traffic police
-
మైనర్ల డ్రైవింగ్.. బండి ఆర్సీ సస్పెండ్!
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగేళ్ల పిల్లాడు పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వస్తుంటాడు.. పదహారేళ్ల కుర్రాడు జూనియర్ కాలేజీకి స్పోర్ట్స్ బైక్ తెస్తాడు.. పదిహేడేళ్ల యువకుడు కళాశాలకు హైస్పీడ్ (High Speed) వాహనం లేదా కారులో రాకపోకలు సాగిస్తాడు.. నగరంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. ఇలాంటి మైనర్లు నగరంలో అనేక మంది అమాయకులను బలి తీసుకోవడంతో పాటు వాళ్లూ ప్రాణాలు కోల్పోతున్నారు. మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని, వాళ్లు వాహనం నడుపకూడదని తల్లిదండ్రులు, కుటుంబీకులు సహా అందరికీ తెలుసు. అయితే ఎవరూ పక్కాగా పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితులన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్లు చిక్కితే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ శనివారం నుంచి ప్రారంభమవుతుందని శుక్రవారం ఆయన ప్రకటించారు. కఠిన చట్టాలు లేకపోవడం వల్లే.. ప్రస్తుతం అమలులో ఉన్న మోటారు వెహికిల్ యాక్ట్ (Motor Vehicles Act) ప్రకారం మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండే అవకాశం లేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాదిరి ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్లు వాహనాలపై విజృంభిస్తున్నారు. అక్కడ మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. ఆ జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే తల్లిదండ్రుల లైసెన్స్ పూర్తిగా రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా.. ఇప్పటి వరకు అధికారులు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 180 ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధిస్తున్నారు. ఇక నుంచి ఆ చట్టంలోని 199 (ఎ) సెక్షన్‌ను వినియోగించాలని జోయల్ డెవిస్ (Joel Davis) నిర్ణయించారు. ఈ సెక్షన్ ప్రకారం వాహనం నడుపుతూ చిక్కిన మైనర్‌కు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) ఏడాది పాటు సస్పెండ్ అవుతుంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెర్నింగ్ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్ తీసుకోవచ్చు. అయితే డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్‌కు మాత్రం 25 ఏళ్ల నిండే వరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్ డెవిస్ కోరుతున్నారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ రోడ్డు ప్రమాదాలు, అందులో మృతుల్ని తగ్గించడంతో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.చదవండి: ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు! -
ఫొటోతో పాటు లొకేషన్ వాట్సాప్ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర మార్గాలు, కాలనీల్లోనూ అనేక ప్రాంతాల్లో గుర్తు తెలియని వాహనాలు (Abandoned Vehicles) కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని నెలలు, ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతాయి. వీటివల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు, క్యారేజ్ వేలు కుచించుకుపోవడం పరిపాటి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివే అసాంఘిక శక్తులకు కలిసి వచ్చే అంశాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ విభాగం సంయుక్త సీపీ డి.జోయల్ డెవిస్ నిర్ణయించారు.సాధారణంగా ఈ వాహనాల్లో అత్యధికం ఏదో ఒక ప్రాంతంలో చోరీ అయినవే అయి ఉంటాయి. జాయ్రైడర్స్గా పిలిచే చోరులు వాహనాలను చోరీ చేసి, వాటిలో ఇంధనం అయిపోయే వరకు తిరిగి వదిలేస్తుంటారు. వీళ్లు వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం వంటివి చేయరు. కొందరు చోరులు కూడా మార్గమధ్యంలో చోరీ వాహనాలు ఆగిపోతే అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు.ప్రాంతాల వారీగా రోడ్లపై కనిపించే వాహనాల సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. దీనికోసం ఇప్పటి ఉన్న ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626తో పాటు ప్రత్యేకంగా 87126 60600ను కేటాయించారు. ఇలాంటి వాహనాలను చూసిన నగరవాసులు దాని ఫొటో లేదా వీడియోతో పాటు లొకేషన్ సైతం వాట్సాప్ (Whatsapp) ద్వారా షేర్ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. #HYDTPinfoవదిలివేసిన వాహనం చూశారా? 🚗⚠️ ట్రాఫిక్ పోలీసులకు నివేదించండి మరియు రహదారులను సురక్షితంగా మరియు స్పష్టంగా ఉంచడానికి సహాయం చేయండి!#TrafficSafety #ReportAbandonedVehicles #RoadSafety #RoadRules pic.twitter.com/xi7CWkoour— Hyderabad Traffic Police (@HYDTP) March 12, 2025 హోలీ సందర్భంగా సిటీలో ఆంక్షలు హోలీ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే రోడ్లపై గుంపులుగా తిరగ వద్దని స్పష్టంచేశారు. వీటిని అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.చదవండి: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం -
నా కారునే ఆపుతావా..?
పంజగుట్ట : కేవలం రూ. 4 వేల పెండింగ్ చలానాలు ఉంటే నా కారునే ఆపుతావా ..? నీకు ఎంత ధైర్యం అంటూ ఓ వ్యక్తి పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించాడు. నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటూ చిందులు తొక్కాడు. అంతే కాకుండా లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ఏర్పాటు చేసుకోవడం, కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు తాజ్‌కృష్ణా నుంచి మోనప్పా సర్కిల్ వైపు వస్తున్న ఫ్యాన్సీ నెంబర్‌తో ఉన్న ఓ కారును గుర్తించారు. మోనప్ప సర్కిల్ వద్ద కారును ఆపి పెండింగ్ చలానాలు చెక్ చెయ్యడంతో రూ.4 వేలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా విండోస్‌కు బ్లాక్ ఫిల్మ్ కనిపించాయి. కారు నడుపుతున్న గచి్చ»ౌలికి చెందిన అరీఫ్ అనే వ్యక్తిని కారు దిగాల్సిందిగా కోరారు. దీంతో ఆరీఫ్ కారు దిగుతూనే తనను ఎందుకు ఆపారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కేవలం రూ.4 వేలు పెండింగ్‌లో ఉంటే తన కారును ఆపుతారా ..?, నా ఇంట్లో ఉన్న కారుకు రూ.16 వేలు పెండింగ్ ,లానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరూ అడగలేదు, నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటూ వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై మోజీరామ్ అతడిని అడ్డుకుని కారును పక్కకు తీయించి కారు టైర్లకు లాక్ వేశారు. అతడి వద్ద లైసెన్స్ కూడా లేనట్లు గుర్తించిన పోలీసులు కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, పెండింగ్ చలానా రూ.4 వేలు, లైసెన్స్ లేనందుకు మరో రూ.వెయ్యి చలానా విధించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు పంజగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మా బంగారు తల్లీ.. కారులో అలా చేయొద్దమ్మా!’
వైరల్: కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానోక టైంకి వచ్చేసరికి.. ఈ తరహా పని తీరు ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్నా కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రీడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో.. అటు ఆఫీస్.. ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ తమ లాప్‌ట్యాప్‌లతో వర్క్ చేస్తున్న దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చేష్టలకు దిగిన బెంగళూరు మహిళా టెకీకి పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఓ మహిళా టెకీ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది బెంగళూరు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లకు చర్యలకు ఉపక్రమించారు. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్‌లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి రూ.వెయ్యి ఫైన్ విధించారు. వర్క్‌ఫ్రమ్ ‘హోమ్’.. కారులో కాదమ్మా! అంటూ.. జరిమానా నోటీసు అందిస్తూ.. ఎక్స్‌లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ చేశారు."work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025 -
వాహనాలపై ఎరుపు, నీలం లైట్లు ఎవరు వాడాలో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: అద్దాలపై పరిమితికి మించిన రంగుతో కూడిన ఫిల్మ్ వేసుకుని సంచరిస్తున్న వాహనాలే కాదు... టాప్‌పై ఎరుపు, నీలి రంగు లైట్లు (బుగ్గలు), సైరన్లు (Syren) పెట్టుకుని సంచరిస్తున్న వాహనాలకు కొదవే లేదు. వీటి వినియోగం కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు... భద్రత పరంగానే పెను సవాలే. అయినా మూడు కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్ విభాగం (Traffic) అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తొలుత తేలికపాటి వాహనాలైన కార్లు తదితరాల టాపులపై ఈ బుగ్గలు పెట్టుకోవడానికి ఎవరు అనర్హులనే దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికైనా దూసుకెళ్లే అవకాశం... సాధారణంగా ఈ తరహా లైట్లు, సైరన్‌తో వచ్చే వాహనాలను చూసి సామాన్యులే కాదు పోలీసులు కూడా అప్రమత్తం అవుతారు. సాధారణ వాహనచోదకులు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తే... వాటిని ఆపడానికి విధుల్లో ఉన్న పోలీసులు సైతం సాధారణంగా ప్రయత్నించరు. ఆయా వాహనాల్లో ప్రముఖులు ఉంటారనే భావనే దీనికి ప్రధాన కారణం. దీనిని ఆసరాగా చేసుకునే కొందరు అనర్హులు, ఆకతాయిలు తమ వాహనాలపై ఈ తరహా లైట్లు పెట్టుకుని సంచరిస్తుంటారు. 2001లో ఢిల్లీలోని పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఇలాంటి లైట్లు ఉన్న వాహనాలనే వాడారు. ఈ తరహా లైట్లు, సైరన్లు ఉన్న కారణంగానే భద్రతా సిబ్బంది కూడా ఆ వాహనాలను పార్లమెంట్ ఆవరణలోకి రాకుండా అడ్డుకోలేదు. వినియోగిస్తున్న వారిలో 90 శాతం అనర్హులే... ఈ తరహా లైట్లు, సైరన్లు వినియోగిస్తున్న వారిలో 90 శాతం అనర్హులే ఉంటున్నారు. సెంట్రల్ మోటారు వెహికిల్ రూల్స్–1989 ప్రకారం కేవలం 43 మంది వీవీఐపీలు మాత్రమే వీటిని వినియోగించాలి. అయితే అసెంబ్లీ, సెక్రటేరియేట్‌తో పాటు కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు తమ వాహనాలపై ఎరుపు, నీలం లైట్లు (Blue Lights) ఏర్పాటు చేసుకుంటున్నారు. పలువురు వీఐపీలు సైతం ఈ లైట్లు, సైరన్లను అక్రమంగా వినియోగిస్తున్నారు. స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు కూడా తమ కార్లపై ఈ తరహా లైట్లు పెట్టుకునే అవకాశం లేదు. అయినప్పటికీ వివిధ హోదాలకు చెందిన వాళ్లు వీటిని వినియోగిస్తున్నారు. అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ లైట్లు, సైరన్ కలిగి ఉండటం హోదాగా భావించే వాళ్లు అనేక మంది ఉంటున్నారు. ఎవరు వినియోగించాలంటే... ఫ్లాషర్తో కూడిన రెడ్‌లైట్:రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్‌సభ స్పీకర్, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ప్లానింగ్ కమిషనర్ ఉపాధ్యక్షుడు, మాజీ ప్రధానులు, ఉభయసభల ప్రతిపక్ష నేతలు, సుప్రీం కోర్టు జడ్జిలు (వీరు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ లైట్‌తో తిరగవచ్చు.)ఫ్లాషర్ లేని రెడ్‌లైట్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కాగ్, ఉభయసభల ఉపాధ్యక్షులు, కేంద్ర సహాయ మంత్రులు, ప్లానింగ్ కమిషన్ సభ్యులు, అటార్నీ జనరల్, క్యాబినెట్ సెక్రెటరీ, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర డిప్యూటీ మంత్రులు, క్యాట్ చైర్మన్, మైనార్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల అధ్యక్షులు, యూపీఎస్సీ చైర్మన్ (వీరు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ లైట్‌తో తిరగవచ్చు.)చదవండి: కుంభమేళాలో ప్రత్యేక అట్రాక్షన్‌గా అయోధ్యరాముని రెప్లికా కేవలం రెడ్‌లైట్: రాష్ట్ర గవర్నర్, గవర్నర్ ఎస్కార్ట్ వాహనాలు, సీఎస్, డీజీపీ, సీజే ఆఫ్ తెలంగాణ, హైకోర్టు జడ్జిలు, లోకాయుక్త, టీజీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్, క్యాట్ వైస్ చైర్మన్.బ్లూ లైట్... ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అసెంబ్లీ స్పీకర్– డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, ఉపాధ్యక్షుడు వాహనంలో సదరు ప్రముఖులు ఉన్నప్పుడు మాత్రమే లైట్ వినియోగించాలని, లేని పక్షంలో దానిపై నల్ల కవర్ తప్పనిసరిగా వేయాలి. -
ప్రియుడి కోసం ఇల్లు వదిలి..పోలీసుల చేతిలో..!
చెన్నై:ప్రియుడిని వెతుక్కుంటూ బయలుదేరిన ఓ 13 ఏళ్ల బాలిక పోలీసుల చేతిలోనే లైంగికదాడికి గురైంది. కాపాడాల్సిన పోలీసే ఆ బాలిక జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇటీవల జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాయ్‌ఫ్రెండ్ మాటలు నమ్మి ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చింది. రాత్రి వేళ కావడంతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసు రామన్ సాయం చేస్తానని బాలికను జీపు ఎక్కించుకున్నాడు. వాహనంలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసుల బూత్‌కు తీసుకెళ్లి బాలికపై మరోసారి లైంగిక దాడి చేశాడు.రామన్ నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరింది.అయితే తనకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న బాలిక ఇంటి నుంచి మళ్లీ పారిపోయింది బాలిక.ఈసారి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసింది. ఇద్దరు కలిసి ఒక చోట సహజీవనం మొదలు పెట్టారు. ఇంతలో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టారు. బాలికను విచారించగా ట్రాఫిక్ పోలీసు రామన్ బాగోతం బయటపడింది. దీనికి తోడు బాయ్‌ఫ్రెండ్ కూడా తనపై లైంగికదాడి చేశాడని బాలిక పోలీసులకు తెలిపింది. -
ఫిల్మ్‌నగర్ పాపం.. ట్రాఫిక్ పోలీసులదే..!
కొందరు అవినీతి ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం... వెరసీ.. ఓ కుటుంబాన్ని పెను విషాదంలో నింపాయి. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసి కనీసం కన్నవారికి ‘ముఖం’ చూసే అదృష్టం కూడా లేకుండా చేశాయి. మంగళవారం (Tuesday) ఉదయం షేక్‌పేట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం పదేళ్ల చిన్నారి అథర్వి ఉసురుతీసింది. ఈ పాపం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదేనని చెప్పక తప్పదు. ఉత్తర్వులు ఉత్తవేనా? హైదరాబాద్ (Hyderanad) నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ప్రవేశించే అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 10 టన్నుల కంటే మించొద్దు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. కాసులు కురిపించడమే కారణమా? షేక్‌పేటలో చిన్నారిని చిదిమేసిన లారీ పంచదార లోడ్‌తో ప్రయాణిస్తోంది. ఇది కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు మాత్రమే నగరంలో తిరగాలి. అయితే.. ప్రమాదం చోటు చేసుకున్న 8.10 గంటలకు అది నగరంలోనే ఉంది. ఈ తరహా లారీలే కాదు... నగరంలో మరికొన్ని వాహనాలు తిరుగుతూ కొందరు ట్రాఫిక్ పోలీసులకు కాసులు పండిస్తున్నాయి. అక్కడ నుంచి మట్టి తరలించే, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తీసుకువచ్చే వాటిని ‘వదిలేయడం’ కోసం యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రయితే చాలు రాకాసులే.. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం చాలా కీలకమైంది. నగర శివార్లలో ఉన్న, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఉన్న అనేక కార్యాలయాలు, పాఠశాలలకు చెందిన బస్సులు, వాహనాలతో ఆ రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. అలాంటి సమయంలోనూ ఓ లారీ మృత్యు శకటంగా దూసుకొచ్చిందంటే దానికి కారణం అయితే మామూళ్ల మత్తయినా అయి ఉండాలి.. లేదంటే నిబంధనలు అతిక్రమించిందంటూ ‘ఉక్కుపాదం’ మోపిన ట్రాఫిక్ పోలీసులు ఓ చలానా రాసి వదిలేసైనా ఉండాలనే వాదన వినిపిస్తోంది. చదవండి: ‘మమ్మీ బాయ్..’ఈ రెంటిలో ఏది జరిగినా ఆ పాపం మాత్రం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదే. నగరంలోకి పగలంతా లారీల ప్రవేశం లేకపోవడంతో రాత్రయిందంటే చాలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తాయి. వాయు వేగంతో దూసుకుపోయే ఇవి రాకాసులుగా మారుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పాయింట్స్‌లో ఉండకపోవడంతో విజృంభిస్తున్నాయి. -
మేం మారాం..!
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు సమాజంలో సముచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుల మాదిరి ట్రాఫిక్ అసిస్టెంట్లు గా ఎంపిక చేయడం ద్వారా ఉపాధి కల్పించాలని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంపిక, శిక్షణలో కట్టుదిట్టంగా వ్యవహరించారు. గత ఏడాది డిసెంబర్ 4న గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కూడా ఇందులో పాలుపంచుకుంది.సాంఘిక సంక్షేమ శాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల వివరాలను పోలీసులు సేకరించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 165 సెంటీమీటర్ల ఎత్తు, (ఎస్టీలు 160 సెం.మీ) కలిగి ఉండాలనే నిబంధన విధించారు. శరీర దారుఢ్య పరీక్షల్లో భాగంగా 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 58 మంది హాజరు కాగా 44 మంది ఎంపికయ్యారు. హావభావాల నుంచి అన్నీ మార్చి.. సిటీ ట్రాఫిక్ విభాగం ఆదీనంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ) అధికారులు గోషామహల్ స్టేడియం కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 15 రోజుల ట్రైనింగ్‌లో నాలుగు రోజులు కేవలం వారి ప్రవర్తన మార్చడానికే వెచ్చించారు. ఈ ట్రాన్స్జెండర్లు ఏళ్ల తరబడి ఓ విధమైన హావభావాల ప్రదర్శన, విపరీత ప్రవర్తన, క్రమశిక్షణ లేని జీవనశైలికి అలవాటుపడ్డారు.వీరిని పోలీసు విభాగంలోకి తీసుకుంటుండడం, అదీ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే ట్రాఫిక్ వింగ్‌లో పని చేయించనుండటంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నడక, నడవడిక, హావభావాలు, మాట తీరే కాదు... ఆహారం తినే విధానాన్నీ చక్కదిద్దారు. వారిలో స్ఫూర్తి నింపడం కోసం వారికి హీరోయిన్లు, యాంకర్ల వీడియోలు చూపించారు. ఆపై ఐదో రోజు నుంచి ట్రాఫిక్ శిక్షణ మొదలైంది. క్షేత్రస్థాయిలో సమర్థంగా విధులు అంబర్‌పేట, బహదూర్‌పుర, బంజారాహిల్స్, బేగంపేట, బోయిన్పల్లి, చిక్కడపల్లి, చాంద్రాయణగుట్ట, చిలకలగూడ, జూబ్లీహిల్స్, కాచిగూడ, లంగర్‌హౌస్, మహంకాళి, మలక్‌పేట్, మారేడ్‌పల్లి, నల్లకుంట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, సంతోష్‌నగర్, తిరుమలగిరి, టోలిచౌకి.. ఈ 20 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలోనూ వీరు క్షేత్రస్థాయి విధుల్లోనే ఉండటం గమనార్హం. ⇒ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్ల సేవలు అంటూ ప్రభుత్వం ప్రకటించినప్పుడు అంతా తేలిగ్గా తీసుకున్నారు... ⇒ సిటీ పోలీసులు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మందిని ఎంపిక చేసిన తర్వాత శిక్షణ అయ్యే – వరకు వీళ్లు ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ⇒ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది విధుల్లో చేరనున్నారని తెలిశాక, వీళ్లు పట్టుమని పది రోజులు కూడా పని చేయరని, వివాదాలు తప్పవని భావించారు. ⇒ కానీ నెల రోజులుగా 38 మంది ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పని చేస్తుంటే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ⇒ ఒకరిద్దరు ట్రాన్స్జెండర్లు భవిష్యత్తులో జరగబోయే కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల్లోనూ పోటీపడేలా కోచింగ్ తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించడం మరింత ఆసక్తికరం.వెన్నుతట్టి ప్రోత్సహించి..ఎంపికైన 44 మందిలో 39 మంది మాత్రమే శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన ఐదుగురూ అప్పటికే ఉన్న ఉద్యోగాల కారణంగా వెళ్లిపోయారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తుది జాబితా ఖరారు చేశారు. ‘సమాజంలో మీకు ఎదురవుతున్న అవమానాలు, మీ పట్ల వివక్షను చూసిన ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది.మీ పని తీరుపైనే మీలాంటి ఇతరుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..’అంటూ వెన్ను తట్టి హితవు పలికిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ డిసెంబర్ 22న వీరి శిక్షణ పూర్తి అయినట్లు ప్రకటించారు. వీరి కవాతునూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో వీక్షించారు. అనంతరం డిసెంబర్ 26 నుంచి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా తమ కొత్త జీవితం ప్రారంభించారు. ఇప్పటికి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఈ ఉద్యోగం వదిలి వెళ్లగా...మిగిలిన వారు సమర్థంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఒకేసారి 573 మంది ఏఆర్ కానిస్టేబుళ్ల బదిలీ
సాక్షి,హైదరాబా: హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పని చేస్తున్న 573 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు ఒకేసారి బదిలీ అయ్యారు. ఇందులో పురుషులు 350 కాగా.. మహిళా కానిస్టేబుళ్లు 223 మంది. వీరందరినీ సిటీలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతో పాటు స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, హెచ్–న్యూ, సైబర్ క్రైమ్ విభాగాలకు అటాచ్ చేస్తూ నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలోని శాంతి భద్రతలు, ఇతర విభాగాల పనితీరును మరింత మెరుగవుతుందని ఆనంద్ తెలిపారు. ఈమేరకు ఆదివారం బదిలీ సిబ్బందితో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సహనంతో, వివిధ వర్గాల ప్రజల మధ్య పని చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇది కేవలం అటాచ్మెంట్ మాత్రమేనని వారికి సీనియారిటీ లేదా విభాగం మార్పిడి హక్కులు ఉండవని, పోలీసు స్టేషన్లలో పెట్రోలింగ్, ప్రాథమిక విధులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న సివిల్ పోలీసుల కొరతను అధిగమించడానికి అటాచ్మెంట్ చేస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల్లో ఉన్నప్పుడు ఏదైనా చిన్న సమాచారం వచి్చనా, సంఘటన చూసినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమములో అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ అడ్మిన్ పరిమళ హనా నూతన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితా కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
న్యూఇయర్ వేళ.. 18 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?
ముంబై : న్యూఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్ చేసిన వారికి 153 చలాన్లు, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడినందుకు 109 చలాన్లు, ట్రిపుల్ రైడింగ్ 123 చలాన్లను, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినందుకు 40 చలాన్లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్స్పెక్టర్లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు. -
యువకుడిపై ట్రాఫిక్ పోలీసుల అమానుషం!
అనంతపురం: మఫ్టీలో ఉండి చలానాలు ఎందుకు రాస్తున్నారు.. అని ప్రశ్నించిన ఓ యువకుడిపై అనంతపురం ట్రాఫిక్ పోలీసులు జులుం ప్రదర్శించారు. యువకుడిని తీవ్రంగా కొట్టారు. అనంతపురం నగరం నడిబొడ్డున టవర్‌క్లాక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తని ఖీలను ముమ్మరం చేశారు. టవర్‌క్లాక్ వద్ద శుక్రవారం రాత్రి త్రిబుల్ రైడింగ్ చేస్తున్న ఓ వాహనాన్ని ఆపారు. ముగ్గురు యువకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు.త్రిబుల్ రైడింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నట్టు గుర్తించారు. బైక్‌ను తీసుకెళ్లి.. రేపు స్టేషన్‌కు వచ్చి తీసుకోవాలని యువకులతో పోలీసులు చెప్పారు. ఇంతలోనే మఫ్టీలో ఉన్న ఒక పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించాడు. మఫ్టీలో ఉంటూ తమపై చలానాలు రాయడమేంటని యువకుడు ప్రశ్నించడంతో.. ఆగ్రహించిన నలుగురు పోలీసులు యువకుడిని బూటు కాళ్లతో తన్నారు. పత్రికల్లో రాయలేని భాషలో తిడుతూ.. తీవ్రంగా కొట్టి ఇంటికి పంపారు. ఇదిలా ఉండగా యువకుడిపై పోలీసులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతు న్నారు. దీంతో ఉలిక్కిపడ్డ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సురేష్, రమేష్, రాజేష్, సురేంద్రకుమార్బాధిత యువకుడిపైనే కేసు పెట్టారు. -
ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్జెండర్లు.. నియామక పత్రాలు అందించనున్న సీఎం
సాక్షి,హైదరాబాద్ : సమాజంలో గుర్తింపు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ట్రాన్స్జెండర్ల జీవితాల్లో వెలుగు నింపనుంది. గోషమహల్ స్టేడియంలో శిక్షణ పూర్తి చేసిన 44 మంది ట్రాన్స్ జెండర్లు సీఎం రేవంత్‌రెడ్డి చేతులు మీదిగా నియామక పత్రాలను అందుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను ఎంపిక చేసింది. సోషల్ వెల్ఫేర్ శాఖ ఇచ్చిన అభ్యర్థుల జాబితా ప్రకారం మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్లకు బుధవారం ఫిజికల్ ఈవెంట్ నిర్వహించింది. అందులో 44 మంది ఎంపికైనట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ 44 మంది ట్రాన్స్జెండర్లకు సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్ది సేపట్లో నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం, వారు ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తించనున్నారు. -
మధురానగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ సుకుమార్
-
పోలీసుల్ని ఢీకొట్టి.. 20 మీటర్లు ఈడ్చుకెళ్లి!
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను ఢీకొట్టిన కారు, వారిని 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని వేదాంత్ దేశికా మార్గ్‌లోని బెర్ సరాయ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శనివారం రాత్రి 7.45 గంటల సమయంలో చోటుచేసుకుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) ప్రమోద్, హెడ్ కానిస్టేబుల్ శైలేశ్ చౌహాన్ ట్రాఫిక్ ఉల్లంఘనుల వాహనాలకు చలాన్లు రాస్తున్నారు. అదే సమయంలో ఓ కారు రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా దూసుకువచి్చంది. దాంతో శైలేశ్, ప్రమోద్ ఆ కారును ఆపారు. అయితే అది ఒక్కసారిగా స్పీడందుకుని ఇద్దరినీ 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి మాయమైంది. గాయపడ్డ పోలీసులను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. వారు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారని అధికారులు తెలిపారు. కారు యజమానిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక భరోసా.. సమాజంలో గౌరవం వలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్జెండర్లకు ప్రతినెలా కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థికంగా భరోసా కలి్పంచడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చునని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అడిషనల్ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలని చెప్పారు. -
శంషాబాద్‌లో యువకుడి హల్చల్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తొండుపల్లిలో ట్రాఫిక్ పోలీసులతో యువకుడు గొడవ పెట్టుకున్నాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను ఆపి చెకింగ్ చేస్తుండగా.. యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రాంగ్‌సైడ్‌లో వెళ్తే లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా వందల సంఖ్యలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఆయా ప్రమాదాలలో వాహనదారులే కాదు పాదచారులు, తోటి ప్రయాణికులు సైతం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దయ్యేలా చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచేటప్పుడు.. అభియోగపత్రాల్లో మందుబాబుల వ్యవహార శైలి, మద్యం మత్తులో చేసిన ప్రమాదాల వివరాలను నమోదు చేస్తున్నారు. న్యాయస్థానాలు వారికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ జరిమానాలు విధించడంతో పాటు కొందరికి 3 నెలల నుంచి 6 నెలల వరకు లైసెన్స్‌లు రద్దు చేస్తున్నాయి. తాజాగా అపసవ్య దిశలో (రాంగ్ సైడ్) వాహనాలు నడపడం, అతివేగం కారణంగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దయ్యేలా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు, త్వరలోనే గ్రేటర్లో అమల్లోకి రానున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. హైవేలపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు: జాతీయ రహదారులపై పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో హైవేలపై ప్రజలు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 103 బ్లాక్స్పాట్లు (ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు) ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వీటి మరమ్మతులు, నిర్వహణపై జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, ఇతరత్రా విభాగాలతో జరిగిన సమావేశంలో చర్చించారు. రోడ్డు మధ్యలో డివైడర్ల ఎత్తును పెంచడంతో పాటు వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చూడాలని నిర్ణయించారు. మరోవైపు ప్రమాదాలకు ప్రధాన కారణాలను కూడా పోలీసులు గుర్తించారు.ప్రమాదాలకు ప్రధాన కారణాలు» జాతీయ రహదారులపై డ్రైవర్లు 15–18 గంటల పాటు ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం. » హైవేలపై లైనింగ్ నిబంధన పాటించకపోవడం. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడం. » రాత్రివేళ సరైన నిద్రలేకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం. » హైవేలపై కేటాయించిన స్థలంలో కాకుండా రోడ్డు మధ్యలో వాహనాలను నిలపడం. » పాదచారులు జాతీయ రహదారులపై లైట్లు లేని ప్రాంతంలో రోడ్లను దాటుతుండటం.భవిష్యత్తు అంధకారమే.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడపడంతో పాటు ఇతరుల మరణానికి కారణం అయితే చేజేతులా భవిష్యత్తును అంధకారం చేసుకున్నట్లే. మోటార్ వాహన చట్టం (ఎంవీ) కేసులలో పోలీసులు న్యాయస్థానాల్లో సమర్పిస్తున్న అభియోగపత్రాల ఆధారంగానే ఉల్లంఘనల విషయంలో చర్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి వస్తే ఉన్న ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగ అవకాశాల సమయంలో విద్యార్థులు, యువకులను ఈ కేసులు ఇబ్బంది పెడతాయి. – వి.శ్రీనివాసులు, డీసీపీ, ట్రాఫిక్, రాచకొండ -
మహిళా ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌పై.. అధికార పార్టీ నేతల దాడి
సాక్షి, టాస్‌్కఫోర్స్: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై టీడీపీ నేతలు దాడిచేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పెన్నా వారధి సమీపంలో జరిగింది. నార్త్ ట్రాఫిక్ ఎస్సై గీతా రమ్య.. హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణతో కలిసి ఆదివారం సాయంత్రం ఆమె రంగనాయకులపేట పెన్నా వారధికి సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. సంతపేట ప్రాంతానికి చెందిన మహేష్ ఫూటుగా మద్యం తాగి ఆ మార్గంలో ఆటో నడుపుతుండగా ఎస్సై అతనిని ఆపి పరీక్ష చేసి కేసు నమోదు చేశారు. ఆటోను పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా డ్రైవర్ అడ్డుకున్నాడు. ఆటోను ఎలా తీసుకెళ్తారంటూ తన స్నేహితులకు ఫోన్‌చేశాడు. అయినా, ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ తాడు సాయంతో ఆటోను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా మహేష్ మళ్లీ అడ్డుకున్నాడు. ఇంతలో టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు, అతని సతీమణి కప్పిర రేవతి తమ అనుచరులతో అక్కడికొచ్చి పోలీసులపై దాడిచేసి గాయపరిచారు. అదే సమయంలో అక్కడున్న ప్రవీణ్ అనే వ్యక్తి దాడి ఘటనను వీడియో తీస్తుండగా అతన్ని కూడా టీడీపీ నేతలు మూకుమ్మడిగా చితకబాదారు. ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో కప్పిర దంపతులూ గాయపడ్డారు. ఇరువర్గాలు సంతపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం ట్రాఫిక్ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, ప్రవీణ్ జీజీహెచ్‌లో చేరారు. కప్పిర దంపతులు తొలుత జయభారత్ ఆస్పత్రి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నారాయణ ఆస్పత్రిలో చేరారు. ఇరువర్గాల ఫిర్యాదులపై సంతపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆనంద్ మహీంద్రా మెచ్చిన ట్రాఫిక్ పోలీస్.. డ్యాన్స్‌కు ఫిదా
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకుంటుంటారు . ఆయన ఏ పోస్టునైనా అలా షేర్ చేశారో లేదో.. నిమిషాల్లో వేలల్లో లైకులు, వ్యూస్ వచ్చేస్తుంటాయి. తాజాగా ఆయన రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ వీడియోను షేర్ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజిత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అక్కడ అతను 16 ఏళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అందరూ చేతులతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తే రంజిత్ సింగ్ మాత్రం తన డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తాడు. గంటల కొద్దీ రోడ్డుపై నిల్చొని ఎలాంటి నీరసం, విసుగు లేకుండా ట్రాఫిక్‌లో ఆగి ఉన్న జనాలకు తన స్టెప్పులతో అలరిస్తాడు. అయితే ఇటీవల రంజిత్ సింగ్ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా. తన వీడియోను షేర్ చేస్తూ మండే మోటివేషన్ అంటూ పోస్ట్ పెట్టాడు. ‘ఈ పోలీస్ బోరింగ్ పని అంటూ ఏమి ఉండదు అని నిరుపించాడు. మన పనిని మనం ఎలా చేయాలి అనేది నీ ఛాయిస్ ’అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This cop proves that there is NO such thing as boring work.It is whatever you choose to make of it.#MondayMotivationpic.twitter.com/ItrI7yjAe2— anand mahindra (@anandmahindra) July 29, 2024 View this post on Instagram A post shared by Devanshu Gupta BUNNY (@iamdevanshugupta) View this post on Instagram A post shared by Ranjeet Singh (@thecop146) -
అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకుంటారా?
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు. తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు. అసలు వారిని వదిలేసి డ్రైవర్‌పై కేసుఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి అధికారులపై పచ్చ మూక బహిరంగంగా బెదిరింపులకు దిగినా.. వారిపై చర్యలకు ఆదేశించడంలో విశాఖ పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా నమోదు మినహా విశాఖ పోలీసులు పచ్చమూకపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇటీవలే త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన విశాఖ ప్రజలు మరువకముందే.. ట్రాఫిక్ పోలీసులపై తెలుగు తమ్ముళ్లు పూటుగా తాగి మద్దిలపాలెంలో బరితెగించిన ఘటన చోటుచేసుకోవడం విశాఖ వాసులతో పాటు పోలీసు వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారాన్ని వీడియోలతో సహా ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులకు పంపినట్టు తెలుస్తోంది. అయినా ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలకు ఆదేశించకపోవడం చర్చకు దారితీసింది. తెలుగు తమ్ముళ్ల బరితెగింపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు విశాఖ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం రాత్రి కారు డ్రైవింగ్ చేస్తున్న టెక్కలికి చెందిన బొమ్మిలి మురళీపై కేసు నమోదు చేసి మమా.. అనిపించారు. ఈ గొడవకు కారకులైన ఢిల్లీశ్వరరావు తదితరులను పక్కన పెట్టి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశమైంది. -
‘ప్లేట్’ ఫిరాయిస్తే కేసే!
ట్రాఫిక్ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకుతమ వాహన నంబర్ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు. - సాక్షి, హైదరాబాద్ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్ చిరునామానే కీలకం. కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువవాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా ఫోర్ వీలర్స్ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్ ప్లేట్ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్ ప్లేట్ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్ పోలీసులకు కనిపిస్తుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్ఎస్లోని సెక్షన్ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులుఅనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్ ప్లేట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు. కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను డ్యామేజ్ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
రక్షణ చత్రమంటున్నా.. రెక్లెస్!
2024 ఫిబ్రవరి 6: షేక్‌పేట గుల్షన్ కాలనీకి చెందిన వ్యాపారి మొహమ్మద్ అర్షద్ (22) ఈ ఏడాది ఫిబ్రవరి 6న యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్నాడు. టోలీచౌకీలోని షేక్‌పేట్ నాలా నుంచి సెవెన్ టూంబ్స్ మెయిన్ రోడ్డు వరకు ఉన్న çశ్మశానానికి సరిహద్దు గోడ ఉంది. అక్కడ అర్షద్ వాహనం అదుపుతప్పి ఆ గోడను బలంగా ఢీ కొంది. ఆ సమయంలో అతడి తలకు హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.2024 మే 26: మాసబ్‌ట్యాంక్‌లోని ఎంజీ నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (45) ప్రైవేట్ ఉద్యోగి. మే 26 తెల్లవారుజామున తన కుమారుడితో (15) కలిసి ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు బయలుదేరారు. మైనర్ వాహనాన్ని డ్రైవ్ చేస్తుండగా అలీ వెనుక కూర్చున్నారు. కాగా హుమయూన్‌నగర్ ఠాణా సమీపంలో ఆ బాలుడు వాహనాన్ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. దీంతో వెనుక కూర్చున్న అలీ కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మూడు రోజులకు కన్ను మూశారు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే గాయాల తీవ్రత తగ్గేదని, ప్రాణం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్పష్టం చేస్తున్న ప్రమాదాలు, హెల్మెట్ ధారణ విషయంలో ఏపీ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల జారీ చేసిన కీలక ఉత్తర్వులు.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం ఎంత తప్పనిసరో తేల్చి చెబుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ప్రమాదాలు నమోదవుతున్నాయి.2023లో మొత్తం 2,548 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఇందులో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే దాదాపు సగం (1,263) ఉన్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 335 మంది మరణిస్తే, ఇందులో టూ వీలర్లకు సంబంధించిన మరణాలు దాదాపు 40 శాతం వరకు ఉండటం గమనార్హం. అయినప్పటికీ టూ వీలర్ వాహనాలు నడిపేవారిలో ఇంకా అనేకమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ ధరించినా ఎక్కువమంది స్ట్రాప్ పెట్టుకోవడం లేదు.కొందరు అలంకారంగా బండి మీద పెట్టుకునో, తగిలించుకునో వెళ్తున్నారు. కొందరు పోలీసుల్ని చూసి హెల్మెట్ పెట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలూ ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి పిలియన్ రైడర్ (ద్విచక్ర వాహనం వెనుక కూర్చునేవారు) సైతం విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తున్నా దాన్ని పట్టించుకునేవారే లేరు.అడపాదడపా పోలీసుల స్పెషల్ డ్రైవ్లుహెల్మెట్ ధారణను హైదరాబాద్‌లో 2012 లోనే తప్పనిసరి చేశారు. అయితే ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. వాహనచోదకుల అవగాహన రాహిత్యం/నిర్లక్ష్యం, పోలీసుల ఉదాసీన వైఖరితో పాటు రాజకీయ జోక్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా కన్పిస్తోంది. నగర వ్యాప్తంగా దాదాపు 70 శాతం, పాతబస్తీ సహా మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే హెల్మెట్ వినియోగంలో ఉంది. వాస్తవానికి మోటారు వాహనాల చట్టం పుట్టిన నాటి నుంచే ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలనే నిబంధన ఉంది. అయితే సుదీర్ఘకాలం పాటు ఈ విషయాన్ని నగర పోలీసులు పట్టించుకోలేదు.తేజ్ దీప్ కౌర్ మీనన్ హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తుండగా 2005లో తొలిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి చేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను పక్కాగా అమలు చేయడానికి కృషి చేశారు. అయితే దీని చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ట్రాఫిక్ చీఫ్‌గా వచ్చిన అబ్దుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్) సైతం హెల్మెట్ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నిబంధనను అమలు చేయడానికి ముందు వాహనచోదకులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అప్పట్లో మొదటి పేజీ తరువాయి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా దాదాపు ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆపై స్పెషల్ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాహనచోదకుల్లో నిర్లక్ష్యంనగరంలోని ద్విచక్ర వాహనచోదకులందరితో హెల్మెట్ పెట్టించాలని ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటికీ పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాలకు చెందినవారు దీనికి దూరంగానే ఉంటున్నారు. హాఫ్ హెల్మెట్లు, హెల్మెట్ ధరించినా స్ట్రాప్ బిగించుకోకపోవడం, హెల్మెట్ వెంటే ఉన్నప్పటికీ కేవలం జంక్షన్లు, పోలీసులు సమీపిస్తున్నప్పుడే తలకు పెట్టుకోవడం పరిపాటిగా మారింది.నగరానికి చెందిన అనేకమంది వాహనచోదకులు తాము నివసిస్తున్న ప్రాంతం దాటి బయటకు వస్తేనే హెల్మెట్ ధరిస్తున్నారు. ఏ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవనే భావన వీరికి ఉండకపోవడమే దీనికి కారణం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని రోజులు హడావుడి చేయడం, ఆపై మిన్నకుండి పోవడంతో 100 శాతం హెల్మెట్ ధారణ సాకారం కావట్లేదు. నగరంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టిహైదరాబాద్లో వాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయడమెట్లా అనే విషయంపై 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దృష్టి పెట్టింది. ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహ నాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం, వీటిలో తలకు దెబ్బతగలడం కారణంగా మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.ఆ ఏడాది హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డబ్ల్యూహెచ్ఓలోని రోడ్ సేఫ్టీ అండ్ ఇన్జ్యూరీ ప్రివెన్షన్ విభాగం టెక్నికల్ ఆఫీసర్ స్వేర్కర్ అల్మ్క్విస్ట్.. హైదరాబాద్‌లో హెల్మెట్ నిబంధన అమల్లో తమ సహకారంపై నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకం 30 శాతమే ఉందని అప్పట్లో అభిప్రాయపడ్డారు.హెల్మెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలుతలకు రక్షణ: శిరస్త్రాణాలు ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. తల అంతర్గత, బహిర్గత గాయాల తీవ్రత, పుర్రె పగుళ్ల ప్రమాదం తగ్గుతుంది.మెదడు రక్షణ: హెల్మెట్ అనేది ప్రమాద సమయంలో తలకు కుషన్‌లా పనిచేస్తుంది. తద్వారా మెదడుకు గాయాలు (ట్రుమాటిక్ బ్రెయిన్ ఇన్జ్యూరీస్) కాకుండా రక్షించడంలో సహాయపడుతుంది.ఫేస్ ప్రొటెక్షన్: చాలా హెల్మెట్లు ఫేస్‌షీల్డ్ లేదా విజర్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాదాల సమయంలో, అలాగే ప్రతికూల వాతావరణంలో ముఖాన్ని రక్షిస్తాయి.కంటి రక్షణ: విజర్ లేదా గాగుల్స్‌తో కూడిన హెల్మెట్లు గాలి, దుమ్ము, సూక్ష్మస్థాయి చెత్త, క్రిమి కీటకాల నుంచి కళ్లను రక్షిస్తాయి.ధ్వని తీవ్రత తగ్గింపు: కొన్ని హెల్మెట్లు చెవి రక్షణ బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. హెల్మెట్ పెట్టుకుంటే శబ్ద కాలుష్యం తక్కువగాఉంటుంది. ప్రమాద సమయంలో వినికిడి దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.మార్పు కోసం కృషి చేస్తున్నాంగతంతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో పరిస్థితి బాగా మెరుగైందనే చెప్పాలి. జంక్షన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌తో పాటు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికీ కొందరు.. ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తేనే హెల్మెట్ పెట్టడం, హెల్మెట్ పెట్టుకున్నా దాని స్ట్రాప్ బిగించుకోకపోవడం వంటివి చేస్తున్నారు. వీరి విషయంలోనూ మార్పు కోసం కృషి చేస్తున్నాం. - పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్
షాపింగ్ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్ ట్రాఫిక్.. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్‌కు అంతరాయం. పోలీసుల కంట్లో పడితే ఫైన్ కట్టక తప్పదు. అదే ఓ యాప్ ఉండి, దగ్గరలో పార్కింగ్ ఎక్కడుందో తెలిస్తే..? అదీ పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసేసుకోగలిగితే..? ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా.బిజీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు ఇలాంటి వెసులుబాట్లు తెస్తే.. వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచి్చంది. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించవచ్చని ప్రతిపాదన చేసింది.సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ నగరం ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఏటా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అవన్నీ రోడ్లపై తిరగడం సంగతి పక్కనపెడితే.. ఎక్కడో ఓ చోట పార్క్ చేయక తప్పదు. షాపింగ్ కోసం వెళ్లినా, ఏదైనా పని మీద వెళ్లినా.. పార్కింగ్ కోసం తిప్పలే. కార్లే కాదు బైకులు పెట్టడానికీ ఎక్కడా స్థలం లేని దుస్థితి. దీనితో షాపుల ముందు, రోడ్ల పక్కన, గల్లీల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటోంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, సాయంత్రాలు ఆహ్లాదంగా గడపడానికి వెళ్లే చోట్ల పార్కింగ్ పెద్ద ప్రహసనంగా మారింది.ఎలా పనిచేస్తుంది..కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఈజీపార్క్ ఏఐ సంస్థ రూపొందించింది. ఆ వివరాల మేరకు.. పార్కింగ్ స్థలం నిర్వహించే వారికి ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఎన్ని వస్తున్నాయి? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతసేపు వాహనాలు పార్క్ చేస్తారన్న డేటాను దాని ద్వారా అందిస్తుంది. అలా అన్ని పార్కింగ్ స్థలాల వివరాలను ఒకచోట క్రోడీకరిస్తుంది.ఈ వివరాలను ఓ యాప్ సాయంతో వాహనదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్ ద్వారా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ముందుగానే పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించేయొచ్చు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లకపోతే.. స్లాట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్రదేశాల్లో ఇంటర్నెట్ ఆధారిత కెమెరాలతో నిఘా ఉంటుంది. వాహనానికి సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. దొంగతనం, మరేదైనా జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు వెళ్లిపోయి పార్కింగ్ స్లాట్లు ఖాళీ అయితే.. వెంటనే యాప్‌లో అప్డేట్ అయి ఖాళీగా చూపిస్తుంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు బయటికి వెళ్లడం, లోపలికి రావడం ప్రత్యేక పరికరాలతో నమోదవుతూ ఉంటుంది. ఆటోమేటిగ్గా వాటి నంబర్లను గుర్తించి అప్డేట్ చేసే వ్యవస్థ ఉంటుంది.మల్టీలెవల్ పార్కింగ్తో.. అలాగే హైదరాబాద్‌లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలకు కొరత ఉండటంతో.. మలీ్టలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఏర్పాటు చేసినా.. అవి ఎక్కడున్నాయో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలిసినా పార్కింగ్ ఖాళీగా ఉందో లేదో తెలియదు. అక్కడిదాకా వెళ్లి ఖాళీ లేకుంటే.. మళ్లీ మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్ ఖాళీగా ఉందో, లేదో తెలిసి.. ముందే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ముందుకొచి్చంది. ఇటీవల దీనిపై రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది.భవనాల్లో పార్కింగ్ సరిగా లేక.. హైదరాబాద్‌లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. కార్లు, టూ వీలర్లతోపాటు విద్యాసంస్థల వాహనాలు, ఆటోలు వంటివీ భారీగా ఉన్నాయి. ఇందులో కార్లు, టూవీలర్ల పార్కింగ్ కోసం ఇబ్బంది వస్తోంది. ట్రాఫిక్‌లో ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న వాహనదారులకు పార్కింగ్ విషయంలో తిప్పలు తప్పట్లేదు. పార్కింగ్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.పార్కింగ్ సమస్యపై జనం ఏమంటున్నారు?సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఓ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. ‘ఈజీపార్క్ఏఐ’ సంస్థ ప్రజెంటేషన్ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఐటీని వినియోగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు కూడా. ఎక్కడికెళ్లినా పార్కింగ్‌కు ఇబ్బందే.. హైదరాబాద్‌లో, ముఖ్యంగా బిజీ ఏరియాల్లో పార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటోంది. చాలాసేపు వెతికితే కానీ బండి పెట్టుకోవడానికి ప్లేస్ కనబడటం లేదు. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఉండట్లేదు. అంతా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అది ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోంది. – నరేశ్‌గౌడ్ లోడి, అంబర్పేటప్రభుత్వం చొరవ తీసుకోవాలి హైదరాబాద్‌లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ విషయంలో ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించాలి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలకు, వాహనదారులకు అవగాహన కలి్పంచాలి. అప్పుడే నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కల్యాణ్, దిల్సుఖ్నగర్ -
Video: తప్ప తాగి కారుతో ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవర్
హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసును కొంతమంది బలవంతంగా కారులోకి ఎక్కించుకొని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌ఘర్‌లో నడిరోడ్డుపై జరిగింది.బల్లాబ్‌ఘర్ బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డు మధ్యలో కారును ఆపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ట్రాఫిక్ సబ్- ఇన్స్పెక్టర్ డ్రైవర్ వద్దకు వెళ్లి బండి పత్రాలు అడిగి, చలాన్ రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై డ్రైవర్‌కు పోలీస్‌కు మధ్య వాగ్వాదం మొదలైంది.పేపర్లను పరిశీలించేందుకు సబ్ఇన్స్పెక్టర్ డ్రైవర్ డోర్ ద్వారా కారు లోపలికి వంగగా.. డ్రైవర్ ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ను నొక్కి కారును ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ పోలీస్‌తోపాటు కారు అలాగే ముందుకు కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అక్కడున్న వారు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది వెంటనే వాహనాన్ని చుట్టుముట్టి అధికారిని రక్షించారు.నిందితుడుని కొంతదూరం వెంబడించి పట్టుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.VIDEO | #Haryana: A cab driver tried to flee when traffic police asked for the documents of the vehicle he was driving in Ballabgarh. He was nabbed by traffic cops after a short chase. The incident reportedly took place yesterday. (Source: Third Party) pic.twitter.com/eJILVSsqMJ— Press Trust of India (@PTI_News) June 22, 2024 -
కార్ పూలింగ్.. వేర్వేరు పనివేళలు
సాక్షి, హైదరాబాద్: ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు.. ఇలా ఎన్ని నిర్మించినా హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. చినుకు పడితే చాలు కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. దీంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ఐటీ కంపెనీలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఇన్ఫోసిటీలో సమావేశమయ్యారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతోపాటు నిర్వహణ వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. ఢిల్లీలో అమలవుతున్న కార్ పూలింగ్ విధానాన్ని ఐటీ కారిడార్ పరిధిలోనూ అమలు చేయడాన్ని ఐటీ సంస్థలు పరిశీలించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు. ఈ విధానంతో వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఒకే పనివేళలు కాకుండా వేర్వేరు సమయాలను కేటాయించాలన్నారు. దీనివల్ల కూడా వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు.కార్ పూలింగ్ అంటే?ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒక్కో వాహనంలో వచ్చే బదులు నలుగురు చొప్పున కలిసి ఒకే కారులో ఆఫీసుకు రావడాన్ని కార్ పూలింగ్ అంటారు. ఈ విధానంలో ఒకరోజు ఒక ఉద్యోగి కారు తీసుకొస్తే ఆ మరుసటి రోజు మరో ఉద్యోగి కారులో ప్రయాణిస్తారు. దీంతో ప్రతిరోజూ ఒకే సమయంలో, ఒకే రహదారిలో నాలుగు కార్లు రోడ్లపైకి రాకుండా ఒకే కారులో నలుగురు ఉద్యోగులు ఆఫీసుకు చేరుకుంటారు. -
కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
మాదాపూర్: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు రక్షించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (25) హైదరాబాద్‌కు వచి్చంది. ఆరి్థక కారణాల నేపథ్యంలో నిద్రమాత్రలు మింగిన ఆమె కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకుని దుర్గం చెరువులో దూకేందుకు యతి్నస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆమెను కాపాడారు. అనంతరం సమీపంలోని విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సదరు యువతికి మతిస్థిమితం లేదని పోలీసులు తేలిపారు. Madhapur Traffic Police's intervention saved a woman's life as they prevented her from jumping off the Durgam Cheruvu Cable bridge.A 25-year-old woman has been taken to Vikram Hospital for treatment after reportedly ingesting pills.#CyberabadTrafficPolice pic.twitter.com/e22GP5bYL7— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 17, 2024 -
ట్రాఫిక్‌పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్‌గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్‌ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్‌కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్‌లో కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్‌లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్‌గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్‌కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్‌గా సెకన్‌కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసమే స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఏర్పాటు: సీపీ
-
కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ ట్రాఫిక్ సీఐ నర్సింహ్మ, లా అండ్ ఆర్డర్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్థరాత్రి దాటే వరకు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేసిన 23 మందికి చలానా విధించారు. రెండో సారి పట్టుబడితే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రాత్రి సమయంలో దుర్గం చెరువు అందాలను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కేబుల్ బ్రిడ్జిపైకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేయడం, బర్త్ డేలు జరుపుకోవడం, సెల్ఫీలు దిగడం సరికాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలను బ్రిడ్జి బయట పార్కింగ్ చేసి రెండు వైపులా ఉన్న పాత్ వేలోనే సందర్శకులు ఉండాలని పేర్కొంటున్నారు. -
ట్రాఫిక్ పోలీస్.. ఇక 24/7 రోడ్ల మీదే
సాక్షి, హైదరాబాద్: నగరవాసికి నిత్యం నరకప్రాయంగా మారిన ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంటల తరబడి నగరరోడ్లపై చిక్కుకుపోయి తిప్పలు పడుతున్న వాహనచోదకులకు ఊరట కలిగించేందుకు, పనిలో పనిగా వాయు, శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టేందుకు పోలీసు శాఖ సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. అదనపు సిబ్బందితోనే వాహనాల రద్దీని అదుపు చేయడం సాధ్యమవుతుందని గుర్తించింది. ఈ మేరకు అదనపు ట్రాఫిక్ సిబ్బందిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్లకు కలిపి అదనంగా 2,500 మంది ట్రాఫిక్ సిబ్బంది అవసరమని గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 24/7 రోడ్ల మీదనే ఉంటూ వాహనాలు, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడమే ఈ అదనపు సిబ్బంది పని. ►ఇటీవల పోలీసుఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి నగర ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు 1,000, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు 1,500 మంది అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీ ఇలా.. ప్రధానంగా రహదారులపై ఫ్రీ లెఫ్ట్ బ్లాక్‌లు, వాహనాల బ్రేక్ డౌన్లే నగరంలో ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణాలని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయా అంశాలపై తక్షణమే స్పందించేందుకు ఈ అదనపు ట్రాఫిక్ పోలీసులు రోజంతా రోడ్లపైనే ఉంచాలని నిర్ణయించారు. ఈ సిబ్బంది ప్రత్యేక ప్రణాళికలతో వర్షాకాలంలో రోడ్లపై ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించనున్నారు. ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా ఇప్పటికే రాంగ్ సైడ్ డ్రైవింగ్‌లపై గ్రేటర్ ట్రాఫిక్ విభాగం కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ద్వి, మూడు చక్రాల వాహనాలకు రూ.200, నాలుగు, అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు రూ.700 చొప్పున జరిమానాలు విధిస్తోంది. అలాగే ట్రావెల్ బస్సులు, భారీ వాహనాలు నగర రోడ్లపై నిర్దేశిత సమయాల్లోనే వచ్చేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. దీంతో రోడ్లపై వాహనాల కదలికలు సాఫీగా, వేగంగా జరుగుతాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వ్యక్తిగత కార్ల వినియోగాన్ని తగ్గించేలా.. వాహనదారులు, కాలనీవాసుల సూచనల మేరకు అవసరమైన చోట యూ టర్న్‌లు, కూడళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇవి స్వల్ప కాలిక పరిష్కారం మాత్రమేనని, రోజూ నగర రోడ్లపైకి వస్తున్న వందలాది వాహనాలను తగ్గిస్తేనే శాశ్వత పరిష్కారం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కార్ల వినియోగాన్ని తగ్గించి, సాధ్యమైనంత వరకు ప్రజారవాణా వ్యవస్థను వినియోగించేలా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎక్కువమంది ప్రజలు మెట్రో, బస్సులలో ప్రయాణిస్తే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని వివరించనున్నారు. -
కారు ఎవరిది..? డాక్యుమెంట్లు ఎవరి పేరున ఉన్నాయి..?
హైదరాబాద్: ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా దుర్భాషలాడిన సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్ జాన్‌బీని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. గత నెల 24న రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు గొడుగు విఘ్నేష్ కారులో ఓ యువతి రాంగ్రూట్లో వస్తుండగా అడ్డుకున్నాడు. . దీంతో రెచ్చిపోయిన ఆమె హోంగార్డు విఘ్నేష్ పై దాడి చేయడమేగాక దుస్తులు చించేసి అడ్డువచి్చన పోలీసులను కూడా దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న పోలీసులను ఆటంకం కలిగిస్తూ నోటికొచి్చనట్లు తిట్టడంతో పాటు న్యూసెన్స్‌కు కూడా పాల్పడింది. అదే రోజు రాత్రి హోంగార్డు విఘ్నేష్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతిని సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్జాన్బీగా గుర్తించి ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లి విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమెకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆమె తరపు న్యాయవాదులు పోలీసులకు చూపించారు. అప్పటికప్పుడు ఆమెకు 41ఏ నోటీసు ఇచ్చి రెండు గంటల పాటు విచారించారు. ఆ రోజు నడిపిన జాగ్వార్ కారు ఎవరిది, కారుకు సంబంధించిన డాక్యుమెంట్లను మూడు రోజుల్లో చూపించాలన్నారు. అలాగే మెడిసిన్ కోసం వెళుతున్నట్లుగా ఆమె చెప్పిందని, మెడిసిన్ ప్రిస్కప్షన్ కూడా చూపించాలని ఆదేశించారు. ఆ రోజు రాంగ్రూట్లో వెళ్లడానికి గల కారణం, పోలీసులపై ఎందుకు దుర్భాషలాడారు, హోంగార్డును ఎందుకు అడ్డుకున్నారు అన్న విషయాలపై ఆమెను ప్రశి్నంచారు. మొత్తం ఎనిమిది ప్రశ్నలు సంధించిన పోలీసులు వాటికి జవాబు ఇవ్వాలని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసులో సూచించారు. మూడు రోజుల్లో మరోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని, విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను ఆదేశించారు. నేను ఎవరిపైనా దాడి చేయలేదు అనంతరం సౌమ్యాజాను మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరిపై దాడి చేయలేదని తెలిపింది. ఆరోజు తాను నడిపిన జాగ్వార్ కారు తన స్నేహితులదని, తాను రాంగ్ రూట్లో వెళ్లిన మాట వాస్తవవేనని, తనది పొరపాటేనని తెలిపింది. తనపై మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, త్వరలో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. -
Sowmya Janu: నటి సౌమ్య జాను వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ నటికి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను రాంగ్ రూట్లో రావడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ హౌంగార్డ్ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ కేసుపై నటి సౌమ్య జాను హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సౌమ్యకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా మార్చి 11 లోపు పోలీసుల ఎదుట హాజరు కావాలని సౌమ్యకు హైకోర్ట్ సూచించింది. అసలేం జరిగిందంటే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడికి పాల్పడిందని సినీనటి సౌమ్యజానుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతనెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. -
ఒక అమ్మాయిని బూతులు తిట్టే హక్కు ఉందా?: ఏడ్చేసిన నటి
ఇటీవల హైదరాబాద్‌లో నటి సౌమ్య జాను ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాంగ్ రూట్లో వెళ్తుండగా ట్రాఫిక్ హోంగార్డ్‌తో జరిగిన గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు.. జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను అడ్డగించారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజగా నటి సౌమ్య జాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ సమయంలో తాను రాంగ్ రూట్లో వెళ్లినట్లు తెలిపింది. కానీ ట్రాఫిక్ పోలీస్ వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిజాలు చెప్పుకొచ్చింది. సౌమ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' అసలు నా గురించి వీడియో సోషల్ మీడియాలో వస్తున్న సంగతే తెలీదు. ఇక్కడ పెద్ద బ్లండర్ ఎంటంటే.. నాకు మందు అలావాటే లేదు. నేను రాంగ్‌లో రూట్లోనే వెళ్లా. దీనికి సారీ చెబుతున్నా. నేను మెడిసిన్స్ కోసం వెళ్తున్నా. ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా మదర్‌కు మందులు అర్జెంట్‌గా కావాలి. ఆ విషయం అతనికి కూడా చెప్పాను. కానీ వినకుండా కారు వెనక్కి తీయమన్నారు. తను చాలా ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. కానీ ఆ ఒక్క బూతు మాట నేను తీసుకోలేకపోయాను. రెండు రోజుల నుంచి మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నా. ఆ మాటలకే నాకు కోపం వచ్చింది. అసలు ఆ మాట అనడానికి అతనికి నోరెలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ప్రతి మగాడు.. ఒక ఆడదాన్ని అలా ఎందుకంటాడు.' అంటూ ఏడ్చేసింది. సౌమ్య మాట్లాడుతూ..'ఒక అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు. కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. అయిన వాళ్లను అనే హక్కు ఎవరికీ లేదు. మన సమాజంలో గేలు కూడా ఉంటారు. వాళ్లను ఉద్దేశించి ఎవరికీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఆ దేవుడు వారికి అలాంటి లైఫ్ ఇచ్చాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఆ మాటలు నన్ను ఎలా అంటారు. అక్కడ నేనేం నానా హంగామా చేయలేదు. కావాలంటే సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీ. కానీ అతను అన్న మాటలకు నా కుటుంబం నరకం అనుభవిస్తున్నాం. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంటి ఇలా అయింది? అని అడుగుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. ఆ రోజు నాకు మా అమ్మ ఆరోగ్యమే ముఖ్యం. అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. నేను ఎక్కడికీ పోలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. అతను చేసింది మాత్రం చాలా తప్పు. దీనిపై ఎంతవరకైనా పోరాడతా' అని అన్నారు. -
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోకి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ♦ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. ♦లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. ♦ డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యా హ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. ♦ ప్రైవేట్ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్యనే నగరంలో ప్రయాణించాలి. ♦ అత్యంత నెమ్మదిగా నడిచే కేటగిరీకి చెందిన చేతితో తోసే బళ్లు, వివిధ రకాలైన జంతువులు లాగే బళ్లు, సైకిల్ రిక్షాలు, ట్రాక్టర్లు తదితరాల సంచారాన్ని నగరంలోని కీలకమైన 61 టూర్లలో నిషేధించారు. ♦ భవన నిర్మాణ, కూలి్చవేత వ్యర్థాలను తరలించే వాహనాల్లో 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు కలిగినవి ఉ. 11.30 నుంచి సాయంత్రం 5, రా త్రి 10 నుంచి ఉదయం 9 మధ్య సంచరించాలి. ♦ వీటిలో 10 టన్నులు అంతకంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. -
హెల్మెట్ ధరించలేదు సరికదా, అడిగితే పోలీసు వేలు కొరికేశాడు
హెల్మెట్ ధరించలేదని అడిగినందుకు ఒక వ్యక్తిట్రాఫిక్ పోలీసుపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం హెల్మెట్ ధరించడం తప్పని సరి. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన వివాదంలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై దుర్భాషలాడి ట్రాఫిక్ పోలీసు వేలిని కొరికిన ఘటన బెంగుళూరులో నమోదైంది. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ దగ్గర సయ్యద్ సఫీని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ఏదని ప్రశ్నించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్కూటర్ కీని లాక్కున్నాడు. ఆసుపత్రికి వెళుతుండగా హెల్మెట్ ధరించడం మర్చిపోయానంటూ వివరించే ప్రయత్నం చేశాడు సయ్యద్. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజాలగిహెల్మెట్ నిబంధన ఉల్లంఘించినందుకు సఫీని రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సయ్యద్, ట్రాఫిక్ పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించాడు. హెడ్ కానిస్టేబుల్ ఫోన్‌ను లాక్కొని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారనిప్రశ్నించాడు. అలాగే తన వీడియో వైరల్‌గా మారినా నాకేం ఫరక్ పడదన్నట్టు వాదించాడు. దీంతో పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, శారీరకంగా గాయపర్చడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. Syed Sharif biting traffic police in Bengaluru He was caught riding bike without Helmet Usually Police don’t ask for helmets to Jali topis in bengaluru pic.twitter.com/IZ9x2o5Iks — Swathi Bellam (@BellamSwathi) February 13, 2024 -
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం
ఖమ్మంక్రైం: రహదారి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు అటు రవాణా శాఖ, ఇటు ట్రాఫిక్ పోలీసులు జరిమానా చలానా విధించడం పరిపాటి. అయితే, ఈ చలాన్లను ఎప్పటికప్పుడు చెల్లించకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు వాహనాన్ని సీజ్ చేసే అవకాశముంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో చలాన్లు పేరుకుపోయినట్లు గుర్తించిన ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపై 80శాతం, కార్లు, ట్రాలీలు వంటి నాలుగు చక్రాలు, లారీలు, ఇతర భారీ వాహనాల పై 60శాతం రాయితీని ప్రకటించినా చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కమిషనరేట్ పరిధిలో 9లక్షల చలాన్లు ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో చాన్నాళ్లుగా చలాన్లు పేరుకుపోయాయి. ట్రాఫిక్ స్టేషన్లలో సిబ్బంది కొరత కారణంగా జరిమానా విధించడమే తప్ప వసూళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో చలాన్లు నానాటికీ పెరిగి 9లక్షలకు చేరాయి. వీటి చెల్లింపునకు ప్రభుత్వం భారీగా రాయితీ ప్రకటించినా వాహనదారుల నుంచి స్పందన రావడం లేదు. గతనెల 26వ తేదీ నుంచి రాయితీ అమల్లోకి రాగా బుధవారం నాటికి కేవలం 1,12,125 మంది మాత్రమే చలాన్లపై జరిమానా చెల్లించారు. వీటి ద్వారా రూ.70,13,485 ఆదాయం లభించింది. అంటే ఇంకా 7,87,875 పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, రాయితీ గడువు ఈనెల 10వ తేదీతో ముగియనున్నందున వాహనదారులు ముందుకు రావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆతర్వాత తనిఖీల్లో దొరికితే వాహనాలు సీజ్ అవకాశముంది. అవగాహన లేమితోనే.. నిత్యం వీవీఐపీలు, వీఐపీల బందోబస్తులో నిమగ్నమవుతున్నట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వం రాయితీ కల్పించిన అంశంపై వాహనదారులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. దీంతో కమిషనరేట్ పరిధి లోని 9లక్షల చలాన్లలో కనీసం 20శాతం కూడా చెల్లింపులు జరగలేదు. ఈనెల 10వ తేదీతో గడువు ముగియనన్న నేపథ్యాన ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా రాయితీపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది. సకాలంలో చెల్లించండి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారు ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలి. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తిస్తుంది. మీ సేవ కేంద్రాల్లో లేదా ఆన్లైన్లో సొంతంగానూ చెల్లించవచ్చు. గడువులోగా చెల్లిస్తేనే రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి. – అశోక్, ట్రాఫిక్ సీఐ -
ఆఫర్ ఉందని చలాన్లు కడుతున్నారా ?..జాగ్రత్త !
-
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
-
బండి ఖరీదు వేలల్లో.. జరిమానా లక్షల్లో... తప్పెవరిదంటే..
కర్ణాటక: ఆ స్కూటీ ఖరీదు రూ.30 వేలు.. దానికి పడిన జరిమానా రూ. 3.22 లక్షలు. అవును.. ఇది నూటికి నూరుపాళ్ల నిజం. అయితే దీనిలో అధికారుల తప్పేమీలేదు. సదరు స్కూటీవాహనదారుని నిర్వాకమే ఇంత భారీ జరిమానాకు కారణం. ఈ ఉదంతం బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను 643 సార్లు ఉల్లంఘించిన స్కూటీకి లక్షల రూపాయల జరిమానా పడింది. ఈ ఘటన ఆర్టీ నగరలో జరిగింది. స్కూటీపై ప్రయాణించిన వ్యక్తి హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంప్ ద్వారా 643 సార్లు అతిక్రమణలకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ కెమెరాలో ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. దీంతో మొత్తం చలానాలను లెక్కించగా రూ. 3.22 లక్షలుగా తేలింది. ఇక ఆ స్కూటీ విలువ రూ. 30 వేలకు మించదు. ఆ స్కూటీ వ్యక్తి కోసం ట్రాఫిక్ పోలీసులు వెతకడం ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ నంబర్ కేఏ04KF9072తో ఈ స్కూటీ ఫిబ్రవరి 2022లో విక్రయమయ్యింది. ఈ వివరాలను బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం తమ వెబ్సైట్లో నమోదు చేసింది. -
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు
బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. -
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు
అహ్మదాబాద్: కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం. ఇక పోలీస్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్ అగర్వాల్ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్‌తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. -
రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా రేపు(ఆదివారం) సద్దుల బతుకమ్మను సంబురంగా జరుపుకోనున్నారు. ఇక, హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ చివరి రోజు ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. #HYDTPinfo Commuters, please make a note of #TrafficAdvisory in view of #SaddulaBathukamma, celebrated on 22-10-2023 at #LumbiniPark & Upper #TankBund.#TrafficAlert #Bathukamma #Festival #Celebrations #Dussehra #Dussehra2023 @AddlCPTrfHyd pic.twitter.com/WMp9Qcpiqa — Hyderabad Traffic Police (@HYDTP) October 21, 2023 ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు. ►సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్ రూట్లోకి మళ్లిస్తారు. ►నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. ►హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్లాలి. ►సికింద్రాబాద్ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతించరు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు. ►ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్-ఉపకార్ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్ వద్ద మళ్లిస్తారు. ►బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న మీ కోసం పార్కింగ్ ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను కేటాయించారు. -
Video: చెక్‌పోస్టు వద్ద ఆగకుండా.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి దూసుకెళ్లిన కారు
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతి వేగం, అజాగ్రత్త, రాంగ్ రూట్లో ప్రయాణించడం నేరం. దీని వల్ల మనతోపాటు ఎదుటివాళ్ల ప్రాణాలను ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రోడ్డు భద్రతా చర్యలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. నాకెందుకులే అని నిర్లక్ష్యంగా ప్రయాణించి అనేక అనర్థాలకు కారణకులుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వెళ్లడమే కాకుండా.. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై ఓ కారు దూసుకెళ్లింది. వివరాలు.. బుధవారం తెల్లవారు జామున ట్రాఫిక్ పోలీసులు చిలకలగూడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అతివేగంతో వెళ్తున్న ఓకారు చెక్‌పోస్టు వద్ద హైస్పీడ్‌తో దూసుకొచ్చింది. కారును గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ దానని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేష్‌కు తీవ్ర గాయాలవ్వగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓవర్ స్పీడ్‌తో నడిపిన కారు డ్రైవర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు అతడిపై కఠిన చర్చలు తీసుకోవాలని కోరుతున్నారు. Early hours of Wednesday, speeding vehicle didn't stop at #checkpost in #Chilakalaguda & instead rammed into @hydcitypolice constable Mahesh & sped past; he was shifted to a private hospital nearby & is thankfully said to be out of danger @ndtv @ndtvindia #TelanganaElections2023 pic.twitter.com/OY4fdxt4FE — Uma Sudhir (@umasudhir) October 20, 2023 -
ట్యాంక్ బండ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంతో ట్యాంక్ బండ్‌పై కోలాహలం నెలకొంది. అయితే ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఓ విగ్రహ తీసుకెళ్తున్న వాహనం నిలిచిపోగా.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఇది చోటు చేసుకోగా.. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. ట్రాక్టర్‌పై విగ్రహం తీసుకెళ్తుండా.. టైర్ డ్యామేజ్ అయ్యి వాహనం ఆగిపోయింది. దీంతో ట్యాంక్ బండ్ వద్ద భారీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి దాకా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోలేదని వాహనదారులు మండిపడుతున్నారు. మరోవైపు పీవోపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) విగ్రహాల నిమజ్జనం తాత్కాలిక కుంటల్లోనే చేయించాలంటూ జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ట్యాంక్ బండ్‌పై నిన్న నిరసన చేపట్టారు కొందరు. -
ట్రాఫిక్ పోలీసులపై యువతి వీరంగం.. చేయి నరికేస్తా అంటూ బెదిరింపులు
ముంబై: మహారాష్ట్రలో ఓ యువతి హల్చల్ చేసింది. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై డ్రైవ్ చేయడమే కాకుండా.. బైక్ ఆపిన పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తించింది. ట్రాఫిక్ పోలీసులపై దుర్భషలాడుతూ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. ఈ ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ వద్ద జరిగింది. వివరాలు.. నూపుర్ ముఖేష్ పటేల్ అనే 26 ఏళ్ల ఆర్కిటెక్ట్ దక్షణి ముంబై వైపు అతివేగంతో వెళుతోంది. గుర్తించిన బాంద్రా-వర్లీ సీ లింక్ ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే మహిళ తన బైక్‌ను దిగడానికి నిరాకరించింది. దీంతో పోలీసులుర ఆమెను కిందకు దింపేందుకు ప్రయత్నించగా వారితో వాదించడం ప్రారంభించింది. ‘ఈ రోడ్డు నా తండ్రిది. నేను ట్యాక్స్ కడుతున్నాను. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ పోలీసులను బెదిరించింది. బైకర్‌ను ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోకుండా బైక్‌ను నడిరోడ్డుపై నిలిపి ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగింది. ‘నా బైక్‌పై చేయి పెట్టడానికి ఎంత ధైర్యం.. నీ చేయి నరికేస్తాను’ అంటూ రెచ్చిపోయింది. అంతేగాక ఓ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. Meet NUPUR PATEL, joyriding on her motorcycle without a #helmet on the Bandra-Worli Sea Link where two-wheelers are not permitted. She started verbally #abusing the police and even allegedly pointed her cigarette lighter, which was shaped like a #pistol, at the police when asked… pic.twitter.com/wGzuSDaUW8 — ShoneeKapoor (@ShoneeKapoor) September 24, 2023 కాగా ట్రాఫిక్ పోలీసులతో మహిళ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో ఆమె ప్రవర్తించిన విధానాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. యువతిని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ప్రాంతానికి చెందిన ఆమెగా గుర్తించారు. బుల్లెట్ బైక్ అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలో రిజిస్టర్ అయి ఉన్నట్లు తేలింది. మరోవైపు యువతిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక విచారణకు హాజరు కావాల్సిందిగా సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
ఫ్రెండ్ కారులో వీకెండ్ ట్రిప్‌కు చెక్కేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
వీకెండ్‌లోనో, లేదా అత్యవసరం అనుకున్నపుడో ఫ్రెండ్కారును తీసుకొని వెళ్లడం చాలామందికి అలవాటు. అలాగే అద్దె కారులో అయినా సరే హిల్ స్టేషన్లకు చెక్కేస్తారు చాలామంది. అయితే అలాంటి వారి గుండ గుభిల్లు మనే వార్త ఇది. స్రేహితుడి కారులో రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఒక ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫ్రెండ్ కారు తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన టూరిస్ట్‌లకు భారీ పెనాల్టి విధించారు అక్కడి పోలీసు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను సీతారామ్ 12456 తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. దీని ప్రకారం అక్కడి ట్రాఫిక్ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఆపారు. చిన్న వీడియోలో కుటుంబం ప్రయాణిస్తున్న కారు కనిపించలేదు. కానీ వీడియోలోని వ్యక్తి తన స్నేహితుడి కారులో ప్రయాణిస్తున్నాడని చెప్పాడు. అతను చూపించిన పత్రాలను చూసిన పోలీసులు మరొకరి కారును ఉపయోగించడనాఇకి అనుమతిలేదని చలాన్ జారీ చేస్తామని డ్రైవర్‌కు చెప్పడం, దీంతో ఇరువురూ కాసేపు వాదించు కోవడం చూడొచ్చు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్న పోలీసులు అసలు కారు ఓనరుకు ఫోన్ చేసి మరీ నిర్ధారించుకున్నారు. చివరికి చలానా విధించారు. (ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు) అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటంటే స్నేహితుడు లేదా బంధువు కారును వారి సమ్మతితో తీసుకు వెళ్లడం, నడపడం నిజానికి చట్టవిరుద్ధం కాదు. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది టూర్ ఆపరేటర్లు కమర్షియల్ వెహికల్ ట్యాక్స్ ఆదా చేసేందుకు పర్యాటకులకు ప్రైవేట్ రిజిస్టర్డ్ కార్లను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలా వ్యవహరించారా అనేది తేలాల్సి ఉంది. అసలు యజమాని నుండి సమ్మతితో కారును తీసుకున్నట్లయితే, అది చట్టవిరుద్ధం కాదు. ఒకవేళ పోలీసులు తప్పుగా చలాన్ జారీ చేస్తే, ఈ విషయాన్ని క్లియర్ చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే చెన్నైలో యజమానికి తెలియకుండా స్నేహితుడి లేదా బంధువుల వాహనం నడుపుతూ పట్టుబడితే, చెన్నై పోలీసులు మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా విధిస్తారు. సాధారణ తనిఖీల సమయంలో కారు లేదా బైక్ తమ స్నేహితుడిదేనని చాలా మంది పేర్కొంటున్నందున, నగరంలో వాహనాల దొంగతనాల సంఖ్యను తగ్గించేలా ఇలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే హైదరాబాద్‌లో ఇలాంటి నిబంధన ఉన్నట్టుగా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) -
ట్రాఫిక్ పోలీసుల రూట్ స్టడీ!
హైదరాబాద్: ‘గణేష్ విగ్రహాలతో ఊరేగింపుగా వచ్చే ఒక్క లారీకీ ఆటంకాలు ఏర్పడకూడదు. ఎక్కడా ట్రాఫిక్ జామ్స్‌కు తావుండకూడదు. 29వ తేదీ తెల్లవారుజాము సమయానికే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి రావాలి’ – గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలివి. ఈ నెల 28న జరిగే ఈ క్రతువు కోసం అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ఠాణాల వారీగా నిమజ్జనం రూట్లను అధ్యయనం చేస్తూ, మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు నేతృత్వంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, డి.శ్రీనివాస్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. విగ్రహాల ఎత్తు ఆధారంగా మార్గం... సామూహిక నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేయడంలో ట్రాఫిక్ అధికారుల పాత్ర కీలకం. ఊరేగింపు మార్గంలో ఏ చిన్న అవాంతరం ఏర్పడినా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటంతో పాటు ఆ ప్రభావం మరుసటి రోజు ట్రాఫిక్‌పై పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వివిధ మార్గాల్లో ఉన్న పాట్‌హోల్స్ మరమ్మతులు, చెట్టు కొమ్మల నరికివేత తదితర చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. మండపం ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత నిర్వాహకులు పోలీసులు ఇచ్చిన పత్రంలో విగ్రహం ఎత్తు, నిమజ్జనం జరిగే తేదీ, ప్రాంతం ఉంటున్నాయి. ఈ వివరాలు సేకరించిన ట్రాఫిక్ ఠాణాల వారీగా అధ్యయనం చేస్తున్నారు. సదరు విగ్రహం ఊరేగింపు జరిగే మార్గాల్లో ఉన్న వంతెనలు, వాటి ఎత్తు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రోడ్డు నుంచి వంతెన ఎంత ఎత్తులో ఉందో దాని కంటే కనిష్టంగా ఐదు అడుగుల తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలకే ఆయా రూట్లలో క్లియరెన్స్ ఇస్తున్నారు. ట్రాలీ లేదా లారీ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటూ ఇలా చేయనున్నారు. మిగిలిన వాటికి నిర్ణీత సమయం ముందే ప్రత్యామ్నాయ మార్గాలు సూచించనున్నారు. పీవీఎన్ఆర్ మార్గ్‌లో హోల్డింగ్ ఏరియా... నిమజ్జనానికి విగ్రహాలను తీసుకువచ్చే ప్రతి వాహనానికీ పోలీసు విభాగం సీరియల్ నెంబర్‌తో కూడిన స్టిక్కర్ ఇస్తుంటుంది. ఈసారి ఇందులో విగ్ర హం ఎత్తును పొందుపరుస్తున్నారు. ఆయా వాహనాలకు ముందు భాగంలో అతికించి ఉండే దీన్ని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాలోని పోలీసు సిబ్బంది పరిశీలిస్తారు. విగ్రహం ఎత్తు ఆధారంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్‌లోని వాటిని పంపిస్తారు. నిమజ్జనం రోజున ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. ఈ నేపథ్యంలోనే వీలున్నంత వరకు 29వ తేదీ తెల్లవారేసరికి నిమజ్జనం పూర్తి చేసి, ఈ రెండు రూట్లను సాధారణ వాహనాలను అందుబాటులోకి తేవాలని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. అప్పటికీ కొన్ని విగ్రహాల నిమజ్జనం మిగిలి ఉంటే పీవీఎన్ఆర్ మార్గ్‌ను హోల్డింగ్ ఏరియాగా చేసి వాటితో ఉన్న వాహనాలను అక్కడికి పంపిస్తారు. ఆపై ఆ మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న క్రేన్ల వద్ద క్రమపద్దతిలో నిమజ్జనం చేయడుతూ... రెండు మార్గాలను సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోపక్క పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో ఉన్న గణేష్ మండపాల వద్దకు స్వయంగా వెళ్తున్న నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అక్కడి పరిస్థితులు, మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం రాత్రి హుస్సేనిఆలం, కామాటిపుర, మొఘల్‌పురాలో ఆనంద్ పర్యటించారు. తెలుగుతల్లి జంక్షన్ మూసివేతతో.. రాజధానిలో ఎన్ని నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్ ఉన్నప్పటికీ... హుస్సేన్‌సాగర్‌కు ప్రత్యేకత ఉంది. బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులోని విగ్రహాలన్నీ అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా అటు ట్యాంక్‌బండ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్‌వైపు వస్తాయి. అయితే కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలోని రహదారులు, జంక్షన్ల వద్ద కీలక మార్పు చేర్పులు జరిగాయి. తెలుగుతల్లి చౌరస్తా మూసివేతతో పాటు సచివాలయం ముందు కొత్త రోడ్డు అందుబాటులోకి రావడం, ఎన్టీఆర్ మార్గ్‌లో ఫుట్‌పాత్ నిర్మాణాల నేపథ్యంలో ఈ ఏడాది నిమజ్జనం ప్రక్రియలో స్వల్పమార్పు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. తెలుగుతల్లి జంక్షన్ మూసివేత నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా విగ్రహాలతో వచ్చే లారీలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి... ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద యూ టర్న్ తీసుకుని ట్యాంక్‌బండ్ వైపు రానున్నాయి. ఫార్ములా ఈ–రేసింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బారికేడ్లను ట్రాఫిక్ అధికారులు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పీవీఎన్ఆర్ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా పక్కన ఓ నిమజ్జనం ఘాట్ నిర్మించిన అధికారులు అక్కడ అదనంగా మూడు క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. డీసీఎం వాహనాల్లో వచ్చే మధ్య స్థాయి ఎత్తు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు. -
ఓరి.. దుర్మార్గుడా..! చలానాకు భయపడి..
Viral Video: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత హితభోద చేసినా.. వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. తమ జీవితాలతో పాటు తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుంటారు. ప్రయాణించే ముందే హెల్మెట్, సరైన ద్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అవేవీ లేకుండా రోడ్లపై వాహనాలను నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చలానా తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన పని తన లవర్ కిందపడిపోయేలా చేసింది. ఓ యువకుడు తన ప్రేమికురాలితో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేశాడు. అంతలోనే అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్ పెంచేసి సిగ్నల్‌ను దాటేయబోయాడు. అంతే వెనక ఉన్న యువతి అమాంతం కిందపడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు. लड़की को breakup में देर नहीं करनी चाहिए ऐसे बहुत आयेंगे जाएँगे यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका बीच सड़क बाइक से उतार दिया pic.twitter.com/BkUdzNq4Ls — Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 14, 2023 అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ అమ్మాయిని పైకి లేపి ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఆనంద్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రాఫిక్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని సూచనలు చేశారు. ఓరి దుర్మార్గుడా..! లవర్ కంటే చలానానే ఎక్కువై పోయిందా అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: Indian Laws: ఆ వెసలుబాటు పురుషులకు లేదు.. అమ్మాయిల్ని దత్తత తీసుకోలేరు -
నేరం నాది కాదు సార్..!
విజయనగరం క్రైమ్: పెండింగ్‌లో ఉన్న పాత ఈ చలానాల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ గురువారం చేపట్టగా ఒక మోటార్ సైకిల్‌పై 93 ఈ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. ఆ వాహనదారు వేరే వ్యక్తి నుంచి వాహనం కొనుగోలు చేసే సమయంలో గతంలో పెండింగ్‌లో ఉన్న ఈచలానాల గురించి తనకు తెలియదని చెప్పడంతో వాహనాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు పాత వాహనాలు కొనుగోలు చేసే సమంయలో రికార్డులను పరిశీలించుకోవడంతో పాటు, ఆ వాహనంపై పెండింగ్‌లో ఉన్న ఈ చలానాల గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. అలా తెలుసుకోకుంటే పెండింగ్‌లో ఉన్న ఈ చలానాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత యజమానిపైనే ఉంటుందన్నారు. ఈ చలానాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల వాహనాలపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే సమయంలో పోలీసులు చేపట్టే తనిఖీల్లో ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో పెండింగ్ ఈ చలనాలను పరిశీలించి, చలానాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టడంతో 163 మంది వాహనదారులు పాత ఈ చలానాలను చెల్లించారని డీఎస్పీ వివరించారు. స్పెషల్ డ్రైవ్‌లో ట్రాఫిక్ ఎస్సైలు లోవరాజు, రాజు, త్రినాథరావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు మరో షాక్ తగిలింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అధికారులు బుధవారం రూ.500 జరిమానా విధించారు. ఇప్పటికే ఖరీదైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుని లోకల్ టాక్స్ చెల్లించకపోవడంతో కేసులను ఎదుర్కొన్నారు. గత ఏడాది నవంబరులో తన కారు అద్దాలకు నలుపు రంగు కవరును అంటించిన కారణంగా రూ.500 జరిమానా కూడా చెల్లించారు. అయితే విజయ్‌కు మరోసారి ఫైన్ విధించారన్న వార్తల్లో నిజం లేదని దళపతి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే ఈ వార్తలపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. విజయ్ కారు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించలేదని ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలవుతోంది. ఆవీడియో చూస్తే విజయ్‌కు ఫైన్ విధించారన్న వార్త అవాస్తమని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆ వీడియోను షేర్ చేస్తూ అలాంటి వార్తలు రాసిన వారిపై మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. హీరో విజయ్ తన కారులో రోడ్డుపై వెళ్తు ఉండగా.. ఓ చోట సిగ్నల్ పడటంతో కారు ఆగిపోయింది. అది కూడా జీబ్రా క్రాసింగ్ అవతలే కారు నిలిచింది. గ్రీన్‌సిగ్నల్ పడిన తర్వాతే విజయ్ కారు ముందుకు కదిలింది. ఈ దృశ్యాలను విజయ్ ఫ్యాన్స్‌తో పాటు కొంతమంది మీడియా సభ్యులు కూడా వీడియో తీశారు. ఆ వీడియోలో విజయ్ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో కలిసి ‘లియో’ సినిమా చేస్తున్నాడు. కాగా విజయ్ రాజకీయ ప్రవేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ.. ఆయనకు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: సీనియర్ నిర్మాత కన్నుమూత) (ఇది చదవండి: అర్ధరాత్రి తమిళుల ఊచకోత.. అసలేంటి 'వైట్ వ్యాన్ స్టోరీ'!) Please listen the audio properly.. You can understand the media politics #ThalapathyVijay pic.twitter.com/cRCO24B3zE — Vijay For Tamilnadu (@VijayForTN) July 12, 2023 -
మీ ప్రేయసి మీ హృదయంలో ఉండాలి... బైక్ నెంబర్ ప్లేట్‌పై కాదు...
కర్ణాటక: నీ ప్రేయసి హృదయంలో ఉండాలి వాహన నెంబర్ ప్లేట్‌పై కాదని హుబ్లీ ధార్వాడ నగర పోలీసులు చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి తన వాహన నెంబర్ ప్లేట్‌పై నెంబర్ నమోదు చేయకుండా ఉన్నందుకు బైక్‌ను స్వాఽ దీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు కోర్టు నోటీసు జారీ చేసి చర్యలు తీసుకున్నారు. తన బైక్ నెంబర్ ప్లేట్‌పై నా ప్రేయసి అని రాసుకొన్న బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు గమనించారు. ప్లేట్‌పైనా నమోదు సంఖ్య బదులుగా ఈ విధంగా రాయడంతో ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని కోర్టు నోటీసును జారీ చేశారు. అలాగే నెంబర్ ప్లేట్ వేయించి బైక్ వాహకుడికి చట్టంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ధార్వాడా ట్రాఫిక్ పోలీసులు మీ ప్రేయసి మీ హృదయంలోఉండాలి కాని బైక్ నెంబర్ ప్లేట్‌పై కాదని హితవు చెప్పారు. -
ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై రోడ్డు కుంగిపోయిన సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. కనీసం నాలుగు గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై పరుగులు తీశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పెద్దగా ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. #WATCH | A large portion of road caved in Delhi's Janakpuri area this morning. No injuries were reported. pic.twitter.com/otjQitTJix — ANI (@ANI) July 5, 2023 అంతకుముందు మే 3న ఢిల్లీ ఖురేజీ ఖాస్ కేవ్స్ వద్ద, మార్చి 31న ప్రెస్ ఎన్ క్లేవ్ రహదారిపై హౌజ్ రాణి రెడ్ లైట్ ప్రాంతం వద్ద కూడా ఇదేవిధంగా రోడ్లు కుంగిపోయిన సంఘటనలు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోనే మూడుసార్లు రోడ్లు కుంగిపోయిన సంఘటనలు ఢిల్లీ అధికారులను కలవర పెడుతున్నాయి. ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
తమిళనాడు: నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ సీఐ జ్ఞానతి హెచ్చరించారు. తిరుత్తణిలోని చిత్తూరు రోడ్డు, చైన్నె బైపాస్, అరక్కోణం రోడ్డు సహా ప్రధాన మార్గాల్లో ట్రాపిక్ సీఐ జ్ఞానతి ఆధ్వర్యంలో ట్రాపిక్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించడంతో పాటు 18 ఏళ్లు లోబడిన వారు వాహనాలు నడపరాదని, ద్విచక్రవాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో సెల్ఫోన్లలో మాట్లాడడం నేరమని అందుకు జరిమానాతో పాటు శిక్ష పడుతుందని హెచ్చరించారు. -
చలాన్లు కట్టమన్నారని..
శంషాబాద్: ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఓ వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపి చల్లాన్లు కట్టమని చెప్పడంతో ఆగ్రహానికి లోనైన అతను వాహనానికి నిప్పు పెట్టేందుకు యత్నించిన సంఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక కిషన్‌గూడ ఫ్లై ఓవర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తొండుపల్లి వైపు నుంచి యాక్టీవాపై వస్తున్న ఫసీయుద్దీన్ ఆపారు. వాహనంపై మొత్తం 28 చలాన్లు ఉండగా మొత్తం రూ.9150 జరిమానా చెల్లించాల్సి ఉంది. జరిమానా చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో ఆగ్రహానికి లోనైన అతను వెంటనే పెట్రోలు ట్యాంక్ తెరిచి అందులో అగ్గిపుల్ల వేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. ట్రాఫిక్ పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించిన అతడిపై ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనంపై త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్ తదితర అనేక ఉల్లంఘనలు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. -
రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ.235 జరిమానా
కరీంనగర్‌క్రైం: రూపాయి నోటుకు బిర్యానీ వస్తుందని ఆశపడి వెళ్లిన వారికి రూ.100 నుంచి రూ.235 వరకు జరిమానా పడింది. కరీంనగర్‌లోని తెలంగాణచౌక్ సమీపంలో కొత్తగా ప్రారంభించిన ఒక బిర్యానీసెంటర్ నిర్వాహకులు శుక్రవారం రూపాయి నోటు ఇచ్చిన వారికి బి ర్యానీ ఇస్తామని ప్రచారం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని కూడా సూచించారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో జనం రూపాయి నోటుకు బిర్యానీ కోసం ఎగబడ్డారు. అరగంటలో 800లకు పైగా బి ర్యానీ ప్యాకెట్లను కొనుగోలు చేసేశారు. చాలామందికి బిర్యానీ లభించకపోవడంతో హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి బిర్యానీసెంటర్ను మూసివేయించడంతోపాటు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వందమంది వాహనాలకు రూ.100 నుంచి రూ.235వరకు జరిమానా విధించారు. దీంతో కొందరు బిర్యానీ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
మైనర్ తప్పు.. మేజర్ ముప్పు
పటాన్చెరు టౌన్: తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. వారిపై అతి ప్రేమతో బైక్‌లు, కార్ల ఇస్తున్నారు. వాటిని నడుపుతుంటూ అది చూసి సంబరపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా పిల్లలను కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే వాహనాలు ఇచ్చి వారిని ప్రమాదాలల్లోకి నెడుతున్నారు. పట్టణ, మండల ప్రాంతాల్లో 4, 5 ప్రమాదాల్లో ఒకటి మైనర్ల డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు సమచారం. ● ప్రస్తుతం పిల్లలు వాహనాలు నడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్తున్న వారి మాట వినకుండా ద్విచక్ర వాహనాలను తీసుకొని రహదారుల పైకి వస్తున్నారు. ● మరికొందరు స్వయంగా తమ పిల్లలకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పోల్చుకుంటే, పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ కేసులను ఎక్కువగా నమోదయ్యాయి. ● సైకిల్ నడపాల్సిన వయస్సులో పిల్లలు ద్విచక్ర వాహనాలపై స్కూళ్లకు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి దుకాణాల్లో సరుకులు తేవాలని పంపుతున్నారు. మరికొందరి తమ పిల్లలు వాహనం నడుపుతున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా ఇవ్వడం తప్పని తెలిసే తప్పు చేస్తున్నారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్ వివరాలు... జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో రూ.6 వేలు జరిమానా విధించారు. పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 313 మైనర్ డ్రైవింగ్ కేసులకు రూ.1,56,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి వాహనాలు నడపాలంటే 18 సంవత్సరాల పైబడి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. గంటకు 25 కిలోమీటర్ కంటే వేగంగా వెళ్లలేని వాహనాలకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 26 కిలో మీటర్ల కంటే ఒక్క కిలోమీటర్ వేగంగా వెళ్లినా ఎలక్ట్రిక్ వాహనాలైనా రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. – రాజా మహమ్మద్, ఎంవీఐ తల్లిదండ్రులే బాధ్యత వహించాలి మైనర్లు వాహనాలు నడపరాదు. మొదటిసారి తనిఖీల్లో పట్టుబడితే వారికి జరిమానా విధించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే వారు ప్రమాదంబారినపడే విధంగా ప్రోత్సహించడం సరికాదు. వాహనం ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి. – ప్రవీణ్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ -
నడిరోడ్డుపై హిజ్రాతో పూజలు.. ఎస్ఐ తీరు చూసి షాక్‌లో ప్రయాణీకులు!
చెన్నై: రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు చనిపోతే.. పోలీసులు ఏం చేస్తారు?. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటారు. హెచ్చరికల బోర్డులు అక్కడ పెడతారు. కానీ, ఓ పోలీసు అధికారి మాత్రం దుష్టశక్తుల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి.. వినూత్నంగా ఆలోచించాడు. మూఢ నమ్మకంతో ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు చేయించాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, అధికారులు సదరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నైలోని వనాగారం, మధురవాయల్ సమీపంలోని రహదారిలో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎస్ఐ పళని సొంత నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఒక హిజ్రాను పోలీస్ వాహనంలో అక్కడకు రప్పించాడు. ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డు ప్రాంతంలో పూజలు చేయించాడు. ఆ హిజ్రా గుమ్మడికాయ, నిమ్మకాయలతో ఆ రోడ్డుకు దిష్టి తీసింది. అనంతరం వాటిని నేలకేసి కొట్టింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కపిల్ కుమార్ శరత్కర్ స్పందించారు. ట్రాఫిక్ ఎస్ఐ పళనిని ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు కంట్రోల్ రూమ్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కపిల్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు అయి ఉండి తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన వ్యక్తిగత నమ్మకంతో అలా రోడ్డుపై పూజలు చేయడం కరెక్ట్ కాదు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి నివారణకు చర్యలు చేపట్టాలి. దుష్టశక్తిని తరిమే పేరుతో ఇలాంటి పూజలు చేయడం సరికాదని పేర్కొన్నారు. అతడిపై చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. Cops break pumpkin on Chennai road to ward off evil; SI booted outhttps://t.co/Rl3XEZHFOf pic.twitter.com/dBDmoKqq4W — TOIChennai (@TOIChennai) June 10, 2023 ఇది కూడా చదవండి: దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత.. -
జంక్షన్ క్లోజ్.. ట్రాఫిక్ జామ్
బంజారాహిల్స్: ట్రాఫిక్ సజావుగా సాగేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాలకు తెరలేపారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు సిగ్నళ్ల వద్ద జంక్షన్లను మూసివేయడంతో పాటు యూ టర్న్‌లను కొనసాగిస్తున్నారు. అదే పంథాను ఇప్పుడు బంజారాహిల్స్‌లో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ఎంతో కీలకమైన సాగర్ సొసైటీ సిగ్నల్ జంక్షన్‌ను అధికారులు మంగళవారం మూడు గంటల పాటు మూసివేశారు. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ట్రయల్ రన్‌గా ఈ జంక్షన్‌ను మూసివేసి వాహనాల రాకపోకలను ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పాటు బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ నరసింహ రాజు పరిశీలించారు. నాన్ పీక్ హవర్స్‌లో వాహనాల రాకపోకలు జంక్షన్ మూసివేత వల్ల ఎంత వరకు ఒత్తిడి పెరుగుతుంది, తగ్గుతుంది అనేది పరిశీలించారు. అయితే ఈ మూడు గంటల్లో రద్దీ లేని సమయాలు కాబట్టి వాహనాలు ముందుకు సాగాయని ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. టీవీ9 జంక్షన్ నుంచి సాగర్ సొసైటీ వైపు వెళ్లే వాహనదారులు కేబీఆర్ పార్కు చౌరస్తాలో యూ టర్న్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అప్పటికే కేబీఆర్ పార్కు చౌరస్తాలో వందల సంఖ్యలో బారులు తీరిన వాహనాలకు తోడు ఈ వాహనాలు కూడా కలిపి చుక్కలు కనిపించాయి. ఇక కేబీఆర్ పార్కు వైపు సాగర్ సొసైటీ వైపు నుంచి వచ్చే వాహనాలు టీవీ 9 చౌరస్తాలో యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇది కూడా వాహనదారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డు విస్తరించకుండా ఫుట్‌పాత్‌లు లేకుండా చేస్తున్న ఈ ట్రయల్ రన్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు తమకు తోచినట్లుగా ప్రయోగాలు చేస్తూ వాహనదారులపై రుద్దుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 ట్రాఫిక్ మళ్లింపులతో చుట్టూ తిరిగి వస్తున్న వాహనదారులు ఒక వైపు అసహనం వ్యక్తం చేస్తుండగానే తాజాగా సాగర్ సొసైటీ చౌరస్తాలో మరో ప్రయోగానికి తెరలేపి గందరగోళం సృష్టించారు. ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాల్లో ఉండి నియంత్రిస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని, అందుకు విరుద్ధంగా జంక్షన్లు మూసివేసి మీ దారిన మీరు పోండి అనే విధంగా ప్రయోగాలు చేస్తుండటంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ సొసైటీ జంక్షన్ మూసివేత విఫల ప్రయోగమని మొదటి రోజే తేటతెల్లమైంది. -
తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం కారణాల వద్ద స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని, డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు, సలహాలు ఇచ్చే విదంగా చర్యలు చేపట్టామన్నారు. ఇక ఘాట్ రోడ్డులో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామని, ఘాట్ రోడ్డులో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే, ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య అన్నారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
బండి మాకొద్దు బాబోయ్..!
నిబంధనలు ఉల్లంఘించి జరిమానాకు గురవుతున్న వాహనదారులు తమ వాహనాలను స్టేషన్లలోనే వదిలేస్తున్నారు. ఫైన్లు పెద్దమొత్తంలో ఉండడంతో వాటిని చెల్లించలేక సతమతం అవుతున్నారు. దీంతో సీజ్ చేసిన వాహనాలతో రాజధాని చైన్నెలోని పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి. సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి, మద్యం మత్తులో వాహనం నడిపి పట్టుబడ్డ వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పెద్దమొత్తంలో ఫైన్లు విధిస్తున్నారు. దీంతో జరిమానాలు చెల్లించలేక తమ వాహనాలను వదులు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలు పోలీసు స్టేషన్లకు పరిమితమై తుప్పు బడుతుండడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 371 వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల దూకుడు.. చైన్నెతో పాటు ఇతర నగరాల్లో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువే. ఇలాంటి వారి భరతం పట్టే రీతిలో ట్రాఫిక్ పోలీసులు దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపే వారు కొందరు అయితే, ట్రిబుల్ రైటింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు మరికొందరు. సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారు కూడా ఎక్కువే. వీరితోపాటు రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారికీ పోలీసులు జరిమానాల మోత మోగిస్తున్నారు. తాజాగా మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రావడంతో జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలూ మరింత కఠినతరం అయ్యాయి. గత ఏడాదిన్నర కాలంగా చైన్నెలోనే కాదు రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలలో ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకుండా ముందుకు సాగే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకెళ్తున్నారు. జరిమానాలు చెల్లించలేక.. ట్రాఫిక్ నిబంధనల్ని పదే పదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులుగా ఉండే వాహన చోదకులు, మందు బాంబులకు రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత ఆధారంగా ఈ చెలాన్లపై అధిక దృష్టి పెడుతున్నారు. వాహనాలను సీజ్ చేయడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు లేదా కోర్టుల్లో వాటి యజమానులు జరిమానా చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులే కాదు, నేర విభాగం పోలీసులు సైతం జరిమానాల వడ్డనలో బిజీగానే ఉన్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ జరిమానాలు చెల్లించ లేక అనేక మంది తమ వాహనాలను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక వేగం, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి రూ. 10 వేలు జరిమానా విధిస్తుండడంతో వాటిని చెల్లించే పరిస్థితి లేక వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దే వదలి పెట్టి వెళ్తున్నారు. పోలీసులు తమను పట్టుకున్న చోటే వాహనం వదిలి ఉడాయించే వారూ ఉన్నారు. ఇక, రూ. 10 వేలు కూడా విలువ చేయని తమ వాహనానికి ఎందుకు అంత భారీస్థాయిలో జరిమానా కట్టాలన్నట్లు.. వాహనం మీరే ఉంచుకోండి అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. తుప్పు పడుతున్న వాహనాలు గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలకు చెందిన యజమానులు జరిమానా చెల్లించక పోవడంతో ఆ వాహనాలన్నీ పోలీసు స్టేషన్ల బయట, పోలీసులకు సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో పార్క్ చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 43 కోట్ల వరకు జరిమానా విధించారు. ఇందులో రూ. 16 కోట్లు మాత్రమే వసూళ్లైంది. జరిమానా చెల్లించిన వారి వాహనాలను తిరిగి అప్పగిస్తున్నారు. చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న మిగిలిన వారి వాహనాలు పోలీస్ స్టేషన్ల సమీపంలో రోడ్ల మీద తప్పుబట్టే విధంగా పడి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వాళ్లే ఉన్నట్టు పరిశీలనలో తేలింది. ఇక సీజ్ చేసిన వాటిలో 371 వాహనాలను వేలం వేయాలని చైన్నెలోని పోలీసు అధికారులు తాజాగా నిర్ణయించారు. -
కొడుకు జల్సా రైడ్లు.. పెండింగ్ చలాన్లతో తండ్రి ఆత్మహత్య
వరంగల్: ట్రాఫిక్ చలాన్లు కట్టలేదని పోలీసులు వాహనాన్ని పట్టుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. తన తండ్రి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని కుమారుడు సూర్య హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(54) నగరంలోని ఓ బట్టల షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మల్లారెడ్డిపల్లి నుంచి బైక్‌పై వరంగల్‌కు వెళ్లి విధులు నిర్వహించి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆ బైక్‌పై 9 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు నమోదయ్యాయి. ఈ నెల 21న ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా చూడగా చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో వాటిని కట్టి బైక్ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతె అతను మల్లారెడ్డిపల్లికి ఆటోలో వెళ్లాడు. వాహనం లేకపోవడం వల్ల విధులకు వెళ్లలేనని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు వచ్చి రూ.3వేలు ఇచ్చి వెళ్లారని బంధువులు ఆరోపించారు. -
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు
నిప్పులుగక్కే ఎండల్లో నిలబడి ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇచ్చేందుకు అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. గంట చార్జింగ్ పెడితే ఎనిమిది గంటలపాటు ఏసీ హెల్మెట్ పనిచేస్తుంది. రూ.13 వేలు విలువజేసే ఈ హెల్మెట్లను హైదరాబాద్ నుంచి తెప్పించనున్నారు. ముందుగా ఏసీ హెల్మెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేందుకు డీఐజీ, ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వెంకటేశ్‌నాయక్ అనంతపురం క్లాక్‌టవర్ వద్ద బుధవారం ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులకు స్వయంగా ఏసీ హెల్మెట్లు ధరింపజేశారు. హెల్మెట్ పెట్టుకున్నపుడు తలకు చల్లగా ఉందని, సౌకర్యవంతంగా ఉందని సిబ్బంది తెలిపారు. త్వరలోనే అవసరమైనన్ని హెల్మెట్లు తెప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. –అనంతపురం శ్రీకంఠంసర్కిల్ -
ఫొటోలు తీయడమే కర్తవ్యమన్నట్లుగా.. ఏంది సారూ ఇది!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో ట్రాఫిక్ నియంత్రణకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లా పోలీసులు ట్రాఫిక్ ని యంత్రణలో తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫి క్ నియంత్రణ సక్రమంగా నిర్వహించకపోగా పోలీసులే ట్రా ఫిక్ సమస్యలు సృష్టించే పరిస్థితి నడుస్తోంది. ప్రతి కూ డలిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ మాత్రం నియంత్రణలో ఉండడం లేదు. పట్టపగలు భారీ వాహనాలు వెళ్తున్నా పట్టింపులేదు. ట్రాఫిక్ చలాన్ల ఫొటోలు తీయడం లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ సమయంలోనైనా, ఏ పోలీసు కానిస్టేబుల్ అయినా ఫొటోలు తీయడమే తమ కర్త వ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ కనిపిస్తుండడం గమనార్హం. ఇక పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సంబంధించి పోలీసులు పలు చోట్ల తిష్ట వేసి తనిఖీలు చేస్తుండడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫొటోలు తీసి, చలాన్లు వేసి, అందుకు సంబంధించిన జరిమానాలు వసూళ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుండడం విశేషం. ఇదిలా ఉండగా మరోవైపు బార్ షాపుల వద్ద కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో ఉండి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. ► ట్రాఫిక్ చలాన్లు పంపే విషయంలో ఒక విధానం లేకుండా పోయింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన గ్లామర్ బైక్ కలిగి ఉన్న ఒక వ్యక్తికి హెల్మెట్ ధరించనందుకు చలాన్ విధించినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఈ ఫొటో తీసింది మాత్రం హన్మకొండ జిల్లా కాజీపేటలో కావడం గమనార్హం. అది కూడా షైన్ బైక్ కావడం విశేషం. అసలు హన్మకొండకు వెళ్లని బైక్‌కు జరిమానా రావడం విడ్డూరం. పోలీసు శాఖ తప్పిదం అయినప్పటికీ చలాన్ మొత్తం చెల్లించాలని జిల్లా పోలీసులు చెబుతుండడం చిత్రంగా ఉంది. చెప్పుకుంటూ పోతే ఇలా ఇష్టం వచ్చినట్లు చలాన్లు వేసిన కేసులు కోకొల్లలు.కాగా ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు వసూలు చేసే విషయంలో పోలీసులు కొందరు వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తి స్తుండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. -
4,293 వాహనాలకు ఒకే ట్రాఫిక్ పోలీస్.. బాగా వెనకబడిన తెలంగాణ?
రాష్ట్రంలోని ట్రాఫిక్ విభాగాలను మానవ వనరుల కొరత వేధిస్తోంది. చాలీచాలని సిబ్బందితో వాహనాల నియంత్రణకు అధికారులు తంటాలు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి పోలీసు పోస్టులకు బదులు హోంగార్డులను వినియోగించుకోవడం మొదలెట్టారు. కానీ వాటిలోనూ వందల సంఖ్యలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ట్రాఫిక్ సిబ్బంది అంశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బాగా వెనకబడి ఉందన్న విమర్శలు ఉన్నాయి. 2022 నాటి ఆర్టీఏ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1,51,13,129 వాహనాలు ఉన్నాయి. బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ) నివేదిక ప్రకారం అన్ని స్థాయిల్లోని ట్రాఫిక్ పోలీసుల సంఖ్య 3,520 మాత్రమే. అంటే రాష్ట్రంలో ప్రతి 4,293 వాహనాల నియంత్రణకు ఒకే ట్రాఫిక్ పోలీసు ఉన్నట్టు స్పష్టమవుతోంది. వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్నా.. రాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2019లో వాహ నాల సంఖ్య 1,33,22,334 కాగా.. 2022 నాటికి 1,51,13,129కి చేరింది. ప్రజా రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, చిన్నకార్లు వంటివాటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇలా రోడ్లపై పెరిగిన వాహనాల నియంత్రణపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. ♦ ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ట్రాఫిక్ సిబ్బంది సంఖ్య తక్కువ. ఉన్న సిబ్బందితోనే అధిక సమయం పని చేయిస్తున్న పరిస్థితి. షిఫ్ట్‌లు, వీక్లీ ఆఫ్‌లు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జంక్షన్లలో వేళాపాళా లేకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వాయు, ధ్వని కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. ప్ర స్తుతం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న చాలా మందికి శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. ♦ఇతర పోలీసు విభాగాల మాదిరిగా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వారికి డ్యూటీ సమయంలో కొంత విరామం కూడా లభించదు. డ్యూటీలోకి వచ్చింది మొదలు పూర్తయ్యే వరకు నిలబడి, అప్రమత్తంగా ఉండి పనిచేయాల్సిందే. రద్దీ వేళల్లో వారి ఇబ్బంది మరీ ఎక్కువ. ♦ ట్రాఫిక్ ఉన్నతాధికారులు గత ఐదారేళ్లలో వివిధ రకా లైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. స్పాట్ చలాన్లకు బదులు పూర్తిస్థాయిలో ఈ–చలాన్లను అమలు చేస్తూ.. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రా«దాన్యం ఇచ్చారు. హెచ్–ట్రిమ్స్ వంటి పథకాలతో సిగ్నల్స్ ఉన్న జంక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవన్నీ సిబ్బంది కొరతతో ఉన్న ట్రాఫిక్ విభాగానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. ♦ ప్రభుత్వం ఇటీవల వేల సంఖ్యలో పోలీసు పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అందులో సింహభాగం హైదరాబాద్‌కు వస్తారని, అవసరమైన సంఖ్యలో ట్రాఫిక్ వింగ్‌కు సిబ్బందిని కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రోత్సాహకంతో పరిస్థితి మెరుగైంది గతంతో పోలిస్తే ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది పరిస్థితి చాలా మెరుగైంది. అప్పట్లో ఈ విభాగాన్ని అప్రాధాన్యమైనదిగా భావించే వారు. కానీ ట్రాఫిక్ వింగ్‌లో పనిచేస్తున్న వారికి 30 శాతం పొల్యూషన్ అలవెన్స్ మంజూరు చేయడంతో పరిస్థితి మారింది. పోస్టింగ్స్ కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ నుంచి ట్రాఫిక్ విభాగానికి గణనీయంగా సిబ్బందిని కేటాయిస్తే ఈ సమస్య తీరుతుంది. – ఆర్వీ నరహరి, ట్రాఫిక్ విభాగం మాజీ అధికారి -
బండి కాదు మొండి ఇది.. సాయంపట్టండి
సిద్దిపేట: డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే వాహనాలు ఏవిధంగా ఉండాలి.. మంచి ఫిట్నెస్తో ఉండాలి.. కానీ, శుక్రవారం డ్రైవింగ్ స్కూల్ వాహనం అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసుల ఎదుటే మొరాయించింది. దీంతో చేసేది ఏమీ లేక ట్రాఫిక్ పోలీసులు వాహనం కొంచెం దూరం వరకు నెట్టి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. ఇది చూసిన పలువురు ఆర్టీఏ అధికారులు ఈ వాహనానికి ఎఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారో అంటూ ముక్కున వెళ్లేశారు. -
రూ.10 వేలు కట్టలేనన్నా.. కనికరించలేదు
సైదాబాద్: ట్రాఫిక్ పోలీసుల ‘చలాన్ల’ వేధింపులు ఒక హమాలీ ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కూలిపని చేసుకునే తాను చలాన్లు కట్టలేనని చెప్పినా ట్రాఫిక్ ఎస్ఐ కనికరించలేదని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు తన బాధను వ్యక్తం చేస్తూ మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరడిగొమ్మ గ్రామానికి చెందిన ఎ.ఎల్లయ్య (45) నగరానికి వలస వచ్చి ఐఎస్‌సదన్ డివిజన్ చింతల్‌బస్తీలో నివసిస్తున్నాడు. అతని భార్య సైదాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. హమాలీ పనిచేసే ఎల్లయ్య ద్విచక్రవాహనంపై మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదివారం రాత్రి భారత్‌గార్డెన్ వద్ద విధులు నిర్వహిస్తున్న మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు అతని వాహనాన్ని తనిఖీ చేసి పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనాన్ని సీజ్ చేశారు. అతను వాహనాన్ని విడిచి పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా చలాన్లు చెల్లించాలని పోలీసులు తెలిపారు. చలాన్లు కట్టడానికి డబ్బులు లేకపోవడంతో మనస్థాపం చెందిన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సైదాబాద్ పోలీసులు అతడి మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మృతుడు రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లకు తెలుపుతూ తన బాధ వ్యక్తం చేశాడు. ‘మీర్‌చౌక్ పోలీసులు రూ.పది వేలు కడితేనే నా బండి ఇస్తామంటున్నారు. కూలిపని చేసుకునే వాడినని బతిమాలినా వారు ఒప్పుకోవడం లేదు.’ అని ఎల్లయ్య సూసైడ్‌నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నాని అందులో పేర్కొన్నాడు. కాగా సైదాబాద్ పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం
-
బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సైని కాలుతో తన్ని
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే యువకుడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎసైను కాలితో తన్నాడు. యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్గా గుర్తించారు. -
ఇక సీపీఆర్లోవిస్తృత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఒకరికి ఒక ట్రాఫిక్ పోలీసు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేసి అతని ప్రాణాలను కాపాడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత ట్రాఫిక్ పోలీసును అభినందించారు. అంతేకాదు.. ఇలాంటి ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల ప్రాణాలు కాపాడటంపై దృష్టి సారించారు. వచ్చే వారం నుంచి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాలు, జిమ్‌లలో ఎంపిక చేసినవారికి, 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా గుండె ఆగి (సడన్ కార్డియాక్ అరెస్ట్) చనిపోతున్న సంఘటనలు పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఏటా గుండె సంబంధిత వ్యాధులతో రెండున్నర లక్షల మంది చనిపోతున్నారు. వీటిల్లో సడన్ కార్డియాక్ అరెస్టు కేసులు కూడా ఉన్నాయి. గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే ఇలాంటివి సంభవించేవి. కానీ ఇప్పుడు యువతీయువకుల్లోనూ సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోతుంది? ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడటం, గుండె కండరం దళసరిగా ఉండటం, కుటుంబీకులకు ఈ రకమైన చరిత్ర ఉండటం, ఒత్తిడి వంటి ఏదో ఒక కారణంతో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే గుండె మొత్తం ఒకేసారి పని చేయడం ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలొదులుతారు. జంక్ ఫుడ్, స్థూలకాయం, ధూమపానం, మితిమీరిన మద్యపానం, మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం కారణంగా ఎలాంటి గుండె వ్యాధి లేనివారు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ బారినపడుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తే కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడే అవకాశం ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్న వారు వెంటనే సీపీఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ సులభంగా చేసేందుకు వీలున్న టెక్నిక్. కానీ అదేమిటో, ఎలా చేయాలో ఏ కొద్దిమందికో తప్ప చాలామందికి తెలియకపోవడం వల్ల బాధితులు కళ్లెదుటే చనిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. బాధితుల్లో 2 నుంచి 5 శాతం మందికే మన దేశంలో సీపీఆర్ అందుతోంది. సీపీఆర్ చేస్తే ఐదుగురిలో ఒకరు బతుకుతారు. మన దేశంలో పెద్ద ఆసుపత్రుల్లో తప్ప చిన్న ఆసుపత్రుల్లోని సిబ్బందికి కూడా సీపీఆర్‌పై సరైన శిక్షణ లేకపోవడం గమనార్హం. తెలంగాణలో 933 పీహెచ్‌సీలు ఉన్నాయి. అలాగే అనేకచోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నా చాలామంది నర్సులు, ఇతర సిబ్బందికి సీపీఆర్ చేయడం తెలియదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీపీఆర్ అంటే.. ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలిపోతే వెంటనే సమీపంలో ఉన్నవారు రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కాలి. అలా 20–30 సార్లు చేయాలి. తర్వాత రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గట్టిగా గాలి ఊదాలి. ఇలా రెండుమూడు సార్లు చేయాలి. దీన్నే సీపీఆర్ అంటారు. ఇలా చేయడంపై శిక్షణ ఇవ్వాలనే ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. సీపీఆర్ వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడే వీలుంటుంది. -
Hyd: సీపీఆర్‌తో పోయే ప్రాణం తిరిగొచ్చింది
హైదరాబాద్ (రాజేంద్రనగర్): రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ గురువారం మధ్యాహ్నం ఆరాంఘర్ చౌరస్తాలో డ్యూటీలో నిమగ్నమై ఉన్నాడు. ఆ పక్కనే ఉన్నట్టుండి కలకలం రేగింది. అక్కడున్న వారంతా గుంపుగా ఒకచోట చేరారు. ఏం జరిగిందోనని రాజశేఖర్ అక్కడికి చేరుకున్నాడు. ఓ వ్యక్తిపై ఫుట్‌పాత్‌పై స్పృహ లేకుండా పడిపోయి ఉండటం గమనించాడు. ఆ వ్యక్తి గుండెపోటు వల్లే కుప్పకూలిపోయాడని అతనికి అర్ధమయ్యింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేశాడు. దీంతో కోలుకున్న వ్యక్తిని వెంటనే 108లో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణం దక్కింది. ఈ సంఘటన టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిసింది. భార్యాపిల్లల్ని చూసి వెళుతుండగా.. బాలాజీ (45) కర్నూలు మార్కెట్ యార్డులో హమాలీగా పని చేస్తున్నాడు. అయితే ఇతని కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ సితార హోటల్ వెనుక బస్తీలో ఉంటోంది. దీంతో బాలాజీ వారానికి ఒక రోజు భార్య, ఇద్దరు పిల్లలను చూసేందుకు నగరానికి వస్తుంటాడు. గురువారం కూడా భార్యా పిల్లలను చూసి మధ్యాహ్నం కర్నూలు వెళ్లేందుకు ఆరాంఘర్ చౌరస్తాకు చేరుకున్నాడు. 3 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నిల్చొని బస్సు కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఫుట్‌పాత్‌పైనే పడిపోయాడు. అయితే రాజశేఖర్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అత్తాపూర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హయత్‌నగర్‌లోని మరో ఆసుపత్రికి బాలాజీని తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫలితం ఇచ్చిన శిక్షణ : 2013 బ్యాచ్‌కు చెందిన పీసీ రాజశేఖర్‌కు గతంలో ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్లో సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చా రు. గుండె నొప్పి వచ్చిన వారికి ఎలా సహాయం చేయాలో నే ర్పించారు. ఇప్పుడదే శిక్షణ బాలాజీ ప్రాణాలు కాపాడింది. అభినందనల వెల్లువ: సీపీఆర్ చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన రాజశేఖర్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అభినందించారు. నగదు బహుమతి కూడా అందించారు. Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents pic.twitter.com/BtPv8tt4ko — Harish Rao Thanneeru (@BRSHarish) February 24, 2023 ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు. pic.twitter.com/vDH3zdd6gm — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 24, 2023 -
బాలరాజుకు సీపీఆర్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
-
ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే?
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. రూల్స్ అతిక్రమించిన వారు ఎంతవారైనా వదిలిపెట్టే సమస్యే లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గోవా నగరంలో ట్రాఫిక్ పోలీసులు 40 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా రహదారులపై నడిచే ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలకు లోబడి ఉండాలి. అలా కాదని మోడిఫైడ్ చేసుకుని రోడ్లమీద తిరిగితే మాత్రం జరిమానాలు భారీగా చెల్లించాల్సి వస్తుంది. గోవాలో సీజ్ చేసిన వాహనాల ఎగ్జాస్ట్ మోడిఫై చేయబడ్డాయి. వాహనంలో కంపెనీ అందించే భాగాలు కాదని కొంతమంది తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. ఇదే వారిని సమస్యల్లోకి నెట్టేస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన బైకులలో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: Pakistan Crisis: చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో) మోడిఫైడ్ చేసిన ఎగ్జాస్ట్ సాధారణ బైకుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఇది ప్రజా రహదారుల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా అన్ని బైకులను సీజ్ చేసినట్లు మార్గోవ్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులలో రాయల్ ఎన్ఫీల్డ్, ఇతర స్పోర్ట్స్ బైకులు ఎక్కువ శబ్దం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కొంతమంది బైక్ ప్రేమికులు తమ వాహనాలను మరింత మాడిఫైడ్ చేసుకోవడం వల్ల ఆ శబ్దం మరింత ఎక్కువవుతుంది. 80 డెసిబుల్స్ మించిన శబ్దాన్ని ఉత్పత్తి చేసే వాహనాలు చట్ట విరుద్ధం. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. -
మత్తు వదలరా.. చెత్త ఎత్తరా.!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన మందుబాబులకు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు వినూత్నమైన శిక్ష వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 52 మందిని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పోలీసులు హాజరు పరిచారు. వారందరితో ఆర్.కె.బీచ్‌లో చెత్తను ఎత్తి బీచ్ శుభ్రం చేయాలని కోర్టు శిక్ష విధించింది. దీంతో మూడో పట్టణ ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ శిక్షను అమలు చేశారు. వారితో బీచ్‌లో చెత్తను ఎత్తించారు. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా విధిస్తారు. కానీ ఇటువంటి శిక్ష విధించటంతో మందుబాబుల మత్తు దిగిపోయింది. ఇప్పటికైనా అలాంటి వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. -
ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఆరోపించారు. శనివారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు. కృష్ణానదీ జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. వర్షాలొస్తే కుంటలు ఉప్పొంగి పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమతున్నాయని, ఈ నేపథ్యంలో జలాశయాలకు మరమ్మతులు చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ బోర్డుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, ఈ పథకం కింద చికిత్సలకు నిధులు పెంచాలని కోరారు. వివి ధ కారణాలతో తొలగించిన హోంగార్డులను మానవీయకోణంలో తిరిగితీసుకోవాలన్నారు. -
షాకింగ్.. ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: కర్ణాటక బెంగళూరు ట్రాఫిక్ ఫోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. చికిత్స కోసం బైక్‌పై ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను ఆపి వేధించారు. పెండింగ్‌లో ఉన్న రూ.5,000 ట్రాఫిక్ చలాన్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బైక్‌ను సీజ్ చేస్తామని బెదిరించారు. తన భార్య డయాబెటిస్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్నామని, పెండింగ్ చలాన్లు తర్వాత కడతామని భర్త వేడుకున్నా ట్రాఫిక్ పోలీసులు కనికరించలేదు. దీంతో చికిత్స కోసం తెచ్చుకున్న రూ.2,000 చెల్లిస్తామని, మిగతా మొత్తం తర్వాత కడతామని దంపతులు విజ్ఞప్తి చేశారు. అయినా ట్రాఫిక్ పోలీసులు మాత్రం జాలి చూపలేదు. మొత్తం రూ.5,000 చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక గత్యంతరం లేదని భావించిన భర్త మిగతా డబ్బు తెచ్చేందుకు ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. అతని కోసం బైక్ వద్దే ఎదురు చూసిన భార్య కాసేపటికే సృహతప్పి పడిపోయింది. ట్రాఫిక్ పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహం చెందిన ఈ దంపతుల కుమారుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అత్యంత కఠినంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బెంగళూరులోని సంగం సర్కిల్లో ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: అదానీ మ్యాజిక్ ఏంటో చెబితే అందరూ కోటీశ్వరులవుతారు కదా..! -
హైదరాబాద్‌లోని ఈ రూట్లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి(జనవరి 30) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్‌రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 6 నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. -
Hyderabad: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్డు పక్కనే అక్రమ పార్కింగ్లు, పుట్‌పాత్‌పైనే చిరు వ్యాపారాలు జోరుగా సాగేవి.. ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే నరకయాతన అయ్యేది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గత రెండు నెలలుగా ఈ అక్రమ పార్కింగ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తుండటంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మేర వాహనాలు తేలికగా రాకపోకలు సాగించే విధంగా ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పదేపదే చెప్పినా పెడచెవిన పెడుతూ రోడ్లపక్కనే బండ్లు పెట్టుకొని హోటళ్లు నడిపిస్తున్న వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమే కాకుండా సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రోడ్లపక్కన అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద నో పార్కింగ్ జోన్లో వాహనాలను లిఫ్ట్ చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు ►దీంతో అపోలో పరిసరాల్లో వాహనం పెడితే పోలీసులు లిఫ్ట్ చేస్తారని చిరు వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తారని భావించిన వీరంతా గత నాలుగు వారాల నుంచి వీటి జోలికి పోవడం లేదు. ►ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతోంది. ►గతంలో రోజుకు రెండు మూడుసార్లు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనాలను తిప్పిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు గంటలో నాలుగైదు సార్లు తిప్పుతుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ►ఇది కేవలం అపోలో ఆస్పత్రికే పరిమితం చేయకుండా స్టార్ ఆస్పత్రి, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, స్టార్ బక్స్, తాజ్‌మహల్ హోటల్, రియాట్ పబ్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, బంజారాహిల్స్ రోడ్ నం.1, బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిలింనగర్‌లకు విస్తరించారు. ►బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు, ఫుట్‌పాత్‌లకు అడ్డంకులు సృష్టిస్తున్న 30 మంది చిరు వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ►మరో వైపు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు ఇష్టానుసారంగా గతంలో వాహనాలు నిలిపేవారు. ► ఇప్పటికే ఈ ఆస్పత్రికి రెడ్‌నోటీసులు జారీ చేశారు. ఆస్పత్రికి వైపు మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని, రెండోవైపు వాహనాలు పార్కింగ్ చేస్తే వీల్ క్లాంప్లు వేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సైతం గత ఐదు వారాల నుంచి అక్రమ పార్కింగ్‌లపై కొరడా ఝులిపిస్తున్నారు. ►రోడ్డుకు రెండువైపులా చిరు వ్యాపారులు రోడ్డును, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఇబ్బందులు కల్గిస్తుండటంతో జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాటు అక్రమ పార్కింగ్‌లకు 80 శాతం వరకు తెరపడింది. ►నిత్యం ఇక్కడి పోలీసులు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనంతో వాహనాలు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న వ్యాపార కేంద్రాలకు ఒక్కదానికి కూడా పార్కింగ్ సౌకర్యం లేదు. ►ఈ రోడ్డులో హోటళ్లు, ఆభరణాల షోరూంలు, బొటిక్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీరందరికీ ఇప్పటికే పలుమార్లు అవగాహన కలిగించి లైన్ దాటితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ► వివాహ భోజనంబు, అంతేరా, స్పైసీ అవెన్యూ, వ్యాక్స్ బేకరీ, బ్రీవ్ 40, సెవన్త్ హెవన్, కేఫ్ కాఫీడే తదితర వ్యాపార సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ►జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రోడ్డు, ఫుట్‌పాత్ అడ్డంకులు న్యూసెన్స్‌కు పాల్పడుతున్న 25 మంది వ్యాపారులపై ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. భారీగా జరిమానాలు విధించారు. పంజగుట్టలో.. ►పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్లు అధికంగా ఉండే సోమాజిగూడ యశోదా ఆస్పత్రి రోడ్డుపై దృష్టి సారించారు. ►ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు సుమారు 25 వాహనాలను స్టేషన్‌కు తరలిస్తున్నారు. ►అక్రమ పార్కింగ్లు చేస్తున్న బైక్‌లను తరలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డులో చిరువ్యాపారులను మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో సహజంగానే రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది. ►ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో పాటు, పంజగుట్ట ప్రధాన రహదారిలోని మెరీడియన్, రెడ్‌రోజ్ హోటల్, రాజ్‌భవన్ రోడ్డులో నిత్యం వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
ఒక్క ప్రమాదం.. ఎన్నో పాఠాలు.. ఆ కాస్త దూరం వెళ్లలేక!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వాహనచోదకులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఆదివారం నాటికీ ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అసలేం జరిగిందంటే... బల్కంపేటకు చెందిన విద్యార్థి యాదగిరి (22) తన ద్విచక్ర వాహనంపై, తన సమీప బంధువు అనిల్‌తో (20) కలిసి ఉప్పల్ నుంచి వస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నాంపల్లి వాసి నవీన్ (31) తన బైక్పైప్రయాణిస్తూ రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నవీన్ వాహనాన్ని యాదగిరి వాహనం ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలూ దాదాపు వంద అడుగులు జారుకుంటూ వెళ్లాయి. దీంతో అనిల్, యాదగిరి తీవ్రంగా గాయపడగా... నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కాస్త దూరం వెళ్లలేక... తన వాహనంపై వస్తున్న నవీన్ ఘటనాస్థలి వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ రాజ్‌భవన్ వైపు వెళ్లాల్సి ఉంది. వేగంగా వస్తున్న అతడు దాన్ని దాటి కాస్త ముందుకు వచ్చేశారు. ఇలా జరిగినప్పుడు కేవలం 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా వరకు వచి్చ, అక్కడ యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంది. ఈ కాస్త దూరం ముందుకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహించిన అతడు తాను ప్రయాణిస్తు మార్గంలోనే రాంగ్ రూట్లో వెనక్కు వచ్చి నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి రాజ్‌భవన్ వైపు వెళ్లే రోడ్డులోకి రావాలని ప్రయత్నించారు. పరిమితికి మించిన వేగం... ఈ ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన పోలీసులు దాన్ని విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో యాదగిరి తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపినట్లు గుర్తించారు. సిటీ రోడ్లలో ఏ సమయంలోనైనా గరిష్టంగా గంటలకు 40 కిమీ వేగం మంచిది కాదు. అయితే ప్రమాద సమయంలో ఈ వాహనం గంటలకు దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వేగమని చెప్తున్నారు. హఠాత్తుగా ఇటు రావడంతో... ఇంత స్పీడుగా వస్తున్న వీరి దృష్టి యూ టర్న్ వద్ద రాజ్‌భవన్ వైపు నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే వాహనాలపై మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం అలానే రావాలి. అయితే నవీన్ అదే రోడ్లో, రాంగ్ రూట్లో వ్యతిరేక దిశలో వచ్చి యూ టర్న్ వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చి రాజ్‌భవన్ వైపు వెళ్లే మార్గంలో ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక నవీన్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ధాటికి ఆ వాహనం పెట్రోల్ ట్యాంక్ వద్ద వంగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. హెల్మెట్ వాడకపోవడంతోనే... ప్రమాదానికి కారణమైన, ప్రమాదానికి గురైన రెండు వాహనాలపై ఉన్న చోదకులూ హెల్మెట్లు ధరించలేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రెండూ 220 సీసీ, 180 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలైనప్పటికీ చోదకులు హెల్మెట్లు ధరించలేదు. చిన్న పాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది వాహనచోదకులకు గుణపాఠం కావాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
Hyderabad: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!
సాక్షి హైదరాబాద్: ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అనే కాన్సెప్ట్ కాదు వీళ్లది. సమాజానికి తమ వంతు సహాయం, బాధ్యతగా వ్యవహరించాలనుకునే గుణం! కార్యాలయాలు, విద్యా సంస్థల పునఃప్రారంభంతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవటంతో నియంత్రణ, క్రమబద్దీకరణలో వీళ్లూ భాగస్వామ్యులవుతున్నారు. వారే ట్రాఫిక్ పోలీసులతో సమానంగా రోడ్ల మీద విధులు నిర్వరిస్తున్న ట్రాఫిక్ వలంటీర్లు! ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు గత తొమ్మిదేళ్లుగా సైబరాబాద్ పరిధిలో మేము సైతం అంటూ ట్రాఫిక్ సేవ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన ట్రాఫిక్ వలంటీర్లను బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా యెదుల తదితరులు పాల్గొన్నారు. 2013 నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 4,500 మంది ట్రాఫిక్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. వలంటీర్లుగా సేవలు అందించాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్లు ఏడీఎట్దిరేట్ఎస్సీఎస్సీ.ఇన్ కు మెయిల్ లేదా 9177283831 నంబరులో సంప్రదించాలి. వలంటీర్లు ఏం చేస్తారంటే... తొలుత సాధారణ ట్రాఫిక్ సమయంలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులకు వలంటీర్లు మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ (డీడీ), ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించి చలాన్లు జారీ చేయించడం, రోడ్డు ప్రమాదాలలో బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో వంటి వాటిల్లో కూడా సహాయం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఈ ట్రాఫిక్ వలంటీర్లు 5,500 గంటలు పని చేశారు. 8,200 ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించారు. వీరిలో 6,100 మంది వాహనదారులకు చలాన్లు జారీ అయ్యాయి. (క్లిక్ చేయండి: మెట్రో స్టేషన్లో బ్యాగులు తారుమారు.. ట్వీట్ చేయడంతో..) ఒత్తిడి తగ్గుతుంది అన్ని వర్గాల ప్రజల నుంచి ట్రాఫిక్ వలంటీర్లకు ఆసక్తిగా కనబర్చటం హర్షణీయం. కొన్ని ఐటీ కంపెనీలైతే వారి సెక్యూరిటీ గార్డులను వలంటీర్లగా నియమిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల రాకపోకల సమయంలో వాళ్లే ఆయా మార్గంలోని ట్రాఫిక్‌ను నియంత్రించుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులపై పని ఒత్తిడి తగ్గుతుంది. – టీ.శ్రీనివాస రావు, డీసీపీ, ట్రాఫిక్ సైబరాబాద్ -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్ కొత్త రూల్స్
-
15 రోజులు.. 1.88కోట్లు.. 30 వేల కేసులు!
సాక్షి, చెన్నై: అమల్లోకి వచ్చిన కొత్త చట్టం మేరకు చెన్నైలో 15 రోజుల్లో రూ.1.88 కోట్లను జరిమానా విధించి, వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వివరాలు.. చెన్నై నగరంలో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. గత నెల ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్రకారు, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారి భరతం పట్టే విధంగా పోలీసులు దూసుకెళ్లారు. హెల్మెట్ ధరించకుంటే, రూ. 1000, ఇన్సూరె న్స్ లేని వాహనాలకు రూ. 2 వేలు అంటూ భారీ జరిమానాలు విధించారు. దీంతో గత పక్షం రోజుల్లోనే చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి 30,699 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి జరిమానా రూపంలో రూ. 1.88 కోట్లు వసూలు చేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అతివేVýæం ప్రమాదకరమని, కుటుంబాన్ని గుర్తెరిగి వాహ నాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. చదవండి: Bear Attack Video: రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి.. -
ప్రూఫ్ ఏంటంటూ నిలదీసిన వాహనదారుడు.... పోలీసుల రియాక్షన్‌తో సైలెంట్
రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మట్ ధరించడం తప్పనిసరి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ధరించకపోతే ట్రాఫిక్ పోలీసలు ఫోటో తీసి చలాన్ పంపించడం వంటివి చేస్తారు. ఇది సర్వసాధారణం. మాములుగా ఎవరైనా చలాన్ చూసుకుని కట్టడం వంటివి చేస్తారు గానీ ఎప్పుడూ జరిగింది ఏంటని ఎవరూ పోలీసులను నిలదీయరు. కానీ ఇక్కడొక వాహనదారుడు మాత్రం ఎవిడెన్స్ కావాలంటూ పోలీసులకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. వివారల్లోకెళ్తే...ఫెలిక్స్రాజ్ అనే వ్యక్తి బెంగళూరు రహదారిపై హెల్మట్ ధరించకుండా స్కూటర్‌పై ప్రయాణించాడు. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతనికి తన బండి, నెంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పంపించి ఫైన్ విదిస్తూ చలాన పంపించారు. దీంతో సదరు వాహనదారుడు ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశిస్తూ..మీరు నా బండి ఫోటో, నెంబర్ ప్లేట్ పంపించారు. కానీ నేను రైడ్ చేస్తున్నట్లు చూపించలేదు. కాబట్టి నేనే రైడ్ చేశాననడానకి ప్రూఫ్ ఏంటని ప్రశ్నించాడు. గతంలో ఇలానే పంపిచారని, జరిమాన చెల్లించానని చెప్పుకొచ్చాడు. మళ్లీ మళ్లీ ఇలా జరిగితే ఊరుకోను. తాను హెల్మట్ లేకుండా ప్రయాణించినట్లు ప్రూఫ్ చూపించండి. అప్పుడే ఫైన్ కడతా లేకపోతే మీరు కేసు అయినా తీసేయండి అని పోలీసులకే సవాలు విసురుతూ ట్వీట్ చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి.... అతగాడు డ్రైవ్ చేస్తున్న ఫోటో తోపాటు ఎప్పుడూ ఏ సమయంలో ఎలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడో వంటి ఆధారాలు, పోటోలతో సహా పోస్ట్ చేశారు. దీంతో సదరు వాహనదారుడు... ఆధారాలు సమర్పించినందుకు ట్రాఫిక్ పోలీసులకు ధన్యావాదాలు. ఇలా ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని సమర్థించుకోవడమే గాక ఫైన్ కట్టేస్తానని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన సంబంధించిన విషయాన్ని వివరిస్తూ ఫోటోలను ట్విట్టర్లో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు సదరు యువకుడి తీరుపై మండిపడటమే గాకుండా హెడ్ ఫోన్స్పెట్టుకుని మరీ వాహనాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది కాబట్టి పోలీసులు మరో నేరం మోపి అరెస్టు చేయాలి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. pic.twitter.com/jRd7FX0KNs — ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 19, 2022 (చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!) -
రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!
నిబంధనలకు అందరికీ వర్తిస్తాయి. అందుకు ఎవరూ అతీతులు కారు అని నిరూపించింది ఇక్కడ జరిగిన ఒక సంఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే...ఇక్కడోక పోలీసు సరైన హెల్మట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీస్‌కి అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై హెల్త్ హెల్మెట్ కేసు బుక్‌చేసి కేసు నమోదు చేశారు ఈ ఘటన బెంగళూరులోని ఆర్టీ నగర్లో చోటు చేసుకుంది. నగర రహదారులపై ఇలా ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. ఇలా గేర్‌లెస్ స్కూటర్ నడుపుతున్నప్పుడూ.. ఆఫ్ హెల్మట్ ధరించడం నేరం. ఈ మేరకు ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ట్విట్టర్లో... ఇలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక పోలీస్‌పై ట్రాఫిక్ పోలీసు కేసు నమోదు చేసి జరిమానా విధించిన విషయాన్ని వివరిస్తూ..ఆ ఘటనకు సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వైరల్ ఫోటోని చూసి పోలీసులు సైతం నిబంధనలను అతిక్రమించడానికి వీల్లేదన్నట్లుగా జరిమానా విధించారంటూ... పలువురు ప్రశంసిస్తే, మరికొంతమంది ఇది స్టేజ్ స్టంట్ కాబోలు లేకపోతే సదరు వ్యక్తి ఫోటోలో ఎలా నవ్వుతున్నాడంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయ నాయకుడి విడుదల...అట్టహాసంగా ఘనస్వాగతం) -
ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదిన యువకుడు.. వీడియో వైరల్..
చండీగఢ్: హర్యానా అంబాల జిల్లాలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తన కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదాడు. అంతటితో ఆగకుండా అతని చొక్కా చింపాడు. అక్టోబర్ 13న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీస్ ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ యువకుడ్ని భటిండాకు చెందిన లావిష్ బత్రాగా గుర్తించారు పోలీసులు. గాయపడ్డ ట్రాఫిక్ పోలీస్.. ఎక్సెంప్టీ సబ్ ఇన్స్పెక్టర్(ఈఎస్ఐ) అశోక్ కుమార్ అని తెలిపారు. A man in Ambala was seen beating up a cop who stopped him for overspeeding. The accused allegedly hit two motorcycles & then tried to flee. He assaulted the victim, ESI Ashok Kumar who also claimed that his uniform tore in the brawl.#ambala #manbeatscop #ashokkumar #lavishbatra pic.twitter.com/FH6n0o6pjS — Mirror Now (@MirrorNow) October 18, 2022 ఘటనకు ముందు రాజ్‌పుర్-అంబాలా రోడ్డులో అశోక్ కుమార్ తనిఖీలు నిర్వహిస్తున్నాడు. రెండు బైక్‌లను ఆపి పత్రాలు పరిశీలిస్తున్నాడు. ఈ సమయంలో ఓ ఎస్యూవీ వేగంగా రావడం చూసి ఆపాడు. అయితే దాన్ని డ్రైవ్ చేస్తున్న యువకుడు వాహనాన్ని నియంత్రించలేక ముందున్న రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీంతో వారు కిందపడి గాయాలపాలయ్యారు. వెంటనే కారులోనుంచి దిగిన యువకుడు ట్రాఫిక్ పోలీస్‌ను చితకబాదడమే గాక అతని దుస్తులు చింపాడు. స్థానికులు అక్కడికి గుంపులుగా రావడంతో భయపడి పారిపోయాడు. ఎస్‌యూవీని రోడ్డుపైనే వదిలిపెట్టాడు. ఈ దృశ్యాలను అక్కడున్నవారు మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అతడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..! -
కారులో ముందు కూర్చున్నా, వెనకాల కూర్చున్నా అది తప్పనిసరి
ముంబై: ఇకపై కారులో ప్రయాణించే వారందరు కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందేనని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. నవంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ నిబంధనను పాటించని వారికి మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం శిక్ష విధిస్తామని హెచ్చరించారు. కారులో ముందు కూర్చున్నా, వెనకాల కూర్చున్నా సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఒకవేళ కార్లలో ప్రయాణికులందరికీ సరిపడా సీటు బెల్టులు లేకపోతే యజమానులు తక్షణమే వాటిని ఏర్పాటు చేసుకోవాలని ముంబై పోలీసులు సూచించారు. కార్లలో ప్రయాణికులందరికీ సీటు బెల్టు తప్పనిసరి అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే ప్రకటించారు. దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన అనంతరం ఈ ప్రకటన చేశారు. కార్లలో సీటు బెల్టు నిబంధన, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో లోపాల వల్లే సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ -
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ లో ఆపరేషన్ రోప్
-
Hyderabad: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు
సాక్షి, హైదరాబాద్: సెల్లార్లనూ వ్యాపారాలకు అద్దెకు ఇచ్చేసి సరైన పార్కింగ్ వసతి లేకుండా సాగుతున్న వాణిజ్య భవనాలపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. బుధవారం నుంచి వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్న అధికారులు పక్షం రోజుల పాటు అవగాహన కల్పించనున్నారు. ఆపై కేవలం అక్రమ పార్కింగ్ చేసిన వాహన చోదకులకే కాదు.. అలాంటి భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారి, దాన్ని అద్దెకు ఇచ్చిన యజమాని పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ► నగరంలోని అనేక వాణిజ్య సముదాయాలు, భవనాలకు సరైన పార్కింగ్ వసతి ఉండట్లేదు. నిర్మాణంలో ఉన్నప్పుడు సెల్లార్‌ను పార్కింగ్ ప్రాంతంగా చూపించి అనుమతి పొందుతున్నారు. ఆపై దాన్ని కూడా అద్దెకు ఇచ్చేయడమో, వ్యాపార, ఇతర అవసరాలకు వాడుకోవడమో చేస్తున్నారు. ఫలితంగా ఆయా భవనాలు, సముదాయాలకు వచ్చే వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాహనాలను రోడ్లపై ఆపాల్సి వస్తోంది. కేవలం వాణిజ్య లావాదేవీలు జరిగే భవనాలే కాదు అనేక ఆస్పత్రులదీ ఇదే తీరు. ఇప్పటి వరకు తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం వాహనచోదకులకే పడుతూ వచ్చింది. రహదారి పైనో, క్యారేజ్ వేలోనో, ఫుట్‌పాత్ మీదో వాహనాన్ని అక్రమంగా పార్క్ చేశారంటూ ట్రాఫిక్ జరిమానా విధించడమో, ఆ వాహనాన్ని టోవింగ్ చేసి మరో చోటకు తరలించడమో చేస్తున్నారు. ► ఈ కారణంగా వస్తువులు ఖరీదు చేయడానికో, సేవలు పొందడానికో వచ్చిన వినియోగదారుడి పైనే భారం పడుతోంది. దీన్ని గమనించిన సిటీ ట్రాఫిక్ విభాగం అధికారులు సమగ్ర విధానం రూపొందించారు. ఈ తరహా ఉల్లంఘనల విషయంలో వాహన చోదకుల కంటే పార్కింగ్ వసతులు కల్పించని, ఉన్న వానిటీ దుర్వినియోగం చేస్తున్న వారి పైనే ఎక్కువ బాధ్యత ఉందని నిర్ణయించారు. దీన్ని అమలులోకి తీసుకువస్తూ ప్రత్యేక డ్రైవ్స్ ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసు బృందాలు పక్షం రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలు, మాల్స్ వద్ద అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాతి నుంచి వాహనచోదకుడితో పాటు సరైన పార్కింగ్ వసతి లేకుండా అద్దెకు ఇస్తే భవన యజమాని, పార్కింగ్‌ను వాణిజ్య అవసరాలకు మార్చేస్తే ఆ వ్యాపారిపై కేసులు నమోదు చేయనున్నారు. (క్లిక్: వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు) -
వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు
బంజారాహిల్స్(హైదరాబాద్): ఏడేళ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే పోలీసులు వాటి చక్రాలకు వీల్ క్లాంప్లు వేసి జరిమానాలు విధించేవారు. ఈ విధానంపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ విధానం నుంచి వైదొలిగారు. తాజాగా వారం రోజులుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల వాహనాలు పార్కింగ్ చేస్తే ఆ వాహనాలకు వీల్ క్లాంప్ వేయడంతో పాటు సదరు వాహనంపై జరిమానా స్టిక్కర్‌ను, ఆ ఏరియాలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారుల నంబర్ వేస్తారు. తగిన జరిమానా చెల్లించిన తర్వాత వాహనాన్ని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలతో.. రోడ్ల పక్కన, షాపుల వద్ద, సినిమా హాళ్ల వద్ద, ఆస్పత్రులు, పార్కులు, నివాసా లు అనే తేడా లేకుండా అక్రమ పార్కింగ్‌లతో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపూ ద్విచక్ర వాహనదారుల నుంచే పెండింగ్ జరిమానాలు వసూలు చేస్తూ కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక నుంచి వీల్‌క్లాంప్ వేసిన కార్ల నుంచి కూడా పెండింగ్ జరిమానాలు వసూలు చేసేందుకు పోలీసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల వద్ద ఆందోళన... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ ప్రాంతాలు ప్రధాన ఆస్పత్రులకు నెలవుగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఆస్పత్రులకు వస్తుంటారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో, సోమాజిగూడ యశోద, బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి పెద్ద ఎత్తున రోగులు వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకొని ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక రోడ్లపక్కన ఖాళీగా ఉన్న స్థలాల్లో పార్కింగ్ చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలుపుతున్న వారిని ఈ తరహా జరిమానాలు, క్లాంప్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగుల కోరుతున్నారు. ఎందుకంటే ఏ ఆస్పత్రికి కూడా సరిపడా పార్కింగ్ సదుపాయాలు లేవు. (క్లిక్: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు) నిత్యం 15 వరకు కేసులు.. అక్రమంగా పార్కింగ్ చేసిన ప్రాంతాలకు ట్రాఫిక్ పోలీసులు వెళ్లి ఆ కార్లకు వీల్ క్లాంప్లు వేస్తూ ఓ స్టిక్కర్ అంటించి దాని మీద సంబంధిత అధికారి ఫోన్ నంబర్ రాస్తున్నారు. పార్కింగ్ చేసిన వాహనదారు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే ఎస్ఐ వెళ్లి వీల్ క్లాంప్ తొలగించి రూ. 600 జరిమానా విధించి పెండింగ్ జరిమానాలు కూడా క్లియర్ చేస్తారు. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు 15 వరకు కేసులు నమోదు చేస్తున్నాం. – జ్ఞానేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, పంజగుట్ట -
హైదరాబాద్‌లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ
సాక్షి, హైదరాబాద్: కోఠి ప్రాంతంలో ఓ మహిళ హంగామా సృష్టించింది. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించింది. కోఠిలోని బ్యాంక్ వీధిలో నో పార్కింగ్ వద్ద మహిళ తన కారు పార్క్ చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె కారు వీల్‌కు తాళం వేసి చలానా విధించారు. ఇది గమనించిన మహిళ కారు వద్దకు వచ్చి.. తన కారుకు లాక్ ఎలా వేస్తారంటూ.. ట్రాఫిక్ పోలీసులపై వాగ్వాదానికి దిగింది. లాక్ తీయాలంటూ ఎస్సై వాకీ టాకీ లాక్కొని హడావిడీ చేసింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కొ పట్టుకొని దుర్భాషలాడింది. అనంతరం సదరు మహిళ ప్రవర్తనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ సుల్తాన్ బజార్ పోలీసులకు పిర్యాదు చేశారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వీడియో: రజినీ స్టైల్లో ట్రాఫిక్ క్లియర్.. రోడ్డుపై ఆయనుంటే సందడే వేరు!
సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు.. చూడగానే నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని వీడియోలు ఆవేదనకు గురిచేస్తాయి. కాగా, ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. వాహనాలను మళ్లించే ఆయన యూనిక్ స్టైల్ చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న సిటీ హార్ట్ ఆసుపత్రి వద్ద హోంగార్డ్ జోగింద్ర కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు వస్తున్న వాహనాలను వినూత్న రీతిలో నియంత్రిస్తున్నాడు. నలువైపుల వస్తున్న వాహనాలను క్లియర్ చేయడానికి ఆయన డ్యాన్స్ చేస్తూ చూపించిన సైగలు హైలెట్ అని చెప్పవచ్చు. #WATCH | Uttarakhand: Jogendra Kumar, a Home Guard deployed as a Traffic Police personnel near City Heart Hospital in Dehradun, controls the vehicular movement of traffic in a unique way. pic.twitter.com/zy2yyrhMio — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2022 ఇలా వినూత్న రీతిలో ఆయన వాహనదారులను మళ్లించడం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. నేను అతడిని ప్రతీరోజూ చూస్తాను. ఆఫీసులకు వెళ్తున్న ఎంతో మందిని ఆయన ఉత్తేజపరుస్తాడు. ఆయనను దేవుడు చల్లాగా చూడాలంటూ కామెంట్స్ చేశాడు. -
‘104’ మృత్యు మార్గాలు.. ఈ రోడ్లు యమడేంజర్ గురూ!
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో 104 మార్గాలు ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. ఈ మార్గాల్లోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రత్యేక బృందం పరిశీలనలో వెలుగు చూసింది. ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టారు. చెన్నై రోడ్లు నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతుంటాయి. ట్రాఫిక్ పోలీసులు అతి వేగంపై దృష్టి పెడుతున్నా, జరిమానాలు విధిస్తున్నా, అతి వేగంగా దూసుకెళ్లే వాళ్లల్లో మాత్రం మార్పు రావడం లేదు. జాతీయ స్థాయి నేర పరిశోధ రికార్డుల మేరకు దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగే జాబితాలో మొదటి మూడు నగరాల్లో చెన్నై కూడా ఉంది. ఆ మేరకు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం నెల రోజుల క్రితం రంగంలోకి దిగింది. ఐపీఎస్ అ«ధికారి వినిత్ మన్కోడో నేతృత్వంలో ఐఐటీ నిపుణులు, చెన్నై కార్పొరేషన్, రహదారుల శాఖ వర్గాలతో కూడిన బృందం గత నెల రోజులుగా చెన్నైలోని రోడ్లపై సుదీర్ఘ పరిశీలన జరిపింది. కమిషనర్ సమాలోచన ఈ బృందం జరిపిన పరిశీలనలో 104 మార్గాలు మృత్యుమార్గాలు, ప్రమాదాలకు నెలవుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్గాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, మరణాలతో పాటు గాయాలపాలయ్యే వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు తేలింది. చిన్న ప్రమాదాలు సైతం పై మార్గాల్లో జరుగుతున్నట్టు తేల్చారు. దీంతో ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చర్యలపై దృష్టి పెట్టారు. శుక్రవారం కమిషనర్ శంకర్ జివ్వాల్‌తో ఈ బృందం సమావేశమైంది. ప్రమాదాలు అధికంగా జరిగే మార్గాల గురించి చర్చించారు. ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కార్యచరణకు సిద్ధమయ్యారు. ఈ విషయంగా కమిషనర్ శంకర్‌జివ్వాల్ మాట్లాడుతూ.. నగరంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. 2021తో పోల్చితే ఈ 8 నెలలు చెన్నైలో ప్రమాదాలు 20 శాతం తక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. అయినా, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ఈ బృందం పేర్కొంటున్న 104 మార్గాల్లో పరిశీలన జరపనున్నామని, ఇక్కడ నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. -
Cyberabad: జంక్షన్లు, యూ టర్న్‌లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్‌లో కొత్తగా యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాంగ్ రూట్లో వెళుతూ.. ‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్లు, జంక్షన్లు, ట్రాఫిక్ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్ డిజైనింగ్‌లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్ రోడ్డు డిజైనింగ్‌లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. ఇప్పటివరకు యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ► ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్ మోటార్స్ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తో కలిసి జంక్షన్‌ను అభివృద్ధి చేశారు. ► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు దగ్గర యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. ► గచ్చిబౌలి జంక్షన్ ఇందిరానగర్ దగ్గర యూటర్న్‌ను ఇచ్చారు. ► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష గ్రేటర్ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్‌పేట హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్‌డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సీఆర్ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. (క్లిక్: విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) -
ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరికింది. గంటలకొద్దీ ట్రాఫిక్జాంలో ఇరుక్కుపోకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ సేవలను సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగేన్వర్, బాలానగర్ డీసీపీ సందీప్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అడిషినల్ డీసీపీ రియాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, ట్రాఫిక్ అడ్మిన్ బీఎన్ఎస్ రెడ్డి, ఐటీ ఇన్స్పెక్టర్ రమేశ్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నవీన్ కుమార్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్ బైక్స్ ప్రత్యేకతలివే: ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ కోసం ఆరు మోటార్ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్‌ఫోర్స్ విధుల్లో ఉంటారు. వీరికి ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారి ఇన్చార్జిగా ఉంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పని చేస్తుంది. ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌కు అందించిన బైక్‌లలో ప్రథమ చికిత్స కిట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్ కెమెరా, షోల్డర్ లైట్, మాన్ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్ జాకెట్, కళ్లద్దాలు, ఎల్ఈబా బాటన్ తదితర వస్తువులు ఉంటాయి. టాస్క్‌ఫోర్స్ ప్యాట్రోలింగ్ ఇక్కడే.. ►మాదాపూర్ నుంచి ఐకియా రౌటరీ– లెమన్ ట్రీ– మైండ్ స్పేస్ ►కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45 – ఐటీసీ కోహినూర్ టాస్క్‌ఫోర్స్ విధులు ఏంటంటే.. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి బైక్‌లకు ఉన్న ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పీఏఎస్) ద్వారా ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్‌ఫోర్స్ బృందాలు పెట్రోలింగ్ తిరుగుతుంటాయి. ట్రాఫిక్ జాంలను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్ చేయడం, నో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి. లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. ఏదైనా చైన్ స్నాచింగ్‌లు జరిగినప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ రాగానే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సహాయం చేస్తారు. ప్యాట్రోలింగ్ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదేని సమస్య వస్తే మీరు దగ్గరుండి సాయం చేస్తారు. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ల ఓవరాక్షన్
-
వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్ సీఐ
-
ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు. -
Viral video: రోడ్డుపై గొడ్డలితో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్!
చండీగఢ్: రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ చేయటం అంత సులభమైన పనేమి కాదు. నిత్యం ఎండలో నిలబడి ట్రాఫిక్ సూచనలు చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. అలా.. రోడ్డుపై గొడ్డలి పట్టుకుని వాహనదారులను బెదిరిస్తూ హల్చల్ చేస్తున్న ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఈ వీడియోలో.. ఓ బైక్‌పై ముగ్గురు యువకులు రాగా.. వారి వైపు గొడ్డలితో దూసుకెళ్లారు పోలీసు. వారిని కాలితో తన్నుతున్నట్లు కనిపిస్తోంది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం, ముగ్గురు ఎక్కటంతో అలా చేసినట్లు తెలుస్తోంది. హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడ్డలి పట్టుకుని బైక్‌పైన ఉన్న వారిని బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ గద్దరించారు. మంగళవారం ఉదయం ఫరిదాబాద్‌లోని బాటా చౌక్‌లో ఈ సంఘటన జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ దర్యాప్తునకు ఆదేశించాం. వీడియోలోని వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఆ గొడ్డలిని వాహనదారుల నుంచి లాక్కున్నట్లు తెలిసింది. నిజానిజాలు వెల్లడైన తర్వాత చర్యలు తీసుకుంటాం.’ అని హర్యానా పోలీస్ ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్ జావూంగా’.. పిల్లాడి హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్ చూడండి! -
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి!.. ట్రాఫిక్ పోలీసులనే తికమక పెట్టాడు
బనశంకరి(బెంగళూరు): జరిమానా చెల్లించకుండా తప్పించుకునేందుకు ఓ ద్విచక్రవాహనదారుడు తన బుల్లెట్ బైక్‌కు ముందు, వెనుక వేర్వేరు నంబర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను బోల్తా కొట్టించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన మరిగౌడ పలు పర్యాయాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో రూ.29 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముందు వైపు ఒక నంబర్, వెనుక వైపు మరో నంబర్ రాయించాడు.దీంతో పలు మార్లు ట్రాఫిక్ పోలీసులు ముందు ఒక నెంబర్ వెనక మరొకటి చూసి చూసి తికమక పడ్డారు. చివరికి ఈనెల 29వ తేదీన మరిగౌడ రాజాజీనగర కూలినగర వంతెన వద్ద సంచరిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 12 వరకు రిమాండ్ విధించారు. చదవండి: నిత్య పెళ్లికొడుకు సతీష్ తెలుగుతమ్ముడే! -
బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని ఫైన్.. చలాన్ ఫోటో వైరల్
తిరువనంతపురం: బైక్‌పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకున్నా ఫైన్ వేయడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ కేరళలోని ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. బైక్‌లో పెట్రోల్ లేకపోతే కూడా ఫైన్ వేస్తారా? ఇలాంటి రూల్ కూడా ఉందా? అని నెటిజన్లు కేరళ ట్రాఫిక్ పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు. బసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో వన్ వే స్ట్రీట్‌లో అపసవ్యదిశగా బండి నడిపాడు. అది చూసి ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపాడు. రూ.250 ఫైన్ కట్టమన్నాడు. అందుకు ఒప్పుకుని అతను చెల్లించాడు. అయితే తీరా ఆఫీస్‌కు వెళ్లాక చలాన్ చూస్తే.. బైక్‌లో సరిపడా పెట్రోల్ లేనందుకు ఫైన్ వేసినట్టుంది. దీంతో అతడు షాక్ అయి చలాన్ ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. భారత మోటారు వాహన చట్టం, కేరళ చట్టంలో బైక్‌లో పెట్రోల్ సరిపడా లేకపోతే ఫైన్ వేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అయితే బస్సు, కారు, వ్యాను, ఆటో వంటి కమర్షియల్ వాహనాలు పెట్రోల్,డీజిల్ సరిపడా లేకుండా ప్రయాణించి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తే రూ.250 ఫైన్ కట్టాలనే నిబంధన కేరళ రవాణా చట్టంలో ఉంది. కానీ ఇది బైక్‌లకు వర్తించదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ అధికారులు రవాణా శాఖకు సూచించారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా.. ఇక వారి ఆటలు సాగవు
బనశంకరి: కర్నాటకలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ ఉల్లంఘనులపై నిఘా కోసం అమర్చిన ఆటోమేటిక్ నంబరు ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా 3 లక్షల 90 వేల పెండింగ్ కేసులను కనిపెట్టారు. అతిక్రమణదారుల నుంచి రూ. 21 కోట్లు జరిమానాలను వసూలు చేశారు. మార్చి నుంచి అమల్లోకి బెంగళూరు నగరంలో అధిక వాహనాల రద్దీ కలిగిన జంక్షన్లు, ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం లేకుండా సంచార వ్యవస్థ నిర్వహణ కోసం ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 చోట్ల ఏఎన్పీఆర్ కెమెరాలు అమర్చారు. అప్పటి నుంచి జూలై 19 వరకు రోజుకు సరాసరి 2,765 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులను గుర్తించారు. చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలు అనేకం దొరికాయి. అలా 3.90 లక్షల పెండింగ్ కేసులను కనిపెట్టారు. ఎలా పనిచేస్తాయంటే అత్యాధునిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తాయి. ఏఎన్పీఆర్ కెమెరాలు అమర్చిన మార్గాల్లో సంచరించే వాహనాల నంబరు ప్లేట్లపై కెమెరాలు నిఘాపెడతాయి. ఆ నంబరుతో వాహనాలు నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే నమోదు చేసి తక్షణం సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మొబైల్‌కు మెసేజ్ పంపుతుంది. దీని ఆధారంగా పోలీసులు సదరు వాహనం దగ్గరికి రాగానే వాహనదారున్ని అడ్డుకుని కేసు రాసి జరిమానా వసూలు చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఏర్పాటు? ఈ కెమెరాలను అమర్చడంతో ట్రాఫిక్ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే తరహా కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలు అమరుస్తున్నారు. ఏఎన్పీఆర్ కెమెరాలు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన, పాత కేసుల ఆచూకీ కనిపెట్టడంతో పాటు చోరీకి గురైన వాహనాలను కనిపెట్టేందుకు సాయపడతాయని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బీఆర్ రవికాంతేగౌడ తెలిపారు. 69 చలానాలతో దొరికాడు సుమారు 69 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడి జరిమానా చెల్లించని బైకిస్టు కోరమంగల 6వ బ్లాక్ 80 ఫీట్ రోడ్డులో అమర్చిన ఏఎన్పీఆర్ కెమెరా సమీపంలో దొరికాడు. అతని గురించి ట్రాఫిక్ పోలీసుల మొబైల్‌కు మెసేజ్ రావడంతో నిఘా వేసి పట్టుకున్నారు. నేను హెల్మెట్ పెట్టుకున్నాను, సక్రమంగా నడుపుతున్నా, ఎందుకు వాహనాన్ని అడ్డుకున్నారని వాగి్వవాదం చేశాడు. అతని వాహన రిజి్రస్టేషన్ నంబరు ఆధారంగా పరిశీలించగా గతంలో 69 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినట్లు నమోదై ఉంది. రూ.34,600 జరిమానాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇది కూడా చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసు.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలను..!
రాయ్‌పుర్: రోడ్డుపై వెళ్తున్న క్రమంలో రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అదే కట్టల కొద్ది డబ్బు దొరికితే ఇంకేమన్నా ఉందా.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తమకు దొరికిన వాటిని ఎంతో నిజాయితీతో తిరిగి ఇచ్చేస్తారు. అలాంటి కోవకే చెందుతారు ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీసు. రోడ్డుపై తనకు రూ.45లక్షలు దొరికితే పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని నవా రాయ్‌పుర్ కయబంధా పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలాంబర్ సిన్హా. మనా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారు జామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. దానిని తెరిచి చూడగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.‘ బ్యాగ్ తెరిచి చూడగా మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కానిస్టేబుల్. ఆ తర్వాత సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బ్యాగ్‌ను అప్పగించారు.’ అని అదనపు ఎస్పీ సుఖ్నాందన్ రాథోడ్ తెలిపారు. రివార్డ్ ప్రకటన.. నోట్ల కట్టలతో బ్యాగు దొరికితే తిరిగి తీసుకొచ్చి తన నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అభినందించారు ఉన్నతాధికారులు. రివార్డ్ ప్రకటించారు. బ్యాగు ఎవరిదనే విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు సివిల్ లైన్స్ పోలీసులు. ఇదీ చదవండి: గ్రీన్ సిగ్నల్ ఫర్ ‘టైగర్’.. నిలిచిపోయిన ట్రాఫిక్.. వీడియో వైరల్ -
ట్రాఫిక్ నిలిపేసి ‘టైగర్’కు గ్రీన్ సిగ్నల్.. నెటిజన్లు ఫిదా!
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిలిపేస్తారు అధికారులు. అయితే.. ఓ పులి రోడ్డు దాటేందుకు ట్రాఫిక్‌కు రెడ్ సిగ్నల్ ఇచ్చి.. కేవలం పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పులి రోడ్డు దాటేందుకు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఆ తర్వాత పులి దర్జాగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీన్ కశ్వాన్ శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘గ్రీన్ సిగ్నల్ ఓన్లీ ఫర్ టైగర్’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ప్రధాన రహదారిపై రెండు వైపులా ట్రాఫిక్ నిలిపేసిన పోలీసు.. నిశబ్దంగా ఉండాలని సూచించారు. అప్పుడే పొదల్లోంచి ఓ పులి బయటకు వచ్చింది. దర్జాగా రోడ్డు దాటి మరోవైపు.. అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న వాహనదారులు టైగర్ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 1.1 లక్షల మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు ఆశ్చర్యానికి గురికాగా.. కొందరు అద్భుతంగా పేర్కొన్నారు. ‘ఇలాంటి సంఘటనలు తరుచుగా విదేశాల్లో చూస్తుంటాం. మార్పు కనిపించటం భారత్‌కు మంచిదే.’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. Green signal only for tiger. These beautiful people. Unknown location. pic.twitter.com/437xG9wuom — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 22, 2022 ఇదీ చూడండి: Tiger In River: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం -
హ్యాట్సాఫ్ సార్! స్వయంగా చేతులతో డ్రైయిన్‌ని క్లీన్ చేసిన ఆఫీసర్: వీడియో వైరల్
చాలామంది అధికారులు సిబ్బంది కోసం ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా ప్రజా సేవ చేసి ప్రజల మనసులను గెలుచుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి చేసి నెటిజనుల మనసులను గెలుచుకున్నాడు. వివరాల్లోకెళ్తే...బెంగుళూరులో భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ వర్షపు నీళ్లతో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. అక్కడ సమీపంలో ఉన్న డ్రెయిన్‌లోకి వాటర్ వెళ్లకుండా చెత్త అడ్డుపడటంలతో నీళ్లన్ని రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో ఒక ట్రాఫిక్ ఆఫీసర్ తానే స్వయంగా తన చేతులతో డ్రైయిన్‌ని క్లీన్ చేసి ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా చేశాడు. ఈ విషయం తెలసుకున్న ఐపీఎస్ దీపాంశు కబ్రా సదరు ట్రాఫిక్ ఆఫీసర్ జగదీష్ రెడ్డిని మెచ్చుకున్నారు. పైగా గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు ముగ్గురు వ్యక్తులు మరణించారని, 75 వాహానాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ విధంగా అందరూ జగదీష్లా ఉద్యోగాన్ని హోదాగా భావించకుండా స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వస్తే ప్రమాదాలు తలెత్తవని ఐపీఎస్ అధికారి అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ట్రాఫిక్ అధికారి కర్తవ్య స్పూర్తిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్లు చేశారు. #Bangaluru ट्रैफिक ऑफिसर #JagdishReddy ने अपने हाथ से नाली के मुहाने पर जमा कचरा साफ किया ताकि सड़क में जमा वर्षाज़ल निकले और आमजनों को दिक्कत ना हो. Commendable work. ये काम उनके Job Role में नहीं आता है, फिर भी ऐसा करना उनकी सेवा भावना व ड्यूटी के प्रति समर्पण दिखलाता है. pic.twitter.com/6Ue0naF3fl — Dipanshu Kabra (@ipskabra) June 20, 2022 (చదవండి: వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే..) -
కార్ల పైనా కన్నేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన పెండింగ్‌లో ఉండిపోయిన ఈ–చలాన్లు క్లియర్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. గతానికి భిన్నంగా కార్ల వంటి తేలికపాటి వాహనాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఫలితంగానే శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు చిక్కింది. నగరంలో ఉన్న వాహనాల్లో 72 శాతం టూ వీలర్లే. తేలికపాటి వాహనాలు 18 శాతం, మరో పది శాతం మిగిలిన కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. గతంలో ట్రాఫిక్ పోలీసుల దృష్టంతా ద్విచక్ర వాహనాల పైనే ఉండేది. వీటినే రోడ్లపై ఆపుతూ పెండింగ్ చలాన్లు వసూలు చేయడానికి ప్రయత్నించే వాళ్లు. తేలికపాటి వాహనాల జోలికి తక్కువగా... హైఎండ్ కార్ల జోలికి అస్సలు పోయేవాళ్లు కాదు. ఈ నేపథ్యంలోనే ఈ వాహనాలపై పెండింగ్ చలాన్లు పెరిగిపోయాయి. ఈ విషయం గుర్తించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, హైఎండ్ కార్లనూ ఆపి తనిఖీలు చేయాలని, పెండింగ్‌లో చలాన్లు ఉంటే కట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసుల వీటిపై దృష్టి పెట్టారు. పెండింగ్ చలాన్లు వసూలుతో పాటు చలాన్ల విధింపులోనూ ఈ కేటగిరీలకు చెందిన వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శనివారం ఒక్క రోజే ట్రాఫిక్ విభాగం అధికారులు 1745 వాహనాలపై చలాన్లు విధించారు. వీటిలో ద్విచక్ర వాహనాలు 943, త్రిచక్ర వాహనాలు 108, తేలికపాటి వాహనాలు 688 ఉన్నాయి. మిగినవి ఇతర రకాలకు చెందిన వాహనాలు. వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు తమ వద్ద ఉన్న ట్యాబ్స్ ద్వారా డేటాబేస్‌లో వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లను సెర్చ్ చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఆ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉండే ఆ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తోంది. సదరు వాహనచోదకుడు ఆ మొత్తం క్లియర్ చేసే వరకు వాహనాన్ని లేదా «ధ్రువీకరణ పత్రాలన పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గడువు ఇచ్చి చార్జ్‌షీట్ దాఖలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో అన్ని రకాలైన వాహనాలకు సమప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలు, యువతులు, కుటుంబాలతో ప్రయాణిస్తున్న వారి వాహనాల వివరాలను తనిఖీ చేసినప్పుడు వారికి కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నాం. ఇలాంటి వారి వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే కట్టాలని ఒత్తిడి చేయట్లేదు. వాటిని క్లియర్ చేసుకోవడానికి గరిష్టంగా 72 గంటల సమయం ఇస్తున్నాం. ఆ గడువు తర్వాత క్లియర్ చేయని వాహనాలపై న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: సికింద్రాబాద్ విధ్వంసంలో 46 మంది అరెస్ట్.. వారి వల్లే ఇలా జరిగింది) -
27 నిమిషాలు.. 23.4 కిలోమీటర్లు.. జెట్ స్పీడ్‌లో దూసుకొచ్చారు!
సాక్షి,సంతోష్‌నగర్(హైదరాబాద్): హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సమయన్వయంతో శుక్రవారం అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి నుంచి లైవ్ ఆర్గాన్ (ఊపిరితిత్తులు)ను రవాణా చేసే సౌకర్యాన్ని కల్పించారు. గ్రీన్ చానల్ (ట్రాఫిక్ పోలీసుల) సహకారంతో శుక్రవారం అవయవదానం జరిగింది. వివరాల ప్రకారం.. బడంగ్పేట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అతడిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో డీఆర్డీఓ అపోలో ఆసుపత్రి వారు కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఊపిరితిత్తులతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి ఎల్బీనగర్, ఉప్పల్ మీదుగా బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి మధ్యాహ్నం 12.12 గంటలకు తరలించారు. అపోలో ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 23.4 కిలో మీటర్ల దూరానికి కేవలం 27 నిమిషాల్లో చేరుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు ఆసుపత్రుల నిర్వాహకులు అభినందించారు. చదవండి: హనీట్రాప్‌లో డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి -
ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డెలివరీ బాయ్ అంటే అంత చులకనా..?
నేను పోలీసును.. నేనేం చేసిన ఎవరూ అడ్డుచెప్పరు.. అనే అహంకారంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై అనుచితంగా ప్రవర్తించాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌ను దారుణంగా కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సింగనల్లూరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఓ స్కూల్‌కు చెందిన బస్సు డ్రెవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి.. బైక్‌లను, పాదచారులను ఢీకొట్టబోయాడు. ఈ క్రమంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మోహన సుందరం.. బస్సును ఆపి డ్రైవర్‌ను నిలదీశాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ట్రాఫిక్ జామ్ అవడంతో ఒక్కసారిగా ఆవేశం తెచ్చుకున్న సతీష్.. ఏం జరిగింది అని కూడా అడగకుండా.. డెలివరీ బాయ్ చెంపపై పదే పదే కొట్టాడు. అనంతరం అతడి సెల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సతీష్.. మోహన సుందరాన్ని తిడుతూ ఆ స్కూల్ బస్సు ఓనర్ ఎవరో తెలుసా అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను కోయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు. "This happened yesterday evening at the fun mall signal and there was a slight traffic block due to this delivery boy and all of a sudden this Cop Started beating up the Delivery person " . #welovecovai . 👉 IG : FB :TW @WELOVECOVAI .#coimbatore #delivery #deliveryboy #traffic pic.twitter.com/OBEwmghc1R — We Love Covai ❤️ (@welovecovai) June 4, 2022 ఇది కూడా చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్‌పై దుమారం -
చలానా జాప్యం ప్రాణం తీసింది
జనగామ/యాదగిరిగుట్ట రూరల్: పాత చలానా చెల్లింపులో అరగంట ఆలస్యం మూడునెలల చిన్నారిని బలిగొంది. కారులో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును చూసినా ఖాకీల మనసు కరగలేదు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వదిలేస్తామన్న పోలీసుల అమానవీయవైఖరి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం జరిగింది. జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు మూడునెలల క్రితం బాబు జన్మించాడు. కొద్దిరోజుల క్రితం సరస్వతి తన కొడుకును తీసుకుని ఇదే మండలం వెంకిర్యాలలోని తల్లిగారింటికి వచ్చింది. ఈ క్రమంలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వెంటనే తల్లిదండ్రులు ఓ అద్దె కారును తీసుకుని బాబుతోసహా బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఆ కారును ఆపారు. కారుకు సంబంధించి వెయ్యి రూపాయల పెండింగ్ చలానా ఉన్నట్లు ఆన్లైన్లో గుర్తించారు. పోలీసులు వెంటనే డ్రైవర్ వద్ద ఉన్న ఒరిజినల్ లైసెన్స్ తీసుకుని, చలానా కట్టిన తర్వాత కారు తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి తీసుకెళ్తున్నామన్నా కనికరించలేదు ‘సారూ.. బాబును ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం.. ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు.. ప్లీజ్ వదిలి పెట్టండి’అని ఆ తల్లిదండ్రులు ఎంతసేపు బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు. కారు ఓనర్‌కు డ్రైవర్ ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడించాడు. చలానా వెంటనే చెల్లిస్తానని అతడు వేడుకోవడంతో కారును వదిలిపెట్టారు. అప్పటికే అరగంట గడిచిపోయింది. ఆ తర్వాత నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన గారాల పట్టి ఇక లేడంటూ బోరున విలపించింది. ఏడాదిన్నర క్రితం కూడా ఆమెకు ఓ బాబు పుట్టిన రెండు నెలల తర్వాత చనిపోయాడు. రెండో కుమా రుడు కూడా పోలీసుల నిర్లక్ష్యం మూలంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో ఊరు ఊరంతా కన్నీటిపర్యంతమైంది. కాగా, ఆస్పత్రికి ఎమర్జెన్సీగా వెళ్తున్నామని మాకు ఎవరూ చెప్పలేదని, వాహనం లోపల బాబు సీరియస్‌గా ఉన్నాడని తెలిస్తే తాము అలా చేయమని ట్రాఫిక్ సీఐ సైదయ్య అన్నారు. -
హైదరాబాద్‌లో బ్లాక్ స్పాట్స్‌పై ట్రాఫిక్ పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే బ్లాక్ స్పాట్స్‌తో పాటు బ్లాక్‌స్ట్రెచ్‌లపైనా దృష్టి పెట్టారు. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు సూచించడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. మరోపక్క బడి పిల్లల భద్రత కోసం ఆధునిక స్కూల్ జోన్స్ ఏర్పాటు చేయడానికీ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీసీపీ– 1 ఎన్.ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా స్ట్రెచ్‌లు... ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్ స్పాట్స్ గుర్తించడానికి కేంద్రం అధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) మార్గదర్శకాలను అనుసరిస్తారు. వీటి ప్రకారం గడిచిన మూడేళ్ల కాలంలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్న 50 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. వీటితో పాటు స్థానిక పరిస్థితులను బట్టి రోడ్డు ప్రమాదాలకు కారణమైన బ్లాక్ స్ట్రెచ్‌లను సిటీ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇవి కనిష్టంగా కి.మీ. నుంచి గరిష్టంగా రెండు కి.మీ. వరకు ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్, స్ట్రెచ్‌ల్లో పరిస్థితులు మార్చడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రత్యేక బృందం కారణాలు, నివారణ మార్గాలను సూచిస్తోంది. వీటిని ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను) తొలిదశలో పదకొండు ప్రాంతాల్లో పరిశీలన.. ట్రాఫిక్– బిట్స్ పిలానీ అధికారులు, నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం తొలి దశలో నగరంలోని పదకొండు కీలక ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ టీమ్ తాడ్‌బండ్ గ్రేవ్ యార్డ్, డెయిరీ ఫాం, టి జంక్షన్, బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, సంగీత్ చౌరస్తా, చిలకలగూడ ఎక్స్‌రోడ్స్, రైల్ నిలయం, ఆలుగడ్డబావి, మెట్టుగూడ చౌరస్తా, రైల్వే డిగ్రీ కాలేజ్, ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడి పరిస్థితులపై ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించిన మ్యాప్స్ సాయంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణులు అధ్యయనం చేశారు. పాఠశాలల పునఃప్రారంభం లోపు... నగరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు బడి పిల్లల భద్రతకు ఉద్దేశించిన ఆధునిక స్కూల్స్ జోన్స్‌ను సిద్ధం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. రద్దీ, పాఠశాల ఉన్న ప్రాంతం తదితరాలను పరిగణనలోని తీసుకుని ఏఏ స్కూళ్ల వద్ద ఇవి ఏర్పాటు చేయాలన్నది నిర్ణయించనున్నారు. ప్రయోగాత్మకంగా నార్త్‌జోన్‌లో ఒకటి, సెంట్రల్ జోన్లో ఒకటి, వెస్ట్‌జోన్‌లో రెండు పాఠశాలలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. (క్లిక్: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!) -
ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు జరిమానా, డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్
కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి కార్లను తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింస్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా చాలా మంది సెలబ్రిటీల కార్లకి చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి కూడా జరిమానా విధించారు. మంగళవారం సుల్తాన్ బజార్ బ్యంక్ స్ట్రీట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఆయన కారుకు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చలానా విధించారు. చదవండి: హిందీ బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చిన కరణ్ జోహార్ ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణా స్పందించిన తీరు అందరిని షాక్‌కు గురి చేస్తోంది. తప్పు తనదేనని, నెంబర్ ప్లేట్ సరి చేసుకుంటానని ఆయన పోలీసులు వివరణ ఇచ్చారు. అనంతరం ఈ మండుటెండల్లో సైతం బాధ్యతగా విధులు నిర్వహిస్తోన్న ట్రాఫీక్ పోలీసులను డైరెక్టర్ అభినందించారు. కాగా టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన కామెడీ సినిమాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ జోనర్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్‌గా, నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా, రైటర్‌గా కూడా ఆయన మల్టీ టాలెంట్ చూపించారు. ఇక కొంతకాలంగా దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం బిగ్‌బాస్ సోహైల్ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1601343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్‌పై సంతోష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ట్రాఫిక్‌లో అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్ కుమార్ అడ్డుకున్నాడు. సంతోష్ అనే వ్యక్తి కారుదిగి నా కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో టూటౌన్ పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (కాలేజీ బస్సు డ్రైవర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..) -
Hyderabad: మీ వాహనంపై 3 చలాన్ల కంటే ఎక్కువ ఉన్నాయా.. ఇక అంతే!
సాక్షి, హైదరాబాద్: 46 రోజుల పాటు అందుబాటులో ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రిబేట్ అవకాశాన్ని మీరు వినియోగించుకోలేదా? మీ వాహనంపై మూడు కంటే ఎక్కువ చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయా? అయితే ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా సరే నడి రోడ్డు మీదే మీ వాహనాన్ని ఆపేస్తారు. అక్కడికక్కడే పెండింగ్ చలాన్ సొమ్ము చెల్లిస్తేనే వాహనాన్ని వదిలిపెడతారు. ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత నెల 1 నుంచి ఈనెల 15 తేదీ వరకూ అందించిన ట్రాఫిక్ చలాన్ల ఈ–లోక్ అదాలత్‌ను వినియోగించుకోని వాహనదారుల ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా పెండింగ్ చలాన్ల డిస్కౌంట్లను రాచకొండ పరిధిలో వాహనదారులు బాగానే వినియోగించుకున్నారు. 46 రోజుల ఆఫర్ సమయంలో 30,63,496 వాహనదారులు చలాన్లను క్లియర్ చేయగా.. వీటి ద్వారా రూ.31,67,79,643 పెండింగ్ సొమ్ము వసూలు అయింది. ప్రస్తుతం మల్కాజ్గిరి, ఎల్బీనగర్, భువనగిరి మూడు జోన్లలో కలిపి 10 లక్షల వాహనాల చలాన్లు, రూ.100 కోట్లు సొమ్ము పెండింగ్‌లో ఉన్నాయి. 3 చలాన్ల ఉన్న వాహనాలు లక్ష.. పెండింగ్ చలాన్లపై రిబేట్ తర్వాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉన్న వాహనాలు లక్ష వరకున్నాయి. వీటికి సంబంధించి రూ.50 కోట్ల చలాన్ సొమ్ము పెండింగ్‌లో ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ప్రభాస్‌పై ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్
హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారంటూ వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అసలు విషయం బయటికి వచ్చింది. నిజానికి అది ప్రబాస్ కారు కాదంట. ఈ మేరకు ప్రభాస్ పీఆర్ టీం స్పష్టతనిచ్చింది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో ప్రభాస్ కారుకి పోలీసులు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి, ప్రభాస్‌కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తున్నాం. దయచేసి గమనించగలరు అని పీఆర్ టీం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఫేక్ న్యూస్‌పై ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. దీంతో రూమర్స్‌కి చెక్పెట్టినట్లయ్యింది. కాగా సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ త్వరలోనే భారత్‌కు రానున్నారు. అనంతరం ఆయన సలార్ షూటింగ్లో పాల్గొంటారు. చదవండి: పెళ్లిపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
హీరో నాగచైతన్య కారుకు పోలీసుల జరిమానా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు పోలీసులు జరిమానా విధించారు. చై కారుకు బ్లాక్ ఫిలిం ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం అతడి వాహనాన్ని ఆపి రూ.700 జరిమానా విధించారు. ఆ సమయంలో నాగచైతన్య కారులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్ములను తొలగించి మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద వారికి రూ.700 చొప్పున చలాన్లు విధించిన విషయం తెలిసిందే! వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తూ కారు అద్దాలకు టింటెడ్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తూ అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను తొలగిస్తున్నారు. చదవండి: మిత్ర శర్మ నాకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది: స్రవంతి ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ -
హఠాత్తుగా వాహనం దిగి.. హోంగార్డును అభినందించి.
సాక్షి, హైదరాబాద్: అది ఎల్బీ స్టేడియం పక్కన ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం చౌరస్తా... రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ఖాన్ విధుల్లో ఉన్నారు. ఉదయం 9.20 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వాహనం ఆ దారిలో వెళ్తోంది. హఠాత్తుగా సీజే తన వాహనాన్ని స్లో చేయించి అలీని దగ్గరకు పిలిచారు. వాహనం నుంచి కిందికి దిగిన జస్టిస్ సతీశ్‌చంద్ర.. అలీని ‘వెల్డన్ ఆఫీసర్’ అంటూ అభినందించి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో అలీఖాన్‌తోపాటు అక్కడున్న వాళ్లూ ఆశ్చర్యపోయారు. విజయ్‌నగర్ కాలనీకి చెందిన అష్రఫ్ 24 ఏళ్ల క్రితం హోంగార్డుగా అడుగుపెట్టారు. రెండున్నరేళ్లుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలీ నిత్యం బీజేఆర్ స్టాట్యూ చౌరస్తాలోని పాయింట్లో డ్యూటీ చేస్తుంటారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాకపోకలు సాగించేది ఈ చౌరస్తా మీదుగానే. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్‌చానల్ ఇస్తుంటారు. సీజే ప్రయాణించే సమయంలో, ఆ మార్గంలో మిగిలిన వాహనాలను ఆపి, ఆయన వాహనాన్ని ముందుకు పంపిస్తారు. బీజేఆర్ స్టాట్యూ వద్ద అలీ ఒక్క రోజు కూడా చిన్న ఇబ్బందీ రానీయలేదు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న అలీని కొన్నాళ్లుగా గమనిస్తున్న సీజే శుక్రవారం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. హోంగార్డు అలీ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా సీజే స్థాయి వారిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది సీజే నా వద్దకు వచ్చి అభినందించడంతో షాకయ్యా’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీజే ఇచ్చిన స్ఫూర్తిని అలీ జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటారని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్టిట్టర్లో పేర్కొన్నారు. -
హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే లైసెన్స్ రద్దు!
న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తే మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తాం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వీడియోని ముంబై పోలీసులు పోస్ట్ చేశారు కూడా. ఆ వీడియోలో ...."హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్ని వెంటనే ఆర్టీవోకి పంపతాం. దీంతో మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా జరిమాన కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి సమీపంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ పంపిస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం." అని డీసీపీ రాజ్ తిలక్ రోషన్ పేర్కొన్నారు. అలాగే ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడూ హారన్లు మోగించకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరైన గనుక ఇలా హారన్ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్ టైం వెయిటింగ్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదీగాక ముంబై ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరాల్లో ఒకటి. పైగా ముంబై వాసులు రెడ్ సిగ్నల్ వద్ద కూడా హారన్లు వేయడంతో శబ్దకాలుష్యం ఎక్కువ అతుతోందని, దీన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమీషనర్ మధుకర్ పాండే అన్నారు. (చదవండి: రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్) -
కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్‌సింగ్.. వైరల్
సాక్షి,కరీంనగర్‌క్రైం: మలయాళ నటుడు ఫహాద్ పాసిల్ పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పేరుతో పోలీస్ క్యారెక్టర్ చేశారు. కరీంనగర్లో అచ్చు ఆయనలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నారు. దీంతో ఆయనతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ఈ విషయం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో ఘటనలో.. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం సాక్షి,కరీంనగర్: నాణ్యమైన విద్యనందించడమే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ నిర్వన్ బిర్లా అన్నారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ట్రినిటి విద్యాసంస్థల అధినేత దాసరి ప్రశాంత్ రెడ్డిచే స్థాపించబడిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను బుధవారం ఆయన ప్రార ంభించారు. ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో నాణ్యమైన విద్యనందించడాని కి కరీంనగర్‌కు బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రమోటర్ బీవోఎంఐఎస్ డాక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ వీబీఎస్సీ ఎలమంచిలి సందీప్, డైరెక్టర్ ఆఫ్ సౌత్ మాస్టర్ బీవోఎంఐఎస్ ఎల్బీ నగర్ విష్ణువర్దన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ భవిత విశ్వచేతన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్చ్.. వీళ్లింతే.! -
సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ తొలగింపు
-
తాగేసి కారు పైకి ఎక్కి హంగామా... ఊహించని ట్విస్ట్!
Ghaziabad Traffic Police has fined a car owner: ఇటీవలకాలంలో సోషల్ మాధ్యమాల్లో స్టార్డమ్ కోసమో లేక ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకో కొన్ని విచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. అవి ఒకోసారి ప్రాణాంతకంగా మారడమో లేక పోలీసులు ఆగ్రహానికి గురై కటకటాల పాలవడమో జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఘజియాబాద్‌లోని రద్దీగా ఉండే ఢిల్లీ మీరట్ ఎక్క్‌ప్రెస్ హైవేలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారు పై డ్యాన్స్ చేశారు. అయితే ఆ కారుని ఒక వ్యక్తి నడుపుతుండగా ..మరో వ్యక్తి ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో మోహిత్ గుర్జార్ అనే ఒక సోషల్ మీడియా వినియోగ దారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ వాహనాన్ని మారుతి సుజికి ఎర్టిగా గుర్తించారు. వీడియోలో కనిపిస్తున్న నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహన యజమాని పై ట్రాఫిక్ పోలీసులు సుమారు రూ. 20 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో బులంద్‌షహర్ రోడ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి 8 గం.ల సమయంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకుగానూ అతని వాహన రిజిస్ట్రేషన్‌ని రద్దు చేశారు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు, ఫైన్ వేసిన ఈ చలానా కాపీని కూడా ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Meanwhile in Ghaziabad, a group of boys, visibly drunk, dancing on the roof of their car on the Delhi-Meerut expressway. Hope @ghaziabadpolice makes them dance to their tunes in the lockup sooner. pic.twitter.com/mJck8JQ4Kh — Prashant Kumar (@scribe_prashant) April 2, 2022 (చదవండి: కోతుల బెడద.. ఆ కటౌట్ చూసి పరిగెత్తాలి డ్యూడ్) -
హీరో మంచు మనోజ్‌కు షాక్
-
డ్రైవింగ్ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్ పోలీస్ కొత్త ఐడియా
సాక్షి,హిమాయత్‌నగర్(హైదరాబాద్): నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఐడియాకు శ్రీకారం చుట్టారు. ఓ పక్క ట్రాఫిక్ కంట్రోలింగ్‌తో పాటు డ్రైవింగ్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తిస్తున్నారు. లైసెన్సు లేకుండా రోడ్డుపైకి రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో పట్టుబడ్డ వారు లైసెన్సుకు అర్హత కలిగిన వారైతే ట్రాఫిక్ పోలీసులే లైసెన్సులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ట్రాఫిక్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ ట్రాఫిక్ కంట్రోలింగ్, సిబ్బంది పనితీరు వంటి వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై చార్జ్‌షీట్ సైతం వేయాలంటూ ఇటీవల ట్రాఫిక్ అధికారులకు రంగనాథ్ సూచించారు. ప్రజల్లో ట్రాఫిక్ విభాగంపై మంచి అభిప్రాయం వచ్చేందుకు సిబ్బంది సహకారం ఎంతో అవసరమని వారికి చెప్పడంతో..చీఫ్ దృష్టిని ఆకర్షించేందుకు నారాయణగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ ఓ కొత్త ఐడియాకు నాంది పలికారు. ఎస్సై ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక.. డ్రైవింగ్ లైసెన్సు కోసం చాలా మంది దళారుల చేతిలో మోసపోతున్నారు. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు పోలీసులే వాటిని జారీ చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పృథ్వీరాజ్ అనే ఎస్సైని ఇన్స్పెక్టర్ కేటాయించారు. డిగ్రీ కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఎలక్ట్రానిక్స్, టీ కొట్లలో పనిచేస్తూ..డ్రైవింగ్ లైసెన్సు లేకుండా ఉన్న వారిని ఎస్సై పృథ్వీరాజ్ గుర్తిస్తున్నారు. వీరికి ముందుగా డ్రైవింగ్ లైసెన్సు జారీకి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను సూచిస్తున్నారు. లోకల్ వ్యక్తి అయితే..అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్..ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే లైసెన్సుకు ఎటువంటి గుర్తింపు ధృవపత్రాలు ఉండాలనే విషయాలను వారికి వివరిస్తారు. ఇప్పటి వరకు సుమారు 30 మందిని ఎంపిక చేశారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు ఎలా ఎంపిక అవ్వాలి, ఎటువంటి ట్రాఫిక్ గుర్తులు ప్రొజెక్టర్‌పై ఉంటాయి, టెస్ట్ ఎలా పాస్ కావాలనే విషయాలను వివరించనున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు అర్హత కూడా పోలీసు స్టేషన్లోనే చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. తాము ఈ తరహా ఐడియాకు శ్రీకారం చుట్టామని దీనిని పరిశీలించి అనుమతి ఇస్తే ఓ అడుగు ముందుకేస్తామంటూ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్‌ను కోరారు. ఆయన సరే అంటే రానున్న రోజుల్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్సులను జారీ అయ్యే అవకాశం ఉంటుంది. -
రోడ్లపై నిలిపివేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
-
Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తే ఇక ఉండవు అంతే..
సాక్షి, హైదరాబాద్: రోడ్లపై రోజుల తరబడి వాహనాలను వదిలేస్తున్నారా..? అయితే మీ వాహనం పోలీస్ స్టేషన్‌కే పరిమితం కానుంది. రోడ్లపై వదిలేసే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఇష్టానుసారం వదిలివెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానాస్పదంగా, నిర్లక్ష్యంగా ఉన్న వందలాది వాహనాలను ట్రాఫిక్ క్రేన్ల ద్వారా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఆ వాహనాలకు సంబంధించి ఎవరూ క్లెయిమ్ చేయకుంటే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని 39బి కింద వేలం వేస్తామని చెప్పారు. రాబోయే కొన్ని రోజులపాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. చదవండి: (బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ) -
బ్లాక్ ఫిలిం ఉంటే బుక్కైపోతారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం కారు అద్దాలకు ఎలాంటి తెరలు ఏర్పాటు చేసినా, అద్దాలకు టింటెడ్ ఫిలింను ఏర్పాటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.ముత్తు హెచ్చరించారు. నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కారు అద్దాలకు టింటెడ్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధించి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను ఆయన తొలగింపజేశారు. కారులో ఎవరు వెళ్తున్నారు, ఎంత మంది వెళ్తున్నారు అనే దృశ్యాలు స్పష్టంగా కనిపించాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంత మంది అవేవి పట్టించుకోకుండా నల్ల తెరలను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా శనివారం 93, ఆదివారం 82 వాహనాలను ఆపి బ్లాక్ ఫిలింలు తొలగింపజేశారు. ఆరు వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండగా వాటిని తొలగించారు. మీడియాకు సంబంధం లేకుండా ఆరు స్కూటర్లకు ప్రెస్ ఆని రాసి ఉందని వాటిని తొలగించామని తెలిపారు. (క్లిక్: ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?) -
ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే
సాక్షి,బళ్లారి: డ్రైవర్ లైసెన్స్, ఇన్సూరెన్స్ సక్రమంగా ఉన్నాయా లేదా, వాహన డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటిస్తున్నారా లేదా అన్న దానిపై నిత్యం ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచి, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడం, అపరాధ రుసుం వసూలు చేయడం పరిపాటి. అయితే అన్ని సక్రమంగా ఉన్నప్పటికి బళ్లారిలో కొందరు ట్రాఫిక్ పోలీసులు ఏదో ఒక తప్పు చూపి వాహనాలు నడిపే వారితో డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన వాహనాలు కనబడితే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. (చదవండి: సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్...పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు ) ఏపీ నుంచి బళ్లారికి వచ్చే వాహనాలను ఆపడంతో ఎంతో కొంత డబ్బులు తీసుకుని వాహనాలు వదులుతున్నారని, డ్రైవర్లు, వాహన యజమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బళ్లారికి అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి పోతుంటారు. బళ్లారి ఏపీఎంసీ మార్కెట్లో పండ్లు, కూరగాయాలు, ఆహార ధాన్యాలు అమ్మకాల సాగించేందుకు ఇక్కడికి వాహనాల్లో వస్తుంటారు. రైతులు తీసుకుని వచ్చిన వాహనాలను సైతం అన్ని రకాలు సక్రమంగా ఉన్నప్పటికి తనిఖీలు చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇక నగరంలోని ప్రధాన రహదాల్లో ఏపీ వాహనాలు కనబడితే చాలు ఆపి ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. -
హైదరాబాద్ లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్
-
Police Warning: ట్రాఫిక్‌లో హారన్ మోగిస్తున్నారా.. తప్పదు భారీ మూల్యం
కోల్కత్తా: రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఉందని.. కదలేకపోతున్నామని.. అసహనంతో అనవసరంగా హారన్ మోగిస్తున్నారా.. ఇలా చేస్తే ఇకపై తప్పదు భారీ మూల్యం. అవసరం లేకున్నా హారన్ మోగించారని 615 మంది వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు రూ. 2 వేలు జరిమానా విధించారు. ఈ ఆసక్తికర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌండ్ పొల్యూషన్‌ను నివారించేందుకు, వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించే ఉద్దేశ్యంతో, యాంటీ-హాంకింగ్ డ్రైవ్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది జూలై నుంచి కోల్కత్తా నగరంలో ప్రత్యేక యాంటీ-హాంకింగ్ డ్రైవ్‌లు చేపడుతున్నట్టు వెల్లడించారు. జూలై నెలలో ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్ వద్ద, ఆసుపత్రుల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా కేవలం 12 రోజుల్లోనే 1,264 వాహనదారులకు జరిమానా విధించినట్టు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన యాంటీ పొల్యూషన్ సెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. తాజగా యాంటీ-హాంకింగ్ డ్రైవ్‌లో భాగంగా ఫిబ్రవరి నెలలో ట్రాఫిక్ పోలీసులు రోజుకు సగటున 22 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అధిక సంఖ్యలో వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తూ హారన్ మోగిస్తుండటం గమనించినట్టు తెలిపారు. దీంతో వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచేందుకే 615 మంది వాహనదారులకు రూ. 2వేల చొప్పున జరిమానా విధించినట్టు ట్రాఫిక్ డీసీ అరిజిత్ సిన్హా పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా లాక్డౌన్ విధించిన సమయంలో ట్రాఫిక్ భారీగా తగ్గిపోయి.. సౌండ్ పొల్యూషన్ తగ్గినట్టు పోలీసులు తెలిపారు. కరోనా రూల్స్ ఎత్తేయడం, సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకోవడంతో మళ్లీ సౌండ్ పొల్యూషన్ పెరుగుతున్నట్టు చెప్పారు. దీంతో వాహనదారులపై ఫోకస్ పెంచినట్టు పోలీసులు వెల్లడించారు. -
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. బంఫర్ ఆఫర్ 30 రోజులే!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 30 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: వాట్సాప్ యూనివర్సిటీ వైద్యం.. వారి సలహాలు వింటే సరి.. లేదంటే ప్రాణాలు హరీ! ) హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఈ-చలాన్ సిస్టమ్ ద్వార పెండింగ్ చలాన్లను చెలించాలని అన్నారు. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గతంలో నో మాస్క చలాన్లు రూ.1000 ఫైన్ ఉండగా, ప్రస్తుతం అవి రాయితీ అనంతరం రూ.100 కడితే సరిపోతుందన్నారు. కాగా దీనిపై నేటి రాత్రిలోపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే అంతే! రెడ్ సిగ్నల్ పడిందో..
సాక్షి, హైదరాబాద్: తాగి వాహనం నడుపుతూ తమతో పాటూ ఇతరుల ప్రాణాలను ముప్పు తెస్తున్న మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. పగటి పూట కూడా మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 24 గంటలూ డ్రంకన్ డ్రైవ్ (డీడీ) టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు డీడీలు చేపట్టనున్నారు. రెడ్ సిగ్నల్ పడగానే.. ఇప్పటివరకు ప్రతి రోజూ సాయంత్రం సమయాల్లో, స్పెషల్ డ్రైవ్‌లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లు చేసేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లు వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) లెవల్ 30 దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఏసీ స్థాయిని బట్టి రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్ట్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. సిగ్నల్ పాయింట్ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్‌తో రెడీగా ఉంటారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. పెండింగ్ డీడీ కేసుల పరిష్కారానికి.. పెండింగ్‌లో ఉన్న డ్రంకన్ డ్రైవ్ (డీడీ) కేసులను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. డీడీలో చిక్కిన మందుబాబులకు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. ప్రస్తుతం తొలిసారి డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబులకు రూ.2,001 జరిమానా చెల్లించే వెసులుబాటును కల్పించారు. కేసులు పెండింగ్‌లో ఉన్న ఎప్పటికైనా ప్రమాదమేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది డీడీ నిందితులు పెండింగ్ జరిమానాను చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో 70 వేలకు పైగా డీడీ కేసులుంటాయని అంచనా. గతేడాది ట్రాఫిక్ చలాన్ల సంఖ్య కమిషనరేట్ ఎంవీ కేసులు డీడీ కేసులు హైదరాబాద్ 70,03,012 25,453 సైబరాబాద్ 53,50,724 34,746 రాచకొండ 22,64,225 8,121 -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
పెండింగ్ చలాన్ వాహనదారులకు భారీ శుభవార్త..!
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఈ-చలాన్లు అందుకుంటూ, ఆర్థిక సమస్యలతో వాటిని కట్టకుండా పెండింగ్‌లో పెట్టిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా పోలీస్‌శాఖ రాయితీలను ప్రకటించింది. రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు, వాహనదారుల ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఉపశమనం కలిగిస్తూ పెండింగ్ చలాన్లలో రాయితీని ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌శాఖ మార్చి 1 నుంచి 30 తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. వాహనదారులకు భారీ స్థాయిలో హైదరాబాద్ పోలీసులు రిబెట్ ప్రకటించారు. ద్విచక్ర వాహనదారుల చలాన్ మొత్తంలో 25 శాతం చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు మిగత 75 శాతాన్ని పోలీస్‌శాఖ మాఫీ చేయనుంది. అంతేకాకుండా కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు హైదరాబాద్ పోలీస్‌శాఖ ఇచ్చింది. ఈ మొత్తాన్ని ఆన్లైన్, మీసేవా, ఆన్లైన్ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మొత్తం రూ.600 కోట్లకు పైగా పెండింగ్ ఛలాన్లు ఉన్నాయి. పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేసేందుకు ఈ కొత్త ప్రతిపాదన పోలీస్‌శాఖ తీసుకొచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్లపై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. చలానాల్లో రాయితీ ఇవ్వడం ద్వారా వాహనదారులు జరిమానాలు చెల్లించే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. (చదవండి: సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!) -
హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్.. ఇకపై ఆ ఆటోలకు ఎంట్రీ లేదు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో నమోదైన ఆటో రిక్షాలను మాత్రమే ఓలా, ఉబెర్‌లలో అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బయటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగరంలో తిరగడానికి అనుమతించబోమన్నారు. ఇతర ప్రాంతాల్లో నమోదైన ఆటోరిక్షాలు ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమై నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, దీంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ ఆటో కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రవాణాశాఖలో టీఎస్ 09 నుంచి టీఎస్ 13 వరకు గ్రేటర్ పరిధిలో నమోదైన ఆటోలను మాత్రమే నడపాలని అధికారులు సూచించారు. ఈ సిరీస్ ఆటోలు మినహాయించి మిగతా సిరీస్‌లో కనిపించే ఆటోలకు అనుమతి ఉండబోదని చెప్పారు. అలాంటి ఆటోలపై జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను కూడా ఓలా, ఉబెర్‌లకు అనుసంధానమై నడిపేందుకు అనుమతించడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. ఏ నిబంధనల మేరకు వాటిని అనుమతించారో స్పష్టం చేయాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. ఇలాంటి ప్రైవేట్ ద్విచక్ర వాహనాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వాహనాల వేగ నియంత్రణపైనా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
ఏయ్.. నేను ఊదనంటే ఊదను.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మందుబాబు
-
కారు, స్కూటీకి ఒకే నంబర్! ఇంతకీ కారు ఎవరిది?
సాక్షి, జోగిపేట(అందోల్): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నిలిపిన కారుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. అనంతరం చలాన్‌ను వాహనం అడ్రస్‌కు పోస్టు చేయగా, అది కారు యజమానికి కాకుండా అదే నంబర్‌తో ఉన్న స్కూటీ యజమానికి చేరిన ఘటన జోగిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జోగిపేటకు చెందిన బండారు మహేశ్ అనే వ్యక్తికి ఈనెల 14న పోస్టు ద్వారా వచ్చిన చలాన్ చూసిన మహేశ్ ఖంగుతిన్నాడు. ఈనెల 12వ తేదిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రోడ్డుపై నిలిపిన టీఎస్ 15 ఎఫ్ఇ 8745 నంబరుగల ఎర్టిగా వాహనానికి పోలీసులు జరిమానా విధించారు. వాహనాన్ని పరిశీలించకుండా చలాన్‌ను స్కూటీ యజమాని అడ్రస్‌కు పోస్టు చేశారు. జరిమానా రశీదు అందుకున్న మహేశ్ వెంటనే జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించగా, చలాన్ పటాన్చెరు పరిధిలో వేసినందున అక్కడికే వెళ్లాలని పోలీసులు సూచించినట్లు తెలిపాడు. ఇంతకీ కారు ఎవరిది? ఒకే నంబరుతో రెండు వాహనాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. స్కూటీకి కూడా ఆర్టీఏ అధికారులు అదే నంబర్ కేటాయించినట్లుగా ఆన్లైన్లో చూపిస్తుంది. కారుకు కూడా అదే నంబరు ఇచ్చారా, లేక కారు యజమాని నంబర్ మార్చాడా అనే విషయం తెలియాల్సి ఉంది. చదవండి: ఎంత జాగ్రత్తపడ్డా.. అడ్డంగా దొరికిపోతారు.. ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి? -
అవన్నీటితో సంబంధం లేదు.. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ...
సాక్షి, నాగోలు: ట్రాఫిక్ పోలీసుల ముఖ్య విధి ట్రాఫిక్‌ను నియంత్రించడం... ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే రంగంలోకి దిగి వాహనాలు సాఫీగా ముందుకు సాగేలా చేయడం... ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకోవడం.. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి కేవలం వాహనదారులకు చలాన్లు విధించడంలోనే బిజీగా ఉంటుండంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►ఎల్బీనగర్ పరిధిలోని వివిధ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులకు చలాన్లు విధించే పనిలోనే ఎప్పుడూ నిమగ్నమై ఉంటున్నారు. ►చౌరస్తాల వద్ద ట్రాఫిక్ జామ్ అయినా.. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిపోయినా తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కానిస్టేబుళ్లు అందరూ పోగై వాహన తనిఖీలు చేపడుతున్నారు. ► రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే కొంత మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అసలు పట్టించుకోవడం లేదు. ►రహదారుల వెంబడి ఉన్న బడా హోటల్ వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాల వైపుకూడా కన్నెత్తి చూడటం లేదు. ►ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు తమ హోటల్‌కు వచ్చే వినియోగదారులు వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ►వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సిబ్బంది నిలబడి చేతిలో కెమెరాలు పట్టుకొని కేవలం హెల్మెట్ లేని వారు, త్రిబుల్ రైడింగ్ చేసేవారికి ఫొటోలు తీస్తున్నారు. ►వీరు రోజూ కనీసం 100 చలాన్లు విధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ►కొన్నిచోట్ల రోడ్లపై వారాంతపు సంతలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ► వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికి చాలన్ విధించడమే పనిగా పెట్టుకున్నారు. ►వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐలతో పాటు కిందస్థాయి సిబ్బంది తమ వెంట తీసుకుని వచ్చిన వాహనలకు పత్రాలు లేని వారి నుంచి పెద్ద ఎత్తున్న డబ్బు వసలు చేస్తున్నారు. ►సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించుకొని వాహనాలను పార్క్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ... ట్రాఫిక్ నియంత్రణ కోసం చౌరస్తాల్లో నియమిస్తున్న ట్రాఫిక్ పోలీసులు విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ నియంత్రణను పక్కకు వదిలేసి చేతిలో కెమెరా.. ట్యాబ్ పట్టుకొని చలాన్లు విధిస్తూ వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు కేవలం ఫొటోలు తీయడమే కాకుండా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలని కోరుతున్నారు. -
వాయుకాలుష్య చక్రబంధంలో ట్రాఫిక్ పోలీస్..
హైదరాబాద్ మహా నగరంలో అర గంట ప్రయాణం చేస్తే చాలు... ‘అబ్బో! ఎంత వాయు కాలుష్యం’ అంటూ గాభరా పడని వాళ్ళుంటారా? ఇంటి నుంచి బయటకొస్తే చెవులు చిల్లులు పడుతున్నాయని ‘ధ్వని కాలుష్యం’ గురించి చెప్పని వాళ్ళుంటారా? కానీ, సిటీ ఈ చివర్నుంచి.. ఆ చివరి వరకూ అడుగుడుగునా కనిపించే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితేమిటి? తెల్లటి షర్ట్‌తో బయటకెళ్ళిన ఆ వ్యక్తి గంటలో నల్లగా మసిబారిపోవడం రోజూ మనం చూస్తున్నదే. కంటికి కన్పించే ఈ నిజం వెనుక కొన్ని కఠోర సత్యాలున్నాయి. వాయు కాలుష్యం వల్ల ట్రాఫిక్ పోలీసుల్లో 32 శాతం మంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారట. ధ్వని కాలుష్యం వల్ల 25 శాతం మంది వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నారట. మరో 7 శాతం మంది సర్వీసులో ఉండగానే తీవ్రమైన దృష్టి లోపానికి గురవుతున్నారట. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్, ఒకప్పటి నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ సీవీ ఆనంద్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన నివేదికలోని పరిశీలనలివి. హైదరాబాద్ లో 3,236 ట్రాఫిక్ పోలీసులు అనుదినం విధుల్లో ఉంటారు. ఇందులో 19 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 77 మంది ఇన్స్పెక్టర్లు, 13 మంది ఏఎస్ఐలు, 172 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 846 మంది కానిస్టేబుళ్ళు, 1276 మంది హోం గార్డులూ ఉన్నారు. సీవీ ఆనంద్ నివేదిక ప్రకారం.. హైదరాబాద్ నగర పరిధిలో 585 ట్రాఫిక్ జంక్షన్లుంటే, ఇందులో చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్, మదీనా, మొజాంజాహి మార్కెట్, లక్డీకాపూల్, సంజీవరెడ్డి నగర్ జంక్షన్లలో అత్యధికంగా వాయు, ధ్వని కాలుష్యం ఉంది. మరో 200 ట్రాఫిక్ జంక్షన్లలో కాలుష్యం మధ్యస్తంగా ఉన్నట్టు గుర్తించారు. రంగారెడ్డి సహా హైదరాబాద్ సిటీ 625 కిలో మీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ 70 లక్షల మంది నివసిస్తుంటే.. వచ్చిపోయే జనాభాను కలుపుకుంటే నగర జన సంచారం కోటి వరకూ ఉంటుంది. ఒకప్పుడు పరిమితంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు అన్ని వైపులా విస్తరించింది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నాయి. హిమాయత్ సాగర్ మొదలు కొని మాదాపూర్, అమీర్‌పేట వరకూ ఐటీ హబ్ ఊహించని విధంగా విస్తరించింది. రవాణాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ప్రజలు ప్రతిరోజూ వెయ్యి వాహనాలు కొంటున్నారు. నగరంలో తిరిగే వాటిల్లో 70 శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. నగరంలో వాహనాలు రోజూ 2.4 మెగా లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి. 50 శాతానికిపైగా వాహనాలు కాలుష్యం వెదజల్లుతున్నాయని తేలింది. పీఎం 10 మైక్రో గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లో కాలుష్యాన్ని కొలుస్తారు. ఇది 60 వరకూ ఉంటే సాధారణంగా భావిస్తారు. కానీ నగరంలో 2008లోనే ఇది 85.684 ఉంటే, 2018 నాటికి 108.75కు చేరింది. 2021 నాటికి ఇది 200కు చేరువలో ఉన్నట్టు నిపుణులు అంటున్నారు. ఇవన్నీ ట్రాఫిక్ పోలీసులను శ్వాసకోశ, ఊపిరితిత్తులు, క్యాన్సర్ బారిన పడేస్తున్నాయని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. – వనం దుర్గాప్రసాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్యం (మైక్రో గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్) ప్రాంతం 2008 2016 2018 బాలానగర్ 107 131 165 జూబ్లిహిల్స్ 50 108 143 శామీర్‌పేట్ 51 73 63 కూకట్పల్లి 85 89 160 సైనిక్‌పురి 59 81 93 రాజేంద్రనగర్ 38 68 61 నాచారం 87 112 124 కేబీఆర్ఎన్ పార్క్ 49 58 104 జూపార్క్ 111 117 182 చదవండి: మరో రెండ్రోజులు చలి! -
'శ్రీవల్లి' పాట పాడిన ట్రాఫిక్ పోలీస్.. అది కూడా మరాఠీ వెర్షన్లో
Pune Police Sings Pushpa Srivalli Song In Marathi Version: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్పరాజ్ అంతకుమించి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాడు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సెలబ్రిటీలు, అభిమానులు సినిమా డైలాగ్‌లు, కవర్ సాంగ్స్‌తో వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాగా హైలెట్ అయిన పాటల్లో 'చూపే బంగారమాయేనా శ్రీవల్లి' సాంగ్ ఒకటి. ఈ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ మరాఠీ భాషలో 'శ్రీవల్లి' పాటకు లిరిక్స్ రాసి స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్రాఫిక్ పోలీస్ పేరు అతీశ్ ఖరాడే. వృత్తిపరంగా అతీశ్ ట్రాఫిక్ పోలీస్ అయినా తనలో మంచి గాయకున్నాడని ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఓవైపు విధులు నిర్వర్తిస్తూ మరోవైపు గాయకుడిగా తానేంటో నిరూపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన హిట్ సాంగ్స్‌ను పాడుతూ తన ఏకే పోలీస్ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రీవల్లి పాటను మరాఠీ వెర్షన్లో పాడి సూపర్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడగానే లైసెన్స్ ఫట్
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను హరించే మందుబాబుల కట్టడికి నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త విధానాలను తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినవారి డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్)లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ)లకు ట్రాఫిక్ పోలీసులు భౌతికంగా లేఖలు పంపించేవారు. కానీ, ఇక నుంచి ఆ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరిగిపోనుంది. ట్రాఫిక్ యాప్‌లో డీఎల్ రద్దు అనే కొత్త ఫీచర్‌ను జోడించారు. దీనిని ఆర్టీఏతో అనుసంధానించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వెంటనే యాప్‌లో డీఎల్ రద్దు ఫీచర్‌ను నొక్కగానే క్షణాల్లో సంబంధిత సమాచారం ఆర్టీఏ అధికారులకు చేరుతుంది. వాళ్లు ఆయా డీఎల్‌ను పరిశీలించి రద్దుచేస్తారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో సమయం ఆదా అవటమే కాకుండా డ్రంకెన్ డ్రైవ్ వాహనదారులకు భయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 255 డీఎల్లు రద్దయ్యాయి. అత్యధికంగా గతేడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9,981 డీఎల్ రద్దులను ఆర్టీఏకు పంపించగా, 215 డీఎల్లు క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్‌లో 25, రాచకొండలో 15 లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఔటర్‌పై డ్రంకెన్ డ్రైవ్‌లు రాష్ట్ర, జాతీయ రహదారులతోపాటు ఓఆర్‌ఆర్‌పైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో ఓఆర్ఆర్పై కూడా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రైవింగ్ స్కూల్ వాహనాలకు ఔటర్ రింగ్ రోడ్‌పైకి అనుమతి లేదు. గతేడాది సైబరాబాద్‌లో 3,989 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 759 మంది మరణించారు. సైబరాబాద్ పరిధిలోకి వచ్చే ఓఆర్ఆర్పై 191 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాచకొండ పరిధిలో జరిగిన 2,529 రోడ్డు ప్రమాదాల్లో 618 మంది చనిపోయారు. గతేడాది రాచకొండ పరిధిలోకి వచ్చే ఔటర్‌పై 41 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 19 మంది మరణించారు. 13 రోడ్డు ప్రమాదాల్లో 50 మందికి గాయాలయ్యాయి. పరిమితవేగాన్ని మించొద్దు ఔటర్‌పై వాహనాలను జాగ్రత్తగా నడపాలి. టోల్‌గేట్స్ వద్ద మంచు ఎక్కువ ఉందని, వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించే ఏర్పాట్లు చేశాం. పరిమిత వేగానికి మించితే లేజర్ గన్‌తో చిత్రీకరించి జరిమానాలు విధిస్తున్నాం. – డి. శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ -
Telangana: ట్రాఫిక్ ఆంక్షలు: అలా చేస్తే 10వేలు ఫైన్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప మిగితా వాహనాలకు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి1 ఉదయం 5గంటల వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ రూట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇక రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు.. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లు(1, 2), మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్టీయూ ఫ్లైఓవర్, రోడ్డు నెం. 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు వంతెన, బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్) మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. డిసెంబర్ 31న విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్‌లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్లు రైడ్‌కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే క్యాబ్ ఆటో ఓనర్లపై మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 కింద రూ.500 పెనాల్టీ విధిస్తామని చెప్పారు. పబ్లిక్ వద్ద అధిక డబ్బు డిమాండ్ చేస్తూ మిస్‌బిహేవ్ చేయవద్దని అన్నారు. పబ్‌లో తాగి బయటకి వెళ్లే కస్టమర్ తాగి వాహనం నడపకుండా పబ్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. అడుగడుగున డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే వాహనాలు జప్తు కూడా చేస్తామని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపితే డ్రైవర్, వాహన యజమాని ఇద్దరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. వాహన నంబర్ ప్లేటులు లేకుండా, వాహనంలో అధిక శబ్ధాలతో ప్రయాణిస్తే బండి సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో అధిక జనాభా, వాహనం మీద కూర్చోని ప్రయాణించడం, పబ్లిక్ స్థలంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగి వాహనం నడిపితే మొదటిసారి దొరికితే రూ.10వేల జరిమాన లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండో సారి పట్టుబడితే రూ.15 ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ చిన్నారిని బలి తీసుకోగా.. ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడటానికి కారణమైంది. ఈ ప్రాంతం ప్రమాదాలు ఎక్కువగా జరిగే మార్గాల జాబితాలో, పాదచారులకు రెడ్జోన్గానూ ఉంది. ట్యాంక్‌బండ్‌పై 2012 అక్టోబర్ 27 రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కేసు లోకాయుక్త సుమోటోగా స్వీకరించే వరకు వెళ్లింది. అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ ఈ రహదారి భద్రతపై ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పటికైనా శాశ్వత చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు ట్యాంక్‌బండ్‌కు బలయ్యే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. అత్యంత కీలక రహదారి... అంబేడ్కర్ విగ్రహం జంక్షన్ నుంచి వైస్రాయ్ చౌరస్తా వరకు దాదాపు 2.6 కిలోమీటర్ల పొడవున్న ట్యాంక్‌బండ్ పాఠశాల, వ్యాపార జోన్లలో ఏ ఒక్కదాని కిందికీ రాదు. అయితే జంట నగరాలకు అనుసంధానంగా ఉన్న దీని చుట్టూ కీలకమైన ప్రాంతాలు, కార్యాలయాలు ఉన్నాయి. సచివాలయం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, మింట్ కాంపౌండ్ తదితరాతో పాటు పర్యాటక స్థలాలైన ఐమాక్స్, పీవీ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీపార్క్, ఎన్టీఆర్ గార్డెన్ తదితరాలు విస్తరించి ఉన్నాయి. ఆద్యంతం పూర్తిస్థాయిలో సరాసరిన, ఎలాంటి టర్నింగ్స్ లేకుండా ఉండే రహదారి ట్యాంక్‌బండ్. రహదారి వెడల్పు తక్కువగా ఉండటం, ప్రతి ఏటా జరిగే నిమజ్జనాలు, ఇటీవల ప్రారంభమైన సన్డే–ఫన్డే తదితరాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై డివైడర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. చదవండి: జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? ఈ–చలానాలతోనే సరా..? ► ఈ ప్రాంతంలో గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల మించిన వేగంతో వెళ్లకూడదనే నిబంధన ఉంది. ► దీన్ని ఉల్లంఘిచిన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ లేజర్ గన్స్‌తో కాచుకుని ఉంటారు. ఈ ఉల్లంఘనులకు చలాన్లు విధిస్తారు. ► అయితే వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందే తప్ప ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాలు తగ్గే దాఖలాలు కనిపించట్లేదు. ► మరోపక్క ఎలాంటి సాంకేతిక నిపుణుల పోస్టులు లేని ట్రాఫిక్ పోలీసులు ఈ గరిష్ట వేగాన్ని ఎలా నిర్ధారించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ► ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ వింగ్ పేరుతో ఇంజనీర్లతో నిండిన జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ప్రాంతాలను సాంకేతికంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి. వాటిలో ట్రాఫిక్ పోలీసుల్ని భాగస్వాముల్ని చేసి పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ‘గ్రేటర్’ మాత్రం అవసరమైన స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు. ఇలా ఎందుకు చేయరు? ► ఇరుకుగా ఉండటంతో పాటు డివైడర్ లేని ట్యాంక్‌బండ్‌పై రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఈ మార్గాన్ని వన్‌వేగా ప్రకటించాలి. ► నిర్దేశిత సమయంలో అప్పర్ ట్యాంక్‌బండ్‌ను ఒక దిశలో వెళ్లే వాహనాలకు, లోయర్ ట్యాంక్‌బండ్‌ను మరో దిశ వెళ్లే వాహనాలు కేటాయించాలి. ‘సన్డే–ఫన్డే’ సమయంలో ట్యాంక్‌బండ్ మొత్తాన్ని మూసేస్తున్న విషయం గమనార్హం. ►ట్యాంక్‌బండ్‌పైకి ఎక్కిన పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుండా ఆద్యంతం రెయిలింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడికి వచ్చే వారు చూడాల్సిన విగ్రహాలు, జలాలు కూడా రెండు వైపులానే ఉన్నాయి కాబట్టి వీటివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. -
నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి
మహబూబాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాము అన్ని నిబంధలను పాటిస్తున్నా.. పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారని కొంతమంది నిరనస కూడా తెలుపుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురుతో కలిసి బైక్‌మీద కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు హెల్మెట్ ధరించలేదని దబాయిస్తూ.. బైక్ తాళం తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి తాను హెల్మెట్ ధరించానని పోలీసులకు చెప్పినా పట్టించుకోకుండా ఎస్ఐ మునీరుల్లా చేయి చేసుకున్నాడని శ్రీనివాస్ తెలిపాడు. తాను ఏ తప్పుచేయలేదని హెల్మెట్ ధరించినా.. లేదని దూషించి చేయి చేసుకున్నాడని ఆరోపించాడు. ఒక వేళ హెల్మెట్ ధరించని పక్షంలో ఫైన్ వేయాల్సిందని.. తనను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పుచేయని తనపై పోలీసు ఎందుకు చేయి చేసుకున్నాడని నిరసిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో ప్రకారం.. పోలీసుల ప్రవర్తనతో శ్రీనివాస్ కూతురు అతన్ని పట్టుకొని ఏడవసాగింది. ‘మనం తప్పు చేయలేదు తల్లి.. నువ్వు ఏడవకు’ అంటూ శ్రీనివాస్ చెబుతాడు. అక్కడ ఉన్నవారు కూడా శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. ఇక విషయం పెద్దదిగా మారుతుందని గ్రహించిన పోలీసులు సదరు వ్యక్తిని అక్కడ నుంచి బలవంతంగా పంపించివేస్తారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఇంచార్జ్ స్పందిస్తూ.. ఎస్ఐ మునీరుల్లాను సదరు వ్యక్తి దూషించాడని తెలిపారు. మరోవైపు తన తండ్రి హెల్మెంట్ ధరించినా.. ధరించలేదని దూషిస్తూ పోలీసులు బైక్ తాళం తీసుకున్నారని అతని కుమార్తె ఏడుస్తూ చెప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడ ఉంది? అంటూ కామెంట్లు చేస్తున్నారు. POLICE STATE?#Mahabubnagar police conducting a drive to ensure people are wearing masks/helmets &following rules. They stopped this man who was apparently going for vegetables& slapped him. The man says you can fine me but who gives a right to slap me in front of my child? pic.twitter.com/UpnQPEjk5M — Revathi (@revathitweets) December 6, 2021 -
కత్రీనా కారు ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. తర్వాత ?
Katrina Kaif Car Stopped By Traffic Police In Mumbai: బీటౌన్‌లో అత్యంత ట్రెండింగ్ టాపిక్ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ వివాహం. డిసెంబర్ 7 నుంచి 10 వరకు వారి వివాహం జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. మంగళవారం సంగీత్, తర్వాత మెహందీ, అనంతరం 9న విక్కీ, కత్రీనాల వివాహం కానుండగా, 10న రిసెప్షన్ జరగనుందని సమాచారం. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అధికారికంగా ఎప్పుడూ ప్రకటిస్తారా.. అని అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు. కానీ ఆ సమయంలో డిసెంబర్ 5న కత్రీనా, విక్కీ సాధారణంగా ముంబై రోడ్లపై దర్శనమిచ్చారు. జిమ్‌కు కలిసి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కత్రీనాకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో కత్రీనా కారును ట్రాఫిక్ పోలీసు ఆపి, తనిఖీ చేయడానికి ముందుకు వస్తాడు. డ్రైవింగ్ సీటు దగ్గరికి వస్తూ కిటికిలోంచి లోపలికి చూస్తాడు. ఒక్కసారిగా కత్రీనా చూసి షాక్ అయిన పోలీసు డ్రైవర్‌తో మాట్లాడి ఓకే చేసి కారు పంపిస్తాడు. అయితే కత్రీనా పెళ్లి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు కారు తనిఖీ చేయడాన్ని చూసి జనం చాలా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోపై కూడా నెటిజన్లు కామెంట్స్ చేశారు. కత్రీనా, విక్కీ కౌశల్ పెళ్లి గురించి సరదాగా కామెంట్స్ చేస్తూ, వివాహ కబురు త్వరగా చెప్పాలని కోరారు. అలాగే మరొక వీడియోలో ఓ అభిమానితో కత్రీనా సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. అభిమాని కోరిక మేరకు క్యాట్ ఏమాత్రం వెనుకాడకుండా సెల్ఫీ దిగడాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఆమె మంచి స్వభావాన్ని తెగ ఇష్టపడుతూ.. 'అందమైన మనసున్న వధువు' అని ఓ నెటిజన్ ప్రశంసించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
పోలీసులు అవాక్కు! ఒకే బైక్‌పై 179 చలాన్లు.. అక్షరాల రూ.42,475 ఫైన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది.. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదు. భాగ్యనగరంలో సగానికి పైగా మంది సక్రమంగా చలాన్లను చెల్లించడం లేదు .దీంతో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘన పేరుతో వాహనదారుల నుంచి ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాచిగూడట్రాఫిక్ పోలీసులు సోమవారం అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులను చూసిన ఓ వాహనదారుడు రోడ్డుపైనే బైక్ వదిలి పారిపోయాడు. అయితే వదిలి వెళ్లిన AP 23 M 9895 హీరో హోండా ప్యాషన్ బైక్‌పై పోలీసులు చలాన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ బైక్ ఏకంగా 179 చలాన్లు, 42,475 రూపాయల ఫైన్ ఉండటం చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీ చలాన్లు ఉండటంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. (చదవండి: వివాహేతర సంబంధం.. అర్ధరాత్రి ప్రియుడి ఇంట్లో ఘర్షణ..) -
అక్కడ డ్రైవర్లకు ‘గరం చాయ్’.. కారణం ఏంటో తెలుసా?
కోల్‌కతా: రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. డ్రైవర్ల తీవ్ర అలసట, నిద్రలేమి కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తించిన కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు నివారించడానికి వాహన డ్రైవర్లకు ‘గరం చాయ్’ అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదం నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.ఆ ప్రమాదంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తొలుత అనుమానించగా.. అతడు మద్యం సేవించలేదని పోస్టుమార్టం రిపోర్టులో తెలిసింది. డ్రైవర్ నిద్ర మత్తు ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. అయితే రాత్రివేళ నిద్రలేమితో అలసిపోయిన డ్రైవర్లను యాక్టివ్‌గా ఉంచడానికి ‘గరం చాయ్’ అందిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా హైవేలపై వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలో వాహన డ్రైవర్లకు వేడి వేడి ‘టీ’ అందించాలని నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. -
చలాన్లు కట్టమన్నారని బైక్‌కు నిప్పు
ఆదిలాబాద్ టౌన్: ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్లు చెల్లించలేక ఓ వ్యక్తి తన బైక్‌ను తగులబెట్టుకున్నాడు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్‌కు చెందిన ఫరీద్ మక్బుల్(ఏపీ01హెచ్8085) కిసాన్‌చౌక్ మీదుగా బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో కిసాన్‌చౌక్ వద్ద వాహనాలను ఆపుతున్న ట్రాఫిక్ పోలీ సులు అతడిని నిలిపి పెండింగ్ చలానాలు చెల్లించాలని సూచించారు. ఆవేశంతో తన బైక్ లోని పెట్రోల్ తీసి అదే బైక్‌పై పోసి నిప్పంటించాడు. అక్కడున్న పోలీసులు వాహనంపై నీళ్లు పోసి మంటలు ఆర్పేశారు. మక్బుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బైక్‌పై రూ.1,200 మేర చలాన్లు ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే రూ.2 వేల చలానా చెల్లించినా, మళ్లీ రూ.1,200 చెల్లించాలని అడిగే సరికి ఆవేశంతో బైక్‌కు నిప్పటించుకున్నాడు. -
హ్యాట్సాఫ్ సార్!... హీరోలా రక్షించారు!
నెల్లూరు: చాలా మంది పోలీసులు, రెస్య్కూ సిబ్బంది వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించేందుకు వాళ్లు చూపించే తెగువ, ధైర్య సాహసాలను చూస్తే ఎవరికైన వారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించకుండా ఉండలేరు. పైగా వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపాడతారు. అచ్చం అలానే ఇక్కడొక ట్రాఫిక్ పోలీసు వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడాడు. (చదవండి: జనరల్నాలెడ్జ్ ఉంటే చాలు... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోగలం!!) అసలువిషయంలోకెళ్లితే.. నెల్లూరు జిల్లా కొడవలూరు శివాలయానికి చెందిన పూజారి వెంకటేశ్వరపురం వంతెన పై బైక్‌పై వెళ్తుండగా వరద నీటిలో కొట్టుకుపోయాడు.అదృష్టవశాత్తూ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నాడు. అయితే ఆ పూజారి సహాయం కోసం అతని కేకలు పెట్టడం విన్నాడు. అంతే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నాయక్ వరదనీటిలో ధైర్యంగా వెళ్లి ఆ పూజరిని తాడు పట్టుకోమంటూ ధైర్యం చెబుతాడు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన వీడియోను ఆంధ్ర పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు "మీ నిస్వార్థ మానవత్వానికి సెల్యూట్... అలాగే కొనసాగించండి సార్" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..) -
బండి అమ్మేసినా.. ఆ చలాన్లు కట్టడానికి సరిపోదేమో..
సాక్షి, గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ఒకే ద్విచక్ర వాహనంపై ఒకటికాదు రెండుకాదు ఏకంగా.. 117 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళవారం సదరు వాహనాన్ని అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. హోండా యాక్టివా(ఏసీ09ఏయూ1727)నంబర్ యాక్టివాను ఆపి తనిఖీ చేశారు. 2015 సంవత్సరం నుంచి దాదాపు 117 చలానాలు పెండింగ్‌లో ఉండటంతో అవాక్కయ్యారు. హెల్మెట్,మాస్క్, నో పార్కింగ్‌లో నిలుపుతూ.. సదరు వాహనదారుడు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. రూ. 30 వేల పెండింగ్ చలానాలు ఉండటంతో వాహానాన్ని సీజ్ చేశారు. -
డ్రంకెన్ డ్రైవ్: వారంలో రూ.కోటిన్నర జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, డ్రంకెన్ డ్రైవ్‌లు, పెండింగ్ చలాన్ల వసూళ్లపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య రాచకొండ పరిధిలో 40,620 కేసులను నమోదు కాగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, డ్రంకెన్ డ్రైవ్ కలిపి సుమారు రూ.కోటిన్నర జరిమానా విధించారు. ఇందులో అత్యధికంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 26,475 కేసులు నమోదు కాగా.. రూ.48,98,900 ఫైన్లు విధించారు. ఇద్దరికి జైలు శిక్ష రాచకొండ కమిషరేట్ పరిధిలో వారం రోజుల్లో 49 డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదయ్యాయి. రూ.4,38,500 జరిమానా విధించారు. 176 మందిని కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి జైలు శిక్ష పడింది. అత్యధికంగా వనస్థలిపురంలో 10 కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలదారులపై 38 కేసులు బుక్కవగా.. త్రీవీలర్స్పై 2, ఫోర్ వీలర్ వాహనాదారులపై 9 కేసులు నమోదయ్యాయి. 54 రోడ్డు ప్రమాదాలు.. 10 మంది దుర్మరణం.. కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 54 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది దుర్మరణం చెందగా.. 50 మందికి గాయాలయ్యాయి. తీవ్రత వారీగా చూస్తే 10 కేసులు ఘోరమైన ప్రమాదాలు కాగా.. 44 సాధారణ రోడ్డు ప్రమాదాలున్నాయి. ఆయా డేటాను విశ్లేషించగా మానవ తప్పిదాలు, రహదారి ఇంజనీరింగ్ లోపాలతోనే జరిగాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, వాహనాలు వాటంతటవే ప్రమాదాలకు గురికావడం కారణాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ తెలిపారు. ఏ విభాగంలో ఎన్ని కేసులంటే.. విభాగం కేసుల సంఖ్య జరిమానా (రూపాయల్లో) హెల్మెట్ లేకుండా 26,475 48,98,900 సీట్‌బెల్ట్ లేకుండా 129 12,900 డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 837 4,11,500 అదనపు ప్రయాణికులు 28 7,200 ఎక్స్ట్రా ప్రొజెక్షన్ 415 41,500 అతివేగం 2,023 20,23,000 సిగ్నల్ జంప్ 96 96,000 ప్రమాదకర డ్రైవింగ్ 14 14,000 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 96 96,000 -
డ్రంక్ అండ్ డ్రైవ్; సీజ్ చేసిన వాహనాలు వెనక్కు...
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు తెలంగాణ హైకోర్టు తీర్పు కాస్తా ఉపశమనాన్నిస్తోంది. గతంలో పట్టుబడిన వాహనాలను సీజ్ చేస్తూ నడిపేవారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం చలానా చెల్లించే వారు. ఇటీవల హైకోర్టు తీర్పుతో ఈ పద్ధతికి ట్రాఫిక్ పోలీసులు ఫుల్స్టాప్ పెట్టారు. సాక్షి, బంజారాహిల్స్: ఏడాదిగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలను మెల్లమెల్లగా కోర్టుకు తీర్పుకు లోబడి ఇచ్చేస్తున్నారు. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మద్యం సేవించి పట్టుబడ్డ వారి నుంచి వాహనాలను సీజ్ చేయకుండా సమీప ప్రాంతంలో ఉండే వారి బంధుమిత్రులను పిలిపించి ఆ వాహనాలను ఇచ్చి పంపిస్తున్నారు. ► బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 615 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సీజ్ చేశారు. ► జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 645 వాహనాలను సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అత్యధిక వాహనాలు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడగా ఆ తర్వాత స్థానం మలక్‌పేటలో పట్టుబడ్డారు. 6,7 స్థానాల్లో వరుసగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉన్నాయి. ► కోర్టు తీర్పుతో సీజ్ చేసిన వాహనాలను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ప్రకారం యజమానులకు అప్పగిస్తున్నారు. ► సీజ్ చేసిన వాహనాలను అప్పగించే క్రమంలో మార్గదర్శకాలు అనుసరిస్తున్నారు. గత అయిదేళ్లుగా నగరంలో డ్రంక్ అండ్డ్రైవ్ నిర్వహిస్తుండగా ఏటా కేసులు పెరగడమే కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ► వాహనదారులకు కౌన్సెలింగ్‌తో పాటు న్యాయస్థానంలో హాజరుస్తున్నారు. అయినా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఇటీవల కొంత మందిపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. (చదవండి: Metro trains: ఆరుకొట్టంగనే మెట్రో రైలు) జూబ్లీహిల్స్ అంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ► పబ్‌లు, క్లబ్‌లు, ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నాయి. అర్ధరాత్రి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు ఈ ఏరియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ► శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అయిదు వేర్వేరు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని ఆ వాహనాలను సీజ్ చేసేవారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏ నెలకు ఆ నెల కేసులు తగ్గుముఖం పట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. ► డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులను కట్టడి చేయడంలో ట్రాఫిక్ పోలీసులు రాత్రి 4 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టాయనే చెప్పొచ్చు.(చదవండి: ఒలెక్ట్రాకు ఎంఎస్ఆర్టీసీ నుంచి 100 బస్సులకు ఆర్డరు) ► నగరంలో మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తక్కువే. ► పబ్‌ల నుంచి యువకులు అర్ధరాత్రి మద్యం సేవించి బయటికి వస్తూ వాహనాలను నడుపుతుండటం దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో తనిఖీలు అర్ధరాత్రి వరకు చేపడుతున్నారు. -
ఫోటో తీసినందుకు ట్రాఫిక్ పోలీసును దూషించిన మోహన్ రెడ్డి
-
Drunk And Drive: వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్న పోలీసు శాఖ
సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కొన్ని వాహనాలను పోలీస్ శాఖ శనివారం తిరిగి ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన పలు వాహనాలు పోలీసు శాఖ తీరిగి ఇవ్వటాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించింది. గుర్తింపు పత్రాలను తమ వద్ద పెట్టుకుని సదరు వ్యక్తులకు పోలీసులు వాహనాలను ఇస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు బడిన వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని, వాహనాలు సీజ్ చేసే సమయంలో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 448–ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని హైకోర్టు చెప్పింది. తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.