Officials
-
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయం తో పని చేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు -
వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు. -
అధికారులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్ గౌడ్ చెప్పారు.అసెంబ్లీలో జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్‌పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
పాలనలో సమన్వయ లోపం
ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధి పతులు, మంత్రుల సమీక్షా సమావేశం 12 గంటల పాటు జరిగింది. గత అనుభవంతో సీబీఎన్ త్వరితంగా పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవలసి ఉండగా, ఇప్పటికీ మూడుసార్లు కలెక్టర్ల సమా వేశాలు నిర్వహించి, ఎనిమిది నెలలుగా నిత్యం ఏదో ఒక శాఖ సమీక్ష చేస్తున్నా... మళ్ళీ మరో సమన్వయ సమావేశం ఎందుకు నిర్వహించినట్లు? నిజానికి ఐదేళ్ళ వైసీపీ పాలన తర్వాత ‘బ్యురోక్రసీ’ వైఖరితో ‘కూటమి’ ప్రభుత్వం సమన్వయ సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నదా? అనేది ఇక్కడ కీలకం. కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన 2022 ఉగాది నాడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మోహన్ రెడ్డి– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ సాధించే దిశలో ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్ఓపీ) పాటించి తీరాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ‘సరళీకరణ’ కాలంలో పొలిటికల్ ఎగ్జిక్యుటివ్ అధికా రులను ‘మార్గదర్శక నిబంధనలు దాట డానికి వీలులేదు’ అనే మాట పైకి అనడం చిన్న విషయం కాదు. ఈ మార్పుకు కారణం, గతంలో పాలన ‘పిరమిడ్’ తరహాలో పైన ఒక్కరిదే నిర్ణయమైతే, దిగువ పలు అంచెల్లో దాన్ని అమలుచేసే యంత్రాంగం ఉండేది. వైసీపీ ప్రభుత్వంలో పైన ఉండే నిర్ణయ శిఖరం ‘చతురస్రం’గా మారింది. విధాన నిర్ణయంలో సమష్టి బాధ్యత వచ్చింది. మండల గ్రామ సచివాలయ సిబ్బంది నిర్ణయాల అమలుకు దఖలు పడ్డారు. సీబీఎన్ శైలి దీనికి పూర్తిగా భిన్నమైంది.రాజకీయ నాయకుల నిర్ణయాల అమలుకు మాత్రమే ఐఏఎస్‌లను పరిమితం చేస్తే, తదుపరి పరిణామాలకు జడిసి కొందరు అధికారులు పోస్టులు మారుతున్నారు. సీఎం తనది ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ అని కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అంటే, అది ‘నీతి ఆయోగ్’ అయినా, ప్రపంచ బ్యాంకు షరతులు అయినా మాకు వర్తించవు’ అని చెప్పడమే అవుతుంది. సీఎం కలెక్టర్లకు చెప్పిందే సెక్రటరీలకు వర్తిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో బహుశా వేగంగా కదలని ‘ఫైళ్ళు’ ఈ సమావేశ నిర్ణయానికి కారణం కావొచ్చు.అయితే, అధికారులు ఉన్నదే వారు తమ బాధ్యతలు తాము నిర్వర్తించడానికి కనుక... ఇక్కడ 2019 ఎన్నికల ముందు జరిగింది ఒకటి చెప్పాలి. ‘సొసైటి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (‘సెర్ప్’) సంస్థ 2019 ఫిబ్రవరి 16 నాటికి ‘ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు, సోషల్ మేనేజ్మెంట్ ఫ్రేం వర్క్’ పేరుతో ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఈ పనిలో ప్రపంచ బ్యాంక్ది ప్రధాన భూమిక.రాష్ట్ర విభజన జరిగిన నాలుగున్నర ఏళ్ల తర్వాత, ఎన్నికల ముందు పేదరిక నిర్మూలన కొరకు రూపొందించిన అధికారిక ‘డాక్యుమెంట్’ ఇది. ఇది జరిగిన నాలుగు నెలలకు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మనకు ‘నెట్’లో అందుబాటులో ఉన్న ఈ పత్రం– ‘వైరుధ్య –ఆంధ్రప్రదేశ్’ అనే ముందుమాటతో మొదలవుతుంది. అందులో – ‘ఇక్కడ ఒకపక్క వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యుత్తు, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమలు, ఐటీ వృద్ధికి పబ్లిక్–ప్రైవేట్ పెట్టుబడులు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో పేదరికం కూడా తగ్గుతున్నది. కానీ ఇక్కడి వ్యవసాయ రంగంలో రైతుల వెతలు అలాగే ఉన్నాయి. సామాజిక మానవీయ విలువల సూచీ అట్టడుగున ఉంది. ఇక్కడి మహిళా స్వయం సహాయ సంఘాల చొరవ గొప్ప మార్పుకు నాంది పలికినా అది ఎస్సీ, ఎస్టీల విషయంలో సామాజిక పెట్టుబడిగా రూపాంతరం చెందలేదు. దాంతో వారి ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్య వసతుల మెరుగు దలను అది ఏ మాత్రం ప్రభావితం చేయలేక మినిమవ్‌ు డెవలప్మెంట్ గోల్స్ (ఎండీజీ) వద్దకు వారిని చేర్చలేక పోయింది.’ ఇది చదివాక, మన కామన్ సెన్స్‌కు వచ్చే ప్రశ్నలు రెండు. ఈ పత్రంలోని అంశాలు తన ప్రభుత్వ కృషి ఫలితం అని సీబీఎన్...పైకి అనకపోవడానికి కారణం ఏమిటి? ఈ నివేదికలో గుర్తించిన వ్యత్యాసాలను అధిగమించేలా తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పథకాలను అమలు చేసింది. అయితే వాటిలో లోపాలు ఉంటే వాటిని చూపడం కాకుండా, ‘సంక్షేమమేనా... అభివృద్ధి ఏదీ?’అంటూ ముప్పేట దాడి చేయడం ఏమిటి? ఈ ‘పత్రం’ సీబీఎన్ ప్రాధాన్యాలలోని అంశం కాకపోవచ్చు. అలాగే పేదలకు మేలు చేసేది కనుక వైసీపీ దాన్ని తన మేనిఫెస్టోలో చేర్చి ఉంటుంది. ఇప్పుడు కూడా ‘కూటమి’ దాని ఊసు ఎత్తడం లేదంటే దాన్ని అమలుచేసే ఆలోచన లేక కావొచ్చు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ గైర్హాజరు.. తెలంగాణ తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కేఆర్ఎంబీ భేటీకి ఏపీ గైర్హాజరు కావడంపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీపై కనీసం గౌరవం లేదా అంటూ తెలంగాణ ప్రశ్నించింది. 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకొని.. ఇప్పుడు రాకపోవడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) అనిల్ కుమార్ హాజరయ్యారు. అయితే, ఇవాళ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరు కాలేదు. దీంతో రేపు(గురువారం) మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. ఏపీ నుంచి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా స్పందిస్తూ.. ఏపీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదంటూ మండిపడ్డారు.తెలంగాణ నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. సదరు ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కేటాయింపులపై కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఏపీ అధికారులు హాజరుకాకపోవడంతో రేపు మరోమారు భేటీ కావాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. -
మేము ఒక తప్పు చేయాలంటే, ఒకటేంటి సార్ మూడు చేద్దామంటున్నారు... అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా లేను... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
-
ఒక తప్పు చేయాలంటే.. మూడు చేద్దామంటున్నారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘గతంలో ప్రజాప్రతినిధులు ఏవైనా అంశాలను ప్రస్తావిస్తే 70, 80 శాతం మంది అధికారులు అందులోని లోటుపాట్లు, చట్ట విరుద్ధతను వివరించేవారు. వాటితో ఏ విధంగా సమస్య వస్తుందో చెప్పారు. ఇలా చేస్తే ప్రజలకు, రాష్ట్రానికి, మీకూ ఇబ్బందేనని వివరించి నాయకులకు జ్ఞానోదయం కల్పించేవారు. ఈ రోజుల్లో అలా చేయడం తగ్గిపోయింది. మేం ఒక తప్పు చేయాలంటే.. ఒకటేంది సార్ మూడు చేద్దాం బాగుంటుంది. బలంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఎందుకు.. రేపు కొత్తగా మూడు తప్పులు చేయవచ్చంటున్న అధికారులను చూస్తున్నాం. ఇది సమాజానికి మంచిదికాదు’’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణలో ఉన్నప్పుడే ఐఏఎస్, ఐపీఎస్‌లు సివిల్ పంచాయితీలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఐఏఎస్ అధికారుల ఇనిస్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుత సివిల్ సర్వెంట్ల ధోరణి బాగోలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే...‘‘ప్రజాప్రతినిధులు తమ వద్దకు వచ్చిన వాళ్లను సంతోషపెట్టాలనో, తనకు సంతోషం కలగాలనో కొన్ని ఆదేశాలిస్తుంటారు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదే. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కేటాయించే బాధ్యతలకు వారి చదువులు, నేపథ్యంతో సంబంధం ఉండదు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్నవారికి వైద్యారోగ్య శాఖ, ఏమీ చదువుకోని వారికి విద్యాశాఖ, బాగా చదువుకున్న వారికి కార్మిక శాఖ ఇవ్వొచ్చు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పాటు అందించడానికి సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారులను ఇస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా నోట్ ఫైల్ తయారు చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవ్వాళ, రేపు అదేమీ ఉండటం లేదు.శిక్షణలోనే సివిల్ పంచాయతీలు..ఎంతో మంది అధికారులు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి సేవచేశారు కాబట్టే మన దేశం ఇంతగా బలపడింది. ఆర్థికంగా నిలదొక్కుకుంది. నేడు వస్తున్న కొత్త తరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకులనే కాదు, సమాజంలో ఉన్న చెడులన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. కొత్తగా ఎంపికైన ఐఏఎస్, ఐపీఎస్‌లు శిక్షణలో ఉన్నప్పుడే పోలీసు స్టేషన్లకు వెళ్లి డ్రెస్ వేసుకుని కూర్చుని, సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నిస్తుండటం దురదృష్టకరం. కొందరిలోనైనా మార్పు రావాలనే ఈ విషయాలను ఈ వేదిక మీద పంచుకుంటున్నాను.ఏసీ అనే జబ్బు ఏమో..ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలను వారి సర్వీస్ బుక్స్‌లో రికార్డు చేయాలని సీఎస్‌ను పదేపదే కోరుతున్నాను. అసలిప్పుడు అధికారులు ఏసీ రూమ్‌ల నుంచి బయటికి వెళ్లడానికే వెనకాడుతున్నారు. నాకు తెలియదు.. అది ఏసీ అనే జబ్బు ఏమో. ఐఏఎస్, ఐపీఎస్ ఒక జిల్లాకు నేతృత్వం వహించినప్పుడు ప్రజల దగ్గరికి వెళితే వచ్చే అనుభవమే గొప్పది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైళ్లు చూడటమే ఉంటుంది. సచివాలయానికి వస్తే ప్రజలతో మాట్లాడే అవకాశం కోల్పోతారు.అధికారుల తీరుతో సంతోషంగా లేనునేను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీటీసీగా ఉన్నప్పుడు విశాలంగా ఉన్న ఆ జిల్లా ఒక మూల నుంచి మరో మూలకు అంబాసిడర్ కారులో చేరాలంటే ఏడెనిమిది గంటలు పట్టేది. ఆ రోజుల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులు అచ్చంపేట అడవుల్లోకి వెళ్లి ఆదివాసీల సమస్యలు తెలుసుకుని, మళ్లీ తిరిగి వచ్చేందుకు రోజులు పట్టేది. అప్పట్లో నేతల కంటే అధికారులే ప్రజలతో మమేకమయ్యేవారు. కలెక్టర్ వద్దకు వెళ్తే తమ సమస్య పరిష్కారం అవుతుందన్న గొప్ప నమ్మకం ప్రజల్లో ఉండేది. కలెక్టర్ తమ గూడేనికి వచ్చి సమస్యలు విన్నారని గొప్పగా చెప్పుకునేవారు. శిక్షణ ఐపీఎస్‌లకు కానిస్టేబుల్ డ్యూటీలు వేసి నైట్ పెట్రోలింగ్ వంటి క్షేత్రస్థాయి విధుల్లో ఉండే సాధకబాధకాలపై అవగాహన కల్పించేవారు. ఇప్పుడు వ్యవస్థ ఎక్కడికి పోతోందో నాకు తెలియదుగానీ.. జరుగుతున్న పరిణామాలు, అధికారుల వ్యవహార శైలితో నేను సంతోషంగా లేను. నేను అందరి గురించి మాట్లాడటం లేదు. సీఎంగా నాకున్న పరిమిత అనుభవాన్ని పంచుకుంటున్నాను.నిబద్ధత గల అధికారులకు గుర్తింపు ఉంటుందిఅధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత గల అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. వచ్చీ రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు. రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నప్పుడు నిబద్ధత గల అధికారి ఎక్కడ ఉన్నాడో వెతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. మా పనితీరు బాగుండాలంటే అధికారుల పనితీరు బాగుండాలి. మేం విధాన నిర్ణయాలు చేయగలం. అమలు చేయాల్సింది అధికారులే. సీనియర్, రిటైర్డ్ ఐఏఎస్‌లతో సమావేశాలు నిర్వహించి వారి అనుభవాలను ఇప్పటి అధికారులకు తెలియజేయానికి ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు ఉపయోగపడే, పేదోడికి సహాయపడాలనే ఆలోచన చేయాలి. అంతేతప్ప ఏ విధంగా అడ్డు వేయాలి, ఏవిధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా నెగిటివ్ కామెంట్స్ రాయాలనే ఆలోచన తగ్గించుకుని సానుకూల దృక్పథం చూపితే చాలా కాలం గుర్తుండిపోతారు.ఈ పుస్తకం నుంచి ఎంతో నేర్చుకోవచ్చురిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణనాయుడు తన జీవిత కాల అనుభవాలన్నీ నిక్షిప్తం చేసి తీసుకొచ్చిన ఈ పుస్తకం దేశానికి సేవలు అందించబోయే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులకు బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిది. ఆరు దశాబ్దాల తన అనుభవాలను ఒక పుస్తకంలో నిక్షిప్తం చేయడం క్లిష్టమైన పని. ఇందులో గోపాలకృష్ణ విజయవంతం అయ్యారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు అందరితో తనకున్న అనుభవాలను ఆయన పుస్తకరించారు. కొత్తగా సర్వీస్‌లో చేరే అధికారులు ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు.వారి బాటలో నడవాలి..మాజీ ఐఏఎస్ శంకరన్ అణగారిన వర్గాల పట్ల నిబద్ధతతో పనిచేసి గొప్ప పేరు సాధించారు. మరో మాజీ ఐఏఎస్ టీఎన్ శేషన్ దేశంలో ఎన్నికల సంఘం ఒకటి ఉందని అందరికీ తెలియజేసిన గొప్ప అధికారి. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే నేడు దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోవడానికి బాటలు వేసింది. వారి అనుభవాల నుంచి నేటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేర్చుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
లంచం ఇస్తేనే ఆక్వా సాగు.. అటవీ అధికారుల వీడియో వైరల్
-
కష్టాలు చెబితే కస్సు బస్సు..
-
‘సాక్షి’ కథనంతో సరిదిద్దారు!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆటో మొబైల్ రిపేర్ వర్క్‌షాప్ నిర్వాహకుడు లింగరాజుకు ఇటీవల వచ్చిన రూ.25,666 కరెంట్ బిల్లును అధికారులు సరి చేశారు. ఈమేరకు ఈ నెల 24న ‘సాక్షి’ జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన ‘గుండె గుబిల్లు’ కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు. బిల్లును రూ.2,100గా సరిదిద్దారు. అధికారులకు మొర పెట్టుకున్నా తన సమస్య పరిష్కారం కాలేదని, సాక్షిలో వెలువడిన కథనంతో ఊరట లభించిందని లింగరాజు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయన ఇంట్లో మీటర్ సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు కొత్తది అమర్చారు. అక్టోబర్, నవంబర్ నెలల బిల్లును సిబ్బంది నమోదు చేయలేదు. డిసెంబర్లో ఏకంగా రూ.25,666 కరెంట్ బిల్లును లింగరాజు చేతిలో పెట్టారు. దీనిపై ‘సాక్షి’ లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు తప్పును సరిదిద్దారు. -
అధికారులకు అరగంట శిక్ష!
అధికారులు ప్రజలతో వ్యవహరించే తీరు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటుంది. ఆ టైంలో చూసేవాళ్లకు రక్తం మరిగిపోతుంటుంది. వాళ్లు ఉన్నది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా! అనుకుంటాం. అయితే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఇక్కడ ఓ ఉన్నతాధికారి భలే శిక్ష విధించారులేండి.అది నోయిడా అథారిటీ కార్యాలయం. సోమవారం నాడు ఓ వృద్ధ జంట తమ పని కోసం అక్కడికి వచ్చారు. చాలాసేపు దాకా అక్కడున్నవాళ్లెవరూ వాళ్లను పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వాళ్లు అలా నిలబడే ఉండిపోయారు. ఇది నోయిడా అథారిటీ సీఈవో లోకేష్ ఎం గమనించారు. మరో అరగంట పోయాక చూస్తే.. ఆ వృద్ధ జంట అలాగే నిలబడి ఉన్నారట!. దీంతో.. ఆయన తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు.వెంటనే.. బయటకు వచ్చి అరగంట పాటు నిలబడి పని చేయండి అని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు. అలా నిలబడి పని చేస్తే.. ఆ వృద్ధ జంట పడ్డ కష్టమేంటో మీకు తెలుస్తుంది అని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ సర్!.. ప్రస్తుతం ఆ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.In Noida Authority, an elderly couple was struggling to get their file approved but faced complete neglect. Witnessing this, the CEO took a bold step – ordered all employees to stand and work for 30 minutes as punishment!#CEO #Noida pic.twitter.com/RrZMOAc4xn— Sneha Mordani (@snehamordani) December 17, 2024 -
పవనూ.. ఎవరి మీద ఈ ఆవేశం? (ఫొటోలు)
-
వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ రెడ్డి, కావ్య, రఘునందన్, డీకే అరుణ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై చర్చించారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వే లైన్లతో పాటు అండర్ పాసులు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని.. 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు తీసుకొస్తాం. రూ.720 కోట్లతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. రూ. 430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మరో రూ.650 కోట్లు కావాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.జంట నగరాల నుంచి యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంఎంటీస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రైల్వే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసి, చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద సర్వీసును పొడిగిస్తున్నాం. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే పనుల కోసం సుమారు 6 వేల కోట్లు బడ్జెట్ మంజూరు అయింది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
రతన్‌టాటాకు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
‘హైడ్రా’ బూచి కాదు: రంగనాథ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా బూచి కాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. భవిష్యత్ తరాలకోసమే అక్రమ కట్టడాలు కూలుస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ)శాఖ కార్యదర్శి దానకిషోర్తో కలిసి రంగనాథ్ శనివారం(సెప్టెంబర్28) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గతంలోనూ మూసీ నిర్వాసితులను తరలించారు.చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తుతోంది. భారీగా వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏమీ చేయలేరు.మూసీని సుందరీకరించడం కోసం కూల్చివేతలు చేయడం లేదు.గతంలో మూసీ సుందరీకరణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు’అని పురపాలక కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యం, 2 నెలలుగా హైడ్రా కూల్చివేతలు జరుపుతోందిచెరువుల ఆక్రమణలు తొలగించాం.. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారువరదల నుంచి ప్రజలను కాపాడటమే హైడ్రా లక్ష్యం. ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చుతున్నాంఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకుంటూపోతే కట్టడి చేయవద్దా?ఆక్రమణల్లో పేదవాళ్ల ఇళ్లు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదుమేము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవుభవిష్యత్తులో వరదలతో కోటి మంది ఇబ్బంది పడతారుఆస్పత్రుల్లో పేషెంట్లు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తున్నారుకొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందిహైడ్రాను భూతంలా చూపిస్తున్నారు. తప్పు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాంహైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు హైడ్రాపై ఆందోళన వద్దు..నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం: దానకిషోర్వందేళ్ల క్రితమే నిజాం మూసీ నది అభివృద్ధి నమూనాలు రూపొందించారు.ఈ నమూనాలు థేమ్స్ నది కంటే అద్భుతంగా ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో ఇటీవల 20 నిమిషాలకే 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది.20 నిమిషాల కొద్దిపాటి వర్షానికే నగరం మునుగుతోంది.మరో 20 నిమిషాలు వర్షం పడితే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితిమూసీ ఒడ్డున కూల్చివేతలు సుందరీకరణ కోసం మాత్రమే కాదు..ప్రమాదం నుంచి కాపాడేందుకు కూడాపేద ప్రజలు నీళ్ళల్లో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మూసీ ప్రక్షాళనప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల పర్యటన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అక్టోబర్‌లో ఉంటుంది.మూసీ నీళ్ల శుద్ధి కోసం 3800 కోసం కొత్త ఎస్టీపీలు తీసుకువస్తాం.మూసీ నీళ్లను మంచి నీళ్ళుగా మార్చేందుకు రూ. 10వేల కోట్లతో పలు కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి.మూసీ పరీవాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.10వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తే వెళ్తామని మాతో చెప్పారు..కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి.మూసీ బాధితులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది.. ఈ విషయమై కమిటీ వేశాం.మూసీ నదీ పరివాహక ప్రాంత వాసులను 14 ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నాం.పిల్లల చదువుల కోసం తల్లితండ్రులు ఆందోళన అవసరం లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.23 లోకేషన్లలో నిర్వాసితులు మానసికంగా ఆందోళన చెందకుండా కౌన్సెలింగ్ ఇస్తారు.సీనియర్ అధికారులతో కాంప్స్ ఏర్పాటు చేస్తాం.50 కుటుంబాలను ఇప్పటికే షిఫ్ట్ చేశారు... మరో 150 కుటుంబాలు షిఫ్ట్ చేస్తున్నారు.హైడ్రా వస్తుంది కూలుస్తుంది అనేది అవాస్తవం...ప్రజలు ఆందోళన అవసరం లేదు.ఏ కుటుంబాలను బలవంతంగా షిఫ్ట్ చేయించడం లేదు..స్వచ్చందంగా ప్రజలు సహకరించాలినష్టపరిహారం ఇవ్వాల్సిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం ఇస్తుంది. ఇదీచదవండి: హైడ్రా బాధితుల తరపున కొట్లాడతాం: బీఆర్ఎస్ -
‘రెడ్ మార్క్’ గోబ్యాక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది గర్భంలో, బఫర్‌జోన్‌లో నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేయడానికి వెళ్తున్న అధికారులకు అడుగడుగునా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఏళ్లకేళ్లుగా కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లను వదిలిపొమ్మనడం ఏమిటంటూ పరీవాహకంలోని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం రెండోరోజు శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు.రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపైనా తమ ఆక్రోశం వెళ్లగక్కారు. అభివృద్ధి అంటే ప్రజలకు మంచి జరగాలని.. తమను ముంచి చేసే అభివృద్ధి ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు మహిళలు బాధతో శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే బృందాలు ఇళ్ల మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మూసీ పరీవాహకంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే తరలివెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పక్కా ఇళ్లు కట్టుకున్నవారు కూల్చివేతను, తరలిపోవడాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే ఎలా బతకాలంటూ చైతన్యపురి వినాయక్‌నగర్ కాలనీలో మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మరో మహిళ తమ ఇల్లు పోతే ఎలాగనే కలతతో రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురిలో బాధితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి.. మూసీ పరీవాహకంలో లంగర్‌హౌస్‌లోని వివిధ బస్తీల్లోని ఇళ్లకు అధికారులు గురువారం రాత్రి మార్కింగ్స్ వేశారు. అలా మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి బాధితులు రాళ్లు పట్టుకొని ఉన్నారన్న హెచ్చరికలతో వెళ్లలేదు. అప్పటికే స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని.. రాత్రివేళ ఆందోళనలు వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. తహసీల్దార్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. మూడు గంటలు దిగ్బంధం కార్వాన్‌లోని జియాగూడ, పరిసర ప్రాంతాల వారు.. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని భారీ ఆందోళనకు దిగారు. ఇక్కడి ప్రధాన రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేసి.. అధికారులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చనివ్వబోమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంటిమీద కునుకు కరువు! మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. జీవితకాలం సంపాదించి కట్టుకున ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పాపం ముటగట్టుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఉదయం ఆరేడు గంటల నుంచే బస్తీల్లో అలజడి కనిపిస్తోంది. పెద్దలు పనులకు వెళ్లకుండా, పిల్లలను బడులకు పంపకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరెవరు బస్తీలోకి వస్తున్నారు, అధికారులు వస్తున్నారా అని ఆందోళనగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంటిని ఖాళీ చేసే మాటేలేదు 30ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పడు కూలగొడతామంటూ ఊరుకునే మాటే లేదు. ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. మేం అన్ని పన్నులు కడుతున్నాం. ఇక్కడే బతుకుతాం. – నవనీత, కమలానగర్ (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి02) భవిష్యత్తు ఆశలను కూల్చేస్తారా? పైసా పైసా కూడబెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే.. ఇల్లు మాత్రమేకాదు. భవిష్యత్తు ఆశలూ పోయినట్టే. మా బతుకులను బజారున పడేయొద్దు. – స్వప్న, గోల్నాక (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి03 ) అనుమతులు తీసుకుని ఇళ్లుకట్టుకున్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బ్యాంకు లోన్‌తో ఇళ్లు కట్టుకున్నాం. 70–80 ఏళ్ల వయసున్న వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? – లక్షి్మ, న్యూమారుతీనగర్ 56 ఏళ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికి వెళ్లాలి? 1968 నుంచి అంటే 56 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడివారంతా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. హైటెక్ సిటీ కంటే సేఫ్‌గా ఉంటున్నాం. ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట రోడ్ల పాలు చేస్తున్నారు. మేమేం కబ్జా చేసి ఇళ్లు కట్టుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? న్యాయం కోసం పోరాడుతాం. – ఉపేందర్, న్యూమారుతీనగర్ -
‘మూసీ’ గేట్లు ఎత్తివేత: చుట్టూ నీరు.. మధ్యలో పశువుల కాపరులు
సాక్షి, నల్గొండ జిల్లా: మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టింది. దీంతో మధ్యలో పశువుల కాపరులు చిక్కుకున్నారు. సాయం కోసం గంగయ్య, బాలస్వామి ఎదురు చూస్తున్నారు.వరదలో 26 గేదెలు, ఆవులు కొట్టుకుపోయాయి. ట్రాక్టర్ నీటిలోనే మునిగిపోయింది. ప్రస్తుతం బండరాయిపైనే గంగయ్య, బాలస్వామి కూర్చుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసుల చర్యలు ప్రారంభించారు. నల్గొండ డీఎస్పీ శివరామ్‌రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన సిబ్బందిని పంపించారు. ప్రొక్లెయినర్ సాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం -
అధికారులు మాట వినడం లేదట!.. టీపీసీసీ చీఫ్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ మాట వినడం లేదంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు మహేష్‌గౌడ్ అప్పగించారు. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదాపూర్ రాడియంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపడుతోంది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో శనివారం నుంచి జిల్లా స్థాయి సమీక్షలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలుజిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశాల ప్రాతిపదికగా ఈ సమీక్షలు జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని స్థాయిల నాయకులు పాల్గొననున్నారు. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
హైడ్రా మరో సంచలన నిర్ణయం
-
మారని ఉద్యోగుల తీరు.. ఉదయం 11 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనం
-
అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) హాల్ టికెట్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో, అమ్మాయి హాల్ టికెట్‌పై అబ్బాయి ఫొటో, సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోయారు. సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడో పొరపాటు జరిగిందని, హాల్ టికెట్ల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.తప్పులు సరిచేస్తామంటున్న విద్యాశాఖడీఎస్సీ పరీక్ష ఈ నెల 18 నుంచి మొదలవుతుంది. పరీక్షకు సీరియస్‌గా సన్నద్ధమవుతున్న యువత హాల్ టికెట్ల గందరగోళంతో కంగారు పడుతోంది. అయితే ఈ తప్పిదాలకు విద్యాశాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరణ ఇచ్చారు. అసలు తామెలా ఫొటోలు, సంతకాలు మారుస్తామని వారు అంటున్నారు. సిస్టమ్ జనరేటెడ్ హాల్ టికెట్లను తాము చూసే అవకాశమే లేదంటున్నారు. తప్పులు దొర్లినట్టు వచ్చిన అభ్యర్థులకు తక్షణమే సరిచేసి న్యాయం చేస్తున్నామని విద్యాశాఖ వెల్లడించింది.మొదట్నుంచీ వివాదమేడీఎస్సీ నిర్వహణ మొదట్నుంచీ వివాదాస్పదమే అవుతోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన వారికి ప్రిపరేషన్ లేకుండా డీఎస్సీ పెట్టడంపై అభ్యర్థులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇవన్నీ కోచింగ్ కేంద్రాలు, రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే నేతలు సృష్టించినవేనని ప్రభుత్వం కొట్టి పారేసింది. తాజాగా హాల్ టిక్కెట్లు ఈ నెల 11 నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, చాలా చోట్ల అవి డౌన్లోడ్ కావడం లేదనే ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విద్యాశాఖ సోమవారం వివరణ ఇచ్చింది. అన్ని చోట్ల డౌన్లోడ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున సోమవారం విద్యార్థులు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఫొటోల తారుమారుమేడ్చెల్ జిల్లా దమ్మాయి గూడ బాలాజీ నగర్‌కు చెందిన పల్లెపు రామచంద్రయ్య డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హాల్ టికెట్లో అతని పేరు సక్రమంగానే ఉంది. కానీ ఫొటో మాత్రం ఎవరో అమ్మాయిది వచ్చింది. సంతకం కూడా తనది కాదని గుర్తించాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినన రుద్రారపు భవ్య డీఎస్సీలో ఎస్ఏ పోస్టుకు అప్లై చేసింది. ఆమె ఫొటో బాదులు వేరే అబ్బాయి ఫొటో వచ్చింది. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. తక్షణమే స్పందించిన అధికారులు ఆమె ఫొటో వచ్చేలా చేశారు.నిజంగా నెట్ సెంటర్లదే తప్పా?అభ్యర్థులు నెట్ సెంటర్లలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వారి ఫొటో, సంతకాలను డిజిటల్ చేసి ఇస్తుంటారని తెలిపారు. ఎక్కువ మంది ఉండటంతో నెట్ యజమానులు ఒకరి ఫొటోకు బదులు వేరొకరి ఫొటో పెట్టారని అంటున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏ ఫొటో, సంతకం ఉంటుందో హాల్ టికెట్‌లోనూ అదే వస్తుందని, దీనికే తమను నిందిస్తే ఎలా అని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం
-
బూతు తమ్ముళ్లు..నరుకుతా..
-
పచ్చ బిళ్ల వేసుకుని వెళ్లండి: అచ్చెన్నాయుడు
గంగ చంద్రముఖిగా మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండు వారాల్లోపే టీడీపీ నేతలు తమ అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి నిదర్శనంశ్రీకాకుళం, సాక్షి: ‘‘టీడీపీ కార్యకర్తల్లారా.. పసుపు బిళ్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడి అధికార యంత్రాంగం సకల రాచమర్యాదలు చేస్తుంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు..’’ అంటూ ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.‘‘.. ఏ ఆఫీస్ అయినా సరే. పసుపు బిళ్ళతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు. అలా వారికి నేను ఆదేశాలను జారీ చేస్తా. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా. ఒకరో ఇద్దరో ఆ మాట జవ దాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను ఆ అధికారులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా నేనే సమావేశం పెట్టి ఆ అధికారుల్ని ఆదేశిస్తా’’ అని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న భరోసా ఇచ్చారు. అంతేకాదు.. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. AP Animal Husbandry and Fisheries Minister Atchannaidu’s open warning to officials and brazen abuse of power. Honorary Minister tells govt officials to salute TDP workers and give them royal treatment in govt offices. #Atchannaidu #TDP #AP #AndhraPradesh pic.twitter.com/NSPY9FGFfQ— Sakshi Post (@SakshiPost) June 18, 2024 VIDEO CREDITS: Sakshi Post -
TG: ‘ముందు మాట’ వివాదం.. ఇద్దరు అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్‌లో వచ్చిన తప్పులను సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి ఇవ్వనున్నారు. -
‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్
ఓ నగర మేయర్ మున్సిపల్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ అంటూ సదరు అధికారిపై ఫైల్‌ను విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే సమావేశంలో ఓ అధికారిపై ఫైలు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైన్ క్లీనింగ్, ఇతర సమస్యలపై అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్థానిక జోన్-3 జోనల్ ఇంజనీర్ నుల్లా శుభ్రపరిచే సమీక్షకు సంబంధించి ఆమెను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో ప్రమీలా పాండే సదరు అధికారిపై మండిపడినట్లు సమాచారం. ఇంజనీర్ తన మండలంలో మార్చిలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదే విషయంలో మేయర్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మేలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినప్పుడు, జోనల్ ఇంజనీర్ మార్చిలో పని ప్రారంభించినట్లు ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టినంత పనిచేయబోయారు. చేతిలో ఫైల్ని సదరు అధికారిపై విసిరేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..పలువురు నెటిజన్లు మేయర్‌కు అండగా నిలుస్తోన్నారు. #WATCH | Uttar Pradesh: Kanpur Mayor Pramila Pandey throws a file at an officer during a meeting of officials held on drain cleaning and other issues in the Kanpur Municipal Corporation office. pic.twitter.com/rsrEQHBveg— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2024 -
నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఆహ్వానం (ఫోటోలు)
-
తెలంగాణ అధికారుల బదిలీ
-
బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
సాక్షి, అమరావతి : బడుగు, బలహీనవర్గాలంటే ఎంతటి ద్వేషమో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా చాటుకున్నారు. తాను అధికారంలో ఉండగా బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్న ఘనుడీయన. అత్యంత అవినీతిపరుడైన తన సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర రావు వంటి అధికారులను అడ్డం పెట్టుకుని కేంద్ర భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిన బరితెగింపు చరిత్ర కూడా ఆయనదే. ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు.అందుకే ఏకంగా అధికార వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అధికారులే లక్ష్యంగా కుట్రలకు తెగించారు. దాంతో పాటు రెడ్డి సామాజికవర్గం అధికారులపైనా కుట్రపూరితంగా దు్రష్పచారం చేస్తున్నారు. ఆ సామాజికవర్గాల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పక్కా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో తమ అక్రమాలకు అడ్డు లేకుండా చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యం.అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాల అధికారులపై కొంతకాలంగా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేస్తున్నారు. అవాస్తవాలు, అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీతో జట్టు కట్టిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, తన వదిన దగ్గుబాటి పురందేశ్వరిని కూడా చంద్రబాబు తన పన్నాగంలో భాగస్వామిని చేసి, ఉమ్మడి కుట్రకు తెరతీశారు. టీడీపీ ఇచి్చన స్క్రిప్ట్ మేరకు పురందేశ్వరి కూడా అవే అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు.చంద్రబాబు ఏ సామాజికవర్గాల అధికారులపై అసత్య ఆరోపణలు చేశారో.. సరిగ్గా ఆ అధికారులపైనే పురందేశ్వరి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ సామాజికవర్గాలకు చెందిన అధికారుల నిబద్ధత, సమర్థతపై అపవాదులు వేస్తున్నారు. అనంతరం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ బడుగు, బలహీనవర్గాలు, రెడ్డి సామాజికవర్గ అధికారులను హఠాత్తుగా బదిలీ చేయిస్తున్నారు. ఆ అధికారులను ఆత్మన్యూనతకు గురి చేసి వేధిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలే సమిధలు చంద్రబాబు, పురందేశ్వరి ఈసీకి పదే పదే చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్న పేర్లలో 70% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనార్టీల అధికారులే. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులు 20% ఉన్నారు. టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ ఇప్పటివరకు బదిలీ చేసిన, చార్జ్ మెమోలు జారీ చేసినవారిలో ఏకంగా 90% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నారు. చంద్రబాబు కుట్రకు తలొగ్గి ఈసీ ఇప్పటివరకు 29 మంది అధికారులను బదిలీ చేసింది.వారిలో 14 మంది అంటే దాదాపు 50% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనారీ్టలకు చెందిన అధికారులే. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 11 మందిని బదిలీ చేసింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో ముగ్గురికి చార్జ్ మెమోలు జారీ చేసింది. అంటే మొత్తం 14మందిపై చర్యలు తీసుకుంది. అంటే టీడీపీ కుట్రలతో బదిలీ అయినవారిలో ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అధికారులే 90% ఉండటం విభ్రాంతి కలిగిస్తున్న వాస్తవం. బ్రాహ్మణ, బలిజ, క్షత్రియ సామాజికవర్గాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.చంద్రబాబు ఒత్తిడితో ఈసీ బదిలీ చేసిన అధికారుల జాబితా ఇలా ఉంది.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ∙పి. రాజా బాబు (కలెక్టర్, కృష్ణా జిల్లా) ∙పీఎస్ గిరీషా (కలెక్టర్, అన్నమయ్య జిల్లా) ∙కల్పనా కుమారి (పీవో, సీతంపేట ఐటీడీయే, పార్వతీపురం మన్యం జిల్లా) ∙జి. పాలరాజు (ఐజీ, గుంటూరు) ∙కేకేఎన్ అన్బురాజన్ (ఎస్పీ, అనంతపురం జిల్లా) ∙పి. జాషువా (ఎస్పీ, చిత్తూరు జిల్లా) ∙పి.శరత్ బాబు (సీఐ, మాచర్ల) ∙వంగా శ్రీహరి (ఎస్సై, వెల్దుర్తి) ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు ∙జి. లక్ష్మీశా (కలెక్టర్, తిరుపతి జిల్లా) ∙ఇ. మారుతి (ఎస్సై, సదుం, చిత్తూరు జిల్లా) బీసీ సామాజికవర్గానికి చెందినవారు ∙టి. కాంతి రాణా (పోలీస్ కమిషనర్, విజయవాడ) ∙సీహెచ్. అంజు యాదవ్ (సీఐ, శ్రీకాళహస్తి) ∙చిన మల్లయ్య (సీఐ, కారంపూడి) ముస్లిం మైనారీ్టలు ∙మహబూబ్ బాషా (డీఎస్పీ, రాయచోటి)రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ∙కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి (డీజీపీ) ∙ఆర్.ఎన్. అమ్మిరెడ్డి (డీఐజీ, అనంతపురం) ∙ఎం. గౌతమి (కలెక్టర్, అనంతపురం జిల్లా) ∙కె. తిరుమలేశ్వరరెడ్డి (ఎస్పీ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా) ∙పి. పరమేశ్వర్‌రెడ్డి (ఎస్పీ, ప్రకాశం జిల్లా) ∙వై. రవిశంకర్‌రెడ్డి (ఎస్పీ, పల్నాడు జిల్లా) ∙రిశాంత్‌రెడ్డి (ఎస్పీ, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక విభాగం) ∙వీర రాఘవరెడ్డి (డీఎస్పీ, అనంతపురం) ∙సి. మహేశ్వర్‌రెడ్డి (సీఐ, పలమనేరు, చిత్తూరు జిల్లా) ∙పి.జగన్మోహన్రెడ్డి (సీఐ, తిరుమల) ∙జి. అమర్నాథ్రెడ్డి (సీఐ, తిరుమల) ఈసీ చార్జ్‌మెమో జారీ చేసిన అధికారులు ∙కె. రఘువీరారెడ్డి (ఎస్పీ, నంద్యాల) ∙ఎన్. రవీంద్రనాథ్‌రెడ్డి (డీఎస్పీ, నంద్యాల) ∙కె. రాజారెడ్డి (సీఐ, నంద్యాల టూటౌన్) బదిలీ అయిన ఇతర ఓసీ సామాజికవర్గాల వారు ∙పీఎస్ఆర్ ఆంజనేయులు (డీజీ, ఇంటెలిజెన్స్) (బ్రాహ్మణ) ∙ఆర్. వినోద్ (ఎస్సై, తిరుమల) (క్షత్రియ) ∙ బీవీ శ్రీనివాసులు (ఎస్సై, తిరుమల), (బలిజ) -
ఇద్దరు ఓటర్లు.. 107 కిలోమీటర్లు.. ఎన్నికల అధికారుల సాహసం!
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్ పూనమ్ పాండేకు మరో భారీ షాక్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె, ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్‌కతాకు చెందిన అమిత్ రాయ్ పూనమ్ పాండేకు లీగల్ నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె అధికారిక ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ మరునాడే తాను బతికే ఉన్నానని, సర్వైకల్ కేన్సర్ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో రిలీజ్ చేయండం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
లండన్ థేమ్స్‌లా మూసీ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని.. హైదరాబాద్‌కు కూడా అటువంటి ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అటు మూసీ నది వెంబడి, హుస్సేన్‌సాగర్ చుట్టూ, ఉస్మాన్‌సాగర్ వంటి జలాశయాలు కేంద్రంగా హైదరాబాద్ అభి వృద్ధి చెందిందని చెప్పారు. మూసీకి పునర్వై భవం తీసుకొస్తే.. నది, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపక ల్పనలో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ బృందం బ్రిటన్‌లోని లండన్‌లో పర్యటించింది. ఆ నగరంలోని థేమ్స్ నదిని పరిశీలించి.. దానిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. తర్వాత థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సమా వేశమై చర్చించారు. విజన్ 2050కి అనుగుణంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నామని, దీనికి సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. అభివృద్ధితోపాటు సంరక్షణకు ప్రాధాన్యం దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్కెహల్ లివీ తదితరులు సీఎం రేవంత్ బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, అనుసరించిన విధానాలను తెలిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు ప్రాధాన్యమి చ్చినట్టు స్పష్టం చేశారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటంతోపాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజన ముండే రెవెన్యూ మోడల్‌ను ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకరిస్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లైన్, వివిధ సంస్థల భాగ స్వామ్యంపై చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎం రేవంత్‌పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సంతతి బ్రిటన్ ఎంపీలతో రేవంత్ భేటీ దావోస్ పర్యటన ముగించుకుని లండన్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి భారత సంతతి ఎంపీలతో సమావేశమయ్యారు. ఓల్డ్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు భవనంలో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో.. ఏడుగురు బ్రిటన్ ఎంపీలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భారత్–బ్రిటన్ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యబంధం ఉందన్నారు. ఇరు దేశాలు మహాత్మాగాంధీ సందేశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. -
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట: ఆలయాలు శుభ్రం చేస్తున్న ప్రముఖులు (ఫొటోలు)
-
రెండేళ్లలో పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే రెండేళ్లలోగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాల కింద కాల్వలతో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాల్వలను పూర్తి చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చెట్లు, పూడికతో నిండిపోయాయన్నారు. సత్వరమే నిర్వహణ పనులు చేపట్టాలని, బెడ్, సైడ్ లైనింగ్ పనులను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద తొలి దశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో భూసేకరణ, కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు రూ.100 కోట్లు, పనుల కోసం మరో రూ.100 కోట్లను సత్వరంగా విడుదల చేస్తామని, పనులు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాదిలో పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది..: కోమటిరెడ్డి గత ప్రభుత్వం నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పనులు చివరి దశలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అసెంబ్లీలో తాను ఎన్నో మార్లు మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
TS: పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పీఎస్‌లో పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీలో అవకతకలు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గొర్రెల పంపిణీ కోసం గుంటూరు జిల్లా నుండి అధికారులు గొర్రెలను తీసుకొచ్చారు. గొర్రెలను ఇచ్చిన వారికి బదులు ఇతరుల ఖాతాలోకి నగదు జమ అయ్యిందని, మొత్తం 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
ఏపీ బాటలో కర్ణాటక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వైఎస్ జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన పిక్టోరియల్(»ొమ్మలతో కూడిన) డిక్షనరీల విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరిశీలించిన కర్ణాటక రాష్ట్ర అధికారులు తమ విద్యార్థులకు కూడా ఇదే తరహా డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఏపీ ఎస్సీఈఆర్టీ) సాయంతో కన్నడ–ఇంగ్లిష్ భాషల్లో డిక్షనరీల తయారీని చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డిక్షనరీలను తమ విద్యార్థులకు అందించాలని భావిస్తోంది. పాఠాల్లోని పదాలతోనే డిక్షనరీ.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ ఇంగ్లిష్–తెలుగు పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. 2021–22లో జగనన్న విద్యా కానుకలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 23,72,560 మంది విద్యార్థులకు ఈ డిక్షనరీలను ప్రభుత్వం అందించింది. అలాగే 2022–23లో ఒకటో తరగతిలో 3,55,280 మందికి, ఈ ఏడాది కేవీకే–4లో 3,08,676 మందికి కలిపి మొత్తం 30,36,516 డిక్షనరీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠాల ఆధారంగానే ఏపీ ఎస్సీఈఆర్టీ రంగురంగుల బొమ్మలతో పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించింది. దీంతో పాటు ‘లెర్న్ ఏ వర్డ్’ పేరుతో విద్యార్థులకు కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్పేలా చర్యలు తీసుకుంది. వాటిని ఎలా పలకాలో, ఎప్పుడు వాడాలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం కర్ణాటక అధికారులను ఆకర్షించింది. దీంతో వారు కూడా ఏపీఎస్సీఈఆర్టీ సహకారంతో తమ రాష్ట్రంలో కూడా పిక్టోరియల్ డిక్షనరీ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. పూర్తి శాస్త్రీయంగా తయారీ ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన పాఠాల్లోని పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని ఇంగ్లిష్–తెలుగు భాషల్లో పూర్తి శాస్త్రీయంగా రూపొందించాం. ప్రతిరోజు ఒక పదం నేర్పేలా స్కూళ్లకు ప్రణాళిక ఇచ్చాం. ఈ విధానం కర్ణాటక అధికారులకు నచ్చింది. తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. డిక్షనరీ రూపకల్పనకు తగిన సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఏపీ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ -
బాపట్ల జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
-
ఓటేసిన రాజకీయ ప్రముఖులు - అధికారులు (ఫొటోలు)
-
నలుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడపశ్చిమ) : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో ఐదుగురు అధికారుల నివాసాల్లో ఏసీబీ అధికారులు శుక్ర, శనివారాలు తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున అక్రమ ఆస్తులను గుర్తించారు. ♦ కాకినాడ జిల్లా బెండపూడి ఆర్టీఏ చెక్‌పోస్ట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) పెసరమెల్లి రమేశ్‌బాబు నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్, మెదక్, కంచికచర్ల, విజయవాడ, గుడివాడ, కనుమోలులలో కలిపి మొత్తం ఎకరా భూమి, మూడు ఫ్లాట్లు, 11 ఇంటి స్థలాలు, రెండు నివాస గృహాలు, రెండు వాణిజ్య దుకాణాలతో పాటు ఇన్నోవా కారు, రూ.8.94 లక్షల నగదు, రూ.33.83 లక్షల బంగారు ఆభరణాలు, ఇతర గృహోపకణాలను గుర్తించారు. ♦నంద్యాల రవాణా కార్యాలయంలో పరిపాలన అధికారి కుంపటి సువర్ణ కుమారి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె నివాసంతో పాటు హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, బనగానపల్లి, మార్కాపురంలలోని బంధువుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. సువర్ణ కుమారికి కర్నూలు, కడపలలో ఇళ్లు, నంద్యాల, ఓర్వకల్, డోన్లలో ఇంటి స్థలంతో పాటు పెద్ద ఎత్తున చరాస్తులున్నట్టు గుర్తించారు. ♦ నంద్యాల గనుల శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ గండికోట వెంకటేశ్వరరావుకు గుంటూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకటేశ్వరరావు, ఆయన భార్య పేరిట గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌ను ఆనుకుని జి+3 నివాసం, గుంటూరు రూరల్ మండలం, తాడికొండ, పెదకాకాని మండలాల్లో వ్యవసాయ భూములు, గుంటూరు నగరం, గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని ఇళ్ల స్థలాలతో పాటు గుంటూరు నగరం, నరసరావుపేట, పెదకాకాని, గోరంట్లలో ఇళ్ల స్థలాలతో పాటు పెద్ద ఎత్తున చరాస్తులను గుర్తించారు. ♦ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ లాలా బాలనాగధర్మసింగ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ధర్మసింగ్, ఆయన కుటుంబ సభ్యులపేరిట విజయవాడలోని గొల్లపూడి, బాపట్ల జిల్లా కొల్లూరులలో జి+1 నివాసాలతో పాటు విజయవాడలో ఇంటి స్థలం, 4 ఫ్లాట్లు, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుకాణాలతో పాటు రూ.69 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.10 లక్షల బ్యాంకు బ్యాలన్స్, రూ.18 లక్షల ఎల్ఐసీ పాలసీలు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. బినామీలపేరిట కూడా విజయవాడ, నల్లజర్లలో రెండు భవనాలు, మూడు ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమి ఉన్నట్టు కూడా వెలుగు చూసింది. మరికొన్ని స్థిర, చరాస్తులు సింగ్ బంధువులు, స్నేహితుల పేరిట ఉన్నట్లు గుర్తించామని, తాము సోదాలకు వచ్చే సమయానికి సింగ్ పారిపోయారని ఏసీబీ అధికారులు చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్ 28,057
సాక్షి, హైదరాబాద్: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వచ్ఛిన ‘ఫారం–12డీ’దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు అనుమతించిన పోస్ట ల్ బ్యాలెట్ వివరాలను గురువారం ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం మొత్తం 44,097 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు 28,057 మంది అర్హులను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం పరిధిలో 707 దరఖాస్తులు రాగా, వాటన్నిటికీ రిటర్నింగ్ అధికారులు అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో 706 దరఖాస్తులు రాగా వాటికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 812 దరఖాస్తులకు గాను 757 పోస్టల్ బ్యాలెట్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన 610 దరఖాస్తుల్లో 339 మాత్రమే అంగీకరించారు. అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గ పరిధిలో 19 దరఖాస్తులురాగా, రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. నారాయణపేట్ నియోజకవర్గ పరిధి లో 28 దరఖాస్తులు రాగా, 28 దరఖాస్తులను, వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో 30 దరఖాస్తులకుగాను 26 పోస్ట ల్ బ్యాలెట్లను అనుమతించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 31 దరఖాస్తులకుగాను 31 పోస్టల్ బ్యాలెట్లు, కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 34 దరఖాస్తు లు రాగా, వాటన్నిటినీ రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. ఎన్నికల విధులతో సంబంధం లేని 13 రకాల అత్యవసర సేవల్లో నిమగ్నమై ఉండే ఓటర్లకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించాలన్న సీఈసీ ఆదేశాల మేరకు వారికీ ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఇచ్ఛినట్టు తెలిసింది. -
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు మరో ప్లాన్.. సుప్రీంకు వినతి!
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తాజాగా కృత్రిమ వర్షాలు కురిపించే యోచనతో ఢిల్లీ ప్రభుత్వం.. ఐఐటీ కాన్పూర్ను సంప్రదించింది. ఈ నేపధ్యంలో ఐఐటీ కాన్పూర్ అందించిన ప్రతిపాదనను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షపాతం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు. కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేరకు మేఘాలు ఆవరించాలని, నవంబర్ 20, 21 తేదీల్లో ఇటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ బృందం తెలిపిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తే కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుని కృత్రిమ వర్షాలు కురిపించే ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వర్షాలపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు సిల్వర్ అయోడైడ్ను ఆకాశంలో స్ప్రే చేయాల్సివుంటుంది. ఇది విమానం సహాయంతో ఆకాశంలో జరుగుతుంది. సిల్వర్ అయోడైడ్ అనేది మంచు లాంటిది. దీని కారణంగా తేమతో కూడిన మేఘాలలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా ఈ మేఘాల నుండి వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఇది కూడా చదవండి: 2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? -
విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనం వేగంగా పూర్తి చేయాలి
-
హైదరాబాద్ సీపీ రేసులో నలుగురి పేర్లు
హైదరాబాద్: హైదరాబాద్‌లో సీపీ కోసం నలుగురి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీపీ రేసులో సందీప్ శాండిల్యా, వీవీ శ్రీనివాస్, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డిలతో కూడిన జాబితాను సీఈసికి సర్కార్ పంపించింది. 17 మంది అడిషనల్ డీజీల పేర్లను కూడా ప్రభుత్వం సీఈసికి ప్రభుత్వం సూచించింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రానున్న ఆదేశాలు రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగానాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ల వరుణ్ రెడ్డిలు ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ -
పైరవీ పోస్టింగ్ లపై వేలాడుతున్న కత్తి..!
జనగామ: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి.. పైరవీలతో కోరుకున్నచోట పోస్టింగ్‌లు కొట్టిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై బదిలీ కత్తి వేలాడుతోంది. వరంగల్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీస్ అధికారుల బదిలీల్లో ఎన్నికల నిబంధనలు పాటించలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీల వరకు 21 మంది ఈ తరహా పోస్టింగ్‌లు పొందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్‌కు, సంబంధిత అధికారులకు లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్‌ఓయు3/ 2023 ద్వారా రాశారు. వరంగల్ కమిషనర్‌తోపాటు మహబూ బాబాద్, ములుగు ఎస్పీలు బదిలీల్లో నిబంధన ఉల్లంఘన లేదంటూ వివరాలు పంపారు. ఇది జరిగి సుమారు రెండు నెలలు కావస్తుండగా.. తాజాగా బుధవారం వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్, మహబూబాబాద్, భూపాలపల్లి ఎస్పీలు చంద్రమోహన్, పుల్లా కరుణాకర్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు, రెవెన్యూ అధికారులపైనా త్వరలోనే బదిలీ వేటు పడనుందన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ఉల్లంఘనపై ఈసీఐ ఆరా... వరంగల్ సీపీ, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎస్పీలపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రెవెన్యూ, పోలీసుశాఖల్లో జరిగిన అన్ని బదిలీల్లో నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని జూన్‌లోనే కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పంపింది. అందుకు విరుద్ధంగా నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అనేక మంది తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు పొందారు. ఈ తరహాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో 27 మంది పోస్టింగ్‌లు పొందినట్లు ఎన్నికల సంఘానికి లిఖితపూర్వమైన ఫిర్యాదులు అందాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఎమ్మెల్యేల సిఫారసుల కారణంగా అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణకు మరోసారి గురువారం ఎన్నికల సంఘం ఆదేశించడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ‘రెవెన్యూ’లోనూ ఇదే తంతు.. మరోవైపు రెవెన్యూలోనూ అదే పరిస్థితి నెలకొంది. హనుమకొండ ఆర్డీఓగా రెండున్నర సంవత్సరాలకు పైగా పని చేసిన వాసుచంద్రను ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలోకి వస్తారని మొదట హైదరా బాద్‌కు బదిలీ చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలు గ్రేటర్ వరంగల్ పరిధిలోకి వస్తాయి కూడా. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు బదిలీ చేసిన ఐదారు రోజులకే ఆయనను వరంగల్ జిల్లాలో ఆర్డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నట్లు రెవెన్యూశాఖలోని కొందరు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లాకు చెందిన చాలామంది తహసీల్దార్లు పొరుగు జిల్లా అయిన వరంగల్‌కు బదిలీ అయ్యారు. పలు నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక జిల్లాలో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు ఇప్పుడు వరంగల్‌కు బదిలీ అయినా పాత నియోజకవర్గంలోకే మళ్లీ వచ్చారు. ఇలా జరిగిన చాలా బదిలీలు, పోస్టింగ్‌లపైనా ఎన్నికల సంఘం ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ ఎస్కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను అదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్ఐగా కూడా నియమించారు. ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్ఐ కిరణ్, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్‌లు దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది. ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్బీ ఏసీపీ నుంచి అదే కమిషనరేట్ పరిధిలోని నర్సంపేటకు ఏసీపీగా పి.తిరుమల్ బదిలీ అయ్యారు. పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిషోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. డేవిడ్‌రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు. సి.సతీష్‌ను జూలై 15న మామునూరు ఏసీపీగా నియమించారు. గతంలో దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పని చేశారు. ఇది ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో ఉంది. .. ఇలా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 21 మంది పోస్టింగ్‌లపై ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదమయ్యాయి. అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో వీరిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. -
సీఎం జగన్‌కు ఘనస్వాగతం (ఫొటోలు)
-
మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నా..
హిమాయత్‌నగర్: మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని... ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) అధికారులకు తెలిపాడు. ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లోని విఠల్‌నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంలో మరోమారు నవదీప్ పేరు తెరపైకి రావడం, అతడు సైతం డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ఎన్ఏబీ నుంచి నోటీసులు అందుకున్న హీరో నవదీప్ శనివారం ఉదయం 11 గంటలకు టీఎస్ఎన్ఏబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యాడు. ఏసీపీ కె.నర్సింగరావుతో కలసి టీఎస్ఎన్ఏబీ (వెస్ట్) ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నార్కోటిక్ బ్యూరో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వచ్చేందుకు సిద్ధమని తెలియజేశాడు. ఈమధ్య కాలంలో డ్రగ్స్ తీసుకోలేదు... డ్రగ్స్ వ్యవహారంలో రామ్‌చంద్ అనే వ్యక్తిని టీఎస్ఎన్ఏబీ పోలీసులు విచారించగా తన పేరు చెప్పాడని... అతనిచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారని హీరో నవదీప్ వివరించాడు. తాను మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానే తప్ప ఇటీవల కాలంలో తీసుకోలేదన్నాడు. 15 ఏళ్లుగా పరిచయమున్న రామ్‌చంద్ ఏ కారణంతో తన పేరు చెప్పాడో తెలియదని పేర్కొన్నాడు. డ్రగ్ పెడ్లర్లు వెంకటరమణారెడ్డి, బాలాజీలతో ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలంటూ నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించగా 2017 నాటి డ్రగ్స్ కేసు విషయం, ఆనాటి పెడ్లర్ల ద్వారా వారు పరిచయమయ్యారని అతను చెప్పినట్లు తెలిసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని నవదీప్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ 81 మందిపై ఆరా... హీరో నవదీప్ మొబైల్‌ను స్వా«దీనం చేసుకున్న నార్కోటిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా 81 ఫోన్ నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారుల పేర్లు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. నవదీప్‌కు చెందిన ఎస్బీఐ ఖాతాను పరిశీలిస్తున్న పోలీసులు... ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా అతని మొబైల్లోని స్నాప్‌చాట్, వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు, అతను ఎవరెవరితో కలసి డ్రగ్స్ తీసుకున్నాడనే విషయాలన్నీ స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌ల చాటింగ్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో నవదీప్‌ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భయం వేసి పారిపోయా.. డ్రగ్స్ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముందని ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను ప్రశ్నించగా మీడియాలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పదేపదే వార్తలు రావడం వల్ల భయానికి గురయ్యానని హీరో నవదీప్ పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఒత్తిడి వల్ల తనను నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి పారిపోయినట్లు విచారణలో అతను చెప్పాడని సమాచారం. 45 మందికి తరచూ ఫోన్లు.. డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్‌ను విచారించాం. మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్లోని డేటా అంతా తొలగించి.. తల్లికి చెందిన మొబైల్ ఫోన్‌తో వచ్చాడు. అతని మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించగా.. మరమ్మతుల్లో ఉందన్నాడు. దీనిపై క్రాస్ చెక్ చేయగా మొబైల్ షాప్ వ్యక్తి కూడా అదే సమాధానం ఇచ్చాడు. పాత, కొత్త మొబైల్‌తోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇప్పటివరకు 81 లింకులను గుర్తించాం. వాటిలో ప్రధానంగా 45 మందికి నవదీప్ తరచూ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేసేవాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – ఎస్పీ సునీతారెడ్డి -
రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డులకు అధికారుల వార్నింగ్
-
ఇంకా రుణమాఫీ అందని రైతులు..1.6 లక్షలు రాష్ట్ర ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీరికి వెంటనే రుణమాఫీ సొమ్ము అందజేయాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... రుణమాఫీకి సంబంధించి ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యక్రమంలో రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లు ఆర్థికశాఖ విడుదల చేసిందన్నారు.17.15 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయన్నారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లు క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లు మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు ఆయనకు అధికారులు వివరించారు. చర్చించిన అనంతరం మూడు పరిష్కారమార్గాలు కనుగొన్నారు. ఆధార్ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం, దీనివల్ల సుమారు మరో లక్షమందికి రుణమాఫీ డబ్బు అందుతుంది. ఎన్పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు. మిగతా 16 వేల మందికి సంబంధించి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌సెల్ రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేయాలి.. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు ముందుగా బ్యాంకుస్థాయిలో సంప్రదిస్తారు..అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరపున జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. కొత్త రుణాలు మంజూరు చేయాలి రుణమాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని చెప్పారు. రుణమాఫీ పొందినవారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యూవల్ పూర్తి కావాలన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9,654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యూవల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణమాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబంధిత అన్ని సమస్యలు పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. -
కృష్ణా బోర్డు & తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల పంపిణీ విషయంలో..తెలంగాణ రాష్ట్రం, కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) మధ్య వివాదం తీవ్రమైంది. తాగునీటి అవసరాల కోసం సెప్టెంబర్ 30 వరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ గత నెలలో ‘త్రిసభ్య కమిటీ’ పేరుతో రూపొందించిన వివాదాస్పద ముసాయిదా మినిట్స్‌ను ఆమోదించాలని తాజాగా కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ముసాయిదా మినిట్స్‌ను తాజాగా రెండు రాష్ట్రాలకూ కృష్ణా బోర్డు పంపించింది. ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా బేఖాతరు చేస్తూ మినిట్స్‌ను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం గమనార్హం. కృష్ణా బోర్డుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం... గత నెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగ్గా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గైర్హాజర య్యారు. కమిటీ కన్వీనర్ డీఎం రాయిపూరే, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజ రై నీటి కేటాయింపులపై చర్చించారు. ఈ సమా వేశా న్ని వాయిదా వేయాలని అంతకుముందే తెలంగాణ లేఖ రాసినా, కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం నిర్ణయాల మేరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని ప్రతిపాదిస్తూ.. ముసాయిదా మినిట్స్‌ను కృష్ణా బోర్డు రూపొందించింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గైర్హాజరైనా, రాష్ట్రానికి అవసరమైన నీటి కేటాయింపులను కోరు తూ గతంలో ఆయన రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తెలంగాణకు నామమాత్రంగా నీటి కేటాయింపులు జరుపుతూ మినిట్స్‌ను రూపొందించినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయి పూరేను కలిసి మినిట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలే దని, నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఒకవేళ చేసినా తెలంగాణ సమ్మతి తెలపలేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సత్వరంగా నిర్వహించి నీటికేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరినట్టు వెల్లడించింది. మొత్తంగా.. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నీటి కేటాయింపుల ప్రతిపాదనలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం వివాదాస్పదంగా మారింది. -
నిమ్స్‌కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్‌కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్‌కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్‌ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్‌బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
‘పెన్‌గంగ’పై అప్రమత్తం!
జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతమైన డొల్లార గ్రామ శివారు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం పర్యటించారు. ఉదయం డొల్లార చేరుకొని 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద పెన్‌గంగ ఉధృతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కొరటా–చనాఖా బ్యారేజీ, హట్టిఘాట్ పంప్ హౌస్‌లను సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు: వరద ధాటికి మండలంలోని పలు గ్రామాల్లో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగాతడిసిపోవడంతో అవస్థలు పడుతున్నారు. కౌఠ గ్రామంలో నిత్యావసర సరుకులను థర్మాకోల్ పడవలపై తరలిస్తూ కనిపించారు. ప్రజలు ఇళ్లను వదిలి మూటముల్లె సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. చెరువులను తలపిస్తున్న పంట చేలు పెన్‌గంగ పరీవాహక ప్రాంతం చుట్టూ ఉన్న పంట చేలు బ్యాక్ వాటర్ ధాటికి పూర్తిగా మునిగిపోయాయి. ఆదివారం వర్షం కొంత తగ్గినప్పటికీ చేలలో వరద తొలగలేదు. పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్‌పూర్, కరంజి, కూర, ఖాప్రి, లేకర్వాడ, మాండగాడ, పూసాయి తదితర గ్రామాల పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పెన్‌గంగా నది బ్యాక్ వాటర్ సాంగిడి గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఆ గ్రామస్తులు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుంచి బయటకు రావాలంటే ఇలా నాటు పడవల ద్వారా ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. -
విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వీసీలతో సీఎం జగన్ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కీలక సమావేశం చేపట్టారు. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు చేశారు. బోధనలో, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి సారించారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. హేమచంద్రారెడ్డి, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ రాష్ట్రానికి, విద్యావ్యవస్థకు ,యువకులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య అందించాలన్నది సీఎం ఆరాటం దేశం యావత్తు దృష్టి ఆకర్షించేలా రాష్ట్రంలో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యనస్థను ప్రవేశపెట్టి విద్యార్థులకు అందివ్వాలని సీఎం ఆదేశించారు రొటీన్ విద్యావిధానం కాకుండా విద్యార్థుల ఆశలు ఆశయాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించాలని సీఎం ఆదేశించారు వీసీలు నాలుగు గ్రూపులుగా విడిపోయి నాలుగు టాపిక్ లపై చర్చించాలని సీఎం ఆదేశించారు చర్చించిన అంశాలు సిఫార్సులపై సాయంత్రం తనకుకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు టెక్నాలజీ ప్రవేశం సహా అంతర్జాతీయ స్థాయి లో పలు అంశాలను కరిక్యులమ్ లో జోడించాలని సీఎం ఆదేశించారు వీసీలంతా కలసి కరిక్యులమ్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు మా ఆలోచనలతో సీఎంకు నివేదిక అందిస్తాం గడచిన నాలుగేళ్లుగా యూనివర్సిటీల్లో ఎక్కడా రాజకీయాలు ఏవీ లేవు రాష్ట్రంలో విద్యావిధానం నాణ్యంగా,ఆదర్శంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రసాదరెడ్డి,ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై సీఎం మాకు దిశానిర్దేశం చేశారు అంతర్జాతీయంగా పరీక్షా విధానం వేరుగా ఉంటుందని తెలిపారు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షా విధానం అమలును పరిశీలించాలని సీఎం ఆదేశించారు అంతర్జాతీయ స్థాయిలో అమలవుతోన్న ఒపెన్ బుక్ పరీక్షా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు రానున్న 5 ఏళ్లలో లీడ్ రోల్ విధానం అమలు చేసేలా నూతన విద్యా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు యావత్ దేశం మన రాష్ట్రం వైపు చూసేలా నూతన విద్యా విధానం ఉండాలన్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో స్టూడెంట్ కు కావాల్సిన కోర్సులు ,లెర్నింగ్ ఆప్షన్లపై చర్చించాలన్నారు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన విద్యావిధానం, పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేయలని సీఎం సూచించారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను తీసుకురావడంపై సమగ్రంగా చర్చించాలని సీఎం ఆదేశించారు గ్లోబల్ గా ఎడ్యుకేషన్ మాప్స్ లో ఎపీ ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలన్నారు ఇంటర్నేషనల్ ప్రొఫెసర్లను పిలచి విద్యావిధానంలో తీసుకోవాల్సిన మార్పులపై చర్చించాలని నిర్దేశించారు విష్ణువర్దన్ రెడ్డి ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ వ్యవసాయరంగంలో అభివృద్ది జరగాలని సీఎం ఆదేశించారు వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యావ్యవస్థలో మార్పు జరగాలని సీఎం ఆదేశించారు లోయర్ ,హయ్యర్ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ వినియోగించి మార్పులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రొఫెసర్ భారతి, పద్మావతి విశ్వ విద్యాలయం వీసీ అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలని సీఎం ఆదేశించారు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యావిధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు బాబ్జి, వైఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మెరుగైన ఫలితాలుంటాయి పేషంట్లకు అధునాతన పద్దతుల్లో మెరుగైన వైద్యం అందించేలా మెడికల్ స్టూడెంట్స్ కు విద్యా బోధన అందించాలని సీఎం ఆదేశించారు ప్రసాదరాజు, జెఎన్ టీయూ వీసీ మన విద్యార్థులు క్రియేటప్లుగా ఉండాలికానీ ఫాలోవర్లుగా ఉండకూడడదని సీఎం ఆదేశించారు ఉన్నత వుద్యలో నాలెడ్జ్ క్రియేటర్లుగా ఉండాలని సీఎం ఆదేశించారు రానున్న రోజుల్లో సిలబస్, పరీక్షా విధానం సమూలంగా మార్చే అవకాశం ఉంది చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
జీఎస్టీ అధికారుల కిడ్నాప్ ఉదంతంపై కేంద్రం సీరియస్
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్.. పోలీసులు ఆ కేసును చేధించిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్.. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్లను ఫోన్లో కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జీఎస్టీ కట్టని షాప్‌ను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను.. దుకాణదారు, మరో ముగ్గురితో కలిసి కిడ్నాప్ చేశాడు. అయితే ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను వెంటాడి అధికారులను రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితులు ఫిరోజ్, ముజీఫ్, ముషీర్, ఇంతియాజ్‌లను అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణా నగర్లో ఫేక్ జీఎస్టీ నంబర్‌తో gst కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు..GST ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మణి శర్మ , ఆనంద్ లు వెళ్లారు. ఆ సమయంలో షాప్ నిర్వాహకుడు , మరో ముగ్గురు కలిసి... ఫార్చ్యూనర్ కార్ లో కిడ్నాప్ చేశారు. GST అధికారుల ఐడీ కార్డు లు చింపి..వారి పై దాడి చేశారు. మాకు సమాచారం అందగానే... దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నాము. ఒక నిందితుడు ఖాయూం పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నాం అని డీసీపీ వెల్లడించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్.. నిందితులు టీడీపీ నేత అనుచరులు? -
తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావుడి
-
ఫేక్ ఐటీ ఐటీ అధికారుల పేరుతో హల్చల్
హైదరాబాద్: హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ సినిమా తరహాలో కొందరు దుండగులు ఐటీ అధికారులమంటూ కిలో 700 గ్రాముల బంగారాన్ని తస్కరించిన ఘటన శనివారం మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవన్ మధుకర్ స్థానికంగా సిద్ధివినాయక జ్యువెలర్స్ పేరుతో దుకాణంతో పాటు పాట్ మార్కెట్లోని నవ్కార్ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో బంగారు నగలు మెల్టింగ్ కార్ఖానా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో అయిదుగురు గుర్తు తెలియని వ్యక్తులు పాట్ మార్కెట్లోని కార్ఖానాకు తాము ఐటీ అధికారులమంటూ వచ్చి గుర్తింపు కార్డులు చూపించారు. కార్ఖానాలో ఉన్న బంగారం వివరాలు కావాలని కోరారు. దీంతో వర్కర్లు అక్కడే ఉన్న కిలో 700 గ్రాముల బంగారం బిస్కెట్లను చూపించారు. దీంతో వారు ఆ బంగారాన్ని తీసుకున్నారు. తమ యజమానితో ఫోన్లో మాట్లాడాలని పని చేసే వాళ్లు చెప్పినా వినకుండా వారి ఫోన్లను లాక్కున్నారు. బంగారం బిస్కెట్లు తీసుకున్న నిందితులు గది బయటకు వచ్చి గడియపెట్టి ఉడాయించారు. అనుమానం వచ్చిన వర్కర్లు గదిలోంచి కేకలు వేయడంతో పక్కన ఉన్న వాళ్లు వచ్చి గడియ తీశారు. అనంతరం విషయం యజమానికి తెలియజేయడంతో ఆయన బావమరిది వికాస్ కేదేకర్ మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఏసీపీ రమేష్, డీసీపీ చందనా దీప్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికాస్ కేదేకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతా 5 నిమిషాల్లోనే.. ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని డీసీపీ చందన దీప్తి చెప్పారు. నిందితులు అయిదుగురు నడుచుకుంటూ వచ్చి చోరీ చేశారని, షాపులో పనిచేసే వ్యక్తులు పెద్దగా చదువుకోకపోవడంతో గుర్తింపు కార్డులు పరిశీలించలేదని ఆమె చెప్పారు. ఒక్కో బిస్కెట్ 100 గ్రాములు ఉంటుందని మొత్తం 17 బంగారు బిస్కెట్లు తీసుకుని వెళ్లారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆమె చెప్పారు. నిందితులు ఉదయం 11.30 గంటలకు పాట్ మార్కెట్ నవ్కార్ కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తుకు వచ్చారు. బయట నుంచి నడుచుకుంటూ పైకి వెళ్లిన నిందితులు కార్ఖానాలో పని చేసే నిందితులను బెదిరించి బంగారు బిస్కెట్లను తీసుకుని 5 నిమిషాల్లో బయటకు వచ్చారని ఆమె చెప్పారు. తెలిసినవారి పనేనా? పాట్ మార్కెట్లో వందల సంఖ్యలో బంగారు దుకాణాలు, నగలు తయారు చేసే కార్ఖానాలు, హోల్‌సేల్ వ్యాపారులు ఉంటారు. చిన్నచిన్న మడిగెల్లో కోట్ల రూపాయల వ్యాపారాలు నడుస్తుంటాయి. గత కొద్ది నెలల క్రితమే మహారాష్ట్రకు చెందిన రేవన్ మధుకర్ అనే వ్యక్తి ఇక్కడ బంగారు నగలు కరిగించే కార్ఖానా ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు వ్యక్తులు పనిచేస్తుండగా ఒకరు కర్ణాటక, మిగతా వాళ్లు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఉన్నారు. గజిబిజిగా ఉండే ఈ ప్రాంతంలో ఇదే కార్ఖానాను ఎన్నుకుని దొంగతనానికి పాల్పడటం.. తెలిసిన వారి పనే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. షాపు యజమాని కూడా మూడు రోజుల నుంచి మహారాష్ట్రలో బంధువుల వివాహానికి వెళుతూ ఆయన బావమరిది వికాస్‌కు షాపును అప్పగించాడు. దుండగులు హిందీ భాష మాట్లాడుతుండటంతో ఇది తెలిసిన వారే స్కెచ్ వేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అదుపులో పనివాళ్లు దుకాణంలో పని చేసే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. వీరి ఫోన్ల సంభాషణలపై ఆరా తీస్తున్నారు. నిందితులు ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వెళ్లారు? తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు మహంకాళి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. -
అకాల వర్షాల వల్ల పంటనష్టంపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
-
అకాల వర్షాలు.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు. వర్షాల వల్ల రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై మొదలైన ఎన్యుమరేషన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. నివేదిక ఖరారు చేయాలన్నారు. ఈ నెలలో వైఎస్సార్ రైతు భరోసాతో పాటు.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్పుట్ సబ్సిడీ జారీకి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్.. మూడురోజుల పాటు భారీ వర్షాలు నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ పూర్తి చేయాలన్నారు. మార్చి నెలలో కురిసిన వర్షాలకు సంబంధించి ఇప్పటికే పంట నష్టం అంచనాలు తయారు చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న పంట నష్టం అంచనాలపైనా ఎన్యుమరేషన్ చురుగ్గా కొనసాగుతోందని ముఖ్యమంత్రికి తెలిపారు. చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర? -
కొలిక్కి వచ్చిన ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఎపిసోడ్
-
సింహాచలం చందనోత్సవం సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష
-
విద్యుత్ పొదుపులో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ప్రత్యేకంగా ఇంధన సామర్థ్య పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలో దాదాపు 67,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అంచనా ప్రకారం ఏటా దీన్లో దాదాపు 25 శాతం అంటే 17 వేల మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇందులో కనీసం 10 శాతం లక్ష్యంగా పెట్టుకున్నా రూ.1,200 కోట్ల విలువైన 1,700 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించనుంది. ఎందుకీ పాలసీ.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో సరికొత్త ఇంధన సంరక్షణ, సాంకేతికతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పాలసీని అమలు చేయనుంది. ఇంధన భద్రత సాధించేందుకు, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ పాలసీ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్–2001ని సమర్థంగా అమలు చేయడం, కర్బన ఉద్గారాల (గ్రీన్హౌస్ వాయువుల) తగ్గింపుతో వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడం, ఇంధన సామర్థ్యంపై అవగాహన కల్పించడం, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వినూత్న ఫైనాన్సింగ్, మార్కెట్ వ్యూహాలను రూపొందించడం ఈ ఇంధన పాలసీ లక్ష్యం. పరిశ్రమలు, భవనాలు, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాలను రూపొందించడం, నివాస, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలలో స్టార్ రేటెడ్ ఇంధన సామర్థ్య పరికరాల వినియోగంపై ఈ పాలసీ దృష్టి సారిస్తుంది. ఇందుకోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని, వివిధ రంగాలకు చెందిన విభాగాధిపతుల నేతృత్వంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. -
Video: సీఎం బొమ్మై కారును అడ్డగించిన అధికారులు.. ఆకస్మిక తనిఖీలు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రయాణిస్తున్న కారును ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆలయానికి వెళ్తుండగా బొమ్మై వాహనాన్ని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆపింది. సీఎం కారులో కారులో తనిఖీలు చేపట్టింది. బొమ్మై కారును అధికారులు తనిఖీ చేస్తన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడదలవ్వడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ క్రమంలో బొమ్మై తన అధికారిక వాహనాన్ని అధికారులకు సరెండర్ చేశారు. శుక్రవారం ఓ ప్రైవేటు కారులో ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళ్తుండగా హోసహుద్య చెక్‌పోస్టు వద్ద అధికారులు ఆపారు. అయితే బొమ్మై కారులో అభ్యంతరకరమైనవేవి గుర్తించలేదని అధికారులు తెలిపారు. సాధారణ తనిఖీ అనంతరం ఆయన వాహనం వెళ్ళడానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. #WATCH | Karnataka CM Basavaraj Bommai's car checked by the Flying Squad team of the Election Commission as he was on his way to Sri Ghati Subramanya Temple in Doddaballapur Model Code of Conduct is enforced in the State in view of the May 10 Assembly elections. pic.twitter.com/esBkFcIMAL — ANI (@ANI) March 31, 2023 కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బుధవారం ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 10న ఎన్నికలు జరుగనుండగా.. మే 13న కౌంటింగ్ ఉండనుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. -
హోలీ వేడుకల్లో సందడి చేసిన యూఎస్ అత్యున్నత అధికారి
ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో బుధవారం హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు జైశంకర్, కిరణ్ జిజు తోపాటు యూఎస్ అత్యున్నత అధికారి గినా రైమోండో పాల్గొన్నారు. ఆమె ముఖానికి రంగులు పులుముకుని, ఓ దండ ధరించి డ్రమ్ బీట్లకు లయబద్ధంగా స్టెప్లు వేసి సందడి చేశారు. ఆ వేడుకలో కృష్ణుడి వేషధారణలో ఒక కళాకారుడు అక్కడున్న ప్రేక్షకులను బాగా అలరించాడు. కాగా, ఇండో యూఎస్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొనేందుకు యూఎస్ వాణిజ్య కార్యదర్శి రైమోండో న్యూఢిల్లీ వచ్చారు. ఆమె మార్చి 7 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె భారత్ యూఎస్‌ల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేసేలా వివిధ రంగాల సహకారంపై చర్చిస్తారు. గతేడాది యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్‌ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఎంఎస్ రైమోండో గత నవంబర్లోనే ప్రారంభించారని యూఎస్ వాణిజ్య విభాగం పేర్కొంది. (చదవండి: నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్) -
మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్మోహన్ పాల్గొన్నారు. చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? -
సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్! చివరికి శ్రీలంకలానే..
పాక్‌లో ఆర్థిక పరిస్థితులు చాల ఘోరంగా ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ అధికారులు నగదు విషయమై చర్చించేందుకు మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో తీవ్ర ఆందోళనలో మొదలయ్యాయి. ఒక పక్క రూపాయి విలువ పతనమవ్వడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో.. నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి డిమాండ్ చేసిన పన్నుల పెంపు, సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా పోరాడారు. దీంతో ఇటీవల పాక్ దివాలా దిశగా అడుగులు వేసింది. అదీగాక స్నేహ పూర్వక దేశాలు సాయం చేసేందుకు రాకపోవడంతో పాక్ ఐంఎఫ్ డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. అంతేగా యూఎస్ డాలర్ల బ్లాక్‌మార్కెట్‌ని నియంత్రించడానికి ప్రభుత్వం రూపాయిపై నియంత్రణలను సడలించింది. దీంతో కరెన్సీ రికార్డు స్థాయికి పడిపోయింది. అలాగే తక్కువ ధరకే లభించే కృత్రిమ పెట్రోల్ ధరలను సైతం పెంచారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త అబిద్ హసన్ మాట్లాడుతూ.."తాము సంక్షోభానికి చివర అంచులో ఉన్నాం. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్ డిమాండ్లను నెరవేర్చడం గురించి ప్రజలకు తెలియజేయాలి. లేదంటే దేశం కచ్చితంగా సంక్షోభంలో మునిగిపోతుంది. చివరికి శ్రీలంకలా అయిపోతుంది. ఐతే మా పరిస్థితి మాత్రం బహుశా అక్కడికంటే ఘోరంగా ఉండొచ్చు." అని ఆవేదనగా చెప్పారు. కాగా, శ్రీలంక కూడా పాక్ మాదిరిగానే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, చివరికి ఆ దేశ నాయకుడు దేశం విడిచి పారిపోయే పరిస్థితికి దారితీసింది. అదీగాక పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్‌కి చెందిన విశ్లేషకుడు నాసిర్ ఇక్బాల్ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని, వాస్తవంగా కుప్పకూలిపోతుందని హెచ్చరించారు కూడా. కొనుగోలు చేయలేని స్థితిలో ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ వినియోగదారులు ఉన్న ఐదవ అతిపెద్ద స్టేట్ బ్యాంకులో సుమారు రూ. 30 వేల కోట్లు (3.7 బిలియన్ డాలర్లు) మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులను కొనుగోలు చేయడానికే సరిపోతుంది. దీంతో కొనుగోలు చేయలేని సరుకంతా కరాచీ పోర్టులోని వేలాది షిప్పింగ్ కంటైనర్లలోనే ఉంటుంది. రూపాయి పతనంలో పరిశ్రమలు కుదేలయ్యాయి. ప్రజా నిర్మాణ ప్రాజెక్టు ఆగిపోయాయి. టెక్స్టైల్స్ ప్యాక్టరీలు పాక్షికంగా మూతపడ్డాయి. దీంతో పెట్టుబడులు మందగించాయి. డజన్ల కొద్ది కూలీలు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఫలితంగా బిక్షాటన చేసే వారి సంఖ్య పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల ఆదాయం మార్గాలు తగ్గడంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని దారుణ స్థితిలో ఉన్నారు. గందరగోళంగా ఉన్న రాజకీయ పరిస్థితులు జూన్‌లో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 33 మిలియన్ డాలర్ల రుణాలు ఇతర విదేశీ చెల్లింపులు చెల్లించాల్సి ఉందని స్టేట్ బ్యాంకు గవర్నర్ జమిల్ అహ్మద్ గత నెలలో వెల్లడించారు. మరోవైపు దేశం తీవ్ర ఇంధన కొరతతో అల్లాడుతోంది. గత వారం ఖర్చుల కోత చర్యల కారణంగా.. విద్యుత్ గ్రిడ్‌లో సాంకేతిక లోపం సంభవించి.. ఒక రోజంతా అంధకారంలోనే ఉండిపోయింది. ఐతే పాక్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ ఏప్రిల్ నుంచి రష్యా చమురు దిగుమతులు ప్రారంభమవుతాయని, ఒప్పందంలో భాగంగా స్నేహ పూర్వక దేశాల మధ్య కరెన్సీలలో చెల్లింపులు జరుగుతాయని ఆశాభావంగా చెప్పారు. ఇదిలా ఉండగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికల కోసం తన ప్రయత్నంలో భాగంగా పాలక కూటమిపై ఒత్తిడి పెంచారు. గతేడాది అవిశ్వాస తీర్మానం కారణంగా పదవి నుంచి తొలగించబడ్డ ఖాన్ 2019లో ఐఎంఎఫ్‌తో బహుళ బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీపై చర్చలు జరిపారు. ఐతే ఈ కార్యక్రమం అనుహ్యంగా నిలిచిపోయింది. ఇప్పటికే రెండు డజన్లకు పైగా ఖరారు చేసుకున్న ఐఎంఎఫ్ ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యాయి. ఒకవేళ పాకిస్తాన్ ఈ పరిస్థితి నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారడమే గాక పేదరికి తీవ్రతరం అవుతుందని రాజీకీయ విశ్లేషకుడు మైఖేలే కుగెల్ మాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలో పెద్దస్థాయిలో సంస్కరణలు తీసుకురాలేకపోతుందని, తదుపరి సంక్షోభాన్ని ఎదుర్కోనే దేశంగా చిట్టచివరి అంచున నిలబడి ఉందని అన్నారు. (చదవండి: పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు) -
APSRTC: ఫేస్బుక్ పోస్ట్‌కు స్పందించిన ఆర్టీసీ అధికారులు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల అభ్యర్థనలకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఫేస్ బుక్ పోస్ట్‌కు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. 40 మంది ఉన్నాం మాకో బస్సు ఏర్పాటు చేయాలంటూ ఎస్. వెంకటరావు అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. వెంకటరావు అభ్యర్థనకు సత్వరమే స్పందించిన ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి.. పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు బస్సు ఏర్పాటు చేశారు. కాగా, ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. చదవండి: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ -
విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నందుకు.. ఆ సంస్థల ఉన్నతాధికారులను సీఎం జగన్ అభినందించారు. విద్యుత్ సమర్థ వినియోగంలో ఏపీ విద్యుత్ సంస్థలు ఇటీవల మూడు అవార్డులు గెలుచుకున్నాయి. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఎంపికైంది. న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను సోమవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌కు ఇంధన శాఖ ఉన్నతాధికారులు అందించారు. వారిని అభినందించిన సీఎం జగన్.. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు గెల్చుకునేలా కృషి చేయాలని సూచించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీ, ఏపీ వీసీ ఎండీ ఎస్.రమణారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ(హెచ్ఆర్డీ) ఐ.పృథ్వితేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్ధన్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్‌కు మంత్రుల శుభాకాంక్షలు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎం జగన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, జోగి రమేశ్‌తో పాటు ఉన్నతాధికారులు సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి -
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ సిద్ధం
-
అమానుష ఘటన: బాలుడి చేతిలో డ్రిల్లింగ్ మిషన్ దింపిన టీచర్!
ఇటీవల కాలంతో ఉపాధ్యాయులు చిన్న చిన్న విషయాలకే కాస్త ఫ్రస్టేషన్‌కి గురయ్యి విద్యార్థులకు అత్యంత అమానుషమైన పనిష్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయుడు కొడవలితో పాఠశాల్లో హల్చల్ చేస్తూ... అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. అంతకు ముందు మరొక ప్రబుద్ధుడు స్ప్రుహ తప్పి పడిపోయాలా ఒక విద్యార్థిని కర్రతో దాడి చేసి చంపేశాడు. ఇలాంటి ఉదంతాలను మర్చిపోక మునుపే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్‌తో పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థి సిసామౌ నివాసి. అతను కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఐతే సదరు విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి పంపించడంతో ఫ్రాథమిక చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి నిర్వాకానికి ఆగ్రహం చెందిన బాధితుడు బంధువులు పాఠశాలకు చేరుకుని గొడవ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న ప్రాథమిక శిక్ష అధికారి, బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కాన్పూర్‌కి చెందిన ప్రాథమిక శిక్షా అధికారి సుజిత్ కుమార్ మాట్లాడుతూ...ఈ మొత్తం ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్‌లోని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక పంపుతారు. ఈ ఘటనలో ఎవరైనా దోషులుగా తేలితే వారు శిక్షార్హమైన చర్యల ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. (చదవండి: క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు.. ) -
మూన్‌లైటింగ్ ఆదాయాన్ని దాచిపెడితే: లేటెస్ట్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపిన మూన్‌లైటింగ్‌పై తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులకు అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చే అసైన్మెంట్లు లేదా ఉద్యోగాలపై ఆదాయపు పన్ను అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఆదాయంపై కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మూన్లైట్ ఉద్యోగులను హెచ్చరించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రూ. 30 వేలు దాటితే టీడీఎస్ తాజాగా, ఈ ‘మూన్ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టిసారించింది. రెండో ఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. పన్ను నిబంధనలు రెండో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఏ కంపెనీ అయినా ఇచ్చే వ్యక్తిగత చెల్లింపులుసహా రూ. 30 వేలు దాటితే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ స్పష్టం చేశారు. (Apple సత్తా: ఆ మూడు దిగ్గజాలకు దిమ్మతిరిగింది అంతే!) మూన్‌లైటింగ్ ఉద్యోగులు తమ ఆదాయ పన్ను రిటర్న్‌లలో ఏదైనా అదనపు ఆదాయాన్ని ప్రకటించి, వర్తించే పన్ను చెల్లించాలని ఉద్యోగులను కోరారు. అలా చేయకపోతే జరిమానా లాంటి చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించిందిఏదైనా కంపెనీ లేదా వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా సంపాదించే రూ 30వేల రూపాయల లోపు ఆదాయానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని పరిమితి దాటితే టీడీఎస్ చెల్లించాలని రవిచంద్రన్ స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194C ప్రకారం కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్‌ను మినహాయించాలి. ఏదైనా సంస్థ, ట్రస్ట్ కానీ, కంపెనీ, స్థానిక యంత్రాంగం వంటివి దీని కిందికి వస్తాయి. నగదు చెల్లింపులు, చెక్, డ్రాఫ్ట్ ఎలా చెల్లించినా సరే టీడీఎస్ మినహాయింపు తప్పనిసరి. ఐటీ చట్టంలోని సెక్షన్ 194జె ప్రకారం రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలి. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది. -
చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు: వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జూని సందర్శించి చిరుత పిల్లకు పాలు పట్టించారు. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు. ఇంతలో ఆయన ఒక చిరుత పిల్లకు పాలబాటిల్తో పాలు పట్టించేందుకు దాని ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి యోగికి ఇచ్చారు. ఐతే అది మొదట తాగేందుకు అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆయన వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎట్టకేలకు ఆ చిరుత పిల్లకు పాలు పట్టించగలిగారు. అంతేగాదు ఆ జూలో ఉన్న మిగతా పెద్ద పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ జూని 'షాహిద్ ఆష్పాక్ ఉల్లాల్ ఖాన్ పార్క్' అని కూడా పిలుస్తారు. దీన్ని గతేడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది పుర్వాంచల్ ప్రాంతంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్, అలాగే ఉత్తరప్రదేశ్‌లో మూడవది అని జూ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు) -
ఏపీ విభజనా చట్టం అమలుపై నేడు కేంద్ర హోంశాఖ సమావేశం
-
పలు శాఖల అధికారులు, మంత్రులతో సీఎం జగన్ సమీక్ష
-
చైనా కక్ష పూరిత చర్య.. ఆంక్షల మోత!
చైనా: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన చైనాకి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఆఖరికి అమెరికా దిగొచ్చి కేవలం తమ డెమెక్రెటిక్ కాంగ్రెస్ సభ్యుల పర్యటన అని చైనాని బుజ్జగింపు ప్రయత్నం చేసింది. అయినా ససేమిరా అంటూ తైవాన్‌పై పదే పదే ద్వేషపూరిత చర్యలకు దిగుతోంది చైనా. అదీగాక ఆది నుంచి ప్రజాస్వామ్యయుతంగా స్వయంపాలనలో ఉన్న తైవాన్ సార్వభౌమాధికారాన్ని తిరస్కరిస్తూ వస్తోంది చైనా. ప్రస్తుతం ఈ యూఎస్ అత్యన్నతాధికారి నాన్సీ పర్యటనతో తీవ్ర ఆగ్రహోజ్వాలతో రగలిపోతుంది చైనా. అందులో భాగంగా చైనా తాజగా ఏడుగురు తైవాన్ అధికారులపై ఆంక్షలు విధించింది. వారంతా తైవాన్ స్వాతంత్య్రానికి మద్ధతిచ్చినందుకే చైనా ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు చైనా అంక్షలు విధించిన తైవాన్ వ్యవహారాల కార్యాలయం అధికారుల్లో వాషింగ్టన్‌లోని తైవాన్ రాయబారి హ్సియావో బిఖిమ్ , తైవాన్ జాతీయ భద్రతా మండలి సెక్రటరీ జనరల్ వెల్లింగ్టన్ కూ ఉన్నారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. అంతేగాక తైవాన్ అధికార రాజకీయ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఆయా అధికారులంతా హాంకాంగ్, మకావులను పర్యటించలేరని తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు ఆయా సంస్థల పెట్టుబడు దారులు కూడా చైనాలో లాభం పొందేందుకు కూడా అనుమతించదని స్పష్టం చేశారు. ఈ ఏడుగురు అధికారుల తోపాటు అదనంగా మరో ముగ్గురు అధికారులు తైవాన్ ప్రీమియర్ సుత్సెంగ్ చాంగ్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వు, పార్లమెంట్ స్పీకర్ సికున్ల పై కూడా ఆంక్షలు విధించినట్లు తైవాన్ పేర్కొంది. (చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం) -
గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మంగళవారం రాత్రి సీఎం రాజమహేంద్రవరంలో సమీక్షించారు. 1986 వరదల తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఈ ఏడాది వచ్చిందని.. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా నియంత్రణ చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఏటిగట్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించాలని, శాశ్వత చర్యలపై దృషిŠ?ట్పట్టి నవంబరుకల్లా టెండర్లు పూర్తిచేస్తే పనులు మొదలుపెడదామన్నారు. కరకట్టల ఆధునీకరణపై కూడా వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్ ఎస్టిమేట్స్ తయారుచేసి వెంటనే నివేదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో వాటిని పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చునని సూచించారు. పారదర్శకంగా నష్టాల నమోదు ఇక నష్టాల నమోదు వెంటనే ప్రారంభించాలని.. ఈ విషయంలో అంతా పారదర్శకంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిచేశాక సామాజిక తనిఖీ నిర్వహించాలని, దీనివల్ల అర్హత ఉండి సాయాన్ని అందుకోలేని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెండు వారాల్లో నష్టాల నమోదును పూర్తిచేద్దామన్నారు. పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నామన్నారు. ఏ సీజన్లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోషిస్తారని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తం చేశారంటూ సీఎం ప్రశంసించారు. వలంటీర్, సచివాలయం వ్యవస్థ ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయన్నారు. అధికారులకు సీఎం అభినందనలు లంక గ్రామాల్లో నష్టతీవ్రత వివరాలను సీఎం అధికారులను అడిగి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలప్పుడు కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్‌చేసి హడావిడి చేసేవారని ఆయన గుర్తుచేశారు. విపత్తుల సమయంలో అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతుండడంవల్ల పునరావాస పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. కానీ, అన్నీ జరిగాక తాను రావడంవల్ల అవి సవ్యంగా జరిగాయా? లేదా? అని తెలుసుకుంటున్నానని.. తాను కూడా వరదల సమయంలో వచ్చి, మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుని నలుగురిని సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? ఫైనల్‌గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి కదా అని ముఖ్యమంత్రి అన్నారు. అధికారులంతా బ్రహ్మండంగా పనిచేశారు కాబట్టే ‘చాలా బాగా చూసుకున్నార’న్న మాట ఈరోజు ప్రజల నుంచి వినిపిస్తోందంటూ సీఎం జగన్ వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళ్దామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారన్నారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విద్యుత్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ విషయంలో ఎక్కడైనా జాప్యం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని.. లేదంటే ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మనం యుద్ధం చేస్తున్నది టీడీపీ, చంద్రబాబుతో కాదని.. నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ వారికి గుర్తుచేశారు. ఆ మీడియా సంస్థలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీ అధికారం కోసం పనిచేస్తున్నాయని, వాస్తవాలను ప్రజలకు వివరించి వాటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాజమహేంద్రవరంలోకి వరదనీరు రాకుండా.. ఇక రాజమహేంద్రవరం అవ డ్రెయిన్ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్ధంచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్నారు. నిపుణులతో కూడిన టెక్నికల్ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మీ తోడ్పాటుతోనే నాణ్యమైన సేవలు.. సహాయక కార్యక్రమాల కోసం నిధులను వెంటనే సమకూర్చడంతో నాణ్యమైన సేవలందించగలిగామని అధికారులు సీఎంకు వివరించారు. పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్నారు. వైద్య శిబిరాలు ముందుగా ఏర్పాటుచేయడంతో జ్వరాలు వంటి వాటిని నివారించగలిగామని, బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న సీఎం సూచనలవల్లే ఎక్కువ సాయం చేయగలిగామన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ లేకుండా ఉంటే ఈ రకమైన సేవలు అందించలేకపోయే వాళ్లమన్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు మీలా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదన్నారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాత్రి బసచేశారు. -
4 దేశాలకు ఏపీ అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి, విశాఖపట్నం: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను త్వరితగతిన క్షేమంగా ఇక్కడికి చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్‌లో రోజు రోజుకు యుద్ధ భయం పెరుగుతుండటం, కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి మరణంతో రాష్ట్రం అప్రమత్తమైంది. విద్యార్థులను సురక్షితంగా తీసుకు రావడానికి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లొవేకియాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపాలని నిర్ణయించింది. హంగేరీకి ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు, ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి ఎస్.వెంకట్, పోలండ్‌కు యూరప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రరెడ్డి, రొమేనియాకు ప్రవాసాంధ్రుల ప్రభుత్వ ఉప సలహాదారుడు చందర్షరెడ్డి, స్లొవేకియాకు నాటా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆయా దేశాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపనున్నట్లు ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రుల ద్వారా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించడం ద్వారా వారిలో మనో ధైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ బాధ్యతను స్థానిక తహసీల్దార్లకు అప్పగించింది. ఉక్రెయిన్‌లో సుమారు 586 మంది ఉన్నట్లు గుర్తించడమే కాకుండా, అందులో 555 మంది ఇళ్లకు అధికారులు స్వయంగా వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యాన్ని నింపారు. వీరందరి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధులకు పంపించడం ద్వారా వారిని వేగంగా స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న 28 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి 28 మంది ఏపీ విద్యార్థులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వారందరికీ అధికారులు ఏపీ భవన్లో వసతి, భోజన సదుపాయం, రాష్ట్రానికి చేరుకోవడానికి రవాణా సదుపాయం కల్పించారు. న్యూఢిల్లీ నుంచి ఐదుగురు విద్యార్థులు బుధవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో విజయవాడకు చెందిన కొర్రపాటి సాయిఆకాష్, షేక్ దలీషా, భవానిపురానికి చెందిన మైలవరపు శ్రవణ్ దీపక్‌కుమార్, తాడేపల్లికి చెందిన అల్లంశెట్టి భానుప్రకాష్, ఏలూరుకు చెందిన తూము ప్రణవ్‌స్వరూప్ ఉన్నారు. మరో ఎనిమిది మంది విద్యార్థులు ఎయిరిండియా విమానంలో బుధవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. -
వేల కిలోమీటర్ల నుంచి వచ్చి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకతలివే..
పిఠాపురం(తూర్పుగోదావరి): అలసట లేని వలస జీవులవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్టుగా ‘తూర్పు’ తీరానికి చేరుకుంటాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం కావడంతో జిల్లాలోని సముద్ర తీరంలో సందడి చేస్తున్న ఈ తాబేళ్ల రక్షణకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. చదవండి: రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..? అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లున్నప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిల్లో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే కాకినాడ సమీపంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్య తీర ప్రాంతానికి ఈ తాబేళ్లు ఎక్కువగా వస్తూంటాయి. జీవనం అంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి, మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. సాధారణంగా ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి ‘తూర్పు’ తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి, ఇసుకలో గోతులు తవ్విన, వాటిల్లో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి, తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకూ గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం మరో విశేషం. అన్నీ గండాలే భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచీ సముద్ర తాబేళ్లకు ప్రాణసంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సిన కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి మృత్యువాత పడుతుంటాయి. రాత్రి సమయాల్లో గుడ్లు పొదిగేందుకు వచ్చిన తాబేళ్లను కూడా వివిధ జంతువులు వేటాడి చంపుతుంటాయి. ఈవిధంగా ఏటా ఉప్పాడ తీరంలో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం జనవరి, ఫిబ్రవరి నెలలు సముద్ర తాబేళ్లకు సంతానోత్పత్తి సమయం. దీంతో ఇక్కడకు వస్తున్న తాబేళ్లకు రక్షణ కల్పిస్తున్నాం. అవి సంచరించే ప్రాంతాన్ని సంరక్షణ ప్రాంతంగా నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేసి, ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేస్తున్నాం. అవి గుడ్లు పెట్టే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చూస్తున్నాం. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకూ సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నాం. తాబేళ్లను, వాటి గుడ్లను ఏ జంతువులూ తినకుండా రక్షణ కలి్పస్తున్నాం. తయారైన పిల్లలు సురక్షితంగా సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. తాళ్లరేవు సమీపంలోని కోరింగ అభయారణ్యం ప్రాంతానికి సుమారు లక్ష వరకూ తాబేళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో కొన్ని పరిస్థితుల వల్ల బోట్లలో పడి కొన్ని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎస్.అశ్వనీకుమార్, అటవీ శాఖ సెక్షన్ అధికారి, కోరంగి -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్‌పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్‌కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్‌కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్‌పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్‌పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్‌లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్‌చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్‌పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
AP: శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆయన ఆదివారం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు. విద్యుత్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదని, వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్ధనరెడ్డి, సంతోషరావులతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ టెలీకాన్ఫరెన్స్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షల్లో ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుపతి, నెల్లూరు ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు, మరో 19 సబ్స్టేషన్లలో నీరుందని చెప్పారు. దీనివల్ల 98 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయని తెలిపారు. వీటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం విద్యుత్ పునరుద్ధరణకు తీసుకున్న చర్యల్ని ఇంధనశాఖ కార్యదర్శి మంత్రి బాలినేనికి వివరించారు. వరదలు, తుపానులు, భారీ ఈదురుగాలులు వంటి విపత్తుల్లో విద్యుత్ సమస్యల తీవ్రతను తగ్గించడానికి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సూచించారు. రూ.30 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌కు ప్రతిపాదనలు తిరుపతిలో ప్రస్తుతం ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్ స్థానంలో కొత్తగా రూ.30 కోట్లతో అత్యాధునిక గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్, తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాలకు ప్రతిపాదనలివ్వాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళం వద్ద 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థల వివాదంపై జిల్లా అధికారులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా వరద నీటిలోనే ఉన్న తిరుపతి 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. నాలుగడుగుల నీరుండటంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించలేకపోయామని, అలిపిరి, రేణిగుంట సబ్స్టేషన్ల నుంచి తిరుపతి నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రతాప్‌కుమార్ చెప్పారు. ఎస్జీఎస్ కళాశాల పక్కన గోడ లేకపోవటం వల్లే వరద నీరు సబ్‌స్టేషన్‌ను దిగ్బంధించినట్లు గుర్తించారు. వెంటనే గోడ నిర్మించాలని, ముందువైపు నీళ్లు రాకుండా ర్యాంపు ఏర్పాటు చేయాలని సివిల్ ఎస్ఈ నరసింహకుమార్‌ను డైరెక్టర్ ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నలుగురి ప్రాణాలను కాపాడిన నెల్లూరు జిల్లా విద్యుత్ సిబ్బందిని ఆయన అభినందించారు. ట్రాన్స్‌కో కడప జోన్ సీఈ శ్రీరాములు, ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ ఎస్ఈ చలపతి, ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంకు పంచాయతీరాజ్ శాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు సీఎం జగన్‌ను కలిశారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం నేపథ్యంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చ జరిపారు.(చదవండి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు) రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు, తదితర అంశాలను సమావేశంలో డీజీపీ వివరించారు. మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమైందని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అతిపెద్ద కార్యక్రమమని, దీనిపట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని డీజీపీ వెల్లడించారు. మావోయిస్టుల రిక్రూట్మెంట్ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమని డీజీపీ అన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...? ♦గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాం ♦అంతేకాదు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసాకూడా ఇస్తున్నాం ♦ప్రతి ఏటా రూ.13,500 గిరిజన రైతుల చేతిలో పెడుతున్నాం ♦ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగుకోసం కార్యాచరణకూడా రూపొందించాం: ♦దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం ♦ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం ♦31,155 ఎకరాల డీకేటీ పట్టాలను 19,919 మంది గిరిజనులకు ఇచ్చాం ♦గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం ♦వాలంటీర్లగా వారిని నియమించాం ♦తద్వారా పెద్ద సంఖ్యలో గిరిజనులకు ఉద్యోగాల కల్పన జరిగింది ♦వారి గ్రామాల్లోనే వారికి ఉద్యోగాలు ఇచ్చాం ♦స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రైబల్‌ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్ ఇచ్చాం ♦ఈ కార్యక్రమాలన్నీ కూడా గిరిజనుల జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయి ♦36 షెడ్యూలు మండలాల్లో పాఠశాలలు, హాస్టళ్లను నాడు – నేడు కింద 10అంశాల ద్వారా మెరుగుపరుస్తున్నాం ♦నాడు – నేడు కార్యక్రమాలకు తగిన సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలన్న సీఎం ♦అలాగే షెడ్యూలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేస్తున్న నాడు–నేడు కార్యక్రమాలకూ తగిన సహకారాలు అందించాలంటూ కేంద్రాన్ని కోరాల్సిందిగా అధికారులకు సూచించిన సీఎం ♦ట్రైబల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న టవర్ల మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలని సమావేశానికి హాజరైన టెలికాం అధికారులకు సీఎం ఆదేశం ♦దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తున్నామన్న అధికారులు ♦సమగ్రంగా ఇంటర్నెట్, మొబైల్ టెలికాం సౌకర్యం ఇచ్చేలా విధానం ఉండాలన్న సీఎం ♦దీనిపై ఒక ప్రణాళిక రూపొందించి, ఆమేరకు కేంద్రం సహకారం కోరాలన్న సీఎం ♦ఒక్క గ్రామం కూడా మిగిలిపోకుండా అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం కల్పించే దిశగా అడుగులేయాలన్న సీఎం ♦గ్రామ సచివాలయాలు ఉన్న ప్రతిచోటా కూడా పోస్ట్‌ఆఫీసు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦ఆ మేరకు మ్యాపింగ్ చేసుకుని , మిగిలిన పోస్ట్ ఆఫీసులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలన్న సీఎం ♦ట్రైబల్ యూనివర్శిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦గిరిజనుల్లో చాలామంది పిల్లలకు ఆధార్ లేదన్న అధికారులు ♦ట్రైబల్ ప్రాంతాల్లో అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్ సెంటర్లుగా గుర్తించేలా కూడా కేంద్రాన్ని కోరాలన్న సీఎం ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ప్రిన్స్‌పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: పేదలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు -
తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్ ప్రధాని
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఎవరు విధులకు హాజరవ్వడం లేదు.. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుత అఫ్గన్ ప్రధాని ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని.. తిరిగి దేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు అఖుంద్ బుధవారం ఓ ప్రకటన చేశారు. (చదవండి: కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!) అఖుంద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి రావడానికి మేం భారీ మూల్యం చెల్లించాం. దేశ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదుర్కొబోతున్నాం. ఈ సందర్భంగా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. దేశం విడిచిపోయిన అధికారులు తిరిగి వచ్చేయండి. మీకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం. యుద్ధంలో ధ్వంసమైన అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో అనేక సవాళ్లను చవి చూడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మీ అవసరం చాలా ఉంది. మీ రక్షణ బాధ్యత మాదే.. తిరిగి దేశానికి వచ్చేయండి’’ అని పిలుపునిచ్చాడు. (చదవండి: Afghanistan: అఫ్గాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం) తాజాగా అఫ్గనిస్తాన్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఎక్కువగా అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే ఉండటం గమనార్హం. ఈ ప్రభుత్వ ఏర్పాటులో పాక్ కీలక పాత్ర పోషించింది. అఫ్గన్ కేబినెట్ మంత్రులు సెప్టెంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9/11 దాడులకు ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో అఫ్గన్ కేబినెట్ మంత్రులు ఆ రోజే తమ ప్రమాణ స్వీకారానికి ఎన్నుకోవడం గమనార్హం. -
కోటి మొక్కలు నాటాలన్నదే లక్ష్యం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆగస్టు 31 నుంచి మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ కూడా చూసుకోవాలన్నారు. నాటిన మొక్కలు చనిపోతే సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇవీ చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు -
ఆక్రమణలపై కొరడా: పీలేరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
సాక్షి, చిత్తూరు: పీలేరులో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. శనివారం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. తిరుపతి రోడ్డులో కబ్జాదారులు భారీ ఎత్తున భవనాలు నిర్మించారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ జాహ్నవి నేతృత్వంలో ఉదయం నుంచి పోలీసుల బలగాల సమక్షంలో భవనాల కూల్చివేత చేపట్టారు. ఇప్పటికే 10 భవనాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. -
ప్రకాశం బ్యారేజీ: రేపు భారీగా వరదనీరు.. యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, విజయవాడ: రేపు ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమతమైంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండటంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉండగా, నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నానికి, సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
వాణిజ్య పన్నుల శాఖకు రూ.84.11 కోట్లు నష్టం
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు రూ.84.11 కోట్ల ఆర్థిక నష్టం కలిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్)లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం117 వాణిజ్య శాఖ కార్యాలయాలు ఉండగా.. 2018–19 సంవత్సరానికి గాను అందులో 37 కార్యాలయాల్లోని రికార్డులను కాగ్ పరిశీలించింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల మొత్తం 448 కేసుల్లో రూ.84.11 కోట్ల వ్యాట్‌ను తక్కువగా మదింపు చేసినట్టు వెల్లడైంది. 180 కేసుల్లో వ్యాట్‌ను విధించకపోవడం లేదా తక్కువగా విధించడం ద్వారా ఖజానాకు రూ.65.29 కోట్ల నష్టం వాటిల్లింది. జరిమానాలు, వడ్డీలు విధించకపోవడం ద్వారా రూ.6.68 కోట్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా రూ.5 కోట్లు, సీఎస్టీ చట్టం కింద 67 కేసుల్లో పన్ను విధించకపోవడం వల్ల రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా రాయితీల చెల్లింపులు రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015–20కి విరుద్ధంగా కొన్ని పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించినట్టు కాగ్ నివేదికలో నిగ్గు తేలింది. నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు ఐస్ ఫ్యాక్టరీలకు 2017 నుంచి 2019 మార్చి కాలానికి రూ.1.32 కోట్ల రాయితీలను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు కాగ్ పేర్కొంది. తినడానికి ఉపయోగించే ఐస్‌ను కాకుండా నిల్వ, సంరక్షణ కోసం తయారు చేసే ఐస్ ఫ్యాక్టరీ అయినప్పటికీ ఆహార తయారీ ప్రోత్సహాక విధానం కింద వీటికి రాయితీలు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తం మంజూరైన రూ.1.32 కోట్ల రాయితీ సక్రమం కాదని, ఇప్పటికే చెల్లించిన రూ.76.39 లక్షలు తిరిగి రాబట్టాలని కాగ్ ప్రభుత్వానికి సూచించింది. రుణ భారంలో పీఎస్‌యూలు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల పేరుతో భారీగా రుణాలను సమీకరించినట్టు కాగ్ పేర్కొంది. వరి ధాన్యం కొనుగోలు, పీడీఎస్ బియ్యం సేకరణ, మౌలిక వసతుల కల్పన పేరిట ప్రభుత్వరంగ సంస్థల పేరిట భారీగా రుణాలను సేకరించినట్టు తెలిపింది. 2016–17లో రాష్ట్ర పీఎస్‌యూల అప్పులు రూ.8,518.99 కోట్లుగా ఉంటే.. 2018–19 నాటికి రూ.30,530.91 కోట్లకు గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎస్బీఐ నుంచి రూ.19 వేల కోట్లను అప్పు తీసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఈడబ్ల్యూఎస్ ఇళ్ల భూములు, మౌలిక వసతుల కల్పనకు ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ రూ.3,951.59 కోట్ల రుణాలను తీసుకున్నట్టు పేర్కొంది. చదవండి: ఏపీ: 18వ రోజుకు కర్ఫ్యూ.. ఆంక్షలు మరింత కఠినతరం Cyclone Yaas: యాస్ తుపాను.. పలు రైళ్ల రద్దు -
కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష
సాక్షి, తిరుపతి: కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎస్వీ వర్సిటీ సెనెట్ హాలులో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ వేగవంతం, పరీక్షలు, ఆక్సిజన్ ఏర్పాటుపై చర్చించారు. చదవండి: కరోనా కట్టడి చర్యలపై దుష్ఫ్రచారం.. ఏపీ సర్కార్ సీరియస్ ముగ్గురాయి గనుల్లో పేలుడు: 9 మంది మృతి -
సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలని, ఇందుకోసం ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట పొలాలకు నిరంతరం నీరందిస్తున్నామని, రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం పెరిగిందని ఆయన అన్నారు. పాలమూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, కాలువల నిర్మాణాలు, విస్తరణ మీద బుధవారం మూడో రోజు ప్రగతిభవన్‌లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ దాకా.. నీటిని తీసుకెల్లే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలన్నారు. కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు తదితర అన్నిరకాల వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మరమతుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచిం చారు. ఓఅండ్‌ఎంకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ప్రతి సాగునీటి కాల్వ చెత్తా, చెదారం లేకుండా అద్దంలా ఉండాలని అన్నారు. -
ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్
గుంటూరు ఎడ్యుకేషన్: ‘విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. కనీస వసతులు కూడా కల్పించరా’ అంటూ నారాయణ జూనియర్ కాలేజీపై ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు శివారులోని పెదపలకలూరులో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ క్యాంపస్‌లో కమిషన్ సభ్యులు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యాంపస్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో టమోటాలు, క్యాబేజీ సహా కుళ్లిన కూరగాయలను అలాగే ఉంచడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు వసూలు చేస్తూ.. విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని కూడా అందించలేరా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూస్తారా అంటూ సిబ్బందిని నిలదీశారు. తమ పిల్లలకు సరైన సదుపాయాలను కల్పించడం లేదని, దీనిపై ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఈ సందర్భంగా వాపోయారు. కమిషన్ సభ్యులు స్పందిస్తూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమకు ఆటవిడుపు కూడా లేకుండా తరగతులకే పరిమితం చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ‘విద్యార్థులకు వారంలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వరా? ఏడు రోజుల పాటు ఉదయం 7 నుంచి రాత్రి 9.30 వరకు తరగతులు నిర్వహిస్తారా!’ అంటూ కమిషన్ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఐవో కార్యాలయంలో కమిషన్ సభ్యులు నారాయణరెడ్డి, ప్రసాద్, ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామని చెప్పారు. యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోతే.. కాలేజీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. కాగా, ఇప్పటి వరకు 40 కాలేజీలకు నోటీసులు జారీ చేశామన్నారు. జూనియర్ కాలేజీల నిర్వహణను ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఆర్ఐవో రామచంద్రరావు పనితీరు సరిగాలేదన్నారు. చదవండి: నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ -
వాట్సాప్‌కు షాక్ : కొత్త దేశీ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారీ షాకిచ్చేలా కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. సందేశ్ పేరుతో ఆవిష్కరించ నున్న ఈ యాప్ టెస్టింగ్ ప్రక్రియిను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్ ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరీక్షకు అందుబాటులో ఉంచింది వాట్సాప్ లాంటి యాప్‌ను ఆవిష్కరించే ప్రణాళికలను ప్రభుత్వం గత ఏడాది ధృవీకరించింది. జిమ్స్ (జీఐఎంఎస్) అనే పేరుతో ఈ ప్రభుత్వ యాప్‌ను లాంచ్ చేయనుందనే అంచనాలు వెలువడ్డాయి. కానీ దేశీయంగా ‘సందేశ్’ పేరుతో తీసుకురానుందట. ఈ నేపథ్యంలోనే దీన్ని వినియోగానికి కూడా సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీన్ని వాడుతున్నట్టు సమాచారం. అంతర్జత సమాచారం మార్పిడి కోసం ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారులు సందేశ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ఒక నివేదికలో బిజినెస్ స్టాండర్డ్ సోమవారం తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ అధీకృత ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితమని పేర్కొంది. ఓటీపీ ఆధారిత లాగిన్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ సహా ఆధునిక చాటింగ్ చాప్‌ల ఫీచర్లతో ఐఓఎస్,ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలకు మద్దతునిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, (ఎన్ఐసీ) బ్యాకెండ్ సపోర్టు అందిస్తోంది. -
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాలవారీగా, మౌలిక సదుపాయాల రూపేనా భారీ నష్టం ఏర్పడిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పట్ల ఆశగా చూశామని చెప్పారు. అయితే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని అధికారులు తెలిపారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటకలాంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలోకి రావడానికి అవసరమైన ప్రత్యేక దృష్టి కేంద్ర బడ్జెట్లో కనిపించలేదని వెల్లడించారు. బడ్జెట్ సందర్భంగా వివిధ రంగాలకు, కార్యక్రమాలకూ చేసిన కేటాయింపులు అన్నిరాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ లేవని పేర్కొన్నారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాలకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆహారం, పెట్రోల్, ఎరువుల రాయితీలను కూడా తగ్గించిన విషయాన్ని అధికారులు నివేదించారు. కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో లైజనింగ్ చేసుకుని సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ అధికారులు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. -
అభినందించాలంటే సిగ్గుగా ఉంది..
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అధికారుల నిర్లక్ష్యం, ప్రాజెక్టుల జాప్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్‌పూర్‌లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కొత్త భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ భవనం నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ ఆలస్యానికి బాధ్యులైన అధికారుల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు జాతీయ రహదారి అథారిటీలో తక్షణమే సంస్కరణలు అవసరమన్నారు. పనిచేయని ఉద్యోగులపై చర్య తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. 80 వేల నుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని కేవలం రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నామని, ఇందుకు గర్వంగా ఉందని ప్రకటించిన ఆయన కేవలం 250 కోట్ల ఈ ప్రాజెక్టును పూర్తికి జరిగిన ఆలస్యాన్ని ప్రశ్నించారు. అనవసరమైన గందరగోళాలను సృష్టించి జాప్యం చేస్తున్న అధికారుల ఫోటోలను సంబంధిత భవనం గోడలపై వేలాడదీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ప్రజలు ఈ గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ భవనం ప్రారంభోత్సవంగా సందర్బంగా అధికారునుద్దేశించి మాట్లాడుతూ "ఎలా పలకరించాలోఅర్థం కావడంలేదు.. మిమ్మల్ని అభినందించాలంటే నాగే సిగ్గుగా ఉందంటూ'' మొదలుపెట్టారు. ఎన్హెచ్ఏఐ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జరిగిన సుదీర్ఘ జాప్యం తనకు అవమానకరంగా ఉందన్నారు. 2008లో ఈ భవన నిర్మాణానికి నిర్ణయించాం. 2011లో టెండర్ పిలిచాం.. 200-250 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 9 సంవత్సరాల కాలం పట్టిందని ఆరోపించారు. ఇందుకు సంబంధిత అధికారుల ఫోటోల భవన గోడలపై వేలాడదీస్తే.. ఆ అధికారుల నిర్వాకం ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పని పూర్తి కావడానికి రెండు ప్రభుత్వాలు, ఎనిమిది మంది అధ్యక్షులు మారారని ఆయన గుర్తు చేశారు. భవిషత్తులో ఈ లోపాలను సరిచేసుకుని, వేగంగా పనులు పూర్తి చేయల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు సూచించారు. -
వేగంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం
ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలి. పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలి. తొలుత ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలి. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్ ప్లాంట్‌ను తీసుకొస్తున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నిర్మాణ కంపెనీ ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేయాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందని, ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3–4 వారాల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.300 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగాలు ► కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ► రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందన్నారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ► పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని, తద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం కావాలని సీఎం సూచించారు. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్పందించిన అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్ కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లాక్డౌన్ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్ఫోన్లో మేసేజ్‌లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
‘మిషన్ కర్మయోగి’కి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్ కర్మయోగి’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ ‘మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్పీసీఎస్సీబీ)’కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. సరైన దృక్పథం, లోతైన జ్ఞానం, ఆధునిక నైపుణ్యాలు కలగలసిన, భారతదేశ భవిష్యత్ అవసరాలను తీర్చగల సమర్థ్ధులైన ఉద్యోగులుగా వారిని సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ‘మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఇది అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమం’అని కేబినెట్ భేటీ అనంతరం సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని దేశసేవకు ఉపయోగపడే అసలైన కర్మయోగిగా మార్చేలా ఈ కార్యక్రమం ఉంటుందని సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్ఆర్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్–2020’ని రానున్న సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడ్తామని జావదేకర్ వెల్లడించారు. -
అది నూటికి నూరుపాళ్లు నిజం: కేటీఆర్
సాక్షి, వరంగల్: నగరంలో రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం మంత్రి వరంగల్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించారు. అనంతరం నిట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. నగరంలో పర్యటించిన సందర్భంగా దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విషయం చెప్పారని, అది నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని చెప్పారన్నారు. వారు చెప్పిదంతా నూటికి నూరుపాళ్లు నిజమని, నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటిని తక్షణం తొలగించాలని, ఈ విషయంలో రాజీ పడేది లేదని అధికారులను హెచ్చరించారు. దీనిపై ఎలాంటి రాజకీయ ఓత్తిళ్లు ఉండవని, పెద్ద పెద్ద నిర్మాణాలను తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పనులు వెంటనే ప్రారంభం కావాలన్నారు. ఇంకా నీటి ప్రవాహాలు వెళ్లే నాలాలకు ఏమైనా అడ్డంకులున్నాయా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. నాలాలపై ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే పని చేయడానికి కలెక్టర్ చైర్మన్ గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఎయుడి కమిషనర్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారని చెప్పారు. వీరిద్దరిలో ఒకరు ప్రతీ వారంలో ఒక రోజు వరంగల్‌లో పర్యటిస్తారని, నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలని ఆదేశం జారీ చేశారు. అవి ఆక్రమ నిర్మాణాలైతే నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని, పేదల ఇళ్లు అయితే, వారికి ప్రభుత్వం తరుఫున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ ఉన్న వారికి నష్ట పరిహారం చెల్లించి తొలగించాలని, ఏదేమైనా మొత్తం నాలాలపై ఆక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తూనే, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా వాటికి ప్రహారీ గోడలు(రిటైనింగ్ వాల్స్) నిర్మించాలన్నారు. ఎస్ఆర్ఎస్పి కాలువ ఆక్విడక్ట్ వద్ద కూడా పూడిక తీయాలని కేటీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక రంగల్ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలు అయ్యిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని, పారిశుద్య పనుల్లో యాంత్రీకరణ జరగాలన్నారు. స్వీపింగ్ మిషన్ల ద్వారా నగరంలో పరిశుభ్రతను కాపాడాలని కేటీఆర్ అధికారులకు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడం, ముంపుకు గురైన వారికి అవసరమైన సాయం అందించడంతో పాటు దీనిని తక్షణ కర్తవ్యంగా అధికారులు భావించాలన్నారు. ముంపుకు గురైన వారికి ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు అందించాలని అధికారులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని ఖాళీ చేయించాలన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. నాలాలపై ఆక్రమ కట్టడాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు చైర్మన్‌గా, పోలీస్ కమిషనర్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్ఈ వరంగల్ అర్బన్ ఆర్డీవో, నేషనల్ హైవేస్ అథారిటీ ఎస్ఈ సభ్యులుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీనీ నియమిస్తూ.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కరోనా: నెల్లూరులో లాక్డౌన్ విధింపు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలోని గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, సంగం, సూళ్లూరుపేటలో లాక్డౌన్ అమలు చేస్తుండగా.. ఇప్పుడు నెల్లూరు పట్టణంలోనూ ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంటాయని, ఆ తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపులు ఉంటాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైరస్ నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి అధికారులు కోరారు. -
అధికారుల తీరుపై కేసీఆర్ గరం
-
కుప్పం కేంద్రంగా అవినీతి..
కుప్పం: అటవీశాఖలో కుప్పం కేంద్రంగా జరిగిన అవినీతి బట్టబయలైంది. నిధులు దుర్వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పని చేశారన్న ఆరోపణల మేరకు నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ అనంతపురం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారి ప్రతాప్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం.. రామకుప్పం మండలం చిల్లిమానుగుంట అటవీ పరిధిలో రూ.9,34,388లతో కుంట తవ్వకం చేపట్టినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వాస్తవంగా అక్కడ కొత్తకుంట తవ్వకుండా పాత కుంటకు మెరుగులు దిద్ది నిధులు కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే 2016–17లో సింగమానుకుంటలో నీరు–చెట్టు పనుల్లో రూ.9,34,383 అవినీతి జరగినట్లు అధికారులు తేల్చారు. అలాగే అడవిలో చల్లేందుకు 15 వేల కిలోల కానుగ, చింత, మర్రి, నేరేడు విత్తనాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. రూ.14,42,609లతో ఈ విత్తనాలను కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌లో కొనుగోలు చేసినట్లు చూపారు. ఎక్కడా విత్తనాలు కొనకం చేపట్టలేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. నిబంధనలు అతిక్రమణ అటవీ నిబంధనల ప్రకారం పూచిక పుల్ల కూడా అడవి నుంచి తొలగించరాదనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడి అధికారులు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. టీడీపీ నాయకుల మన్ననలు పొందేందుకు నడుమూరు మోడల్ సూŠక్ల్ నుంచి బేటరాయస్వామి కొండ వరకు 320 మీటర్ల రోడ్డును అడవిలో వేసేందుకు సహకరించినట్టు విచారణ అధికారులు తేల్చారు. గుడుపల్లె మండలంలో బూరుగులపల్లి నుంచి మల్లప్పకొండకు అటవీ ప్రాంతంలో 332 మీటర్ల రోడ్డు నిర్మాణానికి శాఖ అనుమతులు లేకుండానే సహకరించినట్లు గుర్తించారు. బేటరాయస్వామి కొండపై కమ్యూనిటీ భవనం నిర్మాణానికి అనుతులు ఇచ్చినట్టు తేల్చారు. సస్పెండ్ అయిన అధికారులు వీరే.. నిధుల దుర్వినియోగం, నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలపై కుప్పం ఎఫ్ఆర్వో కాలప్పనాయుడు, పలమనేరు సెక్షన్ అధికారి మధుసూదన్, నడుమూరు ఫారెస్ట్ బీట్ అధికారులు పరమేశ్, మున్నాను సస్పెండ్ చేశారు. అప్పటి చిత్తూరు వెస్ట్ డీఎఫ్‌వో చక్రపాణి, ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ రేంజ్ అధికారి గంగయ్యపై శాఖపరమైన చర్యలకు అనంతపురం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ప్రతాప్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కుప్పం వదిలి బయటికి పోరాదని ఆదేశించారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అవినీతి 2016–2018 మధ్య టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం, స్థానిక నాయకుల మన్ననలు పొందాలనే ఉద్దేశంతో రేంజర్ కాలప్పనాయుడు, సిబ్బంది అత్యుత్సాహం చూపినట్టు సమాచారం. కుప్పానికి నోడల్ అధికారిగా కాలప్పనాయుడి నియమించడంతో అటవీ సిబ్బంది కొంత హల్చల్ చేశారు. టీడీపీ నాయకులు చెబితే అడవిలో ఇసుక దోపిడీ, కలప నరికివేతకు ఇట్టే అనుమతులు ఇచ్చేవారు. ప్రధానంగా బేటరాయస్వామి కొండకు అడవిలో రోడ్డు, మల్లప్పకొండకు రోడ్డు నిర్మాణం విషయంలో చంద్రబాబు పీఏ మనోహర్ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. -
మిడతల దండుపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మిడతల దండు రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మిడతల దండును అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై ఆయన ప్రగతి భవన్లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, జయేశ్ రంజన్, పీసీసీఎఫ్ శోభ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్ డీజీ సంజయ్ కుమార్ జైన్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్ ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో మిడతలు ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. (ఆదిలాబాద్‌కు 300 కి.మీ. దూరంలో మిడతలు) అక్కడి నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నాట్లు అధికారు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే మిడతలు తెలంగాణలో ప్రవేశించేందుకు తక్కువ అవకాశాలున్నప్పటికీ రాష్ట్రంలోకి అవి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారలు సీఎంకు తెలిపారు. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారని అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలు ఉన్నాయని చెప్పారు. కాగా గాలి మరలి చత్తిష్‌గఢ్ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చని అధికారులు తెలిపారు. అందుకే మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలని కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జీవన్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలమల్లు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. (పొలాల మధ్యన డీజే, లౌడ్ స్పీకర్ల హోరు..) మిడతల దండును అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు: ఇప్పటికే మహారాష్ట్ర, చత్తీష్‌గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రాష్ట్రంలో ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు అయిదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతిలతో ఈ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. (బాలయ్య వ్యాఖ్యల దుమారం.. కళ్యాణ్ క్లారిటీ) మిడతల దండు రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వారు మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్, క్లోరోఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ ద్రావణాలను సిద్ధంగా పెట్టుకోవాలి. 12 ఫైర్ ఇంజన్లు, 12 జెట్టింగ్ మిషన్లలను కూడా సిద్ధంగా చేసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాసేలా ఈ కమిటీలు చూసుకుంటాయి. -
కొందరి నిర్లక్ష్యం.. ఉద్యోగులకు శాపం
కొందరి నిర్లక్ష్యం కరోనా విధుల్లో పాల్గొంటున్న అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు శాపంగా మారింది. కరోనా లక్షణాలున్న వారు సరైన సమయంలో పరీక్షలు చేయించుకోకపోవడం, లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్న అధికారులనూ కరోనా మహమ్మారి కబళిస్తోంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలందరూ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. సాక్షి, తిరుపతి : జిల్లాలో లండన్ నుంచి వచ్చిన శ్రీకాళహస్తి యువకుడికి తొలిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ యువకుడు కరోనా వైరస్‌ను ముందే గుర్తించి తనకుతానుగా ఆస్పత్రిలో చేరిపోవడం, కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కి వెళ్లడంతో వారి నుంచి ఎవ్వరికీ వైరస్ సోకలేదు. అయితే ఢిల్లీలోని మర్కత్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి జిల్లాలో కల్లోలం మొదలైంది. తిరుపతికి చెందిన యువకుడి నుంచి మొదలైన కరోనా కల్లోలం ఇప్పటికీ ఆగలేదు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో ఆ యువకుడితో మొదలై వారి కుటుంబ సభ్యులకు, వారి ద్వారా ఇద్దరికి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నమోదైంది. (ఎండలో ఎలా వెళ్తావు తల్లీ..) ఆది, సోమవారాల్లోనే 25 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. ఒక్క శ్రీకాళహస్తిలోనే 24, చంద్రగిరి మండలం రంగంపేటలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 53 కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు పాజిటివ్ రోగులు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 49 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఫలితంగా లాక్‌డౌన్‌ని ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లో లాక్ డౌన్‌ని పొడిగించింది. ముక్కంటి చెంత కరోనా కలకలం లండన్ నుంచి వచ్చిన యువకుడు చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదు. కుటుంబ సభ్యులు కూడా వారి వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇంట్లోనే ఉన్నా వైరస్ ఇంతగా వ్యాప్తి చెందేది కాదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో కొందరు పట్టణంలో తిరగ టంతో పాటు సర్వేకు వచ్చిన అధికారులతో కలిసిపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న అనుమానితులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా నిర్వాహకుల హెచ్చరికలను పెడచెవినపెట్టినట్లు సమాచారం. ఫలితంగా శ్రీకాళహస్తిలో వైరస్ వ్యాప్తికి కారకులయ్యారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన 15 మంది ద్వారా కొందరు అధికారులకు ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని కలెక్టర్ భరత్‌నారాయణ గుప్త భావిస్తున్నారు. లాక్డౌన్ మరింత కఠినతరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన శ్రీకాళహస్తి, తిరుపతి, ఏర్పేడు, రేణిగుంట, నిండ్ర, పిచ్చాటూరు, నారాయణవనం, వడమాలపేట, పలమనేరు, గంగవరం, చంద్రగిరి మండలం రంగంపేటను రెడ్జోన్లుగా కలెక్టర్ ప్రక టించారు. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి సడలింపు ఇచ్చినా కరోనా కేసులు నమోదు కావటంతో రెడ్‌జోన్ ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా రెండు రోజుల్లోనే శ్రీకాళహస్తిలో అత్యధిక కేసులు నమోదు కావటంతో వారు ఎవరెవరిని కలిశారనే వివరాల ద్వారా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. నివాసాల్లో ఉన్న వారిని, ఆ ప్రాంతంలో తిరుగుతున్న వారిని థర్మల్ స్కా నింగ్ చేస్తున్నారు. స్కానింగ్‌లో వ్యక్తు ల టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితే క్వారంటైన్‌కి తరలిస్తున్నారు. -
ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: దాడులు.. దౌర్జన్యాలు.. చెయ్యడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది.రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని శ్రీరామ్ బెదిరింపులకు దిగారు. (మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం) -
విద్యుత్ డిమాండున్నా సరఫరాకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లకు చేరినా, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ, గృహావసరాలకు కనెక్షన్లు పెరగడంతో వినియోగం పెరిగిందని వెల్లడించారు. కొత్తగా 40 లక్షల కనెక్షన్లు ఇవ్వడంతో విద్యుత్ డిమాండ్ రెండు రెట్లు పెరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అదనంగా విద్యుత్ వాడకం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే హెచ్చరించారని, అందుకు అనుగుణంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సోమవారం ఆయన ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల ద్వారా నీటి పంపిణీ, కాల్వలకు అవసరమైన మరమ్మతులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు సూర్యాపేటకు వస్తాయా? అంటూ ప్రతిపక్ష నేతలు అవహేళన చేశారని, వారికి నీళ్లు తెచ్చి సమాధానమిచ్చామన్నారు. కాగా, ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిండి ప్రా జెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే దీనిపై సీఎం సమీక్షిస్తారని తె లిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు సైతం అడ్వాన్సులు చెల్లించామని, సాంకేతిక ఇబ్బందుల వల్ల పనులకు ఆటంకం కలిగినా వాటినీ పరిష్కరిస్తామన్నారు. -
పైసా లంచం తీసుకోవద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో నుంచి ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదని.. చిన్న కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయాలన్నా యుద్ధం చేయాల్సివచ్చేందన్నారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో పెద్దగా సంబంధాలు ఉండేవి కావని.. సీఎం కేసీఆర్ నిర్ణయం పరిస్థితిని సమూలంగా మార్చిందని చెప్పారు. ప్రజలు గొంతెమ్మ కోరికలేమి కోరడం లేదు.. ప్రతిపౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలన్నారు. సీఎం కేసీఆర్ కోరుకునే విధంగా పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలకు ప్రణాళికబద్ధమైన ప్రగతిని అందించాలన్నారు. ప్రజలు అసాధారణమైన గొంతెమ్మ కోరికలేమి కోరడంలేదని.. వ్యవస్థీకృత పట్టణాలను కోరుకుంటున్నారని తెలిపారు. దీర్ఘకాలిక అభివృద్ధి కనిపించేవిధంగా పట్టణాల రూపురేఖలను మార్చాలన్నారు. ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారని వెల్లడించారు. టీఎస్ ఐ పాస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.. టౌన్ ప్లానింగ్ విషయంలో సీరియస్ గా ఉండాలని.. అత్యుత్తమ పట్టణాలను రూపొందించాలని సూచించారు. టీఎస్ ఐ పాస్ గురించి ఎక్కడికి వెళ్లినా గొప్పగా మాట్లాడుకుంటున్నారని.. టీఎస్ బీ పాస్‌ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. మార్చి నెలలో టీఎస్ బీ పాస్ లో ఉన్న అన్ని లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బీ పాస్ పై అన్ని స్థాయిల అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పైసా లంచం లేకుండా ఇంటి అనుమతులు ఇవ్వాలని..75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. టీఎస్ బీ పాస్, మీ సేవాతో పాటు మరో కొత్త యాప్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ మూడు ప్రక్రియల ద్వారా లేదా నేరుగా మున్సిపల్ అధికారులకు కలవడం ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. -
ఆర్టీఏలో 'మోనార్క్'
రోడ్డు రవాణా శాఖలో ఓ ఉన్నతాధికారి మోనార్క్ పాలన సాగిస్తున్నాడు. కాసుల కోసం చేయి తిరిగిన సిబ్బందికి దగ్గరలోనే విధులు కేటాయించడం, నిక్కచ్చిగా ఉన్న వారిని దూరప్రాంతాలకు పంపడం పరిపాటిగా మారుతోంది. చిరుద్యోగులతో అనధికారిక విధులు చేయిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మొత్తం ఈ వ్యవహారం వెనుక ఓ కానిస్టేబుల్ తతంగం నడిపిస్తుండడం గమనార్హం. అనంతపురం సెంట్రల్: రోడ్డు రవాణాశాఖలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారి దారితప్పిన ఓ ఉద్యోగిని చేరదీశాడు. దీని వెనుక అసలు కథ చాలానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సదరు అధికారి అవసరాలన్నీ ఆ కానిస్టేబులే చూసుకుంటున్నాడు. గతంలో ఇతని ఉచ్చులో పడిన అధికారులు బలి పశువులయ్యారు. ఓ షోరూంలో పనిచేసే మహిళతో అక్రమ వ్యవహారంలో పడి ఓ అధికారి విలవిలలాడిపోయారు. రూ. లక్షలు చెల్లించి కేసు రాజీ చేసుకోవాల్సి వచ్చింది. తాజాగా బదిలీ వేటు పడిన అధికారి గానా బజానా ఏర్పాటు చేయడం.. దానికి ఓ షోరూం నిర్వాహకుడు ఫైనాన్స్ చేయడం వెనుక సదరు కానిస్టేబుల్ ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెద్ద దూమారం రేగి రాష్ట్ర అధికారుల వరకు వెళ్లింది. దీంతో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఇంట్లో పనిమనిషిగా సెక్యూరిటీ గార్డు సదరు అధికారి ఇంట్లో పనిమనిషిగా ఓ సెక్యూరిటీ గార్డు ఏడెనిమిది నెలలుగా పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సోము అనే సెక్యూరిటీ గార్డు కార్యాలయానికి రావడమే మానేశాడు. ఉదయం పాల ప్యాకెట్లు తెచ్చే దగ్గర నుంచి అన్ని పనులూ అతనే చూసుకుంటున్నట్లు సమాచారం. ఆయన విధులు మాత్రం మిగతా సెక్యూరిటీ గార్డు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పనిభారం అవుతోందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే హోంగార్డుల అత్యాశను సదరు అధికారి అలుసుగా తీసుకొని ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేసే పనిలో పడ్డారు. ఆర్టీఏలో పని చేసే ప్రతి ఒక్కరూ చెక్‌పోస్టులో పనిచేయాలని కోరుకుంటారు. రోజూ రూ.లక్షల్లో అక్రమ ఆదాయం ఉంటుంది. అక్కడ పనిచేస్తే అందులో అందరికీ సమానంగా వాటాలు వస్తాయి. అక్కడికిపోవాలని కోరుకునే సిబ్బందికి ముందుగా విజయవాడ టర్న్ డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. దీంతో కొంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టుకొని విజయవాడలో అధికారుల వద్ద పనిచేసి వస్తున్నారు. ఇలా అనేక విషయాల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ♦ తాజాగా సదరు కానిస్టేబుల్ అంతా తానై ఆర్టీఏను నడిపిస్తున్నాడు. ఆర్టీఏలో ఏ అధికారిని ఎక్కడ పెట్టాలి... జిల్లా కేంద్రంలో ఎవరుండాలి... తదితర అంశాలపై ఆ కానిస్టేబుల్ సలహా తీసుకునే అధికారి నడుచుకుంటున్నారు. గతంలో అనేక ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసి పనిచేస్తుండడంతో గతంలో సాక్షిలో కథనం రావడంతో అప్పటి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాడు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోనే ఇతర ఆర్టీఏ కార్యాలయాల వెళ్లాల్సి ఉంది. కాగా ఇటీవల మళ్లీ చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. ఇటీవల అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్లాడు. ఇప్పుడు తిరిగి అనంతపురానికి వచ్చాడు. తొలుత ఓ ఎంవీఐకి అటాచ్ చేశారు. అక్కడ ఎక్కువ ఆదాయం ఉండదనుకున్నాడో ఏమో రెండు రోజుల్లో అక్కడే మరో ఎంవీఐకి ఆగమేఘాలపై బదిలీ చేయించుకున్నాడు. మిగిలిన వారికి మాత్రం గుంతకల్లు, హిందూపురం, కదిరి ప్రాంతాలకు తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. అవినీతిపరుడిగా ముద్రపడిన ఇతడికి ఇటీవల ఉత్తమ అధికారిగా సత్కారం చేయడం గమనార్హం. -
హైదరాబాద్‌లో సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎస్బీఐ బ్యాంక్‌కు చెందిన ఆరుగురు అధికారుల ఇళ్లలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది. సినీఫక్కీలో తప్పుడు పత్రాలతో పాటు, లేని మనుషులను ఉన్నట్లుగా చూపి బ్యాంక్ నుంచి రుణాలు పొందిన భారీ మోసం వెలుగు చూసింది. రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొందరు ఎస్బీఐ ఉన్నత ఉద్యోగులు ముఠాగా ఏర్పడి రూ.16 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారనే అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు అధికారులు కలిసి డబ్బులు డ్రా చేసినట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్,మైసూర్,బెంగుళూరులో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
కోర్టులంటే లెక్క లేదా..?
సాక్షి, హైదరాబాద్: ‘కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేకుండా పోతోంది. ఒకరిద్దరు అధికారులను కోర్టు ధిక్కార కేసుల్లో జైళ్లకు పంపితేగానీ మొత్తం అందరూ దారికి వచ్చేట్లు లేరు. పలువురు అధికారుల్లో నిలువెల్లా నిర్లక్ష్యం కనబడుతోంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తారా లేక వాటికి ఎలా విలువ ఇవ్వాలో చెప్పాలా..?’అని ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార కేసులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేయడంలోనూ ఆలస్యం చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో ఏకంగా 2 వేల కోర్టు ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో ఒకే జడ్జి వద్ద ఏడెనిమిది వందల కేసులు ఉన్నాయంటే అధికారులు కోర్టు ఆదేశాల్ని ఏ మేరకు ధిక్కరిస్తున్నారో స్పష్టమవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓ కేసులో కోర్టు ఆదేశాలపై అప్పీల్‌ను 466 రోజులు ఆలస్యంగా చేసినందుకు గాను ఆలస్యాన్ని మన్నించి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థన చేయడంతో ధర్మాసనం నిప్పులు చెరిగింది. విచారణ సమయంలో అడ్వొకేట్ జనరల్‌ను ఉద్దేశించి పైవిధంగా హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. గౌరవం నేర్చుకుంటారా.. నేర్పమంటారా..? స్టేట్ లిటిగేషన్ పాలసీ రూపొందించాలని, అన్ని శాఖల్లోనూ కోర్టు కేసుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని గతంలో తాము చేసిన సూచనలు ఏమయ్యాయని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘స్థానిక’ పోరుకు సన్నద్ధం
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు నివేదించడంతో సందడి మొదలైంది. ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల కు ఆదేశాలు అందాయి. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఏటా జనవరి నెలలో ఓటర్ల జాబితాను ప్రకటిస్తున్నారు. ప్రస్తు తం 2020 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. డిసెంబర్ 16 నాటికి ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రకటిస్తారు. కొత్త జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ను రూపొందిస్తారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,03,114 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,36,703 మంది పట్టణ ఓటర్లు కాగా 22,66,411 మంది గ్రామ ఓటర్లు. 2019 ఎన్నికల నాటికి కొత్త ఓటర్లను చేరుస్తూ రావడం వలన సుమారుగా 29 లక్షలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలలో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని చేర్చాలని నిర్ణయించారు. దీని వలన మరో 10 వేల వరకు ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 15 వరకు కొత్త ఓటర్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. వారందరినీ ఫిబ్రవరి 7న ప్రచురించనున్న తుది జాబితాలో ప్రటిస్తారు. మునిసిపాలిటీలకు మేలోగా ఎన్నికలు... రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం మే నెలలోగా ఎన్నిక లు నిర్వహించాలని యోచిస్తోంది. జిల్లాలో శ్రీకా కు ళం నగరపాలకసంస్థకు తొమ్మిదేళ్లుగా, రాజాం నగ ర పంచాయతీకి 14 ఏళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోవాల్సి వ చ్చింది. అలాగే మునిసిపాలిటీల కాల వ్యవధి పూర్త య్యేనాటికి ఎన్నికలను నిర్వహించడం ద్వారా స్థాని క సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. -
వరద తగ్గింది.. ‘ఇసుక’ పెరిగింది
సాక్షి, అమరావతి: ఇసుక రీచ్‌ల వద్ద వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ఇసుక సరఫరాను క్రమేణా పెంచుతోంది. రీచ్‌లలో నీరు పూర్తిగా ఇంకిపోతే ప్రజలు కోరినంత ఇసుకను స్టాక్ యార్డుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 1వ తేదీన 31,576 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు చేరింది. శుక్రవారం ఇది 96,600 టన్నులకు పెరిగింది. గడచిన ఐదు రోజుల్లో మూడు రెట్లు అధికంగా ఇసుక లభించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సుమారు 4 లక్షల టన్నుల ఇసుకను ఏపీ ఎండీసీ స్టాక్ యార్డులకు చేరవేసింది. తూర్పు గోదావరి జిల్లాల్లో తవ్విన ఇసుకను కలిపితే 4.30 లక్షల టన్నుల వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో తవ్వకాలను రెట్టింపు చేయడం ద్వారా కోరినంత ఇసుకను ప్రజలకు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. రోజుకు 2 లక్షల టన్నుల సరఫరా ఇదే పరిస్థితి కొనసాగి మరిన్ని రీచ్‌లలో వరద నీరు ఇంకిపోతే రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఏపీ ఎండీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వర్షాలు ఆగిపోతే వారం రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అధిగమించి ప్రజలకు కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాల్లోని వంకలు, వాగులు, ఏర్లలో ఇసుక తవ్వకాలకు అనువైన 300 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. -
లంచావతారుల్లో ఏసీబీ గుబులు
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఏసీబీ చేస్తున్న దాడులు అవినీతి అధికారులు, ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మేడ్చల్ కలెక్టరేట్ ప్రాంగణంలోని పలు శాఖల కార్యాలయాల్లో వరుసగా ఏసీబీ దాడులు చేస్తుండడంతో కలెక్టరేట్‌కు అవినీతి మచ్చ తప్పదని ఉద్యల్లోను కలవరపెడుతోంది. తాజాగా గురువారం మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ.. ఏసీబీకి పట్టుబడ్డారు. గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ 2014 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల ఆడిట్ రిపోర్టును క్లియర్ చేసేందుకు రూ.15 లక్షలు ఇవ్వాలని డీపీఓ రవికుమార్ డిమాండ్ చేయగా, ఇరువురి మధ్య రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా ఈశ్వర్ నుంచి డీపీఓ అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడాది కాలంలో పలువురు అవినీతి ఉద్యోగులు ఏసీబీకి చిక్కిన సంఘటనలు ఉన్నాయి. ♦ ఇటీవల సెప్టెంబర్ నెలలో బాచుపల్లి మండలం తహశీల్దార్ యాదగిరి స్థానిక బిల్డర్ నుంచి ప్లాట్ల(భూమి) విషయంలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ♦ ఆగస్టులో జిల్లా కో–ఆపరేటివ్ శాఖకు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్, మేనేజర్ ఓ సొసైటీకి సంబంధించి అడిట్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు. ♦ జూన్‌లో బాచుపల్లి మండలంలో భూమి పట్టా జారీకి ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అప్పటి డిప్యూటీ తహశీల్దార్ శ్రీదేవి ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యారు. ♦ ఈ ఏడాది మే నెలలో మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సైతం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ♦ మేలోనే దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన మేనేజర్ గోవిదరావు, జూనియర్ అసిస్టెంట్ క్రిష్ణారెడ్డి సహా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇద్దరు బిల్ కలెక్టర్లు.. ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్డు, వాటర్ ట్యాంక్ నిర్మాణం విషయంలో పెండింగ్ బిల్లు ఇవ్వటానికి మేనేజర్ గోవిందరావు, జూనియర్ అసిస్టెంట్ క్రిష్ణారెడ్డి లంచం తీసుకోవడంతో వారిని కలెక్టర్ సైతం సస్పెండ్ చేశారు. ♦ కీసర మండలం చీర్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 219లోని నాలుగు ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలను అడ్డుకోవటంలో నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శాంతిపై కూడా కలెక్టర్ వేటు వేశారు. ♦ గతంలో అంటే 2017లో డీఈఓ ఉషారాణి అవినీతికి పాల్పడిందన్న అభియోగాల నేపథ్యంలో సస్పెన్షన్స్‌కు గురయ్యారు. జిల్లాలో పలువురు అధికారులు, ఉద్యోగుల అవినీతి, అక్రమాల బాగోతం ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఉద్యోగవర్గాల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పౌర సరఫరాలు, నీటిపారుదల, పీఆర్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, గనులు, భూగర్భ వనరులు, ఆర్టీఓ, ఎక్సైజ్ శాఖల్లో పనిచేస్తున్న పలువురు అవినీతి ఉద్యోగుల లెక్కలు సైతం ఇప్పుడు ఏసీబీ చేతిలో ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. మరోపక్క మేడ్చల్ కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఏసీబీ దాడులు, అవినీతి సంఘటనల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో పాతుకుపోయిన అవినీతి ఉద్యోగుల పనిట్టడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఆయా అధికారులు, ఉద్యోగులకు భయం పట్టుకుంది. కొంపల్లిలో సైతం సోదాలు కుత్బుల్లాపూర్: కీసర కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ఇంట్లో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. కొంపల్లిలోని లక్ష్మీ గణపతి నిలయం అపార్ట్మెంట్ ప్లాట్ నెం.205లో ఉంటున్న రవికుమార్ నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు చేసి చేసి పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో పాటు పలు డాంక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. కాగా, రవికుమార్ భార్య సంధ్యారాణి దూలపల్లిలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఈమె వాడుతున్న కారును సైతం ఏసీబీ తనిఖీ చేసింది. -
కొత్త మున్సిపల్ చట్టాన్ని సరిచూసుకోండి
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలు, చట్టంలోని ఆయా సెక్షన్లకు సంబంధించి కొత్త మున్సిపల్ చట్టంలో ఉన్న మార్పులను సరిచూసుకోవాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సూచించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం వార్డుల పునర్విభ జన తదితరాల్లో తప్పులు, పొరబాట్లు దొర్లాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొంది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించిందని తెలిపింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మళ్లీ కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన వివిధ అంశాలతో మళ్లీ ఫారమ్స్, కవర్స్, బుక్లెట్ల ముద్ర ణ అసాధ్యమని తెలిపింది. దీనికోసం మరింత సమయం పట్టి ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొత్త, పాత చట్టా ల్లోని నిబంధనల్లో పెద్దగా మార్పులేమీ లేవని పేర్కొంది. అయితే ఈ రెండు చట్టాలను సరిచూసినప్పుడు వీటిల్లోని వివిధ సెక్షన్లు, ఆయా అంశాలకు సంబంధించిన సీరియల్ నంబర్లు మాత్రమే మారినట్లు స్పష్టమైందని తెలిపింది. ఇదిలావుండగా.. పాత, కొత్త చట్టాల్లోని ఆయా అంశాలు, సెక్షన్ల గురించి ముఖ్యంగా ఫారమ్స్, బుక్లెట్లు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, నోటిఫికేషన్లు తదితరాల్లో ఇప్పటికే ఎస్ఈసీ విడుదల చేసిన అంశాలపై స్పష్టతనిస్తూ ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
తమాషా చేస్తున్నారా? : కలెక్టర్ ఫైర్
సాక్షి, నారాయణపేట: పొద్దస్తమానం కష్టపడి రైతులు పంటలు పండిస్తే వారికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దళారులతో పంటను ఎలా కొనుగోలు చేస్తారు..? ఇది ఎంతవరకు సమంజసం అని కలెక్టర్ ఫైర్ అయ్యారు. సోమవారం “పెసర పంచాయితీ’పై స్థానిక కలెక్టరేట్లో మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, ఉట్కూర్ పీఏసీఎస్ నిర్వాహకులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. మార్క్‌ఫెడ్ అధికారులపై కలెక్టర్ బాగానే సీరియస్ అయినట్లు తెలిసింది. అసలు కొనుగోలు కేంద్రంలోకి మార్కెట్ పాలకవర్గం వారికి పనేంటీ..? వారు ఎందుకు వచ్చారో చెప్పాలని సూటిగా అడిగినట్లు సమాచారం. మార్కెట్ పాలకవర్గంలోని ఒకరిద్దరు ప్రతినిధులు హడావుడి చేస్తూ టోకెన్లు ఇప్పించి పెసరను కొనుగోలు చేయించడంలో అంతర్యమేమిటో చెప్పాలని గట్టిగా నిలదీసినట్లు తెలిసింది. తేమ శాతం చూడకుండానే విక్రయాలా? కొనుగోలు కేంద్రాన్ని విక్రయించేందుకు వచ్చే రైతులు తెచ్చిన పెసరను ముందుగా తేమశాతం పరిశీలించకుండా ఎలా కొన్నారని.. లోడింగ్ చేసి వాపస్ వచ్చిన లారీల పరిస్థితి ఏంటీ అని మార్క్‌ఫెడ్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే లారీల్లోని సరుకును సరిచూసి ఆరబెట్టి వాటిని తిరిగి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం వరకు ఇప్పటి వరకు తీసుకువచ్చిన పెసరను కొనుగోలు చేయాలని, అందులో ఏవరైనా దళారులు తెచ్చినట్లు తెలితే వారిపై క్రిమినల్కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిసించినట్లు తెలుస్తోంది. నివేదికలు వచ్చాక చర్యలు ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోందని, పూర్తిస్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించినట్లు తెలిసింది. ఇకపై మార్కెట్ పాలకవర్గం వారు ఎవరైనా కొనుగోలు కేంద్రంలో కాలు పెడితే బాగుండదని, కేవలం ఊట్కూర్ పీఏసీఎస్ వారితో మాత్రమే కొనుగోలు చేయించుకోండని హెచ్చరించినట్లు సమాచారం. సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్, మార్క్‌ఫెడ్ డీఎం హన్మంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. -
‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల పరీక్షలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకు తాడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర్రస్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రేపు సాయంత్రానికి అన్ని జిల్లాల్లో స్టాంగ్ రూమ్‌లు సిద్ధం చేయాలన్నారు. ఈ సారి 1.26 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావుండకూడదన్నారు. ప్రణాళికబద్ధంగా పరీక్షలను నిర్వహించాలని చెప్పారు. అధికారులంతా బాధ్యతగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లు
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలను ఆగస్టు మాసంలో నిర్వహిస్తామని వాటికి సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని గతంలో ప్రకటించడంతో ఆ దిశగా మున్సిపల్ అధికారులు ఏ ర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. అధికారులు వార్డుల విభజన పూర్తి చేసి వార్డులు, కులాల వారీగా ఓటర్ల తు ది జాబితాను విడుదల చేసిన విష యం తెలిసిందే. ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించారు. ఎన్నికలసంబంధించిన అధికారులను నియమించారు. వారికి శిక్షణను సైతం అందజేశారు. ప్రధానంగా జోనల్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వేలైన్ బృందాలు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల నియమాకాన్ని చేపట్టారు. మరోసారి విచారణ వాయిదా.. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందంటూ హైకోర్టుకు వెళ్లినా విషయం తెలిసిందే. ఆయా అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి న్యాయ స్థానం ప్రభుత్వానికి పలుసార్లు గడువు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖాలైన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్డులో విచారణ సాగింది. కొత్త పురపాలక చట్టం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం న్యాయ స్థానానికి సమర్పించింది. పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని నివేదించింది. వార్డుల విభజన గందరగోళం, తదితర అంశాలపై అభ్యంతరాలు చెప్పినప్పటికీ వాటిని పరిష్కరించలేదని పిటిషనర్లు వాదించగా, అభ్యంతరాలన్ని ఒక్కరోజులో పరిష్కరించడం సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయ పడింది. విచారణలో భాగంగా కౌంటర్లో పేర్కొన్న అంశాలపై పూర్తి ఆధారాలను ఈనెల 20లోపు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదివరకే పలుమార్లు విచారణను వాయిదా వేసిన హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టి తదుపరి విచారణను 21వ తేదికి వాయిదా వేసింది. కొనసాగుతున్న ఏర్పాట్లు మున్సిపాలిటీ ఎన్నికలకు ఓవైపు అంతా సిద్ధమవుతుంటే మరోవైపు సందిగ్ధం నెలకొంది. ఎన్నికలు జరుగుతాయో.. లేదోననేది వివిధ పార్టీల్లో ఆశావహులే కాకుండా అధికారుల్లో సైతం అయోమయం నెలకొంది. అధికార యంత్రాంగం తన పనితాను చేసుకుంటూ ముందుకెళ్తోంది. ముందస్తుగా అన్నిసిద్ధం చేసేందుకు కార్యాచరణను రోజువారీగా రూపొందించుకుంటున్నారు. ఇదివరకే అధికారులు చేపట్టిన పనులు, తదితర వాటిపై వివరాలు తీసుకున్నారు. ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ హాజరై పలు సూచనలు సైతం అందజేశారు. అందరిలో ఉత్కంఠ.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గతంలో 36వార్డులు ఉండగా, విలీనమైన గ్రామపంచాయతీలతో ఆ వార్డు సంఖ్య 49కు చేరింది. ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ పాలకవర్గం గడువు నుంచి ఆశావహులు ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు ముందస్తుగానే అంచనాలను వేసుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై ఇదివరకే ఆదిలాబాద్ మున్సిపాలిటీ నుంచి కాకుండా ఇతర జిల్లా నుంచి హైకోర్టులో వ్యాజ్యాలు వేయడంతో పలుమార్లు హైకోర్టు ఆ అంశాలపై విచారణ చేపట్టింది. దీంతో ఆశావహులు మరింత ఉత్కంఠకు గురవుతున్నారు. వార్డుల్లో కలియ తిరుగుతూ.. పోటీ చేసే ఆశావహులు నెలరోజుల నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ రిజర్వేషన్ కలిసివస్తే తమకు మద్దతు పలకాలని వార్డుల్లో కలియతిరుగుతూ వేడుకుంటున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను ఇప్పటినుంచే మచ్చిక చేసుకుంటున్నారు. విందులు ఇస్తూ వారిని దగ్గర చేసుకుంటున్నారు. ఎన్నికల మహాత్యమేమో కానీ అర్ధరాత్రికి ఫోన్ చేసినా స్పందిస్తూ కాలనీలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. -
రూ. 2 కోట్ల స్థలం కబ్జా!
అది గూడూరు పట్టణంలో ఎంతో విలువైన స్థలం. అక్కడ అంకణం విలువ సుమారు రూ.20 లక్షలకు పైమాటే. అలాంటి ప్రాంతంలో సుమారు 10 అంకణాలకు పైగా రూ.2 కోట్ల విలువజేసే స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏకంగా ఆ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులిచ్చారు. సంబంధిత ఆర్అండ్బీ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి, గూడూరు: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఎదురుగా పురాతన గడియారం బిల్డింగ్ ఉండేది. అప్పట్లో వాహనాల పార్కింగ్ నిమిత్తం ఆ భవనానికి ముందుగా సుమారు 10 నుంచి 15 అంకణాల వరకూ ఆర్అండ్బీ అధికారులు స్థలాన్ని వదిలి ఉంచారు. కాలక్రమంలో ఆ గడియారం బిల్డింగ్ ఉన్న స్థలాన్ని ప్లాట్ల రూపంలో విభజించి విక్రయించారు. ఈ క్రమంలో ఆర్అండ్బీ పార్కింగ్ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తుల కన్ను పార్కింగ్ నిమిత్తం వదిలిన స్థలంపై పడింది. ఇదే అదనుగా ఆ దుకాణ సముదాయం నిర్మించే బిల్డర్, సేవ ముసుగులో అవినీతికి పాల్పడే ఎల్‌బీఎస్‌లు(లైసెన్స్డ్ బిల్డింగ్ సర్వేయర్) టౌన్ ప్లానింగ్ అధికారులతో మధ్యవర్తిత్వం నెరిపి, ఆ శాఖ అధికారులకు భవన నిర్మాణధారుల నుంచి భారీ స్థాయిలో ముడుపులు ఇప్పించారు. అలాగే ఆర్అండ్బీ శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూడకుండా వారికి కూడా నగదు ముట్టజెప్పినట్లు బిల్డర్, ఎల్‌బీఎస్‌లు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొనుగోలు చేసిన స్థలంతోపాటు కబ్జా చేసిన స్థలాన్ని కలుపుకుని భారీ స్థాయిలో దుకాణ సముదాయ నిర్మాణానికి సన్నద్ధమవుతున్నారు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణం చేపట్టే స్థలానికి ముందుకు వచ్చి కనీసం సెట్ బ్యాక్‌లకు కూడా స్థలం వదలకుండా పెద్ద పిల్లర్‌ను ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలం నాడే ముందు చూపుతో ఆ శాఖాధికారులు పార్కింగ్ అవసరాల నిమిత్తం స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం పెరిగిన వాహనాల రద్దీతో ఆ స్థలం కూడా సరిపోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కొద్దిపాటి స్థలాన్ని కూడా ఆర్అండ్బీ అధికారులు కాపాడుకోవాల్సి ఉంది. అయితే దర్జాగా కబ్జా చేసేస్తుంటే పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హద్దులు చూపాలని తహసీల్దార్‌ను కోరాం మా శాఖకు చెందిన పార్కింగ్ స్థలం అక్కడ ఉందని మా దృష్టికి వచ్చింది. దీంతో గతంలోనే ఆ స్థలానికి సంబంధించిన హద్దులు చూపాలని తహసీల్దార్‌ను రాత పూర్వకంగా కోరాం. కబ్జాకు గురవుతుందని తెలిసింది కాబట్టి మా స్థలాన్ని కాపాడుకునేందుకు మళ్లీ హద్దులు చూపాలని అడుగుతాం. మా స్థలంలో నిర్మాణాలు చేపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – వివేకానంద, ఈఈ, ఆర్అండ్బీ శాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటాం పట్టణంలో స్థలం ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. ఈ మేరకు పరిశీలిస్తున్నాం. కబ్జాకు గురైనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – ఓబులేశు, మున్సిపల్ కమిషనర్ -
స్టీల్‌ప్లాంట్‌ను పరిశీలించిన చైనా ప్రతినిధులు
సాక్షి, జమ్మలమడుగు/ కడప: మండల పరిధిలోని అంబవరం పంచాయతీ చిటిమిటి చింతల గ్రామ సమీపం వద్ద నిర్మిస్తూ ఆగిపోయిన స్టీల్‌ప్లాంట్‌ను చైనాకు చెందిన ధియాంగ్ హోల్డింగ్స్ కంపెనీకి చెందిన నలుగురు ప్రతినిధులు పరిశీలించారు. శుక్రవారం కడపకు చెందిన పరిశ్రమల అధికారులు, ఆర్డీఓ వి.నాగన్న, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డిలతో కలసి క్షేత్రస్థాయిలో జరిగిన పనులను పరిశీలించారు. భూముల వివరాలను తెలుసుకున్న ప్రతినిధులు.. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కొప్పర్తి ప్రాంతాన్ని పరిశీలించిన చైనా ధియాంగ్ హోల్డింగ్స్ కంపెనీ ప్రతినిధులు నేరుగా ఆర్డీఓ ఛాంబర్లో ఉన్న ఆర్డీఓ నాగన్నను కలిశారు. ఈసందర్భంగా స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన భూముల వివరాలను, ప్లాంట్‌కు కావలసిన నీరు, ముడిసరుకు వివరాలతోపాటు, ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, జాతీయ రహదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
ఆదరణ నిధులు పక్కదారి
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద బీసీల్లో ఉన్న కుల వృత్తుల వారికి పరికరాలు ఇప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా దోచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 4 లక్షల మంది బీసీలకు పరికరాలు కొనుగోలు చేసి, అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం రూ.850 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము పక్కదారి పట్టిందని లబ్ధిదారులు వాపోతున్నారు. 2.5 లక్షల మందికి పరికరాలు పంపిణీ చేశామని చెబుతున్నా చాలామందికి అవి అందలేదు. పరికరాలు ఇవ్వకపోగా, లబ్ధిదారుల వాటా కింద కట్టించుకున్న మొత్తాన్ని వారికి తిరిగి ఇవ్వలేదు. ఇలా తమ వాటా కింద డబ్బులు చెల్లించిన వారు 70 వేల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆదరణ పథకం కింద 8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, టీడీపీ ప్రభుత్వం కేవలం 2.5 లక్షల మందికి నాసిరకం పరికరాలు ఇచ్చి చేతులు దులుపేసుకుంది. గోడౌన్లలో ప్రస్తుతం వృథాగా పడి ఉన్న పరికరాల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. -
ఆలయాలు, మసీదుల వెలుపల వాటిపై నిషేధం
లక్నో : కొన్ని మత సంస్థలు వీధుల్లో హనుమాన్ చాలీసా చదవడం, మహా హారతి ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే వార్తలు రావడంతో వీధుల్లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని అలీగఢ్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ముస్లింలు రోడ్లపై నమాజ్ చేస్తుండటంతో అందుకు ప్రతిగా కొన్ని హిందూ సంస్థలు రహదారులపై మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే సమాచారాన్ని అలీగఢ్ జిల్లా మేజిస్ర్టేట్ చంద్ర భూషణ్ సింగ్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దీంతో ఇరు మతాల పెద్దలతో సమావేశమైన జిల్లా మేజిస్ర్టేట్ రోడ్లపై ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వీధుల్లో కాకుండా దేవాలయాలు, మసీదుల్లో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలని ఆయా సంస్థలు, సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలీగఢ్ సమస్యాత్మక ప్రాంతమైనందున ఎలాంటి మతపరమైన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టేముందు నిర్వాహకులు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. -
ఎస్ఎల్బీసీ నెత్తిన మరో పిడుగు!
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో టన్నెల్ తవ్వకపు పనులకు కొత్త చిక్కొచ్చి పడింది. గడిచిన రెండు, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లుల చెల్లింపు చేయకుంటే ఈ నెల 10 నుంచి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని జెన్కో అధికారులు ఏజెన్సీ సంస్థకు నోటీసులు పంపారు. ఎస్ఎల్బీసీలో ఇప్పటికే శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు కన్వేయర్ బెల్ట్ పాడవడం, టన్నెల్ బోరింగ్ యంత్రానికి మరమ్మతులు జరగని కారణంగా ఆగిన విషయం తెలిసిందే. ఈ పనులకే రూ.60 కోట్లు అడ్వాన్సులు కోరగా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. దీనికి తోడు మరో రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. ఈ నిధులే ఐదారు నెల లుగా రాకపోవడంతో ఏజెన్సీ సంస్థ తలపట్టుకుంటోంది. ప్రస్తుతం ట్రాన్స్‌కో మరో పిడుగు వేసింది. టన్నెల్ తవ్వకం సందర్భంగా వస్తున్న సీపేజీ నీటిని తోడేందుకు ఏజెన్సీకి ప్రతినెలా రూ.2 నుంచి రూ.3 కోట్ల మేర కరెంట్ బిల్లు వస్తోంది. గతంలో బిల్లులు లేక చెల్లింపు చేయకపోవడంతో ప్రభుత్వం విదిల్చిన అరకొర నిధులతో నెట్టుకొచ్చింది. తాజాగా మళ్లీ మూడు నెలలుగా రూ.7 నుంచి రూ.8 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. వాటిని చెల్లించాలని లేదంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఇదివరకే జెన్కో హెచ్చరించింది. దీంతో ప్రాజెక్టు ఇంజనీర్లు ఆర్థిక శాఖను కలిసినా నిధుల విడుదల జరగలేదు. దీనిపై కల్పించుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు కొందరు రాష్ట్ర ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డితో చర్చించి కొన్నాళ్లు సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని విన్నవించారు. దీంతో సరఫరా కొనసాగిస్తూ వస్తుండగా, వారు విధించిన తుది గడువు ఈ నెల 10తో ముగుస్తోంది. బిల్లు చెల్లింపు చేయకుంటే సరఫరా ఆగనుంది. అదే జరిగితే మొత్తం ప్రాజెక్టుకు మొదటికే మోసం రానుంది. ఇప్పటికే ఇన్లెట్ టన్నెల్ పనుల వద్ద ప్రస్తుతం భారీగా సీపేజీ ఉండటంతో నిమిషానికి 9,600 లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీ వద్ద 6 వేల లీటర్ల మేర మాత్రమే నీటిని తోడే సామర్ధ్యం ఉండటంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతే డీ వాటరింగ్ చేయడం కష్టం. అదే జరిగితే టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా మునిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
వైద్య ఆరోగ్య శాఖపై వైఎస్ జగన్ సమీక్ష
-
చంద్రబాబు తీరుతో నలిగిపోతున్న అధికారులు
-
పసుపు రైతులకు దొరకని సీఈసీ అపాయింట్మెంట్
-
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా.. .
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యం త్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ వినియోగించిన వీవీప్యాట్ యం త్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెగ్మెంట్‌కు లెక్కించే వీవీప్యాట్ సంఖ్యను పెంచాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు/వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
అద్భుతం ఆవిష్కృతం
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భు తం ఆవిష్కృతమైంది. రాష్ట్ర సాగునీటి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో జల దృశ్యం సాక్షాత్కారమైంది. పనులు మొదలైనప్పటి నుంచి రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. ప్యాకేజీ–6లో భాగం గా ధర్మారం మండలం నందిమేడారం వద్ద నిర్మిం చిన సర్జిపూల్లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ వెట్‌రన్ విజయవంతమైంది. ఈ పరీక్షకు సంబంధించి సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తికావడంతో అధికారులు బుధవారం వెట్‌రన్ నిర్వహించారు. నందిమేడారం సర్జిపూల్లో నింపి ఉంచిన ఎల్లంపల్లి నీళ్లను రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. ఈ సర్జిపూల్లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 మోటార్లు బిగించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 4 మోటార్లు సిద్ధంచేశారు. వీటిలో మొదటి మోటార్‌ను వెట్‌రన్ చేయడం ద్వారా సర్జిపూల్ నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని పంప్ చేశారు. తొలుత ఉదయం 11 గంటలకు భూగర్భంలోని పంప్‌హౌస్ వద్ద సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, నీటి పారుదల సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, నవయుగ సీఎండీ శ్రీధర్, జీధెం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో స్మితాసబర్వాల్ మొదటి పంప్ స్విచ్ ఆన్‌చేసి వెట్‌రన్ ప్రారంభించారు. మోటార్ ఆన్ చేయగానే పంపింగ్ ప్రారంభమై టన్నెల్ ద్వారా మేడారం రిజర్వాయర్ సమీపంలోని డెలివరీ సిస్టర్న్ ద్వారా నీరు పైకి వచ్చింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇదే మోటార్‌కు మరోసారి వెట్‌రన్ నిర్వహించారు. ఈఎన్సీ, ఈఈల పనితీరు భేష్.. మొదటి మోటర్ వెట్‌రన్ విజయవంతం కావడం వెనుక ఇంజనీరింగ్ అధికారుల నిరంతర శ్రమ ఉందని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ప్రశంసించారు. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, నీటి పారుదల సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి చాలా చక్కగా పనిచేశారని కొనియాడారు. ఈఎన్సీ వెంకటేశ్వర్లు చాలా కష్టపడ్డారని ఈఈ శ్రీధర్ స్మితాసబర్వాల్‌కు చెప్పగా.. మీరు కూడా సూపర్ వర్కర్ అని ఆమె కితాబిచ్చారు. -
ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్తో ఓటేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇకపై ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ)తో నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రం నుంచైనా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం పొందనున్నారు. ఓటు కలిగి ఉన్న నియోజకవర్గంలోనే ఎన్నికల విధులు నిర్వహించేవారికి ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు. వారు ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఓటేసే అవకాశం పొందనున్నారు. ఏప్రిల్ 11న రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ సాధారణ ఎన్నికల నిర్వహణ విధుల్లో పాలుపంచుకోనున్న 2.8 లక్షల మంది అధికారులు, సిబ్బందిలో అధిక శాతం ఈడీసీ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయాన్ని పొందబోతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. ఓటు ఉన్న నియోజకవర్గం కాకుండా వేరే ప్రాంతంలో పనిచేసే ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈడీసీ, పోస్టల్ బ్యాలెట్ల జారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ‘పీబీ సాఫ్ట్’అనే సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారందరూ వారికి సంబంధించిన 12/12ఏ ఫారంను తప్పుల్లేకుండా నింపి, ఎన్నికల విధి నిర్వహణ వివరాలను జతపరిచి వారం రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌ను కలవాలని సీఈవో సూచించారు. ఈ పత్రాల ఆధారంగా అందరూ శిక్షణ కార్యక్రమాలకు హజరు కావొచ్చని తెలిపారు. సహాయక సిబ్బందికి సైతం.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షల మందికి ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. వెబ్ కాస్టర్లు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు, క్లీనర్లు ఇలా మరో లక్ష మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరందరికి కూడా ఈడీసీ/ పోస్టల్ బ్యాలెట్ ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. -
111 కేజీల బంగారం పట్టివేత
సాక్షి, చెన్నై: ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజే తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో 111 కేజీలకు పైగా బంగారం పట్టుబడింది. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 లోక్‌సభ, 19 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఏప్రిల్ 18వ తేదీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కరూర్ జిల్లా అరవచ్చకుడి వద్ద వేకువజామున ఓ వాహనంలో 95 కేజీల బంగారం బయట పడింది. సేలంలోని ప్రముఖ జ్యువెలరీస్‌కు దీనిని తరలిస్తున్నట్టు సిబ్బంది పేర్కొన్నారు. రుజువులు చూపలేకపోవడంతో సీజ్ చేశారు. వేలూరు సమీపంలోని చిట్టంపట్టి వద్ద అధికారులు ఓ వాహనంలో ఉన్న 12 కేజీల బంగారం, ఐదు కేజీల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.64 కోట్లుగా తేల్చారు. ఎలాంటి రికార్డులు లేకుండా వీటిని తరలిస్తుండటంతోనే సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే, కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు తిరుపతి నుంచి వచ్చిన ఓ ప్రైవేటు మినీ బస్సులో ప్రయాణిస్తున్న రామనాథపురానికి చెందిన మహ్మద్ అబ్దుల్ వద్ద రూ.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై రైల్వే స్టేషన్లో పోలీసులు నలుగురు ప్రయాణికుల నుంచి 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. తస్మాత్ జాగ్రత్త..
సాక్షి, ఎమ్మిగనూరు: ఎన్నికల వేళ పోలీసులకు విశేషాధికారాలు ఉంటాయి. వారనుకొంటే ఎంతటి నేరగాడినైనా ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది. చిన్న నేరాన్నీ ఉపేక్షించకుండా కట్టడిచేస్తే దాని ఫలితం ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదవుతుంది. ఎన్నికలవేళ పోలీసుల అమ్ములపొదిలో అమరి ఉన్న అధికారాలను పరిశీలిస్తే.. సెక్షన్ 125(ఏ): అభ్యర్థులు తమకు పడిన శిక్షలు..తమపై మోపిన నేరాలకు సంబంధించిన విచారణలు గోప్యంగా ఉంచటం నేరం. ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచితే శిక్షార్హమే. దీనికి ఆరునెలలు జైలు.. జరిమానా.. రెండూ విధించవచ్చు. సెక్షన్ 126: ఎన్నికలకు 48 గంటలలోపు ఊరేగింపులు చేయడం, సమావేశాలు నిర్వహించటం, మీడియా ప్రకటనలు ఇవ్వడం, సంగీత కచేరీలు తదితర వినోద కార్యక్రమాలు నిర్వహించటం నేరం. దీనికి రెండు సంవత్సరాల వరకూ జైలు, జరిమానా, రెండూ విధించవచ్చు. సెక్షన్ 127(ఏ): పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు ఎవరైనా అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించటం నేరం. ఘర్షణలు సృష్టించే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆరునెలలు జైలుశిక్ష తప్పదు. సెక్షన్127: ప్రచురణకర్తల చిరునామా లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రకటనలు ముద్రించటం నేరం. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితోనే జారీ చేయాలి. దీన్ని ఉల్లంఘిస్తే ఆరునెలలు జైలు, రూ.25వేలు జరిమానా చెల్లించక తప్పదు. సెక్షన్128: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు చెందిన విషయాలను గోప్యంగా ఉంచాలి. ఉల్లంఘిస్తే మూడునెలలు జైలు తప్పదు. సెక్షన్ 129: ఎన్నిక విధుల్లో ఉన్న అధికారులు ఏపార్టీ అభ్యర్థికైనా అనుకూలంగా వ్యవహరించటం నేరం. నిబంధనలు అతిక్రమిస్తే ఆరునెలలు జైలు.. జరిమానా ఉంటుంది. సెక్షన్ 130: పోలింగ్ స్టేషన్‌కు100 మీటర్లలోపు ప్రచారం నిర్వహించటం, ఓటర్లను అభ్యర్థించటం, ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లేయొద్దని చెప్పడం నేరం. సెక్షన్ 131, సెక్షన్ 132: పోలింగ్ స్టేషన్లలో ఉన్నవ్యక్తులకు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఆగ్రహం తెప్పించేలా మెగాఫోన్లు, లౌడ్‌స్పీకర్లతో ధ్వనులు చేయటం నిషిద్ధం. అలాంటివారిని అరెస్టు చేయాల్సిందిగా ప్రిసైడింగ్ అధికారులు.. పోలీసు అధికారులకు సూచించవచ్చు. నిందితులకు మూడునెలలు జైలు, జరిమానా, రెండూ విధించవచ్చు. సెక్షన్ 134(ఏ): ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పార్టీలకు ఎన్నికల ఏజెంటుగా, పోలింగ్ కౌటింగ్ ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహించటం నేరం. అందుకుగాను మూడునెలలు జైలు తప్పదు. సెక్షన్ 134(బీ): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుల అనుమతిపొందిన సాయుధ పోలీసులు మినహా ఎవ్వరూ ఆయుధాలు ధరించి పోలింగ్‌స్టేషన్ సమీపంలో సంచరించ కూడదు. పట్టుబడితే రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుంది. సెక్షన్ 165, 166 సీఆర్పీసీ: పోలీసులు వారెంట్లు లేకుండానే సోదాలు చేసే అధికారాన్ని ఈ సెక్షన్లు కల్పిస్తాయి. ఓటర్లకు పంపిణీ చేయటానికి ఎక్కడైనా డబ్బు, మద్యం, ఇతర బహుమతులను భద్రపర్చినట్లు సమాచారం వస్తే పోలీసులు వెంటనే సోదాలు నిర్వహిస్తారు. అనుమతిలేకుండా ఉంచిన ఆయా స్టాకును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేస్తారు. సెక్షన్ 353, 332, 186, 189, 190: ప్రకారం విధుల్లో ఉన్న ఉద్యోగులను నిరోధించటం, వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం, దాడులు చేయటం వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, మారణాయుధాలు వినియోగించి దాడులకు పాల్పడటం, బాంబులు విసురుకోవడం చేస్తే..ఐపీసీతోపాటు ఆర్పీ యాక్టు, పోలీసు చట్టంలోని సెక్షన్లకింద కేసులు నమోదు చేస్తారు. -
కరప్షన్ కింగ్స్!
సాక్షి సిటీబ్యూరో: నగరంలో అవినీతి అధికారులు, సిబ్బంది రెచ్చిపోతున్నారు. పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడితప్పటంతో లంచావతారులు సాధారణ జనాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారు. ప్రతిపనికి ఓ రేటు నిర్ధారించి నేరుగా నగదు తీసుకోవటమో లేక తాము అనధికారికంగా నియమించుకున్న ఏజెంట్ల ద్వారా పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇందులో మున్సిపల్ (జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్ఎండీఏ)కు రెవెన్యూ, ట్రాన్స్‌కో(డిస్కం), పోలీస్ శాఖలు అగ్రభాగాన ఉన్నట్లు ఏసీబీ తాజాగా విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. మంగళవారం సైతం జీహెచ్ఎంసీ, సిటీ సివిల్ కోర్టుల్లో ఇద్దరి ఉద్యోగుల్ని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జీహెచ్ఎంసీ విషయంలో తమ స్థాయిలో ఎన్నిచర్యలు తీసుకున్నా జోన్, సర్కిల్ స్థాయిలో అక్రమాలు, అవినీతిపరులకు ఇంకా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా నివాస, వ్యాపార నిర్మాణాలకు సంబంధించి అనుమతుల నుండి మొదలవుతున్న అవినీతి వ్యవహారం, నిర్మాణదారులు అనుమతించిన దానికంటే అదనంగా వేసుకునే ఫ్లోర్లకు స్క్వేర్ ఫీట్ చొప్పున రేట్లు నిర్ధారించి వసూళ్లు చేస్తున్నారు. ఇక రెవెన్యూ విభాగంలోనూ ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ విషయంలోనూ భారీ మాయాజాలం నెలకొంటోంది. నివాస భవనాలను వాణిజ్య భవనాలుగా, వాణిజ్య భవనాలను నివాస భవనాలుగా చూపటంతో పాటు మొత్తం విస్తీర్ణాన్ని సైతం నిర్ధారించే విషయంలో భారీ గోల్‌మాల్‌కు పాల్పడుతూ సొంతజేబులు నింపేసుకుంటున్నారు. ఇక హెచ్ఎండీఏలో లే అవుట్లు, భారీ భవనాల అనుమతుల విషయంలో రోడ్ అప్రోచ్‌లు, జోన్ నిబంధనలు, మాస్టర్‌ప్లాన్ నియమాలు చూసీచూడనట్లు వదిలేసేందుకు ప్రత్యేక ప్రైవేటు వ్యవస్థలే పనిచేస్తున్న దాఖలాలున్నాయి. వాటర్బోర్డులోనూ ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బంది చేతివాటం బోర్డుకు నష్టాలను పంచుతోంది. పోలీస్ శాఖలో పర్యవేక్షణ లోపం... పోలీస్స్టేషన్ల నిర్వహణకు ప్రతి నెలా నిధుల విడుదలతో పాటు అత్యాధునిక వాహనాలు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా..సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల ధనదాహం పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల లక్ష్యాలకు గండికొడుతోంది. దొంగలతో పాటు, దొంగ సొత్తు కొనుగోలుదారులు, పలు కేసుల్లో నిందితులతో కుమ్మక్కై రూ.2 వేల నుండి లక్షల వరకు లంచాలు గుంజుతున్న వైనం ఆయా కమిషనరేట్లలో పర్యవేక్షణ లోపాలను వెల్లడిస్తోంది. ఏసీబీ గడిచిన కాలంగా కొరఢా ఝులిపిస్తుండటంతో ఆయా పోలీస్స్టేషన్లలో ఇన్స్పెక్టర్లు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు బహిరంగంగా దొరికిపోతున్న వైనం కింది స్థాయిలో మారని పరిస్థితిని తెలియచేస్తోంది. ఇక డిస్కంలో అయితే పరిస్థితిలో ఏ మార్పు కనిపించటం లేదన్న ఫిర్యాదులున్నాయి. కరెంటు మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాలనీలు, అపార్ట్మెంట్లకు లైన్లు వేసే విషయంలో భారీఎత్తున అవినీతి చోటు చేసుకుంటోంది. రెవెన్యూ శాఖలో ఐతే కింది స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు ప్రతి పనికి ఓ రేటును నిర్ధారించుకున్నారు. నగరంతో పాటు శివార్లలోనే భారీగా భూ క్రయవిక్రయాలు చోటు చేసుకుంటుండటంతో మ్యుటేషన్ మొదులకుని రికార్డులు, పాస్ పుస్తకాల జారీలో గ్రామ రెవెన్యూ అధికారి నుండి ఉన్నతాధికారుల వరకు భారీ మొత్తాలు ఫిక్స్ అయి ఉన్నాయి. నేరుగా ఫిర్యాదు చేయండి: ఏసీబీ గడిచిన ఐదేళ్లలో నగరంలో 75 మంది మున్సిపల్, రెవెన్యూ, డిస్కం, పోలీస్ శాఖలకు సంబంధించి సుమారు 95 కేసులు నమోదు చేసిన ఏసీబీ, 2019లో రెండు మాసాల్లోనే 14 మందిని వలపన్ని పట్టుకుంది. అందులో అత్యధికం రెడ్హ్యాండెడ్వి కావటం విశేషం. నగరంలో ఎవరు లంచం అడిగినా, డిమాండ్ చేసినా 040–23251501, 23251 555, 94404 46126 ఫోన్ నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చు. అలాగే వాట్సాప్ నెంబర్: 94404 46106లలో ఫిర్యాదు చేయాలని ఏసీబీ ముఖ్య అధికారులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. న్యాయశాఖ ఉద్యోగి... యాకుత్‌పురా: కోర్టు వారెంట్‌లో జాప్యం కొరకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ సిటీ సివిల్ కోర్టు న్యాయశాఖ ఉద్యోగి మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్–1 ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన కృష్ణ నాయక్ పురానీహవేలిలోని సిటీ సివిల్ సెంట్రల్ నజారత్ సెక్షన్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన అమితుల్ సయ్యిదా హజ్రా ఇంట్లో అద్దెకుంటున్న ఆరీఫ్ మోహిద్దీన్ అనే వ్యక్తి ఇల్లు ఖాళీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో 2009 నుంచి అమితుల్ సయ్యిదా హజ్రా, ఆరీఫ్ మోమిద్దీన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోర్టు ఇటీవల ఆరీఫ్ మోహిద్దీన్‌కు వారెంట్ జారీ చేసింది. సదరు వారెంట్‌ను పెండింగ్‌లో ఉంచాలని కోరుతూ ఆరీఫ్ మోహిద్దీన్ కృష్ణ నాయక్‌ను ఆశ్రయించాడు. ఇందుకు అతను రూ. లక్ష డిమాండ్ చేశాడు. చివరికి రూ.35 వేలకు ఒప్పందం కుదిరింది.దీనిపై ఆరీఫ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచనమేరకు మంగళవారం మధ్యాహ్నం అతను కోర్టు ప్రాంగణంలోని పార్కింగ్ వద్ద కృష్ణ నాయక్‌ను కలిసి రూ.35 వేలు ఇస్తుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్ రావు, రవీందర్ రెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు బంజారాహిల్స్: ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సెంట్రల్‌జోన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఇద్దరు ఉద్యోగులను లంచం తీసుకుంటుండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌జోన్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 13లో ఎం.సత్యనారాయణ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా, కె.చరణ్ బిల్ కలెక్టర్ కమ్ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సయ్యద్‌షా అలీం అనే బాధితుడు తన ఇంటి ఆస్తిపన్ను అసెస్మెంట్ ఫైల్‌ను పరిష్కరించుకునేందుకు పలుమార్లు సత్యనారాయణ వద్దకు వచ్చాడు. ఇందుకోసం రూ.8 వేలు లంచం కావాలంటూ ఈ నెల 12న సత్యనారాయణతో పాటు బిల్‌కలెక్టర్ చరణ్ డిమాండ్ చేశారు. ఇందుకు అంగీకరించిన బాధితుడు ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం పక్కా ప్లాన్‌తో బాధితుని నుంచి వీరిద్దరూ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిద్దరినీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. -
‘ఆ అధికారులను గమనిస్తున్నాం’
సాక్షి,న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పట్ల మితిమీరిన విధేయత చూపుతున్న అధికారులపై తాము కన్నేసి ఉంచామని, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అవి మారుతుంటాయని వారు గుర్తెరగాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో తాము కొన్నిసార్లు విపక్షంలో ఉంటే మరికొన్నిసార్లు అధికారంలో ఉంటామని, ప్రభుత్వ అధికారులు ఈ విషయం గమనించాలన్నారు. ప్రధాని పట్ల అతివిధేయత కనబరుస్తున్న అధికారులపై తాము కన్నేసి ఉంచామని, రాజ్యాంగం అన్నింటికంటే పెద్దదన్న సంగతి అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కాగా గవర్నర్ కార్యాలయలు, వర్సిటీ వీసీలు, మీడియా సహా అన్ని వ్యవస్ధలపైనా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాడి చేస్తోందని ఇటీవల కపిల్ సిబల్ ఆరోపించారు. కళాకారులు, రచయితలపై దేశద్రోహం అభియోగాలు మోపుతున్నారని, కొందరు మాట్లాడుతుంటే అడ్డుకుని భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
తక్కువ మాట్లాడండి.. ఊపిరి ఎక్కువ తీసుకోవద్దు!
న్యూయార్క్: మాట్లాడకుండా, ఊపిరి తీసుకోకుండా ఎలా ఉంటారు? అయినా.. ఇవేం పిచ్చి సూచనలు? ..ఇవే కదా మీ అనుమానాలు! తొందరపడి అక్కడి అధికారులను తిట్టుకోవద్దు. నిజానికి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే అధికారులు ఈ రకమైన సూచనలు చేశారు. అసలు విషయమేంటంటే.. చలి అమెరికాను గడ్డకట్టించేస్తోంది. మనదగ్గర ఉష్ణోగ్రతలు ఏడెనిమిది డిగ్రీలకు పడిపోతేనే గజగజా వణికిపోతున్నాం. అమెరికాలోనైతే ఏకంగా మైనస్ 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్, విస్కాన్సిన్, ఇలినాయిస్, మిచిగాన్ తదితర ప్రాంతాల్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఈ సందర్భంగా వాతావరణశాఖ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని.. బయటకు వెళ్లేటప్పుడు పెద్దగా ఊపిరి తీసుకోవద్దని, ఇతరులతో తక్కువగా మాట్లాడాలని సూచించారు. అలాగే ఇటువంటి చలి వాతావరణంలో బయట 10 నిముషాలకు మించి ఉంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. రానున్న రెండుమూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
అంత చదువు చదివి..
పేరుకు పోలవరం ప్రాజెక్టులో ఏఈఈలు, టెక్నికల్ ఉద్యోగులు. వీరిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములై వేగంగా పూర్తి చేసేందుకు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ ప్రచారానికి వీరిని వినియోగిస్తుంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వారికి భోజనాలు వడ్డించడం తదితర విధులకు వీరిని పరిమితం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ ప్రచారకర్తలుగా వీరిని వాడుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నోరు మెదపలేని పరిస్థితి. వ్యతిరేకిస్తే తమ ఉద్యోగ భద్రతకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని వారంతా భయపడుతున్నారు. పోలవరం రూరల్ :పోలవరం ప్రాజెక్టు సందర్శకుల పేరుతో బస్సుల్లో ప్రభుత్వం ప్రజలను తరలిస్తోంది. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నిత్యం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నిత్యం 100 బస్సుల్లో 5 వేల నుంచి 6 వేల మంది ప్రజలు పోలవరం సందర్శనకు వస్తున్నారు. వీరు రాగానే భోజన శాల వద్ద ఏఈఈలు ఔట్ సోర్సింగ్ సిబ్బంది వారి వివరాలు సేకరిస్తారు. ఏ జిల్లా, ఏ మండలం నుంచి ఎంత మంది వచ్చారు. బస్సు నెంబర్‌తో సహా, ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. ఈ వివరాలు ప్రకారం వచ్చిన వారికి టిఫిన్ రూ.75, భోజనం రూ.125 చొప్పున బిల్లు చేస్తారు. భోజన శాల వద్ద కొంతమంది సిబ్బంది వీరికి ఏర్పాట్లు చేస్తారు. స్పిల్‌వే, వ్యూ పాయింట్, ప్రాజెక్టు నమూనా ప్రదేశాల్లో ఒక్కొక్క చోట నలుగురు ఏఈఈలు వంతున 16 మంది విధులు నిర్వహిస్తారు. దర్శకులు అక్కడికి చేరుకోగానే ప్రాజెక్టు పనులు జరుగుతున్న వివరాలను తెలియజేస్తారు. ప్రాజెక్టులో వీరే చేసే అసలు విధులకు వెళ్లి 8 నెలలు కావస్తోంది. సుమారు 30 మంది ఏఈఈలు, 30 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది అసలు విధులకు దూరమవుతున్నారు. డివిజన్–2 టన్నెల్స్, డివిజన్–4 గేట్లు తయారీ, డివిజన్–8 ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలులో పనిచేసే సిబ్బంది పర్యాటకుల సేవ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు సందర్శన అంటూ ఆర్భాటం చేస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన ఈ సందర్శన కార్యక్రమంలో సుమారు ఇప్పటి వరకు 4 లక్షల మంది వచ్చారంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. ఈ పేరిట ప్రజాథనం వృథా చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టులో పాలు పంచుకోవాల్సిన ఏఈఈలు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని టూరిస్టు గైడ్లుగా మార్చి అవమాన పరుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. బాధాకరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గిన్నిస్ రికార్డు వచ్చిదంటూ సంబరాలు చేస్తున్నారు. రెండో పక్క ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఇంజినీర్లను సందర్శకుల సేవకు పరిమితం చేయడం బాధాకరం. నిర్మాణంలో చురుకుగా ఉండాల్సిన ఇంజినీర్ల పనులకు ఆటంకం కలిగించడం సరైంది కాదు. –ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యవర్గ భ్యులు సమంజసం కాదు యువ ఇంజినీర్లను పనిలో ఉత్సాహ పరచవలసింది పోయి, వారిని సందర్శకుల సేవలకు ఉపయోగించడం సమంజసం కాదు. ఇంజినీర్లను, సిబ్బందిని వివిధ పనులకు వినియోగిస్తూ వారిని అసలు పనులకు దూరం చేస్తున్నారు. – దత్తి రాంబాబు, పోలవరం -
సీబీఐలో మిడ్నైట్ డ్రామా
వర్గపోరు, అత్యున్నతాధికారులపై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం అర్ధరాత్రి ఆ సంస్థలో అనూహ్య మార్పులు చేపట్టింది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జేడీగా ఉన్న తెలుగు వ్యక్తి నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. విచారణకు సహకరించకపోవడంతో సీవీసీ సిఫారసుల మేరకే అలోక్ వర్మను పదవి నుంచి తొలగించామంది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఇలా డైరెక్టర్‌ను మార్చడం ఇదే తొలిసారి. నాగేశ్వరరావు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12 మంది అధికారులను బదిలీ చేశారు. అస్థానా, అలోక్‌ల పరస్పర అవినీతి ఆరోపణలపై విచారణకు కొత్త బృందాన్ని నియమించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు కాగా అంతకుముందే తనను తొలగించడం ద్వారా సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ అంశంలో కేంద్రం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. రఫేల్ స్కాం పత్రాలను అలోక్ వర్మ సేకరిస్తున్నందునే ఆయన్ను ప్రధాని తప్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యూఢిల్లీ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో వర్గపోరుతో మొదలైన ముసలం కొనసాగుతోంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన 1986 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావును ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఎన్నడూ లేని తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది. కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ) సిఫారసుల మేరకే అలోక్, అస్థానాలను సెలవుపై పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీవీసీ విచారణకు అలోక్ సహకరించకపోవడం వల్లే ఆయనను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అలోక్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కేసుల విచారణల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం లేదనే కక్షతోనే తనను పదవి నుంచి తప్పించారని అలోక్ ఆరోపించారు. ఇటు సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు మంగళవారం అర్ధరాత్రే విధుల్లో చేరి చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయ భవనంలోని రెండు అంతస్తులను సీజ్ చేసి, అలోక్ వర్మకు సన్నిహితులుగా పేరున్న మొత్తం 12 మంది అధికారులను ఉన్నపళంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపేందుకు అలోక్ ఆసక్తిగా ఉన్నందునే ఆయనను ప్రభుత్వం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే సీబీఐ గౌరవాన్ని, నిబద్ధతను కాపాడేందుకు ఈ బదిలీలు కచ్చితంగా అత్యవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. వివిధ ప్రాంతాలకు బదిలీలు నాగేశ్వర రావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీబీఐలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలోక్ వర్మకు సన్నిహితులుగా ఉన్న 12 మంది అధికారులను ఉన్నపళంగా అండమాన్ నికోబార్ దీవులు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు నాగేశ్వర రావు బదిలీ చేశారు. అస్థానాపై నమోదైన కేసులను విచారిస్తున్న పాత బృందంలోని సభ్యులను పూర్తిగా తొలగించి, మొత్తం కొత్త వారితో ప్రత్యేక బృందాన్ని నియమించారు. అస్థానాపై కేసు విచారణకు సీబీఐ జేడీ మురుగేశన్ పర్యవేక్షణలో డీఐజీ తరుణ్ గౌబా, ఎస్పీ సతీశ్ దగర్‌లతో నాగేశ్వర రావు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ కేసును సతీశ్ విచారించగా, తరుణ్ గౌబా మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం దర్యాప్తులో పాలుపంచుకున్నారు. మురుగేశన్ బొగ్గు కుంభకోణం కేసును విచారించారు. అటు అస్థానాపై నమోదైన కేసును విచారిస్తున్న ఏకే బస్సీని అండమాన్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌కు, ఆయన పై అధికారి, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్‌ను జబల్పూర్కు, అస్థానా కేసు విచారణను పర్యవేక్షిస్తున్న డీఐజీ ఎంకే సిన్హాను నాగ్‌పూర్‌కు నాగేశ్వర రావు బదిలీపై పంపారు. జేడీ (పాలసీ)గా ఉన్న అరుణ్ కుమార్ శర్మను.. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారిస్తున్న ఎండీఎంఏకు జేడీగా, సీనియర్ అధికారి సాయి మనోహర్‌ను చండీగఢ్ జోన్ జేడీగా బదిలీ చేశారు. కాగా విజయ్ మాల్యా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు బ్యాంకులను మోసగించడం తదితర సున్నితమైన కేసులను అస్థానా నేతృత్వంలోని బృందాలే ఇన్నాళ్లూ విచారించగా, తాజా పరిణామాలతో ఆ కేసుల విచారణ తీవ్రంగా ప్రభావితం అవ్వొచ్చని సీబీఐ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణకు కొత్త బృందం మంగళవారం అర్ధరాత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, అలోక్, అస్థానాలను సెలవుపై పంపుతున్నట్లు అత్యవసరంగా ఆదేశాలు జారీచేసింది. మంత్రివర్గ సమావేశ వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇరువురు అధికారులు పరస్పరం చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుందని చెప్పారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అలోక్, అస్థానాలు సెలవుపైనే ఉంటారని జైట్లీ తెలిపారు. సీవీసీ సిఫారసుల ఆధారంగానే ఇరువురు అధికారులను విధుల నుంచి తప్పించామని చెప్పారు. ‘దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలోని ఇద్దరు అత్యున్నతాధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో విపరీత, దురదృష్టకర పరిస్థితులకు దారితీసింది’ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఆయన ఖండించారు. సీబీఐలోని సీనియర్ అధికారులపై ఇంతటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం అత్యంత అసాధారణ విషయమనీ, విచారణకు కూడా సహకరించకపోతుండటంతోనే అలోక్‌ను సెలవుపై పంపాల్సి వచ్చిందని వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అటు అలోక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ.. తనను ఉన్నపళంగా విధుల నుంచి తప్పించడం ద్వారా సీబీఐకి ఉన్న స్వతంత్ర అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారించనుంది. హెడ్‌క్వార్టర్స్‌లో హంగామా సాధారణంగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో రాత్రయితే సీఐఎస్ఎఫ్కు చెందిన కాపలాదారులు తప్ప ఎవరూ ఉండరు. కానీ మంగళవారం రాత్రి మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7.30 గంటలకు అలోక్ వర్మ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఒక్కసారిగా ఆ కార్యాలయం వద్ద అలజడి ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 10 గంటలకు 15 మంది అధికారులు కార్లలో అక్కడికి వచ్చారు. తర్వాత నాగేశ్వర రావు కూడా తన కారులో అక్కడకు చేరుకున్నారు. 11.30 గంటల సమయంలో ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అలోక్, అస్థానాల కార్యాలయాలకు సీల్ వేయించారు. ఆ తర్వాత అలోక్ వర్మ బృందంలోని అధికారులు ఏకే శర్మ, మనీశ్ సిన్హాలను కూడా సెలవుపై పంపుతూ ఆదేశాలిచ్చారు. వారి డ్రైవర్లు, ఇతర సిబ్బందిని తన కార్యాలయ పరిసరాల్లోకి కూడా రాకుండా నిలువరించారు. అంతకుముందు రాత్రి 8–8.30 సమయంలోనే అలోక్, అస్థానాలను తొలగించాల్సిందిగా సిఫారసు చేస్తూ సీవీసీ కేంద్రానికి సమాచారం పంపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నియామకాల విభాగం అధికారులను అర్ధరాత్రి కార్యాలయానికి పిలిపించి వారిచేత అలోక్, అస్థానాలకు ఉత్తర్వులు ఇప్పించారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉండేలా గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అలోక్ వర్మను నియమించి రెండేళ్లు కాకముందే సీవీసీ సిఫారసును కారణంగా చూపి ఆయనను పదవి నుంచి తొలగించింది. ఇంత ఉత్కంఠ నడుమ సీబీఐ డైరెక్టర్‌ను మార్చడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం బయట గుమిగూడిన మీడియా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్న జైట్లీ, రవిశంకర్ -
సీబీఐలో ప్రక్షాళన : అధికారుల బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ : విభేదాలతో రచ్చకెక్కిన సీబీఐని ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం రాకేష్ ఆస్తానా, అలోక్ వర్మ బృందాల్లో పనిచేస్తూ వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని బదిలీల్లో టార్గెట్ చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్‌ను చండీగఢ్‌కు బదిలీ చేశారు. రాకేష్ ఆస్థానా కేసు దర్యాప్తు చేస్తున్న ముగ్గురు అధికారులను సీబీఐ బదిలీ చేసింది. సీబీఐ బదిలీలు చేసిన సీనియర్ అధికారుల్లో డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ, అదనపు ఎస్పీ ఎస్ఎస్ గుర్మ్, డీఐజీ మనీష్ కుమార్ సింగ్, ఏసీబీ డీఐజీ తరుణ్ గౌబా, డీఐజీలు జస్బీర్ సింగ్, అనిష్ ప్రసాద్, కేఆర్ చురాసియా, రామ్ గోపాల్, ఎస్పీ సతీష్ దగార్, అరుణ్ కుమార్ శర్మ, ఏ సాయి మనోహర్, వి. మురుగేశన్, అమిత్ కుమార్‌లున్నారు. మొత్తం 13 మంది అధికారులను సీబీఐ బదిలీ చేసింది. మరోవైపు సీబీఐ నూతన చీఫ్‌గా నియమితులైన నాగేశ్వరరావుపైనా అవినీతి ఆరోపణలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. -
శివారుల వరకు కీలక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే తగు ప్రణాళికలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా దూరప్రాంతాలకు నడిచే పలు రైళ్ల సేవలను శివారుల నుంచి నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలో అధిక సంఖ్యలో నివసించే వివిధ ప్రాంతాల ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా పలు రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించింది. దీంతోపాటు ఉత్తరాదికి వెళ్లే కొన్ని రైళ్లనూ హిస్సార్, శ్రీగంగానగర్ వరకు విస్తరించింది. త్వరలోనే మరిన్ని రైళ్లను శివారు ప్రాంతాల నుంచి నడిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎందుకు పొడిగించారు? నిత్యం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 75 ఎంఎంటీఎస్, 90 సబర్బన్, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాటితో కలిపి మొత్తం 215 రైళ్లు ప్రయాణం సాగిస్తాయి. దాదాపు 1,80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరంలో వలసలు పెరుగుతున్న దరిమిలా.. ట్రాఫిక్ సమస్యలూ రెట్టింపవుతున్నాయి. ఈ భారం రైల్వేపైనా పడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొంతకాలంగా ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోవడంతో ఉన్న 10ప్లాట్‌ఫారాలు ఇరుగ్గా మారాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌పై భారం తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. దీనిలో భాగంగా లింగంపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. ఇక్కడ నుంచే రైళ్లను నడపడం ద్వారా ప్రజలకు సికింద్రాబాద్ దాకా రావాల్సిన ఇబ్బంది తప్పుతుంది. పలు రైళ్ల వేగం పెంపు.. పట్టాల సామర్థ్యం పెంచడం, నిర్వహణ పనులు ఆధునీకరించడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. ఫలితంగా ప్రయాణికులు గమ్యస్థానాలకు ముందుగానే చేరుకునే వీలుచిక్కింది. ఏటా వివిధ మార్గాల్లో జరిగే అభివృద్ధి పనులు, ట్రాక్ నాణ్యతా మెరుగు ఆధారంగా ద.మ.రైల్వే తన టైంటేబుల్‌ను మారుస్తుంటుంది. ఈసారి మారిన టైంటేబుల్ వల్ల వేలాది ప్రయాణికులకు సమయం కలిసి రావడం గమనార్హం. వివిధ రైళ్లు ముందస్తుగా చేరుకునే సమయం ఇదే.. 1. ఎన్సీజే ముంబై ఎక్స్‌ప్రెస్– నాగర్ కోయిల్ – ఛత్రపతి శివాజీ టెర్మినల్ (75 నిమిషాలు) 2. చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్ (25 ని.మి) 3. చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్ హమ్‌సఫర్ (25 ని.మి) 4. కాచిగూడ – నాగర్‌కోయిల్ జంక్షన్ (18 ని.మి) 5. ఛత్రపతి శివాజీ టెర్మినల్– నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ (15 ని.మి) 6. మద్రాస్ – ఛత్రపతి శివాజీ టెర్మినల్ (10 ని.మి) 7 తిరుపతి – జమ్మూతావి (10 ని.మి) 8. ఆదిలాబాద్ – తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ (10 ని.మి) 9. చెంగల్పట్టు– కాకినాడ పోర్ట్ (8 ని.మి) 10. హైదరాబాద్ – జైపూర్ (5 ని.మి) -
సబ్‌ప్లాన్ చట్టానికి తూట్లు..!
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం అమలుకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నోడల్ ఏజెన్సీ ద్వారా వివిధ శాఖల నుంచి జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులను రాబట్టి వాటిని సకాలంలో ఖర్చు చేయడంతోపాటు ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు లేకుండా చూడాల్సిన జిల్లా మానిటరింగ్ కమిటీ అందుకు తగినంతగా పనిచేయడం లేదన్న విమర్శలు దళిత, గిరిజన సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. చట్టం ఏర్పాటు ఇలా.. దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరంపై అనేక పోరాటల ఫలితంగా జనవరి 1, 2013లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం వచ్చింది. దేశంలో దళితులు 17.08 శాతం, గిరిజనులు 6 శాతం ఉన్నారు. ఈ చట్ట ప్రకారం దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాధికన బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగాలి. కేటాయించిన నిధులను ఈ రెండు సామాజిక వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. చట్టం ఏం చెబుతోంది..? ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయడంతో ఏటా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీవో నంబర్ 8, 23.12.2013 ప్రకారం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఈ నోడల్ ఏజెన్సీకి చీఫ్ మినిస్టర్ చైర్మన్ కాగా 35 మందిని మెంబర్లుగా నియమిస్తారు. కన్వీనర్‌గా ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఈ నోడల్ ఏజెన్సీకి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన బడ్జెట్లో నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. జిల్లాలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు.. జీవో నంబర్ 34 ప్రకారం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటిలో 22 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటికి జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని జీవో చెబుతుంది. ఈ జీవోని 01.11.2013న ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులపై సమీక్షించిన దఖాలాలు ఏ మాత్రం కనిపించడంలేదని తెలుస్తోంది. ఆ తరువాత ప్రభుత్వం జీవో నంబర్ 6 ని 2014లో విడుదల చేసింది. దీనిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఐటీడీఏ ఉన్న ప్రాంతాలలో ఆ శాఖ జిల్లా అధికారి కన్వీనర్‌గా ఉండగా మిగిలిన శాఖల అధికారులు మెంబర్లుగా ఉంటారని స్పష్టం చేసింది. ఐటీడీఏ లేని ప్రాంతాలలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఈ నోడల్ ఏజెన్సీ జిల్లాలో ఉన్న ప్రభుత్వం శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. ఇంకా బడ్జెట్ ప్రతిపాదనలు, నిధుల సమీకరణ, వాటికి ఖర్చుకు సంబంధించిన మానిటరింగ్‌ను చేయాల్సి ఉంది. అంతే కాకుండా ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అభివృద్ధి పథకాల అమలలో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సి ఉంది. అలాంటి పనులు జిల్లాలో ఏమాత్రం జరగటం లేదు. ఇంకా జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఉప ప్రణాళిక అమల తీరును పర్యవేక్షించాల్సి ఉంది. రెండు నెలలకొకసారి సమావేశాలు జరపాల్సి ఉందని జీవ 34 చెబుతుంది. మౌలిక సదుపాయలు లేక దళిత, గిరిజన గ్రామాలు విలవిల.. జిల్లాలో 56 మండలాలు ఉండగా కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లుగా పరిపాలన సాగుతుంది. మొత్తం 1028 గ్రామపంచాయితీలు వీటి పరిధిలో ఉన్నాయి. 33 లక్షల జనాభా ఉన్న జిల్లాలో అత్యధిక శాతం దళిత, గిరిజనులే ఉన్నారు. వీరిలో 50 శాతానికి పైగా భూములు లేని కుటుంబాలు ఉండి, కేవలం దినసరి కూలీపైనే ఆధారి పడి జీవిస్తున్నాయి. మట్టి రోడ్లకు నోచుకోని పల్లెలతో పాటు, తాగునీరు, వీధిలైట్లు ఇలాకనీస మౌళిక సదుపాయాలు లేని గ్రామాలు దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇంకా స్మశానాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉపప్రణాళిక నిధుల జమఖర్చులపై ప్రశ్నించిన నాధుడు లేడు. చట్టం రాకముందు దళిత, గిరిజన నిధులు దారిమళ్లుతున్నాయని ఘోషించిన దళిత, గిరిజన నాయకులు చట్టం వచ్చిన తరువాత నోరుమెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, జేసీలకు ఫిర్యాదులు.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కమిటీ సమావేశాలు, నిధుల ఖర్చు, సమావేశాలు ఏమి జరగటం లేదని అంబేద్కర్ ఫీపుల్స్ జేఏసీ నాయకులు ఎం.కిషోర్‌కుమార్, మిట్నసల బెంజిమెన్ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. తరువాత జాయింట్ కలెక్టర్–2 మార్కెండేయులకు పిర్యాదు చేశారు. సంబధిత నోడల్ ఏజెన్సీ కన్వీనర్‌ని పిలిపించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలిపారు. -
మీ కుటుంబ సభ్యుడిలా చూడండి
సాక్షి, విశాఖపట్నం: గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకోకుండా.. తనను మీ కుటుంబ సభ్యుడిలా భావించి సహకరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను కోరారు. స్థానిక గ్రీన్‌పార్కు హోటల్లో ఆదివారం రాత్రి అధికారులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి తాను అందరి వాడనంటూ వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పేదోడి గూడు కూలగొట్టారని ఆవేదనతో ఆనందపురం తహసీల్దార్‌తో అలా మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశంలేదని వివరణ ఇచ్చుకున్నారు. అయితే మంత్రి ఆగ్రహానికి గురైన ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. ఎంతో సౌమ్యునిగా పేరొందిన మంత్రి గంటా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే సుతిమెత్తగా మందలించేవారు. నలుగురి మధ్య పల్లెత్తుమాట అనేవారు కాదు. కళ్లతోనే హెచ్చరిక చేసేవారు. నాలుగు రోజుల క్రితం ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావు పట్ల నోరు పారేసుకున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆనందపురం మండలంలో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని హౌసింగ్ స్కీమ్ కోసం టిడ్కోకు అప్పగించిన వైనాన్ని తప్పుబడుతూ తహసీల్దార్ పట్ల ఒంటికాలుపై లేచారు. ఏం వేషాలేస్తున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తహసీల్దార్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజనలకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీల దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్‌పై మంత్రి గంటా ఆగ్రహించిన తీరుపై సాక్షి కథనం ప్రచురించింది. ఈ కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెవెన్యూ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తమ యూనియన్ సభ్యుడైన తహసీల్దార్‌కు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చింది. గంటా వ్యాఖ్యలను ఖండించింది. కలెక్టర్, జేసీలకు ఫిర్యాదు కూడా చేసింది. రాష్ట్ర యూనియన్‌కు కూడా జరిగిన ఘటనను తెలియజేయడంతో రాష్ట్ర నేతలు సైతం తహసీల్దార్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంతో మంత్రి గంటాకు అధికారుల మధ్య అంతరం ఏర్పడింది. జరిగిన నష్టం పూడ్చుకునేందుకు గంటా స్వయంగా రంగంలోకి దిగారు. అధికారులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు. పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తా.. పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తానే తప్ప వదులుకునే స్వభావం తనది కాదని ఆత్మీయ సదస్సులో మంత్రి గంటా కాస్త ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును మందలించడానికి కారణాలను వివరిస్తూ శ్లాబ్ వేసుకున్న తర్వాత ఓ నిరుపేద ఇంటిని కూల్చేశారని ముందుగానే చెప్పి ఉంటే వాళ్లు నష్టపోయి ఉండేవారు కాదని, అందుకే కాస్త ఆవేశంతో మాట్లాడానే తప్పఎలాంటి ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని చెప్పుకొచ్చారు. అధికారులంతా నా కుటుంబ సభ్యులేనని, వారిని ఏనాడు పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదని చెప్పుకొచ్చారు. అందరూ నాకు సహకరించాలని కోరారు. దీంతో మంత్రి వివరణకు అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్వో చంద్రశేఖరరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. సమావేశంలో గత నాలుగేళ్లలో ఎక్కడా అధికారులను మంత్రి తిట్టిన సందర్భంలేదని ఓ అధికారి ప్రస్తావించగా.. ఆనందపురం తహసీల్దార్ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడారో తమకు ఇప్పటికి అంతుచిక్కడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు. -
నంబర్ ప్లేట్ కావాలా నాయనా!
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు నొక్కేస్తున్నారు. నెలకు లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. వాహనదారులు ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. కంపెనీ ప్రతినిధుల అక్రమాలపై సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేట్లలో నాణ్యతకూడా అంతంత మాత్రంగానే ఉంది. నెల్లూరు(టౌన్): హై సెక్యూరిటీ పేరుతో కంపెనీ ప్రతినిధులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రమాదాలను తగ్గించి ప్రమాణాలను పెంపొందించాలన్న ఉద్దేశంతో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వాహనానికి నంబర్ ప్లేట్‌ను బిగించాల్సి ఉంది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లను నియంత్రించాల్సిన రవాణా, ఆర్టీసీ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్లేట్ కోసం ఎదురుచూపులు హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు విధానం 2016 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. నంబర్ ప్లేట్ల తయారీ కాంట్రాక్ట్ట్ను లింకో ఆటో టెక్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వాహనానికీ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలని అధికారులు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే నంబర్ ప్లేట్‌కు కూడా చలానా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలానా చెల్లించిన నాలుగు రోజులకు నంబర్ ప్లేట్ బిగించాల్సిఉంది. అయితే 20 నుంచి 25 రోజులకు పైగా నంబర్ ప్లేట్ కోసం ఎదురుచూడాల్సివస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అన్ని రకాల పన్నులతో కలిపి ద్విచక్రవాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనానికి రూ.619, లారీలకు రూ.650, ట్రాక్టర్ ట్రైలర్‌కు రూ.900 ధరను నిర్ణయించారు. నంబర్ ప్లేట్‌ను కంపెనీ ప్రతినిధులే బిగించాల్సిఉంటుంది. అయితే నంబర్ ప్లేట్ నాణ్యత పడిపోయి పలుచటి రేకును వాడుతుండడంతో దెబ్బతింటోందని వాహనదారులు చెబుతున్నారు. నెలకు రూ.3 లక్షల అక్రమార్జన జిల్లాలో నెల్లూరుతోపాటు గూడూరు, కావలి, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు సరాసరి 200కు పైగా వివిధ రకాల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే నంబర్ ప్లేట్‌కు చలానా కట్టించుకున్న లింక్ ఆటో టెక్ ప్రతినిధులు సంబంధిత వాహనానికి ప్లేట్‌ను ఉచితంగా బిగించాలన్న నిబంధన ఉంది. కంపెనీ ప్రతినిధులు మాత్రం నంబర్ ప్లేట్ బిగించినందుకు కారు, రవాణా వాహనాలకు రూ.200 నుంచి రూ.300 వరకు, బైకుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఇస్తేనే నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని వాహనదారులు అడిగితే కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఈ లెక్కన అన్ని రకాల వాహనాలకు కలిపి సరాసరి రూ.50 ప్రకారం లెక్కిస్తే రోజుకు ఆదాయం రూ.10 వేలు ఉంటోంది. అంటే నెలకు వీరి అక్రమ సంపాదన రూ.3 లక్షల వరకు ఉంటోంది. ఇంటికి వచ్చి వాహనానికి నంబర్ ప్లేట్ బిగిస్తే రూ.200 వసూలు చేస్తున్నారు. ఇలా కంపెనీ ప్రతినిధులు వాహనదారులను దోపిడీ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు నంబర్ ప్లేట్ బిగించే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రవాణా కార్యాలయంలోనే తమ కళ్ల ముందే కంపెనీ ప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే రవాణా అధికారుల సాయంతో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. నంబర్ ప్లేట్ కూడా వాహనానికి సక్రమంగా బిగించడం లేదని చెబుతున్నారు. వాహనానికి ఇచ్చిన రంధ్రాలు, నంబర్ ప్లేట్ సైజు సరిపడకపోవడంతో వంకరటింకరగానే ప్లేట్ బిగించుకోవాల్సివస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా కంపెనీ ప్రతినిధుల అక్రమ వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం దృష్టికి వచ్చింది.నంబరు ప్లేటు బిగిస్తే అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే రవాణాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. వారి మీద చర్యలు తీసుకునే అధికారం మాకులేదు. కొంతమంది వాహన యజమానులు ఎక్కువ డబ్బులు ఇచ్చి నెంబరు ప్లేటును ఇంటికి తీసుకెళ్తుతున్నారు. – ఎన్.శివరాంప్రసాద్, రవాణాశాఖ ఉప రవాణా కమిషనర్ తయారీ వరకే మా పరిధి నంబర్ ప్లేట్ తయారీ వరకే మా పరిధి ఉంది. నాణ్యత ప్రమాణాలుపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి దానిని ఫార్వర్డ్ చేస్తాం. మిగిలిన వాటిని రవాణా అధికారులు చూసుకుంటారు. – రవివర్మ, రీజనల్ మేనేజర్, ఆర్టీసీ -
అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మంత్రులంతా తమ జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. అధికారులు స్థానికంగానే ఉండి, అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. మంత్రులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సి ఉన్నందున సోమవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. -
యాదాద్రి గర్భాలయం రాయి తొలగింపునకు యత్నం!
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని గర్భాలయం గుండుకు సమీపంలో ఉన్న రాయి ముక్కను తొలగించేందుకు అధికారులు యత్నిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానాలయం పనుల్లో భాగంగా గర్భాలయం లోని స్వయంభూ మూర్తిని ఆనుకుని ఉన్న పెద్ద బండరాయి, సమీప రాళ్లలో చిన్న ముక్కను కూడా తీసివేయకూడదని చిన్న జీయర్ స్వామి గతంలో చెప్పారు. గర్భాలయాన్ని ఏ మాత్రం ముట్టుకోకుండా పనులు చేయాలని సీఎం కేసీఆర్ కూడా మౌఖిక ఆదేశాలిచ్చారు. కానీ అధికారులు అందుకు భిన్నంగా పనులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంభూ మూర్తి గుండుకు ఆనుకుని ఉన్న రాయి ముక్కను పక్కకు తొలగించారు. దీని పై అటు స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో అధికారులు బయట పెట్టడం లేదు. రాయిని మాత్రం తొలగించడం లేదంటూనే పక్కకు జరిపేందుకు ప్రయత్నించడం గమనార్హం. -
జలీల్ ఖాన్‌ను తలదన్నే ఫీట్!
బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందని ఆ మధ్య ఉవాచించిన ఒక ప్రజాప్రతినిధి ‘అపార’ పరిజ్ఞానంపై ప్రసార,సామాజిక మాధ్యమాల్లో కొన్నాళ్లపాటు ఏకధాటిగా సెటైర్లే.. సెటైర్లు.. కానీ.. ఆయనగారి కంటే ముందు ఒక విద్యాసంస్థ ఆయన్ను తలదన్నే ఫీట్ ప్రదర్శించింది. సదరు ప్రజాప్రతినిధి ఒక్క సబ్జెక్టు విషయంలోనే తన అతి తెలివి ప్రదర్శిస్తే.. ఈ విద్యాసంస్థ మాత్రం ‘కుడి ఎడమైతే పొరపాటు లేదని..’ అనుకుందో ఏమో.. ఏకంగా బీఎస్సీ విద్యార్థికి బీకామ్ పట్టా ఇచ్చేసింది. అలా ఇచ్చిన సంస్థ ఊరూ పేరు లేనిదా.. అంటే.. ఎంతో విశిష్టత, ఉన్నత చరిత్ర కలిగిన మన ఆంధ్ర విశ్వవిద్యాలయమే ఆ ఘనతను సొంతం చేసుకుంది.. పోనీ.. ఏదో పొరపాటు జరిగిపోయింది.. దాన్ని వెంటనే సరిదిద్దారా అంటే.. పట్టా మార్చకుండా మూడేళ్లుగా బాధిత విద్యార్థిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏయూ అధికారుల నిర్వాకంతో ఉద్యోగావకాశాలు కూడా పోగొట్టుకుంటున్న ఆ కుర్రాడు చివరికి ‘సాక్షి’ని ఆశ్రయించాడు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం.. చెప్పుకోవడానికి దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం.. కానీ తీరులో అంతా గందరగోళం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి ఉదంతం. ఆ జి ల్లాలోని నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన శ్రీహరి టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రది స్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆం ధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించా లని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాం లే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అది గో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. అలా ఎలా జరిగిందో? వాస్తవానికి వర్సిటీలో బీఎస్సీ, బీకామ్లకు విడివిడిగా విభాగాలున్నాయి. ఒక విభాగానికి సం బంధించిన సర్టిఫికెట్ మరో విభాగంలో కలిసే అవకాశం లేదు. క్లర్క్, సూపరింటెండెంట్ పరిశీలించిన తర్వాతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం పెడతారు. ఒకవేళ ముద్రణ సమయంలో పొరపాటు జరిగినా సంబంధిత శాఖ ఉద్యోగులు గమనించాలి. కనీసం తప్పిదం జరిగిన తర్వాతైనా సరిదిద్దకుండా ఏయూ అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలపాలవుతోంది. నా వద్దకు వస్తే వెంటనే మార్పిస్తా ఎలా జరిగిందో తెలియదు.. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది.. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాదే.. ఆ యువకుడు నేరుగానన్ను కలిస్తే సర్టిఫికెట్ మార్పించి ఇస్తాను. – సుధాకర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ -
అధికారులు వణికిపోయారు
సాక్షి, బెంగళూరు: ఎనిమిది నెలలుగా పెన్షన్ కోసం ఎదురుచూపులు. అడిగితే.. అధికారులు పట్టించుకోవట్లేదు. ఓపిక నశించి.. విసిగి వేసారిన ఆ పెద్దాయన వినూత్న రీతిలో నిరసన తెలిపి మీడియా దృష్టిని ఆకర్షించారు. గాద్గాలోని రోన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... మాను సాబ రాజేఖాన్(68) కుష్టు వ్యాధిగ్రస్తుడు. గత ఎనిమిది నెలలుగా ఆయనకు రావాల్సిన పింఛన్ అందట్లేదు. పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని ఆరాతీయగా.. అసలు అధికారులే మంజూరు చేయలేదని తేల్చి చెప్పారు. దీంతో పెన్షన్ ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరిగినా లాభం లేకపోయింది. కడుపు మండిపోయిన మాను.. గురువారం ఓ పెద్ద పామును మీదేసుకుని సరాసరి ఆఫీస్ లోపలికి వెళ్లారు. అది చూసి అధికారులు బిత్తరపోయారు. ‘పని చేసే ఒపిక లేదు. నేనేం తినాలి’ అంటూ రాజేఖాన్ అధికారులను నిలదీశారు. మెడలో పామును చూసి అధికారులు కాసేపు వణికిపోయారు. కొందరైతే ఏకంగా బయటకు పరుగులు తీశారు. చివరకు 3-4 రోజుల్లో పెన్షన్ సొమ్ము అందేలా చూస్తానని ఓ ఉన్నతాధికారి హామీ ఇవ్వటంతో ఆయన పామును విడిచిపెట్టారు. ఆ వీడియోను మీరూ చూడండి... -
‘అంచనాలకు’ మించి అవినీతి!
సాక్షి, పెద్దపల్లి : భూసేకరణలో అంచనాలు భారీగా పెంచి అక్రమాలకు పాల్పడ్డ ఆర్డీవో వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అంచనాలకు మించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలుతోంది. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లాది రూపాయలకు ఎసరుపెట్టిన అధికారుల తీరు ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వానికి సరెండర్ చేసిన పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్ ఉదంతమే జిల్లాలో భూసేకరణలో భారీ కుంభకోణాలకు సజీవ తార్కాణంగా నిలుస్తోంది. లక్షలాది ఎకరాల భూ సేకరణ కాళేశ్వరం ప్రాజెక్ట్, సింగరేణి విస్తరణలో భాగంగా జిల్లాలో లక్షలాది ఎకరాల భూసేకరణ అవసరం పడింది. కమాన్‌పూర్, రామగిరి, మంథని, రామగుండం మండలాల పరిధిలో సింగరేణి ఓసీపీల నిర్మాణానికి వేలాది ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటికీ అక్కడక్కడా భూసేకరణ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జిల్లాలోనే అధికభాగం జరుగుతోంది. సుందిళ్ల, అన్నారం, గోలివాడ, మేడారంలలో బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగమార్గాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం వేలాది ఎకరాల భూసేకరణ ఏళ్లుగా సాగుతోంది. దాదాపు పూర్తయింది. అధికారుల చేతివాటం లక్షలాది ఎకరాల భూసేకరణ చేతిలో ఉండడంతో సంబంధిత అధికారుల చేతివాటాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో అధికారులు అంచనాలు పెంచి పరిహారంలో వాటాలు తీసుకున్నట్లు సంవత్సరాలుగా ఆరోపణలున్నాయి. పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్ వ్యవహారంతో అవి నిజమని తేలాయి. భూ నిర్వాసితులకు చెల్లించే పరిహారంలో వాటాలు కోరడం ఇక్కడ మామూలే. మామూళ్లు ఇస్తేనే పరిహారం వచ్చేట్లు చేయడం, లేదంటే చెప్పులరిగేలా తిరిగినా పరిహారం ఇవ్వకపోవడం బహిరంగరహస్యమే. ఇదంతా ఒక ఎత్తయితే ముందే ఒప్పందం చేసుకొని అంచనాలను భారీగా పెంచి కొంతమంది పెద్దలు వాటాలు పంచుకున్నారు. ఇందుకోసం ఏజెంట్ల వ్యవస్థను సృష్టించారు. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండికొట్టారు. రూ.2 కోట్ల నుంచి రూ.25 కోట్లు జిల్లాలో భూసేకరణ, పరిహారం చెల్లింపులో జరుగుతున్న అవినీతి భాగోతం ఏరకంగా ఉందో రామగిరి మండలం జల్లారం ఉదంతం చూస్తే అర్థమవుతుంది. సింగరేణి భూసేకరణలో భాగంగా జల్లారంలో వ్యవసాయభూమికి రూ.2 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉండగా, ఇంటిస్థలాలుగా చూపి ఏకంగా రూ.25 కోట్ల పరిహారం కాజేయడానికి రంగం సిద్దం చేశారు. దీనికోసం ఆ ప్రాంతంలో కొంతమంది ఏజెంట్లును ఏర్పాటు చేసుకొని, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. జల్లారంతో పాటు గోలివాడ, మేడారంలలో భూసేకరణలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మొత్తం తతంగంలో కోట్లాది రూపాయలు స్వాహా చేయడానికి రంగం సిద్దం కావడం, అధికారుల విచ్చలవిడి అవినీతికి అద్దం పడుతోంది. భూసేకరణలో అక్రమాలకు కలెక్టర్ శ్రీదేవసేన చెక్ పెట్టారు. పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్ వ్యవహారంలో తీగలాగి డొంకను కదిలించారు. ఆర్డీవోపై గత కలెక్టర్ల హయంలోనూ ఆరోపణలు రాగా, అప్పుడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జల్లారంలో అంచనాలు భారీగా రూ.25 కోట్లకు పెంచడంతో, విచారణకు ఆదేశించిన కలెక్టర్, మిగిలిన కుంభకోణాలకు కూడా వెలికితీయగలిగారు. ధర్మారం మండలంలోని చామనపల్లి, మల్లారం, సాయంపేట, మేడారం నిర్వాసితులకు జిల్లా కలెక్టర్ రూ.23 కోట్ల 91 లక్షల 57 వేల 875 ఆమోదించగా, రూ.5,74,13,826 అదనంగా, మొత్తం రూ.29,65,71,701 ఆర్డీవో పరిహారంగా చెల్లించారు. అలాగే అంతర్గాం మండలం గోలివాడలో అనర్హులు 45 మందికి రూ.1 కోటి 02 లక్షల 12 వేలు చెల్లించారు. ఈ మూడు వ్యవహారాల్లో అవినీతి అక్రమాలకు బాధ్యుడు కావడంతో ఆర్డీవో అశోక్‌కుమార్‌పై వేటువేసినట్లు కలెక్టర్ తెలిపారు. అవినీతిలో మరింతమంది భూసేకరణలో అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడిన వ్యవహారం సంచలనం సృష్టిస్తుంటే, ఇలాంటి వ్యవహారాల్లోనే మరికొంతమంది రెవెన్యూ అధికారులున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధానంగా రామగుండం, ధర్మారం, మంథని ప్రాంతాల్లోని రెవెన్యూ అధికారులు జల్లారం స్థాయిలో కాకున్నా, అంచనాలు పెంచి వాటాలు అందుకున్నట్లు అధికారిక వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. భూసేకరణ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కలెక్టర్ సంకల్పంతో ఉండడంతో, ఈ అవినీతి అధికారుల వ్యవహారం కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
దీక్ష వద్దు.. సభలూ వద్దు!
వలేటివారిపాలెం: గ్రామంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నవనిర్మాణ దీక్షలు పేరుతో సభలు నిర్వహించొద్దని అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కూనిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షను నిర్వహించకుండా అధికారులు గ్రామం విడిచి వెళ్లే వరకూ స్థానికులు ఒప్పుకోలేదు. సమస్యలు పరిష్కరిస్తాం.. అర్జీలు ఇవ్వాలని అధికారులు కోరారు. ఇప్పటికే పలు సార్లు ఆర్డీఓకు, స్థానిక శాసన సభ్యుడికి అర్జీలు ఇచ్చినా ఫలితం కనిపించలేదని, నవ నిర్మాణ దీక్షకు గ్రామానికి వచ్చిన అధికారులు గ్రామంలో ఉన్న సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని నిలదీశారు. గ్రామానికి పైఎత్తున వాగులో చెక్‌డ్యామ్ నిర్మించారని, పోకూరు గ్రామానికి చెందిన రైతులు ఎందుకు పగుల గొట్టారని, చెక్ డ్యామ్ నిర్మించే వరకూ గ్రామానికి అధికారులు రావొద్దని తెగేసి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు వద్దకు అంతా వెళ్లి విషయం చెబితే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందువల్లే చెక్‌డ్యామ్ పగులగొట్టాల్సి వచ్చిందని సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పగుల గొట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. వర్షాలు లేక పంటలు పండక రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటే నిర్మించిన చెక్‌డ్యామ్ పగులుగొట్టి గ్రామంలోని రైతులు ఇబ్బందులు పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సామాధానం చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టారు. వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ చేసుకునేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌ను తిరిగి నిర్మించే వరకు అధికారులు గ్రామంలో నవనిర్మాణ దీక్షలు చేపట్టొద్దని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పట్టుబట్టారు. ఫ్లెక్సీని తీసేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోవడంతో గ్రామస్తులు ఫ్లెక్సీని తొలగించి నవనిర్మాణ దీక్ష బహిష్కరిస్తున్నామంటూ అక్కడి నుంచి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. చేసేది లేక అధికారులు కూడా తమ కార్యాలయాల బాట పట్టారు. -
షాక్.. పప్పీ అనుకుని పెంచింది.. కానీ..
బీజింగ్ : చాలా మందికి జంతువులను పెంచుకోవడం ఇష్టం. అలానే ఓ మహిళ చిన్న పప్పీని పెంచుకుకోవడానికి రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుకుంది. ఆ తర్వాత మహిళకు తాను పెంచుతున్నది పప్పీ కాదు ఎలుగుబంటి అనే వాస్తవం తెలిసింది. అంతే ఇంకేముంది ప్రాణం పోయినంత పని అయింది. ఆమె వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. ఈ ఘటన చైనాలోని యూనాన్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. చైనాకు చెందిన ఓ మహిళ ఓ నల్లని జంతువును శునకంగా భావించి ఇంటికి తెచ్చుకుంది. అది శునకం జాతుల్లో ఒక రకమని భావించింది.కానీ కొన్నిరోజుల తర్వాత దాని బరువు 200 కేజీలకు చేరుకుంది. దీంతో ఆ మహిళకు అనుమానం వచ్చి పప్పీని పరిశీలించింది. అంతే అది శునకం కాదు ఎలుగుబంటి అని తెలుసుకుంది. భయంతో ఆ మహిళ అటవీ అధికారులకు సమాచారం అందించింది. వెంటనే అధికారులు ఆమె ఇంటికి చేరుకుని ఆ ఎలుగుబంటిని బోనులో బందించారు. ఆ ఎలుగు బంటి చాలా ప్రమాదకమైననదిగా వారు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ దానిని ఇంటికి తీసుకొచ్చి ‘లిటిల్ బ్లాక్’ అని పెరు పెట్టాను. కానీ అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అంతే అది ఎలుగు బంటి అని తెలిసే సరికి చాలా భయపడ్డాను. అంతేకాక అది రోజుకు రెండు బకెట్ల న్యూడిల్స్ తినేది’ అని ఆమె తెలిపింది. -
అధికారుల మధ్య కోల్డ్‌వార్
నెల్లూరు(పొగతోట): ఓ పక్క పని ఒత్తిడి.. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల హెచ్చరికలతో రెవెన్యూ శాఖ ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు సైతం జిల్లా స్థాయి అధికారులకు ఎదురు తిరగలేక.. చెప్పిన పని చేయలేక నలిగిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారుల మధ్య కోల్డ్‌వార్ ప్రారంభమైంది. ఉన్నతాధికారుల వైఖరిపై రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లేం దుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక.. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ అధికారి మరణించగా, మరో అ«ధికారి ఆస్పత్రి పాలయ్యారు. జిల్లా అ«ధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సివిల్ సప్లయ్స్ డీఎం తన కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇదీ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి. పనులు చేస్తున్నా, అది చాలదని, ఇంకా పరిగెత్తండంటూ ఒత్తిళ్లు చేయడంతో రెవెన్యూ అధికారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. సమావేశాల్లో తహసీల్దార్లు, సీఎస్డీటీలను మందలించిన విషయం పత్రిక విలేకరికి ఎవరు చేరవేస్తున్నారంటూ జిల్లా అధికారులు ఆరాతీస్తున్నారు. మీరెన్ని చేసినా మా తీరింతేనని బెదిరిస్తున్నారని సమాచారం. సమీక్ష సమావేశాల్లో తహసీల్దార్లు, డీటీలు, సీఎస్డీటీలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం రివాజు గా మారిపోయింది. ధర్నాలు, ఆందోళనలు చేసుకోండి ఐ డోంట్‌కేర్ అనే రీతి లో వ్యవహరిస్తున్నారని సమాచారం. సెలవుపై తహసీల్దార్ తహసీల్దార్లతో చులకనగా మట్లాడటంతో ఒకరు సెలవుపై వెళ్లగా, మరో ఇద్దరు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేక అనంతసాగరం తహసీల్దార్ చెంచుకృష్ణమ్మ ఆస్పత్రి పాలై మరణించారు. అధికారుల ఒత్తిళ్లు, బెదిరింపులను తట్టుకోలేక జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం తన కార్యాలయంలోనే ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో సిబ్బంది కాపాడటంతో డీఎం ప్రాణాలతో బయటపడ్డారు. రికార్డులు సక్రమంగా లేకపోతే వాటిని ఈ విధంగా రాయాలని సూచించకుండా అందరి ముందు అవమానకరంగా మాట్లాడి మానసికంగా హింసిస్తున్నారని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. సీనియర్ తహసీల్దార్లతో దురుసు సీనియర్ తహసీల్దార్లతో జిల్లా అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాను జిల్లాకు వచ్చింది మీరు చెప్పింది వినడానికి కాదు.. తాను చెప్పింది చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మీరు చెప్పింది ఆచరణలో సాధ్యంకాదు అని సమాధానం చెప్పిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సాధారణ పాలన, జిల్లా అధికారుల సొంత అజెండా, సర్వేలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్ష, సమావేశాలు, తదితరాలతో రెవెన్యూ అధికారులు అల్లాడిపోతున్నారు. సిబ్బంది తక్కువ సమస్యలు అధికం. సూచించిన పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. సీనియర్లని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఇది మంచిపద్ధతి కాదని.. జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల మధ్య అగాధం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే జరగబోయే పరిణామాలకు జిల్లా యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బొప్పరాజు తెలిపారు. -
గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, జాతీయస్థాయి పరీక్షలు జేఈఈ, నీట్‌లలో గురుకుల విద్యార్థులకే ఎక్కువ సీట్లు రావాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం గురుకుల సొసైటీల అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. గురుకులాలన్నింటిలో ఉమ్మడి పరీక్షావిధానం, కామన్ మెను, మంచి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లోని గురుకులాల్లో స్థానికులకు కొంత ప్రాధాన్యం ఇచ్చేవిధంగా ప్లాన్ చెయ్యాలని, వేసవి సెలవుల్లో ప్రతి విద్యాలయంలో వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. కిరాయి భవనాలకు మరమ్మత్తులు చేయించి తగిన వసతులు కల్పించాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న అమ్మాయిలకు ప్రత్యేక పోషకాహారం ఇవ్వాలని, విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలన్నారు. ప్రతి గురుకులంలో ఏఎన్ఎం, పీఈటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. -
తనగల గుట్టలపై ట్రెక్కింగ్
శాంతినగర్ (అలంపూర్): వడ్డేపల్లి మండలంలోని తనగల గుట్టలపై పోలీసు అధికారులు, సిబ్బంది ఆదివారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకే ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ ఆర్.భాస్కర్, డీఎస్పీ సురేందర్‌రావుతోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు అక్కడికి చేరుకున్నారు. కాలినడకన సుమారు 5కి.మీ. గట్టుపైకి ఎక్కి ఫ్రెండ్లీగా కబడ్డీ ఆడి పర్దీపురం శివారులో కిందకు దిగారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ‘మన కుటుంబం–మన ఆరోగ్యం’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. శిక్షణ సమయంలో తప్పా శారీరక శ్రమ లేకపోవడంతో పోలీసు అధికారులు, సిబ్బంది తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వారు ఆరోగ్యంగా, శారీరక దృఢత్వం పొందాలనే ఉద్దేశంతో ట్రెక్కింగ్ చేపట్టామన్నారు. అంతేగాక ఎవరెవరు ఏ మేరకు ఫిట్నెస్ కలిగి ఉన్నారనేది పరీక్షించామన్నారు. -
పీఎన్బీ స్కాం: ఆర్బీఐకు సీబీఐ సెగ
సాక్షి, ముంబై: పంజాబ్నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసు ఆర్బీఐ మెడకు బాగానే చుట్టుకున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే కేంద్ర బ్యాంకు ప్రాతపై ఆరా తీస్తున్న సీబీఐ మరింత వేగం పెంచింది. తాజాగా స్కాం చోటుచేసుకున్న కాలం నాటి అధికారులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్‌ను శుక్రవారం ప్రశ్నించింది. దాదాపు రూ.13,500 కోట్ల మేర పీఎన్బీ భారీ కుంభకోణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఆర్బీఐ సరియైన ఆడిట్ చేపట్టలేకపోవడమేనని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఆరోపించిన నేపథ్యంలో సీబీఐ మరింత చురుకుగా కదులుతోంది. ఈ నేపథ్యంలో తాజా చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆ అధికారి పేరు మాత్రం వెల్లడి కానప్పటికీ 2011-16 కాలంలో ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న హెచ్ ఆర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పీఎన్బీ స్కాం విషయంలో తొలిసారి ఆర్బీఐ అధికారులను కూడా ఇప్పటికే విచారించింది సీబీఐ . ఆర్బీఐకు చెందిన నలుగురు సీనియర్ ఆర్బీఐ అధికారులను సీబీఐ ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. నలుగురు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్‌ల్లో ముగ్గురు చీఫ్ జనరల్ మేనేజర్లు, ఒకరు జనరల్ మేనేజర్ ఉన్నారు. మోదీ, చౌక్సిలకు జారీచేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్ఓయూ) జారీచేయడం విషయం సెంట్రల్ బ్యాంకుకు తెలుసా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్ఓయూ జారీ ప్రక్రియలో ఆడిటింగ్‌పై కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న 80:20 గోల్డ్ ఇంపోర్ట్ స్కీమ్‌పై కూడా సీబీఐ విచారిస్తోంది. ఈ స్కీమ్ చౌక్సి, మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే.