Hindi Remake
-
సంక్రాంతికి వస్తున్నాం.. హిందీ రీమేక్?
వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయాలని చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు ప్లాన్ చేస్తున్నారని, ఈ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్(Akshay Kumar) అయితే బాగుంటుందని ‘దిల్’ రాజు భావిస్తున్నారట. కెరీర్లో ఇప్పటికే ఎన్నో దక్షిణాది సినిమాల హిందీ రీమేక్స్‌లో నటించిన అక్షయ్ కుమార్ మరి... ఈ రీమేక్ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
బేబమ్మగా ఖుషీ
దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ‘ఉప్పెన’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని టాక్. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ (2021) తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనా సమయంలో విడుదలైన ఈ మూవీ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో బేబమ్మగా తనదైన నటనతో అలరించిన కృతీ శెట్టి ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హిట్ మూవీని నిర్మాత బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో అంగీకరించిన రెండో చిత్రం సందర్భంగా చెప్పారట బోనీ. ‘దేవర’ (ఎన్టీఆర్ హీరో) మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జాన్వీ. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్‌తో నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారీ బ్యూటీ. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ్రపారంభోత్వంలో జాన్వీ కపూర్‌తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన అతిథులతో సరదాగా ముచ్చటించిన బోనీ కపూర్.. ‘‘బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ సినిమా చూశాను. కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. మా చిన్నమ్మాయి ఖుషీ కపూర్‌ని ‘ఉప్పెన’ మూవీ చూడమని చెప్పాను’’ అన్నారట. దీంతో ‘ఉప్పెన’ బాలీవుడ్ రీమేక్‌లో హీరోయిన్గా ఖుషీ నటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
లవ్ టుడే హిందీ రీమేక్‌లో ఆమిర్ ఖాన్ కొడుకు, శ్రీదేవి కూతురు
ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ప్రేమికులు కానున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయదర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటించనున్నారు. రూ. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ఫ్యాంటమ్ స్టూడియోస్ దక్కించుకుంది. అప్పట్నుంచి ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో నటించనున్నారంటూ పలువురు హిందీ యువ హీరో హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారని లేటెస్ట్ టాక్. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాను తెరకెక్కిస్తారట. -
రాజమౌళి, ప్రభాస్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయిన హిందీ ఛత్రపతి లెక్కలు
-
ప్రభాస్ సినిమా రీమేక్ కష్టాలు బెల్లంకొండపై తీవ్రంగా ట్రోల్
-
ఫారిన్ స్టోరీ.. బాలీవుడ్ మూవీ
విదేశీ కథలపై హిందీ దర్శక–నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది విదేశీ చిత్రాలు రీమేక్ రూపంలో హిందీ తెరపై కనిపించనున్నాయి. ఆ ఫారిన్ చిత్రాల్లోని కథలు ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉండటంతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఫారిన్ స్టోరీతో రీమేక్ అవుతున్న బాలీవుడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. స్పానిష్ స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రామా ‘చాంపియన్స్’ (2018) హిందీ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా కోసం ఆమిర్, సల్మాన్‌లు కలిసి చర్చించుకున్నారు. ఈ చిత్రానికి ఆమిర్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారట. ఒకవైపు ఈ రీమేక్ గురించి చర్చిస్తూనే మరోవైపు సౌత్ కొరియన్ డిటెక్టివ్ డ్రామా ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ దర్శక –నిర్మాత అతుల్ అగ్ని హోత్రి దక్కించుకున్నారు. ఇక అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’ (2015) హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఈ రీమేక్‌కి అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమా నుంచి దీపికా తప్పుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే షూటింగ్ ఆరంభించలేదని టాక్. కాగా, ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ట్రాన్స్పోర్టర్’ (2002) హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు నిర్మాత విశాల్ రానా. ఇందులో హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్లలో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే అమెరికన్ సూపర్‌హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ర్యాంబో’ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్నారని ప్రకటన వచ్చిoది. ఇక షాహిద్ కపూర్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బ్లడీ డాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ ‘స్లీప్‌లెస్ నైట్’ (2011)కు రీమేక్ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అదే విధంగా సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్’ (2011) హిందీ రీమేక్‌లో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘కోడ’ (2021) రీమేక్‌ను దర్శకుడు విశాల్ బాల్ తెరకెక్కించనున్నారని, అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ (2003) రీమేక్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా విదేశీ చిత్రాల హిందీ రీమేక్ జాబితాలో మరికొన్ని కూడా ఉన్నాయి. -
సల్మాన్.. ఆమిర్... ఓ సినిమా!
సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లు కలిసి ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. స్పానిష్ ఫిల్మ్ ‘చాంపియన్స్’ హిందీ రీమేక్‌ను నిర్మించి, నటించా లనుకున్నారు ఆమిర్. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు సల్మాన్ ఖాన్ బాగుంటారని భావించారట. ఈ సినిమా గురించి చర్చించడానికి సల్మాన్‌ను ఇంటికి ఆహ్వానించారట ఆమిర్. కాగా తాను నటించిన ‘ది ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్‌సింగ్ చడ్డా’ సరిగ్గా ఆడకపోవడంతో వెంటనే మరో రీమేక్‌లో నటించాలనే నిర్ణయాన్ని ఆమిర్ మార్చుకున్నారట. అందుకే హీరోగా నటించాల్సిందిగా సల్మాన్‌ను రిక్వెస్ట్ చేశారని టాక్. -
అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ
Rashmika Mandanna Was 1st Choice For Shahid Jersey: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ ఈ నెల 22న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇందులో షాహిద్ నటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన నేచులర్ స్టార్ నాని జెర్సీకి ఇది హిందీ రీమేక్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ ఇదే పేరుతో ఈ మూవీని రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్ తల్వార్ అనే తండ్రి పాత్రలో కనిపించాడు. చదవండి: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో షాహిద్ పోషించిన భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయినప్పటికీ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షాహిద్ భార్యగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకుర్ నటించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదించారట చిత్ర బృందం. అయితే తను ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. ఐఏఎన్ఎస్తో ముచ్చటించిన రష్మిక హిందీ జెర్సీ ఆఫర్‌పై నోరు విప్పింది. తనకు హిందీ జెర్సీ ఆఫర్ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించానని తెలిపింది. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ‘ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసినవన్ని కమర్షియల్ సినిమాలే. అలాంటి నేను జెర్సీలాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది. జెర్సీ మంచి సినిమా కాదు అని నేను అనడం లేదు. ఇది రియలిస్టిక్ చిత్రం. జెర్సీ తెలుగు వెర్షన్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు తనకన్న గొప్పగా ఎవరూ నటించలేరని నా ఉద్దేశం. అందుకే ఈ పాత్రకు నేను కరెక్ట్ కాదని అనిపించింది. అనుకుంటే నేను ఈ సినిమాలో నటించేదాన్నే. కానీ నా వల్ల దర్శక-నిర్మాతలు నష్టపోకూడదనుకున్న. ఈ సినిమా కోసం వారికి నాకంటే బెటర్ ఆప్షన్స్ ఎన్నో ఉండోచ్చు కదా. అందుకే ఈ సినిమాకు నో చెప్పాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగు పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ చిత్రాలతో బిజీగా ఉంది. -
సూర్య మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న అక్షయ్, షూటింగ్ షురూ
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సురారై పోట్రూ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇందులో సూర్య కెప్టెన్ గోపీనాథ్ అనే వ్యాపార వేత్త పాత్రలో నటించాడు. ‘సింప్లీ ఫై’ అనే పుస్తకం ఆధారం తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని రోజులగా ఈ మూవీ హిందీ రీమేక్‌పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో రీమేక్ చేస్తున్నట్లు తాజాగా సూర్య ట్విటర్ వేధికగా వెల్లడించాడు. చదవండి: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే అసహ్యం: షాహిద్ కపూర్ ‘మరో కొత్త ఆరంభానికి మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి’ అంటూ అక్షయ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. ఇందులో అక్షయ్ సరసన రాధిక మదన్ నటిస్తోంది. ఈ రోజు మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. హీరోయిన్ రాధిక కొబ్బరికాయ కొడుతున్న వీడియోను అక్షయ్ షేర్ చేశాడు. ఇదే వీడియో సూర్య రీట్వీట్ చేశాడు. కాగా తెలుగులో ఈ సినిమా దర్శకత్వం వహించిన సుధాకొంగర హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తోంది. 2డీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌పై తెలుగు, తమిళంలో ఈ సినిమాను నిర్మించిన సూర్య హిందీలో కూడా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. Proud and heart filled 😊❤️…!🙏🏽 https://t.co/ivLwgt5FZH — Suriya Sivakumar (@Suriya_offl) April 25, 2022 -
రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్‌డే స్పెషల్ ట్రీట్
Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్‌గా పేరొందిన హృతిక్ రోషన్ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. 'విక్రమ్ వేద' హీందీ రీమెక్ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్‌లో హృతిక్ రఫ్ లుక్‌లో అట్రాక్టీవ్‌గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ హిందీ రీమెక్కు డైరెక్షన్ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్ నటించిన విక్రమ్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్ బర్త్‌డే స్పెషల్ ట్రీట్‌గా వెద ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది. वेधा . VEDHA#vikramvedha pic.twitter.com/4GDkb7BXpl — Hrithik Roshan (@iHrithik) January 10, 2022 ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’
సాక్షి,భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి బీచ్‌లో శుక్రవారం షూటింగ్ సందడి నెలకొంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో అదే పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, బెల్లంకొండ సురేష్ నిర్మాత. హీరోయిన్ ముసరత్ బంచా, హీరో తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా ఇంకా శరత్ ఖేలేఖర్, రాజేష్‌శర్మ, రాంజేంద్ర గుప్తా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 10 వరకు ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తారు. వినాయక్‌ను కలిసిన మంత్రి ముత్తంశెట్టి షూటింగ్లో ఉన్న దర్శకుడు వినాయక్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. స్వయం కృషితో గొప్ప దర్శకునిగా ఎదిగారని భీమిలిలో జరిగే ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయనకు హిందీలో తొలి సినిమా అని అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని గుర్తింపు పొందుతారని అన్నారు. చదవండి: Allu Arjun-Priyamani: ప్రియమణిపై ‘హాట్’ కామెంట్స్ చేసిన బన్నీ -
బాలీవుడ్‌లోకి ఆర్ఎక్స్ 100, అల వైకుంఠపురములో.. టైటిల్స్ ఇవే
టాలీవుడ్ స్టోరీలు బాలీవుడ్ కి వెళుతున్నాయి. మన కథలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. రస్టిక్ లవ్ స్టోరీస్ ని మాత్రమే కాదు తెలుగులో సక్సెస్ అయిన కమర్షియల్ చిత్రాల్ని కూడా బాలీవుడ్ మేకర్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. అలాంటి రెండు రీమేక్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం.. షెహజాదా... అంటే యువరాజు అని అర్థం. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇది బాలీవుడ్ రీమేక్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు టీ సిరీస్, బ్రాత్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. అల్లు అర్జున్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. కృతీ సనన్ హీరోహిన్ గా యాక్ట్ చేస్తోంది. టబు పోషించిన పాత్రలో మనీషా కోయిరాల కనిపించబోతుంది. షెహజాదా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు 2022 నవంబర్ 4న షెహజాదా రిలీజ్ కాబోతున్న ప్రకటించింది మూవీ టీమ్. తడప్.. తెలుగులో స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఎక్స్100 కు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని మిలన్ లూద్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. అషన్ శెట్టి, తారా సుతారియా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 3న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. -
‘కాటమరాయుడు’ రీమేక్‌ని పక్కన పెట్టిన సల్మాన్, కారణం ఇదేనా?
సౌత్ సైడ్ ఏదైనా మూవీ హిట్ అయితే చాలు. బాలీవుడ్ లో సల్మాన్ అలెర్ట్ అయిపోతాడు. వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తాడు. అలా సౌత్ లో సూపర్ హిట్టైన వీరమ్ మూవీని, గతంలోనే సల్మాన్ బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నాడట. ఆ సౌత్ రీమేక్ ను పక్కన పెట్టాడట. 2014లో విడుదలైన వీరమ్ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ ఊరమాస్ లుక్ కు కోలీవుడ్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 80 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయింది. హిందీలో సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీవాళి పేరుతో రీమేక్ చేయాలనుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కాని ఇప్పుడు ఈ రీమేక్ ఆగిపోయిందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఓటీటీలో రిలీజ్ చేసిన న్యూ మూవీ రాధే. ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. దాంతో సల్మాన్ షాక్ కు గురైయ్యాడని సమాచారం. తాను చేస్తున్న, చేయాల్సిన ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడట. అందులో భాగంగా అంతిమ్, టైగర్ 3 చిత్రాలు తప్పితే మిగితా ప్రాజెక్ట్స్ అన్నిటినీ హోల్డ్ లో పెట్టాడట. కాటమరాయుడు హిందీ రీమేక్ ను క్యాన్సిల్ చేసాడట. ప్రస్తుతం సల్మాన్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ లో మాస్టర్ రీమేక్, దబాంగ్ 4, కిక్ 2, చిత్రాలు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తోంది. ఓటీటీలోకి మరో మూవీ ఈద్ కానుకగా రాధే ను ఇటు ఓటీటీలోను, అటు థియేటర్స్ లోనూ ఒకేసారి రిలీజ్ చేసాడు సల్మాన్. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో అంతిమ్ కూడా విడుదల కానుందట. దేశంలో పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకోకపోవడంతో, సింగిల్ స్క్రీన్స్, జీ5 యాప్ లో అంతిమ్ మూవీ ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మూవీలో సల్మాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ రోల్ ను ఆయుష్, అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను సల్మాన్ చేస్తున్నాడు. -
హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్
Madras High Court Green Signal To Remake Of Soorarai Pottru: సూరరై పోట్రు చిత్రం హిందీ రీమేక్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు.. కథనాయకుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన చిత్రం సూరరై పోట్రు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య అబున్డంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయరాదని, కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ ఆధారంగా రచించిన సింప్లిఫై పుస్తక హక్కులు తమకు చెందినవి అంటూ సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ప్రతిగా 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. వాదనల అనంతరం న్యాయమూర్తి బుధవారం 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. -
'అల.. వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో బన్నీ!
అల్లు అర్జున్‌కి దక్షిణాదిలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన స్టైలిష్ లుక్స్, నటనతో సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా ‘అల.. వైకుంఠపురములో’ సినిమా రీమేక్‌తో అని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘షాజాదే’ (యువరాజు) పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ జంటగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పరేశ్ రావల్, మనీషా కొయిరాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అతిథి పాత్ర చేయాలని అల్లు అర్జున్‌ని చిత్రవర్గాలు కోరగా, ఆయన పచ్చజెండా ఊపారని టాక్. తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ అతిథి పాత్ర లేదు. మరి ‘షాజాదే’లో అతిథి పాత్రను జోడించి ఉంటారా? ఉంటే.. ఆ పాత్రను అల్లు అర్జున్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. -
బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్.. లాంఛ్ చేసిన రాజమౌళి
అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. 2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఛత్రపతి హిట్‌తో మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కోర్టు మెట్లు ఎక్కనున్న రాధికా ఆప్టే?
కోర్టు మెట్లు ఎక్కనున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అంటే.. కాదు. కొత్త సినిమా కోసం కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లోనే ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన లాయర్ పాత్రను హిందీలో రాధికా ఆప్టే చేయనున్నారట. కథ ప్రకారం మాధవన్ భార్య శ్రద్ధా శ్రీనాథ్. సో.. హిందీలో సైఫ్‌కి జోడీగా రాధిక కనిపిస్తారన్న మాట. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులోపు చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. -
హిందీలోకి ‘సూరరై పోట్రు’, బాలీవుడ్‌లోకి నిర్మాతగా సూర్య ఎంట్రీ
హీరో సూర్య ఇటీవల నటించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. సూర్య, జ్యోతికలు కలిసి నిర్మించిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఓటీటీలో విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు సూర్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సూర్య, జ్యోతిక, రాజశేఖర్ పాండియన్లు సంయుక్తంగా ఈ మూవీని అబన్డంతియ ఎంటర్టైన్మెంట్స్పై బాలీవుడ్లో నిర్మించబోతున్నారు. ఈ రీమేక్ ద్వారా హీరో సూర్య బాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. దర్శకుడు సుధా కొంగర బాలీవుడ్‌లోనూ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక హీరో ఎవరన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. హీరో, నటీనటులు ఎవరన్నది త్వరలోనే అధికారిక ప్రకటన వెలువనుంది. Excited to announce our association with @Abundantia_Ent lead by @vikramix for #SooraraiPottru in Hindi, Directed by #SudhaKongara@CaptGopinath#Jyotika @rajsekarpandian @ShikhaaSharma03 @2D_ENTPVTLTD pic.twitter.com/ECjSpO9OOT — Suriya Sivakumar (@Suriya_offl) July 12, 2021 -
‘హిట్’ రీమేక్‌లో హీరోయిన్గా దంగల్ నటి ఖరారు!
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్‌ను అందుకుంటున్నాయి. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన ఉప్పెన. ఇది చిన్న సినిమే అయినప్పటికీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కంటెంట్ చిత్రాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కబీర సింగ్‌గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడంతో ఇక బాలీవుడ్ మన తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ టాలెంటెట్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ కూడా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. హిందీ రాజ్‌కుమార్ రావు హీరోగా తెరకెక్కతున్న ఈ రీమేక్‌లో.. తాజాగా హీరోయిన్ను కూడా ఖారారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దంగల్ మూవీ నటి సన్యా మల్హోత్రాను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. కాగా దంగల్‌లో ఆమె ఆమీర్ ఖాన్‌కు కూతురిగా కనిపించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితో పాటు జెర్సీ, బ్రోచేవారేవరురా, అలా వైకుంఠపురంలో, డీజే, నంది, రవితేజ ఖిలాడీ మూవీలో కూడా హందీ రీమేక్‌కు క్యూలో ఉన్నాయి. -
అమీర్‌తో ఖాన్‌కు ఫ్రెండ్‌గా నాగ చైతన్య..
గురువారం నుంచి నాగచైతన్య హిందీ సంభాషణలు పలుకుతున్నారు. అలాగే యుద్ధం కూడా చేస్తున్నారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ కోసమే ఇదంతా. ఇందులో చైతూ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. లాల్‌సింగ్ చద్దా (ఆమిర్ పాత్ర పేరు) ఆర్మీలో ఉన్నప్పుడు అతని స్నేహితుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది. చైతూది కూడా ఆర్మీ మ్యాన్ పాత్ర అని టాక్. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని, మేకోవర్ అయ్యారని తెలిసింది. గురువారం లడఖ్‌లో ఆరంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి ఆమిర్ ఖాన్, నాగచైతన్య తదితరులు ఎంటరయ్యారు. కొన్ని టాకీ సీన్స్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ సీన్స్‌ని హాలీ వుడ్ స్టంట్ మాస్టర్స్ డిజైన్ చేస్తున్నారట. దాదాపు 20 రోజులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారట నాగచైతన్య. -
అజయ్ దేవగణ్ భార్యగా కాజల్..
హిందీ హీరో అజయ్ దేవగణ్‌తో కాజల్ అగర్వాల్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హిందీ ‘సింగం’ చిత్రంలో అజయ్‌తో తొలిసారి నటించారు కాజల్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్–కాజల్ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారని టాక్. అయితే తమిళ వెర్షన్లో హీరోయిన్ పాత్రకు స్థానం లేదు. కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారని ఓ వార్త హల్చల్ చేస్తోంది. -
‘ఛత్రపతి’ కోసం రూ.3 కోట్లతో ఆరు ఎకరాల్లో భారీ సెట్!
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో డా. జయంతి లాల్ గడ ఈ రీమేక్‌ని నిర్మించనున్నారు. తెలుగు ‘ఛత్రపతి’కి కథ అందించిన విజయేంద్రప్రసాద్ హిందీకి తగ్గట్టు కొన్ని మార్పులతో కథను తయారు చేస్తున్నారట. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 22న షూటింగ్ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈలోపు అకాల వర్షాల వల్ల ఈ సెట్ బాగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ సెట్‌ని మళ్లీ సెట్ చేసి, కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. -
హిందీలో రీమేక్ కానున్న సౌత్ చిత్రాలు: హీరోలు ఎవరంటే?
దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్? ఆ విషయంలోనే బాలీవుడ్ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్ కపూర్ (నిర్మాత బోనీకపూర్ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్ డియోల్ మెయిన్ లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్ అప్డేట్ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్ గాయత్రి ద్వయమే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారని, ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ‘అంజామ్ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్’ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. కుంచకో బోబన్ నటించిన ‘అంజామ్ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్’ రీమేక్‌కు విశాల్ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్ హిట్ సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హిందీలోకి దృశ్యం 2: హీరోపై రాని క్లారిటీ!
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీలో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషన్ సంస్థ నిర్మాతలు కుమార్ పాఠక్, అభిషేక్ పాఠక్ ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ‘‘దృశ్యం 2’ మంచి హిట్ సాధించింది. ఇలాంటి కథలు మరింతమంది ప్రేక్షకులకు చేరాలనే ఉద్దేశంతో హిందీ రీమేక్ హక్కులను తీసుకున్నాం’’ అన్నారు కుమార్, అభిషేక్. అయితే హిందీ రీమేక్‌లో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయంపై సరైన స్పష్టత ఇవ్వలేదు నిర్మాతలు. ఇక మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రధారులుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 2013లో ‘దృశ్యం’ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్ హీరోగా నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. చదవండి: హిట్ రిపీట్ అవుతుందా? -
‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్, హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లెన్త్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట. ఇందులో హీరోను కూడా నవీల్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా గతంలో నవీల్ పోలీశెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌ను కూడా నవీన్‌నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్ పూర్తి చేసినట్లు సమాచారం. చదవండి: ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్ -
కథ నాది, మీకు హక్కు లేదు, అర్థం అవుతుందనుకుంటా: శంకర్
వరుస వివాదాలతో దర్శకుడు శంకర్ అల్లాడిపోతున్నారు. హీరో రామ్‌చరణ్‌తో శంకర్ సినిమాను అనౌన్స్ చేయగానే ‘కమలహాసన్‌తో తాము నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయనిదే ఎక్కడికీ కదలడానికి లేదు’ అని లైకా ప్రొడక్షన్స్ కేసు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా, తమిళ చిత్రం ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) హిందీ రీమేక్‌ను హీరో రణ్‌వీర్‌సింగ్‌తో చేయనున్నట్టు బుధవారం నాడు శంకర్ ప్రకటించడం మరో సంచలనమైంది. ఇప్పుడు ఆ ప్రకటన కూడా వివాదాస్పదమైంది. శంకర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే అప్పట్లో ‘అన్నియన్’ చిత్రాన్ని నిర్మించిన ‘ఆస్కార్’ రవిచంద్రన్ ఆ కథ హక్కులు తనవి అంటూ ఘాటుగా లేఖ పంపారు. ఆ వెంటనే శంకర్ దానికి తన స్పందనగా మరో ఘాటైన ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ వివాదం సినీసీమలో గురువారం పెద్ద చర్చనీయాంశమైంది. నన్నడగకుండా ఎలా తీస్తారు? – ‘అన్నియన్’ నిర్మాత రవిచంద్రన్ ‘నా ఊహలకు తగ్గట్టు పవర్ఫుల్ హీరో దొరికాడు. హిందీలో నా ‘అన్నియన్ ’ అతనే’ అని దర్శకుడు శంకర్ ఇలా ప్రకటించారో, లేదో అలా వివాదం మొదలైంది. ‘‘నన్ను సంప్రదించకుండానే రీమేక్‌ని ప్రకటిస్తారా?’ అంటూ ‘అన్నియన్ ’ చిత్ర నిర్మాత ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్ మండిపడ్డారు. దర్శకుడు శంకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే... ‘‘మీరు (శంకర్) ‘అన్నియన్ ’ ఆధారంగా హిందీలో ఓ సినిమాను అనౌన్స్ చేయడం తెలిసి, షాక్ అయ్యాను. ‘అన్నియన్ ’కు నేను నిర్మాతని అని మీకు గుర్తుండే ఉంటుంది. ఈ స్టోరీ లైన్ పై పూర్తి స్థాయి హక్కులను రచయిత సుజాత (దివంగత రచయిత సుజాతా రంగరాజన్ )కు డబ్బు చెల్లించి నేను సొంతం చేసుకున్నాను. ఇందుకు ఆధారాలు కూడా నా వద్ద భద్రంగా ఉన్నాయి. ‘అన్నియన్ ’ స్టోరీలైన్ కు సంబంధించిన పూర్తి హక్కులు నావే. నా అనుమతి లేకుండా ఈ స్టోరీలైన్ తో రీమేక్ సినిమా చేయాలనుకోవడం చట్టరీత్యా నేరం. మీ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సక్సెస్ కాకపోవడంతో ఆందోళనలో ఉన్న మీకు ‘అన్నియన్ ’కు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నేనే. ఈ సినిమా సక్సెస్ఫుల్ దర్శకుడిగా మీ స్టార్‌డమ్‌ను పెంచింది. ఇందులో ‘అన్నియన్ ’ నిర్మాతగా నా సపోర్ట్ ఉంది. కానీ ఇదంతా మరచిపోయి నన్ను సంప్రదించకుండానే మీరు హిందీ రీమేక్‌ను అనౌన్స్ చేశారు. ఎప్పుడూ నైతిక విలువలను పాటించే మీరు, మీ స్థాయిని తగ్గించుకునేలా ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నియన్ ’ హక్కులు నా దగ్గర ఉన్నాయి గనుక, హిందీ రీమేక్ ఆలోచనను విరమించుకోవాలని సలహా ఇస్తున్నా’’ అని పేర్కొన్నారు రవిచంద్రన్ . కథ... స్క్రీన్ ప్లే...డెరెక్షన్ నావి! – దర్శకుడు శంకర్ ‘అన్నియన్ ’ హక్కులు తనవేనంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన నిర్మాత రవిచంద్రన్ కు దర్శకుడు శంకర్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ‘‘ఆ ‘అన్నియన్ ’ కథ హక్కులు మీవి (రవిచంద్రన్) అంటూ... పంపిన మెయిల్ చూసి షాక్ అయ్యాను. కథ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శంకర్ అనే టైటిల్‌తోనే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను నేను ఎవరికి అప్పగించ లేదు. ఆ స్క్రిప్ట్ నిజానికి రచయిత సుజాత గారిదని మీరు అనడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఆ సినిమాకు డైలాగ్స్ మాత్రమే రాశారు. అందుకే, ఆయనకు సినిమాలో డైలాగ్ రైటర్‌గా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. డైలాగ్స్ మినహా... ‘అన్నియన్ ’ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్ ఇలా దేనిలోనూ సుజాత గారి ప్రమేయం లేదు. ‘అన్నియన్ ’కు దర్శకుడిగా నాకే కాదు. నిర్మాతగా మీకూ పేరు వచ్చింది. నిర్మాతగా సినిమా స్క్రిప్ట్‌పై మీకు హక్కు లేదు. నిరాధారమైన ఆరోపణలను ఇకనైనా మానుకోండి. మీరు చెబుతున్న అవాస్తవాలు నా భవిష్యత్ ప్రాజెక్ట్స్‌ను ప్రభావితం చేయవు. నా వివరణ మీకు పాజిటివ్‌గానే అర్థం అవుతుందని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు శంకర్. కమల్ వస్తే... శంకర్ రెడీనే! ‘అన్నియన్’ వివాదం ఇలా ఉండగా... ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా, శంకర్ మరో సినిమాను డైరెక్షన్ చేయకూడదని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం విచారణ జరిగింది. శంకర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, ‘‘లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఆరోపించినట్లు ‘ఇండియన్ 2’ను శంకర్ మధ్యలో వదిలేయలేదు. ఆ సినిమా షూటింగ్‌కు విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా ఫారిన్ టెక్నీషియన్స్‌తో షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టడం అంత ఈజీ కాదు. ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న పెద్ద డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌ను రెండేళ్ళుగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు. జూన్‌లో కూతురి పెళ్ళి పెట్టుకున్నప్పటికీ, కమల్‌హాసన్ గనక షూటింగ్‌కు వస్తే ‘ఇండియన్ 2’ను పూర్తి చేయడానికి శంకర్ సిద్ధంగానే ఉన్నారు’’ అని కోర్టుకు విన్నవించుకున్నట్లు కోడంబాకమ్ సమాచారం. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్ ’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను అనౌన్స్ చేశారు శంకర్. తొలిపార్టులో హీరోగా నటించిన కమల్‌హాసనే మలిపార్టులో కూడా హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
ఆర్టికల్ 15 రీమేక్‌లో ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ హిందీ చిత్ర రీమేక్‌లో నటించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో చాలా మంది నటులు మాదిరిగానే ఉదయనిధి స్టాలిన్ కూడా కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. హిందీలో సంచలన విజయం సాధించిన ఆర్టికల్ 15 చిత్ర రీమేక్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, నాజర్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్టికల్ 15 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ పొందారు. ఇప్పుడు తమిళంలో బోని కపూర్, జి స్టూడియోస్ సంస్థలు సమర్పణలో రోమియో పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. చదవండి: దర్శకుడు సుందర్‌కి కరోనా .. వెల్లడించిన ఖుష్బూ ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో -
హిందీ ‘మాస్టర్’గా సల్మాన్ ఖాన్!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో హిందీలో రీమేక్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విజయ్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాస్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఈ మూవీ హిందీ వెర్షన్లో బాలీవుడ్లో విడుదలైనప్పటికి ‘మాస్టర్’ హందీ రీమేక్‌కు నిర్మాత మురాద్ ఖేతని (కబీర్ సింగ్ నిర్మాత) రైట్స్‌ను దక్కించుకున్నారట. ఇందులో విజయ్ పాత్ర కోసం ఆయన ఇటీవల సల్మాన్ ఖాన్‌ను సంప్రదించి కథ వివరించారట. మాస్టర్ స్టోరీ లైన్‌ను చెప్పినప్పుడు సల్మాన్ ఇంప్రెస్ అయ్యారని, కథలో కొన్ని సూచనలు చెప్పి, హిందీ ఆడియన్స్‌కు తగ్గట్లుగా మార్పులు చేయాలని కోరారట. మాస్టర్ కథ గురించి చెప్పాలంటే.. కాలేజీ స్టూడెంట్స్ ఇష్టపడే ఓ లెక్చరర్ కొన్ని పరిస్థితుల కారణంగా జైలుకు వార్డెన్‌గా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బాల నేరస్థులను తన స్వార్థానికి ఉపయోగించుకునే ఓ రౌడితో ఈ లెక్చరర్ పోటపీపడి వారిని ఎలా కాపాడాడు అనేదే ‘మాస్టర్’ కథ. -
బెల్లంకొండ రిక్వెస్ట్: అనన్య ఓకే చేస్తుందా?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట కానసాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే కొందరు స్టార్ హీరోయిన్లను కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే తాజాగా బెల్లంకొండకు జోడీగా హీరోయిన్ అనన్య పాండేను సంప్రదించారట చిత్ర బృందం. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారట. మరి ఈ ఆఫర్‌కు అనన్య గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనన్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తుంది. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లుడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం. చదవండి : (ఆ నటుడితో బిగ్‌బీ మనవరాలు ప్రేమాయణం.. స్పందించిన తండ్రి) (కంగనాపై ఆర్జీవీ ట్వీట్, ఆ వెంటనే డిలీట్!) -
హీరో విలన్, విలన్ హీరో అయ్యాడు
లాక్డౌన్లో సోనూ సూద్ రియల్ హీరో అయ్యారు. ఆ తర్వాత రీల్ హీరో కూడా అయ్యారు. హీరోగా పలు చిత్రాలు కమిటయ్యారు. ‘కిసాన్’ అనే సినిమాలో హీరోగా చేస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. తాజాగా తమిళ హిట్ చిత్రం ‘ఇరంబుదురై’ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట సోనూ సూద్. విశాల్ హీరోగా, అర్జున్ విలన్ పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగులో ‘అభిమన్యుడు’గా విడుదలైంది. ఈ హిందీ రీమేక్‌కి సంబంధించిన మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విశాల్ విలన్‌గా కనిపించనున్నారట. ఈ సినిమా ద్వారా ఆయన బాలీవుడ్‌కి ఎంట్రీ కాబోతున్నారు. సో.. విలన్ హీరో అయితే హీరో విలన్ అయ్యారు. రోల్స్ రివర్శ్ అయ్యాయన్నమాట. -
మ్యాచ్‌కి డేట్ ఫిక్స్
నాని హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లో విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయింది. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. తెలుగు ‘జెర్సీ’ని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ తెరకెక్కించారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘దిల్’ రాజు, అమన్ గిల్, ఎస్. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 5న ‘జెర్సీ’ సినిమాను విడుదల చేస్తున్నామని షాహిద్ కపూర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ఫెంటాస్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చెయ్యడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
గుడ్‌లక్ జెర్రీ
కెరీర్ ఆరంభంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం అంటే సవాల్ లాంటిదే. జాన్వీ కపూర్ అలాంటి సవాల్నే అంగీకరించారు. తమిళంలో నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ సినిమా హిందీ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా తల్లితండ్రుల బాధ్యత తీసుకుని, కేన్సర్ బారిన పడిన తల్లిని కాపాడుకోవడానికి డబ్బు కోసం డ్రగ్స్ ముఠాలో చేరుతుంది కథానాయిక. చివరికి తన జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది కథ. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లో ఆరంభమైంది. ఈ చిత్రానికి ‘గుడ్ లక్ జెర్రీ’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, జాన్వీ కపూర్ లుక్‌ని విడుదల చేశారు. -
బాలీవుడ్‌కి బ్రోచేవారెవరురా
2019లో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ ఒకటి. శ్రీ విష్ణు, నివేదా «థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. అజయ్ దేవగణ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అభయ్ డియోల్, కరణ్ డియోల్ ఈ రీమేక్‌లోæ హీరోలు. దేవెన్ ముంజల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చడంతో రీమేక్ రైట్స్ తీసుకున్నారట అజయ్. ప్రస్తుతం కథను హిందీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు మారుస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది
‘‘ఎవరైనా వాళ్ల సినిమాను ప్రేక్షకులకు థియేటర్స్‌లోనే చూపించాలనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల తప్పనిసరి అయింది’’ అన్నారు దర్శకుడు జి. అశోక్. అనుష్క ముఖ్య పాత్రలో అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. అశోక్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ‘దుర్గామతి’ టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్ర చేశారు. అక్షయ్ కుమార్ ఓ నిర్మాత. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా అశోక్ చెప్పిన విశేషాలు. ► ఓ పెద్ద హీరోతో హిందీ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు ‘భాగమతి’ రీమేక్ కోసం హిందీ నిర్మాతలు నన్ను కలిశారు. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది దాటడంతో ఇప్పుడు రీమేక్ చేస్తే చూస్తారా? అనుకున్నాను. రీమేక్ చేయాలని, నేనే చేయాలని నిర్మాతలు అడిగారు. అప్పటికే అక్షయ్ కుమార్‌గారు ఈ సినిమా రీమేక్‌ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది. ఒరిజినల్లో మనం సరిగ్గా చెప్పలేదు అనుకున్న సీన్లను ఇంకా బాగా చెప్పొచ్చు ► దర్శకుడిగా నాకు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకునే స్వేచ్ఛని ఇచ్చారు. భూమి పెడ్నేకర్ ఈ పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నాం. చాలా బాగా చేసింది. ఈ పాత్రకు న్యాయం చేసింది. లాక్డౌన్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. లాక్డౌన్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేశాం. షూటింగ్ కంటే నిర్మాణానంతర కార్యక్రమాలు చాలా కష్టం అయ్యాయి. లాక్డౌన్ సమయంలో టెక్నీషియన్లు బయటకు రావడానికి కాస్త భయపడ్డారు. ► ఈ సినిమా థియేటర్స్ కోసం చేశాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇంట్లోనూ వీలైనంత ఆస్వాదించేలా ఈ సినిమాను రెడీ చేశాం. ‘సినిమా బుల్లెట్లా పరిగెడుతోంది. చాలా బావుంది’ అని చూసిన తర్వాత అక్షయ్ కుమార్‌గారు అన్నారు. ► హన్సికతో ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాను. అదీ అమెజాన్‌లో త్వరలోనే విడుదల కానుంది. అలానే ఓ రెండు హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఒక సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. తమిళంలోనూ ఓ పెద్ద హీరోతో కథా చర్చలు జరుగుతున్నాయి. -
అక్షయ్ ఊసరవెల్లి
టాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతుండటం తెలిసిందే. తెలుగు చిత్రాలను బాలీవుడ్ ప్రేక్షకులకు అందించడంలో హీరో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే పలు టాలీవుడ్ చిత్రాల రీమేక్‌లో నటించిన ఆయన తాజాగా మరో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్. ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊసరవెల్లి’. 2011లో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ చూసిన అక్షయ్ కుమార్ ఫిదా అయ్యి, హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట.కాగా ఇప్పటికే ‘టిప్స్’ అనే సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులు కొనుగోలు చేసిందట.. ప్రస్తుతం బాలీవుడ్‌కి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్. అయితే ఈ సంస్థ నిర్మించే చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయంపై క్లారిటీ లేదు. మరి ‘టిప్స్’ సంస్థ నిర్మించే చిత్రంలో అక్షయ్ కుమార్ నటిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. కాగా ఇప్పటికే తెలుగులో హిట్ అయిన ‘అల వైకుంఠపురములో, ఇస్మార్ట్ శంకర్, ఛత్రపతి’ సినిమాలు తాజాగా బాలీవుడ్లో రీమేక్ కానున్నాయి. -
మళ్లీ కాంబినేషన్ షురూ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ‘అల్లుడు శీను’ తొలి సినిమా. డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ సినిమాతో శ్రీనివాస్‌ను హీరోగా తెలుగుకు పరిచయం చేశారు. మంచి సక్సెస్‌ను కూడా తనకు అందించారు. ఇప్పుడు మరోసారి తన తొలి దర్శకుడితో బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు సాయి శ్రీనివాస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ హిందీలో రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌ను వీవీ వినాయక్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రభాస్ చే సిన రోల్‌ను సాయి శ్రీనివాస్ చేస్తారు. ఈ రీమేక్ సాయి శ్రీనివాస్‌కే కాదు వినాయక్‌కి కూడా హిందీలో తొలి సినిమా అవుతుంది. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మిస్తారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నా బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. ఈ పాత్ర చేయడం గొప్ప బాధ్యతలా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఛత్రపతి’ కథకు సాయి శ్రీనివాస్ కరెక్ట్. రీమేక్స్‌లో వినాయక్‌గారి నైపుణ్యం అందరికీ తెలిసిందే’’ అన్నారు జయంతిలాల్ గడ. -
ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా సాయి శ్రీనివాస్‌ను హీరోగా అల్లడు శీను సినిమాతో వీవీ వినాయక్ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కనుండటం విశేషం. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: (సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్) -
దుర్గావతి కాదు దుర్గామతి
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘భాగమతి’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్. అశోక్ జి. దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అయింది. అనుష్క పోషించిన పాత్రలో భూమి ఫెడ్నేకర్ నటించారు. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అశోక్ ఈ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఇది వరకు ‘దుర్గావతి’ అని టైటిల్ పెట్టారు. తాజాగా ‘దుర్గామతి: ది మిత్’గా మార్చారు. అలాగే ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతల్లో ఒకరైన అక్షయ్ కుమార్. డిసెంబర్ 11న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
మమ్మమ్మాస్ ఎంట్రీ షురూ
ప్రభాస్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ‘ఛత్రపతి’ (2005) ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనున్నారు. ‘అల్లుడు శీను’ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయిశ్రీనివాస్. తన ప్రతి చిత్రాన్ని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటూ వచ్చారు. అలా డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు శ్రీను. ఇప్పుడు డైరెక్ట్ సినిమాతో హిందీ తెరపై కనిపించాలనుకున్నారు. మంచి మాస్ కథాంశంతో రూపొందిన ‘ఛత్రపతి’ రీమేక్ అయితే బాగుంటుందనుకున్నారు. ఈ రీమేక్ కోసం ఓ ఫోటోషూట్ చేశారట సాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. -
మళ్లీ జంటగా...
కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు చిత్రం ‘ఖైదీ’. రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. హీరోయిన్ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఖైదీ’ చిత్రం హిందీలో రీమేక్ కాబోతోంది. కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేయనున్నారు. అయితే ఈ రీమేక్‌లో ఓ పెద్ద మార్పు చేయబోతున్నారని తెలిసింది. హిందీ రీమేక్‌లో హీరోయిన్ పాత్రను కూడా చేర్చనున్నారట. ఈ పాత్ర కోసం కాజోల్‌ను సంప్రదించారని సమాచారం. గతంలో ‘హల్చల్, దిల్ క్యా కరే, యు మీ ఔర్ తుమ్’ వంటి సినిమాల్లో జంటగా నటించారు ఈ ఇద్దరూ. ‘ఖైదీ’లో నటిస్తే ఈ రియల్ లైఫ్ కపుల్‌ని మరోసారి జంటగా తెర మీద చూడొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. -
ఆట ముగిసింది
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో రీమేక్ అయింది. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. నాని పాత్రను షాహిద్ కపూర్ పోషించారు. కోవిడ్ వల్ల చాలా సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ఉత్తరాఖండ్‌లో తిరిగి ప్రారంభించి, పూర్తి చేశారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్‌గా కనిపించడానికి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నారు షాహిద్. మృణాల్ థాకూర్ కథానాయికగా నటించారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
బైబై లాల్‌సింగ్
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ ముఖ్య పాత్రలో ‘లాల్ సింగ్ చద్దా’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కరీనా కపూర్ కథానాయిక. అద్వైత్ చందన్ దర్శకుడు. లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. అయితే లాక్‌డౌన్‌లోనే కరీనా కపూర్ మళ్లీ తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కరీనా పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ ముందే పూర్తిచేయాలని చిత్రబృందం భావించింది. అలానే సెట్స్‌లో ఆమె సీన్స్ అన్నీ పూర్తి చేశారు. గురువారంతో కరీనా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసి, చిత్రబృందానికి బై బై చెప్పారు. ఇతర తారలతో మిగిలిన షెడ్యూల్స్‌ను టర్కీలో చిత్రీకరించడాని సిద్ధం అవుతోంది చిత్రబృందం. వచ్చే ఏడాది డిసెంబర్‌కి ఈ సినిమా విడుదల కానుంది. -
బాలీవుడ్‌కి ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. సంచలనాత్మక విజయం సాధించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని సమాచారం. రామ్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలిసింది. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ హిందీ రీమేక్‌ను పూరి జగన్నాథే దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఓ టాక్. -
కోకిలగా జాన్వీ
2018లో నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). తమిళ తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. నయనతార చేసిన పాత్రను జాన్వీ కపూర్ చేయనున్నారని సమాచారం. ఈ హిందీ రీమేక్‌ను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో అనుకోకుండా డ్రగ్స్ రాకెట్లో చిక్కుకొని డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసే అమ్మాయి పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
హిందీలోకి మానగరం
సందీప్ కిషన్, శ్రీ, రెజీనా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మానగరం’. ‘నగరం’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఒక్క రాత్రిలో జరిగే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. విక్రాంత్ మాస్సీ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ కెమెరామేన్ సంతోష్ శివన్ డైరెక్ట్ చేయబోతున్నారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
అంతా సెట్లోనే!
ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకుడు. హాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కు ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో టామ్ హ్యాంక్స్ పోషించిన పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు. లాక్డౌన్ ముందే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. మిగిలిన భాగాన్ని టర్కీలో పూర్తి చేయాలనుకుంటున్నారు. అయితే ఇటీవలే కరీనా కపూర్ రెండోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. నెలలు గడిచేకొద్దీ కరీనా శరీరాకృతిలో మార్పులు వచ్చేస్తాయి కాబట్టి, త్వరలో ఆమె పాత్ర చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ వారంలోనే కరీనా కపూర్ చిత్రీకరణలో పాల్గొంటారట. కరీనాకు సంబంధించిన సీన్స్‌ని సెట్లోనే పూర్తి చేయడానికి ప్లాన్ చేశారని సమాచారం. ఆ భాగం పూర్తయితే టీమ్ టర్కీ ప్రయాణం అవుతుంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
లక్ష్మీబాంబ్‌ని తీసుకొస్తున్నా
‘ఈ దీపావళికి లక్ష్మితో పాటు ఓ బాంబ్ కూడా మీ ఇంటికి రాబోతోంది’ అన్నారు అక్షయ్ కుమార్. ఆయన హీరోగా రాఘవా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. కియారా అద్వానీ కథానాయిక. దక్షిణాదిన లారెన్స్ చేసిన ‘కాంచన’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ‘భూల్ బులయ్య’ తర్వాత 13 ఏళ్లకు మళ్లీ అక్షయ్ చేసిన హారర్ కామెడీ చిత్రం ఇది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 9న నేరుగా హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. -
హిందీలోకి అంజామ్ పాతిరా
ఈ ఏడాది మలయాళంలో విజయం సాధించిన చిత్రాలలో ‘అంజామ్ పాతిరా’ ఒకటి. కుంచక్కో బోబన్, షరాఫ్ ఉద్దీన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. మిధు మాన్యూల్ థామస్ దర్శకత్వం వహించారు. పోలీస్ ఆఫీసర్లను వరుసగా హత్య చేసే సీరియల్ కిల్లర్‌ను ఎలా ఎదుర్కొన్నారు? ఎలా ఆపారు? అనేది చిత్రకథ. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతోంది రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మలయాళ చిత్రాన్ని నిర్మించిన ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది రిలయన్స్. ‘‘ప్రేక్షకుడిని ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే కథాంశం ఉన్న చిత్రమిది. ఇలాంటి సినిమాను దేశవ్యాప్తంగా ఆడియన్స్‌కు అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రిలయన్స్ ప్రతినిధి సిభాషిస్ సర్కార్. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎవరు నటిస్తారు? అనే వివరాలను ప్రకటించలేదు. -
హిందీలోకి దూకుడు
మహేశ్‌బాబు కెరీర్లో భారీ హిట్స్‌లో ‘దూకుడు’ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, పాగల్ పంతీ’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనీజ్ బజ్మీ ఈ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తారని సమాచారం. -
దర్శకుడు మారారు
హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు, హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ‘రాంబో’ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం షారుక్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్ ఆర్యన్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు రోహిత్ ధావన్. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
బాలీవుడ్ భీష్మ
టాలీవుడ్లో హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సెన్సేషనల్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేయగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్ 100, ఓ బేబీ, రాక్షసుడు’ వంటి చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కానున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘భీష్మ’ చేరింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరెక్కించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో రణ్వీర్ సింగ్ నటించనున్నారని టాక్. -
రాక్షసుడుని హిందీలో రీమేక్ చేయబోతున్నా
‘‘గత ఏడాది నా పుట్టినరోజుకి ‘రాక్షసుడు’ సినిమా హిట్‌తో ఉన్నా.. ఈ ఏడాది ఏం లేదు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే కచ్చితంగా మరో హిట్‌తో ఉండేవాణ్ణి’’ అని దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స అన్నారు. ‘ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు. ►ఈ లాక్డౌన్లో ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాను. అయితే పని అనేది తప్పని సరి కావడంతో 10 రోజులుగా ఆఫీసుకు వెళుతున్నా. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేయాలి కదా. ‘రాక్షసుడు’ సినిమా విడుదల తర్వాత నాకు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ రవితేజగారితో చేయాలనుకోవడంతో ఆగాను. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు కూడా తొందరేం లేదు కంఫర్టబుల్‌గా చేద్దామన్నారు. తమిళ్లో హిట్ అయిన ఓ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ ఆ కథ కంటే ఇప్పుడు చేయబోయే సినిమా కథ రవితేజగారికి చాలా బాగుందని దీంతో ముందుకు వెళుతున్నాం. సెట్స్‌పైకి వెళ్లేందుకు బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసిపెట్టుకున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్ ప్రారంభించలేదు. అందరూ మొదలు పెడితే మేం కూడా సిద్ధమే. ►‘రాక్షసుడు’ హిందీ రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణగారే తీసుకున్నారు. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాలన్నారాయన. రీమేక్‌లో నటించేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ మేం ఎవర్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రవితేజగారి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్లో ‘రాక్షసుడు’ రీమేక్ చేస్తా. ►నిర్మాతగా ‘7’ నా తొలి సినిమా. చిన్న చిత్రంగా తీద్దామనుకున్నాం. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంతో పెద్ద సినిమా అయింది.. బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో నా స్నేహితులు కూడా ప్రొడక్షన్లో భాగమయ్యారు. ఈ చిత్రం వల్ల నష్టంలేదు.. సేఫ్ ప్రాజెక్ట్.. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ఆదరణ బాగుంది. ఆ సినిమా హిందీలో చేస్తే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ ప్రతిపాదన కూడా పెట్టారు. భవిష్యత్‌లో సినిమాలు నిర్మించాలా? వద్దా అన్నది నిర్ణయించుకోలేదు.. అవకాశాల్ని బట్టి వెళతా. -
ఖైదీకి జోడి
ఖైదీకి జోడీగా మారనున్నారట కత్రినా కైఫ్. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. కార్తీ నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తారని తాజా సమాచారం. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర లేదు. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ హీరోయిన్ ని చూపించలేదు. అయితే ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రను యాడ్ చేయనున్నారట. అజయ్ భార్యగా కత్రినా నటించనున్నారట. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. -
హిందీ ఆమె
అమలాపాల్ ముఖ్యపాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నారు ఆ చిత్రదర్శకుడు రత్నకుమార్. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. హిందీ రీమేక్‌లో కథానాయికగా శ్రద్ధాకపూర్ నటిస్తారని సమాచారం. మరి ఒరిజినల్ వెర్షన్లో అమలా చేసిన బోల్డ్ సీన్ (నగ్నంగా నటించారు) ను రీమేక్‌లో శ్రద్ధాకపూర్ చేస్తారా? అనేది చూడాలి. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
అల.. హిందీలో
ఈ ఏడాది సంక్రాంతికి మంచి హిట్ అందుకొని, అల్లు అర్జున్‌కి కమ్‌బ్యాక్ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా హిందీలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ రీమేక్‌లో అల్లు అర్జున్ పాత్రను కార్తీక్ ఆర్యన్ చేయబోతున్నారు. ‘దేశీ బాయ్స్, డిష్యూం’ చిత్రాలను తెరకెక్కించిన రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఏక్తా కపూర్‌తో కలసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
భారీ రేటుకు 'ఏజెంట్ సాయి' రీమేక్ హక్కులు
గతేడాది భారీ బడ్జెట్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోగా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు మాత్రం అపూర్వ విజయాలను నమోదు చేసుకున్నాయి. అందులో హీరో నవీన్ పొలిశెట్టి నటించిన "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"కు ప్రత్యేక స్థానం ఉంది. థ్రిల్లర్, డిటెక్టివ్ తరహాలో రూపు దిద్దుకున్న ఈ సినిమా మూస సినిమాలు చూస్తూ విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇచ్చింది. దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన ఈ సినిమా గతేడాది జూన్ 21న విడుదలవగా నాలుగు రోజుల్లోనే ఆరు కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో హీరోగా పరిచయమైన నవీన్ పొలిశెట్టి సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా నడిపించారు. రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే రూపొందించారు. త్వరలోనే దీనికి సీక్వెల్ తీయాలని ఆలోచనలో పడ్డారు స్వరూప్. (హిందీకి హిట్) కాగా ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం ప్రధాన పాత్రలో తమిళంలో ఈ చిత్రం రీమేక్ కానుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులు 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. బడ్జెట్ కన్నా రెట్టింపు డబ్బులకు రీమేక్ హక్కులు రేటు పలకడం విశేషం. రీమేక్‌లో ఎవరు నటించనున్నారు? రీమేక్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే చిన్న సినిమాలైన విశ్వక్సేన్ 'హిట్', ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూమారుడు శ్రీ సింహా 'మత్తు వదలరా' సినిమాలు కూడా బాలీవుడ్ రీమేక్‌ల దిశగా అడుగులు పడిన విషయం తెలిసిందే. (‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’) -
హిందీకి హిట్
టాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా ‘హిట్’ సినిమా చేరింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్’. హీరో నాని, ప్రశాంతి నిర్మించిన ఈ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాత ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నిర్మాత కుల్దీప్ రాథోర్‌తో కలిసి ‘హిట్’ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించనున్నారు. హిందీ రీమేక్‌ను కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా 2021లో సెట్స్‌పైకి వెళ్లనుంది. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్ రావ్, ‘దిల్’ రాజుగారితో కలిసి పని చేయనుండటం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి, నేటివిటీకి తగినట్లు చిన్న చిన్న మార్పులు చేస్తా’’ అన్నారు. ‘‘ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్ మూవీ ‘హిట్’. ఓ నటుడిగా ఇలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘హిట్’ రీమేక్ చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు రాజ్‌కుమార్ రావ్ . -
లాల్ సింగ్ టైమ్‌కి రాడా?
ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రావాలన్నది లాల్ సింగ్ చద్దా ప్లాన్. కానీ ఆ ప్లాన్‌లో మార్పు ఉండబోతోందని బాలీవుడ్ టాక్. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్ కథానాయిక. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ఆమిర్ ఖాన్. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడటంతో ‘లాల్ సింగ్ చద్దా’ను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. మరి లాల్ సింగ్ అనుకున్న టైమ్‌కి వస్తాడా? రాడా? చూడాలి. -
బాలీవుడ్ భీష్మ
‘భీష్మ: ది బ్యాచిలర్’ తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అందుకే బాలీవుడ్‌లోనూ రీమేక్ కాబోతున్నాడు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌లో రణ్‌బీర్ కపూర్ యాక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బాలీవుడ్ ‘భీష్మ’ కన్ ఫర్మ్ అయ్యారట. ఈ సినిమాలో హీరోగా అర్జున్ కపూర్ నటించబోతున్నారు అని తాజా సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. -
అల.. బాలీవుడ్ తెరపైకి!
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ అనూహ్య విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్ వార్దే ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. హీరోగా అక్షయ్ కుమార్ లేదా షాహిద్ కపూర్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
బ్రేక్ తర్వాత...
హాలీవుడ్ చిత్రం ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్‌లో దీపికా పదుకోన్ కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే. రిషి కపూర్ ఓ ముఖ్య పాత్ర చేయనున్నారు. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్టర్ చేస్తారనే విషయంపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్‌శర్మ,, ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘డియర్ జిందగీ’ చిత్రాలను తెరకెక్కించిన గౌరీ షిండేలతో ఈ చిత్రబృందం చర్చలు జరుపుతోందన్నది తాజా సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు డైరెక్టర్ సీట్లో కూర్చుంటారో చూడాలి. అయితే గౌరీ షిండేకే ఎక్కువ చా¯Œ ్స ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారట. -
రా రా సరసకు రారా!
‘రారా సరసకు రారా...’ పాట సౌత్ ఇండస్ట్రీల్లో సూపర్ పాపులర్. ‘చంద్రముఖి’లోని ఈ పాటను, పాటలో జ్యోతిక గెటప్‌ను, ఆమె అభినయాన్ని ఎవరూ మర్చిపోలేరు. మలయాళ చిత్రం ‘మణిచిత్ర తాళ్’ ఆధారంగా కన్నడంలో ‘ఆప్తమిత్రన్’, తెలుగు/తమిళంలో ‘చంద్రముఖి’, హిందీలో ‘భూల్ బులేయ్య’, బెంగాలీలో ‘రాజ్మొహోల్’ సినిమాలు రూపొందాయి. హిందీ రీమేక్‌లో ‘రారా సరసకు రారా (‘మేరే డోల్నా సున్’) పాటలో విద్యా బాలన్ నర్తించారు. ఇప్పుడు ‘భూల్ బులేయ్య’ సీక్వెల్ ‘భూల్ బులేయ్య 2’లో ఆ పాట రీమిక్స్‌లో డ్యాన్స్ చేయనున్నారు టబు. దెయ్యం పట్టిన డ్యాన్సర్ గెటప్‌లో ‘రారా సరసకు రారా’ అని పాడనున్నారట. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ముఖ్య తారలుగా అనీజ్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. -
ప్రతి సినిమా నీతోనే...
‘‘కరీనా... వీలుంటే ప్రతీ సినిమాలో నీతో రొమాన్స్ చేయాలనుంది. నీతో యాక్ట్ చేస్తుంటే రొమాన్స్ చాలా సులువుగా వస్తుంది’’ అంటున్నారు ఆమిర్ ఖాన్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. కరీనా కపూర్ కథానాయిక. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కపూర్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కానుంది. -
హిందీలో ఖైదీ
గత ఏడాది దీపావళికి థియేటర్స్‌లో లక్ష్మీ బాంబ్లా పేలిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించారు. హీరోయిన్, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. తాజాగా ‘ఖైదీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రనిర్మాత యస్ఆర్ ప్రభు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలసి ఈ హిందీ రీమేక్‌ను నిర్మించనున్నారాయన. ‘ఖైదీ’ హిందీ రీమేక్ డైరెక్టర్, యాక్టర్స్ వివరాలను ప్రకటించలేదు. -
దీపిక ది ఇంటర్న్
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా చేసిన ‘చప్పాక్’ తర్వాత దీపికా పదుకోన్ ఏం చేయబోతున్నారు? అనే ఆసక్తి బాలీవుడ్లో ఉంది. ఫ్యాన్స్ ఎదురుచూపులకు సోమవారం ఫుల్స్టాప్ పెట్టారామె. తన తదుపరి చిత్రం ‘ద ఇంటర్న్’ అని ప్రకటించారు. 2015లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ద ఇంటర్న్’కి ఇది హిందీ రీమేక్. హాలీవుడ్ చిత్రంలో రోబర్ట్ డీ నీరో, అన్నే హథవే ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీలో ఈ పాత్రలను రిషీ కపూర్, దీపికా పదుకోన్ చేయనున్నారు. రిషీ కపూర్ కంపెనీలో ఇంటర్న్‌గా పని చేసే పాత్రలో దీపిక నటిస్తారట. ఈ సినిమాను హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో కలిసి దీపికా నిర్మించనుండటం విశేషం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దర్శకుడు ఎవరనేది తెలియాలి. ‘‘నా తదుపరి చిత్రం ‘ది ఇంటర్న్’ రీమేక్ అని ప్రకటించడానికి థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు దీపికా. -
దుర్గా మాత ఆశీర్వాదంతో...
‘దుర్గావతి’ ప్రయాణం మొదలైంది. భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దుర్గావతి’. తెలుగులో హిట్ సాధించిన అనుష్క ‘భాగమతి’ (2018) చిత్రానికి ఇది హిందీ రీమేక్. అక్షయ్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భాగమతి’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. అశోకే ‘దుర్గావతి’ని తెరకెక్కిస్తుండటం విశేషం. దర్శకుడిగా హిందీలో అశోక్‌కి ఇది తొలి చిత్రం. ఐపీఎస్ ఆఫీసర్‌గా భూమి ఫడ్నేకర్ నటిస్తోన్న ఈ చిత్రంలో మహీ గిల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ‘‘దుర్గా మాత ఆశీర్వాదంతో ‘దుర్గావతి’ చిత్రీకరణ మొదలైంది. నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాను. టాల్ అండ్ స్ట్రాంగ్‌గా నిలబడటానికి నేను రెడీ అక్షయ్ సార్’’ అన్నారు భూమి. ‘దుర్గావతి’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. -
కోలీవుడ్ టు బాలీవుడ్
ప్రాంతీయ భాషల్లో హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ అవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా అదే జాబితాలో తమిళ చిత్రం ‘ఒత్తా సెరుప్పు సైజ్ 7’ కూడా చేరనుంది. ఈ సినిమా త్వరలో హిందీలో రీమేక్ కానుంది. కేవలం ఒకే ఒక్క పాత్రతో రూపొందిన ‘ఒత్తా సెరుప్పు సైజ్ 7’లో నటించడమే కాకుండా, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు తమిళ దర్శకుడు పార్తిబన్. హిందీ రీమేక్‌లో ఆ పాత్రను నవాజుద్దీన్ సిద్ధిఖీ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
గురుశిష్యులు
సాధారణంగా అందరికీ లైఫ్‌లో గురువు పాత్రను ఎక్కువగా తండ్రే పోషిస్తారు. బాలీవుడ్ నటుడు షాహిదీ కపూర్‌కు వాళ్ల నాన్న పంకజ్ కపూరే గురువు. ఇప్పుడు ఆన్‌స్క్రీన్ కూడా తనయుడికి గురువు పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సూపర్‌హిట్ సినిమా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించనున్నారు షాహిద్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో షాహిద్ మెంటర్‌గా (తెలుగులో సత్యరాజ్ పోషించిన పాత్ర) ఆయన తండ్రి పంకజ్ కపూర్ నటించనున్నారని తెలిసింది. ఈ నెలాఖారున షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 28న రిలీజ్ కానుంది. -
దుర్గావతి
బాలీవుడ్ ‘దుర్గావతి’గా మారారు కథానాయిక భూమీ ఫడ్నేకర్. అనుష్క టైటిల్ రోల్లో జి. అశోక్ దర్శకత్వంలో ‘భాగమతి’ (2018) చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ కానుంది. తెలుగులో అనుష్క చేసిన పాత్రను హిందీలో భూమీ ఫడ్నేకర్ పోషించనున్నారు. తెలుగు ‘భాగమతి’ చిత్రాన్ని తెరకెక్కించిన జి. అశోకే హిందీ రీమేక్ ‘దుర్గావతి’కి దర్శకుడు కావడం విశేషం. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నటుడు అక్షయ్ కుమార్, నిర్మాత భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తారు. ‘‘దుర్గావతి’లో నటించబోతున్నానని చెప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. శనివారం అధికారికంగా ప్రకటించాం. చాలా సంతోషంగా ఉంది. దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు భూమీ ఫడ్నేకర్. -
అంధురాలి పాత్రలో...
హిట్ రన్ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ సమయంలో తాను సాక్ష్యం చెబుతానని ఓ అమ్మాయి ముందుకొచ్చింది. కానీ, ఆ అమ్మాయికి చూపు లేదు. మరి.. ఈ కేసులో నిజమైన దోషులకు శిక్ష పడిందా? పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరించారు? అనే అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సౌత్ కొరియన్ మూవీ ‘బ్లైండ్’ (2011). ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. చూపులేని యువతి పాత్రలో సోనమ్ కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ‘కహానీ’ (2012), ‘బద్లా’ (2019) చిత్రాల దర్శకుడు సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సుజోయ్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన షోమీ మఖిజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. -
ఆట ఆరంభం
క్రికెటర్‌గా సాధన మొదలుపెట్టారు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఇండియన్ క్రికెట్ జుట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగులో సూపర్‌హిట్ సాధించిన ‘జెర్సీ’ చిత్రం హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారు. ఇందులో 36 ఏళ్ల క్రికెటర్ పాత్రలో నటించబోతున్నారాయన. ఈ సినిమా కోసమే క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 28న విడుదల కానుంది. మరోవైపు తెలుగు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో సూపర్ హిట్ అందుకున్న షాహిద్ వెంటనే మరో తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. -
అమ్మ దీవెనతో...
కొత్త సినిమా కోసం కొత్త ప్రయాణం మొదలు పెట్టారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఆయన హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ (1994)కి హిందీ రీమేక్ ఇది. ఇందులో కరీనా కపూర్ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి సన్నివేశానికి ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ క్లాప్ ఇచ్చారు. హిందీ చిత్రం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమిర్ ఖాన్ దాదాపు 20కేజీల బరువు తగ్గిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఇంకో పోలీస్ కావలెను!
బాలీవుడ్లో ఓ లేడీ పోలీసాఫీసర్ కోసం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారట నటుడు షారుక్ ఖాన్, దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. వీరిద్దరి కాంబినేషన్లో గత ఏడాది విడుదలైన ‘జీరో’ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఇప్పుడు షారుఖ్ –ఆనంద్ ఓ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ఇది ఓ సౌత్ కొరియన్ సినిమాకు హిందీ రీమేక్ అట. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు లేడీ పోలీసాఫీసర్లు ఉంటారట. అందులో ఒక పోలీసాఫీసర్ పాత్ర కోసం కత్రినా కైఫ్‌ను ఎంపిక చేశారని బాలీవుడ్ టాక్. మరో లేడీ పోలీసాఫీసర్ కోసం హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తున్నారట. విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఇంకా ఫైనలైజ్ కాలేదట. ప్రస్తుతం ‘సూర్యవన్షీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు కత్రీనాకైఫ్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరో. -
రూమర్స్‌పై స్పందించిన కంగనా రనౌత్!
కోలీవుడ్ అమ్మడు అమలాపాల్ నటించిన తాజా చిత్రం ఆడై.. తెలుగులో ‘ఆమె’ పేరుతో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించకపోయినప్పటికీ.. కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఒక ప్రత్యేక చిత్రంగా ‘ఆడై’ గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లలో ఒంటిమీద నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా నటించి.. పాత్రకు అమలాపాల్ న్యాయం చేకూర్చారు. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో హిందీలో రీమేక్ కానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత మహేశ్ భట్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా హిందీ రీమేక్‌లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించనున్నారని ఊహాగానాలు చెలరేగాయి. ‘ఆడై’ సినిమాలో అమల్‌పాల్ పాత్ర కంగన పోషించనున్నారన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేశాయి. ఆమె ఫ్యాన్స్ కూడా ఈ వార్తలపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా కంగనా టీమ్ ఈ వార్తలపై స్పందించింది. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కంగన ప్రస్తుతం తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌లో మాత్రమే నటిస్తున్నారని, ఇతర కొత్త ప్రాజెక్టులేమీ కమిట్ అవ్వలేదని, ముఖ్యంగా ‘ఆడై’ రీమేక్‌లో ఆమె నటించడం లేదని కంగన టీమ్ స్పష్టం చేసింది. నిజానికి ‘ఆడై’ హిందీ రీమేక్ మీద ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. హిందీలో ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాలని భావిస్తున్న మహేశ్ భట్.. త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశముంది. హిందీలోనూ రత్నకుమారే దర్శకత్వం చేస్తారని అంటున్నారు. చిత్రయూనిట్ గురించి మరిన్ని వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
టాక్సీవాలా రీమేక్
పాత కారు, అందులో దెయ్యం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన విజయ్ దేవరకొండ చిత్రం ‘టాక్సీవాలా’. రిలీజ్‌కు ముందే పైరసీ అయినప్పటికీ మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోందని సమాచారం. బాలీవుడ్ యంగ్ హీరో, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా ‘కాలీ పీలీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనన్యా పాండే హీరోయిన్. మక్బూల్ ఖాన్ దర్శుకుడు. ఈ సినిమాలో టాక్సీ కూడా ప్రధాన పాత్ర అని సమాచారం. తాజా సమాచారం ఏంటంటే ‘కాలీ పీలీ’ చిత్రం ‘టాక్సీవాలా’ చిత్రం ఆధారంగా రూపొందుతోందని తెలిసింది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా రిలీజ్. ఇషాన్ గత సినిమా ‘ధడక్’ కూడా మరాఠీ సినిమాకు రీమేకే. -
‘ఆమె’ రీమేక్ చేస్తారా?
అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైంది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్ సంచలనం సృష్టించారు. రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో విమర్శకుల ప్రసంశలు పొందింది ఈ సినిమా. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోందని సమాచారం. ఒరిజినల్‌ను రూపొందించిన రత్నకుమారే హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారట. హిందీ రీమేక్‌లో హీరోయిన్గా నటించేవారిలో కంగనా రనౌత్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మరో రీమేక్
సౌత్‌లో సక్సెస్ఫుల్ సినిమాలు బాలీవుడ్ రీమేక్‌కి దారి ఇస్తున్నాయి. ఆ దారిలో బాలీవుడ్‌కు వెళ్తున్న చిత్రం ‘జెర్సీ’. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాను ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు సూపర్ అన్నారు. ఇప్పుడు ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నాని పాత్రను షాహిద్ కపూర్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. షాహిద్ గత చిత్రం ‘కబీర్ సింగ్’ తెలుగు ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అని తెలిసిందే. తన కెరీర్ బెస్ట్ హిట్‌గా ‘కబీర్ సింగ్’ సినిమా నిలిచింది. ఇప్పుడు ‘జెర్సీ’ రీమేక్ తన హిట్ ట్రాక్‌ని కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
మోస్ట్ వాంటెడ్
సల్మాన్ ఖాన్ కెరీర్‌ను గాడిలో పడేసిన సినిమా ‘వాంటెడ్’. ప్రభుదేవా దర్శకత్వంలో ‘పోకిరి’ చిత్రానికి హిందీ రీమేక్‌గా రూపొందింది ఈ సినిమా. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘మోస్ట్ వాంటెడ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించనున్న కొత్త సినిమాకు ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కాప్: రాధే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండగకు తీసుకురాబోతున్నారు. కొరియన్ చిత్రం ‘ద అవుట్ లాస్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. నవంబర్ 4న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. సల్మాన్‌ఖాన్ – ప్రభుదేవా కాంబినేషన్లోనే రెడీ అయిన ‘దబాంగ్ 3’ చిత్రం డిసెంబర్లో విడుదలకానుంది. -
విలక్ష్మీణమైన పాత్ర
‘‘మనం చాలా సులువైన పనులు కాకుండా కష్టతరమైనవి చేస్తున్న క్షణం నుంచే ఓ కొత్త జీవితం ప్రారంభం అవుతుంది’’ అంటున్నారు అక్షయ్ కుమార్. యాక్షన్, కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్షయ్ బాలీవుడ్లో ఆకట్టకుంటుంటారు. ప్రస్తుతం లక్ష్మీ అనే అమ్మాయిగా ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు , తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ‘కాంచన’ చిత్రాన్ని రూపొందించిన రాఘవ లారెన్స్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులోని లక్ష్మీ పాత్ర లుక్‌ను అక్షయ్ షేర్ చేస్తూ – ‘‘నవరాత్రి అంటే మనలో దేవతకు తలవంచుతూ, మన అసాధారణ శక్తి సామర్థ్యాలను సెలబ్రేట్ చేసుకోవడమే. ఈ సందర్భంగా నేను చేస్తున్న లక్ష్మీ లుక్‌ను పంచుకుంటున్నాను. చాలా ఉద్వేగంగా, కొంచెం టెన్షన్‌గా ఉంది’’ అని ట్వీట్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 5న రిలీజ్ కానుంది. -
నో మేకప్... ప్లీజ్!
హీరోయిన్గా కాకపోయినా ‘పింక్’ (2016), ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్’ (2019), ‘మిషన్ మంగళ్’ (2019) చిత్రాల్లో మంచి పాత్రల్లో చక్కని నటన కనబర్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కృతీ కుల్హరీ. ఆమె తాజాగా హాలీవుడ్ చిత్రం ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ హిందీ రీమేక్‌లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఇందులో కృతి మేకప్ లేకుండా నటిస్తున్నారు. ‘‘మేకప్ లేకుండా ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. మేకప్ ఉంటేనే స్క్రీన్కు సూట్ అవుతాం అనేం లేదు. పాత్రలో బలం ఉండాలి’’ అని పేర్కొన్నారు కృతీ. రిభు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణీతీ చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. అదితీ రావ్ హైదరీ మరో కీలక పాత్రధారి. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలోనే రూపొందిన ‘బార్డ్ ఆఫ్ బ్లెడ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించారు కృతీ కుల్హరీ. సెప్టెంబరు 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. -
ప్రయాణం మొదలైంది
కథానాయిక పరిణీతి చోప్రా రైలు ప్రయాణం చేస్తున్నారు. అదితీరావ్ హైదరీ, కృతీకల్హారీ ఈ ప్రయాణంలో పరిణీతి చోప్రాకు తోటి ప్రయాణికులు. ఈ ముగ్గురు హీరోయిన్లు కలిసి ఏ ట్రైన్ ట్రిప్ ప్లాన్ చేయలేదు. ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే హాలీవుడ్ సినిమా హిందీ రీమేక్ మూవీ కోసం తోటి ప్రయాణికులుగా తోడయ్యారు. రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మేజర్ షూటింగ్ లండన్‌లో ప్లాన్ చేశారు. ఓ మిస్సింగ్ పర్సన్ కేసులో చిక్కుకున్న ఓ వివాహిత ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుంది. పౌలా హాకిన్స్ ఫేమస్ నవల ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ ఆధారంగా అదే టైటిల్‌తో 2015లో ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
ఆమిర్ వర్సెస్ సైఫ్
ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ మీద తలపడనున్నారు. మరి ఎవరు గెలుస్తారు? ప్రస్తుతానికి సస్పెన్స్. 2017లో తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్ వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి రూపొందించారు. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో పలువురు హీరోలు నటిస్తారని వార్తలు వినిపించాయి. ఫైనల్‌గా ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ఈ రీమేక్‌లో నటించనున్నారు. మాధవన్ పాత్రలో సైఫ్, సేతుపతి పోషించిన పాత్రను ఆమిర్ ఖాన్ చేస్తారట. 2020 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వై నాట్ స్టూడియోస్, నీరజ్‌పాండే, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించనున్నాయి. -
రీమేక్‌తో వస్తున్నారా?
‘డాన్ 3’, రాజ్‌కుమార్ హిరాణీతో ఓ లవ్ స్టోరీ, ఆదిత్య చోప్రాతో సినిమా, అట్లీతో ఓ రీమేక్ సినిమా... ఈ సినిమాల్లో షారుక్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే విషయంలో క్లారిటీ రాలేదు. లేటెస్ట్గా బాలీవుడ్లో వినిపిస్తున్న కొత్త న్యూస్ ఏంటంటే... స్పానిష్ సిరీస్ ‘మనీ హేస్ట్’ను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సిరీస్ రైట్స్‌ను కూడా షారుక్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ సిరీస్‌ను ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించే ఆలోచనలో ఆయన టీమ్ ఉందని సమాచారం. బ్యాంక్ దొంగతనం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాని షారుక్ నిర్మించడం మాత్రమేనా? నటిస్తారా? అనే విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత మిగతా వివరాలను ప్రకటించనున్నారు టీమ్. -
రీమేక్ క్వీన్
రెగ్యులర్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలను అదే సంఖ్యలో చేస్తున్నట్టున్నారు తమన్నా. లేటెస్ట్గా ఓ తమిళ సినిమా హిందీ రీమేక్‌లో తమన్నా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తండా’ హిందీలో రీమేక్ కాబోతోంది. తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రలో ఆర్యన్ కార్తీక్, బాబీ సింహా చేసిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ నిర్మించనున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ ఏడాది తమన్నా ఎక్కువ రీమేక్స్‌లో కనిపించనున్నారు. ఇటీవలే హిందీ ‘క్వీన్’ను తెలుగులో ‘దటీజ్ మహాలక్షి’గా రీమేక్ చేశారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది . ఆల్రెడీ తెలుగు సూపర్ హిట్ ‘ఆనందో బ్రహ్మా’ను ‘పెట్రోమాక్స్’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు. అందులో తమన్నా లీడ్ రోల్ చేశారు. ఇప్పుడు తమిళ ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి తెలుగు టు తమిళం టు హిందీ సినిమాల రీమేక్స్‌తో ప్రస్తుతానికి ‘రీమేక్ క్వీన్’ అయ్యారు తమన్నా. -
భాయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారా?
నార్త్‌లో ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. షాహిద్ కపూర్‌కి సోలో హీరోగా ఇది తొలి వంద కోట్ల చిత్రం అవ్వడమే కాకుండా రెండొందల కోట్ల సినిమా కూడా కాబోతోందని టాక్. తన సూపర్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను షాహిద్‌తో ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేశారు సందీప్ వంగా. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా నడుస్తోంది. హిందీకి సౌత్ సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్లో బడా చాన్స్ కొట్టేశారట సందీప్ వంగా. సల్మాన్ హీరోగా టీ సిరీస్ సంస్థ నిర్మించబోయే సినిమాకు దర్శకుడిగా సందీప్ పేరుని పరిశీలిస్తున్నారట. ‘కబీర్ సింగ్’కు టీ–సిరీస్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామి అనే సంగతి తెలిసిందే. మరి.. సల్మాన్‌తో సందీప్ సినిమా ఉంటుందా? అంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా సంగతి అలా ఉంచితే సందీప్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌కు ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేయనున్నారు. -
మరో రీమేక్‌లో?
తెలుగులో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయడం కామన్. టాలీవుడ్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో షాహిద్ కపూర్ ఇటీవల భారీ హిట్ అందుకున్నారు. షాహిద్ గత చిత్రాల అత్యధిక వసూళ్లను సైతం ‘కబీర్‌సింగ్’ తొలి వారంలోనే దాటనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని బాలీవుడ్ టాక్. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకూ అలరిస్తుందని ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ అనుకున్నారట. అందుకే ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే హిందీ రీమేక్ చేయనున్నారట. -
ఇది షాహిద్ సినిమా కాదు!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్ దర్శకత్వంలోనే ‘కబీర్‌సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ అయింది. ఈ నెల 21న చిత్రం విడుదల కానున్న సందర్భంగా షాహిద్, కియారా చెప్పిన విశేషాలు. ► ‘కబీర్‌సింగ్’ చిత్రం కోసం తిరిగి కాలేజీకి వెళ్లడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా భయం వేసింది. ఎందుకంటే ఇందులో నేను దాదాపు పాతికేళ్ల కుర్రాడిలా కనిపించాలి. ఇప్పుడే వచ్చిన కొత్త హీరో అనే ఫీల్‌ని ఆడియన్స్‌కి కలగజేయాలి. ఈ సినిమాలోలా రియల్ లైఫ్‌లోనూ నేను ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ కావడంతో ఈజీ అయింది. టీజర్ చూసినవాళ్లు కాలేజీ స్టూడెంట్‌లానే ఉన్నారని చెప్పగానే ఆనందం అనిపించింది. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు నా వయసు పాతికేళ్లు కాదు. ► తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా? చూశాను. బాగా నచ్చింది. సినిమాలోని క్యారెక్టర్, ఎమోషనల్ థింగ్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. ఈ ఫిల్మ్ మేకింగ్‌ని ఎంజాయ్ చేశాను. హీరోది చాలా గొప్ప పాత్ర. విజయ్ బాగా చేశాడు. ► ‘అర్జున్‌రెడ్డి’ అప్పుడు విజయ్ చేసింది తక్కువ సినిమాలు. మీరు 30కి పైగా సినిమాలు చేశారు కాబట్టి అంచనాలు ఉంటాయి. ప్రెషర్ ఏమైనా? ఇలాంటి సబ్జెక్ట్‌ను కొత్త హీరో అయితే డిఫరెంట్ ఎనర్జీతో చేస్తారు. అలాగే నాలాంటి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు కూడా డిఫరెంట్‌గానే ట్రై చేస్తారు. అయితే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్‌కు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కొంచెం కష్టం అనిపించొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్ ఒకసారి సినిమా చూశారు. అంతకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అయినా ఈ సినిమా వరకూ ఆడియన్స్ ఇందులోని క్యారెక్టర్ని చూస్తారు. మన గురించి అంతగా ఆలోచించరు. కథ అలాంటిది. అందుకే ఇది షాహిద్ కపూర్ సినిమా కాదు. కబీర్ సింగ్ సినిమా. అఫ్కోర్స్ ఈ పాత్ర చాలెంజింగ్ అని మాత్రం ఒప్పుకుంటాను. ► ఈ రీమేక్ ఆలోచన మీకు వచ్చిందా? ‘అర్జున్‌రెడ్డి’ని ఒకరు చూపించారు. చాలా బాగుందనిపించింది. అయితే మనం చేసి ఇప్పుడు స్పాయిల్ చేయడం ఎందుకు అనుకున్నా. కానీ ఎప్పుడైతే సందీప్‌రెడ్డి హిందీ రీమేక్ పట్ల ఇంట్రెస్ట్‌గా ఉన్నారని తెలిసిందో అప్పుడు చేయాలనిపించింది. అతని వర్క్ బాగా నచ్చింది. ఓ మంచి సినిమాని ఎక్కువమంది చూడాలని కోరుకునే మనస్తత్వం నాది. ఈ సినిమాను హిందీ ఆడియన్స్ నా వల్ల చూస్తారు అన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. ► ‘కబీర్‌సింగ్’ ట్రైలర్‌ని ప్రభాస్ ప్రశంసించారు.. నాకు, ప్రభాస్‌కు హకీమ్ హెయిర్ స్టైలిష్‌గా ఉన్నారు. ప్రభాస్ గురించి చాలా విన్నాను. సో కైండ్. ట్రైలర్‌ని అభినందిస్తూ ప్రభాస్ నాతో మాట్లాడారు. తనతో మాట్లాడటం అదే ఫస్ట్ టైమ్. ► అర్జున్‌రెడ్డి, కబీర్సింగ్లకు పోలికలు పెడతారు. ఆ విషయం గురించి ఏమంటారు? పోలిక పెట్టకూడదు. ఎందుకంటే ఒకటి బాగుందంటే అది ఎప్పటికీ బాగున్నట్లే. దానికి ఆ గౌరవం ఇవ్వాలి. ‘అర్జున్ రెడ్డి’ బాగుంది. అలాంటప్పుడు ‘కబీర్‌సింగ్’తో పోలికపెట్టడం దేనికి? అర్జున్‌రెడ్డి నాకూ నచ్చింది. ఇప్పుడు ‘కబీర్..’ని ప్రేక్షకులు కొత్త సినిమా అనుకుని చూడాలి. ► ‘ఉడ్తా పంజాబ్, కబీర్‌సింగ్, కమీనే’.. ఇలా డార్క్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నట్లున్నారు? డార్క్, లైట్ అని కాదు భిన్నమైన పాత్రలు చేయడానికి నేను ఇష్టపడతాను. కానీ అవుటాఫ్ ది బాక్స్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయడంలో ఉన్న ఫీల్‌ని ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ రోల్స్ చేయాలనుకుంటాను. ► ‘కబీర్ సింగ్’లో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ. మరి మీ ఆవిడ మీరా దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? నిజానికి ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తనకు నచ్చింది. ఈ పాత్ర నీ కెరీర్‌కు ఫ్లస్ అవుతుందని తనే చెప్పింది. ఈ వృత్తిలో ఉన్న విషయాలను అర్థం చేసుకునే పరిణితి తనకు ఉంది. ► ‘కబీర్‌సింగ్’ లవ్‌లో ఫెయిలై, ఫైనల్లీ ప్రేమికురాలిని దక్కించుకుంటాడు. రియల్ లైఫ్‌లో మీకూ లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా? అందరి జీవితాల్లో ఉన్నట్లే నా లైఫ్‌లోనూ కొన్ని లవ్ ఫేజెస్ ఉన్నాయి. అది కామన్ (నవ్వుతూ). ► కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘హిందీ రీమేక్ ఒప్పుకోక ముందు ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశాను. సైన్ చేశాక మాత్రం చూడలేదు. ఎందుకంటే ఆ ప్రభావం నా నటన మీద పడే అవకాశం ఉంది. క్యారెక్టర్ని నా స్టైల్లో నేను చేయాలనుకున్నాను. కథానుగుణంగానే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రేమికులను తీసుకుందాం. వాళ్ల మధ్యమాటలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది కదా. సినిమాలో షాహిద్, నేను ప్రేమికులం కాబట్టి మా మధ్య రొమాన్స్ ఉంటుంది. అవి లేకుండా ప్రేమ ఉండదు. షాహిద్ కపూర్ నటించిన కొన్ని సినిమాలు నేను చూశాను. అన్నింటికన్నా ‘కబీర్‌సింగ్’లో ‘ది బెస్ట్ పర్ఫార్మెన్స్’ ఇచ్చాడు. ఓ 25, 30 సినిమాలు చేశాక కాలేజీ సబ్జెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కొత్త హీరో అనిపించేలా చేశాడు. సందీప్ రెడ్డి అమేజింగ్ డైరెక్టర్ అనాలి. అసలు కథే వండర్ఫుల్ అంటే పాత్రలను ఆయన మలిచిన తీరూ అద్భుతమే. -
కరీనా సరేనా?
దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్–కరీనా కపూర్ జంటగా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో కథానాయికగా కరీనాను సంప్రదించారట. కరీనా ఓకే చెబితే దాదాపు పదేళ్ల తర్వాత ఆమిర్–కరీనా జోడీ కట్టినట్లే. 2009లో వచ్చిన హిట్ మూవీ ‘త్రీ ఇడియట్స్’ తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటించలేదు. మరోవైపు ‘గుడ్‌న్యూస్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన కరీనా ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ ‘అంగ్రేజీ మీడియం’ (హిందీ మీడియం సీక్వెల్) సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే కరీనా ఓ టెలివిజన్ షోకు కమిటైన సంగతి తెలిసిందే. -
హిందీ వేదాలంలో..
బాలీవుడ్లో సౌత్ రీమేక్‌ల హవా మరింత జోరు అందుకున్నట్లు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కాంచన’, ‘ఆర్ఎక్స్ 100’, ‘ప్రస్తానం’... ఇలా మరికొన్ని దక్షిణాది సినిమాలు బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా అజిత్ ‘వేదాలం’ కూడా చేరిందన్నది బాలీవుడ్ ఖబర్. బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ‘వేదాలం’ హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారట. ఇందులో జాన్ అబ్రహాం హీరోగా నటించడానికి ఆసక్తి చూపించారని తెలిసింది. స్క్రిప్ట్‌లో ముంబై బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్లు మార్పులు చేస్తారట. ఈ సినిమా ఎవరు దర్శకుడు అనే చర్చల్లో కొందరి ప్రముఖ దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
బాలీవుడ్‌కి బేబీ
బేబీ బాలీవుడ్‌కి వెళ్లనుంది. ఇక్కడ సమంత ఫొటో ఉంది కాబట్టి ఆమె హిందీ తెరకు పరిచయం కాబోతున్నారని అనుకుంటున్నారా? అదేం కాదు.. సమంత నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’ హిందీలో రీమేక్ కానుంది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా బి. నందినీరెడ్డి దర్శకత్వం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి, సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు చేసిన ఈ చిత్రం ఈ 5న విడుదల కానుంది. ‘ఓ బేబీ’ని హిందీలో నిర్మించాలనుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. అక్కడి ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత డి. సురేష్‌బాబు బాలీవుడ్‌కి చెందిన ఓ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
వన్ ప్లస్ వన్
ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటారో అంతే బాగా పర్సనల్ లైఫ్‌ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు తాప్సీ. రెండేళ్ల క్రితం ముంబైలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్న ఈ బ్యూటీ తాజాగా మరో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌కి ఓనర్‌గా మారారు. గతంలో తాను ఉన్న అపార్ట్మెంట్లోనే తాప్సీ ఈ కొత్త ఫ్లాట్‌ను తీసుకున్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇంటీరియర్ డెకరేషన్ వర్క్ జరుగుతోందట. తాప్సీ సిస్టర్ శాగున్ దగ్గరుండి మరీ ఈ పనులన్నీ చూసుకుంటున్నారట. ఇలా పర్సనల్‌గా కూడా తాప్సీ మంచి జోరుమీద ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.... ఇటీవల ‘బద్లా’ చిత్రంతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న తాప్సీ ‘సాండ్‌కీ అంఖే, మిషన్ మంగళ్’ అనే హిందీ సినిమాలను పూర్తి చేశారు. తమిళం, తెలుగు భాషల్లో తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం జూలై 14న విడుదల కానుంది. బాలీవుడ్లో తాప్సీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకున్న నిర్మాతలు ఈ సినిమా హిందీ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో అనురాగ్ కశ్యప్ ఈ చిత్రం విడుదల చేయనున్నారు. -
ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు
‘లక్ష్మీబాంబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతే నాకు తెలియదు. దర్శకుడిగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను’ అంటూ బాంబ్ పేల్చారు రాఘవ లారెన్స్. ‘కాంచన’ చిత్రం అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ విషయం తనకు తెలియదన్నారు లారెన్స్. దీని గురించి లారెన్స్ మాట్లాడుతూ– ‘‘గౌరవం లేని ఇంట్లో అడుగుపెట్టకూడదు’ అని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, ఫేమ్ కంటే కూడా ఆత్మాభిమానం అనేది మనిషికి ముఖ్య గుణం అయ్యుండాలి. ‘కాంచన’ రీమేక్ నుంచి తప్పుకోవడానికి కారణం ఇదీ అని చెప్పలేను. ఎందుకంటే చాలా కారణాలున్నాయి. శనివారం ‘లక్ష్మీ బాంబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అన్న సంగతే నాకు తెలియదు. తన సినిమా అప్డేట్స్ మూడో మనిషి ద్వారా దర్శకుడికి తెలియడం చాలా బాధాకరం. ఒక క్రియేటర్‌గా ఆ పోస్టర్పట్ల సంతృప్తిగా లేను. ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు. నేను ఎటువంటి అగ్రిమెంట్ సైన్ చేయలేదు కాబట్టి స్క్రిప్ట్‌ను నాతోనే ఉంచుకోవచ్చు. కానీ నేనలా చేయను. అక్షయ్ కుమార్‌గారి మీద ఉన్న గౌరవంతో ఆ స్క్రిప్ట్ ఇచ్చేయదలచుకున్నాను. త్వరలోనే అక్షయ్గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. -
కబీర్‌సింగ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ, షాలినీపాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’కి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్’ ని తెరకెక్కించడం విశేషం. భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషణ్ కుమార్, అశ్విన్ వర్డే నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘అర్జున్‌రెడ్డి’లోని అనుభూతిని ఎక్కడా మిస్ కాకుండా ‘కబీర్‌సింగ్’ తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 21న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్లో ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందే వేచి చూడాలి. -
పండగ ఎవరికి?
వచ్చే ఏడాది క్రిస్మస్కు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్‌ఖాన్, హృతిక్ రోషన్. గత ఏడాది డిసెంబర్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ఆస్కార్ అవార్డ్ సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్‌సింగ్ చద్దా’లో నటించనున్నట్లు ఇటీవల తన పుట్టినరోజు నాడు వెల్లడించాడు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిందని బాలీవుడ్ సమాచారం. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో రానున్న ‘క్రిష్ 4’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కే విడుదల చేయనున్నట్లు హృతిక్ రోషన్ తెలిపారు. సో.. ఇలా వచ్చే ఏడాది క్రిస్మస్కు ఇద్దరు టాప్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎవరి పంట పండుతుందో, సినిమా విజయంతో ఎవరు పండగ చేసుకుంటారో చూడాలి. అయితే ఇంకా ‘క్రిష్ 4’ సెట్స్ పైకి వెళ్లలేదు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కేన్సర్ బారిన పడి, చికిత్స తీసుకుని ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
కబీర్ సింగ్‌కు ప్రభాస్ ప్రశంసలు
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ టీజర్ ఇటీవల రిలీజైంది. కబీర్ సింగ్‌గా నటించిన షాహిద్ కపూర్‌కు అభినందనలు కురిపిస్తోంది బాలీవుడ్. టీజర్లో షాహిద్‌ను చూసి మన ‘బాహుబలి’ ప్రభాస్ కూడా ఫ్లాట్ అయిపోయారట. షాహిద్‌ను పర్సనల్‌గా అభినందించారట కూడా. షాహిద్‌కు, ప్రభాస్‌కు కనె„ý న్ ఎక్కడ కుదిరిందీ అనుకుంటున్నారా? ఇద్దరి హైయిర్ స్టైలిస్ట్ ఒక్కరే. ప్రభాస్ ‘సాహో’ సినిమాకు హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు హకీమ్ అలీ. షాహిద్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కూడా ఇతనే. ‘సాహో’ షూటింగ్ టైమ్‌లో ‘కబీర్ సింగ్’ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసిన ప్రభాస్, ‘సాహో’ బృందం చాలా బావుందని మాట్లాడుకోవడం హకీమ్ అలీ చెవిలో పడింది. వెంటనే షాహిద్‌కు కాల్ చేసి ఫోన్ ప్రభాస్ చేతిలో పెట్టారట. ‘‘టీజర్ చాలా బావుందని సుమారు 7 నిమిషాల పాటు షాహిద్, ప్రభాస్ మాట్లాడుకున్నారు’’ అని హకీమ్ అలీ పేర్కొన్నారు. ‘కబీర్ సింగ్’ జూన్ 21న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్. -
ఫన్ చేస్తారా?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. హిందీ చిత్రంలో వెంకటేశ్, అర్జున్ కపూర్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. తెలుగు చిత్రాలు ‘పెళ్లాం ఊరెళితే, రెడీ’లను నో ఎంట్రీ, రెడీగా హిందీలో రీమేక్ చేసిన అనీస్ బాజ్మీ హిందీ ‘ఎఫ్ 2’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక బోనీకపూర్ తనయుడే అర్జున్ కపూర్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి.. వెంకీ, అర్జున్ కాంబినేషన్ నిజమేనా? వేచి చూద్దాం. -
సినిమా కోసం తాగాల్సి వచ్చింది
‘‘కబీర్ సింగ్ పాత్ర కోసం రోజుకు ఇరవై సిగరెట్లు వరకూ తాగేవాణ్ణి. ఆ దుర్వాసన అంతా పోవడానికి సుమారు రెండు గంటలు స్నానానికి కేటాయించేవాడ్ని’’ అని తెలిపారు షాహిద్ కపూర్. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు షాహిద్ కపూర్. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌కి కూడా దర్శకుడు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలో ప్రేయసి దూరమైన తర్వాత మందు, సిగరెట్లకు బానిస అయిన ప్రేమికుడిగా కనిపిస్తారు షాహిద్. కబీర్ సింగ్ పాత్ర గురించి షాహిద్ మాట్లాడుతూ – ‘‘రీమేక్ చేయడం చాలా కష్టం. ఒరిజినల్ని కాపీ చేస్తే కుదరదు. ఇక్కడి (నార్త్) ప్రేక్షకులకు సూట్ అయ్యేలా చేశాం. వ్యక్తిగతంగా పొగ త్రాగడాన్ని నేను అసలు ప్రోత్సహించను. కానీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అలా ఉంది. తన బాధను, కోపాన్ని వ్యక్తపరచలేక వాటికి బానిస అవుతాడు. ఆ పాత్ర కోసం రోజుకు 20 సిగరెట్లు వరకూ తాగాను. ఇంటికి వెళ్తే పిల్లలుంటారు కాబట్టి ఆ వాసన పోవడం కోసం 2 గంటలు షవర్ చేసి ఇంటికి వెళ్లేవాడ్ని’’ అని పేర్కొన్నారు. ‘కబీర్ సింగ్’ చిత్రం జూన్ 21న రిలీజ్ కానుంది. -
మ్యాచ్ కుదిరిందా?
షారుక్ ఖాన్ తమిళ సినిమాలో కనిపించబోతున్నారా? కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీ సర్కిల్లో ఇదే చర్చ. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో షారుక్ కనిపిస్తారని టాక్. మరోవైపు తమిళ బ్లాక్‌బస్టర్ ‘మెర్సల్’ను హిందీ రీమేక్ చేసే ఆలోచనలో షారుక్ ఉన్నారని టాక్. మంగళవారం చెన్నై – కోల్కత్తా ఐపీఎల్ మ్యాచ్‌లో షారుక్‌తో పాటు దర్శకుడు అట్లీ కూడా స్టేడియంలో కనిపించడంతో అట్లీ నెక్ట్స్ సినిమాలో షారుక్ కనిపిస్తారనే వాదనకు బలం చేకూరింది. మ్యాచ్ అనంతరం అట్లీ ఆఫీస్‌కి షారుక్ ఖాన్ వెళ్లారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మరి ఈ చర్చలు విజయ్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపించడానికా? లేక ‘మెర్సల్’ రీమేక్ కోసమా? తెలియాల్సి ఉంది. -
నవ్వుల కూలీ!
జూలై నుంచి కూలీగా మారనున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. 1991లో వెంకటేశ్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘కూలీ నెం.1’ అదే పేరుతో హిందీలో రీమేక్ అయ్యింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవింద నటించారు. ఇప్పుడు ఈ హిందీ ‘కూలీ నెం.1’ లేటెస్ట్ రీమేక్‌లో హీరోగా నటించే బాధ్యతను డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సారా అలీఖాన్ నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జూలై నుంచి ఆరంభం కానుంది. ‘‘ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో మార్పులు చేశాం. మరింత హాస్యం ఉంటుంది. ప్రస్తుతం లొకేషన్స్‌ను సెలక్ట్ చేస్తున్నాం. ఫారిన్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బోల్డ్ ఎంట్రీ
బోల్డ్ అండ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ఈ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు బోల్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని తెరకెక్కించిన మిలన్ లూథ్రియా ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. సాజిద్ నడియాడ్వాలా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ‘‘ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ సినిమాని రీమేక్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా ద్వారా యంగ్ హీరో అహన్ శెట్టి పరిచయం అవుతున్నాడు, సాజిద్లాంటి నిర్మాత ఉన్నారు. ఎగై్జటింగ్‌గా, చాలెంజింగ్‌గా ఉండబోతోందని అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు మిలన్. -
జోరు.. హుషారు
సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు ఒప్పుకుంటూ జోరు మీద ఉన్నారు జ్యోతిక. ఒక సినిమా (‘కాట్రిన్ మొళి’) ఇవాళ రిలీజ్ అంటే.. రెండు రోజుల క్రితమే మరో సినిమాకు ముహూర్తం జరిపారు. ప్రస్తుతం సూర్య చేస్తున్న ‘ఎన్జీకే’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థే జ్యోతిక కొత్త చిత్రాన్ని నిర్మించనుంది. నూతన దర్శకుడు యస్. రాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఇటీవలే జరిగింది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి స్టార్ట్ కానుందట. ఈ చిత్రం షూటింగ్ కోసం సుమారు 50 లక్షల వ్యయంతో ఓ స్కూల్ సెట్ రూపొందించారట. మరి ఈ సినిమాలో జ్యోతిక స్కూల్ టీచర్‌గా కనిపిస్తారా? లేక కీలక సన్నివేశాల కోసం ఆ స్కూల్ సెట్ ఉంటుందా? వేచి చూడాలి. లక్ష్మీతో పోటీ పడగలనా అనిపించింది జ్యోతిక ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ చిత్రం ‘కాట్రిన్ మొళి’. విద్యా బాలన్ హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులూ’కి రీమేక్ ఇది. ఇందులో లక్ష్మీ మంచు జ్యోతిక బాస్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీతో కలసి నటించడం గురించి జ్యోతిక మాట్లాడుతూ – ‘‘మంచు లక్ష్మీతో పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. లక్ష్మీ పవర్ఫుల్ లేడీ. తను నటించిన విధానం నాకు ముచ్చటేసింది. తను యాక్ట్ చేస్తున్నట్లే అనిపించదు. పాత్రలా ప్రవర్తిస్తుంది అంతే. కాన్ఫిడెంట్‌గా, తెలివిగా ఉండటం చూసి నేను తనతో పోటీపడగలనా? అనిపించింది. మేం ఇద్దరం అమ్మలం. సెట్లో మా పిల్లలు బాగా కలిసిపోయారు’’ అని పేర్కొన్నారు. -
నా ఇష్టం శ్రీదేవికి తెలియకూడదనుకున్నా!
బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్ ఎంత పెద్ద స్టారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారాయన. ‘లగాన్, పీకే, దంగల్’ వంటి సినిమాలతో సినీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆమీర్ ముందు ‘మీకు ఇçష్టమైన నటీనటులు ఎవరు?’ అన్న ప్రశ్న ఉంచితే– ‘‘అమితాబ్ బచ్చన్‌గారంటే ఇష్టం’’ అని టకీమని చెప్పారు. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి.. ‘‘నటి శ్రీదేవికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నా కెరీర్ మొదట్లోనే ఆమె అంటే ఇష్టం మొదలైంది. ఓ మ్యాగజీన్ ఫొటోషూట్ కోసం శ్రీదేవిని కలిశాను. అప్పుడు ఆమె కళ్లలోకి నా కళ్లు పెట్టి చూస్తే నా మనసులో ఉన్న ఇష్టం ఆమెకు ఎక్కడ తెలిసిపోతుందోనని వీలైనంత వరకూ నా చూపులను పక్కకు తిప్పుకునేలా ప్రయత్నించాను. ఆమెతో కలిసి ఇంగ్లీష్ మూవీ ‘రోమన్ హాలీడే’ హిందీ రీమేక్‌లో నటించాలనుకున్నా. ఈ ఆలోచన గురించి దర్శకుడు మహేశ్భట్తో చర్చించాను కూడా’’ అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు ఆమిర్. ఇదిలా ఉంటే.. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలుగా నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైందని బాలీవుడ్ టాక్. -
అర్జున్ రెడ్డి ఈజ్ కబీర్ సింగ్
‘అర్జున్ రెడ్డి’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బిగించి ఉన్న పిడికిలిని లవ్ సింబల్‌గా చేసి ఉన్న గుర్తుతో ఉన్న టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జూన్ 21న విడుదల కానున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘‘అర్జున్‌రెడ్డి’ ని ప్రేమించారు, అభినందించారు. ఇప్పుడు ‘కబీర్ సింగ్’ వంతు వచ్చింది. వేచి చూడండి’’ అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. -
రీమేక్‌తో ఎంట్రీ
బాలీవుడు నటుడు సునీల్ శెట్టి 25 సంవత్సరాలుగా హిందీ, దక్షిణాది చిత్రాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తన రెండో జనరేషన్ యాక్టర్స్‌ని స్క్రీన్కు పరిచయం చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కూతురు అతియా శెట్టిని ‘హీరో’ సినిమా ద్వారా 2015లో సల్మాన్‌ఖాన్ పరిచయం చేశారు. ఇప్పుడు కుమారుడు అహన్ శెట్టిని బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ న డియాడ్వాలా పరిచయం చేయనున్నారు. తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ రైట్స్ ఈ నిర్మాత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ద్వారా అహన్ శెట్టిని హీరోగా బాలీవుడ్లో పరిచయం చేయనున్నారట. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. -
హాలీవుడ్ ఎంట్రీ!
బాలీవుడ్ యాక్షన్ హీరోల లిస్ట్‌లో టైగర్ ష్రాఫ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఏ ‘ప్లైయింగ్ జాట్, భాగీ సిరీస్’ చిత్రాల్లో టైగర్ యాక్షన్ టాలెంట్ ఏంటో చూశాం. ఇప్పుడీ యాక్షన్ హీరో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. ఇటీవల టైగర్ ష్రాఫ్‌ను హాలీవుడ్ నిర్మాత లారెన్స్ కసోనోఫ్ మీట్ అవ్వడమే ఇందుకు కారణం. టైగర్ ఫిజిక్కు లారెన్స్ ఇంప్రెస్ అయ్యారట. తాను తీయాలనుకుంటున్న యాక్షన్ మూవీకి టైగర్ నప్పుతాడని భావించారట. గతంలో ‘బ్లడ్ డిన్నర్, ఫార్ ఫ్రమ్ హోమ్, ట్రూ లైస్’ వంటి భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు లారెన్స్. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ ఫిల్మ్ ‘రాంబో’ హిందీ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. -
డేట్ రెడీ
బాలీవుడ్ అర్జున్ రెడ్డి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి డేట్ రెడీ చేసుకున్నారు. ఒక్కసారి స్టార్ట్ అయితే ఇక నో బ్రేక్స్ అంటున్నారు. గతేడాది తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. పలుమార్లు డిలే అవుతూ వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19న స్టార్ట్ కానుంది. ఈ క్యారెక్టర్ కోసం మరింత గడ్డం పెంచడానికి టైమ్ తీసుకున్నారు షాహిద్ కపూర్. తొలుత ఈ సినిమాలో తారా సుతారియాని హీరోయిన్గా అనుకున్నారు కానీ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నారు. -
బెంగళూర్ టు ముంబై
సౌత్ నుంచి సూపర్ హిట్ సినిమాల ఎగుమతి ఈ మధ్య బాగా జరుగుతోంది. తాజాగా నాలుగేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్ నటించిన మలయాళం బ్లాక్‌బస్టర్ ‘బెంగళూర్ డేస్’ కూడా బాలీవుడ్లో రీమేక్ కానుందట. ‘యం.యస్.థోని’ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నారట. కేవలం నిర్మించడమే కాకుండా మలయాళంలో నివిన్ పౌలీ చేసిన పాత్రను హిందీ రీమేక్‌లో పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారట ఈ యంగ్ హీరో. ఈ సినిమా రైట్స్ ప్రొడ్యూసర్ వివేక్ రంగాచారీతో ఉండటంతో, ఆ నిర్మాతతో రీమేక్ విషయంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేలోపు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట సుశాంత్ సింగ్. -
హిందీలో కత్తి పట్టేదెవరు?
బాలీవుడ్లో సౌత్ సినిమాల రీమేక్ గాలి బాగా వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సౌత్ నుంచి ‘టెంపర్, ప్రస్థానం, అర్జున్ రెడ్డి, విక్రమ్ వేదా’ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో తమిళం చిత్రం ‘కత్తి’ కూడా చేరిందని బాలీవుడ్ టాక్. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దక్కించుకున్నారట. గతంలో సౌత్ నుంచి ‘విక్రమార్కుడు’ సినిమాను ‘రౌడీ రాథోడ్’గా, తమిళ మూవీ ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయ్యింది) సినిమాను ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ పేరుతో హిందీలో నిర్మించి హిట్ సాధించారు భన్సాలీ. ఈ రెండు సినిమాల్లో అక్షయ్ కుమార్‌నే హీరో కావడం విశేషం. మరి.. ‘కత్తి’ రీమేక్‌లో కూడా అక్షయ్‌నే హీరోగా నటిస్తారా? లేక ఇంకో హీరో చేస్తారా? తెలియడానికి కాస్త టైమ్ ఉంది. తమిళ ‘కత్తి’ సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా ‘ఖైదీ నంబర్ 150’ పేరుతో రీమేక్ అయింది. -
‘మిత్రోం’ ఇది తగునా..?
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డిఫరెంట్ కామెడీతో ఆకట్టుకున్న పెళ్లిచూపులు తరుణ్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టడమే కాదు. దర్శకుడిగా రచయితగా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిపెట్టింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో మిత్రోం పేరుతో రీమేక్ చేశారు. సెప్టెంబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. నేటివిటీ పరంగా మార్పులు చేసిన ట్రైలర్లో ప్రతీ సీన్ ఒరిజినల్ వర్షన్లో కనిపించిందే. అయితే టైటిల్ లో మాత్రం ఎక్కడా తరుణ్ భాస్కర్ ప్రస్తావన్ లేదు. కథా కథనాలు పెళ్లి చూపులు నుంచే తీసుకున్నారు కాబట్టి తప్పుకుండా తరుణ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒరిజినల్‌గా కథా కథనాలు తయారు చేసిన తరుణ్‌భాస్కర్‌కు క్రెడిట్ ఇవ్వకపోగా రచయితగా శరిబ్ హష్మీ పేరు వేశారు. దీంతో హిందీలో రీమేక్ చేసిన దర్శక నిర్మాతలు క్రెడిట్ ఇవ్వకపోవటం అన్యాయం అన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై మిత్రోం చిత్ర దర్శకుడు నితిన్ కక్కర్, నిర్మాత విక్రమ్ మల్హోత్ర ఎలా స్పందిస్తారో చూడాలి. -
గడ్డం కహానీ!
గడ్డం ఫుల్‌గా పెరగనిదే సెట్స్‌లోకి రానని చెప్తున్నారట షాహిద్ కపూర్. ఎందుకంటే తెలుగు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో ఆయన హీరోగా నటించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే హిందీ కూడా చేయనున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈపాటికే స్టార్ట్ కావాల్సింది. క్యారెక్టర్ దృష్ట్యా హీరో గడ్డం పెంచాల్సి ఉంది. కానీ షాహిద్‌కు గుబురు గడ్డం రావడానికి ఇంకా టైమ్ పడుతుందట. డూప్లికెట్ గడ్డంతో ప్రొసీడ్ అవుదామన్నా ఒరిజనలే ముద్దు అని ఫిక్సయ్యారట. అందుకే ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ఆరంభమవుతుంది. ఫైనల్లీ ఈ నెల 20న స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన తర్వాత షాహిద్ బ్రేక్ తీసుకుంటారట. ఆయన సతీమణి మీరా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అవుతుండటమే ఇందుకు కారణం. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. హిందీ ‘అర్జున్ రెడ్డి’ వచ్చే ఏడాది జూన్ 21న థియేటర్స్‌లోకి వస్తాడట. -
ఇక ఆపుతారా?
‘‘ఓ సారి యాక్టర్, ఇంకోసారి క్రికెటర్, ఈసారేమో డాక్టరట. ఈ రూమర్స్ అన్నీ వింటుంటే నేనేదో పెళ్లి కొడుకులను షాపింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రేమించాలి, ప్రేమలో ఉండాలని నాకూ ఉంటుంది. కానీ ఇలాంటి రూమర్స్‌ని, అదీ నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన వార్తలను ఎప్పటికీ సహించను’’ అని ఘాటుగా స్పందించారు తమన్నా. అమెరికాలోని ఓ డాక్టర్‌తో తమన్నా త్వరలో మూడు ముళ్లు వేయించుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అందులో ఎటువంటి నిజం లేదని, అవన్నీ కేవలం పనిలేని వాళ్లు పనిగట్టుకొని చేస్తున్న పని అంటున్నారు తమన్నా. ఈ విషయాన్ని తమన్నా వివరిస్తూ – ‘‘ప్రస్తుతానికైతే సింగిల్‌గా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా అమ్మానాన్నలు కూడా నాకు పెళ్లి కొడుకుని చూడటంలేదు. ప్రస్తుతానికి నా సినిమాలతో నేను ప్రేమలో ఉన్నాను. షూటింగ్స్‌తో నేను బిజీగా ఉంటేæ ఇలాంటి రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయో అర్థంకాదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే అప్పుడు స్వయంగా అనౌన్స్ చేస్తాను. ఈ విషయం గురించి మరోసారి క్లారిటీ ఇస్తున్నాను ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోవడం లేదు. ఇలాంటి అవాస్తవ వార్తలను రాయడం ఆపేస్తారని అనుకుంటున్నాను’’ అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తమన్నా క్వీన్ హిందీ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’, వెంకటేశ్–వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
మిస్ డీసెంట్
కన్నడ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’లో డీసెంట్ గాళ్‌గా రష్మిక మండన్నా నటించారు. ఇప్పుడు ఇదే పాత్రను చేయడానికి బాలీవుడ్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెడీ అవుతున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ జైన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో ఒక కథానాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ సినిమా తెలుగులో ‘కిరాక్ పార్టీ’ టైటిల్‌తో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో ‘డ్రైవ్’ సినిమాతో బిజీగా ఉన్నారు జాక్వెలిన్. -
హిందీ కిర్రాక్ పార్టీ
‘టెంపర్, ప్రస్థానం, అర్జున్ రెడ్డి, విక్రమ్ వేదా’ వంటి దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి కన్నడ హిట్ ‘కిర్రిక్ పార్టీ’ చేరింది. ఈ హిందీ రీమేక్‌కు అభిషేక్ జైన్ దర్శకత్వం వహిస్తారు. ‘సోను కే టిట్టు కీ స్వీటీ’ ఫేమ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాను సంప్రదించారట. ఆయన డేట్స్ కుదరక పోవడంతో ఆ చాన్స్ ఆర్యన్‌ను వరించిందని టాక్. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక మండన్నా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం తెలుగులో ‘కిర్రాక్ పార్టీ’ పేరుతో రీమేక్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఇస్తినమ్మ వాయనం...
‘తుమ్హారీ సులూ’ సినిమా తర్వాత ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో బసవతారకం రోల్ చేస్తున్నారు విద్యా బాలన్. ఆ మధ్య ఇందిరా గాంధీ బయోపిక్‌లోనూ యాక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ అప్డేట్ ఇంకా లేదు. ఆయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారమేంటంటే తమిళంలో జ్యోతిక కమ్‌బ్యాక్ చిత్రంగా చేసిన ‘36 వయదినిలే’ హిందీ రీమేక్‌లో నటించడానికి విద్యా ఆసక్తికరంగా ఉన్నారని టాక్. ‘36 వయదినిలే’ మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కు రీమేక్. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం, సబ్జెక్ట్ నచ్చడంతో ఈ సినిమాను ఓకే చేశారట విద్యా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనంలా ఉంది విద్యా బాలన్, జ్యోతికల పరిస్థితి. ఒక పక్క విద్యా బాలన్ ‘తుమ్హారీ సులూ’ రీమేక్ లో జ్యోతిక యాక్ట్ చేస్తుంటే, విద్యా బాలన్ ఏమో జ్యోతిక సినిమా రీమేక్ చేయాలనుకోవడం విశేషం. -
ప్రస్థానం ప్రారంభం
అబ్బా.. బాలీవుడ్ సినిమాలు భలే ఉంటాయిరా బాబు! మన టాలీవుడ్లో అలాంటి సినిమాలు రావడం తక్కువ అని కొందరు అంటుంటారు. కానీ ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో అయితే మన తెలుగు సినిమాలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందుకు మన ‘బాహుబలి’ చిత్రమే నిదర్శనం. అంతెందుకు ఇప్పుడు చూడండి. తెలుగు సినిమాలు ‘ప్రస్థానం, టెంపర్, అర్జున్‌రెడ్డి’ బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’కు టీమ్ కొబ్బరికాయ కొట్టారు. గురువారం హిందీ ‘ప్రస్థానం’ మొదలైంది. తెలుగులో డైరెక్ట్ చేసిన దేవా కట్టానే దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు జాకీ ష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. పదేళ్ల క్రితం హిందీ చిత్రం ‘కార్తూస్’లో కలిసి నటించిన సంజయ్, మనీషా, జాకీ మళ్లీ ఇప్పుడు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌లో నటిస్తుండటం విశేషం. ‘‘ఫస్ట్ డే షూట్లో సంజయ్‌దత్ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దేవా కట్టా. -
మైసూర్లో ప్యారిస్ ప్యారిస్!
‘ప్యారిస్ ప్యారిస్’ అంటూ మైసూర్ వెళ్లారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయ్యో.. పాపం ఆమె అలా ఎలా పొరపాటు పడ్డారు? ఇప్పుడెలా అని ఫ్యాన్స్ కంగారు పడిపోకండి. ‘ప్యారిస్ ప్యారిస్’ అనేది సినిమా టైటిల్. ప్లేస్ కాదండీ బాబు. రమేష్ అరవింద్ దర్శకత్వంలో కాజల్ లీడ్ రోల్ చేస్తోన్న చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. హిందీ హిట్ ‘క్వీన్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూర్లో ప్లాన్ చేసింది. ఈ షూటింగ్లో కాజల్ పాల్గొంటున్నారట. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా హైదరాబాద్ షెడ్యూల్లో కాజల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ ప్రస్థానం
‘హీరోలూ విలన్లూ లేరీ నాటకంలో..’ అంటూ 2010లో దర్శకుడు దేవా కట్టా రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రస్థానం’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ నటన, సాయి కుమార్ డైలాగ్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్స్గా నిలిచాయి. ఇప్పుడు అవే పదునైన సంభాషణలు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పలకబోతున్నారు. తెలుగులో రిలీజ్ అయిన ఎనిమిది సంవత్సరాలకు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు దేవా కట్టా. సాయి కుమార్ పాత్రలో సంజయ్ దత్, శర్వానంద్ పాత్రలో అలీ ఫాజల్ నటించనున్నారు. హీరోయిన్గా అమైరా దస్తూర్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంజయ్ దత్ ఓ నిర్మాత కావడం విశేషం. సంజయ్ దత్ తల్లి, బాలీవుడ్ సూపర్‌స్టార్ నర్గీస్ జయంతి సందర్భంగా జూన్ 1న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
షాహిద్ ఈజ్ అర్జున్ రెడ్డి
‘రణ్వీర్ సింగ్ చేస్తాడు. లేదు.. లేదు.. అర్జున్ కపూర్ చేస్తాడు’ అంటూ తెలుగు సూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్లో రీమేక్‌లో అవుతుందని తెలిసినప్పటి నుంచి పలువురి హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఫైనల్‌గా బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ దొరికేశాడు. హిందీ రీమేక్‌లో అర్జున్ రెడ్డి పాత్రలో షాహిద్ కపూర్ కనిపించనున్నారు. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ రీమేక్‌నూ డైరెక్ట్ చేయనున్నారు. జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను మురాద్ ఖేతానీ, అశ్విన్ వార్దే నిర్మించనున్నారు. ‘‘కాలేజ్ పోర్షన్‌ను ఢిల్లీలో షూట్ చేయనున్నాం. బాలీవుడ్లో ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది. ఈ కథను ఇంకా ‘రా’గా చూపించే ప్రయత్నం చేస్తాను. షాహిద్ కపూర్ చాలా టాలెంటెడ్ యాక్టర్. అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌ను బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించేలా చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాకు సంబంధించి మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. 2019 మార్చి 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నెక్ట్స్ మహేశ్‌తో.. డైరెక్టర్ సందీప్ వంగా బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కంప్లీట్ చేయగానే మహేశ్‌బాబుతో ఓ సినిమా ఉంటుందని సమాచారం. ఆల్రెడీ మహేశ్‌బాబు కథ వినేసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. మహేశ్ 27వ సినిమాగా రూపొందే అవకాశం ఉందట. బహుశా హిందీ రీమేక్ తర్వాత సందీప్ చేయబోయేది ఈ ప్రాజెక్టే అవుతుందేమో?. హిందీ ‘అర్జున్ రెడ్డి’ వచ్చే ఫిబ్రవరిలో పూర్తి అవుతుంది. ఆ తర్వాత మహేశ్‌బాబు–సందీప్ సినిమా మొదలవుతుందని ఊహించవచ్చు. -
జాన్వీ@టెంపర్
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. శషాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో జోడీ కట్టారు జాన్వీ. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో క్రేజీ ఆఫర్ జాన్వీని వరించిందని బీ టౌన్ టాక్. ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని ‘శింబా’ పేరుతో హిందీలో రీమేక్ చేయనున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ చిత్రం నిర్మించనున్నారట. ఇందులో జాన్వీ కపూర్‌ని కథానాయికగా తీసుకున్నారని బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తెలుగులో కాజల్ చేసిన పాత్రకంటే ‘శింబా’లో జాన్వీ పాత్రను మరింత క్యూట్‌గా మలచనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. జాన్వీ ఫస్ట్ మూవీ ‘ధడక్’ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ‘టెంపర్’ రీమేక్‌కి కూడా ఆయనే నిర్మాత. ఒకవేళ జాన్వీ నటన నచ్చి, ‘టెంపర్’కి కూడా తీసుకోవాలనుకున్నారేమో? అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. -
అర్జున్‌రెడ్డికి నో...
...అవును. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటించేందుకు రణ్వీర్ సింగ్ ‘నో’ చెప్పారట. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం టాలీవుడ్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో హీరో, హీరోయిన్, డైరెక్టర్, స్నేహితుడి పాత్రధారి రాహుల్ ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోయారనడం అతిశయోక్తి కాదేమో. తెలుగునాట ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీ, కన్నడ భాషల్లో ఇతర దర్శకులు రీమేక్ చేస్తున్నా హిందీకి మాత్రం సందీప్ రెడ్డే దర్శకత్వం వహిస్తారనీ, రణ్‌వీర్‌సింగ్ లీడ్ రోల్లో నటిస్తారని వార్తలు వినిపించాయి. రణ్‌వీర్‌కి కథ వినిపించడంతో నటించేందుకు తొలుత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారట. ‘అర్జున్‌రెడ్డి’ కంటెంట్ బోల్డ్‌గా ఉండడమే ఇందుకు కారణమట. ‘పద్మావతి’ సినిమాలో రణ్వీర్ చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రే ఇప్పటికే వివాదం కావడంతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి మరో వివాదాస్పద పాత్రలో నటించడం ఇష్టం లేక ‘నో’ చెప్పారట. రణ్వీర్ స్థానంలో ఇప్పుడు షాహిద్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు షాహిద్‌నే ఖరారు చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్ టాక్. -
బాలీవుడ్ లో స్పైడర్ రీమేక్..?
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ స్పైడర్. తొలి సారిగా ఈ సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అయిన మహేష్, మరోసారి బాక్సాఫీస్ ముందు సత్తా చాటాడు. తొలి రోజు డివైడ్ టాక్ తో స్టార్ట్ అయిన స్పైడర్ ఒక్క రోజులో 51 కోట్ల గ్రాస్ సాధించి మహేష్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సౌత్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటిన మురుగదాస్, స్పైడర్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ముందుగా ఈ సినిమానే డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బాలీవుడ్ రీమేక్ తో మహేష్ బాబును బాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతను కూడా మురుగదాస్ తీసుకోబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ నాట స్పైడర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మురుగదాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తి కనబరుస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న స్పైడర్ బాలీవుడ్ రీమేక్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ముంబైకి నిన్ను కోరి!
‘‘... కానీ నేను అలా కాదుగా బ్రదర్... తననే ప్రేమించాను.. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను’’.. ఈ డైలాగ్ ‘నిన్ను కోరి’ సినిమాలో నాని చెప్పిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో శివనిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్టయింది. ఇప్పుడు ఇలాంటి డైలాగ్స్‌నే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హిందీలో చెప్పబోతున్నారట. ‘నిన్ను కోరి’ హిందీ రీమేక్‌లో ఆయనే హీరోగా నటించనున్నారని సమాచారం. రీమేక్ విషయమై తెలుగు వెర్షన్ నిర్మాతలు కోన వెంకట్, డీవీవీ దానయ్యలతో బాలీవుడ్ దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ చర్చలు జరుపుతున్నారట. నాని చేసిన ఉమ పాత్రకు వరుణ్ ధావన్ సూట్ అవుతారని భన్సాలీ భావించారట. ఇక్కడ కథానాయికగా నివేదా థామస్, హీరోలాంటి రోల్‌ను ఆది పినిశెట్టి చేశారు. మరి.. ఈ రెండు పాత్రలకు హిందీలో ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి. -
ఎట్టకేలకు బాలీవుడ్లో మగధీరకు మోక్షం
-
మార్పు చేయాల్సిందే!
విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కత్తి’ ఘనవిజయం సాధించిన విషయం, ఆ చిత్రం తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. తెలుగుకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు. కాగా, ‘కత్తి’ చిత్రం హిందీ రీమేక్‌లో నటించడానికి అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన అంగీకరించి, ఏడాది పైనే అయ్యింది. హిందీకి తగ్గట్టుగా కథను మార్చమని దర్శకుడు మురుగదాస్‌తో అక్షయ్ చెప్పారట. ఆ మార్పులు సంతృప్తికరంగా అనిపిస్తే అప్పుడు చిత్రీకరణ మొదలుపెడదామని అన్నారట. -
హిందీలో మణిరత్నం హిట్
దిగ్దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన మేటి చిత్రాల్లో ‘అగ్ని నక్షత్రం’(తెలుగులో ‘ఘర్షణ’) ఒకటి. కార్తీక్, ప్రభు ముఖ్యపాత్రల్లో 28 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం హిందీ రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్ ముఖ్యపాత్రల్లో ‘వజీర్’ చిత్రాన్ని తెరకెక్కించిన బిజోయ్ నంబియార్ ఈ రీమేక్‌కు దర్శకుడు. గమ్మత్తేమిటంటే, మెగాఫోన్ పట్టక ముందు బిజోయ్ కొన్నాళ్లు మణిరత్నం వద్ద సహాయకునిగా పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల ఈ సినిమా రీమేక్ హక్కులను మణిరత్నం నుంచి తీసుకున్న బిజోయ్ ఇప్పుడీ సినిమా స్క్రిప్ట్‌ను హిందీ వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. -
కండలవీరుడు... శ్రీమంతుడు?
సొంతూరికి ఏదైనా చేయాలనే శ్రీహర్ష పాత్రలో మహేశ్‌బాబు ఒదిగిపోయారు. మంచి కథా కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ దత్తత తీసుకుని విజయాన్నందించింది. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి సల్మాన్‌ఖాన్ సుముఖత వ్యక్తం చేశారట. అలాగే నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. గతంలోనే మహేశ్‌బాబు ‘పోకిరి’ని ‘వాంటెడ్’గా రీమేక్ చేసి తన కెరీర్లో ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అన్నీ కుదిరితే ‘శ్రీమంతుడు’గా సల్మాన్ సందడిని వెండితెరపై చూడొచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని భోగట్టా! -
శ్రీమంతుడును రీమేక్ చేస్తున్న సల్మాన్!
-
హిందీలోకి 'గోవిందుడు' రీమేక్?
రాంచరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రభుదేవా సిద్దం అవుతున్నారట. ఆ సినిమాను ప్రభుదేవా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడంతో అది చూసినప్పటినుంచి దాన్ని ఎలాగైనా హిందీలో తీయాల్సిందేనని ప్రభుదేవా అంటున్నాడు. యాక్షన్ జాక్సన్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో.. ఆ తర్వాత ఏదైనా విభిన్నమైన సినిమా తీయాలని అనుకుంటుండగా... కృష్ణవంశీ కళాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆయన దృష్టికి వచ్చింది. హిందీ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఉంటారని సమాచారం. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన చూసి ప్రభుదేవా చాలా ఇంప్రెస్ అయ్యారని, దాంతో ఆయన తప్ప వేరేవెరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరనిపించి ఆయన్నే ఖాయం చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుదేవా ఈ సినిమాను ప్రత్యేక స్క్రీనింగ్‌లో చూసిన విషయాన్ని సినిమా నిర్మాత బండ్ల గణేశ్ కూడా నిర్ధారించినా, రీమేక్ విషయం గురించి మాత్రం ఆయనేమీ చెప్పలేదు. ప్రస్తుతానికి తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనన్నారు. ఇంతకుముందు పోకిరీని వాంటెడ్గాను, విక్రమార్కుడిని రౌడీ రాథోడ్గాను తీసి బాలీవుడ్లో ప్రభుదేవా కొన్ని విజయాలు చూశారు. దాంతో ఇప్పుడాయన గోవిందుడు సినిమాను రీమేక్ చేయడం పెద్ద విచిత్రమేమీ కాదని సినీ పండితులు అంటున్నారు. -
దృశ్యం రిమేక్‌లో అజయ్‌దేవగన్
-
కే.రాఘవేంద్రరావు డాక్టరేట్‌కు అనర్హుడు:నిర్మాత కే.మురారీ
తమిళ సినిమా : ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుపై మరో ప్రముఖ నిర్మాత కే.మురారి నిప్పులు చెరిగారు. రాఘవేంద్రరావు సంస్కారంలేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి గౌరవ డాక్టరేట్ బిరుదు అందుకునే అర్హత లేదని మండిపడ్డారు. గోరింటాకు, నారినారి నడుమమురారి, త్రిశూలం, సీతారాముడు తదితర చిత్రాల నిర్మాత మురారి. అదేవిధంగా శతాధిక చిత్రాల దర్శకుడు కే.రాఘవేంద్రరావు. కాగా కే.రాఘవేంద్రరావుతోపాటు మరో ఇద్దరు ప్రముఖులకు వైజాగ్‌లోని గీతం యూ నివర్సిటీ గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించింది. ఈ నేపథ్యంలో దర్శకు డు కే.రాఘవేంద్రరావు డాక్టరేట్ అవార్డు నందుకోనుండటాన్ని నిర్మాత కే.మురారి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన శుక్రవారం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాఘవేంద్రరావుపై ధ్వజమెత్తారు. రాఘవేంద్రరావు కుసంస్కారి అని అన్నారు. ఒకసారి ఆయన చెన్నైలో మాయాజాల్ సినీథియేటర్కు సినిమా చూడటానికొచ్చారని, విషయం తెలిసి తానాయాన్ని ఇంటికి ఆహ్వానించానని చెప్పారు. తన ఇంటిని పరీక్షిస్తున్న రాఘవేంద్రరావుకు తన తల్లి ఫొటోను చూపించగా అంతఅసహ్యంగా ఉందేంటంటూ ఫొటోను కిందపడేసిన కుసంస్కారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను నిర్మించిన త్రిశూలం చిత్రం హిందీ రీమేక్ హక్కులపై తనకు రావాల్సిన మూడు లక్షల రూపాయలను ఇప్పటికీ తనకివ్వలేదని ఆరోపించారు. అసలు ఆయనేమి సాధించాడని ఆయనకీ గౌరవ డాక్టరేట్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనేమ్మన్నా సామాజిక సేవ చేశాడా..? అంటూ విమర్శించారు. రాఘవేంద్రరావు సొంత కథలతో తెరకెక్కించిన చిత్రాలన్ని ప్లాఫ్లేనని అన్నారు. రాఘవేంద్రరావుకు డాక్టరేట్ అనగానే ఇప్పటి వరకూ ఆ బిరుదుపై ఉన్న గౌవరం పోయిందని కే.మురారి అన్నారు. -
వివాదాస్పద చిత్రంలో...వివాదాస్పద వ్యక్తి
క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం పుణ్యమా అని వార్తల్లో నిలిచి, ఆ కళంకం ఇప్పటికీ మాసిపోని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడు బుల్లితెర, వెండితెరలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లున్నారు. ప్రముఖులు పాల్గొనగా బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షో ‘ఝలక్ దిఖ్లా జా’ తాజా సీజన్లో ఇటీవలే ఆయన మెరిశారు. కాగా, ఇప్పుడీ మాజీ క్రికెటర్ ఏకంగా ఓ హిందీ సినిమాలో నటించనున్నారు. ఓ పాపులర్ మలయాళ చిత్రాన్ని, ఓ ప్రముఖ మలయాళ దర్శకుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. ఆ సినిమాలో శ్రీశాంత్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు భోగట్టా. సాక్షాత్తూ శ్రీశాంత్ సోదరుడైన దీపూశాంత్ ఈ సంగతి నిర్ధారించారు. ‘‘ప్రస్తుతం పాల్గొంటున్న డ్యాన్స్ రియాలిటీ షో అయిపోగానే శ్రీశాంత్ ఈ హిందీ సినిమాలో నటిస్తారు’’ అని దీపూశాంత్ తెలిపారు. ఇతర తారాగణం ఖరారు కావాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆలోచన. అన్నట్లు, ఇది ఓ కుటుంబ కథా చిత్రమట! అప్పట్లో వివాదాస్పదమైన మలయాళ సూపర్‌హిట్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. మొత్తానికి, ఎక్కడకు వెళ్ళినా వివాదాన్ని వెంటబెట్టుకుపోవడం శ్రీశాంత్ పంథా అనుకోవచ్చేమో! అంతేనా, శ్రీశాంత్!