West Godavari District News
-
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశం చౌక్): ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. భూమి, ఇళ్లు, సరిహద్దులు, పెన్షన్లు, రేషన్‌కార్డులు, పోలీసు కేసులు, రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు తదితర సమస్యలపై 237 అర్జీలు వచ్చాయి. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, వృద్ధుల అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. కుమారుడికి పెన్షన్ కోసం.. అత్తిలి మండలం అరవల్లి గ్రామానికి చెందిన మల్లిడి సురేఖ దంపతుల కుమారుడు ఆరేళ్ల వయసు నుంచి మానసిక, శారీరక దివ్యాంగుడిగా ఉన్నాడు. అకస్మాత్తుగా పడిపోతూ ఉండటంతో తల్లితండ్రులు అనుక్షణం అందుబాటులో ఉండాల్సి ఉంటోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వైద్యం కోసం తీసుకువెళ్లడం, ప్రతినెలా మందులు, ఇతర ఖర్చులకు రూ.15 వేల వరకు ఖర్చవుతున్నాయి. దీంతో కూలీ పనులపై బతికే సురేఖ దంపతులకు కుమారుడి వైద్య ఖర్చులు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తమ కుమారుడికి రూ.15 వేలు పెన్షన్, ట్రైసైకిల్ మంజూరు చేయాలని సురేఖ దంపతులు కలెక్టర్‌ను కలిసి కోరారు. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం.. ఉండిలోని పడవలవానిపేట శశ్మాన వాటికలో చెత్తాచెదారం పారవేసి డంపింగ్ యార్డ్‌గా మారుస్తారని, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు పీజీఆర్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే శ్మశానవాటిక పల్లంగా ఉండటంతో వర్షం నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని, శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మంచినీళ్లు లేక ఇబ్బందులు పెంటపాడు మండలం పడమర విప్పర్రులోని న్యూ హౌసింగ్ కాలనీలో 40 కుటుంబాల వరకు ఉన్నాయని, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ ప్రాంత మహిళలు కలెక్టర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మంచినీటి పైపులైన్ వేయలేదని, దీంతో రెండు కిలోమీటర్లు దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కరించాలంటూ అర్జీ అందించారు. -
ఆక్వా వర్సిటీకి చంద్ర గ్రహణం
సాక్షి, భీమవరం: జిల్లాలోని ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య గ్రహణం పట్టింది. నిధులు లేక నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. రెండేళ్లలో పూర్తికాల్సిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. మరో పక్క ఆక్వా వర్సిటీని ప్రైవేట్‌పరం చేసే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్వా హబ్‌గా ఉమ్మడి జిల్లా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 2.53 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు, 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలు, ఆక్వా అనుబంధ వ్యాపారాలతో ఆక్వా హబ్‌గా పేరొందింది. చేపలు, రొయ్యల మేతలు, చెరువుల నిర్వహణ సామగ్రి అమ్మకాలు, పట్టుబడి, ప్రాసెసింగ్ ప్లాంట్లు, రవాణా తదితర రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వే లాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ఆక్వాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో గత సీఎం జగన్మోహన్రెడ్డి ఆక్వా యూనివర్సిటీని మంజూరు చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం, జిల్లాలోని ఉండిలోని ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్లను యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చారు. యూనివర్సిటీ కోసం నరసాపురం సమీపంలోని లిఖితపూడిలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవన నిర్మాణాల నిమిత్తం రూ.100 కోట్లు మంజూరు చేశారు. తాత్కాలికంగా నరసాపురంలోని తుఫాన్ షెల్టర్ భవనంలో 2022 నవంబరు నుంచి 66 సీట్లతో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ తరగతులను ప్రారంభించారు. గతే డాది నూతన భవనాల్లో ఆక్వా వర్సిటీ, క్యాంపస్ కళాశాలను ప్రారంభించే లక్ష్యంతో అప్పట్లో పనులు వేగవంతం చేశారు. ఆర్బీకేలో సెకండ్ బ్యాచ్‌కు తరగతులు నరసాపురంలోని 12 గదులతో ఉన్న తుఫాను షె ల్టర్ భవనంలో తాత్కాలికంగా కళాశాలను నిర్వహి స్తున్నారు. తరగతి గదులు, ల్యాబ్, ఆఫీస్, లైబర్రీ, స్టాఫ్ రూమ్ ప్రస్తుతం ఉన్న భవనం ఒక బ్యాచ్‌కు మాత్రమే సరిపోతుంది. గతేడాది సెకెండ్ బ్యాచ్‌కు క్లాసులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న భవనం సరిపోక ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలోని ఫిషరీస్‌కు సంబంధించిన భవనాల్లోకి కళాశాలను తరలించాలని అధికారులు భావించారు. స్థానికంగా వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఆ ప్రయత్నాన్ని నిలిపివేసినట్టు సమాచారం. దీంతో రైతు భరోసా కేంద్రాన్ని తరగతుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరితగతిన యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష ్యంతోనే.. ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందేందుకు ఆక్వా వర్సిటీ దోహదపడుతుంది. ప్రైవేట్ సంస్థలకు ఆక్వా వర్సిటీని అప్పగించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పేద విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే విరమించుకుని త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. – వడ్డి రఘురాం, అప్సడా మాజీ వైస్ చైర్మన్, తాడేపల్లిగూడెం విద్యపై కూటమి కత్తి గత ప్రభుత్వంలో జిల్లాకు తలమానికంగా ఆక్వా వర్సిటీ భవన నిర్మాణాలకు రూ.100 కోట్ల మంజూరు రెండేళ్లలో పనులు పూర్తిచేసేలా లక్ష్యం బిల్లుల విడుదలలో కూటమి సర్కారు జాప్యం ఏడాదిగా నత్తనడకన పనులు ప్రైవేట్‌పరం చేసే ఆలోచన ? ముందుకు సాగని పనులు అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాల పనులు శ్లాబ్ దశకు చేరుకోగా బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.35 కోట్ల విలువైన పనులు జరగ్గా కేవలం రూ.15 కోట్లు మాత్రమే బిల్లులు విడుదలయ్యాయి. తాజా బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఆక్వా వర్సిటీకి కేటాయించడంతో ఈ ఏడాది పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పనులు ఎప్పుడు పూర్తవుతాయనేది చెప్పలేమని అధికార, నిర్మాణ సంస్థ వర్గాలంటున్నాయి. ఆక్వా వర్సిటీని ప్రైవేట్‌పరం చేసే ఆలోచనతోనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే గత ప్రభుత్వం ఉన్నతాశయంతో తలపెట్టిన ఈ కార్యక్రమం నీరుగారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సమరగ అభివృద్ధి లక్ష్యం
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్ రూపొందించడంపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర–2047 విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు అధికారులకు రెండు రోజుల వర్క్‌షాపు సోమవారం ప్రారంభమైంది. ఉభయ జిల్లాల చీఫ్ ప్లానింగ్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బందికి కలెక్టర్ సూచనలు ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల మనోభావాలు అనుగుణంగా యాక్షన్ ప్లాన్‌కు రూపొందించాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర, పర్యావరణ అనుకూలమైన వృద్ధి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపు, భవిష్యత్ నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, శ్రామికశక్తిని ప్రోత్సాహం అందించడంపై దృష్టి సారించాలన్నారు. నియోజక వర్గాల వారీ గా సమర్థవంతమైన ప్రణాళికలు అమలుచేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య రంగాల్లో ప్రస్తుత విస్తరణ, దిగు బడులు, రానున్న రోజుల్లో అంతర సాగు విధానం, ఆదాయం పెంపు, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంపు తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు. ఉమ్మడి జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులు సీహెచ్ వాసుదేవరావు, కె.శ్రీనివాసరావు, రిటైర్డ్ జేడీ డీవీవీ సీతాపతిరావు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల క్యూఆర్ కోడ్ ప్రారంభం
భీమవరం: గంజాయి, మాదక ద్రవ్యాలు ఇలా ఏదైనా సమాచారం పోలీసులకు తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. భీమవరం వన్‌టౌన్ స్టేషన్లో సోమవారం క్యూఆర్ కోడ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే లింక్ వస్తుందని, అందులో వివరాలు చెబితే సర్వర్లోకి చేరతాయన్నారు. ఇలా నమోదైన వివరాలను పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి సంబంధిత స్టేషన్లకు పంపించి విచారణ చేస్తారన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐలు ఎం. నాగరాజు, జి.కాళీచరణ్ పాల్గొన్నారు. -
జిల్లా జడ్జికి అభినందనలు
ఏలూరు (టూటౌన్): జిల్లా ప్రధాన సివిల్ న్యాయమూర్తిగా (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి) పదవీ బాధ్యతలు స్వీకరించిన సిరిపురం శ్రీదేవిని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆమెకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజల న్యాయ అవసరాలు తీర్చేందుకు సంబంధిత విభాగాల మధ్య సమన్వయంతో కేసుల విచారణ, మహిళా భద్రత, నేర నిరోధక చర్యలపై వారు చర్చించారు. పోలీస్‌శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ శివకిషోర్ ఆమెకు వివరించారు. ఫిర్యాదులపై సత్వర చర్యలు భీమవరం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ఫిర్యాదులపై విచారణ చేసి చట్టపరిధిలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధితులకు భరోసా ఇచ్చారు. సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలు ఆయన తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు, అత్తింటి వేధింపులు, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు వంటి 23 అర్జీలను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై విచారణ చేయాలని అధికారులకు ఫోన్లో ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రీ ఓపెన్ అయిన అర్జీలపై సమీక్ష భీమవరం(ప్రకాశం చౌక్): రీ ఓపెన్ అయినా అర్జీల విషయంలో మరింత జవాబుదారీతనం కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమ వారం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, రీ ఓపెన్ అయిన అర్జీలపై సమీ క్షించారు. అధికారులు తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి లేఖ ద్వారా తెలియజేయాలన్నారు. జిల్లాలో 927 ఫిర్యాదులు రీఓపెన్ కాగా 821 ఫిర్యాదులను పరిష్కరించామని, 106 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. పేదల ఇళ్ల కూల్చివేత దారుణం భీమవరం అర్బన్: పాలకోడేరులోని ఏఎస్ఆర్ నగర్లో 60 ఏళ్లుగా 130 కుటుంబాలు ఉంటున్నాయని, వారి ఇళ్లను కూటమి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేయడం దారుణమని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్, నాయకులు ఎం.ఆంజనేయులు అన్నారు. మండలంలోని తోకతిప్పలో సోమవారం ఇళ్ల కూల్చివేతపై సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రభుత్వం అని చెబుతూనే పేదల ఇళ్లను కూలగొట్టి రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా అని ప్రశ్నించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైఖరి మార్చుకోవాలని, ప్రజలపై దాడులు మాని భూస్వాముల చేతుల్లో ఆక్రమణకు గురైన భూముల్ని వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రజలే బుద్ధి చెబు తారని హెచ్చరించారు. సీపీఎం శాఖ కార్యదర్శి బొడ్డు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. 24 నుంచి ఉపాధ్యాయులకు వైద్య శిబిరం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పూర్వ పశ్చిమగోదా వరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్ కేటగిరీ/స్పెషల్ పాయింట్లు పొందాల్సిన వారు వైద్య శిబిరాలకు హాజరుకావాలని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 26 వరకు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. -
24 నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు
భీమవరం: పట్టణంలోని చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి 18వ జాతీయస్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి వ్యవస్థాపక అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ చెప్పారు. సోమవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నాటిక పోటీల వివరాలను వెల్లడించారు. పట్టణంలోని డీఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నాలుగు రోజులుపాటు నాటిక పోటీలు నిర్వహిస్తామన్నారు. 24న ఉషోదయ కళానినేతన్ కట్రపాడు వారి శ్రీకిడ్నాప్ఙ్, మైత్రి కళానిలయం హైదరాబాద్ వారి ‘బ్రహ్మ స్వరూపం్ఙ, 25న యువభేరీ థియేటర్ ఆర్గనైజేషన్ వారి ‘నా శత్రువు’, అమరావతి ఆర్ట్స్ వారి ‘ చిగురు మేఘంశ్రీ, మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ చిలకలూరిపేట వారి ‘మా ఇంట్లో మహాభారతం’, 26న మహతి క్రియేషన్ హైదరాబాద్ వారి ‘ఉక్కు సంకెళ్ళు’, చైతన్య కళా స్రవంతి విశాఖ వారి ‘(అ) సత్యం’, మిత్రా క్రియేషన్ హైదరాబాద్ వారి ‘ఇది రహదారి కాదు’ నాటికల ప్రదర్శన ఉంటుంది. 27న అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘విడాకులు కావాలి’, సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘జనరల్ బోగీలు’ నాటికలను ప్రదర్శిస్తారని భగవాన్ వివరించారు. అలాగే కళాకారులకు పురస్కారాలు అందిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో నాటక పరిషత్ కార్యదర్శి మంతెన రామకుమార్‌రాజు, పీఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, కోశాధికారి బొండా రాంబాబు, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, పేరిచర్ల లక్ష్మణవర్మ, వడుపు గోపి, కట్రెడ్డి సత్యనారాయణ, నడింపల్లి మహేష్, పెన్నాడ శ్రీను, చెరుకుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. నాటిక పోటీల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు హాజరవుతారని భగవాన్ తెలిపారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ కల్పించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షన్, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సాధన సమితి ఉమ్మడి డిమాండ్ చేసింది. ఈమేరకు జిల్లా పర్యటనకు సోమవారం సాయంత్రం నగరానికి వచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సంఘ అధ్యక్షుడు పీ శ్రీనివాస్, కన్వీనర్ కే కృష్ణకుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, 1980 ని సవరించి 2004 సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర – ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును అమలులోకి తెచ్చినా విద్యుత్ ఉద్యోగులు మాత్రం జీపీఎఫ్ పరిధిలోనే ఉన్నారన్నారు. దీనివల్ల 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగష్టు 31 మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో నియమతులైన సుమారు 6,200 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అంతే కాకుండా, ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రమాదాలకు గురై మరణించిన ఉద్యోగుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వీధిన పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం పెన్షన్ సౌకర్యం, జీపీఎఫ్ సౌకర్యం విద్యుత్ ఉద్యోగులకు అందరికీ కల్పించాలని మంత్రిని కోరారు. ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు శ్రీజీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టీవీఎంయూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్‌కుమార్‌లకు జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. నాగులదేవునిపాడులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు దెందులూరు: గాలాయిగూడెం పంచాయతీ నాగులదేవునిపాడు గ్రామంలో ఇరుకుటుంబాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి మురుగునీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసిందన్నారు. గుజ్జుల నాగేంద్రబాబు చాకుతో గూడపాటి చందు, గూడపాటి జోషిలపై దాడికి పాల్పడగా.. జోషి కుమారుడు సుమంత్ రాయితో గుజ్జుల నాగేంద్రబాబుపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించమన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివాజీ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి పెదపాడు: ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన ఘటన పెదపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎద్దు వేదప్రకాష్ (38) తన స్థలంలో ఇంటి నిర్మాణానికి వాటరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు గురై మృతి చెందాడు. వేదప్రకాష్ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రకాష్‌కు భార్య ఒక పాప ఉన్నారు. ఫార్మసీ చదివిన ప్రకాష్ వైద్యురాలు అయిన భార్యతో కలిసి హెల్త్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. -
బుల్లెట్టు.. వీరి టార్గెట్టు
తణుకు అర్బన్: అంతర్రాష్ట్ర బైక్ దొంగలను తణుకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్, రూరల్ సీఐ బి.కృష్ణకుమార్ చోరీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు పెట్టిన వాహనాలను మాయం చేస్తున్న దొంగతనాలకు సంబంధించి తణుకు పాతవూరుకు చెందిన గుడాల లక్ష్మీనారాయణ అలియాస్ లక్కీ, తణుకు మండలం కొమరవరం గ్రామానికి చెందిన బొంత రవితేజ, హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన దాసరి మణిబాబు అలియాస్ చింటులను సోమవారం తణుకులో అరెస్టు చేసి రూ.13.40 లక్షలు విలువైన 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు తణుకులో ఇటీవల జరిగిన మూడు బైక్ దొంగతనాలకు సంబంధించి జరిపిన విచారణలో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని తెలంగాణలోని జీడిమెట్ల, సూరారం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్, పోడూరు, నిడదవోలు పోలీస్స్టేషన్ల పరిధిలోని చోరీలకు సంబంధించి బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో బుల్లెట్ వాహనాలే అధికంగా ఉండడం, బుల్లెట్ వాహనాలే వీరి లక్ష్యంగా ఎంచుకున్నారని స్పష్టం చేశారు. నిందితుల ఆచూకీతోపాటు చోరీలకు సంబంధించిన వాహనాలను రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్, ఏఎస్సై పి.సంగీతరావు, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎస్కే అన్వర్, ఎం.శ్రీనివాస్, వి.మాధవరావు, ఎస్.భాస్కరాచారిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్టు రూ.13.40 లక్షల విలువైన 11 బైక్‌ల స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ విశ్వనాథ్ -
పిఠాపురంలో వెలివేసిన దళిత కుటుంబాలను ఆదుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన వారు వెలివేసిన దళితులను ఆదుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఇలా జరగడం శోచనీయం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ య్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలివేసిన దళితులను ఆదుకుని, ఈ నేరానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉన్నమట్ల యేసురత్నం, సుంకర ప్రియబాబు, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ ఉంగుటూరు: చోరీ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం రాచూరు, చుట్టుపక్కల గ్రామాల చెరువుల మీద మేత బస్తాలు చోరీ జరుగుతున్నాయని చెరువుల యజమాని నడింపల్లి రామాంజనేయ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు సీతారాంపురానికి చెందిన బైరపూడి హరికృష్ణ, వనపర్తి సహదేవుడు, తాడేపల్లి వెంకట కుమార్, జుత్తుక ధనుష్, జుత్తుక పవన్ కుమార్, నబిగేరి జయరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సూర్యభగవాన్ చెప్పారు. -
పోగొట్టుకున్న బ్రాస్లెట్ భక్తుడికి అప్పగింత
జంగారెడ్డిగూడెం: ఆలయ పరిసరాల్లో పొగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ను సోమవారం బాధితుడికి నూకాలమ్మ ఆలయ కమిటీ అందజేసింది. మూడు రోజుల క్రితం కొప్పుల దుర్గాప్రసాద్, అశ్విని దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో చేతికి ఉన్న బ్రాస్లెట్ కనిపించకపోవడంతో ఆలయ కమిటీకి తెలియజేసి దొరికితే ఇప్పించాలని దుర్గాప్రసాద్ కోరాడు. ఆలయ సమీపంలో నివసించే మహాలక్ష్మికి ఈ బ్రాస్లెట్ దొరకగా ఎవరిదో విచారించి వారికి ఇవ్వాలని ఆలయ కమిటీని కోరింది. సోమవారం దుర్గాప్రసాద్ దంపతులకు మహాలక్ష్మి చేతుల మీదుగా బ్రాస్లెట్ను ఆలయ కమిటీ అందజేసింది. మహాలక్ష్మిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు. కాగా బ్రాస్లెట్ విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు దెందులూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో దళిత కుటుంబాన్ని పెత్తందారులు సామాజిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటని దళిత ప్రజాప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సర్క్యూట్ వల్ల దళితుడు సురేష్ మృతి చెందడం, అతనికి న్యాయం చేయాలని దళితులు, గ్రామస్తులు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం నేరమా అని ప్రశ్నించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా బాధిత కుటుంబాన్ని పవన్‌కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి దేశమంతా తలెత్తుకొని చూసేలా చేస్తానని అన్ని మీటింగ్‌లో చెప్పారని, దాని అర్థం ఇదేనా అని దళిత ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. దళిత కుటుంబాన్ని వెలివేసిన వారిని, ఇందుకు సహకరించిన వారిని జిల్లా బహిష్కరణ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ఈ ఘటనపై పవన్‌కళ్యాణ్ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని దళిత ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఏలూరు జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తెర ఆనంద్, ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లం ప్రసాద్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు మోరు రామరాజు, పార్టీ జిల్లా కార్యదర్శులు గొల్ల కిరణ్ దేవదాసు ప్రేమ్ బాబు ఉన్నారు. -
కొంపముంచిన నకిలీ మొక్కలు
దెందులూరు: నకిలీ మొక్కలు, విత్తనాలు తమ కొంప ముంచాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తే తీరని నష్టం కలిగిందని లబోదిబోమంటున్నారు. దెందులూరు మండలం చల్ల చింతలపూడి గ్రామంలో ఖమ్మ బ్రహ్మాజీ తన ఐదెకరాల పొలంలో ఒక మొక్క రూ.211 చొప్పున 337 పామాయిల్ మొక్కలు రూ.71 వేలకు 2018లో ఓ ప్రైవేటు కంపెనీ నుంచి కొనుగోలు చేసి సాగు చేశాడు. మొత్తం 36 మొక్కలు బెరుకు మొక్కలు వచ్చాయని, దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి వృథా అయ్యిందని, నకిలీ విత్తనాలు తన పాలిట శాపంగా మారాయని రైతు బ్రహ్మాజీ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై రెండు రోజుల్లో హార్టికల్చర్ శాఖ, విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోకుంటే తన పొలంలోనే దీక్షలు చేస్తానని హెచ్చరించారు. హార్టికల్చర్ ఆఫీసర్ కరణ్ స్పందిస్తూ పామాయిల్ సాగులో బెరుకు మొక్కలు వచ్చిన సంగతి వాస్తవమే అన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. మరోవైపు ఇదే గ్రామంలో పుచ్చ విత్తనాలు తనకు నష్టం మిగిల్చాయని రైతు బోప్పన శ్రీను కన్నీటి పర్యంతమయ్యాడు. తనకున్న రెండున్నర ఎకరాల్లో రూ.22 వేలతో పుచ్చ విత్తనాలు వేశానని, సాగు, డ్రిప్పు మల్చింగ్ నిమిత్తం రూ.55 వేలు పెట్టుబడి పెట్టానని, కానీ 40 శాతం మాత్రమే మొలకలు వచ్చాయని వాపోయాడు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగిస్తున్న కంపెనీలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గగ్గోలు పెడుతున్న రైతన్నలు -
అగ్నిమాపక సిబ్బంది ఔదార్యం
చింతలపూడి: ప్రమాదవశాత్తూ నేల బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు శునకాలను గ్రామస్తుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. చింతలపూడి మండలం, శెట్టివారిగూడెం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శెట్టివారిగూడెం పొలాల్లో ఉన్న ఇరవై అడుగుల బావిలో రెండు కుక్కలు ప్రమాదవశాత్తూ పడిపోయాయి. బావి నుంచి కుక్కల అరుపులు విన్న రైతులు వాటిని బయటికి తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి చింతలపూడి అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సిబ్బందిని బావి దగ్గరకు పంపించారు. ఫైర్‌మెన్ రామకృష్ణ, ఫైర్ హోంగార్డ్ బాబురావు బావిలోకి దిగి కుక్కల్ని సురక్షితంగా బయటికి తీశారు. సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి మూగ జీవాల ప్రాణాలు కాపాడిన ఫైర్ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. బావిలో పడ్డ శునకాల్ని బయటికి తీసిన వైనం -
ఈఏపీ సెట్‌కు దరఖాస్తు ఇలా..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు తమ తొలి అడుగు వేయడానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఆయా కోర్సుల్లో ప్రవేశించడానికి గతంలో ఎంసెట్ నిర్వహించేవారు. ఎంసెట్ ద్వారా వైద్య విద్యలో కూడా ప్రవేశించే వెసులుబాటు ఉండేది. అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు మాత్రం రాష్ట్రస్థాయిలోనే ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఏపీఈఏపీ సెట్) నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశించడానికి ఈఏపీ సెట్ పరీక్ష రాయడం తప్పనిసరి. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోలేని వారు ఇప్పుడు తొందరపడకపోతే తమ ఇంజనీరింగ్ చదువు కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లేదా తమ తోటివారికంటే ఒక ఏడాది ఆలస్యంగా ప్రవేశించాల్సి వస్తుంది. ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా జిల్లాతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సీఈటీఆర్.ఏపీఆర్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఏపీ ఈఏసీసెట్–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈ ఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించిన తేదీలు, సూచనలు తదితర పూర్తి వివరాలు పొందవచ్చు. ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవడం మరువద్దు ఈ పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవడం మరిచిపోవద్దు. ముఖ్యంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పీహెచ్సీ కేటగిరిల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్లో క్లిక్ చేయాలి. అలాగే ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన నంబర్‌ను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ తరువాత తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏ విద్యా సంస్థల్లో చదివారు, ఏ ఊరిలో చదివారనే వివరాలు ఆయా విద్యా సంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివరలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సొంత జిల్లాకు చెందిన విద్యార్థి తమ సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతర కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ప్రింటౌట్ తీసుకోండి ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసిన తరువాత ప్రింటౌట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్‌తో పాటు ఆన్లైన్ ప్రింటౌట్ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్, పుట్టిన తేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్ హాల్ టికెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి. 5 దశలుగా దరఖాస్తు ప్రక్రియ ఏపీఈఏపీ సెట్–2025 సైట్లో లాగిన్ అయిన తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్‌కు లాగిన్ అయి సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ నమోదు చేయాలి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఫార్మా, అగ్రికల్చర్ ఫార్మసీ, బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరిపై క్లిక్ చేసి ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాలి. క్రెడిట్, డెబిట్‌కార్డు, నెట్ బ్యాకింగ్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నో యువర్ పేమెంట్ స్టేటస్‌పై క్లిక్ చేసి సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. అనంతరం విద్యార్థి చేరనున్న కోర్సుల వారీగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్ చేయడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఫిల్ అప్లికేషన్లో పేమెంట్ చేసిన ఐడీతోపాటు సీనియర్ ఇంటర్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్‌పై క్లిక్ చేసి పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ్ క్లిక్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. మూడు రోజుల్లో ముగియనున్న గడువు.. దరఖాస్తులు ఆన్లైన్లోనే సమర్పించాలి -
కళావిహీనం.. ఆటపాక కేంద్రం
కై కలూరు: రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఉన్న ఆటపాక పక్షుల విహార కేంద్రం కళావిహీనంగా మారింది. తీవ్ర నీటి కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. ఆహారం, ఆవాసం కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఏటా నీటి కొరత ఏర్పడుతుందని తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టడంలో అటవీ అధికారులు అలసత్వం వహిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. ఆటపాకలో బోటు షికారు నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నిరుత్సాహంతో తిరిగి వెళ్తున్నారు. ప్రపంచంలోనే అరుదైన పెలికాన్(గూడబాతు) పక్షులు ఆటపాక పక్షుల కేంద్రానికి సంతానోత్పత్తి కోసం వలస వస్తాయి. దీంతో ఈ కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. పక్షుల విహారానికి 286 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఇక్కడ అందుబాటులో ఉంది. విదేశీ పక్షుల గూడు నిమిత్తం, సంతానోత్పత్తికి వీలుగా 156 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. కొల్లేరులో సాధారణంగా పెలికాన్, పెయింటెడ్ స్టోక్, టీల్స్, నైట్ హెరాన్, కింగ్ ఫిషర్స్, గ్లోబీ ఐబీస్, స్టిల్ట్, షావలర్స్, స్పూన్ బిల్స్ వంటి దాదాపు 189 రకాల పక్షులు విహరిస్తాయని అంచనా. పక్షుల సంతానోత్పత్తికి ఆటపాక పక్షుల కేంద్రం అనుకూలంగా ఉండటంతో ఎక్కువగా పక్షులు విచ్చేస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి సర్వత్రా వినిపిస్తున్నాయి. గట్ల ఎత్తు పెంచాలి ఆటపాక పక్షుల కేంద్రంలో ప్రధానమైంది విహార చెరువు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ఈ ప్రాంతంలో తొలగించిన చెరువులన్నింటినీ ఒక్కటిగా చేయడంతో చెరువు విస్తీర్ణం మరింతగా పెరిగింది. సాధారణంగా చెరువులో 6 అడుగులు నీటిని నిల్వ చేసుకోవచ్చు. గట్లు బలహీనంగా ఉండటంతో 4 అడుగులకు మించడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో చెరువు పూర్తిగా అడుగంటుతోంది. పక్షులు ఆహారంగా తీసుకునే చేపలు చనిపోతున్నాయి. చెరువు గట్ల ఎత్తు పెంచాలని ప్రతిపాదనలు పంపుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. మే నెలలో ఏకంగా చెరువు బీటలు వారుతోంది. దీంతో పక్షులకు ఆహార కొరత ఏర్పడడంతో కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. నీటి తరలింపులో జాప్యం ఏటా పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపడం పెద్ద ప్రహసనంలా మారుతోంది. సమీప కోమటిలంక నాగరాజు డ్రెయిన్ నుంచి పక్షుల కేంద్రం చెరువుకు నీటిని నింపుతారు. వర్షాలు అధికంగా కురిస్తే డ్రెయిన్‌లో నీరు పెరుగుతుంది. ఆ సమయంలో తూములు తీసి చెరువుకు నీటిని పంపుతారు. ప్రస్తుతం నాగరాజు డ్రెయిన్ నీటిలో 8కిపైగా ఉప్పు శాతం ఉందని పరీక్షల్లో తేలింది. ఈ నీటిని నింపితే చెరువులో సహజసిద్ధంగా పెరిగిన చేపలు మరణిస్తాయి. ఈ కారణంతో నీటిని నింపడం లేదు. ఆటపాక గ్రామం పంట కాల్వ నుంచి నీటిని పైపుల ద్వారా నేరుగా పక్షుల కేంద్రం చెరువులోకి తరలించాలని ప్రతిపాదనలు చేస్తున్న ఆచరణ సాధ్యం కావడం లేదు. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పక్షుల కేంద్రాన్ని స్వయంగా సందర్శించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. నీటి కోసం అల్లాడుతున్న పక్షులు నిలిచిన బోటు షికారు చెరువు నీటిని నింపడంలో అధికారులు విఫలం ప్రతిపాదనలు పంపాం ఆటపాక పక్షుల కేంద్రంలో చెరువు గట్ల ఎత్తు పెంచడానికి ప్రతిపాదనలు పంపించాం. కోమటిలంక సమీప గట్లను మరమ్మతులు చేయించాం. చెరువు విస్తీర్ణం అధికంగా ఉండటంతో పూర్తి స్థాయిలో నీటిని నింపడానికి సాధ్యసాధ్యాలను పరిశీస్తున్నారు. ప్రస్తుతం ఆటపాకలో నీరు అడుగంటింది. బోటు షికారు నిలిపేశాం. చెరువులో పక్షుల ఆహారానికి కొరత లేదు. – ఎం.రంజిత్‌కుమార్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కై కలూరు. వేసవికి ముందుగానే నీటిని నింపాలి వేసవికి ముందుగానే అటవీ అధికారులు ఆటపాక పక్షుల చెరువులో నీటిని నింపాలి. ఆటపాక పంట కాల్వ నుంచి రామాలయం మీదుగా నేరుగా పక్షుల కేంద్రం చెరువుకు అండర్ గ్రౌండ్ పైపులైన్లు ఏర్పాటు చేయాలి. పోల్‌రాజ్ డ్రెయిన్(నాగరాజు కాల్వ) నుంచి వర్షాల సమయంలో నీటిని చెరువులో నింపేందుకు మరిన్ని లాకులను ఏర్పాటు చేయాలి. – ఎల్ఎస్.భాస్కరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
మహోదయం.. ఏసు పునరుత్థానం
కాళ్ల : జువ్వలపాలెంలో సమాధుల తోటలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం పెంటపాడు: తాడేపల్లిగూడెం పాతూరులోని సమాధుల తోటల్లో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు కరుణామయుడు ఏసు పునరుత్థానానికి చిహ్నంగా క్రైస్తవులు ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సమాధుల తోటలను ప్రత్యేకంగా అలంకరించి తమ కుటుంబసభ్యుల కోసం వేకువజామున కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల్లో విశేషంగా అలంకరించిన వేదికలపై క్రీస్తును ఆహ్వానిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. క్షమ, కరుణ, సహనానికి ప్రతీక ఈస్టర్ అని మత పెద్దలు ఉద్బోధించారు. – సాక్షి నెట్వర్క్ -
పేదలకు అప్పుల తిప్పలు
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వ పాలనలో పనులు లేక.. చిరు వ్యాపారాలకు పెట్టుబడులు దొరక్క.. సంక్షేమ పథకాలు అందక.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం రాక.. పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు యంత్రాలతో చేస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు చేతినిండా పని దొరకని పరిస్థితి. ఈ క్రమంలో కుటుంబ పో షణ భారం కాగా.. పిల్లలు చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు అప్పుల బాటపడుతున్నారు. కు టుంబ పోషణ, డ్వాక్రా రుణాల చెల్లింపునకు మహిళలు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ల ఖర్చు, బీమా తదితరాల కింద 10 శాతం రుణంలో మినహాయించుకుని ఇస్తున్నాయి. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. 2014లో చంద్రబాబు పాలనలోనూ ఇదే తరహా పరిస్థితులు ఉండగా అప్పట్లో చాలా మంది ప్రైవేట్ బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వేధింపులతో కాల్‌మనీ వ్యవహరంలో ప్రాణాలు పొగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పేదలకు కేవలం డ్వాక్రా రుణాలతోనే సరిపెడుతున్నాయి. సూపర్ సిక్స్.. మోసం ఫిక్స్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఇప్పటికీ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌సిక్స్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. కేవలం పింఛన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు మినహా మిగిలినవి అటకెక్కించింది. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వ్యాపారాలూ అంతంతమాత్రంగా సాగుతున్నాయి. ప్రధానంగా మహిళలకు ఎలాంటి పథకాలు అందడం లేదు. కంటి తుడుపుగా కార్పొరేషన్ రుణాలు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నామమాత్రంగా బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్ రుణాల పేరిట గ్రామం, వార్డుకు ఇద్దరు ముగ్గురికి చొప్పున రుణాలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దీంతో అర్హులకు రుణాలు అందని పరిస్థితి. పనులు లేక.. సంక్షేమం కానరాక.. అప్పుల బాటపడుతున్న ప్రజలు విద్య, వైద్యానికి వడ్డీ వ్యాపారుల చెంతకు.. నామమాత్రంగానే కార్పొరేషన్ రుణాలు పథకాలపై కూటమి కత్తి గత ఐదేళ్లలో సంక్షేమం పరవళ్లు భీమవరానికి చెందిన లక్ష్మి అనే మహిళ నాటి జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్ చేయూత ఆర్థిక సాయంతో అద్దెకు షాపు తీసుకుని చిన్నపాటి బట్టల దుకాణం పెట్టుకుంది. నాలుగేళ్ల పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం అందడం, కొనుగోళ్లు బాగుండటంతో వ్యాపారం బాగా జరిగింది. భర్త సంపాదనతో పాటు ఆమె ఆదాయంతో కుటుంబ చక్కగా నడిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో కొనుగోళ్లు లేక షాపు అద్దె చెల్లించడం కూడా భారంగా మారింది. దీంతో ఆమె బట్టల దుకాణం మూసివేసే పరిస్థితి వచ్చింది. పాలకోడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం పిల్లల ఫీజులు, డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం ప్రైవేట్ బ్యాంకు వద్ద రూ.50 వేలు రుణం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక కొరతతో కొన్ని నెలలు భవన నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు సరిగా లేక జీవనం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో వారం వారం బ్యాంకు వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఒత్తిళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కుటుంబాలు జిల్లాలో వందలాదిగా ఉన్నాయి. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకాల లబ్ధి పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో) చేయూత 2,72,111 552.88 ఆసరా 1,02,352 1,067.35 అమ్మఒడి 2,25,525 597.62 కాపు నేస్తం 2,24,286 79.40 ఈబీసీ నేస్తం 12,286 19.02 సున్నా వడ్డీ రుణాలు 2,64,719 14.02 సున్నా వడ్డీ (డ్వాక్రా) 11,65,513 110.51 నేతన్న నేస్తం 2,286 10.98 గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా సాయం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పేద, మధ్యతరగతి ప్రజలకు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాల లబ్ధి అందింది. ముఖ్యంగా మహిళల పేరిట పథకాలను అమలు చేయడంతో కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు ఇబ్బందులు ఉండేవి కావు. కరోనా విపత్తు సమయంలోనూ రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలు ఎన్నో పేద కుటుంబాల జీవనానికి భరోసాగా నిలిచాయి. వైఎస్సార్ చేయూత, ఆసరా (డ్వాక్రా రుణమాఫీ), అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల సాయంతో ఎందరో మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. పిల్లల స్కూల్, కళాశాల ఫీజులు, వైద్య ఖర్చులు కూడా నాటి ప్రభుత్వం భరించడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ఉండేది కాదు. దీంతో వారు అప్పులు చేసే పరిస్థితులు లేవు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. -
మధుర ఫలం.. ధర పతనం
నూజివీడు: మామిడి దిగుబడి ఈ ఏడాది తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందన్న మామిడి రైతుల, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారుల ఆశలు అడియాశలవుతున్నాయి. పండ్లలో రారాజుగా కీర్తిని సంపాదించుకున్న మామి డిని సాగు చేసిన రైతులకు నష్టాలను పంచుతోంది. రోజురోజుకూ మామిడి ధరలు పతనమవుతుండటంతో ఏంచేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మామిడి రైతులు, వ్యాపారులు కొట్టుమిట్టాడుతున్నారు. మామిడి దిగుబడి ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో మామిడి ధరలు బాగానే ఉన్నా రానురానూ పతనమవుతూ రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. కాయలకు డిమాండ్ ఉన్నా ధర మాత్రం పెరగడం లేదు. దీనంతటికీ మామిడి కాయలు కొనుగోలు చేసే సేట్లు సిండికేట్ కావడమే కారణమని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు ఈదురుగాలులు వీచి ఉన్న కాయలు ఎక్కడ రాలిపోతాయోనని రైతులు, తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలో రూ.1.20 లక్షలు మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో ముంబై మార్కెట్లో బంగినపల్లి రకం టన్ను రూ.1.20 లక్షల ధర పలికింది. క్రమేణా ఆ ధర రూ.90 వేలకు, రూ.60 వేలకు తగ్గి ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. దీంతో కిరాయిలు, కోతఖర్చులు పోను రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కలెక్టర్ (తోతాపురి) రకం పరిస్థితి సైతం అలాగే ఉంది. టన్ను ధర రూ.9 వేల నుంచి రూ.11 వేలు మాత్రమే లభిస్తోంది. పెట్టుబడులు పెరగడం, దిగుబడి పడిపోవడం, ధర తగ్గడంతో తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు లబోదిబోమంటున్నారు. స్థానిక మార్కెట్లలో సైతం.. మామిడి దిగుబడి లేనప్పటికీ స్థానికంగా ఏర్పాటు చేసిన కమీషన్ దుకాణాల్లో కూడా ధర తక్కువగానే ఉంది. ఆగిరిపల్లి మండలం ఈదర, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం, విస్సన్నపేటలో మామిడి కమీషన్ దుకాణాలు ఉన్నాయి. అక్కడ కూడా బంగినిపల్లి టన్నుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల ధర మాత్రమే లభిస్తోంది. అలాగే తోతాపురికి రూ.9 వేలు లభిస్తోంది. లోకల్ దుకాణాల్లో సూటు పేరుతో టన్నుకు 100 కిలోల కాయలను తీసుకుంటున్నారని, కమీషన్ 10 శాతం వసూలు చేస్తున్నారని, వీటితో పాటు హమాలీ చార్జీలు తీసుకుంటుండటంతో రైతుకు మిగిలేది ఏమీ ఉండటం లేదని రైతులు అంటున్నారు. విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్‌కు కాయలను తరలించే వారే కనిపించడం లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి మామిడి రైతులకు ఈ ఏడాది ఆదాయం పూర్తిగా పడిపోయిన క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన పంటలకు మాదిరిగా మామిడికి కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మామిడి పంట లాటరీగా మారిందని, ఇవే పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో మామిడి పంట మనుగడ ప్రశ్నార్థకరంగా మారనుందని వాపోతున్నారు. మామిడి.. తడబడి బంగినపల్లి, కలెక్టర్ రకాల ధరలు దారుణం దిగుబడి తక్కువే.. ధరా తక్కువే.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్. కాపు కలవరపాటు మామిడికి పెట్టింది పేరైన నూజివీడు నియోజకవర్గంతో పాటు చింతలపూడి ప్రాంతంతో కలుపుకుంటే జి ల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పూతలు బాగా వచ్చినా అందులో 20 శాతం కూడా పిందె నిలవలేదు. దీంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. అయితే దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగా ఉంటుందనుకుంటే అది కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రోజురోజుకూ ధర తగ్గుతూ..
ఈ ఏడాది మామిడి దిగుబడి బాగా తగ్గినా ధర పెరగకుండా తగ్గుతోంది. రోజురోజు కూ ధర తగ్గిపోతుండటంతో పెట్టుబడులు కూడా వస్తాయోరావోనని ఆందోళన పెరుగుతోంది. రసాయన మందుల పిచికారీ, తోట కాపలా, ఇతర ఖర్చులు కలిపి పెట్టుబడులు తడిసి మోపెడవుతుండగా మామిడికి మాత్రం ధర పెరగడం లేదు. – యర్రంశెట్టి రవితేజ, నూజివీడు నిరాశాజనకంగా ధరలు ఈ ఏడాది కాపు తక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుందని అనుకున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితిని చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సేట్లందరూ సిండికేట్ అయ్యి ధరను తగ్గించేస్తున్నారు తప్పితే పెంచడం లేదు. దీంతో పెట్టుబడులు ఏ మాత్రం రావు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. – బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు మండలం ● -
గోపీనాథపట్నంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం భక్తాంజనేయ స్వామి ఆలయ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవదాయ ధర్మదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆయన సతీమణి సౌదిని కుమారి రెండో రోజు ఆదివారం విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠంలో పీఠాధిపతి చేత అభిషేకాలు, పూజలు అందుకున్న శివలింగం ఆదివారం ఇక్కడికి చేరుకుంది. పంచామృతాలతో విగ్రహలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జలాదివాసం నిర్వహించారు. విశేష పూజల నడుమ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోపాలకృష్ణ చక్రవర్తి బ్రహ్మత్వంలో వేద పండితుల మంత్రోచ్ఛరణలతో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వాచ్మేనే వైద్యుడు
పెనుగొండ: అది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్.. జనరల్ ఫిజీషియన్ తప్ప మిగిలిన అన్ని విభాగాల్లోనూ వైద్యులు ఉన్నారు. అయితే ఆదివారం, పండుగ రోజుల్లో వైద్యులు అందుబాటులో ఉండరు. నర్సులు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయరు. దీంతో బాధితులకు వాచ్‌మేన్ వైద్యం అందిస్తుంటారు. ఇది పెనుగొండ సీహెచ్‌సీలో పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. ములపర్రులో ఆదివారం బాలుడు శ్రీనివాస్ సైకిల్‌పై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో తలకు గాయమైంది. దీంతో శ్రీనివాస్ ను మేనమామ ప్రదీప్ మోటార్‌సైకిల్‌పై పెనుగొండ సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోగా కనీసం నర్సులు బాలుడిని పరీక్షించి ప్రథమ చికిత్స అందించే పరిస్థితి లేకపోవడంతో అవాక్కయ్యారు. నర్సులు కనీసం చూడకపోవడంతో వాచ్‌మేన్ వచ్చి గాయపడిన బాలుడి తలను శుభ్రం చేసి బ్యాండేజ్ వేశారు. నర్సులు బాలుడిని కనీసం ముట్టుకోకుండా మందులు ఇచ్చి పంపించడం విశేషం. ఇది దారుణమంటూ బాలుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. వాచ్‌మేన్ వైద్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ కా వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. -
రామాలయంలో బంగారు అభరణాల అపహరణ
భీమడోలు: కోరుకొల్లు పంచాయతీ శివారు రత్నాపురంలోని రామాలయంలో బంగారు వస్తువులను దొంగించిన వ్యక్తిని భీమడోలు పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కోరుకొల్లు పంచాయతీ పరిధిలోని రామాలయంలో ఈనెల 14న రాత్రి గుడి తలుపుల తాళాలు పగులకొట్టి సుమారు 17 గ్రాముల బంగారు వస్తువులను పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన కట్టా సుబ్బారావు చోరీ చేసాడు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వై.సుధాకర్‌కు వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 19న రాత్రి గుండుగొలను వద్ద కట్టా సుబ్బారావును పట్టుకున్నారు. అతని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసి భీమడోలు కోర్టులో హాజరుపర్చారు. అన్యాయంగా ఇళ్లను తొలగిస్తున్నారు భీమవరం: పాలకోడేరు మండలం ఎస్ఆర్ నగర్లో అన్యాయంగా పేదల ఇళ్లను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తొలగిస్తున్నారని, పేదలకు అండగా ఉన్న సీపీఎం నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో లంకపేటలో ధర్నా నిర్వహించారు. సీపీఎం పట్టణ నాయకుడు ఎం.వైకుంఠరావు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ఉంటున్న పేదల ఇళ్లను నోటీసు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా తొలగించారని, 130 కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. ఉండి ఎమ్మెల్యే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా.. పేదల ఇళ్లను పీకి పడేస్తున్నారని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఎం నాయకులు మల్లిపూడి ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నరసాపురం జిల్లా జడ్జిగా వాసంతి
నరసాపురం : నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జిగా ఎ.వాసంతి ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ జిల్లా జడ్జిగా పనిచేసిన విజయదుర్గ విశాఖలోని ఏసీబీ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న తణుకు 4వ జిల్లా జడ్డి డి.సత్యవతి నుంచి వాసంతి బాధ్యతలు చేపట్టినట్టు కోర్టు పరిపాలనా అధికారి డి.నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. మాలలకు కూటమి ద్రోహంపెనుగొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని మాల సంఘాల జేఏసీ నాయకుడు ఉన్నమట్ల మునిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆచంట మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొడమంచిలి గ్రామంలోఅంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాలల ఆక్రోశానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి కులాల మధ్య చిచ్చుపెట్టడమే తప్ప సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వానికి చేతకాదని విమర్శించారు. ఆర్డినెన్స్‌కు టీడీపీ మాల నాయకులు మ ద్దతు పలకడం మాలజాతికి ద్రోహం చేసినట్లేన ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ సుంకర సీతారామ్, గౌరవాధ్యక్షుడు బీరా మధు, మండల జేఏసీ నాయకుడు కోట వెంకటేశ్వరరావు, జెంట్రీ శ్రీను, మట్టా చంటి, గుండే నరేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు పీజీఆర్ఎస్ భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా ప్రజాసమస్య ల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే డివిజన్, మండల స్థాయిల్లో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇళ్ల బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలి భీమవరం: ఉండి ఎమ్మెల్యే ప్రజల పట్ల వ్య వహరిస్తున్న తీరును ఏపీ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ విమర్శించింది. పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగర్లో పేదల ఇళ్లను ప్రభు త్వం అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు ఆది వారం ప్రకటన విడుదల చేశారు. ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల్లో నివసించే పేదలను తరిమికొట్టి, ఇళ్లను అక్రమంగా కూలగొట్టడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు తీరు అర్థమవుతుందన్నారు. అభివృద్ధికి అడ్డంగా పేదల ఇళ్లే కనిపిస్తున్నాయా అని ఎండగట్టారు. జిల్లాలో నీటి కాలుష్యం, వ్యర్థ కాలుష్యం, ఆహార కాలుష్యాన్ని అరికట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కాలువ గట్లు, రోడ్లు పక్కన నివసించే ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మించి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. పేద ముస్లింల కోసమే వక్ఫ్ చట్టం భీమవరం: పేద ముస్లింలకు న్యాయం జరగాలనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ముద్రించిన వక్ఫ్ సవరణ చట్టం ప్రయోజనాలను తెలియజెప్పే కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 20 వేల కరపత్రాలను అన్ని మండలాల అధ్యక్షులకు పంపిస్తామని, ముస్లింలలో ఈ చట్టంపై ఉన్న సందేహాలు తొలగిపోయేలా అన్ని వివరాలు ఇందులో పొందుపరిచినట్టు జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అ న్నారు. భీమవరం తూర్పు అధ్యక్షుడు అడ బాల శివ, పడమర అధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాద్, షేక్ మొహద్దీన్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గోవర్ధన్ కుమార్ పాల్గొన్నారు. -
కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
కై కలూరు: కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇటీవల కొల్లేరు సమస్యపై సుప్రీంకోర్టు 12 వారాల గడువు ఇవ్వడంపై వడ్డీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు అధ్యక్షతన కై కలూరు ట్రావెలర్స్ బంగ్లాలో ఏలూరు జిల్లా కొల్లేరు పెద్దలతో సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని సుప్రీంకోర్టు క్షేత్రస్థాయిలో కొల్లేరు సమస్యపై నివేదిక కోరిందన్నారు. త్వరలో సీఈసీ సభ్యులు కొల్లేరు అధ్యయనానికి వస్తారన్నారు. ఆయా గ్రామాల ప్రజలు అర్జీలతో సమస్య చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పర్యావరణంతో పాటు ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలనే వాదాన్ని ప్రజాప్రతినిధులందరూ తెలుపుతున్నామన్నారు. కొల్లేరు అభయారణ్య విస్తీర్ణం 77,535 ఎకరాలను 55,000గా నిర్ణయించి మిగిలినవి కొల్లేరు పేదలకు పంపిణీ జరిగేలా కృషి చేస్తామన్నారు. కొల్లేరు తరపున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ చేపల రైతుల సంఘం దాఖలు చేసిందని, దాంతో పాటు కొల్లేరు సంఘాల తరుపున ఇంప్లీడ్‌కు అవకాశం కల్పించాలని నాయకులు కోరారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు వడ్డీల సాధికారిత కన్వీనర్ బలే ఏసురాజు, సాహితీవేత్త వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాట్నాలమ్మకు రూ.56,105 ఆదాయం
పెదవేగి: రాట్నాలమ్మకు భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన రాట్నాలమ్మను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.26,300, విరాళంగా రూ.4,230, లడ్డూప్రసాదంపై రూ.23,175, ఫొటోల అమ్మకంపై రూ.2,400 కలిపి మొత్తం రూ.56,105 ఆదాయం లభించిందని దేవస్థాన ఈవో ఎన్.సతీష్‌కుమార్ చెప్పారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగమ్మతల్లి గుడి భక్తులతో కిటకిటలాడింది. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కోడి వ్యర్థాలు తరలిస్తున్న వ్యాన్ స్వాధీనం భీమడోలు: కోడి వ్యర్థాలు తరలిస్తున్న ముగ్గురిని ఆదివారం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐషర్ వ్యాన్‌ను సీజ్ చేశారు. విజయవాడకు చెందిన ఎం.రాంబాబు, ముసునూరు మండలం రంగంపేటకు చెందిన పిల్లి వెంకట రమణ హైదరాబాద్ నుంచి కోడి వ్యర్థాలను లింగంపాడులోని గంటా మోహనరావు ఆక్వా చెరువుకు తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వై.సుధాకర్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని సీజ్ చేసారు. -
శ్రీవారి క్షేత్రంలో భక్తజన సందోహం
ద్వారకాతిరుమల: సెలవుదినం కావడంతో ద్వారకాతిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. దానికి తోడు ఆలయ అనివేటి మండపంలో, పరిసర ప్రాంతాల్లో వివాహాలు, ఒడుగులు, అన్నప్రాసన వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. దాంతో క్షేత్ర పరిసరాలు కళకళలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం సిబ్బంది మజ్జిగ అందజేశారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై వీరిశెట్టిగూడెంకు చెందిన జానపద వృత్తి కళాకారుల సంఘం వారు నిర్వహించిన భజనలు భక్తులను అలరించాయి. క్షేత్రంలో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. -
క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం
తాడేపల్లిగూడెం (టీఓసీ): శశి విద్యా సంస్థల్లో క్రమశిక్షణతో పాటు విద్య, విజ్ఞానం నేర్పిస్తామని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అన్నారు. శశి తాడేపల్లిగూడెం క్యాంపస్‌లో 7, 8, 9, 10, 10 ప్లస్ 1 విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్‌పై ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. దాదాపు 5 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సదస్సులో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను ఒత్తిడి చేయకుండా వారు ఏదైతే చేయగలుగుతారో ఆ కోర్సులు మాత్రమే చేయగలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ మాట్లాడుతూ స్కూల్‌కి మార్కులు, ర్యాంకులు కోసమే కాకుండా విజ్ఞానం కోసం పంపాలని చెప్పారు. విద్యార్తులు ఫోన్ అవసరానికి వాడాలని, బానిస కాకూడదన్నారు. ఐఐటీ, నీట్‌పై తల్లిదండ్రులు అడిగిన సందేహాలు నివృత్తి చేశారు. సదస్సులో డైరెక్టర్ మేకా క్రాంతి సుధ, క్యాంపస్ ఇన్చార్జి కె.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యను మేమే అమ్ముకుంటాం
రొయ్య రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 4లో uచెత్త నియంత్రణతో ఆరోగ్యం కలెక్టర్ నాగరాణి తాడేపల్లిగూడెం: చెత్త నియంత్రణ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఈ దిశగా ప్రజలు చైతన్యవంతులు కావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఏర్పాటుచేసిన కంపోస్టు యూ నిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్మీ కంపోస్టు తయారీని క్రమపద్ధతిలో నిర్వహించాలని సూచించారు. అనంతరం 14వ వార్డులో జరిగిన ఈ–వేస్టు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు చైతన్యవంతులు, శక్తిమంతులని ప్రభుత్వ స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ–వ్యర్థాలను సక్రమ పద్ధతిలో తొలగించకపోతే ప్రమాదమన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు మాట్లాడుతూ చెత్త నిర్మూలన బాధ్యతగా భావించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు పాల్గొన్నారు. పాలిటెక్నిక్‌తో ఉజ్వల భవిష్యత్ పాలిటెక్నిక్‌తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని కలెక్టర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఉచిత శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రిన్సిపాల్ ఫణీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
1.15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
భీమవరం: జిల్లాలో 249 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 1,15,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రబీ 2024–25 గాను జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలుపై కొనుగోలు కమిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైతుల ఖాతాలలో ధాన్యం సొమ్ములను 48 గంటల సమయంలో జమ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం కావాల్సిన హమాలీలు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ఇప్పటివరకూ 59 లక్షల గోనెసంచులను రైతులకు పంపిణీ చేశామన్నారు. పది రోజులకు సరిపడా గోనె సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్య కొనుగోలులో సమస్యలు ఉంటే జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 81216 76653కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టి.శివరామ ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి జెడ్.వెంకటేశ్వరులు, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి శ్రీ నాగరాజు, జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సరోజ, తహసీల్దార్లు, మండల వ్యవసాయ, కో–ఆపరేటివ్ అధికారులు, పౌరసరఫరాల డీటీలు పాల్గొన్నారు. -
విలీన మండలాల్లో కరెంట్ కష్టాలు
లోఓల్టేజీ సమస్య తెలంగాణలో ఉన్నప్పుడు సమస్య వస్తే బూర్గంపాడు నుంచి లేకపోతే అశ్వారావు పేట నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుంచి లోఓల్టేజీ సమస్య వేదిస్తోంది. ఇప్పటికీ మా ఊరిలో లోఓల్టేజీతో గృహోపకరణాలు సరిగా పనిచేయడంలేదు. దీనిపై గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసినా ఫలితం లేదు. – నకిరికంటి వెంకటేశ్వర్లు, కొండపల్లి, కుక్కునూరు గంటల తరబడి అంతరాయం వేసవి కాలం వచ్చిందంటే వి ద్యుత్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. గడిచిన వారం రోజుల్లో కూడా రాత్రి మొత్తం విద్యుత్ సరఫరా లేక పిల్లాపాపలతో చాలా ఇబ్బంది పడ్డాం. పోలవరం ప్రాజెక్టు పేరుతో మా మండలాలను విలీనం చేసుకుని మా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. – పేరాల నరసింహారావు, కొండపల్లి, కుక్కునూరు ● ఈదురుగాలులతో తరచూ నిలిచిపోతున్న విద్యుత్ ● జంగారెడ్డిగూడెం నుంచి సరఫరాలో అవాంతరాలు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న ప్రజలు కుక్కునూరు: విలీన మండలాలను విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. వేసవి వచ్చిందంటే విద్యుత్ సమస్యతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరు మధ్యలో ఎక్కడ బలంగా గాలులు వీచినా గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో సరఫరా పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రావాల్సిందే.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు విద్యుత్ సబ్స్టేషన్లకు జంగారెడ్డిగూడెంలోని 132 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కుక్కునూరు మండలంలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా కావాలంటే జంగారెడ్డిగూడెం నుంచి మైసన్నగూడెం, ములగలంపల్లి, పి.నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు గ్రామాల్లోని సబ్స్టేషన్ల నుంచి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్యలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఏర్పడినా విలీన మండలాల ప్రజలు చీకట్లలో మగ్గాల్సిందే. అటవీ ప్రాంతం కావడంతో.. జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరం. ములగలంపల్లి నుంచి కుక్కునూరు మధ్య అటవీ ప్రాంతం మీదుగా విద్యుత్ లైన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంతో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రా విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య తీవ్రంగా మారింది. దీనిపై పలుమార్లు ప్రజలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. అల్లూరి జిల్లాలోని ఎటపాక 132 కేవీ సబ్‌స్టేషన్ నుంచి గోదావరి మీదుగా టవర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ను అందించాలని, లేకుంటే వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి వద్ద 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ దిశగా అధికారులు కూడా సర్వే చేసినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. -
కంటి వెలుగు లేదు
గత ప్రభుత్వంలో పెద్దపీట ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కంటి పరీక్షలు కొనసాగించాలి గతంలో ఆస్పత్రిలోని ఈఐ కేంద్రంలో, పాఠశాలలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి కంటి పరీక్షలు చేసేవారు. మందులు, కళ్లజోళ్లు ఇవ్వడంతో పాటు శస్త్రచికిత్సలు చేసేవారు. ఇలానే సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి. – వర్ధనపు సుధాకర్, రుస్తుంబాద పేదలకు ఇబ్బంది ఈఐ కేంద్రాల్లో కంటి పరీక్షలు నిలిపివేయడంతో పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సేవలందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటంతో పరీక్షలకు చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. – కురెళ్ల పౌలు, దుంపగడప, ఆకివీడు మండలం సాక్షి, భీమవరం: పేదల కంటి వైద్యానికి కూటమి ఎగనామం పెట్టింది. సీహెచ్‌సీల్లోని ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల కాంట్రాక్టు గడువు ముగిసి ఎనిమిది నెలలుగా సేవలు నిలిచినా పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అంతంతమాత్రంగానే ఉండటంతో పేదవర్గాలు కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో.. జిల్లాలోని భీమవరం, ఆచంట, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ల్లో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా కంటి వైద్యసేవలు అందించే వారు. ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఒక ఆఫ్త్త మాలజీ అసిస్టెంట్, ఒక ఎక్యూప్మెంట్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేవారు. ఆధునాతన ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, కంటి లోపల భాగాలను పరీక్షించే ఫండస్ కెమెరాలతో కంప్యూటర్ ద్వారా డీఆర్, గ్లకోమా, కాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్, హైపర్టెన్సీవ్ రెటీనోపతి తదితర సుమారు రూ.3 వేల విలువైన పరీక్షలు చేసేవారు. అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందించేవారు. కంటి సమస్యలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్య నిమిత్తం సమీపంలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులకు పంపేవారు. 8 నెలలుగా నిలిచిన సేవలు కాంట్రాక్టు సంస్థతో ఉన్న మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) గతేడాది సెప్టెంబరు 4తో ముగిసింది. సేవలను కొనసాగించే నిమిత్తం ఎంఓయూను రెన్యువల్ చేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఈఐ కేంద్రాల సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లోని ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, ఫండస్ కెమెరాలు, ఇతర సామగ్రిని అప్పట్లోనే కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది. ఈఐ కేంద్రాల గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ ఉచిత కంటి వైద్య పరీక్షల నిర్వహణపై కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్కూటమి చిన్నచూపు 8 నెలలుగా నిలిచిన ఈఐ కేంద్రం సేవలు కాంట్రాక్టు సంస్థతో గత సెప్టెంబరులో ముగిసిన ఎంఓయూ రెన్యువల్‌కు చొరవ చూపని కూటమి ప్రభుత్వం కంటి వైద్య సేవల కోసంపేదల ఇబ్బందులు గత ప్రభుత్వంలో జిల్లాలో 1,30,733 మందికి కంటి పరీక్షలు 90,059 మందికి కళ్లజోళ్ల పంపిణీ గత ప్రభుత్వంలో ఈఐ కేంద్రాల్లో అందించిన సేవలు ఈఐ కేంద్రం వైద్య పరీక్షలు రిఫ్రాక్షన్ చెక్స్ కళ్లజోళ్లు పంపిణీ ఫండస్ చెక్స్ ఆచంట 27,970 27,832 18,131 13,831 ఆకివీడు 20,576 20,407 13,688 7,246 భీమవరం 23,944 23,638 17,807 8,899 పాలకొల్లు 30,553 29,815 21,443 12,491 నరసాపురం 27,690 26,666 18,990 10,635 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2018లో ఏర్పాటైన ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కేంద్రాల్లో సేవలకు ఆంటంకం కలగకుండా కాంట్రాక్టు సంస్థతో ఎంఓయూ గడువును ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ వచ్చారు. ఈఐ కేంద్రాల ద్వారా మొత్తంగా 1,30,733 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 1,28,358 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 53,102 మందికి ఫండస్ చెక్స్, 90,059 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాక్యులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున వంద మందికి పైగా రోగులు వచ్చి కంటి వైద్యసేవలను ఉచితంగా పొందేవారు. -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో శనివారం క్రైస్తవులు నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ వసంతమహల్ సెంటర్, జ్యూట్‌మిల్లు, ఓవర్‌బ్రిడ్జి, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఇండోర్ స్టేడియం వద్దకు చేరింది. ముఖ్య అతిథులుగా ఐసీఎం సంఘాల అగ్రపీఠాధిపతి బిషప్ జాన్ ఎస్డీ రాజు, మన్నా చర్చ్ బిషప్ ఎలీషా రాజు హాజరయ్యారు. రన్ ఫర్ జీసస్ క్రైస్తవ సమాజంలో భాగమైపోయిందని, రాబోయే సంవత్సరాల్లోనూ కొనసాగించాలని బిషప్ జాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి అద్దం పడుతుందని బిషప్ ఎలీషా రాజు అన్నారు. ఇదే క్రమశిక్షణను క్రైస్తవులు నిరంతరం కొనసాగించాలని అమలోధ్బవి కథీడ్రల్ గురువులు ఫాదర్ మైఖేల్ ఇంజమాల అన్నారు. శ్యామ్ బాబు, రాజకుమార్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లూథరన్ సంఘ సీనియర్ గురువులు మిల్టన్, పీపీఎస్ కిరణ్, ఎంఎం కుమార్, యు.విలియమ్ కేరీ, పి.శ్యామ్ పాలీనా తదితరులు సందేశాలు అందించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం చేపట్టి డి.యోబు, కె.కిరణ్, జెర్మియా, కె.డేవిడ్ తదితరులు ప్రార్థనలు చేశారు. వందలాది మంది క్రైస్తవులు ర్యాలీలో పాల్గొన్నారు. -
పేదల ఇళ్ల తొలగింపు దుర్మార్గం
భీమవరం: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను తొలగించడానికి అక్కడి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక శాఖను అప్పగించినట్టుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్ దుయ్యబట్టారు. పేదల ఇళ్ల తొలగింపును నిరసిస్తూ శనివారం భీమవరం ప్రకాశంచౌక్‌లో నిరసన తెలిపారు. పాలకోడేరు మండలంలో ఎన్నో ఏళ్లుగా పేదలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తుంటే అధికార దురహంకారంతో ఉండి ఎమ్మెల్యే దుర్యోధన పర్వానికి తెరదీశారని మండిపడ్డారు. ఇళ్లు తొలగింపు సందర్భాల్లో భౌతిక దాడుల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పేదలపై దాడులు, దౌర్జన్యాలు తప్ప ఒనగూరిందేమి లేదన్నారు. పాలకోడేరులో పుంత పొడవునా సుమారు 50 సెంట్ల పోరంబోకు భూమిని పెత్తందారులు ఆక్రమించుకుని పొలాల్లో కలిపేసుకున్నారని, వారి జోలికి వెళ్లే దమ్ము ఉండి ఎమ్మెల్యేకు లేదని విరుచుకుపడ్డారు. పేదలపై ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే ప్రభుత్వ పతనం తప్పదని గ్రహించాలన్నారు. సీపీఎం జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం. వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డి.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. బొండాడలో నిరసన కాళ్ల: పేదల ఇళ్ల తొలగింపు దారుణమని సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని బొండాడ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఇంత దారుణానికి ఒడిగట్టడం సరికాదన్నారు. ఇలానే ఇళ్లు కూల్చుకుంటే పోతే రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గం శ్మశానంగా మారుతుందన్నారు. పే దలంటే చులకనగా చూస్తున్న ఎమ్మెల్యేకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అధిక సంఖ్యలో పేదలు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్‌లో శశి వేలివెన్ను విజయభేరి
ఉండ్రాజవరం: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో మరోసారి సత్తా చాటారని వేలివెన్ను శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో జి.అనూప్రాజ్ 26, డి.మణికంఠరెడ్డి 63, ఎ.శివరామ్ 142, బి.నిఖిల 159, ఏఎల్ జ్ఞాన ప్రకాష్ 168, కె.జైకిశాన్ 225, కె.ఆనంద్ 266, ఎం.సాయి కిరణ్ 292, పి.సుకుమార్ 363, పీవై సుందరరెడ్డి 436, డి.శర్వాన్ 448, ఐ.రామచరణ్ 477, కె.శివ సత్యదేవ్ 543, సీహెచ్ యశస్విని 623, షేక్ అబ్దుల్ వహబ్ 671, కె.ఆనంద్‌పాల్ 756, కె.ఉజ్వల్ కిరణ్ 859, కె.చరణ్‌దీప్ 871, బి.చైతన్య 913 ర్యాంకులు సాధించారని వివరించారు. 100 లోపు ఇద్దరు, 500 లోపు 12 మంది, 1,000 లోపు 19 మంది, 5,000 లోపు 58 మంది, 10,000 లోపు 101 మంది, 15,000 లోపు 134 మంది, 20,000 లోపు 161 మంది, 30,000 లోపు 219 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యా సంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు. శ్రీషిర్డీసాయి విద్యార్థుల ప్రతిభకంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య శనివారం విలేకరులకు తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడన్నారు. సీహెచ్ మోక్షిత్ 35, ఎం.మధులిక రెడ్డి 169, మోహన్ శ్రీరామ్ జీ 287 ర్యాంకులు కై వసం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనపరచారన్నారు. మొత్తం 10 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా, 23 మంది 2,000 లోపు, 45 మంది 5,000 లోపు, 64 మంది 10,000 లోపు, 88 మంది 20,000 లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. మొత్తం 245 మంది విద్యార్థులు హాజరుకాగా 186 మంది విద్యార్థులు అడ్వాన్స్‌కు అర్హత సాధించారన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
మా రొయ్యను మేమే అమ్ముకుంటాం
పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రోడ్డెక్కినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం శనివారం పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డు నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లే మార్గ మధ్యలో ఓ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘ సెక్రటరీ బోణం చినబాబు మాట్లాడుతూ ప్రాసెసింగ్ ప్లాంట్లపై ఆధారపడి ఇప్పటివరకూ ఆక్వా రైతులు చాలా నష్టపోయారన్నారు. డొమెస్టిక్ సేల్స్ కేంద్రం ఇటు వినియోగదారుడు, అటు ఆక్వా రైతుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అలాగే కొందరు మహిళలకు ఉపాది కూడా కల్పించినట్లు అవుతుందన్నారు. ఈ నెల 30 వ తేదీన శంకుస్థాపన చేస్తామని, అనంతరం మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పక్కాగా ప్రారంభోత్సవం చేయాలనే సంకల్పంతో తమ సంఘం ఉందన్నారు. ప్రారంభం అయిన వెంటనే ఇక్కడ రూ.100కు రొయ్యలను అందజేస్తామన్నారు. అంతా రెడీ కుక్లా ప్యాకింగ్‌లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా రైతు 100 కౌంట్‌కు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్న సమయంలో నేరుగా ఈ కౌంటర్ వద్దకు తీసుకువచ్చి తన రొయ్యను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. లోకల్ సేల్స్ పెరిగిందంటే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే కౌంటర్ మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా అమలైందంటే ఈ కార్యక్రమం విజయవంతమైనట్టేనని అన్నారు. ఆక్వా సంఘ సభ్యులు మేడిది జాన్‌రాజు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం ఏర్పాట్లు చేస్తున్న జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం -
ఉత్తమ ప్రదర్శనగా ‘ఇది అతని సంతకం’ నాటిక
భీమవరం: పట్టణంలో కళారంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించిన 14వ జాతీయస్థాయి నాటిక పోటీల్లో గుంటూరు వారి అభినయ ఆర్ట్స్ ‘ఇది అతని సంతకం’ నాటిక ప్రథమ బహుమతిని గెల్చుకుంది. అంతేకాకుండా ఈ నాటిక నుంచే ఉత్తమ నటనకు, దర్శకత్వానికి ఎన్ రవీంద్రరెడ్డికి ఉత్తమ సంగీతానికి లీలామోహన్ బహుమతులు అందుకున్నారు. విజేతల వివరాలను న్యాయనిర్ణేతలు గంటా రామ్మోహనరావు, అల్లు రామకృష్ణ, గంటా ముత్యాలరావునాయుడు శనివారం విలేకర్లకు తెలిపారు. ఉత్తరాంధ్ర సౌజన్య కళాప్రవంతి వారి దేవరాగం నాటిక ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా బహుమతి అందుకుంది. ఉత్తమ నటనకుగాను బీఎస్ఎస్ శివ (దేవరాగం), వరప్రసాద్ (అనస్వరం), మంజునాఽథ్ (హక్కు), జ్యోతిరాణి (దేవరాగం), బహుమతులు గెల్చుకోగా ఉత్తమ రచనకు దేవరాగం నాటికి రచయిత కేకేఎల్ స్వామి, ఉత్తమ ఆహార్యం తితిక్ష నాటిక, ఉత్తమ రంగాలంకరణ తితిక్ష నాటికకు టి బాబురావు బహుమతులు అందుకున్నట్లు న్యాయనిర్ణేతలు తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కళారంజని నాటక అకాడమీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జవ్వాది దాశరథి శ్రీనివాస్, మెంటే పూర్ణచంద్రరావు, గుండా రామకృష్ణ, మల్లుల సీతారామ్‌ప్రసాద్, పులగం శివనాగనర్సింహరావు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్య క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు వెలువడటంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. భక్తులతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద ఉచిత అన్నప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. పార్కింగ్ ప్రదేశాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
గుడ్‌ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి
పేరుపాలెం బీచ్‌లో స్నానానికి దిగి ఒకరి మృతి నరసాపురం రూరల్ : క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి జరుపుకునే గుడ్‌ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 40 రోజుల ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వాసులు పేరుపాలెం తీరంలోని వేళాంకణ్ణి మాత ఆలయం వద్ద మాల విరమణ చేసేందుకు శుక్రవారం రాత్రినుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇందులో శనివారం వేకువ జామున సముద్రస్నానానికి దిగిన ఇద్దరు యువకులు సముద్రపు అలలకు ఉక్కిరి బిక్కిరై ఒడ్డుకు ప్రాణాలతో కొట్టుకు వచ్చారు. వీరిలో నల్లజర్ల మండలం ప్రకాశపాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్‌కుమార్ (19) అనే యువకుడిని స్థానికులు, పోలీస్ సిబ్బంది మొగల్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉండటంతో నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయకుమార్ తండ్రి చిన్న తనంలోనే మృతి చెందగా తల్లి విజయలక్ష్మి బిడ్డను చూసుకుంటోంది. ఈ ఘటనపై మృతుడి అక్క విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు 2వ ఎస్సై వై నాగలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే ప్రమాదంలో బయట పడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు భీమవరంలో చికిత్స చేయించి సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. -
ఒలింపియాడ్‌లో 29 మంది విద్యార్థులకు ర్యాంకులు
తాడేపల్లిగూడెం రూరల్: ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ సంస్థ (గురుగ్రామ్) వారు నిర్వహించిన గణిత, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ పరీక్షల్లో మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ బి.రాజారావు శనివారం తెలిపారు. మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో 30 మందికి గాను ఐదుగురు, ఇంగ్లీష్ పరీక్షలో 20 మందికి గాను ముగ్గురు, సైన్స్ పరీక్షలో 62 మందికి గాను 12 మంది, జనరల్ నాలెడ్జ్‌లో ముగ్గురికి ముగ్గురు ఇంటర్నేషనల్, సోషల్ విభాగంలో 34 మందికి గాను ఆరుగురు ఇంటర్నేషనల్ ర్యాంకులతో పాటు జోనల్, క్లాస్ ర్యాంకులు, గోల్డ్ మెడల్స్ సాధించినట్లు వివరించారు. సైన్స్ ఒలింపియాడ్‌లో రోషన్ (ఏడవ తరగతి), పృధ్వీ (8వ తరగతి), చిగురుపల్లి వివేక్ (9వ తరగతి), పిట్టా తంబి, అరవింద్ సాగర్‌బాబు (10వ తరగతి) మొదటి ర్యాంకులు సాధించారన్నారు. అలాగే ఇంగ్లీష్ ఒలింపియాడ్‌లో కంకిపాటి శాండీ రేవంత్ (8వ తరగతి) మొదటి ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 29 మంది ప్రతిభ కనబర్చారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయాధికారిణి బి.ఉమాకుమారి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ బి.ప్రతాప్, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఆ ఊరంతా నారసింహులే..
నంబర్‌తో పిలిచేవారు మా గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో రాజవరంలోని పాఠశాలకు వెళ్లి చదువుకునే వాళ్లం. మా గ్రామం నుంచి వెళ్లిన వారిలో ఎక్కువ మంది నరసింహమూర్తి పేరుగల వారం ఉండేవారం. దాంతో ఉపాధ్యాయులు ఒకటి, రెండు, మూడు ఇలా పది మందికి నంబర్లు పెట్టారు. అటెండెన్స్ వేసేటప్పుడు కూడా ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారు. నా నంబర్ ఏడు కాబట్టి నన్ను ఏడు గాడు వచ్చాడా అని పిలిచేవారు. – పసుపులేటి నరసింహమూర్తి ఆనవాయితీగా మారింది లక్ష్మీనరసింహ స్వామివారి పేరును పిల్లలకు పెట్టడం ఈ గ్రామంలో ఆనవాయితీగా మారింది. ఆ క్రమంలోనే నా తల్లిదండ్రులు నాకు నరసమ్మ అని పేరు పెట్టారు. లక్ష్మీనరసింహ స్వామివారిపై ఉన్న భక్తి, నమ్మకంతో ఆయన పేరును నామకరణం చేస్తున్నారు. ఆ స్వామి పేరులోనే ఏదో మహత్యం ఉంది. – బోయిన నరసమ్మ నా మనుమరాలికి కూడా స్వామి పేరే పెడతా.. నా తండ్రి పేరు నరసయ్య, నా భార్య పేరు లక్ష్మీ నరసమ్మ, నా కుమార్తె పేరు నాగవెంకట నరసమ్మ. నా మనుమరాలికి మరి కొద్దిరోజుల్లో పేరు పెట్టాల్సి ఉంది. ఆమె పేరు కూడా స్వామివారి పేరే పెడతాను. నా పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో గ్రామంలో నన్ను ఒకటి గాడు అని పిలుస్తారు. – ముత్తింటి నరసింహమూర్తి ద్వారకాతిరుమల: ఆ ఊరిలో వెలసిన నారసింహుడంటే వారికెంతో నమ్మకం. ఆ ఊరిలో మగబిడ్డ పుట్టినా.. ఆడ బిడ్డ పుట్టినా.. ఆ స్వామివారి పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ఊరిలో ఏ గడప తొక్కినా.. నరసింహ, నరసయ్య, నరసింహమూర్తి, నరసింహస్వామి, లక్ష్మీనరసమ్మ, నరసమ్మ వంటి పేర్లే వినిపిస్తాయి. ఇప్పటికే నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో కొంత మందిని నంబర్లతో పిలుస్తున్నారు. ఇదే ఈ ఊరి ప్రత్యేకత. ఇక్కడ ఏ ఇంట శుభకార్యం జరగాలన్నా ముందు ఆ స్వామిని దర్శించి, పూజలు జరుపుకుంటారు. ఆ తరువాతే అడుగు ముందుకు వేస్తారు. ఎన్నికల సమయాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ ఊరి నుంచే ప్రచారాలను మొదలు పెడతారు. ఎందుకంటే ఈశాన్యం మూల ఉన్న ఊరు ఇది.. అందులోనూ నారసింహుని సన్నిధి నుంచి ప్రచారం మొదలు పెడితే ఇక తిరుగు ఉండదన్న నమ్మకం వారిది. అందరికీ అంత సెంటిమెంట్ ఆ స్వామివారంటే. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం గ్రామం నారసింహుని క్షేత్రంగా విరాజిల్లుతోంది. సుమారు వెయ్యి మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో, రెండు వందల మందికి పైగా స్వామివారి పేరుగల వారు ఉన్నారంటే అతిశయోక్తికాదు. నామకరణం వెనుక చరిత్ర ఇదీ.. సుమారు వందేళ్ల క్రితం అప్పటి ఠాణేదారు అయిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చర్లకోట రామారావు, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెంది గూడూరు అయ్యన్న, బెల్లన్న అరణ్యప్రాంతమైన ఈ మార్గం గుండా వెళుతున్నారు. కొందరు పశువుల కాపర్లు కొండపైన ఏదో ఉందని, అప్పుడప్పుడు పశువుల కోసం కూత వేస్తుంటే తిరిగి కూత వినిపిస్తోందని వారికి చెప్పారు. దాంతో వారు డొంకలు నరుక్కుంటూ కొండపైకి చేరుకుని అక్కడ స్వయంభూ నరసింహ స్వామిని గుర్తించి పాల పొంగలిచేసి స్వామివారికి నివేదించారు. ఆ వెంటనే మండు వేసవి రోజున వర్షం కురిసింది. దాంతో స్వామివారు ఎంతో మహిమాన్వితుడని రామారావు నమ్మారు. తనకు సంతానం లేకపోవడంతో స్వామివారిని మొక్కుకున్నారు. దాంతో ఆయనకు కలిగిన మొదటి సంతానమైన కుమారుడికి స్వామివారి పేరు పెట్టుకుని, ఇలవేల్పుగా కొలిచారు. ఆ తర్వాత ఆయన మనుమడికి సైతం కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆయనే గురూజీగా ప్రతి ఏటా శివరాత్రి నాడు ఈ నారసింహుని క్షేత్రంలో మహా యజ్ఞాన్ని నిర్వహిస్తూ, స్వామివారి కీర్తిని చాటుతున్నారు. తికమక పడకుండా నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో పిలిచేవారు అలాగే పలికేవారు తికమక పడేవారట. దాంతో వారు చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు కొంత మంది నరసింహమూర్తులకు నంబర్లు పెట్టారు. ఒకటి గాడు, రెండు గాడు, మూడు గాడు ఇలా పది నంబర్ల వరకు పెట్టారు. క్లాస్‌కి వచ్చే ఉపాధ్యాయులు ఏరా.. ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారట. ఇప్పటికీ గ్రామంలో వారిని ఆ నంబర్లతోనే పిలుస్తుండటం విశేషం. పుట్టిన ప్రతి బిడ్డకూ నరసింహ నామకరణం నరసింహమూర్తి, నరసమ్మల పేర్లే అధికం ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండటంతో నంబర్లతో పిలుపు ఐఎస్ జగన్నాధపురంలో అదే ప్రత్యేకత లక్ష్మీనరసింహ స్వామివారే ఆ గ్రామ ప్రజల ఆరాధ్య ధైవం ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుతో.. నా పేరు పసుపులేటి నరసింహమూర్తి. నా కుమార్తెకు కూడా నరసమ్మ అని పేరుపెట్టాను. ఆ లక్ష్మీనరసింహ స్వామివారిని మదినిండా నింపుకున్నాం. అందుకే మా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుగల వారు ఉంటారు. – పసుపులేటి నరసింహమూర్తిఎక్కడా ఇలా లేదు ఎన్నో గ్రామాల్లో క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా దేవుళ్ల పేరును ఇంతిలా పెట్టుకున్న వారు లేరు. నరసింహమూర్తి అనే పేరు ఎంత మందికి ఉన్నా.. ఇంకా పుడుతున్న బిడ్డలకు ఆ పేరునే పెట్టుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు ఆడపిల్లలకు నర్సవేణి, నకవల్లి పేర్లు కూడా పెడుతున్నారు. అందుకే ఈ గ్రామ ప్రజలపై స్వామివారి కృపా కటాక్షాలు ఉంటున్నాయి. – కోడూరి ఈశ్వర శర్మ, లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు -
వాహన దొంగల అరెస్టు
కై కలూరు: వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను కలిదిండి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్లో రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. పేట కలిదిండికి చెందిన వనమాల జగదీష్(31), కలిదిండికి చెందిన చేబోయిన శ్యాంతేజా(28) ఇటీవల ఈ ప్రాంతంలో 5 వాహనాలను దొంగతనం చేశారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకుని మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ఏఎస్సై కె.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.రమేష్, డి.వడ్డీ కాసులు, హోంగార్డు కట్టా శ్రీనులను సీఐ రవికుమార్ అభినందించారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి భీమవరం: మోటారుసైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందాడు. భీమవరం టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న రాజమహేంద్రవరానికి చెందిన ఎం జ్ఞానసాగర్(21) శుక్రవారం రాత్రి తన స్నేహితుడు కె సాయిభరత్తో కలసి గరగపర్రు రోడ్డులోని తన రూమ్ నుంచి మోటారు సైకిల్‌పై పట్టణంలోకి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్‌ను తప్పించబోయి అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో జ్ఞానసాగర్ తలకు తీవ్ర గాయాలు కాగా సాయిభరత్కు స్వల్పగాయలయ్యాయి. వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా జ్ఞానసాగర్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సాయిభరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. పురుగు మందు తాగి.. పెనుగొండ: అనారోగ్యంతో మనస్తాపానికి గురై ఆచంట శివారు బాలం వారి పాలెంకు చెందిన వేండ్ర శ్రీను (49) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేండ్ర శ్రీను గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నాడు. దీనికి తోడు కుమార్తే సైతం మానసిక వ్యాధితో బాధ పడుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శనివారం కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలుపు మందు తాగడం గమనించిన భార్య కుమారుడుకు చెప్పడంతో హుటాహుటిన శ్రీనుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం తణుకు, ఏలూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డ్యూటీ డాక్టర్ పరీక్షించి శ్రీను మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి బంధువు వేండ్ర మురళీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఆచంట ఎస్సై కేవీ రమణ తెలిపారు. -
వైభవంగా ఎంబెరుమానార్ స్వామి రథోత్సవం
నరసాపురం రూరల్: శ్రీఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నరసాపురం పట్టణంలో రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి రథంలో ఉంచారు. ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చే కార్యక్రమంలో స్థానాచార్యులు కె.వెంకటాచార్యులు, అధ్యాపక స్వామి ముడుంబై మోహన నర్సింహాచార్యులు, అర్చక స్వాములు పెద్దింటి మోహన రామాచార్యులు, శ్రీనివాసుల జగన్నాథాచార్యులు, సుదర్శనం శేషాచార్యులు, శ్రీనివాసుల రామకృష్ణ పాలు పంచుకున్నారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. రథోత్సవానికి ముందు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణలు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్‌వీవీఎస్ రామచంద్రకుమార్, ఫౌండర్ ట్రస్టీ పుప్పాల వెంకట కృష్ణారావు, పుప్పాల ఆదినారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పోలీస్ శాఖకు అత్యాధునిక డ్రోన్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని, నేరాలను నిరోధించటం, బాధితులకు న్యాయం చేయటమే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లా పోలీస్ శాఖ సొంతం చేసుకుంటోందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం అవంతి ఫీడ్స్ సంస్థ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు రూ.8 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్‌ను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. ఐజీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే డ్రోన్ కెమెరాను పోలీస్ శాఖకు అందించటం అభినందనీయమన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అనేక కేసులను ఛేదించే క్రమంలో, నేరాలను నిరోధించేందుకు ఇలాంటి ఆధునిక డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాలకు వెలుపల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా మరింత పటిష్టం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలను సమకూర్చుతున్నామని తెలిపారు. అవంతి ఫీడ్స్ సంస్థ డ్రోన్‌ను అందజేసి ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ పి.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఐజీకి అందజేసిన అవంతి ఫీడ్స్ అధినేత -
చిక్కుముడిగా వంతెన నిర్మాణం
పోలవరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అధికారులు పోలవరం రూరల్: మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు శనివారం పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. మహారాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి సంజయ్ బెల్సారే, గోదావరి నది నిర్వహణ ఔరంగాబాద్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ తీర్మన్వర్, జలవనరులవిభాగం పుణె చీఫ్ ఇంజనీర్ హనుమంత్ గుణాలే, సీడీఓ నాసిక్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఆశీష్ డియోగడే పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమలను సందర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్ వే, స్పిల్ వే గేట్లు, ఫిష్ లేడర్, ఎగువ, దిగువ కాఫర్ డామ్స్, డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతం, పోలవరం జల విద్యుత్తు కేంద్రం తదితరాలను వీరు ఆసాంతం పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను సీఈ నరసింహమూర్తి వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టులో ఫిష్ లేడర్ ప్రత్యేకతను ఏపీ జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేకంగా వివరించారు. వరద సమయంలో పులస చేప గోదావరి నదికి ఎదురీదుతూ వస్తుందని, ప్రత్యేకంగా ఆ చేపల కోసమే ఫిష్ లేడర్ నిర్మించామని, దేశంలో మరెక్కడా ఇలాంటి నిర్మాణం లేదని మహారాష్ట్ర అధికారులకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర అధికారులు పట్టిసీమ ఎత్తిపోతల పథకం సందర్శించారు. అక్కడ పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు. అనంతరం అధికారులను ప్రాజెక్ట్ సీఈ కె.నరసింహమూర్తి శాలువా కప్పి సత్కరించారు. ఈఈ డి.శ్రీనివాస్, ఏఈఈలు పద్మకుమార్, అనిల్ కుమార్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్‌బాబు అంగర, డీజీ ఎం.మురళి పమ్మి పాల్గొన్నారు. భీమడోలు: గోదావరి కాల్వపై నిర్మిస్తున్న కొత్త వంతెన నిర్మాణ పనులు సాంకేతిక కారణాల రీత్యా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జల రవాణా శాఖ ఈ వంతెన నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్లాబ్ దశలో ఉన్న పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గోదావరి కాల్వపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి పాత వంతెన రెండున్నర సంవత్సరాల క్రితం కూలిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏడాదిన్నర క్రితం కాల్వపై నిర్మించిన తాత్కాలిక బెయిలీ వంతెనపై భారీ వాహనాల రాకపోకలతో వంతెన శిథిలావస్థకు చేరింది. గత కొంతకాలంగా బెయిలీ వంతెనపై ఉన్న ఇసుప ప్లేట్లు తుప్పు పట్టడంతో పాటు నట్లు ఊడిపోయాయి. దీంతో ప్లేట్లు గతి తప్పి చిన్న వాహనం వెళ్లినా భారీ శబ్దాలతో దడ పుట్టిస్తున్నాయి. కాలం చెల్లిన తాత్కాలిక వంతెనపై ప్రయాణం బిక్కుబిక్కుమంటూ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వంతెనపై రాకపోకలు సాగించే భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ వంతెన కూలేందుకు సిద్ధంగా ఉండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు గ్రామాల వారికి ఇదే ప్రధాన ద్వారం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాల నుంచి జాతీయ రహదారికి రావడానికి ఈ వంతెనపై నుంచి వెళ్లాల్సిందే. అలాంటి వంతెనపై భయం భయంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ సమస్యను భీమడోలు ఏఎంసీ మాజీ చైర్మన్ వగ్వాల భాస్కర్ సంబంధిత ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ అండ్ బీ శాఖ వద్ద నిధుల కొరత తీవ్రంగా ఉందని, బెయిలీ వంతెన మరమ్మతులకు పంచాయతీ నిధులు కేటాయించాలని ఆర్ అండ్ బీ అధికారి పంచాయతీకి లేఖ రాశారు. దీంతో తాత్కాలిక వంతెనకు మరమ్మతులు పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా నిర్మించిన బెయిలీ వంతెనపై ఎన్నాళ్లు పాట్లు పడాలంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక అడ్డంకులు తొలగించి శాశ్వత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానిక వార్తలు గుండుగొలనులో కొత్త బ్రిడ్డి నిర్మాణానికి సాంకేతిక అడ్డంకులు కూలేందుకు సిద్ధంగా బెయిలీ వంతెన -
రక్తదానంతో ప్రాణదానం
భీమవరం (ప్రకాశంచౌక్): రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా పంచాయతీ అధికారి అరుణశ్రీ అన్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించారు. ఆయా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పంచాయతీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్ అరుణశ్రీ భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎంఎస్వీ భద్రిరాజు చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ చేసిన దాతలకు, ధ్రువీకరణ పత్రాలు అందించారు. సుమారుగా 90 మంది జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగులు, అధికారులు రక్తదానం చేశారు. -
జీతాలు ఇవ్వండి.. మహాప్రభో!
నూజివీడు: జీతాలు సకాలంలో అందక ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను వేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న దాదాపు 1000 మంది టీచింగ్, నాన్ టీచింగ్, పర్మినెంట్ ఉద్యోగులకు ఈనెల 16వ తేదీ గడచినా ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. దీంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో పనిచేసే ఉద్యోగుల్లో పర్మినెంట్ ఉద్యోగులు 30 మంది లోపే ఉండగా మిగిలిన వారంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం యూనివర్సిటీనే నెల ప్రారంభంలోనే వేతనాలను చెల్లిస్తుంది. పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు మాత్రం ఈ నెల 17వ తేదీ వరకు కూడా వేతనాలు జమ కాలేదు. ఈ నెల మొదటి వారం నుంచి జీతాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని వారు వాపోతున్నారు. సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వైద్యం ఖర్చులు, పిల్లల ఫీజుల చెల్లింపు, నెలవారీ మందుల ఖర్చులు, పాల బిల్లులు, సరకుల బిల్లులు ఇలా అనేక వాటికి చెల్లించలేకపోతున్నామని లబోదిబోమంటున్నారు. అడ్వాన్సులతో కాలక్షేపం జీతం డబ్బులు నెలలో సగం రోజులు గడచినా రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు వర్సిటీ నిధుల్లో నుంచి ఎవరైతే అడ్వాన్సులు కావాలని అడిగారో వారికి జీతంలో సగం మొత్తం అడ్వాన్సులు ఇచ్చారు. దీంతో అధిక శాతం మంది తమ జీతంలో 50 శాతం అడ్వాన్సు తీసుకొని కాలం గడుపుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సకాలంలో జీతాలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 17వ తేదీ గడచినా ట్రిపుల్ ఐటీలో ఇంకా అందని జీతాలు బడ్జెట్ మంజూరైంది వేతనాలకు సంబంధించి బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. రెండు రోజుల్లో కాంట్రాక్టు, పర్మినెంట్ ఉద్యోగులకు సంబంధించి జీతాలు వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. ప్రతినెలా సకాలంలోనే జీతాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. – బి.లక్ష్మణరావు, ఏఓ, నూజివీడు ట్రిపుల్ ఐటీ -
రెండోరోజూ మట్టి నమూనాల పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో మట్టి నాణ్యత పరీక్షలను గురువారం రెండవ రోజు కూడా కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేశారు. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్దార్ధ హెడవో, విపుల్ కుమార్ గుప్త ప్రాజెక్టు ప్రాంతంలోని దండంగి, జలవిద్యుత్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో నిల్వ చేసిన మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానిక లేబోరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా పరిశీలించేందుకు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు. క్షేత్రస్థాయిలో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ సెంటర్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్, డయాఫ్రమ్‌వాల్ ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వీరి వెంట ప్రాజెక్టు ఈఈ శ్రీనివాసులు, డీఈ వి.నిర్మల, మేఘ ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ సీహెచ్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి పాలకొల్లు సెంట్రల్: ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి 23 శాతం జీతం పెంచాలని లంకలకోడేరు పీహెచ్సీ కన్వీనర్ గౌతమి తెలిపారు. గురువారం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, సీహెచ్‌ఓలుగా పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాల సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక ఎన్జీఓ యూనిట్ అధ్యక్షుడు గుడాల హరిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ పని ఆధారిత ప్రోత్సాహకాలను సవరించాలని, ఈపీఎఫ్‌ను పునరుద్దరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సుజిత, రాజశ్రీ, యువతేజ, స్రవంతి, కృష్ణవేణి, లిఖిత, శైలజ, శిరీష, అన్నప్రైస్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలి ఏలూరు(మెట్రో): ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
ప్రొటోకాల్ పాటించడం లేదు
ఏలూరు (టూటౌన్): అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని పలువురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు మండిపడ్డారు. తామేమీ ప్రభుత్వ పెద్దలచే నామినేట్ అయిన సభ్యులం కాదని ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులమని గుర్తు చేశారు. గురువారం జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సర్వ సభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పి.థాత్రీ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, చిర్రి బాలరాజు,, జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్లు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్.చిన్న రాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గడువులోగా మంచినీటి చెరువులను నింపాలి ఉమ్మడి జిల్లాలో పంట కాలువలను ఈ నెల 22తో కట్టివేస్తున్నందున అన్ని మంచినీటి చెరువులను గడువులోగా నీటితో నింపుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా సమావేశంలో ఎకరాకి 50 బస్తాల వరకే ధాన్యం కొనుగోలు చేయడంపై పలువురు డెల్టా జెడ్పీటీసీలు వ్యవసాయాధికారులను నిలదీశారు. ఎటువంటి కోతలు లేకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. అలాగే తమ మండలంలో చేపట్టే పనుల ప్రతిపాదనలు సమర్పించినా జెడ్పీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు నిలదీశారు. తాము ప్రతిపాదించిన పనులను టేక్అప్ చేయకండా ఎవరో చెప్పిన పనులను మాకు తెలియకుండా ఎలా చేపడతారు అంటూ ప్రశ్నించారు. అందరినీ సమానంగా చూడాలి ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వస్తే పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ వేదిక మీదకు ఆహ్వానించారని అదే తాను వస్తే సాధారణంగా పైకి ఆహ్వానించారని ఇదెక్కడి పక్షపాతమంటూ ప్రశ్నించారు. జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గత 18 నెలలుగా వేతనాలు రావడం లేదని, వీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పీఎంజీపీవైలో 2023–24లో 94 దరఖాస్తులు అందగా వాటిలో 34 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, 2024–25లో 84 దరఖాస్తులు అందగా 48 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. ఇలా అయితే ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సీడీని విడుదల చేసేలా చూడండి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులకు త్వరగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు జిల్లాలకు సంఖ్యా బలం ఆధారంగా సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించగా తాడేపల్లిగూడెంకు మాత్రం రూ.7 కోట్లు కేటాయించారని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు మంజూరైనా పనులు మొదలు కాక తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలో కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నా హాజరైంది మాత్రం ముగ్గురే. అందులో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజు వచ్చామా.. నాలుగు పలుకులు పలికామా.. అన్నట్లు పలికి వెళ్లిపోయారు. మధ్యలో వచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ సభ పూర్తయ్యేవరకు ఉన్నారు. తామేమి నామినేట్ సభ్యులం కాదని జెడ్పీటీసీల మండిపాటు వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం సమావేశానికి ప్రజాప్రతినిధుల గైర్హాజరు -
రూ.46.95 లక్షల మిగులుతో జెడ్పీ బడ్జెట్ ఆమోదం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ బడ్జెట్‌ను రూ.46.95 లక్షల మిగులుతో ఆమోదించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈమేరకు సభ్యులు ఏకగ్రీవంగా బడ్జెట్‌ను ఆమోదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా పరిషత్ మొత్తం ఆదాయం రూ.153.16 కోట్లుగా, వ్యయం రూ.152.69 కోట్లుగా అంచనా వేశారు. దీంతో రూ.46.95 లక్షలు మిగులుతో బడ్జెట్‌ను ఆమోదించారు. సమన్వయంతో పనిచేద్దాం ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె మొదటగా 1వ, 7వ స్థాయి సంఘాల సమస్యలు, రెండవ విడతగా 2, 3, 4, 5, 6 స్థాయి సంఘాల సమావేశాల్లో ఆయా అంశాలపై గురువారం సమీక్షంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన కొన్ని పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కె.భీమేశ్వరరావు, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. మొగల్తూరు రోడ్డు ప్రమాద ఘటనలో మరో వ్యక్తి మృతి నరసాపురం: మొగల్తూరులో 216 జాతీయ రహదారి పక్కన పని చేసుకుంటున్న ఉపాధి హామీ కూలీలపై బుధవారం అదుపుతప్పి దూసుకొచ్చిన నూనె డబ్బాల వ్యాన్ బోల్తా ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుబ్బల మాణిక్యాలరావు (65) బుధవారం రాత్రి మృతి చెందాడు. ప్రమాదంలో మాణిక్యాలరావు భార్య గంగావతి, మరో మహిళ కడలి పావని అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాణిక్యాలరావును మొదట నరసాపురం ఏరియా ఆసుపత్రికి, తరువాత మెరుగైన వైద్యం కోసం భీమవరం అక్కడ నుంచి గుంటూరు తరలించారు. ప్రమాదంలో లివర్ దెబ్బతినడంతో మాణిక్యాలరావు మృతి చెందాడు. కాగా నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కూలీ గుడాలి సత్యనారాయణను మెరుగైన వైద్యం నిమిత్తం గురువారం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో స్వచ్ఛఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డీపీఓలతో ఇప్పటికే చర్చించామని, ఇందుకు కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
● అలరించిన జాతీయస్థాయి నాటిక పోటీలు
పట్టణంలోని కళారంజని నాటక అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీసోమేశ్వర జనార్ధనస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. పోటీల్లో గురువారం ప్రదర్శించిన గుంటూరు వారి అభినయ ఆర్ట్స్ ‘ఇది అతని సంతకం’, హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి శ్రీసారీ రాంగ్నెంబర్శ్రీ నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ఎన్ రవీంద్రరెడ్డిని ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు స్మారక పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కళారంజని వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరఽథీశ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వై వెంకటరమణ, మెంటే పూర్ణచంద్రరావు, మల్లుల సీతారామప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. –భీమవరం -
ఇంజినీరింగ్దే హవా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దాదాపు దశాబ్ద కాలానికి పైనుంచే విద్యార్థులు సాంకేతిక విద్యబాట పట్టారు. గతంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ కోర్సుల్లోకి ప్రవేశించడం సంప్రదాయంగా వచ్చింది. అనంతర కాలంలో ప్రపంచం మొత్తం మీద వచ్చిన సాంకేతిక విప్లవం ఆధారంగా కంప్యూటర్, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా జీతాలు వచ్చే అవకాశం ఈ రంగంలో ఉండడంతో విద్యార్థులు సైతం సాంకేతిక విద్యపై ఆకర్షితులయ్యారు. దీనితో ఇంజినీరింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల హవా నడుస్తోంది. ఇంటర్మీడియెట్ అనంతరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడం కోసం ప్రభుత్వం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఏపీఈఏపీ సెట్ పేరిట నిర్వహిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడి కావడంతో విద్యార్థులంతా ఈఏపీ సెట్‌కు సిద్ధమౌతున్నారు. మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశించే వారి కోసం మే 19వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్లోని ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకూ గడువు ఉంది. ఉమ్మడి పశ్చిమలో 13,330 సీట్లు ఇంజినీరింగ్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి వివిధ కోర్సులకు సంబంధించి 13,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900 సీట్లు, ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో 1360 సీట్లు, నూజివీడులోని సారధి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో 1,860, శ్రీ విష్ణు మహిళా కళాశాలలో 960, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో 1,140, భీమవరం ఇంజినీరింగ్ కళాశాలలో 300, నరసాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో 1,620, తాడేపల్లిగూడెంలోని శ్రీవాసవి కళాశాలలో 1,200, శశి ఇంజినీరింగ్‌లో 1,140, నల్లజర్లలోని వైస్ ఇంజినీరింగ్‌లో 270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక మరో 10 శాతం సీట్లు అంటే 1333 సీట్లు ఈడబ్ల్యూస్ కోటాలో కేటాయిస్తారు. అంటే మొత్తం కలిపి 14,663 సీట్లు ఈ రెండు జిల్లాల్లోని కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఈ పరీక్షలకు గత సంవత్సరం మాదిరిగానే ఇంటర్మీడియెట్‌లో అభ్యర్థి సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈఏపీ సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి మొత్తం కలిపిన తరువాత ర్యాంకును ప్రకటిస్తారు. ప్రస్తుతం దరఖాస్తులు చేస్తున్న ఉరవడి పరిశీలిస్తే గత ఏడాది కంటే మరో 10 శాతం దరఖాస్తులు పెరగనున్నట్టు ఈ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ కాకినాడ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈఏపీ సెట్లో ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులకే విద్యార్థుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గత ఏడాది వరకూ తెలంగాణ విద్యార్థులకు నాన్‌లోకల్ కేటగిరీ కింద 15 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున ఈ ఏడాది నుంచి వారికి రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి మొత్తం సీట్లలో స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. దీనివల్ల ఆంధ్ర విద్యార్థులకు కొద్దిగా పోటీ తగ్గనుంది. మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాలకు పరీక్షలు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 14 ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో 13,330 సీట్లుఉత్తీర్ణులైతేనే ఫీజు రీయింబర్స్మెంట్ ఈఏపీసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఫీజు రీయింర్స్‌మెంట్ పథకం వర్తిస్తుంది. 160 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షకు 40 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టే. ఫీజు రీయింబర్స్మెంట్ ఆశించే విద్యార్థులు ముందుగానే ఇన్‌కం ట్యాక్స్ సర్టిఫికెట్, ఈ ఏడాది తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్ కోటా (ఈడబ్ల్యూఎస్)లో చేరే విద్యార్థులు ముందుగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను పొందిఉండాలి. పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో తమపేరు అక్షరం కూడా తప్పులేకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. – పీ బాలకృష్ణ ప్రసాద్, ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ -
తప్పులు లేకుండా ఓటర్ల చేర్పులు, మార్పులు
కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశంచౌక్): ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు క్లయిమ్స్ పరిష్కార ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. టీడీపీకి చెందిన మరపట్ల శ్యాంబాబు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు నమోదులో డబుల్ ఎంట్రీలు ఉన్నాయని అన్నారు. ఆరు నెలల డేటాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 14,70,886 మంది ఉండగా, పురుషులు 7,20,613 మంది, మహిళలు 7,50,197 మంది, ట్రాన్స్జెండర్లు 77 మంది ఉన్నారన్నారు. ఫారం–6 ఓటు నమోదుకు 906 మంది ద రఖాస్తు చేసుకోగా 741 పరిష్కరించామని, 73 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం–8 మా ర్పులు, చేర్పులకు 2,491 క్లయిమ్స్‌కు 2,135 పరిష్కరించగా 125 తిరస్కరించామని, 232 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కలెక్టరేట్ ఇన్చార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, యు.చంద్రశేఖర్ (టీడీపీ), జై.శివ (జనసేన), కామన నాగేశ్వరరావు (వైఎస్సార్సీపీ), ఎం.రామాంజనేయులు (సీపీఎం), ఎం.రత్నరాజు (బీఎస్పీ) పాల్గొన్నారు. -
‘ఫీజు’ కోసం పోరు
భీమవరం: నిబంధనలు మీరిన ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, జీఓ 77, 107, 108లను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటూ గురువారం భీమవంరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జీఓ 77 రద్దు చేస్తామని, పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, అయినా వీటిని అమలు చేయలేదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ డిన్ను చందు, జిల్లా కన్వీనర్ వెంకట్, రాష్ట్ర కార్యనిర్వాహకుడు సాయి, భీమవరం నగర కార్యదర్శి జగదీష్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల నిరసన తణుకు అర్బన్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మి కులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేశారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, పెన్షన్, గ్రాట్యూటీ ఇవ్వాలని, ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు ఇవ్వాలని నినదించారు. యూనియన్ అధ్యక్షుడు యు.శ్రీనివాసరావు, కార్యదర్శి జి.విజయకుమార్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని, తక్కువ వేతనాలతో బతకడం కష్టంగా ఉందన్నారు. సీఐటీయూ నాయకులు ఎన్.ఆదినారాయణ బాబు, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గళమెత్తిన ఆర్టీసీ కార్మికులు తణుకు అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎన్ఎంయూఏ తణుకు డిపో కమిటీ అధ్యక్షుడు సరిదే ఏసుబాబు డిమాండ్ చేశారు. తణుకు ఆర్టీసీ డిపోలో గురువారం కార్మికులు నిరసన తెలిపారు. 1–2009 సర్కులర్ ప్రకారం విధివిధానాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, 114 జీఓ ప్రకారం నైట్ అవుట్లకు రూ.400 జీతం ఇవ్వాలన్నారు. ఈహెచ్ఎస్ పద్ధతిలోనే పాత వైద్యవిధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే తీయాలని కోరారు. ఎన్ఎంయూఏ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్య క్రమం చేపట్టామన్నారు. డిపో కార్యదర్శి బీవీఎన్ఎస్ సుబ్బారావు, కోశాధికారి ఎస్వీ రావు, సహాయ కార్యదర్శి టి.శ్రీను, ఉపాధ్యక్షుడు కేవీ రత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ పీఎస్ రాజు, కార్మికులు పాల్గొన్నారు. శ్రీవారికి కాసుల పంట ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదును స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం లెక్కించారు. చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. 20 రోజులకు నగదు రూపంలో రూ. 1,93,36,657, 326 గ్రాముల బంగారం, 4.149 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ సత్యనారాయణమూర్తి తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.20 వేలు లభించాయన్నారు. ఆల య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆక్వా సాగుకు సెలవు
జీతాలు ఇవ్వండి.. మహాప్రభో! జీతాలు సకాలంలో అందక ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బందికి ఇప్పటికీ జీతాలు రాలేదు. 10లో uశురకవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, భీమవరం: ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్ల దోపిడీని నిరసిస్తూ ఆక్వా చరిత్రలో తొలిసారి రైతులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గం నుంచి దీనికి నాంది పలికారు. జూలై నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించగా పట్టుబడులు పూర్తిచేసుకున్న రైతులు ఇప్పటినుంచే పంటకు విరామమిచ్చి చెరువులను ఎండగట్టేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. స్థానికంగా 40కి పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. కిలోకు 30 నుంచి 50 లోపు కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటే, 60 నుంచి 100 కౌంట్ రొయ్యలు చైనా, యూరోపియన్ దేశాలకు వెళుతున్నాయి. టారిఫ్‌లు సాకుగా చూపి.. చి... నెలన్నర రోజుల క్రితం 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యలు) ధర రూ.470, 40 కౌంట్ రూ.415, 100 కౌంట్ రూ.260 వరకు ధర ఉంది. సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు వనామీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. పట్టుబడులు మొదలై మార్కెట్లోకి రొయ్యలు రావడం పెరగడంతో ధరలు తగ్గిస్తూ వచ్చారు. ఈనెల 3న అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన వెలువడే నాటికి 30 కౌంట్ ధర రూ.460, 40 కౌంట్ రూ.370, 100 కౌంట్ రూ.230కి ధరలు పడిపోయాయి. అమెరికా సుంకాలను సాగుకు చూపించి కౌంట్‌ను బట్టి కేజీకి రూ.30ల నుంచి రూ.70 వరకు కోత పెట్టి ఈ ధరలను మరింత తగ్గించేశారు. ఇప్పట్లో పన్నుల బాదుడు లేదని అమెరికా ప్రకటించినా తగ్గించిన ధరలను పెంచలేదు. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు సిండికేటై తమ కష్టాన్ని దోచుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. గతంలోని 30 కౌంట్ రూ.470–490, 50 కౌంట్‌కు రూ.370, 60 కౌంట్‌కు రూ.350 కనీస మద్దతు ధర ఉండాలని, మేత ముడి సరకు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.20 వేలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇలాకాలో ఫ్లెక్సీల ఏర్పాటు మంత్రి నిమ్మల సొంత నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి క్రాప్ హాలిడేని రైతులు ప్రారంభించారు. బుధవారం యలమంచిలి మండలం శిరిగాలపల్లిలో 10 ఎకరాల్లో పంట విరామం పాటిస్తున్నట్టు ఫ్లెక్సీని ఏర్పాటుచేయగా గురువారం నియోజకవర్గంలోని పూలపల్లి, చందపర్రు, నరసాపురం నియోజకవర్గంలోని తూర్పుతాళ్లు తదితర చోట్ల దాదాపు 50కి పైగా ఎకరాల్లోని రైతులు సమ్మెలోకి వెళుతున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పట్టుబడులు పూర్తిచేసుకున్న రైతులు ఒక్కొక్కరుగా పంటకు విరామమిస్తున్నారు. చెరువుల వద్ద క్రాప్ హాలిడే ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి వాటి వివరాలను అధికారులకు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. ఊరటనివ్వని ‘ఉండి’ సమావేశం న్యూస్రీల్అయ్యో.. రొయ్య ధరల పతనంపై జిల్లా రైతుల పోరుబాట ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడే తొలుత జూలై నుంచి అమలుకు యోచన ఈనెల నుంచే పంట విరామంలోకి రైతులు మంత్రి నిమ్మల ఇలాకా నుంచే ఉద్యమం మొదలు ఇప్పటికే చెరువుల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు జిల్లాకు చెందిన జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల రైతులు ఈనెల 7న పాలకొల్లులో రాస్తారోకో చేశారు. మూడు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉండగా జూన్ నెలాఖరు నాటికి ప్రస్తుత సాగును పూర్తి చేసుకుని జూలై నుంచి సెప్టెంబరు వరకు పంట విరామం పాటించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంలో సాగు సమ్మె ప్రకంపనలు సృష్టించింది. సాగు సమ్మె విరమింపజేసే దిశగా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజుతో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు చర్చలు జరిపారన్న ప్రచారం జరిగింది. దీంతో ఈనెల 13న ఉండిలో జరిగిన ఆక్వా సదస్సులో తమకు మేలు జరుగుతుందని రైతులు ఆశించారు. ప్రభుత్వం నుంచి ఏదో జరుగుతుందని ఆశించవద్దు.. ప్రభుత్వాన్ని ఎంతవరకు వా డాలో అంతవరకే వాడుదాం.. అన్నింటికీ ప్రభుత్వం, ప్రభుత్వం అంటే కుదరదంటూ ప్రభుత్వ పెద్దలు ఆ సమావేశంలో చెప్పిన మాటలు ఆక్వా రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేలు మాత్రమే తగ్గించడం, 15న విజయవాడలో సమావేశమైన ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ కంటితుడుపు నిర్ణయాలు రైతులను నిరాశకు గురిచేశాయి. -
పన్ను వేలం తగ్గింపుపై అభ్యంతరం
నరసాపురం: నరసాపురం మున్సిపల్ మార్కెట్లో రోజువారీ పన్ను వసూళ్లు (2025–26) హక్కులకు సంబంధించి బహిరంగ వేలం పాట అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వైఎస్సార్సీపీ మెజార్టీ కౌన్సిలర్లు తీసుకున్న ఈ నిర్ణయం కూటమి నేతలకు షాక్ ఇచ్చినట్టయ్యింది. గురువారం పన్ను పాట అంశం సింగిల్ అజెండాగా చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా వేలం విషయమై మున్సిపాలిటీ హైడ్రామా నడుస్తోంది. గతేడాది రూ.82 లక్షలకు పాట వెళ్లగా ఈ ఏడాది ఓ జనసేన నేతకు రూ.30 లక్షలకు పాటను ఖరారు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇబ్బందులొస్తాయని భావించి రూ.45 లక్షలకు ఓ టీడీపీ నేతకు కట్టబెట్టాలని అధికారులు తాపత్రయపడ్డారు. అయితే వీరి ప్రయత్నానికి కౌన్సిల్ అత్యవసర సమావేశంలో చుక్కెదురయ్యింది. మూడేళ్ల సగటును తీసుకుని రూ.70 లక్షలకు తగ్గకుండా పాట జరగాలని, మున్సిపల్ ఆదాయానికి గండి కొడతామంటే సహించేది లేదని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తేల్చిచెప్పింది. వేలంలో స్పష్టత కరువు మార్కెట్ పాట వ్యవహారంలో గందరగోళానికి అధికారుల వైఖరే కారణమని మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు, సీనియర్ వైఎస్సార్సీపీ నేత ఏడిద కోటసత్యనారాయణ (వైకేఎస్) ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాటకు సంబంధించి పలు అంశాల్లో స్పష్టత లేదన్నారు. ప్రస్తుతం మున్సిపల్ సిబ్బందే పన్నులు వసూలు చేస్తున్నా.. సరైన రీతిలో జరగడం లేదన్నారు. మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ అధికారులు మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టాలని చూడటం దారుణమన్నారు. పదేళ్లలో ఎన్నడూలేని విధంగా పన్నుపాట ఎందుకు తగ్గిందని వైస్ చైర్పర్సన్ కామన నాగిని ప్రశ్నిచారు. పాట తక్కువగా వెళ్లడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతుందని.. తీర్మానం చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ ప్రకటించారు. చర్చలో కోటిపల్లి సురేష్, వన్నెంరెడ్డి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని, బొంతు రాజశేఖర్ పాల్గొన్నారు. మున్సిపాలిటీలో అధికారుల పనితీరు దారుణంగా ఉందని, గోదావరి పుష్కరాల నిర్వహణ విషయంలో, స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు విషయంలో అసలు కదిలిక లేదని పలువురు కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రభుత్వానికి నివేదించాలని నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం నరసాపురంలో కూటమి నేతలకు షాక్ -
కార్యకర్తలకు అండగా జగన్
తణుకు అర్బన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా సంక్షేమం అందించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. తణుకు సీఎం ఫంక్షన్ హాలులో గురువారం తణుకు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీ నాయకత్వం సంస్థాగ తంగా పార్టీని ప్రక్షాళన చేసే దిశగా వెళ్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు జగన్ పదవులు అందించారని గుర్తుచేశారు. సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కేసులకు బెదరం.. చెదరం అని స్పష్టం చేశారు. రాలిపోయే పువ్వు కేంద్రమంత్రి వర్మ : కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ రాలిపోయే పువ్వు అని, కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనపై దిగజారి వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ మంత్రి కారు మూరి నాగేశ్వరరావు అన్నారు. ఎంపీగా నరసాపురం ప్రాంత ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన లే కుండా చేతులు, కాళ్లు నరుకుతానని బాహాటంగా నే అనడం దౌర్భాగ్యమన్నారు. రాజుల గౌరవాన్ని పాడుచేసేలా ఆయన భాష వాడకాన్ని చూస్తుంటే వర్మ వార్డు మెంబరుకు ఎక్కువ సర్పంచ్‌కు తక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పశువధ శాలలో ఆవులు, గేదెలు వధిస్తున్నందుకు వర్మకు ఎన్నికోట్లు ముట్టాయోనని త ణుకు ప్రజలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో కూటమి ప్రభుత్వం వచ్చాక 45 గోవులు చనిపోతే నోరు విప్పలేకపోయావా వర్మా అని నిలదీశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎడిటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. ఏలూరులో తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో వదలడంతో రాష్ట్రవ్యాప్తంగా తానే పెరిగానని కారుమూరి అన్నారు. పావలా ఎమ్మెల్యేగా పేర్గాంచిన రాధాకృష్ణ హయా ంలో పేకాటలు, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్‌లు, మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని దు య్యబట్టారు. జగన్ పాలనలో అందరికీ సంక్షేమం అందించారని అన్నారు. కూటమి పాలనలో సంక్షేమం అందించకుండా విద్యార్థులను, రైతులను, మహిళలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి చేస్తున్న మారణకాండకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దుర్మార్గం కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఇటీవల మాజీ మంత్రి కారుమూరిపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నా యని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. అత్తిలి ఎంపీపీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ఫ్యాక్షనిజాన్ని తలపిస్తోందన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు, పార్టీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, బహుజన కులాల రాష్ట్ర నేతలు చింతపల్లి గురుప్రసాద్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
ఇళ్ల కూల్చివేతపై భగ్గుమన్న పేదలు
కాళ్ల: బొండాడలోని మెయిన్‌రోడ్డులో పేదల ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో పంచాయతీ అధికారులు గ్రామంలోని 28 ఇళ్లను కూల్చేందుకు పొక్లెయిన్‌ను తీసుకురాగా పేద బాధితులు, సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ ప్రతిఘటించారు. ఈ సమయంలో పోలీసులు, బాధితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆకివీడు సీఐ జగదీశ్వర్‌రావు, ఆకివీడు, భీమవరం రూరల్, కాళ్ల ఎస్సైలు, పోలీసులు, పోలీసుల బందోబస్తుతో పేదలు, బాధితులను నిర్బంధించారు. సీపీఎం నేత రామకృష్ణను అరెస్ట్ చేసి కాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పొక్లెయిన్‌తో ఇళ్లను కూల్చివేశారు. దీంతో మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతను అడ్డుకుంటున్న మహిళలను పోలీసులు ఓ చోట నిర్బంధించారు. మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యం చేయడం అన్యాయమని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బొండాడలో తొలగించిన ఇళ్లకు ఆనుకుని ఇరిగేషన్ పోరంబోకు భూమి 79 సెంట్లు ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
మానవత్వం చాటుకున్న కారుమూరి
తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన సిబ్బందితో సపర్యలు చేయించి సురక్షితంగా ఆస్పత్రికి పంపించిన సంఘటన తణుకు మండలం వేల్పూరులో గురువారం చోటుచేసుకుంది. వేల్పూరుకు చెందిన వృద్ధుడు టీవీఎస్ మోపెడ్ పై ఓ మహిళను ఎక్కించుకుని తణుకు వైపునకు వస్తుండగా తణుకు వైపు నుంచి వస్తున్న కారు ఆయన్ను ఢీకొట్టింది. ఇదే సమయంలో అటుగా వెళుతున్న కారుమూరి స్వల్పంగా గాయపడ్డ వృద్ధుడిని సముదాయించి ప్రమాదానికి కారకులైన కారులో ఉన్న వారితో వృద్ధుడిని ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సిందిగా చెప్పి అదే కారులో ఎక్కించి పంపించారు. వైఎస్సార్సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్ ఉన్నారు. మున్సిపల్ అధికారులపై చర్యలు భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మున్సిపాలిటీ లో పన్ను విధింపునకు సంబంధించి అధికారులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. పట్టణంలోని ఓ ఖాళీ స్థలానికి సంబంధించి పత్రాలు, స్థల పరిశీలన చేయకుండా పన్ను విధించిన వ్యవహారంలో ము న్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణ, ఆర్వో డి.సోమశేఖర్, ఆర్ఐ ఎస్.కృష్ణమోహన్, వా ర్డు వెల్ఫేర్ సెక్రటరీ పి.చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ (సీడీఎంఏ)కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంజినీరింగ్దే హవా
సాంకేతిక విద్యపై విద్యార్థులు ఆకర్షితులవడంతో ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ కోర్సుల హవా నడుస్తోంది. 10లో uఆక్వా రంగం కుదేలు మేత, సీడ్, లీజు, మెడిసిన్ ధరలు 100 శాతం పెరగ్గా రొయ్య ధర మాత్రం పతనమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయడం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితిలో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సాగు సమ్మెతోనే రైతులకు న్యా యం జరుగుతుంది. – పొత్తూరి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, కలగంపూడి ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోకపోతే ఆక్వాకు గడ్డు కాలమే. అమెరికా సుంకాల పేరు చెప్పి కౌంట్‌కు కిలోకు రూ.30 నుంచి రూ.70 వరకు ధరలు తగ్గించేశారు. సుంకాలు లేవని చెప్పినా ధరలు పెంచకుండా రైతులను దోచుకుంటున్నారు. మేత ధరలు తగ్గించి, రొయ్యల ధరలు పెంచేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. – కుక్కల సూరయ్య, ఆక్వా రైతు, మేడపాడు -
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పరిశీలన
ఉంగుటూరు: ప్రజలు ఎవరి ఇంట్లో చెత్తను వారే ఎరువులు తయారు చేసుకునేలా పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలని స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కమిషనర్ డాక్టర్ బి.అర్జునరావు అన్నారు. గురువారం ఉంగుటూరు గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్న చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు చెత్త సేకరణలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 17వ స్థానానికి పడిపోయిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలంటే అధికారులతో పాటు నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారు సింధు, ఎంపీడీఓ రాజ్‌మనోజ్, ఈఓపీఆర్డీ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కారును ఢీకొన్న లారీ.. విద్యార్థి మృతి
కొల్లేరు ప్రజలను రక్షించాలని డిమాండ్ అధికారుల ఆంతర్యం ఏమిటో జంగారెడ్డిగూడెం: తమ స్నేహితుడి పుట్టినరోజు జరుపుకొని భద్రాచలం శ్రీరామచంద్రుడిని దర్శించుకునేందుకు బయలుదేరిన ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఒకే కారులో బయలుదేరారు. వీరిలో రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా, ముగ్గురు విద్యార్థులకు తీవ్ర, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శశి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కొయ్యలగూడెం మండలం అంకాలగూడేనికి చెందిన కోమటికుంట ప్రమోద్, కొత్తూరు నిర్వాసిత కాలనీకి చెందిన చింత రాహుల్ కృష్ణ తేజ, విజయనగరం జిల్లా వీరసాగరానికి చెందిన జాగరాన హేమంత్, బుట్టాయగూడెం కొత్తపేటకు చెందిన గరికపాటి హరిహరన్, కొయ్యలగూడెం తూర్పుపేటకు చెందిన బెల్లాన బాల అజయ్ కుమార్, జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన చిన్నం శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా పాలంగికి చెందిన దుంగా నరేష్, టి.నరసాపురం మండలం మెట్టగూడేనికి చెందిన కోమటి స్వామి (20) ఒక కారును సెల్ఫ్ డ్రైవింగ్ పద్ధతిన అద్దెకు తీసుకుని బయలుదేరారు. వీరిలో ఏడుగురు మాత్రం తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరగా, కొయ్యలగూడెంలో కోమటికుంట ప్రమోద్ను ఎక్కించుకున్నారు. కారును బెల్లాన బాల అజయ్‌కుమార్ నడుపుతున్నాడు. కారు అదుపు తప్పి.. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయికి వచ్చేసరికి కారు అదుపు తప్పి ఎడమ వైపు మార్జిన్లోకి దిగిపోయింది. దీంతో కారు నడుపుతున్న అజయ్‌కుమార్ వెంటనే కారును అదుపు చేసేందుకు కుడివైపునకు వేగంగా తిప్పాడు. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేట వైపు వెళుతున్న కారు తిరిగి జంగారెడ్డిగూడెం వైపునకు తిరిగి పోయింది. అదే సమయంలో అశ్వారావుపేట నుంచి వేగంగా వస్తున్న లారీ కారును వెనుక భాగంలో కుడివైపున బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చొన్న కోమటి స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే కోమటికుంట ప్రమోద్, రాహుల్ కృష్ణతేజ, హేమంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో హరిహరన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ముందు సీట్లో కూర్చున్న చిన్నం శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అజయ్‌కుమార్, దుంగ నరేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం సీఐ వి.కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్, సిబ్బంది జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు వెనుక భాగం నుజ్జునుజ్జవడంతో కారులో ఇరుక్కుపోయిన వారిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలింపు తీవ్రంగా గాయపడిన కోమటికుంట ప్రమోద్, రాహుల్ కృష్ణతేజ, హేమంత్‌లను ప్రాథమిక చికిత్స చేసి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హేమంత్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతన్ని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. వీరిలో దుంగా నరేష్ పుట్టిన రోజు కావడంతో అతని పుట్టిన రోజు జరుపుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు వీరంతా బయలుదేరారు. ఇంటికి వస్తానని చెప్పాడు ప్రమాదంలో మృతిచెందిన టి.నరసాపురం మండలం మెట్టగూడేనికి చెందిన కోమటి స్వామి (20) బుధవారం రాత్రి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడని కుటుంబసభ్యులు, అతని బాబాయ్ తెలి పారు. మళ్లీ ఫోన్ చేసి.. ఫ్రెండ్స్‌తో కలసి భద్రాచలం వెళుతున్నానని చెప్పగా, వద్దు ఇంటికి వచ్చేయ్ అందరం కలిసి వెళదామని అన్నానని, అయినా స్నేహితులతో భద్రాచలం బయలుదేరి మృత్యువాతకు గురయ్యాడని ఆయన బోరున విలపించారు. ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజలను రక్షించాలని, ఆక్వా రంగాన్ని కాపాడాలని, రొయ్యల రైతులను ఆదుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలు ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులు బి.బలరాం, మంతెన సీతారాం డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని ఉద్దరాజు రామం భవనంలో గురువారం నాడు సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసి ఆమోదించారు. ముఖ్యవక్తలుగా విచ్చేసిన సీపీఎం రాష్ట్ర నాయకులు బి.బలరాం, మంతెన సీతారాం మాట్లాడుతూ కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉపాధి కల్పించాలని, సొసైటీలు, జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగులు భూములు కొల్లేరు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని కోరారు. ఆక్వారంగంపై తీవ్ర ప్రభావం అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ప్రతీకార సుంకాల పేరుతో భారత్ ప్రభుత్వంపై పెట్టిన భారం ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఆక్వా రైతాంగంపై తీవ్రమైన ప్రభావం చూపిందని, తద్వారా రొయ్యల రైతులు నష్టాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం 100 కౌంట్ కి చెందిన రొయ్యల ధర రూ.220 రూపాయలకు కొనాలని నిర్ణయించడం అన్యాయమని, ఆ ధరను రూ.270లకు పెంచాలని అన్నారు. అలాగే పట్టణాల్లో పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని కోరారు. 2025–26 సంవత్సరాలకు సంబంధించి పట్టణాల్లో ఆస్తి పన్ను గత సంవత్సరంతో పోలిస్తే 15%, 2020–21 సంవత్సరాలతో పోల్చితే 30% పన్ను పెంచుతూ, గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. దీనివలన రూ.320 కోట్ల భారం పట్టణ ప్రజలపై పడుతుందని తెలిపారు. సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్. లింగరాజు, తెల్లం రామకృష్ణ, జి.రాజు, కె.శ్రీనివాస్, పి.రామకృష్ణ ఇతర జిల్లా నాయకులు ఎం.జీవరత్నం, ఎ.ఫ్రాన్సిస్, మడకం సుధారాణి, వై.నాగేంద్రరావు, ఎస్.మహాంకాళీరావు, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. స్థానిక వార్తలు మరో ఐదుగురికి గాయాలు దైవ దర్శనం కోసం భద్రాచలం వెళ్తుండగా ఘటన వీరంతా తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్ విద్యార్థులు -
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని.. క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 15 మంది గర్భిణిలకు సామూహిక సీమంతం నిర్వహించి, పండ్ల కిట్‌ను అందజేశారు. అనంతరం పౌష్టికాహార పక్షోత్సవ సమాచార గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, జిల్లా వైద్య శాఖ అధికారి గీతాబాయి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం నేతల రిలే దీక్ష
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం సోదరులు చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం – 2025ని నిరసిస్తూ కై కలూరు పెద్ద మసీదు వద్ద ముస్లిం నాయకుడు షేక్ షాబుద్దిన్ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే దీక్షను బుధవారం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు దీక్ష సాగింది. ముస్లింల మనోభావాలు దెబ్బతిసే చట్టాన్ని రద్దు చేయడానికి చేస్తున్న నిరసనలలో ప్రజాస్వామ్య, లౌకికవాదులందరూ మద్దతుగా రావాలన్నారు. ముస్లిం నాయకులు మహమ్మద్ గాలీబ్ బాబు, షేక్ ఆరిఫ్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ అలీమ్, మహమ్మద్ రఫీ, అమీర్, షేక్ రఫీ, అబ్దుల్ హసీబా, ఫిర్దోస్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ ,ఆసిఫ్, జహంగీర్, సుల్తాన్, భాష, మున్నా తదితరులు పాల్గొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్‌కు బుకింగ్ ప్రారంభం ఏలూరు(మెట్రో): దీపం–2 కింద రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియలో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారన్నారు. మొదటి విడత 2024 నవంబర్‌లో మొదలై ఈ ఏడాది మార్చి 31తో ముగిసిందన్నారు. -
కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా
ఈదురుగాలుల బీభత్సం ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల చెట్లు ఇళ్లపై పడ్డాయి. 8లో uసీఈసీ సూచనల అమలుపై నివేదిక కోరిన ధర్మాసనం కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు, పర్యావరణ విఘాతం అనే అంశాలపై సుప్రీంకోర్టులో ఉన్న కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా పడింది. ద్విసభ్య ధర్మాసనం ముందు కొల్లేరు అంశంపై బుధవారం వాదనలు జరిగాయి. క్షేత్రస్థాయిలో కొల్లేరు రైతుల సమస్యలపై ఏం సలహాలు ఇచ్చారని సీఈసీని సుప్రీం ప్రశ్నించింది.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సీఈసీ సూచనలు ఎంత మేర అమలు చేసింది.. అమలు తీరును కలెక్టర్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్టు, చీఫ్ సెక్రటరీ పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా కొల్లేరు సమస్యపై అధ్యయనం చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) కొల్లేరులో 14,000 ఎకరాలు నష్టపోయిన జీరాయితీ రైతులకు నష్టపరిహారం అందించాలని, కొల్లేరులో సంప్రదాయ వేటకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా అవేమీ జరగలేదు. మరోవైపు కూటమి నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి కొల్లేరు సమస్యను వివరించారు. రాష్ట్ర మంత్రి వై.సత్యకుమార్, కై కలూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ధర్మరాజు, కొల్లేరు నాయకులు బలే ఏసురాజు, కొల్లి బాబీ, రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు తదితరులు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. కేంద్రం నుంచి కూడా అఫిడవిట్ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే కామినేని తెలిపారు. -
పొట్టకూటి కోసం వెళితే..
నరసాపురం: తోటి వ్యక్తులతో కలిసి ఉదయాన్నే పనుల్లో నిమగ్నమైన ఆ ఉపాధి కూలీల బతుకులు అనుకోని ప్రమాదంతో తెల్లారిపోయాయి. టాటా ఏస్ వాహనం రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన ఉపాధి కూలీలంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఒకరి అతివేగం రెండు నిండు ప్రాణాలను పొట్టనబెట్టుకోగా మరో ఇద్దర్ని గాయాలపాలు చేసిన ఘటన ఉపాధి కూలీల్లో తీవ్ర విషాదం నింపింది. బుధవారం మొగల్తూరు మండలంలో 216 జాతీయ రహదారి పక్కన నల్లావారితోట వద్ద ఆయిల్ డబ్బాల లోడుతో వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి రోడ్డుకు ఆనుకుని ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. అక్కడే ఉపాధి హామీ పథకంలో పంట బోదె బాగు చేస్తున్న కూలీలు కడలి పావని (45), గుబ్బల గంగావతి (55)పై వాహనం పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గంగావతి భర్త మాణిక్యాలరావు, మరో కూలీ గుడాలి సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. మాణిక్యాలరావును నరసాపురం, భీమవరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తీసుకెళ్లారు. మరో కూలీ సత్యనారాయణ తలకు బలమైన గాయం కాగా నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో 15 మంది కూలీలు అక్కడ పనిచేస్తున్నారు. అకస్మాత్తుగా రోడ్డుపై వెళుతున్న వాహనం తమవైపు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి తోటి వారి మీదపడటంతో వారంతా భయందోళనలో పరుగులు తీశారు. వెంటనే తేరుకుని వాహనం కింద పడ్డ తోటివారిని విగత జీవులుగా చేతుల మీదుగా తీసుకుని బోరున విలపించారు. గాయపడిన వారిని నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంతోపాటు, ప్రమాద స్థలంలో ఉన్న మలుపును గుర్తించలేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, నరసాపురం డీఎస్పీ డాక్టర్ డి.శ్రీవేద పరిశీలించారు. ప్రభుత్వ పరంగ బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. వ్యాన్ డ్రైవర్ వై.వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు మహిళలది, గాయపడ్డ మరో ఇద్దరు కూలీలదీ మొగల్తూరు మండలం నక్కావారిపేట పడమటి పాలెం. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన పావనికి ఇందుశ్రీ, ప్రవల్లిక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త సత్యనారాయణ ఆటో డ్రైవర్. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. ఇంట్లో తల్లితండ్రులు ఇద్దరూ కష్టపడితేగానీ ఇద్దరు ఆడపిల్లల ఆలనాపాలనా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రమాదంలో తల్లి అకాలంగా మృత్యువాత పడింది. ఇందుశ్రీకి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దేవుడు ఇంత పనిచేశాడని బంధువులు, ఇంటిపక్కవారు బోరున విలపించడం కన్నీళ్లు తెప్పించింది. ఇక మృతురాలు గంగావతికి పెళ్లయిన ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. గంగావతి ప్రాణాలు విడువగా, ఇంటికి పెద్దదికై ్కన మాణిక్యాలరావు ప్రాణాపాయం మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఉపాధి హామీ కూలీలపైకి దూసుకొచ్చిన వాహనం ఇద్దరు మహిళా కూలీల దుర్మరణం మరో ఇద్దరికి తీవ్రగాయాలు నక్కావారిపాలెంలో తీవ్ర విషాదం -
ఏలూరు ఇందిరమ్మకాలనీ వద్ద అస్థిపంజరం
విచారణ చేస్తున్న ఏలూరు రూరల్ పోలీసులు ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఇందిరమ్మకాలనీ పంటకాలువ సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం అస్థిపంజరంను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు వేమూరి సత్యనారాయణ (65)గా గుర్తించారు. కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో సత్యనారాయణ ఒంటరిగా ఉంటున్నాడని, అతని భార్య విజయవాడలోని కుమారుడి వద్ద ఉంటుందని చెబుతున్నారు. మద్యానికి బానిసై పంటకాలువ వద్ద పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతిచెంది సుమారు నెలరోజులు అయి ఉండవచ్చిని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం వ్యాన్ బోల్తా పోలవరం రూరల్: మద్యం సీసాల లోడుతో వస్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. రాజమహేంద్రవరం జిల్లాలోని డిపో నుంచి పోలవరం మద్యం దుకాణానికి తరలిస్తున్న వ్యాన్ కొత్తపట్టిసీమ, పాత పట్టిసీమ మధ్యలో బుధవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో తీసుకువస్తున్న సుమారు రూ.7 లక్షల విలువైన మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం వ్యాన్ తిరగబడిన సమాచారం మద్యం షాపు యజమానికి అందడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడికి చేరుకుని నేలపై పడ్డ మద్యం సీసాలను ఒబ్బిడి చేసుకున్నారు. పొగాకు బేరన్ దగ్ధం బుట్టాయగూడెం: కొమ్ముగూడెంలో బుధవారం రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక పొగాకు బేరన్ దగ్ధమైంది. ఆలపాటి వెంకట రమణమూర్తి అనే రైతు పొగాకు క్యూరింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను గ్రామస్తులు ఆర్పే ప్రయత్నం చేశారు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్టు రైతు వెంకట రమణమూర్తి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పెనుగొండ: వడలి పిట్టల వేమవరం రహదారిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం పెనుగొండకు చెందిన తడివాడ భార్గవ్ (17) స్నేహితుడు ఇళ్ల నంద కిషోర్‌తో కలసి మోటార్‌సైకిల్‌పై వడలి పిట్టల వేమవరం రహదారిలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ టచ్ అవ్వడంతో మోటారుసైకిల్ రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్గవ్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నందకిషోర్‌కు గాయాలు కావడంతో తణుకు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పెనుగొండ ఎస్సై కే గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి రంగులు వేస్తూ జారిపడి వ్యక్తి మృతి భీమవరం: ఇంటికి రంగులు వేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతిచెందినట్లు వన్‌టౌన్ ఏఎస్సై బాజి బుధవారం చెప్పారు. పట్టణంలోని మారుతీ నగర్లో ఇళ్ల వేణుగోపాల్ ఇంటికి రంగులు వేయడానికి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కురెళ్ల తాతారావు(56) వచ్చాడు. రంగులు వేస్తుండగా తాడు జారి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తాతారావు అల్లుడు జవ్వాది సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బాజి చెప్పారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్‌లో కీర్తనకు రజతం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరంలోని ఏఆర్‌డీజీకే పాఠశాల విద్యార్థిని చుక్క కీర్తన రజత పతకం సాధించింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకూ మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కీర్తన 59 కేజీల విభాగంలో స్నాచ్‌లో 67 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 87 కిలోలు కలిపి మొత్తం 154 కిలోలు ఎత్తి రజత పతకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీ. షారోన్ తెలిపారు. అలాగే తమ పాఠశాలకు చెందిన మొయిద పావని 40 కేజీల విభాగంలో స్నాచ్‌లో 47 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 55 కిలోలు మొత్తం 102 కిలోల బరువు ఎత్తి 4వ స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి పతకాలు సాధించిన విద్యార్థినిలను, ఫిజికల్ డైరెక్టర్ పీ పుల్లారావును బుధవారం పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ ఉపాధ్యాయులు వీ కాంతి జయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈడే శివశంకర రావు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం
భీమవరం: సమాజాన్ని చైతన్య పరిచేవి కళలేనని, వాటిలో తొలి ప్రాధాన్యం సాంఘిక నాటికలేదేనని పలువురు వక్తలు అన్నారు. కళారంజని 14వ వార్షికోత్సవ జాతీయ స్థాయి తెలుగు నాటికల పోటీలు బుధవారం రాత్రి భీమవరంలోని సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చుక్కన్నశ్రీ స్మారక పురస్కారంను నటులు, దర్శకులు, రచయిత, ప్రయోక్త వేల్పూల నాగేశ్వరరావుకు, జవ్వాది సూర్యారావు స్మారక పురస్కారంను విశాఖపట్టణంకు చెందిన చలసాని కృష్ణప్రసాద్‌కి అందజేసి వారిని దుశ్శాలువాలతో పూలమాలలతో సత్కరించారు. ముందుగా బీవీకే కీయోషన్ కాకినాడ వారి తితిక్ష నాటికను ప్రదర్శించి, అనంతరం సత్కార కార్యక్రమం నిర్వహించారు. రెండవ నాటికగా శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్ విజయవాడ వారి అపస్వరం నాటికలను ప్రదర్శించారు. ఈ నాటికలో నటించిన కళాకారులు వారి హావభావాలతో అందరిని అలరించారు. కార్యక్రమంలో బుద్దాల వెంకట రామారావు, రాయప్రోలు భగవాన్, జవ్వాది దాశరథి శ్రీనివాస్, నల్లం వెంకట కృష్ణారావు, గుండా రామకృష్ణ, మల్లుల సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన భారీ గాలులు, వర్షంతో భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల వృక్షాలు ఇళ్లపై పడ్డాయి. జంగారెడ్డిగూడెం కాలేజ్ రోడ్డులో భారీ వృక్షం నేలకూలింది. పట్టణం, మండలంలో భారీ వృక్షాలు విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడం, విద్యుత్‌వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా, విద్యుత్ ఈఈ పీర్ అహ్మద్‌ఖాన్, డీఈ యు.సుబ్బారావుల ఆధ్వర్యంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను అర్ధరాత్రి తరువాత నుంచి ప్రారంభించారు. చివరకు బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరించారు. పంటలు నష్టపోయిన రైతులు బుట్టాయగూడెం: గత మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, గాలి బీభత్సంతో ఏజెన్సీ ప్రాంతంలోని పలు చోట్ల అరటితోటలు నేలకొరిగాయి. మొక్కజొన్న, పొగాకు, జీడిమామిడి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించగా కొమ్ముగూడెం, బుట్టాయగూడెం, నిమ్మలగూడెం, తదితర గ్రామాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. సుమారు 18 ఎకరాల వరకూ మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ఏఓ డి.ముత్యాలరావు ప్రాథమిక అంచనా వేశారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న పంటలు -
7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 14 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి బుధవారం వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా 7న ఉదయం శ్రీవారిని పెండ్లికుమారునిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేస్తారు. 8న అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణను నిర్వహిస్తారు. అలాగే 9న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధి సేవలు, 10న రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. 11న రాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. 12న రాత్రి రథోత్సవం, 13న చక్రవారి–అపభృధోత్సవము, వేద సభ, ధ్వజావరోహణ నిర్వహిస్తారు. 14న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము–పవళింపుసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను నిర్వహిస్తామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చేనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని ఈఓ కోరారు. 11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం 12న రాత్రి రథోత్సవం ఉత్సవ వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ మూర్తి -
బాబు పాలనే.. అయ్య బాబోయ్
కొయ్యలగూడెం: బాబు పాలన అంటేనే అయ్యబాబోయ్ అనే పరిస్థితి ప్రజల నోళ్లలో పునరావృతం అవుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుధవారం కొయ్యలగూడెంలో ఆయన పలనాడు రైతు ప్రతినిధులను కలుసుకున్న సందర్భంగా మాట్లాడారు. పలనాడు జిల్లా రైతు ప్రతినిధులు, మాజీ సొసైటీ అధ్యక్షుడు నల్లపాటి రామయ్య నేతృత్వంలో బాలరాజును కలుసుకుని తమ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాధక, బాధలు గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతూ వచ్చిన వీరు మిర్చి, పత్తి, టొబాకో రైతుల సంక్షేమ పరిస్థితి గురించి చర్చించారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ఏనాడు సుభిక్షంగా లేరని ఇప్పుడు కూడా ఆయన పాలన ఎప్పుడు ముగుస్తుందా అని తమ ప్రాంత రైతులతో సహా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాయలసీమలోని రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని, సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి యూరప్ పర్యటనలతో గడుపుతున్నారని విమర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే కేవలం ఇంకా సినీ ఆర్టిస్టు మాదిరిగానే నటనతో జీవిస్తున్నారని అన్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్ష సాధింపు చర్యలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మేకల అన్నవరం, వైఎస్సార్ సీపీ నాయకులు విగ్గిన రామకృష్ణ, చింతలపూడి కిషోర్, రాఘవరాజు సాయి కృష్ణ, చవల నాగేశ్వరరావు, చవాకులు సూరిబాబు, నారా సుధీర్, తదితరులు పాల్గొన్నారు. -
కూలి డబ్బుల కోసం ఎదురుచూపులు
● మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు బంద్ ● రూ.13.12 కోట్ల బకాయిలు భీమవరం(ప్రకాశం చౌక్): బతుకుదెరువు కోసం ఎండలో కష్టపడి పనిచేసే ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత మూడు నెలలగా ఉపాధి కూలీలకు వేతనాలు అందడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు బకాయి పెట్టారు. కూలీ డబ్బులు కోసం నిరు పేదలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వేతనాలు రాకపోయేసరికి అప్పులు చేసుకునే బతుకుతున్నారు. వేతనాలు ఎప్పుడు పడతాయే అధికారులకు కూడా తెలియని పరిస్థితి. ఒక్కో కూలీకి రూ.4 వేల వరకూ బకాయి జిల్లాలో 20 మండలాల్లో ఫ్రిబవరి నుంచి ఇంతవరకు ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయి రూ.13.12 కోట్లకు పైగానే ఉంది. ఒక్కో ఉపాధి కూలీకి రోజుకు రూ.300 చొప్పున రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లించాల్సి ఉంది. మూడు నెలల దాటినా వారి ఖాతాలో వేతనాలు జమకావడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.కోట్ల నిధులు ఉన్నప్పటికీ వేతనాలు ఇవ్వడం లేదు. కూలీలకు వేతనాలు చెల్లించకుండా బకాయిలు మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది.. ఆ నిధులు దేనికి మళ్లిస్తున్నారు.. ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ నిధులు ప్రభుత్వం ఏం చేస్తుందో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలంటున్నారు. జాతీయ ఉపాధి హమీ పథకం ప్రారంభించిన నాటి నుంచి గత ప్రభుత్వ పాలన వరకూ ఎప్పుడూ కూలీలకు ఇలా బకాయిలు పెట్టింది లేదు. ముమ్మరంగా పనులు జిల్లాలోని 20 మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. పంట కాలువలు, చెరువులు పూడికతీత పనులు చేయిస్తున్నారు. రోజుకు జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. జిల్లాలో ఇలా.. ఉపాధి జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు : 1,84,459 యాక్టివ్‌గా ఉన్న జాబ్ కార్డులు : 1,2,806 మొత్తం కూలీలు : 3.3 లక్షలు పనికి వెళుతున్న కూలీలు : 1.48 లక్షలు రోజుకు కూలీ వేతనం రూ.300 -
25 నుంచి కొంతేరులో నాటికల పోటీలు
యలమంచిలి: యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు కొంతేరు పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 43వ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ చైర్మన్ అంబటి మురళీకృష్ణ, పాలకవర్గ సభ్యులు తెలిపారు. స్థానిక కళామందిరంలో బుధవారం సమావేశమైన సభ్యులు నాటిక పోటీల బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్య దర్శి గంటా ముత్యాలరావు(నాయుడు), బోణం రవిబాబు, జక్కంశెట్టి సుబ్రహ్మణ్యం, అంబటి నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్‌కు ఉచిత శిక్షణ పెంటపాడు: ఈ నెల 30న జరగనున్న పాలిసెట్ ప్రవేశపరీక్షకు ఆయా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు గూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి. ఫణీంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 90102 22178, 94901 04336 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు. పోలీసు సబ్ డివిజన్‌కు ఉత్తమ అవార్డు భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో శవాన్ని పార్శిల్ చేసిన కేసును ఛేదించిన భీమవరం సబ్ డివిజన్ పోలీసులకు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్త అవార్డు అందించారు. గత డిసెంబర్ 17న కాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన బర్రె పర్లయ్యను అదే మండలానికి చెందిన శ్రీధర్‌వర్మ హత్యచేసి పెట్టెలో పార్శిల్ చేసి యండగండి పంపించాడు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచనం సృష్టించింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఆదేశాలతో ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య, టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, ఆకివీడు సీఐ వి.జగదీశ్వరరావు, భీమవరం, ఉండి, కాళ్ల, ఆచంట ఎస్సైలు ఛేదించి నిందితుడ్ని అరెస్టు చేశారు. నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికిచ్చే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్) అవార్డులో భీమవరం డివిజన్ ప్రథమస్థానంలో నిలిచింది. కార్పొరేషన్ రుణం కోసం దీక్ష ఆకివీడు: కార్పొరేషన్ రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని, అర్హులకు రుణాలు మంజూరు చేయలేదని మండలంలోని అజ్జమూరుకు చెందిన వర్ధినీడి వరప్రసాద్ బుధవారం దీక్ష చేపట్టారు. కాపు కార్పొరేషన్ లోన్ తనకు మంజూరు చేయకుండా కొంతమందికి రికమండేషన్‌తో కేటాయించడం దారుణమన్నారు. చివరకు బ్యాంకు అధికారులు రుణం మంజూరుకు అనుమతి ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు భీమవరం(ప్రకాశం చౌక్): స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి జి.గీతాబాయి అన్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. -
రొయ్యకు లోకల్ మార్కెట్
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, భీమవరం: రొయ్య ధరల స్థిరీకరణకు స్థానిక వినియోగం పెంచడం మంచి పరిష్కారమని చెబుతున్నారు. ఆ దిశగా ప్రముఖులతో ప్రమోషన్ చేయించాలని, చికెన్ షాపుల్లోనూ రొయ్యల అమ్మకాలు చేయాలని ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సిద్ధంచేసిన లోకల్ మార్కెట్ కాన్సెప్ట్‌ను ఇప్పుడు కూటమి కమిటీ తెరపైకి తెస్తోంది. ఏడాదికి ఒక్కొక్కరు 10–12 కిలోల సగటు వినియోగంతో రొయ్యలు ఎక్కువగా తినే దేశాల్లో చైనా టాప్‌లో ఉంటే, 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. యూరోపియన్ దేశాల్లోనూ సగటున ఒక్కొక్కరు ఎనిమిది కిలోల వరకు తీసుకుంటారు. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే మనదేశంలో మాత్రం సగటు వినియోగం 800 గ్రాములు మాత్రమే. ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఏపీలో వినియోగం 1.5 కిలోలు ఉన్నట్లు ఫిషరీస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఏటా సుమారు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా మొదటి స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో నకిలీ సీడు, ఫీడు, దళారుల దోపిడీతో కుదేలైన ఆక్వా రంగానికి గత ప్రభుత్వం కొత్త ఊపిరిలూదింది. ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారటీ (అప్సడా) ఏర్పాటు చేసి రొయ్య ధరలను లాభసాటి చేయడంతో పాటు, మేత ధరలను తగ్గించి, ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం పెంచకుండా నియంత్రించింది. నాన్ ఆక్వా జోన్ పరిధిలోని వేలాది ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తెచ్చి విద్యుత్ రాయితీ అందజేసింది. రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా చర్యలు తీసుకుంది. ఫిష్ ఆంధ్రా ద్వారా డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 60 శాతం, మిగిలిన వారికి 40 శాతం రాయితీపై జిల్లా వ్యాప్తంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు విలువైన 250కు పైగా అవుట్లెట్లు ఏర్పాటుచేశారు. ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ సబ్సిడీపై అందించారు. రొయ్యల డోర్ డెలివరీకి కార్యాచరణ క్వాలిటీ రొయ్యలను స్థానికంగా సామాన్య వినియోగదారుల చెంతకు చేర్చేలా రొయ్యల డోర్ డెలివరీకి ఏడాదిన్నర క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రక్రియ అమలుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ అప్పట్లో ముందుకు వచ్చింది. ఎక్స్‌పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలోకు కౌంట్‌ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. తొలుత జిల్లాలోని భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నగరాలు, పట్టణాలకు విస్తరింప చేయా లని భావించారు. 2023 ఏడాది చివర్లో మత్య్సశాఖ జిల్లా అధికార వర్గాలు అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈలోగా ఎన్నికలు హడావుడి మొదలు కావడంతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. మరుగున పడేసిన కూటమి న్యూస్‌రీల్ స్థానిక వినియోగం పెంచే ప్రయత్నాలు ఏడాదిన్నర క్రితమే రొయ్యల డోర్ డెలివరీకి కార్యాచరణ పైలెట్ ప్రాజెక్టుగా భీమవరం ఎంపిక ఎన్నికలు రావడంతో నిలిచిన ప్రక్రియ తర్వాత పట్టించుకోని కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రొయ్యల స్థానిక వినియోగం పెంచే కార్యాచరణను మరుగున పెట్టేసింది. అమెరికా ప్రతీకార సుంకాలు అమలులోకి రాకపోయినా వాటిని సాకుగా చూపించి రెండు వారాలుగా ఎగుమతిదారులు రొయ్య ధరలను కౌంట్‌కు రూ.40 నుంచి రూ.90 వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండటం పట్ల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం విజయవాడలో భేటీ అయిన ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా కార్యాచరణ నిర్ణయించడం గమనార్హం. రొయ్యల ప్రాముఖ్యతను వివరిస్తూ సినీ నటులు, ప్రముఖులతో ప్రమోషన్ చేయించాలని, 100, 250, 500 గ్రాములుగా ప్యాకెట్లు చేసి విక్రయించాలని, చికెన్ షాపుల్లో సైతం వీటిని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం కోవిడ్ సమయంలో సైతం రొయ్య ధరలు తగ్గకుండా రైతులకు అండగా నిలిచి మద్దతు ధర అందించింది. తర్వాతి కాలంలో ధరలు తగ్గించకుండా ఎక్స్పోర్టర్స్పై నియంత్రణ ఉంచింది. స్థానిక వినియోగం పెంచేందుకు కృషిచేసింది. అదే మాదిరి కూటమి ప్రభుత్వం స్థానిక వినియోగంతో పాటు ఎక్స్పోర్టర్స్పై ఒత్తిడి తెచ్చి రొయ్య ధరలను రైతులకు లాభసాటి చేసేందుకు కృషిచేయాలని రైతులు కోరుతున్నారు. -
పని లేదు.. నిరుద్యోగ భృతి రాదు
ఏలూరు (మెట్రో): ‘నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తాం.. లేదంటే నిరుద్యోగ భృతిగా రు.3 వేలు అందించి అండగా నిలుస్తాం’ ఇవి కూటమి సర్కారు అధికారం కోసం ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు. వాస్తవానికి కూటమి సర్కారు అధికారం చేపట్టి సంవత్సర సమీపిస్తున్నా ఉద్యోగం లేని వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం సర్వే చేస్తున్నామంటూ, సచివాలయ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతూ కూటమి సర్కారు కాలయాపన చేస్తుంది. జిల్లాలో నిర్వహిస్తున్న వర్క్‌ఫ్రమ్ హోం సర్వేలో ఏ పనీ లేని వారి సంఖ్య 6,37,333 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గత రెండు నెలలుగా చేయిస్తున్న ఈ సర్వేలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి.? జనాభా ఎంత? ఏ పని చేయని వారు ఎంతమంది ఉన్నారు. ఇళ్ల వద్ద పనులు చేసేందుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు? అనే అంశాలను క్రోడీకరిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 99.90 శాతం సర్వేను సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే పూర్తి చేశారు. సర్వే వివరాలను ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ప్రచారం చేస్తున్నప్పటికీ ఇది ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా డిగ్రీ పట్టభద్రులతోపాటు ఇంజినీరింగ్ చేసిన యువతకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు కల్పిస్తారని చెబుతున్నారు. ఉన్న ఉద్యోగాలే తీసేస్తుంటే.. సర్వేలో నివాస గృహాల్లో బ్రాడ్‌బాండ్, వైఫై సదుపాయం, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, లేదా అన్న వివరాలు సర్వేల్లో నమోదు చేశారు. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రదేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఫైబర్నెట్పైనే పర్యవేక్షణ కొరవడటంతో కొత్తగా ఇంటర్నెట్ సదుపాయం ఎలా కల్పిస్తారనేది ప్రశ్నార్ధకమే. కనీసం ఫైబర్‌నెట్‌లో విధులు నిర్వహించే సుమారు 500 మంది ఉద్యోగాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి కొత్తగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనేది కూటమి సర్కారుకే తెలియాలి. వర్క్‌ఫ్రమ్ హోం సర్వే వివరాలు జిల్లా వ్యాప్తంగా ఇంతవరకూ చేసిన సర్వేలో 49,0034 గృహాల్ని సందర్శించారు. 10,83,839 మంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారిలో వివిధ పనులు చేస్తున్న వారు 1,93,819 మంది ఉన్నారు. ఏ పని చేయని వారు 6,37,333 మంది ఉన్నారు. ఇంటి వద్ద వివిధ పనులు చేస్తున్న వారు 17,341 మంది ఉన్నారు. నిరుద్యోగులను మోసగించిన కూటమి జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారని, నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసిన సర్కారు కనీసం దీనిపై నోరు మెదపడం లేదని సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ విమర్శించారు. వర్క్‌ఫ్రమ్ హోం సర్వేలో తేలిన లెక్కలు జిల్లాలో ఏ పని లేని వారి సంఖ్య 6,37,333 మంది జిల్లాలో 99.90 శాతం సర్వే పూర్తి -
పేదోడిపై ప్రతాపం.. బడాబాబులపై కనికరం
ఉండి: ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే ఎవరైనా ఉపేక్షించం అంటూ ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే సామాన్యులు, పేదలు ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లను కూలగొట్టి వారిని రోడ్డున పడేశారు. వారికి ప్రత్యామ్నాయాలు చూపకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. అయితే బడాబాబులు, అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్న స్థలాల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పొట్టకూటికోసం రోడ్ల పక్కన చిన్న బడ్డీ కొట్లు, రేకులతో తాత్కాలికంగా షెడ్లు నిర్మించుకున్న వారిపై, రోడ్ల పక్కన చేపలు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారిపై ప్రతాపం చూపించారు. ఆకివీడు, పాలకోడేరు మండలాల్లో నిరుపేదల ఇళ్లను కూలగొట్టారు. పరీక్షల సమయం దయచేసి కరెంటు ఇవ్వండి.. తరువాత ఏదో చోటికి వెళ్ళిపోతాం అని విద్యార్థులు వేడుకున్నా కనికరించలేదు. నిరుపేదలు, చిరువ్యాపారులపై ప్రతాపం చూపించిన అధికారులు బడాబాబులు ప్రభుత్వ స్థలాలు, పంటబోదెలు ఆక్రమించుకున్నా అవి ఆక్రమణలు కావు అన్నట్లు కన్నెత్తి కూడా చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఆక్రమణలు కావా ? ఉండి గణపవరం రోడ్డులో పంటబోదెను ఆక్రమించుకుని భారీ షెడ్డు నిర్మించగా.. పక్కనే ఉన్న ఓ రొయ్యల ఫ్యాక్టరీ యజమాని పంటబోదెను ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసినా, మద్యం దుకాణం ఏర్పాటు చేసి బోదె ఆక్రమించుకున్నా గానీ అధికారులకు కనిపించడం లేదు. బడాబాబులపై ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నారని విమర్శిస్తున్నారు. భారీ ఆక్రమణలకు ఎదురుగా కాలువ పక్కగా కొంతకాలం క్రితం పూరిపాకలు నిర్మించు కుని జీవిస్తున్న కొందరి ఇళ్ళను పీకి పారేశారు. ఎదురుగా ఉన్న భారీ ఆక్రమణలు మాత్రం కనిపించలేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత వేసవి ఎండల్లో చేసేది లేక చిరువ్యాపారులు ఎండల్లోనే పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. రోడ్ల వెంట చిరు వ్యాపారులు, పేదల షెడ్ల తొలగింపు పంట బోదెలు ఆక్రమించుకున్న పెద్దలపై మెతక వైఖరి -
కోకో ధరలపై ఒప్పంద ప్రకటన చేయాలి
ఏలూరు (టూటౌన్): వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని కోరుతూ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతుల సంఘం ప్రతినిధి బృందంతో ఎంపీ చర్చించారు. కోకో రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధర రాకపోవడంతో కోకో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు రూ.750కు పైగా ధర ఉన్నా రూ.450 నుంచి రూ.550 మాత్రమే ఇస్తున్నారన్నారు. పాత గింజలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ నెల 3న వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో కంపెనీలు, ట్రేడర్లతో సమావేశం జరిగిందని.. ఈ నెల 7 లోపు ధరల నిర్ణయ ప్రకటన చేస్తామని చెప్పారన్నారు. ఇంతవరకు నిర్ణయం కాకపోవడంతో కంపెనీలు అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత గింజలకు కిలోకు రూ.300, కొత్త గింజలకు కిలోకు రూ.550 అంటూ ప్రచారం చేయడంతో రైతులు మరింతగా నష్టపోతున్నారన్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధర ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ వైభవం దక్కేనా!
నాటకాన్ని నిలబెడుతున్న కళాపరిషత్‌లు జిల్లాలోని పలు సంస్థలు పరిషత్‌లు నిర్వ హిస్తూ నాటక రంగాన్ని పోషిస్తున్నాయి. తోలేరుకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర నాటక కళాపరిషత్, వీరవాసరా నికి చెందిన వీరవాసం కళా పరిషత్, భీమవరానికి చెందిన చైతన్య కళాభారతి, కళారంజని కళా పరిషత్‌లు.. ఏలూరుకు చెందిన హేలాపురి కళాపరిషత్, గరికపాటి కళా పరిషత్, పాలకొల్లు నాటక కళా పరిషత్ సంస్థలు ఏటా నాటక పోటీలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని ప్రముఖ సంస్థలకు చెందిన కళాకారులను ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి, పోటీలతో పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. 1995లో రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలు ప్రారంభించి నంది అవార్డులను ఇస్తోంది. 2009లో ఖాజావలీ దర్శకత్వంలో ప్రదర్శించిన ఎవరో ఒకరు సాంఘిక నాటకం బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు గెలుచుకుంది. ఆ తరువాతి సంవత్సరం వలీ దర్శకత్వంలోనే 2010లో ౖసైసె జోడెడ్ల బండి నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వరించాయి. 2012లో మహాసాధ్వి శకుంతలకు వెండి, కాంస్య నంది, 2017లో ఇంద్రసింహాసనం పౌరాణిక నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వచ్చాయి. ● జిల్లాలో నాటకాలకు పెరుగుతున్న ఆదరణ ● నాటకాలతో ప్రజలను చైతన్యపర్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి ● పరిషత్‌ల నిర్వహణలో నాటక రంగ పోషణ ● నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కందుకూరి వీరేశలింగం పంతులు వ్యవహార ధర్మబోధిని నాటకాన్ని రచించి, తొలిసారిగా రంగస్థలంపై ప్రదర్శించిన రోజు కావడంతో ఏటా ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అప్పట్లో టిక్కెట్లు కొని నాటకాలు చూసేవారు. ప్రముఖ కళాకారుల నాటకాలు చూసేందుకు జనం ఎగబడేవారు. అనంతరం సినిమాలు, టీవీలు, ఇటీవలి మొబైల్ ఫోన్లు రావడంతో నాటకాలకు ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక నాటక కళా పరిషత్‌లు పోటీలు నిర్వహిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి. నాటక రంగానికి ఊపిరులూదే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందరో మహానుభావులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎందరో నాటక రచయితలు అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందారు. తిరుపతి వేంకట కవుల గురించి పరిచయం అవసరం లేదు. అనేక పౌరాణిక నాటకాలు రచించి నటులు, దర్శకులకు మార్గదర్శకులయ్యారు. మత్స్యపురికి చెందిన కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్నే ఉర్రూతలూగించింది. దెందులూరుకు చెందిన ఎన్ఆర్ నంది రచించిన మరో మొహంజదారో నాటిక ఉర్రూతలూగించింది. ఏలూరుకు చెందిన కోడూరుపాటి సరస్వతి రామారావు రచించిన సాని– సంసారి నాటిక సాంఘిక నాటకాలకు దిక్సూచిగా నిలిచింది. బందా కనకలింగేశ్వర రావు నాటకాల్లో నృత్యాలను, పాటలను ప్రవేశపెట్టి నాటకాలను ప్రజారంజకంగా మలచడంలో కీలకపాత్ర పోషించారు. నాటక రంగంపై చెరగని ముద్ర జిల్లాకు చెందిన అనేక మంది నాటక రంగంపై చెరగని ముద్ర వేశారు. పౌరాణిక నాటకాల్లో షణ్ముఖి ఆంజనేయరాజు అగ్రగణ్యుడు. ఆయన పద్యాలు అందుకుంటే ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యేవారు. తాడేపల్లిగూడెంకు చెందిన మద్దాల రామారావు నాటక రంగంపై తనదైన ముద్ర వేశారు. అనేక మంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కళాకారులు నాటకరంగాన్ని ఒక ఊపు ఊపారు. సాంఘిక నాటకంపై తాళాబత్తుల ముద్ర పాలకొల్లుకు చెందిన తాళాబత్తుల వెంకటేశ్వర రావు సాంఘిక నాటక రంగంలో గుర్తింపు పొందారు. ఉపాధ్యా యుడిగా పని చేస్తున్నప్పటికీ నాటక రంగంపై మక్కువతో అనేక నాటకాలు రచించడంతో పాటు నటుడిగా రాణిస్తున్నారు. ఆయన రచించిన సైకత శిల్పం, నాన్నా నేనొచ్చేసా, అనూహ్యం, తప్పుటడుగులు, సప్త పది, దిష్టిబొమ్మలు, నాన్నా నన్ను క్షమించండి, మనిషికీ మనిషికీ మధ్య వంటి సంచలన విజయాలు అందుకున్నాయి. ప్రభుత్వం ఆదరించాలి మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నాటక రంగానికి ఆదరణ తగ్గుతోంది. కరోనా అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 కొత్త పరిషత్‌లు వచ్చాయి. నేటి తరంలో నాటకరంగంపై ఆసక్తి కలిగించడానికి ప్రాథమిక విద్యలో నాటకరంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో నాటకాలను ప్రదర్శించేలా ప్రోత్సహించాలి. నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. – బుద్దాల వెంకట రామారావు, బీవీఆర్ కళాక్షేత్రం అధినేత, తాడేపల్లిగూడెం -
‘సూపర్ సిక్స్’ అమలుకు ప్రభుత్వంపై ఉద్యమించాలి
బుట్టాయగూడెం: ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. జీలుగుమిల్లి మండంలో వైఎస్సార్సీపీ అనుబంధ పదవులు పొందిన నాయకులు మంగళవారం రాత్రి బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో బాలరాజు గృహంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మిలకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు రావడం లేదన్నారు. అదేవిధంగా మహిళల కోసం ఏర్పాటు చేస్తామన్న ఉచిత బస్సు ఊసే ఎత్తడంలేదని అన్నారు. రైతులకు రైతు భరోసా పథకం లేక ఖరీఫ్, రబీ సీజన్లో కూడా నానా కష్టాలు పడుతూ వ్యవసాయం చేశారని అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తల్లికి వందనం ఎప్పడిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, అలాగే వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిగేటట్లు చేశారని, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరికో బెల్టుషాపు పెట్టి మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, జిల్లా కార్యాచరణ కార్యదర్శి బోదా శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర సెక్రటరీ బూరుగు ఫ్రెడరిక్ ప్రేమ్‌కుమార్, నాయకులు సున్నం సురేష్, చిట్టిబొమ్మ శ్రీను, కొప్పుల సత్యనారాయణ, ఉప్పల రాంపండు, రంగుల రమేష్, వెంకట్, ఆకుల రవి, బొంతు వెంకట్, చిన్నరాముడు, వంకా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు -
ఎస్ఆర్కేఆర్ ప్రోత్సాహంతో ఉన్నత స్థానం
ఉప రాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సుమ భీమవరం: స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహమే తమ ఉన్నతికి కారణమని డీఏఎన్ ఐపీఎస్ అధికారిణి, ఢిల్లీ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్, భారత ఉపరాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ మద్ద సుమ అన్నారు. మంగళవారం తాను చదువుకున్న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తన భర్త, కళాశాల పూర్వ విద్యార్థి, శ్యాంసంగ్ ఆర్అండ్డీ విభాగం జనరల్ మేనేజర్ బి అనిల్ కుమార్‌తో కలిసి వచ్చి ఈసీఈ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని సుఽమ స్పష్టం చేశారు. తన సోదరుడు ఎం నీలాజలం కూడా ఇక్కడే చదివి అనంతరం పీజీ చేసి పోటీ పరీక్షల్లో విజయం సాధించి భీమవరంలోనే ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్, ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి వారిని అభినందించారు. -
మే 11న సుందరగిరిపై నృసింహ జయంతి వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి జయంతి (ఆవిర్భావ)వేడుకలు మే 11న వైభవంగా జరుగనున్నాయి. ఆరోజు స్వాతి నక్షత్రం, చతుర్దశి తిథి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు అర్చకులు, పండితులు విశేష ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశ అభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత సుదర్శన నృసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ అనంత మూలమంత్ర హోమాలు, విశేష నివేదనలు, పంచ హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వినియోగం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయని నృసింహ ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మి నరసింహ గురూజీ తెలిపారు. మధ్యాహ్నం అన్నసమారాధన జరుగుతుందన్నారు. రూ.1,116 చెల్లించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే దంపతులకు స్వామివారి శేష వస్త్రంతో పాటు, ప్రసాదాలను అందిస్తారని చెప్పారు. వివరాలకు 99085 63958, 99122 81886 నంబర్లలో సంప్రదించాలన్నారు.మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బారులు దీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంనకు చెందిన శ్రీ విజయదుర్గ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,43,328 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. 1200 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఏర్పాట్లు చేశారు. -
పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బౌబ్రిడ్జి మీదుగా వెళుతున్న తాగునీటి ప్రధాన పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బౌబ్రిడ్జి వద్ద ఎన్నో ఏళ్లుగా పైప్‌లైన్‌కు లీకేజీలు ఏర్పడుతుండడంతో నీరు వృథాగా పోతోంది. అంతేగాక పలు ప్రాంతాల్లో సైతం ఏర్పడిన లీకేజీల ద్వారా నీరు కలుషితమవుతోందని, తోక పురుగులు వస్తున్నాయని ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సాక్షి కథనాలను ప్రచురించింది. ఎప్పటికప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం.. మళ్లీ కొన్నాళ్లకు లీకేజీలు ఏర్పడడం షరామామూలే. ప్రస్తుతం దీనిపై స్పందించిన అధికారులు ప్రధాన పైపులైన్‌కు ఏర్పడిన లీకేజీని అరికట్టేందుకు రూ.2 లక్షల వ్యయంతో కాస్ట్ ఐరన్ పైపును లింక్ చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో అధికారులు ఎంఈ వెంకటరమణ, డీఈలు వెంకటేశ్వరరావు, పవన్ ఆధ్వర్యంలో ఈపనులు చేపట్టారు. దీంతో సమస్య పరిష్కారమైంది. -
యర్రంపేట వాసికి గిన్నిస్ బుక్‌లో చోటు
కొయ్యలగూడెం: యర్రంపేటకు చెందిన కీబోర్డ్ కళాకారుడు జీవన్ ప్రసాద్ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు. మంగళవారం ఆ వివరాలకు విలేకరులకు వెల్లడించారు. హాలెల్ అంతర్జాతీయ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో పద్దెనిమిది దేశాలకు చెందిన కీబోర్డ్ కళాకారులతో ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. గంటసేపు అంతరాయం లేకుండా ప్లేచేస్తూ నైపుణ్యత కనబరిచిన 1046 మందిని విజేతలుగా ప్రకటించారన్నారు. విజేతల్లో తాను ఉన్నానని, ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేశారన్నారు. గిన్నిస్ అద్జిడికేటర్ రిచర్డ్ స్టిన్నింగ్ అవార్డులను హైదరాబాదులో ప్రదానం చేసినట్లు చెప్పారు. ‘అక్కడ అమ్మాయి– ఇక్కడ అబ్బాయి’ చిత్ర బృందం సందడి భీమవరం: భీమవరం ఏవీజీ సినిమాస్‌లో ‘అక్కడ అమ్మాయి– ఇక్కడ అబ్బాయి’ చిత్ర బృందం మంగళవారం సందడి చేసింది. హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక పిల్లి యూనిట్ సభ్యులతో ప్రేక్షకులతో మాట్లాడారు. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు వాయిదా ఏలూరు రూరల్ / టౌన్: ఈ నెల 17, 18 తేదీల్లో ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్, అండర్–23, అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు వాయిదా వేసినట్లు ఉమ్మడి ప శ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌న్ అధ్యక్షుడు జి ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ పోటీలు వాయిదా వేశామని, తదుపరి తేదీలను పత్రికల ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌పై వచ్చిన పలు ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించిందని కమిటీ చైర్మన్ చవాకుల కాశీ విశ్వేశ్వరరావు మరో ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిబంధనలు పాటించకపోవటంతో వెస్ట్‌గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఏవిధమైన కార్యకలాపాలు నిర్వహించకుండా నిలుపుదల చేశారని పేర్కొన్నారు. వేతన బకాయిలు విడుదల చేయాలి భీమడోలు: ఉపాధి కార్మికులకు రెండు నెలలుగా రావాల్సిన వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అన్నారు. భీమడోలు సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండీఎం నిర్వాహకులకు రెండు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చిరుద్యోగులు, కూలీల వేతన బకాయిలను నెలల తరబడి పెండింగ్ పెట్టడం దారుణమన్నారు. -
వరిసాగులో యంత్రాల జోరు
పెంటపాడు: వరి సాగులో రైతులు కొత్తవంగడాలు వినియోగించడంతో పాటు వినూత్న రీతిలో సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగా యంత్రాల వినియోగం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. రైతుల ఆలోచనలకు తగ్గుట్టు యంత్రాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు మినహా మిగిలిన రైతులు యంత్రాలు కొనుగోలు చేసి వరి సాగులో జోరుగా వాటిని వినియోగిస్తున్నారు. మరికొందరు రైతులు యంత్రాలను అద్దెకు తీసుకొంటూ సాగు చేస్తున్నారు. వరి సాగు ప్రారంభంలో ట్రాక్టర్లతో దమ్ములు చేయడంతో పాటు వరి నాట్లు వేయడంలోనూ యంత్రాలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వరి కోతలు సమయం కావడంతో యంత్రాల సాగు జోరుగా ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు అనుగుణంగా రాత్రి పగళ్లు పొలాల్లో బీజీగా గడుపుతూ యంత్రాల సాయంతో నూర్పులు చేపడుతున్నారు. కాగా ప్రస్తుతం దాళ్వా మాసూళ్ల విషయంలో రైతులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో సరిగ్గా కోతల సమయంలోనే వర్షాలు కురుస్తూ, ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో యంత్రాల వినియోగం రైతులకు మేలు చేస్తోంది. వినియోగంపై ఆసక్తి తక్కువ సమయంలో ఎక్కువ పని చేసేందుకు అలాగే పెట్టిన రాబడి రాబట్టుకొనేందుకు రైతుల యంత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎకరా సాగు చేసేందుకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అదే యంత్రాలు ఉపయోగించి సాగు చేస్తే రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు అవుతోంది. అలాగే ప్రస్తుతం ఎకరం వరి కోత కూలీలకు రూ.5500 కాగా, అదే యంత్ర సాయంతో రూ.2400 ఖర్చు అవుతోంది. దీంతో సగానికి పైగా ఖర్చు తగ్గుతోంది. ఏళ్ల తరబడి వ్యవసాయ పనులను నమ్ముకున్న కూలీలకు యంత్రం వల్ల ఉపాధి లేకుండా పోయింది. దీని వల్ల వారు పనుల కోసం వలసబాట పడుతున్నారు. కొంతమంద కూలీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకొంటూ ఉపాధి పొందుతున్నారు. యంత్రాలపైనే ఆసక్తి చూపుతున్న రైతులు ప్రస్తుతం యంత్రాలతో ముమ్మరంగా వరికోతలు ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలు సమయం, ఖర్చు ఆదా ప్రస్తుతం వరికొతలను యంత్రాల ద్వారా సాగు చేస్తున్నారు. తక్కువ సమయంతో పాటు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. దీంతో మాకు కొంత పెట్టుబడి మిగులుతుంది. ప్రస్తుతం దాళ్వా కోతల సీజన్ కావడం తో యంత్రాలతో మాసూళ్లు చేపడుతున్నాం. – తోరం సుబ్బన్న రైతు, పడమరవిప్పర్రు పెట్టుబడి తగ్గుతుంది ప్రసుత్త వరి కొతలను యంత్రాల సాయంతో చేయడం వల్ల అనుకున్న సమయాని కంటే ముందే పని పూర్తవువుతోంది. ఎకరా కోత నూర్పు చేయడానికి రూ.3600 ఖర్చు అవుతోంది. అదే కూలీలను పెట్టి కోస్తే రూ.5 వేలు అవుతుంది. – పాలా గణపతి, కొండేపాడు -
నిర్వాసితుల ఇళ్ల గల్లంతుపై మళ్లీ విచారణ
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టులో ఇళ్లను కోల్పోతున్న అర్హులైన నిర్వాసితుల పేర్లను తొలగించిన స్పెషల్ కలెక్టర్ సరళావందనం మళ్లీ ఈ పేర్లపై విచారించాలని తాజాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏలూరు–2 కు లిఖితపూర్వకంగా ఆదేశించారు. ప్రభుత్వం నోటిఫై చేసిన అవార్డు ఉత్తర్వులో వేలేరుపాడు మండలం జగన్నాధపురంలోని 140 మంది నిర్వాసితుల పేర్లను స్పెషల్ కలెక్టర్ సరళ వందనం తొలగించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళ వందనం గత ఏడాది అక్టోబర్ నెలలో అప్పటి ఏలూరు ఎస్డీసీ ముక్కంటితో విచారణ చేయించారు. అప్పట్లో వేలేరుపాడు తహసీల్దార్, వీఆర్వో, గ్రామ పంచాయితీ కార్యదర్శి, ఎంపీడీఓల సమక్షంలో విచారణ చేపట్టారు. 2015, 2016, 2017 ఇంటి పన్ను రశీదులు పరిశీలించి ఎస్డీసీ కార్యాలయానికి అందరి అధికారుల సంతకాలతో పంపారు. మళ్లీ తొలగించిన నిర్వాసితుల ఇండ్లను విచారించాలని, అన్ని ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిజంగా ఇండ్లు ఉన్నాయా... లేదా? అన్న అంశాలను పరిశీలించాలని పోలవరం స్పెషల్ కలెక్టర్ తాజాగా ఆదేశించారు. దీంతో మంగళవారం ఏలూరు ఎస్డీసీ వాకా శ్రీనివాసరెడ్డి విచారణ చేపట్టారు. ఇంటింటింకీ తిరిగి నోట్ కెమెరాతో ఫొటోలు తీశారు. ఇంటి యజమాని అందుబాటులో ఉంటే ఇంటి ముందు నిలబెట్టి ఫొటోలు తీశారు. వీరితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, వీఆర్వో, ఎస్డీసీ కార్యాలయ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు. గతంలో పేర్లు తొలగించిన స్పెషల్ కలెక్టర్ సరళావందనం మళ్లీ విచారించాలని తాజాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు ఆదేశం ఇంటింటికీ తిరిగి నోట్ కెమెరాతో ఫొటోలు తీస్తున్న అధికారులు -
బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పనిచేస్తుందని ఆ సంఘ నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. మంగళవారం స్థానిక అంబిక ఫ్లేవర్స్ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బ్రాహ్మణులు సామాజికంగా అభివృద్ధి చెందిన వారి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థికంగా అట్టడుగున ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. అలాగే బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందించాలని, వ్యాపారాలు చేసుకోవడానికి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హెచ్‌కే మోహనరావు, కోశాధికారిగా పులిపాక ప్రసాద్, అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా సత్యవాడ దుర్గా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన బ్రాహ్మణులు గండ్లూరి దత్తాత్రేయ శర్మ, గుండు రామనాథ శాస్త్రి, బులుసు అపర్ణ, ఓరుగంటి వెంకట రమణ, శంకరమంచి సుబ్రహ్మణ్య శాస్త్రి, గోపాలుని హరిహరరావు, గామోజీ అపర్ణ ప్రసాద్, సూరంపూడి వీరభద్రరావు, విష్ణుదాస్ శ్రీకాంత్‌లను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. -
సమష్టిగా కృషి చేయాలి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసే దిశగా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలత అన్నారు. మంగళవారం ఏలూరులోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఎకై ్సజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీలత మాట్లాడుతూ జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత పెండింగ్‌లోని కేసులపై విచారణ పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. కేసులు పెట్టినా మారకుంటే పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ కేవీఎం ప్రభుకుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏ.అవులయ్య, ఏఈ ఎస్.అజయ్‌కుమార్ సింగ్, పాండురంగారావు ఉన్నారు. ఆటో బోల్తా.. 9 మందికి స్వల్ప గాయాలు నూజివీడు: మీర్జాపురంలో ఆటో బోల్తా పడి మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం గొల్లపల్లికి చెందిన మహిళలు మంగళవారం సీతారామపురం వద్ద ఉన్న సమోసా తయారీ ఫ్యాక్టరీలోకి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి ఆటోలో ఇంటికి వస్తుండగా మీర్జాపురం వద్దకు వచ్చే సరికి క్రేన్ తగిలి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మహిళలకు స్వల్పగాయాలయ్యాయి. వీరందరిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత -
వివాదాస్పదంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
పెనుమంట్ర: నత్తారామేశ్వరం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వివాదస్పదంగా మారింది. ఇక్కడ పాత చిన్న విగ్రహం స్ధానంలో పూర్తి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో గందరగోళం నెలకొంది. నూతన విగ్రహ ఏర్పాటుకు దళిత సంఘాల నేతలు కొన్నిరోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అధికారులు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై దళితులు నిరసన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన ప్రదర్శన చేశారు. కొందరు నాయకులు ఒత్తిడిలకు తలొగ్గి అధికారులు ఉద్దేశపూర్వకంగానే విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై రాకపోకలు నిలుపుదల చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పెనుమంట్ర ఎస్సై కె స్వామి జోక్యం చేసుకుని నాయకులకు నచ్చచెప్పారు. కొద్దిసేపు తర్జనభర్జనల అనంతరం ఎస్సై సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కేవీవీ సుబ్బారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం పెనుమంట్రలోని అంబేద్కర్ సెంటర్లో దళిత సంఘాల నాయకులు మరోసారి నిరసనకు దిగారు. అక్కడ కూడా ఎస్సై జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో నిష్క్రమించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. కాగా దళితులు ఎట్టకేలకు తాము అనుకున్న విగ్రహం కాకుండా మరో విగ్రహాన్ని తీసుకువచ్చి పీఠంపై నెలకొల్పి ఆవిష్కరించారు. -
21 నుంచి దివ్యాంగులకురాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో దివ్యాంగులకు ఈనెల 21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ వెల్లడించారు. వివిధ రకాల వైకల్యం గల కలిగిన 12 నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కోసం ప్రత్యేక ఒలింపిక్ భారత్ (ఎస్‌ఓబీ) సహకారంతో క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని కలిగించి పోటీల్లో పాల్గొనే విధంగా దివ్యాంగుల్లో చైతన్యం కలిగించాలని భవిత సెంటర్ ప్రత్యేక ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. క్రీడా పోటీలు నడక, బ్యాడ్మింటన్, సైక్లింగ్, బాల్ త్రో తదితర పోటీలు ఉంటాయని వివరించారు. కోకో రైతుల చలో గుంటూరు వాయిదా ఏలూరు (టూటౌన్): కోకో రైతులకు న్యాయం చేస్తామని ఈనెల 12వ తేదీన ఆగిరిపల్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 15న (రేపటి) చేపట్టనున్న చలో గుంటూరు కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ప్రకటించింది. సోమవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. కోకో గింజలు కొనుగోలు, ధర సమస్యలను ఈనెల 7వ తేదీ లోపు పరిష్కారం చేస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. కోకో గింజల ధరల నిర్ణయ ప్రకటన చేయకపోవడంతో కంపెనీలు అతి తక్కువ ధర కొనుగోలు చేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చామని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో కోకో రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దీంతో ఆందోళన కార్యక్రమం వాయిదా వేశామని, హామీ అమలు చేయకపోతే మరలా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని, పాత గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల మోసాలు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, ఉప్పల కాశీ నాయకులు పి.నరసింహారావు, వి.రాంబాబు, యలమాటి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
అకాల వర్షంతో అంతటా నష్టం
కై కలూరు: అకాల వర్షాలతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షానికి పలుచోట్ల వరిచేలు, మామిడి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రధానంగా విపరీతమైన ఈదురు గాలులు.. వడగండ్ల వర్షంతో కై కలూరు నియోజకవర్గం చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం రాత్రి నుంచి వీచిన గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడడంతో పాటు దాదాపు 192 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు చిమ్మచీకట్లలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ప్రధానంగా విద్యుత్‌శాఖకు భారీ నష్టం కలిగింది. ఆక్వా చెరువులపై విద్యుత్ స్తంభాలు ఎక్కువగా కూలబడ్డాయి. మండవల్లి మండలం పుట్లచెరువు వద్ద ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన టవర్ నేలకూలింది. దీంతో మరో టవర్ నుంచి విద్యుత్‌ను మళ్లించారు. కై కలూరు టౌన్, రూరల్, కలిదిండి, మండవల్లి, ముదినేనపల్లి మండలాల్లో అనేక ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ తీగలపై పడ్డాయి. ఎక్కువ నష్టం కలిదిండి మండలంలో జరిగింది. కై కలూరు టౌన్లో గాలులకు వైర్లు తెగిపడ్డాయి. అనేక దుకాణా బోర్డులు ఊడి రోడ్లపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పిల్లలు ఫ్యాన్లు తిరగక దోమలతో నరకయాతన అనుభవించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడ్డారు. చార్జింగ్‌లు లేక సెల్ఫోన్లు మూగబోయాయి. విద్యుత్ సరఫరా యుద్ధప్రాతిపాదికన పునరుద్ధరిస్తున్నామని విద్యుత్‌శాఖ డీఈ రామయ్య చెప్పారు. ఇదిలా ఉండగా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామ సమీప కొత్తమాలపల్లిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో మేకా ఆదిలక్ష్మి (45) అనే మహిళ బయట వంట సామాగ్రి తీయడానికి వెళ్లగా ఆమైపె తాడిచెట్టు పడింది. కై కలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. పూరి–తిరుపతి రైలుపై కూలిన వృక్షం కై కలూరు రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి ప్రయాణికుల కోసం నిలిచిన పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు పైన, విద్యుత్ తీగలపై స్టేషన్లో భారీ వృక్షం పడింది. ఆ సమయంలో ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయపడ్డారు. కొందరు రోడ్డు మార్గాన వెళ్లిపోయారు. రైల్వే శాఖ మూడు గంటలు శ్రమించి విద్యుత్ వైర్లను పునరుద్ధరించింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈకారణంగా గుడివాడ– భీమవరం రూటులో రైళ్లను దారి మళ్లించారు. నేలకూలిన వృక్షం కాళ్ల: కాళ్ళ మండలంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీవర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఒకపక్క కోతదశకు వచ్చిన వరిచేలు నేలకొరిగి నీటమునిగాయి. మరోపక్క ఆక్వా రైతులకు కునుకు లేకుండా పోయింది. తీవ్రంగా వీచిన గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాళ్ళ నుంచి భీమవరం వెళ్లే దారిలో జక్కరం వద్ద తెల్లవారుజామున భారీవృక్షం రాష్ట్రీయ రహదారిపై కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సోమవారం వృక్షాన్ని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. రైతన్న బెంబేలు గణపవరం: ఆదివారం రాత్రి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రబీ రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పగటి పూట ఎండబెట్టిన ధాన్యాన్ని సాయంత్రం రాశులుచేసి తడవకుండా బరకాలు, టార్ఫాలిన్లు కప్పి ఉంచడంతో వర్ష ప్రభావం పెద్దగా నష్టం చేయలేదు. కొంతమేర తడిసిన ధాన్యాన్ని రైతులు సోమవారం ఉదయం నుంచి ఎండబెట్టుకున్నారు. ఇక కోతలు కోయడానికి సిద్ధమైన రైతులు ఆఘమేఘాలపై వరికోతలు పూర్తిచేసి ధాన్యం రాశులు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. వర్షంనీరు చేలల్లో చేరడంతో రైతులు సోమవారం ఉదయం నుంచే చేలల్లో చేరిన నీటిని బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దెబ్బతిన్న మామిడి తోటలు నరసాపురం రూరల్: నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని మామిడి, వరి పంటలు ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, అకాల వర్షంతో దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని నరసాపురం, మొగల్తూరు మండాల్లో సుమారు రెండు వేలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొగల్తూరు, ముత్యాలపల్లి, పేరుపాలెం, మోడి, రుస్తుంబాద, సీతారామపురం, తూర్పుతాళ్లు, లక్ష్మణేశ్వరం, పసలదీవి, తదితర ప్రాంతాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఆది నుంచి మామిడి రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చెట్లు మామిడిపూత సమయంలో బాగానే ఉన్నా తేనె మంచు కురవడంతో పూచిన పూత అంతా మాడిపోయింది. దీంతో ఉన్న కొద్దిపాటి పూత, పిందెలను నిలుపుకునేందుకు ఇప్పటికే ఐదారుసార్లు వివిధ క్రిమి సంహారక మందులు పిచికారి చేయడంతో కొంతమేర కాయ నిలబడింది. అయితే ఒక్కసారిగా ఆదివారం రాత్రి కురిసిన భారీగాలులతో కూడిన వర్షానికి మామిడితో పాటు వరి చేలు కూడా నేలనంటాయి. కై కలూరులో నేలకొరిగిన 192 విద్యుత్ స్తంభాలు పూరి–తిరుపతి రైలుపై కూలిన వృక్షం పలు మండలాల్లో నేలకొరిగిన వరిచేలు -
లిఫ్ట్ ఇచ్చి దోచేస్తారు.. జాగ్రత్త
తణుకు అర్బన్: లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతున్నారా.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తానంటే ఎక్కుతున్నారా అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. గురువుగారూ ఎక్కడ దింపమంటారు అంటూ ద్విచక్ర వాహనం ఆగినా.. బాబూ కొంచెం పైసెంటర్లో దింపుతారా అని మీరే అడిగినా మీపై దాడులు చేయడం ఆపై మీ జేబులు గుల్లయ్యే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త.. లిఫ్ట్ ఇచ్చినవారు మంచి వారైతే క్షేమంగా ఇంటికి చేరే పరిస్థితి. లేదంటే వారి పని అంతేనన్నట్లుగా ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. దీంతో అపరిచిత వ్యక్తులు ఎవరైనా రోడ్డుపై ఆపి లిఫ్ట్ అడుగుతున్నా, లిఫ్ట్ ఇస్తామన్నా నమ్మలేని పరిస్థితి దాపురించింది. నడి వయస్సు, వృద్ధులే లక్ష్యంగా.. కష్టపడలేక ఈజీ మనీకి అలవాటు పడుతున్న యువత ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. వాహనంలో లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి గాయపరుస్తూ భయబ్రాంతులకు గురిచేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును సైతం దోచుకుంటున్నారు. ముఖ్యంగా నడి వయస్సు, వృద్ధులే లక్ష్యంగా ఈ దోపిడీ జరుగుతున్నట్లుగా బాధితవర్గాలు చెబుతున్నారు. అయితే సదరు దోపిడీదారులు చాలా భయానకంగా వ్యవహరిస్తున్నారని వాహనం నుంచి దించగానే మోకాళ్లపై కుర్చోపెట్టి మారణాయుధాలతో బెదిరించి లొంగని వారిపై దాడులకు పాల్పడుతున్నట్లుగా బాధితులు వాపోతున్నారు. ఇటీవల తణుకుకు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది హైదరాబాద్‌కు వెళ్లి రాత్రి సమయంలో తణుకులో బస్సు దిగారు. ఇరగవరం రోడ్డులోని తన ఇంటికి వెళ్లేందుకు స్థానిక వెంకటేశ్వర థియేటర్ ప్రాంతంలో ఆటో కోసం ఎదురుచూస్తుండగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు తాము దింపేస్తామంటూ ఆయన్ను ఎక్కించుకుని కంపోస్టు యార్డు దగ్గరకు తీసుకువెళ్లి ఆయన దగ్గర ఉన్న రూ.1500 నగదు, సెల్ ఫోన్ దోచేశారు. బ్యాంకులో ఉన్న రూ. 2వేలు కూడా ఫోన్‌పే ద్వారా వారు బదిలీ చేసుకుని ఫోన్‌తో ఉడాయించారు. దీంతో మరుసటి రోజున ఆ న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసును ఛేదించిన పోలీసులు పైడిపర్రు కేంద్రంగా నివాసం ఉంటూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరవాసరం మండలం నవుడూరు గ్రామానికి చెందిన యువకుడు, బుట్టాయిగూడెం మండలం రామచంద్రపురానికి చెందిన ఒక యువకుడు కలిసి పైడిపర్రులో నివాసం ఉంటూ తణుకు పరిసర ప్రాంతాల్లో ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పైడిపర్రు పరిధిలోని వైజంక్షన్‌లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2.87 లక్షలు విలువైన 41 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరు తణుకు పట్టణ పరిధిలో 3, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చోరీల్లో పాల్గొన్నట్లు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ తరహా చోరీల్లో బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా మరి కొందరు చెప్పుకోలేక ఇంటి దారి పడుతున్నారు. పోలీసు స్టేషన్లకు చేరని నేరాలు పదుల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లిఫ్ట్ ఇచ్చి దాడులకు తెగబడుతున్న దొంగలు 6 కేసులకు సంబంధించి ఇద్దరి అరెస్ట్ అపరిచిత వ్యక్తులను ఆశ్రయించవద్దు ఎవరైనా రహదారుల్లో అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటే వద్దని చెప్పడమే మంచిది. లిఫ్ట్ ఇస్తానని వాహనం ఎక్కించుకుని దోపిడీ చేస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అపరిచిత వ్యక్తులను లిఫ్ట్ అడగకుండా ఉండడంతోపాటు, వాహనం ఎక్కండి లిఫ్ట్ ఇస్తానన్నా ఎక్కకుండా ఉండడమే క్షేమం. ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – ఎన్.కొండయ్య, తణుకు పట్టణ సీఐ -
పెట్రోల్ బంకులో మోసంపై తహసీల్దార్‌కు ఫిర్యాదు
కాళ్ల: కాళ్ళ హెచ్‌సీ పెట్రోలు బంకులో ఘరానా మోసం బయటపడింది. రూ.100 పెట్రోలు కొట్టిస్తే కేవలం అర లీటరు పెట్రోల్ రావడంపై వినియోగదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే కాళ్ళ గ్రామానికి చెందిన ఎం.సూరిబాబు బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో దారిలో ఆగిపోయింది. దీంతో దగ్గరలో ఉన్న హెచ్‌పీ బంకుకు వెళ్లి ఖాళీ వాటర్ బాటిల్లో రూ.100 పెట్రోలు కొట్టించాడు. తీరా చూస్తే బాటిల్లో అర లీటర్ పెట్రోలు రావడంతో విస్తుబోయి మెషిన్ని చూడగా 0.91 లీ. అని వచ్చింది. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని నిలదీశాడు. అదే సమయంలో మరో వ్యక్తి వచ్చి బాటిల్లో పెట్రోల్ పట్టమనగా మళ్లీ అదేవిధంగా అర లీటరు మాత్రమే రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులు బంకులో చేస్తున్న ఘరానా మోసంపై స్థానిక తహసీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లలో మోసాలు జరగకుండా తూనికలు, కొలతల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
తృటిలో తప్పిన ముప్పు
యలమంచిలి: మండలంలోని అడవిపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని ధ్వజ స్తంభం ఆదివారం రాత్రి భారీ ఈదురుగాలులకు నేలకొరిగింది. ధ్వజ స్తంభం అడుగు భాగంలో చెక్క పొట్టుగా రాలడం వల్లే నేలకొరిగిందని భావిస్తున్నారు. ధ్వజ స్తంభం కూలిన శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ధ్వజస్తంభం పక్కనే ఉన్న రైతు భవనంపై పడడంతో ఏ ప్రమాదమూ జరగలేదు. 42 అడుగుల ధ్వజస్తంభాన్ని గ్రామస్తుల సహకారంతో నాలుగేళ్ల క్రితం ప్రతిష్ఠించారు. నేడు ఆక్వా రైతుల సమావేశం భీమవరం: సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం పట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మంగళవారం ఆక్వా రైతులు సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ సోమవారం చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన ఆక్వా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఆక్వా సమస్యల నుంచి ఆక్వా రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చో ఈ సదస్సులో వివరిస్తారని సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.బలరాం హాజరవుతారని గోపాలన్ చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే సదస్సులో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 21 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు భీమవరం: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వరస్వామి 14వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా కల్యాణం, రథోత్సవం, వైభవోత్సవం, ఊరేగింపు, ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల బాల, జీవీఐటీ అప్పారావు, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పత్తి హరివర్థన్, యర్రంశెట్టి శివకృష్ణ, ముచ్చకర్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి ఆయనతో పాటు కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నివాళులర్పించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మహోన్నత దివ్య శక్తిగా ఎదిగారని కొనియాడారు. ఎస్పీ మాట్లాడుతూ అందరికీ సమాన హక్కుల ధ్యేయంతో రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. మాల మహానాడు అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్, డీవీఎంసీ సభ్యులు చీకటమిల్లి మంగరాజు, పొన్నమండ బాలకృష్ణ, జిల్లెళ్ళ సత్య సుధామ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.రాహుల్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బీ.వీ.ఎస్.బి రామాంజనేయ రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకముందు అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. అంబేడ్కర్ మార్గంలో నడవాలి: మండలి చైర్మన్ వీరవాసరం: బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు పిలుపునిచ్చారు. నందమూరి గరువులో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అంబేడ్కర్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, సర్పంచ్ మేకల వెంకట చలపతి, మెంటే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
పాపాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తంటాలు
తాడేపల్లిగూడెం అర్బన్: టీటీడీ గోశాలలోని గోవులు మరణిస్తే.. అబద్ధమంటూనే చివరకు మరణాలను అంగీకరించారని తమ పాపాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ గోవుల మృతి పట్ల అవాస్తవాలు చెప్పడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బ తీశారన్నారు. దేవస్థానం ఈఓ శ్యామలరావు తన బాధ్యతలను పక్కనబెట్టి టీడీపీ సభ్యుడిగా ఆ పార్టీ అజెండా మోస్తున్నట్లు ఉందని విమర్శించారు. గోశాలలో గోవుల మృతిపై 22 గోవులు అని ఒకసారి, 40 గోవులు అని మరోసారి చెప్పారని.. చివరకు ఆలయ ఈఓ 43 గోవులు మృతిచెందాయని చెప్పారన్నారు. గోవులు మృతి చెందితే ఆందోళన ఎందుకని దేవస్థానం నిర్వాహకులు వ్యాఖ్యానించడం శ్రీవారి సేవల పట్ల వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు కలుస్తున్నాయని ఆరోపణలు చేస్తూ భక్తులను మనోవేదనకు గురి చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలు వైఎస్సార్సీపీకి ముడిపెడుతూ వైఎస్ జగన్మోహనరెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికీ తన మోసపూరిత నైజాన్ని విడవలేకపోతున్నాడని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా శ్రీవారి నవనీత సేవకు 40 గిరి ఆవులతో కలిపి 550 గోవులను కొనుగోలు చేసి వెన్న నైవేద్యానికి ఏర్పాటు చేశామని కొట్టు సత్యనారాయణ చెప్పారు. అబద్ధమంటూనే గోవుల మరణాలు అంగీకరించారు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ -
కుల అంతరాలు లేని సమాజమే లక్ష్యం
నరసాపురం: కుల అంతరాలు లేని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సమాజాన్ని అంబేడ్కర్ కోరుకున్నారని, అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. అంబేడ్కర్ జయంతిని నరసాపురం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన వేడుకలో ముదునూరి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అభివృద్ధి చెందిన సమాజంలో కుల అసమానతలకు చోటు ఉండకూడదని అంబేడ్కర్ ఆశించారని ముదునూరి చెప్పారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని వరంగా ఇచ్చారని కొనియాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా టాక్సీస్డాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, వైస్ చైర్పర్సన్ కామన నాగిని, ఎంపీపీ మైలాబత్తుల సోనీ, జడ్పీటీసీలు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాబ్జీ, పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడీ రాజు, కో–ఆప్షన్ సభ్యుడు వైకేఎస్, పార్టీ నాయకులు చాగంటి సత్యనారాయణ, పప్పుల రామారావు, షేక్ బులిమస్తాన్, బర్రి శంకరం, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కామన బుజ్జి, ఉంగరాల రమేష్‌నాయుడు, ముసూడి రత్నం, రావి బ్రహ్మాజీ, కావలి నాని, యర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
వర్జీనియారైతుకునిరాశే !
బరువు 150 కేజీలు దాటకూడదు బేళ్ల బరువు 150 కేజీలు దాటకుండా చూసుకోవాలి. గ్రేడింగ్‌లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హీట్, సాఫ్ట్ లేకుండా గ్రేడ్ల ఆధారంగా పొగాకు సిద్ధం చేసుకోవాలి. అవశేషాలు లేకుండా ఎగుమతికి ఆమోదయోగ్యంగా ఉండే పొగాకును పండించుకోవాలి. – బి.శ్రీహరి, వేలం సూపరింటెండెంట్, జంగారెడ్డిగూడెం కేంద్రం–1 ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఏడాది పంటకు పెట్టుబడు లు, ఖర్చులు, కౌలు పెరిగాయి. సరాసరి రూ.300 వస్తేనే రైతుల కష్టాలు తీరతాయి. ప్రస్తుత ధరలు చూస్తే భయమేస్తుంది. ఇలానే కొనసాగితే రైతులు నష్టాల పాలవ్వడం ఖాయం. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెం: ఎన్నో ఆశలతో పొగాకు పంట వేసిన రైతుకు ఈ ఏడాది నిరాశ తప్పేలా లేదు. గత రెండేళ్లుగా పొగాకు పంటకు రికార్డు స్థాయిలో ధర రావడంతో ఈ ఏడాది రైతులు భూమి కౌలు, పెట్టుబడిని సైతం లెక్క చేయకుండా పంట వేశారు. గత నెల 24న ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు మొదటి రోజే ధర రైతులను నిరాశ పరిచింది. కిలో పొగాకుకు సరాసరి రూ.300 వస్తుందని రైతులు ఆశపడ్డారు. అయితే రూ.290 పలుకడంతో రైతులు ఢీలా పడిపోయారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై 20 రోజులు దాటినప్పటికీ ధరలో మార్పు లేకుండా మార్కెట్ ధర నిలకడగా ఉండడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రసుత్తం పొగాకుకు సరాసరి ధర రూ.278 రాగా కనిష్ట ధర రూ.265 పలికింది. గరిష్ట ధర రూ.290 పలుకుతోంది. ధరలు ఇలా కొనసాగితే తీవ్ర నష్టాల పాలవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా రాజమండ్రి పొగాకు బోర్డు రీజియన్ పరిధిలో ఈ ఏడాది సీజన్లో సుమారు 70 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అవుతుందని బోర్డు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలుదారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాతావరణంలో మార్పుల కారణంగా ఆకు గుల్లబారి తూకం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బోర్డు సుమారు 56.88 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. గతేడాది మార్కెట్లో పొగాకు కిలో గరిష్టంగా రూ. 410 పలికింది. దీంతో అధిక సంఖ్యలో రైతులు పొగాకు సాగు చేశారు. బోర్డు అనుమతి లేకుండా సుమారు 8 వేల హెక్టర్లలో పంట సాగు చేస్తున్నట్లు సమాచారం. అదనపు పంటతో చిక్కులు బోర్డు అధికారులు ఇచ్చిన అనుమతి కంటే అదనంగా సాగు చేయడం వల్ల చిక్కులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్లుగా పొగాకు ధరలు అధికంగా రావడంతో ఈ ఏడాది జీడిమామిడి, మామిడి, ఇతర పంటలను తొలగించి కొత్తగా రైతులు కూడా పొగాకు సాగు చేశారు. అధికంగా రూ.లక్ష వరకూ కౌలుకు తీసుకుని సారంలేని భూముల్లో పొగాకు పండించడం వల్ల లోగ్రేడ్ పొగాకుగా పండినట్లు సమాచారం.ఈ ఏడాది ఆశించిన దాని కంటే 20 శాతం అదనంగా పంట వేయడంతో ధరలు కూడా ఆశించిన స్థాయిలో రాకపోవచ్చని చెబుతున్నారు. ఆశాజనకంగా లేని పంట ధరలు కిలో సరాసరి ధర రూ.278 రూ.300 వస్తే గానీ గిట్టుబాటు కాదంటున్న రైతులు అమ్మకాలకు ఆసక్తి చూపని రైతులు బోర్డు అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి 5 కంపెనీలు మాత్రమే కొనుగోలు ప్రస్తుతం పొగాకు బేళ్ల కొనుగోల్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రారంభంలో కిలో గరిష్ట ధర రూ. 290, కనిష్ట ధర రూ.265, సగటు ధర రూ. 280.31 లభించింది. బేళ్ల కొనుగోళ్లలో 9 కంపెనీలు పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం 5 కంపెనీలే పాల్గొంటున్నాయి. వీటిలో 90 శాతం ఐటీసీ మాత్రమే కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం రైతులు కూడా బేళ్లను అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు. కొనుగోళ్లు ప్రారంభానికి, చివరకు ధరల్లో వ్యత్యాసం ఉంటుందని రైతులు చెబుతున్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించారు
ఉండి: కోటి ఆశలతో సమావేశానికి హాజరైన ఉ మ్మడి జిల్లా ఆక్వా రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మత్స్య శాఖ, ఆక్వా రైతుల ఆధ్వర్యంలో ఆదివారం ఉండి మండలం వాండ్రం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆక్వా రైతుల సదస్సులో చివరికి ఉసూరుమనిపించారు. సమావేశాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రా రంభించి మాట్లాడుతూ రైతుల విన్నపాలు ప్రభు త్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొని మాట్లాడారు. ఏం మాట్లాడినా షరతులు వర్తిస్తాయి అన్నట్టే ఉండటంతో రై తులు వాటిని ఆమోదించలేకపోయారు. మా ఉ సురు పోసుకుంటారు.. అంటూ రైతులు శాపనా ర్థాలు పెట్టడం గమనార్హం. మేత ధరలు తగ్గించాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యుత్ సబ్సిడీ మాత్రం అందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లు జోన్ల వారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యూనిట్ విద్యుత్ ధర రూ.2 ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రైతులు సమావేశంలో డిమాండ్ చేశారు. నాణ్యమైన సీడ్ అందించాలని, మద్దతు ధరలు తగ్గిపోవడంతో నష్టపోతున్నామని, ధరల స్థిరీకరణను ఏర్పాటు చేయాలని కోరారు. ఆక్వా రంగంలో గందరగోళానికి ఫీడ్ కంపెనీలు ప్రధాన కారణమని, రైతులను నిండా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికీ ప్రభుత్వం అంటే కుదరదు దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తన మాటలతో రైతులను గందరగోళానికి గురిచేశారు. ఆక్వా రైతులు అడిగిన విన్నపాలకు, రఘురామ చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో రైతులు తెల్లముఖాలు వేశారు. సొంత పార్టీకి చెందిన వారు కూడా ము ఖాలు మాడ్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకు ఏదో జరుగుతుందని ఆశించకండి.. ప్రభుత్వాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడదాం.. అన్నింటికీ ప్రభుత్వం.. ప్రభుత్వం అంటే కుదరదు.. ప్రభుత్వం అన్ని విషయాల్లో అయిపోయి ఉంది అంటూ రఘురామ చెప్పడం గమనార్హం. ప్రభు త్వ సహకారం అనే సంగతి మీ బుర్రల్లో నుంచి తీసేయాలంటూ ఆయన రైతులకు తేల్చిచెప్పారు. ప్ర భుత్వాన్ని రోడ్లు వేయాలని మాత్రం అడుగుదామని అన్నారు. అడిగినవన్నీ నెరవేరిస్తే రైతులు లేజీగా తయారవుతారు రైతులు అడిగే కొన్ని విన్నపాలు చూస్తుంటే వాటిని నెరవేరిస్తే రైతులు లేజీగా తయారవుతారని డిప్యూ టీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ముందు మీకు వచ్చిన కష్టాన్ని తట్టుకుని ముందుకు వెళ్లేలా ప్రయత్నించండి అని అన్నారు. అలాగే ఆక్వా రైతు లు నిబంధనలు పాటించకుండా చెరువుల తవ్వకా లు చేశారని, నిబంధనలు తప్పక పాటించాలంటూ చురకలు వేశారు. రెండు రోజుల్లో అమరావతిలో ఆ క్వా రైతుల కోసం సమావేశం ఉందని అన్నారు. డీ సీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, సుబ్బరాజు, గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు పాల్గొన్నారు. నీరుగారిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆక్వా రైతుల సమావేశం హామీలు లేవు, కష్టాన్ని అలవాటు చేసుకోవాలంటూ సూచన ఆక్వా రైతులు నిబంధనలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆదేశం -
బీమా.. లేదిక ధీమా!
కూటమి ప్రభుత్వంలో నిలిచిన పథకం ● పది నెలలుగా బాధిత కుటుంబాల ఎదురుచూపులు ● రెట్టింపు సాయం అంటూ ఎన్నికల సమయంలో హామీలు ● గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా సాయం అందజేత ● 2023–24లో 714 మందికి రూ.9.82 కోట్ల చెల్లింపు భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుటుంబ యాజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అందించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణం పొందితే రూ.లక్ష సాయం అందించి బాధితులను ఆదుకుంది. దీంతో బాధిత కుటుంబ బతుకు దెరువు ముందుకు సాగేది. ఎవరైన వ్యక్తి చనిపోయారని తెలిసిన వెంటనే సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబం ఇంటికి వెళ్ల్లి వెంటనే బీమా పథకం క్లయిమ్ కోసం ఆన్లైన్ చేసేవారు. ఆన్లైన్ చేసిన 21 రోజుల్లో నామినీకి (కుటుంబ సభ్యులు) బీమా సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. అయితే ఇంతటి ప్రాధాన్యమున్న బీమా పథకం అమలుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఎన్నికల సమయంలో రెట్టింపు భరోసా అంటూ హామీ ఇచ్చి ఇప్పటికీ పథకం అమలుకు విధివిధానాలు ప్రకటించలేదు. బీమాకు ఎసరు కూటమి మేనిఫెస్టోలో చంద్రన్న బీమా కింద సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ పథకం ఊసే ఎత్తడం లేదు. కేవలం పేరు మార్పుతో సరిపెట్టిన సర్కారు అమలు దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో బీమా పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పాలనలో సహజ మరణం, ప్రమాదవశాత్తూ మరణం పొందిన కుటుంబాల్లో బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. పేదల జీవితాలకు భరోసాగా ఉండే బీమా పథకం అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 800 మంది వరకు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా పథకానికి అర్హులైన సుమారు 800 మంది వరకు జిల్లాలో మరణించారు. వీరిలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారు 200 మంది వరకు ఉండగా, సహజ మరణం పొందిన వారు 600 మంది ఉన్నారు. ప్రమాదాల్లో శాశ్వత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యం పొందిన వారు 200 మంది వరకూ ఉన్నారు. ఆయా కుటుంబాలు బీమా సొమ్ముల కోసం ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వంలో నిబంధనల మేరకు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉండి ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు సహజ మరణం పొందితే రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం పొందితే రూ.2.50 లక్షలు బీమా సొమ్ములు అందించారు. గత ప్రభుత్వంలో (2023–24) బీమా చెల్లింపు పశ్చిమగోదావరి జిల్లా కేటగిరీ సంఖ్య సాయం (రూ.కోట్లలో) ప్రమాదవశాత్తూ మరణించిన వారు 30 1.50 సహజ మరణం పొందిన వారు 266 2.66 మొత్తం 296 4.16 ఏలూరు జిల్లా కేటగిరీ సంఖ్య సాయం (రూ.కోట్లలో) ప్రమాదవశాత్త్తూ మరణించిన వారు 37 1.85 సహజ మరణం పొందిన వారు 381 3.81 మొత్తం 418 5.66గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023–24 సంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 714 కుటుంబాలకు బీమా పరిహారం కింద రూ.9.82 కోట్లు చెల్లించారు. వీరిలో 67 మంది ప్రమాదవశాత్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3.35 కోట్లు, 647 మంది సహజ మరణం పొందిన వారి కుటుంబాలకు రూ.6.47 కోట్ల సాయం అందించారు. -
‘గురుకుల’ పరీక్షలు
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఐదో తరగతిలో ప్రవేశానికి 93 మందికి 83 మంది, ఇంటర్లో ప్రవేశానికి 206 మందికి 182 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రిన్సిపల్ బి.రాజారావు తెలిపారు. ఇంటర్మీడియల్ ప్రవేశ పరీక్షను గురుకులాల జిల్లా సమన్వయాధికారి బి.ఉమాకుమారి, ఐదో తరగతి పరీక్షలను ఎంఈఓ–2 పీఎంకే జ్యోతి పరిశీలించారు. పుప్పాల, చెరుకువాడల నియామకం శుభ పరిణామం తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారుల కమిటీలో జిల్లా నుంచి పుప్పాల వాసుబాబు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజులకు అవకాశం ఇవ్వడం, తూ ర్పుగోదావరి జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి, తోట త్రిమూర్తులను నియమించడం మంచి పరిణామమని శాసనమండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుద ల చేశారు. ఎంతో అనుభవం, నేర్పు, ఓర్పు, ఎ త్తుగడలు వేసే సామర్థ్యం ఉన్న వీరి నా యకత్వం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో ప్రతి వారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం రద్దు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేశామని పేర్కొన్నారు. ఉపాధి హామీ మేట్ తొలగింపు ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాల పంచాయతీలో ఉపాధి హామీ పనుల మస్తర్లలో జరుగుతున్న అ క్రమాలపై ‘సాక్షి’లో ఈనెల 11న ప్రచురితమైన ‘సత్తాలలో ఉపాధి సిత్రాలు’, అలాగే ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతున్న అవకతవకలపై 12న ‘తెలంగాణలో ఉన్నా ఉపాధి సొమ్ము జమ’ కథనాలకు అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సత్తాలలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మేట్ నరెడ్ల శ్యామలాదేవిని విధుల నుంచి తొలగించినట్టు ఏపీఓ బిరుదుగడ్డ నాగరాజు తెలి పారు. అలాగే ఐఎస్ జగన్నాథపురంలో జరిపిన విచారణలో ఒకరికి బదులుగా మరొకరు ఉపాధి పనికి వెళుతున్నట్టు చెప్పారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని సంగారెడ్డిలో స్థిరపడ్డ పసుపులేటి నరసింహమూర్తి, పావని దంపతులకు బదులుగా ఆయన తల్లిదండ్రులు ఇక్కడ ప నికి వెళుతున్నట్టు చెప్పారన్నారు. ఒకరికి బదు లు మరొకరు పనికి వెళ్లొచ్చా.. అని అడిగిన ప్ర శ్నకు వెళ్లకూడదని ఏపీఓ బదులిచ్చారు. మరి ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ఆర్థిక సాయానికి దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): షెడ్యూల్ కులాల అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్టు ఎస్సీ కా ర్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి ప్రకటనలో తలెఇపారు. అభ్యర్థులు సోమవారం నుంచి వచ్చేనెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లాకు ఎస్సీ కా ర్యాచరణ ప్రణాళిక కింద 1,111 యూనిట్లకు రూ.4644.05 లక్షల పథక విలువతో లక్ష్యాలను కేటాయించారన్నారు. సబ్సిడీగా రూ.1,835.30 లక్షలు, బ్యాంకు రుణాలుగా రూ.2,576.55 లక్షలు, లబ్ధిదారుల వాటాగా రూ.232.20 లక్షల నిర్దేశించారని పేర్కొన్నారు. అలరించిన గానామృతం ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం తూర్పుగో దావరి జిల్లా దొమ్మేరుకు చెందిన శ్రీ లక్ష్మీ నా రాయణ భజన సంఘం వారు నిర్వహించిన వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ గానామృతం అలరించింది. ముందుగా ఆలయ అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూ ర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజనలు చేస్తూ శ్రీవారి కల్యాణ గానామృతాన్ని నిర్వహించారు. -
అన్ని వర్గాలకూ ఆరాధ్యుడు అంబేడ్కర్
శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు పెనుగొండ : దేశంలో అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆరాధ్యుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం ఆచంటలో సర్పంచ్ కోట సరోజని ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ప్రతిఒక్కరూ జయంతి వేడుకలు నిర్వహించే ఏకై క మహానేత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు నినాదంతో అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించి భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా చరిత్రలో నిలవాలన్నారు. వైఎస్సార్ సీపీ యువనేత చెరుకువాడ నరసింహరాజు(నరేష్) మాట్లాడుతూ అంంబేడ్కర్ అందరివాడన్నారు. యువకులంతా అంబేడ్కర్ చూపిన మార్గం చదువులో ముందుండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సరిళ్ల పురుషోత్తం, మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, మాల సంఘాల రాష్ట్ర కన్వీనర్ గుమ్మాపు సూర్యవరప్రసాద్, బండి సుందర రామమూర్తి, జిల్లేళ్ల సత్య సుధామా, యాదాల రవిచంద్ర, ఆచంట మండల జేఏసీ కన్వీనర్ కోట వెంకటేశ్వరరావు, బీరా మధు తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
భీమడోలు: మండలంలోని పోలసానిపల్లిలో రాష్ట్ర రహదారి పక్కన ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం వేకువజామున ఘోర అవమానం జరిగింది. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. దీంతో దళిత యువకులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అంబటి దేవి వారితో కలిసి నినాదాలు చేశారు. దీంతో వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో భీమడోలు, దెందులూరు ఎస్సైలు వై.సుధాకర్, సుధీర్, సిబ్బంది వచ్చి చర్చించగా ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. నిందితులు ఎంతటి వారైనా సాంకేతికత సాయంతో పట్టుకుంటామని, సంయమనం పాటించాలని సీఐ కోరడంతో ఆందోళన విరమించారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీములు విచారణ చేపట్టగా పోలీస్ జాగిలం విగ్రహానికి పక్క రోడ్డులోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. దీంతో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపుల మధ్య విభేదాల వల్లే.. గ్రామంలో దళిత సామాజికవర్గానికి చెందిన వారు కొన్నేళ్లుగా రెండు వర్గాలుగా వీడిపోయారు. ఇటీవల ఓ వర్గానికి చెందిన వారు మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం నిర్మాణంలో ఉండగానే మరో వర్గానికి చెందిన వారు అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి నాడు ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. దీని వల్ల వారి మధ్య వివాదాలు ముదిరినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు. కఠినంగా శిక్షించాలి అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాలకు అవమాన కరమైన సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, విగ్రహాలను సంరక్షించే బాధ్యత పోలీస్, రెవెన్యూ శాఖలదేనన్నారు. సర్పంచ్ షేక్ రహీమాబేగం, వైఎస్సార్సీపీ దళిత విభాగం నేతలు అంబటి నాగేంద్ర ప్రసాద్, ముళ్లగిరి జాన్సన్, పాము మాన్సింగ్, దళిత సంఘం నాయకులు పైడిమాల యుగంధర్, గోవింద్, మండల జనసేన అధ్యక్షుడు ప్రత్తి మదన్ సంఘటనను తీవ్రంగా ఖండించారు. -
దామరచర్లలో పోలీస్ పికెట్
కుక్కునూరు: మద్యం మత్తులో నలుగురి మధ్య జరిగిన గొడవ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు ఆదివారం దామరచర్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మద్యం మత్తులో దామచర్ల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. స్థానికులు వారిని వారించి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆదివారం స్థానికంగా ఉన్న పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించి రాజీ చేయించారు. ఆదివారం మధ్యాహ్నాం మరోసారి ఇరు వర్గాల వ్యక్తులు మద్యం సేవించేందుకు ఒకే ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో మళ్లీ ఘర్షణ పడ్డట్టు తెలుస్తుంది. ఓ వర్గానికి చెందిన వారు బీరుసీసాలతో మరోవర్గానికి చెందిన వారిపై దాడి చేయడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. ఆ వ్యక్తి తరుపు బంధువులు రోడ్డుపై ఆందోళన చేసేందుకు సిద్ధపడగా పోలీసులు వారిని చెదరగొట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఐ, ఎస్ఐ మరో ఇరవై మంది సిబ్బందితో కలిసి దామరచర్లలో పికెట్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరావు దామరచర్ల గ్రామాన్ని పరిశీలించారు. -
పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం
గణపవరం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకంతో కీలకమైన పీఏసీ కమి టీ సభ్యుడిగా నియమించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం క్యాంపు కార్యాలయానికి వచ్చి వాసుబాబుకు అభినందనలు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం వాసుబాబు మాట్లాడుతూ పార్టీకి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదని, జగన్ పర్యటనలకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణే ఇందుకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో అలవికాని హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏడాది తిరక్కుండానే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. సూపర్ సిక్స్‌ను అటకెక్కించి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై చంద్రబాబు దృష్టి సారించారని, పీ4 అంటూ మాయ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ జగన్ పాలనే రావాలని కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా నిలవడం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్దామని వాసు బాబు అన్నారు. మండల పార్టీ కన్వీనర్లు దండు రాము, సంకుసత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్తిబాబు, ఎంపీపీలు దండు రాము, ధ నుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రా మయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశి, కె.జయలక్ష్మి, తుమ్మగుంట భవానీ, పార్టీ జిల్లా నాయకులు వెజ్జు వెంకటేశ్వరరావు, పుప్పాల గోపి, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పిలుపు -
61రోజులు..వేటకు విరామం
నరసాపురం: వేట బోట్లకు లంగరు పడనుంది. సముద్రంలో 61 రోజులపాటు వేట నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. ఈ మేరకు మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు వేట నిషేధం అమలుకానుంది. ఉభయగోదావరి జిల్లాల్లో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాకు చెందిన బోట్లు నరసాపురం తీరానికి తీసుకువచ్చి లంగరు వేస్తున్నారు. సోమ వారం రాత్రి 12 గంటల నుంచి జూన్ 14న అర్ధరాత్రి వరకు వేట సాగించే వీలులేదు. ఈ మేరకు అధికారులు తీరంపై ప్రత్యేక నిఘా పెట్టారు. భరోసా అందేనా? 2019 నుంచి 2023 వరకూ వైఎస్సార్సీపీ ప్రభు త్వం ఐదేళ్ల పాటు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు మత్స్యకార భరోసా పథకం కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి సగటున 1,635 మందికి 5 దఫాలుగా సొమ్ములు అందించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఉపాధి లేక ఖాళీగా ఉంటారు. వీరి కుటుంబాలకు అండగా నిలిచేలా రూ.10 వేల చొప్పున మత్స్యకార భరోసా సా యాన్ని గత ప్రభుత్వం అందించింది. గత ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసా మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అయితే 2024లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం గతేడాది సాయం అందించలేదు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు వేట నిషేధ సాయం అందక, మరోవైపు వరుస ప్రకృతి విపత్తులతో ఏడాదంతా సవ్యంగా వేట సాగక గంగపుత్రులు పాట్లు పడ్డారు. ఈ ఏడాదైనా కూటమి ప్రభుత్వం కనికరించి వేట నిషేధ భృతిని అందిస్తుందని మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బకాయిలతో కలిపి రెండేళ్ల మత్స్యకార భరోసా సొమ్ములు అందించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. నేటి అర్ధరాత్రి నుంచి అమలు సముద్ర తీరానికి చేరుకుంటున్న బోట్లు గతేడాది మత్స్యకార భరోసాకు కూటమి ఎసరు ఈ ఏడాది అయినా అమలు చేసేనా? -
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
బుట్టాయగూడెం: వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ఆ సంఘం ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకు సరాసరి కిలోకు రూ.330 వరకూ వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు, కౌలు రేట్లు బాగా పెరిగాయని అన్నారు. అయితే గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది మార్కెట్ ధర ఉండే పరిస్థితి కనిపించడంలేదన్నారు. ఇప్పటికే వైట్ బార్లీ పొగాకు కొనుగోలు చేయడం లేదని చెప్పారు. వర్జీనియా పొగాకు రైతులకు తగిన ధర కల్పించేలా బోర్డు అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, బొడ్డు రాంబాబు, బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
చిల్లరతో పనేముంది!
కరోనా భయంతో.. కరోనా వైరస్ సమయంలో ఇతరులను తాకాలన్నా, వారి వస్తువులు ముట్టుకోవాలన్నా భయపడేవారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్లు తీసుకుంటే కోవిడ్ సోకుతుందేమోనని ఆందోళన చెందేవారు. బ్యాంకులకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో, నగదు రహిత లావాదేవీలు జోరందుకున్నాయి. 2020–2021 లో మొదలైన ఈ డిజిటల్ లావాదేవీలు గత మూడేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్‌ల వినియోగం పెరగడంతో ఆన్లైన్ లావాదేవీలు విస్తృతం అవుతున్నాయి. నగదు రహిత లావాదేవీల్లో 60 నుంచి 70 శాతం మైలు రాయిని అధిగమించాలని కొద్దినెలల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆర్బీఐ ఉన్నతాధికారులు సూచించారు. దీనికి అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ, పైవేటు రంగ బ్యాంకులు నగదు రహిత లావాదేవీల్లో పోటీ పడుతున్నాయి. ద్వారకాతిరుమల: ఒకప్పుడు పెద్ద కరెన్సీ నోటు పట్టుకుని ఏ షాపుకు వెళ్లినా చిల్లర కష్టాలు తప్పేవికావు. ఏ వ్యాపారి నోట విన్నా చిల్లర పట్టుకు రండి.. మా దగ్గర చిల్లర లేదు అన్న మాటే వినిపించేది. ఆ సమయంలో వినియోగదారులు వ్యాపారులను చిల్లర కోసం బతిమిలాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. డిజిటల్ నగదు చెల్లింపులు వచ్చిన తరువాత చిల్లరకు కష్టాలు తప్పాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు పెరగడమే ఇందుకు కారణం. బ్యాంకుల్లో పేరుకుంటున్న చిల్లర ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల ద్వారా నెలకు రూ.10 లక్షల చిల్లర వస్తోంది. అందంతా స్థానిక యూనియన్ బ్యాంకుకు చేరుతోంది. ఇక్కడి నుంచి ఆ చిల్లర తాడేపల్లిగూడెంలోని సంబంధిత కార్యాలయానికి వెళ్తుంది. ప్రస్తుతం స్థానిక యూనియన్ బ్యాంకులో సుమారు రూ. 35 లక్షల వరకు చిల్లర ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు జిల్లాలోని వ్యాపారులు శ్రీవారి హుండీలు ఎప్పుడు తెరుస్తారో, చిల్లర ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూసేవారు. వాటి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. చిన్న దుకాణాల్లోనూ స్కానర్లు.. నోటు చిరిగిందనే బాధ లేదు. వ్యాపారి నుంచి చిల్లర వస్తుందో.. లేదో అనే బెంగ లేదు. డబ్బు లెక్కపెట్టాల్సిన పని అంతకంటే లేదు. హైపర్ మార్కెట్ అయినా, డిపార్ట్మెంటల్ స్టోర్ అయినా, హోటల్ అయినా, కూరగాయల దుకాణాలైనా, ఫ్రూట్ జ్యూస్ షాపు అయినా, రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై అమ్మే కొబ్బరి బొండాలైనా, మొక్కజొన్న పొత్తులైనా, పెట్రోల్ బంకుల్లో అయినా, టీ కొట్టులో అయినా ఇలా ఏ దుకాణంలో అయినా అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. వాటి ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. రూపాయి పెట్టి కొనే అగ్గిపెట్టె నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారం వరకు నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. ఆర్బీఐ ప్రోత్సాహంతో.. అన్ని బ్యాంకుల్లోనూ నూరు శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేలా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా దాదాపు అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులు సైతం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు రూ.100 కావాలంటే పనులన్నీ పక్కనబెట్టి, బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. గడప దాటకుండానే నగదు రహిత లావాదేవీలు చేసుకునే అవకాశం రావడంతో ప్రజల అవసరాలు క్షణాల్లో తీరిపోతున్నాయి. సమయం ఆదాతో పాటు, జేబులో సొమ్ము పోతుందనే భయం లేకపోవడంతో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. విస్తృతమైన డిజిటల్ నగదు చెల్లింపులు చిన్న చిన్న దుకాణాల్లోనూ యూపీఐ లావాదేవీలు శ్రీవారి హుండీ ద్వారా నెలకు రూ.10 లక్షల చిల్లర బ్యాంకుల్లో పేరుకుంటున్న చిల్లర చిల్లర కష్టాలు తప్పాయి యుపీఐ పేమెంట్లు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తుల్లో 90 శాతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వినియోగిస్తున్నారు. దాంతో చిల్లర కష్టాలు తప్పాయి. గతంలో బ్యాంకు నుంచి తెచ్చి వినియోగదారులకు చిల్లర ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. – దేశెట్టి రాంబాబు, కూల్‌డ్రింక్ షాపు వ్యాపారి, ద్వారకాతిరుమల నగదు రహిత లావాదేవీలే బెస్ట్ కూరగాయలు కొంటున్న వారిలో ఎక్కువ మంది యూపీఐనే వాడుతున్నారు. చిల్లరతో పని లేకపోవడంతో అదే బెస్ట్ అనిపిస్తోంది. షాపునకు వచ్చే పది మందిలో, ఎనిమిది మంది నగదు రహిత లావాదేవీలనే జరుపుతున్నారు. మహిళలు సైతం యూపీఐని వినియోగిస్తున్నారు. కళ్లేపల్లి అభిరామ్, కూరగాయల వ్యాపారి, ద్వారకాతిరుమల -
జూనియర్ లెక్చరర్ల సంఘ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఏలూరు జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా జి.భక్త హనుమాన్, కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు సంఘ ఉపాధ్యక్షుడిగా ఎస్కే ఖాసింపీర, సంయుక్త కార్యదర్శిగా కేకేఎన్ జనార్థన రావు, కోశాధికారిగా కే. సమత తదితరులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జి.సందీప్, పరిశీలకునిగా అయినపర్తి మురళీకృష్ణ వ్యవహరించారు. -
టోల్‌ప్లాజా వద్ద జనసేన నేత దౌర్జన్యం
సాక్షి టాస్క్ఫోర్సు: ఉంగుటూరు మండలం జనసేన నేత స్థానిక టోల్‌ప్లాజా వద్ద తన అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించిన కారేటి జ్యోతి భర్త అయ్యప్ప తనకు చెందిన లిక్కర్ మినీ లారీని టోలు లేకుండా పంపమని ప్లాజా నిర్వాహకులను కోరారు. యెల్లో బోర్డు ఉంటే కుదరదు అని చెప్పగా తన అనుచరులు సుమారు 15 మందితో వచ్చి దౌర్జన్యంగా గేటు తీసేసి వాహనాన్ని పంపించారు. టోలు సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిట్టి దౌర్జన్యం చేసినట్లు సమాచారం. దీంతో టోలు ప్లాజా సిబ్బంది చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం అత్తిలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అత్తిలి కాలువలో ఆదివారం కొట్టుకొచ్చింది. బల్లిపాడు శివారు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేకపోవడంతో కాలువలోకి స్నానానికి దిగి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని అత్తిలి పోలీసులు బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.ప్రేమరాజు చెప్పారు. బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ భీమవరం (ప్రకాశంచౌక్): హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీపద్మావతి వేంకటేశ్వరస్వామి మందిర 14వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు, కల్యాణం, రథోత్సవం, వైభవోత్సవం, ఊరేగింపు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మందిర అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు తెలిపారు. కార్యక్రమంలో మందిర సభ్యులు పాల్గొన్నారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ ఆదివారం కూడా మంగమ్మతల్లి గుడి భక్తులతో కిటకిటలాడింది. మహిళ అదృశ్యంపై కేసు నమోదు కాళ్ల: భార్య కనిపించడం లేదంటూ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కాళ్ళకూరు గ్రామానికి చెందిన పి.దివ్య(27) తన కుమారుడు మనోహర్షిత్తో కలిసి ఈ నెల 10న ఉదయం భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాలకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి రాకపోవడంతో భర్త భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. -
శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం సైతం కొనసాగింది. శనివారం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షేత్రానికి విచ్చేశారు. వీరికి తోడు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామికి మొక్కుబడులు సమర్పించారు. దాంతో కళ్యాణ కట్ట ప్రాంతం భక్తులతో పోటెత్తింది. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొల్టేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, చిన్న, పెద్ద తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గధుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, విరాళాలు ద్వారా మొత్తం రూ.83,057 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. కృష్ణభారతి సేవలు అజరామరం తాడేపల్లిగూడెం: స్వాతంత్య్ర సమరయోధురాలు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుమార్తె పసల కృష్ణభారతి సేవలు అజరామరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇటీవల దివంగతులైన కృష్ణభారతి సంస్మరణ సభ ఆదివారం కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. కృష్ణభారతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు పసల కనకసుందరరావు తదితరులు హాజరయ్యారు. -
పెళ్లి మండపాలకు పెరిగిన డిమాండ్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కల్యాణ మండపం చూసినా రంగు రంగుల విద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 20 వరకు వివాహ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. రాత్రి ఏడు గంటలు దాటిన ముహూర్తం దగ్గర నుంచి తెల్లవారుజాము ముహూర్తాలు ఉండడంతో ఒక్కసారిగా కల్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. గూడెం ప్రాంతంలో చిన్నా పెద్దా కలిపి 20 వరకు కల్యాణ మండపాలు ఉన్నాయి. కనీస ఽఅద్దె రూ.30 వేలు ఉంటుంది. వీటికి తోడు విద్యుత్, క్లీనింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చులు అదనంగా చెల్లించాలి. గూడెంలో చినతాడేపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపానికి ఖర్చులతో కలిపి రూ.5 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మధ్యతరహ హంగులున్న కల్యాణ మండపాలకు అద్దెలు ఇస్తున్నారు. మరో వైపు బ్యాండ్ ధరలు మోత మోగుతున్నాయి. పెళ్లి కొడుకు చేయడానికి నలుగురు వాద్యకారులు కావాలంటే రూ.6 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. తంతు జరిపించడం కోసం పురోహితులు దక్షిణలు బాగా చెల్లిస్తేనే పెళ్లిళ్లు చేయడానికి అంగీకరిస్తున్నారు. పూల డెకరేషన్ల ధరలు మండిపోతున్నాయి. పూల మండపానికి కనీసం రూ.17 వేలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపానికి రూ. 60 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయాల వద్ద పెళ్ళిళ్లు చేసేవారు ఈ సీజన్లో పెరిగారు. పట్టణంలో సత్యనారాయణస్వామి ఆలయంలో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీకి కనీసం రూ.60 వేల నుంచి అడుగుతున్నారు. ఈ నెలలో ఒక వారంలోనే అధిక ముహూర్తాలుండటంతో కల్యాణమండపాలు ఖాళీగా లేవు. -
అకాల వర్షంతో ఇక్కట్లు
తాడేపల్లిగూడెం: ఆదివారం సాయంత్రం గూడెం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఒకవైపు పూర్తి స్థాయిలో పంట ఎదిగి, కోతలు జరుగుతున్న వేళ కురిసిన ఈ వాన రైతులకు ఆందోళన కలిగించింది. బోర్ల కింద వ్యవసాయం చేసే గూడెం మండలంలో చినతాడేపల్లి నుంచి బంగారు గూడెం వరకు దాదాపుగా మాసూళ్లు పూర్తయ్యి, ధాన్యం అమ్మకాలు అయ్యిపోయాయి. మాధవరం ప్రాంతంలో కూడా మాసూళ్లు పూర్తిచేసుకుని రైతులు ఒబ్బిడి అయ్యారు. ఈ మండలంలో సుమారు 25 వేల ఆయకట్టులో వరి వేశారు. కాలువ కింద గ్రామాలైన కృష్ణాయపాలెం నుంచి నవాబుపాలెం, నందమూరు వరకు ఇంకా కోతలు ప్రారంభం కాలేదు. సుమారు 18 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కావాల్సి ఉంది. నిటారుగా నిలబడే 1121 రకం కావడంతో ఆదివారం కురిసిన వానతో పంటకు పెద్దగా నష్టం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పనల మీద ఉన్న ధాన్యానికి కూడా అకాల వాన వల్ల ఇబ్బంది లేదు. పెంటపాడు మండలంలో సుమారు 21 వేల ఎకరాల ఆయకట్టులో వరి వేశారు. దీనిలో రెండు వేల ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి. 19 వేల ఎకరాల్లో ఇంకా కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఆదివారం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాన పడటంతో రైతులు కంగారు పడ్డారు. కొద్దిసేపు వర్షం పడి ఆగడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వాన వల్ల పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకుడు మురళీకృష్ణ తెలిపారు. గూడెం పట్టణంలో వానతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేదదీరారు. ఏజెన్సీలో గాలివాన బీభత్సం బుట్టాయగూడెం: ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వర్షంతో పాటు గాలి బీభత్సం సృష్టించింది. పలు చోట్ల కొమ్మలు విరిగిపోయాయి. గాలులకు కరెంటుకు అంతరాయం కలిగింది. రాత్రి 8 గంటల వరకూ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌శాఖ అధికారులు కరెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కుక్కునూరులో ఈదురు గాలులతో వర్షం కుక్కునూరు: కుక్కునూరు మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలంగా వీచిన గాలుల దాటికి మండలంలోని చిరవెల్లి గ్రామంలో తాటిచెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా గాలుల దాటికి మండల వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
‘సాక్షి’పై అరకమ కేసులు ఎత్తివేయాలి
భీమవరం: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై రెండో రోజూ శనివారం జిల్లాలో పాత్రికేయులు గళమెత్తారు. భీమవరంలో ఏపీయూడబ్ల్యూజే, భీమవరం ఏరియా ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ ఆర్జీ జయసూర్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా, రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రంశెట్టి గిరిజాపతి మాట్లాడుతూ అక్రమ కేసు లను తక్షణం ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్ కార్యదర్శి కమ్మిల హనుమంతరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్ఆర్కే గోపాలకృష్ణ, పాత్రికేయులు పి.విజయ్‌కుమార్, ఎ.శ్రీనివాస్, రవి, ఎన్.నాగరాజు, ఎన్.సత్యనారాయణ, రాజాబాబు, వీపీవీ అప్ప య్య, చిన్నారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో గళమెత్తి.. తాడేపల్లిగూడెం: ఏపీయూడబ్ల్యూజే, తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద పాత్రికేయులు నిరసన తెలిపారు. ఐజేయూ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్) కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ ‘సాక్షి’ సంపాదకులపై కేసు నమోదు కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి రాజకీయ ద్వేషాలను జర్నలిస్టుల మీద చూ పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏపీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి గజపతి ప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టి.రంగసురేష్, యూనియన్ రాష్ట్ర నాయకుడు యడ్లపల్లి మురళీకృష్ణ, ప్రెస్ క్లబ్ సభ్యులు పాలడుగు సతీష్, పెద్దోజు మురళీ, పుండరీ, కె.వెంకట్రావు, కళింగ లక్ష్మణరావు, కె.ఆశీర్వాదరావు, కేవీ కృష్ణారావు, శీలి రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గళమెత్తిన పాత్రికేయులు -
పీఏసీ సభ్యులుగా చెరుకువాడ, వాసుబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఇద్దరు కీలక నేతలకు చోటు దక్కింది. పీఏసీ పూర్తిస్థాయిలో పునః వ్యవస్థీకరించి నూతన నియామకాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నూతన సభ్యులను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పశ్చిమగోదా వరి జిల్లా నుంచి మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఏలూ రు జిల్లా నుంచి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాస్‌ను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ముఖ్య నేతలతో కమిటీని ప్రకటించారు. వైఎస్సార్సీపీలో నియామకాలు భీమవరం: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాలోని పలువురు నాయకులకు స్థానం కల్పించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్టూడెంట్స్ వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పి.సంజయ్‌బాబు, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తన్నీడి వెంకట గంగాధరరావు, రాష్ట్ర కా ర్యదర్శిగా వీఎస్ సీతారామకృష్ణ, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జీజీ బెన్హర్ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం భీమవరం: రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం ఆ మోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం పట్టణంలోని ప్రకాశం చౌక్‌లో నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. భీమారావు మాట్లాడతూ వక్ఫ్ చట్టం దేశ ఐక్యతకు, మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతమని, ప్రతిపక్షాలు సూచించిన స వరణలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టా న్ని ఆమోదించడం దురదృష్టకరమన్నారు. ము స్లిం మైనార్టీ నాయకులు చాన్ బాషా, షేక్ ఆషా, అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కోనా జోసెఫ్, కార్యదర్శి వి.రాజు, సీపీఐ నాయకులు చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఏరులై పారుతున్న మద్యం పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో మద్యం సిండికేట్లకు లాభాల కోసం ఊరూవాడా బెల్టుషాపులు పెట్టుకోమని కూటమి ప్రభుత్వం అను మతి ఇచ్చినట్టుందని, దీంతో ఎకై ్సజ్ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదని కల్లు గీత కార్మి కుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి విమర్శించారు. శనివారం స్థానిక ఎకై ్స జ్ కార్యాలయం వద్ద కల్లు గీత కార్మిక సంఘం నాయకులు మోకులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నర్సింహమూర్తి మాట్లాడుతూ బెల్టు షాపులతో కల్లు గీత కార్మికులు వ్యాపారాలు లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. బెల్టు షాపులను అరికట్టాలని, గీత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 5 వేలు, రాష్ట్రంలో 70 వేల వరకు బెల్టుషాపులు ఉన్నాయన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెర వేర్చాలన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు బొక్కా చంటి, బొంతు శ్రీను, జక్కంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
భీమవరం అర్బన్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయా లని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. మండలంలోని గొల్లవానితిప్పలో శనివారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో, వెంపలో పి.గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ అంబేద్కర్ అన్నివర్గాలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అంబేడ్కర్ మన దేశంలో పుట్టడం దేశ ప్రజల అదృష్టమన్నారు. పీఏసీ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగే అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, నాయకులు మెంటే పార్థసారథి, వబిలిశెట్టి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ పెనుమాల నరసింహస్వామి, మాజీ సర్పంచ్ బోకూరి విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు -
రొయ్యకు సిండికాటు
పోటెత్తిన శ్రీవారి క్షేత్రం ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం శనివారం భక్తులు, పెళ్లి జనాలతో పోటెత్తింది. క్షేత్రంలోని అన్ని విభాగాలూ భక్తులతో కిటకిటలాడాయి. 8లో uఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025భీమవరం: రొయ్య రైతుల కష్టాన్ని ఆక్వా సిండికేట్ అడ్డగోలుగా దోచేస్తోంది. అమెరికా సుంకాలు పెంచేసిందంటూ పది రోజుల క్రితం ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మీడియేటర్స్ క్షణాల్లో రొయ్య ధరలను అమాంతం తగ్గించేశారు. మూడు నెలల పాటు పన్నుల పెంపు లేదని అమెరికా స్పష్టం చేసినా తగ్గించిన ధరలు పెంచకుండా రైతుల కష్టాన్ని కొల్లగొడుతున్నారు. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా దీనిలో వనామీ విస్తీర్ణం 70 వేల వరకు ఉంటుంది. దాదాపు 30 వేల మందికి పైగా రైతులు రొయ్యల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో పెద్ద మొత్తంలో రొయ్యలు మార్కెట్లోకి వస్తుంటాయి. ఏటా సీజన్లో సుమారు 500 టన్నుల వరకు రొయ్యలు అమెరికా, చైనా, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒడిదుడుకుల కోర్చి రైతులు పండించిన పంటను ఎగుమతిదారులు, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలు, మధ్యవర్తులు ఏకమై కొల్లగొడుతున్నారు. టారిఫ్‌లు సాకుగా.. నెల రోజుల క్రితం 100 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.260 వరకు ఉండగా మార్కెట్లోకి రొయ్యలు ఎక్కువగా వస్తుండటంతో రూ.230కి తగ్గించేశారు. జిల్లావ్యాప్తంగా రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలపడంతో రూ.240కి పెంచిన విషయం తెలిసిందే. దేశీయ ఉత్పత్తులపై సుంకాలను 26 శాతం పెంచుతున్నట్టు ఈనెల 3న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని సాకుగా చూపించి మరలా ధరలు తగ్గించేశారు. కిలోకు 50 కౌంట్లోపు రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి అవు తుండగా.. 60 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు చైనా, యూరప్ దేశాలకు వెళుతుంటాయి. అమెరికా పన్నుల ప్రభావమంటూ అన్ని కౌంట్లలోనూ రూ.50 నుంచి రూ.90 తగ్గించేసి కొనుగోళ్లు చేయడంతో రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది. కిలో రూ.100 వరకు ధరలు తగ్గించి.. గత 10 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రొయ్యలపై దిగుమతి సుంకం 26 శాతం పెంచుతున్నట్టు ప్రకటించిన వెంటనే ఇక్కడ ఎగుమతిదారులు రూ.50 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గించేశారు. వివిధ దేశాధినేతల ఒత్తిడి మేరకు మళ్లీ ట్రంప్ ఇప్పట్లో సుంకాలు పెంచబోమని ప్రకటించినా ఇక్కడి ఎగుమతిదారులు ధరలు పెంచకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టలేక.. పట్టుబడులు పట్టలేక.. వారం రోజులుగా రొయ్య ధరలు తగ్గిపోవడంతో మళ్లీ పెరుగుతాయని భావించి రైతులు తమ చెరువుల్లోని రొయ్యలు పట్టుబడులు చేయకుండా నిరీక్షిస్తున్నారు. దీంతో రోజుకు పెద్ద మొత్తంలో ఫీడ్, ఇతర మందులకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతి ఆత్మహత్య ప్రేమించి మోసం చేయడంతో ఏలూరులో నర్సుగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుందని, న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ధర్నా చేశారు. 8లో uదళారుల రాజ్యం రొయ్యల సాగులో ఎకరాకు రూ.4 లక్షలకు పైగా పెట్టుబడులు అవుతున్నాయి. రైతుల వద్ద నుంచి పట్టుబడి రొయ్యలు ఎగుమతిదారులు వద్దకు చేరుకోవడానికి ముగ్గురు మధ్యవర్తులను దాటి వెళ్లాల్సి వస్తుంది. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారుల వద్ద ఏౖమైతే రొయ్య కొరతలు ఉన్నాయో వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులకు సమాచారం పంపుతారు. ఉదాహరణకు ఎగుమతులుదారుల వద్ద 100 కౌంట్ కిలో రూ.235 ధర ఉంటే వ్యాపారుల నుంచి ప్రాసెసింగ్ యూనిట్లు రూ.220 కొనుగోలు చేస్తాయి. వీళ్లు 5 టన్నులకు పైగా ఉంటేనే కొంటారు. అయితే వ్యాపా రులు మాత్రం రైతుల వద్ద నుంచి రూ.190కి మాత్రమే కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు టన్నుకు రూ.45 వేల వరకు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కల్పించుకుని ధాన్యం మాదిరిగా రొయ్యలను కొనుగోలు చేయాలి. రొయ్యల కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలి. న్యూస్రీల్పోరాటాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం ఈనెల 9న ఉండిలో అప్సడా వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిర్వహించే సమావేశాన్ని కూటమి నేతలు అడ్డుకున్నారు. రొయ్య రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వ పరువు, ప్రతిష్టలు అభాసుపా లవుతాయని తలచి అసోసియేషన్ నాయకులను, రైతులను కూటమి నాయకులు బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. మళ్లీ ఆదివారం ఉండిలో కోట్ల ఫంక్షన్ హాలులో రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. అయితే ఈ సమావేశంలో రైతులు రొయ్యల ధరల గురించి మాట్లాడకుండా ఫీడ్ ధరలు, విద్యుత్ సబ్సిడీ వంటి అంశాలు మాత్రమే ప్రస్తావించేలా పథకం రచించినట్టు తెలిసింది. కూటమి నాయకుల కనుసన్నల్లో నిర్వహించే ఆక్వా రైతుల సమావేశం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇదేందిరొయ్యో రైతులను దోచేస్తున్న వ్యాపారులు అమెరికా సుంకాల పేరిట భారీగా ధరల తగ్గింపు కిలోకు కౌంట్‌ను బట్టి రూ.50 నుంచి రూ.90 వరకు కోత ఇప్పట్లో సుంకాలు లేవంటున్న అగ్రరాజ్యం అయినా ధరలు పెంచని వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న రైతులు ధరలు నిలకడగా ఉండేలా చూడాలి రొయ్యల ధరల పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. అమెరికా పన్నుల పేరుతో ఆ దేశానికి ఎగుమతి కాని కౌంట్ రొయ్యలకు కూడా దళారులు ధర తగ్గించి రైతులను నష్టాల ఊబిలోకి తోస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కంటితుడుపు చర్యలు కాకుండా రొయ్యల ధరలు నిలకడగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి. – పెనుమాల నర్సింహస్వామి, ఆక్వా రైతు, గొల్లవానితిప్ప మొక్కుబడి సమావేశాలు వృథా కూటమి నాయకులు రైతులతో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వారం రోజులుగా రొయ్యల ధరలు భారీగా పతనమై రైతులు నష్టపోతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం. రైతులు, రొయ్యల కొనుగోలుదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటుచేయాలి. – నాగరాజు వెంకట గోపాలకృష్ణంరాజు, ఆక్వా రైతు, కొణితివాడ -
యూపీఐ సేవలు నిలిచిపోవడంతో గగ్గోలు
ఏలూరు (టూటౌన్): యూపీఐ సేవలు నిలిచిపోవడంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే డౌన్ అవడంతో సేవలు అందుబాటులో లేవు. దీంతో డిజిటల్ లావాదేవీలు నిలిచిపోవడంతో చాలాచోట్ల యూజర్లు పేమెంట్లు చేయలేకపోయారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని ఒక బిర్యానీ హోటల్‌కు వచ్చిన ఇద్దరు యువకులు బిర్యానీ తిన్నాక ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిద్దామంటే స్కానర్ పనిచేయలేదు. క్యాష్ ఇద్దామంటే జేబులో సరిపడా సొమ్ములు లేవు. దీంతో ఫోన్‌తో చాలా సేపు కుస్తీ పట్టిన సదరు యువకులు బిక్క మొహం వేశారు. చివరకు అందులోని ఒక యువకుడి సోదరుడికి ఫోన్ చేసి రమ్మని డబ్బులు కట్టారు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని ఒక వస్త్ర దుకాణంలోకి వచ్చిన మహిళ తనకు నచ్చిన దుస్తులు కొనుగోలు చేసింది. క్యాష్ కౌంటర్‌కు వచ్చి డిజిటల్ పేమెంట్ చేసేందుకు ప్రయత్నించగా యూపీఐ సర్వర్ స్లోగా ఉండటంతో మనీ ట్రాన్స్ఫర్ అయినట్లు చూపినా అవి దుకాణదారుడి ఖాతాలోకి రాలేదు. దీంతో ఆమె ఇంటి నుంచి కుటుంబ సభ్యులను రప్పించి నేరుగా క్యాష్ చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి సన్నివేశాలు శనివారం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా డిజిటల్ లావాదేవీలు డౌన్ అయితే పరిస్థితి ఏంటనే దానిపై శనివారం జిల్లా వాసులకు స్పష్టత వచ్చింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. జిల్లాలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని ఫిర్యాదులు చేశారు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే డిజిటల్ పేమెంట్ యాప్‌లు పనిచేయడం లేదని వినియోగదారులు గగ్గోలు పెట్టడం కన్పించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో 66 శాతం యూజర్లకు పేమెంట్ చేసే సమయంలో సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. మరో 34 శాతం మంది ఫండ్ టాన్స్‌ఫర్ కావడం లేదని రిపోర్ట్ చేశారు. జిల్లాలో 10 లక్షలకు పైగా వినియోగదారులు ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 లక్షల వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరిలో 10 లక్షల మంది వరకు డిజిటల్ లావాదేవీలైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి వాటిని వినియోగిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో కనీసం రూ.10 కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. దీంతో జేబులో, పర్సులో డబ్బులు లేకుండానే యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వరుసగా బ్యాంకులకు మూడు రోజులు సెలవులు రావడం, శనివారం మధ్యాహ్నం నుంచి డిజిటల్ సేవలు మొరాయించడంతో ప్రజలకు తమ వెంట నగదు తెచ్చుకోకపోతే పరిస్థితి ఏంటనేది అర్థమైంది. -
ప్రేమ పేరుతో మోసగించడం వల్లే ఆత్మహత్య
జీజీహెచ్ ముందు యువతి తల్లిదండ్రుల ధర్నా ఏలూరు టౌన్/ముసునూరు : ఏలూరులోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోన్న యువతిని ప్రేమించి మోసం చేయటంతో ఆత్మహత్య చేసుకుందని.. ఆమె మృతికి కారణమైన వ్యక్తిని శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ ఏలూరు సర్వజన ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు పురుగు మందు డబ్బాతో ధర్నాకు దిగారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి తమ కుమార్తె మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పంతంగి నాగరాజు, రమాదేవికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పంతంగి ఉమాశిరీష (23) బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రస్తుతం ఏలూరు నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. నాగరాజు గ్రామంలో పంచాయతీ వాటర్‌వర్క్స్‌లో పనిచేస్తున్నారు. ఉమా శిరీష విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్లో పనిచేస్తుండగా.. ముసునూరు మండలం విస్సన్నపేట ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్ అదే హాస్పిటల్లో పనిచేసేవాడు. వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను కుటుంబ సభ్యులు నిరాకరించారని చెబుతుండగా, యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను మోసం చేయటంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. శుక్రవారం స్వగ్రామంలో శిరీష పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక చికిత్స అనంతరం ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శిరీష శనివారం మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు ఏలూరు జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగటంతో వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు బాధితుల వద్దకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ సంఘటనపై ఆరా తీశారు. స్టేట్మెంట్ తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో తమ కుమార్తెను బీఎస్సీ నర్సింగ్ చదివించామని.. ప్రేమ పేరుతో మోసం చేయటంతో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని తల్లిదండ్రులు విలపించటం అందరినీ కలిచివేసింది. -
ఇంటర్ ఫలితాల్లో ‘శశి’ సత్తా
ఉండ్రాజవరం: ఇంటర్–2025 ఫలితాలలో వేలివెన్ను శశి క్యాంపస్ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కె.సాత్విక్ వర్మ, బి.షన్మిత, డీపీబీ బంగారం 990, ఎస్జేఎం దీపిక, బి.స్నేహ, జిఎస్.వైష్ణవి, కె.నంద కార్తిక్ 989 మార్కులు, ఏజేఎస్ రమాదేవి, ఎస్.హేమలత, పీఎల్ ప్రసన్న, సీహెచ్.పవన్‌కుమార్, ఎస్.రేఖ 988 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో కె.లీలా వినోదిని 990, జి.చెరిష్ సాయి, పి.ధరణి 989, టి.కీర్తి 988 మార్కులు సాధించారు. 990 మార్కుల పైన నలుగురు, 980 మార్కులపైగా 179 మంది, 950 మార్కులపైగా 811 మంది, 900 మార్కులపైగా 1402 మంది సాధించారని ఆయన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎస్.నాగపూజిత్, వై.రాహుల్, టి.నారాయణ మూర్తి, ఎం.శైలజ, పి.సాయి చరణ్, సీహెచ్.వినీల, కె.కాళీశ్వర, టి.మణికంఠ, ఎం.సాయిలక్ష్మి, బి.సాత్విక్, ఎస్వి.తేజశ్విని, సయ్యద్ అనస్, ఎన్.చాతుర్ వర్మ, యు.ధీరజ్ కుమార్, ఎండి.తహ్లీల్ సామా 466 మార్కులు, బైపీసీలో ఎల్.దినేష్, జి.భవ్య, ఎస్.స్వర్ణాంజలి, పి.సుష్మ 435 మార్కులు సాధించారు. 465 మార్కులు పైన 50 మంది, 460 మార్కుల పైన 264 మంది, 430 మార్కులు పైన 1070 మంది, 400 మార్కుల పైన 1567 మంది సాధించారని ఆయన తెలిపారు. ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ అభినందించారు. -
వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలి
పెంటపాడు: మత స్వేచ్ఛను హరించేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును తక్షణం రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళింగ లక్ష్మణరావు, ఇతర సంఘాల ప్రతినిధులు కోరారు. శనివారం పెంటపాడు గేట్ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులతో కలిసి కమ్యూనిస్టులు భారీ నిరసన చేపట్టారు. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ గుజరాత్ పెట్టుబడి దారులకు ప్రధాని అనుకూలంగా ఉండటం తగదన్నారు. వక్ప్ బిల్లు పట్ల ముస్లింలు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోరాటం హిందూ, ముస్లింల వివాదాలకు దారితీయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ముస్లిం సంఘ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు షేక్ హాసేన్ మాట్లాడుతూ మైనారీటీ హక్కుల కోసం చేస్తున్న ఈ నిరసనకు తప్పక కేంద్రం తలొగ్గాలన్నారు. ఈ చట్టాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. సీపీఐ నాయకులు వంకా అప్పారావు, దిద్దే నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఓటు బ్యాంక్ కోసం బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టడం తగదన్నారు. షేక్ ఇస్మాయేల్, షేక్ బాజీ, షేక్ హుస్సేన్, మస్తాన్, రజియా, షహాదాబి, ఫాతిమాబీ, షేక్ లాల్‌బీ తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులు, పెళ్లి జనాలతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ విద్యార్థులకు సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం క్షేత్రంలోను, వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరగడంతో నూతన వధువరులు, వారి బంధువులు ఆలయానికి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులు, పెళ్లి జనాలతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు రద్దీగా మారాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో ఈ రద్దీ కొనసాగింది. ఆదివారం క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసభ్యకర ప్రవర్తనపై కేసు నమోదు భీమవరం: మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రెహమాన్ శనివారం చెప్పారు. రాయలం గ్రామంలో ఉంటున్న కొక్కట్టి రాములు తన భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేసుకుని జీవిస్తోంది. ఈనెల 11న ఇళ్లలో పనిముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన కుమార్, అతని స్నేహితుడు ఆమెను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై రెహమాన్ చెప్పారు. -
ఇంటర్ ఫలితాల్లో మాంటిస్సోరి ప్రతిభ
తణుకు అర్బన్: ఇంటర్ ఫలితాల్లో మాంటిస్సోరీ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు తెలిపారు. ఫస్టియర్ బైపీసీలె ఎ.లావణ్య 435 మార్కులు, ఎంపీసీలో పీఎస్వీ సూర్యనారాయణ 464, టి.హరి నాగేంద్రనాధ్ 464, ఎం.అజన్య నిస్సి 463, జె.వైష్ణవి ప్రణీత 463 సాధించినట్లు వివరించారు. శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. సాంకేతికతలో రైతులకు సాయపడాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వ్యవసాయ రంగంలో అందివస్తున్న అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుగా వ్యవసాయ అధికారులు అవగాహన చేసుకుని అనంతరం ఆ సాంకేతికతను రైతులకు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ ఎంవీ శేషారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అధికారుల సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా, వారి హక్కులను పరిరక్షించడం కోసమే తమ సంఘం పని చేస్తోందని స్పష్టం చేశారు. అసోసియేషన్‌కు సంబంధించి ఇటీవల ఖాళీ అయిన ప్రధాన కార్యదర్శి స్థానానికి జిల్లాలోని కొయ్యలగూడెంకు చెందిన బోడపూడి సోమశేఖర్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు బత్తిన రంగనాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు . -
క్షీరారామలింగేశ్వరస్వామికి చక్రస్నానం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివార్లకు చక్రస్నానం, త్రిశూల స్నానం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మిగతా ఆలయంలో చక్ర స్నానం, త్రిశూల స్నానంలో ఏదొకటి జరుగుతుందని.. పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మాత్రం రెండూ జరుగుతాయని ఆలయ ప్రధానార్చకుడు సన్నిధిరాజు కిష్టప్ప తెలిపారు. భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులు చక్ర, త్రిశూల స్నానాల్లో పాల్గొన్నారు. అనంతరం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు. కల్యాణోత్సవాల్లో భాగంగా 27 మంది దంపతులతో స్వామి, అమ్మవార్లకు 27 కావిళ్లతో సారె సమర్పించారు. ముందుగా ఆలయం నుంచి బయలుదేరి మెయిన్‌రోడ్డు, ముచ్చర్ల వారి వీధి, కారుమూరి వారి వీధి గుండా గొడుగు కావిళ్లతో ఊరేగి అనంతరం స్వామివారికి సమర్పించారు. పురుషులు కావిళ్లు మోయగా, మహిళలు భర్తలకు గొడుగులు పట్టుకుని సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరిండెంట్ వాసు, అర్చకులు అనిల్, వీరబాబు, పూర్ణయ్య, కె.వి కృష్ణవర్మ, మీసాల రాము, జక్కంపూడి కుమార్, మురహరి ఈశ్వరరావు, బోణం మునసబు తదితరులు పాల్గొన్నారు. 27 మంది దంపతులతో కావిళ్లు సమర్పణ -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు శాంతినగర్ ఏడో రోడ్డులోని అపార్ట్మెంట్లోని ప్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అర్థంకాక జనం కిందికి పరుగులు తీశారు. అపార్ట్మెంట్లోని ఫోర్‌బీ ప్లాట్‌లో మంటలు చెలరేగటం, మరోవైపు దట్టమైన పొగతో 5వ అంతస్తులోని వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతూ బయటకు రాలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాట్లోని వస్తువులు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. బాధితులను అగ్నిమాపక శాఖ సిబ్బంది సాహసోపేతంగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సీహెచ్ రత్నబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శాంతినగర్ ఏడో రోడ్డు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల పక్కన హిమనీ అపార్ట్మెంట్స్ ఉంది. శనివారం ఉదయం ఫోర్త్ బీ ప్లాట్లోని టీవీ ప్యానెల్ బోర్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బెడ్రూమ్, హాలు, కిచెన్‌లోకి వ్యాపించాయి. ఆ సమయంలో ప్లాట్ యజమాని శ్రీకాంత్, కుటుంబ సభ్యులు ఇంట్లో లేదు. దట్టమైన పొగతో కారిడార్, మెట్ల ప్రాంతం పొగ కమ్మేసింది. 5వ అంతస్తులోని వృద్ధులు పీ.రామకృష్ణ (74), ఎస్.విజయలక్ష్మి (82) బయటకు రాలేక చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది వారిని చేతులపై ఎత్తుకుని కిందికి తీసుకువచ్చారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.15 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను అపార్ట్మెంట్ వాసులు అభినందించారు. తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చాట్రాయి: మనస్తాపంతో ఉరేసుకుని విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని చాట్రాయి గ్రామానికి చెందిన మరీదు ప్రవల్లిక(20) తరుచూ ఫోన్ చూస్తుందని తల్లిదండ్రులు శుక్రవారం మందలించారు. శనివారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట వికాస్ కాలేజీలో బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతుంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అధికారిణియలమంచిలి: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మండల స్థాయి మహిళా అధికారి చిక్కుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజుల క్రితం ఉన్నతాధికారి పేరుతో బెదిరించడంతో ఆమె ఆన్లైన్లో రూ.70 వేలు వేసినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్ల పని అని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది. 15 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి..ఏలూరు టౌన్: విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు 15 ఏళ్ళ క్రితం పోలీసులను మోసం చేసేందుకు ప్రయత్నించటంతో వారిని అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం అప్పట్లో బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి నుంచి కోర్టు వాయిదాలకు రాకుండా పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతోన్న ఒక వ్యక్తిని ఏలూరు ఐడీ పార్టీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. 2010లో ఏలూరు డీఐజీగా మహేష్ భగవత్ వద్దకు జవ్వాది లక్ష్మీచెందు, చిన్న నాయుడు వచ్చి తాము దివంగత వైఎస్సార్ బంధువులమని.. ఒక ఎస్సైకు తణుకు పోలీస్‌స్టేషన్‌కు పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అనుమానం వచ్చిన డీఐజీ ఆరా తీయగా, నకిలీ వ్యక్తులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. బెయిల్‌పై విడుదల అయ్యాక జవ్వాది లక్ష్మీచెందు వాయిదాలకు గైర్హాజరవుతున్నాడు. -
నిట్ డైరెక్టర్‌కు ఉగాది పురస్కారం
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు కిన్నెర ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ విషయాన్ని నిట్ అధికారులు శనివారం తెలిపారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు న్యాయ, పోలీసు, రక్షణ, ఇంజనీరింగ్, సాహిత్యం ,వైద్యం, నాటకం, నృత్యం, సంగీతం, ప్రసార మాద్యమం, చిత్రలేఖనం, హస్తకళలు వంటి పలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఏటా గుర్తించి అవార్డులతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాదికి సివిల్ ఇంజనీరింగ్ రంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్యులు రమణారావును ఎంపిక చేశారు. ఇటీవల హైద్రాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణా గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. -
కళారంగంలో హేలాపురి కళకళలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళారంగానికి సంబంధించి ఏలూరుకు ఘనమైన కీర్తి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రాంతానికి గొప్ప గుర్తింపు తీసుకువచ్చారు. ఏలూరు అంటేనే కళలకు కాణాచి అని జాతీయ స్థాయిలో చెప్పుకునేటంత ప్రఖ్యాతి ఈ ప్రాంతానికి ఎంతోమంది కళాకారుల ద్వారా వచ్చింది. సంగీతం, నాటకం, నృత్యం ఇలా ఆయా రంగాల్లో ఏలూరుకు చెందిన కళాకారులు విదేశాల్లో సైతం ప్రదర్శినలిచ్చి అక్కడి ప్రజలను ఉర్రూతలూగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఏలూరుపై 2025వ సంవత్సరంలో కళారత్న (హంస)అవార్డులు గుంపులుగా వాలాయి. హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలు కళా సాంస్కృతిక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో హంస అవార్డు అత్యున్నతమైనదిగా కళాకారులు భావిస్తారు. ఈ అవార్డు రావాలంటే 64 కళల్లో ఏదో ఒక కళలో విశేషమైన కృషి, సేవ చేసి ఉండాలి. అలాగని ఎవరికిపడితే వారికి ఇచ్చే అవార్డు కాదిది. 64 కళల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంతో కొంతమంది తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. అలాంటి వారి పోటీని ఎదుర్కొని ఈ అవార్డు సాధించడం గొప్ప ఘనతగానే గుర్తించాలి. అంతటి ఘనతను ఏలూరుకు చెందిన ముగ్గురు కళాకారులు ఈ ఏడాది ఉగాది నాడు అవార్డులు అందుకుని హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలుగా నిలిచారు. సినీ, నాటక రంగాల్లో చేసిన కృషికిగానూ ఎస్వీ రామారావు, కూచిపూడి నృత్య రంగంలో చేసిన కృషికి గానూ ఎ.పార్వతి రామచంద్రన్, హరికథాగాన రంగంలో సప్పా భారతికి అవార్డులు వచ్చాయి. ఏలూరులో ఒకే ఏడాది ముగ్గురికి కళారత్న అవార్డులు లలిత కళల్లో చేసిన సేవలకు ప్రభుత్వ గుర్తింపు -
రైతులు దళారులను ఆశ్రయించొద్దు
పాలకొల్లు సెంట్రల్: రైతులు మద్దతు ధరకు ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం మండలంలోని శివదేవుని చిక్కాల రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం లోడు ఎత్తిన తర్వాత కూడా తేమ శాతాన్ని లెక్కించాలని, మిల్లు వద్దకు వెళ్లినా తేడా రాకూడదన్నారు. ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత ఎఫ్టీఓ జనరేట్ చేయకపోతే సకాలంలో ధాన్యం సొమ్ములు జమకావన్నారు. రైతు లు నగదు కోసం మిల్లుల వద్దకు వెళ్లనవసరం లేదన్నారు. వ్యవసాయ శాఖ జేడీ జెడ్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ దుర్గ కిషోర్, ఏడీఏ ఎ.పార్వతి, ఎంఏఓ రాజశేఖర్ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల నిరసన తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యో గుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్‌ను అమలు చే యాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం డిపో గేట్ వద్ద నిరసన తెలిపారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్ ఆపాలని, ఆగిపోయిన ప్ర మోషన్స్ ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలని, అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు ఎంవీ రత్నం, జోనల్ ఉపాధ్యక్షు డు ఎ.నాగేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.భుజంగరావు, డిపో అధ్యక్షుడు ఎంఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. సూత్రధారులను వదిలి పాత్రధారుల అరెస్టా? కొయ్యలగూడెం: సూత్రధారులను వదిలి పా త్రధారులను అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం చట్టాన్ని పక్కదోవ పట్టిస్తోందని మాజీ ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవా రం వైఎస్సార్సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడు కిరణ్ వెనకున్న అసలు దోషులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. కిరణ్‌ని అరెస్టు చేసిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నా రు. జగన్‌ని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చే సుకుని అసత్యపు ఆరోపణలు చేస్తోందన్నారు. నిలకడ లేని రాజకీయాలకు పవన్ కల్యాణ్, నైతిక విలువలు లేని రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని అన్నారు. ఖాకీలు ఖద్దర్ చొక్కాల మాటున విధులు నిర్వహిస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్సార్సీపీ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు రుచి చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, టౌన్ కన్వీనర్ సంకు కొండ, ఎంపీటీసీ ఘంటసాల సీనమ్మ, నాయకులు పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కోర్సు ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. భౌతికశాస్త్రం పరీక్షకు 41 మందికి 35 మంది, రసాయన శాస్త్రం పరీక్షకు 41 మందికి 32 మంది హాజరయ్యారు. జిల్లాలో డీఈసీ కమిటీ ప్రయోగపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖా ధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
లారీని ఢీకొన్న పెళ్లి కారు
ఉంగుటూరు: జాతీయరహదారిపై శుక్రవారం సాయంత్రం నాచుగుంట క్రాసింగ్ పాయింటు వద్ద లారీ–కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పాలకొల్లుకు చెందిన ఓ కుటుంబం పెళ్లి నిమిత్తం పెళ్లికొడుకుతో సహా ఏలూరు వెళ్తున్నారు. అయితే నాచుగుంట వద్ద ఏలూరు కాలువపై వంతెన మీద నుంచి రహదారి మీదకు ఒక్కసారిగా వచ్చిన క్వారీ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొల్లంశెట్టి నాగమణి (65), కొల్లంశెట్టి నాగేశ్వరరావు(70), గంటాపద్మావతి (58), పసుమర్తి రాజేంద్వరప్రసాదు (38)కు తీవ్రగాయలు కాగా, జి.నవీన్ (34), పెళ్ళికొడుకు, ప్రవీణ్‌కుమార్(32) స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను హైవే అంబులెన్స్ ద్వారా ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే టోల్ ఫీజు మినహాయింపు కోసం ఉంగుటూరు బ్రిడ్జి మీదుగా నాచుగుంట వద్దకు అక్కడ నుంచి హైవేపైకి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్లకే పరిమితమైన ఉల్లంఘనలు ప్రస్తుతం క్వారీ లారీలు సైతం వస్తుండడంతో రోడ్లు పాడైపోతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికై నా టోల్ అధికారులు ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆరుగురికి గాయాలు -
గ్యాస్ సిలిండర్‌తో నిరసన
కుక్కునూరు: పెట్రో, గ్యాస్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం కుక్కునూరు ప్రధాన సెంటర్ లో గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ నరేంద్రమేదీ ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గిస్తామని చెప్పి వివిధ రకాల పన్నుల భారాన్ని ప్రజలపై మోపి పెట్టుబడిదారులకు వేల కోట్లు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికి అనేక మార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంగాల కల్లయ్య, షేక్ మున్ని, సొడే చిరమయ్య తదితరులు పాల్గొన్నారు. 17న ఆశ్రంలో జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక ఏలూరు రూరల్: ఆశ్రం మెడికల్ కశాశాల ఆవరణలో ఈ నెల 17న సీనియర్ మెన్ జట్టు, 18న అండర్–23 మెన్, అండర్–19 బాలుర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. 01–09–2002 తర్వాత పుట్టిన వారు అండర్–23 విభాగానికి, 01–09–2006 తర్వాత పుట్టిన వారు అండర్–19 విభాగం పోటీల్లో పాల్గొనేందుకు అర్హులను వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు పుట్టిన తేదీ, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న వారు 2025–2026 సంవత్సరానికి ఏసీఓ నిర్వహించే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. తెలంగాణలో ఉన్నా ఉపాధి సొమ్ము జమ ద్వారకాతిరుమల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవకతవకలు రాష్ట్ర సరిహద్దులు దాటాయి. మండలంలోని ఐఎస్ జగన్నాథపురానికి చెందిన దంపతులు పసుపులేటి నరసింహమూర్తి, అతని భార్య పావని ఏడాది క్రితం తెలంగాణలోని సంగారెడ్డికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో వారికి మస్తర్లు పడుతున్నాయి. దీంతో వారి బ్యాంకు ఖాతాకు నగదు కూడా జమ అవుతుంది. అయితే వారిద్దరూ ఐఎస్ జగన్నాఽథపురంలో ఈనెల 1 నుంచి 5 వరకు పసుపులేటి వీరాయమ్మ తోటలో రింగ్ ట్రెంచ్ పనులు చేసినట్టు ఆన్లైన్లో చూపారు. ఆ పనిదినాలకు సంబంధించిన రూ. 2,742 లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇది తెలిసిన కొందరు గ్రామస్తులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు. అలాగే పనికి వెళ్లని ఒక టీడీపీ నాయకుడికి, తాపీ మేసీ్త్రకి, ట్రాక్టర్ డ్రైవర్‌కు, ఇలా మరి కొంత మందికి ఉపాధి మస్తర్లు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోందని అంటున్నారు. అయితే దొంగ మస్తర్ల ద్వారా వచ్చే సొమ్ములో వాటాలు సంబంధిత అధికారులు, సిబ్బందికి అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఉపాధి సొమ్మును అక్రమంగా స్వాహా చేస్తున్న వారిపై తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మండల సమావేశం బహిష్కరణ
యలమంచిలి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఊహించని పరిణామానికి అటు అధికారులు, ఇటు కూటమి సర్పంచ్‌లు బిత్తరపోయారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ఏర్పాటు చేశారు. సమావేశానికి వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రతిపక్ష కూటమి సభ్యులు ఎవరూ రాలేదు. ఇటీవలె వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రం వచ్చారు. సమావేశాన్ని ఇన్చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేస్తామని చెబుతుండగా వైఎస్సార్ సీపీకి చెందిన గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తనను అన్యాయంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యులు వినుకొండ ధనలక్ష్మి మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 12 మంది సభ్యులు ఉన్నా నలుగురు సభ్యులు ఉన్న కూటమి నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలకు అధికారులు వత్తాసు పలికి ఎన్నికను అర్ధాంతరంగా నిలిపివేయడానికి నిరసనగా మండల సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. దీంతో మిగిలిన 11 మంది సభ్యులు ఆమె వెంట బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులకు మద్దతుగా సర్పంచ్‌లు కూడా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికీ మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రమే సంతకం చేశారు. దీంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ప్రకటించారు. యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదాపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల నిరసన -
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. ఇదేమి పాలన అని ప్రశ్నిస్తే కేసులు.. ఏమిటీ దౌర్జన్యం అని నిలదీస్తే దాడులు.. అన్యాయం అని నిరసన తెలిపితే అరెస్టులు.. ప్రజాస్వామ్యం జిందాబాద్ అంటే జైళ్లు.. ఇదీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు. రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు ‘సాక్షి’పై కక్ష గట్టిన ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై అక్రమ కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు గళమెత్తారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి వినతిపత్రాలు అందించారు. తణుకు అర్బన్: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథ నానికి ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంపై తణుకు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు తహసీలార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఏపీయూ డబ్ల్యూ జే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ మా ట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా అక్రమ కేసులు నమోదుచేయడం శోచనీయమన్నా రు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. అనంతరం తహసీల్దార్ దండు అశోక్‌వర్మకు తణుకు ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూ జే మాజీ సెక్రటరీ కొడమంచిలి కృష్ణ, ఏపీయూడబ్ల్యూజే చిన్నపత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి ఏడుకొండలు, తణుకు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు బొండ రామ్‌కుమార్, పాత్రికేయులు తానేటి దొరబాబు, గజ్జరపు నారాయణమూర్తి, కొలగాని రాజా, పంజా శివ, వెలగల నారాయణరెడ్డి, చిల్లా రాజశేఖర్, గాదిరెడ్డి రామ్‌ప్రసాద్, రంబాల బద్రి, అమర రాజశేఖర్, సతీష్, హరీష్, పెద్దిరాజు, సత్యప్రసాద్, డేగల మణి, ఆనంద్, ముమ్మిడివరపు ప్రతాప్ తదిత రులు పాల్గొన్నారు. కేసులు సిగ్గు సిగ్గు ఉండి: మీడియాపై అక్రమ కేసులు సిగ్గు సిగ్గు అంటూ ఉండి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు నినదించారు. ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.కృష్ణమోహన్, చిట్టూరి జోషి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రత్నకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశా రు. మీడియాపై అక్రమ కేసులు దారుణమని, గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన నీతులు మర్చిపోయిందా అంటూ ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలిచే మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సీనియర్ జర్నలిస్టులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, ప్రెస్‌క్లబ్ కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, మణికంఠ, కేశవ, బాలాజీ, వెంకటరమణ, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పెనుగొండ: జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమే అంటూ పెను గొండలో జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెనుగొండలో తహసీల్దార్ జి.అనితకుమారికి వినతిపత్రం సమర్పించారు. విలేకరులు గుర్రాల శ్రీనివాసరావు, తేతలి తమ్మిరెడ్డి, బి.చిట్టిబాబు, రాజశేఖర్, పి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. కేసులు తక్షణమే ఎత్తివేయాలి జంగారెడ్డిగూడెం: ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు జంగారెడ్డిగూడెంలో శుక్రవారం స మావేశమయ్యారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ కోరారు. అక్రమ కేసులను తక్షణ మే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డీవీ భాస్కరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ రమణరావు, ఎం.గంగరాజు పాల్గొన్నారు. అక్రమ కేసులు అన్యాయం పాలకొల్లు సెంట్రల్: వృత్తి ధర్మంలో భాగంగా వార్తలు రాస్తే కేసులు కట్టే సంస్కృతి నుంచి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాలకొల్లు ప్రెస్‌క్లబ్ సెక్రటరీ ఎంఎన్వీ సాంబశివరావు అన్నారు. శుక్రవారం పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్కు వినతిపత్రం అందజేశారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరా రు. ప్రెస్‌క్లబ్ ట్రెజరర్ తోట రాంబాబు, క్లబ్ సభ్యు లు బండి శ్రీనివాస్, పులపర్తి నాని, మండెల అప్పలరాజు, వానపల్లి భాను, కారుమంచి రాజ్‌గోపాల్, పప్పుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు నిరసనలు.. వినతిపత్రాలు అందజేత జిల్లావ్యాప్తంగా ఆందోళనలు -
రాట్నాలమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో ఉన్న రాట్నాలమ్మ వారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిఏటా ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ తిరునాళ్లకు జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు ఈ తిరునాళ్ల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఈఓ ఎన్.సతీష్, చైర్మన్ మన్నే శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ సెట్టింగ్‌లు ఆకర్షిస్తున్నాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు రాత్రి సమయాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే 16న మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ మేళా జంగారెడ్డిగూడెం: స్థానిక శ్రీరామచంద్ర విద్యాసంస్థల్లో ఆదివారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బీవీ కృష్ణారావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ప్రముఖ ఫార్మా కంపెనీ మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్, హైదరాబాద్ శాఖల్లో ఉన్న 300 ఖాళీలను ఈ మేళాలో భర్తీ చేస్తుందని వివరించారు. పడోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 87126 35899, 87126 87497, 87126 11847 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. స్విమ్మింగ్ కోచ్ గణేష్‌కు అరుదైన గుర్తింపు ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ బలగా గణేష్ పాక్ జలసంధి ఈదేందుకు అనుమతులు సాధించాడు. ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీలంక, భారతదేశం సరిహద్దుల మధ్య 31 కిలోమీటర్ల మేర సముద్రంలో పాక్ జలసంధిలో ఈత కొట్టనున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ గుర్తింపు సాధించిన మొట్టమొదట తెలుగు పారా స్విమ్మర్‌గా అరుదైన ఘనత సాదించాడు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్ఏ చీఫ్‌కోచ్ శ్రీనివాసరావుతో పాటు పలువురు శిక్షకులు పోటీ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆయనకు అభినందనలు తెలిపారు. -
పేరుకే స్టాక్ పాయింట్
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025అడ్డగోలుగా వసూళ్లు ఇసుక ఉచితమని, లో డింగ్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని వినియోగదారులతో పాటు కిరాయిలు రాక లారీ యజమానులు నష్టపోతున్నాం. అధికారులు స్పందించి అదనపు వసూళ్లను ఆపాలి. – రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు సాక్షి, భీమవరం: జిల్లాలోని ఆరు ఓపెన్ రీచ్‌లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో వాటిని మూసివేశారు. ఇసుక కోసం తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, గోపాలపురం, తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. స్థానిక అవసరాల నిమిత్తం ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. తీపర్రు–2 ర్యాంపు నుంచి ఇసుకను తరలించి స్టాకు యార్డుల ద్వారా అమ్మకాలు చేసే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఆచంట స్టాక్ పాయింట్ వద్ద టన్ను రూ.295, పాలకొల్లులో రూ.320, తాడేపల్లిగూడెంలో రూ.300, తణుకులో రూ.215, నరసాపురంలో రూ.370, ఉండిలో రూ.440గా ధర నిర్ణయించారు. ఆయా స్టాకు పాయింట్ల వద్ద మొత్తం 900 టన్నుల ఇసుక అందుబాటులో ఉంచామని, అవసరమైన వారు తీసుకువెళ్లాలని ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు ప్రకటించారు. సేల్స్ మొదలు కాలేదు వినియోగదారులు తమ వివరాలను వెబ్సైట్లో నమోదుచేసుకుని రిజిస్ట్రేషన్ రశీదును స్టాక్ పాయింట్ వద్ద చూపించి ఇసుక పొందవచ్చని, లేదా నేరుగా స్టాక్ పాయింట్ వద్దకు ఆధార్ కార్డును చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. పాయింట్ వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తే అక్కడి ఇన్చార్జి డిజిటల్ పేమెంట్ చేయించుకుని ఇసుక సరఫరా చేసేలా ఏర్పాటుచేశారు. ఆయా స్టాక్ పాయింట్ల వద్ద ఉండే ఇన్చార్జిల నంబర్లను అధికారులు విడుదల చేశారు. వీటిలో కొన్ని పనిచేస్తుండగా మరికొన్ని స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఉండి కౌంటర్ల ఇన్చార్జిలకు ఫోన్లు చేసి ఇసుక అమ్మకాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి అమ్మకాలు ఇంకా మొదలు కాలేదన్న సమాధానం వచ్చింది. అమ్మకాలు ప్రారంభించకపోవడంపై జిల్లా గనులు, భూగర్భశాఖ ఏడీని ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా కనెక్ట్ అవ్వలేదు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఉదాహరణకు ఐదు యూనిట్ల లారీని నింపేందుకు దాదాపు 20 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ప్రస్తుతం ర్యాంపు వద్ద నుంచి ఉండి ప్రాంతానికి లారీకి సుమారు రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటుచేసిన స్టాక్ పాయింట్‌ను వినియోగంలోకి తెస్తే ఇసుక లోడింగ్‌కు రూ.8,800, రవాణా నిమిత్తం రూ.3 వేలు వెచ్చించినా రూ.11,800లకే ఇసుక లభ్యమవుతుంది. వినియోగదారులకు రూ.5 వేల వరకు ఆదా అవుతుందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ స్టాకు పా యింట్లతో ర్యాంపు నిర్వాహకుల దోపిడీకి ఆస్కారం ఉండదు. తక్కువ ధరకే జిల్లా వాసులకు ఇసుక లభ్యమవుతుంది. జిల్లాలో ఏర్పాటుచేసిన స్టాకు పాయింట్లు తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. న్యూస్రీల్ఇసుక.. మస్కా టన్ను ఇసుక ఇచ్చింది లేదు జిల్లాలో అలంకారప్రాయంగా స్టాక్ యార్డులు ఏర్పాటుచేసి రెండు నెలలు ఇంకా మొదలుకాని ఇసుక విక్రయాలు ర్యాంపుల వద్ద లారీకి రూ.5 వేల దోపిడీ జిల్లావాసులపై రోజుకు రూ.30 లక్షల వరకు అదనపు భారం రూ. లక్షల్లో భారం పొరుగు జిల్లాల్లోని ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నట్టు లారీ యజమానులు చెబుతున్నారు. అదనపు వసూళ్ల రూపంలో పాలకులు, నాయకుల జేబుల్లోకి వెళుతున్న వాటాల మొత్తం భారాన్ని జిల్లాలోని వినియోగదారులు భరించాల్సి వస్తోందంటున్నారు. ఆయా ర్యాంపుల నుంచి జిల్లాకు రోజుకు 500 నుంచి 600 లారీల ఇసుక రవాణా జరుగుతుండగా ఈ మేరకు స్థానిక వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోందని అంచనా. మూసి ఉన్న ఈ కౌంటర్‌ను గమనించారా? ఉండి నియోజకవర్గ ప్రజల ఇసుక అవసరాలు తీర్చే నిమిత్తం కొలమూరులోని ప్రైవేట్ స్థలంలో మైనింగ్ అధికారులు ఏర్పాటుచేసిన స్టాక్ యార్డ్‌లోని కౌంటర్ ఇది. వినియోగదారులకు ఇక్కడ ప్రభుత్వ నిర్ణీత ధరకే ఇసుకను విక్రయించనున్నట్టు ప్రకటించారు. స్టాక్ పాయింట్ నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. స్టాక్ యార్డు ఏర్పాటుచేసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఈ కౌంటర్‌ను ఓపెన్ చేసి వినియోగదారులకు లారీ ఇసుక విక్రయించిన దాఖలాలు లేవు. -
కంకర మాఫియాకు పోల‘వరం’
ఉంగుటూరు: మండలంలోని కంకర మట్టి మాఫియాకు పోలవరం కుడికాలువ గట్టు వరంలా మారింది. రాత్రి సమయంలో పోలవరం కుడికాలువ గట్టును తవ్వి దర్జాగా మట్టిని తరలించుకుపోతున్నారు. మండలంలోని చేబ్రోలు, నారాయణపురం, కై కరం గ్రామాల్లో ఈ కంకర మాఫియా ముఠాలు తయారయ్యాయి. అలాగే మండల సరిహద్దు ప్రాంతమైన శింగరాజుపాలెం నుంచి ఉంగుటూరు మండలం కంసాలిగుంట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేరకు ఈ కాలువ విస్తరించి ఉంది. ఆ కాలువ వెంబడి గోపాలపురం, గొల్లగూడెం, కంసాలిగుంట, నల్లమాడు, యర్రమిల్లిపాడు గ్రామాల్లో రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లపై కంకర తరలిపోతోంది. లక్షలాదిరూపాయలు సొమ్ములు ఆర్జిస్తున్నారు. కూటమి ముఖ్య నేతల అండదండలతోనే ఈ కంకర మాఫియా చెలరేగిపోతుందని ప్రజలు చెబుతున్నారు. ఈ తవ్వకాలు గొల్లగూడెం వీఆర్ఓ నాగరాజును ప్రశ్నించగా మా దృష్టికి వచ్చిన వెంటనే వెళ్లి పట్టుకుని కేసులు పెడుతున్నట్లు వివరించారు. అలాగే ఇటీవల కంసాలిగుంట ప్రాంతం నుంచి కంకర తరలిస్తుంటే కేసులు కూడా నమోదు చేశామని వివరించారు. -
వక్‌్ఫ సవరణ బిల్లుపై మండిపాటు
నరసాపురం: ముస్లింల రక్షణకు విఘాతం కలిగించే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని నరసాపురం అంజుమన్ సంఘ అధ్యక్షుడు షేక్ బులిమస్తాన్ డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. పంజా సెంటర్ నుంచి ప్రకా శం రోడ్డు మీదుగా అంబేడ్కర్ సెంటర్ వరకూ ర్యా లీ సాగించి. అంబేడ్కర్ సెంటర్ వద్ద జరిగిన సభ లో బులిమస్తాన్ మాట్లాడుతూ ముస్లింల హక్కులను కాలరాసేలా వక్ఫ్ సవరణలకు కేంద్రం పూనుకుందన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. అంజుమన్ సంఘ నాయకులు దాపూద్ ఖాన్, షేక్ సిలార్‌సాహెబ్, ఎండీ మౌలాలీఖాన్, ఎండీ బాషాఖాన్, బడా వలీ, ఖాజీ ఇమ్రాన్ నాయకత్వం వహించారు. ఆకివీడులో.. ఆకివీడు: వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని స్థానిక జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సెంటర్లో ధర్నా చేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, వైఎస్సార్సీపీ, ముస్లిం నాయకులు మాట్లాడుతూ చట్టంతో ముస్లింల మనోభావాలతో పాటు వారిని ఆర్థికంగా దెబ్బతీసినట్టు అవుతుందన్నారు. కొత్త చట్టాల వల్ల మైనార్టీలు భయంతో బతకాల్సి ఉంటుందన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఎండీ బిలాల్, సీపీఎం పట్టణ కార్యదర్శి కె.తవిటినాయుడు, పెంకి అప్పారావు, బీవీ వర్మ, వైఎస్సార్సీపీ నాయకులు ఎండీ సిద్ధిక్, జక్కీ, మాబూ, సాహిజ్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ చట్ట సవరణ చట్టాన్ని నిలుపుదల చేయాలి ఇరగవరం: వక్ఫ్ సవరణ బిల్లును నిలుపుదల చేయాలని ముస్లింలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేలంగిలో సీపీఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కామన మునిస్వామి మాట్లాడారు. ముస్లిం ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. గ్రామ శాఖ కార్యదర్శి ఇల్లంపాటి సత్యనారాయణ, కమిటీ సభ్యులు షేక్ బాబ్జి, షేక్ ఆలీబాబా, సల్మాన్, బాషా, పాన్ బీబీ తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లులో గర్జించిన ముస్లింలు పాలకొల్లు సెంట్రల్: వక్ఫ్ సవరణ బిల్లును భేషరతుగా వెనక్కి తీసుకోవాలని నియోజకవర్గ ముస్లిం ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జానీ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో సున్ని జామియా మసీదు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జానీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి ముస్లిం మనోభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లా ఆస్తులను కాపాడి రాష్ట్రంలో వక్ఫ్ బిల్లు అమలు కాకుండా చూడాలన్నారు. షేక్ శిలార్, నజీర్, షేక్ మస్తాన్, మదీనా బీషా, రౌఫ్, బ్రాడీపేట మసీద్ ప్రెసిడెంట్ సల్మాన్ బాజీ, రామారావు పేట అధ్యక్షుడు షేక్ బాబాజీ, పూలపల్లి మసీదు అధ్యక్షుడు మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
వరి నేలవాలి.. రైతులు విలవిల్లాడి
● ఈదురుగాలులతో బెంబేలు ● వర్షంతో తడిసిన ధాన్యం గణపవరం/ఆకివీడు: వాతావరణం రైతులను కలవరపెడుతోంది. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మి ఈదురుగాలులు వీస్తూ చిరుజల్లులు పడుతున్నాయి. అయితే గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో కోతలకు సిద్ధమైన వరి చేలు నేలనంటాయి. గణపవరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో రబీ పంట వేయగా ఇప్పటికే 2 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి. 25 శాతం పంట కోత దశలో, మిగిలిన పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేలవాలిన పైరును శుక్రవారం రైతులు నిలబెట్టి కట్టలు కట్టారు. చేలల్లో చేరిన నీటిని బయటకు తరలిస్తున్నారు. కోతలు పూర్తయి ధాన్యాన్ని రోడ్ల మీదికి చేర్చిన రైతులు ఎండ బెట్టుకుంటున్నారు. ధాన్యం రాశులు తడవకుండా బరకాలు, టార్పాలిన్లు కప్పి కాపాడుకుంటున్నారు. నె లాఖరు వరకూ వాతావరణం అనుకూలిస్తే గ ట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఆకివీడు, భీమడోలు తదితర మండలాల్లో తడిసిన, యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. -
రీ–సర్వేపై కేంద్ర బృందం పర్యటన
తాడేపల్లిగూడెం అర్బన్/తాడపల్లిగూడెం రూరల్/ పెంటపాడు : ప్రజలకు చెందిన స్థిరాస్తుల వివరాలు పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రీ–సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి, యశడా డైరెక్టర్ జనరల్ నిరంజన్ కుమార్ సుధానుసు తెలిపారు. ఈ సందర్భంగా భూముల రీ–సర్వేపై స్థానిక నిట్ కాన్ఫరెన్స్ హాలులో కేంద్రభుత్వం నుంచి వచ్చిన బృందం జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన రీ–సర్వేపై చర్చించారు. ఇప్పటి వరకు పూర్తిచేసిన రెండు విడతల రీసర్వేలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించిన వివరాలపై సమీక్షించారు. తాడేపల్లిగూడెంలోని 23వ వార్డులో రీసర్వే నిర్వహించిన ప్రాంతాల ప్రజలతో చర్చించి వారి నుంచి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలోని రెండో ప్రపంచ యుద్ధ అవసరాలకు వినియోగించిన విమానాశ్రయ భూముల్లో సుమారు 4 వేల కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయన్నారు. ఆయా భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ బృందానికి తెలియజేశారు. అలాగే మండలంలోని చినతాడేపల్లి గ్రామానికి చెందిన అక్కిన గంగాభవాని నివాసం వద్ద కడియద్ద రెవెన్యూకు సంబంధించిన రీ–సర్వేపై రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పెంటపాడు మండలంలోని కె. పెంటపాడు బైరాగిమఠంలో నిర్వహించిన సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ డీఎల్‌బీఎల్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విద్యులత, ఐఏఎస్ అధికారి ఆర్ఎం గోవిందరావు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కౌసర్భానో, ఆర్డీ బాలస్వామి, మున్సిపల్ కమిషనర్ వై.ఏసు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జయంతి వేడుకలకు సుబ్బయ్యకు ఆహ్వానం
భీమవరం: భారత పార్లమెంట్లో ఈ నెల 14న నిర్వహించనున్న బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని పట్టణానికి చెందిన ఫౌండేషన్ కేంద్ర బోర్డు సభ్యుడు గరికిముక్కు సుబ్బయ్యకు ఆహ్వానం అందిందని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, అంబేడ్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్, కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నుంచి తనకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సుబ్బయ్య తెలిపారు. శ్యాంప్రసాద్‌కు అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు మండవల్లి: మండలంలోని కానుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు కురేళ్ల శ్యాంప్రసాద్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు లభించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు, విద్యార్థుల ఉన్నతికి చేస్తున్న కృషికి బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రైవేట్ లెక్చరర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 13న గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పురస్కారాన్ని అందిస్తారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సర్పంచ్ థామస్, గ్రామ పెద్దలు శ్యాంప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. నాటుసారా బట్టీపై మెరుపు దాడులు చాట్రాయి: మండలంలోని పోలవరంలో ముందస్తు సమాచారంతో నూజివీడు ఎకై ్సజ్ ఎస్సైలు వై.ఈశ్వరరావు, ఎం.ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రజువారం సారాబట్టీపై మెరుపు దాడి చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎ.మస్తానయ్య తెలిపారు. ఈ దాడిలో ఓ తోటలో రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్న బిలుగుది చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే సారా తయారీ కోసం ఊరబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. -
సంక్షోభంలో సాగు
అన్నదాతకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి.. ఆరుగాలం శ్రమించినా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.. పంట దిగుబడులు రాక.. గిట్టుబాటు ధరలు లేక.. సిండికేట్ల మాయాజాలం.. అంతర్జాతీయ పరిణామాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మద్దతు ధరల కోసం రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా కూటమి సర్కారుకు పట్టడం లేదు. రైతులకు నామమాత్రపు సాయం కూడా అందడం లేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యలు, కోకో, మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోలుకోని కోకో జిల్లాలో కోకో సాగు 36,150 ఎకరాలు విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం ఉన్న జిల్లాగా ఖ్యాతి గాంచింది. ఏటా జిల్లాలో 12 వేల టన్నుల కోకో గింజల దిగు బడి ఉంది. గతేడా ది ఏప్రిల్, మే నెల ల్లో కిలోకు అత్యధికంగా రూ.1,050 ధర పలకగా ప్రస్తు తం రూ.500కి చేరింది. అంతర్జాతీయంగా కోకోకు మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యత, ఇతర కారణాలు చూపుతూ తక్కువ ధరకు కొంటున్నారు. దీంతో రాష్ట్ర కోకో రైతుల సంఘం నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా రైతుల రా స్తారోకోలు, 15న ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాల య ముట్టడికి పిలుపునిచ్చారు. మద్దతు ధర కల్పి స్తామని గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించినా కనీసం స్పందన లేకపోవడంతో ఆందోళనలు తీవ్రతరం చేశారు. మామిడి.. దిగుబడి తడబడి ఏలూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి సాగు విస్తరించి ఉంది. నూజివీడు మామిడి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. ఈ ఏడాది డిసెంబర్, జనవరిలో పూత సమయంలో నల్ల తామర రావడంతో 70 శాతానికిపైగా దిగుబడి తగ్గిపోయింది. గతంలో మామిడి రైతులకు నష్టం వాటిల్లిన క్రమంలో ప్రభుత్వం ఆర్థిక సాయంతో ఆదుకుంది. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవతో సహా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు. ఎన్నికల సమయంలో మామిడి పరిశ్రమ అభివృద్ధికి ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యూస్, పల్ప్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కాక కనీసం మామిడి సాగు స్థితిగతులపై దృష్టి సారించకపోవడం గమనార్హం. అన్నదాత.. గుండెకోత ● ఆర్థిక గండాలతో సతమతం ● ట్రంప్ దెబ్బకు రొయ్యల ధరలు పతనం ● గిట్టుబాటు ధర కోసం కోకో రైతుల ఆందోళన ● మామిడి తోటల్లో తగ్గిన దిగుబడి ● ఆక్వాలో క్రాప్ హాలిడే దిశగా అడుగులు ● ఆదుకోని కూటమి సర్కారు సాక్షి ప్రతినిధి, ఏలూరు : వాణిజ్య పంటలు, ఆక్వా కు రాష్ట్రంలోనే ఖ్యాతి గాంచిన జిల్లాలో మద్దతు ధర కోసం రైతులతో పాటు ఆక్వా సాగుదారులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా జిల్లాలో 60 శాతానికిపైగా కోకో ధరలు పతనం కావడం, ఆక్వా ధరలు పూర్తిగా తగ్గిపోవడం, మామిడి దిగుబడి లేకపోవడం వంటి ప్రధాన సమస్యలతో లక్షలాది మంది రైతులు తీవ్ర అగనాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మొదలు లోకేష్ వరకూ జిల్లాను ఆక్వా హబ్‌గా మారుస్తాం, కోకో సాగుకు మహర్దశ తీసుకువస్తాం, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లతో మామి డి హబ్‌గా మారుస్తామని హామీలిచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత వీటి ఊసే ఎత్తడం లేదు. శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న క్రమంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలపై అంతటా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల పెట్టుబడి సాయం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరితో పాటు వాణిజ్య పంటలు ఆక్వా, మత్స్య సాగు అధికంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆయిల్‌పామ్, కోకో, పొగాకు వంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా పథకం కింద జిల్లాలో 2,35,847 మంది రైతులకు రూ.1,830.24 కోట్ల పెట్టుబడి సాయం కింద అందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాని పరిస్థితి. రొయ్య ‘వెల’ విల జిల్లాలోనే ఆక్వా సాగు సుమారు 2.59 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. రాష్ట్రంలో అత్యధిక సాగు జరిగే జిల్లాగా ఉమ్మడి పశ్చిమ నిలిచింది. ఏటా 3 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి ఉంది. ఆక్వా పరిశ్రమకు అనుబంధంగా 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. అమెరికా పన్నుల ఆంక్షలు సాకుగా చూపించి వ్యాపారులు రొయ్యల ధరలు తగ్గించారు. 100 కౌంట్ కిలో రూ.235 ఉండగా రూ.40 తగ్గించి కొంటున్నారు. నెల క్రితం 100 కౌంట్ రూ.260 పలకగా ప్రస్తుతం రూ.190కి చేరింది. దీంతో టన్నుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు నష్టపోతున్నామంటూ ఆక్వా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాలకొల్లులో రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారుల సిండికేట్‌తో ధరలు పతనమవుతున్నాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలంటూ పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో జూన్ నుంచి ఆక్వా క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చారు. ఇదే బాటలో మిగిలిన నియోజకవర్గాల్లో రైతులు సన్నద్ధమవుతున్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అప్సడా పూర్తిగా సమస్యలను విస్మరించడంతో పాటు షెడ్యూల్ ప్రకారం జిల్లాలో జరగాల్సిన రైతుల సదస్సులను గాలికి వదిలేసింది. -
డెలివరీ బాయ్స్‌పై వేధింపులు తగవు
భీమవరం: జిల్లాలో గ్యాస్ డెలివరీ బాయ్స్‌పై వేధింపులు ఆపకపోతే సమ్మెకు సిద్ధమని జిల్లా గ్యాస్ డెలివరీ బాయ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు హెచ్చరించారు. గురువారం భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరిగిన ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. డెలివరీ బాయ్స్‌కు కనీస వేతనాలు అమలు చేయకపోగా ఇటీవల అధికారులు, డీలర్ల వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీలర్స్ డెలివరీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ సమకూర్చడం లేదని, కిలోమీటర్ల దూరం సిలిండర్లు సరఫరా చేసినా వినియోగదారులు కనీస చార్జీలు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ టీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ మా ట్లాడుతూ డెలివరీ బాయ్స్ జీతాలు తక్కువగా ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ఏఓ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. నూతన కమిటీ ఎన్నిక : జిల్లా గ్యాస్ డెలివరీ బాయ్స్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వై.వెంకటేశ్వరరావు, బి.వాసుదేవరావు, ఉపాధ్యక్షులుగా ఎం.సీతారామయ్య, సనపల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణరాజు, 14 మంది స భ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆక్వా సమస్యలను అధిగమిస్తాం భీమవరం: అమెరికా ఆంక్షల కారణంగా రొయ్యల రైతులకు ఏర్పడిన ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్ సీహెచ్ నాగరాణితో కలిసి ఆయన సమీక్షించారు. అనంతరం దినకర్ విలేకరులతో మాట్లాడుతూ అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి అన్నిరకాల కౌంట్ రొయ్యల ధరలు తగ్గించారనే విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకునేలా కృషిచేస్తానన్నారు. ఉపాధి హామీ పథకం, జలజీవన్ మిషన్ అమలు, గ్రామీణ సడక్ యోజన, లాక్పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎం సూర్యఘర్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షించామన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మె ల్సీ వంక రవీంద్రనాథ్, ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీపీఓ కె.శ్రీనివాసరావు, వ్యవసాయశా ఖ జేడీ జెడ్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
సత్తాలలో ఉపాధి సిత్రాలు
ద్వారకాతిరుమల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. పనిలోకి వెళ్లని వారి పేరున మస్తర్లు వేసి కొందరు సిబ్బంది సొమ్ములు స్వాహా చేస్తున్నారు. ద్వారకాతిరుమల మండలం సత్తాల పంచాయతీలో జరుగుతున్న పనులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. గ్రా మంలో రెండు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 80 నుంచి 90 మంది కూలీలు పనిచేస్తున్నట్టు మస్తర్లు వేస్తున్నారు. వాస్తవానికి పనిలోకి వెళ్లని కొందరు కూలీలకు సైతం మస్తరు పడుతున్నాయి. కూటమి నేతల అండతోనే ఉపాధి హామీ సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగ మస్తర్లు వేస్తోందిలా.. రోజూ పనిచేసిన కూలీలను గ్రూప్ ఫొటో తీసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న మేట్ నరెడ్ల శ్యామలాదేవి ఫొటోలో ఉన్న వారికంటే ఎక్కువ మందికి మస్తర్లు వేస్తున్నారు. ఈనెల 8న ఇందేటి నాగమణి అనే కూలి ఒక్కరే ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి ఆమెతో పాటు, నరెడ్ల సుబ్బారావుకు కూడా మస్తర్ వేశారు. అలాగే 9న బాలుడు గొన్నూరి కార్తీక్ ఫొటో అప్లోడ్ చేసి వృద్ధుడు నరెడ్ల సుబ్బారావుకు మస్తర్ వేశారు. అదే రోజు ముగ్గురున్న ఒక ఫొటోను అప్లోడ్ చేసి ఆరుగురికి మస్తర్లు వేశారు. అలాగే బుధవారం ఇందేటి నాగమణి ఒక్కరే ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి, ఆమెతో పాటు నరెడ్ల సుబ్బారావుకు, అలాగే ముగ్గురున్న మరో ఫొటోను అప్లోడ్ చేసి ఆరుగురికి మస్తర్లు వేశారు. పని అక్కడ.. మస్టర్లు ఇక్కడ : పేరమ్మ (మేరెమ్మ) దూబచర్లలో జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు. సుబ్బమ్మ ఇంటి వద్దే ఉంటోందని, మమత వ్యవసాయ పనులకు వెళుతోందని అయినా వారికి మస్తర్లు వేస్తున్నారని అంటున్నారు. ఇలా దొంగ మస్తర్లు వేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేస్తాం దీనిపై ఉపాధి హామీ ఏపీఓ బిరుదుగడ్డ నాగరాజును వివరణ కోరగా సత్తాల పంచాయతీలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన మస్తర్లలో అవకతవకలు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై విచారణ చేస్తామని చెప్పారు. దొంగ మస్తర్ల దందా బోగస్ హాజరుతో వేతన నిధులు స్వాహా! కూటమి నేతల అండతో అక్రమాలు ద్వారకాతిరుమల మండలం సత్తాల పంచాయతీ సండ్రకుంట గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు గొన్నూరి కార్తీక్ ఈనెల 9న ఉపాధి హామీ పనులకు వెళ్లినట్టు అతడి ఫొటోను సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అయితే పేరు మాత్రం 79 ఏళ్ల వయసున్న నరెడ్ల సుబ్బారావు గా చూపారు. బాలుడు కార్తీక్‌తో ఉపాధి పనులు చేయించి సుబ్బారావుకు మస్తర్ వేశారా, లేక పనిలోకి వెళ్లని సుబ్బారావుకు మస్తర్ వేసేందుకు కార్తీక్ ఫొటోను వాడుకున్నారా అన్న ప్రశ్నలకు ఉపాధి హామీ అధికారులే సమాధానం చెప్పాలి. -
ఎమ్మెల్యే నాయకర్ వ్యాఖ్యలపై మండిపాటు
నరసాపురం: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సమక్షంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కా రుమూరి నాగేశ్వరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత పెండ్ర వీరన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయకర్ రౌడీయిజంలో కాకుండా, నియోజకవర్గ అభివృద్ధిలో తన టాలెంట్ చూపించాలని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి ఓ బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రిపై దుర్భాషలాడటం దారుణమన్నారు. నాయకర్ తీరుతో కూటమిలోని పార్టీలు, కార్యకర్తలకే నష్టమన్నారు. నియోజకవర్గంలో బీసీ రుణాలు కూటమి నాయకులు, కార్యకర్తలకు దక్కుతున్నాయని, నిష్పక్షపాతంగా అర్హులకు ఒక్కరికి రుణం ఇచ్చామని ఎమ్మెల్యే ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ఎమ్మెల్యే మాట్లాడాలి గానీ బహిరంగ సభల్లో బూతులతో బెదింపులకు దిగడం ఏంటని ధ్వజమెత్తారు. నియోజకవర్గ చరిత్రలో నాయకర్ మాత్రమే.. నరసాపురం నియోజకవర్గ చరిత్రలో ఎందరో మంత్రులుగా, కేబినెట్ హోదాల్లో పనిచేశారని, ఎవరూ నాయకర్లా నీచ సంస్కృతి జోలిక పోలేదని వీరన్న అన్నారు. రౌడీయిజం, బూతులు, బెదిరింపుల్లో నాయకర్ మొదటి ఎమ్మెల్యేగా నిలిచారని, ఇప్పటికై నా తీరు మార్చుకోవాలని అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు, జెడ్పీటీసీ సభ్యుడు బొక్కా రాధాకృష్ణ, కౌన్సిలర్ యర్రా శ్రీను, నాయకులు బర్రి శంకరం, అ డ్డాల నర్సింహరావు, కూనపరెడ్డి నారాయణ, ని ప్పులేటి సత్యనారాయణ, మురాల చిన్న, కడలి అ బద్దం, పెదశింగు శంకరం పాల్గొన్నారు. -
మామిడికి అకాల నష్టం
నూజివీడు: ప్రకృతి ప్రకోపం మామిడి రైతుల ఆశలను వమ్ము చేసింది. అసలే కాపు తక్కువ ఉండి నష్టాల్లో ఉన్న రైతులను పెనుగాలుల రూపంలో ప్రకృతి మరింత అప్పుల్లోకి నెట్టేసింది. ఈనెల 7న సాయంత్రం ఈదురు గాలులు, అకాల వర్షం మామిడికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పండ్ల తోటల్లో మామిడి ప్రాధాన్యమైంది. ఈ ఏడాది దాదాపు 80 శాతం దిగుబడి తగ్గి రైతులు దిగాలుగా ఉండగా.. పెనుగాలులు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి దిగుబడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో పంట వర్షార్పణం అయ్యింది. 15 శాతం వరకు పంటకు దెబ్బ నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో వీచిన ఈదురుగాలులకు మా మిడి కాయలు నేలపాలయ్యాయి. తోటల్లో దాదాపు 10 నుంచి 15 శాతం మామిడి కాయలు రాలిపోయా యి. చాట్రాయి మండలంలోని కొత్తగూడెం, యర్రావారిగూడెం, సి.గుడిపాడు, నరసింహరావుపాలెం, చిన్నంపేట తదితర గ్రామాల్లో, ముసునూరు మండలంలోని రమణక్కపేట, లోపూడి, సూరేపల్లి, బా స్వరప్పాడు గ్రామాల్లో ఈదురుగాలులు వీచాయి. రాలిన కాయలను విక్రయిద్దామన్నా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో వాటిని పారబోయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది. చాట్రాయి మండలంలో 4,232 ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగు చే స్తుండగా సుమారు 30 టన్నుల కాయలు నేలరాలా యి. అలాగే ముసునూరు మండంలలో 3,100 ఎకరాల విస్తీర్ణంగా సాగు చేస్తుండగా సుమారు 15 టన్నుల కాయలు నేలరాలాయి. పూతను కాపాడుకుంటే... పూతను నిలుపుకునేందుకు 12 నుంచి 15 సార్లు పురుగు మందులను రైతులు పిచికారీ చేశారు. నల్లతామర పురుగు ఉధృతంగా ఉన్నప్పుడు కూడా పూతను కాపాడుకునేందుకు నానాపాట్లు పడ్డారు. పురుగు మందులు, తోట కాపలా, నీటితడులు కో సం వేలాది రూపాయలు ఖర్చు పెట్టామని, దిగుబడులు చేతికి వచ్చే సమయానికి పెనుగాలుల తాకిడికి కాయలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో నేలరాలిన కాయలు అకాల వర్షంతో అవస్థలు లబోదిబోమంటున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి నాకు రెండెకరాల్లో మామిడి తోట ఉంది. ఇప్పటివరకు రూ. లక్షకు పైగా ఖర్చుచేశా. పూత వచ్చి పిందెలు ఏర్పడ్డాయని సంతోషించే లోపు ఈదురుగాలులకు కాయలు రాలిపోయాయి. దీంతో దాదాపు రూ.40 వేల నష్టం వాటిల్లింది. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – మందపాటి రఘుపతిరెడ్డి, రైతు, సి.గుడిపాడు, చాట్రాయి మండలం తీవ్రంగా నష్టపోయాం నాకు పది ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. రూ.10 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. ఈదురుగాలులు, వర్షానికి మామిడి కాయలు రాలిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కొండా వెంకట్రావు, రైతు, రమణక్కపేట, ముసునూరు మండలం -
కై కలూరు ఏఎంసీలో కయ్యాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల ఎంపిక కై కలూరు నియోజకవర్గంలో కయ్యాలకు కారణమవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి తర్వాత రెండో స్థానంగా కై కలూరు, కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులను భావిస్తారు. రాష్ట్రంలో కై కలూరు ఏఎంసీ ఆదాయంలో మొదటి స్థానంలో నిలవగా.. రాష్ట్ర జీడీపీలో కలిదిండి మండలం మొ దటి స్థానంలో ఉంది. దీంతో ఈ రెండు ఏఎంసీ చైర్మన్ల పదవుల కోసం కూటమి పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో ఏఎంసీ చైర్మన్లను ప్రకటించినా కై కలూరు, కలిదిండి ప్రస్తావన లేదు. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజర్వేషన్ల చిచ్చు ఏఎంసీ చైర్మన్ల రిజర్వేషన్ల కేటాయింపులో మతలబు జరిగిందనే భావన కూటమి నేతల్లో నెలకొంది. మొదట్లో కై కలూరు ఏఎంసీ బీసీ కోటాలో టీడీపీ నాయకుడు పూలా రాజీ సతీమణికి, కలిదిండి ఏఎంసీ చైర్మన్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పోకల జోగిరాజుకు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. అయినా ఎమ్మెల్యే కామినేని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా కై కలూరు ఏఎంసీ పదవిని పెన్మత్స త్రినాథరాజు, గంగుల శ్రీదేవి, బూరుబోయిన శ్రీనివాసరావు, తెంటు వెంకటరమణ, కలిదిండి నుంచి జనసేన నేత చలపతి, అండ్రాజు శ్రీనివాసరావు ఆశించారు. తాజాగా కై కలూరు ఏఎంసీ ఓసీ, కలిదిండి ఏఎంసీ ఎస్సీ మహిళకు కేటాయించాలని నిర్ణయించినట్టు, అధిష్టానం వద్ద ఇవే రిజర్వేషన్లు ఉంటే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేశారని ఆశావహులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురు బరిలో.. కై కలూరు ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్ ఓసీగా మారిస్తే టీడీపీ మండలాధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు మొ దటి వరుసలో ఉన్నారు. అలాగే కేవీఎన్‌ఎం నా యుడు, పుప్పాల సూర్యప్రకాశరావు పోటీపడుతున్నారు. కలిదిండి ఏఎంసీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ గా మారితే ముదినేపల్లి మండలానికి చెందిన పంత గాని సురేష్ కుటుంబం, కోరుకొల్లు పంచాయతీ స ర్పంచ్ బట్టు లీలాకనకదుర్గ (జనసేన) పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కలిదిండిని జనసేనకు కేటాయిస్తే చలపతికి వస్తుందనే ప్రచారం కూడా ఉంది. కై కలూరు ఏఎంసీ బీసీ మహిళా కోటాలో తెంటు వెంకటరమణ బరిలో ఉన్నారు. చైర్మన్ పదవి కోసం ఆశావహుల యత్నాలు కై కలూరు ఓసీ, కలిదిండి ఎస్సీ మహిళ రిజర్వేషన్లకు పట్టు ఏఎంసీ చైర్మన్లను ప్రకటించని ప్రభుత్వం -
చెరువు గట్టుపై చెట్లు అమ్మేశారని ఫిర్యాదు
ద్వారకాతిరుమల: మండలంలోని తిరుమలంపాలెంలో నారప్ప చెరువు గట్టుపై ఉన్న ఎన్నో ఏళ్ల నాటి చెట్లను కొందరు అక్రమార్కులు నరికివేసి, అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దీనిపై భీమడోలుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త కొత్తపల్లి చంద్రమౌళి గురువారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక నారప్ప చెరువు గట్టుపై ఉన్న దశాబ్దాల కాలం నాటి 15 చెట్లను కొందరు వ్యక్తులు వారం రోజుల క్రితం అక్రమంగా నరికివేసి, పంగిడిగూడేనికి చెందిన ఒక వ్యక్తికి రూ. 2.80 లక్షలకు విక్రయించినట్టు చంద్రమౌళి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారులకు, నీటి సంఘం అద్యక్షుడికి తెలిసే జరిగిందని ఆరోపించారు. దీనిపై పంచాయితీ కార్యదర్శి నాగదేవిని వివరణ కోరగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్టు చెప్పారు. చెట్లు నరికి చాలా రోజులు అయినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని, ఆరు చెట్టు కొమ్మలు మాత్రమే అక్కడ ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై స్థానిక పోలీస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెనుమంట్ర: మండలంలోని మార్టేరు రోడ్డులోని బ్రాహ్మణ చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సిద్ధాంతం గ్రామానికి చెందిన సతీష్ బైక్‌పై వెళ్తూ బ్రాహ్మణచెరువు గ్రామంలో అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించగా సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సతీష్‌ను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. డ్రెయిన్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం భీమవరం: భీమవరం రెండో పట్టణ పరిధి రాయలం డ్రెయిన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేసు కూడా నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పెదవేగి : గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో విజయరాయికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి ఎస్సై కె.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం విజయరాయి గ్రామానికి చెందిన కంబంపాటి రాజేంద్రప్రసాద్ ఈ నెల 9న సాయంత్రం స్థానిక నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రోజువారీ పని ముగించుకుని ఇంటి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో స్థానికులు రాజేంద్రప్రసాద్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడి భార్య దుర్గాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
భగవద్గీత అనువాదం గొప్ప విషయం
పాలకొల్లు సెంట్రల్: భగవద్గీతను వంద భాషల్లో అనువాదం చేయాలనే సంకల్పం చాలా గొప్ప విషయమని రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. గురువారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో గజల్ శ్రీనివాస్ సంగీతం సమకూర్చి గానం చేసిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత (తెలుగు) లోకార్పణ కార్యక్రమం సేవ్ టెంపుల్ భారత్, సూర్యనారాయణమూర్తి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ తండ్రి కేశిరాజు నరసింహరావు చేతులు మీదుగా భగవద్గీత లోకార్పణ కార్యక్రమం ఆవిష్కరించారు. ఈ సందర్భంగాగజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీతను దాదాపుగా వంద భాషల్లో అనువదించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే 25 భాషల్లో భగవద్గీత రికార్డింగ్ పూర్తయ్యిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి, అంగర రామ్మోహన్, యడ్ల తాతాజీ, కుమార దత్తాత్రేయ వర్మ, డీటీడీసీ బాబు, పెండ్ర వీరన్న, చినిమిల్లి సత్యనారాయణరావు పాల్గొన్నారు. -
వేతన యాతన తీరేదెప్పుడు..?
తణుకు అర్బన్: ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలివ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. నిత్యం ఆస్ప్రత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు చేసే వారి ఇళ్లు ఆకలికేకలతో అల్లాడుతున్నాయి. శుభ్రత, భద్రత, క్షేమంగా ఇంటికి చేర్చే రంగాల్లో వారు సేవలు అమోఘంగా చేస్తున్నా సరైన సమయానికి వేతనాలు అందించడం లేదని కార్మికులు వాపోతున్నారు.తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ విభాగం, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా గతం నుంచి రోగులకు సత్వర సేవలందుతున్నాయి. కానీ నేడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలు, సెక్యూరిటీ విభాగం 2 నెలలు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లకు రెండు నెలలు జీతం పెండింగ్‌లో ఉండడంతో కుటుంబాలను పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కుదిరితే అప్పులు..లేకపోతే పస్తులు జీతం రాకపోయినా ఖర్చులు తప్పవు అనే ఉద్దేశంతో ఇళ్లు గడిపేందుకు అప్పులు చేస్తున్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో వచ్చే వ్యర్థాలతోపాటు వివిధ వార్డుల్లో వచ్చే వ్యర్థాలను తొలగించడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలకంగా పనిచేస్తుంటారు. రక్తపు వ్యర్థాల తొలగింపులో రోగాలబారిన పడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లోనే విధుల్లో ఉండాల్సి వస్తుందని అయినప్పటికీ ఏ నెల వేతనం ఆ నెల ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు రోగుల రక్షణ, భద్రతలో కీలకంగా ఉంటారు. రోగులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లో పంపించడంతోపాటు ఎలాంటి ఘర్షణలు జరిగినా సర్దబాటు చేయడంలోను ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. లోపలకు వచ్చేవారితోపాటు బయటకు వెళ్లేవారిని గమనిస్తూ ఎటువంటి చోరీలు జరగకుండా చూస్తుంటారు. క్షేమంగా ఇంటికి చేర్చినా.. ఆస్పత్రిలో ప్రసవాల అనంతరం తల్లి, బిడ్డను క్షేమంగా వారి ఇంటికి చేర్చడంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు సత్వర సేవలు అందిస్తుంటారు. అరకొర వేతనంతోనే విధులు నిర్వర్తిస్తూ బాలింతలను సురక్షితంగా ఇంటికి చేరుస్తూ వారి ప్రశంసలు పొందుతున్నారు. గత ఐదేళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిన ఈ సేవలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వారి జీవనోపాధి కుంటుపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి ఆయా కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అప్పులతో కాలం గడుపుతున్నారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చే స్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ వేతనానికి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ వేతనం కూడా ఏ నెల వేతనం ఆ నెలలో ఇవ్వకుండా నెలలపాటు బకాయిలు పెట్టి వారిని అప్పులపాలు చేస్తున్నారు. కార్మికుల ఆకలికేకలు పట్టించుకోని ప్రభుత్వాలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కోనాల భీమారావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు ప్రభుత్వాస్పత్రుల్లో కార్మికులకు నెలల తరబడి వేతనాల పెండింగ్ అప్పులు చేసి బతుకుతున్నామంటూ ఆవేదన జిల్లాలో ప్రభుత్వాస్పత్రిలో కార్మికులు విభాగం కార్మికుల సంఖ్య పారిశుద్ధ్యం 152 సెక్యూరిటీ 110 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు 14 -
పీజీ సెంటర్లో కూలుతున్న అకడమిక్ బ్లాక్ భవనం
నూజివీడు: పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీకి చెందిన పీజీ కేంద్రంలోని అకడమిక్ బ్లాక్ భవనం ద్వితీయ అంతస్తు స్లాబు బుధవారం కూలిపోయింది. ఈ సమయంలో పైన పెద్ద శబ్దం రావడంతో కింది అంతస్తులో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై భవనంపై నుంచి కిందకు పరుగులు తీశారు. ఈ అంతస్థు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో గత ఏడాది కాలంగా ఈ భవనంలోని గదుల్లో తరగతులు నిర్వహించడం లేదు. దానంతట అదే కూలిపోక ముందే, ఎలాంటి ప్రమాదం చోటు చోసుకోకముందే ఈ భవనం పై అంతస్థును కూల్చేయాలని పీజీ సెంటర్లోని అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పలుమార్లు యూనివర్శిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పందించడం లేదు. గత నెలలో పీజీ కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా యూనివర్శిటీ వీసీ ఆచార్య కూన రాంజీ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇప్పటికై నా పై అంతస్తును కూల్చివేయాలని పీజీ కేంద్రం విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. -
విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి
నూజివీడు: పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం మలుపులో నిర్మాణంలో ఉన్న నూతన బిల్డింగ్‌లో టైల్స్ వేసే పనికి వెళ్లిన 17 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అజరయ్యపేటకు చెందిన చిట్లూరి ప్రవీణ్ (17) తొమ్మిదో తరగతి వరకు చదువుకొని ఆ తరువాత తన తండ్రికి పనుల్లో సాయంగా వంట పనికి వెళ్తుంటాడు. వంట పని లేనిప్పుడు కూలి పనులకు వెళ్తూ ఉంటాడు. దీనిలో భాగంగా నూతన బిల్డింగ్‌లో టైల్స్ వేసే పనికి మేసీ్త్రతో పాటు వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా ఊదయం 10 గంటల సమయంలో సున్నం బస్తాను తీసుకుని అక్కడే ఉన్న ఐరన్ గ్రిల్స్‌పై కాలు వేయగానే గిలాగిలా కొట్టుకొంటూ కిందపడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న మేసీ్త్ర లాగు శ్రీను బాలుడిని పట్టుకోగా అతను పెద్దగా కేకలు వేస్తూ గిలాగిలా కొట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ అతను కేకలు విని చూసి పరిగెత్తుకొని వచ్చి కరెంటు బోర్డులో ఉన్న విద్యుత్ తీగను తప్పించాడు. ఈ తీగకు ఉన్న అతుకులు తొలగి ఐరన్ గ్రిల్స్‌కు ఆనడం వల్ల గ్రీల్స్‌కు కరెంటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం లాగు శ్రీనుని, ప్రవీణ్‌లను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. షాక్‌కు గురైన మేసీ్త్ర లాగు శ్రీను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో అజరయ్యపేటలో తీవ్ర విషాదం నెలకొంది. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
భీమవరం: పట్టణంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యు.స్వర్ణకుమారి (19) కళాశాల హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణకుమారి గురువారం తరగతులకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండి తన స్నేహితుడికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతడు కళాశాలలోని తన స్నేహితులకు చెప్పడంతో హాస్టల్ గదికి వెళ్లేసరికి స్వర్ణకుమారి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేళ్లాడుతూ కనిపించింది. హుటాహుటిన చికిత్స కోసం ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె స్నేహితులతో టూర్ వెళ్లడానికి ప్లాన్ చేసుకోగా తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై రూరల్ సీఐ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. నేషనల్ క్రికెట్ టీంకు క్రీడాకారుడి ఎంపిక పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణం బ్రాడీపేట ప్రాంతానికి చెందిన షేక్ సమీరుద్దీన్ నేషనల్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఇండో–నేపాల్ కప్ చాంపియన్‌షిప్–2025 క్రికెట్ టోర్నమెంట్‌కు ఇండియా తరఫున ఆడేందుకు నైన్ ఏ సైడ్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సంస్థ నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు వచ్చినట్లు సమీరుద్దీన్ తెలిపాడు. ఈ టోర్నమెంట్ మే 26 నుంచి 31 వరకూ నేపాల్‌లో ఆరురోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చైతన్య కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాని పేర్కొన్నారు. అలాగే పీడీ రామకృష్ణ, మణికంఠల శిక్షణలో తర్ఫీదు పొందుతున్నానని వివరించాడు. త్వరలో క్రికెట్ అకాడమీకి పిలుస్తామని సిద్దంగా ఉండాలని నైన్ ఏ సైడ్ సంస్థ సభ్యులు సమాచారం ఇచ్చినట్లు సమీరుద్దీన్ తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ ఏలూరు రూరల్: ఏలూరుకు చెందిన కంఠం సాయితరుణ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడని శిక్షకుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు బదిరెడ్డి రామ్‌ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1న బైలాస్పూర్లో ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జూనియర్ మిస్టర్ ఇండియా చాంపియన్‌షిప్ పోటీల్లో 80 కేజీల విభాగంలో తృతీయస్థానం సాధించాడని వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర పోటీల్లో సైతం చాంపియన్స్ ఆఫ్ ది చాంపియన్స్‌గా నిలిచి ఓవరాల్ టైటిల్ కై వసం చేజిక్కించుకున్నాడని హర్షం వ్యక్తం చేశారు.