జస్టిస్ చల్లా కోదండరామ్ దంపతులను సత్కరిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి. చిత్రంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చల్లా కోదండరామ్ విధులు నిర్వహించిన ఎనిమిదేళ్లలో 18,890 వేల కేసుల్లో తీర్పులిచ్చారని, మరో 13,752 మధ్యంతర పిటిషన్లను పరిష్కరించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి ప్రశంసించారు. జస్టిస్ కోదండరామ్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు సమావేశమై కోదండరామ్ సేవలను కొనియాడింది.
అనంతరం ఘనంగా వీడ్కోలు పలికింది. తర్వాత హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆయనను సత్కరించింది. రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment