Navjot Singh Sidhu
-
తప్పుడు నిర్ణయం.. రోహిత్‌నే పక్కన పెడతారా?
సిడ్నీ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథినే పక్కనపెట్టడం ద్వారా మేనేజ్మెంట్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరుగలేదంటూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో కంగారూ జట్టుతో తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో భారత జట్టును ముందుండి నడిపించిన బుమ్రా.. పెర్త్ టెస్టులో విజయాన్ని అందించాడు.రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత అయితే, రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా వరుసగా వైఫల్యాలే ఎదురయ్యాయి. అడిలైడ్‌లో ఓడిపోయిన భారత్.. బ్రిస్బేన్‌లో డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా సిరీస్‌లో 1-2తో వెనుకబడింది.బ్యాటర్‌గానూ విఫలంఇక బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. ముఖ్యంగా అనవసరపు షాట్లకు పోయి అతడు వికెట్ పారేసుకున్న తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆసీస్‌తో ఆఖరిదైన ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట రోహిత్ స్వయంగా తప్పుకొన్నాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ వంటి వాళ్లు రోహిత్ నిర్ణయాన్ని సమర్థించగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం భిన్నంగా స్పందించాడు.తప్పుడు నిర్ణయం.. రోహిత్‌నే పక్కన పెడతారా?‘‘ఇది చాలా ఆశ్చర్యకరంగా, వింతగా ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అతడిని కెప్టెన్‌ను ఎందుకు చేశారు?.. అయినా సారథిగానే కాకుండా కీలక ఆటగాడిగా భారత క్రికెట్‌కు అతడు ఇప్పటికే ఎంతో సేవ చేశాడు.అలాంటి ఆటగాడి ఫామ్ బాగున్నా.. లేకున్నా అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే అతడు కెప్టెన్. జట్టు ప్రయోజనాల కోసం తనను తాను బెంచ్‌కే పరిమితం చేసుకోవడం ఏమిటి? ఇలా చేయడం ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ తప్పుడు సంకేతాలు ఇస్తోంది.అతడిపై వేటు వేయడమో.. లేదంటే తనకు తానుగా తప్పుకొనేలా చేయడమో సరికాదు. జట్టును నిర్మించిన సారథి అతడు. యువ ఆటగాళ్లలో చాలా మంది అతడిని తమ తండ్రి సమానుడిలా భావిస్తారు. వాళ్ల నుంచి అతడు అంతటి గౌరవాన్ని పొందాడు. ఏ కెప్టెన్ అయినా నౌకను మధ్యలోనే వీడి వెళ్లిపోడు. అది మునిగిపోతుందని తెలిసినా గట్టెక్కించే ప్రయత్నమే చేస్తాడు గానీ.. తానే ముంచేయాలని చూడడు. అతడొక గౌరవప్రదమైన వ్యక్తి. కానీ మీరు మాత్రం అతడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది. అతడిపై నమ్మకం ఉంచాల్సింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సిడ్నీలో తొలి రోజు ముగిసిందిలాకాగా ఆసీస్‌తో సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు ఆదిలోనే షాకిచ్చింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి ఆసీస్ తొమ్మిది పరుగులు చేసింది.చదవండి: కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
నిమ్మరసం, పచ్చిపసుపుతో క్యాన్సర్‌కు చెక్? సిద్ధూకి రూ. 850 కోట్ల లీగల్ నోటీసు
మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్‌కి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి భారీ షాక్ తగిలింది. అల్లోపతి మందులు లేకుండానే తన భార్య 4వ దశ క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకుందన్న వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వారం రోజుల్లోగా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లీగల్ నోటీసులిచ్చింది. లేనిపక్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులిచ్చింది. అంతేకాదు సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని కోరింది.డైట్ కంట్రోల్ వల్ల తన భార్య నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందంటూ సిద్ధూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ, నిమ్మరసం, పచ్చిపసుపు, వేప, తులసి లాంటి పదార్థాలతో కేవలం 40 రోజుల్లోనే తన భార్య వైద్యపరంగా క్యాన్సర్‌ను జయించిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా దీనిపై సివిల్ సొసైటీ తీవ్రంగా మండిపడింది. సిద్ధూ వాదనలు సందేహాస్పదమైనవి, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఇది క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్రమాదకరంగా మారుతుందని సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు.కాగా పలువురు వైద్య నిపుణులు, ఆంకాలజిస్టులు కూడా సిద్ధూ వ్యాఖ్యల్ని ఖండించారు. సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. కేవలం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ డైట్ ప్లాన్‌ను వైద్యులతో సంప్రదించి అమలు చేశామని ,"చికిత్సలో సులభతరం"గా పరిగణించాలని సోమవారం తెలిపాడు. మరి తాజా నోటీసులపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇదీ చదవండి: ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా? -
రెండుసార్లు బౌండరీని తాకినా ఎందుకిలా? ఇది అన్యాయం..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతికత పేరిట సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అతడు గనుక క్రీజులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఇక సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.బాధ్యత తీసుకున్న సంజూ శాంసన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(4), జోస్ బట్లర్(19) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.46 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుటయ్యాడు. పదహారో ఓవర్లో ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో షాయీ హోప్‌నకు క్యాచ్ ఇచ్చాడు.అయితే, క్యాచ్ అందుకునే సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్‌ను తాకినట్లుగా అనిపించినా ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ అవుటివ్వడంతో సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు.. సంజూకు మద్దతుగా నిలిచాడు.సైడ్ యాంగిల్లో చూసినపుడు ‘‘అంపైర్లు తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. సంజూ శాంసన్ అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక.. కానీ సైడ్ యాంగిల్లో చూసినపుడు ఫీల్డర్ బౌండరీ లైన్‌ను రెండుసార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించింది.సాంకేతికత వాడినా, వాడకపోయినా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈసారి టెక్నాలజీ వల్ల కచ్చితంగా తప్పిదం జరిగిందనే చెప్తాను. రెండుసార్లు అతడు బౌండరీ లైన్ తాకినా అవుట్ ఇవ్వడం సరికాదు.అన్యాయం.. సంజూ బలైపోయాడునేను తటస్థంగా ఉండే వ్యక్తిని. సంజూ నాటౌట్ అని కచ్చితంగా చెప్పగలను. అలా అని అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని నేను అనుకోవడం లేదు.ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజూ బలైపోయాడు. ఆటలో ఇవన్నీ సహజమే అయినా.. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో రాజస్తాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.చదవండి: Playoff Race: సన్‌రైజర్స్ గుండెల్లో వర్షం గుబులు.. మ్యాచ్ రద్దైతే గనుక! Game of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
IPL 2024: ఢిల్లీ, లక్నో, గుజరాత్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే?
ఐపీఎల్-2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఎడిషన్‌లో సగం పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గత సీజన్లో నిరాశపరిచిన రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఏడాది సీజన్లో దుమ్ములేపుతున్నాయి.ప్రస్తుతం పాయింట్ల పట్టిక టాప్-4లో రాజస్తాన్ రాయల్స్ 14 పాయింట్లతో అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత స్ధానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐదో స్ధానంలో నిలిచింది.అయితే 7 విజయాలతో తొలి స్ధానంలో ఉన్న రాజస్తాన్ మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. మిగిలిన మూడు స్ధానాలు కోసం మిగితా 9 జట్లు పోటీపడనున్నాయి. అందులో ఆఖరి స్ధానంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే.ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అద్బుతాలు జరిగాలి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అంచనా వేశాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయని సిద్దూ జోస్యం చెప్పాడు.నాలుగో స్ధానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడతాయని సిద్దూ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దూ పేర్కొన్నాడు. అయితే పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో లక్నో సూపర్ జెయింట్స్‌ను సిద్దూ ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా ముంబై ఇండియన్స్ పాయింట్ల టేబుల్లో ప్రస్తుతం 8వ స్ధానంలో ఉంది. అటువంటిది ముంబై ఇండియన్స్‌ను సిద్దూ ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
ఇక్కడైతే రోజుకు రూ. 25 లక్షలు..
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ కామెంటేటర్‌గా పునరాగమనం చేయనున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు. మరోసారి తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీని ధ్రువీకరిస్తూ సిద్ధు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ఫస్ట్ లవ్ క్రికెట్ అన్న ఈ పంజాబీ బ్యాటర్.. చేపకు ఈత నేర్పడం ఎటువంటిదో తనకు కామెంట్రీ గురించి ఎవరైనా కొత్తగా చెప్పడం కూడా అలాంటిదేనన్నాడు. గ్యాప్ వచ్చినా తన మాటల పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు సిద్ధు. తన కెరీర్లో కఠిన సవాళ్ల అనంతరం సుమారు 20 సార్లు రీఎంట్రీ ఇచ్చానన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు.. కామెంటేటర్‌గా మాత్రం ఇదే తొలి కమ్‌బ్యాక్ అని పేర్కొన్నాడు. వ్యాఖ్యాతగా ప్రయాణం ప్రారంభించాలనుకున్నపుడు తను ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా లేనన్న సిద్ధు.. వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లో కూడా అదరగొట్టడం అభిమానులతో పాటు తననూ ఆశ్చర్యపరిచిందన్నాడు. గతంలో ఇలాంటి మేజర్ టోర్నీ మొత్తం కామెంట్రీ చేసినందుకు రూ. 60- 70 లక్షలు పారితోషకంగా అందుకునే వాడినన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు.. ఐపీఎల్లో మాత్రం రోజుకు రూ. 25 లక్షలు వస్తాయని చెప్పాడు. అయితే, ఐపీఎల్లో కేవలం డబ్బు వల్ల మాత్రమే సంతృప్తి దొరకదని.. పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 కంటే ముందు ఐపీఎల్ రూపంలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకనుందన్న సిద్ధు.. ఇప్పుడు అందరి కళ్లు క్యాష్ రిచ్ లీగ్ మీదనే ఉన్నాయన్నాడు. కేవలం టీమిండియా ఆటగాళ్లకే కాకుండా ప్రధాన జట్టు ఆటగాళ్లంతా వరల్డ్‌కప్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఐపీఎల్-2024 ప్రదర్శనే ప్రామాణికంగా ఉండబోతుందని సిద్ధు అభిప్రాయపడ్డాడు. పీటీతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రాజకీయాల్లోనూ ప్రవేశించిన సిద్ధుకు పంజాబ్ మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఇక మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుంది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ ఈవెంట్ షురూ కానుంది. చదవండి: T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన -
ఘనంగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొడుకు కరణ్ పెళ్లి ఫొటోలు వైరల్
-
రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు..మమ్మల్ని చూసి: సిద్ధూ
చండీగడ్: పంజాబ్ కాంగ్రెస్ నేత, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ.. పాటియాలలోని తన ఇంటి వద్ద భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చాడని వెల్లడించారు. పని మనిషి అతడ్ని చూసి తనను అప్రమత్తం చేశాడని చెప్పుకొచ్చారు. టెర్రస్‌పైకి వచ్చిన ఆగంతుకుడు బ్లాంకెంట్ కప్పుకుని ఉన్నాడని, అతని తీరు చూస్తే లోపల ఆయుధం కలిగి ఉండవచ్చనే అనుమానం కల్గిందని సిద్ధూ పేర్కొన్నారు. తాము బయటకు వెళ్లి చూడగానే అనుమానిత వ్యక్తి పక్కింటిపైకి దూకి పారిపోయాడని వివరించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Today on the terrace of my residence an unknown suspicious character wrapped in grey blanket was noticed around 7:00 PM , the moment my servant went out raised the alarm and called for help , he immediately ran and escaped. Have spoken to @DGPPunjabPolice and SSP Patiala has… — Navjot Singh Sidhu (@sherryontopp) April 16, 2023 ఈ విషయాన్ని వెంటనే పాటియాల ఎస్ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానని, పంజాబ్ డీజీపీతో కూడా మాట్లాడానని సిద్ధూ చెప్పారు. అనంతరం ఎస్ఎస్పీ వెళ్లి ఇంటిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను సేకరించి అనుమానిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానితుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చినప్పుడు సిద్ధు కాంగ్రెస్ నేతలతో ఇంట్లోనే సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాటియాల మాజీ ఎంపీ ధర్మవీర గాంధీ, ఇతర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. పని పనిషి ఆగంతకుడ్ని చూసిన విషయాన్ని సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్ పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పారని గాంధీ వివరించారు. తాము వెంటనే బయటకు వెళ్లి చూడగా.. అతడు పక్కింటిపైకి దూకి పారిపోయాడని తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
సత్ప్రవర్తనతో రెండు నెలల ముందే... సిద్ధూ విడుదల
పటియాలా: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జైలుశిక్ష ముగించుకుని శనివారం పటియాలా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బానిసలుగా తమ ఇష్టానికి వాడుకుంటున్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్‌ను అక్బారీ (పత్రికల్లో ప్రకటనలిచ్చే) ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రాష్ట్రం శాంతిభద్రతలు, రుణాల సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ‘దేశాన్ని నిరంకుశ పాలన పట్టిపీడించిన ప్రతిసారి దేశంలో విప్లవం పుట్టుకొస్తుంది. అలా ఈసారి పుట్టుకొచ్చిన విప్లవమే రాహుల్ గాంధీ’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు. 1988లో ఒక రోడ్డు ప్రమాద గొడవలో ఘర్షణ పడటంతో ఒకరి మృతికి కారణమైన నేరానికి సిద్ధూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేనెలలో ఒక ఏడాదిపాటు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. సత్ప్రవర్తన కారణంగా సిద్ధూ 10 నెలలకే విడుదలయ్యారని ఆయన న్యాయవాది తెలిపారు. సిద్ధూ విడుదల సందర్భంగా జైలు ప్రాంతం ఆయన మద్దతుదారులతో నిండిపోయింది. -
పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఛండీగఢ్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. పది నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల కిందటి నాటి ఓ కేసులో.. కిందటిఏడాది ఆయనకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాటియాలా జైలు నుంచి బయటకు రాగానే తాను మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమన్నారు. వాస్తవానికి ఈ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది శిక్ష విధించింది సుప్రీం కోర్టు. దాని ప్రకారం మే నెలలో ఆయన విడుదల కావాల్సి ఉంది. కానీ, శిక్షాకాలంలో సత్ప్రవర్తన కారణంగానే ఆయన ముందుగా విడుదల అవుతున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆదివారాలు పోనూ, సత్ప్రవర్తన కింద 48 రోజుల్ని మినహాయించి.. ముందుగానే సిద్ధూను రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని సిద్ధూ న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ కూడా ధృవీకరించారు. Will address the media outside patiala jail around noon.. — Navjot Singh Sidhu (@sherryontopp) April 1, 2023 1988, డిసెంబర్ 27వ తేదీన పాటియాలలో పార్కింగ్ విషయంలో జరిగిన ఓ గొడవలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్సంధూలు.. ఓ వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బాధితుడు 65 ఏళ్ల గురునమ్ సింగ్ మరుసటిరోజు కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. సిద్ధూ, గురునమ్ తలపై బలంగా కొట్టాడని, ఆ గాయం కారణంగానే అతను చనిపోయాడని బాధిత కుటుంబం వాదించింది. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే.. 2018లో సుప్రీం కోర్టు సిద్ధూ నేరాన్ని సాధారణమైందిగా ప్రకటిస్తూ.. వెయ్యి రూపాయల జరిమానా విధించింది. చివరకు బాధిత కుటుంబం మరోసారి కోర్టును ఆశ్రయించడంతో కిందటి ఏడాది తీర్పును సమీక్షించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో.. నేర తీవ్రత దృష్ట్యా సిద్ధూకి జైలు శిక్ష తప్పనిసరి అని అభిప్రాయపడ్డ కోర్టు, ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. Telangana: కేంద్ర మంత్రి గడ్కరీ కీలక ప్రకటన -
జైలులో నవజోత్‌సింగ్ సిద్ధూకు వర్క్ అలాట్.. పని ఏంటంటే..?
కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజోత్‌సింగ్ సిద్ధూ పాటియాలలోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 1998లో జరిగిన ఓ దాడికి సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా.. తాజాగా సిద్ధూకు జైలు అధికారులు క్లర్క్ పనిని అప్పగించినట్టు జైలు అధికారులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్లర్క్‌గా ఆయన ఏ పని చేయాలో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శిక్షణ అనంతరం సిద్ధూ పూర్తి స్థాయిలో ఆ పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జైలు రికార్డులను పరిశీలించడం, సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను పర్యవేక్షించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. శిక్షణ ఇచ్చిన తర్వాత జైలు రూల్స్ ప్రకారం.. మూడు నెలల పాటు వేతనం చెల్లించరు. శిక్షణ ముగిసిన తర్వాత స్కిల్‌ను బట్టి రోజుకు రూ. 40-90 వరకు వేతనం అందిస్తారు. ఇక, సిద్ధూ.. హై ప్రొఫైల్ ఖైదీ కావడంతో బరాక్ నుంచే క్లర్క్ పనులను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ నుంచి బయటకు రాకుండా ఆయన దగ్గరకే రికార్డులు పంపించనున్నారు. సిద్ధూ ఉండే సెల్ సమీపంలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. సిద్ధూకు ఖైదీ నంబర్ 241383, బ్యారక్ నంబర్ 7గా కేటాయించబడిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: అసెంబ్లీలో అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్ ఇది -
ఆసుపత్రికి పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూ.. స్పెషల్ డైట్‌కు అనుమతిస్తారా?
పటియాలా: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూను పటియాలా సెంట్రల్ జైలు నుంచి రాజేంద్ర ఆసుపత్రికి అధికారులు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జైల్లో సిద్ధూకు స్పెషల్ డైట్ కావాలని ఆయన తరపు లాయర్ కోర్టులో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే వైద్యుల బోర్డు ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎలాంటి ఎటువంటి ప్రత్యేక ఆహారం అవసరమో బోర్డు నిర్ణయించనుంది. అనంతరం సంబంధిత నివేదికను స్థానిక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పిస్తుంది. 1988 నాటి రోడ్ర్యాడ్ కేసులో ఏడాది జైలుశిక్ష పడిన నేపథ్యంలో.. గత శుక్రవారం పటియాలా కోర్టులో సిద్ధూ లొంగిపోయారు. చదవండి: జైల్లో డిన్నర్ చేయని సిద్ధూ సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి. -
జైల్లో డిన్నర్ చేయని సిద్ధూ
పటియాలా: కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూని పటియాలా జైల్లో బారక్ నంబర్–10లో ఉంచారు. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురితో కలిసి రాత్రంతా ఆయన గడిపారు. శుక్రవారం రాత్రి జైల్లో సిద్ధూ అసహనంగానే గడిపినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. రాత్రి భోజనం కింద చపాతీ, పప్పు ఇచ్చినా తినలేదు. తినేసి వచ్చానని చెప్పి, కొన్ని మందులు వేసుకున్నారు. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి. గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదు. ప్రత్యేకంగా భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన ప్రతినిధి వెల్లడించారు. జైలు వైద్యులు సిద్ధూ అనారోగ్యాన్ని గుర్తించి అంగీకరిస్తే ఆయన భోజనం జైలు క్యాంటిన్ నుంచి తెప్పించుకోవచ్చునని లేదంటే స్వయంగా వంట చేసుకునే అవకాశం కూడా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో సిద్ధూతో పాటు పోటీపడిన శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితా డ్రగ్స్ కేసులో ఈ జైల్లోనే ఉండడం విశేషం. సిద్ధూకి రెండు సెట్లు తెల్ల రంగు పైజామాలు, ఒక చైర్, టేబుల్, ఒక కప్బోర్డు, రెండు తలపాగాలు, కప్పుకోవడానికి దుప్పటి, మంచం, బెడ్షీట్లు, లోదుస్తులు, టవళ్లు, దోమలు కుట్టకుండా నెట్ వంటి సదుపాయాలు కల్పించారు. 1988 నాటి రోడ్డు ఘర్షణల కేసులో ఒక వ్యక్తి మృతికి కారకుడైన సిద్ధూకి సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 8 నెలల్లోపే బయటకు వచ్చే చాన్స్ సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి. -
జైలులో కాంగ్రెస్ నేత సిద్ధూ.. ఆయన షెడ్యూల్, వసతులు ఇవే..
పంజాబ్ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మధ్యాహ్నం పాటియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో నమోదైన ఓ కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అనంతరం తక్షణమే కోర్టు ముందు లొంగిపోవాలని కూడా సిద్ధూకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో ఆయనకు రూల్స్ ప్రకారం.. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛాతిలో నొప్పి వచ్చినట్లు అనిపించడంతో సిద్ధూను మాతా కౌసల్య ఆస్పత్రికి తీసుకెళ్లి పోలీసులు చికిత్స ఇప్పించారు. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. సిద్ధూ జైలులో ఏడాది పాటు ఎలాంటి జీవితం గడపనున్నారు అనే విషయంపై జైలు అధికారులు స్పష్టతనిచ్చారు. సిద్ధూకు జైలు అధికారులు ప్రత్యేక మర్యాదలు చేశారు. సిద్ధూకు ఖైదీ నంబర్ 241383ను అలాట్ చేస్తూ.. బ్యారక్ నంబర్ 7ను సిద్ధూకు కేటాయించారు. జైలులో సిద్ధూకు ఓ టేబుల్, రెండు టర్బన్లు, నాలుగు జతల కుర్తా పైజామా, బ్లాంకెట్, రెండు టవల్స్, ఓ కప్ బోర్డు, దోమ తెర, ఓ పెన్ను, నోట్ బుక్, షూలు, రెండు బెడ్ షీట్స్ అందించారు. ఇక, సిద్ధూ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని జైలు అధికారులు తెలిపారు. జైలు మాన్యువల్ ప్రకారం సిద్ధూకు శుక్రవారం రాత్రి 7.15 గంటలకు పప్పు, రోటీ ఇచ్చినట్లు సమాచారం. ఖైదీల రోజువారీ జీవితం ఇలా ఉంటుంది.. - ఉదయం 5:30 గంటలకు ఖైదీలు నిద్రలేస్తారు. - ఉదయం 7 గంటలకు వారికి టీతో పాటు బిస్కెట్లు లేదా శనగలు(chickpeas) అందిస్తారు. - ఉదయం 8:30 గంటలకు బ్రంచ్ (6 చపాతీలు, పప్పు/వెజ్జీలు) అనంతరం పనికి వెళ్లాలి. - సాయంత్రం 5:30 గంటలకు ఖైదీలు కేటగిరీ ప్రకారం కేటాయించిన పనిని పూర్తి చేస్తారు. - సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనం (ఆరు చపాతీలు, పప్పు/వెజ్జీలు). - రాత్రి 7గంటలకు ఖైదీలను వారి బ్యారక్ల లోపలకి వెళ్తారు. ఇక, ఖైదీలకు రోజువారీ పనికిగానూ రూ. 30-90 సంపాదిస్తారు. మొదటి మూడు నెలలు వారికి వేతనాలు లేకుండా శిక్షణ ఇస్తారు. నైపుణ్యం లేని, సెమీ-స్కిల్డ్ లేదా నైపుణ్యం కలిగిన ఖైదీగా వర్గీకరించబడిన తర్వాత వారు ప్రతిరోజూ రూ. 30-90 సంపాదిస్తారు. శిక్ష పడిన నేరస్థులు రోజుకు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని 10 రోజులు గడిపిన కూతురు -
Navjot Sidhu: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
ఛండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేతనవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మధ్యాహ్నం పటియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో నమోదైన ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా తక్షణమే కోర్టు ముందు లొంగిపోవాలని కూడా సిద్ధూకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు లొంగిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన సిద్ధూ... అనారోగ్య కారణాల వల్ల తాను లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన బెంచ్.. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ను ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టు నుంచి ఈ మాట వినిపించినంతనే శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన సిద్ధూ..పటియాల కోర్టు ముందు లొంగిపోయారు. Patiala, Punjab | He (Navjot Singh Sidhu) has surrendered himself before Chief Judicial Magistrate. He is under judicial custody. Medical examination and other legal procedures will be adopted: Surinder Dalla, media advisor to Congress leader Navjot Singh Sidhu pic.twitter.com/U13TDDOPju — ANI (@ANI) May 20, 2022 -
Navjot Singh Sidhu: సిద్ధూకు షాక్.. తప్పదు లొంగిపోవాల్సిందే!
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని కోరుతూ సిద్ధూ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడం కుదరదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో సిద్ధూ నేడో రేపో సిద్ధూ లొంగిపోవాల్సి ఉంటుంది. ఇక, 1988 నాటి కేసులో కోర్టు నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సిద్ధూ గురువారం స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని అన్నారు. ఇంతలోనే శుక్రవారం సిద్ధూ.. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇది కూడా చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! -
మాట మార్చిన సిద్ధూ.. ప్లీజ్ కొంచెం టైమ్ ఇవ్వండి
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 1988 నాటి కేసులో కోర్టు ఆయనుకు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సిద్ధూ గురువారం స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని అన్నారు. ఇంతలోనే శుక్రవారం సిద్ధూ మాట మార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని నవజోత్ సింగ్ సిద్ధూ కోరారు. దీంతో, సిద్ధూ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు సింఘ్వీ.. సీజేఐ ఎన్వీ రమణను కలవాలని ఏఎం ఖన్వీల్కర్ సూచించారు. ఇక, కేసు రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని, శుక్రవారం ఉదయం ఛండీగఢ్ కోర్టు నుంచి పాటియాలా పోలీస్‌స్టేషన్‌కు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం సమన్లను సిద్ధూకి అందించి లొంగిపోవాలని కోరుతున్నామని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన వెంటనే సిద్ధూను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టం చేశారు. Will submit to the majesty of law …. — Navjot Singh Sidhu (@sherryontopp) May 19, 2022 ఇది కూడా చదవండి: లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన సీబీఐ -
నవజ్యోత్ సింగ్ సిద్ధూ కు జైలు శిక్ష
-
Navjot Singh Sidhu: నవజ్యోత్‌సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్దూకు భారీ షాక్ తగిలింది. సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే, 1988 రోడ్డుపై ఘర్షణ కేసు విచారణలో భాగంగా సిద్దూకు కోర్టు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది. కాగా, 1988 డిసెంబరు 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేట్ క్రాసింగ్ దగ్గర రోడ్డు మధ్యలో పార్క్ చేసిన జిప్సీలో సిద్ధూ, ఆయన సన్నిహితుడు రూపిందర్ సింగ్ సంధు ఉన్నారు. ఆ సమయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి.. తన స్నేహితులతో డబ్బులు విత్‌డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సిద్దూ జిప్సీని తొలగించాలని గుర్నామ్‌సింగ్ కోరాడు. దీంతో వారి వాగ్వాదం చోటుచేసుకుని గుర్నామ్‌పై సిద్ధూ దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. 1988 నాటిలో కేసులో సిద్ధూ నేరస్థుడు అనడానికి తగిన ఆధారాలేవీ లేవనే కారణంతో 2018 మేలో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. కేవలం 1000 రూపాయల జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన బాధితుడి కుటుంబం.. మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో సిద్ధూ నేరస్థుడేనా, కాదా అనే కోణంలో మరోసారి విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సిద్ధూను నేరస్థుడిగా తేల్చింది. విచారణలో భాగంగా సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్ పరువు తీసిన సిద్ధూ.. ఎందుకిలా అన్నాడు..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 18 స్థానాల్లో విజయం సాధించింది. అటు బీజేపీ పార్టీ సైతం ఆప్ ఎదుట నిలువలేకపోయింది. ఇదిలా ఉండగా.. పంజాబ్‌లో భారీ మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మాన్కు శుభాకాంక్షలు తెలుపుతూ సిద్ధూ చేసిన ట్వీట్ కాంగ్రెస్ అధిష్టానికి బిగ్ షాకిచ్చింది. సిద్ధూ తన ట్విట్లో ఆప్‌ను ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌లో సరికొత్త మాఫియా వ్యతిరేక శకాన్ని భగవంత్ మాన్ ప్రారంభించారు. ఎవరూ ఊహించని వ్యక్తి సంతోషకరమైన వ్యక్తి భగవంత్ మాన్. అంచనాలు అందుకుంటూ, ప్రజా అనుకూల విధానాలతో పంజాబ్‌ను తిరిగి గాడిన పెడతారనే నమ్మకం ఉందని ఆశిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. అయితే, పంజాబ్‌లో ఓటిమి కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతో పంజాబ్ పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇలా రాజీనామా చేసిన తర్వాతి రోజే సిద్ధూ పరోక్షంగా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టు.. ఆప్‌ను ప్రశంసించడం సంచలనంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ జీ-23 అసమ్మతి నేతలు పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ విమర్శలకు దిగుతున్న తరుణంలో సిద్ధూ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సతరించుకుంది. The happiest man is the one from whom no one expects … Bhagwant Mann unfurls a new anti - Mafia era in Punjab with a mountain of expectations …hope he rises to the occasion , brings back Punjab on the revival path with pro - people policies … best always — Navjot Singh Sidhu (@sherryontopp) March 17, 2022 -
కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు భగవంత్ మాన్ బుధవారం ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. సామాన్య పౌరులు.. కాంగ్రెస్ సీఎంతో సహా సీనియర్ నాయకులను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించారు! చన్నీకి ఉగోకే చెక్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోరంగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఆయన ఓడించింది సీనియర్ నాయకుడు కాదు.. సామాన్య యువకుడు. చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త లాభ్ సింగ్ ఉగోకే అనే యువకుడు బదౌర్ నియోజకవర్గంలో చన్నీపై 34,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా సేవలు అందిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉగోకేకు హీరో హోండా మోటార్‌సైకిల్ మాత్రమే ఉంది. డాక్టర్ సాబ్‌కే జై చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీకి ‘ఆప్’చేతిలో చుక్కెదురైంది. వృత్తిరీత్యా వైద్యుడైన 55 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ చన్నీకి వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి మన్ననలు పొందారు. ఈసారి 7,942 ఓట్ల తేడాతో చన్నీని ఓడించగలిగారు. నవజ్యోత్ వర్సెస్ జీవన్ జ్యోత్ ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్. పంజాబ్ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖ నాయకులను ఆమె ఓడించారు. అమృత్సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజిథియాలపై 6,750 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా చేరి, పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షురాలిగా మారడానికి ముందు.. కౌర్ సామాజిక కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. ‘షీ’అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్ల వాడకం, రుతుక్రమ పరిశుభ్రత తెలియజేస్తూ 'ప్యాడ్‌వుమన్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. (క్లిక్: సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై) కౌర్ చేతిలో సింగ్లా చిత్తు సంగ్రూర్‌లో ఆప్ యువనేత నరీందర్ కౌర్ భరాజ్.. సిట్టింగ్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాతో పోటీ పడి భారీ విజయాన్ని అందుకున్నారు. సింగ్లాను 36,430 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి తానేంటో నిరూపించుకున్నారు. కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి అరవింద్ ఖన్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) లా గ్రాడ్యుయేట్ అయిన కౌర్ జనవరిలో ఎన్నికల సమయంలో తన తల్లితో కలిసి స్కూటర్‌పై వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అప్పట్లో ఈ వీడియోలో తెగ వైరల్ అయింది. రూ. 24,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె.. ద్విచక్ర వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెంత హేళన చేసినా లెక్కచేయక పోటీలో నిలబడి ఘన విజయం సాధించారు. బాదల్‌కు జగదీప్ బ్రేక్ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కంచుకోట జలాలాబాద్‌లో ఆప్ పాగా వేసింది. 2009 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న బాదల్‌కు ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నాయకుడైన జగదీప్ గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో బాదల్‌పై దాదాపు 31,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిక్కెట్ నిరాకరించడంతో మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడిన కాంబోజ్ 2019 ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా 5,000 ఓట్లకు మించి సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆప్ మరో ‘జెయింట్ కిల్లర్’అజిత్‌పాల్ సింగ్ కోహ్లి. అకాలీదళ్ మాజీ నాయకుడైన అజిత్‌పాల్.. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో మేయర్‌గా పనిచేసిన ఆయన పెద్దగా అంచనాలు లేకుండానే పోటీకి దిగి విజయం సాధించడం విశేషం. -
కాంగ్రెస్ ఘోర పరాజయం.. సోషల్ మీడియాలో రాహుల్, సిద్ధూపై సెటైర్లు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పంజాబ్‌లో ఉన్న ప్రభుత్వాన్ని సైతం పోగొట్టుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చలేకపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కాంగ్రెస్‌పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని, అన్నా, చెల్లెళ్ల బ్రాండ్ విలువ కూడా తగ్గిపోయిందని విమర్శకులంటున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రియాంకాగాంధీ యూపీ ఎన్నికల్లో ఎవరూ చేయనంత ప్రచారం చేశారు. మొత్తం 209 ర్యాలీలు, రోడ్ షోలలో ప్రసంగించారు. యూపీ మీదే ఆమె ఎక్కువగా కేంద్రీకరించినా, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌ల్లోనూ తిరిగారు. మహిళా సమస్యలవంటి ప్రధాన అంశాలపై ఫోకస్ చేసినా, తన సభలకు పెద్ద ఎత్తున ప్రజలను రప్పించగలిగినా, వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయారు. ఇక రాహుల్‌గాంధీ సైతం ఐదు రాష్ట్రాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. అయినా ఆయన మ్యాజిక్కేమీ పనిచేయలేదు. రాహుల్, ప్రియాంకాగాంధీలు పార్టీలోనూ విశ్వసనీయత కోల్పోతున్నారని, వైఫల్యానికి బాధ్యులను చేస్తూ తొందరల్లోనే సొంత పార్టీ నేతలే వారి మీద కత్తులు దూయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్‌లో దళితుడిని ముఖ్యమంత్రిని చేశామని చూపించే ప్రయత్నం చేశారు కానీ అది బెడిసికొట్టింది. ప్రియాంకా గాంధీ కష్టపడ్డారనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఆమె బాగా పనిచేశారు. ప్రధానమైన మహిళల సమస్యలను లేవనెత్తారు. అయినా రాజకీయాల్లో మ్యాజిక్కులంటూ ఉండవు, కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అలాంటి టైమ్ నడుస్తోంది. రాజీకీయాలు ఒక్కరాడే ఆట కాదు, ఇది టీమ్గేమని గాంధీ కుటుంబం ఇప్పటికైనా తెలుసుకోవాలని, బలమైన నేతలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో పార్టీ విఫలమైందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓటమిపాలైన ప్రతిసారీ పార్టీలో అసమ్మతిరాగాలు పెరుగుతాయి. అలా గొంతెత్తిన వారిని తగ్గించే ప్రయత్నమూ జరుగుతుంది. అదే సమస్యకు అసలు కారణం. రాష్ట్రాల్లో స్థానిక నాయకులకు ప్రోత్సాహం పెరగాలి. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్వంటి నేతలను కొత్తనాయకత్వంగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ అందులో విఫలమైంది. గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్రాల్లో నమ్మినబంట్ల వంటి రాజకీయ నాయకులున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలే దేశం మొత్తాన్ని సమీకరించాలనుకున్నారు. ఇక్కడే అన్నాచెల్లెళ్లు విఫలమయ్యారంటున్నారు విశ్లేషకులు. మీమ్స్ అండ్ జోక్స్.. ఐదు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరలవుతున్నాయి. రాహుల్‌గాంధీ, నవజ్యోజోత్సింగ్సిద్ధూలపై జోకులు పేలుతున్నాయి. ‘కాంగ్రెస్‌కు మరో ఆప్షన్ లేదు. గాంధీ ఫ్యామిలీని వదిలేసి.. కొత్త నాయకత్వంతో ముందుకు రావాలి. లేదంటే పార్టీపనైపోయినట్టేనని ఈ ఎన్నికల ఫలితాలు సందేశమిస్తున్నాయి’ అని ఫిల్మ్ మేకర్ మనీష్ ముంద్రా ట్వీట్ చేశారు. ఇక రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటూ పలువురు ట్వీట్స్ చేశారు. ‘రాహుల్ గాంధీ బ్రేక్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఇక కాలమిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ అయితే ఏకంగా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌ను అనుకరిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. పంజాబ్‌లో పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ మాజీ క్రికెటర్ సిద్ధూపైనా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ ఎగ్జిట్‌పోల్స్ చూడగానే సిద్ధూకి కపిల్ శర్మ ఫోన్ కాల్ వస్తుందని, తనకూ పోటీ వస్తున్నందున అర్చనా పురాణ్ శర్మ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. -
కాంగ్రెస్‌ను ముంచేసి..ఇప్పుడు రాజీనామానా?
చంఢీగఢ్: పంజాబ్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఈసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పంజాబ్ కాంగ్రెస్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్‌సింగ్ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టే వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయినా ఇది కాంగ్రెస్‌కు సత్ఫలితాలను ఇవ్వలేదు. కాంగ్రెస్ గ్రూపు రాజకీయంతో విసుగుపోయిన ప్రజలు ఆప్కే పట్టం కట్టారు. ఆది నుంచి కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టిన ఆప్ అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. పంజాబ్‌లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది. కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్ బై? పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్ సింగ్ వైదొలగడానికి ప్రధాన కారణమైన సిద్ధూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఆశించే పంజాబ్ కాంగ్రెస్‌లో మంట రాజేసిన సిద్ధూ.. ఆపై సీఎం కావొచ్చనే భావించాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చన్నీని ముఖ్యమంత్రి చేసింది. ఇది కూడా సిద్ధూకి జీర్ణించలేదు. పార్టీ మారదామనే ప్లాన్ చేశాడు. మొత్తం కాంగ్రెస్‌నే విచ్ఛిన్నం చేద్దామనే అనుకున్నాడు. తనకు దక్కనిది వేరే వాళ్ల దక్కడంతో వివాదాలకు ఆజ్యం పోశాడు. కానీ చివరకు రాహుల్ గాంధీ జోక్యంతో సిద్ధూ వెనక్కి తగ్గి కాంగ్రెస్‌తో నడిచాడు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీని అధిష్టానం ప్రకటించినా సిద్ధూ మిన్నుకుండిపోయాడు. సీఎం క్యాండిడేట్ తనకు ప్రాబ్లమ్ లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ దారుణ పరాజయం దిశగా సాగుతుండటంతో సిద్ధూకు రాజీనామ ఒక్కటే మార్గంలా కనబడుతోంది. ఇవాళ సాయంత్రం ఆ రాష్ట్ర సీఎల్పీ సమావేశం నిర్వహించాలని భావించినా అందుకు పలువురు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండాలని అనుకున్నారట. అందులో సిద్ధూ కూడా ఉన్నాడని, తాను రాజీనామా చేయబోతున్నట్లు సీఎల్పీకి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చేసిన నష్టమంతా చేసి ఇప్పుడు రాజీనామా డ్రామాకు తెరలేపడం మళ్లీ హాట్‌టాపిక్ అయ్యింది. చదవండి: పంజాబ్‌లో అఖండ ‘ఆప్ కీ సర్కార్’.. ఫలించిన ‘ఎక్ మౌకా’ నినాదం -
Sakshi Cartoon: ముప్పై ఏళ్ల కిందట కేసు
ముప్పై ఏళ్ల కిందట కేసు.. చిక్కుల్లో సిద్ధూ -
చిక్కుల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో దోషి అయిన సిద్ధూ స్వల్ప జరిమానాతో బయటపడ్డారు. సిద్ధూ చేసిన నేరానికి తగిన శిక్ష పడలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ మళ్లీ కోర్టుకెక్కడంతో తీర్పుని పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 1998లో పంజాబ్‌లోని పాటియాలాలో వాహనం పార్కింగ్‌పై వివాదం నెలకొని 65 ఏళ్ల వయసున్న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు సిద్ధూపై కేసు పెట్టారు. ఈ కేసు నుంచి బయట పడడానికి సిద్ధూ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారు. పంజాబ్ హరియాణా హైకోర్టు సిద్ధూ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018 మేలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని పక్కన పెట్టేసింది. సీనియర్ సిటిజన్‌ను గాయపరిచినందుకు కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సిద్ధూని కేసు నుంచి విముక్తుడిని చేసింది. ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మళ్లీ కోర్టుకెక్కింది. సిద్ధూకి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం సుప్రీంలో శుక్రవారం వాదనలు వినిపించింది. సిద్ధూ తరపున కాంగ్రెస్ నేత, లాయర్ పి. చిదంబరం వాదనలు వినిపించారు. ఇన్నేళ్ల తర్వాత తీర్పుని సమీక్షించడం అర్థరహితమని పేర్కొన్నారు. -
చిక్కుల్లో సిద్ధూ.. సుప్రీం నోటీసులు!
Setback To Sidhu In Road rage Case: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ చిక్కుల్లో పడ్డారు. మూడు దశాబ్దాల కిందటి కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం 58 ఏళ్ల సిద్ధూకి నోటీసులు జారీ చేసింది. నోటీసు పరిధిని పెంచాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు, సిద్ధూ తరపు న్యాయవాదిని కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని జాబితా చేయనున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. సిద్ధూ పాల్పడింది ఘోరమైన నేరంగా పరిగణించి.. తీర్పును పునఃసమీక్షించాలని బాధిత కుటుంబం సుప్రీంను అభ్యర్థించింది. అయితే ఘటన జరిగిన ఇన్నేళ్లకు(33 ఏళ్లకు) నేర తీవ్రత గురించి పిటిషనర్లు లేవనెత్తడం విడ్డూరంగా ఉందని, పిటిషన్‌పై అనుమానాలు ఉన్నాయని సిద్ధూ తరపున పి.చిదంబరం వాదించారు. అంతకు ముందు తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ సిద్ధూ అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ఎప్పుడో ముప్ఫై ఏళ్ల కిందినాటి కేసు గనుక పరిగణనలోకి తీసుకోకూడదంటూ విజ్ఞప్తి చేశాడు. అయినప్పటికీ కోర్టు బాధితుల అభ్యర్థననే పరిగణనలోకి తీసుకుంది. కేసు పూర్వపరాలు.. 1988, డిసెంబర్ 27న పాటియాలాలో సిద్ధూ, అతని స్నేహితుడు రూపీందర్ సింగ్ సంధూ పార్కింగ్ విషయంలో గుర్నమ్ సింగ్ అనే వ్యక్తితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో గుర్నమ్‌ను కారులోంచి బయటకు లాగేసి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో గుర్నమ్ చనిపోయారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సిద్ధూని నిర్దోషిగా వదిలేయగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు మాత్రం 2006లో దోషిగా గుర్తించి.. మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై 2007లో సుప్రీంను ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ.. బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉపశనంతోనే.. అమృత్సర్ నియోజకవర్గం తరపున లోక్‌సభలో పోటీ చేయడానికి సిద్ధూకి అనుమతి దొరికినట్లయ్యింది. తిరిగి 2018, మే 15న.. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఒక వృద్ధుడ్ని తీవ్రంగా గాయపర్చిన నేరానికి సిద్ధూ, అతని స్నేహితుడికి వెయ్యి రూపాయల ఫైన్ విధించింది. ఒక దెబ్బకే చనిపోయాడని చెప్పడానికి ఆధారాలు లేనందున ఈ తీర్పు ఇస్తున్నట్లు వెల్లడించింది బెంచ్. అయితే తీర్పుపై రివ్యూ చేపట్టాలని బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించింది. -
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
ఛండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల్లో ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. గురునానక్ స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం.. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాలపై మాఫియా రాజ్‌ను అంతం చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా పైలట్ కావచ్చు, కానీ తుఫాను వచ్చినప్పుడు, మనం కష్టాలను అవకాశంగా మార్చుకోగలగాలి.. అదే కాంగ్రెస్ మేనిఫెస్టో లక్ష్యమని సిద్ధూ పేర్కొన్నారు. కాగా, నూనెగింజలు, పప్పులు, మొక్కజొన్నలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నట్టు సిద్దూ వెల్లడించారు. మేనిఫెస్టోలోని అంశాలు.. - పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు. - మహిళలకు నెలకు రూ.1,100 అందజేత. - ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు. -
Punjab: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు
అమృత్సర్: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కూతుళ్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. తండ్రుల గొప్పదనాన్ని వివరిస్తూ వారు ప్రచారం చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రుబియా కౌర్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ కూతురు హర్షిత ఈసారి తండ్రులకు తోడుగా తొలిసారి ప్రచారంలోకి దిగారు. ఎంతో అనుభవమున్నట్టుగా, ఓటర్లలో సెంటిమెంట్ రగిలేలా మాట్లాడుతున్నారు. సిద్ధూ పోటీ చేస్తున్న అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలో రుబియా ప్రచారం చేశారు. సింగపూర్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన ఆమె తన తండ్రిపై ప్రేమను అడుగడుగునా ప్రదర్శిస్తున్నారు. సిద్ధూను సీఎం అభ్యర్థిగా చేయకపోవడంపై ఆమె ప్రచారంలో కంటతడి పెట్టుకున్నారు కూడా! ‘‘ఒక కూతురిగా నేనొక్కటే చెప్పదలచుకున్నా. ప్రజాకర్షణ, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి సీఎం అభ్యర్థి కాలేకపోయారు. మున్ముందు ఏం జరగనుందో చూద్దాం. నీతిమంతుల్ని ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరు. అలాగే అవినీతిపరులకు ఎదురుదెబ్బ తప్పదు’’ అన్నారు. పంజాబ్ ప్రజలు పేద సీఎంను కోరుకుంటే, చన్నీ కోట్లకు పడగలెత్తారని, ఆయన బ్యాంకు ఖాతాల్లోనే 133 కోట్లుంటాయని ధ్వజమెత్తారు. చదవండి: (కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ..) కేజ్రివాల్ కుమార్తె హర్షిత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ తరఫున ధురిలో ప్రచారం చేశారు. తన తండ్రి పంజాబ్ బాలల కోసమే ఎక్కువగా ఆలోచిస్తారని, వారు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే భావి భారతం బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన హర్షిత తనపై తండ్రి ప్రభావం చాలా ఉందని చెప్పారు. ‘‘నా స్నేహితులు చాలామంది విదేశాలకు వెళ్లిపోయారు. నేనూ వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడే ఉండి దేశం కోసం పని చేయాలని నాన్న చెప్పారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా దేశం కోసం చేస్తేనే తృప్తి’’ అంటూ నాన్నను ఆకాశానికెత్తేశారు. -
మా నాన్న గెలిచే వరకు నో మ్యారేజ్.. రబియా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చంఢీగడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సీఎం స్థానం కోసం పోటీ పడి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటుకు గురయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చన్నీ, సిద్దూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చదవండి: వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం! ఇదిలా ఉండగా శుక్రవారం అమత్ సర్(ఈస్ట్)లో ప్రచారంలో పాల్గొన్న సిద్దూ కూతురు రబియా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అభ్యర్థి చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చన్నీ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.133 కోట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరోపించారు. తన తండ్రి సిద్దూ 14 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారని తెలిపారు. పంజాబ్‌ను న్యూ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో సిద్దూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!!
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరూ ఉంటారంటూ వస్తున్న పుకార్లను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకరి పేరును మాత్రమే ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవీ కోసం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ, నవజ్యోత్ సిద్ధూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాందీ లూథీయానాలో ఈ ఇద్దర్ని పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రకటిస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఈ ప్రచారం ఊపందుకున్న తర్వాత రోజే అక్రమ కేసుల తవ్వకాల్లో చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముందంజలో చన్నీ ఉన్నందున సిద్దూ తన సొంత పార్టీపై దాడిని పెంచారు. మరోవైపు చన్నీ మేనల్లుడు అరెస్టు కావడంతో ప్రత్యక్ష విమర్శదాడులకు దిగారు. ఈ మేరకు సిద్దూ పార్టీ నిజాయితీ, క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారిని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు మెగ్గుచూపుతున్నట్లుగా పలు సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు ఏ నాయకుడికి అనుకూలంగా ఉన్నారో ఎంచుకోవడానికి ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్ల ద్వారా పబ్లిక్ సర్వేను కూడా నిర్వహిస్తోంది. అయితే చన్నీ బంధువు అరెస్టు కావడంతో సిద్దూ తన వాదనను వినిపించేందుకు దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకున్నారు. అంతేకాదు చన్ని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నామినేట్ అవ్వడం, మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా చన్నీకి మరో అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని కోరడం వంటి తదితర కారణాలతో చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఊహాగానాలకు తెర తీసింది. మరోవైపు సిద్ధూ కూడా తనను తాను అభ్యర్థిగా చెప్పుకోవడానికి పదేపదే ప్రయత్నించడం గమనార్హం. (చదవండి: ‘సీఎం అభ్యర్థి చాయిస్.. చాన్స్ కాదు’) -
నామినేషన్ దాఖలు చేసిన సిద్ధూ
అమృత్సర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నగరానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, అది కొనసాగుతుందని, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మజీతియా అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినా.. మజీతాను మాత్రం వీడటం లేదని వ్యంగాస్త్రాలు విసిరారు. ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే మజీతాను వీడి, తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ రాష్ట్రాన్ని నాశనం చేసిందే అకాళీదల్ అని సిద్ధూ ఆరోపించారు. తనను గెలవనివ్వబోనన్న అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధూ... ఆయనకు దమ్ముంటే పటియాలాను వీడి తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. 30 ఏళ్ల క్రితం మరణించిన తన తల్లి ప్రస్తావన తెచ్చిన తన ప్రత్యర్థులపై ఆయన మండిపడ్డారు. వారు నీచ రాజకీయాలు చేస్తున్నారన్న సిద్ధూ... ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’
చండీగఢ్: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె అమెరికా నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సిద్ధూ, డబ్బుల కోసం తల్లినే విడిచిపెట్టాడని, అతను డబ్బు కోసం ఏదైనా చేస్తాడంటూ ఆరోపించారు. ‘ మేము చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం.. మా తల్లి నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో ఉంది. సిద్ధూ అసలు పట్టించుకోలేదు. ఇది అసత్య ఆరోపణలు కావు.. దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. కేవలం ఆస్తుల కోసం తమతో సంబంధాలను తెంచుకున్న క్రూరమైన వ్యక్తిగా సిద్ధూ’ అని ఆమె పేర్కొంది. 1986 సంవత్సరంలో తమ తండ్రి చనిపోయిన తర్వాత.. తల్లిని దిక్కులేని స్థితిలో వదిలేశారని వాపోయింది. ఆ తర్వాత మా తల్లి 1989లో ఒక అనాథ మహిళగా ఢిల్లీ రైల్వేస్టేషన్లో చనిపోయిందని యూఎస్ నుంచి సుమన్ తూర్ ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా 1987 ఇండియాటుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సిద్ధూ.. తల్లిదండ్రుల గురించి అసత్యాలే చెప్పాడని ఆరోపించింది. అదే విధంగా గత జనవరి 20న సిద్దూని కలవడానికి పంజాబ్ వెళ్లానని కనీసం తలుపులు తీయలేదని.. సుమన్ తూర్ తెలిపారు. తనను చాలా సేపు ఇంటి బయటే నిలబెట్టి అవమానర్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న నాకు .. నా సోదరుడు ఫోన్లో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడని వాపోయింది. చనిపోయిన నా తల్లికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని సుమన్ తూర్ అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ సోదరి చేసిన ఆరోపణలు పంజాబ్ కాంగ్రెస్‌లో హీట్‌ను పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. #WATCH | Chandigarh: Punjab Congress chief Navjot Singh Sidhu's sister from the US, Suman Toor alleges that he abandoned their old-aged mother after the death of their father in 1986 & she later died as a destitute woman at Delhi railway station in 1989. (Source: Suman Toor) pic.twitter.com/SveEP9YrsD — ANI (@ANI) January 28, 2022 -
సీఎం అభ్యర్థిని ప్రకటించండి!
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే 7– 10 రోజుల్లో పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించాలని రాహుల్‌గాంధీకి పీపీసీసీ చీఫ్ నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ గురువారం డెడ్‌లైన్ విధించారు. జలంధర్‌లో జరుగుతున్న ప్రచారంలో రాహుల్‌ను సిద్ధూ ప్రశ్నించారు. తనను షోకేస్‌లో బొమ్మలాగా ఎల్లకాలం చూపాలని కోరడం లేదని సిద్ధూ స్పష్టం చేశారు. సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ను ఎవరు నడిపిస్తారో పంజాబ్ ప్రజలకు వెల్లడించాలని, అప్పుడే కాంగ్రెస్ సులభంగా 70 సీట్లు నెగ్గుతుందని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా అదే డిమాండ్‌ను వినిపించారు. వేదికపై సిద్దూను ఆలింగనం చేసుకొని తమ మధ్య ఏలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ నోరు మూయించాలని చన్నీ కోరారు. పంజాబ్ కోసం తాను ప్రాణమిస్తానని, అయితే ప్రజలు ఈ రోజు సీఎం అభ్యర్ధి ఎవరని అడుగుతున్నారని చెప్పారు. రాహుల్ తనకు ఎన్నో ఇచ్చారన్నారు. సీఎం కేండిడేట్‌గా ఎవరిని ప్రకటించినా తనకు సంతోషమేనన్నారు. కాంగ్రెస్‌కు పెళ్లికొడుకు ( సీఎం అభ్యర్ధి) లేరనే కేజ్రీవాల్ విమర్శలు వినదలుచుకోలేదని చెప్పారు. త్వరలో నిర్ణయిస్తాం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించిన అనంతరం సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. అలా ప్రకటించాల్సిన అవసరం ఉందో, లేదో కూడా కార్యకర్తలను అడుగుతామన్నారు. ఎవరో ఒక్కరే పార్టీని ముం దుండి నడిపిస్తారని చెప్పారు. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు మద్దతు ఇస్తామని ఇద్దరూ(చన్నీ, సిద్ధూ) వాగ్దానం చేశారని, ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
చన్నీ, సిద్ధూలు పంజాబ్ ప్రజలను దోచుకున్నారు: అరవింద్ కేజ్రీవాల్
చండీగఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ జలంధర్ పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రజలకు రాహుల్ మొహం చూపించలేక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పర్యటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో పంజాబ్‌ను దోచుకుందని ఎద్దేవా చేశారు. చన్నీ,సిద్దూలు ప్రజలను మోసం చేసిన రాజకీయా ఏనుగులే అన్నారు. ప్రజలను దోచుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి సత్యమార్గంలో నడిచినప్పుడు గిట్టని వారు తిట్టడం సహజమే అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాగా, తమ సీఎం అభ్యర్థి బిక్రమ్ మజిథియా అమృత్సర్ ఈస్ట్ నుంచి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. People are tired of Congress & SAD. Why will people vote for Majithia or Sidhu? Both are political elephants who have crushed people. Our candidate(from Amritsar East) is a common woman who will be available for people always: Delhi CM & AAP national convenor Arvind Kejriwal pic.twitter.com/ghW7Gn4R1B — ANI (@ANI) January 27, 2022 చదవండి: చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
సిద్దూపై సుఖ్బీర్ బావ పోటీ
చండీగఢ్: పంజాబ్‌లో ఎన్నికల రంగం రసకందాయంలో పడుతోంది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాళీదళ్ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడి తూర్పు అమృత్సర్ నియోజకవర్గంలో సిద్దూపై సీనియర్ నేత, తన బావ విక్రమ్‌సింగ్ మజీతియా పోటీ చేయనున్నట్టు అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రకటించారు. బుధవారం ఆయన అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడారు. తూర్పు అమృత్సర్ నియోజకవర్గంలో మజీతియా రంగంలోకి దిగడంతో సిద్దూ తన డిపాజిట్ కోల్పోక తప్పదని వ్యాఖ్యానించారు. అలాగే పంజాబ్ మాజీ సీఎం, తన తండ్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ (94 ఏళ్లు) లంబి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అకాళీదళ్, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 సీట్లు ఉండగా.. అకాళీదళ్ 97 చోట్ల, బీఎస్పీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కోర్టు కేసుల మధ్య.. సిద్దూపై పోటీకి దిగుతున్న విక్రమ్‌సింగ్ మజీతియాపై గత నెలలోనే డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల కింద పంజాబ్–హరియాణా హైకోర్టు మజీతియాకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా మూడు రోజుల పాటు పోలీసులు అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించింది. ఈ కేసులో ఆయన ఎప్పుడైనా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దూపై పోటీకి దిగుతుండటం ఆసక్తిగా మారింది. -
యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్
Punjab Chief Minister Charanjit Singh Channi portrayed as superhero Thor: కరోనా మహమ్మారి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్ రోడ్ షోలు, ర్యాలీలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమదైన వ్యూహాలతో ప్రజలను ఆకర్షించేలా ప్రచారాలకు సనద్దమయ్యారు. అందులో భాగంగానే పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ని స్ఫూర్తిగా తీసుకుంది. అయితే మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ హాలీవుడ్ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, మార్క్ రుఫాలో, క్రిస్ ఎవాన్స్, తదితర నటులు నటించారు. ఈ మేరకు ఈ అవెంజర్స్ చిత్రంలో థోర్స్ పాత్రలో చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖాన్ని, రాహుల్ గాంధీని బ్రూస్ బ్యానర్ అకా ది హల్క్‌గా ఒక యుద్ధ సన్నివేశానికి సంబంధించిన వీడియోని చిత్రీకరించారు. అయితే ఇందులో నవజ్యోత్ సింగ్ సిద్ధూని కెప్టెన్ అమెరికాతో పోల్చారు. అంతేకాదు ఈ అవెంజర్స్ సినిమాలో దేవుళ్ల సినిమాల్లో ఉన్నట్టుగా ఉరుములు మెరుపులతో కూడి యుద్దం చేస్తున్న సన్నీవేశాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోలో నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖాలను గ్రహాంతరవాసుల పాత్రలతో వారిని శత్రువులుగా చిత్రీకరించారు. పైగా పంజాబ్‌లో లోక్ కాంగ్రెస్ అనే తన సొంత పార్టీని స్థాపించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ (సీఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌లను దుష్ట గ్రహాంతరవాసులు పాత్రలుగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్లో థీమ్ సాంగ్‌తో మిస్టర్ చన్నీ ఎంట్రీ అయ్యి స్టార్మ్బ్రేకర్(గొడ్డలి ఆకారంలో ఉండే ఆయుధం)ని ఉపయోగించి గ్రహాంతరవాసులందరి గొంతులను కోస్తున్నట్టుగా వీడియో రూపోందించారు. పంజాబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల నుండి తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఏమైన చేస్తాం అని వీడియో చివరలో వినిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు హాలీవుడ్ అవెంచర్స్ మూవీలోని యుద్ధ సన్నివేశాన్ని ఎడిట్ చేసిన క్లిప్పింగ్ వీడియోతోపాటు "పంజాబ్‌లో కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుంది" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ హాలీవుడ్ మూవీకి భారతదేశంలో విపరీతమైన అభిమానులు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లోని యువత ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని ఎంచుకుంది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాలీవుడ్ పాట 'మస్త్ కలందర్'ను ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. We will do whatever it takes to redeem our beloved state from the clutches of evil forces working against the interest of Punjab and its people. #CongressHiAyegi pic.twitter.com/6lVxqkN4VC — Punjab Congress (@INCPunjab) January 24, 2022 -
సిద్ధూను మంత్రిని చేయమని పాక్ కోరింది: అమరీందర్ సింగ్
న్యూఢిల్లీ: నవజోత్ సింగ్ సిద్ధూను మంత్రిగా తొలగించిన తర్వాత తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవాలని తనకు పాకిస్తాన్ నుంచి సందేశం వచ్చిందని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. సిద్ధూ తమ ప్రధానికి పాత స్నేహితుడని, అందువల్ల ఆయన్ను తిరిగి పదవిలోకి తీసుకోవాలని తనను కోరారన్నారు. ఈ విషయమై స్పందించేందుకు సిద్ధూ నిరాకరించారు. సిద్ధూకు పదవినిస్తే ఇమ్రాన్ ఖాన్ సంతోషిస్తారని తనకు చెప్పారని అమరీందర్ తెలిపారు. అయితే సిద్ధూ అసమర్ధుడనే తాను తొలగించానని, 70 రోజులు పదవీలో ఉండి ఆయన కనీసం ఒక్క ఫైలును చూడలేదని దుయ్యబట్టారు. తర్వాత తనకు పాకిస్తాన్ నుంచి రాయబారాలు వచ్చాయని చెప్పారు. రెండోమారు పదవి ఇచ్చాక పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించమని తనను పాకిస్తాన్ వర్గాలు కోరాయన్నారు. అయితే ఎవరి నుంచి ఈ సందేశం వచ్చిందో చెప్పలేదు. సరిహద్దు అవతల నుంచి భారీగా భారత్‌లోకి ఆయుధాలు అక్రమంగా వస్తున్నాయని అమరీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: Yogi Adityanath: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్.. అక్రమ ఇసుక మైనింగ్‌తో సంబంధం ఉన్న ఎంఎల్ఏలకు సిద్ధూ ఆశ్రయమిచ్చాడని అమరీందర్ ఆరోపించారు. ఇందులో సిద్ధూ సొంత ప్రయోజనాలున్నాయన్నారు. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడిని కోరితే ఆయన నిరాకరించడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనపై సిద్దూ ఆరోపణలు గుప్పించడం చూస్తే, ఆయన ఎంత అభద్రతా భావనతో ఉన్నారో అర్ధమవుతోందన్నారు. చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే! -
చన్నీకి మరొక్కసారి అవకాశం ఇవ్వాలి: సోనూసూద్
Punjab Assembly Election 2022: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సుదీర్ఘకాలం పదవిలో ఉండి సేవలందించే అవకాశం లభింనందున అతనికి మరొక్క అవశాశం ఇవ్వాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. చన్నీ ముఖ్యమంత్రిగా చాలా తక్కువ సమయమే పని చేసినప్పటికీ చాలా ప్రశంసించదగ్గ పనులు చేశారని చెప్పారు. అంతేకాదు పంజాబ్ రాష్ట కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంచి నిజాయితీ పరుడు, హృదయ పూర్వకంగా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని, పైగా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందన్న విషయన్ని కూడా నొక్కి చెప్పారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ని తాను చాలా ఏళ్ల క్రితం ఒక కళాకారుడిగా మాత్రమే కలిశానని చెప్పారు. ఆయన రాజకీయనాయకుడిగా ఎలా ఉంటారనే విషయం గురించి తనకు తెలియదని సోనూ సూద్ తెలిపారు. సోనూ సూద్ సోదరి 38 ఏళ్ల మాళవిక సూద్ సచార్ కాంగ్రెస్ అభ్యర్థిగా తమ పూర్వీకుల ఊరు మోగా నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తన సోదరితో కలిసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, చాలా కాలంగా సామాజిక సేవలో పాల్గొంటున్న తన సోదరికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని సూద్ నొక్కి చెప్పారు. మొగాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలు మా కుటుంబమే నిర్మించిందని ఈ సందర్భంగా చెప్పారు. పైగా వ్యవస్థలో భాగమైతే చాలా పనులు జరుగుతాయని మాళవికను ప్రజలే రాజకీయాల్లోకి తీసుకొచ్చారని సూద్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లోని మోగా నియోజకవర్గంలో మంచి పనులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందన్నారు. అంతేకాదు తమ మానిఫెస్టోని అమలు చేయగల పార్టీగా కాంగ్రెస్‌ని విశ్వస్తున్నాని, అందువల్ల తమ సోదరి కాంగ్రెస్‌లో చేరడం మంచిదని భావించానని చెప్పుకొచ్చారు. పైగా తనకు వివిధ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయని కూడా చెప్పారు. అయితే తాను వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని, కాకపోతే తనవద్ద తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం జరిగిన ఆదాయపు పన్ను శాఖ రైడ్ విషయం కూడా సెటిల్ అయ్యిందని సోనూ సూద్ చెప్పారు. (చదవండి: పాటియాలా నుంచి అమరీందర్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల) -
పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..
వచ్చే నెలలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు ఈసారి సేఫ్‌గేమ్ ఆడుతున్నారు. అన్ని పార్టీల్లోని పెద్ద నేతలంతా ఒకరిపై ఒకరు పోటీ చేయొద్దన్న ధోరణితో బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సహా అనేకమంది బాదల్ కుటుంబంపై పోటీ చేసేందుకు ముందుకు వచ్చి చేతులు కాల్చుకోవడంతో ఈసారి మాత్రం ఒకరిపై ఒకరు పోటీచేసేందుకు వెనక్కి తగ్గారు. మిగతా కొందరి ప్రముఖుల స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు ఎక్కడి నుంచి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పాత సీటు అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సిద్ధూ మజీఠా సీటులో బిక్రమ్ మజీఠియాపై లేదా పాటియాలా స్థానంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పోటీ చేస్తారని ముందుగా ఊహించారు. బిక్రమ్ మజీఠియా: మజీఠా సిట్టింగ్ ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్ యువనేత అయిన బిక్రమ్ మజీఠియాకు పోటీగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు పెద్ద నేతలను నిలబెట్టలేదు. ఇక్కడ నుంచి ఆప్ తరఫున లాలీ మజీఠియా, కాంగ్రెస్ నుంచి జగ్గా మజీఠియాలు బరిలో ఉన్నారు. చరణ్‌జిత్ చన్నీ: చమ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి సీఎం చరణ్‌జిత్ చన్నీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసేలా చర్చలు జరిగినా, పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. చదవండి: (Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్) కెప్టెన్ అమరీందర్ సింగ్: కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నుం చి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన తన సొంత జిల్లా పాటియాలాను వదిలి వేరే దగ్గర పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే కెప్టెన్ అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూపై పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. సుఖ్బీర్ బాదల్: అకాలీదళ్–బీఎస్పీ కూటమి సీఎం అభ్యర్థి అయిన సుఖ్బీర్ బాదల్ ఈసారి కూడా జలాలాబాద్ నుంచి పోరాడుతున్నారు. ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 2017 ఎన్నికల్లో సుఖ్బీర్ బాదల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. భగవంత్ మాన్: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ధురి నుంచి ఆధిక్యం సాధించారు. అందుకే ఆయనకు ఎలాంటి ఆటంకం రాకుండా పార్టీ అధిష్టానం సేఫ్ సీటు ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దల్బీర్ గోల్డీ, అకాలీదళ్ నుంచి ప్రకాశ్ చంద్ గార్గ్‌లను ఆ రెండు పార్టీలు రంగంలోకి దింపాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
పొలిటికల్ సిద్ధూయిజం: క్రికెట్లో అజారుద్దీన్‌నీ వదల్లేదు.. రాజకీయాల్లో..
క్రికెటర్‌గానైనా, కామెంటేటరైనా, కమేడియెన్గా మారినా, పొలిటికల్ లీడర్ అవతారం ఎత్తినా సిద్ధూ రూటే సెపరేటు. సిద్ధూ అంటే వివాదం, సిద్ధూ అంటే వినోదం, సిద్ధూ అంటే ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మాట్లాడితే చాలు, ప్రత్యర్థులకి పంచ్ పడాల్సిందే. సిక్సర్ల సిద్ధూ నుంచి సింగిల్ లైనర్ సిద్ధూగా ఆయన ప్రయాణం నిత్యం సవాళ్లతో కూడుకొని ఉంది. ఆ సవాళ్లను స్వీకరిస్తూనే తనదే పై చేయి కావాలనే స్వభావం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అదరరు, బెదరరు. క్రికెట్లో కెప్టెన్ అజారుద్దీన్‌నీ వదల్లేదు. రాజకీయాల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్నీ విడిచిపెట్టలేదు. పంజాబ్ కాంగ్రెస్‌లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, అధిష్టానంపైనే సిక్సర్లు విసురుతున్నారు. మిన్నువిరిగి మీదపడినా తాను నమ్మిన సిద్ధాంతాల్లో రాజీ పడనంటూ దూకుడుగా అనుకున్న లక్ష్యాల వైపు పరుగులు తీస్తున్నారు. ►పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సర్దార్ బల్వంత్ సింగ్, నిర్మల దంపతులకు 1963 అక్టోబర్ 20న జన్మించారు. ►చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. పాటియాలాలో డిగ్రీ వరకు చదువుకున్నారు. ►1983లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి 16 ఏళ్ల పాటు ఎదురు లేని బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. 51 టెస్ట్ మ్యాచ్‌లు, 100కి పైగా వన్డే మ్యాచ్‌లో ఓపెనర్‌గా ప్రత్యర్థి బౌలర్లకి చుక్కలు చూపించి సిక్సర్ల సిద్ధూగా పేరు తెచ్చుకున్నారు. ►సిద్ధూ భార్య నవజోత్ కౌర్ వృత్తి రీత్యా డాక్టర్. ఆమె కూడా రాజకీయాల్లో ఉన్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ►1996లో ఇంగ్లండ్ టూర్లో ఉండగా కెప్టెన్ అజారుద్దీన్‌తో విభేదాలు వచ్చి టూర్ మధ్యలోంచి వెనక్కి వచ్చేశారు. అప్పుడే సిద్ధూ తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది. ►1998లో పంజాబ్‌లోని పాటియాలాలో వాహనం పార్కింగ్‌పై వివాదం నెలకొని 65 ఏళ్ల వ్యక్తిని చితకబాదారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఆ కేసులో బుక్కయ్యారు. దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశాక 2018లో సుప్రీంకోర్టు సిద్ధూని విముక్తుడిని చేసింది. ►1999లో క్రికెట్‌కి గుడ్‌బై కొట్టేశారు. ఆ తర్వాత కామెంటేటర్‌గా తన సంభాషణా చాతుర్యంతో నవ్వులు పండించి ఫాలోవర్లను పెంచుకున్నారు. సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో అసమాన ప్రతిభ కనిపించారు. వాటినే అభిమానులు ప్రేమగా సిద్ధూయిజం అని పిలిచేవారు. ►కపిల్ శర్మ కామెడీ షోలో మొదటి రెండు సీజన్లలోనూ అతిథిగా కనిపించి అందరినీ అలరించారు. కమెడీయన్‌గా కూడా సత్తా చాటారు. సిద్ధూ పగలబడి నవ్వితే చాలు, టీఆర్పీ రేటింగ్స్ దుమ్ము రేగ్గొట్టేవి. చదవండి: (Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!) ►బీజేపీ నేత అరుణ్ జైట్లీని స్ఫూర్తిగా తీసుకొని 2004లో బీజేపీ గూటికి చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమృత్సర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ►ఆ తర్వాత రెండేళ్లకే వ్యక్తిని కొట్టి చంపిన కేసులో కింది కోర్టు దోషిగా తేల్చడంతో 2006లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ►ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో 2007లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ సింగ్లాను 77,626 ఓట్ల తేడాతో ఓడించారు ►2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు అంబికా సోనిని ఓడించి వరస గా మూడోసారి లోక్‌సభకి ఎన్నికయ్యారు. ►2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2016 ఏప్రిల్‌లో మోదీ ప్రభుత్వం సిద్ధూని రాజ్యసభకు పంపింది. బీజేపీలో ఉన్నంతకాలం శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు వద్దంటూ పార్టీ పెద్దలపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చేవారు. ►బీజేపీ అధిష్టానం వైఖరితో రాజీపడలేక రాజ్యసభ ఎంపీ పదవికి 2016 జులై 18న రాజీనామా చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో బీజేపీకి గుడ్‌బై కొట్టేశారు. ►2017లో కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ ఎ న్నికల్లో అమృత్సర్ తూర్పు నియోజ కవర్గం నుంచి ఎమ్మెల్యేగాఎన్నికయ్యారు. ►కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. v2018 ఆగస్టులో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం వివాదాస్పదమైంది. అప్పట్నుంచి సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ►2019 లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య నవజోత్ కౌర్‌కి టిక్కెట్ నిరాకరించడంతో బహిరంగంగానే అమరీందర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. సిద్ధూ శాఖని మార్చడం తో కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ►ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ రెండేళ్ల పాటు అమరీందర్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. చివరికి సిద్ధూయే పైచేయి సాధించడంతో అమరీందర్ కాంగ్రెస్‌ని వీడారు. ► కాంగ్రెస్ పార్టీ 2021 జులై 18న సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేసింది ►మూడు నెలలు తిరక్కుండానే పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ విధానాలని వ్యతిరేకిస్తూ 2021 సెప్టెంబర్ 21న పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆ రాజీనామాను తిరస్కరించింది. ►2021 నవంబర్‌లో కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్‌కు వెళ్లి ఇమ్రాన్‌ను పెద్దన్నగా కీర్తించడం కూడా వివాదాస్పదమైంది. ►2022 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (దళిత సామాజిక వర్గానికి చెందిన వారు) ఉంటాడని చెప్పలేని బలహీనత కాంగ్రెస్‌ది. అదే జరిగితే సిద్దూ ఈసారి అంపైర్ తలే పగులగొట్టడం ఖాయం (కాంగ్రెస్ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తారు). మరోవైపు పంజాబ్‌లో 32 శాతం ఉన్న దళితుల ఓట్లపై ప్రేమతో సిద్దూను సీఎం అభ్యర్థిగా ప్రకటించే సాహసం కాంగ్రెస్ చేయడం లేదు. – నేషనల్ డెస్క్,సాక్షి -
భద్రతా వైఫల్యం పెద్ద డ్రామా: సిద్ధూ
-
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి
చంఢీఘడ్: పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు అధికమయ్యాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంగళవారం బీజేపీలోకి చేరారు. ఖాదియాన్ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఫతే జంగ్ బజ్వా, శ్రీ హగోబిండ్పూర్ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బల్విందర్ లడ్డీలు కాషాయ జెండా కప్పుకున్నారు. ఎంపీ ప్రతాప్ బజ్వాకు ఫతే జంగ్ బజ్వా సోదరుడు. వీరిద్దరు కూడా ఖాదియాన్ నుంచి పోటీలో చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ .. ఫతేజంగ్ బజ్వాను ఖాదియాన్ నియోజక వర్గ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇదే సీటుపై తాను కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రతాప్ సింగ్ బజ్వా కాంగ్రెస్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫతేజంగ్ అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. కాగా, ఢిల్లీలో అమిత్‌షా నివాసంలో.. బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాళీదల్ (సంయుక్త) కలిసి పోటీ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని వలసలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
డ్రగ్స్ కేసులో మాజీ మంత్రి సోదరుడు.. సిద్ధూ కీలక వ్యాఖ్యలు
చంఢీఘడ్: పంజాబ్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు చలి కాలంలోనూ హీట్‌ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే నేతల పరస్పర ఆరోపణలతో పంజాబ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. కాగా, డ్రగ్స్ కేసుకు సంబంధించి పంజాబ్ రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అకాలీదళ్ కీలక నేత బిక్రమ్ సింగ్ మజిథియాపై పంజాబ్ పోలీసులు కేసును నమోదు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. మాజీ కేంద్ర మంత్రి అయిన హర్ సిమ్రాత్ కౌర్ బాదల్‌కు మజిథియా సోదరుడు. 2018లో డ్రగ్స్ మాఫియాతో అక్రమ రవాణాలో సహకారం, నేరపూరిత కుట్రలపై మజిథియాపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా బిక్రమ్ సింగ్‌పై కేసు నమోదు చేయడం చర్చకు దారి తీసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ పరిణామాన్ని అకాలీదళ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అధికార పక్షం, కావాలనే ప్రతీకార రాజకీయాలు చేస్తోందని అకాళీదళ్ మండిపడుతోంది. తాజా ఘటనపై, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్విటర్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్న వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని సిద్ధూ పేర్కొన్నారు. కాగా, కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం ఉన్నప్పుడు ఈ కేసును పట్టించుకోలేదని సిద్ధూ ఆరోపించారు. చదవండి: ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్ సింగ్ సిద్ధూ -
ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం, కపుర్త ఘటనలకు సంబంధించిన కుట్రదారులను బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఆయన మాలేర్‌కోట్లలో జరిగిన సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత మంది కావాలనే మత విద్వేశాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలతో.. పంజాబ్‌లో అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే స్వర్ణదేవాలయం ఘటనపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నిన్న సీఎం చన్నీ(డిసెంబరు 19)న స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరుస ఘటనలతో ఆయా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భద్రతను పెంచాయి. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం కోరారు. కాగా, స్వర్ణదేవాలయంలోని నిశిద్ధ ప్రాంతం, కపుర్త జిల్లా నిజాంపూర్ లోని గురుద్వారా పైకెక్కి పవిత్ర జెండా (నిషాన్ సాహిబ్)ను తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తులు స్థానికుల మూకదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను ఇప్పటికే పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. చదవండి: 'పార్టీ కోసం నా జీవితం అర్పించా.. కాషాయం విడిచేది లేదు' -
‘లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ’
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): సీఎం బొమ్మై ఆర్ఎస్ఎస్కు చెందినవారు కాదు. యడియూరప్పను తొలగించినప్పుడు లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ లభించింది. బొమ్మైను సాగనంపాలని మంత్రి ఈశ్వరప్ప యత్నిస్తున్నారు అని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. ఆదివారం బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకాలో కాంగ్రెస్ భేటీలో మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌వారు గాడ్సే వంశీకులని ఆరోపించారు. కాంగ్రెస్‌పై సీఎం విసుర్లు బొమ్మనహళ్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బు బలంతో గెలవాలని యత్నిస్తోందని సీఎం బసవరాజు బొమ్మై ఆరోపించారు. ఆదివారం బెంగళూరు శివార్లలోని ఆనేకల్ తాలూకా అత్తిబెలె వద్ద బీజేపి అభ్యర్థి గోపినాథ్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య పదేపదే బీజేపీ డబ్బులతో అధికారంలోకి వస్తోందని ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు కోటీశ్వరులకు టికెట్లు ఇస్తే, బీజేపీ సామాన్యులను పోటీలో నిలిపిందన్నారు. -
సిద్ధూ టిట్ ఫర్ టాట్ రాజకీయం
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ టిట్ ఫర్ టాట్ రాజకీయాలకు దిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట దేశా రాజధానిలో నిరసన చేస్తున్న టీచర్లతో కలిసి ఆయన కూడా తన గళాన్ని వినిపించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ టీచర్లు తమని రెగ్యులర్ చేయాలన్న డిమాండ్‌తో చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో ఆదివారం సిద్ధూ కూడా పాల్గొన్నారు. గత నెలలో పంజాబ్‌లోని మొహాలిలో కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులరైజేషన్ కోరుతూ నిరసన చేస్తుంటే కేజ్రీవాల్ వారికి మద్దతుగా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పుడు సిద్ధూ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా అదే డిమాండ్ చేస్తున్న ఢిల్లీ టీచర్లతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ టీచర్లని పర్మనెంట్ చేస్తామని, విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ హామీలు ఇచ్చారు. ఢిల్లీలో కూడా కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థని పెట్టుకొని పంజాబ్‌లో ఏం చేస్తారని సిద్ధూ ప్రశ్నించారు. ఖాళీలన్నీ గెస్ట్ టీచర్లతోనే కేజ్రీవాల్ భర్తీ చేస్తున్నారన్నారు. -
పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు
లుధియానా: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పెంచుకోవటం వల్ల ఇరు దేశాల స్నేహబంధం పెరుగుతుందన్న సిద్ధూ వ్యాఖ్యలను ఖండించారు. భారత్‌పై.. పొరుగు దేశం పెంచుకుంటున్న వ్యతిరేకత ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వ్యర్థమని స్పష్టం చేశారు. చదవండి: మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా పాకిస్తాన్ ఇండియాలోకి ఉగ్రవాదులను పంపుతోందని మండిపడ్డారు. మారణాయుధాలు, డ్రగ్స్‌ను పాక్ తమ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో చేరవేస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలు ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. కరాచీ సరిహద్దు తెరిచి ఉంటే.. వ్యాపారం కోసం అట్టారీ సరిహద్దును ఎందుకు తెరవలేరని సిద్ధూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌లో చేరిన వివాదాస్పద గాయకుడు..
చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాల తర్వాత.. కాంగ్రెస్‌లో అనేక పలు ఆసక్తికర మార్పులు సంభవించిన విషయం తెలసిందే. తాజాగా, పంజాబ్ వివాదాస్పద గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మూసేవాలా.. గతంలో ‘సంజు’ అనే పాటల వీడియోలో తుపాకీలను ఉపయోగించారు. ఆ పాట వివాదాస్పదంగామారి, పలు కేసులు కూడా నమోదయ్యాయి. మూసేవాలా చేరికపై సీఎం ఛన్నీ స్పందించారు. మూసేవాలా.. ప్రజల మనస్సులు గెలుచుకున్నారని తెలిపారు. ఆయన తండ్రి మాజీ సైనికాధికారి, తల్లి మాన్సా గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారని తెలిపారు. అదే విధంగా, మూసేవాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూసేవాలా మాట్లాడుతూ.. తాను మూడేళ్ల కిందట పాటలను పాడటం ఆరంభించానని తెలిపారు. ప్రస్తుతం ఒక కొత్త మార్పు రావాలనే సంకల్పంతో.. ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. మాన్సా గ్రామం చాలా వెనుక బడి ఉందని, గ్రామాభివృద్ధి కోసమే.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మూసేవాలా.. కాంగ్రెస్ పార్టీని గర్వపడేలా చేస్తారనే నమ్మకం ఉందని ఛన్నీ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మూసేవాలాను ‘చాంప్’ గా కూడా అభివర్ణించారు. కాగా, సిద్ధూ మూసేవాలా అసలు పేరు.. శుభ్ దీప్ సింగ్ సిద్ధూ. ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. సంగీతం నేర్చుకున్నారు. సిద్ధూ మూసేవాలా తన స్వగ్రామమైన మాన్సా నుంచి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఇమ్రాన్ ఖాన్ నాకు పెద్దన్న
లాహోర్: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం కర్తార్‌పూర్ కారిడార్ గుండా వెళ్లి, పాకిస్తాన్ భూభాగంలోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్–పాకిస్తాన్ మధ్య నూతన స్నేహ అధ్యాయం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్–పాక్ మధ్య పరస్పర ప్రేమను తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 74 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న అడ్డుగోడలకు గవాక్షాలు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరిచేందుకు చర్యలు తీసుకున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ సీఈఓ ముహమ్మద్ లతీఫ్ జీరో పాయింట్ వద్ద సిద్ధూకు స్వాగతం పలికారు. ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న అని, తనకు గొప్ప గౌరవం, ఎంతో ప్రేమ లభించిందని సిద్ధూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కర్తార్‌పూర్ కారిడార్ అధికారిని ఆలింగనం చేసుకొని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్న అంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవియా ట్విట్టర్లో షేర్ చేశారు. సిద్ధూ గతంలోనూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకొని, పొగడ్తల వర్షం కురిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి సన్నిహితుడైన సిద్ధూ పాకిస్తాన్ నేతలను పొగడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని మాలవియా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సిద్ధూ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. పాకిస్తాన్ మన దేశంలోని పంజాబ్‌లోకి డ్రోన్లతో ఆయుధాలను, మాదక ద్రవ్యాలను, జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని అన్నారు. అలాంటి పాక్ ప్రధానిని పొగడడం సరైంది కాదని హితవు పలికారు. సిద్ధూ వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి రాఘవ్ చద్ధా అన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పాకిస్తాన్ పట్ల ప్రేమను దాచుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తనపై వస్తున్న విమర్శలపై సిద్ధూ స్పందించారు. వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకోనివ్వండి అని బదులిచ్చారు. -
Navjot Singh Sidhu: పంజాబ్‌లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ
Punjab Advocate General Who Sidhu Wanted Out Resigns: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తన పంతం నెగ్గించుకున్నారు. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ తలొగ్గారు. ఎట్టకేలకు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రాజీనామాను ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నియమించాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన ముగిసినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై చున్నీ మాట్లాడుతూ.. ఏజీ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం పంపుతున్నాము. ఈరోజు ఆమోదం పొందితే రేపు కొత్త ఏజీని నియమిస్తామన్నారు. అంతేకాకుండా డీజీపీ పోస్టుకు చట్టప్రకారం 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారి ప్యానెల్‌కు పంపి.. కొత్త డీజీపీని కూడా నియమిస్తాం' అని తెలిపారు. కాగా, పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఏపీఎస్ డియోల్, డీజీపీగా ఇక్బాల్ ప్రీత్‌సింగ్ సహోటా రాజీనామా చేసే వరకు పీసీసీ బాధ్యతలు స్వీకరించబోనని సిద్ధూ మొండికేసిన సంగతి తెలిసిందే. -
గ్లామరస్ రబియా దూకుడు, పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
చండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుమార్తె రబియా సిద్దూ మరోసారి సంచలనంగా మారింది. ఇటీవల ఒక మీటింగ్‌లో తళుక్కున మెరిసిన రబియా తాజాగా చేసిన హడావిడి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పూర్తి పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా సందడి చేస్తూ తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి బజ్ క్రియేట్ చేశారు. పీపీసీసీ పనుల్లో సిద్ధూ బిజీబిజీగా ఉంటే ఆయన కుమార్తె రబియా రాజకీయంగా దూసుకుపోతారనే ఊహాగానాల మధ్య పూర్తి రంగంలోకి దిగిపోయింది. సిద్దూ అసెంబ్లీ నియోజకవర్గం అమృత్సర్ ఈస్ట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, ఆమె సుడిగాలి పర్యటన స్థానికులను ఆకట్టుకుంది. అంతేకాదు ఆయా పనుల కొనసాగింపుపై కూడా హామీలను గుప్పించడం విశేషంగా నిలిచింది. వార్తలను గతంలో రుబియా ఖండించినప్పటికీ..ఇటీవల కేవలం పది రోజుల వ్యవధిలోనే వివిధ కార్యక్రమాలతో చూపిస్తున్న రబియా దూకుడు పోలిటిక్స్‌లోకి ఎంట్రీ ఖాయం అనే ఊహాగానాల్ని తెరపైకితెచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్ సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనుందా అనే అనుమానాలు భారీగా నెలకొన్నాయి. అయితే తాను రాజకీయాల్లో చేరబోతున్నానన్న వార్తలను రబియా ఖండించింది. పంజాబ్ సంక్షోభంలో కూరుకుపోయిన తన తండ్రి తరపున తాను పనిచేస్తున్నట్టు ఇటీవల వెల్లడించారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన రోడ్లు, పార్కులు, అభివృద్ధి పనులను ముఖ్యంగా రూ .33 లక్షల విలువైన పార్కుల సుందరీకరణ, పనులను చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు సిద్ధూకి, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ సిద్దూ 13 పాయింట్ల ఎజెండాతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్ ప్రభుత్వాన్ని కదిలించాలంటూ అక్టోబర్ 15న రాసిన నాలుగు పేజల లేఖ ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి : Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత కాగా 2012 లో శిరోమణి అకాలీదళ్-బీజేపీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ అసెంబ్లీ సీటును గెలుచుకోగా, 2009లో కాంగ్రెస్ టికెట్‌పై సిద్ధూ అదే స్థానాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రబియా సిద్దూ ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. బాలీవుడ్ నటులకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. -
పంజాబ్‌కు 13 పాయింట్ల ఎజెండా
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఇదే ఆఖరి అవకాశం అంటూ 13 పాయింట్ల ఎజెండాను సూచిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. 2017 ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా పంజాబ్ ప్రభుత్వాన్ని కదిలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్ 15న రాసిన ఆ లేఖను ఆదివారం సిద్ధూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 13 పాయింట్ల ఎజెండాపై సోనియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని సిద్ధూ వెల్లడించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న పంజాబ్‌అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, ఇసుక మాఫియా, విద్యుత్, రవాణా రంగాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. -
వారిద్దరు మాట్లాడుకోవడం లేదు.. ఇదిగో సాక్ష్యం..!
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో నెలకొన్న అస్థిరత ముగిసప్పటికి.. నేతల మధ్య ఇంకా సఖ్యత కుదిరినట్లులేదు. తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనేక సార్లు చర్చలు, డిమాండ్లకు అంగీకరించిన తర్వాత సిద్ధూ శాంతించాడు. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించాడు. అయితే సిద్ధూ, చన్నీల మధ్య దూరం అలానే ఉంది. ఇందుకు సాక్ష్యంగా నిలిచే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. (చదవండి: మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ) ఆదివారం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కుమారుడు వివాహం జరిగింది. గురుద్వారాలో చాలా సాధారణంగా జరిగిన ఈ వేడుకకు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కానీ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ మాత్రం ఈ వివాహవేడకకు హాజరు కాలేదు. ప్రస్తుతం సిద్ధు వైషో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ కశ్మీర్ వెళ్లారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చన్నీ కుమారుడి వివాహవేడుకకు సిద్ధూ హాజరుకాకపోవడంతో.. ఈ ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చన్నీ కుమార్ నవ్‌జిత్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ సిమ్రన్ధీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. Darshan of the primordial mother during Navratras is synergising ... Washes away all the dirt from the soul !! Blessed to be at the lotus feet of Mata Vaishno Devi#JaiMataDevi pic.twitter.com/MP5VcDzy9F — Navjot Singh Sidhu (@sherryontopp) October 10, 2021 చదవండి: ఆ రోజు పంజాబ్‌లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే.. -
మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ
చండీగఢ్: కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతున్న నవజోత్‌సింగ్ సిద్దూ మరోమారు గళం విప్పారు. యూపీలో జరిగిన రైతు మరణాలకు సంబంధించి ఆయన మొహాలి నుంచి లఖిమ్‌పూర్‌కు యాత్ర చేపట్టారు. దీని ఆరంభానికి ముందు పంజాబ్ సీఎం రాక ఆలస్యం కావడంతో ఆయన అసహనంగా కనిపించారు. దీంతో సిద్ధూను కేబినెట్‌మంత్రి పర్గాత్ సింగ్ శాంతింపజేయడానికి ప్రయతి్నస్తున్న వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. సీఎం త్వరలో వస్తారని పర్గాత్ చెప్పడం, ఈ యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్ పంజాబ్ సీడబ్లు్యసీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సముదాయించడం వీడియోలో కనిపించింది. వీరి మాటలకు సిద్ధూ స్పందిస్తూ ‘‘విజయం ఎక్కడ? నాకు పగ్గాలు అప్పజెప్పిఉంటే మీకు విజయం కనిపించేది. ఇప్పుడు కాంగ్రెస్ మృతావస్థలో ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనిపించింది. సీఎం మార్పునకు నిరసనగా కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ అనంతరం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డట్లు కనిపించారు. అయితే ఆయన రాజీనామాను అధికారికంగా ఉపసంహరించుకోలేదు. ఆయనలో అసంతృప్తి చల్లారలేదని తాజా వ్యాఖ్యలు చూపుతున్నాయి. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష అకాలీదళ్ విమర్శించింది. కాంగ్రెస్ సమస్యలకు తక్షణ పరిష్కారాలు దొరకవు! న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి తక్షణ మార్గాల్లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. లఖీమ్‌పూర్ ఘటనతో పార్టీకి తక్షణ పునర్వైభవం వస్తుందని ఆశించేవారు నిరాశ పడకతప్పదంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్ తయారవుతున్నారన్న ఊహాగానాల నడుమ ఆయన తాజా ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. జీఓపీ(గ్రాండ్ ఓల్డ్ పార్టీ– కాంగ్రెస్) వెనువెంటనే పునర్వికాసం చెందేందుకు లఖీమ్‌పూర్ ఘటన ఉపయోగపడుతుందని చాలామంది ఆశిస్తున్నారని, వీరంతా త్వరలో అతిపెద్ద నిరాశను ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజా ట్వీట్‌తో తనకు, పార్టీ నాయకత్వంతో విభేదాలున్నట్లు ప్రశాంత్ పరోక్షంగా చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కొత్త పార్టీ ఏర్పాటుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు
-
ఛాన్ని రాకతో మళ్లీ అలిగిన సిద్ధూ
-
శాంతించిన సిద్ధూ..!
న్యూఢిల్లీ/చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన గురువారం చండీగఢ్‌లోని పంజాబ్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ అయ్యారు. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే ఒక సమన్వయ కమిటీని(కో–ఆరి్డనేషన్ ప్యానెల్) ఏర్పాటు చేసుకోవాలని ఇరువురూ నిర్ణయానికొచి్చనట్లు తెలిసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు నేతల మధ్య 2 గంటలపాటు భేటీ జరిగింది. భేటీ తర్వాత చన్నీ, సిద్ధూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అతిత్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం అతిత్వరలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం చెప్పారు. పార్టీలో ఇటీవలి కాలంలో లుకలుకలు, అసంతృప్త గళాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సీడబ్ల్యూసీ భేటీ తక్షణమే నిర్వహించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంపై అధినేత సోనియా గాంధీ ఇటీవలే సంకేతాలిచ్చారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మరోవైపు, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అస్థిరత సృష్టిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గురువారం ఆరోపించారు. -
Navjot Singh Sidhu: ముగిసిన పంజాబ్ సీఎం, సిద్ధూ భేటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సిద్ధూ.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో తొలిసారి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరగ్గా, సిద్ధూ డిమాండ్లను సీఎం చన్నీ అంగీకరించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం నవజ్యోత్ సింగ్ సిద్ధూ మట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. నిజాయతీ, నమ్మదగిన అధికారులను నియమించాలని అన్నారు. మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. చదవండి: Punjab Crisis: బీజేపీలో చేరికపై అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు -
పార్టీనే సుప్రీం.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం: చన్నీ
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో అలజడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మీదే వదిలేసిది అధిష్టానం. ఈ క్రమంలో చన్నీ అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: Charan Singh Channi: సిద్ధూ రాజీనామాపై నాకు సమాచారం లేదు) పార్టీనే సుప్రీం అని.. ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చన్నీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సిద్దూతో ఆయన ఫోన్లో మాట్లాడారు. పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ.. ‘‘ఏది కావాలని చేయలేదు. ఏదైనా నియామకానికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. నాకు ఎలాంటి ఈగో సమస్యలు లేవు.. పార్టీనే సుప్రీం అని సిద్ధూకి స్పష్టం చేశాను. కూర్చుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం’’ అన్నారు. (చదవండి: ఇక ఈ అవమానాలు నావల్లకాదు: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం?) సిద్ధూ రాజీనామా అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఆయన నివాసానికి వెళ్లి రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా సిద్ధూని కోరారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ రాజీనామాను అంగీకరించలేదు.. దీనిపై అతడితో చర్చింలేదని సమాచారం. చదవండి: Punjab: నిజం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతా: నవజోత్ సింగ్ సిద్ధూ -
సిద్దు ఒంటరివాడు... జట్టుగా పనిచేయలేడు
-
పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం
-
Punjab: నిజం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతా: నవజోత్ సింగ్ సిద్ధూ
చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం మౌనం వీడారు. తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని, అదే సమయంలో తన సిద్ధాంతాలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని చెప్పారు. పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ), అడ్వొకేట్ జనరల్ నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కళంకిత నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టడం ఏమిటని నిలదీశారు. ఈ మేరకు నవజోత్ సింగ్ సిద్ధూ 4 నిమిషాల నిడివి గల ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపర్చడం, మార్పును తీసుకురావడమే తన ఆశయం, బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇదే తన ధర్మమని పేర్కొన్నారు. ఎవరిపైనా తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. తాను ఎవరితోనూ వ్యక్తిగతంగా పోరాడడం లేదని చెప్పారు. కేవలం పంజాబ్ అనుకూల ఎజెండా కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే దీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్నానని పేర్కొన్నారు. సత్యం కోసమే నా పోరాటం కేవలం సత్యమార్గంలో నడవాలని, నైతిక విలువల విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగాలని తన తండ్రి ఉద్బోధించాడని సిద్ధూ గుర్తుచేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ప్రీత్ సింగ్ సహోతాకు పంజాబ్ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన ప్రస్తావించారు. నైతిక విలువలు పాటించడంపై కొందరు రాజీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2015లో ఫరీద్‌కోట్‌లో గురు గ్రంథ సాహిబ్‌కు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, అందుకోసమే తాను పోరాటం ప్రారంభించానని చెప్పారు. కొత్త అడ్వొకేట్ జనరల్‌గా ఏపీఎస్ డియోల్‌ను నియమించడంలోని ఔచిత్యాన్ని సిద్దూ ప్రశ్నించారు. గురు గ్రంథ సాహిబ్‌ను అవమానించిన కేసులో ఏపీఎస్ డియోల్ ఆరేళ్ల క్రితం అప్పటి పాలకుడు బాదల్‌కు క్లీన్ చిట్ ఇచ్చారని, అలాంటి వ్యక్తికి అదే కేసులో న్యాయం చేకూర్చే బాధ్యతను ఎలా అప్పగిస్తారని అన్నారు. అవినీతిపరులైన నేతలు, అధికారులతో కూడిన వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చారని మండిపడ్డారు. దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని వివరించారు. కలిసి మాట్లాడుకుందాం.. రాష్ట్రంలో ప్రభుత్వ నియామకాలపై ఏమైనా అసంతృప్తి ఉంటే కూర్చొని చర్చించుకోవాలని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఫోన్ చేసి మాట్లాడారు. పంజాబ్‌లో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేదని కలిసి, అందరూ కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమైపోతుందని అన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అహం అడ్డు రాదని వ్యాఖ్యానించారు. అవినీతిపరులను తొలగించాలి: కేజ్రీవాల్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఒక తమాషా వ్యవహారంగా మార్చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పంజాబ్ కేబినెట్ నుంచి అవినీతిపరులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. చదవండి: పంజాబ్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం हक़-सच की लड़ाई आखिरी दम तक लड़ता रहूंगा … pic.twitter.com/LWnBF8JQxu — Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021 -
సిద్ధూ రాజీనామాను ఆమోదించని కాంగ్రెస్ అధిష్ఠానం
-
పంజాబ్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
-
కాంగ్రెస్‌కు సిద్ధూ షాక్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలలే గడువు ఉండగా రాష్ట్ర కాంగ్రెస్‌లో తాజాగా మరో రాజకీయ సంక్షోభం నెలకొంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియమితులై మూడు నెలలు తిరక్కుండానే నవజోత్ సింగ్ సిద్ధూ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపించారు. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా పంజాబ్ తలనొప్పి వదలిపోయిందని ఊపిరి తీసుకున్న అధిష్టానానికి సిద్ధూ రాజీనామా గట్టి షాక్‌నిచ్చింది. ‘రాజీపడటం మొదలైతే వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. పంజాబ్ రాష్ట్ర సంక్షేమం, భవిష్యత్ విషయంలో నేను ఎన్నటికీ రాజీపడను. అందుకే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీకి సేవలందిస్తాను’ అని సోనియాకు రాసిన రాజీనామా లేఖను మంగళవారం సోషల్ మీడియాలో సిద్ధూ షేర్ చేశారు. సిద్ధూ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతుగా చన్నీ కేబినెట్లో మంత్రి పదవి పొందిన రజియా సుల్తానా రాజీనామా చేశారు. సిద్ధూకి సంఘీభావంగాS రాజీనామా చేస్తున్నట్టుగా సీఎంకు పంపిన లేఖలో ఆమె పేర్కొన్నారు. అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపే వరకు నిత్య అసమ్మతివాదిగా కెప్టెన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్న సిద్ధూ పీసీసీ అధ్యక్షుడయ్యాక సూపర్ చీఫ్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా పీసీసీ పదవికే రాజీనామా చేసి కాంగ్రెస్ అధిష్టానంపై గుగ్లీ విసిరారు. అన్నీ సర్దుకుంటాయి: కాంగ్రెస్: సిద్ధూ రాజీనామా విషయంలో కాంగ్రెస్ వేచిచూసే ధోరణిని అవలంభిస్తోంది. రాజీనామాను ‘భావోద్వేగ స్పందన’గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారని, సిద్ధూను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ... సిద్ధూతో మాట్లాడతారని, రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరతారని చెప్పాయి. ఎందుకీ నిర్ణయం ? పంజాబ్ కేబినెట్ విస్తరణ జరిగిన రెండు రోజులకే సిద్ధూ పీసీసీ చీఫ్‌గా రాజీనామా చేయడంతో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమరీందర్‌సింగ్ స్థానంలో సిద్ధూకి సన్నిహితుడైన దళిత నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కేబినెట్ మంత్రుల విషయంలో సిద్ధూ మాటల్ని అధిష్టానం పట్టించుకోలేదు. కేబినెట్ కూర్పు అంతా రాహుల్ గాంధీ ఇష్టం మేరకే సాగింది. వచ్చే ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న సిద్ధూ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, ఇతర అధికారిక నియామకాల్లో తన మాట చెల్లుబాటు కాలేదని అసహనంగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తునారు. ►సిద్ధూ ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సుఖ్జీందర్ సింగ్ రాంధావాను అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన జాట్ సిక్కు కావడం సిద్ధూకి మింగుడు పడలేదు. సిద్ధూ కూడా జాట్ సిక్కు కావడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎంగా ఉండాలన్న తన కల నెరవేరడానికి రాంధావా అడ్డు పడతారని సిద్ధూ భావిస్తున్నారు. పైగా మంగళవారం జరిపిన శాఖల కేటాయింపుల్లో రాంధావాకు అత్యంత ముఖ్యమైన హోంశాఖను కట్టబెట్టారు. ►సిద్ధూ తనకు నమ్మకస్తులైన కుల్జిత్ సింగ్ నగ్రా, సుర్జిత్ సింగ్ ధైమన్కు కేబినెట్లో చోటు కోసం ప్రయత్నించి విఫమయ్యారు ►సిద్ధూ అనుచరులకు మంత్రి పదవులు లభించకపోగా తాను తీవ్రంగా వ్యతిరేకించిన, ఇసుక మైనింగ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్‌సింగ్‌కు కేబినెట్లో చోటు దక్కడం పుండు మీద కారం చల్లినట్టుగా అయింది. అక్ర మ మైనింగ్‌పై పోరాడుతున్న సిద్ధూ... రాణా కు మంత్రిపదవి ఇవ్వడాన్ని సహించలేకపోయారు. ►ముఖ్యమంత్రిగా తాను మద్దతు ఇచ్చిన చన్నీ వివిధ పదవుల నియామకంలో తనకు నచ్చినవారికే కట్టబెట్టడం సిద్ధూకి మింగుడు పడడం లేదు. రాష్ట్ర డీజీపీగా సిద్ధార్థ చటోపాధ్యాయ, అడ్వొకేట్ జనరల్‌గా పట్వాలియాను నియమించాలన్న సిద్ధూ సూచనల్ని సీఎం పట్టించుకోలేదు. డీజీపీగా ఇక్బాల్ సిహŸతా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా డియోల్‌ను నియమించారు. డియోల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తిగా ఉన్నారు. విజిలెన్స్ కేసుల్లో ఇరుక్కున్న మాజీ డీజీపీ సుమేధ్సింగ్ సైనికి న్యాయవాదిగా వ్యవహరించి.. ఆయనని ఆ కేసుల నుంచి డియోల్ బయటపడేశారు. అలాంటి వ్యక్తికి అత్యున్నత స్థాయి పదవి కట్టబెట్టడాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి నేను చెప్పానా.. ముందే చెప్పానా! సిద్ధూఅసమ్మతి సెగలకు ఉక్కిరిబిక్కిరై.. అవమాన భారాన్ని భరించలేక సీఎం పదవిని వీడిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సిద్ధూ రాజీనామాపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టారు. సిద్ధూ ఇచ్చిన ఝలక్ నుంచి ఇంకా తేరుకోని అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘మీకు ముందే చెప్పాను. సిద్ధూకి స్థిరత్వం లేదు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కి అతను తగిన వ్యక్తి కాదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పర్యటన మీద ఢిల్లీ చేరుకున్న అమరీందర్ విలేకరులతో మాట్లాడారు. పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టి మూడు నెలలు తిరక్కుండా వెళ్లిపోతే అతనిపై ఎవరికి నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను వీడి మరో పార్టీతో చేతులు కలపడానికి సిద్ధూ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పంజాబ్ పర్యటనకు ఒక్క రోజు ముందే సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో అమరీందర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఢిల్లీకి అమరీందర్ అమరీందర్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. సెప్టెంబర్ 18న సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. అమరీందర్ బీజేపీలో చేరుతారని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడానికే ఢిల్లీకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. అయితే అమరీందర్ మీడియా సలహాదారు రవీణ్ తుక్రల్ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తమే అమరీందర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ‘ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. దాంతో పాటు ఢిల్లీలోని కపుర్తలా హౌస్ (ఢిల్లీలో పంజాబ్ సీఎం అధికారిక నివాసం)ను ఖాళీ చేసి కొత్త సీఎం చన్నీకి అప్పగిస్తారు’ అని తుక్రల్ ట్వీట్ చేశారు. అమరీందర్ చండీగఢ్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ తన పర్యటనపై అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దని కపుర్తలా హౌస్‌ను ఖాళీ చేయడానికే వెళుతున్నానని చెప్పారు. అమరీందర్ ఢిల్లీకి వెళ్లడానికి విమానాశ్రయానికి వెళ్లినప్పుడే హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లడం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా విమానాశ్రయానికి చేరుకోవడం విశేషం. -
పంజాబ్ కేబినెట్లో ఏడు కొత్త ముఖాలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ తొలిసారిగా ఆదివారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 15 మందిని కేబినెట్లో చేర్చుకున్నారు. వీరిలో ఏడుగురు కొత్త మంత్రులు ఉన్నారు. మంత్రులతో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఐదు నెలల్లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చన్నీ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకం పాటించినట్లు స్పష్టమవుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో పనిచేసిన పలువురికి మరోసారి అవకాశం కల్పించారు. బ్రహ్మ మోహింద్రా, మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, త్రిప్త్ రాజీందర్‌సింగ్ బాజ్వా, అరుణా చౌదరీ, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, రజియా సుల్తానా, విజయిందర్ సింగ్, భరత్ భూషణ్ అషూ, రాణా గుర్జీత్ సింగ్ తదితరులు మరోసారి మంత్రులయ్యారు. అమరీందర్‌సింగ్‌కు గట్టి మద్దతుదారులుగా పేరున్న రాణా గుర్మిత్ సింగ్ సోదీ, సాధు సింగ్ ధరంసోత్, బల్బీర్‌సింగ్ సిద్దూ, గురుప్రీత్‌సింగ్ కంగర్, సుందర్‌శామ్ అరోరాకు ఈసారి నిరాశే ఎదురయ్యింది. తమను పక్కనపెట్టడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చేసిన తప్పేమిటో చెప్పాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీశారు. ఈ ఐదుగురు అమరీందర్‌కు అత్యంత సన్నిహితులు. చదవండి: (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు) అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హరీష్ రావత్ ప్రయత్నించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కట్టబెడతామని ఊరడించారు. సామాజిక, ప్రాంతీయ సమతూకం పాటిస్తూ మంత్రివర్గంలో యువతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఒ.పి.సోనీ గత సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో నిబంధనల ప్రకారం మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి. తాజా విస్తరణతో సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 18కి చేరింది. చదవండి: (ఎన్నికల ప్రేమకథ) Congress MLAs Brahm Mohindra and Manpreet Singh Badal take oath as Cabinet ministers of Punjab Govt, at Raj Bhavan in Chandigarh pic.twitter.com/hbInrGHcNG — ANI (@ANI) September 26, 2021 -
ఎన్నికల ప్రేమకథ
దేశంలోనే అత్యధికంగా దళితులున్న రాష్ట్రమది. అక్కడ నూటికి 32 మంది దళితులే. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండినా, ఇప్పటి దాకా ఒక్క దళితుడైనా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. మరో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలనగా ఇప్పుడయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి తొలి దళిత సీఎంగా కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం పదవీ ప్రమాణం చేశారు. ఇన్నేళ్ళకు సాధ్యమైన ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందే. కానీ 5 నెలల్లో ఎన్నికలనగా చూపిన ఈ ప్రేమ, చేసిన ఈ మార్పు దళితుల సాధికారికతకు చిహ్నమా? లేక ఎన్నికల వ్యూహమా అన్నది ప్రశ్న. అధ్యక్ష పదవిలో లేకున్నా పార్టీపై అపరిమిత అధికారం ఉన్న రాహుల్ గాంధీ స్వయంగా ఈ తాజా పదవీ ప్రమాణానికి హాజరయ్యారు. బీజేపీ అధినాయకుడైన ప్రధాన మంత్రి మోదీ విపక్ష దళిత సీఎంపై అభినందనల వర్షం కురిపించారు. ఎన్నికల క్షేత్రంలో దళిత ఓటర్ల ప్రాముఖ్యాన్ని ఏ పార్టీ విస్మరించదలుచుకోలేదని, ఓట్ల వేటలో కులాల వారీ ప్రేమకథ నడుపుతోందనీ అర్థమవుతోంది. 117 స్థానాల అసెంబ్లీలో 80 సీట్లు గెలిపించి, 2017 నుంచి ఇప్పటి దాకా అన్ని ఎన్నికలలోనూ పార్టీని గెలిపించిన చరిత్ర తాజా మాజీ సీఎం అమరిందర్ది. జనంలో పేరున్న నమ్మకస్థుడైన ఈ పార్టీ సైనికుడిని కాదనుకొని, కాంగ్రెస్ అధిష్ఠానం సెల్ఫ్‌గోల్ చేసుకుంది. రెండు నెలల క్రితం పీసీసీ అధ్యక్షపదవి దక్కించుకున్న సిద్ధూకూ, అమరిందర్‌కూ మధ్య ఆధిపత్య పోరులో చివరకు సిద్ధూదే పైచేయి అయింది. 2019లో పర్యాటక శాఖ మంత్రిగా రాజీనామా చేసినప్పటి నుంచి విమర్శలు, ప్రతివిమర్శలతో వారి మధ్య పోరు బహిరంగ రహస్యం. ఇప్పుడు మరో అయిదు నెలల్లోనే ఎన్నికలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి అంతకన్నా తక్కువ టైమే ఉంది. వెరసి, పాలనలో తనదైన ముద్ర వేయడానికి కొత్త సీఎం చన్నీకి నిండా 100 రోజులే. అధికారులపై అతిగా ఆధారపడి, ఎమ్మెల్యేలకైనా అందుబాటులో లేకుండా ఫామ్‌హౌస్‌లోనే గడిపారనీ, ఎన్నికల వాగ్దానాలు అనేకం నెరవేర్చలేదనీ అమరిందర్పై విమర్శ. పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలంటే, ఓటర్లలో ఆ వ్యతిరేకతని తగ్గించాలి. క్యాబినెట్లో ఉంటూనే అమరిందర్‌ను విమర్శించిన చన్నీ సీఎం పదవి చేపట్టగానే గ్రామాలలో నీటి, విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది అందుకే! అయితే, 52 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, ‘‘అవమాన భారంతో’’ నాటకీయంగా సీఎం కుర్చీ వీడారు 79 ఏళ్ళ అమరిందర్. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాకఢ్ సహా ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలతో పోలిస్తే చన్నీ వయసులో చిన్నవాడు. ఎమ్మెల్యేగా, విధాన సభలో ప్రతిపక్ష నేతగా, నిన్నటి దాకా అమరిందర్ క్యాబినెట్లో మంత్రిగా అనుభవం ఉంది. అదే సమయంలో ఆయనపై కొన్ని వివాదాలూ లేకపోలేదు. అయితే, అమరిందర్ స్వతంత్ర ధోరణి రాహుల్‌కు కొంతకాలంగా నచ్చట్లేదు. ప్రియాంకా గాంధీ సైతం సిద్ధూకు అనుకూలంగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో సీఎం మార్పుపై అధిష్ఠానం కొద్ది నెలలుగా ఊగిసలాడింది. పరిస్థితులు గమనించినా, అమరిందర్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. చివరకు అధిష్ఠానం అనేకానేక పేర్లు పరిశీలించి, ఏవేవో పేర్లు లీక్ చేసి, అనూహ్యంగా చన్నీకి ఓటేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెబుతూనే, ఇందిరా గాంధీ నాటి సీల్డు కవర్ సంప్రదాయంలో, దళిత కార్డుపై చన్నీకి పట్టం కట్టింది. దేశంలో మినీ ఎన్నికల పోరాటం మొదలైపోయినట్టు కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల వేడి, దానికి తగ్గట్టే కుల, మత రాజకీయాల జోరు పెరిగాయి. ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ మొదలు గుజరాత్, పంజాబ్ దాకా అన్ని చోట్లా కుల, మత సమీకరణాలే అన్ని పార్టీల వ్యూహాలనూ శాసిస్తున్నాయి. ఇన్నేళ్ళలో తొలిసారిగా పంజాబ్‌లో దళితుడు సీఎం అయ్యారంటే దాని చలవే. అయితే, రానున్న పంజాబ్ ఎన్నికలు సిద్ధూ సారథ్యంలోనే జరుగుతాయని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీశ్ రావత్ నోరు జారడంతో, ప్రతిపక్ష అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు విమర్శించడానికి వీలు చిక్కింది. ‘దళిత సీఎం అనేది ఎన్నికల ముందు చేసిన గిమ్మిక్కు’ అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నాయి. మరోపక్క రాజకీయ అపరిపక్వత, పదవీకాంక్ష నిండిన సిద్ధూ ‘జాతి వ్యతిరేకి’ అంటూ స్వయంగా అమరిందరే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ విపక్షాలకు అవి అంది వచ్చిన అస్త్రాలు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు అకాలీదళ్‌కు కలిసొచ్చినా రావచ్చు. దేశం మొత్తం మీద మూడే రాష్ట్రాలలో అధికారంలో మిగిలిన కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో తాజా మార్పులతో పెను జూదమే ఆడింది. సీఎం మార్పు అనివార్యమనుకున్నా ఆ మార్పు చేసిన విధానమే అంతా కలగాపులగమైంది. ఇక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ సీఎంలతో ఉన్న చిక్కుల్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. బీజేపీ జయపతాక మోదీ తమ పార్టీ సీఎంలను మార్చినట్టు, విజయాల ట్రాక్ రికార్డు లేని రాహుల్ అండ్ కో చేద్దామనుకుంటే చిక్కే. ఏమైనా ఆరు నెలల క్రితం ఇట్టే గెలుస్తామనుకున్న పంజాబ్‌లో ఆ పార్టీ ఇప్పుడు వెనకబడింది. ఆత్మహనన ధోరణి నిర్ణయాలతో ప్రతిపక్షాలకు సందు ఇచ్చింది. అధికారానికి కొత్త అయిన చన్నీ ఇప్పుడు పార్టీలోని అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుంటూనే, పాలనను గాడిలో పెట్టాలి. 2022 ఎన్నికలలో పార్టీని గెలిపించాలి. అందుకు ఆయన దళిత కార్డు ఒక్కటే సరిపోతుందా? సిద్ధూ సారథ్యంలోనే ఎన్నికలన్న వ్యాఖ్యలను బట్టి చూస్తే, చన్నీ తాత్కాలిక ముఖ్యమంత్రేనా? ఒకవేళ రేపు కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే, చన్నీనే సీఎంను చేస్తారా? ఎన్నికల దళిత ప్రేమకథలో ఇప్పటికైతే ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. -
తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్య వ్యక్తిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య నెలరోజుల పాటు సాగిన సంకక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో చన్నీ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణమే సాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు రైతు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. స్వయంగా రిక్షా పుల్లర్‌ని అయిన తాను వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాకపోవడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి కాంగ్రెస్ పెద్దలు, పలువురు నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా శుభాకాంక్షలు అందజేశారు. #WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7 — ANI (@ANI) September 20, 2021 Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab. — Narendra Modi (@narendramodi) September 20, 2021 -
పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్(79) రాజీనామా చేశారు. అవమానభారంతో పదవి నుంచి వైదొలుగుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను తదుపరి సీఎంగా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించనని కుండబద్దలు కొట్టారు. కొత్త సీఎంను ఎన్నుకునే అధికారాన్ని అధినేత్రి సోనియాకు అప్పగిస్తూ పంజాబ్ సీఎల్పీ నిర్ణయించింది. సింగ్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతికి తెరదించినట్లయింది, కానీ రాబోయే ఎన్నికల్లో ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న మొదలైంది. పంజాబ్‌లో పతనావస్థలో ఉన్న పారీ్టకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తినివ్వడంలో అమరీందర్ పాత్ర చాలా ఉంది. కానీ చివరకు అసమ్మతి రాజకీయాలకు తలొగ్గి, సోనియాతో చర్చల అనంతరం సీఎల్పీ సమావేశానికి ముందు రాజీనామాను సమర్పించారు. ఇప్పటికి ఇది మూడో సీఎల్పీ సమావేశమని, తాజా సమావేశంపై తనకు కనీస సమాచారం లేదని ఆయన చెప్పారు. తనపై అపనమ్మకాన్ని అవమానంగా భావిస్తున్నట్లు రాజీనామాను గవర్నర్‌కు సమర్పించిన అనంతరం అమరీందర్ వ్యాఖ్యానించారు. 50కిపైగా కాంగ్రెస్ ఎంఎల్ఏలు కెప్టెన్‌ను మార్చాలంటూ సోనియాకు లేఖ రాశారు. అమరీందర్ రాజీనామాతో సిద్ధూకు, తనకు జరుగుతున్న పోరులో సిద్దూదే పైచేయి అయినట్లయింది. అమరీందర్ ఇష్టానికి వ్యతిరేకంగా సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ను చేయడం తెల్సిందే. సమయం వచ్చినప్పుడు చెప్తా రాజీనామా అనంతరం భవిష్యత్ ప్రణాళికలపై అమరీందర్ స్పందించారు. అన్నింటికీ ఒక ఆప్షన్ ఉంటుందని, తనకు సమయం వచి్చనప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో కలిసి భవిష్యత్‌పై సమాలోచన జరుపుతానని చెప్పారు. అధిష్టానం ఎవరిని కావాలనుకుంటే వారిని సీఎం చేయవచ్చన్నారు. కానీ తనను ఎందుకు తొలగించాలని నిర్ణయించుకున్నారో అర్ధం కావడం లేదని వాపోయారు. కాంగ్రెస్‌లో తాను 52 సంవత్సరాలున్నానని, ముఖ్యమంత్రిగా 9ఏళ్లకు పైగా పనిచేశానని గుర్తు చేశారు. ఎంఎల్ఏలు డిమాండ్ చేసిన సమావేశానికి అజయ్ మాకెన్, హరీష్ చౌదరీలను అధిష్టానం పరిశీలకులుగా పంపింది. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ప్రతినిధి హరీష్ రావత్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో కాంగ్రెస్ కుమ్ములాటలు పారీ్టకి చేటు చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పోరాటాల కెప్టెన్ పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్ సింగ్ తొలుత సైన్యంలో పనిచేశారు. వారిది సైనిక కుటుంబం, 1965, 1971 యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. డెహ్రాడూన్, ఎన్డీఏల్లో విద్యాభ్యాసం చేశారు. రిటైర్మెంట్ తర్వాత అప్పటి కాంగ్రెస్ యువ నేత రాజీవ్‌కు సన్నిహితుడయ్యారు. తర్వాత ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు, కానీ బ్లూస్టార్ ఆపరేషన్‌కు నిరసనగా రాజీనామా చేశారు. 1985లో అకాళీదళ్‌లో చేరి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. 1998లో కాంగ్రెస్ గూటికి చేరారు. 2002–07లో పంజాబ్ సీఎం అయ్యారు. 2014లో బీజేపీకి చెందిన అరుణ్‌జైట్లీని ఓడించి ఎంపీ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలంగా తీర్చిదిద్ది అకాళీదళ్ ఓటమిలో కీలకపాత్ర పోషించారు. పదేళ్ల తర్వాత పంజాబ్‌లో గెలిపించినందుకు ఆయన్నే అధిష్టానం సీఎంగా చేసింది. సీఎం అయ్యాక రైతు రుణమాఫీ చేసి రైతాంగంలో ఇమేజ్ పెంచుకున్నారు. సిద్దూ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సింగ్‌కు పార్టీపై పట్టు తగ్గుతూ వచ్చింది. సిద్దూను మచ్చిక చేసుకునేందుకు తనకు కేబినెట్ పోస్టును సింగ్ ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. 2019లో సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి అమరీందర్‌పై విమర్శలు పెంచారు. సింగ్ రాజీనామా అనంతరం పంజాబ్ సీఎల్పీ సమావేశం జరిగింది. ‘సిద్ధూ పాక్ తొత్తు’ తన పదవికి ఎసరు పెట్టిన సిద్ధూపై కెప్టెన్ విమర్శలు చేశారు. సిద్దూను సీఎంగా అంగీకరించనన్నారు. సిద్ధూ దేశానికే వ్యతిరేకమని, పాకిస్తాన్ తొత్తు అని తీవ్రంగా నిదించారు. సిద్ధూ అంటేనే సంక్షోభమని, అతను ప్రమాదకారి, అసమర్ధుడు, అస్థిరత్వానికి కారకుడని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌తో కలిసిపోయినవాడు దేశానికి, పంజాబ్‌కు ప్రమాదకరమన్నారు. అలాంటివాడు దేశాన్ని నాశనం చేస్తానంటే అంగీకరించనని, ప్రజలకు చెడు చేసే అంశాలపై పోరాటం చేస్తానని తెలిపారు. పాక్ నాయకత్వంతో సిద్దూకు సత్సంబంధాలున్నాయంటూ.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి సిద్దూ హాజరవడ్డాన్ని, ఇమ్రాన్‌ను, పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాను సిద్ధూ గతంలో ఆలింగనం చేసుకోవడాన్ని, వారిని ప్రశంసించడాన్ని గుర్తు చేశారు. పంజాబ్ అంటే దేశ రక్షణ అని, అలాంటి రాష్ట్రానికి సిద్ధూ లాంటివాడు సీఎం కావడాన్ని అంగీకరించనని చెప్పారు. ఒక్క మంత్రిత్వ శాఖనే సరిగ్గా నిర్వహించలేని అసమర్థుడు మొత్తం పంజాబ్‌ను నడిపించడం జరగని పని అని ఎద్దేవా చేశారు. సిద్ధూకు ఎలాంటి సామర్ధ్యం లేదని, తన మాట కాదని సిద్ధూని సీఎంగా చేస్తే అన్ని విధాలుగా వ్యతిరేకిస్తానని హెచ్చరించారు. సిద్ధూ శకుని పాత్ర పోషిస్తున్నందున తాను సీఎంగా ఉండడని గతంలోనే సోనియాకు చెప్పానని, అప్పుడు రావత్ కూడా అక్కడే ఉన్నారని అమరీందర్ వెల్లడించారు. కానీ అప్పుడు ఆమె తన అభ్యర్ధన మన్నించలేదన్నారు. కాంగ్రెస్‌కు తాను శక్తిమేర పనిచేశానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలను విరమించే ప్రసక్తి లేదని అమరీందర్ స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా తనకు ఇంత అవమానం జరుగుతుందని ఊహించలేదని, కానీ చివరకు తనను తప్పించాలని ఎందుకు నిర్ణయించారో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇక ఈ అవమానాలు నావల్లకాదు: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు, తాజా పరిణామాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు సమాచారం. సోనియా మాట ప్రకారం, ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులను అంగీకరించానని, కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలని , ఇలా జరగడం ఇది మూడోసారని సింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ శనివారం సాయంత్రం సీఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నాయకత్వ మార్పుపై ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించనున్నారని తీవ్ర ఊహాగానాలు చెలరేగాయి. గత కొన్ని నెలలుగా కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఒక వర్గం ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కొత్త నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి తోడు పలు సర్వేల అనంతరం 2022, ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర ఎన్నికలకు ముందు పంజాబ్‌లో సీఎంను మార్చాలని హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించిందని అంచనా. మరోవైపు సునీల్ జాఖర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా, బియాంత్ సింగ్ మనవడు ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూలలో ఒకర్ని కొత్త సీఎంగా నియమించ నున్నారనే అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా పంజాబ్ పీసీసీ పగ్గాలను ఎమ్మెల్యే సిద్దూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగింది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పేందుకు అమరీందర్ ససేమిరా అన్నారు. అయినా సిద్దూనే పీసీసీ అధ్యక్షుడు అంటూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. -
సిద్ధూపై ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవసాయ చట్టాల అంశంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. శిరోమణి అకాలీదళ్ చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆప్ కూడా రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విరుచుకు పడ్డారు. దీంతో ఆప్ సిద్ధూపై ఎదురుదాడికి దిగింది. సిద్ధూ రాజకీయాల్లో రాఖీసావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన సిద్ధూని కాంగ్రెస్ హైకమాండ్ మందలించింది. సీఎం అమరీందర్‌ను నిరంతరం దూషిస్తున్న సిద్ధూకి కళ్లెం వేసింది. అందుకే మార్పు కోసం ఆయన కేజ్రివాల్‌ని అంటున్నారు. రేపటి వరకు వేచి చూడండి. సిద్దూ మళ్లీ కెప్టెన్‌పై విరుచు కుపడతారు’’ అని రాఘవ్ ట్వీట్ చేశారు. (చదవండి: Cadbury: 1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..) -
త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్ చర్చలు
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ ముందుకొచ్చారు. త్వరలో పంజాబ్‌లో పర్యటించి అమరీందర్, సిద్ధూలను కలుస్తానని, సయోధ్యకు ప్రయత్నిస్తానని రావత్ ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలపై పార్టీ నేత రాహుల్‌గాంధీతో ఆయన శనివారం చర్చించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండు మూడు రోజుల్లో నేను పంజాబ్‌కి వెళతాను. సయోధ్య కుదిర్చేందుకు అమరీందర్, సిద్ధూలతో మాట్లాడతాను. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత లందరితోనూ మాట్లాడతాను’ అని రావత్ చెప్పారు. గత కొన్ని నెలలుగా అంతర్గత పోరుతో కాంగ్రెస్ పార్టీ అల్లాడిపోతోంది. సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఈ వర్గ పోరు ఒక కొలిక్కి రాలేదు. సిద్ధూ సలహాదారు మాల్వీందర్ సింగ్ కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సీఎం శిబిరం ఒత్తిడితో ఆయన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరోవైపు తాను డమ్మీ చీఫ్‌గా ఉండలేనని, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రం కావాలని సిద్ధూ డిమాండ్ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ సమస్యని అధిష్టానం ఎలా పరిష్కరించనుందో వేచి చూడాలి. -
నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వండి
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో సిద్ధూ– అమరీందర్ సింగ్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ స్పష్టంచేయడంతో పార్టీ రాష్ట్ర చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ నిరసన స్వరం మరింత పెంచారు. ఒక రాష్ట్ర విభాగానికి అధ్యక్ష హోదాలో తనను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోనివ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ సిద్ధూ వ్యాఖ్యానించారు. కీలు బొమ్మలాగా, కేవలం ప్రదర్శనకు ఉంచిన ఒక వస్తువులాగా ఉండిపోదల్చుకోలేదని ఆయన అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల అసమ్మతిని తగ్గించేందుకు సీఎం అమరీందర్ గురువారం పరోక్షంగా బల ప్రదర్శన చేశారు. గురువారం చండీగఢ్‌లో క్రీడల శాఖ మంత్రి రాణా గుర్మీత్‌సింగ్ ఇంట్లో జరిగిన విందు కార్యక్రమానికి దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు హాజరయ్యారు. ఇది మంత్రుల భేటీగా వార్తలొచ్చినా.. సీఎం పరోక్షంగా బలప్రదర్శన చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధూ దీటుగా స్పందించారు. పార్టీ నియమ నిబంధనలకు లోబడి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు ఉందని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించిందని సిద్ధూ గుర్తుచేశారు. శుక్రవారం అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దూ మాట్లాడారు. ‘నన్నూ నిర్ణయాలు తీసుకోనివ్వండి. అలా అయితేనే పార్టీ మరో 20 ఏళ్లుపాటు అధికారంలోనే ఉండేలా చేస్తా. ఇందుకు ప్రణాళికలు సైతం సిద్ధంచేశా. నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వకుంటే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని సిద్ధూ ధిక్కార స్వరంతో మాట్లాడారు. ఇన్చార్జ్గా తప్పించండి: హరీశ్ రావత్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అక్కడ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షునిగా బిజీగా ఉంటానని, అందుకే పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తనను తప్పిస్తే బాగుంటుందని హరీశ్ రావత్ అన్నారు. తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చి పార్టీ చీఫ్ సోనియాగాంధీతో ఈ విషయమై చర్చించారు. ‘ఇంతకాలం పంజాబ్ వ్యవహారాలు చూశా. ఇకపైనా చూడమంటే చూస్తా. అధిష్టానానిదే తుది నిర్ణయం’ అని రావత్ వ్యాఖ్యానించారు. సిద్ధూ వ్యాఖ్యలపైనా రావత్ స్పందించారు. ‘సిద్ధూ ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నారో కనుక్కుంటా. రాష్ట్ర అధ్యక్షులది నిర్ణయాత్మక పాత్ర కానపుడు ఇంకెవరి నిర్ణయాలను అమలుచేస్తారు? ’ అని రావత్ అన్నారు. మరోవైపు, కశ్మీర్, పాక్ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారు మల్వీందర్ సింగ్ ఇకపై ఆ పదవిలో కొనసాగబోనని చెప్పారు. సలహాలు ఇవ్వడం ఆపేస్తే మంచిదని రావత్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం మల్వీందర్ తప్పుకోవడం గమనార్హం. -
చల్లారని రగడ: పీసీసీ చీఫ్ వరుస ట్వీట్లు.. నేడు ఢిల్లీకి సీఎం
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మధ్య విభేదాలు ఇంకా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. సిద్ధుకు రాష్ట్ర నాయకత్వ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమరీందర్ సింగ్.. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయంతో ఏకీభవించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలన్న సిద్ధు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఆయనతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం మరోసారి అమరీందర్ సర్కారును ఇరుకునపెట్టేలా వరుస ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. డ్రగ్స్ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందంటూ సిద్ధు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు.. ‘‘పంజాబ్ పోలీసులు ఏం చేస్తున్నారు? మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికై ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుంది? స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఏడీజీపీ హర్‌ప్రీత్ సిద్ధు 2018 ఫిబ్రవరిలో పంజాబ్, హర్యానా హైకోర్టులో డ్రగ్స్ విషయమై స్టేటస్ రిపోర్టు ఫైల్ చేశారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రెండేళ్లలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పారదర్శకంగా ముందుకు సాగాలి. సదరు నివేదికను పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురండి’’ అని నవజోత్ సింగ్ సిద్ధు డిమాండ్ చేశారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, అదే విధంగా ఇండో- పాక్ సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు అమరీందర్ సింగ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సిద్ధు ఈ మేరకు ట్వీట్లు చేయడం గమనార్హం. -
సిద్ధూ కామెంట్లపై రైతుల ఫైర్!
చండీగఢ్ : నూతన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల చేపట్టిన సందర్భంగా శుక్రవారం నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన కామెంట్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రూప్‌నగర్ జిల్లాలో సిద్ధూకు వ్యతిరేకంగా నిరసలు చేపట్టారు. గురుద్వారాలో ప్రార్థనల కోసం వచ్చిన ఆయనకు నల్ల జెండాలతో స్వాగతం పలికారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, శుక్రవారం తను చేసిన కామెంట్లపై సిద్ధూ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. రైతుల పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉందని, వారి ఉద్యమానికి మనసా,వాచ మద్దతు ఇస్తున్నానని చెప్పారు. రైతన్నల విజయమే తన మొదటి ప్రాధాన్యమని.. నిరసనలు చేస్తున్న రైతులు తనను ఆహ్వానిస్తే వారి వద్దకు చెప్పులు లేకుండా వారి వద్దకు వెళతానని వ్యాఖ్యానించారు. శుక్రవారం పీసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి మాట్లాడుతూ..‘‘ కిషన్ మోర్చా పెద్దలు.. మీరు దాహంతో బావి వైపు అడుగులు వేస్తున్నారు. ఆ బావి మీ దప్పిక తీర్చదు. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు. -
రైతుల గెలుపే మొదటి ప్రాధాన్యత
చండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాల రద్దే లక్ష్యంగా నిరసనలు చేస్తున్న రైతన్నల విజయమే తన మొదటి ప్రాధాన్యమని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. నిరసనలు చేస్తున్న రైతులు తనను ఆహ్వానిస్తే వారి వద్దకు చెప్పులు లేకుండా వారి వద్దకు వెళతానని వ్యాఖ్యానించారు. ఏడాది నుంచి జరుగుతున్న రైతు నిరసనలు ఎంతో పవిత్రమైనవని అందువల్ల సంయుక్త కిసాన్ మోర్చా విజయం తనకు ముఖ్యమని పేర్కొన్నారు. శనివారం ఆయన చమ్‌కౌర్ సాహిబ్ వద్ద మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతన్నల కోసం ఏం చేయగలదో చెబుతామని అన్నారు. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న దిగుబడి ప్రస్తుత నిరసనలకు కారణమైందని అన్నారు. -
చేతులు కలిపారు
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్‌లో గత కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడ్డాయి. నేతలిద్దరు చేతులు కలిపి రాష్ట్ర సంక్షేమం కోసం కలిసి పనిచెయ్యాలని నిర్ణయించారు. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం అమరీందర్ హాజరయ్యారు. సిద్ధూకి ఆ పదవి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ గురువారం సిద్ధూ అమరీందర్‌కి ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలో మీరే పెద్ద వారని పేర్కొన్నారు. దీంతో అమరీందర్ వెనక్కి తగ్గారు. అందరితో కలిసి పనిచేస్తా : సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇప్పడు ఐక్యంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నెగ్గేలా పని చేస్తామని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతన్నలకు అండగా ఉంటామన్నారు. ‘‘నాకు ఇగో లేదు. నేను పార్టీ కార్యకర్తల భుజంతో భుజం కలిపి పని చేస్తాను. నా కంటే వయసులో చిన్నవారిని ప్రేమిస్తాను. పెద్దవారిని గౌరవిస్తాను. పంజాబ్ గెలుస్తుంది, పంజాబీలు గెలుస్తారు’’అంటూ గట్టిగా నినదించారు. తననెవరైతే వ్యతిరేకించారో వారే తాను మెరుగ్గా పని చేయడానికి సహకరిస్తారని పేర్కొన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ తామిద్దరం రాష్ట్ర సంక్షేమం కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. సర్, ఎలా ఉన్నారు ? అంతకు ముందు పంజాబ్ భవన్లో సీఎం అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ఈ సమయంలో సీఎం దగ్గరగా వచ్చిన సిద్ధూ నమస్కరిస్తూ ఎలా ఉన్నారు సర్ అని పలకరించారు. వారిద్దరూ పక్కపక్కనే సీట్లలో కూర్చున్నారు. ఆ తర్వాత సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా ఇద్దరూ పక్క పక్క సీట్లలోనే కూర్చున్నారు. నాలుగు నెలల తర్వాత సిద్ధూ, సీఎం అమరీందర్ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ రెండు కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్ పాల్గొన్నారు. #WATCH: Newly appointed Punjab Congress president Navjot Singh Sidhu mimics a batting style as he proceeds to address the gathering at Punjab Congress Bhawan in Chandigarh. (Source: Punjab Congress Facebook page) pic.twitter.com/ZvfXlOBOqi — ANI (@ANI) July 23, 2021 -
సిద్ధూ బాధ్యతల స్వీకారానికి సీఎం అమరీందర్
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా హాజరుకానున్నారు. సిద్దూతోపాటు రాష్ట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇటీవల నియమితులైన కుల్జీత్ సింగ్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్ గురువారం మొహాలీలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి అమరీందర్‌ను ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేల తరఫున తమ ఆహ్వానానికి సీఎం అంగీకరించారని చెప్పారు. సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవు తారని వెల్లడించారు. ఇలా ఉండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం అమరీందర్ ఆహ్వానించారని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ట్విట్టర్లో పేర్కొన్నా రు. ఉదయం 10 గంటలకు పంజాబ్ భవన్లో టీ పార్టీ ఉంటుందనీ, అనంతరం అందరూ కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్లో జరిగే కొత్త పీసీసీ బృందం బాధ్యతల స్వీకార కార్య క్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. -
ఈనెల 23న పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న సిద్దూ
చంఢీగడ్: పంజాబ్ నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 23న పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్ రావత్ సహా పలువురు ప్రముఖలకు ఆయన ఆహ్వానం పంపారు. ఇదిలా ఉంటే, సీఎం అమరీందర్‌పై సిద్దూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, అంతవరకు సిద్దును సీఎం కలిసే అవకాశమే లేదని ప్రభుత్వ మీడియా సలహాదారుడు రవీన్ తుక్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దూ కోసం అమరీందర్ సింగ్ ఎలాంటి సమయాన్ని కేటాయించలేదనినాయన అన్నారు. మరోవైపు సిద్దూ ఇవాళ 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అమృత్‌సర్‌లోని తన నివాసంలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి స్వర్ణ దేవాలయంతో పాటు పలు ఆథ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. -
ఒంటరైన సీఎం: 62 మంది ఎమ్మెల్యేలకు సిద్ధూ విందు
ఛండీగఢ్: పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా బుధవారం అల్పాహార విందు ఏర్పాటుచేశాడు. ఈ విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే ఈ అల్పాహార విందుకు కొందరు అనివార్య కారణాలతో రాలేనట్లు తెలుస్తున్నా వారంతా ముఖ్యమంత్రి వర్గానికి చెందిన వారు. తాజా పరిణామంతో సీఎం అమరీందర్ సింగ్ ఒంటరైనట్లు తెలుస్తోంది. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 62 మంది హాజరు కావడంతో సీఎం బలం తగ్గినట్టే. ఈ సమావేశం అనంతరం ‘గాలిలో మార్పులు’ అంటూ సిద్ధూ ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వద్దని వారిస్తున్నా సిద్దూకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అధిష్టానం అప్పగించడంతో సీఎం అమరీందర్ సింగ్ అసహనంతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్‌ను కలవలేదు. సిద్ధూ క్షమాపణ కోరితేనే తనను కలిసేందుకు అవకాశం ఇస్తానని సీఎం వర్గీయులు చెబుతున్నారు. దీనికి సిద్ధూ ససేమిరా అంటున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. పార్టీ అధ్యక్షుడు అల్పాహార విందు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కాదని వెళ్లారు. ఆ విందుతో సిద్దూ వేరే కుంపటి పెట్టినట్టుగా మారింది. కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో అధిష్టానం ఆశీర్వాదం ఉన్న సిద్ధూకు పార్టీ ఎమ్మెల్యేలంతా జై కొట్టారు. సిద్దూ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం కాబోతోంది. ఈ పరిణామంతో పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ తనను పట్టించుకోకపోవడంపై గుస్సాగా ఉన్నారు. అధిష్టానం పట్టించుకోకపోవడం.. వయసు మీదపడడం వంటి సమస్యలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కాలం అయిపోయేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఫలితాలు ఎలా ఉన్నా ఆయన రాజకీయ సన్యాసం చేసే అవకాశాలు ఉన్నాయి. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్‌లో కొన్ని నెలల్లోనే ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లో బలాబలాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ 80, ఆమ్ ఆద్మీ పార్టీ 16, శిరోమణి అకాలీదల్ 14, బీజేపీ 2, ఎల్ఐపీ 2 ఉండగా.. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోసారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. రైతుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా ఉండడం కలిసొచ్చే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదల్ కాంగ్రెస్‌కు గట్టిపోటీని ఇచ్చేలా ఉన్నాయి. Winds of Change - Of the People By the People For the People | Chandigarh to Amritsar | 20 July 2021 pic.twitter.com/CRBQLqMJk2 — Navjot Singh Sidhu (@sherryontopp) July 21, 2021 -
బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసిన సిద్దూ
-
‘బహిరంగ క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని సీఎం కలవరు’
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. కాంగ్రెస్ అధిష్టానం నవజోత్ సింగ్ సిద్ధూకి పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సిద్ధూ తనకు క్షమాపణలు చెప్పే వరకు తనను కలిసేది లేదని ఇంతకుముందే అమరీందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థుక్రాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘నవజోత్ సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు అనే వార్తలు అవాస్తవం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు లేదు. నవజోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు అమరీందర్ సింగ్ సిద్ధూని కలవరు.. అతడికి సమయం ఇవ్వరు’’ అని స్పష్టం చేశారు. మరోవసై పంజాబ్ మినిస్టర్ బ్రహ్మ్ మోహింద్రా కూడా సిద్ధూని కలవడానికి ఇష్టపడలేదు. ఈ మేరకు ఆయన ‘‘సిద్ధూని పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను. కానీ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసి.. వారిద్దరి మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకునే వారికి నేను సిద్ధూని కలను’’ అని ప్రకటించారు. -
Navjot Singh Sidhu: నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది
చండీగఢ్: తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని పంజాబ్ కాంగ్రెస్ నూతన చీఫ్, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. సిద్ధూ, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ఆయన్ను ఆదివారం నియమించిన విషయం తెలిసిందే. సోమవారం సిద్ధూ చండీగఢ్ చేరుకుని పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి, కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి, రాహుల్, ప్రియాంకలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రయాణం మొదలైంది. విధేయత కలిగిన కార్యకర్తగా ‘జీతేగా పంజాబ్’మిషన్ సాకారానికి పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితోనూ కలిసి పనిచేస్తా. పంజాబ్ మోడల్, అధిష్టానం సూచించిన 18 అంశాల ఎజెండాతో ప్రజల అధికారాన్ని తిరిగి ప్రజలకే అప్పగిస్తా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పాటియాలాలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకుని మొహాలీలోని ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ నగ్రా నివాసానికి వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ జాకఢ్, మంత్రులు రజియా సుల్తానా, తృప్త్ రజీందర్ సింగ్, మాజీ సీఎం రజీందర్ కౌర్ నివాసాలకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లో కాంగ్రెస్ శ్రేణులు, సిద్దూ మద్దతుదారులు స్వీట్లు పంచుకున్నారు. ఇలా ఉండగా, సీఎం అమరీందర్ తీవ్ర వ్యతిరేకత నడుమ సిద్ధూను పీసీపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సిద్ధూ క్షమాపణ చెప్పే వరకు అతనితో సమావేశమయ్యేది లేదని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. సిద్దూ నియామకంపై ఆయన వర్గం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోమవారం సీఎం అమరీందర్ తన అధికార నివాసంలో పార్టీ నేతలు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. -
విందుకు అందని పిలుపు.. వివాదానికి ఆజ్యం పోసిన ప్రమోషన్
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందని భావిస్తున్న సమయంలో ఓ ‘విందు’ ఆ సంక్షోభాన్ని మరింత పెంచేలా ఆజ్యం పోస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒక వర్గంగా, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించి పదోన్నతి కల్పించింది. దీంతో వివాదం సమసిపోయిందని అనుకుంటుండగా తాజాగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేయబోతున్న ఓ విందు విబేధాలు ఇంకా తొలగిపోలేదని స్పష్టం చేస్తోంది. జూలై 21వ తేదీన పంచకులలో సీఎం అమరీందర్ సింగ్ విందు ఏర్పాటుచేశారు. భోజనానికి పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూకు మాత్రం ఆహ్వానం పంపలేదు. సిద్ధూను అధ్యక్షుడిగా ప్రకటించిన మరుసటి రోజే సీఎం అమరీందర్ ఈ విందు ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. తాజాగా పార్టీ నియమించిన పీసీసీ కార్యవర్గంలో సీఎం అమరీందర్ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పైగా ఇంకా సిద్దూపై కోపంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం తన బలం ప్రదర్శించేందుకు ఈ విందు ఏర్పాటు చేశారని పంజాబ్‌లో చర్చ సాగుతోంది. తనకు క్షమాపణలు చెప్పేంత వరకు సిద్ధూను కలిసే ప్రసక్తే లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సీఎం అమరీందర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య విబేధాలు పార్టీకి ప్రతికూలంగా మారాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నా కాంగ్రెస్‌లో విబేధాలు సద్దుమణగకపోవడంతో పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని రెండో స్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో సిద్ధూ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నెలకొని ఉన్న సమయంలో పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పీసీసీ చీఫ్‌గా సిద్దూని నియమించిన సోనియా.. మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సంగత్ సింగ్ గిల్జియాన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయెల్, కుల్జీత్ సింగ్ నాగ్రాలను వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. ఒకే పార్టీలో కీలక నేతలుగా ఉన్న అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ బహిరంగంగానే పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ కూడా వారిద్దరి మద్దతుదారులతో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. వారిద్దరి మధ్య సయోధ్య కోసం పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నించింది. ‘పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తక్షణమే అమల్లోకి వచ్చేలా, నవజ్యోత్ సింగ్ సిద్ధూని నియమిస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న సునీల్ జాఖడ్ సేవలను ఈ ప్రకటనలో పార్టీ కొనియాడింది. 2017లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత క్రమంగా, పార్టీలో పట్టు సాధించారు. పీసీసీ చీఫ్ నియామకం విషయంలో సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకతను కాదని, సిద్ధూ వైపే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ నాయకత్వంతో పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పనిచేస్తాయని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సిద్ధూ ప్రసంగ శైలి ప్రజలను ఆకట్టుకుంటుందని, ఎన్నికల ప్రచారంలో సిద్ధూ సేవలు అవసరమని సోనియాగాంధీ తదితర సీనియర్ నాయకులు విశ్వసించారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా సిద్ధూ వైపే మొగ్గు చూపారని వెల్లడించాయి. అమరిందర్ సింగ్‌తో సయోధ్య, ఒకవేళ అది కుదరని పక్షంలో ఆయన వర్గీయుల వ్యతిరేకతను తట్టుకుని పార్టీని ఏకం చేయడం, పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల కోసం సిద్ధం చేయడం నూతనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముందున్న ప్రధాన సవాళ్లు. తనపై చేసిన ఆరోపణలు తప్పు అని అంగీకరిస్తూ, బహిరం గంగా క్షమాపణలు కోరితే తప్ప సిద్ధూని కలిసే ప్రసక్తే లేదని ఇటీవల ఢిల్లీలో పార్టీ చీఫ్ సోనియాతో సీఎం అమరీందర్ చెప్పారని సమాచారం. సీనియర్ నేతల మధ్య విబేధాలు తొలగనట్లయితే, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అమరీందర్ ప్రభుత్వంలో మంత్రిగా సిద్ధూ ఉన్నప్పటి నుంచే వారి మధ్య విబేధాలు ఉన్నాయి. అమరీందర్ వ్యతిరేకతను పట్టించుకోకుండా, అయన మంత్రివర్గంలో ఉన్న సిద్ధూ పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం, పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాను కౌగిలించుకోవడం.. మొదలైనవి ఇరువురి మధ్య విబేధాలు తీవ్రమవడానికి కారణమయ్యాయి. -
పంజాబ్ రాజకీయ సంక్షోభం కొలిక్కి
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య సయోధ్య కుదరకపోయినప్పటికీ అమరీందర్ ఒక మెట్టు దిగారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా తమందరికీ ఆమోదయోగ్యమేనని అమరీందర్ శనివారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇష్టానికి వ్యతిరేకంగా నవజోత్ సింగ్ సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ హరీశ్ రావత్ చండీగఢ్ వెళ్లారు. రావత్‌తో సమావేశానంతరం అమరీందర్ సింగ్ సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనంటూ ప్రకటన విడుదల చేశారు. అమరీందర్ వ్యక్తం చేసిన కొన్ని అంశాల్ని సోనియా దృష్టికి తీసుకువెళతానని రావత్ హామీ ఇచ్చినట్టు సీఎం సన్నిహితులు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు, విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని కలవబోనని అమరీందర్ రావత్‌కి చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వరస సమావేశాలతో సిద్ధూ బిజీ సిద్ధూని పంజాబ్ పీసీసీ అ«ధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన రోజంతా బిజీ బిజీగా గడిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్, పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం అమరీందర్‌కు విధేయులైన నాయకుల్ని కలుసుకొని మంతనాలు సాగించారు. కెప్టెన్ సాబ్ కీలక ప్రకటన చేశారు : రావత్ అధినేత్రి సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ముఖ్యమంత్రి అమరీందర్ çకీలకమైన ప్రకటన చేశారని హరీష్ రావత్ అన్నారు. బయట జరుగుతున్న చర్చల్లో చాలా అంశాలు అవాస్తవాలని తనకు అర్థమైందని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో సోనియా నిర్ణయాన్ని తాను కూడా పూర్తిగా గౌరవిస్తానంటూ ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్ హైకమాండ్ రాంగ్ సిగ్నల్?
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తెరదించేందుకు అధిష్టానం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులోభాగంగా ఎన్నికలకు కెప్టెన్ సారథ్యం వహిస్తారని, సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ గురువారం ఇచ్చిన స్నిగల్ పరిస్థితిని చక్కదిద్దకపోగా, మరింత ఆందోళనలకు కారణమైంది. కెప్టెన్ అమరీందర్‌పై సిద్ధూ అసంతృప్తి, తిరుగుబాటు శైలిని చూసి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకున్న హైకమాండ్ ప్లాన్ క్యాంపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. సిద్ధూ, కెప్టెన్ తమకు అనుకూలంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యులతో క్యాంపు సమావేశాలు జరిపారు. నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలో సోనియాగాంధీని కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధూ అంతకుముందు జూన్ 30 న ఢిల్లీకి వచ్చి ప్రియాంకా గాంధీని కలిశారు. అదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం పార్టీ అధినేత్రితో భేటీ అయ్యారు. సోనియాతో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ హరీష్ రావత్ పాల్గొన్నారు. కాగా సిద్ధూ సోనియాగాంధీని కలిసే ముందే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ పార్టీ అధినేత్రికి ఒక లేఖ పంపించారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కెప్టెన్, సిద్ధూలు కలిసి పనిచేయగల శాంతి సూత్రాన్ని కేంద్ర నాయకత్వం రూపొందిస్తోందని రావత్ అభిప్రాయపడ్డారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన రావత్ ‘నేను పంజాబ్‌లో పార్టీకి సంబంధించి నివేదికను సమర్పించడానికి పార్టీ అ«ధినేత్రిని కలిశాను. పంజాబ్ కాంగ్రెస్ విషయంలో పార్టీ అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయం గురించి నాకు సమాచారం వచ్చిన వెంటనే, మీ అందరికీ చెబుతాను’అని అన్నారు. అంతేగాక సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేస్తున్నారంటూ తను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. కాగా, పంజాబ్‌లో సిద్ధూ, ఆయన ప్రత్యర్థి శిబిరం మధ్య పోస్టర్ల యుద్ధం మొదలైంది. సిద్ధూ మద్దతుదారులు అమృత్సర్, లూధియానాతో సహా పంజాబ్‌లోని పలు చోట్ల వేసిన పోస్టర్లలో లూధియానాలో కొన్ని పోస్టర్లను చింపేశారు. పార్టీ తీసుకొనే కొన్ని నిర్ణయాలపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాలకు హరీష్ రావత్ తెరదించారు. ఈ విషయంలో కెప్టెన్‌కి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తామని రావత్ అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడైన ఎంపీ, సీనియర్ నేత మనీష్ తివారీ కూడా ఈ వివాదంలో తనదైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సామాజిక సమూహాల మధ్య సమతుల్యతను కాపాడటం ముఖ్యమని, సమానత్వం సామాజిక న్యాయానికి పునాది అని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో సిక్కులు 57.75 శాతం, హిందువులు 38.49 శాతం, దళితులు 31.94 శాతం ఉన్నారని తెలిపారు. లోక్‌సభ సభ్యుడు మనీష్ తివారీ తన ట్వీట్లో కాంగ్రెస్ పంజాబ్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్‌ను ట్యాగ్ చేశారు. దీంతో సిద్ధూకి చెక్ పెట్టేలా సీఎం అమరీందర్‌కు అనుకూలంగా తివారీ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. -
సయోధ్య సాధ్యమేనా..?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసమ్మతికి చెక్ పెడుతూ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహ రచన పూర్తి చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను హైకమాండ్ సిద్ధం చేసింది. అందులో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ పోరాడనున్నట్లు ఆయన గురువారం స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవజోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించవచ్చని హరీష్ రావత్ సూచించారు. గతంలో సిద్ధూ, అమరీందర్ సింగ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటల యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ పంజాబ్‌లో పర్యటించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి నివేదికను హైకమాండ్‌కు సమర్పించింది. అనంతరం ఇరువురు నాయకులు పార్టీ పెద్దలతో వేరువేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పోరాడనుండగా, అదే సమయంలో నవజోత్ సింగ్ సిద్ధూకు కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడం ఎంత అవసరమో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్ నాయకులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే నవజోత్‌సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు త్వరలో కీలక ప్రకటన జరగవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఫార్ములా సిద్ధం చేసిందని సమాచారం. ఒకవేళ నవజోత్‌సింగ్ సిద్ధూ పంజాబ్ పీసీసీ అధ్యక్షుడైతే, ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే యోచనలో ఉంది. అదే సమయంలో ఇటీవల నవజోత్ సింగ్ సిద్దూ చేసిన ట్వీట్ పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో అమరీందర్, సిద్ధూల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సిద్ధూని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా చేయడంవల్ల పరిస్థితి ఇప్పుడు చల్లబడినప్పటికీ, రాబోయే రోజుల్లో గొడవ మరింత ముదిరే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల తర్వాత సిద్ధూ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నందున అమరీందర్ విధేయులు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన కోరుకొనే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో తమ విధేయులకు ఎక్కువ టికెట్లు కోరుతూ ఎవరికి వారు పోటీపడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ పంజాబ్‌లో సిద్ధూకి ఉన్న ప్రజాదరణ కారణంగా ఆయనను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ ముందు నెలకొంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి రిస్క్ చేయదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం సిద్ధూపై దృష్టి సారించినందుకు వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని హైకమాండ్ యోచిస్తోంది. -
పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ..?
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో అంతర్గిత కుమ్మలాటపై కాంగ్రెస్ హైకమండ్ దృష్టి సారించింది. సీఎం అమరీందర్ సింగ్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత పంజాబ్ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ స్థానంలో సిద్దూను నియమించనున్నారు. మరో ఇద్దరు సీనియర్ నేతలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉంది. పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ హరీశ్ రావత్ బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిద్దుకు పంజాబ్ పార్టీ బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిద్దుకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
ఉచిత విద్యుత్తు..రోజంతా కరెంటు
చండీగఢ్: పంజాబ్‌లో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందివ్వాలని, రోజంతా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. పరిశ్రమలకు కూడా తక్కువ ధరకే కరెంటు సరఫరా చేయాలని ఆదివారం ట్విట్టర్లో కోరారు. ‘పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే 9వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. దీంతోపాటు, గృహ, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుతం ఒక్కో యూనిట్‌పై రూ.10–12వరకు విధిస్తున్న సర్ఛార్జిని రూ.3–5కు తగ్గించాలి’అని ట్వీట్ చేశారు. ఆప్ పంజాబ్‌లో అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా, అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేస్తామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో సిద్దూ ఈ మేరకు పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా డిమాండ్ చేయటం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానం సూచించిన 18 అంశాలతో కూడిన ప్రజానుకూల ఎజెండాను అమలు చేయాలన్నారు. జాతీయ విధానం ప్రకారం కొత్తగా విద్యుత్ కొనుగోలు ధరలను నిర్ణయిస్తూ పంజాబ్ శాసనసభ కొత్త చట్టాలను ఆమోదించాలని సూచించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పలు అంశాలపై విభేదిస్తూ వస్తున్న సిద్ధూ ఈ మేరకు ట్వీట్లు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
రాహుల్, ప్రియాంకతో భేటీ: సిద్ధూకు కొత్త బాధ్యతలు!
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే సచనలు కనిపిస్తున్నాయి. అసమ్మతి నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ‘ప్రియాంక గాంధీజీతో సుదీర్ఘ సమావేశం జరిగింది’అంటూ ట్విట్టర్లో సిద్ధూ వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధ బహిరంగంగానే తన అసమ్మతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పార్టీలో తన పాత్ర గురించి సిద్ధూ ప్రియాంకతో చర్చించినట్టుగా తెలుస్తోంది. సిద్ధకి త్వరలో కొత్త బాధ్యతలు కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సిద్ధూతో సమావేశమయ్యే అవకాశమే లేదని రాహుల్ మంగళవారం చెప్పారు. మరుసటి రోజే ప్రియాంక, రాహుల్‌లు సిద్ధూకి అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషం. చదవండి: ‘సిద్ధు’కు షాకిచ్చిన రాహుల్ గాంధీ! -
‘సిద్ధు’కు షాకిచ్చిన రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే క్రమంలో అధిష్టానం కొన్నిరోజులుగా నేతలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, పలువురు పంజాబ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, రాహుల్ తాజా వ్యాఖ్యలతో.. పార్టీ చీలికకు ముఖ్యకారణంగా భావిస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధుకు గట్టి షాక్ తగిలినట్లయింది. తాను ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని సిద్ధు చెప్పగా అలాంటిదేమీ ఉండబోదని.. రాహుల్ కుండబద్దలుకొట్టారు. కాగా మంగళవారం, జన్‌పథ్ 10లోని తన నివాసం నుంచి తన తల్లి, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి పయనమైన రాహుల్ గాంధీ ఏఎన్ఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘సిద్ధుతో సమావేశం ఉండదు’’ అని స్పష్టం చేశారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సంక్షోభాన్ని రూపుమాపేందుకు ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కాగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అర్జున్ ప్రతాప్‌సింగ్ బజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అమరీందర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలతో సీఎం, సిద్ధు వర్గం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్, సీనియర్ నేత జేపీ అగర్వాల్‌లతో కూడిన ఈ కమిటీ రంగంలోకి దిగింది. ఈ ప్యానెల్ ఎదుట హాజరైన సీఎం అమరీందర్ సింగ్ గట్టిగానే తన వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిద్ధుతో మీటింగ్ ఉండబోదంటూ రాహుల్ వ్యాఖ్యానించడం ఆయన వర్గానికి మింగుడుపడటం లేదు. చదవండి: సీఎం VS సిద్ధూ.. అసలేం జరుగుతోంది? -
సీఎం VS సిద్ధూ
సంకీర్ణంలో భాగస్వామిగా కాకుండా సొంతంగా అధికారంలో ఉన్నది మూడంటే మూడు రాష్ట్రాల్లో.. అన్ని రాష్ట్రాల్లోనూ ముఠా తగాదాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో సమస్యలు చక్కదిద్దలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. మరీ ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్‌లో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరుకోవడంతో సీన్ హస్తినకి మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో ఢీ అంటే ఢీ అంటూ వస్తున్న మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ గళానికి మరికొందరు నేతలు ఇప్పుడు జత కలిశారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అర్జున్ ప్రతాప్‌సింగ్ బజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద (వారి తాతలు వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారని) ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అమరీందర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సునీల్ ఝాకర్, రాష్ట్ర మంత్రి సుఖ్జీందర్ రాంధ్వా సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కెప్టెన్ వ్యవహారశైలి ఇలాగే ఉంటే రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేశారు. వారిద్దరితో మంత్రులు రాజీందర్ సింగ్ బాజ్వా, రజియా సుల్తానా, చరణ్‌జిత్ సింగ్, ఇంకొందరు ఎమ్మెల్యేలు గళం కలిపారు. డిప్యూటీ సీఎం లేదంటే పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నవజోత్ సింగ్ సిద్ధూ సీఎంపై నేరుగానే మాటల తూటాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా, మీడి యా ఇంటర్వ్యూల్లోనూ అమరీందర్‌ను అబద్ధాల కోరుగా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ తలనొప్పుల్ని పరిష్కరిం చడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక కమిటీ వేసి రాష్ట్రంలో పరిస్థితుల్ని రెండు వారాల్లో చక్కదిద్దాలని డెడ్‌లైన్ విధించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్, సీనియర్ నేత జేపీ అగర్వాల్‌లతో కూడిన కమిటీ ఎదుట హాజరైన సీఎం అమరీందర్ సింగ్ తన వాదనని సమర్థంగా వినిపించినట్టు తెలుస్తోంది. సిద్ధూ వర్గం చేసిన ప్రతీ ఫిర్యాదుకి ఆయన కౌంటర్లు ఇచ్చినట్టుగా సీఎం వర్గం చెబుతోంది. సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి మాత్రం ఆయన ససేమిరా అంటున్నారు. మరోవై పు రాహుల్ గాంధీని కూడా పలువురు నేతలు కలుసుకొని రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించారు. రాజీ ఫార్ములా ? సీఎంకి, సిద్ధూకి మధ్య రాజీ ఫార్ములా కుదిర్చే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ వివిధ సర్వేల్లో అట్టడుగు స్థానంలో ఉండడం ఆయనకు మైనస్‌గా మారితే, నవజోత్ సింగ్ సిద్ధూ బహిరంగంగానే సీఎంను తూలనాడడం ఆయనకు మైనస్‌గా మారింది. సిద్ధూ వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతానికి సిద్ధూ çపక్షాన ఉన్నప్పటికీ ఎంతవరకు పార్టీలో ఆయనను కాపాడగలరన్న సందేహాలైతే ఉన్నాయి. అమరీందర్ ఢిల్లీకి వచ్చినప్పటికీ సోనియా, రాహుల్‌ల అపాయింట్మెంట్ ఆయనకు దొరకలేదని చెబుతున్నారు. సిద్ధూ లేవనెత్తిన పలు అంశాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంను ఆదేశించింది. తద్వారా సిద్ధూని బుజ్జగించినట్లు అవుతుందని, ప్రజల కోసం మాట్లాడానని, సమస్యలు పరిష్కరించగలిగానని ఆయన చెప్పుకోవడానికి వీలుంటుందని భావిస్తోంది. ఇప్పటికే సిద్ధూని ఢిల్లీకి రమ్మని పిలవడంతో సోనియాగాంధీ వీరి ఇరువురి మధ్య సయోధ్య కుదురుస్తారని, ఎన్నికల వేళ ఎలాంటి మార్పులు చేపట్టినా మొదటికే మోసం వస్తుందని అధిష్టానం భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎంపై సిద్ధూ వర్గం చేస్తున్న ఫిర్యాదులు ► కెప్టెన్ అమరీందర్ నేతృత్వంలో వచ్చే ఏడాది ఎన్నికలకి వెళితే కాంగ్రెస్ గెలిచే చాన్స్ లేదు ► అమరీందర్ సింగ్ అకాలీదళ్‌తో కలిసి రాష్ట్రంలో మాదక ద్రవ్య మాఫియాను పెంచిపోషిస్తున్నారు ► 2015లో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథసాహిబ్ను అపవిత్రం చేసిన ఘటనల్లో, కాల్పుల్లో ఇద్దరు యువకులు చనిపోవడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో అమరీందర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ► ఇసుక, రవాణా మాఫియాలతో కుమ్మక్కై కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణాలు ► నిరుపేదల సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఫల్యం ► ఉద్యోగులు, రైతులు, దళితులు, ఆశ వర్కర్లు సీఎంకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు. అమరీందర్‌పై సిద్ధూ సిక్సర్లు ‘‘ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతారు. నేను ఆప్‌తో చేతులు కలుపుతున్నానని అంటున్నారు. దానికి ఆధారాలున్నా యా? ఏం మాట్లాడుతున్నారో ఆయనకేమైనా అర్థమవుతోందా? ఒక ముఖ్యమంత్రిగా అస లేం చేశారు? రిపోర్టు కార్డు ఇవ్వండి. అమరీం దరే అకాలీదళ్ చేతుల్లోకి వెళ్లిపోయారు’’ ‘‘మీకు కావాలనుకుంటే ఎన్నికల ప్రచారానికి తీసుకువెళ్లి గెలిచిన తర్వాత నన్ను తిరిగి అల్మారాలో పెట్టేయడానికి నేనేమీ షో పీస్‌ని కాను. అందుకే మీ పని తీరుని నేను గమనిస్తూనే ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. ఇది నేను భరించలేను’’ ‘‘ప్రశాంత్ కిశోర్ నన్ను 60 సార్లు కలుసుకున్నాకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. గత ఎన్నికల్లో నేను 56 స్థానాల్లో ప్రచారం చేస్తే 54 సీట్లలో పార్టీ గెలిచింది. అప్పట్నుంచి నాకున్నది ఒక్కటే ఎజెండా. పంజాబ్ ప్రజల ఎజెండా. ఈ విషయాన్ని అప్పట్లోనే నేను స్పష్టం చేశాను. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాను’’ – నేషనల్ డెస్క్, సాక్షి -
BKU: ఢిల్లీ సరిహద్దులకు చేరుతున్న రైతులు
చండీగఢ్: ఈ నెల 26న రైతులు తలపెట్టిన బ్లాక్‌డే నిరసన సందర్భంగా పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు ఆరు నెలలకు చేరిన సందర్భంగా రైతు సంఘాలు ఈ నెల 26న దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నారు. దీనికి హాజరు కావాల్సిందిగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్ నుంచి భారీ స్థాయిలో రైతులు ఢిల్లీ సరిహద్దులకు వస్తున్నారని భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రాహణ్) సీనియర్ నేత షింగారా సింగ్ సోమవారం చెప్పారు. యువకులు, పెద్దలు అంతా కలసి తమ వాహనాలతో తిక్రి, సింఘు సరిహద్దులకు చేరుకుంటున్నారు. పంజాబ్‌లోని సంగ్రూర్, పాటియాలా, మనసా, బతిందా, మోగ, గుర్దాస్పుర్, ఫరిద్కోట్ జిల్లాల నంచి రైతులు వస్తున్నట్లు షింగారా తెలిపారు. రైతులు చేపట్టనున్న నిరసనకు కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్దు మద్దతు ప్రకటించారు. నిరసన రోజున వారికి సంఘీభావంగా తన ఇంటిపై నల్లజెండా ఎగురవేస్తానని చెప్పారు. (చదవండి: CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!) -
పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా మాజీ క్రికెటర్!
న్యూఢిల్లీ : 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తులు వేస్తోంది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీ క్రికెటర్, ఆ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య ఉన్న వివాదాలను సద్దుమణిగించే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వజూపుతోంది. బుధవారం సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. కాగా, సిద్ధూకు ముఖ్యమంత్రికి మధ్య 2019, మే నెలలో వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. 2019 లోక్ సభ ఎన్నికల సందర్బంగా సిద్ధూ పని తీరు బాగాలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆయన తన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నా కెప్టెన్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ.. కెప్టెన్( అమరీందర్ సింగ్)కు కెప్టెన్’’ అని వ్యాఖ్యానించారు. ప్యాన్ ఇండియా సెలెబ్రిటీ అయిన సిద్ధూను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. 2022లో జరగబోయే ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్‌గా ఆయనను రంగంలోకి దించే ఆలోచన చేస్తోంది. చదవండి : మేము పోటీ చెయ్యం.. అభ్యర్థులకు ప్రచారం చేస్తాం -
అగ్రనేతల జాబితాలో సిద్ధూ, సిన్హా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి ఫిబ్రవరి 8న జరిగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వాయ్‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. అగ్ర నేతలు పాల్గొనే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్, అమరీందర్ సింగ్‌లకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చోటు లభించిడం విశేషం. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 66స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా రోమేష్ సబర్వాల్ తలపడనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలకు జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్ -
'ఆ సమయంలో సిద్ధూ ఎక్కడికి పారిపోయారు'
న్యూఢిల్లీ : పాకిస్తాన్లో నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజేపి నాయకురాలు మీనాక్షి లెఖీ తెలిపారు. అయితే దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎక్కడికి పారిపోయారో తనకు తెలియదని, ఎవరైనా కనిపెట్టాలంటూ చురకలంటించారు. గురుద్వారాపై జరిగిన దాడిపై శనివారం బిజెపి జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లేఖీ మాట్లాడుతూ .. పాకిస్తాన్‌లోని మతపరమైన ప్రదేశాలలో నిరంతరం హింస చోటుచేసుకుంటుందని వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా బలవంత మత మార్పిడులు, అత్యాచారాలతో మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. పాకిస్తాన్లో యువతులను బలవంతంగా ఎత్తుకొచ్చి వారికి మతమార్పిడిలు చేసి ముస్లిం అబ్బాయిలకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి అక్కడ వేల సంఖ్యలో జరుగుతున్న పోలీసులు, ప్రభుత్వం అరికట్టాల్సింది పోయి వారికి వత్తాసు పలకడం దారుణమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అక్కడ హింస నిరంతరాయంగా కొనసాగుతుండడంతో మైనారిటీలు భారతదేశంలోకి బలవంతంగా చొరబడుతున్నారు. దీనివల్ల దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడం సరైందేనని తాను భావిస్తున్నట్లు తెలిపారు. సీఏఏ అవసరం దేశంలో ఎంత ఉందనేది పాకిస్తాన్లో జరిగిన చర్యలే నొక్కిచెబుతున్నాయని వివరించారు. సిక్కులకు ఎంతో పవిత్రంగా భావించే నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడులు కాబా, జెరూసలేంపై జరిగిన దాడులతో సమానం అని ఆమె అభివర్ణించారు.ఈ దాడి జరిగిన సమయంలో సిద్దూ ఎక్కడికి పారిపోయాడో తనకు తెలియదని పేర్కొన్నారు. అతను ఎక్కడున్నాడనేది ఎవరైనా కనిపెట్టాలని, ఒకవేళ ఈ దాడి జరిగిన తర్వాత ఐఎస్ఐ చీఫ్ ను ఆలింగనం చేసుకుంటాడేమోనన్న విషయాన్ని కాంగ్రెస్ పరిశీలించాల్సిన అవసరం ఉందని మీనాక్షి లేఖీ అభిప్రాయపడ్డారు. -
ఇప్పుడు కూడా ఆయనను కౌగిలించుకుంటారా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో సిక్కులపై రాళ్ల దాడిని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లోని నంకానా గురుద్వారా సాహిబ్ వద్ద శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. సిక్కు యువతి జగ్జీత్కౌర్ను అపహరించి, మతమార్పిడికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయంపై స్పందించిన మీనాక్షి లేఖి.. కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. ‘ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా నవజ్యోత్ సింగ్ ఐఎస్ఐ చీఫ్‌ను ఆలింగనం చేసుకుంటారా? ఈ విషయం గురించి కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు. సిద్ధు అన్నయ్య ఎక్కడికి పారిపోయారో తెలియడం లేదు’ అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా గతేడాది పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సమయంలో నవజ్యోత్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశపు ఆర్మీ చీఫ్‌ను ఎలా కౌగిలించుకుంటారంటూ సిద్ధుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాయావతి సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జన్మస్థానమైన నంకానా సాహిబ్ వద్ద సిక్కులపై రాళ్ల దాడిని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు...‘ గురునానక్ దేవ్ జీ జన్మస్థానం వద్ద శుక్రవారం జరిగిన మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ఘటనల గురించి మన దేశం సహజంగానే స్పందిస్తుంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని ట్విటర్ వేదికగా విఙ్ఞప్తి చేశారు. -
మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్
-
మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే పాక్‌లోని కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవానికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. భారత్ నుంచి బయల్దేరిని యాత్రికుల బృందం కోసం కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అక్కడి నాయకులు ఎదురు చూశారు. ఈ సందర్బంగా ‘మన సిద్దూ ఎక్కడా’అంటూ ఇమ్రాన్ ఆసక్తిగా అక్కడ ఉన్నవారిని అడిగారు. సిద్దూను మన సిద్దూ అంటూ ఇమ్రాన్ సంబోధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. క్రికెటర్లైన ఇమ్రాన్, సిద్దూలు రాజకీయ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్లో మాదిరిగానే రాజకీయల్లోకి వచ్చాక కూడా వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఇక నిన్నటి కార్యక్రమంలో సిద్దూ పాక్ ప్రధానిపై ప్రశంసలు కురిపించాడు. కర్తార్‌పూర్ కారిడర్ నిర్మాణానికి సహకరించిన ఇమ్రాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే పాక్ సెనేటర్ కూడా సిద్దూపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో సిద్దూకు మంచి సత్ససంబంధాలు ఉన్నాయని, సిద్దూ పాకిస్తాన్‌కు మంచి స్నేహితుడని తెలిపారు. అంతేకాకుండా సిద్దూ పాక్‌పై టెస్టు సెంచరీ సాధించలేదని గుర్తుచేస్తూ.. పాక్‌పై, ఇమ్రాన్‌పై అతడికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించాడు. ఇక సిద్దూ 9 టెస్టు సెంచరీలు సాధించాడు. అయితే 1989-90లో పాక్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సిద్దూ సభ్యుడు. అప్పుడు పాక్ జట్టుకు ఇమ్రాన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో 7 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన సిద్దూ ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. అత్యధికంగా 97 పరుగులు చేశాడు. ఇక పాక్ సెనేటర్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
సిద్ధూ పాక్ మిత్రుడు.. అందుకే
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ : రాజకీయ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిద్దూను పాక్ ముఖ్య అతిథిగా పిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇమ్రాన్‌పై సిద్దూ ప్రశంసల జల్లు కురిపించాడు. కర్తార్‌పూర్ కారిడర్ నిర్మాణానికి సహకరించిన ఇమ్రాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్దూ గురించి పాకిస్తాన్ సెనేట్ ఫైజల్ జావెద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాక్ స్నేహితుడు నవజ్యోత్‌సింగ్ సిద్దూ 9 టెస్టు సెంచరీలు సాధించాడు. కానీ పాకిస్తాన్‌పై మాత్రం సాధించలేదు. ఇంతకంటే ఏం రుజువు కావాలి.. పాకిస్తాన్‌పై ముఖ్యంగా ప్రధాని ఇమ్రాన్‌పై సిద్దూకు ఎంత ప్రేమ ఉందో తెలపడానికి’అంటూ ఫైజల్ వ్యాఖ్యానించాడు. ఇక 1989-90లో పాక్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సిద్దూ సభ్యుడు. ఆ పర్యటనలో పాక్ జట్టుకు ఇమ్రాన్ సారథ్యం వహించాడు. అయితే ఈ పర్యటనలో ఏడు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన సిద్దూ సెంచరీ సాధించలేకపోయాడు. అత్యధికంగా 97 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే సిద్దూ పాక్‌పై సెంచరీ చేయలేదనే విషయాన్ని పాక్ సెనేటర్ గుర్తుచేశాడు. ప్రస్తుతం సిద్దూపై పాక్ సెనేటర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్ కారిడార్ శనివారం ప్రారంభమైంది. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ కారిడర్‌ను ప్రారంభించారు. ఈ రోజు 500 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బృందం కర్తార్‌పూర్ వెళ్లింది. ఈ బృందంలో సిద్దూ కూడా సభ్యుడే. -
సిద్ధూకు పాక్ వీసా మంజూరు
ఇస్లామాబాద్ : ఈనెల 9న కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూకు పాకిస్తాన్ ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ సిద్ధూకు పాకిస్తాన్ హై కమిషన్ వీసా మంజూరు చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రం అనుమతి కోసం సిద్ధూ ఇంకా వేచిచూస్తున్నారు. వీసాతో వాఘా వద్ద సిద్ధూ సరిహద్దు దాటే అవకాశం ఉన్నా పంజాబ్ చట్ట సభ సభ్యుడిగా ఎన్నికైనందున పాక్ ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి క్లియరెన్స్ లభించాల్సి ఉంది. కర్తార్‌పూర్ ఈవెంట్లో పాల్గొనేందుకు అనుమతించాలని కోరుతూ సిద్ధూ ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖరాశారు. (చదవండి: కర్తార్‌పూర్ వీడియోలో ఖలిస్తాన్ నేతలు?) -
మళ్లీ బీజేపీలోకి వెళ్లరు.. అవన్నీ వదంతులు
చండీగఢ్: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ బీజేపీలో చేరతారని వస్తున్న వార్తలను ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ తోసిపుచ్చారు. ఇవి వదంతులు మాత్రమే అంటూ కొట్టిపారేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఇక నుంచి సామాజిక కార్యకర్తను మాత్రమే అంటూ కౌర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చిన కౌర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన శాఖను మార్చడంతో జూలైలో మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే అమరీందర్‌తో తమకు ఎటువంటి విభేదాలు లేవని కౌర్ తెలిపారు. కాంగ్రెస్‌లో ఉన్నవారే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి గ్రూపులు పెట్టలేదని, తన భర్తకు ప్రచార యావ లేదన్నారు. అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సిద్ధూ సేవలు కొనసాగిస్తారని చెప్పారు. ఉప ఎన్నికల్లో సిద్ధూ ఎందుకు ప్రచారం చేయలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తాను మళ్లీ బీజేపీకి వెళతానని వస్తున్న వార్తలపై నవజ్యోత్ సిద్ధూ ఇప్పటివరకు స్పందించలేదు. -
సిద్ధూకి కీలక బాధ్యతలు!
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూకి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు సమాచారం. సిద్ధూ ఇటీవల పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో సిద్ధూ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూకి ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లైంది. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకులు కూడా ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో సిద్ధూకు ఢిల్లీ పగ్గాలు అప్పగించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సిద్ధూకి గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో కూడా సిద్ధూకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూని డీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అనంతరం సిద్ధూ డీపీసీసీ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో కొట్టిపాడేశారు. డీపీసీసీ అధ్యక్షుడిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ‘ డీపీసీసీ అధ్యక్షుడి పగ్గాలు సిద్దూ చేపట్టబోతున్నారనేది అవాస్తవం. ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’ అని చాకో పేర్కొన్నారు. -
సిద్ధూ రాజీనామాపై తుది నిర్ణయం నాదే..
సాక్షి, చండిఘడ్ : నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా లేఖ అందిందని, అయితే దాన్ని చదివాకే నిర్ణయం తీసుకుంటానని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో సఖ్యత కుదరక ప్రముఖ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ ఆదివారం మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధూ జులై 10న రాజీనామా లేఖను రాహుల్‌గాంధీకి సమర్పించారు. ఆదివారం తన రాజీనామాపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చివరిగా ముఖ్యమంత్రికి పంపారు. తన రాజీనామను చివరిగా ముఖ్యమంత్రికి పంపడంతోనే వీరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. సిద్ధూ రాజీనామాపై అమరీందర్‌సింగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని నేనే కాబట్టి తుది నిర్ణయం నాదేనని, ఆ లేఖను చదివాకే స్పందిస్తానన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌పార్టీ గెలిచినప్పటి నుంచి సిద్ధూ, అమరీందర్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు వచ్చాయి. రాజకీయ నాయకుడిగా మారిన ఈ మాజీ క్రికెటర్ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నాడు. కానీ చివరికి ముఖ్యమంత్రి పదవి కెప్టెన్‌కు వరించడంతో వీరి మధ్య చీలికలు మొదలయ్యాయి. అప్పటినుంచే ఉప్పు నిప్పులా ఉన్న వీరికి భారత్ పాక్‌ల మధ్య సిద్ధు వివాదాల తర్వాత మరింత దూరం పెరిగింది. తనకు కెప్టెన్ రాహుల్ గాంధీయేనని, తన కెప్టెన్(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్ అంటూ గత ఏడాది సిద్ధూ వ్యాఖ్యానించడం తీవ్ర విభేదాలకు ఆజ్యం పోసింది. ఈ ఘటనల మధ్యనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జూన్ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. -
కేబినెట్ నుంచి సిద్ధూ నిష్క్రమణ
చండీగఢ్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. గత నెలలోనే ఆయన రాజీనామా చేసినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో జూన్‌లోనే రాజీనామా చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు పంపిన ఆ లేఖను సీఎంకు కూడా పంపుతానన్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జూన్ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. దీంతో సిద్ధూ, సీఎం సింగ్‌ల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు పార్టీ అప్పగించింది. అయితే, సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో నెల రోజులపాటు వేచి చూసినా ఎలాంటి ఫలితం కనిపించకనే తాజాగా సిద్ధూ తన రాజీనామా లేఖను బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ నెల రోజులు కూడా సిద్ధూ మీడియా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నారు. సీఎం, సిద్ధూ విభేదాలు ఏమిటి?: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావం కనిపించకపోవటానికి స్థానిక పాలన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న సిద్ధూయే కారణమంటూ సీఎం అమరీందర్ బాహాటంగా ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో మత విశ్వాసాలకు భంగం కలిగించిన బాదల్ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో సీఎంను సిద్దూ ప్రశ్నించారు. అదేవిధంగా, తనకు కెప్టెన్ రాహుల్ గాంధీయేనని, తన కెప్టెన్(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్ అంటూ గత ఏడాది సిద్దూ వ్యాఖ్యానించడం విభేదాలకు ఆజ్యం పోసింది. -
మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా!
చండీఘడ్ : టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాసిన లేఖను ట్వీటర్లో పంచుకున్నారు. జూన్ 10నే ఈ లేఖను రాహుల్ గాంధీకి ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందరసింగ్ ఇటీవల చేపట్టిన మంత్రివర్గం విస్తీరణతో సిద్ధూ తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీతో సిద్ధూ గత నెల 10న ప్రత్యేకంగా సమావేశంమయ్యారు. తనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని రాహుల్ వద్ద సిద్ధూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. My letter to the Congress President Shri. Rahul Gandhi Ji, submitted on 10 June 2019. pic.twitter.com/WS3yYwmnPl — Navjot Singh Sidhu (@sherryontopp) July 14, 2019 -
‘సిద్ధు... మేము ఎదురుచూస్తున్నాం’
చండీగఢ్ : పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధుకు మొహాలీలో చేదు అనుభవం ఎదురైంది. మీరెప్పుడు రాజీనామా చేస్తారు సిద్ధూజీ అంటూ ఆయన పేరిట పోస్టర్లు వెలిశాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనయిర్‌గా సిద్ధు పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించి తీరతారని, అలా జరగని పక్షంలో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని శపథం చేశారు. అన్ని పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి కేంద్రమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో..‘ సిద్ధు రాజకీయాల నుంచి ఎప్పుడు వైదొలుగుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మీ రాజీనామా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు మొహాలీలో పోస్టర్లు అంటించారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న సిద్ధు ప్రస్తుత పరిణామాలపై ఇంతవరకు స్పందించలేదు. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను విమర్శించిన ఆయన.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలలో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. Punjab: Posters with Congress leader Navjot Singh Sidhu's picture stating,'When are you quitting politics? Time to keep your words. We are waiting for your resignation,' seen in Mohali. pic.twitter.com/DtJN7dCRUw — ANI (@ANI) June 21, 2019 -
రాజీనామాకు సిద్ధపడ్డ సిద్ధూ..!
చండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందరసింగ్ ఇటీవల చేపట్టిన మంత్రివర్గం విస్తీరణతో సిద్ధూ తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. దీంతో గత గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు .పార్టీకి సిద్ధూ రాజీనామా చేస్తారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌తో భేటీ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి గురించి రాహుల్‌కు వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని రాహుల్ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధూకు పార్టీలో మరింత ప్రాధాన్యం కల్పిస్తామని రాహుల్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో సమావేశంలో ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కూడా పొల్గొన్నారు. అయితే కెప్టెన్ అమరీందర్ సింగ్ తీరుపై గతకొంత కాలంగా సిద్ధూ తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు ఉద్దేశించి.. సీఎం అమరీందర్ కేబినెట్ సమావేశం నిర్వహించగా.. దానికి హాజరుకాకుండా సిద్ధూ తన అసమ్మతిని తెలియజేశారు. ఈ క్రమంలో సిద్ధూకు అమరీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలలో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలైన అమరీందర్, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు. -
సీఎంతో విభేదాలు.. కేబినెట్ భేటీకి డుమ్మా!
చండీగఢ్ : మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు ఉద్దేశించి.. సీఎం అమరీందర్ కేబినెట్ సమావేశం నిర్వహించగా.. దానికి హాజరుకాకుండా సిద్ధూ తన అసమ్మతిని తెలియజేశారు. ఈ క్రమంలో సిద్ధూకు అమరీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలలో కీలకమైన స్థానిక సంస్థల శాఖను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్ధూ కేవలం పర్యాటకం, సాంస్కృతిక శాఖకు పరిమితమయ్యారు. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్ నేతలైన అమరీందర్, సిద్ధూల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అమరీందర్ నేతృత్వంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) భేటీలోనూ సిద్ధూ పాల్గొనలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు ఉద్దేశించిన ఈ సమావేశంలో సిద్ధూ పనితీరుపై అమరీందర్ ఘాటు విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాలు రావడానికి సిద్ధూ అసమర్థతే కారణమని ఆయన నిందించారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సిద్ధూ.. అమరీందర్ విమర్శలను తిప్పికొట్టారు. తన పేరును ప్రస్తావించి మరీ.. ఫలితాల విషయంలో తనను నిందిస్తున్నారని, నిజానికి తనకు అప్పగించిన రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టిందని ఆయన అన్నారు. ఇష్టమొచ్చినట్టుగా తనపై విమర్శలు చేయడం సరిసకాదని, తాను కష్టపడి పనిచేస్తున్నానని, తాను పంజాబ్ ప్రజలకు జవాబుదారుడినని సిద్ధూ అన్నారు. -
‘ఆయన కొత్త పెళ్లి కూతురిలాగే.. గాజుల శబ్దమే’
భోపాల్ : సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకున్న వేళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీ నాయకులే లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధు మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ.. ‘ కొత్త పెళ్లి కూతురు రొట్టెలు చేసే శబ్దం కంటే ఆమె గాజుల శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ కారణంగా కొత్త కోడలు పనిమంతురాలే అని ఇరుగుపొరుగు వాళ్లు అనుకుంటారు. మోదీజీ కూడా అలాంటి కొత్త పెళ్లి కూతురు లాంటి వారే. ఆయన ప్రభుత్వం కూడా తక్కువ పనిచేస్తుంది. కానీ ఎక్కువ శబ్దం చేస్తుంది’ అని నరేంద్ర మోదీని, బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ అబద్ధాలు వ్యాప్తి చేసే వారికి సారథి అని, అంబానీ-అదానీ వంటి వ్యాపారవేత్తలకు బిజినెస్ మేనేజర్ అంటూ మండిపడ్డారు. నల్ల ఆంగ్లేయులను తరిమికొట్టండి ‘ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మౌలానా ఆజాద్, మహాత్మా గాంధీల నాయకత్వంలో పనిచేసిన పార్టీ ఇది. శ్వేత జాతీయులైన బ్రిటిషర్ల నుంచి వాళ్లు మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. అదే విధంగా ఇండోర్ ప్రజలు తమ ఓటుతో నల్ల ఆంగ్లేయుల(బీజేపీ నేతలను ఉద్దేశించి)ను ఓడించి దేశాన్ని కాపాడాలి’ అని సిద్ధు విఙ్ఞప్తి చేశారు. కాగా శుక్రవారం కూడా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈసీ సిద్ధుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో కూడా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 72 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. Punjab Minister & Congress leader Navjot Singh Sidhu in Indore, MP: I call him Liar-in-Chief, Divider-in-Chief and Business Manager of Ambani and Adani. https://t.co/JLDwq1Bms3 — ANI (@ANI) May 11, 2019 -
ఎన్నికల ప్రచారంలో నవజ్యోత్ సింగ్ సిద్దూ దూకుడు
-
సిద్ధూకు ఝలక్
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూ ప్రచారంపై ఎన్నికల కమిషన్ 72 గంటలపాటు నిషేధం విధించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది. సిద్ధూ ఈనెల 16న బిహార్‌లోని కటిహార్ ప్రచారంలో మాట్లాడుతూ, ముస్లిం ఓట్లు చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముస్లింలంతా ఐక్యమై ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన ఈ మాటలన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతోపాటు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ ఎన్నికల ప్రచారంపై కూడా ఇంతకుముందు ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కూడా ఈసీ ఇదేరకమైన చర్య తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు, మతమనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి మేనకా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి వరుసగా రెండు రోజులు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. -
‘మోదీ వారికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్’
న్యూఢిల్లీ : ఐదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ ఓ ప్రధాన మంత్రిలా కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలకు ‘‘బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్’’ మాదిరిగా పనిచేశారని పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను పక్కనబెడుతూ పారిశ్రామికవేత్తలకు భారీగా లబ్ధి చేకూర్చారన్నారు. మోదీ హయాంలో పారిశ్రామిక వేత్తలకు 18 భారీ కాంట్రాక్టులు కుదిరాయని సిద్దూ అన్నారు.శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రధానమంత్రి చేసిన విదేశీ పర్యటనలలో ఆయన వెంట ఇద్దరు ప్రముఖ పారిశ్రామిక వేత్తలను మాత్రమే తీసుకెళ్లారు కానీ ప్రభుత్వ సంస్థల చైర్మన్లను తీసుకెళ్లలేదన్నారు. మోదీ విదేశాలలో చేసుకున్న ఒప్పందాలు అధిక భాగం ఆ ఇద్దరికే దక్కాయని అని సిద్దూ ఆరోపించారు. గతంలో మంచి లాభాల్లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు గత ఐదేళ్లలో నష్టాల్లో నెట్టుకొస్తున్నాయని విమర్శించారు. దేశానికి కాపలాదారు( చౌకిదార్) అని చెప్పుకునే మోదీ కేవలం ఒక శాతం ఉన్న ధనవంతులకే కాపలా కాస్తున్నారని ఆరోపించారు. వ్యాపారవేత్తలు అనిల్ అంబానీ, అదానీలకు బిజినెస్ డెవలప్మెంట్ మేజేజర్‌గా మోదీ పని చేస్తున్నారని విమర్శించారు. మోదీ హయంలో ఎస్బీఐ, ఎమ్‌టీఎన్‌ల్ లాంటి ప్రభుత్వ స్థలకు తీవ్ర నష్టాలు రాగ, పేటిఎమ్, రిలియన్స్ జియో లాంటి సంస్థలకు భారీ లాబాలు వచ్చాయన్నారు. ఓట్ల కోసమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతియవాదాన్ని వాడుకుంటున్నారని, ఆయన ఓ జాతి వ్యతిరేకి విమర్శించారు. జాతియవాదాన్ని వాడుకోకుండా ప్రజలకు అవసరమైన అంశాలను చెప్పి మోదీ ఓట్లు అడిగే మంచిదని సిద్ధూ అభిప్రాయపడ్డారు. -
300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన దాడుల్లో నిజంగానే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారా అంటూ ప్రతిపక్షాలు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. భద్రతా దళాల ధైర్యసాహసాలను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని, ఆర్మీ దాడులను రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలకు తాజాగా పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గొంతు కలిపారు. విదేశీ శత్రు దేశంతో పోరాడుతున్నామంటూ దేశంలోని ప్రజలను మోసం చేస్తున్నారని, నిజానికి మీరు ఉగ్రవాదులను చంపారా? లేక చెట్లను కూల్చారా? ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనా అని సిద్ధూ ప్రశ్నించారు. ‘300 మంది ఉగ్రవాదులు నిజంగా చనిపోయారా? లేదా? మీ ఉద్దేశం ఏమిటి? ఉగ్రవాదులను నేలమట్టం చేయడమా? చెట్లను కూల్చడమా? ఇది ఎన్నికల గిమ్మిక్కా? శత్రుదేశంతో పోరాడుతున్నామంటూ.. దేశాన్ని మోసం చేస్తున్నారు. ఆర్మీతో రాజకీయం చేయడం మానండి. ఆర్మీ దేశమంతా పవిత్రమైనది’ అని సిద్ధూ ట్వీట్ చేశారు. -
‘పాజీ తప్పేం లేదు.. పాక్ నటుల కోసం నేను పోరాడుతా’
‘పాజీ మాట్లాడిన దానిలో తప్పేం ఉంది. మీరు అనవసరంగా ఆయన మాటలను వక్రీకరుస్తున్నారు’ అంటూ బిగ్‌బాస్ 11(హిందీ) ఫేం, కాంగ్రెస్ నేత శిల్పా షిండే... తమ పార్టీ నాయకుడు, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు అండగా నిలిచారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ‘ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదు.. ఎవరో చేసిన తప్పునకు దేశాన్ని నిందించడం సరికాదు’ అని సిద్ధు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా సిద్ధు తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.(పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) ఈ విషయంపై స్పందించిన శిల్పా షిండే మాట్లాడుతూ... ‘ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా. నన్ను ట్రోల్ చేసిన వాళ్లకు బుద్ధి చెప్తా. పుల్వామా దాడిపై స్పందించిన మహిళా జర్నలిస్టులకు కూడా బెదిరింపులు వచ్చాయి. పాజీ(సిద్ధు)కి మద్దతుగా మాట్లాడినందుకు నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. నిజానికి ఇటువంటి వ్యక్తులు కూడా ఉగ్రవాదులే. లష్కర్, జైషే ఉగ్రవాదుల కంటే వీరు చాలా ప్రమాదకరం. అసలు పాజీ అన్నదాంట్లో తప్పేం ఉంది. ఆయన ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వలేదు. శాంతియుత చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించకుండా ఓ రాజకీయ నాయకుడిగా ఆయన తప్పు చేశారనుకుంటున్నారేమో. కానీ వాళ్లిద్దరు ఏళ్ల తరబడి కలిసి క్రికెట్ ఆడిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పాక్ నటులపై బాలీవుడ్ బ్యాన్ విధించడాన్ని శిల్పా షిండే తీవ్రంగా తప్పుబట్టారు. ‘ కపిల్ శర్మ షో నుంచి సిద్ధును తొలగించడం, పాకిస్తాన్ నటులపై నిషేధం విధించడానికి నేను పూర్తి వ్యతిరేకం. ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు. ప్రతిభ ఉన్న పాకిస్తాన్ నటుల హక్కుల కోసం నేను పోరాడుతా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నిషేధం ఎదుర్కొన్నదాన్నే. అందుకే ఆ బాధ ఏంటో నాకు తెలుసు’ అంటూ శిల్పా షిండే చెప్పుకొచ్చా రు. కాగా టీవీ షో ‘బాబీ జీ ఘర్ పర్ హై’లో అంగూరి బాబీగా ఆదరణ పొందిన శిల్పా బిగ్‌బాస్ 11 విన్నర్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యారు. ఇక ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.(కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ టీవీ నటి) -
‘తనొక క్రికెటర్.. కానీ నేనొక సైనికుడిని’
చండీగఢ్ : ‘సిద్ధు ఒకనాడు క్రికెటర్ అయితే.. నేను ఒకనాటి సైనికుడిని. ఈ ఘటనను మేము చూసే విధానంలో, మా అభిప్రాయాల్లో భేదాలు ఉంటాయి’ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి జాతి, మతం ఉండదన్న పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.(పుల్వామా ఉగ్రదాడి : సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) ఈ క్రమంలో సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ..‘ సిద్ధు మాజీ క్రికెటర్. సరిహద్దుల్లో ఉండే ఇబ్బందులు తనకి అర్థం కావు. కానీ నేనో సైనికుడిని అక్కడి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిని వాడిని. అందుకే మా ఇద్దరి అభిప్రాయాల్లో తేడా కచ్చితంగా ఉంటుంది. పుల్వామా దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని దేశం కోరుకుంటోంది. పాకిస్తాన్ అండతో ఉగ్రవాదులు 41 మంది జవాన్లను బలి తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా వారి 82 మంది సైనికులను చంపి బదులు తీర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. పాక్‌పై సైనిక, దౌత్య, ఆర్థికపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.(‘చాలు.. ఇక చాలు.. గుణపాఠం చెప్పాల్సిందే’) కాగా పుల్వామా ఉగ్రదాడి గురించి స్పందిస్తూ... భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరిగినపుడు మాత్రమే ఇలాంటి ఘటనలు జరగవని, ఉగ్రవాదులు చేసిన దాడి కారణంగా ఒక జాతి మొత్తాన్ని విమర్శించడం తగదంటూ సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో వివాదానికి దారి తీసిన సిద్ధుపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మోదీ సర్కార్‌పై సిద్ధూ ఎదురుదాడి
-
మోదీ సర్కార్‌పై సిద్ధూ ఎదురుదాడి
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. 1999 కాందహార్ ఘటనకు బాధ్యులైన వారిని ఎవరు విడుదల చేశారని సిద్ధూ ప్రశ్నించారు. కాందహార్ ఘటనకు కారకులైన వారిని విడుదల చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. వారికి వ్యతిరేకంగానే తమ పోరాటమని, అసలు సైనికులు ఎందుకు మరణించాలని ప్రభుత్వ అసమర్ధతను ఎండగట్టారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు అన్వేషించరాదని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించరాదన్న తన వైఖరికి కట్టుబడి ఉంటానన్నారు. రాబోయే తరాలకు విఘాతంలా పరిణమించే ఉగ్రవాదాన్ని ఆసాంతం రూపుమాపాలని, ఉగ్ర దాడులకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని సిద్ధూ వ్యాఖ్యానించారు. కాగా పుల్వామా ఘటనకు యావత్ పాకిస్తాన్‌ను బాధ్యుల్ని చేయలేమని, కొద్ది మంది చేసిన దుశ్చర్యకు మొత్తం దేశాన్నో, ఏ ఒక్కరినో నిందించలేమని సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. సిద్ధూను సస్పెండ్ చేయాలి పాకిస్తాన్‌పై సిద్ధూ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. మరోవైపు పుల్వామా దాడిని ఖండిస్తూ పంజాబ్ సీఎం తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆయన మంత్రివర్గ సహచరుడు సిద్ధూ పాకిస్తాన్‌ను ప్రశంసించారని శిరోమణి అకాలీ దళ్ నేత బీఎస్ మజితీయ ఆరోపించారు. -
నిప్పులు చెరిగిన యాంకర్ రష్మీ
సాక్షి, హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారకంగా పాకిస్తాన్‌పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ దాడిలో అసువులు బాసిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ పాకిస్తాన్ దుశ్చర్యపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి, బుల్లితెర యాంకర్ రష్మీగౌతమ్ ట్విటర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్‌లోనే ఉంటూ పాక్ మద్దతుగా మాట్లాడిన వారిని ఏకిపారేశారు. పుల్వామా దాడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధును సైతం ఈ బుల్లితెర యాంకర్ వదిలి పెట్టలేదు. ‘దేశ విభజన సమయంలోనే పాక్ వైపుకి వెళ్ళాల్సింది. కానీ మన దురదృష్టం కొద్దీ ఈ దేశంలో ఉన్నాడు.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ సిద్ధూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ( చదవండి : ‘సిద్ధూని తీసేయకపోతే చూడం’) పాకిస్తాన్ జిందాబాద్ అంటూ షోయబ్ హఫీజ్ అనే నెటిజన్ చేసిన కామెంట్‌కు రష్మీ గౌతం ఆగ్రహంతో ఊగిపోయింది. ‘నీ పాకిస్థాన్ గొప్పతనం ఏంట్రా? సాలే, మాతోనే అస్థిత్వం, లేకపోతే నువ్వు దానితో సమానం.. మూసుకుని కూర్చో.. దేశ వ్యతిరేక విధానం సిగ్గులేని చర్య.. ’ అని నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ స్టూడెంట్ చేసిన కామెంట్‌పై కూడా ఘాటుగానే కామెంట్ చేశారు. ‘ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఈ నాకొడుకులను ఏరి పారెయ్యాలి’.. అంటూ తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు.. ఈ సందర్భంగా పలువురు నెటిజన్స్, రష్మీకి మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు. (చదవండి: సిద్ధు వివాదాస్పద వ్యాఖ్యలు) Teri Pakistan ki aise ki tesi Sale tum nikale hi humane HO bacha samhjke maaf karte rahe hai Hum hai tho tum HO Varna tum maati ke barabar Koi asthitva nahi hai tumhara Even few of ur pak states are named after us So shut the fuck up https://t.co/EsqY2pU2Nt — rashmi gautam (@rashmigautam27) February 15, 2019 At the time of partition he was supposed to go to the other side sadly to our bad luck he stayed back here https://t.co/9JSN8z3epP — rashmi gautam (@rashmigautam27) February 16, 2019 -
‘సిద్ధూని తీసేయకపోతే చూడం’
చండీగఢ్ : ‘ఉగ్రవాదానికి మతం, జాతి ఉండదు’ అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రజలు భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా సిద్ధుపై దుమ్మెత్తిపోస్తున్నారు. 43 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై సిద్దూ స్పందిస్తూ.. ‘కొంతమంది కోసం మీరు దేశం మొత్తాన్ని నిందిస్తారా? హింసను ఎప్పుడూ ఖండించాల్సిందే. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించాల్సిందే. పాకిస్తాన్‌తో.. భారత్ చర్చలు జరిపినపుడు మాత్రమే ఇటువంటి ఘటనలు పునరావృతమవ్వవు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పాక్‌కు వత్తాసుగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో సోని టీవీలో ప్రసారమయ్యే ‘ది కపిల్ శర్మ షోను నిషేదించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ షో నుంచి సిద్ధూనన్న తీసేయాలని పట్టుబడుతున్నారు. ఈ షోను చూడకపోతే.. రద్దవుతోందని, ఇది అమరజవాన్లకు నిజమైన నివాళని పిలుపునిస్తున్నారు. సిద్ధూకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని కూడా కామెంట్ చేస్తున్నారు. ‘దేశ రక్షణ కోసం 40 మంది ప్రాణ త్యాగం చేస్తే.. సిగ్గులేకుండా పరాయి దేశానికి వత్తాసు పలుకుతావా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత జవాన్లపై ఏ మాత్రం గౌరవం ఉన్న సోనీ టీవీ వెంటనే కపిల్ శర్మ షో నుంచి సిద్ధుని తీసేయాలని సూచిస్తున్నారు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సావానికి హాజరుకావడం వంటి చర్యలతో సిద్ధు తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్‌పై యుద్దం చేయాల్సిందేనని, సర్జికల్ స్ట్రైక్ 2 జరపాల్సిందేనని యావత్ భారత్ ముక్తకంఠంతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల విషయంలో భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్చనిస్తున్నట్లు ప్రకటించారు. @SonyTV @KapilSharmaK9 We request you to expel @sherryontopp from The Kapil Sharma Show & show courtesy to nation where you earn revenue. Removing him would be great tribute to our martyrs of Pulwama,else we would boycott this show henceforth "Kapil Sharma" — Hitesh Vyas (@vyashit) February 15, 2019 We all must boycott Kapil Sharma show as long as Sidhu is there. — Rajendra Saluja (@RajendraSaluja) February 15, 2019 Throw Out Sidhu From The Kapil Sharma Show Or Els We #Boycott The Kapil Sharma Show..!!@SonyTV @KapilSharmaK9 — Soumya Roy (@SamRoy_) February 15, 2019 -
నిరాపరాధిగా బయటపడ్డ సిద్ధూ భార్య
నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్.. అమృత్సర్ రైలు దుర్ఘటన కేసు నుంచి నిరపరాధిగా బయపడ్డారు. దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 19న అమృత్సర్ సమీపంలోని రైల్వేట్రాక్ మీద గుంపుగా నిలబడి రావణకాష్టాన్ని తిలకిస్తున్న వారి మీదుగా లోకల్ ట్రైన్ దూసుకెళ్లడంతో 60 మంది మరణించారు. ఆ ఘటనలో.. రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు అమృత్సర్ అసెంబ్లీ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్‌తో పాటు, ఇతర నాయకుల పైన కేసులు నమోదయ్యాయి. నిర్వాహకుల అలక్ష్యం తప్ప, ఇందులో కౌర్ బాధ్యతారాహిత్యం ఏమీ లేదని తాజా నివేదిక తేల్చింది. కౌర్ భర్త సిద్ధూ కాంగ్రెస్ పాలనలోని పంజాబ్‌లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎం.పి. సావిత్రీబాయి ఫూలె పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక ధోరణికి, విభజన రాజకీయాలకు విసిగి వేసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంపీగా మాత్రం పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమె కొనసాగుతారు. ఫూలే బి.ఎస్.బి. సెక్టార్ కోఆర్డినేటర్‌గా 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో బి.జె.పి.లో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బల్హా ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బారైచ్ ఎంపీగా విజయం సాధించారు. రెండు రోజుల క్రితం డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహాలకు, ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళితున్న సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సావిత్రీబాయి ఫూలే విమర్శించారు. అంటార్కిటిక్ సముద్రంలో చెలరేగిన తుఫాను వల్ల దారి తప్పిన ఒంటరి బ్రిటిష్ నావికురాలు ఒకరిని చిలీ అధికారులు రక్షించారు. సూసీ గుడ్‌ఆల్ అనే ఆ సాహస యాత్రికురాలిని కేప్ హార్న్‌కు 2000 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించి సురక్షితంగా, భద్రంగా దక్షిణమెరికా ఒడ్డుకు చేర్చారు. అప్పటికి రెండు రోజులుగా ఆ కల్లోల సముద్రంలో ధైర్యంగా నిలదొక్కుకుని ప్రపంచంతో ఆమె కమ్యూనికేషన్ ఏర్పచుకోగలిగారు. -
ఆ ప్రమాదంతో సిద్ధు దంపతులకు సంబంధం లేదు!
చండీగఢ్ : ఈ ఏడాది విజయదశమి వేడుకల సందర్భంగా అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో సుమారు 61 మంది మరణించగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కార్యక్రమాన్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నిర్వహించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. కాగా ఇందుకు సంబంధించిన 300 పేజీల నివేదికను అధికారులు రూపొందించారు. సిద్ధు దంపతులకు సంబంధం లేదు.. అమృత్‌సర్‌లో జరిగిన ప్రమాదానికి రైల్వే అధికారులు- పోలీసులు, అమృత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. అదే విధంగా సౌరభ్ మిథు మదన్ అనే వ్యక్తి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి పొందాడు గానీ, అందుకు సంబంధించి సరైన ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయాడని తెలిపింది. అయితే సౌరభ్ మిథు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు సన్నిహితుడు కావడం, రావణ దహన కార్యక్రమానికి సిద్ధు భార్య, మాజీ ఎమ్మెల్యే నవజోత్ కౌర్ హాజరుకావడంతో వీరిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధు దంపతుల పేరు చెప్పి ఈ కార్యక్రమానికి మిథు అధిక సంఖ్యలో జనాలను పోగు చేసి వారి మరణానికి కారణమయ్యాడనే వాదనలూ వినిపించాయి. (‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’) ఈ నేపథ్యంలో ఈ ఘటనతో సిద్ధు దంపతులకు ఏమాత్రం సంబంధం లేదని, ముఖ్య అతిథిగా హాజరైనంత మాత్రాన నవజ్యోత్ కౌర్ ఈ ఘటనకు బాధ్యురాలు కాదంటూ నివేదిక క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక.. ఈ ఘటనపై గతంలో విచారణ జరిపిన రైల్వే సెక్యూరిటీ చీఫ్ కమిషనర్.... కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించునందు వల్లే ప్రాణాలు కోల్పోయారని, తమకు ఎటువంటి సంబంధం లేదని నివేదిక ఇచ్చారు. -
‘అవును... నన్ను పాకిస్తాన్‌కు పంపించింది ఆయనే’
సాక్షి, హైదరాబాద్ : సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన నాటి నుంచి పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఫొటో దిగడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అకాలీదళ్ పార్టీ నాయకులు.. ‘సిద్ధు పాకిస్తాన్ ఏజెంట్’ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సిద్ధు ప్రవర్తన తీరుపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. (రాహుల్ జీ.. స్పష్టత ఇవ్వండి!) ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై సిద్ధు స్పందించారు. ‘నా కెప్టెన్ రాహుల్ గాంధీ. ఆయన నన్ను ఎక్కడికి పంపాలని భావిస్తే అక్కడికి పంపిస్తారు. పాకిస్తాన్‌కు కూడా ఆయనే పంపించారు. అయినా నాకు నేనుగా కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు వెళ్లలేదు. 20 మంది సీనియర్ నేతలు అక్కడికి వెళ్లాల్సిందిగా నన్ను కోరారు. పార్టీ అధిష్టానం నిర్ణయం కూడా అదే. అందుకే మా ‘కెప్టెన్’ (పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌ను ఉద్దేశించి)కు నేను కచ్చితంగా పాకిస్తాన్ వెళ్తున్నానని చెప్పాను. ఆయనకు కూడా రాహుల్‌జీనే కెప్టెన్ కదా. అమరీందర్ సింగ్ అయితే ఆర్మీ కెప్టెన్ మాత్రమే’ అని సిద్ధు వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఎన్నికల ప్రచార నిమిత్తం సిద్ధు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH Navjot Singh Sidhu, Congress in Hyderabad: Mere captain Rahul Gandhi hain, unhone toh bheja hai har jagah (for #KartarpurCorridor). Hamare Captain sahab ke bhi Captain Rahul Gandhi ji hain' pic.twitter.com/XmagrUgfWw — ANI (@ANI) November 30, 2018 -
ఖైరతాబాద్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రచారం
-
కేసీఆర్ ఊసరవెల్లిని మించిన వ్యక్తి: సిద్ధు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చి గద్దెనెక్కారని కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు విమర్శించారు. బైద పీపుల్ తెలంగాణలో ఫర్ద పీపుల్‌గా మారిందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 40 శాతం ప్రజలు రోజుకు కనీసం 140 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ తన కోసం రూ. 300 కోట్ల భవంతిని నిర్మించుకున్నారని మండిపడ్డారు. వెదురు బొంగు పొడుగ్గానే ఉన్నా.. లోనంత డొల్లేనని.. తెలంగాణ పాలన కూడా అలాంటిదేనని ఎద్దేవా చేశారు. రూ.17 వేల కోట్ల మిగులు రాష్ట్రాన్ని రూ. 2లక్షల 40వేల కోట్ల అప్పుల మయం చేశారని ఆరోపించారు. నలుగురి ఆస్తులు మాత్రం 400 శాతం పెరిగాయని దుయ్యబట్టారు. ‘సోనియాగాందీ వల్లే తెలంగాణ ఏర్పడింది. పార్టీ విలీనం, దళిత సీఎం అన్నారు. ఊసరవెళ్లి కంటే వేగంగా రంగు మార్చి ఆయనే గద్దే పైన కూర్చున్నారు. మహిళల సాధికారిత అంటే కేసీఆర్ దృష్టిలో ఆయన కూతురు ఒక్కరి అభివృద్దినేనా? ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? దేశంలో సచివాలయంకు పోకుండా ఇంటి నుంచి పాలన చేసే ఏకైక సీఎం కేసీఆర్. ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు ఇద్దరూ ఒకటే. నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం’ అని సిద్ధు మండిపడ్డారు. -
రాహుల్ జీ.. స్పష్టత ఇవ్వండి!
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన నాటి నుంచి తన వ్యాఖ్యలు, చర్యలతో పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. పాకిస్తాన్లో కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు హాజరైన సిద్ధు.. ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఫోటో దిగడం తాజాగా వివాదాస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ సిద్ధుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మన సైనికులను చంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకుంటారు. పాకిస్తాన్‌కు వెళ్లి మూడు రోజులపాటు అక్కడే ఉంటారు. అంతేకాకుండా ఉగ్రవాదులతో కలిసి ఫొటోలకు పోజులిస్తారు. ఇటువంటి చర్యల ద్వారా ఆయన నిజమైన పాకిస్తాన్ ఏజెంట్ అని నిరూపించుకున్నారు’ అని సిద్ధును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదని, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల అమృత్‌సర్‌లోని నిరంకారి భవన్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి, గోపాల్ సింగ్ చావ్లాకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చావ్లాతో తాను ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో సిద్ధూ స్పందించారు. గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తనకు తెలియదని, పాక్‌లో తనతో వేలమంది ఫొటో దిగారని, అతను ఎవరో తాను గుర్తుపట్ట లేదని ఆయన వివరణ ఇచ్చారు. -
ఖలిస్తాన్ ఉగ్రవాదితో మంత్రి ఫొటో.. తీవ్ర దుమారం!
అమృత్సర్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఆయన ఫోటో దిగడం తాజాగా వివాదాస్పదమైంది. గురువారం గోపాల్ సింగ్ తన ఫేస్బుక్లో సిద్దూతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఇటీవల అమృత్‌సర్‌లోని నిరంకారి భవన్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి, చావ్లాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చావ్లాతో తాను ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో మంత్రి సిద్ధూ స్పందించారు. గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తనకు తెలియదని, పాక్‌లో తనతో వేలమంది ఫొటో దిగారని, అతను ఎవరో తాను గుర్తుపట్ట లేదని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు చావ్లాతో సిద్ధూ ఫొటో దిగడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇందిరా గాంధీలాగే పంజాబ్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా?’ అని రాహుల్‌ను ఉద్దేశించి బీజేపీ ప్రశ్నించింది. ‘నాలుగు రోజుల క్రితమే అమృత్‌సర్‌లో జరిగిన ఉగవాద దాడి వెనుక ఖలిస్తాన్‌వాదుల హస్తం ఉందని పోలీసులు కనుక్కున్నారు. నిన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, చావ్లాతో కలిశారు. దీని వెనుక ఏంజరుగుతుందో రాహుల్‌గాంధీని చెప్పాలం’టూ బీజేపీ నేత తాజిందర్ బగ్గా ట్వీట్ చేశారు. సిద్దూకు దేశమంటే పట్టింపు ఉందా? లేక వేరే ఉద్దేశంతో ఉన్నారా? అని అకాలీదళ్ ఘాటుగా ప్రశ్నించింది. సిద్దూ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీని వెనుక చావ్లా హస్తముందని అకాలీదళ్ పేర్కొంది. చావ్లాను సిద్దూ చాలాసార్లు దూరంపెట్టారని, కానీ ఈ సారి అతడు ఎలాగోలా సిద్దూతో ఫోటో దిగగలిగారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు పరమజిత్ సింగ్ సర్నా చెప్పారు. సిద్దూ పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని, భారతీయుల కంటే పాకిస్తానీల నుంచే ఆయన ఎక్కువ ప్రేమాభిమానాలు పొందుతున్నారని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధూ అక్కడినుంచే పోటీ చేయించాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. -
పాకిస్థాన్‌లో పోటిచేసినా సిద్దూ గెలుస్తాడు!
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన స్నేహితుడైన ఒకప్పటి క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూకు బాసటగా నిలిచారు. పాక్ ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి హాజరైనందుకు సిద్ధూ భారత్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఇమ్రాన్ మాట్లాడారు. ‘ సిద్దూను ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా ప్రమాణస్వీకారానికి వచ్చి అతను శాంతిని, స్నేహభావాన్ని పెంచాడు. అతను ఇక్కడి పంజాబ్‌లో పోటి చేసినా గెలిచి తీరుతాడు’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు. కర్తాపూర్ కారిడార్ శంకుస్థాపన వేడుకలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భారత్ తరఫున సిద్దూ హాజరైన విషయం తెలిసిందే. సిక్కులు పవిత్రంగా భావించే పాకిస్థాన్‌లోని గురుద్వార దర్బార్, కర్తాపూర్ నుంచి భారత్ గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక రహదారి కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దూ.. 70 ఏళ్ల సిక్కుల నిరీక్షణకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెరదించారని ప్రశంసల జల్లు కురిపించారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరై.. పాక్ ఆర్మీ చీఫ్‌ను సిద్ధూ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
70 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఇమ్రాన్!
ఇస్లామాబాద్: సిక్కుల నిరీక్షణకు తెరపడనుంది. సిక్కులు పవిత్రంగా భావించే పాకిస్థాన్‌లోని గురుద్వార దర్బార్, కర్తాపూర్ నుంచి భారత్ గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక రహదారి కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం శంకుస్థాపన చేసింది. భారతదేశం విజ్ఞప్తి మేరకు రెండు దేశాలలోని సిక్కు భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మాట్లాడుతూ.. 70 ఏళ్ల నిరీక్షణకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెరదించారని ప్రశంసల జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టన్ అమరీందర్ సింగ్ గురుదాస్‌పూర్‌లో ఇక్కడి కారిడార్‌కు మంగళవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లో జరిగే శంకుస్థాపన వేడుకకు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్‌ను పాక్ ఆహ్వానించగా.. సరిహద్దుల్లో తమ జవానులను పాకిస్థాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారంటూ ఆయన పాక్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. సిక్కుల పవిత్ర గురువైన గురునానక్ తన జీవిత చరమాంకంలో కర్తాపూర్‌లో జీవించారు. గురునానక్ 550వ జయంతి నాటికి భారత్-పాక్‌ల మధ్య ఈ కారిడార్ ఏర్పాటు కావాలని చాలా మంది సిక్కులు కోరుకున్నారు. ఈ కారిడార్‌ను ఆరు నెలల్లో పూర్తిచేయాలనుకుంటున్నారు. ఇది పూరైతే సిక్కు భక్తులు ఎటువంటి వీసా లేకుండానే కర్తాపూర్‌ను సందర్శించవచ్చు. -
‘మిస్టర్ స్టుపిడ్’.. క్షమాపణలు చెప్పాలి’
ఇండోర్ : పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సందర్భంగా సిద్ధూ ఇండోర్ మేయర్‌ను విమర్శించిన సంగతి తెలిసిందే. సిద్దూ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె, సిద్ధూని ఉద్దేశిస్తూ.. ‘మిస్టర్ స్టుపిడ్’ అనడమే కాక మేయర్ మాలిని లక్ష్మణ్‌సింగ్ గౌర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా ఇండోర్‌లోని రాజ్వాడ ప్రాంతంలో దేవి అహల్య విగ్రహం ముందు మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న సిద్ధూ, నగర మేయర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతపై మాట్లాడుతూ.. ‘చప్పట్లు కొట్టండి అలాగే మేయర్‌ను కూడా కొట్టండి’ అంటూ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నష్టపరిహారం ఇవ్వకుండా ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిద్ధూ టెలివిజన్ కామెడీ షోలో ‘చప్పట్లు కొట్టు’ అనే పదం ఎక్కువగా వాడతారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అదే పదాన్ని వాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా నేత పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
‘అసలైన ఘనత ఇమ్రాన్‌కే చెందుతుంది’
చండీగఢ్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక చొరవ వల్లే కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించారు. సిక్కుల ప్రార్థనలు ఫలించేలా చేసిన ఘనత కేవలం ఇమ్రాన్‌కే చెందుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సిద్ధు.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం విషయంలో అసలైన ఘనత మాత్రం పాక్ ప్రధాని, తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. 24 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్ సిక్కు ప్రజల ఆకాంక్షలు ఫలించేలా చేశారని ప్రశంసించారు. రాజకీయాలను, మతాన్ని వేర్వేరుగా చూసినపుడే అందరూ సంతోషంగా ఉంటారని ఈ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. (భారత్ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్) కాగా వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలవడం సిద్ధుకు కొత్తేం కాదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సమయంలో, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం.. సౌత్ ఇండియా కంటే పాకిస్తానే బెటర్ అంటూ వ్యాఖ్యానించడం తదితర సమయాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే లష్కరే ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన నరమేధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ ఘటనలో మరణించిన వారికి, అమరవీరులకు దేశమంతా నివాళి అర్పిస్తుంటే... అందుకు కారణమైన దాయాది దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడం సిద్ధుకే చెల్లిందని ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. (26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం) -
‘నా కౌగిలింత పని చేసింది’
చండీగఢ్ : నేను ఇచ్చిన ‘జప్పి’(కౌగిలింత) పనిచేసిందంటున్నారు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ. భారత్ – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు పాక్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ.. పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత గురించి సిద్ధూ ‘అతనే నా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కర్తార్‌పూర్‌లోని సాహిబ్ కారిడార్ తెరవడం గురించి మాట్లాడుకున్నామం’టూ సిద్ధూ వివరణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాహిబ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో ‘నా కౌగిలింత ఫలించింది. కారిడార్ ఒపెన్ అయినప్పుడు ముద్దు ఇస్తానం’టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ‘సిద్ధూ పంజాబ్ క్యాబినేట్ బదులు పాక్ క్యాబినేట్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. భారతదేశానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి పాక్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాడంటూ’ మండిపడ్డారు. -
ఆయనలా.. పిలవని పేరంటానికి వెళ్లలేదే : సిద్ధు
చండీగఢ్ : ‘ప్రధాని నరేంద్ర మోదీ నన్ను చూసి అసూయపడుతున్నారేమో? నేనేం ఆయనలా పిలవని పేరంటానికి వెళ్లలేదు కదా.. అయినా గోద్రా అల్లర్ల కేసులో చిక్కుకున్న వారి ముందు నా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ పంజాబ్ మంత్రి, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడాన్ని బీజేపీ నేతలు విమర్శించడంపై సిద్ధు ఈ విధంగా స్పందించారు. (‘సౌత్ ఇండియా కన్నా పాకిస్తాన్ బెటర్’) శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోదీకి ఆహ్వానం అందనందు వల్లే తనపై అసూయ పడుతున్నారని, తానేం మోదీలాగా పిలవకుండానే పాక్ మాజీ ప్రధాని (నవాజ్ షరీఫ్) పుట్టినరోజుకు వెళ్లలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సమయంలో సిద్ధు.. పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలే కాకుండా సీఎం అమరీందర్ సింగ్ కూడా సిద్ధు చర్యను తప్పుబట్టారు. అయితే సిద్ధు మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. Is the PM jealous that he was not called (for Imran Khan’s oath ceremony)? Is he jealous that he went to Pakistan uninvited (for Nawaz Sharif’s birthday)? I’ll not prove my patriotism to people whose name came up in Godhra(riots case): Navjot Singh Sidhu, Congress pic.twitter.com/NSd4iCpUK1 — ANI (@ANI) November 17, 2018 -
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సిద్ధూ, అజహర్
రాయ్‌పూర్: రాజకీయ నేతలుగా మారిన మాజీ క్రికెటర్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహ్మద్ అజహరుద్దీన్‌లు ఛత్తీస్‌గఢ్ తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. తొలిదశ ఎన్నికల కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సుశీల్ కుమార్ షిండే, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, గులాం నబీ ఆజాద్, రాజ్ బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులున్నారని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లుండగా, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. -
సిద్ధూ వ్యాఖ్యలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశాన్ని ఉద్దేశించి పంజాబ్ కాంగ్రెస్ మంత్రి, మాజీ భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. సిద్ధూ చేసిన వ్యాఖ్యలు దక్షిణ భారతీయులను అవమానపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆదివారం ట్వీట్ చేశారు. ఒక క్రికెటర్‌గా దేశం మొత్తం సిద్ధూను అభిమానిస్తుందని, కానీ పాకిస్తాన్‌కు మద్దతుదారుడిగా కాదని అన్నారు. భారతదేశ భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించదా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ‘ఒక వేళ నేను దక్షిణ భారత్‌లోని ప్రాంతాలకు వెళితే ఎక్కువ కాలం ఉండలేను. నాకు అక్కడి భాష అర్థం కాదు. వారి వంటలు తినలేను. ఇడ్లీ మాత్రమే తినగలుగుతా. వారి అలవాట్లు, సంస్కృతి వేరు. కానీ నేను పాకిస్తాన్ వెళ్తే అక్కడి ప్రజలు పంజాబీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అందుకే నాకు దక్షిణ భారత్ వెళ్లడం కంటే పాకిస్తాన్ వెళ్లడమే ఎక్కువ ఇష్టం’ అంటూ ఇటీవల ఒక సాహిత్య కార్యక్రమంలో సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. -
సిద్ధూను మంత్రివర్గం నుంచి తొలగించండి!
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారతీయులను అవమానించిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. దేశంలోని భిన్నంత్వంలోని ఏకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించదా? అని ఆయన ప్రశ్నించారు. క్రికెటర్‌గా సిద్ధుని దేశమొత్తం గౌరవించిందని, ఆయన పాకిస్తాన్ ముసుగులా వ్యవహరించరాదని చెప్పారు. దక్షిణ భారత్ కంటే పాకిస్తాన్ వెళ్లడమే బెటర్ అని సిద్ధూ తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కసౌలి లిటరేచర్ మొదటి ఎడిషన్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన.. పాక్‌పై ఉన్న ప్రేమను మరో సారి బయటపెట్టారు. ‘ఒకవేళ నేను దక్షిణ భారత్‌కి వెళితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. నాకు వారి భాష అర్థం కాదు. వారి వంటలు నేను తినలేను. కేవలం ఇండ్లీ మాత్రమే తినగల్గుతాను. అంతేకాని సౌత్ ఇండియా వారి వంటలను ఎక్కుకాలం తినలేను. వారి అలవాట్లు, సంస్కృతి వేరు. కానీ నేను పాకిస్తాన్ వెళితే వారితో సులభంగా కలిసిపోగలను. వారు పంజాబీ, ఆంగ్లం మాట్లాడగల్గుతారు. అందుకే నాకు దక్షిణ భారత్ కంటే పాకిస్తాన్ వెళ్లడమే ఇష్టం’ అని సిద్ధూ అన్నారు. అంతకుముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిద్ధూ.. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకొని విమర్శలు పాలైన విషయం తెలిసిందే. జవాన్లను చంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. అయితే, పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడాన్ని సిద్ధూ సమర్థించుకున్నారు. ‘ఆ కౌగిలింత యాదృచ్ఛికంగా జరిగింది. పాకిస్తాన్లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది. పంజాబ్ పెద్ద రాష్ట్రం. ఐదు నదులతో ఈ రాష్ట్రం ఏర్పడింది. కానీ విభజన సందర్భంగా రెండు నదులు పాకిస్తాన్ వైపు వెళ్లాయి. కౌగిలింతను పక్కకు పెట్టండి. నేను అతన్ని ముద్దుపెట్టుకుంటాను ’అని సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
‘సౌత్ ఇండియా కన్నా పాకిస్తాన్ బెటర్’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌పై తనకు ఉన్న ప్రేమను మరోసారి బహిర్గతం చేశాడు మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధూ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకొని విమర్శలు పాలైన విషయం తెలిసిందే. జవాన్లను చంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. కాగా ఇప్పుడు మరో సారి సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ఇండియా కంటే పాకిస్తాన్ వెళ్లడమే బెటర్ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కసౌలి లిటరేచర్ మొదటి ఎడిషన్ ఫెస్టివల్లో పాల్గొన్న ఈ మాజీ క్రికెటర్ పాక్‌పై ఉన్న ప్రేమను మరో సారి బయటపెట్టారు. ‘ఒక వేళ నేను దక్షిణ భారత్‌కి వెళితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. నాకు వారి భాష అర్థం కాదు. వారి వంటలు నేను తినలేను. కేవలం ఇండ్లీ మాత్రమే తినగల్గుతాను. అంతేకాని సౌత్ ఇండియా వారి వంటలను ఎక్కుకాలం తినలేను. వారి అలవాట్లు, సంస్కృతి వేరు. కానీ నేను పాకిస్తాన్ వెళితే వారితో సులభంగా కలిసిపోగలను. వారు పంజాబీ, ఆంగ్లం మాట్లాడగల్గుతారు. అందుకే నాకు దక్షిణ భారత్ కంటే పాకిస్తాన్ వెళ్లడమే ఇష్టం’ అని సిద్ధూ అన్నారు. అంతే కాకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడాన్ని సమర్థించుకున్నారు. ‘ఆ కౌగిలింత యాదృచ్ఛికంగా జరిగింది. పాకిస్తాన్లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది. పంజాబ్ పెద్ద రాష్ట్రం. ఐదు నదులతో ఈ రాష్ట్రం ఏర్పడింది. కానీ విభజన సందర్భంగా రెండు నదులు పాకిస్తాన్ వైపు వెళ్లాయి. కౌగిలింతను పక్కకు పెట్టండి. నేను అతన్ని ముద్దుపెట్టుకుంటాను ’అని సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడంపై సిద్ధూ క్లారిటీ.. -
‘భారత్‌లో కన్నా పాక్, బంగ్లాలో తక్కువ’
చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. దేశంలో ఇంధన ధరల ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌తో పోల్చితే సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. గత కొన్ని వారాలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీవితకాల గరిష్టానికి చేరుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పయాని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్న కేంద్రం మాత్రం ధరలను తగ్గించే ఆలోచన చేపట్టకపోవడం బాధకరమని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలపై అధిక పన్నులు విధించి ఇంధన కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. క్రూడాయిల్‌కు పన్ను మినహాయింపు అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. -
భారత స్నేహితునికి పాక్ ప్రధాని సందేశం
చండీఘఢ్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరై విమర్శలను ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి వార్తల్లో నిలిచారు. తన స్నేహితుడు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకో సందేశం పంపినట్లు సిద్ధూ వెల్లడించారు. ఈ సందేశంలో ఇమ్రాన్ ఖాన్ భారత్, పాక్‌ల మధ్య శాంతియుతమైన పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్ వచ్చి వెళ్లిన తరువాత కార్గిల్ యుద్ధం జరిగింది.. మోదీ పాకిస్తాన్‌ని సందర్శించిన తరువాత పఠాన్ కోట్‌పై దాడి జరిగింది. కానీ సిద్ధూ పాక్ వచ్చి వెళ్లిన తర్వాత భారత్‌లో అంతర్గత కుమ్ములాటలు జరిగాయని’ ఇమ్రాన్ తన సందేశంలో పేర్కొన్నట్లు సిద్ధూ తెలిపారు. అంతేకాక ‘మేము శాంతి కోరకుంటున్నాం. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మేము రెండడుగులు ముందుకు వేస్తాం’ అని ఇమ్రాన్ ఖాన్ తనకు పంపిన సందేశంలో తెలిపినట్లు సిద్ధూ వివరించారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ 22వ ప్రధానిగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన సిద్ధూ.. పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన చర్యగా శివసేన మండిపడగా, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
సిద్ధూకి మద్దతుగా బీజేపీ సీనియర్ ఎంపీ
సాక్షి, కోలకతా: బీజేపీ సీనియర్ నేత శతృఘ్న సిన్హా మరోసారి సొంత పార్టీపై తనదైన శైలిలో స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్‌తో హగ్ వివాదంలో మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి మద్దుతుగా నిలిచారు. దేశ మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో పాకిస్తాన్ ప్రధానమంత్రులను ఆలింగనం చేసుకోలేదా అని సిన్హా ప్రశ్నించారు. పాక్ పర్యటనల సందర్భంగా దేశ ప్రధానులు పాక్ ప్రధానులను హగ్ చేసుకున్నారని గుర్తుచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు, ప్రస్తుత ప్రధాని మోదీ పాక్ పర్యటనల సందర్భంగా అప్పటి ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను కౌగిలించుకోలేదా అని ప్రశ్నించారు. అలాగే ఈ విషయంపై ఇప్పటికే సిద్ధూ వివరణ ఇచ్చిన తరువాత ఇంకా వివాదం ఉంటుందని తాను భావించలేదన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో శతృఘ్నసిన్హా మాట్లాడుతూ, బిజెపికి వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, పార్టీకి అద్దంలా వ్యవహరించానని పేర్కొన్నారు. అయితే పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పార్టీకి వ్యతిరేకమైనట్టు కాదని పేర్కొన్నారు. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదనే సూత్రాన్ని నానాజీ దేశ్‌ముఖ్, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ లాంటి బీజేపీ అగ్రనేతల నుంచి తాను నేర్చుకున్నానని గుర్తు ఆయన చేసుకున్నారు. అంతేకాదు జీఎస్టీ చట్టంపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంక్లిష్టమైన చట్టంగా పేర్కొన్న సిన్హా, దీనిమూలంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీపై నోరు విప్పడం తన బాధ్యత అని చెప్పారు. కాగా గత వారం పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ 22వ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన క్రికెటర్ టర్న్డ్ పొలిటీషియన సిద్ధూ పాక్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిగ్గుమాలిన చర్యగా శివసేన మండిపడగా, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ బీజేపీ కాంగ్రెస్‌పార్టీపై విరుచుపడిన సంగతి తెలిసిందే. -
మోదీని ఏ ఒక్కరూ ప్రశ్నించరు: సిద్దూ
చండీఘఢ్ : పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరై విమర్శలను ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. ప్రతి ఒక్కరు అనవసరంగా తనను విమర్శిస్తున్నారని, అంత పెద్ద తప్పుచేయలేదని తన చర్యలను సమర్థించుకున్నారు. పాక్ ప్రధాని ప్రమాణాస్వీకార కార్యక్రమంలో చివరి నిమిషంలో ముందు వరుసలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి సైతం పాకిస్తాన్‌కు బస్సు యాత్ర చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ 2015లో లాహోర్‌కు వెళ్లి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కౌగిలించుకున్నారని గుర్తుచేశారు. షరీఫ్ సైతం మోదీ ప్రమాణస్వీకారానికి హజరయ్యారన్నారు. అప్పడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఏ ఒక్కరూ ఎందుకు ప్రశ్నించలేదని అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కొందరు కాంగ్రెస్ నేతలు సైతం విమర్శిస్తున్నారని సిద్దూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా వారి అభిప్రాయాలను చెప్పవచ్చన్నారు. ఇమ్రాన్ ఖాన్ నుంచి 10 సార్లు ఇన్విటేషన్ అందిందని, తాను భారత ప్రభుత్వం అనుమతి తీసుకొని హాజరయ్యానని స్పష్టం చేశారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలంచుకోవడంపై స్పందిస్తూ.. ‘సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడుతూ కౌగిలించుకున్నాను. అందులో తప్పేం ఉంది’ అని సిద్ధూ పేర్కొన్నారు. కాగా పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం పట్ల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిద్ధూ చర్య సరైనది కాదని, పాక్ ఆర్మీ చీఫ్ పట్ల అంతటి అభిమానం చూపించడం తప్పని ఆయన పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కన సిద్దూ కూర్చోవడం కూడా భారతీయులు తట్టుకోలేకపోయారు. దీంతో అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన శాంతి దూత: పాక్ ప్రధాని మరోవైపు సిద్ధూపై పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. అతనొక శాంతి దూత అని కొనియాడారు. తన ప్రమాణస్వీకారినికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌లో అతన్ని టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. శాంతి లేకుంటే ఇరుదేశాల్లో పురోగతి ఉండదని వ్యాఖ్యానించారు. -
పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్‌పై దేశద్రోహం కేసు
-
‘నా కౌగిలింతను తప్పుగా చూడకండి’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సిద్దూను పాక్ అగ్రనేతలతో పాటు తొలివరుసలో కూర్చోబెట్టారు. ఇమ్రాన్ ప్రమాణం చేసిన తర్వాత ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాను కూడా సిద్ధూ కౌగిలించుకున్నారు. ఇది ఇండియాలో చాలా మందికి నచ్చడంలేదు. ఈ విషయంపై సిద్ధూని చాలా మంది విమర్శిస్తున్నారు. కాగా సిద్ధూ మాత్రం తన చర్యలను సమర్థించుకున్నారు. అలా చేయడం మన సంస్కృతి అన్నారు. నా కౌగిలింతను తప్పుగా చూడోదంటూ మీడియా ద్వారా వేడుకున్నారు. ‘ మనం ఒక ప్రదేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్తే.. వారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం. నేను మొదటగా దూరంగా కూర్చున్నా. కానీ వారు నన్ను స్టేజీపైకి రమ్మని తొలివరుసలో కూర్చోమన్నారు. అందుకే వెళ్లాను. అందులో తప్పేం ఉందని సిద్ధూ వ్యాఖ్యానించారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలంచుకోవడంపై స్పందిస్తూ.. ‘అతనే నా ముందుకు వచ్చి ఒకప్పుడు క్రికెటర్ కావాలని అనుకున్నట్లు చెప్పారు. అంతే కాదుసిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది’ అని సిద్ధూ పేర్కొన్నారు. కాగా పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం పట్ల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విముఖత వ్యక్తం చేశారు. సిద్ధూ చర్య సరైనది కాదు, పాక్ ఆర్మీ చీఫ్ పట్ల అంతటి అభిమానం చూపించడం తప్పని పేర్కొన్నారు. -
ఇమ్రాన్ కోసం పాక్‌కు వెళ్తాం : భారత దిగ్గజ క్రికెటర్లు
న్యూఢిల్లీ/అమృత్సర్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాము హాజరవుతామని భారత దిగ్గజ క్రికెటర్లు తెలిపారు. పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానని భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992లో పాక్ జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గిన విషయాన్ని సిద్ధూ ప్రస్తావించారు. ఇమ్రాన్ నమ్మదగ్గ వ్యక్తి అని, వ్యక్తిత్వమున్న మంచి మనిషి అని సిద్ధూ కొనియాడారు. భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చేసేందుకు ఇమ్రాన్ కృషి చేస్తారని ఆయన ఆకాంక్షించారు. ఇదే విషయంపై హర్యానా ‘హరికేన్’ కపిల్ దేవ్ స్పందించారు. ఇమ్రాన్ నుంచి ఆహ్వానం అందిందో లేదో ఇంకా చెక్ చేసుకోలేదన్నారు. ఒకవేళ ఇమ్రాన్ నుంచి తనకు ఆహ్వానం అందినట్లయితే కచ్చితంగా పాకిస్తాన్‌కు వెళ్లి ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారన్ని వీక్షిస్తానని చెప్పారు. అయితే భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని కపిల్ స్పష్టం చేశారు. కాగా, టీమిండియా తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్ నెగ్గింది కపిల్ సారథ్యంలోనే. ఈ నెల 11న ఇమ్రాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి భారత దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలతో పాటు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సైతం ఇమ్రాన్ ఆహ్వానం పంపించారని పీటీఐ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, తనకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆమిర్ వెల్లడించాడు. గావస్కర్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పలు కథనాలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. ఆగస్టు 11న జరగనున్న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతల (విదేశీ నేతలు)ను ఆహ్వానించడం లేదని స్పష్టం చేసింది. ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహతులైన కొందరు విదేశీ వ్యక్తులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. -
భారత క్రికెటర్లను ఆహ్వానించిన ఇమ్రాన్
ఇస్లామాబాద్ : రాజకీయాల్లోకి అడుగుపెట్టినా క్రికెట్ అనే పదాన్ని ఇమ్రాన్ ఖాన్ నుంచి వేరు చేయలేం అనిపిస్తోంది. ఎందుకంటే వన్డే ప్రపంచ కప్ అందించి దేశ ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తి ఇమ్రాన్. పాకిస్తాన్ నూతన ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఆహ్వానించిన విషయం విదితమే. ఆ వేడుకలో ఆహ్వానితుల జాబితాలో భారత క్రికెటర్లకు ఇమ్రాన్ స్థానం కల్పించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారు. తాను క్రికెట్ ఆడే సమయంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఆగస్టు 11న ప్రధానిగా తన ప్రమాణ స్వీకార వేడుకకు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు. వీరితో పాటు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్, ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్‌కు ఆహ్వానం అందించారు. పాక్ విదేశాంగశాఖ అధికారులతో చర్చించిన అనంతరం వీరికి ఇన్విటేషన్ పంపినట్లు పీటీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2014 మేలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఏ తరహాలో ప్రమాణ స్వీకారం చేశారో.. నేడు అదే తీరును ఇమ్రాన్ ఖాన్ ఫాలో అవుతున్నారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను సైతం మోదీ ఆహ్వానించి ద్వైపాక్షిక సంబంధాలకు శ్రీకారం చుట్టారు. కాగా, నేడు ఇమ్రాన్ సైతం సార్క్ దేశాల అధినేతలతో పాటు ప్రధాని మోదీని, భారత దిగ్గజ క్రికెటర్లకు ఆహ్వానితుల జాబితాలో చోటు కల్పించారు. 1983లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను హర్యానా ‘హరికేన్’ కపిల్ దేవ్ సారథ్యంలోనే భారత్ తొలిసారి నెగ్గగా, 1992లో అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌కు వన్డే వరల్డ్‌కప్ అందించి పాక్ ప్రజలకు చిరకాల కానుక అందించారు. తాజాగా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. -
రాహుల్‌తోనే ఉంటా..
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో ప్రియాంకకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో పలువురు నేతలు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి బాసటగా నిలుస్తున్నారు. పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ రాహుల్‌ను సమర్ధించారు. పార్టీ నేతగా రాహుల్ సమర్ధుడు..2019లో మిత్రపక్షాల వెన్నుదన్నుగా రాహుల్ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతా’రని సిద్ధూ వ్యాఖ్యానించారు. తన ఒంట్లో రక్తం ప్రవహించే వరకూ తాను రాహుల్ వెన్నంటి ఉంటానని చెప్పుకొచ్చారు.మరోవైపు డీవి శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు సైతం రాహుల్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఎన్నికల్లో రాహుల్ చెమటోడుస్తున్నా స్ధానిక నాయకత్వం ఓట్లుగా మలుచుకోలేకపోవడం వంటి కారణాలతో తాము ఓటమి పాలవుతున్నామని వ్యాఖ్యానించారు. -
మాజీ క్రికెటర్‌కు సుప్రీం ఊరట
న్యూఢిల్లీ : నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కొట్టి చంపారనే కేసులో మాజీ క్రికెటర్, పంజాబ్ పర్యాటక మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను సుప్రీం కోర్టు నిర్ధోషిగా తేల్చింది. 30 ఏళ్ల క్రితం1988 డిసెంబర్ 27న సిద్ధూ అతని స్నేహితుడు రూపీందర్ సింగ్ సంధు పాటియాలలోని రోడ్డుపై తమ జీప్సీని ఆపారు. అదే దారిపై వెళుతున్న గుర్నాం సింగ్.. వాహనాన్ని పక్కకు తొలగించాల్సిందిగా సిద్ధూ, సంధులను కోరాడు. ఇది వారి మధ్య గొడవకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడిన గుర్నాం ఆస్పత్రికి తరలించిన తర్వాత మృతిచెందాడు. సిద్ధూ గాయపరచడం వల్లే గుర్నాం మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు 2006లో సిద్ధూతోపాటు, సంధుకు లక్ష రూపాయల జరిమానాతో పాటు, మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. గుర్నాం వైద్య నివేదిక అస్పష్టంగా ఉందంటూ సిద్ధూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సిద్ధూ బాధితుడిని ఉద్దేశపూర్వకంగా గాయపరిచాడని నిర్ధారిస్తూ రూ వేయి జరిమానాను విధించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు సిద్ధూ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న సిద్ధూకు న్యాయ సహాయం చేయాలని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. కానీ ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం సిద్ధూకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. -
సిద్దూకు షాక్; బ్యాంక్ అకౌంట్లు సీజ్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, పంజాబ్ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ షాకిచ్చింది. ట్యాక్స్ రిటర్న్స్‌కు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించని కారణంగా అతనికి సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. 2014-15 సంవత్సరంలో సిద్ధూ ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి సమర్పించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని, అదనంగా రూ.52 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుందని గతేడాది జనవరిలోనే ఆయనకు నోటీసులు ఇచ్చామని అధికారులు గుర్తుచేశారు. అయితే సరదు నోటీసులపై సిద్దూ అప్పీలుకు వెళ్లారని, విచారణ చేపట్టిన కమిషనర్ చివరికి పన్ను కట్టాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశామని ఐటీ శాఖ గురువారం ఒక ప్రకటన చేసింది. సిద్దూ పన్ను ఎగ్గొట్టింది వీటిపైనే..: ఐటీ శాఖ పేర్కొన్నట్లు మంత్రి సిద్దూ రూ.52 లక్షల పన్ను కట్టాల్సిఉంది. అవి ఏయే ఖర్చులకు సంబధిచినవో కూడా ప్రకటనలో పేర్కొన్నారు. 2014-15లో సిద్దూ దుస్తుల కోసం రూ.28.38లక్షలు, పర్యటన కోసం రూ38.24లక్షలు, జీతం వ్యయం రూ.47.11లక్షలు, పెట్రోల్,డీజిల్ కోసం రూ.17.80లక్షలు ఖర్చుపెట్టినట్లు ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్నారు. అయితే ఆయా ఖర్చులకు సంబంధించిన బిల్లులు లేదా ఇన్వాయిస్లను సమర్పించడంలో విఫలమయ్యారు. ఇక సిద్దూ బ్యాంక్ అకౌంట్ల సీజ్ వ్యవహారం ఇటు రాజకీయంగానూ ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్లైంది. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను స్టార్ క్యాంపెయినర్‌గా పంపాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. మాటలమాత్రికుడు సిద్ధూ అకౌంట్ల సీజ్‌పై స్పందించాల్సిఉంది. -
ఎర్రకోటలో రాహుల్ జాతీయ జెండావిష్కరణ!
న్యూఢిల్లీ : 2019 సంవత్సరంలో ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు రాహుల్‌గాంధీ సిద్ధం కావాలని, ఆయనను కార్యకర్తలు ప్రధానమంత్రిని చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఢిల్లీలో జరగుతున్న కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీలో సిద్దూ మాట్లాడారు. ప్రధానిగా ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేసేందుకు రాహుల్ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ‘ ప్రధానమంత్రి మాజీ కాగలడు. ఎంపీ మాజీ కాగలడు. ఎమ్మెల్యే మాజీ కాగలడు. కానీ ఒక కార్యకర్త ఎప్పుడూ మాజీ కాబోడు. కార్యకర్తలను రాహుల్ అక్కున చేర్చుకోవాలి. వారే ఎర్రకోటపై రాహుల్ జెండా ఎగురవేసేలా చేస్తారు’ అని అన్నారు. బీజేపీ ఎంత రచ్చ చేస్తున్నా.. కనీసం మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండి చేసినంత అభివృద్ధి కూడా చేయలేకపోతోందని చమత్కరించారు. దీంతో సోనియాగాంధీ, అశోక్ గెహ్లాట్ నవ్వుల్లో మునిగిపోయారు. -
జాకెట్ రగడపై సిద్ధూ కామెంట్స్
సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ ధరించిన జాకెట్‌పై కాంగ్రెస్, బీజేపీల వాగ్వాదం కొనసాగుతుంటే ఈ వివాదంపై పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ రాహుల్‌ను వెనుకేసుకొచ్చారు. కీలకమైన పదవిలో ఉన్నా సాధారణ జీవితం గడిపేందుకే రాహుల్ ఇష్టపడతారని తమ పార్టీ చీఫ్‌ను సిద్ధూ సమర్ధించారు. రాహుల్ గాంధీ రూ 70,000 విలువైన జాకెట్ ధరించారని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సిద్ధూ తోసిపుచ్చుతూ రాహుల్ జాకెట్ కొంటున్నప్పుడు వారు బిల్లును చెక్ చేశారా అని ప్రశ్నించారు. బిల్లును చూడకుండా దాని ధర వారికెలా తెలిసిందని నిలదీశారు. మరోవైపు రాహుల్ జాకెట్ రూ 70,000 విలువైనదన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి తోసిపుచ్చారు. రూ 700కే ఇలాంటి జాకెట్స్‌ను తాను చూపిస్తానని ఆమె సవాల్ విసిరారు. మేఘాలయాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ధరించిన జాకెట్‌పై బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. రాహుల్ ధరించిన బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బుర్బెరీ జాకెట్ ఖరీదు బ్లూమింగ్డేల్స్ వెబ్సైట్లో రూ 68,145గా ఉండటంతో బీజేపీ నేతలు ఈ ప్రచారం చేపట్టారని చెబుతున్నారు.