్‌పై సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ తన తెలుగు ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. ‘నాతోపాటు న్యాయవ్యవస్థకు కూడా మిత్రుడైన కేసీఆర్ గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. చేతికి ఎముక లేదనే సామెతకు ఆయనే ట్రేడ్‌మార్క్. వివిధ రంగాల తరహాలోనే న్యాయవ్యవస్థ అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనకు న్యాయవ్యవస్థ తరఫున కృతజ్ఞతలు. కేంద్రం, వివిధ రాష్ట్రాలు ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తున్న క్రమంలో కేసీఆర్ న్యాయవ్యవస్థలో 4,320 ఉద్యోగాలు సృష్టించారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కోసం స్థలం, నిధులు కేటాయించి భవనం నిర్మించారు. హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా ఫ్రాంచైజీలు ఇస్తాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. వేదికపై ఉన్న వారికి వీణలను బహుమతిగా ఇచ్చిన సీఎం కేసీఆర్ తనకు మాత్రం నెమలి బొమ్మ ఇచ్చారంటే జాతీయ పక్షి అని ఇచ్చారేమోనని సీజేఐ చమత్కరించారు. తనకు నెమలి బొమ్మ ఇచ్చినా ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ హాస్యోక్తి విసిరారు. కాగా, యువ న్యాయ అధికారుల్లో క్రమశిక్షణా రాహిత్యం, సీనియర్ న్యాయమూర్తులను అవమానించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. తీర్పులు వెలువరించడంలో సమయపాలన పాటించడం లేదని, బాధితులకు సరైన న్యాయం అందించేందుకు సమగ్ర మార్పులు అవసరమన్నారు. వికార్ మంజిల్‌లో నిర్మించే జడ్జీల అతిథిగృహం, సెంట్రల్ రికార్డు బ్లాక్ శిలాఫలకాలను జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. తెలంగాణ జడ్జీల అసోసియేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యామినీరెడ్డి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.రామసుబ్రమణ్యం, హైకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్, హైకోర్టు ఇతర జడ్జీలు, జిల్లాలు, మెజిస్ట్రే్టట్ కోర్టుల జడ్జీలు పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి కోర్టుల్లో పనిభారం: సీఎం కేసీఆర్ గోవా, సిక్కిం వంటి రాష్ట్రాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తలసరి ఆదా యం, విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో అద్భుత పురోగతిలో ఉన్న తెలంగాణలో పాలనా సంస్కరణలతో 33 జిల్లాలు ఏర్పాటైనట్లు వెల్లడిం చారు. రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 24 నుంచి 42కు పెరిగిందని, న్యాయ విభాగంలో గతంలో 780 పోస్టులు మంజూరు చేయగా, తాజాగా 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మం జూరు చేసినట్లు చెప్పారు. ధరణి ద్వారా భూములను డిజిటలైజేషన్ చేసి కోర్టులపై అపార నమ్మకంతో రెవెన్యూ కోర్టులు రద్దు చేశామన్నారు. న్యాయమూర్తుల హోదాకు తగ్గట్లుగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహ సముదాయం నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమ శంకు స్థాపనకు రావాల్సిందిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఆహ్వా నించారు. పెట్టుబడుల ఆకర్షణలో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం పోటీ పెరిగిన నేపథ్యంలో తలెత్తే న్యాయ వివా దాలను న్యాయవ్యవస్థ వెంటనే పరిష్కరించా లని కోరుకుంటున్నానని, అలా జరిగితేనే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. 400 మంది హాజరైన న్యాయ అధికారుల సదస్సు న్యాయమూర్తులు తమ పనితనం మెరుగుపరుచుకునే వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఒత్తిడిలో ఉండే కక్షిదారులకు ఊరటనివ్వడంతోపాటు వివాదాల్లో మానవీయ కోణాన్ని చూడండి. సమానత్వానికి న్యాయసూత్రాలు దూరం కావనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు మీ విచక్షణను ఉపయోగించే అవకాశం ఉన్న చోట న్యాయ వ్యవస్థలోని మానవీయ కోణాన్ని చాటిచెప్పండి. – సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్, రంగారెడ్డిలోని సిటీ సివిల్ కోర్టులు, జిల్లా కోర్టుల్లో పనిభారం పెరిగింది. కొత్తగా ఏర్పాటైన 22 జిల్లాల్లో కోర్టులు ప్రారంభించాలి. కొత్త కోర్టులకు అవసరమైన స్థలాలను ఎంపిక చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులిస్తాం. కొత్తగా ప్రారంభమయ్యే జిల్లా కోర్టుల సిబ్బంది కోసం 1,730 అదనపు పోస్టులు మంజూరు చేస్తాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ -
హఠాత్తుగా వాహనం దిగి.. హోంగార్డును అభినందించి.
సాక్షి, హైదరాబాద్: అది ఎల్బీ స్టేడియం పక్కన ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం చౌరస్తా... రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ఖాన్ విధుల్లో ఉన్నారు. ఉదయం 9.20 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వాహనం ఆ దారిలో వెళ్తోంది. హఠాత్తుగా సీజే తన వాహనాన్ని స్లో చేయించి అలీని దగ్గరకు పిలిచారు. వాహనం నుంచి కిందికి దిగిన జస్టిస్ సతీశ్‌చంద్ర.. అలీని ‘వెల్డన్ ఆఫీసర్’ అంటూ అభినందించి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో అలీఖాన్‌తోపాటు అక్కడున్న వాళ్లూ ఆశ్చర్యపోయారు. విజయ్‌నగర్ కాలనీకి చెందిన అష్రఫ్ 24 ఏళ్ల క్రితం హోంగార్డుగా అడుగుపెట్టారు. రెండున్నరేళ్లుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలీ నిత్యం బీజేఆర్ స్టాట్యూ చౌరస్తాలోని పాయింట్లో డ్యూటీ చేస్తుంటారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాకపోకలు సాగించేది ఈ చౌరస్తా మీదుగానే. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్‌చానల్ ఇస్తుంటారు. సీజే ప్రయాణించే సమయంలో, ఆ మార్గంలో మిగిలిన వాహనాలను ఆపి, ఆయన వాహనాన్ని ముందుకు పంపిస్తారు. బీజేఆర్ స్టాట్యూ వద్ద అలీ ఒక్క రోజు కూడా చిన్న ఇబ్బందీ రానీయలేదు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న అలీని కొన్నాళ్లుగా గమనిస్తున్న సీజే శుక్రవారం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. హోంగార్డు అలీ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా సీజే స్థాయి వారిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది సీజే నా వద్దకు వచ్చి అభినందించడంతో షాకయ్యా’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీజే ఇచ్చిన స్ఫూర్తిని అలీ జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటారని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్టిట్టర్లో పేర్కొన్నారు. -
పాక్‌లో సంక్షోభం
ఇస్లామాబాద్: తాత్కాలిక ప్రధానమంత్రి నియామకం జరిగేవరకు ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా కొనసాగుతారని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి సోమవారం ప్రకటించారు. ఆ పదవికి తగిన వ్యక్తులను సూచించాలని ఆయన ప్రధాని ఇమ్రాన్‌కు, ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారని డాన్ పత్రిక వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం కేబినెట్, జాతీయ అసెంబ్లీ రద్దయినట్లు లేఖలో ఆల్వి వెల్లడించారని తెలిపింది. జాతీయ అసెంబ్లీ రద్దయిన మూడు రోజుల్లోగా ఇరువురూ ఎవరి పేరునూ సూచించకపోతే స్పీకర్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఇద్దరి పేర్లను ఇమ్రాన్, షరీఫ్ సిఫార్సు చేయాలని ఆల్వి సూచించారు. అయితే ఈ ప్రక్రియలో పాలుపంచుకోనని షరీఫ్ తేల్చిచెప్పారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇద్దరి పేర్లను తాము సూచించామని, షరీఫ్ ఎవరి పేరునూ సూచించకపోతే తాము చెప్పినవారిలో ఒకరు ప్రధాని అవుతారని మాజీ మంత్రి ఫహాద్ చెప్పారు. ఇమ్రాన్ సలహాపై పార్లమెంట్‌ను అధ్యక్షుడు ఆల్వి రద్దు చేయడంపై ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. గుల్జార్‌ను నామినేట్ చేసిన ఇమ్రాన్ పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పేరును ఆపద్ధర్మ ప్రధాని పదవికి ఇమ్రాన్‌ఖాన్ నామినేట్ చేశారు. పార్టీ కోర్ కమిటీలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అధ్యక్షుడి లేఖపై చర్చించి గుల్జార్ పేరును నామినేట్ చేశామన్నారు. ఆర్టికల్ 224– ఏ1 ప్రకారం ఎన్నికల నిర్వహణకు దేశంలో కేర్‌టేకర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఈ అధికారం అధ్యక్షుడికి ఉందని ప్రెసిడెంట్ ఆఫీసు ప్రకటించింది. జస్టిస్ గుల్జార్ 2019 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నవాజ్ షరీఫ్ అనర్హత తీర్పు వెలువరించిన బెంచ్‌లో ఆయన సభ్యుడు. ప్రభుత్వాలు, అధికారులపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తారని గుల్జార్‌కు పేరుంది. నేను యాంటీ ఇండియన్ కాదు! తాను భారత్, అమెరికా లేదా మరే ఇతర దేశానికి వ్యతిరేకం కాదని ఇమ్రాన్ ఎప్పారు. అన్ని దేశాలతో సత్సంబంధాలనే తాను కోరుకున్నానన్నారు. పాక్ ప్రజలనుద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు. ప్రభుత్వాన్ని పడదోయడానికి ఒక విదేశీ శక్తి ప్రయత్నించిందన్న వార్తలపై ఆయన స్పందించారు. విచారణ మరో రోజు వాయిదా పార్లమెంట్ రద్దుపై విచారణను పాక్ సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదావేసింది. సీజేపీ ఉమర్ అటా బందియల్ నేతృత్వంలోని భారీ బెంచ్ సోమవారం ఈ కేసు విచారణ చేపట్టింది. కేసులో అధ్యక్షుడితో సహా పలువురిని ప్రతివాదులుగా చేర్చింది. అసెంబ్లీ రద్దుపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయానికి సంబంధించి ప్రతిపక్ష, అధికార పార్టీల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఫుల్‌బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను సీజేపీ తోసిపుచ్చారు. అనంతరం మంగళవారానికి విచారణను వాయిదా వేశారు. ఈ విషయమై సరైన ఆదేశాన్ని ఇస్తామని అంతకుముందు సీజేపీ చెప్పారు. అవిశ్వాస తీర్మాన ప్రొసీడింగ్స్‌లో ఉల్లంఘనలున్నట్లు కోర్టు భావించిందని డాన్ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారమే తీర్పునివ్వడం కుదరదని ఇతర జడ్జిలు అభిప్రాయపడడంతో విచారణను వాయిదా వేసింది. చదవండి: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం.. రంగంలోకి సుప్రీంకోర్టు -
Tribunals Vacancies: కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు ట్రిబ్యునళ్లలో ఖాళీలపై(పెండింగ్ నియామకాలు చేపట్టకపోవడంపై) సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై స్పష్టమైన వైఖరి ఏంటో తెలపాలంటూ కేంద్రాన్ని వివరణ కోరింది. బుధవారం ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని తేలికగా తీసుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు నియమకాలపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరింది బెంచ్. ‘‘ఇది ట్రిబ్యునల్స్‌కు సంబంధించిన అంశం. రోజూ ప్రస్తావిస్తూనే ఉన్నాం. అయినా ఏదో మొక్కుబడిగా నియామకాలు చేపడుతున్నారు. ఎంతో మంది రిటైర్ అవుతున్నారు. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటోంది’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, అటార్నీ జనరల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బదులుగా ఏజీ స్పందిస్తూ.. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందన్నారు. దీంతో తదుపరి వాదనలను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
మై లార్డ్, యువరానర్ అనాల్సిన అవసరం లేదు.. సర్ చాలు!
సాక్షి, భువనేశ్వర్/కటక్: సాధారణఃగా కోర్టుల్లో కేసుల విషయంలో వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ లేదా..యువరానర్’ అని సంభోదిస్తుంటారు. అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్, యువర్ ఆనర్ వంటి సంబోధనలు మినహాయించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్.మురళీధర్ న్యాయవాదులకు విన్నపం చేశారు. సర్ వంటి సాధారణ సంబోధన సరిపోతుందని ఆయన అన్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఈ సందేశం జారీ చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రోజుల్లో సైతం న్యాయవాదులకు ఆయన ఇదే సందేశాన్ని జారీ చేయడం విశేషం. 2006 మే 29 నుంచి 2020 మార్చి 5వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2020లో పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉండే సమయంలో కూడా ఇదే విన్నపం అక్కడి న్యాయవాదులకు విన్నవించడం గమనార్హం. 2020 మార్చి 6 నుంచి 2021 జనవరి 3వ తేదీ వరకు పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా, చీఫ్ జస్టిస్ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మై లార్డ్, లార్డ్‌షిప్, యువర్ ఆనర్, ఆనరబుల్ వంటి సంబోధనలు నివారించాలని 2006లో తీర్మానించింది. చదవండి: వేల సంఖ్యలో కేసులు.. భారత్‌లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్? చీఫ్ జస్టిస్ నిర్ణయం అభినందనీయం.. హైకోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించాల్సిన సంబోధనల పురస్కరించుకుని, ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన సందేశం అభినందనీయమని ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జె.కె.లెంకా తెలిపారు. ఆయన విన్నపం నేపథ్యంలో తోటి న్యాయమూర్తులు ఈ సంస్కరణ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, కోర్టు విచారణకు హాజరయ్యే వ్యక్తులు ఇదే పద్ధతి పాటించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే సంబోధనల నివారణకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హయాంలో బీజం పడిందని సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి 1975 వరకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయమూర్తులను సర్ అని సంబోధించాలని ఫుల్ బెంచ్ అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. -
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
-
CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!
సాక్షి, చెన్నై : ‘ నన్ను క్షమించండి’ అంటూ వీడ్కోలు కార్యక్రమాన్ని సైతం పక్కన పెట్టి, బరువెక్కిన హృదయంతో సీజే సంజీబ్ బెనర్జీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బందికి లేఖ రాసి పెట్టి రోడ్డుమార్గంలో కోల్‌కతాకు బుధవారం బయలుదేరి వెళ్లారు. వివరాలు.. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోల్ కతాకు చెందిన సంజీబ్ బెనర్జీ ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, హఠాత్తుగా ఆయన్ని ప్రాధాన్యత లేని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడం చర్చకు దారితీసింది. ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పోరాటాలు చేసినా ఫలితం శూన్యం. ఈ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో గౌరవంగా బాధ్యతల నుంచి సంజీబ్ బెనర్జీ తప్పుకున్నారు. న్యాయమూర్తి పదవీ విరమణ పొందినా, బదిలీ అయినా, బార్ కౌన్సిల్, న్యాయమూర్తులు, న్యాయవాద సంఘాలు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే, ఆ కార్యక్రమాన్ని సైతం పక్కన పెట్టి బరువెక్కిన హృదయంతో అందరికీ సారీ అంటూ లేఖ రాసి పెట్టి కోల్ కతాకు సంజీబ్ బెనర్జీ వెళ్లిపోయారు. రోడ్డు మార్గంలో పయనం.. బుధవారం సీజే బెంచ్ పదికి పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. అయితే, ఎవ్వరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కేవలం హైకోర్టు సిబ్బంది, సహచర న్యాయమూర్తులకు లేఖ రాసి ఐ యామ్ సారీ, కృతజ్ఞతలు అని పేర్కొంటూ రోడ్డు మార్గంలో కోల్ కతాకు బయలు దేరి వెళ్లారు. తాను ఏ పనిచేసినా హైకోర్టు కోసమే చేశానని గుర్తు చేస్తూ, వీడ్కోలు కార్యక్రమానికి సైతం దూరం వెళ్తున్నానని పేర్కొన్నారు. ఆనందంగానే బయలు దేరుతున్నానని ముగించారు. దీంతో సీనియర్ న్యాయమూర్తి దురైస్వామి కేసుల విచారణపై దృష్టి పెట్టారు. ఇక, అలహాబాద్ హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తి మునీశ్వర్నాథ్ బండారిని హైకోర్టు తాత్కాలిక ఇన్చార్జ్ న్యాయమూర్తిగా నియమించారు. ఆయన గురు లేదా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. -
అశ్వ వాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అశ్వ వాహనంపై శ్రీవారు దర్శనమిస్తున్నారు. అశ్వ వాహన సేవలో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. (చదవండి: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం జగన్) జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. రేపు(శుక్రవారం) ఉదయం చక్రస్నాన మహోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. తిరుమల పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు. చదవండి: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ సర్కార్ నిర్ణయం -
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం
-
ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు , హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు. చదవండి: CM YS Jagan: మొక్కులు చెల్లించి.. చరిత్రలో నిలిచి.. కాగా.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌లో జన్మించారు. బిలాస్పూర్ లోని గురు ఘాసిదాస్ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987, సెప్టెంబర్ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకొని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004, జూన్ 26 నుంచి 2007, ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. 2007, సెప్టెంబర్ 1 వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. 2009, డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైకోర్టు నూతన సీజేగా నేడు జస్టిస్ మిశ్రా ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం/విశాఖ లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్.. జస్టిస్ పీకే మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, న్యాయ మూర్తులు, తదితరులు పాల్గొననున్నారు. కాగా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం నుంచి ఇండిగో విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ డి.రమేష్, జస్టిస్ శేషసాయి, జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ బట్టు దేవానంద్, పలువురు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ భానుమతి, హైకోర్టు ప్రొటోకాల్ రిజిస్ట్రార్ మురళీధర్, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యంరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రాయపూర్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పలువురు అధికారులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
నేడు జస్టిస్ అమానుల్లా ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఉ.10 గంటలకు హైకోర్టులో జరిగే కార్యక్రమంలో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ప్రమాణం చేయించనున్నారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమానుల్లాను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. జస్టిస్ అమానుల్లా 1963 మే 11న బీహార్‌లో జన్మించారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివిన ఆయన 1991 సెప్టెంబర్ 27న బీహార్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి, సుప్రీంకోర్టు, ఢిల్లీ, కలకత్తా జార్ఖండ్ హైకోర్టుల్లో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన కేసులు, సర్వీసు కేసుల్లో మంచి నైపుణ్యం సాధించారు. 2006 నుంచి 2010 వరకు బీహార్ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2010 నుంచి న్యాయమూర్తి అయ్యేంత వరకు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2011 జూన్ 20న పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పాట్నా హైకోర్టులో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన రెండవ స్థానంలో కొనసాగుతారు. నేడు సీజేకు వీడ్కోలు ఇక ఛత్తీస్‌ఘడ్‌కు బదిలీపై వెళ్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామికి ఆదివారం హైకోర్టు వీడ్కోలు పలకనుంది. జస్టిస్ అమానుల్లా ప్రమాణ కార్యక్రమం పూర్తయిన తరువాత, జస్టిస్ గోస్వామికి వీడ్కోలు పలుకుతారు. జస్టిస్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది జనవరి 6న బాధ్యతలు చేపట్టారు. -
ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌కుమార్ మిశ్రా
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌ల నియామకం జరిగింది. తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్ చంద్రశర్మ నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జస్టిస్ మిశ్రా.. ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, 2021, జూన్ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టుకు సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ.. 1961, నవంబర్ 30వ తేదీన భోపాల్‌లో జన్మించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్న సతీశ్ చంద్ర శర్మ.. మధ్యప్రదేశ్‌లో ఒక లీడింగ్ లాయర్‌గా పేరు గాంచారు. ఆయనకు 42 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ అడ్వొకేట్‌గా ప్రమోషన్ పొందారు. తద్వారా ఆ రాష్ట్ర హైకోర్టు చరిత్రలో పిన్న వయసులో సీనియర్ అడ్వొకేట్‌గా బాధ్యతలు చేపట్టిన అతి కొద్దిమందిలో ఆయన కూడా స్థానం సంపాదించారు. 2008, జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా నియమితులైన ఆయన.. 2010, జనవరి 10 వ తేదీన పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్నారు. 2020, డిసెంబర్ 31న కర్ణాటక హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ అయిన సతీశ్ చంద్ర శర్మ.. 2021, జనవరి 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై ఈ ఏడాది, ఆగస్టు 31 వ తేదీ నుంచి కర్ణాటక హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: కోస్తాంధ్రకు మరో తుపాను! -
భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది. వారంలోగా తీరు మార్చుకోవాలని పేర్కొంది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఢిల్లీ బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అమర్జీత్ సింగ్ బేడిలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వాఖ్యలు చేసింది. మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి: కోర్టు తీర్పుల్ని కేంద్రం గౌరవించడంలేదని స్పష్టంగా అర్థమవుతోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రైబ్యునళ్లలో ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో చెప్పండి, ఆయా అంశాలపై ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిన్నరగా ఖాళీలు భర్తీ కాక మూసివేత దశలోకి వచ్చేలా ఉన్నా... ట్రైబ్యునళ్లలో ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 1. కొత్త చట్టం అమలుపై స్టే ఇచ్చి ట్రైబ్యునళ్లను మూసివేయడం. 2. సుప్రీంకోర్టే ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం. 3. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం. కేంద్రంతో ఘర్షణ పడాలని తాము భావించడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సిఫారసులను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖాళీలతో చైర్పర్సన్లు, సభ్యులు లేక ట్రైబ్యునళ్లు కూలిపోయేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా వాటి నిర్వీర్యానికి కారణం అవుతున్నారని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునళ్లను మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం నోటిఫై అయినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కొత్త చట్టం ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేస్తుంది. సెర్చ్, సెలక్షన్ కమిటీ సిఫారసులను కేంద్రం తీసుకుంటుంది’ అని తుషార్ మెహతా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)వంటి వాటిల్లో అనేక ఖాళీలున్నాయని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ట్రిబ్యునళ్లలో ఖాళీల వల్ల అనేక కేసులు పరిష్కారం కావడం లేదన్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా బ్యూరోక్రాట్లతో సమావేశమై పలు పేర్లు సిఫారసు చేశామని, అయినా నియామకాలు చేపట్టలేదని... ఇదంతా వృథా ప్రయాస అయిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఖాళీల భర్తీకి సంబంధించి వివరాలను తదుపరి విచారణకు అందజేస్తామని మెహతా చెప్పడంతో ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘మీపై మాకు విశ్వాసం ఉంది. ఇలాంటి చట్టాలు చేయమని ప్రభుత్వానికి ఎప్పుడూ సూచించరు . ప్రభుత్వం దగ్గర ఉండే కొందరు బ్యూరోక్రాట్లు సలహాలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే కొత్త చట్టం రూపొందించమని చెబుతారు. ప్రస్తుతం బ్యూరోక్రసీ పనితీరు ఇలా ఉంది. అది మాకు తెలుసు. కానీ సీరియస్ అంశం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మేమెంతో నిరుత్సాహం చెందాం. మేం చెప్పదలచుకున్నది ఇదే’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. మూడు నాలుగు రోజులపాటు సమయం ఇస్తే... ఈలోగా భర్తీ చేస్తామని తుషార్ మెహతా చెప్పడంతో సోమవారానికి విచారణ వాయిదా వేస్తున్నామని కోర్టు పేర్కొంది. సోమవారానికి ఖాళీల భర్తీ కాకుంటే ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి పది రోజులు సమయం ఇస్తూ ధర్మాసనం ఆగస్టు 16న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ట్రైబ్యునల్ సభ్యుల పదవీకాలం తగ్గించడం, ఇతర సేవలను తగ్గిస్తూ కేంద్రం తీసుకొచి్చన ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం, 2021ను ఇటీవల పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ సభ్యుడు లేదా చైర్పర్సన్ నియామకానికి కనీస వయసు 50 ఏళ్లు ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ట్రైబ్యునళ్ల చైర్పర్సన్ల పదవీకాలం ఐదేళ్లు ఉండాలని ఆ మేరకు చట్టంలో పొందుపరచాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవే అంశాలు మళ్లీ కొత్త చట్టంలో రావడంతో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా అంశాలు కేంద్రం విస్మరించడంతో తమ తీర్పులు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. గతంలో కొట్టివేసిన చట్టానికి కొత్త చట్టం అచ్చు నకలులా ఉందని పేర్కొంది. -
మా సహనాన్ని పరీక్షిస్తున్నారా?: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. భర్తీ విషయంలో అలసత్వం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం వాదనలు జరగ్గా.. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం లేనట్లు మాకనిపిస్తోంది. మా సహనాన్ని పరీక్షిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఒక వారంలో ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సీజే నేతృత్వంలోని న్యాయమూర్తుల బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక సోలిసిటర్ జనరల్ మెహతాకి మూడు అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపిన సీజే రమణ.. నియమకాలు చేపట్టడం, ట్రిబ్యునల్స్‌ను మొత్తంగా మూసేయడం, నియమాకాలకు తమకు(సుప్రీం) అవకాశం ఇచ్చి.. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధపడడం ఆప్షన్స్‌ను కేంద్రం ముందు ఉంచారు. ‘‘మేం అసహనంతో ఉన్నాం. ప్రభుత్వంతో ఇబ్బందికర వాతావరణం మేం కోరుకోవట్లేదు’’ అని సీజే వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా‘‘ప్రభుత్వమూ ఇబ్బందికర పరిస్థితుల్ని కోరుకోవట్లేద’’ని తెలిపారు. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ దాఖలు చేసిన ట్రిబ్యునల్ ఖాళీల భర్తీ పిటిషన్‌పై.. చీఫ్ జస్టీస్ రమణ, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపుతోంది. ఈ క్రమంలోనే సోమవారం కేంద్రానికి నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్13కి వాయిదా వేసింది. చదవండి: వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు
-
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు
న్యూఢిల్లీ: "భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పదవిని ఒక మహిళ చేపేట్టే సమయం ఆసన్నమైంది" అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అన్న వ్యాఖ్యలు నిజం అయ్యే సమయం ఆసన్నమయినట్లే ఉంది. అన్ని అనుకూలిస్తే.. త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఓ మహిళ చేపట్టనున్నారు. జస్టిస్ బీవీ నాగరత్న 2027 లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోయే మొదటి మహిళగా నిలవనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తదుపరి చీఫ్ జస్టిస్ రేసులో ఉన్న 9 మంది న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేసింది. వీరిలో బీవీ నాగరత్న పేరు కూడా ఉన్నది. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్నం పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆమె 2008 లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే.. అది దేశ న్యాయ చరిత్రలో చారిత్రాత్మక క్షణంగా నిలుస్తుంది. నాగరత్న తండ్రి ఈఎస్ వెంకటరామయ్య గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జూన్ 1989 నుంచి డిసెంబర్ 1989 మధ్య భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. భారతదేశానికి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి కావాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీవీ నాగరత్నను ఆ పదవి వరిస్తే.. ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా మహిళ.. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని అభిప్రాయపడ్డారు. గతంలో బాబ్డే "మహిళల ఆసక్తి, ఉత్సాహం మాకు తెలుసు. సాధ్యమైనంత మేర అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వైఖరిలో మార్పు రావాలి అనడానికేమీ లేదు. సమర్థులైన అభ్యర్ధులు కావాలి" అన్నారు. జాబితాలో మరో ఇద్దరు మహిళలు.. ఐదుగురు సభ్యుల కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల జాబితాలో నాగరత్నతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారు జస్టిస్ హిమా కోహ్లీ (తెలంగాణ హైకోర్టు సీజే), జస్టిస్ బేల త్రివేది (గుజరాత్). సుప్రీంకోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది పీఎస్ నరసింహ పేరు కూడా కొలీజయం జాబితాలో ఉంది. నాగరత్న, పీఎస్ నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్ , జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్,జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ జాబితాలో ఉన్న ఇతరులు. న్యాయ వ్యవస్థలో మహిళలు.. భారతదేశంలో 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. అంతకుముందు 1935 నుంచి ఉన్న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీం కోర్టు వచ్చింది. అప్పటినుంచి 47మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించారు. తొలిగా ఎపెక్స్ కోర్టులో 8 మంది జడ్జిలు మాత్రమే ఉండేవారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారాన్ని రాజ్యాంగం, పార్లమెంటుకు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 మంది. అయితే, ఇప్పటివరకూ కేవలం 8 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో జడ్జ్‌లుగా వ్యవహరించారు . 1989లో తొలిసారిగా జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం 34 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న 25 హైకోర్టులలో కేవలం ఒక్క కోర్టులో మాత్రమే మహిళా ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆమె, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. దేశవ్యాప్తంగా ఉన్న 661 మంది హైకోర్టు జడ్జ్‌లలో కేవలం 73 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మణిపూర్, మేఘాలయ, పట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్‌లలో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. -
న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదు: సీజేఐ రమణ
-
జార్ఖండ్ జడ్జి హత్య కేసు: సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసులో సుమోటో విచారణను అత్యున్నత ధర్మాసనం శుక్రవారం చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపరిచే ట్రెండ్ దురదృష్టకరమన్నారు. న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జడ్జిలు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడంలేదని, పట్టించుకోవడం లేదని చీఫ్ జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ అని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. అంతేకాదు పూర్తి బాధ్యతతోనే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందన్నారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయనీ, మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఎన్వీ రమణ ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేశారు. కాగా ధన్‌బాద్‌కు చెందిన జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ది అనుమానాస్పద మృతిగా, తరువాత రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగానే భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు బార్ అసోసిసేషన్(ఎస్సీబీఏ) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది. న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ వ్యవహరాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీం జార్ఖండ్ డీజీపీనుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే. -
ఎనిమిదేళ్లలో 18 వేల కేసుల్లో తీర్పులిచ్చారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చల్లా కోదండరామ్ విధులు నిర్వహించిన ఎనిమిదేళ్లలో 18,890 వేల కేసుల్లో తీర్పులిచ్చారని, మరో 13,752 మధ్యంతర పిటిషన్లను పరిష్కరించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి ప్రశంసించారు. జస్టిస్ కోదండరామ్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సమావేశమై కోదండరామ్ సేవలను కొనియాడింది. అనంతరం ఘనంగా వీడ్కోలు పలికింది. తర్వాత హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆయనను సత్కరించింది. రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ పాల్గొన్నారు. -
చాలా ఎక్కువ చేస్తున్నారు: ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ: జారీ చేసిన ఉత్తర్వులు అందజేయడంలో జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. డిజిటల్ యుగంలో కూడా ఆదేశాలు పంపే పావురాల కోసం ఆకాశం వంక చూడాల్సివస్తోందని వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు అందించేందుకు ఒక సురక్షిత, నమ్మకమైన మార్గాన్ని అమల్లోకి తెచ్చేందుకు యత్నిస్తామని పేర్కొంది. ఇటీవలే 13మంది ఖైదీల విడుదలకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో యూపీ పోలీసులు చేస్తున్న జాప్యంపై వచ్చిన వార్తలను కోర్టు సుమొటోగా స్వీకరించి విచారణ జరిపింది. ఈ సందర్భంగా... ఆదేశాల అమలు ఆలస్యమవుతుండడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం లోని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం వేగంగా ఆదేశాలు అందించేందుకు అవసరమైన విధానాన్ని ప్రతిపాదించాలని కోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ఇందుకు రెండువారాల గడువు ఇచ్చింది. ఇదే సమయంలో అన్ని జైళ్లలో ఉన్న ఇంటర్నెట్ సదుపాయంపై వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. లేకుంటే ఇలాంటి ఆదేశాలను వెంటనే అందించలేమని అభిప్రాయపడింది. చాలా ఎక్కువ ఆగ్రా కోర్టు నుంచి ఖైదీలను విడుదల చేయకపోగా, తమకు కోర్టు ఆదేశాలు అందలేదనడం పరిస్థితిని చూపుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు చాలా ఎక్కువ చేస్తున్నారన్నది. అయితే కొందరు ఖైదీలు తప్పుడు ఆదేశాలను సృష్టిస్తుంటారని, అందువల్ల జైలు అధికారులు కోర్టు వెబ్సైట్లో ఆర్డర్లు అప్లోడ్ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెమతా కోర్టుకు విన్నవించారు. ఈ గందరగోళం లేకుండా చూసేందుకే ఫాస్టర్(ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్)పేరిట అన్ని కోర్టులకు, జైళ్లకు వేగంగా ఆదేశాలు పంపే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను కోర్టు అమికస్ క్యూరీగా నియమించింది. సొలిసిటర్ జనరల్ సాయం కూడా తీసుకోవాలని సూచించింది. -
సెక్షన్ 124ఏ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండటాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, గోఖలే వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్‌ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, ఈ సెక్షన్ ప్రస్తుత కాలంలో అవసరమా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ ఎన్జీ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌ల ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ దేశద్రోహం చట్టం బ్రిటిష్ వారి నుంచి వలస తెచ్చుకున్న చట్టంగా అభివర్ణించింది. ప్రభుత్వాలపై విద్వేషం పెరిగేలా చేసే ప్రసంగాలు లేదా భావ ప్రకటనలను బెయిల్‌కు వీల్లేని నేరంగా పరిగణిస్తూ, ఈ సెక్షన్ కింద జీవితకాల జైలుశిక్ష విధించే అవకాశముంది. ‘ఈ చట్టం వలసరాజ్యం నాటి చట్టం. స్వేచ్ఛను అణచివేయడానికి, గాంధీ, తిలక్ వంటి వారి గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని బ్రిటిష్‌వారు ప్రయోగించే వారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా?’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తరహా కేసులు సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాల వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటర్స్ గిల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. 124ఏ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో పిటిషన్లో వివరించామన్నారు. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేసిన కేసులే ఎక్కువని, కొయ్య మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే మొత్తం అడవినే నరికినట్లుగా ఉందంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని సీజేఐ ఉదహరించారు. చట్టం దుర్వినియోగం అవడంతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ తరహా ఇతర కేసులు కూడా పరిశీలిస్తామన్న సీజేఐ.. అన్ని కేసులను ఒకే చోట విచారిస్తామన్నారు. కాలం చెల్లిన చట్టాలను చాలా వరకూ రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సెక్షన్‌ను కొట్టివేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన ప్రయోజనాల నిమిత్తం మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. పిటిషనర్ ఆర్మీ మేజర్ జనరల్‌గా పనిచేశారని, ఆయన దేశం కోసం త్యాగం చేశారని, ఈ పిటిషన్‌ను ప్రేరేపిత పిటిషన్‌గా భావించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘సెక్షన్ 124ఏ ను పేకాట ఆడేవారిపైనా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థుల అణచివేతకు రాజకీయ నేతలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెక్షన్ 124ఏ ప్రయోగించేలా ఫ్యాక్షనిస్టులు ప్రవర్తిస్తున్నారు. బెయిల్ రానివ్వకుండా ఈ సెక్షన్‌తో బెదిరిస్తున్నారు’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. సెక్షన్ 124ఏ రద్దుపై వైఖరి తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. విపక్ష నేతల హర్షం దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఒకవైపు, ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బుధవారం హరియాణాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 100 మంది రైతులపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో రైసీ గెలుపు
దుబాయ్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఇప్పటిదాకా 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవగా వాటిలో 62 శాతం ఓట్లను రైసీ దక్కించుకున్నట్లు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం ప్రకటించింది. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నేత అయిన అయతొల్లా అలీ ఖమేనీకి రైసీ అత్యంత ఆప్తుడు. రైసీ ప్రస్తుతం ఇరాన్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపులతోపాటు చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో 5.9 కోట్ల ఓటర్లలో 2.89 కోట్ల మందే ఓటేశారు. పోలైన ఓట్లలో రైసీకి 1.79 కోట్ల ఓట్లు పడ్డాయి. రైసీతో పోటీపడిన మాజీ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ మొసెన్ రెజాయీకి 34 లక్షల ఓట్లు, అబ్దుల్‌నాజర్ హెమ్మతీకి 24 లక్షల ఓట్లు దక్కాయి. మరో అభ్యర్థికి 10 లక్షల ఓట్లు పడ్డాయి. ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదవడం తెల్సిందే. రైసీ గెలుపును ఖరారుచేస్తూ ఇంకా అధికారిక ఫలితాలు వెల్లడికాలేదు. రైసీకి గట్టి పోటీ ఇవ్వగలరని భావించిన అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్యానెల్ తిరస్కరించడంతో రైసీ సునాయాసంగా గెలిచారు. 60 ఏళ్ల రైసీ గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడినా ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ చేతిలో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో గెల్చిన రైసీ ఆగస్టులో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
‘తెలుగు రాష్ట్రాల్లో పర్యటన.. ఎంతో ఆనందాన్నిచ్చింది’
శ్రీశైలం టెంపుల్: వారం రోజులుగా తెలుగు గాలిని పీలుస్తూ.. తెలుగు నేలపై తిరుగుతుండడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. శ్రీశైలంలోని అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత స్వల్ప వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి తన కార్యక్రమం చెప్పినప్పటికీ అన్ని ఏర్పాట్లు భేషుగ్గా చేశారని ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే, ఇతర అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం పలికారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏటా రెండు మూడుసార్లు ఇక్కడకు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునే వాడినని తెలిపారు. కర్నూలు జిల్లాతో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, వృత్తిరీత్యా ఈ ప్రాంతానికి చెందిన ఏరాసు అయ్యపరెడ్డి వద్ద 10ఏళ్లపాటు జూనియర్‌గా పనిచేశానని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు. శ్రీశైల వైభవం పుస్తకావిష్కరణ స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం మూలప్రతిని సంస్కృతం నుంచి తెలుగులో శ్లోక భావార్థాలను రూపొందించడంలో కీలకపాత్రను పోషించిన త్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మను సీజే జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. అలాగే, ఘంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో లభించిన పురాతన తామ్ర శాసనాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవస్థానం ప్రచురించిన శ్రీశైల వైభవం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కాగా, సీజే జస్టిస్ ఎన్వీ రమణ వెంట ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ న్యాయమూర్తి జస్టిస్ డి.వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. చదవండి: ‘యాదాద్రి అద్భుతం.. అద్వితీయం’ సీజేఐ ప్రశంసలు -
కేసుల సత్వర విచారణ జరపాలి: హిమా కోహ్లి
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్: బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కేసులను సత్వరమే విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేకూర్చాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ సమావేశం ద్వారా నాగర్‌కర్నూల్‌లో 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు, కొల్లాపూర్‌లో మొదటి, రెండో జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించారు. సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ప్రేమావతి, 4వ అదనపు సెషన్స్ జడ్జి రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జి శీతల్, మొబైల్ మెజిస్ట్రేట్ మురళీమోహన్, జూనియర్ సివిల్ జడ్జి స్వరూప, ఎస్పీ సాయిశేఖర్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నార -
అద్భుత వాదనలు విన్నా.. సంతృప్తిగా వెళుతున్నా: జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఎంతో సంతృప్తిగా తాను పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ఎంతో సంతోషంతో, మధుర స్మృతుల్ని మూటగట్టుకొని, మంచి పేరు సంపాదించుకొని అత్యున్నత న్యాయస్థానాన్ని వీడుతున్నట్టు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా అత్యుత్తమ పనితీరును ప్రదర్శించడానికి శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నారు. ఎన్నో అద్భుతమైన వాదనలు విన్నానని, అంతకు మించి న్యాయం కోసం చిత్తశుద్ధితో పోరాటం సాగించిన వారిని చూశానని వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పుతో సహా ఎన్నో ముఖ్యమైన తీర్పులను జస్టిస్ బాబ్డే వెలువరించారు. కోవిడ్–19 సంక్షోభం నెలకొన్నప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపట్టారు. అయితే ఈ తరహా విచారణ తనలో చాలా అసంతృప్తిని మిగిల్చిందని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. అందువల్ల తన పదవీ కాలం చివరి రోజుల్లో మిశ్రమ అనుభూతులే తనకు మిగిలాయని చెప్పారు. 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం పదవీ ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ అత్యంత సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం కనీసం మూడు సంవత్సరాలైనా ఉండాలన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కోర్టులు మూతపడకుండా వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టి 50 వేల కేసుల్ని పరిష్కరించడం జస్టిస్ బాబ్డే వల్లే సాధ్యమైందని కొనియాడారు. ( చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా? ) -
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ
-
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తన తర్వాత ఆ స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణను నియమించాల్సిందిగా కోరుతూ... ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే... ప్రతిపాదన పంపగా, రాష్ట్రపతి ఆమోదించారు. ఏప్రిల్ 24, 2021న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 26, 2022 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వహిస్తారు. కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆగస్టు 27, 1957న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ట్రైబ్యునళ్లు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, ఎన్నికల అంశాల్లో కేసులు వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార కేసులు, క్రిమినల్ కేసుల్లో నిపుణుడిగా పేరు పొందారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్, క్యాట్, హైదరాబాద్‌లో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా జూన్ 27, 2000 నుంచి సెప్టెంబరు 1, 2013 వరకు కొనసాగిన జస్టిస్ రమణ కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబరు 2, 2013 నుంచి ఫిబ్రవరి 16, 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 17, 2014న పదోన్నతితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బాబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉన్నారు. చదవండి: అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే దేశ్‌ముఖ్ వ్యవహారం: సీఎం నోరు విప్పడం లేదేంటి? -
న్యాయమూర్తులు... ఆదర్శాలు
దేశంలో న్యాయమూర్తులు ఎందరో ఉండవచ్చు. కానీ అత్యున్నత న్యాయస్థానపు అత్యున్నత పదవి ఎవరినోగానీ వరించదు. తెలుగువాళ్లలోనైతే అంత స్థాయికి వెళ్లినవాళ్లు ఎందరో చెప్పడానికి వేళ్లు కూడా అక్కర్లేదు. రెండు చేతులు చాలు. డెబ్బై యేళ్ల స్వతంత్ర భారతంలో సర్వోన్నత న్యాయ స్థానపు ప్రధాన న్యాయమూర్తి అవుతున్న రెండవ తెలుగువాడు జస్టిస్ ఎన్.వి. రమణ మాత్రమే. అయితే పదవులు అందరూ చేపడతారు. కానీ కొందరే ఆ పదవులకు వన్నె తెస్తారు. సుప్రీం మహోన్నత పీఠంపై ముమ్మూర్తులా న్యాయదేవతను తలపించిన కొందరు న్యాయమూర్తులు చరిత్రలో భాగమైనారు. వాళ్లు నెలకొల్పిన ఆదర్శాలే అందరికీ అనుసరణీయం కావాలి. ‘‘దేశంలోని పేదలు, నిరక్షరాస్యులు తమ హక్కులను విధిగా ఆచరణలో అనుభవించ లేని దశలో, భారత ప్రజలందరికీ సమాన హక్కులను అమలు జరుపు తామని చెప్పే హామీకి అర్థం లేదు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన ప్పటినుంచీ దారిద్య్ర సమస్యతోనూ, న్యాయం పొందడం కోసమూ నిరంతరం పోరు సల్పుతూనే ఉంది. అయినా, 74 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా అవే సమస్యలను ఇంకా చర్చించు కోవలసి వస్తోంది’’. – సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ: ఢిల్లీలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో ప్రసంగం (23 మార్చ్ 2021) ‘‘న్యాయమూర్తుల పైన, న్యాయవ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం తగ్గిపోతోంది. దానిని పెంచేందుకు న్యాయవాదులు కృషి చేయాలి’’. – ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్.వి.రమణ (3 మార్చ్ 2013) తెలుగువారి చరిత్రలో ఎందరో న్యాయమూర్తులు రాష్ట్ర హైకోర్టుకు సేవలందించి ఉన్నారు. కానీ తెలుగువారి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికై సేవలందించిన విశిష్ట వ్యక్తి కోకా సుబ్బారావు కాగా, అనేక సంవత్సరాల తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించబోతున్న రెండవ తెలుగు న్యాయమూర్తి జస్టిస్ నూతల పాటి వెంకటరమణ కావడం హర్షించదగిన విషయం. ఈ సమ యంలో భారత న్యాయవ్యవస్థలో అనేక ఒడిదుడుకుల మధ్యనే సుసంప్రదాయాలను, ఎప్పటికీ ఆదర్శవంతంగా నిలిచిపోగల విశిష్ట తీర్పులను మనకు అందించిపోయిన ఆదర్శ న్యాయమూర్తులను తలచుకోకుండా ఉండలేము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ రమణే ఎనిమిదేళ్ల క్రితం ‘న్యాయమూర్తుల పైన, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం తగ్గిపోతోం’దని ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో పూర్వాపరాలను ఆయనతో పాటు మనం కూడా తరచి చూసుకోవలసి ఉంది. ముఖ్యంగా గడిచిన రెండు దశా బ్దాలలోనూ మూడు రాజ్యాంగ వ్యవస్థలకు (ప్రభుత్వం/శాసన వ్యవస్థ/న్యాయవ్యవస్థలు) నిర్దేశించిన నియమిత అధికారాలను, బాధ్యతలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడం జరిగింది. అయినా ఆత్మ విమర్శ జరగనందువల్ల మూడు రాజ్యాంగ వ్యవస్థలు పరస్పరం తమతమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక శాఖలో మరొక శాఖ దూరి తలా ఒక దారిగా ప్రవర్తించినందువల్ల దేశ న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయే దశ వచ్చేసింది. ఒక్కముక్కలో చెప్పా లంటే ఏ దశకు పాలకులు చేరుకున్నారంటే– తాము ఆశించిన ప్రజా వ్యతిరేక విధానాలకు ‘తాతాచార్యుల ముద్ర’ మాదిరిగా పార్ల మెంటులో బ్రూట్ మెజారిటీ సాయంతో కొన్నాళ్లు, ‘కరోనా’ లాంటి వ్యాధుల వ్యాప్తి పేరిట ఇంకొన్నాళ్లు, సమావేశాలను, చర్చలనే పక్కనపెట్టారు. సుప్రీం మెడలువంచి లేదా కొందరు జడ్జీలకు అనంతర పదవుల ఆశ చూపి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తినే భౌతికంగా తప్పించేశారన్న అపవాదు గత కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్న సంగతి మరచి పోరాదు. న్యాయవ్యవస్థలో మనం ఒక అబ్రహాం లింకన్‌నూ, ఒక మహాత్మాగాంధీనీ ఆశించడం ‘కుందేటి కొమ్ము’ను సాధించడానికి ప్రయత్నించడమే అవుతోంది. అందుకే బహుశా భారత న్యాయ మూర్తులలో అగ్రశ్రేణి విలువలకు పట్టంకట్టిన పలువురు ఉద్దండ పిండాలలో ఒకరైన సుప్రీం న్యాయమూర్తి వి.ఆర్. కృష్ణయ్యర్ తన స్వీయచరిత్ర ‘జీవిత చరమాంకం’ (ది ఈవెనింగ్ ఆఫ్ లైఫ్) గ్రంథంలో ఇలా రాయవలసి వచ్చింది: ‘‘నిజాయితీకి బద్ధ విరోధి అవినీతి. కానీ ఈ అవినీతి రానురానూ మన న్యాయవ్యవస్థను క్రమంగా ‘కుమ్మరి పురుగు’లా తొల్చుకుంటూ పోతోంది. మనల్ని ప్రశ్నించేవాళ్లు లేరన్న ధీమాతో ముందుకు సాగుతోంది. నేను బార్లో ఉన్నప్పుడు చివరికి మున్సిఫ్ ప్రవర్తనను సహితం అనుమానించే వాడిని. కానీ ఈ రోజున అత్యున్నత న్యాయస్థానం సహితం తప్పుడు పనులకు, నిజాయితీకి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతుండటం విచారకరం. ప్రభుత్వం లేదా పాలనాధికార వర్గం తప్పుడుగా వ్యవ హరిస్తే ఆ తప్పును న్యాయవ్యవస్థ అధికారికంగా సరిదిద్దవచ్చు. శాసన వ్యవస్థే రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ నేరానికి కోర్టువారు శిక్షించవచ్చు. కానీ తీర్పరిగా ఉండాల్సిన న్యాయమూర్తే నేరానికి ఒడిగడితే అతడిని సరైన బాటలో పెట్టేవారుండరు. కనుకనే అలాంటి న్యాయమూర్తులు తమ నిర్ణయానికి తిరుగులేదన్న భ్రమలో ఉండిపోతారు’’.అందుకే, బ్రిటిష్ కామన్వెల్తులో అత్యంత నిజాయితీపరుడైన జస్టిస్ మైఖేల్ కిర్బీ ఒక సందర్భంలో రాస్తూ– జస్టిస్ కృష్ణయ్యర్కి జైలు జీవిత సత్యాలు ఎలా ఉంటాయో తెలుసుననీ, అందుకే భారత దేశ జైళ్లలోని ఖైదీలకూ, భారత రాజ్యాంగాన్ని నమ్మేవారికీ మధ్య ఇనుప తెర అంటూ ఉండదనీ పేర్కొన్నారు. ‘సునిల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ పాలక వ్యవస్థ’ కేసుకు సంబంధించిన తీర్పులో కృష్ణయ్యర్ ఎంత సాధికారతతో న్యాయసూత్రాలను రూపొందించారో, ఆ సూత్రాలను చివరికి బ్రిటన్ ప్రీవీ కౌన్సిల్, ఇతర కోర్టులలోనూ ఎలా ఆదర్శంగా అనుసరించాల్సి వచ్చిందో కిర్బీ పేర్కొన్నారు. ‘‘జస్టిస్ కృష్ణయ్యర్లా పెక్కుమంది న్యాయమూర్తులు జైలులో స్వయంగా ఒక రాత్రి గడిపి ఉండరు. నా మాదిరిగానే మహా అయితే జైళ్లు పరిశీలించి ఉండవచ్చు, జైళ్లలోని ఖైదీల పరిస్థితుల్ని గమనించి ఉండొచ్చు. కానీ ఈ పైపై క్షణికానుభవాలు ప్రభుత్వ తాఖీదుపైన అరెస్టయి జైలు జీవితం స్వయంగా అనుభవించడం లాంటి అనుభవం మరీ ముఖ్యంగా ప్రభుత్వ అన్యాయపు ఉత్తర్వుపై అరెస్టయి జైల్లో గడపటం లాంటి అనుభవం ముందు దిగదుడుపే. కృష్ణయ్యర్ లాంటి అనుభవం తక్కువమందికి ఉంటుంది.’’ ఒక న్యాయవాదిగా కృష్ణయ్యర్ (ఈనాటి ప్రసిద్ధ పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, కీ.శే. కన్నాబిరాన్ లాగా) ‘కోర్టు ధిక్కారం’ అన్న అభియోగంపైన రెండుసార్లు ప్రాసిక్యూషన్ ఎదు ర్కొన్నవారే. అలాంటి సందర్భాలలోనే ఆయన భారత లీగల్ వ్యవస్థలోని బలహీనతల్ని, వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారని మరచిపోరాదు. అలాంటి ఉద్దండ న్యాయమూర్తుల్లో ‘నా ముందుకు ఫలానా కేసు వద్దు’ (నాట్ బిఫోర్ మి) అంటూ ఇప్పటికీ తప్పు కుంటున్న జస్టిస్ లోకూర్, జస్టిస్ భండారీ లాంటి నిజాయితీపరులు ఉన్నారు. పతంజలి శాస్త్రి నుంచి జె.ఎస్.వర్మ, బరూచా, వి.ఎన్.ఖారే, సదాశివమ్, జీవన్‌రెడ్డి, శివరాజ్ పాటిల్, రామస్వామి, పి.ఎ.చౌదరి లాంటి ప్రసిద్ధులు జన హృదయాల్లో ఆదర్శమూర్తులుగా ఉండి పోయారు. అందుకనే కబుర్లు కాదు, ఉన్నత స్థాయికి చేరుకున్న న్యాయమూర్తులు అందరికీ ఆచరణ ముఖ్యం. కృష్ణయ్యర్ ఒక సూక్తిని ఉదహరించేవారు– ‘‘ప్రజా వ్యతిరేక దుష్ట చట్టాల గురించి మనలో చాలామంది మాట్లాడుకుంటుంటారు. కానీ, అలాంటి చట్టాలను ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు. అందుకే ఫ్రెంచి మేధావి థోరే అన్నాడు: ఒక వ్యక్తిని పరమ అన్యా యంగా జైలుకు పంపించే ప్రభుత్వం ఉన్నచోట, న్యాయంగా బతికే వ్యక్తి ఉండాల్సిన స్థానం కూడా జైలే అవుతుంది సుమా!’’ రేపటి ఆదర్శమూర్తులు ఎలా ఉండాలో 2018 జనవరి 12న న్యాయవ్యవస్థ చరిత్రలో తొలిసారిగా జస్టిస్ చలమేశ్వర్ ఆధ్వర్యంలో అయిదుగురు జడ్జీలు నిర్వహించిన చారిత్రక పత్రికా సమావేశం నిర్ణయించింది. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ హిమా కోహ్లి గురు వారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్య క్రమంలో ఆమె చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమా ణం చేయించారు. అనంతరం జస్టిస్ హిమా కోహ్లికి గవర్నర్‌తో పాటు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలి పారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కోహ్లి కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు న్యాయ మూర్తులు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
వ్యక్తి స్వేచ్ఛను కాపాడారు..
సాక్షి, హైదరాబాద్: వ్యక్తులు అదృశ్యమైన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు దాఖలు చేసే హెబియస్ కార్పస్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అత్యవసరంగా విచారించి వ్యక్తి స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కాపాడారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తే సత్వర న్యాయం లభిస్తుందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారన్నారు. జస్టిస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దేశంలోనే తెలం గాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని సీజే ఆకాంక్షించేవారని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చారని ప్రసాద్ పేర్కొన్నారు. ఎర్రమంజిల్‌ను కూల్చి అక్కడ సచివాలయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చి, చారిత్రక కట్టడాన్ని రక్షించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తుచేశారని తెలిపారు. కష్టపడితేనే న్యాయవాదిగా గుర్తింపు: సీజే న్యాయవాద వృత్తిలో షాట్‌కట్స్ ఉండవని, కష్టపడిన వారికే మంచి గుర్తింపు లభిస్తుందని జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. యువ న్యాయవాదులు కష్టపడాలని, సీనియర్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో కూడా న్యాయమూర్తుల సహకారంతో కేసులను విచారించి ప్రజలకు సత్వర న్యాయం అందించామని తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ పనిచేయడం తనకెంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని వివరించారు. న్యాయమూర్తులతోపాటు హైకోర్టు రిజిస్ట్రార్లు, ఇతర న్యాయాధికారులు, తన కార్యాలయ సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, ఇతర న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోశ్‌రెడ్డి, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి అనుపమా చక్రవర్తి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
సుప్రీం నుంచి శుభ్ర పవనాలు
ప్రాథమిక హక్కులను సైతం హరించే దుర్ముహూర్త ఘడియలు వేగంగా పాలకులకే గాదు, న్యాయవ్యవస్థను కూడా ముసురుకుంటున్న దశలోనే కారు చీకటిలో కొంత కాంతిరేఖలా ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ధర్మాసనం నుంచి కొంత కొత్తగాలి వీచడం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొన ఊపిరితోనైనా బతికి ఉండటానికి తోడ్పడగల్గుతుందా? ఆ భరోసా భారత ప్రజాబాహుళ్యానికి కలగాలంటే, పాలకవర్గాలు రాజ్యాంగ చట్టానికి, ప్రకటిత సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉండాలి. పేద కార్మిక కర్షక వర్గాలకు మద్దుతుగా నిలిచే అభ్యుదయకర శక్తులపైన నిర్బంధ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి. వారిపైన మోపిన కేసులు ఎత్తివేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం వైఫల్యం చెందింది అనేంతలా వారిని (ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవి ధర్మాసనం) ప్రభావితం చేసిన అంశమేమిటో మాకు అంతుపట్టడం లేదు. తమ వారిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయ స్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? పైగా రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనట్లు పిటిషన్లు ఎవరూ పేర్కొనలేదు. ఆ ఏపీ హైకోర్టు న్యాయ మూర్తుల ధర్మాసనం ఆ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలి పోయాయని భావించడానికి అంతగా వారిని ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో మాకు అంతుపట్టడం లేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ‘స్టే’ ఇస్తు న్నాం. అలాగే రాజ్యాంగం వైఫల్యంపై రాష్ట్ర హైకోర్టు కేవలం ప్రశ్న మాత్రమే లేవనెత్తిందనీ, అవి ఆదేశాలు కావనీ ప్రతివాదుల తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. కానీ మీరు 29 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా, ఏ న్యాయ స్థానమైనా ఇలాంటి కేసుల్లో (హెబియస్) రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామంటూ ఉత్తర్వులు ఇవ్వడం చూశారా? ఏపీ హైకోర్టు ఉత్తర్వులు అత్యున్నత న్యాయస్థానమైన మాకు ఆందోళన కల్గిస్తున్నాయి!’’ – ఏపీ ప్రభుత్వ అప్పీలుపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నల పరంపర. సుమారు నాలుగేళ్ల తరువాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో తిరిగి వీస్తున్న చైతన్య పవనాలుగా తాజా పరిణామాలను భావించు కోవ చ్చునా?! ఎందుకంటే ఇటీవల కొందరు సునిశిత పరిశోధకులు, పరి శీలకులు, సుప్రీంకోర్టు ధర్మాసన చైతన్యంలో చాలాకాలం తర్వాత తిరిగి పొడసూపుతున్న పరిణామాలను రెండు దశలుగా విభజించి – ఒకటి, మాజీ ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహార్ (2017) బెంచ్ ఉన్నప్పటి దశగానూ, రెండు– మాజీ చీఫ్ జస్టిస్ గొగోయ్ అనంతర (2019) దశగానూ విశ్లేషించుతున్నారు. ఈ రెండు దశలను తులనాత్మ కంగా జల్లెడపట్టి జస్టిస్ ఖేహార్‌కు ముందున్న ప్రధాన న్యాయ మూర్తుల హయాం ఎంత గౌరవప్రదంగా ముగిసిందీ, క్రమంగా ఆ ఉన్నతస్థాయి నుంచి గొగోయ్ నేతృత్వ పతనదశ ఇటీవలి కాలం దాకా ఎలా కొనసాగుతూ వచ్చిందీ విశ్లేషిస్తూ వచ్చారు. వచ్చి, వచ్చి చీఫ్ జస్టిస్ అరుణ్ మిశ్రాతో (రిటైర్డ్) న్యాయవ్యవస్థలో పతనదశ తారా స్థాయికి ఎలా చేరేస్థితికి వచ్చిందో విచారించుకోవటం మొదలైంది. ఎందుకంటే, సుప్రీం చరిత్రలో బహుశా తొలిసారిగా న్యాయమూర్తులు తమకు ప్రమేయం ఉన్న కేసులపై తామే తీర్పులు చెప్పేసుకునే దశకు ఎదిగిపోయారన్నది ఒక బహిరంగ రహస్యంగా మారింది! న్యాయ వ్యవస్థలో ఈ పరిణామానికి దోహదం చేసినవారు కొందరు న్యాయ మూర్తులతో పాటు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన పాలకవర్గాలు కూడానని మరచిపోరాదు. ప్రభుత్వం, శాసనవేదిక, న్యాయవ్యవస్థల పరిధుల్ని, అధికారాల్ని స్పష్టంగా భారత లౌకిక రాజ్యాంగం నిర్వచించి విభజించినా– పాల నాధికారంలో ఉన్న రాజకీయులు తరచూ తమపైకి వచ్చిపడే అవినీతి కేసుల నుంచి, వారు జరిపే అక్రమ లావాదేవీల నుంచి బయటపడేం దుకు న్యాయవ్యవస్థపైన, న్యాయమూర్తులపైన ఒత్తిడి చేసి ప్రయో జనం పొందడం మానరు గాక మానరు. ఈ పరిణామం తిరిగి న్యాయ వ్యవస్థను తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి బలహీనంగా కనిపించే న్యాయ మూర్తులను ప్రభుత్వానికి, లేదా పాలకులకు లోబడి ఉండేట్లు చేస్తుంది. ఈ దశలోనే చైతన్యం గల, స్వతంత్రంగా వ్యవహరించగల నలుగురు సుప్రీం న్యాయమూర్తులు స్వతంత్ర భారత చరిత్రలో తొలి సారిగా జస్టిస్ చలమేశ్వర్ నాయకత్వంలో జరూరుగా సమావేశమై బహిరంగ పత్రిక గోష్ఠి నిర్వహించి జ్యుడీషియరీలో జరుగుతున్న బాగోతాన్ని కాస్తా నిర్భయంగా ఎండగట్టి, న్యాయవ్యవస్థ పరువు నిల్పడానికి ఒక చారిత్రక పాత్ర నిర్వహించాల్సి వచ్చింది. అయితే, తదనంతరం వచ్చిన ప్రధాన న్యాయమూర్తి తీరుపైనా, ఆయన రాజ్యసభ సీటు అంగీకరించడంపైనా విమర్శలు వచ్చాయి. చివరికి కొందరు న్యాయమూర్తులు ఏ స్థాయికి దిగజారిపోయారంటే, రాజ్యాంగం చట్టరీత్యా కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను, గ్యారంటీ చేసిన ప్రాథమిక స్వత్వాలన్నింటినీ బాహాటంగానో, నర్మగర్భంగానో హరించే రాజకీయ పాలనాశక్తులు శాసించే ఆదేశాలను పాటించి, న్యాయసూత్రాలను పక్కకు త్రోసిపుచ్చే దశకు చేరుకున్నారు. సరిగ్గా అలాంటి దుర్ముహూర్త ఘడియలు వేగంగా పాలకులకే గాదు, న్యాయవ్యవస్థను కూడా ముసురుకుంటున్న దశలోనే కారు చీకటిలో కొంత కాంతిరేఖలా ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ధర్మాసనం నుంచి కొంత కొత్తగాలి వీచడం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొన ఊపిరితోనైనా బతికి ఉండటానికి తోడ్పడగల్గుతుందా? ఎందుకంటే– ఆ భరోసా భారత ప్రజాబాహుళ్యానికి కలగాలంటే, పాలకవర్గాలు రాజ్యాంగ చట్టానికి, ప్రకటిత సెక్యులర్ (లౌకిక వ్యవస్థా రక్షణకు) విధానాలకు, పౌర బాధ్యతల అధ్యాయంలో శాసించిన శాస్త్రీయ ఆలోచనా స్రవంతిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉండాలి. ఆ భరోసా కలగడానికి పాలకశక్తులు– దేశ స్వాతంత్య్ర రక్షణకు, లౌకిక రాజ్యాంగ రక్షణకు బాధ్యత వహించి పేద మధ్యతరగతి కార్మిక, కర్షక, నిరుపేద వర్గాలతో మతాతీతంగా వ్యవహరిస్తున్న అభ్యుదయకర శక్తులకు అండదండలుగా నిలుస్తున్న ప్రజా ఉద్యమకారులు, రచయితలు, కవులపైన, స్వాతంత్య్రోద్యమ కార్యకర్తలపైన నిర్బంధ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి. అక్రమ కేసులు మోపి జైళ్లలో బంధించిన వారిని విడుదల చేయాలి. కేసులు ఎత్తివేయాలి. ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇక మీనమేషాలు లెక్కించకుండా తక్షణం ‘సుమోటో’గా స్వీకరించి, జస్టిస్ ఖన్నాలాగా (ఎమర్జెన్సీలో మొనగాడు న్యాయమూర్తిగా నిలిచి) వేలాదిమంది కార్యకర్తల విడుదలకు వంతెన నిర్మించి, అమెరికాలో సహితం కీర్తి పతాక సన్నివేశానికి చేరినట్టుగా నూతన అధ్యాయాన్ని రచించాలి! ఆ అవకాశాన్ని స్వతంత్ర శక్తిగా న్యాయస్థానం చేతికి అందివచ్చిన లౌకిక రాజ్యాంగ స్వభావాన్ని తు. చ. తప్పకుండా న్యాయస్థానాలు జారవిడుచుకోరాదు. అందుకు మొదటి గ్యారంటీ – నిర్ణయాలలో స్వతంత్ర శక్తిగా జ్యుడీషియరీ వ్యవహరించడమేనన్న రాజ్యాంగ నిర్దేశమే! ఆ శక్తి చొరవ లేకపోబట్టే వీమార్ (జర్మన్) జ్యుడీషియరీ చివరికి నాజీల పాలనకు లొంగిపో వలసి వచ్చింది. బహుశా ఈ చరిత్ర గుర్తుండబట్టే సుప్రసిద్ధ భారత న్యాయవాదులలో ఒకరైన ఎ.జి.నూరానీ ఒక సందర్భంలో, న్యాయవాద వృత్తి తొలిరోజుల్లో మరో వివాదాస్పద న్యాయమూర్తిని శక్తియుక్తులున్న ‘బార్’ అదుపాజ్ఞల్లో ఉంచగలిగినట్లయితే మనకు ఈ ఇబ్బందులు తప్పేవని అన్నారు. అమెరికా సుప్రీంకోర్టు ఆయన లాంటి జడ్జీలను అనుమతించి ఉండేదీ కాదు అన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.వర్మ ఉత్తరోత్తరా న్యాయమూర్తులుగా తప్పుడుమార్గం తొక్కబోయే జడ్జీలు ‘బార్’లో ప్రవేశించడం వల్లనే ధర్మాసనం ప్రతిష్ట కూడా పతనం అవుతుందని హెచ్చరించారని మరచిపోకూడదు. 1918లో బ్రిటిష్ జ్యుడీషియల్ కమీషన్ పరిశీలనకు ఒక హెబియస్ కార్పస్ పిటి షన్ తీర్పు కోసం వచ్చినపుడు మన జాతీయోద్యమ నాయకుల్లో ఒక రైన సి.ఆర్.దాస్ ఆ కేసు విచారణ సందర్భంలో జడ్జీ కటువైన వ్యాఖ్యకు ఆగ్రహించి ఇక మీరు ఈ కేసును అసలు విచారించనే కూడ దని జవాబిచ్చారట! అలాగే ప్రజల స్వేచ్ఛ స్వాతంత్య్రాలను హరించి దెబ్బతీసే చట్టాలను (1780 నుంచి 1919 దాకా); పత్రికలను అణచి వేసే నిర్బంధ చట్టాలను, ప్రెస్ యాక్ట్ లాంటి వలస పాలనా చట్టా లను ఖండిస్తూ క్రోఢీకరించి ప్రచురించిన ప్రసిద్ధ ఇంగ్లిష్ బారిస్టర్, మద్రాసు, కలకత్తా హైకోర్టులలో ప్రాక్టీస్ చేసిన ప్రసిద్ధుడు, జాతీయ కాంగ్రెస్ నాయకుల్లో ఒకరైన ఎర్డాలీ నోటన్ ఇలా అన్నారు: న్యాయ మూర్తి తన స్థానంలో ఉండి జారీ చేసే అధికారిక తాఖీదులను తానుగా కావాలని చేయడు; అనిష్టంగానే రిజర్వేషన్‌తో జారీ చేస్తాడు. వ్యక్తి నచ్చినందున అధికారం అతనికి అప్పనంగా చేతికి రాదు. అధి కారం ద్వారా పని అమలులోకి వస్తోంది. చట్టం నిర్వచించి నివేదిం చిన దాన్ని పౌరుడు తెలుసుకుంటాడు. అప్పుడే అతనికి తన హక్కులే మిటో తెలుస్తాయి. తన హక్కులేమిటి, వాటిని ఎలా పొందాలని చెప్పే చట్టాల్ని, ఆ హక్కుల్ని స్పష్టంగా నిర్వహించాలని చెప్పే విధానాన్ని తెలుసుకోనంతకాలం ఏ పౌరుడూ తన హక్కుల్ని రక్షించుకోలేడు. ఇంతకూ న్యాయం చెప్పు నాగిరెడ్డీ అంటే, నాకూ ఇద్దరు ‘పెళ్లాలే’ అన్నట్టుగా న్యాయం ఉండకూడదు. ఆఖరి తీర్పూ, మొదటి తీర్పూ కూడా. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
9 రాష్ట్రాలకు కొత్త సీజేలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా.. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేగా పదోన్నతి లభించింది. అలాగే మరో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ హిమా కోహ్లి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ సీజేగా బదిలీ అయ్యారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి రానుండగా.. ఏపీ ప్రస్తుత సీజే జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం సీజేగా బదిలీ అయ్యారు. అలాగే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి.. ఏపీ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. జస్టిస్ హిమా నేపథ్యం ఇదీ.. తెలంగాణ హైకోర్టుకు సీజేగా రానున్న జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీలో 1959 సెప్టెంబర్ 2న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బీఏ గ్రాడుయేట్ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. 1984లో లా పట్టా అందుకుని ఢిల్లీ బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా, న్యాయ సలహాదారుగా పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టు 29న పూర్తికాలం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా, నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ చైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్నారు. కరోనా పరీక్షల వెనుక ఆమె.. ఢిల్లీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడానికి ప్రయోగశాలలు పెంచడం, ఫలితాలు ఒకే రోజులో వచ్చేలా చేయడం వంటి ఆదేశాలు జస్టిస్ హిమా కోహ్లి ఇచ్చినవే. ప్రస్తుతం ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్‌పర్సన్‌గానూ ఆమె వ్యవహరిస్తున్నారు. న్యాయమూర్తిగా అధికారిక విధులు నిర్వర్తించడంతో పాటు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ఫోరమ్‌గా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంపై ఆమె ఆసక్తి కనబరుస్తారు. పర్యావరణ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ పాత్ర, కుటుంబ వివాదాల పరిష్కారంలోనూ ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా, జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కర్ణాటక హైకోర్టు నుంచి 2018 నవంబర్ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2019 ఏప్రిల్ 3న తెలంగాణ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూన్ 22న పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె చేపట్టిన బాధ్యతలు.. 2017 ఆగస్టు 8 నుంచి పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్‌కు సభ్యురాలుగా ఉన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రచురించే న్యాయ దీప్ ఎడిటోరియల్ కమిటీ సభ్యురాలుగా 7.5.2019 నుంచి ఉన్నారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ కమిటీ చైర్‌పర్సన్‌గా 2020 మార్చి 11 నుంచి ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మిడిల్ ఇన్‌కం గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ చైర్‌పర్సన్‌గా 2020 జూన్ 29 నుంచి ఉన్నారు. నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా 2020 జూన్ 30 నుంచి ఉన్నారు. బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు.. ప్రధాన న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తెలంగాణ ఉత్తరాఖండ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ సిక్కిం జస్టిస్ మహమ్మద్ రఫీఖ్ ఒడిశా మధ్యప్రదేశ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి సిక్కిం ఆంధ్రప్రదేశ్ సీజేలుగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు.. న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీ తెలంగాణ జస్టిస్ ఎస్.మురళీధర్ పంజాబ్, హర్యానా ఒడిశా జస్టిస్ సంజీబ్ బెనర్జీ కోల్కత్తా మద్రాస్ జస్టిస్ పంకజ్ మిత్తల్ అలహాబాద్ జమ్ముకశ్మీర్ జస్టిస్ సుధాంశు ధులియా ఉత్తరాఖండ్ గౌహతి బదిలీ అయిన న్యాయమూర్తులు న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి కోల్‌కతా ఆంధ్రప్రదేశ్ జస్టిస్ సంజయ్యాదవ్ మధ్యప్రదేశ్ అలహాబాద్ జస్టిస్ రాజేష్ బిందాల్ జమ్ము కశ్మీర్ కల్కత్తా జస్టిస్ వినీత్ కొఠారి మద్రాస్ గుజరాత్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ మధ్యప్రదేశ్ కర్ణాటక -
తెలంగాణ హైకోర్టు సీజేగా హిమ కోహ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా, నూతన న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా హిమ కోహ్లీ నియమితులయ్యారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమ కోహ్లీ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1979 లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్లో ‘లా’ పూర్తి చేశారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం) -
సీజేఐకి లేఖపై పిటిషన్లు మరో ధర్మాసనానికి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ బహిర్గతం కావడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్‌గౌడ్, స్వచ్ఛంద సంస్థ యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సునీల్ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. అయితే గతంలో తాను న్యాయవాదిగా ఉండగా వాద, ప్రతివాదుల్లో ఒకరి తరఫున ప్రాతినిధ్యం వహించినందున ప్రస్తుత కేసులో వాదనలు వినలేనని జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి సూచించిన మరో ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ లలిత్ ఆదేశించారు. -
చీఫ్ జస్టిస్ బెంచ్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల పిల్ బదిలీ
-
చీఫ్ జస్టిస్ బెంచ్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల పిల్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిల్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తెచ్చిన జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 52ఇ రిజర్వేషన్ పాలసీకి విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, రెగ్యులర్ రొటేషన్ చేసేంత వరకు గ్రేటర్ ఎన్నికలు నిర్వహించ వద్దని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టీస్ విచారిస్తారని తెలిపిన న్యాయవాది అభిషేక్ రెడ్డి.. పిల్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేశారు. రేపు ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలకు తొందరొద్దు -
సుప్రీంకోర్టుకు మేధావుల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుపైనే కాక ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టుకు మేధావుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 131 మంది మేధావులు లేఖ రాశారు. వీరిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకుర్ కూడా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల పక్షాన పనిచేస్తున్న ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు సరి కావని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రతిష్ట, న్యాయవ్యవస్థ నిష్పక్షపాత వైఖరిని దృష్టిలో ఉంచుకొని ఆయనపై చర్యలను నిలిపివేయాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. (బాకీలపై మరో మాట లేదు..) వారం రోజుల క్రితం ప్రశాంత్ భూషణ్ దేశంలో గత ఆరేళ్లలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కీలక పాత్ర పోషించారని ట్వీట్ చేశారు. అంతేకాక ఇక ప్రస్తుత సీజేఐ ఎస్ ఏ బాబ్డే ఆ మధ్య హార్లే డేవిడ్ సన్ బైక్‌ని నడిపారని.. ఆ సమయంలో హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారంటూ మరో ట్వీట్ చేశారు. కోర్టు లాక్డౌన్లో ఉండగా ఒక చీఫ్ జస్టిస్ ఇలా చేయవచ్చా అని ప్రశ్నించారు. దాంతో ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (బ్యాట్ పట్టిన సీజే బాబ్డే.. టాప్ స్కోరర్) -
మైలార్డ్ అనకండి.. ‘సర్’ చాలు
కోల్‌కతా: ఇప్పటి వరకు ఆచరణలో ఉన్న ‘మైలార్డ్’, ‘లార్డ్‌షిప్’ లాంటి సంబోధన తగదని, తనను ‘సర్’ అని మాత్రమే పిలిస్తే సరిపోతుందని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాక్రిష్ణన్ వ్యాఖ్యానించారు. బెంగాల్, అండమాన్‌లలోని న్యాయాధికారులందరూ తనను ‘సర్’ అనే సంబోధించాలని ఆయన సూచించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాయ్ చటోపాధ్యాయ.. బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని జిల్లా జడ్జీలకు, కింది కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్ చేసిన సూచనలను పంపారు. ఇకపై జిల్లా న్యాయాధికారులు, హైకోర్టులోని రిజిస్ట్రీ సిబ్బంది తనను ‘సర్’అని సంభోదించాలని చీఫ్ జస్టిస్ ఆకాంక్షించారు. (హైకోర్టు జడ్జికి కరోనా రావాలి: లాయర్) -
సేవా ఆణిముత్యం
కడప అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి బదిలీ అయిన గోకవరపు శ్రీనివాస్ విధుల్లో చేరినప్పటి నుంచి ‘మానవత’కు చిరునామాగా ఖ్యాతిగడించారు. 2017 మార్చిలో విధుల్లో చేరిన ఆయన న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్వహించి ‘సేవా ఆణిముత్యం’ అనిపించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే కోర్టు ఆవరణలో కార్పొరేషన్, రెవెన్యూ, ఆర్అండ్బీ, పోలీసుశాఖల సమన్వయంతో బురదగా ఉన్న నేలను మట్టితో చదును చేయించడం, బెంచీలను విస్తృతంగా ఏర్పాటు చేయించారు. నూతన జిల్లా కోర్టు భవనాల సముదాయ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు అయ్యేందుకు తమవంతుగా కృషి చేశారు. జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 10వేల లోపువారి దరఖాస్తు దారులను పరిశీలించి వారిలో 18,165 మందిని లబ్ధిదారులుగా గుర్తించి, రూ. 13,18,6,785 మంజూరయ్యేందుకు తమ న్యాయమూర్తులు సిబ్బందితో కలిసి అహర్నిశలు శ్రమించారు. 2018–19 సంవత్సరంలో ప్రజలకు కేసుల పరిష్కారం, సేవా కార్యక్రమాలకుగాను నేషనల్ లీగల్ లిటరసీ సెల్( ఎన్ఎల్ఎస్ఏ) వారు గుర్తించి రెండు ఉత్తమ అవార్డులను అందజేశారు. గత ఏడాది నవంబర్ 9న వీటిని నూఢిల్లీలో అందజేశారు. జిల్లా వ్యాప్తంగా డీఎల్ఎస్ఏ, పర్మినెంట్ లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు తమ వంతు కృషి చేశారు. బాధితులెవరైనా సరే న్యాయం కోసం వస్తే వారికి సకాలంలో, సత్వరంగా కేసుల పరిష్కారం చేయడంతో పాటు సమయం, డబ్బులు వృథా కాకుండా చేయగలిగారు. జిల్లా వ్యాప్తంగా బాధితులు ఒకదశలో పోలీస్స్టేషన్ల మెట్లెక్కడంకంటే.. జిల్లా కోర్టు మెట్లెక్కడం ఎంతో ప్రయోజనం చేకూర్చిందనే స్థాయికి తీసుకుని వచ్చారు. ట్రాన్స్‌జెండర్స్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, కాంటాక్ట్ ఉద్యోగులకు తమ వంతుగా సేవచేశారు. మొత్తంమీద ఒకవైపు న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈయన సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నారు. కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్థానం నుంచి విశాఖపట్నంలోని పరిశ్రమల ట్రిబ్యునల్ కం ప్రిసైడింగ్ ఆఫీసర్ లేబర్‌కోర్టు చైర్మన్‌గా గోకవరపు శ్రీనివాస్ బదిలీ ఆయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పురుషోత్తంకుమార్: జిల్లాకు ప్రధానన్యాయమూర్తిగా ఏపీ హైకోర్టులో రిజిష్ట్రార్‌గా పనిచేస్తున్న సీ. పురుషోత్తం కుమార్ నియమితులయ్యారు. ఆయన త్వరలో విధుల్లో చేరనున్నారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తిగా విధులను నిర్వహిస్తున్న బి. సత్యవెంకట హిమబిందును విశాఖపట్నం సీబీఐ కేసులకు సంబంధించి ప్రిన్సిపల్ జడ్జిగా బదిలీ అయ్యారు. అలాగే జిల్లాలోని రాజంపేట కోర్టులో మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న సీ. సత్యవేణి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని మహిళల నేరాల, లైంగిక నేరాలను పరిష్కరించే స్పెషల్ కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. రాజంపేటలోని మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా విశాఖపట్నం ఏడవ జిల్లా అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్న ఆర్‌వివిఎస్ మురళీకృష్ణ బదిలీ అయ్యారు. -
పన్ను వివాదాలకు సత్వర పరిష్కారం చూపాలి
న్యూఢిల్లీ: పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని, వివాదంలో ఉన్న నిధులకు విముక్తి కలుగుతుందన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. దేశ వనరుల సమీకరణలో పన్నుల న్యాయ వ్యవస్థ పాత్ర కీలకమైనదని పేర్కొంటూ, పెండింగ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ 79వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. దీనికి చీఫ్ జస్టిస్ హాజరై మాట్లాడారు. పరోక్ష పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు, సీఈఎస్‌టీఏటీలోని పెండింగ్ కేసుల్లో 61%(1.05 లక్షల కేసులకు) గత రెండేళ్ల కాలంలో తగ్గించామని చెప్పారు. పన్నుల ఎగవేతను తోటి పౌరులకు చేసే సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. అదే విధంగా ఏకపక్షమైన, అధిక పన్ను విధింపు అన్నది ప్రభుత్వం ద్వారా సామాజిక అన్యాయానికి దారితీస్తుందన్నారు. తేనెటీగలు పువ్వులకు హాని చేయకుండా మకరందాన్ని తోడుకున్నట్టుగానే, ప్రజల నుంచి పన్నులను రాబట్టాలని సూచించారు. న్యాయ ప్రక్రియలోనూ ఏఐ న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ (ఏఐ) అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ప్రస్తావించారు. ముఖ్యంగా వేగవంతమైన పరిష్కారం, ఒకే తరహా కేసుల పునరావృతం, డాక్యుమెంట్ల నిర్వహణలో ఏఐ అవసరపడుతుందన్నారు. అదే సమయలో ఏఐ అన్నది మానవ ప్రమేయాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదన్నారు. -
నిర్భయ కేసులో మలుపు
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఆర్ బానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, నిర్భయ తల్లి తరఫున విచారించిన లాయర్లలో తన బంధువు ఉన్నారని, అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ బాబ్డే ప్రకటించారు. దీంతో బుధవారం మరో బెంచ్ విచారణ చేపట్టనుంది. మరో కేసు.. కేసులో దోషిగా తేలిన రాజకీయనేతలు, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నవారు రాజకీయ పార్టీలకు ఎలా నేతృత్వం వహిస్తారంటూ సుప్రీంలో దాఖలైన పిల్ విచారణ నుంచీ సీజేఐ తప్పుకున్నారు. లాయర్ అయిన జస్టిస్ బాబ్డే కుమార్తె ఇదే అంశంపై మరో విచారణ బెంచ్ ఎదుట వాదనలు వినిపించడంతో ఆయన కేసు విచారణ నుంచీ తప్పుకున్నారు. -
కేసులు సత్వరం పరిష్కరించాలి
సాక్షి, కరీంనగర్: న్యాయస్థానాల్లో కేసులు త్వరగా పరిష్కరించాలని, ఇందుకు న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు, కక్షిదారుల సహకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్‌చౌహాన్ అన్నారు. కరీంనగర్ కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈఫైలింగ్ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు, కరీంనగర్ పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడారు. కోర్టు భవనాలు పటిష్టంగా తయారు చేస్తున్నామన్నారు. కోర్టుల్లో చక్కని వాతవరణం నెలకొల్పి, కోర్టుకు వచ్చేవారికి ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ కోర్టు తెలంగాణలో ఉన్న అన్ని కోర్టులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ దృష్టి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టులో అన్ని సదుపాయాలు కల్పిస్తే కోర్టుకు వచ్చే న్యాయవాదులు, కక్షిదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి కావాల్సిన పరిజ్ఞానం అభివృద్ధికి న్యాయమూర్తులకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జనవరిలోగా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా న్యాయవాదుల పరిజ్ఞానం అభివృద్ధికి వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా చట్టాలపై లోతైన అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. కరీంనగర్లో కోర్టులో 762 కేసులు పెండింగ్‌లో ఉండగా మరో రెండు కోర్టుల్లో 80, 22 కేసులు దాదాపు 10 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అనంతరం కరీంనగర్ పోర్ట్‌ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. నిబంధనల మేరకే న్యాయమూర్తులను నియమించడం జరుగుతుందన్నారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎప్పుటికప్పుడు పరిష్కారం చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో మార్పు అనేది కింది స్థాయి నుంచి రావాలని, మన చేతిలో ఉన్న చిన్నచిన్న అభివృద్ధి పనులు మనం చేసుకుంటే తప్పుకాదని వివరించారు. హైకోర్టు మరో జడ్జి పి.నవీన్‌రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు అనందకరమన్నారు. త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ కరీంనగర్లో కోర్టులో నూతన మార్పులు అందరి సహకారంతో చేయగలిగామని, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ కోర్టు భవనాలను ప్రముఖ కంపెనీలకు కాంట్రాక్టు అప్పగించాలని అప్పుడే దీర్ఘకాలికంగా మన్నిక ఉంటుందని, సంబందిత కంపెనీలు కూడా బాధ్యతగా పర్యవేక్షిస్తారని సూచించారు. ప్రభుత్వ విభాగాలకు అప్పగిస్తే కట్టి వదిలేస్తున్నారని తర్వాత పట్టించుకోవడం లేదని తెలిపారు. అనంతరం కేసుల విషయంలో పలు సమస్యలను హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోర్టు ఆవరణలో న్యాయవాదులకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, ఫారెస్ట్ ఛీప్ కన్జర్వేటర్ అక్బర్, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీలు సింధూశర్మ, రాహుల్‌హెగ్డే వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయస్థానాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తికి ఘనస్వాగతం... ఉదయం కరీంనగర్ కోర్టుకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌కు జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి ఆధ్వర్యంలో కలెక్టర్సర్పరాజ్ అహ్మద్, కరీంనగర్ పోలీసు కమి షనర్ వీబీ.కమలాసన్ రెడ్డి, వరంగల్ రేంజ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తర్వాత పూర్ణకుంభ స్వాగ తంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు, చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టు భవనం, మిని పార్కు ప్రారంభించారు. కోర్టు ఆరవణలో హైకోర్టు న్యాయమూర్తులు బస్టిస్ కోదండరాం, పి,నవీన్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన ఈ–ఫైలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. కరీంనగర్ ది బెస్ట్... కరీంనగర్ కోర్టును ది బెస్ట్ కోర్టుగా ఆదర్శంగా నిలుపాలని ఆకాంక్షిస్తూ చక్కటి ఆహ్లాదకరమైన వాతావారణం ఏర్పాటు చేసిన జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌తోపాటు ఫారెస్ట్ అధికారులపై ప్రశంసలు కురిపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు కమిషనర్, సిబ్బందిని అభినందించారు. బార్ అసోసియేషన్ సభ్యులు చక్కటి క్రమశిక్షణతో ఉన్నారని చీఫ్ జస్టిస్ కితాబునిచ్చారు. అనంతరం కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి చీఫ్ జస్టిస్ శాలువాలు కప్పి అభినందించారు. న్యాయవాదులు అంకితభావంతో పనిచేయాలి : హైకోర్టు జడ్జి కోదండరామ్ కమాన్‌చౌరస్తా(కరీంనగర్): న్యాయవాదులు వృత్తిపై అంకిత భావంతో పనిచేయాలని, సమాజంలో తమ బాధ్యత తెలుసుకుని ఎంచుకున్న పనిలో నైపుణ్యత సాధించి దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ హైకోర్టు జడ్జి, కరీంనగర్ జిల్లా ఫోర్ట్ ఫోలియో జడ్జి, జస్టిస్ కోదండరామ్ అన్నారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా న్యాయవాద పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ లాపై శనివారం ఉదయం నిర్వహించిన వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం కంటే ఎన్నో దేశాలు వెనుకబడి ఉన్నాయని, చిన్నదేశాల వారు ఎంతో అంకిత భావంతో దేశంపై ప్రేమతో ఉండడం వల్లనే సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. దేశం నాకు ఏం ఇచ్చిందని కాదని దేశానికి నేను ఏం చేయాలో ఆలోచించాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ , సీనియర్ న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాల వివరాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని, ప్రత్యేక రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి రెవెన్యూ చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. సమావేశంలో న్యాయవాద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కరూర్ మోహన్, ప్రధాన కార్యదర్శి సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి సత్యనారాయణరావ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణార్జునచారి, వేణుగోపాల్, బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్, కరీంనగర్ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది కేవీ వేణుగోపాల్‌రావు, వివిధ బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ జితేంద్రకుమార్
-
ఏపీ హైకోర్టు తొలి సీజేగా జీకే మహేశ్వరి ప్రమాణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ పురుషోత్తం, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో సీజే జేకే మహేశ్వరి,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. జస్టిస్ మహేశ్వరి నేపథ్యం.. జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్ 28న పదవీ విరమణ చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణం
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులైన జేకే మహేశ్వరి రేపు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషన్ హరిచందర్ సీజేగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న సీజే ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి (జనవరి 1, 2019) నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. గత 9 నెలలుగా ఏసీజేగా ఆయన విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి సీజే నియామకంతో జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు. జస్టిస్ మహేశ్వరి నేపథ్యం.. జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్ 28న పదవీ విరమణ చేస్తారు. -
ఏపీ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జస్టిస్ మహేశ్వరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టులో నంబర్ టూ స్థానంలో ఉన్న జస్టిస్ మహేశ్వరిని పదోన్నతిపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేయడం తెలిసిందే. దీనికి ప్రధాని మోదీ ఆమోద ముద్ర వేయడంతో జస్టిస్ మహేశ్వరి నియామక ఫైలు రాష్ట్రపతికి చేరింది. తాజాగా రాష్ట్రపతి సైతం ఆ నియామకానికి ఆమోదముద్ర వేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీజేగా జస్టిస్ మహేశ్వరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్రం తన నోటిఫికేషన్లో పేర్కొంది. జస్టిస్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం తేదీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దసరా సెలవుల తర్వాతే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశముందని హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి (జనవరి 1, 2019) నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. గత 9 నెలలుగా ఏసీజేగా ఆయన విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి సీజే నియామకంతో జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు. జస్టిస్ మహేశ్వరి నేపథ్యమిదీ.. జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్ 28న పదవీ విరమణ చేస్తారు. -
త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ ఖురేషి
న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ఎ.ఎ. ఖురేషి పేరును సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా ప్రతిపాదించింది. గతంలో ఆయన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ కొలీజియం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటిపై ఈ నెల 5వ తేదీన జరిగిన కొలీజియం భేటీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఖురేషిని మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ఎంపిక చేస్తూ మే 10వ తేదీన కొలీజియం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై కేంద్రం ఆగస్టులో పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదులు త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ ఎ.ఎ. ఖురేషి పేరును తాజాగా కేంద్రం పరిశీలనకు పంపింది. అయితే, జస్టిస్ ఎ.ఎ. ఖురేషి ఆదేశాల మేరకే 2010లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పోలీసులు అరెస్టు చేశారని, తాజా పరిణామానికి అదే కారణమని గుజరాత్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రెసిడెంట్ యతిన్ ఓజా అనుమానం వ్యక్తం చేశారు. జస్టిస్ తహిల్ రమణి రాజీనామా ఆమోదం తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్ రమణి రాజీనామా ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది. తనను మేఘాలయ కోర్టుకు బదిలీచేయడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ తన రాజీనామా చేశారు. -
గుజరాత్ హైకోర్టు సీజేగా విక్రమ్‌నాథ్
న్యూఢిల్లీ: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విక్రమ్‌నాథ్ అలహాబాద్ హైకోర్టులో జడ్జీగా పనిచేస్తున్నారు. జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఏప్రిల్‌లో సిఫార్సు చేసింది. అయితే ఈ నియామకానికి మోకాలడ్డిన కేంద్రం ఆయన పేరును తిప్పిపంపింది. దీంతో జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం ఆగస్టు 22న తీర్మానించింది. దీంతో కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గుజరాత్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి దాదాపు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. -
మద్రాస్ హైకోర్టు సీజే రాజీనామా
సాక్షి, చెన్నై: మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్రమణి తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు శనివారం ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. తనను మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆమె చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజీయం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తనన మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆగస్ట్ 28న సీజే రమణి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను కోరారు. అయితే ఆమె అభ్యర్థనను సుప్రీం తొసిపుచ్చింది. -
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా ఆయన పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగపరమైన కేసులు వాదించడంలో మహేశ్వరికి విశిష్ట అనుభవం ఉంది. -
కేంద్రం వద్ద జడ్జీల పెంపు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంపుదల చేయాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ వెల్లడించారు. దీనిపై కేంద్రం త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీతోపాటు 24 నుంచి 42 మందికి సంఖ్య పెంపు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని గురు వారం హైకోర్టు ప్రధాన భవనం వద్ద సీజే జెండా ఎగుర వేసి.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించడంలో ఎందరో మహనీయుల త్యాగాలున్నాయన్నారు. హైకోర్టు లో సాంకేతికతను పుణికిపుచ్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, హైకోర్టును పేపర్‌లెస్ చేయబోతున్నట్లు తెలిపారు. తీర్పు వెలువడిన ఒకట్రెండు రోజుల్లో తీర్పుల ప్రతులు ఆన్లైన్లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అందరికీ న్యాయ ఫలాలు అందించడంలో కోర్టుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్య క్షుడు సూర్యకరణ్‌రెడ్డి మాట్లాడారు. పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు సీజే బహుమతులు ప్రదానం చేశారు. -
తెలంగాణ హైకోర్టు సీజేగా రాఘవేంద్రసింగ్ చౌహన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్.. జస్టిస్ చౌహాన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ రామసుబ్రమణియన్
సాక్షి, సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ రామసుబ్రమణియన్ పదోన్నతిపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయ శాఖ నియమించిన విషయం విదితమే. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ కావడంతో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ను నియమించాలని మే 10న సుప్రీం కోర్టు కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. -
ఏసీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ఆయన్ను ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. దీంతో జస్టిస్ చౌహాన్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టులో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ చౌహాన్ ఏసీజేగా నియమితులయ్యారు. ఏప్రిల్ 2న జస్టిస్ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే జస్టిస్ చౌహాన్ ఇక్కడ ఏసీజేగా బాధ్యతలు చేపడతారు. రాజస్తాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్ గత ఏడాది నవంబర్ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. -
తండ్రికి తగ్గ తనయుడు...!
-
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ కూడా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా కొనసాగుతారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ నియామకాలు జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. (ఇక ఎవరి హైకోర్టు వారిదే) కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న రాధాకృష్ణన్ జన్మించారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్ లా కాలేజీ నుంచి లాయర్ పట్టా సాధించారు. తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్ లాయర్‌గా పేరుగాంచిన రాధాకృష్ణన్ రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్‌లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా కొనసాగనుంది. దీనికి చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ను కొనసాగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. -
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుకానున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఏపీ హైకోర్టులో సీనియర్ అయిన ప్రవీణ్‌కుమార్‌ను చీఫ్ జస్టిస్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుంది. ఇదే రోజు నుంచి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. (జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు) 1961 ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ప్రవీణ్‌కుమార్ జన్మించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదువుకున్నారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్లో కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నిజాం కళాశాలలో బీఎస్సీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి లా పట్టా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో 1986, ఫిబ్రవరి 28న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సి.పద్మనాభరెడ్డి వద్ద న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. క్రిమినల్, రాజ్యాంగ సంబంధ కేసులు ఎక్కువగా వాదించారు. 2012, జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013, డిసెంబర్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. -
ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ రమేశ్ రంగనాథన్
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ను ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం రెండు రోజుల కిందట ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రస్తుతం హైకోర్టులో నంబర్ 2గా కొనసాగుతున్నారు. 2016 జూలై 30 నుంచి 2017 జూన్ 30 వరకు ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అయిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది, 1985లో ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2000–2004 వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2005 మేలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. -
కశ్మీర్ హైకోర్టు మహిళా సీజేగా జస్టిస్ గీత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ శనివారం కశ్మీర్ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వోహ్రా జస్టిస్ మిట్టల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ప్రస్తుత, పదవీ విరమణ పొందిన హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు హాజరయ్యారు. 1981లో జస్టిస్ మిట్టల్ న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించారు. 2004 జూలై 16న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు గీత ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన జడ్జిగా ఉన్నారు. -
‘శబరిమల’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన అంశంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ప్రాతిపదికన మహిళలకు ప్రవేశాన్ని మీరు (ఆలయ అధికారులు) నిరాకరిస్తారు..? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..ప్రజల కోసం ఆలయాన్ని తెరిచారంటే ఎవరైనా అందులోకి వెళ్లవచ్చ’ని పేర్కొన్నారు. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది. శబరిమల ఆలయంలో మహిళలను ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అని కేరళ మంత్రి కే సురేంద్రన్ పేర్కొన్నారు. తమ వైఖరిని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఇక సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా దాన్ని అంగీకరిస్తామన్నారు. గత ఏడాది అక్టోబర్ 13న ఈ పిటిషన్‌పై విచారణను సర్వోన్నత న్యాయస్ధానం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. -
రాజ్‌భవన్‌లో జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
-
ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. హైకోర్టు 93వ చీఫ్ జస్టిస్‌గా(ఉమ్మడి హైకోర్టుకు రాధాకృష్ణన్ 4వ సీజే) తాజాగా ఆయన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ రాధాకృష్ణన్‌చే సీజేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాధాకృష్ణన్ గురించి... 1959 ఏప్రిల్ 29న తొట్టథిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ జన్మించారు. కర్నాటక కేజీఎఫ్ లా కాలేజి నుంచి ఆయన ఎల్ఎల్బీ చేశారు. 2004లో కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2017 నుంచి ఛత్తీస్గడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు. -
తెలంగాణ-ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్
-
ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియా మకానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశముందని వెల్లడించాయి. అలాగే పట్నా హైకోర్టులో జడ్జీగా ఉన్న అజయ్ కుమార్ త్రిపాఠీని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను సిఫార్సు చేయగా, తాజాగా కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. -
నేడు జస్టిస్ చలమేశ్వర్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల్లో ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారంతో ఆయనకు 65 ఏళ్లు పూర్తవుతున్నాయి. జస్టిస్ చలమేశ్వర్ సుమారు ఏడేళ్లు సుప్రీంకోర్టులో జడ్జీగా విధులు నిర్వర్తించారు. తన కోసం వీడ్కోలు సమావేశం నిర్వహించొద్దని ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు ఇది వరకే విజ్ఞప్తి చేశారు. ముక్కుసూటి మనిషిగా పేరొందిన చలమేశ్వర్ పలు చారిత్రక తీర్పులు వెలువరించిన బెంచ్‌లలో సభ్యుడిగా పనిచేశారు. జనవరి 12న జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కలసి జస్టిస్ చలమేశ్వర్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కేసులను కేటాయిస్తున్న తీరును తప్పుపట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని చారిత్రక తీర్పునిచ్చిన 9 మంది జడ్జీల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ పేరును సుప్రీం జడ్జి పదవికి ప్రతిపాదించిన ఐదుగురు సభ్యుల కొలీజియంలోనూ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి అత్యున్నత స్థానానికి.. 1953, జూన్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, పెద్ద ముత్తెవి గ్రామంలో జన్మించిన చలమేశ్వర్..మచిలీపట్నంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. చెన్నైలోని లయోలా కళాశాలలో బీఎస్సీ(భౌతికశాస్త్రం) అభ్యసించారు. 1976లో విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 1999లో ఏపీ హైకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందా రు. 2007లో గౌహతి హైకోర్టు సీజేగా, 2010లో కేరళ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. -
నిబంధనల మేరకే సీజేఐ ఎంపిక
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తన తర్వాత ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తారని.. అనంతరం కార్యనిర్వాహక వ్యవస్థ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రా పదవీ కాలం అక్టోబర్ 2న ముగియనున్న నేపథ్యంలో.. సీనియర్ అయిన రంజన్ గొగోయ్‌కు సీజేఐ పదవి దక్కుతుందా అన్న ప్రశ్నకు రవిశంకర్ ఈ సమాధానమిచ్చారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసెస్ (ఏఐజేఎస్) విషయంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య భేదాభిప్రాయాలున్న విషయాన్ని అంగీకరిస్తూనే.. కిందిస్థాయి కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికలోనూ ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా.. పలు సంస్థలు భారతీయుల డేటాను దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. వీరిపై కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై ఇప్పటికే ఫేస్బుక్ క్షమాపణలు చెప్పిందని.. కేంబ్రిడ్జ్ అనలిటికా నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌ను రవిశంకర్ సమర్థించుకున్నారు. 121 కోట్ల మంది భారతీయులకు కేంద్ర పథకాల లబ్ధిని అందించడంలో ఆధార్ కీలకమన్నారు. ఆధార్ వ్యవస్థను మరింత పకడ్బందీగా మారుస్తున్నట్లు ఆయన చెప్పారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వాలని సీనియర్ మహిళా నేతలైన సోని యా గాంధీ, మాయావతి, మమత బెనర్జీలను మంత్రి కోరారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా స్పందిం చాల్సిన అవసరం ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరస్తులపై కఠినంగా వ్యవహరించేలా చట్టాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. -
జస్టిస్ జోసెఫ్ పేరు మళ్లీ కేంద్రానికి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు సిఫారసు చేయాలనీ, వారి పేర్లతోపాటే జస్టిస్ జోసెఫ్ పేరును కేంద్రానికి పంపాలని కొలీజియం శుక్రవారం తీర్మానించింది. ఏపీæ–తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, రాజస్తాన్, కలకత్తా హైకోర్టుల న్యాయమూర్తుల పేర్లూ సిఫార్సుచేయొచ్చని సమాచారం. ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై నిర్ణయించేందుకు సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల కొలీజియం మే 16న సాయంత్రం భేటీ కానుంది. ఇదీ నేపథ్యం.. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియమించాలని కొలీజియం ఈ ఏడాది జనవరిలో సిఫారసు చేయగా, కేంద్రం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సిఫార్సు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం అప్పట్లో సుప్రీం జడ్జీలను కోరింది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండటానికి అవసరమైన ప్రమాణాలు, అనుభవం జస్టిస్ జోసెఫ్‌కు లేవనీ కొలీజియం సిఫారసును కేంద్రం తిరస్కరించింది. తర్వాత జస్టిస్ జోసెఫ్ విషయంపై చర్చించేందుకు కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ చలమేశ్వర్ సీజేఐకి మే 9న లేఖ రాయగా కొలీజియం శుక్రవారం భేటీ అయ్యి పై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జోసెఫ్ పేరును తిరస్కరిస్తూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లేవనెత్తిన అన్ని అంశాలతో జస్టిస్ చలమేశ్వర్ విభేదించారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఒకసారి తిరస్కరించాక రెండోసారి కూడా కొలీజియం అదే న్యాయమూర్తి పేరునే సిఫారసు చేస్తే మరోసారి తిరస్కరించే అవకాశం కేంద్రానికి లేదు. కొలీజియం సిఫారసులను ఆమోదించి ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాల్సిందే. -
నేడు కొలీజియం భేటీ!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరోసారి ప్రతిపాదించేందుకు నేడు సుప్రీం కొలీజియం సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఈ అంశంపై కొలీజియం సభ్యుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆ నేపథ్యంలో నేడు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా కొలీజియాన్ని సమావేశపర్చవచ్చని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. మరోవైపు అత్యవసరంగా కొలీజియాన్ని సమావేశపర్చాలని కోరుతూ సీజేఐకు సుప్రీంలోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ జే.చలమేశ్వర్ బుధవారం లేఖ రాశారు. జస్టిస్ జోసెఫ్ పేరును పునఃపరిశీలించాలంటూ కొలీజియా నికి ప్రతిపాదనల్ని ఏప్రిల్ 26న కేంద్రం తిప్పిపంపిన సంగతి తెలిసిందే. గతంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలకు ప్రతిపాదనలు అనుగుణంగా లేదని, అత్యున్నత న్యాయవ్యవస్థలో ఇప్పటికే కేరళ నుంచి తగిన ప్రాధాన్యం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీనియారిటీ జాబితాలో జస్టిస్ జోసెఫ్ కంటే అనేక మంది ముందు వరుసలో ఉన్నారని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘జనవరి 10న జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కొలీజియానికి సిఫార్సు చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఆయన పేరును సుప్రీం జడ్జీగా పునరుద్ఘాటిస్తున్నాను’ అని లేఖలో జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ జోసెఫ్‌కు పదోన్నతిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు లేఖలో జస్టిస్ చలమేశ్వర్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 22న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చలమేశ్వర్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా కొలీజియం బుధవారం సమావేశమవుతుందని భావించినప్పటికీ.. జస్టిస్ చలమేశ్వర్ సెలవులో ఉండటం వల్ల జరగలేదని తెలుస్తోంది. కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్లు సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి ప్రతిపాదించేందుకు తాను అనుకూలంగా ఉన్నానని జస్టిస్ జోసెఫ్ కురియన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
సీజేఐ నియామకంలో మార్పులు అవసరం: కట్జూ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న నిబంధనను పక్కనపెట్టాలని.. అది లోపభూయిష్ట విధానంగా ఇప్పటికే రుజువైందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. ‘విదర్ ఇండియన్ జ్యుడీషియరీ’ పేరుతో రాసిన పుస్తకంలో ఆయన పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ‘సుప్రీం కోర్టులోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి నిజాయితీపరుడైనా.. అతను అంత సామర్థ్యమున్న వ్యక్తి కాకపోవచ్చు. అప్పుడు అతన్ని పక్కనపెట్టి సీనియారిటీలో తరువాతి స్థానంలో ఉన్న న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్‌గా నియమించాలి’ అని మార్కండేయ కట్జూ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. -
రేపు సుప్రీం కొలీజయం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును మరోసారి సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కొలీజియం మళ్లీ ప్రతిపాదనలు పంపినా కేంద్రం వాటిని ఆమోదించకపోవచ్చని సుప్రీం వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవచ్చని చెబుతున్నారు. -
‘కేసుల కేటాయింపు’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపు (రోస్టర్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలన్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. కేసుల కేటాయింపు బాధ్యతను ఐదుగురు జడ్జీల కొలీజియంకు అప్పగించాలని కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఫలానా కేసు తనకు కేటాయించలేదని లేదా ఎందుకు కేటాయించరంటూ కొందరు జడ్జీలు అసంతృప్తికి గురయిన సందర్భాలు కూడా హైకోర్టుల్లో ఉన్నాయని విచారణ సందర్భంగా జడ్జి సిక్రి అన్నారు. పిటిషనర్ తరఫున దుశ్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. సున్నితమైన కొన్ని కేసుల బాధ్యతను కొన్ని బెంచ్‌లకే అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ‘మాస్టర్ రోస్టర్’గా సీజేఐకు అపరిమిత అధికారం ఉన్నట్లు కాదని తెలిపారు. సుప్రీంజడ్జిగా ఇందూ ప్రమాణం సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా(61) సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె రాకతో సుప్రీంజడ్జీల సంఖ్య 25కు చేరుకుంది. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. సుప్రీం చరిత్రలో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జీలు పనిచేయడం ఇది మూడోసారి. -
కొలీజియం సిఫార్సులు తిరస్కరణ
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు, కేంద్రప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్(59)ను నియమించాలని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని సుప్రీంను కోరింది. కొలీజియం ప్రతిపాదనలు సుప్రీంకోర్టు విధించిన పరిమితులకు లోబడి లేవని, సుప్రీంకోర్టులో కేరళ నుంచి ప్రాతినిధ్యం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ జోసెఫ్ కన్నా అనేకమంది హైకోర్టు సీజేలు, సీనియర్ జడ్జీలు సీనియారిటీలో ముందున్నారని, కొలీజియం సిఫార్సులు సముచితం కాదని పేర్కొంది. సిఫార్సుల్ని తిప్పిపంపడానికి కారణాల్ని కొలీజియంకు తెలియచేస్తూ సీజేఐ జస్టిస్ మిశ్రాకు న్యాయ శాఖ నోట్ పంపింది. జస్టిస్ జోసెఫ్ పేరును పునః పరిశీలించాలన్న ప్రతిపాదనను రాష్ట్రపతి, ప్రధాని ఆమోదించారని పేర్కొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కొలీజియం చీఫ్‌గా ఉన్న సీజేఐ జస్టిస్ మిశ్రా మద్దతు లభించింది. ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినప్పటికీ జోసెఫ్ పేరును తిరస్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థకు హక్కు ఉందన్నారు. కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. జస్టిస్ జోసెఫ్ పేరును మరోసారి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు, సుప్రీం న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకాన్ని ఖరారు చేస్తూ గురువారం ఉదయం న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా, జస్టిస్ జోసెఫ్‌లను సుప్రీం న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ జోసెఫ్ పేరును ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. మరోసారి ఆయన పేరును కొలీజియం న్యాయ శాఖకు సిఫార్సు చేయవచ్చు. ప్రమాణాల మేరకే తిరస్కరించాం: కేంద్రం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో ఒకరికి మాత్రమే ఆమోద ముద్ర వేయడంపై కేంద్ర ప్రభుత్వం వివరణిస్తూ.. ‘సుప్రీం సిఫార్సుల్ని వేరు చేసి చూసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. వివిధ హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాల సమయంలోను, ఇతర కేసుల్లోను అలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియామకానికి చేసిన సిఫార్సులు సుప్రీం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి లేవు. న్యాయవ్యవస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లోనే జడ్జీల నియామకానికి నిబంధనలు, ఇతర ప్రమాణాల్ని ఏర్పాటు చేశారు. వాటిని మేం పరిగణనలోకి తీసుకున్నాం’ అని సీజేఐకు పంపిన ఆరు పేజీల లేఖలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కొలీజియం అనుమతి లేకుండా సిఫార్సుల్ని వేరు చేయకూడదని 2014లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోథా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ సమయంలో మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియంను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం చేసిన సిఫార్సుల్ని మోదీ ప్రభుత్వం తిరస్కరిస్తూ మిగతా పేర్లకు ఆమోదం తెలిపింది. సీనియారిటీది ప్రధాన పాత్ర.. సుప్రీం న్యాయమూర్తి పదవికి జస్టిస్ జోసెఫ్ కంటే అర్హులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయమూర్తులు ఉన్నారని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీం న్యాయమూర్తుల నియామకంలో సీనియారిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందని, హైకోర్టు జడ్జీల నియామకంలోను సీనియారిటీని తప్పకుండా పాటిస్తున్నారని తెలిపింది. ‘దేశంలోని అన్ని హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే.. జస్టిస్ జోసెఫ్ 42వ స్థానంలో ఉన్నారు. జస్టిస్ జోసెఫ్ కంటే వివిధ హైకోర్టుల్లో 11 మంది ప్రధాన న్యాయమూర్తులు సీనియారిటీలో ముందున్నారు. జస్టిస్ జోసెఫ్ సొంత హైకోర్టు కేరళ. ఆ రాష్ట్రం నుంచి సుప్రీం కోర్టు, ఇతర హైకోర్టుల్లో తగిన ప్రాతినిధ్యం ఉంది. సుప్రీంలో కేరళ నుంచి కురియన్ జోసెఫ్ జడ్జీగా ఉన్నారు. కేరళకే చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా, ఆంటోనీ డొమినిక్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ సమయంలో కేరళ హైకోర్టు నుంచి వచ్చిన మరొకరిని సుప్రీం జడ్జిగా నియమించడం సమర్ధనీయం కాదు’ అని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. సుప్రీం చరిత్రలో తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు. అత్యున్నత న్యాయస్థానం చరిత్రలోనే ఒక మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకు ఎంపికవడం ఇదే మొదటిసారి. అలాగే స్వాతంత్య్రం అనంతరం సుప్రీంకోర్టులో పనిచేసిన ఏడో మహిళా న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా.. 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఆర్.భానుమతి ఒక్కరే సుప్రీంలో మహిళా న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2007లో మల్హోత్రా సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 1956, మార్చి 14న ఆమె బెంగళూరులో జన్మించారు. న్యాయ వ్యవస్థ ఏకంకావాలి: కాంగ్రెస్ కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలతో పాటు సీనియర్ న్యాయవాదులు, సుప్రీం బార్ అసోసియేషన్ తప్పుపట్టింది. ‘భారతదేశ న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది. తన స్వతంత్రతను కాపాడుకునేందుకు న్యాయ వ్యవస్థ ఏకం కాకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఎవరు పోరాడతారు. ఇంతవరకూ జరిగింది వదిలేసి న్యాయవ్యవస్థ ఒకే మాటపై నిలబడుతుందా?’ అని కాంగ్రెస్ నేత సిబల్ ప్రశ్నించారు.మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అతీతమా? అని మరో కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. ‘జస్టిస్ జోసెఫ్ నియామకం నిలుపుదల వెనుక కారణమేంటి.. ఆయన రాష్ట్రమా లేక మతమా లేక ఉత్తరాఖండ్ కేసులో తీర్పా?’ అని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. జస్టిస్ జోసెఫ్ నియామకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బార్ అసోíసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తప్పుపట్టారు. ‘కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి ఈ రకమైన జోక్యం అనుచితం’ అని పేర్కొన్నారు. కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ఏకగ్రీవంగా ఖరారు చేసినా.. ఉత్తరాఖండ్ కేసులో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినందుకే తిరస్కరించారని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుపట్టారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ..‘ఒకవైపు సీజేఐ బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన్ని నిరక్ష్యం చేస్తున్నామంటున్నారు. కాంగ్రెస్ పూర్తి నిరాశలో ఉంది’ అని విమర్శించారు. చాలా రాష్ట్రాలకు సుప్రీంలో ప్రాతినిధ్యం లేదు: కేంద్రం ‘దేశంలోని కలకత్తా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, కశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ నుంచి సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. చాలా కాలం నుంచి సుప్రీం కోర్టులో ఎస్సీ, ఎస్టీల నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం’ అని లేఖలో కేంద్రం తెలిపింది. జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేస్తూ రూపొందించిన తీర్మానాన్ని ఫిబ్రవరిలో కొలీజియం బహిర్గతం చేస్తూ.. ‘ఇతర హైకోర్టు సీజేలు, సీనియర్ జడ్జీల కంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి జస్టిస్ జోసెఫ్ అర్హుడు’ అని పేర్కొంది. 2016లో ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జోసెఫ్ రద్దు చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేలా ఉత్తర్వులిచ్చారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా అందరూ భావించారు. న్యాయ వ్యవస్థతో అనుచితంగా వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని న్యాయ మంత్రి రవిశంకర్ విమర్శించారు. ‘తమకు అనుకూలంగా లేని జడ్జీల్ని కాంగ్రెస్ పార్టీ పక్కనపెట్టింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల స్వేచ్ఛను సమర్ధిస్తూ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా తన అభిప్రాయం చెప్పినందుకు ఆయనను పక్కన పెట్టి జూనియర్‌ను సీజేఐగా నియమించారు’ అని పేర్కొన్నారు. -
‘పిల్’ అంటే ఎందుకు గుబులు?
సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు. ‘మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే వ్యక్తి ఎంత నీతిమంతుడైనా ఒక సామాన్య మనిషిగా ఆయనకూ బలహీనతలు ఉంటాయి. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ఎంత సత్యసంధుడనుకున్నా, ముక్కుసూటి మనిషనుకున్నా ఆయనకు సంపూర్ణాధికారాలను మాత్రం కట్టబెట్టకూడదు.’ – డా. బీఆర్ అంబేడ్కర్ (రాజ్యాంగ రూపకల్పన సందర్భంగా) ‘ప్రధాన న్యాయమూర్తి సహ న్యాయమూర్తులకు ధర్మాసనాలను కేటాయించే విషయంలో దాదాపు అంబేడ్కర్ భావనే ఇంగ్లండ్‌లో కూడా వ్యక్తమ యింది. అయితే కేసులు కేటాయించిన న్యాయమూర్తుల పట్టికకు ప్రధాన న్యాయమూర్తిని సారథిగా (మాస్టర్ ఆఫ్ రోస్టర్) ప్రకటించే సంప్రదాయం ఉంది. కానీ ఆ సంప్రదాయం వెర్రితలలు వేసి క్రమంగా అది ఇంగ్లండ్ ప్రజలు తలపెట్టిన రాజకీయ మహోద్యమాలనే శాసించే న్యాయమూర్తులు పాక్షిక ధర్మాసనాలను ఏర్పాటు చేసుకునే సంప్రదాయానికి లార్డ్ చాన్స్లర్లు తెరలేపారు. ప్రధాన న్యాయమూర్తిని విశ్వసించాలన్న సూత్రం సాంఘిక ధర్మమైనా ఆ విశ్వాసం శాశ్వత సంపూర్ణ ధర్మంగా నిలవగలదని నమ్మలేం. సంప్రదాయం అనే మత్తులో పడే న్యాయవాద సోదరులందరికీ ఇంగ్లండ్ అనుభవం ఒక ఉదాహరణ. తాత్కాలికంగా న్యాయమూర్తుల మధ్య ఆంతరంగిక సర్దుబాట్లు/ పరిష్కారం కుదిరినట్టు కన్పించినా భారత న్యాయవ్యవస్థలో అంతటా సవ్యం గానే ఉందని ప్రపంచానికి చెప్పాలనుకున్నా–మహా అయితే అదంతా అతుకుల బొంత ‘పట్టీ’గానే మిగిలిపోతుంది. ఇంతకూ ఇప్పుడు జరగవలసిన అసలు చికిత్స–బహిరంగ చర్చ ద్వారా పార్లమెంట్ ప్రత్యేకమైన సుప్రీంకోర్టు చట్టాన్ని ఆమోదించడం. ఈ బహిరంగ చర్చలో సంబంధిత పరిణామాలతో సంబంధం ఉన్న పౌర సమాజం, న్యాయవ్యవస్థ న్యాయవాద సంఘాలు, విభిన్న రాజకీయాభిప్రాయాలు గలవారు అంతా పాల్గొనాలి.’ – ప్రొ. అర్ఘ్యసేన్గుప్తా, 18–1–18 (సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్) న్యాయవ్యవస్థకూ, ప్రభుత్వ పక్షంగా పాలకవర్గాలకూ మధ్య కొన్ని మాసాలుగా, ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లుగా ఏదో ఒక సంఘర్షణ తలెత్తడం కనిపిస్తూనే ఉంది. ఆయా సందర్భాలలో ప్రజా సమస్యల మీద, ప్రాథమిక హక్కుల రక్షణలో ప్రభుత్వాలు పక్కదారులు తొక్కినప్పటికీ న్యాయవ్యవస్థ ప్రజలకు అండదండలనిచ్చిన ఉదాహరణలు కూడా తక్కువేమీ కాదు. అందులో ఒకటి అత్యవసర పరిస్థితిలో సాధించిన విజయం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా తన పదవీ రక్షణ కోసం ఎమర్జెన్సీ విధించారు. బీజేపీ వారు సమయం వచ్చినప్పుడల్లా నాటి అత్యవసర పరిస్థితి ప్రకటన మీద విరుచుకుపడుతూనే ఉంటారు. కానీ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అదే రాజ్యాంగం పేరిట అనుసరిస్తున్న విధానాలు కూడా కాంగ్రెస్ పోకడలనే గుర్తు చేస్తూ, ప్రజాకంటకంగా మారిపోతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పాలకులు చేసిందీ, ఇప్పుడు బీజేపీ–ఎన్డీఏ పాలకులు కూడా చేస్తున్నదీ ఒక్కటే– రాజ్యాంగ నిబంధనలను, ఆదేశాలను, సెక్యులర్ వ్యవస్థా నిర్దేశాలను ప్రజాహితంగా అమలు చేయడంలో దారుణంగా విఫలం కావడం. పెడధోరణులు నిజం కార్య నిర్వాహక అధికారాల పేరిట న్యాయవ్యవస్థ నిర్వహణలో నేరుగానో, నర్మగర్భంగానో బీజేపీ పాలకులు జోక్యం చేసుకునే స్థితికి చేరుకున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి సుప్రీంకోర్టు, ధర్మాసనాలు, ప్రధాన న్యాయమూర్తి, కొందరు న్యాయమూర్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒత్తిళ్లకు లోనవుతున్నట్టు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొన్ని కేసుల విచారణ, కొన్ని ధర్మాసనాలు, వాటికి కొన్ని కేసుల కేటాయింపు తీరుతెన్నులు ప్రజాక్షేత్రంలో చాకిరేవుకు అవకాశం కల్పించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న ‘పాక్షిక ధోరణి’ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జస్టిస్ చలమేశ్వర్, మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహిం చడం సంచలనం కలిగించింది. ధర్మాసనాలకు కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాన్ని ఆ నలుగురు కూడా కాదనలేదు. కానీ ఆ కేటాయింపులు న్యాయ వ్యవస్థ నిర్వహణ యంత్రాంగం కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తికి సరి సమానులైన తోటి సీనియర్ న్యాయమూర్తులను కూడా సంప్రదించాలని, తద్వారా కేసుల కేటాయింపు జరగాలని ఆ నలుగురు ఆకాంక్షించారు. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ నలుగురు ఒక విశిష్టమైన, విజ్ఞానదాయకమైన ప్రకటన జారీ చేశారు: ‘దేశం రుణం తీర్చుకోవడానికే మేం నలుగురు న్యాయమూర్తులం పత్రికా గోష్టిని ఏర్పాటు చేశాం. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ లోయా మరణానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఏ ధర్మాసనానికి బదలాయించాలన్న విషయం గురించి తలెత్తిన సమస్యే మేం పత్రికా గోష్టిని ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న కారణం’ (13–1–18). నేతలనుబట్టి మారుతున్న న్యాయం సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో బీజేపీ నేత అమిత్ షాకు ప్రమేయం ఉందన్న ఆరోపణే ఈ కేసు నాలుగేళ్లు నానడానికి అసలు కారణమన్న మాట ఉంది. అమిత్ షా నిర్దోషి అని కింది కోర్టు ప్రకటించినప్పటికీ, జస్టిస్ లోయా హఠాన్మరణం పూర్వరంగంలో ఈ కేసును తిరగదోడాలని బొంబాయి న్యాయవాదుల సంఘంలో మెజారిటీ సభ్యులు, ఒక పత్రికా రచయిత, ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి కొట్టివేశారు. ఇది అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామం గురించి పిటిషనర్ల తరఫున వాదించిన సుప్రీం కోర్టు న్యాయవాదులు దుష్యంత దావే, ఇందిరా జైసింగ్ ఇలా ప్రకటించారు: ‘లోయా మృతి కేసును పునర్విచారించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తిరస్కరించడానికి చెప్పే కారణాల్లో తీవ్రమైన వైరుధ్యాలున్నాయి. జస్టిస్ లోయా మరణం విషయంలో స్వతంత్ర విచారణ జరక్కుండా నిరోధించడంలో ఆసక్తి ఉన్న ఒకే ఒక వ్యక్తి మరెవరో కాదు, మీ కక్షిదారుడేనని, అతనే అమిత్‌షా అనీ దావే, అమిత్‌షా తరఫున వకాల్తా వహించిన సుప్రీం లాయర్ సాల్వేకు చెప్పారు’ (‘ఫ్రంట్‌లైన్’: హిందూ గ్రూపు, 16.2.18). ఇదొక్క కేసే కాదు, యూపీ, ఒరిస్సాలలోని మెడికల్ కాలేజీ వ్యవహారాల్లో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్న రిటైర్డ్ జడ్జి విషయంలో విచారణ జరపడానికి ప్రధాన న్యాయమూర్తి తాత్సారం చేశారని కూడా నలుగురు న్యాయమూర్తులూ అభియోగం మోపడంతో వ్యవస్థ పరువు బజారున పడినట్టయింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యమనేది ‘అత్యంత అభ్యుదయకర ధర్మాసన చైతన్య శక్తి’గా వర్ణిస్తూ, ఈ ‘పిల్’ సుప్రీంకోర్టు రూపురేఖలనే మార్చి, ప్రజల న్యాయస్థానంగా మారుస్తుందని ఆశించినవారు జస్టిస్ జీబీ రెడ్డి. జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ‘నా న్యాయ చట్టం మనిషి జీవితానికి విరుద్ధంగా నడిచే పక్షంలో ఆ చట్టాన్ని తుంగలో తొక్కేయడం మంచిది కాని, దాన్ని సవాలు చేయడం కాదు’ అన్నారు. అంతేగాదు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తులూ, న్యాయమూర్తులూ పెక్కు సందర్భాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా వ్యవస్థలను రక్షించిన ఉదాహరణలను కూడా మరచి, తాజాగా పిల్స్‌ను వ్యతిరేకించే, తిరస్కరించే ధోరణి కూడా న్యాయవ్యవస్థా చట్రంలో పాగా వేస్తోంది. ఇంతకుముందు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఠాకూర్ కూడా అమరావతి రైతాంగం తరఫున న్యాయం చేయాలని అర్థిస్తూ ఈ వ్యాసకర్త మరి ఇరువురు పాత్రికేయ మిత్రులూ వేసిన ‘పిల్’ను చూడకుండానే ఒక్క సెకనులో తోసిపుచ్చారు (దాని వెనుక ఒక ముఖ్యమంత్రి, ఒక న్యాయమూర్తి నడిపిన కథ కూడా బట్టబయలయింది). పిల్ అంటే ఎందుకు ఆగ్రహం? తాజా పరిణామం అంత కంటే దారుణం – ఉన్నావ్‌లో జరిగిన బాలిక అత్యాచారం కేసులో న్యాయం జరగాలని కోరుతూ అడ్వకేట్ ఎం.ఎల్. శర్మ సుప్రీంలో ‘పిల్’ దాఖలు చేశారు. ‘లైంగిక వేధింపులకు గురైన బాలిక తరఫు బంధువు నీకెవరైనా ఉన్నారా? నీవు బాధితుడివి కాదు కదా! రేప్ కేసులకు నీకు సంబంధం ఏమిటి?’ అని ధర్మాసనమే ప్రశ్నించింది. ఇది సబబా? ఇంతకూ అసలు రహస్యం– ఒక బీజేపీ లెజిస్లేటర్ ఈ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. బీజేపీ నాయకుడి కేసులో అనుకూల తీర్పు చెబితే రూ. 100 కోట్ల నజరానా ఇస్తారని బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహిత్ షా జస్టిస్ లోయాకు ఆశ చూపినట్టు ఒక ఆరోపణ ఉంది. తమ సోదరుడు జస్టిస్ లోయాయే తమకు ఈ సంగతి చెప్పాడని ఆయన తోబుట్టువులు అనూరాధ బియాని, సరితా మంధానీ చెప్పారు. ఇది నిజమా? అబద్ధమా? ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లోయా కేసుకు ‘భరత వాక్యం’ పలకడంతో కథ కంచికి వెళ్లినట్లేనా? వెళ్లినా గానీ పార్లమెంటులోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి అనేక ఆరోపణలు సంధించి ప్రధాన న్యాయమూర్తిపైన చరిత్రలో తొలిసారిగా అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే దాని పర్యవసానం ఏమిటి? మిరాజ్కర్ కేసులో ఒకసారి సుప్రీంకోర్టు గొప్ప వ్యాఖ్యానం చేసింది: ‘రహస్యమనే కారు చీకటిలో, దుష్ట ప్రయోజనాలతో అడుగడుగునా దుర్మార్గపు ఆలోచనలు కళ్లాలు లేని గుర్రాలుగా స్వైర విహారం సాగిస్తాయి’. సరిగ్గా ఇలాంటి అంధకారంలోనే నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు పత్రికా గోష్టి నిర్వహించి వెలుతురును ప్రసాదించారు. ‘ఈ వెలుగును ఆర్పేసి, అంతర్గతంగా తమ మధ్య సర్దుబాట్లు చేసుకుంటూ సమస్యను తమలో తాము సర్దుకోవడం అంటే తలెత్తిన తీవ్రమైన మౌలిక సమస్య కోరుకుంటున్న శాశ్వత పరిష్కారానికి విరుద్ధమని గమనించాల’ని ఒక లీగల్ పండితుడు గొంతు విప్పాడు. సీనియర్ న్యాయమూర్తి చలమేశ్వర్ మిగతా ముగ్గురు న్యాయమూర్తుల తరఫున దేశాన్ని, జాతిని ఉద్దేశించి విడుదల చేసిన (12.1.18) అపూర్వ సందేశం నిరాడంబరతకు, నికార్సయిన దేశభక్తికి అరమరికలు లేని నిండు మనస్సుకు ఉద్దీపన శక్తిగా భావిం చాలి: ‘నేటినుంచి ఇరవైయ్యేళ్ల తరువాత న్యాయమూర్తులమైన మమ్మల్ని – జస్టిసెస్ చలమేశ్వర్ రంజన్ గోగోయి/లోకూర్/కురియన్–తమ ఆత్మల్ని అమ్మేసుకుని, అత్యంత కీర్తిగన్న సుప్రీం సంస్థ ప్రయోజనాల్ని గాలికి వదిలేసి పోయారని ఏ జ్ఞాని, విజ్ఞానీ భావించకుండా ఉండేందుకే ఇప్పుడే ఈ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాం’. ఈ పరిణామాల దృష్ట్యానే ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల పదవుల్ని కూడా ప్రజాస్వామీకరించాలని, ఒక వ్యక్తి వద్దనే అధికారాలు కేంద్రీకృతమై ఉండరాదని ఇది కేసుల బదలాయింపులో, న్యాయమూర్తులకు కేటాయించే ధర్మాసనాల విషయంలో (రోస్టర్స్) చాలా అవసరమని చెప్పారు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అభిశంసన అంత సులభం కాదు
ప్రజానుకూల విధానాలు అనుసరించని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్ మినహా పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఇందుకు 2019 ఎన్నికలు సమీపిస్తూండటం ఒక కారణం కాగా, బీజేపీ బలహీనపడుతూండటం కూడా మరొక కారణం. గత నాలుగేళ్ళుగా బీజేపీ, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా, ప్రజా వ్యతిరేక పాలననే కొనసాగించింది. అంతేగాక, మేధావులపైనా, ప్రజాస్వామికవాదులపైనా, దళి తులు, మైనార్టీలపైనా హత్యలు, దాడులు బీజేపీ పాలనలో పెచ్చు పెరిగిపోయాయి. పాలకవర్గాల్లో అసహనం, ప్రజల్లో అభద్రత పెరిగాయి. కనుక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం మరింతగా పెరిగింది. అయితే, ఏది ప్రత్యామ్నాయం, అనేదే కీలకమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయస్థాయి మహాసభలకు ప్రాముఖ్యత ఏర్పడింది. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడం. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నిటితో కలిపి కూటమి ఏర్పడాలనే విధానం సీపీఐలో ఇప్పటికే స్పష్టంగానే వుంది. అంటే, కాంగ్రెస్‌ను కూడా కలుపుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయ సారాంశం. అయితే సీపీఎం విధానం అంత సూటిగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ విధానం అటూ ఇటూ మారుతూ వస్తోంది. 1964 నాటి పార్టీ చీలికకు ఆనాటి సీపీఐ నాయకత్వం చేపట్టిన కాంగ్రెస్ అనుకూల పోకడే ప్రధాన కారణం అని సీపీయం నాయకత్వం ఆనాడు స్పష్టంగానే ప్రకటించింది. అయితే కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏ ప్రజాస్వామిక, ఆర్థిక, సామాజిక విధానాలపరమైన వ్యత్యాసాల కారణంగా 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీడీపీని బలపరిచిందో, ఆ పార్టీ నాయకత్వమే చెప్పాలి. ప్రస్తుతం ప్రతిపాదిస్తోన్న బీజేపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ స్థానం ఏమిటి, అన్నది ముఖ్యమైన అంశంగా సీపీఎంలో చర్చ జరుగుతూండటం బహిరంగ రహస్యమే. వాస్తవానికి 1964 నాటి చీలిక ప్రకారం రెండు పార్టీలు, సీపీఐ, సీపీఎంలుగా కొనసాగాలంటే కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల విధానాల ప్రాతిపదిక ఉండితీరాలి. ఆ ప్రాతిపదికే లేకపోతే అప్పుడు పార్టీని చీల్చడమే తప్పు; ఇప్పుడు రెండు పార్టీలుగా కొనసాగడం అంతకన్నా తప్పు. నేటి ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఉండబట్టేనేమో, సీపీఐ నాయకత్వం రెండు పార్టీల విలీనాన్ని పదేపదే బలంగా ప్రతిపాదిస్తూ వస్తోంది. ఆ ప్రతిపాదనను సీపీయం నాయకత్వం అదేపనిగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ తిరస్కరణకు సీపీఎం నాయకత్వం మనస్సులో ఏ కారణాలు పని చేస్తున్నాయో ప్రజలకైతే అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పరిపాలన ఎంతటి జుగుప్సాకరంగా, అవినీతిమయంగా, ప్రజా వ్యతిరేకంగా సాగుతుందో చెప్పటానికి ప్రబలమైన ప్రత్యక్ష సాక్ష్యం, 2014 ఎన్నికల్లో ప్రజలు పచ్చి మతోన్మాద బీజేపీని ఎన్నుకుని అధికారంలో కూర్చోబెట్టటమే. గతంలో వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం, పదేళ్ల కాంగ్రెస్ యుపిఎ పరిపాలన అనంతరం నాలుగేళ్ల కిందట తిరిగి బిజెపి బహు పెద్ద మెజారిటీతో అధికార పీఠానికి ఎగబాకడం చూసిన తరువాత కూడా, మళ్ళీ కాంగ్రెస్‌తో కలిసిన ప్రత్యామ్నాయాల గురించి సీపీఐ, సీపీఎంలు ఆలోచించటం ఎంతటి ఆత్మవంచన? ఎంతటి ఆత్మహత్యా సదృశ్యం? అసలు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? అది రాజకీయ విధాన ప్రత్యామ్నాయంగా వుండాలి. ఆ రాజకీయ విధానం అభివృద్ధికరమైన, మార్పు దిశగా నడిచే సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన స్వభావంతో కూడుకుని ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలుగానీ, సీపీఐ, సీపీఎంలు ప్రతిపాదిస్తోన్న కూటమిలోని భాగస్వామ్య ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న విధానాలు గానీ, ప్రజానుకూలంగా వున్నాయా? కనీసం ఆ సీపీఐ, సీపీఎంలు సమర్థించేవిగానైనా వున్నాయా? ప్రజానుకూల విధానాలు అనుసరిం చని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్‌ను మినహాయించి పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. బీజేపీ ఉగ్రవాద హిందుత్వ పార్టీకాగా, కాంగ్రెస్ తదితర పార్టీల్లో హెచ్చు భాగం ఉదారవాద హిందుత్వ పార్టీలే. తరతమ తేడాలేతప్ప స్వభావం మాత్రం ఒక్కటే. మరో ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలూ, ఏదో ఒక దశలో మతోన్మాద బీజేపీతో చెలిమి చేసినట్టివే. ఏవో తమ సొంత కారణాల వల్ల ఆ పార్టీకి ఈ పార్టీలు ప్రస్తుతం దూరంగా వుండవచ్చు. అంతమాత్రాన బీజేపీతో జతకట్టగలిగిన ఆ పార్టీల అలనాటి స్వభావం మారిందనుకోలేం. మారినట్లుగా దాఖలాలూ లేవు. ఇప్పుడు తాము ప్రతిపాదిస్తున్న బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చదలచుకుంటోన్న ఒక్కొక్క పార్టీ గత చరిత్రను సీపీఐ., సీపీఎం.లు బహిరంగంగా ప్రకటించాలి. ఈ పార్టీలు బీజేపీ దగ్గరకు జరిగినా, లేక, దూరంగా వెళ్ళిపోయినా అవి తమ అప్పటి అవసరాల కోసం, అవకాశవాదంతో ఏర్పరచుకొన్న వైఖరే తప్ప, విధానపరమైన నిర్ణయాలు కావు. ఇలాంటి శక్తులతో కలసి నిజమైన బిజెపి వ్యతిరేక కూటమిని సీపీఐ, సీపీఎంలు నిర్మించడం సాధ్యమేనా? సామాజిక న్యాయం, కుల వివక్షలను గురించి మాటల్లో చెప్పడం కాదు. అది చేతల్లో కనపడాలి. ముఖ్యంగా కీలకమైన రాజకీయ రంగంలో స్పష్టంగా ప్రతిబింబించాలి. దినదినం క్షీణించిపోతున్న తమ ఉనికిని నిలబెట్టుకొని, బలపడి.. సామాజిక కులవర్గ దృక్పధంతో ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి కమ్యూనిస్టు పార్టీల మçహాసభలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కనుక, సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకొనడంపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. నిజమైన కమ్యూనిస్టులుగా, నిజమైన సామాజిక రాజకీయ శక్తులతో కలిసి, నిజమైన ప్రత్యామ్నాయ, రాజకీయ శిబిరాన్ని నిర్మించడమా? లేక, బూటకపు లౌకిక శక్తులు, బూటకపు ప్రజాతంత్ర శక్తులతో జతకట్టి, బూట కపు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమా? ఇవే, సీపీఐ, సీపీఎం మహాసభల ముందున్న నిజమైన ప్రత్యామ్నాయాలు. కొసమెరుపు : బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఫ్రంట్‌కు సీపీఎం అంగీకరించనున్నట్లు తాజా వార్తలు. - ఇంటర్వ్యూ : జీకేఎం రావు, సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ -
అభిశంసన అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఏడుగురు ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా శుక్రవారం నాడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలుసుకొని ఓ లేఖను అందజేశాయి. ఆ లేఖపై కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందిన 71 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేశారు. ప్రతిపక్షానికి చెందిన డీఎంకే మాత్రం అభిశంసన తీర్మానానికి దూరంగా ఉంది. సీబీఐ ప్రత్యేక జడ్జీ బ్రిజ్మోహన్ హరికిషన్ లోయ అనుమానాస్పద మృతిపై స్వతంత్య్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం నాడు దీపక్ మిశ్రా నాయకత్వంతోని సుప్రీం కోర్టు బెంచీ కొట్టివేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి వీలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 124 సెక్షన్ కిందనే ఆయన్ని తొలగించవచ్చు. తప్పుడు ప్రవర్తన, అసమర్ధుడు అనే కారణంగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సుప్రీం కోర్టుకు చెందిన ఏ జడ్జీనైనా పదవీ విరమణకన్నా ముందే తొలగించాలంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం నెగ్గితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగిస్తారు. అభిశంసన తీర్మానాన్ని ఇరు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించడంతోపాటు ఓటింగ్ రోజున ఇరు సభల్లో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. జడ్జీల (ఇంక్వైరీ) యాక్ట్–1969, జడ్జీల (ఇంక్వైరీ) రూల్స్–1969 చట్టాల కింద జడ్జీలను తొలగించేందుకు రాజ్యాంగంలోని 124వ అధికరణ వీలు కల్పిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను అభిశంసనగా వ్యవహరిస్తారు. -
సీజేఐ అధికారాలపై స్పష్టత ఇవ్వండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జడ్జీలకు కేసుల కేటాయింపు విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కున్న నిర్వహణ అధికారాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా ఉన్న సీజేఐ ఇతర జడ్జీలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న నిబంధనలు, విధివిధానాలపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. శాంతిభూషణ్ తరఫున ఆయన కొడుకు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిల్ వేశారు. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాసిన ప్రశాంత్.. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిల్ విచారణకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా సున్నితమైన, అధికార/ప్రతిపక్ష పార్టీలకు చెందిన కేసుల్ని నచ్చినవారికి కేటాయిస్తూ సీజేఐ, రిజిస్ట్రార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పిటిషన్లో సీజేఐ జస్టిస్ మిశ్రాను ప్రతివాదిగా చేర్చారు. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయనీ, సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా కేసుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు జనవరి 12న మీడియా ముందుకొచ్చిన నేపథ్యంలో తాజాగా అదే అంశంపై పిల్ దాఖలుకావడం గమనార్హం. బహుభార్యత్వం కంటే అయోధ్య కేసే ముఖ్యం అయోధ్య–బాబ్రీ మసీదు కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన తర్వాతే కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టులో ముస్లిం ప్రతినిధుల తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు విన్పిస్తూ.. ‘ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం సమస్య విచారణ కంటే అయోధ్య–బాబ్రీ మసీదు కేసు విచారణ ముఖ్యమైనది. ఈ సమస్య పరిష్కారమవ్వాలని దేశం కోరుకుంటోంది’ అని అన్నారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. -
మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి..
కోరుట్ల: ‘‘మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి.. అయ్యా! మేం.. కోరుట్ల జెడ్పీ బాలికల హైస్కూల్లో చదువుతున్నాం. 540 మందిలో 320 మంది బాలికలం. మా బడిలో సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటి వసతి లేదు. అన్నం తిన్న తర్వాత తాగడానికి నీళ్లు లేక తలా కొన్ని డబ్బులు జమ చేసి కొనుక్కుంటున్నం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. 9వ తరగతి సాంఘికశాస్త్రంలో ‘బాలల హక్కులు–పరిరక్షణ’ పాఠంలో బాలలు సమస్యలు ఉంటే నేరుగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తే పరిష్కరిస్తారని చదివాం. అందుకే ఈ లేఖ రాస్తున్నాం.. తప్పయితే క్షమించండి’ ఇది.. పది హేను రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ సారాంశం. లెక్కలేని సమస్యలు..: కోరుట్ల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఒక్క టాయ్‌లెట్ మాత్రమే పనిచేస్తోంది. మిగిలినవి మరమ్మతులు చేయాల్సి ఉంది. పాఠశాలలో బోరు దెబ్బతినగా..బాగు చేయించే వారులేరు. రోజు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుంటున్నారు. పిల్లలు ఈ నీటిని తాగలేక బయట కొనుక్కుని తాగుతున్నారు. మధ్యాహ్న భోజనానికి వంటగది, డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఆరుబయట భోజనాలు చేస్తున్నారు. కూలిన ఎస్సారెస్పీ గదుల్లోనే కొన్ని తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాల సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. రూ. 11 లక్షలతో అంచనాలు: విద్యార్థులు లేఖ రాసిన క్రమంలో కదిలిన విద్యాశాఖ వసతుల కల్పనకు రూ.11 లక్షలతో అంచనాలు తయారు చేసింది. దీనిలో 4 మూత్రశాలలు, బోర్వెల్, వాటర్ ట్యాంకు నిర్మాణానికి రూ.2 లక్షలు, మోటార్‌కు రూ.50 వేలు, 4 గదులకు రూ.8 లక్షలు, మరుగుదొడ్లు.. టాయ్లెట్ల మరమ్మతుకు రూ.5 వేలు కేటాయిస్తూ అంచనాలు తయారుచేశారు. నిధుల మంజూరుకు విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు నివేదిక అందించారు. స్పందించిన హైకోర్టు.. విద్యార్థినులు రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. పాఠశాలలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కి ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్‌ఎంఎస్‌ఏ ఇంజనీర్లతో కలసి గురువారం పాఠశాలను పరిశీలించారు. అవసరమైన వసతులు వెంటనే కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యా«ధికారి వెంకటేశ్వర్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ద్వారా హైకోర్టుకు తెలిపారు. -
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా.. మాజీ సీఎం కూతురు
ఇంఫాల్(మణిపూర్) : మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అభిలాష కుమారి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ కుమారికి మంగళవారం పదోన్నతి లభించింది. జస్టిస్ అభిలాష కుమారి హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమార్తె. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వవిద్యార్థి అయిన జస్టిస్ కుమారి హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో లా పూర్తి చేశారు. 1984లో న్యాయవాద వృత్తిని స్వీకరించి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా చేసి, 2005లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. తండ్రి వీరభద్ర సింగ్‌తో జస్టిస్ అభిలాష కుమారి( ఫైల్ ఫోటో) -
జస్టిస్ చలమేశ్వర్ ఏం చెప్పారంటే..
-
సీజే తీరు బాగోలేదు.. జరగకూడనివి జరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ న్యాయ చరిత్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై మిగతా సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఊహించని విధంగా మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తన నివాసంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు (జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్)తో కలిసి జరిగిన పరిణామాలను మీడియా ముందు వివరించారు. అయితే పూర్తి అంశాలను వెల్లడించకుండా మీడియాకు లేఖలు విడుదల చేశారు. జస్టిస్ చలమేశ్వర్ ఏం చెప్పారంటే... ‘‘దేశంలోనే కాదు.. ప్రపంచ న్యాయ చరిత్రలోనే బహుశా ఇలాంటి ఘట్టం చోటు చేసుకోలేదేమో. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా పరిపాలన విధానం సరిగా లేదు. జరగకూడని పరిణమాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో వస్తున్నట్లు ఇవేం రాజకీయ అంశాలు కావు. న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని.. ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తికి(లేఖ ద్వారా) విజ్ఞప్తి చేశాం. కానీ, ఆయన నుంచి సానుకూల స్పందన లభించలేదు. అందుకే లోపాలను సరిదిద్దాలని మేం నలుగురం భావించాం. న్యాయవ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే వాటిని వివరించేందుకు మీడియా ముందుకు వచ్చాం. చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలా లేదా అన్నది దేశ ప్రజలే తేల్చుకోవాలి' అని ఆయన చెప్పారు. కాగా ఇంతకు ఏ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విభేదాలు వచ్చాయి? ఏ అంశాన్ని ఆయన నిరాకరించారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. అన్ని వివరాలను లేఖ రూపంలో ఇస్తామని తొలుత చెప్పి అనంతరం వాటిని మీడియాకు అందజేశారు. తమ ముందు మరో అవకాశం లేకుండా పోవటంతోనే ప్రజల ముందుకు వచ్చామని మరో న్యాయమూర్తి లోకూర్ తెలిపారు. ఇక గత డిసెంబర్ లో ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా-జస్టిస్ చలమేశ్వర్‌ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకపక్షంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయాలు తీసుకుంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. వరుస భేటీలు.. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానితో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ భేటీ అయ్యారు. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు విమర్శల నేపథ్యంలో అటార్నీ జనరల్‌తో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా భేటీ కావటం విశేషం. -
రాజ్యాంగం ముందు తలొంచాల్సిందే
భువనేశ్వర్: రాజ్యాంగ సార్వభౌ మత్వం అత్యున్నతమైనదని, అంతా దాని ముందు తలొంచా ల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తేల్చి చెప్పారు. రాజ్యాంగ సార్వభౌమత్వ లేమి అరాచకానికి దారి తీస్తుందని, చట్టాలకు అంతా లోబడి ఉండాల్సిందేనన్నారు. ఒడిశా న్యాయవా దుల అసోసియేషన్ నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ.. శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తు న్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవా లన్నారు. న్యాయ వాదులు న్యాయ వృత్తి పవిత్రతను కాపాడుతూ ప్రజలకు సేవ చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా సూచించారు. గత పదేళ్లుగా దేశంలో పెం డింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్ని పరిష్కరిం చాలని హైకోర్టులకు స్పష్టం చేశామని, పెండింగ్ కేసుల పరిష్కారానికి శనివారం కూడా పనిచేయాలని న్యాయ మూర్తులు, న్యాయవాదుల్ని కోరామని సీజేఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీలను తక్కువగా చూడొద్దు..
మహబూబ్‌నగర్ క్రైం : జైలులోని ఖైదీలను తక్కువగా చూడరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వెంకటకృష్ణయ్య అన్నారు. వా రికి జీవితానికి సంబంధించిన విలువైన పాఠాలు చెబితే వారు క్రమశిక్షణగా ఉండటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పా రు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో సోమవారం ఖైదీల సంక్షేమ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంక్షేమ కోసం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మంచి విషయమన్నారు. ఖైదీల సం క్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచించాలని అధికారులకు సూచించారు. జిల్లా జైలులో ఖైదీల సంక్షేమం కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖైదీలకు చదువుతోపాటు క్రమశిక్షణ, యోగా నేర్పించడం ఎంతో మంచిదని అన్నారు. అనంతరం ఖైదీలకు ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి, డీఎస్పీ భాస్కర్, జైలర్స్ శ్రీనునాయక్, డిప్యూటీ జైలర్ సుధాకర్‌రెడ్డి, ఉపేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా
► సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం ► జస్టిస్ మిశ్రాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ స్థానంలో 45వ సీజేఐగా దీపక్‌మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ మిశ్రా చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా ఇంగ్లిష్‌లో దేవునిపై ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఆయన 2018 అక్టోబర్ 2 వరకూ సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ మిశ్రా పేరును జస్టిస్ ఖేహర్ గత నెలలో ప్రతి పాదించారు. జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో ఒరిస్సా హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1996లో ఒరిస్సా హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన 1997 డిసెంబర్ 19న శాశ్వత జడ్జి అయ్యారు. 2009లో పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన పట్నా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2011 అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ మిశ్రా ప్రస్తుతం కీలకమైన కావేరీ, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా తదితర కేసులకు సంబంధించి వాదనలు వింటున్న ధర్మాసనాల్లో సభ్యునిగా ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని పాడాలని తీర్పునిచ్చిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. అలాగే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించిన ధర్మాసనం లోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణïస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, పలువురు కేంద్ర మంత్రులు హాజర య్యారు. నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చిన జస్టిస్ మిశ్రాకు ప్రధాని మోదీ అభినంద నలు తెలిపారు. ఆయన పదవీ కాలం ఫలప్రదంగా కొనసాగాలని కోరుకుంటున్నానని ట్వీటర్లో ఆకాంక్షించారు. -
కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం తీవ్రం
న్యూఢిల్లీ: జడ్జిల నియామకం విషయంలో కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య వివాదం తీవ్రతరమైంది. జడ్జీల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 500 హైకోర్టు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ధీటుగా స్పందించారు. అందరితో పాటూ న్యాయవ్యవస్థకూ లక్షణ రేఖ ఉంటుందన్నారు. ఆ లక్ష్మణరేఖను న్యాయవ్యవస్థ గుర్తించాలని సూచించారు. ఆత్మపరిశీలనకు సిద్ధం కాలాలని ముకుల్ రోహత్గీ తెలిపారు. -
నోట్లు తడపడంపై సుప్రీం సీరియస్!
న్యూఢిల్లీ : కొత్త రూ.2000 నోట్లు తడిపితే, రంగుపోతున్నాయంటూ నమోదైన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నోట్లను ఎందుకు తడపారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. నోట్లను నీళ్లలో తడపవద్దంటూ చీఫ్ జస్టిస్ టీఎస్ థాకూర్, పిటిషనర్ల తరుఫు లాయర్ ఎంఎల్ శర్మకు సూచించారు. తడిపితే కొత్తనోట్లు రంగు పోతున్నాయంటూ.. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.500, రూ.1000 నోట్ల రద్దును నిలిపివేయాలని కోరుతూ పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. ఈ నోట్లలో రెండో రంగుగా కుసుంభ వర్ణం ఉందని, అది తడిపితే రంగుపోతుందని అధికారులు సైతం దృవీకరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి తిరస్కరించిన సుప్రీంకోర్టు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద కట్టిన క్యూలైన్లు, అసౌకర్య పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన ఈ నోట్లను వాషింగ్ మెషిన్లో వేసిన ఓ వీడియో సైతం వైరల్ అయింది. నోట్లపై పలువురుకు ఉన్న అనుమానాలు ఈ వీడియో చూస్తే పటాపంచలవుతాయని, పేర్కొంటూ ఈ వీడియో పోస్టు అయింది. -
అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్.ఠాకూర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం ఎదుట టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. కుంకుమార్చన సేవలో సతీసమేతంగా చీఫ్ జస్టిస్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, చిత్తూరు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో చీఫ్ జస్టిస్ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. -
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు
కేంద్ర ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. రోడ్డు ప్రమాదాల గురించిన విషయంలో సమాధానం ఇంతవరకు పంపనందుకు రవాణా మంత్రిత్వశాఖకు రూ. 25వేల జరిమానా విధించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే అతిపెద్ద లిటిగెంట్ అని, కానీ కోర్టులు సరిగా పనిచేయలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికి ఏడాది గడిచినా మీరు (కేంద్రం) అఫిడవిట్ దాఖలు చేయలేదని అంటూ.. ''ఇక్కడేమైనా పంచాయతీ నడుస్తోందని అనుకుంటున్నారా'' అని వ్యాఖ్యానించారు. దాంతో.. మూడు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తుందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు. -
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రమేశ్ రంగనాథన్
► రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్రం నోటిఫికేషన్ హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రమేశ్ రంగనాథన్ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్.బి.బొసాలే బాధ్యతల నుంచి తప్పుకున్న నాటి నుంచి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ప్రధాన న్యాయమూర్తి నిర్వహించే విధులను నిర్వర్తిస్తారని కేంద్రం ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. జస్టిస్ బొసాలే పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. జస్టిస్ రమేశ్ రంగనాథన్ 1958 జూలై 28న న్యూఢిల్లీలో జన్మించారు. 1977లో గ్రాడ్యుయేషన్, 1981లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చార్టెర్డ్ అకౌంటెంట్‌గా, కంపెనీ సెక్రటరీగా కూడ ఆయన అర్హత సాధించారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1985 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూలై నుంచి 2004 మే వరకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర ప్రముఖ సంస్థలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. 2005, మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2015 డిసెంబర్ 29 నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
మేం మనాలీకి వెళ్లడం లేదు!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ తన సెలవు దినాలను తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 'మేం ఏమైనా సెలవుల్లో ఎంజాయ్ చేస్తామా? మనాలీ వంటి తదితర హిల్స్టేషన్లకు పోయి ఎంజాయ్ చేస్తామనుకుంటున్నారా? తీర్పులను ఎవరు రాస్తారు? ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసన తీర్పులను ఎవరు రాస్తారు? అసలు విషయం తెలుసుకోండి.. మాకు మూడు వారాలు మాత్రమే బ్రేక్ లభిస్తుంది. నా సహచరుడు (జస్టిస్ జేఎస్ ఖేహార్) బ్రేక్ సమయంలో జాతీయ న్యాయ నియామక కమిషన్ (ఎన్‌జేఏసీ)పై విచారించారు. సెలవుల సమయంలో తీర్పును రాశారు' అని చీఫ్ జస్టిస్ ఠాకూర్ చెప్పారు. ఆదివారం ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో చీఫ్ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగ ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ మీద పని భారం మోపడం సరైంది కాదని అన్నారు. అమెరికాలో ఏడాదికి ఒక న్యాయమూర్తి 81 కేసులను పరిష్కరిస్తుంటే ఇండియాలో 2,600 కేసులను పరిష్కరించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జడ్జీలు సెలవులు తగ్గించుకోవాలన్న సూచనపైనా చీఫ్ జస్టిస్ ఘాటూగా స్పందించారు. -
ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకం
-
మరోసారి శ్రీవారి సేవలో..
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు బుధవారం మరోసారి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన జస్టిస్ దత్తు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఇతర భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయన ఓ సామాన్య భక్తుడిలా తిరుమలలో కలియ తిరిగారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలసి మరోసారి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ చీఫ్ జస్టిస్‌ను శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. -
పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి
సుప్రీంకోర్టుకు సమ్మతి తెలిపిన హైకోర్టు న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి పదోన్నతిపై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులు కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నది. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం ఆయన సమ్మతిని కోరింది. ఇందుకు ఆయన సమ్మతి తెలియజేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం పాట్నా హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ రేఖామన్హర్‌లాల్ దోషిత్ వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరువాత జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పాట్నా హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడుతారు. పాట్నా వెళ్లేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి సమ్మతి తెలియచేసిన నేపథ్యంలో త్వరలోనే సుప్రీంకోర్టు కొలీజియం ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపనున్నది. కేంద్రం కూడా ఆమోదముద్ర వేసిన తరువాత సంబంధిత ఫైలు రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన తరువాత పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి జరుగుతున్న మొట్టమొదటి నియామకం ఇదే. ఒకవేళ అన్నీ కలిసొస్తే, తెలంగాణ రాష్ట్ర కోటాలో జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకోర్టుకు సైతం వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి.. వరంగల్ జిల్లా, గవిచర్ల గ్రామంలో 1953 ఆగస్టు 1న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడి నుంచే పీజీ డిగ్రీ కూడా చేశారు. 1979లో న్యాయవాదిగా నమోదు చేసుకుని.. ప్రముఖ న్యాయకోవిదుడు పి.బాబుల్‌రెడ్డి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1983 వరకు బాబుల్‌రెడ్డి వద్ద ఉన్న జస్టిస్ నర్సింహారెడ్డి.. 1984 నుంచి స్వతంత్రంగా కేసులు వాదించడం మొదలు పెట్టారు. 1988-90 సంవత్సరాల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. తరువాత పలు ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు న్యాయసలహాదారుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా వ్యవహరించారు. 2001లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్నో సంచలన కేసుల్లో జస్టిస్ నర్సింహారెడ్డి తీర్పులు వెలువరించారు. -
ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎం లోధా
-
ఏపీ హైకోర్టును త్వరగా ఏర్పాటు చేయండి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీ అడ్వొకేట్ జేఏసీ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలైనంత త్వరగా హైకోర్టును ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధాకి తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించినట్టు జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని విభాగాల్లో విభజన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా, న్యాయవ్యవస్థకు సంబంధించి ఎలాంటి పనులు జరగడం లేదని సీజే దృష్టికి తీసుకెళ్లామన్నారు. అపాయింటెడ్ డే తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు పరిధిలో దీనికి సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకునేలా చూస్తామని సీజే హమీ ఇచ్చినట్టు రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండాలన్న దానికి సీజే సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. -
నిరాశేనా!
రాజీవ్ హంతకుల విడుదల ఇప్పట్లో లేనట్లే సుప్రీం నిర్ణయంతో నిరాశ మళ్లీ పోరాటం అంటున్న అర్బుతామ్మాళ్ చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు క్షమాభిక్షపై విడుదలవుతారని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారు శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో నిరాశకు లోనయ్యూరు. కన్నీరుమున్నీరైన పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ మళ్లీ పోరాడుతానని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యూరు. ఈ కేసుకు సంబంధించి 26 మందికి శిక్ష విధించారు. వారిలో మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళినీలకు ఉరిశిక్ష పడింది. తమ శిక్షను రద్దుచేయాలని రాష్ట్రపతికి, కేంద్రానికి వారు విజ్ఞప్తి చేసుకున్నారు. పసి బిడ్డతల్లి అనే మానవీయ కోణంలో నళినీకి పడిన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చారు. మిగిలిన వారి విషయూన్ని కేంద్రం 11 ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. దీనిపై వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వారి శిక్షను కూడా యావజ్జీవంగా మారుస్తున్నట్టు 2014 ఫిబ్రవరి 18వ తేదీన తీర్పు ఇచ్చింది. వారికి క్షమాభిక్ష పెట్టే విచక్షణాధికారాన్ని కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమం లో ఆ ముగ్గురితోపాటు మొత్తం ఏడుగురికి జైలు జీవితం నుంచి విముక్తి ప్రసాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా హర్షం వెలిబుచ్చాయి. తమిళనాడు ప్రజలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేగాక సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఏడుగురి విడుదలపై స్టే ఇచ్చింది. దీంతో ఆ ఏడుగురి విడుదల ఆగిపోయింది. ఈ పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదుల వాదోపవాదాలు గత నెల 27వ తేదీతో పూర్తయ్యాయని, ఈ నెల 25వ తేదీలోగా తీర్పు వెలువడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఈ నెల 18వ తేదీన కోవైలో ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖైదీల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు నిరాశకు లోనైయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం శుక్రవారం పదవీ విరమణ చేస్తున్నందున మానవతా ధృక్పథంతో చివరి కేసుగా వారికి విముక్తి ప్రసాదిస్తారని అందరూ ఆశించారు. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు భయంకర ఉగ్రవాదులు కాబట్టి వారికి క్షమాభిక్షపై రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని జస్టిస్ సదాశివం వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఏడు అంశాలపై విచార ణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను మూడు నెలల్లోగా ఏర్పాటు చేయూలని ఆదేశించారు. -
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి
-
ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి బాధ్యతలు స్వీకరించారు. నిన్నటివరకూ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి సేవలందించారు. ఆమె పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ రోహిణి, 1976లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చేశారు. 1980 డిసెంబర్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ కోకా రాఘవరావు వద్ద జూనియర్‌గా చేరారు. రాఘవరావు చీఫ్ ఎడిటర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు ఆమె రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. 1995లో హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గాను, 2001లో అదనపు జడ్జిగాను, 2002 నుంచి పూర్తి స్థాయి జడ్జిగాను ఆమె నియమితులయ్యారు. అప్పటినుంచి రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు.