WhatsApp Group
-
వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?
ఇజ్రాయెల్ కంపెనీ పారాగాన్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన అత్యాధునిక స్పైవేర్ ద్వారా జర్నలిస్టులు, సివిల్ సొసైటీ సభ్యులతో సహా దాదాపు 100 మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు వాట్సప్ సైబర్ సెక్యూరిటీ ఆరోపించింది. అయితే, భారతీయ వినియోగదారులు ఈ ఉల్లంఘన బారిన పడలేదని హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ధ్రువీకరించింది. తన భారతీయ వినియోగదారులు ఈ దాడికి గురికాలేదని వాట్సాప్ స్పష్టం చేసింది.గ్రాఫైట్ అని పిలువబడే ఈ స్పైవేర్ ‘జీరో-క్లిక్’ పద్ధతిని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేశారని వాట్సప్ తెలిపింది. అంటే బాధితులు ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తులను టార్గెట్ చేసి హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ఈ స్పైవేర్‌ను అక్కడి ప్రభుత్వ క్లయింట్లు ఉపయోగిస్తున్నారని భావిస్తున్నప్పటికీ, దాడి వెనుక ఉన్న నిర్దిష్ట వ్యక్తులను వాట్సప్ గుర్తించలేకపోయింది.ముఖ్యంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)తో కంపెనీ గతంలో దాదాపు 2 మిలియన్ల డాలర్ల కాంట్రాక్టును దక్కించుకొని వార్తల్లో నిలిచింది. జాతీయ భద్రతా సమస్యల కారణంగా ఫెడరల్ ఏజెన్సీలు స్పైవేర్ వినియోగాన్ని పరిమితం చేసేలా, అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వెలువడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు అనుగుణంగా ఉండేలా ఈ ఒప్పందాన్ని సమీక్షించారు. పారగాన్ సొల్యూషన్స్ యూఎస్‌లోని చాంటిల్లీ, వర్జీనియాలో కార్యాలయాలను కలిగి ఉంది. యూఎస్ ప్రభుత్వ సంస్థలతో సంస్థ ఒప్పందాలపై పరిశీలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖాతాదారులచే స్పైవేర్‌ను విస్తృతంగా ఉపయోగించడంపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానాపారాగాన్ సొల్యూషన్స్‌పై వాట్సప్ చర్యలు చేపట్టింది. చట్టవిరుద్ధమైన నిఘా కోసం కంపెనీ స్పైవేర్‌ను ఉపయోగించడం నిలిపివేయాలని కోరుతూ.. ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని లేఖ రాసింది. వాట్సప్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో వినియోగదారులు ప్రైవేట్‌గా కమ్యూనికేట్ చేసే సామర్థ్యాన్ని రక్షించడానికి నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. స్పైవేర్ సంస్థలను కట్టడి చేస్తూ వారి చర్యలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. -
జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ జనవరి 1, 2025వ తేదీ నుంచి కొన్ని ఫోన్లలో పని చేయదని మెటా ప్రకటించింది. ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. దాంతో వాట్సప్ అప్డేట్లు విడుదల చేసినప్పుడు ఆయా డివైజ్‌ల్లో పని చేయడం లేదని పేర్కొంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసు, భద్రతను అందించేందుకు కంపెనీ అందిస్తున్న అప్డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారు అందుకోలేకపోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో భద్రత కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సప్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పని చేయని డివైజ్‌ల లిస్ట్‌కు ప్రకటించింది.సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీమోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్డీ, మోటో ఈ 2014హెచ్‌టీసీ: వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601ఎల్జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90సోనీ: ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీయాపిల్ ఓఎస్‌లోనూ..ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్ 15.1 వర్షన్ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: అప్పుడు పరీక్షలో ఫెయిల్.. గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..అప్డేట్లు ఎందుకు అవసరం అంటే..ఆన్లైన్ యాప్‌లు నిత్యం కొత్త అప్డేట్లు తీసుకొస్తుంటాయి. కొన్ని అప్డేట్లు వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేలా ఉంటే, మరికొన్ని భద్రత పరమైనవి ఉంటాయి. పాత డివైజ్‌ల్లోని హార్డ్‌వేర్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయవు. దాంతో కొత్తగా వస్తున్న యాప్ అప్డేట్లు పాత ఓఎస్‌ల్లో పని చేయవు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్లు వస్తున్నప్పుడు అందుకు వీలుగా ఓఎస్‌లు, డివైజ్‌ల్లోని యాప్‌లను అప్డేట్ చేసుకోవడమే మేలని కొందరు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
Year Ender 2024: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. చాటింగ్ స్టైలే మారిపోయిందే..
వాట్సాప్.. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచ వ్యాప్తంగా 295 కోట్ల మంది వినియోగదారులు ఈ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ‘మెటా’ ఈ ఏడాది వాట్సాప్‌లో పలు ఫీచర్లను జోడించింది. అంతేకాకుండా దాని ఇంటర్ఫేస్లో కూడా మార్పు చోటుచేసుకుంది. ఫలితంగా వాట్సాప్‌లో చాటింగ్ అనుభవం పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాది వాట్సాప్‌లో ప్రవేశించిన ప్రత్యేక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.మెటా ఏఐమెటా ఏఐ.. జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ వాట్సాప్‌కి జోడించింది. మెటా దాని అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు దాని లామా (లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్) ఆధారిత ఉత్పాదక ఏఐ సాధనాన్ని జోడించింది. వాట్సాప్ యూజర్లు మెటా ఏఐ ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చాట్‌బాట్ వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, ఆదేశాలకు అనుగుణంగా చిత్రాలను కూడా రూపొందిస్తుంది.వీడియో కాల్ ఫిల్టర్వాట్సాప్ వీడియో కాల్ ఫీచర్‌కు ఈ ఏడాది కొత్త ఇన్నోవేటివ్ ఫిల్టర్లు జోడించారు. వీడియో కాల్ల సమయంలో వినియోగదారులు ఈ ఫిల్టర్లను ఉపయోగించి తమకు నచ్చిన నేపథ్యాన్ని మార్చుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార కాల్లు లేదా సమావేశాల సమయంలో, వినియోగదారులు ఈ వీడియో కాల్ ఫిల్టర్లను ఉపయోగించవచ్చు.కస్టమ్ చాట్ జాబితాఈ సంవత్సరం మెటా.. వాట్సాప్‌లో కస్టమ్ చాట్ జాబితా ఫీచర్‌ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వారికి ఇష్టమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల చాట్ జాబితాను సృష్టించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ తమకు నచ్చినవారితో నిత్యం కనెక్ట్ కాగలరు.వాయిస్ సందేశాలకు అక్షరరూపంవాట్సాప్లో వాయిస్ మెసేజ్‌ల కోసం ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ జోడించారు. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ రిసీవ్ చేసుకునే వినియోగదారులు ఆ వాయిస్ మెసేజ్‌లను అక్షర రూపంలో చదవగలరు. వినియోగదారులు తమకు నచ్చిన భాషలో వాయిస్ సందేశాలను చదువుకునే అవకాశం కూడా ఉంది.ఇంటర్ఫేస్లో మార్పులుఇతర ప్రధాన అప్గ్రేడ్లతో పాటు, యాప్ వినియోగదారులు ఇంటర్ఫేస్ను కూడా మార్చుకోవచ్చు. వాట్పాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి, టైపింగ్ ఇండికేటర్‌ను జోడించారు. మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు, అవతలి వ్యక్తి ప్రత్యుత్తరం కోసం ఏదైనా టైప్ చేస్తే, అది చాటింగ్ విండోలో కనిపిస్తుంది.ఇది కూడా చదవండి: మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే.. -
వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి
టెక్నాలజీ పెరుగుతోంది.. స్కామర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంతోమంది బాధితులు మోసపోయి లెక్కకు మించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మరో సంఘటనే తెరమీదకు వచ్చింది.ముంబైలోని కోలాబాకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ షిప్ కెప్టెన్‌ను.. మొదట గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. అతడు పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తూ.. షేర్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలను వెల్లడించాడు. దీనికోసం ఒక యాప్‌లో పెట్టుబడి పెట్టమని సూచించారు. అప్పటికే చాలామంది లాభాలను పొందుతున్నట్లు కూడా పేర్కొన్నాడు.గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నిజమని కెప్టెన్ నమ్మేశాడు. దీంతో స్కామర్ బాధితున్ని మరో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. కంపెనీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్‌ను షేర్ చేశాడు. బాధితుడు యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత.. ట్రేడింగ్, ఐపీఓ వంటి వాటికి సంబంధించిన మెసేజ్‌లను అందుకుంటాడు. అదే సమయంలో స్కామర్.. బాధితుని ఇంకొక వ్యక్తిని పరిచయం చేసాడు. ఆ వ్యక్తి.. బాధితుడు సిఫార్సు చేసిన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని ఒప్పించాడు.లావాదేవీలన్నీ సెప్టెంబర్ 5, అక్టోబర్ 19 మధ్య జరిగాయి. బాధితుడు 22 సార్లు.. మొత్తం రూ. 11.16 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసాడు. వేరు వేరు ఖాతాకు ఎందుకు డబ్బు బదిలీ చేయాలని బాధితుడు స్కామర్లను అడిగినప్పుడు.. ట్యాక్స్ ఆదా చేయడానికి అని అతన్ని నమ్మించారు.కొన్ని రోజుల తరువాత తన నిధులలో కొంత తీసుకోవాలనుకుంటున్నానని.. స్కామర్లు అడిగినప్పుడు, సర్వీస్ ట్యాక్స్ కింద పెట్టుబడులపై 20 శాతం చెల్లించాలని కోరారు. ఇది చెల్లించిన తరువాత కూడా.. మళ్ళీ మళ్ళీ ఏదేది సాకులు చెబుతూ.. మోసం చేస్తూనే ఉన్నారు. చివరకు బాధితుడు మోసపోయామని గ్రహించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.ఇలాంటి మోసాల నుంచి బయటపడటం ఎలా?👉గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను స్పందించకపోవడం మంచిది.👉ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించడానికి ప్రయత్నించడం, లేదా లింకులు పంపించి వాటిపై క్లిక్ చేయండి.. మీకు డబ్బు వస్తుంది అని ఎవరైనా చెబితే.. నమ్మకూడదు.👉స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను చెబుతూ.. ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మవద్దు. 👉షేర్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే.. నిపుణలను సందర్శించి తెలుసుకోవాలి. లేదా తెలిసిన వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి.👉స్కామర్లు రోజుకో పేరుతో మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. -
వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!
అక్కడ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.కొత్త రూల్ ఎందుకంటే..తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు! -
వాట్సాప్ గ్రూపులపై ఏపీలో కేసులు
-
కొంప ముంచిన వాట్సాప్ గ్రూప్: రూ.50 లక్షలు మాయం
భారతదేశంలో ఆన్లైన్ మోసాల కారణంగా భారీగా మోసపోతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్దులు, యువకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో కేసు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం.హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి స్టాక్ డిస్కషన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరడంతో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, కునాల్ సింగ్ తన మార్గదర్శకత్వంతో కొంతమంది క్లయింట్స్ ఎక్కువ లాభలను పొందినట్లు, తనను తాను ప్రఖ్యాత ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకున్నాడు.స్టాక్ మార్కెట్లో గొప్ప లాభాలను పొందాలంటే ఆన్లైన్ క్లాసులకు చేరాలని వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించాడు. క్లాసులకు జాయిన్ అవ్వాలంటే.. వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేయాలని పేర్కొనడంతో.. బాధితుడు ఇదంతా నిజమని నమ్మేశాడు. అంతే కాకుండా స్కైరిమ్ క్యాపిటల్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టమని స్కామర్లు ఆదేశించడంతో బాధితుడు అలాగే చేసాడు.ప్రారంభంలో బాధితుని పెట్టుబడికి.. స్కామర్లు మంచి లాభాలను అందించారు. అయితే ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే.. ఎక్కువ పెట్టుబడి పెట్టాలని స్కామర్లు పేర్కొన్నారు. అప్పటికే లాభాల రుచి చూసిన బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత స్కామర్లు చెప్పిన వెబ్సైట్ నుంచి లాభాలను తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే..టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపే సోషల్ మీడియా గ్రూపులతో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకూడదు. అంతగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే.. నిపుణులు నిర్వహించే తరగతులకు హాజరవ్వొచ్చు, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర నెర్కకోవచ్చు. -
3 నగరాలు 4 దేశాలు
సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే ఒకటీ రెండు రోజులు బాధపడతాం. కాస్త విలువైన ఫోన్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దొరికితే దొరుకుతుంది లేదా కొద్దిరోజుల తర్వాత మర్చిపోతాం. కానీ ఈ సెల్ఫోన్ల చోరీ వెనుక పెద్ద వ్యవస్థీకృత దందా దాగి ఉందంటే మాత్రం విస్తుపోక తప్పదు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో దొంగల ముఠాల ద్వారా చోరీ అవుతున్న సెల్ఫోన్లు సీ ఫుడ్ ముసుగులో ఏకంగా దేశం దాటేస్తు న్నాయి. ప్రధానంగా మూడు నగరాల మీదుగా నాలుగు దేశాలకు తరలిపోతున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో స్థానికుల నుంచి విదేశీయుల వరకు ఉంటున్నారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా చోరీ ఫోన్ల ఫొటోలు షేర్ చేసుకుని, క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఓడ రేవుల్లో కార్యకలాపాలు సాగించే వారితో పాటు ఆయా దేశాల సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ మొత్తం దందా మూడు దశల్లో కొనసాగుతోంది. తొలుత దొంగల నుంచి స్థానిక వ్యాపారుల వద్దకు చేరుతున్న సెల్ఫోన్లు, అక్కడి నుంచి మెట్రో నగరాలకు చేరుకుని ఆ తర్వాత దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఫస్ట్ స్టేజ్..⇒ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు కలిసి ముఠాలుగా ఏర్పడుతున్నారు. బస్సుల్లో, బస్టాపులు, వైన్ షాపులు, బహి రంగ సభలు జరిగే చోట్ల, ఇతర రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగిలిస్తున్నారు. ఈ చోరీ ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలోని కొందరు వ్యాపారులకు విక్రయి స్తున్నారు.ఈ ఫోన్లు అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు టెక్నీషియన్లు పని చేస్తుంటారు. వీళ్లు చోరీ ఫోన్లు అన్‌లాక్ చేయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపరింగ్ చేస్తారు. నగరంలో చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న వ్యాపారులు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ‘హోల్‌సేల్ వ్యాపారులకు’ కలిపి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఇక్కడ ఫోన్లు కొంటున్న వ్యాపారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఫోన్ల ఫొటోలను వాటిల్లో పోస్టు చేస్తున్నారు.థర్డ్ స్టేజ్..⇒ చోరీ సెల్ఫోన్లు సూడాన్, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లకు ఎక్కువగా వెళ్తు న్నాయి. విదేశీ వ్యాపారులు ఎంపిక చేసు కున్న సెల్ఫోన్లను ఇక్కడి వ్యాపారులు ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేస్తున్నారు. ఐదేసి ఫోన్లు చొప్పున తొలుత ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో పార్శిల్ చేస్తున్నారు. తర్వాత ఇలాంటి 20 నుంచి 25 బాక్సులను థర్మా కోల్ పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. సీ ఫుడ్‌గా చెబుతూ ఓడ రేవుల ద్వారా సూడాన్, శ్రీలంక దేశాలకు పంపిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు మాత్రం థర్మాకోల్ పెట్టె ల్లోనే పార్శిల్ చేసి సరిహద్దు గ్రామాలకు చెందిన వారి ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు.రెండు వైపులా ఉండే సరిహద్దు గ్రామాలకు చెందిన కమీషన్ ఏజెంట్లు ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారు. కోల్‌కతా నుంచి తమ వద్దకు వస్తున్న ఫోన్లను ఆవలి వైపు ఉన్న వారికి చేరవేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. దీనికోసం సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. వీరికి ఒక్కో ఫోన్‌కు దాని మోడల్ ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు కమీషన్‌గా లభిస్తోంది. సీ ఫుడ్ పేరుతో వెళ్తున్న థర్మాకోల్ బాక్సుల్ని తనిఖీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తు న్నారా? లేక స్మగ్లర్లతో మిలాఖత్ అయ్యారా? తేలాల్సి ఉందని నగర పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేయాల్సి ఉంటుందని, ఇప్పటివరకు తాము పట్టుకున్న ముఠాల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను ఆయా ఏజెన్సీలకు పంపిస్తామని పేర్కొంటున్నారు.సెకండ్ స్టేజ్..⇒ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఇతర నగరాలకు చెందిన వ్యాపారులు తమకు నచ్చిన, అవసరమైన సెల్ఫోన్లను ఆ ఫొటోల ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు. బేరసారాల తర్వాత ఇక్కడి వ్యాపారులు అక్కడి వారు కోరిన వాటిని పార్శిల్ చేసి తమ మనుషులకు ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని వ్యాపారుల వద్దకు చోరీ సెల్ఫోన్లు చేరుతున్నాయి. సూడాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఉన్న వ్యాపారులు, ఈ నగరాల్లోని వ్యాపారులకు ఉమ్మడి వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. వాటిలో పోస్టు అవుతున్న ఫొటోల ఆధారంగా విదేశీ వ్యాపారులు ఫోన్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు.వరుస అరెస్టులతో అదుపులోకి చోరీలు⇒ నగరంలో సెల్‌ఫోన్ చోరీలు పెరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఫోన్ల కోసం దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు హత్యలూ జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక అదేశాలు జారీ చేశారు. నగరంలో వ్యవస్థీకృతంగా సాగుతున్న సెల్‌ఫోన్ చోరీలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు ముఠాలను పట్టుకున్నారు.మే ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా«ధీనం చేసుకున్నారు. గత నెల మొదటి వారంలో ముగ్గురిని పట్టుకుని 43 సెల్ఫోన్లు సీజ్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల 31 మందిని అరెస్టు చేసి 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ వరుస అరెస్టులతో నగరంలో సెల్‌ఫోన్ చోరీలు అదుపులోకి వచ్చాయి. దీంతోనీ వ్యవస్థీకృత ముఠాల వెనుక ఉన్న వారిని గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ దిశగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని ఇద్దరు యువకుల దారుణహత్య
కడ్తాల్: వాట్సాప్ గ్రూపు లొల్లి ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందాయిపల్లికి చెందిన బీజేపీనేత జల్కం రవి ఇటీవల బటర్ ఫ్లై వెంచర్‌లోని ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నెల 4న సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులతో కలిసి రవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ ఫోటోలను రవి తన గ్రామా నికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గోవిందాయిపల్లికి చెందిన గుండెమోని శివగౌడ్(25), శేషగారి శివగౌడ్(27)లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో 5వ తేదీన సాయంత్రం రవి వీరిద్దరిని తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అప్పటికే రవి వద్ద బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్ ఉన్నాడు. నలుగురూ మద్యం తాగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను ఎందుకు తొలగించారు..? ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారు అని రవి ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికిలోనైన రవి, పల్లె రాజుగౌడ్ కత్తులలో దాడి చేసి గుండెమోని శివగౌడ్, శేషగారి శివగౌడ్‌ను చంపేశారు. అనంతరం విల్లాకు తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్ ఫ్లై సిటీలోని ఆ విల్లాకు వెళ్లి తాళం పగులగొట్టారు. లోపల రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. గుండెమోని శివగౌడ్ హైదరాబాద్‌లోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తుండగా, శేషుగారి శివగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తునట్టు తెలిసింది. యువకుల హత్యలకు వాట్సాప్ వివా దమే కారణమా.. మరేదైనా ఉందా..? అని గ్రామస్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం– హైదరాబాద్ జాతీ య రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రెండుగంటలకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం
ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు. ఇప్పుడా రోజులు పోయాయి. అక్కడక్కడా ఫెక్సీలున్నా అవన్నీ బడా నేతల దృష్టిలో పడేందుకు చోటా, మోటా లీడర్ల ప్రయత్నాల్లో భాగమే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాది కీలక పాత్ర. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్... రీల్స్, షార్ట్స్, మీమ్స్.. మాధ్య మమేదైనా సరే.. ఓటరు మానసిక స్థితిని ప్రభావితం చేసే మార్గాలే! అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. పార్టీలు తమ విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సోషల్ బాట పడుతున్నాయి... కరోనా తర్వాతి ప్రపంచంలో సమాచార సాధనంగా సోషల్ మీడియా పట్ల దృక్పథమే పూర్తిగా మారిపోయింది. డేటా–సేకరణ, విజువలైజేషన్ ప్లాట్‌ఫాం స్టాటిస్టికా ప్రకారం ఫేస్‌బుక్‌కు భారత్‌లో 36.7 కోట్ల యూజర్లున్నారు. వాట్సాప్‌కు 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వారి అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో వీటితో పాటు ఎక్స్, ఇన్‌స్టా, వాట్సప్ చానళ్లదీ కీలక పాత్రే. అందుకే పార్టీలు ప్రచారానికి సోషల్ ప్లాట్‌ఫాంలను ఎంచుకుంటున్నాయి. ఫేస్బుక్లో ప్రతి పార్టీకీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి దాకా ఓ పేజ్ ఉంది. ప్రతి రాజకీయ నాయకుడికీ ఓ సైన్యమే ఉంది. ఇక వాట్సాప్ గ్రూప్లకైతే కొదవే లేదు. ఇవి కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కులాలు, మతాలవారీగా ఎప్పుడో ఏర్పాటయ్యాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలనే ఆయుధంగా చేసుకుని బీజేపీ 2014లో అధికారంలోకి వచి్చంది. ఎక్స్‌లో ప్రధాని మోదీకి ఏకంగా 9.7 కోట్ల ఫాలోయర్లున్నారు. రాహుల్‌కు 2.5 కోట్ల మంది ఉన్నారు. పర్సనల్ అప్రోచ్.. ఎన్నికలంటే ఇంటింటికీ వెళ్లి ఓట్లగడం పాత పద్ధతి. ఇప్పుడంతా పర్సనల్ అప్రోచ్. బీజేపీ ఇటీవల వాట్సాప్ ఉన్న వాళ్లందరికీ ‘ప్రధాని నుంచి లేఖ’ పంపింది. కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని పౌరులను కోరింది. ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ’ అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది. మోదీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నదీ చెబుతూ వీడియో చేసి పెట్టడానికి వీలు కల్పించింది. సాధారణ పౌరుడిని ప్రధానే నేరుగా అభిప్రాయం కోరడం, ఓటేయడానికి కారణాన్ని అడిగి తెలుసుకోవడం కచి్చతంగా వారి అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మారుస్తుందన్నది బీజేపీ అంచనా. రాహుల్ గాంధీ వాట్సాప్ చానల్‌ను కాంగ్రెసే నిర్వహిస్తోంది. అందులో రాహుల్ ప్రజలతో సంభాíÙస్తారు. వారి ప్రశ్నలకు బదులిస్తారు. ఈ వాట్సాప్ సమాచారం సర్క్యులేషన్‌ను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎక్కువ వాట్సాప్ గ్రూపుల ద్వారా మరింత ఎక్కువ మంది ఓటర్లతో వేగంగా, మెరుగ్గా అనుసంధానం కావచ్చన్నది కాంగ్రెస్ భావన. ప్రభావశీలతపై సందేహాలూ.. సోషల్ మీడియా ప్రభావంపై అనుమానాల్లేకపోయినా ఓటర్లుగా ఫలానా పార్టీకి ఓటేసేలా ప్రభావితం చేయడంలో వాటి శక్తిపై మాత్రం సందేహాలున్నాయి. వాటి ప్రచారం తటస్థ ఓటర్ల వైఖరిలో మార్పు తేవచ్చేమో గానీ సంప్రదాయ ఓటర్లు, పార్టీ మద్దతుదారుల అభిప్రాయాలను ప్రభావితం చేయబోదని విశ్లేషకుల అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థి కులం, స్థానిక అనుబంధం, పార్టీకి విధేయత వంటివే సంప్రదాయ ఓటర్లను ప్రభావితం చేస్తాయంటున్నారు. అభ్యర్థి చరిష్మా, విశ్వసనీయత, పార్టీకి ప్రజాదరణ కూడా ఓటర్లను కదిలిస్తాయని విశ్లేషిస్తున్నారు. కీలకంగా ఇన్ఫ్లుయెన్సర్లు... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఎక్కువమందిని ఆకర్షించగల, ప్రభావితం చేయగల వ్యక్తులు. రీల్స్, షార్ట్స్ ప్రాచుర్యంతో వీరి ప్రాబల్యం మరింతగా పెరిగింది. ఎన్నికల్లో కూడా కీలక ప్రచారకర్తలుగా మారారు. సామాజిక మాధ్యమాల్లో 10,000 మంది ఫాలోయర్స్ ఉన్నవారిని ‘నానో’ ఇన్‌ఫ్లూయెన్సర్లని, లక్ష దాకా ఉంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, 10 లక్షలుంటే మాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, అంతకు మించితే మెగా ఇన్ఫ్లుయెన్సర్లని అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఇన్ఫ్లూయెన్సర్లు కీలకంగా మారారు. ముందున్న బీజేపీ.. 2024 సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరిగింది. పార్టీలు వారికి ప్రధాన ఖాతాదారులుగా మారుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ ముందుంది... ► ప్రభుత్వ పథకాలపై కంటెంట్ కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో కలిసి పని చేయడానికి నాలుగు ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు తెలిపారు. ఇదంతా బీజేపీకి లబ్ధి చేసేదే. ► వివిధ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్సర్లతో బీజేపీ 50కి పైగా సమావేశాలను ఏర్పాటు చేసింది. మోదీ నేతృత్వంలో మంత్రులు కూడా ప్రధాన చానళ్లకు బదులు పాడ్‌కాస్ట్ షోలు, యూట్యూబ్ చానళ్లలో కనిపిస్తున్నారు. ► ఎస్.జైశంకర్, స్మృతీ ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి కేంద్ర మంత్రులు యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లున్న పాడ్‌కాస్టర్ రణ్వీర్ అలహాబాదియాకు ఇంటర్వ్యూలిచ్చారు. కాంగ్రెస్‌దీ అదే బాట... ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వాడుకునే విషయంలో కాంగ్రెస్ కూడా ఏమీ వెనకబడి లేదు. భారత్ జోడో యాత్రలోనూ, తాజాగా ముగిసిన భారత్ జోడో న్యాయ్ యాత్రలోనూ వారిని బాగానే ఉపయోగించుకుంది... ► రెండు జోడో యాత్రల్లోనూ ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకే రాహుల్ ప్రాధాన్యమిచ్చారు. ► ‘అన్ ఫిల్టర్డ్ విత్ సమ్దీశ్’ యూ ట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ► ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పాడ్‌కాస్ట్ కర్లీ టేల్స్ వ్యవస్థాపకుడు కామియా జానీతో తన భోజనం తదితరాల గురించి పిచ్చాపాటీ మాట్లాడారు. ► రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన హయాంలో ‘జన్ సమ్మాన్’ వీడియో పోటీలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై సోషల్ ప్లాట్‌ఫాంల్లో 30 నుంచి 120 సెకన్ల వీడియోలు షేర్ చేసిన వారిలో విజేతలకు నగదు బహుమతులిచ్చారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యాప్తి సగటున 40 శాతం ఉందని అంచనా. ఆ లెక్కన 2 లక్షల ఓటర్లుండే అసెంబ్లీ స్థానంలో సోషల్ మీడియా ద్వారా కనీసం 70 నుంచి 80 వేల మందిని ప్రభావితం చేసే వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలాసార్లు విజేతను తేల్చడంలో ఐదారు వేల ఓట్లు కూడా నిర్ణాయకంగా మారుతున్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద సంఖ్యేనని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాను ఇప్పుడు ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. – అంకిత్ లాల్, అడ్వైజర్, పొలిటికో – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు వ్యవహారం టెక్ ప్రపంచంలో అలజడి సృష్టించింది. ఈ ఉదంతం మార్క్ జుకర్‌బర్గ్, డ్రూ హ్యూస్టన్లతో సహా 100 మందికి పైగా సిలికాన్ వ్యాలీ సీఈవోలు ఉన్న ప్రైవేటు వాట్సాప్ చాట్ గ్రూప్‌లో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్‌మన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్‌మన్ అనూహ్య తొలగింపు ఉదంతం.. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, డ్రాప్‌బాక్స్ సీఈవో డ్రూ హ్యూస్టన్‌తో సహా యూఎస్‌లోని పలు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల సీఈవోలను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. నవంబర్ 17న ఆల్ట్‌మన్‌ను ఓపెన్ఏఐ తొలగించినట్లు వార్తలు వెలువడినప్పుడు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన ఈ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక సందేశం వచ్చింది. ఇంతకీ ఏంటది? సీఈవోల వాట్సాప్ గ్రూప్‌లో ఆ రోజు "శామ్ అవుట్" అని ఓ సందేశం వచ్చింది. దీనిపై గ్రూప్ సభ్యులు వెంటనే స్పందించారు. శామ్ ఏమి చేశాడు.. అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఉన్నంటుండి తొలగించడానికి శామ్ ఆల్ట్‌మన్ చేసిన తప్పేంటి అనేదానికిపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్! ఓపెన్ఏఐ సంస్థకు అతిపెద్ద పెట్టుబడిదారైన మైక్రోసాఫ్ట్‌లో కూడా దీనిపై అలజడి చలరేగింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెవిన్ స్కాట్‌కి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి నుంచి కాల్ వచ్చినట్లు వాట్సాప్ చాట్‌లో ఉంది. ఆల్ట్‌మన్‌ను తొలగించినట్లు ఓపెన్ఏఐ బోర్డు ప్రకటించబోతోందని, తానే తాత్కాలిక చీఫ్‌గా ఉండనున్నట్లు ఆ కాల్లో ఆమె స్కాట్‌తో చెప్పినట్లు సందేశంలో పేర్కొన్నారు. దీంతో స్కాట్ వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్ చేశారట. ఆ సమయంలో ఆయన రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశంలో ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన సత్య నాదెళ్ల తక్షణమే ఓపెన్ఏఐ సీటీవో మీరా మురాటికి ఫోన్ చేసి బోర్డు నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీసినట్లు వాట్సాప్ సందేశాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో ఆయన ఓపెన్ఏఐ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ డీఏంజెలోకి కాల్ చేసి ఏం జరిగిందని అడిగినా కారణం తెలియరాలేదు. అయితే తమతో ఆల్ట్‌మన్ సమన్వయం సక్రమంగా లేదని మాత్రమే బోర్డు చెప్పినట్లు వాట్సాప్ సందేశాల సారాంశం. -
వాట్సాప్ గ్రూపులతో బందోబస్తు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించిన వాట్సాప్ గ్రూపుల విధానాన్ని.. ఇప్పుడు పోలీసులు ఎన్నికల బందోబస్తు, నిఘా కోసం అవలంబిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలతోపాటు స్థానిక సిబ్బంది పనిని ఈ గ్రూపులతో పర్యవేక్షిస్తున్నారు. పాయింట్ డ్యూటీలు, రూట్లలో ఉన్న సిబ్బంది తమ లొకేషన్, సెల్ఫీ ఫొటోలను గ్రూపుల్లో షేర్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఇక బందోబస్తు, భద్రత విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి బస, రవాణా, ఆహారం తదితరాల కోసం ఏర్పాట్లు చేశారు. ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో.. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ తరఫున ప్రచారం చేయడానికి, కాలనీలు, బస్తీల్లో జెండాలతో సంచరించడానికి చాలా మందిని నియమించుకున్నారు. వారికి రోజులు, వారాల లెక్కన చెల్లింపులు చేశారు. బృందాలుగా చేసి ప్రాంతాల్లో తిప్పారు. వారు తాము చెప్పిన చోటుకే వెళ్తున్నారా? స్థానికులను కలుస్తున్నారా? ప్రచారం చేస్తున్నారా? అన్నది పరిశీలించేందుకు వాట్సాప్ గ్రూపులను వాడారు. క్షేత్రస్థాయిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ లొకేషన్లు షేర్ చేసేలా, ప్రజలతో సెల్ఫీలు దిగిపోస్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇదే వ్యూహాన్ని బందోబస్తు, భద్రత చర్యల కోసం వచ్చి న అదనపు బలగాలను పర్యవేక్షించడానికి పోలీసు ఇన్స్పెక్టర్లు వాడుతున్నారు. కేంద్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక, సాయుధ బలగాలను పోలీసుస్టేషన్ల వారీగా కేటాయించారు. ఆయా పోలీస్స్టేషన్ల ఇన్స్సెక్టర్లే వారి విధులను పర్యవేక్షించాలి. ఎవరెవరు ఏ విధుల్లో ఉన్నారు? ఎక్కడ ఉన్నారన్నది సులువుగా తెలుసుకుని, పర్యవేక్షించేలా ఇన్స్పెక్టర్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. రూట్ పార్టీ ల్లో తిరుగుతున్న, పాయింట్ డ్యూటీల్లో ఉన్న సిబ్బంది కచ్చి తంగా తమ ఫొటోలు, లొకేషన్లను అందులో షేర్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా.. బందోబస్తు విధులంటే పోలీసులకు ఇబ్బందే. తాగడానికి నీళ్లుండవు, ఆహారం ఉండదు. కేటాయించిన ప్రాంతాన్ని వదిలి కదలడానికి లేదు. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లేందుకూ ఇబ్బందే. ఈసారి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సిబ్బంది రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి పాయింట్‌కు చేరడం కోసం, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడం కోసం వాహనాలు అద్దెకు తీసుకున్నారు. భోజనం, టీ, మంచినీళ్లుఅందేలా ఏర్పాట్లు చేశారు. -
కత్రినా క్రేజే వేరు.. ఏకంగా ఫేస్ బుక్ సీఈవోను వెనక్కి నెట్టి!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్‌స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్‌లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్, ప్రముఖ రాపర్ బ్యాడ్ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) ఇప్పటివరకు వాట్సాప్ ఛానెల్‌కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్‌ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానెల్‌ను ప్రారంభించింది. కొత్త ఛానెల్‌కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్ టాప్‌లో ఉంది. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
వివాదానికి కారణమైన వాట్సప్ గ్రూపులో ఫొటో పోస్టు
కర్నూలు: వాట్సాప్ గ్రూపులో ఫొటో పోస్టు చేసిన విషయం రెండు వర్గాల మధ్య దాడికి దారితీసింది. మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పీరుసాహెబ్ పేటలో ప్రతి ఏటా వినాయకుడిని ప్రతిష్ఠించి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. విగ్రహం వద్ద వడ్డె ఎల్లశ్రీనివాసులు, బోయ వెంకట మద్దిలేటి కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను వడ్డె ఓబన్న యూత్ వాట్సాప్ గ్రూపులో ఎల్లశ్రీనివాసులు పోస్టు చేశారు. వేరే కులస్తుడితో దిగిన ఫొటోను ఎలా గ్రూపులో పోస్టు పెడతావని అదే గ్రూపులో ఉన్న గ్రామానికి చెందిన సంపంగి శివకృష్ణతో పాటు మరికొందరు వడ్డె ఎల్లశ్రీనివాసులుతో సోమవారం వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మిడుతూరు ఏఎస్ఐ సుబ్బయ్య ఘటనా స్థలానికి వెళ్లి గొడవకు పాల్పడిన వారిని విచారించారు. జరిగిన ఘటనపై మంగళవారం ఉదయం స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఎల్లశ్రీనివాసులు, రమణమ్మ, వెంకటనరసమ్మ, మహేశ్వరమ్మ మిడుతూరుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన కుంచెపు మద్దిలేటి, కుంచెపు బొబ్బిలితో పాటు మరికొందరు ఫిర్యాదుదారులపై స్టేషన్లో దాడికి దిగారు. ఈ ఘటనలో ఫిర్యాదుదారులకు గాయాలు కావడంతో పాటు స్టేషన్ జీపు అద్దాలు సైతం ధ్వసమయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు మిడుతూరు సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. విషయం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్ఐ నాగార్జున స్టేషన్‌కు చేరుకుని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనపై ఇరువర్గాలకు చెందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లశ్రీనివాసులు వర్గానికి చెందిన మాధవస్వామి ఫిర్యాదు మేరకు 11 మంది( సంపంగి శివకృష్ణ, కుంచెపు రామకృష్ణ, వెంకటరమణ, మద్దిలేటి, బొబ్బిలి, మధుకుమార్, మధుగోపాల్, మధుమోహన్, మధుక్రిష్ణ, శివమధు, మహేశ్వరి)పై, ప్రత్యర్థి వర్గానికి చెందిన రాములమ్మ ఫిర్యాదు మేరకు ఐదుగురి (ఎల్లశ్రీనివాసులు, మహేశ్వరి, రాజు, అంజి, మారెమ్మ)పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. -
ఖమ్మం జిల్లా కల్లూరులో ఎస్ఐ Vs హోంగార్డు..
కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన హోంగార్డు సిరసాని రాంబాబు(సస్పెన్షన్‌లో ఉన్నారు) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా జిల్లా హోంగార్డుల వాట్సాప్ గ్రూప్‌లో శుక్రవారం మెసేజ్ పెట్టడం పోలీసు శాఖలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ మృతి విషయం మరువకముందే.. ఈ మెసేజ్ పెట్టడం, విషయం ఆనో టా ఈనోటా బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో సిరసాని రాంబాబుతో ‘సాక్షి’మాట్లాడగా, హోంగార్డులు పని భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, చాలీచాలని జీతంతో ఇబ్బందిపడుతున్నారని వాపోయాడు. కల్లూరులో భూమి విషయంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కొందరు తన తల్లిదండ్రులపై ఫిబ్రవరి 10న దాడి చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయాన వేరే ప్రాంతంలో ఉన్న తాను ఫిబ్రవరి 28న ఎస్ఐ పి.రఘుతో కేసు విషయమై మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్ప డమేకాక ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహ త్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆరోపణల్లో వాస్తవం లేదు: ఎస్ఐ సస్పెండ్ అయిన హోంగార్డు సిరసాని రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కల్లూరు ఎస్ఐ పి.రఘు స్పష్టం చేశారు. భూమి అక్రమంగా ఆయనే ఆక్రమించాడని, ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయన్నారు. గతంలో తోటి హోంగార్డును కొట్టి సస్పెండ్ అయ్యి జైలుకు వెళ్లి రాగా, కొంత కాలానికి విధుల్లో తీసుకున్నట్లు తెలిపారు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోగా, మద్యం సేవించి విధులకు వస్తుండడంతో సస్పెండ్ చేశారని వెల్లడించారు. -
పోలీసులకు వాట్సాప్ గ్రూప్
సాక్షి, చైన్నె: పోలీసులకు ఉపయోగకరంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుకు డీజీపీ శంకర్ జివ్వాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో తమిళనాడు పోలీసు సంక్షేమం పేరిట ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీజీపీ, ఏడీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, కమిషనర్ల స్థాయి అధికారులు ఉంటారు. అలాగే నగరస్థాయిలో అదనపు కమిషనర్ల నేతృత్వంలో డీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులతో గ్రూప్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే డీసీపీ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు, అదనపు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు, తమ పరిధిలోని పోలీసులు ఈ గ్రూప్‌లో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎస్పీ, డీఎస్పీల నేతృత్వంలో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేయడానికి డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని డీజీపీ నుంచి ఆయా అధికారులు, ఆ తదుపరి స్థాయిల్లో ఉన్నవారికి చేర వేస్తారని పేర్కొన్నారు. -
TS: ‘గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్స్’.. పోలీసుల వినూత్న కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గతేడాది 19,456 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 6,746 మంది మరణించగా.. 18,413 మంది క్షతగాత్రులయ్యారు. మరణించిన వారిలో 50% మంది గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స అందించకపోవటం వల్లే మృత్యువాత పడ్డారు. గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు వైద్య సహాయం అందించగలిగితే 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో గోల్డెన్ అవర్‌కు ఉన్న ప్రాధాన్యత, ఆ సమయంలో ప్రథమ చికిత్స ఆవశ్యకతను తెలంగాణ ట్రాఫిక్ పోలీసు విభాగం విశ్లేషించింది. రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ‘గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌ల’పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్స అందించి, స్థానిక ఆసుపత్రికి తరలించడమే ఈ గ్రూప్‌ల లక్ష్యం. గోల్డెన్ అవర్ అంటే.. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. అంబులెన్స్ చేరుకొని, ఆసుపత్రికి తరలించే లోపు క్షతగాత్రులకు వైద్య సహాయం అందించినట్లయితే ప్రమాద తీవ్రతను బట్టి గాయాల తీవ్రత తగ్గేందుకు, ప్రాణాపాయం తప్పేందుకు అవకాశం ఉంటుంది. మన దేశంలో గోల్డెన్ అవర్‌కు మోటారు వాహన చట్టం–1988లోని సెక్షన్ 2 (12 ఏ) కింద చట్టపరమైన గుర్తింపు కూడా ఉంది. గుడ్ సామరిటన్స్కు శిక్షణ ఒంటరిగా వాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై గాయపడితే.. తనంతట తానుగా లేచి ప్రథమ చికిత్స చేసుకొని, ఆసుపత్రికి వెళ్లలేని స్థితిలో ఉంటాడు. ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా క్షతగాత్రుడికి సహాయం చేసేవాళ్లను ‘గుడ్ సామరిటన్స్’గా పిలుస్తారు. అయితే కొన్ని సందర్భాలలో ‘గుడ్ సామరిటన్స్ అందించే ప్రథమ చికిత్స వల్ల క్షతగాత్రుడికి మరింత ఇబ్బందులు, కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా జరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా గుడ్ సామరిటన్స్కు రోడ్డు ప్రమాద బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్నిచోట్ల శిక్షణ ప్రారంభమైంది. అలాగే ఎస్పీలు, డీసీపీల ఆధ్వర్యంలో గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి ఈ గుడ్ సామరిటన్స్ను సభ్యులుగా చేర్చుకుంటున్నారు. గ్రూప్‌లో ఎవరెవరుంటారు? రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా ఆ చుట్టుపక్కలవారే స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల వెంబడి దాబాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు, కిరాణా దుకాణాలు, టీ స్టాళ్ల నిర్వాహకులు, ఎన్జీవోలకు చెందిన వారిని గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక ట్రాఫిక్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వీరి ఎంపిక బాధ్యత తీసుకుంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా ఇప్పటివరకు 800కు పైగా గుడ్ సమారిటన్స్కు శిక్షణ ఇచి్చనట్లు ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన కలి్పంచడంతో పాటు బీఎల్ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్ట్), సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వంటి ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వీరు ఏం చేస్తారంటే.. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు అధిక రక్తస్రావం కాకుండా కట్టుకట్టడం, సీపీఆర్ వంటి ప్రథమ చికిత్స అందిస్తారు. పోలీసులు, బాధితుల కుటుంబాలకు సమాచారం అందించి, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చుతారు. అలాగే ఏదైనా వాహనం అతివేగంగా వెళ్తున్నట్లు గుర్తిస్తే.. వెంటనే ఆ ప్రాంతం, వాహనం నంబరు వివరాలను గోల్డెన్ అవర్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. స్థానిక పోలీసులు వెంటనే స్పందించి ఆ వాహనాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రాహుల్, ఖర్గే ఏం చెప్పారు? -
‘టీడీపీ కనిగిరి’ వాట్సప్ గ్రూప్‌లో అసభ్యకర పోస్టింగ్
కనిగిరి రూరల్: టీడీపీ కనిగిరి పేరుతో వాట్సప్ గ్రూప్‌లో తీవ్ర అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడంపై కనిగిరిలో కలకలం రేపింది. ఈ గ్రూప్‌లో పట్టణానికి చెందిన ఓ యువకుడు, యువతి ఫొటో పెట్టి పక్కన పలువురు మహిళలతో పాటు, వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధుల తల ఫొటోను మార్ఫింగ్ చేసి చాలా అసభ్యకరంగా పోస్టింగ్ చేశారు. దీనిపై పట్టణంలో జోరుగా చర్చ సాగింది. అయితే ఈ గ్రూప్ డీపీ లోగోలో ఒకరి ఫొటోలు ఉండగా, గ్రూప్ అడ్మిన్లుగా వేరే వ్యక్తుల పేర్లు పెట్టారు. దీంతో ఆ గ్రూప్‌లో అడ్మిన్‌గా కనిపిస్తున్న వ్యక్తి (ఓ టీవీ రిపోర్టర్ కావడంతో) వెంటనే స్పందించాడు. తనకు ఈ గ్రూప్‌నకు ఎటువంటి సంబంధం లేదని, భాను అనే పేరుగల వారు తనను గ్రూప్‌లో యాడ్ చేసి అడ్మిన్ చేశారని, వారిపై తాను పోలీస్ కేసు పెడుతున్నట్లు గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు. సభ్యులంతా గ్రూప్‌లో నుంచి లెఫ్ట్ కావాలని ఆ పోస్ట్‌లో కోరాడు. ఈ ఘటనపై పోలీసులు రహస్య విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై కనిగిరి ఎస్సై దాసరి ప్రసాద్‌ను వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
ఏంటిది బ్రో.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆ ఫోటో పెట్టి.. అడ్డంగా బుక్ అయ్యావ్!
మా పిల్లలు బుద్ధిమంతులు, చెడు అలవాట్లు లేవు.. ఇది తల్లిదండ్రులకు వారి పిల్లలపై ఉన్న నమ్మకం. అంతెందుకు ఇరుగు పొరుగు, బంధువులు దగ్గర కూడా ఇలానే చెప్పడం మనం చూసే ఉంటాం. ఇక కొందరైతే ఇంట్లో సైలెంట్‌గా బయట వైలెంట్‌గా ప్రవర్తిస్తుంటారు. కానీ ఏది ఏమైనా ఏదో ఒక రోజు అసలు బండారం మన పేరెంట్స్‌కి తెలిసి తీరుతుంది. తాజాగా ఓ కుర్రాడు ఇదే తరహాలోనే అడ్డంగా బుక్ అయ్యాడు. యువతలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో చెన్నై, ముంబై, ఆర్సీబీ వంటి టీమ్‌లకు ఫ్యాన్స్ ,ఫాలోవర్స్ ఎక్కవనే చెప్పాలి. ఇక తమ అభిమాన జట్టు గెలిస్తే ఆ ఆనందంతో సంబరాలు జరుపుకోవడం సహజమే. తాజాగా ఓ యువకుడు బీర్ తాగుతూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతటి ఆగక వెంటనే ఆ బీర్ టిన్ ఫోటో తీసి "ముంబయి గెలుస్తుంది...లెట్స్ గో" అని వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అయితే ఇక్కడే ఓ పొరపాటు జరిగిపోయింది. అతను తన ఫ్రెండ్స్ గ్రూప్‌లో అనుకుని ఫోటోని ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేశాడు. ఇంకేముంది...ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఇది చూసి ఖంగుతిన్నారు. "నీకు తాగే అలవాటుందా..? ఇదేంటి..?' అని అతన ప్రశ్నించారు. మరోవైపు ఆ ఫోటోని వెంటనే డిలీట్ చేయాలని సానియా తన సోదరుడిని కోరింది. దీంతో అతను తొందర్లో డెలీట్ ఫర్ ఎవరీ వన్ అనే ఆప్షన్ కాకుండా డెలీట్ ఫర్ మీ అనే దాన్ని క్లిక్ చేశాడు. ఇంకేముంది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తరవాత పెద్ద రచ్చ జరిగింది. ఆ కుర్రాడి అన్న ఈ ఛాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని ట్విటర్లో షేర్ చేశాడు. "మా తమ్ముడు చేసిన పని ఇది" అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. " ఏంటి బ్రో తాగితే తాగావ్..ఆ ఫోటోలు అవసరమా" అని ఆ కుర్రాడికి క్లాస్ పీకుతున్నారు. ఇంకొందరైతే "సెల్ఫ్ డ్యామేజ్ ఎలా చేసుకోవాలి అనే కోర్స్ చేసుంటాడు" అని ఫన్నీగా స్పందిస్తున్నారు. No way my brother sent this on the family group 😭 pic.twitter.com/FKnrcYiu3K — Saniya Dhawan (@SaniyaDhawan1) May 26, 2023 చదవండి: మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ! -
Tenth Class Exam Paper Leak: వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ పేపర్ చక్కర్లు.. లీక్?!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేపర్ లీక్‌ల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులో ప్రశ్నాపత్రం సర్క్యూలేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న టెన్త్ పేపర్‌పై పోలీసులు, విద్యాశాఖ ఆరా తీస్తోంది. పేపర్ ఎలా లీక్ అయ్యింది అని దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫొటో తీశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
గ్రూపుల్లోనే గూడుపుఠాణి!.. మాస్ కాపీయింగ్‌లో వాట్సాప్ గ్రూపులే కీలకం!
సాక్షి, సిటీబ్యూరో: టోఫెల్, జీఆర్ఈ తదితర పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముఠాలకు సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టు ఆదేశాలతో జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఇంకా అరెస్టు కావాల్సిన సంఖ్య 19గా పేర్కొన్నారు. ఈ నివేదికలో కేసుకు సంబంధించిన ఆసక్తికర అంశాలను పొందుపరిచారు. బ్యాచులర్ రూములే అడ్డాలు.. ఆన్లైన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కోసం అనేక ముఠాలు పని చేస్తున్నాయి. వీటిలో గుణ శేఖర్, శ్రావణ్లకు చెందినవి ఉన్నాయి. ఇవి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న బ్యాచులర్స్ రూములే అడ్డాగా ఈ దందా చేస్తున్నాయి. ఆ యువకులకు గంటల లెక్కన అద్దె చెల్లిస్తూ అక్కడే తాత్కాలిక కంప్యూటర్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాయి. గుణ శేఖర్‌కు నగరం నడిబొడ్డున పది రూమ్స్ ఉండగా... శ్రావణ్ గ్యాంగ్‌కు శివార్లలో 13 వరకు ఉన్నాయి. తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారిని పరీక్ష రాయడానికి ఇక్కడికే పిలిచే వాళ్లు. ఈ సూత్రధారులు టోఫెల్, జీఆర్ఈ పరీక్షల్లో ఉండే సబ్జెక్టులను అనుగుణంగా ఎక్స్‌పర్ట్స్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. ఒక్కో సజ్జెక్టుకు కనీసం ఐదుగురు చొప్పున నిపుణులతో ఒప్పందం చేసుకుని వారితో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాయి. ‘బయటకు–లోపలకు’ వీటి ద్వారానే.. పరీక్ష జరిగే సమయంలో ఏమాత్రం గందరగోళానికి ఆస్కారం లేకుండా వీళ్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే గ్రూపు కాకుండా ఒక్కోదానికి ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. గణితం కోసం ‘జోరో జోరో’ పేరుతో, ఫిజిక్స్‌కి ‘దేశీ బాయ్స్’ పేరుతో ఇవి పని చేశాయి. అభ్యర్థి పరీక్ష రాసే గదిలోనే ఈ ముఠాకు చెందిన వ్యక్తి రహస్యంగా దాక్కుని ఉండేవాడు. కెమెరా కంట పడకుండా కూర్చుకుని తెరపై కన్న ప్రశ్న పత్రాన్ని తన సెల్ఫోన్లో ఫొటో తీసేవాడు. ఏ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలను ఆ గ్రూపులో పోస్టు చేసేవాడు. దీని చూసే ఎక్స్పర్ట్స్ తక్షణం స్పందించి సమాధానాలు అదే గ్రూపులో పోస్టు చేయడం, దాన్ని కను సైగలు, వేళ్ల కదలికల ద్వారా పరీక్ష రాసే అభ్యర్థికి ముఠా సభ్యుడు అందించడం నిమిషాల్లో జరిగిపోయేవి. మరికొన్ని ముఠాలు ఉన్నట్లు గుర్తింపు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం మండల శ్రావణ్ కుమార్, మండల సాయి సంతో‹Ù, పి.కిశోర్, ఎ.కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. వీరిలో అమెరికాలో ఉన్న గుణశేఖర్‌తో కలిసి కిషోర్ పని చేయగా.. మిగిలిన ముగ్గురూ మరో విడిగా ముఠా కట్టి మాస్ కాపీయింగ్ కథ నడిపారు. ఇలాంటి గ్యాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీరిలో జ్యోతిరాదిత్య (వైజాగ్), తేజేందర్ రెడ్డి (గుంటూరు), హైదరాబాద్‌కు చెందిన అభిజిత్ రెడ్డి, బోలిశెట్టి భాను తేజ, వినీత్ రెడ్డి, సూర్య వంశి, మండా విశ్వక్సేన్ రెడ్డి, బడిని రవి కుమార్, సతీ‹Ù, కిక్ బౌస్కీ, సుద్ని సాయి కిరణ్ రెడ్డి, దినే‹Ù, సాయి కిరణ్ రెడ్డి, కిషక్షర్ కుమార్, అభి, యువ, తేజ రెడ్డిలతో పాటు అమెరికాలో ఉన్న గుణ శేఖర్‌ను పరారీలో ఉన్న నిందితులుగా పేర్కొన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
బాధితుడికి టీడీపీ నేత బెదిరింపులు
చంద్రగిరి(తిరుపతి జిల్లా)/ఒంగోలు టౌన్: తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడిపై టీడీపీ నేత బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘నువ్వు ఎవరి దగ్గరకు వెళ్లినా నన్నేమీ చేయలేవు.. నీ అంతు చూస్తా’ అంటూ తీవ్ర పదజాలంతో బెదిరించాడు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ బాధితుడు సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. కాకినాడకు చెందిన టీడీపీ నేత మనోహర్‌చౌదరి ‘యువగళం మనకోసం’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. అందులో రుణాలు ఇస్తానని నమ్మబలికి.. తిరుపతి జిల్లా పనపాకం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.43 లక్షలు కాజేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్‌చౌదరి తనకు సోమవారం ఫోన్ చేసి ‘నీ ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు నావద్దే ఉన్నాయి. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. పోలీసు అధికారులు నా చేతిలో ఉన్నారు. నా మనుషులు నీ గ్రామానికే వచ్చి అంతు చూస్తారు. నీకు జీతం రాకుండా అడ్డుకుంటా.. ఈనెల 10లోపు నోటీసులు కూడా పంపిస్తా. ఏ నాయకుడు కూడా నన్ను ఏమీ చెయ్యలేడు. నా నెట్వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తా’ అంటూ బెదిరించాడని బాధితుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. మనోహర్‌చౌదరికి చెందిన రెండు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ‘టీడీపీ 2024 టార్గెట్’ పేరుతో ఒంగోలులో కుచ్చుటోపీ వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి మనోహర్ చౌదరి చేసిన మోసాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ‘టీడీపీ 2024 టార్గెట్’ అనే పేరుతో మరో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసిన మనోహర్ చౌదరి.. రూ.5 లక్షల వరకు రుణాలిస్తామంటూ ఆశపెట్టి పలువురిని మోసం చేశాడు. ఒంగోలులోని వేంకటేశ్వర కాలనీకి చెందిన ఎంఏ సాలార్ ‘టీడీపీ 2024 టార్గెట్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ గ్రూప్ అడ్మిన్ అయిన మనోహర్‌చౌదరి శ్రీసాయి మైక్రోఫైనాన్స్ పేరుతో రూ.5 లక్షల వరకు రుణాలిస్తానని గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు. దీంతో సాలార్.. మనోహర్‌ను సంప్రదించాడు. అతని నుంచి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్న మనోహర్‌చౌదరి.. వివిధ ఫీజుల పేర్లతో రూ.43వేలకు పైగా వసూలు చేశాడు. మరో రూ.30 వేలు అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు తన డబ్బులు ఇచ్చేయాలని మనోహర్‌చౌదరిని నిలదీశాడు. దీంతో సాలార్‌ను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఇటీవల ఒంగోలు తాలూకా సీఐకి ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
'యువగళం మనకోసం' వాట్సాప్ గ్రూపులో ఘరానా మోసం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): యువగళం పేరుతో ఓ వైపు నారా లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే.. ఆయన అనుచరులు అదే పేరుతో వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి మోసాలకు తెగబడుతున్నారు. అలాంటి గ్రూప్‌లో మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి యువగళం మనకోసం వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. గ్రూప్ సభ్యులకు రూ. 2 లక్షల వరకూ లోన్ ఇస్తానంటూ గత నెల 29న కాకినాడకు చెందిన అడ్మిన్ మనోహర్ చౌదరి గ్రూపులో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితుడు తనకు లోను కావాలంటూ మెసేజ్ చేశాడు. 30వ తేదీన మనోహర్ చౌదరి బాధితుడికి ఫోన్ చేసి లోన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 3,800 చెల్లించాలని కోరడంతో బాధితుడు గూగుల్ పే ద్వారా చెల్లించాడు. తనకు రూ. 15 వేలు పంపిస్తే లోను మంజూరు చేస్తానని మనోహర్ చౌదరి మరోసారి చెప్పగా బాధితుడు మళ్లీ గూగుల్ పే ద్వారా చెల్లించాడు. ఇలా మాయమాటలు చెప్పి బాధితుడి వద్ద నుంచి మనోహర్ చౌదరి మొత్తం రూ. 1.43 లక్షలు కాజేశాడు. ఇంత చెల్లించినా ఇంకో రూ. 15 వేలు పంపమని చెప్పడంతో బాధితుడు ఎదురుతిరగగా.. మనోహర్ చౌదరి బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించాడు. తక్షణమే స్పందించిన పోలీసులు మనోహర్ చౌదరికి చెందిన 2 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. మోసగాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అంటే తనకు అభిమానమని, తనకు వచ్చిన లింక్ ద్వారా యువగళం మనకోసం గ్రూపులో సభ్యుడిగా చేరానని బాధితుడు తెలిపాడు. గ్రూపు అడ్మిన్ మనోహర్ చౌదరి తనను మోసం చేయడమే కాకుండా.. తననే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని వాపోయాడు. -
లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల
వాష్టింగన్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఇంట మాత్రమే కాదు.. విదేశాల్లోనూ లక్షల మంది ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని వాషింగ్టన్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అగ్రరాజ్యంలో వేలమంది భారతీయ ఐటీ ఉద్యోగులు.. లే ఆఫ్స్ బారిన పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీలతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లోనూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కమిట్మెంట్ల కారణంగా తిరిగి స్వదేశానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు బాగా కష్టపడుతున్నారు. ఇక వీసా చిక్కులతో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. ఈ లోపే కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణలో మునిగిపోయారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు లే ఆఫ్స్ బారినపడి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. అయితే అందులో 30 నుంచి 40 శాతం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి. వాళ్లలో ఎక్కువగా హెచ్1బీ, ఎల్1 వీసాల మీద వెళ్లిన వాళ్లే ఉన్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగాల వేటకు.. వాట్సాప్ గ్రూపు ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లు.. వర్క్ వీసాల కింద డెడ్లైన్లు ముందు ఉండడంతో కొత్త జాబ్‌ను వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. ఉద్యోగాలు పొగొట్టుకున్న ఉద్యోగుల్లో కొందరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎనిమిది వందల మందితో ఉన్న ఓ గ్రూప్ అందుకు నిదర్శనం. ఇక వీళ్ల కష్టాలను చూసి జిట్‌ప్రో(GITPRO), ఫిడ్స్(FIIDS) రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఓ ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను వాళ్ల కోసం ఏర్పాటు చేశాయి. ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ప్లాట్‌ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పరిస్థితి వర్ణనాతీతంగా ఉండడంతో ఉద్యోగులు సైతం తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని కొందరు ఉద్యోగుల గోడు వెల్లబోసుకోగా.. వాళ్ల వ్యథలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ రెండు వీసాలు ఎవరికంటే.. H-1B వీసా అనేది వలసేతర వీసా. అమెరికన్ కంపెనీలు తమకు అవసరమయ్యే టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను(విదేశీ ఉద్యోగులను) నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇక ఈ వీసా కింద భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అక్కడి బడా కంపెనీలు.హెచ్ 1 బీ వీసా జాబ్ పోతే గనుక.. 60రోజుల్లోగా హెచ్-1బీ స్పాన్సరింగ్ ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక L-1A, L-1B వీసాలు.. కంపెనీలు తాత్కాలిక బదిలీల మీద పంపిస్తుంటాయి. మేనేజెరియల్ పొజిషన్స్ లేదంటే ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉద్యోగుల విషయంలో ఈ వీసాలు ఎక్కువగా ఇస్తుంటారు. -
కాంగ్రెస్ లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం
-
ఇక సెలవు.. ఉంటా మరి..! టీ కాంగ్రెస్ నేతలకు బై చెప్పిన మాణిక్కం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను నియమించింది. ఇదిలా ఉండగా, టీ కాంగ్రెస్‌లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది. లేదు.. వాట్సాప్ గ్రూప్‌లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు వాదించారు. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు తెలిపారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను పంపించి.. ఆ స్థానంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను అధిష్ఠానం నియమించింది. ఠాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయ్యే ముందు.. ఈ రోజు వరకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. -
పెళ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్.. కార్డులిచ్చే రోజులు పోయాయి..
సాక్షి వరంగల్: మా ఇంట్లో పెళ్లికి రండి.. అంటూ ఆప్యాయమైన పెళ్లి పత్రిక పలకరింపు మారింది. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇళ్లకు తిరుగుతూ.. బొట్టు పెట్టి మరీ పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెళ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. దూరంగా ఉన్న ఊళ్లకు ప్రింట్ చేయించిన కార్డులను ఇంటి.. నాయీబ్రాహ్మణుడు లేదా రజకులకు ఇచ్చి పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. మారుతున్న కాలం.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా 200 కార్డులు.. అంతకన్నా కొంచెం ఎక్కువ.. తక్కువగా ప్రింట్ చేయించడం.. సోషల్ మీడియా ద్వారా బంధువులు, స్నేహితుల గ్రూపు తయారు చేసి అందులో కార్డు పెట్టి పిలిచే విధానానికొచ్చింది. వాట్సాప్‌లో కార్డు పెడుతున్నారు. కొందరికి ఫోన్ చేసి పెళ్లికి రండి అని సెలవిస్తున్నారు. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి పిలుపులు ప్రస్తుతం ఎలా మారాయో చూద్దాం.. పెళ్లికార్డు.. పిలుపు ఇలా.. నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై ఓరచూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. పెళ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా.. ఫొటోసూ్టడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. తాజాగా ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెళ్లి పత్రికను(పెళ్లి ఫైల్ అనాలి మరి..) ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక వివరాలతో చివరగా ‘డేట్ సేవ్ చేసుకోండి’ అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్ గ్రూప్ కాల్ చేసి.. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం.. అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది. వాట్సాప్ గ్రూపులో పెళ్లి సందడి.. బ్రాహ్మణుడు లగ్న పత్రిక రాసింది మొదలు.. పెళ్లి సందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెళ్లి తేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్.. పెళ్లి జరుగుతున్న వారి ఇంటి పేరుతో క్రియేట్ చేస్తారు. అందులో దగ్గరి, దూరపు బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ ఫొటోలను అందులో అప్లోడ్ చేయడం.. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయింది. ఆ ఫొటోలు చూసిన గ్రూపులోని వారు సైతం మరీ గుర్తు చేసుకుని తాము కూడా పెళ్లికి వెళ్లాలనే ఆతృత వారిలో పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 200 కార్డులే.. కరోనా ముందు వరకు ఓ ఇంట్లో పెళ్లి జరిగితే దాదాపు వెయ్యి కార్డుల వరకు ఆహ్వాన పత్రికలు ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు 200 వరకు ప్రింట్ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. డిజైన్ చేసిన పెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్ తగ్గించారు. – బోడకుంట్ల సంపత్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, వరంగల్ సైకిల్‌పై వెళ్లి ఇచ్చాం.. మా నాన్న వాళ్లు సైకిళ్లపై.. దూరమైతే బస్సుల్లో వెళ్లి పెళ్లి కార్డులు ఇచ్చి వచ్చేవాళ్లు. ఎడ్ల బండిపై కూడా వెళ్లి పంచేవాళ్లు. కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే ఇప్పుడైతే గ్రామం వరకే పరిమితమైంది. కొందరికి పెళ్లి కార్డులు లేదంటే ఇంటింటికి వెళ్లి చెప్పి వస్తున్నాం. పెళ్లింటి వారే వాట్సాప్‌లలో కార్డులు పంపుతున్నారు. – పంతంగి రజనీకాంత్, రజక కులపెద్ద, ధర్మారావుపేట ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత.. పెళ్లి పనులన్నీ ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది కత్తిమీద సాముతో కూడుకున్న పని. అయినా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి పత్రికలు ఇవ్వడం.. పెళ్లి పనుల ఒత్తిడిలో పడి కొందరికి కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోతుంటాం. అందుకే.. వాట్సాప్ ద్వారానే ప్రతి ఒక్కరికి పెళ్లి కార్డులు పంపించాం. వీడియో ప్రోమోలు కూడా సెండ్ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెళ్లి కార్డుల పంపిణీకి నెలరోజుల ముందు నుంచే బాగా కసరత్తు చేసేవాళ్లం. ఇప్పుడు కాస్త సులువైంది. – గంగధార మురళి, తండ్రి నెలరోజుల ముందు నుంచే.. గతంలో నెల రోజుల ముందే పెళ్లి కార్డులు మాకు ఇచ్చేవారు.. రజక, నాయీబ్రాహ్మణుల సహాయంతో తమ బంధువులు ఉండే ఊర్లకు పంపించి పెళ్లి కార్డులు ఇచ్చేలా చూశాం. వారికి తలా కొన్ని కార్డులు ఇచ్చి ఏ ఊరికి పోవాలో చెప్పేవాళ్లం. కొన్ని సందర్భాల్లో కార్డు తీసుకునేవారు ఇంటి వద్ద లేకపోతే పక్క ఇంటివారికి ఇచ్చి మళ్లీ వచ్చాక ఇవ్వమని చెప్పిన సందర్భాలున్నాయి. సొంత ఊరిలో కుల బంధువుల ఇంటికి వెళ్లి వారి దర్వాజకు బొట్టు పెట్టి, ఆ ఇంట్లో వారికి కూడా బొట్టు పెట్టి పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించాం. ఇప్పటికీ ఊళ్లలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్ అంట.. అందులో కార్డులు పంపిస్తుండ్రు. – కె.లచ్చమ్మ, బంధనంపల్లి, రాయపర్తి మండలం -
వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్ ఫీచర్ ఇంకా...!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరో బంపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లకు యాండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్టఫోన్లలో 'పోల్స్' ఫీచర్‌ను జోడించింది. ఇంతకు ముందు, వినియోగదారులు ప్రత్యక్ష చాట్లు, గ్రూపు సంభాషణలలో పోల్‌లను నిర్వహించడానికి థర్డ్ పార్ట్ యాప్‌ల ద్వారా క్రియేట్ చేసిన పోల్ లింక్‌లను షేర్ చేయాల్సి వచ్చేది. ఇపుడు ఆ అవసరం లేకుండానే ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్ మెసేజెస్‌లో పోల్ నిర్వహించేందుకు అనుమతినిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలోఉన్న వాట్సాప్‌లో పోల్‌లను ఎలా సృష్టించాలో ఒకసారి చూద్దాం. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) ఇదీ చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే? ఐఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్ బాక్స్‌కు ఎడమ వైపున ఉన్న ప్లస్ (+) గుర్తుపై నొక్కండి ♦ 'పోల్' ఎంపికపై నొక్కండి. పోల్‌కు సంబంధించిన ♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను టైప్ చేసి, ఆ తర్వాత ఆప్షన్స్‌ను టైప్ చేయండి ♦ ఆ తరువాత చాట్‌లో పోల్‌ను షేర్ చేయడానికి సెండ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఎంపికపై నొక్కండి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్‌ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్బాక్స్కు కుడి వైపున ఉన్న పేపర్ క్లిప్ ఐకాన్‌ను ఎంచుకోవాలి. ♦ 'పోల్' ఎంపికపై క్లిక్ చేయండి. ♦ పోల్‌కు సంబంధించిన ప్రశ్నను, ఆప్షన్స్‌ను టైప్ చేయాలి. ♦ ఆ తర్వాత, చాట్‌లో పోల్ సెండ్ చేస్తే సరిపోతుంది. (దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్) యూజర్లు పోల్‌లో గరిష్టంగా 12 ఆప్షన్స్‌ను జోడించవచ్చు. రైట్ సైడ్‌లో ఉన్న హాంబర్గర్ సహాయంతో, వినియోగదారులు ప్రతిస్పందనల క్రమాన్ని మార్చు కోవచ్చు. అంతేకాదు ఇతర పోల్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, వాట్సాప్ పోల్స్ క్రియేట్ అయితన తర్వాత వినియోగదారులు ఎప్పుడైనా ఓటు వేయవచ్చు. ఎపుడు ఓటు వేస్తే అపుడు ఆటోమేటిగ్గా అప్డేట్ అవుతుంది. గ్రూపు సభ్యులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయవచ్చు. అలాగే వ్యూ వోట్స్ ఆప్షన్ ద్వారా ఎవరు ఎన్ని ఓట్లు వేసింది, ఎవరు ఏయే ఆప్షన్‌ను ఎంచుకున్నారు అనేది కూడా చూడవచ్చు. పాస్వర్డ్ లేదా పిన్ స్క్రీన్ లాక్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప పరీక్షిస్తోంది. డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసి మర్చిపోయేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ మీద వాట్సాప్ యాప్‌ను ఓపన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిందే. తద్వారా యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత కల్పిస్తోంది సంస్థ, త్వరలోనే ఈ ఫీచర్ వస్తుంది. -
ప్రతీ వాట్సాప్ గ్రూపునకు కూడా 10 డాలర్లు పెడితే!?
సాక్షి, హైదరాబాద్: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను టెస్లా చీఫ్ కొనుగోలు చేసిన తరువాత సోషల్ మీడియాలో సెటైర్లు ఒక రేంజ్లో పేలుతున్నాయి. మెటా సొంతమైనవాట్సాప్ను కూడా కొనుగోలు చేసి, వాట్సాప్ గ్రూపులకు కూడా ఫీజు పెడితే బావుంటుందంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ‘‘ఎలాన్ మస్క్ దయచేసి వాట్సాప్‌ను కొనుగోలు చేసి, 10 డీలర్లు ఫీజు పెట్టండి.. డాలర్లే డాలర్లు’’ అంటూ హాయ్ హైదారాబాద్ అనే ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్ల రియాక్షన్స్, మీమ్స్ అదిరిపోతున్నాయి. వుండండి బ్రో..మీరు లేనిపోని సలహాలు ఇవ్వకండి. నేను అంత రిచ్ కాదు ఒకరు కమెంట్ చేయగా, ఆ పనిచేయాలి పీడా పోద్ది, ఫ్యామిలీ గ్రూపు, ఆఫీసు గ్రూపు, ఫ్రెండ్స్ గ్రూపు, టెన్త్ గ్రూపు, ఇంటర్ గ్రూపు, అసోసియేషన్ గ్రూపు అబ్బో..ఈ గ్రూపులతో చచ్చిపోతున్నాం అని ఇంకొకరు వ్యాఖ్యానించారు అంతేకాదు 55 శాతం ట్విటర్ ఉద్యోగులను తొలగించారు.. ఇక మస్క్ వాట్సాప్‌ను కొంటే..వాట్సాప్ యూనివర్శిటీ స్టూడెంట్లు అందరినీ సస్పెండ్ చేస్తారేమో అంటూ మరొకరు, స్పామ్ మెసేజ్‌ల గోల ఉండదు అని ఇంకొకరు ట్వీట్ చేయడం విశేషం. Hey @elonmusk, Please buy @WhatsApp and charge $10 for each WhatsApp group. Enjoy 🌧️💱💸💴💵💰🌧️ — Hi Hyderabad (@HiHyderabad) November 5, 2022 Ala cheste whatsApp university emai povali andi pic.twitter.com/BOvjHAz5CV — Naveen (@naawritings) November 5, 2022 Whatsapp university students 😂😀 pic.twitter.com/O23uJyn9zz — CH SaiTeja 09 (@iamSaiTeja09) November 5, 2022 Actually that is the best thing… we can get out off from spam messages. — Maidla Kiran Mudiraj (@kiranMudiraj128) November 5, 2022 -
వావ్..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మార్కెట్లో కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అప్లికేషన్‌ను అప్డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా ‘కమ్యూనిటీస్’ అనే ఫీచర్‌ను వాట్సాప్ సంస్థ వరల్డ్ వైడ్‌గా ఎనేబుల్ చేసింది. ఇదే విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. గతంలో వాట్సాప్ గ్రూప్‌ల నిర్వహణ కష్టంగా మారడంతో.. మార్క్ జుకర్ బర్గ్ కమ్యూనిటీస్ ఫీచర్‌పై వర్క్ చేశారు. కొద్ది నెలల క్రితం బీటా వెర్షన్లో విజయ వంతంగా ట్రయల్స్ నిర్వహించి..గురువారం రియల్ టైం యూజర్లు వినియోగించేలా మార్కెట్‌కు పరిచయం చేశారు. కమ్యూనికేట్ ఫీచర్ వాట్సాప్‌లో ఫ్యామిలీ, కాలేజీ, ఆఫీస్ ఇలా అనేక గ్రూప్‌లు ఉండేవి. అయితే ఇప్పుడు ఫ్యామిలీ గ్రూప్‌లో ఎన్ని గ్రూప్‌లు ఉంటే అన్నీ గ్రూప్‌లో ఒకే గ్రూప్ కింద యాడ్ చేసుకోవచ్చు. అలా గ్రూప్‌లో యాడ్ చేసుకొని.. ఆ గ్రూప్‌కు ఒక నేమ్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీలో ఫ్యామిలీ గ్రూప్‌లు, కాలేజీ గ్రూప్‌లో కాలేజీ గ్రూప్‌లు.. ఇలా డివైడ్ అయిపోతాయి. అలా గ్రూపుల్ని డివైజ్ చేయడం వల్ల వాట్సాప్ వినియోగం సులభతరం అవుతుందని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఈ కమ్యూనికేట్ ఫీచర్‌తో పాటు గ్రూప్ చాట్‌లో పోల్స్ క్రియేట్ చేయడం, ఒకే సారి 32 మంది సభ్యులకు గ్రూప్ వీడియో కాల్ చేయడం, గ్రూప్ వీడియో కాల్లో పాల్గొనే సభ్యుల సంఖ్యను డబుల్ చేసిపనట్లు వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఎంతంటే వాట్సాప్ గతంలో గ్రూప్ సభ్యుల సంఖ్య 512 మంది వరకు చేరే సౌకర్యం ఉంది. తాజాగా ఆ సభ్యుల సంఖ్య 1,024కి పెంచింది. తద్వారా వ్యాపార వేత్తలు వారి క్లయింట్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్ సెండ్ చేయడంతో పాటు వ్యాపార కార్యకలాపాల్ని మరింత వృద్ధి చేసుకోవచ్చు. గతేడాది 256 మంది సభ్యుల నుంచి 512కి పెంచింది. కాగా వాట్సాప్ కాంపిటీటర్ టెలిగ్రాంలో సుమారు 2లక్షల మంది సభ్యులు చేరవచ్చు. కానీ వాట్సాప్ తరహాలో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తరహాలో సెక్యూర్ లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. -
రిస్టోర్ అయిన వాట్సాప్ సేవలు
-
వాట్సాప్ సేవలు పునరుద్ధరణ
భారత్‌తో పాటు పలు దేశాల్లో నిలిచిపోయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సుమారు 95 నిమిషాల తర్వాత సేవలను పునరుద్ధరించించి మాతృ సంస్థ మెటా. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల యూజర్లు మెసేజ్‌లు పంపేందుకు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత.. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించకపోవటం, డబుల్ టిక్, బ్లూటిక్ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో పడ్డారు యూజర్లు. సమస్య తలెత్తిన తర్వాత వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఫిర్యాదులు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్‌లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు! -
Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాట్సాప్‌ను ప్రజలు వినియోగిస్తున్నారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 244 కోట్లు మంది ఇప్పటివరకు వాట్సాప్ సేవలను వాడుతున్నారు. నవంబర్ 2009లో ప్రాథమికంగా వాట్సాప్‌ను యాపిల్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. 2010లో అండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ దశ తిరిగింది. కేవలం నాలుగేళ్లలోనూ 200 మిలియన్ యూజర్ల మార్కును చేరుకుంది. వాట్సాప్ పెరుగుతున్న తీరును చూసిన ఫేస్ బుక్.. వెంటనే బేరం పెట్టింది. ఏకంగా 19 బిలియన్ డాలర్లను వెచ్చించి 2014లో సొంతం చేసుకుంది. ఈ మొత్తం వాట్సాప్ విలువ కంటే 12 రెట్లు ఎక్కువ. భారత్ వ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల యూజర్లు ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ మెసెజ్‌లు పంపుకోవచ్చు. ప్రతీ రోజు దాదాపు పది వేల కోట్ల మెసెజ్‌లను వాట్సాప్ చేరవేస్తుంది. (చదవండి: దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం.. అయోమయంలో యూజర్లు!) వాట్సాప్ వచ్చిన తర్వాత దెబ్బ పడిన మొదటి సర్వీస్ SMS. అప్పటి వరకు ఒక్కో SMSకు కొంత మొత్తాన్ని చార్జ్ చేసిన మొబైల్ నెట్‌వర్క్‌లు వాట్సాప్ దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఇక భారతీయులయితే వాట్సాప్‌ను ఎంతగా అభిమానించారంటే.. ఏం చేసినా వాట్సాప్‌లో పంచుకున్నారు. మెసెజ్ షేరింగ్, ఫోటో షేరింగ్, స్టేటస్.. ఇలా ప్రతీ అంశానికి వాట్సాప్‌పై ఆధారపడతారు.కొన్నాళ్లుగా కాలింగ్‌కు కూడా వాట్సాప్ ప్రత్యామ్నాయంగా మారింది. నేరుగా కాల్ చేస్తే రికార్డు అవుతుందనో.. లేక సౌకర్యంగా ఉంటుందనో వాట్సాప్ కాలింగ్‌నే నమ్ముకున్నారు చాలా మంది. ఇక విదేశాల్లో, లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి వాట్సాప్ కాలింగ్ ఎంతో సులభం. దీని వల్ల భారత్ లాంటి దేశాల్లో ISD ఇంటర్నేషనల్ కాలింగ్‌కు ఎంతో దెబ్బ పడింది. మొబైల్ నెట్‌వర్క్‌లు కన్నుమూసి తెరిచేలోపు వాట్సాప్ ఇంటర్నేషనల్ కాల్ ఎంతో ముందుకు వెళ్లింది. ఒకప్పుడు STD, ISD చేయాలంటే బూత్‌లకు వెళ్లేవాళ్లు. అపాయింట్మెంట్లు తీసుకునేవాళ్లు. వీటన్నింటికి వాట్సాప్ బెస్ట్సొల్యూషన్గా మారింది. ఇక వాట్సాప్ గ్రూపుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ప్రతీ వాట్సాప్ యూజర్ కనీసం 10 గ్రూపుల్లో చేరడం, తమకు నచ్చిన అంశాలను బేస్ చేసుకుని గ్రూప్‌లు క్రియేట్ చేయడం వీపరీతంగా పెరిగింది. దీనికి తోడు మీడియాకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారింది. ప్రతీ వార్తను వాట్సాప్‌లో షేర్ చేసుకోవడం అనవాయితీగా మారింది. ఏకంగా వాట్సాప్ బేస్డ్గా మీడియా అంటే వార్తా ఛానళ్లు, పబ్లికేషన్లు నడుస్తుండడం ఆశ్చర్యం. గతంలో గోడ పత్రికలన్నీ ఇప్పుడు వాట్సాప్ పత్రికలుగా మారిపోయాయి. (చదవండి: WhatsApp Down కలకలం: స్పందించిన మెటా) -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీకోసం
ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లతో అనతి కాలంలోనే కోట్లాది యూజర్లను సంపాదించుకున్న సంగతి తెలసిందే. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీతో తమ వినియోగదారులకు సేవలందించడంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. తాజాగా ఈ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ని జతచేస్తోంది. యూజర్లకు బెస్ట్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫీచర్‌ని వాట్సాప్ ప్రవేశపెడుతోంది. వాయిస్ కాలింగ్ కోసం కాల్ లింక్‌ల ఫీచర్‌ను విడుదల చేసింది. యూజర్లు కేవలం ఒక ట్యాప్‌లో వాట్సాప్ వాయిస్ కాల్ చేయవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే, యూజర్లు కాల్స్ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న ‘కాల్ లింక్‌లు’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత వీడియో లేదా ఆడియో కాల్ లింక్‌ను క్రియేట్ చేసుకుని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈజీగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాల్ లింక్‌లను ఉపయోగించేందకు యూజర్లు వారి వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్‌లో ఈ కాల్ లింక్‌ల ఫీచర్‌ను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. మెటా సీఈఓ (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. 32 మంది వ్యక్తుల కోసం సేఫ్ ఎన్క్రిప్టెడ్ వీడియో కాలింగ్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌తో సహా ఇతర గ్రూప్ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాంలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
'ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతారు'.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
అనంతపురం అగ్రికల్చర్: రెండు మూడు రోజులుగా వాట్రాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఫొటోలు, సందేశాలు నిరాధారమైనవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మల్లీశ్వరి తెలిపారు. “పత్తి పంటలో ఒక పురుగు ఉంది. ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతున్నారు... జాగ్రత్తగా ఉండండి’ అంటూ అందరూ ఆందోళనకు గురయ్యేలా పురుగు ఫొటోలు, చనిపోయిన మనుషుల ఫొటోలు, ఆడియో సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ పూర్తీగా అవాస్తవమని పేర్కొన్నారు. అలాంటి పురుగు పత్తి పంటకు అసలు ఆశించదని, అది ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో కనిపిస్తుందన్నారు. లద్దె పురుగు ఆకారంలో శరీరంపై వెంట్రుకలు కలిగి ఉంటుందన్నారు. వెంట్రుకల చివరి భాగంలో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుందన్నారు. ఒకవేళ ఆ పురుగు మనిషి శరీరాన్ని తాకినా కేవలం తగిలిన చోట దురద , లేదంటే చిన్నగా వాపు వస్తుందని, ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. చదవండి: (AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ) -
వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి
జడ్చర్ల: వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్‌గా చేరి తర్వాత తమనే గ్రూపు నుంచి తొలగించారంటూ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన చైతన్య, వసీంలు పట్టణంలోని 25వ వార్డు పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌లో తనను కూడా సభ్యురాలిగా చేర్చుకోవాలని కోరుతూ కౌన్సిలర్ లత కోరగా...అడ్మిన్‌గా అవకాశం కల్పించారు. కొద్దిరోజుల తర్వాత గ్రూపు నుంచి తమనే తొలగించిందని, తమ గ్రూపును తమకు ఇప్పించాలంటూ చైతన్య, వసీంలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీనిపై సదరు కౌన్సిలర్ స్పందిస్తూ...గ్రూప్‌ను క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లాలనే తాను అడ్మిన్‌గా వ్యవహరిస్తున్నానని, తాజా ఫిర్యాదుతో తాను ఆ గ్రూప్‌నుంచి వైదొలుగుతున్నానని, మరో కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వివరించారు. -
సైలెంట్‌గా సైడ్ అయిపోవచ్చు, వాట్సాప్ యూజర్లకు శుభవార్త!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు ఫీచర్లను యాడ్ చేస్తున్నట్లు వాట్సాప్ మాతృసంస్థ, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఏదైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఇతర సభ్యులకు ఎవరికీ తెలియదు. ఎగ్జిట్ అయిన విషయం అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది. అలాగే వాట్సాప్‌ను ప్రైవేట్‌గా చూసుకునే వెసులుబాటు రానుంది. అంటే ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఆగస్ట్‌లోనే జతకూడనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. యూజర్ మరో యూజర్‌కు వ్యూ వన్స్ ఫీచర్‌ను ఉపయోగించి ఫోటో, వీడియో పంపినప్పుడు ఒకసారి మాత్రమే చూసుకునే వీలుంది. అయితే వ్యూ వన్స్ ద్వారా వచ్చిన ఫొటోను, వీడియోను స్క్రీన్‌షాట్ తీసుకునే వీలు లేకుండా కొత్త ఫీచర్ కొద్ది రోజుల్లో రానుంది. చదవండి👉ఎస్బీఐ:'హాయ్' చెప్పండి..వాట్సాప్‌లో బ్యాంక్ సేవల్ని పొందండి! -
35 వాట్సాప్ గ్రూప్‌లపై నిషేధం విధించిన కేంద్రం
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. ప్లాన్స్ సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్ గ్రూప్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్ గ్రూప్‌లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, నిషేధం విధించిన వాట్సాప్ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఇక, ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడుల నుంచి మొదలు కొని బీహార్‌లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఈ దాడులకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారనే నివేదికలపై చర్యలు చేపట్టింది. ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. Centre bans 35 WhatsApp groups for spreading misinformation on Agnipath scheme, 10 arrested for fake news#AgnipathScheme pic.twitter.com/Fqv0N8DF2n — Pandurang Dhond (@PandurangDhond7) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: మధ్యలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు. ఆ మాటలు నమ్మిన ఆర్మీ అభ్యర్థులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. కానీ ఎవరూ పట్టిం చుకోవడం లేదన్న భావనతో వారిలో కొందరు విధ్వంసం మొదలుపెట్టారు. మరికొందరూ వారిని అనుసరించారు. చివరికి బోగీలకు నిప్పుపెట్టడం, రైళ్లను ధ్వంసం చేయడం వంటి చర్యలకూ దిగారు.. శుక్రవారం నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఇలాంటి కీలక అంశాలెన్నో బయటపడుతున్నాయి. ఏపీలోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావు ఈ వ్యవహారంలో సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రైల్వే, హైదరాబాద్ సిటీ పోలీసులు.. మొత్తంగా 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్నా, రైల్వేస్టేషన్లో ఎవరెవరు విధ్వంసం సృష్టించారో నిర్ధారించి అరెస్టులు చేస్తున్నారు. అందులో శనివారం 52 మందిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల కోసం నిందితులను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు ఫీజుల కోసం ప్రైవేట్ అకాడమీలు కుట్రతో, పక్కా పథకం ప్రకారం జరిగిన రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక.. సాయి డిఫెన్స్ అకాడమీ సహా తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీటిలో కొన్ని అభ్యర్థులు ఎంపికయ్యా ఫీజుల చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఎంపిక పరీక్షల్లో ఒక్కోదశ దాటే కొద్దీ అభ్యర్థులు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లిస్తుంటారు. ఈ నెల 14న రాజ్‌నాథ్‌సింగ్ ‘అగ్నిపథ్’ ప్రకటన చేయడంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోతాయని.. తమకు రావాల్సిన ఫీజులు, భవిష్యత్తులో చేరే అభ్యర్థుల సంఖ్యపై ప్రభావం ఉంటుందని అకాడమీలు భావించాయి. ఈ క్రమంలో నిర్వాహకులు అప్పటికే తమవద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో సృష్టించిన వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీడియోలు పోస్టు చేశారు. ఈ నెల 17న నిరసన తెలపడానికి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌కు రావాలని సందేశాలు పెట్టారు. ఇలా పాత గ్రూపులు, కొత్తగా క్రియేట్ చేసిన వాటితో కలిపి మొత్తం 12 గ్రూపుల్లో ఈ సమాచారం సర్క్యులేట్ అయింది. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు, ఏపీకి చెందిన అభ్యర్థులు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు హైదరాబాద్‌లోని డిఫెన్స్ అకాడమీల్లో బస చేశారు. వారికి ప్రైవేటు అకాడమీల నిర్వాహకులే భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రావాలంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చిన తర్వాతే పెట్రోల్ తెచ్చి.. శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు కృష్ణ, గోదావరి, గౌతమి, ఇతర రైళ్లలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారు తమ ప్రతి కదలికనూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు. ఈ క్రమంలో హకీంపేట ఆర్మీ సోల్జర్స్ సహా నాలుగు గ్రూపులను గుర్తించిన పోలీసులు.. వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. వాటిలో ఉన్న వాయిస్ మెసేజీల ప్రకారం.. ఆర్మీ అభ్యర్థులు తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన తెలపాలని మాత్రమే భావించారు. కానీ ఈ నిరసన ఆశించిన స్థాయిలో అందరి దృష్టీ ఆకర్షించలేదని, బలగాలు వచ్చి తమను తరిమేసే లోపు అందరి దృష్టి ఆకర్షించేలా విధ్వంసానికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిరసన మొదలయ్యాకే వెళ్లి పెట్రోల్ తెచ్చి.. బోగీలకు నిప్పంటించారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు స్టేషన్లోకి పోలీసు బలగాలు ప్రవేశించడంతో.. బయట రేతిఫైల్ బస్టాప్ వద్ద బస్సులకూ నిప్పుపెట్టాలని అభ్యర్థులు ప్రయత్నించినట్టు గుర్తించారు. ► హకీంపేట్ వాట్సాప్ గ్రూప్‌లోని వాయిస్ మెసేజీలలో.. ‘‘ఎంతసేపు ఒర్రుతార్రా ఒర్రోర్రి నోర్లు నోస్తయ్. అందుకే గమ్మునపోయి పెట్రోల్ తీసుకువచ్చి తగలబెట్టేసినం అనుకో.. బయటికి పోతాది న్యూస్. అంతేగని ఎంతసేపు ఒర్రినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా ఏమీ అవ్వదు. రెండు గంటలు, ఒక గంటల స్క్వాడ్ వస్తది. అందరినీ వెల్లగొడ్తది. అందుకే పోయి పెట్రోల్ తీసుకొస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు’ అంటూ ఒక వాయిస్ మెసేజీ.. ► ‘‘అరే పెట్రోల్ పంప్‌కు పోతున్నా పెట్రోల్ తీస్కరానీకి, ఎవరైనా వస్తే పెట్రోల్ తీస్కరానికి రండి’’ అంటూ మరో వాయిస్ మెసేజీ ఉన్నాయి. ► ఇక మరో వాట్సాప్ గ్రూపులో.. ‘‘బెటాలియన్ ఆగయా.. సబ్ లోగ్ రేతిఫైలి కనే ఆజావ్.. బస్ జలాదేంగే..’’ అంటూ ఇంకో వాయిస్ మెసేజీని పోలీసులు గుర్తించారు. ఈ మూడు సందేశాలను పోస్టు చేసినది ఒకే వ్యక్తి కావడంతో.. అతడే విధ్వంసానికి సూత్రధారి అని అనుమానిస్తున్నారు. అడ్మిన్ల ఫోన్ నంబర్లు.. టవర్ లొకేషన్లతో.. రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, వాట్సాప్ గ్రూపులు, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు నిందితుల ద్వారా తెలుసుకున్న అధికారులు.. అందులో నాలుగింటిని గుర్తించారు. వీటిలో అడ్మిన్లు, సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి.. వారి సెల్ టవర్ లోకేషన్లను పరిశీలిస్తున్నారు. తద్వారా విధ్వంసం సమయంలో రైల్వేస్టేషన్లో ఉన్నవారిని గుర్తిస్తున్నారు. కేసు తీవ్రమైనది కావడంతో అనుమానితులను పూర్తిగా పరిశీలించి, ప్రశ్నించాకే అరెస్టు చేస్తున్నారు. పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. పరిశీలన అనంతరం 52 మందిని నిందితులుగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకమని భావిస్తున్న మరో ఏడుగురిని ప్రశ్నిస్తుండగా.. మిగతా వారిని విడిచిపెట్టారు. మొత్తంగా ఈ కేసులో నిందితులుగా 200 మందిని గుర్తించారు. వారి కోసం సికింద్రాబాద్ జీఆర్పీతోపాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తును హైదరాబాద్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మి పర్యవేక్షిస్తున్నారు. పట్టుకున్నాక తెలిసింది పోలీసని.. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం మొదలయ్యాక మీడియాకు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారని, రావాలని ఆ ఫోన్ చేసిన వ్యక్తి కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కూడా అభ్యర్థేనని, కీలక వ్యక్తి కావడంతోనే మీడియాను పిలిచి ఉంటాడని భావించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే అప్రమత్తమై తప్పించుకోవచ్చని భావించి.. సాంకేతిక ఆధారాలు, ముమ్మర గాలింపుతో ఆయనను గుర్తించి పట్టుకున్నారు. కానీ ఆయన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అని తెలిసింది. రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగిన అభ్యర్థులను వెళ్లిపోవాలని కోరగా.. మీడియా వస్తే తప్ప వెళ్లబోమని భీష్మించారని, దాంతో మీడియా వస్తే త్వరగా నిరసన ముగుస్తుందనే ఫోన్ చేశానని ఆయన వివరించారు. దీంతో ఆయన్ను అధికారులు విడిచిపెట్టారు. కీలక నిందితుడు.. ఏపీ పోలీసుల అదుపులో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో అభ్యర్థులను ప్రేరేపించిన నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆవుల సుబ్బారావు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రావిపాడు పంచాయతీ పరిధిలో డిఫెన్స్ అకాడమీని నడుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్ వెళ్లిన సుబ్బారావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నరసరావుపేటకు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి పాతూరులోని సాయి రెసిడెన్సీ లాడ్జిలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు చెందిన డిఫెన్స్ అకాడమీ కార్యాలయంలో తనిఖీలు చేసి.. రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును ఆదివారం తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశమున్నట్టు తెలిసింది. అయితే సుబ్బారావు గుంటూరు, విశాఖపట్నంలలోనూ ఆర్మీ అభ్యర్థుల నిరసనలకు ప్రేరేపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. దీనితో అక్కడే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయవచ్చే వాదన వినిపిస్తోంది. సుబ్బారావు అప్పగింతపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. -
అమలాపురం అల్లర్లలో మరో ఇద్దరి అరెస్ట్
అమలాపురం టౌన్: అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ముమ్మిడివరం గొల్లవీధికి చెందిన మట్ట లోవరాజు, అమలాపురం కల్వకొలను వీధికి చెందన గోకరకొండ సూరిబాబులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కలిపి అమలాపురం విధ్వంసకర ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 137 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ కేసుల్లో మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఫేస్బుక్లో అసత్య ప్రచారంపై కేసు నమోదు అమలాపురంలో జరిగిన అల్లర్లపై ఫేస్బుక్లో అసత్య ప్రచారం చేసిన పశ్చిమ గోదావరి జి ల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన చేగొండి నానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. నానిని బుధవారం అరెస్ట్ చేసి కో ర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఫేస్బు క్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ గ్రూపుల్లో ఒక వర్గాన్నిగానీ, వ్యక్తులనుగానీ రెచ్చగొట్టేలా పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు ఉంటా యని హెచ్చరించారు. ఎక్కడైనా జరిగిన ఘటనలకు అసత్యాలు జోడించి పోస్టింగ్ పెట్టినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. -
వాట్సాప్ గ్రూప్.. ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఎగ్జిట్ అవ్వొచ్చు
ఫ్రెండ్స్.. ఫ్యామిలీస్.. ఆఫీస్.. అపార్ట్మెంట్స్.. ఇలా ఒకటో, రెండో.. కాదు పదుల కొద్దీ వాట్సాప్ గ్రూప్స్.. వందల కొద్దీ మెసేజీలు.. ఒక్కోసారి ఫొటోలు, వీడియోలతో మెమరీ నిండిపోతుంది. గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్ అవుదామనుకున్నా.. ఏమైనా అనుకుంటారేమోనన్న ఉద్దేశంతో బలవంతంగా అయినాకొనసాగుతుంటారు. మరెలా..? ఏముందీ ఎవరికీ తెలియకుండా, గ్రూప్‌లో ఎగ్జిట్ నోటిఫికేషన్ రాకుండానే బయటపడొచ్చు. వాట్సాప్ త్వరలోనే ఈ వెసులుబాటును అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం బీటా వెర్షన్లలో కొందరికి ఈ ఆప్షన్ ఉన్నట్టు ‘డబ్ల్యూఏ బీటా ఇన్ఫో’ అనే టెక్ నిపుణుల బృందం గుర్తించింది. అయితే.. ఇలా ఎగ్జిట్ అయినట్టు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రం తెలుస్తుందట. గ్రూప్‌లో నోటిఫికేషన్ రాదని.. మెంబర్లకు తెలియదని నిపుణులు చెప్తున్నారు. బలవంతంగా గ్రూపుల్లో కొనసాగుతూ ఇబ్బందిపడుతున్నవారికి ఈ ఆప్షన్ బాగా తోడ్పడుతుందని అంటున్నారు. చదవండి: పామాయిల్ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే అడ్మిన్లు డిలీట్ చేసేయవచ్చు వాట్సాప్ గ్రూప్‌లలో ఎవరు పెట్టిన పోస్టులను వారు మాత్రమే డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వివాదాస్పద, ఇబ్బందికర పోస్టులను పెడితే.. అవి గ్రూప్‌లో అందరికీ కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎవరు పెట్టిన పోస్టులను అయినా అడ్మిన్లు డిలీట్ చేయగలిగే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ►వాట్సాప్‌లో 2 గిగాబైట్ల వరకు పరిమాణం ఉన్న పెద్ద ఫైల్స్‌ను పంపుకోవడానికి అవకాశం రానుంది. ►ఒకేసారి ఏకంగా 32 మందితో గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్నీ వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది. ఏమిటీ బీటా వెర్షన్లు? వాట్సాప్ త్వరలో విడుదల చేసే వెర్షన్లను ముందుగా కొందరికి ప్రయోగాత్మకంగా అందిస్తుంది. వాటిలోని కొత్త ఆప్షన్లను వాడినప్పుడు ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా మార్పులు చేయాలా అన్నది పరిశీలిస్తుంది. వీటినే బీటా వెర్షన్లు అంటారు. అన్నీ సరిదిద్దాక చివరగా మెయిన్ వెర్షన్‌ను వినియోగదారులందరికీ విడుదల చేస్తుంది. త్వరలో రాబోయే సదుపాయాలు ఇలా బీటా వెర్షన్లలో తెలిసిపోతుంటాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట -
కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం
రెండు రోజుల క్రితం కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’సినిమా లింక్ వచ్చింది. సినిమా చూడాలన్న ఆసక్తితో చాలామంది లింక్ ఓపెన్ చేశారు. రెండు నిముషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. కడపలోని ఏడు రోడ్ల కూడలిలోని ఓ మొబైల్ షాపునకు ఇద్దరు యువకులు వచ్చి ఫోన్ కొన్నారు. ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లంపులు చేశారని తేలింది. తెలంగాణలో మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు మెయిల్‌కు ఓ లింక్ వచ్చింది. సిబ్బంది దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకులోని సొమ్ము మాయమైంది. ఇందులో బ్యాంకు సిబ్బందితోపాటు నైజీరియా దేశస్తులను తెలంగాణ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. సాక్షి, కడప కార్పొరేషన్/అర్బన్: మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్లైన్ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమై పోతోంది. చివరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్‌లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారాగానీ, నంబర్ల నుంచిగానీ నేరుగా వెబ్సైట లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు మాయమవడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కడపలోని ఓ బ్యాంకులో నెల రోజుల వ్యవధిలోనే 50 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో భద్రమనుకుంటే... బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. ఇంట్లో భద్రం కాదని అనుమానంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడ కూడా భద్రత ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ మొబైల్ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదు. 2021లో యోనో కేవైసీ, ఫేక్ మనీ యాప్స్, ఫ్లిప్‌కార్ట్ లాటరీ, గిఫ్ట్ మనీ, క్రెడ్ యాప్, ఓటీపీ, ఇన్స్రూె ఓఎల్ఎక్స్, జాబ్, ఏనీ డెస్క్ వంటి వాటి ద్వారా 326 మంది రూ.50.04లక్షలు మోసపోయారు. ఎఫ్ఐఆర్ వరకూ రాని సంఘటనలు చాలానే ఉన్నాయి. ఏఈపీఎస్ ద్వారా కూడా మోసాలు సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు మాసాల్లో దీని ద్వారా మోసపోయిన బాధితులు చాలా మంది ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10వేల వరకూ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్ నేరగాళ్లు రూపాల్లో ప్రజల వేలిముద్రలు సేకరించి ఏఈపీఎస్ ద్వారా డబ్బులు దోచేçస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి చేయొద్దు ►కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. ►ఎవరైనా క్యాష్ ఇవ్వండి. ఫోన్ పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్రావా పంపితే అమౌంట్ వచ్చినట్లు చూపుతుంది. కానీ మన ఖాతాలో జమ కాదు. ►ఇటీవల హిట్ అయిన సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల మన ఖాతాల్లో డబ్బు మాయమవుతుంది. ►మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ►ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు సంబంధించిన పాస్వర్డ్లు గోప్యంగా ఉంచుకోవాలి. ►ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు నమోదు చేయకూడదు. బ్యాంకులు లింకులు పంపవు చాలాసార్లు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లింక్ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులు అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. తెలియని కాల్స్, మెయిల్స్‌పై క్లిక్ చేయవద్దు. వెబ్సైట్ ద్వారా ఆధార్‌ను లాక్ చేసుకోవాలి. రుణాలు ఇస్తామని, క్రెడిట్, డెబిట్ కార్డు గడువు తీరిపోయాయని ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదు. – దుర్గాప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయవద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించవద్దు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు, ఓటీపీలు చెప్పవద్దు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశాం. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – కేకేఎన్ అన్బురాజన్, వైఎస్సార్ జిల్లా ఎస్పీ -
కొడుకు చెంతకు చేర్చిన వాట్సాప్
కేసముద్రం: హైదరాబాద్‌లోని ఓ కోళ్లఫామ్‌లో పనిచేస్తున్న కొడుకు వద్ద ఉంటున్న తల్లి 9 రోజుల క్రితం తప్పిపోయింది. ఓ సామాజిక కార్యకర్త ఆమెను చేరదీసి అడ్రస్‌ను వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ చేయడంతో సమాచారం కేసముద్రానికి చేరింది. తల్లి ఆచూకీ తెలుసుకున్న కొడుకు ఆమె వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన మాంకాల యాకయ్య కొంతకాలంగా హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి గండిచెరువులో గల కోళ్లఫామ్‌లో పనిచేస్తున్నాడు. కొడుకు వద్దే ఉంటున్న తల్లి కొమురమ్మ 9 రోజుల క్రితం బస్సు ఎక్కి తప్పిపోయింది. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. తల్లి, కొడుకుతో జంగయ్య ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి ఆదివారం చేరుకున్న కొమురమ్మ, తన పరిస్థితిని పలువురుకి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త చెరుకూరి జంగయ్య ఆమె పూర్తి వివరాలను అడిగితెలుసుకున్నాడు. ఆకలితో ఉన్న కొమురమ్మకు భోజనం పెట్టాడు. ఆమె తెలిపిన వివరాలను వెంటనే వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ సమాచారం తిరిగితిరిగి కేసముద్రం గ్రూపులకు చేరింది. దీంతో సమీప బంధువులు కొమురమ్మ వివరాలను కొడుకు యాకయ్యకు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే అతడు తల్లి ఉన్నచోటుకు చేరుకున్నాడు. తప్పిపోయిన తల్లిని 9రోజుల తర్వాత చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె సైతం కొడుకును చూసి భావోధ్వేగానికి గురైంది. తన తల్లిని చేరదీసిన జంగయ్యకు యాకయ్య కృతజ్ఞతలు తెలిపాడు. వాట్పాప్ ద్వారా సమాచారం షేర్ చేసిన గంటల వ్యవధిలోనే తల్లీకొడుకులు కలుసుకోవడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు. -
లింకు నొక్కితే ఖాతా ఖాళీ
రెండు రోజుల క్రితం కొన్ని గ్రూపుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా లింక్ వచ్చింది. సినిమా చూద్దామన్న ఆసక్తితో చాలామంది లింక్ ఓపెన్ చేశారు. రెండు నిమిషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఈ నెల 19న అనంతపురం సప్తగిరి సర్కిల్లోని ఓ మొబైల్‌షాపులో ఇద్దరు యువకులు వచ్చి మొబైల్ ఫోన్ కొన్నారు. ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్‌పే యాప్ ద్వారా చెల్లింపులు చేశారని తేలింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్లైన్ మోసగాళ్లకు అవకాశం మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమైపోతోంది. చివరకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్‌లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా గానీ, నంబర్ల నుంచి నేరుగా గానీ వెబ్సైట్ లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు లాగేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలోని ఓ బ్యాంకులో నెల వ్యవధిలోనే 58 ఫిర్యాదులు అందాయి. తాజాగా అనంతపురం జిల్లా ఓడీ చెరువుకు చెందిన శ్రీనివాసులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు మాయమైంది. బ్యాంకు మేనేజర్‌ను కలిస్తే తమకు సంబంధం లేదని చెప్పారు. బ్యాంకుల్లో భద్రమనుకుంటే.. బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. దీంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడా భద్రత ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ మొబైల్ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ఏఈపీఎస్ ద్వారానూ మోసాలు సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ద్వారానూ మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు నెలల్లో ఇలా మోసపోయిన బాధితులు జిల్లాలో 30 మందికి పైగానే ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతి ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10 వేల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజల వేలిముద్రలను సేకరించి ఏఈపీఎస్ ద్వారా డబ్బు దోచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పొరపాట్లు చేయొద్దు.. ► కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. ► ఎవరైనా క్యాష్ ఇవ్వండి.. ఫోన్‌పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్వారా పంపితే అమౌంట్ వచ్చినట్టు చూపిస్తుంది కానీ మన ఖాతాలో జమకాదు. ► ఇటీవల హిట్ సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం ప్రమాదకరం. ► మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశముంది. ► ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్‌లకు సంబంధించిన పాస్వర్డ్లు గోప్యంగా ఉంచుకోవాలి. ► ఫోన్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు నమోదు చేయకూడదు. అప్రమత్తంగా ఉండాల్సిందే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి లింకులూ క్లిక్ చేయొద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తుతెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించొద్దు. ముఖ్యంగా వివిధ బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు ఓటీపీలు చెప్పవద్దు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ బ్యాంకులు లింకులు పంపవు చాలాసార్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులూ అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. వాటిపై క్లిక్ చేయొద్దు. వెబ్సైట్ ద్వారా ఆధార్‌ను లాక్ చేసుకోవాలి. ఈజీ లావాదేవీల కోసం ప్రైవేటు యాప్‌లను ఆశ్రయించడం మంచిది కాదు. –జి.భాస్కర్‌రెడ్డి, చీఫ్ మేనేజర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా -
వాట్సాప్‌లో మెసేజ్‌లను తెగ ఫార్వర్డ్ చేస్తున్నారా..! అయితే
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకురానుంది.ఈ ఫీచర్‌తో ఫార్వర్డ్ మెసేజ్‌లకు కళ్లెం వేయనుంది వాట్సాప్. ఫార్వర్డ్ చేయలేరు..! ఫార్వర్డ్ మెసేజ్‌లపై వాట్సాప్ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో ఆయా వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఫార్వార్డింగ్ చేయడాన్ని పరిమితం చేయనుంది. దీంతో ఒక మెసేజ్‌ను సదరు యూజరు ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఒకే సమయంలో ఫార్వర్డ్ చేయలేరు. ఈ చర్యతో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచార వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చునని వాట్సాప్ అభిప్రాయపడుతోంది. WABetainfo ప్రకారం...వాట్సాప్ ఒకేసారి ఒక గ్రూప్ చాట్‌కు మాత్రమే సందేశాలను ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్‌తో ఒక సందేశాన్ని ఫార్వార్డ్ చేసినట్లుగా గుర్తించనప్పుడు, దానిని ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్లకు ఫార్వార్డ్ చేయడం ఇకపై సాధ్యం కాకుండా చేయనుంది. ఒక వేళ సదరు సందేశాన్ని ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్లకు ఫార్వార్డ్ చేయాల్సి వస్తే, యూజర్లు ఆయా సందేశాన్ని సెలక్ట్ చేసుకొని, మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. తొలుత ఫీచర్ వాట్సాప్‌బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ ఫార్వార్డింగ్ విషయంలో వాట్సాప్ గతంలో ఒక అప్డేట్ను విడుదల చేసింది. దీని ద్వారా యూజర్లు ఒకేసారి ఒక చాట్‌కు సందేశాలను ఫార్వార్డ్ చేయవచ్చు. వాట్సాప్ సదరు మెసేజ్ అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని ‘ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అంటూ ఆయా మెసేజ్‌కు లేబిలింగ్ను వాట్సాప్ ఇస్తోంది. చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.! -
వాట్సాప్.. నీకు హ్యాట్సాఫ్
సాక్షి,గౌతంనగర్(హైదరాబాద్): పేదంటి ఆడబిడ్డ పెళ్లికి గౌతంనగర్‌కు చెందిన ‘మానవసేవే–మాధవసేవ’ వాట్సాప్ గ్రూప్ సభ్యులు తమ వంతు చేయూతనిచ్చారు. చర్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గౌస్ కూతురి పెళ్లి ఈ నెల 25వ తేదీ నిశ్చయమైంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కూతురు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నా విషయాన్ని గ్రూప్ సభ్యులు రాగం రాజు యాదవ్, ప్రసాద్యాదవ్ల ద్వారా విషయాన్ని మానవసేవే–మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులు అడ్మిన్ కుమ్మరి రాజుకి తెలుపడంతో ఈ విషయాన్ని గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో గ్రూప్‌లో ఉన్న 21 మంది స్పందించి తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మొత్తం రూ.19 వేలు జమా కావడంతో గురువారం పెళ్లి కూతురి తండ్రి గౌస్‌కు నగదుతో పాటు, క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. తమ కూతురి పెళ్లికి ఆర్థిక సాయం చేసిన వాట్సాప్ గ్రూప్ సభ్యులకు గౌస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు కుమ్మరిరాజు, మహ్మద్ రషీద్, గణేష్ముదిరాజ్, కిట్టు, మోహన్‌రాజు, శంకర్, కొమురయ్య ఉన్నారు. (చదవండి: గంజాయి మత్తులో యువకుల వీరంగం.. అడ్డుకోబోయిన మహిళపై.. ) -
వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల పోస్టులు.. అడ్మిన్ బాధ్యతపై హైకోర్టు వ్యాఖ్యలు ఇవే..
తిరువనంతపురం: వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర కంటెంట్ పోస్టులపై గ్రూపు అడ్మిన్ బాధ్యత వహించడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పోస్టులకు అడ్మిన్ బాధ్యులు కాదంటూ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ తన తీర్పును వెలువరించారు. అయితే, మార్చి 2020లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్ ‘ఫ్రెండ్స్’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అతడితో పాటు మరో ఇద్దరు అడ్మిన్లు ఉండగా.. వారిలో ఒకరు గ్రూపులో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి, పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పిటిషనర్ గ్రూపును క్రియేట్ చేసినప్పటి నుంచి ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. ఈ పోస్టు విషయంలో తనకు ప్రమేయం లేదంటూ అతను కోర్టును ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టు.. గ్రూప్‌లోని మెంబర్ పోస్ట్ చేసిన అభ్యంతకర పోస్టులకు గ్రూపు అడ్మిన్ బాధ్యులుకారని పేర్కొంది. అలా వారిని బాధ్యులుగా పరిగణించడం క్రిమినల్ చట్టంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ కోర్టు పేర్కొంది. -
మీరు వాట్సాప్ గ్రూప్ అడ్మినా..! అయితే మీకో గుడ్‌న్యూస్..!
మీరు వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్స్‌గా ఉన్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్...! వాట్సాప్ గ్రూప్స్‌ను దృష్టిలో ఉంచుకొని మెటాకు చెందిన వాట్సాప్ త్వరలోనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇతరుల మెసేజ్‌లను డిలీట్..! వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం..వాట్సాప్ గ్రూప్‌లోని సదరు యూజర్ షేర్ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని నివేదించింది. ఇలాంటి మోడరేషన్ పీచర్ టెలిగ్రాం యాప్‌లో అందుబాటులో కలదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన విషయాలను వాట్సాప్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. WABetaInfo ప్రకారం...ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్లలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం ...గ్రూప్స్‌లోని సదరు యూజరు పంపిన సందేశాలను అడ్మిన్స్ డిలీట్ చేసే ఫీచర్‌ను ట్విటర్లో షేర్ చేసింది. సదరు యూజర్ పంపిన మెసేజ్‌ను గ్రూప్ అడ్మిన్స్ డిలీట్ చేశారనే విషయాన్ని గ్రూప్ సభ్యులకు తెలియజేస్తుందని పేర్కొంది. ప్రస్తుతానికి, గ్రూప్ అడ్మిన్లు గ్రూప్‌లోని పాత మెసేజ్‌లను తొలగించగలరా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. వినియోగదారులు ప్రస్తుతం వారి స్వంత సందేశాలను పర్సనల్ చాట్‌లో లేదా గ్రూప్స్‌లో ఒక గంట, ఎనిమిది నిమిషాల, 16 సెకన్లలో తొలగించగలరు. అడ్మిన్స్‌కు ఊరట..! వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్‌తో అడ్మిన్స్‌కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. గ్రూప్స్‌లో నకిలీ వార్తలు లేదా హానికరమైన కంటెంట్లను అరికట్టడానికి గ్రూప్ అడ్మిన్స్‌కు తోడ్పడనుంది. గతంలో వాట్సాప్ గ్రూప్స్‌లో సదరు యూజర్లు పెట్టే మెసేజ్‌లకు పూర్తి బాధ్యత గ్రూప్ అడ్మిన్స్దేనని ప్రభుత్వం తెలిపింది. దీనిపై బాంబే, మద్రాస్ హైకోర్టులు గ్రూప్ అడ్మిన్స్‌కు ఊరట కల్పించాయి. వాట్సాప్ గ్రూప్‌లో ఇతర సభ్యులు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్స్‌ను బాధ్యులుగా చూడలేమని పేర్కొన్నాయి. If you are a group admin, you will be able to delete any message for everyone in your groups, in a future update of WhatsApp beta for Android. A good moderation, finally. #WhatsApp pic.twitter.com/Gxw1AANg7M — WABetaInfo (@WABetaInfo) January 26, 2022 చదవండి: ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే, మీ మొత్తం డేటా కంపెనీల చేతుల్లోకి! -
కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్
మైసూరు: పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న హెడ్మాస్టర్ నీచ ఉదంతమిది. ఈ ఘటన మైసూరు జిల్లా హెచ్డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు వాట్సప్‌లో వ్యాప్తి చెందడంతో ఆ హెచ్ఎంపై ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరువ్యాప్తంగా ఆ వీడియోలు వైరల్ కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: (మొదటి భార్య నాలుగో కూతురు.. రెండో భార్య కొడుకు మధ్య ప్రేమ..) -
వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్‌పై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!
వాట్సాప్ గ్రూప్స్‌లో చేసే మెసేజ్స్‌పై పూర్తి బాధ్యత గ్రూప్స్ అడ్మిన్‌దేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్ విషయంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బాంబే హైకోర్డుతో ఏకీభవిస్తూ..! గతంలో బాంబే హైకోర్టు వాట్సాప్ గ్రూప్ మెసేజ్స్ విషయంలో గ్రూప్ అడ్మిన్‌ను బాద్యుడిని చేయలేమని ఇచ్చిన తీర్పును మరోకసారి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆ తీర్పును పునరుద్ఘాటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. వాట్సాప్ గ్రూప్ సభ్యులు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌కు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యులు కాదని వెల్లడించింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ బాంబే హైకోర్టు కిషోర్ వర్సెస్ స్టేట్ మహారాష్ట్ర తీర్పును మద్రాస్ హైకోర్టు ప్రస్తావించింది గ్రూప్‌లో మెసేజ్ పెట్టినవారే..! వాట్సాప్ గ్రూప్స్‌లో అడ్మిన్ కాకుండా గ్రూప్ సభ్యులు చేసిన నేరంలో అతను ఎలాంటి పాత్ర పోషించనట్లయితే నిందితుడి జాబితా నుంచి తప్పక తొలగించాలని పేర్కొంది. ఒకవేళ అడ్మిన్ నేరంలో ప్రమేయం ఉన్నట్లు చూపించే సాక్ష్యాలను సేకరించినట్లయితే అతణ్ణి చట్ట ప్రకారం విచారించవచ్చని కోర్టు వెల్లడించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం..! ఆయా వాట్సాప్ గ్రూప్స్‌లోని వ్యక్తులు గ్రూప్ అడ్మిన్‌పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా అడ్మిన్‌ను ఆయా సభ్యుల స్వార్థం కోసం ఇరికించే అవకాశం ఉన్నట్లు మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్ కేవలం యాడ్, రిమూవ్ చేసే అధికారాన్నే కల్గి ఉంటారని పేర్కొంది. గ్రూప్ సభ్యులు పంపే సందేశాలకు అడ్మిన్ బాధ్యత వహించలేడని పిటిషన్ పేర్కొంది. గతంలో బాంబే కోర్టు కూడా.. వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు చేసే పోస్టులకు అడ్మిన్లను బాధ్యులను చేయలేమని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ పేర్కొంది. సభ్యులు చేసే తప్పిదాలకు అడ్మిన్లపై క్రిమినల్ నేరం మోపలేమని అభిప్రాయపడింది. కోర్టుకెక్కిన వాట్సాప్, ఫేస్బుక్..! కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఐటీ చట్టాలను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ న్యాయస్థానాలకు ఆశ్రయించాయి. ఈ చట్టాలతో తమ ఖాతాదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని ఇవ్వమని ప్రభుత్వం కోరడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తాము ఖాతాదారులకు హామీ ఇచ్చామని,. దాన్ని ఉల్లంఘించలేమంటూ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. చదవండి : WhatsApp: గూగుల్ మ్యాప్స్‌లోనే కాదు..వాట్సాప్‌లో కూడా వెతికేయచ్చు..! ఎలాగంటే..? -
వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp Upcomig Features In 2022: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ త్వరలో అదీ కొత్త ఏడాది మొదట్లో కొత్త ఫీచర్స్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఈ ఏడాది అంతగా ఫీచర్ల అప్డేట్ ఇవ్వని వాట్సాప్.. 2022లో మాత్రం యూజర్ ఫ్రెండ్లీ అప్డేట్స్తో రానున్నట్లు సమాచారం. భారత్ సహా ప్రపంచంలోనే మోస్ట్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది వాట్సాప్. వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వాట్సాప్.. క్రమంగా వివాదాలను అధిగమిస్తూ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా పేరు దక్కించుకుంది. కరోనా ప్రభావంతో కిందటి ఏడాది, అలాగే 2021 కూడా వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ఈ తరుణంలో కొత్త సంవత్సరం అదిరిపోయే ఫీచర్లను అందించబోతోంది. వాబేటా ఇన్ఫోప్రకారం.. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ 2022లో వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్ బహుశా ఇదే అయ్యి ఉండొచ్చు. గ్రూపులో పెట్టే ఏ మెసేజ్‌నైనా.. అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్ ఇది. అప్పుడు అక్కడ This was removed by an admin అని చూపిస్తుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ రీసెంట్గా మెసేజ్ డెలిట్ ఫీచర్‌ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరైనా సరే చేసిన మెసేజ్‌ను వారంలోగా వెనక్కి తీసేసుకునే వెసులుబాటు కల్పించింది. క్విక్ రిప్లయిస్.. బిజినెస్ ప్రత్యేకం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కోసం ఈ ఫీచర్. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ కోసం తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు ఛాట్బాక్స్లో “/” అనే సింబల్‌ను తరచూ పంపించే మెసేజ్‌లకు త్వరగతిన స్పందించేందుకు యాడ్ చేసేవాళ్లు. ఇకపై ఈ ఫీచర్ ఛాట్షేర్ యాక్షన్ మెనూకి సైతం చేర్చునున్నారు. స్టిక్కర్ స్టోర్ వాట్సాప్‌లో సాధారణంగా ఇతర యాప్‌ల సాయంతో స్టిక్కర్లు పంపుకోవడం తెలిసిందే. అయితే ఇకపై ఎంపిక చేసిన స్టిక్కర్స్‌ను నేరుగా వాట్సాప్ ద్వారానే పంపుకునే విధంగా స్టిక్కర్ స్టోర్ ఆప్షన్ తీసుకురాబోతోంది వాట్సాప్. వెబ్ అప్లికేషన్స్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షలకు ఈ ఆప్షన్‌ను అందించనుంది. కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ ఫీచర్. ఇది గ్రూప్ అడ్మిన్ల కోసం తీసుకురాబోతున్న ఫీచర్. తద్వారా మల్టీపుల్(ఒకటి కంటే ఎక్కువ) గ్రూపులు అడ్మిన్ కంట్రోల్ చేతిలో ఉంటాయి. అంతేకాదు సబ్ గ్రూపులను క్రియేట్ చేసే వీలుంటుంది కూడా. మెసేజ్ రియాక్షన్స్ దీని గురించి ఆల్రెడీ చర్చించిందే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మాదిరి.. మెసేజ్‌లకు ఎమోజీల ద్వారా నేరుగా రియాక్ట్ అయ్యే వెసులుబాటు కల్పించడం. ప్రస్తుతం ఆరు ఎమోజీల సాయంతో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది వాట్సాప్. స్టిక్కర్ సజెషన్స్ వాట్సాప్‌లో ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్ లోడ్ చేశారనుకోండి!. ఒకటి కంటే ఎక్కువ స్టిక్కర్లకు(సేమ్ స్టిక్కర్) సరిపోయేలా ఏదైనా టైప్ చేస్తే.. అప్పుడు అందులో ఓ స్టిక్కర్ చిహ్నం(కన్ఫ్యూజ్కి గురి చేయకుండా) ఆటోమేటిక్‌గా మారుతుంది. ఎందుకంటే వాట్సాప్ సర్వర్‌లో కాకుండా కేవలం డివైజ్‌లో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేశారు కాబట్టి. ఆ స్టిక్కర్లకు WhatsAppతో సంబంధం ఉండదు కాబట్టి. ఈ ఫీచర్ యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. సేవ్ చేయకుండా స్టిక్కర్లు ఫార్వాడ్ చేయడం సాధారణంగా వాట్సాప్‌లో ఎవరైనా స్టిక్కర్లు పంపితే.. వాటిని సేవ్ చేయకుండా మరొకరికి పంపలేం. అందుకే సేవ్ చేయకుండానే పంపే ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. చదవండి: వాట్సాప్ నెంబర్ పదే పదే బ్యాన్ అవుతోందా? ఇలా చేయండి -
మిద్దె తోటల సాగుపై 54 వాట్సప్ గ్రూప్‌లు
ప్రకృతి/ సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు, మిద్దె తోటల సాగుపై నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఊపందుకుంటున్నది. మిద్దె తోటల నిర్మాణంపై మౌలిక అవగాహన కల్పించడంతోపాటు రోజువారీ నిర్వహణ, చీడపీడల సమస్యలపై సందేహాలు తీర్చుకునేందుకు మాటసాయం కల్పిస్తే సేంద్రియ ఆహారాన్ని ఉన్నంతలో స్వయంగా పండించుకోవటం నేర్చుకునే పట్టణ ప్రాంతీయులకు మేలు జరుగుతుంది. ఈ లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని 46 జిల్లాలు, దేశంలోని ఆరు మెట్రో నగరాలలో నివాసం ఉండే తెలుగు వారి సౌకర్యార్థం మిద్దె తోటల నిపుణుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి జిల్లాకూ ఒక గ్రూపు ఏర్పాటైంది. కృష్ణా జిల్లాకు రెండు గ్రూపులు అదనంగా ఏర్పాటు చేసినట్లు తుమ్మేటి తెలిపారు. ఏ జిల్లాలో నివాసం ఉండే వారు ఆ జిల్లా వాట్సప్ గ్రూపులో చేరవచ్చు. సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటల సాగు తప్ప ఇతర విషయాలకు ఈ గ్రూపులలో తావుండదు. ప్రభుత్వాల నుంచి, స్థానిక సంస్థల నుంచి రాయితీలు పొందడానికి సమష్టి గొంతుకను వినిపించడానికీ ఈ గ్రూపులు వేదికగా ఉపకరిస్తాయి. ఫేస్‌బుక్‌లోని తన వాల్‌పై అన్ని జిల్లాల గ్రూపు అడ్మిన్ల నంబర్లను తుమ్మేటి పేర్కొన్నారు. https://facebook.com/ragotamareddy.tummeti చాలా గ్రూపులకు రఘు అడ్మిన్‌గా ఉన్నారు. ఆయన మొబైల్ నంబరు 90001 84107. గ్రూపులో చేరే ఆసక్తిగల వారు ఏ జిల్లావారైనా ఆయనను వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు. -
వాట్సాప్ గ్రూపులపై పోలీసుల నజర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన విశ్వవిద్యాలయం: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులపై పోలీసులు దృష్టిసారించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులను గుర్తించేందుకు సీజ్ చేసిన తొమ్మిది మొబైల్ ఫోన్లను సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో ఆయా కళాశాలలకు, వాట్సాప్ గ్రూపులకు చెందిన వారిలో కలవరం మొదలైంది.విచారణలో కొన్ని కొత్త వాట్సాప్ గ్రూపులు, మరింత అదనపు సమాచారం రావడంతో వారందరికీ నోటీసులు పంపిస్తూ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ: దేశంలోని తొలి ప్రయోగం.. వాట్సాప్.. రైతుల హేట్సాఫ్
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నదాతలకు మెరుగ్గా ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారికి అనుక్షణం అండగా ఉంటోంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడమేగాక క్షేత్రస్థాయిలో వారి సమస్యలకు తక్షణం పరిష్కారం చూపుతోంది. ఇప్పటికే 4.5 లక్షలమంది రైతులు ఈ గ్రూపుల్లో చేరి సాగులో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 38.14 లక్షల హెక్టార్లు. దాంట్లో 15.99 లక్షల హెక్టార్లలో వరి, 3.63 లక్షల హెక్టార్లలో అపరాలు, 7.98 లక్షల హెక్టార్లలో నూనెగింజలు, 6 లక్షల హెక్టార్లలో పత్తి, 1.50 లక్షల హెక్టార్లలో మిరప, మిగిలినదాన్లో ఇతర పంటలు సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో 54 లక్షలమంది రైతులున్నారు. మొత్తం రైతుల్లో 70 నుంచి 80 శాతం మంది వరి, అపరాలు సాగుచేస్తున్న వారే. ఇప్పటివరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సమాచారం కావాలంటే రైతుభరోసా కేంద్రానికి (ఆర్బీకేకు) వెళ్లి సిబ్బందిని అడిగి తెలుసుకునేవారు. సాగువేళ సందేçహాలు, సమస్యలొస్తే తెలిసిన రైతుకో, సమీప వ్యవసాయాధికారికో చెప్పి వారి సలహాలు, సూచనలు పాటించేవారు. సమస్య తీవ్రంగా ఉంటే శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లి నివారణ చర్యలు తీసుకునే వారు. అరచేతిలోనే సమగ్ర సమాచారం రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు పనిచేస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల వారీగా రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా ప్రాంతాల వలంటీర్లను కూడా చేర్చారు. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న రైతులను ఇప్పటికే ఈ గ్రూపుల్లో చేర్చారు. రైతులు బేసిక్ ఫోన్ వాడుతుంటే వారి కుటుంబసభ్యుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారి నంబరును ఈ గ్రూపులో చేర్చారు. ఫోన్లు ఉపయోగించని రైతులకు వలంటీర్ల ద్వారా గ్రూపులోని సమాచారం తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 19,364 గ్రూపులు ఏర్పాటు చేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,481 గ్రూపులు ఏర్పాటు చేయగా, అత్యల్పంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 846 గ్రూపులు ఏర్పాటు చేశారు. మిగిలిన వారిని కూడా ఖరీఫ్ సాగు పూర్తయ్యేలోగా గ్రూపుల్లో చేర్చాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్బీకేలో విత్తన, ఎరువులు, పురుగుల మందుల నిల్వలు ఎంతున్నాయి? ఆర్బీకే చానల్ ద్వారా ఏ పంటకు సంబంధించి ఏ శాస్త్రవేత్త ఎప్పుడు రైతులతో ముఖాముఖి అవుతున్నారు? ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. జిల్లాస్థాయి వనరుల కేంద్రంలోని కేవీకే, వర్సిటీ శాస్త్రవేత్తలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పంటలను పరిశీలించి ఆడియో, వీడియో సందేశాలు (మెసేజ్‌లు) తయారు చేస్తున్నారు. 20 సెకన్ల నుంచి ఒకటిన్నర నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ సందేశాలను వాట్సావ్ గ్రూపుల్లో ఉంచుతున్నారు. ఈ వీడియోలకు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వీడియో సందేశంతో సమస్య తీరింది ఖరీఫ్‌లో సాగుచేస్తున్న మిరపలో ముడత బాగా ఎక్కువగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆర్బీకేలో మిరప సాగు రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో శాస్త్రవేత్తలు పెట్టిన వీడియో చూశాను. ఎవర్నీ అడగలేదు. ఆ వీడియోలో చెప్పినట్టు ఫిప్రోనిల్ 250 గ్రాములు, మోనోక్రోటోపాస్ 250 గ్రాములను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేశా. మరుసటి రోజుకు ముడత తగ్గిపోయింది. ఇలా ఏ సమస్య వచ్చినా వీడియో రూపంలో మాకు చక్కని పరిష్కారం చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – చిట్టినేని వెంకటసతీష్‌కుమార్, చినఓగిరాల, కృష్ణా జిల్లా రైతులకు మరింత చేరువవ్వాలనే.. ఆర్బీకేల్లో వ్యవసాయ సహాయకులు రైతులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను తెలియజేస్తున్నారు. సాగువేళ వారికొచ్చే సందేహాలు, సమస్యల పరిష్కారానికి ఈ గ్రూపులు ఎంతగానో దోహద పడుతున్నాయి. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, మిల్లెట్స్‌తో సహా ప్రధాన పంటలను కవర్ చేసేలా వ్యవసాయ విస్తరణ విభాగం తెలుగులో రూపొందించిన వాట్సప్ సందేశాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయశాఖ పంటలవారీ రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల సంఖ్య పంట వాట్సాప్ గ్రూపుల సంఖ్య వరి, ఇతర ఆహారధాన్యాలు 9,181 ఉద్యానపంటలు 2,208 అపరాలు 2,178 నూనెగింజలు 2,132 పత్తి 1,737 మిరప 788 చెరకు 457 పసుపు 150 పట్టు 150 కొబ్బరి 127 పొగాకు 61 తమలపాకు 3 ఇతర పంటలు 192 మొత్తం 19,364 -
వాట్సాప్ గ్రూప్స్‌తో విసుగుచెందారా..! అయితే ఇది మీ కోసమే..!
ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌తో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్సాప్ యాప్‌లో మనందరికీ గ్రూప్‌లు ఉండే ఉంటాయి. ఫ్యామిలీ గ్రూప్, స్కూల్ ఫ్రేండ్స్ గ్రూప్స్, ఆఫీస్ కోలిగ్స్ గ్రూప్ ఇలా..ఎన్నో..మనకు తెలిసిన వాళ్లతో గ్రూప్‌ను క్రియేట్ చేసి మన అభిప్రాయాలను ఆయా సభ్యులతో పంచుకుంటాం. వాట్సాప్ గ్రూప్‌లో మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ...మనకు తెలియకుండా వేరే ఇతర వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేస్తే కాస్త ఇబ్బంది కల్గుతుంది. మనలో కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే..! కొన్ని సార్లు వాట్సాప్ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లతో అప్పుడప్పుడు మనలో చాలా మందికి విసుగు వస్తుంది. కాగా వాట్సాప్‌లోని ఒక చిన్న ట్రిక్‌తో తెలియని వాట్సాప్ గ్రూప్‌ల బెడద నుంచి తప్పించుకోవచ్చును. వాట్సాప్ గ్రూప్‌ల్లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయాలనే విషయాన్ని నిర్ణయించవచ్చును. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా ఉండటం కోసం ఇలా చేయండి..! మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి. స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. తరువాత ‘సెట్టింగ్’ పై క్లిక్ చేయండి. తరువాత ‘అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అకౌంట్‌పై క్లిక్ చేసిన తరువాత ‘ప్రైవసీ’ అప్షన్‌పై క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రీన్‌ను పైకి స్క్రోల్ చేసి ‘గ్రూప్స్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. 1. ఎవ్రీవన్, 2. మై కాంటాక్ట్స్, 3. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఎప్పుడు డిఫాల్ట్‌గా ‘ఎవ్రీవన్’ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లతో ఎవరు మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసే విషయాన్ని నిర్ణయించవచ్చును. ఎవ్రీవన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మిమ్మల్ని ఆయా వాట్సాప్ గ్రూప్‌లో ఏవరైనా యాడ్ చేయవచ్చును మై కాంటాక్ట్స్ ఆప్షన్‌తో మీ కాంటాక్ట్ లిస్ట్‌లో మీరు సేవ్ చేసిన నంబర్లకు మాత్రమే ఇతర వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ద్వారా సదరు వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా చేయవచ్చును. మిమ్మల్ని ఎవరు ఇతర గ్రూప్‌ల్లో యాడ్ చేసే వారిని మీరు ఎంచుకోవచ్చును. మీకు నచ్చిన విధంగా సెట్టింగ్‌లను ఎంచుకోని సేవ్ చేస్తే చేయాలి. మిమ్మల్ని ఎవరు వేరే వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేయలేరు. -
పోలీస్ వాట్సప్ గ్రూప్‌లో మట్కా డాన్ కూతురు..
సాక్షి, బొమ్మలసత్రం: దొంగకు ఇంటి తాళాలు ఇవ్వడం అనేది ఓ సామెత. ఇక్కడ పోలీసులే ఆ పని చేసి అందిరినీ ఆశ్చర్య పరిచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే నిందితులకు స్టేషన్ తాళాలు ఇచ్చేశారు. ముందస్తు దాడుల వివరాలు, ఎఫ్ఐఆర్ నమోదు, నిందితుల రిమాండ్ తదితర వివరాలు నిందితులకు ఎప్పటికప్పుడు తెలిసే లా ఏర్పాటు చేశారు. పోలీసులకు చెందిన వాట్సప్ గ్రూపులో నంద్యాల మట్కా డాన్ కుమార్తె నంబర్ ఉన్నట్లు పోలీసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. గ్రూప్‌లో ఆమె నంబర్ ఉండటంతో పోలీసుల దాడుల వివరాలు ముందే తెలుసుకుని ఆ సమాచారాన్ని మట్కా నిర్వాహకులకు తెలియజేస్తూ తప్పించేది. ఈ విషయం బయటపటంతో నంద్యాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈనెల 13వ తేదీ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో త్రీటౌన్ పరిధిలో ఉన్న కొలిమిపేటకు చెందిన చాంద్‌బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి మట్కా నిర్వ హిస్తుండగా సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐలు తిరుపాలు, నగీనా సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. చాంద్‌బాషా కుటుంబంలోని ఓ మహిళ సెల్ నెంబర్ త్రీటౌన్ అఫీషియల్ వాట్సప్ గ్రూప్‌లో ఉండటాన్ని పోలీసులు గమనించి వెంటనే గ్రూప్ నుంచి తొలగించారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణకు ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన కానిస్టేబుల్ హరిప్రసాద్‌ను సస్పెండ్ చేసి పూర్తి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఇద్దరు మహిళా పోలీసుల పాత్రపై కూడా అనుమానం ఉండటంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
వాట్సాప్ అడ్మిన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు
ముంబై: వాట్సాప్ గ్రూపు నిర్వాహకుల విషయంలో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన, నేరపూరితమైన సమాచారం పంపితే అందుకు గ్రూప్ అడ్మిన్ జవాబుదారీ కాదని బొంబాయి హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. 33 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసుకు విషయంలో నమోదైన కేసును కొట్టివేస్తూ కోర్టు ఈ వాఖ్యలు చేసింది. వాట్సాప్ గ్రూపుల నిర్వాహకులకు దానిపై పరిమిత నియంత్రణ ఉందని కోర్టు పేర్కొంది. వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు కేవలం కొత్త సభ్యులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు కానీ, గ్రూపులో పోస్ట్ చేసిన కంటెంట్‌ను నియంత్రించలేరు లేదా సెన్సార్ చేయలేరు అని తెలిపింది. అసలు విషయానికి వస్తే.. కిశోర్ తరోన్ పై 2016లో గోండియా జిల్లాలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తరోన్ నియంత్రణలో ఉన్న వాట్సాప్ గ్రూపు సభ్యుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకాపోవడంలో విఫలమయ్యాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఓ గ్రూపులో కొందరు వ్యక్తులు మహిళా సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినా ఆ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న కిశోర్ తరోనే(33) స్పందించలేదని, ఆ సభ్యుడిని గ్రూప్ నుంచి తొలగించి లేదని కనీసం అతనిచే క్షమాపణ చెప్పించలేదు అని ప్రాసిక్యూషన్ వారు పేర్కొన్నారు. అతనిపై ఐపీసీ 354, 509, 107 సెక్షన్ల కింద, ఐటీ చట్టం 67వ నిబంధన కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ గ్రూప్ అడ్మిన్ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది. గ్రూపులో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేస్తే అతను మాత్రమే చట్టపరమైన చర్యలకు ఎలా బాధ్యుడు అవుతాడని కోర్టు స్పష్టం చేసింది. చదవండి: వాట్సాప్ స్టేటస్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? -
అమ్మాయిల వాట్సాప్ గ్రూపు.. అతడేం చేశాడంటే..
మీరెప్పుడైనా మీకు తెలియకుండా.. మీకు సంబంధం లేని వాట్సాప్ గ్రూపులో యాడ్ చేయబడ్డారా?. ఒక వేళ అలా అయితే ఏం చేస్తారు? వెంటనే ఆ గ్రూపులోనుంచి ఎగ్జిట్ అవుతారు. మీరు ఓ అబ్బాయయుండి.. అమ్మాయిల బ్యాచిలర్ పార్టీ గ్రూపులో యాడ్ చేయబడితే? ఏం చేసేవారో ఆలోచిస్తున్నారా?.. మీరేమో కానీ, టేలర్ అనే వ్యక్తి చేసిన పని ప్రస్తుతం అతన్ని సోషల్ మీడియా సెలెబ్రిటీని చేసింది. వివరాలు.. టేలర్ లోవరీ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం పొరపాటున ఉమెన్స్ బ్యాచిలర్ పార్టీ గ్రూపులో యాడ్ చేయబడ్డాడు. ఆ గ్రూపులో ఓ అమ్మాయి పెళ్లికి సంబంధించిన బ్యాచిలర్ పార్టీ గురించి చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు ఎవరో తనను ఎందుకు గ్రూపులో యాడ్ చేశారో తెలియక టేలర్ తికమకబడ్డాడు. ఆ గ్రూపులోనుంచి ఎగ్జిట్ అవుదామనుకున్నాడు. కానీ, అంతకంటే ముందు తానెవరో ఆ గ్రూపు వారికి తెలియజేయాలని భావించాడు. ఇందుకోసం ఓ వీడియో తీసి గ్రూపులో పెట్టాడు. ‘‘ లేడీస్! నా పేరు టేలర్ లోవెరీ. నన్ను కెల్లర్ బ్యాచిలర్ పార్టీకి పిలిచినందుకు సంతోషం. కెల్లర్‌కు శుభాకాంక్షలు. నేను లేడీస్ నైట్ పార్టీలో పాల్గొనటానికి విగ్ కొనుక్కోలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ( పాపం లిగాన్.. 68 ఏళ్లు జైల్లో.. అందర్నీ కోల్పోయి..) నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మీరనుకుంటున్న టేలర్(అమ్మాయి)ని కాదు. కాబట్టి మీరామెకు ఫోన్ చేసి సరైన అడ్రస్ కనుక్కోవటం మంచిది. బహుశా తనకు ఈ బ్యాచిలర్ పార్టీ గురించి తెలిసుండకపోవచ్చు. బ్యాచిలర్ పార్టీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. మరో సారి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నాడు. టేలర్ పంపిన వీడియోను గ్రూపులోని ఓ అమ్మాయి తన టిక్‌టాక్ ఖాతా ద్వారా షేర్ చేసింది. దీంతో వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
వాట్సాప్‌లో పెళ్లి పిలుపు, ఫేస్బుక్లో లైవ్
సాక్షి, అమరావతి బ్యూరో: గతంలో వివాహానికి ఆహ్వానించాలంటే బంధువులు, మిత్రుల ఇళ్లకు వెళ్లి పెళ్లి పత్రికలు అందజేసి కుటుంబ సమేతంగా విచ్చేయమని కోరేవారు. పెళ్లికి నెల రోజుల నుంచే పెళ్లి పత్రికల పంపిణీ మొదలుపెట్టేవారు. ఎవరెవరికి పత్రికలు ఇవ్వాలో కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఏ ఒక్క పేరు మరచిపోకుండా రాసుకొని మరీ ఆహ్వానించేవారు. పిలుపులను గౌరవించిన ఆహ్వానితులు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి పెళ్లి తంతును తిలకించి, దంపతులను ఆశ్వీరదించి, విందు ఆరగించి వచ్చేవారు. కరోనా మహమ్మారి, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పెళ్లిళ్లు మొత్తం ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. టెక్నాలజీ సహాయంతో కొత్త పుంతలు తొక్కుతున్న వివాహ వేడుకలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వాట్సాప్‌లో ఆహ్వానం.. వివాహ ఆహ్వాన పత్రికలు ఇది వరకు శ్రీరస్తు... శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ మొదలయ్యేవి. ఇప్పుడు హాయ్... అంటూ వాట్సాప్‌లో సందేశాల రూపంలో మొబైల్‌లోకి వచ్చిపడుతున్నాయి. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లను ఉపయోగించి వధూవరుల ఫొటోలు, కల్యాణ వేదిక, సమయం వివరాలతో డిజైన్ చేయిస్తున్నారు. చాలామంది ప్రీవెడ్డింగ్ షూట్ జరిపి, వాటితోనే వీడియో రూపంలో ఆహ్వానం పంపుతున్నారు. పెళ్లి కార్డులు పంపిణీ చేస్తే వాటిలో క్యూ ఆర్ కోడ్‌ను నిక్షిప్తం చేస్తున్నారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే వీడియో రూపంలో ఉన్న ఆహ్వానం, వేదిక, ప్రత్యక్ష ప్రసారాల వివరాలు తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ షేర్.. ఆకాశమంత పందిరి వేసి, భూమి అంత ముగ్గుతో ఆహ్వానం పలికే పెళ్లి ఇళ్లు గతంలో కనిపించేవి. బంధువులు, స్నేహితులకు ఆహ్వానితుల ఇళ్లు తెలియకపోయినా సందడి వాతావరణాన్ని చూసి పెళ్లి ఇంటికి చేరుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆహ్వానితుల వేదిక వద్దకు సులువుగా చేరుకోవడానికి వీలుగా గూగుల్ మ్యాప్ సహాయంతో లొకేషన్‌ను షేర్ చేస్తున్నారు. ఈ లొకేషన్ ఆధారంగా పెళ్లికి హాజరుకావాల్సిన వారు సులువుగా చేరుకొనే వీలుంది. ఆహ్వాన పత్రికలు, వాట్సాప్ సందేశాలలో గూగుల్ మ్యాప్ లొకేషన్‌ను తప్పకుండా ఉంచుతున్నారు. మరోవైపు ముఖ్యమైన బంధువులు, స్నేహితులలో ప్రత్యేకంగా ఫలానా ఇంటి వారి పెళ్లి అంటూ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిశ్చితార్థం మొదలు పెళ్లి ముగిసేవరకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. ఎప్పుడు వేదిక వద్దకు చేరుకోవాలి, ప్రత్యేకంగా అందరూ ఒకే విధమైన దుస్తులు ధరించడం, పెళ్లిలో తీసిన ఫొటోలు షేర్ చేయడం వంటివి ఈ గ్రూప్‌ల వేదికగా జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాలు.. కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లకు ఎక్కువ సంఖ్యలో బంధుమిత్రులను ఆహ్వానించడానికి వీలులేకుండా పోయింది. పిలిచినా వెళ్లడానికి సంశయిస్తున్న సమయం. ఈ క్రమంలోనే టెక్నాలజీని ఉపయోగించి పెళ్లి తంతును మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా హాజరు కావాలని కోరుకుంటున్నప్పటికీ కరోనా దృష్ట్యా వీలుపడం లేదని, ఆన్లైన్లో వీక్షించి.. మా నవదంపతులను మనసారా దీవించండి అంటూ పెళ్లింటి వారు కోరుతున్నారు. పెళ్లి కుమార్తె మండపానికి రావడంతో మొదలు, మాంగల్యధారణ, బంధుమిత్రుల ఆశీర్వచనాలు, విందుభోజనాల వరకు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేసేస్తున్నారు. మొబైల్ ఫోన్లకు లైవ్ లింకులను ప్రత్యేకంగా పంపుతున్నారు. తమకు ఇష్టమైన వారు పెళ్లికి హాజరుకాలేదన్న దిగులు లేకుండా పోతోంది. లైవ్‌లో చూస్తున్న వారు వధూవరులను నిండుమనసుతో ఆశీర్వదిస్తున్నారు. -
ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్ గ్రూప్'పై కేసు
సాక్షి, న్యూఢిల్లీ: మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'కట్టర్ హిందూ ఏక్తా' పేరుతో ఉన్న ఈ గ్రూప్‌లో మెసేజులు, ఫొటోలను పరిశీలించిన పోలీసులు.. మరో మతానికి వ్యతిరేకంగా ఈ గ్రూప్ పనిచేస్తోందని గుర్తించారు. ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయాలని ఈ గ్రూప్ వేదికగా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ వివరాలను సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో పొందుపరిచి కోర్టుకు నివేదించారు. ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి 24న పెద్ద ఎత్తును మత ఘర్షణలు జరిగిన మరుసటి రోజే ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 751 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. 1571 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 250 చార్జ్షీట్లు నమోదు చేసి 1153 మందిని నిందితులుగా చేర్చారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: చార్జిషీట్లో సల్మాన్ ఖుర్షీద్ పేరు!) -
టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూపులో బూతు వీడియోలు
లక్నో : పదవ తరగతి వాట్సాప్ గ్రూపు నిండా బూతు వీడియోలు దర్శనమిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగపత్కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదివే విద్యార్థి ఇంటర్నేషనల్ నెంబర్‌తో బయోలజీ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాడు. అందులో బూతు వీడియోలు, బయోలజీ టీచర్ ఫొటోలు ఉంచాడు. అంతేకాకుండా గ్రూపు సభ్యులు అసభ్యకరంగా చాట్ చేసుకుంటూ ఉన్నారు. దీని గురించి ఓ ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి : భైంసాలో విషాదం.. తల్లీ కూతురు ఆత్మహత్య -
సర్కారు బడుల్లోనూ వాట్సాప్ గ్రూపులు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకే పరిమితమైన వాట్సాప్ పర్యవేక్షణ... ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకూ చేరింది. కరోనా నేపథ్యం లో విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్లైన్ లేదా టీవీల ద్వారా పాఠ్యాంశ బోధనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 27 నుంచి విధులకు హాజరవుతున్న టీచర్లు.. తమ తరగతి విద్యార్థుల పర్యవేక్షణకు సామాజిక మాధ్యమాల వాడకాన్ని విస్తృతం చేశారు. ఇందులో భాగంగా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి.. క్లాస్ టీచర్ అడ్మిన్‌గా ఉంటూ విద్యార్థులను ఆ గ్రూప్‌లో సభ్యులుగా చేరుస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా బోధన కార్యక్రమాలను సాగిస్తుండగా, తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాట్సాప్ వాడకం అనివార్యమైంది. సూచనలు, సందేహాల నివృత్తి.. ఆన్లైన్ పాఠ్యాంశ బోధనకు వాట్సాప్ గ్రూప్ వారధిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి వీడియో పాఠాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి లో ఉపాధ్యాయులు ఇప్పటికే వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు సలహా సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ నిర్దేశించిన విధంగా వర్క్షీట్లను పోస్టు చేయగా, విద్యార్థులు వాటిని చూసి నోట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆన్లైన్, టీవీ పాఠాల టైమ్‌టేబుల్‌ను పోస్ట్చేస్తూ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలంటే ఆం దోళన కలిగించేదే అయినా.. టీచర్లు ప్రతి విద్యార్థితో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు కలిగే సందేహాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా లేదా నేరుగా ఫోన్ ద్వారా నివృత్తి చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ లేకుంటే..: పట్టణ ప్రాంత పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో దాదాపు 67 శాతం మందికి స్మార్ట్ఫోన్లు ఉన్నట్లు విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ఇందులో వాట్సాప్, ఇంటర్నెట్ ఉన్నవి 50 శాతం మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతంలోపు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద మాత్రమే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అన్న, అక్క, ఇతర కుటుంబసభ్యుల వద్ద ఫోన్లు ఉన్నా.. ఆన్లైన్ క్లాసుల సమయంలో అవి అందుబాటులో ఉండవనే సమాధానం వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాంటి వారికి ఉపాధ్యాయులు నేరుగా ఫోన్‌చేసి సూచనలిస్తున్నారు. డీడీ యాదగిరి ప్రసారాల షెడ్యూల్ విడుదల నేటి నుంచి దూరదర్శన్ యాదగిరి చానల్ ద్వారా వీడియో పాఠాల ప్రసారానికి సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రతి క్లాస్ అరగంట పాటు ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు ప్రసారమయ్యే పాఠాల వివరాలను ఇందులో పొందుపర్చింది. షెడ్యూల్‌ను అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు ఆన్లైన్ తరగతుల వివరాలను కూడా బోర్డు విడుదల చేసింది. -
వాట్సాప్ చాట్‌ను బహిర్గతం చేసిన సుశాంత్ సోదరి
బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తిపై ఉచ్చు బిగుస్తోంంది. అయితే తనకే పాపం తెలియదని, సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని రియా చక్రవర్తి ప్రముఖ ఛానల్ ఆజ్‌తక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సుశాంత్ కుటుంబంపై ఆమె పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రియా వాదనల్లో ఎంత మాత్రం నిజం లేదని పేర్కొంటూ సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ రియాకు సంబంధించి పలు వాట్సాప్ చాట్లను బహిర్గతం చేశారు. ఇందులో ప్రధానంలో రియా, షోయుక్ చక్రవర్తి, సిద్ధార్థ్ పిథాని, శ్యాముల్ మిరిండాల మధ్య జరిగిన సంభాషణ, అందులో సుశాంత్‌కు డ్రగ్ ఇవ్వడం లాంటి విషయాలను శ్వేతా బయటపెట్టారు. డూబీ (గంజాయి ) ఇవ్వండి అని షోయుక్ అడగగా, ఇప్పుడే సుశాంత్ తీసుకున్నాడు అని పిథాని బదులిచ్చాడు. జూలై 30, 2019న మరొక చాట్‌లో డూబీ కావాలి అని రియా అడగగా అట్నుంచి రోలింగ్, గెట్టింగ్ అనే సమాధానం వచ్చింది. ఎన్ఐఎఫ్డబ్ల్యూ పేరుతో ఉన్న ఈ వాట్సాప్ గ్రూపులో రియా, ఆమె సోదరుడు షోయుక్, సిద్ధార్థ్ పిథాని సహా మరికొందరు ఉన్నారు. (‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) డూబీ (గంజాయి) కావాలని, సుశాంత్ అది తీసుకున్నాడా లేదా లాంటి విషయాలే ఎక్కువగా చర్చించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను సుశాంత్ సోదరి శ్వేతా సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది. దోషులను అరెస్ట్ చేయండంటూ ఓ క్యాప్షన్‌ను జతచేశారు. అంతేకాకుండా తన కుటుంబంపై రియా చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తన సోదరుడు సుశాంత్‌ను ప్రేమ పేరుతో రియా వాడుకుందని ఆరోపించారు. ప్రతీ నెల 17 వేల రూపాయలు ఈఎంలు కట్టుకునే సాధారణ మధ్య తరగతి కుటుంబంలోని రియాకు దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్‌ను ఎలా పెట్టుకోగలిగిందంటూ ప్రశ్నించారు. కాగా జూన్ 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో బలన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ప్రస్తుతం రియాను కూడా విచారిస్తోంది. సుశాంత్‌తో పరిచయం నాటి నుంచి సహజీవనం, జూన్ 8న ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లడం తదితర విషయాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. (రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం) -
వాట్సాప్ గ్రూప్‌లో రూ.లక్ష పలికిన లడ్డూ పాట
సాక్షి, శ్రీకాకుళం : నగరంలో మొండేటివీధి శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో వినాయకచవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీగణపతి ఆలయ వాట్సాప్ గ్రూప్ ద్వారా లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ పాటలో నగరానికి చెందిన ఎన్.కిరణ్, కె.గోవింద్, అమరావతి శ్రీను, ఎస్.శ్రీను, జె.నవీన్‌లు సంయుక్తంగా రూ.1.03 లక్షలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఆలయం వద్ద స్వామివారి లడ్డూ ప్రసాదానికి అర్చకులు బద్రం కోదండరామాచార్యులు, బద్రం మాధవాచార్యులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి సమక్షంలో మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. -
వైరల్: వాట్సప్ గ్రూప్‌లోకి అశ్లీల చిత్రాలు
సాక్షి, బెంగళూరు: మాజీ కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు రవిగౌడ పాటిల్ దూళఖేడ మొబైల్‌ఫోన్ నుంచి కొన్ని అశ్లీల ఫోటోలు వాట్సప్ గ్రూప్‌లోకి వెళ్లడం వైరల్‌గా మారింది. అతని ఫోన్ నుంచి కొన్ని నీలిచిత్రాలు విజయపుర డీసీసీ ప్రెస్ గ్రూప్‌లో అప్లోడ్ అయ్యాయి. గ్రూప్‌లోని సభ్యులందరూ ఈ చిత్రాలను చూసి అవాక్కయ్యారు. ఇదేం బాగాలేదని గ్రూప్‌లోని కొందరు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దీనికి పాటిల్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీనిని గమనించిన గ్రూప్ అడ్మిన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వసంతహొనమాడే, రవిగౌడ పాటిల్‌ను గ్రూప్ నుంచి తొలగించారు. ఆదివారం ఉదయం రవిగౌడ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ క్షమాపణ కోరారు. శనివారం రాత్రి ఇంట్లో ముఖం కడుక్కోవడానికి వెళ్లిన సమయంలో చిన్నపిల్లలు మొబైల్ తీసుకుని ఆడుకుంటున్నారు. ఈ సమయంలో ఫోటోలు వెళ్లి ఉండవచ్చు, అందరూ నన్ను క్షమించాలని పాటిల్ సంజాయిషి ఇచ్చారు. చిన్నపిల్లలు అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తారంటే నమ్మశక్యంగా లేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. (పోర్న్సైట్లలో విద్యార్థినులు, లెక్చరర్ల ఫోటోలు) -
స్నేహితుడి చికిత్స కోసం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): చిన్ననాటి స్నేహితుడు రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ఆర్థిక ఇబ్బందుల విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు ఆదుకోవాలని సంకల్పించారు. అంతే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి స్నేహితుడికి ఆపద వేళ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్లితే... హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన కోయ లక్ష్మణŠ(23) అలియాస్ అరుణ్ ఈ నెల 16వ తేదీన మంచిర్యాల వైపు వస్తుండగా పాతమంచిర్యాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ్ది నిరుపేద కుటుంబం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే దిక్కుతోచని స్థితిలో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో లక్ష్మణ్ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వేంపల్లి గ్రామానికి చెందిన పిన్నం వెంకటేశ్, వోలపు రత్నకుమార్, పర్వతి తిరుపతి, ఎలుక మహేందర్‌లు కలిసి సహాయం చేయాలని సంకల్పించారు. ఇందుకు లక్ష్మణ్ సహాయ నిధి పేరుతో 130 మందితో కలిపి వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. గ్రూప్ సభ్యులు, మరో 21 మంది సోషల్ మీడియా ద్వారా స్పందించి మానవతా దృక్పథంతో తోచిన విధంగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాతల రూపంలో మొత్తంగా రూ.96,042 లను సమకూర్చి ఆస్పత్రిలో బిల్లు మొత్తం కట్టేశారు. లక్ష్మణ్ ప్రస్తుతానికి వేంపల్లిలోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆదుకున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్మణ్‌కు 2006–09 బీజెడ్సీ బ్యాచ్‌కు చెందిన చాణక్య డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు సైతం రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. -
కలెక్టరేట్ ఏ– సెక్షన్లో అవినీతి బాగోతం..
జిల్లాలోని అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన కలెక్టరేట్లో అవినీతి దర్శన మిస్తోంది. కలెక్టరేట్లోని ఏ–సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అవినీతి బాగోతం వాట్సాప్ మెసేజ్‌ల ఆధారాలతో బట్టబయలైంది. అసలే కుటుంబ యజమాని మృతి చెంది దీనస్థితిలో ఉంటూ..కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న బాధితులనే ఈ ఉద్యోగి లంచం డిమాండ్ చేయడం ఆ శాఖకే మచ్చ తెస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో అతి ముఖ్యమైన ఏ–సెక్షన్లో అవినీతి వ్యవహారం బయటపడడం చర్చనీయాంశమైంది. చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అవినీతిరహిత పాలన అందజేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అవినీతికి పాల్పడే ఎంతటి అధికారినైనా, ఉద్యోగినైనా సహించేది లేదని కఠిన చర్యలుంటాయని పలు మార్లు హెచ్చస్తున్నారు. అయినా కలెక్టరేట్ కార్యాలయంలోనే అవి నీతి తంతు విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఆకస్మికంగా మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు శాఖల్లో ఆకస్మికంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలిచ్చే నివేదికలు కలెక్టరేట్‌కు వచ్చాయి. ఈ నివేదికలను పర్యవేక్షించే ఏ–సెక్షన్‌లోని ఏ–7 జూనియర్ అసిస్టెంట్ అవినీతిని పాల్పడేందుకు స్కెచ్ వేశారు. వచ్చిన నివేదికల్లోని చిరునామాల ఆధారంగా గుట్టుచప్పుడు కాకుండా లంచం కోసం ప్రయత్నించారు. వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. కారుణ్య నియామకానికి అర్హత ఉన్న ఓ బాధితుడు సంవత్సరకాలంగా ఉద్యోగం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాడు. కరుణించని కలెక్టరేట్ ఏ–సెక్షన్ అధికారుల తీరుతో ఆ బాధితుడు విసిగిపోయాడు. చిట్టచివరిగా ఏ–7 సెక్షన్ చూసే సిబ్బందికి లంచం ఇచ్చేనా ఉద్యోగం పొందేందుకు సిద్ధమయ్యాడు. ఏ–7 ఉద్యోగి ఫోన్ నంబర్‌ను తీసుకుని వాట్సాప్ ద్వారా సంభాషణ జరిపాడు. దొరికాడు ఇలా.... ఆ ఉద్యోగికి లంచం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న బాధితుడు చివరికి ఇలా చేశాడు.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల మెయిల్ ఐడీలను ఆ బాధితుడు తెలుసుకున్నాడు. ఏ7 ఉద్యోగితో జరిపిన వాట్సాప్ సంభాషణల ఆధారాలను ఆ మెయిల్ ఐడీలకు పంపాడు. ఈ విషయం సాక్షి దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయి వివరాల కోసం సాక్షి మరింత సమా చారాన్ని సేకరించింది. సంవత్సరాల కొద్దీ పాతుకుపోయారు కలెక్టరేట్లోని పలు విభాగాల్లో కొంతమంది ఉద్యోగులు సంవత్సరాల కొద్దీ పాతుకుపోయారు. ఏళ్లు గడుస్తున్నా వారు మాత్రం మరో చోటకు బదిలీ అయిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏ–సెక్షన్లో కొందరు ఏళ్ల తరబడి ఒకే సీటులో తిష్ట వేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే అవినీతికి తావిస్తోంది. కొందరు చేస్తున్న తప్పులకు ఆ శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తోంది. కలెక్టర్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కలెక్టరేట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాట్సాప్ సంభాషణ ఇలా.. బాధితుడు : సార్, చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. ఏ7 ఉద్యోగి : ఒక సంవత్సరమా.. రెండు సంవత్సరాలా... బాధితుడు : ఒక సంవత్సరానికి పైగా సార్... ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా సార్... ఏ7 ఉద్యోగి : ఎస్... నువ్వు అనుకుంటే త్వరగా అవుతుంది... మంచి డిపార్టుమెంట్ కూడా బాధితుడు : నేను ఏమీ చేయాలి సార్.. ఏ7 ఉద్యోగి : రూ.80వేలు బాధితుడు : సార్, నేను చాలా పేదవాణ్ణి... నా పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోండి ఏ7 ఉద్యోగి : రూ.65 వేలు బాధితుడు : సార్, ప్లీజ్ దండం పెడుతాను.. ప్రస్తుతం నా కుటుంబ పరిస్థితులకు ఉద్యోగం చాలా ముఖ్యం సార్, ఏ7 ఉద్యోగి : ఓకే, రూ.50 వేలు ఫైనల్ ఏ7 ఉద్యోగి : ప్రశ్న గుర్తును పెడుతూ... ఓకే.. ఇక నీఇష్టం... గుడ్‌లక్ చర్యలుంటాయ్ అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదు. ఏ–సెక్షన్‌లోని ఏ7 ఉద్యోగిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తాం. తప్పు తేలితే కఠినచర్యలు ఉంటాయ్. ఉద్యోగాల కోసం ఎవ్వరూ ఏ అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. – నారాయణభరత్‌గుప్తా, కలెక్టర్ -
పెళ్లయిన ఐదు రోజులకే నవవధువు..!
కరీంనగర్, రామగుండం: పెళ్లయిన ఐదురోజులకే నవ వధువు అత్తారింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం అంతర్గాం మండల పరిధిలోని పొట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..మండలంలోని ముర్మూర్ గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు–మల్లమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు కాగా మమత చిన్నకూతురు. పొట్యాల గ్రామానికి చెందిన మస్కం రాయమల్లు అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఏకైక కుమారుడు మస్కం స్వామి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి ఈ నెల 11వ తేదీన కట్నకానుకలతో వివాహం జరిపించారు. (నా చావుకు ఎవరూ బాధ్యులు కారు) ఈ నేపథ్యంలో పెళ్లయిన ఐదురోజుల్లోనే పొట్యాలలోని అత్తారింట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృతురాలు చివరగా తన సెల్‌ఫోన్ వాట్సప్‌లో చాటింగ్ చేసిన మెసేజ్, ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా యువతికి, యువకుడికి గతంలో వివాహం అయి విడాకులు అయినట్లు తెలిసింది. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సీఐ తాండ్ర కరుణాకర్‌రావు, అంతర్గాం ఏఎస్సై పురుషోత్తంరెడ్డి తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి యువతి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. (అప్పుడే పెళ్లి: వాంతి వస్తోందని చెప్పి వధువు..) -
వాట్సాప్‌లో పెళ్లి ఫోటోలు.. మనస్తాపంతో..
రంగారెడ్డి ,దౌల్తాబాద్: ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని కుదురుమళ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి(23) మహబూబ్‌నగర్‌లో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఆమె, కుదురుమళ్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వివాహం చేసుకొని ఫొటోలు కూడా దిగారు. లాక్డౌన్ నేపథ్యంలో స్రవంతి గ్రామానికి వచ్చింది. ఆమెకు రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. కుటుంబీకులు ఈనెల 30న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. (ప్రేమ వివాహం.. బాలిక బలవన్మరణం ) ఈ విషయం తెలుసుకున్న తిరుపతయ్య స్రవంతిని వివాహం చేసుకునే అబ్బాయి గ్రామానికి వెళ్లి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిపాడు. అలాగే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలియడంతో స్రవంతిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అయితే, స్రవంతి, తిరుపతయ్య ప్రేమకు అదే గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య సహకరించాడు. మృతురాలి తండ్రి శైలేందర్ ఫిర్యాదు మేరకు తిరుపతయ్య, కోస్గి వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వజాన్ తెలిపారు. -
పాలడబ్బా కోసం ఫేస్బుక్ పోస్ట్
మేము గతంలో పని చేసిన సంస్థలోని ఉద్యోగులందరినీ కలుపుతూ ‘ప్రభ గ్రూప్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఒక విశ్రాంత జర్నలిస్టు ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టారు. ‘కరోనా జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి మేము సిద్ధమే. కానీ మా పిల్లలు వేరే దేశాల్లో ఉన్నారు. మేమిద్దరమే హైదరాబాద్‌లో ఉన్నాం. మాలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. మా వయసు వాళ్లు బయటకు వెళ్లకపోతే... సరుకులు, మందులు, ఇతర అవసరమైన పనులు ఎలా?’ అని ఆ పోస్ట్ సారాంశం. వెంటనే ‘మా ఇల్లు మీకు దగ్గరలోనే. మీ ఏరియా మీదుగానే రోజూ ప్రయాణిస్తుంటాను. ఏం కావాలో నా నంబర్‌కి మెసేజ్ పెట్టండి. రాత్రి ఇంటికి వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఇచ్చి వెళ్తాను’ అంటూ ముగ్గురు ప్రతిస్పందించారు. అప్పుడా పెద్దాయన... ‘మీరు స్పందించిన తీరు చాలా సంతోషంగా ఉంది. నేను అడిగిన సమస్య నా గురించి కాదు. నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లకు ఏదైనా వ్యవస్థీకృతమైన మార్గం ఉందా? ఫీల్డులో ఉన్న మీకు వివరాలు తెలిసి ఉంటాయని అడిగాను. మీరు తెలుసుకుని అందరికీ తెలియచేయండి’ అని మరో పోస్ట్ పెట్టారు. ఆయన చెప్పింది నిజమే. ‘ఒక సమస్య ఎదురైంది.. అంటే అందుకు పరిష్కారం కూడా ఉండే ఉంటుంది. ఆ పరిష్కారం ఏమిటో మనం వెతికి పట్టుకోవాలి. పరిష్కారం కోసం ఇప్పటి వరకు అలాంటి ఒక వ్యవస్థ లేకపోతే మనమే ఎస్టాబ్లిష్ చేయాలి. బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ మహితా నాగరాజ్ అదే పని చేశారు. ఫ్రెండ్ నుంచి ఫోన్ దేశం లాక్డౌన్లోకి వెళ్లడానికి కొద్ది ముందుగా ఓ రోజు మహితకు యూకేలో ఉన్న ఒక ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కోరమంగళలో ఉంటున్న ఆమె ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఎదురైన ఇబ్బంది తెలిసింది. ఆ రోజు వాళ్లకు కావలసిన వస్తువులను తీసుకెళ్లి ఇచ్చారు మహిత. ఆ మరుసటి రోజే యూఎస్ నుంచి మరో ఫ్రెండ్ నుంచి ఫోన్. అప్పుడామెకు ‘కోర్ మాంగర్స్ ఇండియా’ ఆలోచన వచ్చింది. బెంగళూరుతోపాటు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, నొయిడా, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఒడిషాల నుంచి దాదాపుగా ఐదు వందల మంది ఫేస్బుక్ మిత్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. బిడ్డ పాల కోసం పొద్దున్నే ఫోన్ ‘‘ఓ రోజు ఉదయం ఆరున్నరకు ఒక చంటిబిడ్డ తల్లి నుంచి ఫేస్బుక్ పోస్ట్‌తోపాటు ఫోన్ కాల్ కూడా వచ్చింది. తన బిడ్డకు బేబీ ఫార్ములా స్టాక్ తనకు దగ్గరగా ఉన్న స్టోర్‌లో దొరకలేదని, బిడ్డతో పెద్ద మార్కెట్లకు వెళ్లడం కుదరడం లేదని చెప్పింది. ఆ చంటిబిడ్డ పాల కోసం పాల డబ్బా తీసుకెళ్లి ఇవ్వడంలో ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. మా సర్వీస్ ఇలాంటి అవసరాల కోసమే మొదలు పెట్టాం. కానీ రెండు రోజుల కిందట ఒక పెద్దాయన వాళ్ల కాలనీలో ఉన్న ఏటీఎమ్ సెంటర్లో క్యాష్ స్టాక్ లేదని చెప్పాడు. ఆయనకు అకౌంట్లో డబ్బుంది. చేతిలో డబ్బులేదు. మరో కాలనీకి వెళ్లడం ఆయనకు కుదిరే పని కాదు. అప్పుడు నా దగ్గరకున్న క్యాష్ ఆయనకు ఇచ్చాను. ఆయన ఆన్లైన్లో నా అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఒకరికి సహాయం చేయాలని ముందుకు వస్తే... చేయాల్సిన ఎన్నో కనిపిస్తాయి. ఒక అవసరం ఏర్పడినప్పుడే దానికి పరిష్కారం కోసం ఒక ఆలోచన వస్తుంది’’ అన్నారు మహిత. ఛ్చిట్ఛఝౌnజ్ఛటటజీnఛీజ్చీ ఫేస్బుక్ పేజీలో కానీ, caremongersindia వెబ్సైట్లో కానీ సంప్రదించవచ్చు. – మంజీర -
అమ్మాయి బర్త్‌డే ఫొటోపై కామెంట్.. హత్య
సూర్యాపేట, కేతేపల్లి(నకిరేకల్) : మండలంలోని కొత్తపేట గ్రామంలో ఈనెల 17న జరిగిన వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య కేసులో భాగస్వాములైన పది మంది నిందితులను బుధవారం కేతేపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పొడేటి సింహాద్రి నకిరేకల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తన క్లాస్మేట్ అయిన ఓ అమ్మాయి జన్మదినం సందర్భంగా సింహాద్రి అమె ఫొటోతో కూడిన మెసేజ్‌ను శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేశాడు. వాట్సాప్ చూసిన కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ జహంగీర్ కుమారుడు సయ్యద్ ‘మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డార్లింగ్’ అని అమ్మాయి బర్త్‌డే ఫొటోపై కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సింహాద్రి తన స్నేహితుడైన కందికంట రజనీకాంత్, గ్రామ నాయకులు కత్తుల వీరయ్యలకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. వారిచ్చిన పోద్బలం, సహకారంతో సయ్యద్‌పై కక్ష పెంచుకున్న సింహాద్రి సయ్యద్‌ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈవిషయమై కందికంటి రజనీకాంత్, కత్తుల వీరయ్యలతో కలసి సింహాద్రి పలుమార్లు చర్చించాడు. ఎలాగైనా సయ్యద్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్న సింహాద్రి ఇందుకోసం అదే గ్రామానికి చెందిన తన స్నేహితులైన కందికంటి రజనీకాంత్, చందుపట్ల వెంకటేష్, చందుపట్ల వేణు, కందికంటి రాజశేఖర్, చందుపట్ల దిలీప్, చందుపట్ల మల్సూర్, ఏర్పుల భాను, చందుపట్ల ప్రదీప్, మందసాయిలతో కలసి పథకం వేశాడు. దీంతో ఈనెల 17న సాయంత్ర వేళ సయ్యద్ గ్రామంలోని బొడ్రాయి వద్ద ఉన్నాడని తెలుసుకున్న సింహాద్రి తన అనుచరులతో కలసి అక్కడి వెళ్లి ఘర్షణకు దిగారు. ఇదే సమయంలో బొడ్రాయి వద్దనే నివాసగృహం ఉన్న జహంగీర్ సోదరుడు షేక్ లతీఫ్(43) తన అన్న కుమారుడు సయ్యద్‌పై యువకులు చేస్తున్న దాడిని చూసి అడ్డుకునేందుకు వెళ్లాడు. రాత్రిపూట గొడవ వద్దని, ఏమైనా వివాదం ఉంటే మరునాడు పరిష్కరించుకోవాలంటూ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన సింహాద్రి అనుచరుల్లో ఒకరైన కందికంటి రజనీకాంత్ తమ వెంట తెచ్చుకున్న కత్తితో లతీఫ్ ఛాతిపై పొడవగా, కిందపడిపోయిన లతీఫ్‌పై మిగిలిన వారు భౌతిక దాడి చేసి చంపారు. హత్య జరిగిన నాటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. మృతుడి భార్య షేక్ ఉస్మాన్‌బేగం ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఈక్రమంలో బుధవారం ఉదయం కొత్తపేటలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మైనర్ నిందితులైన పొడేటి సింహాద్రి, ఏర్పుల భాను, చందుపట్ల ప్రదీప్, మందసాయిలతో పాటు కందికంటి రజనీకాంత్, చందుపట్ల వెంకటేష్, చందుపట్ల వేణు, కందికంటి రాజశేఖర్, చందుపట్ల దిలీప్, చందుపట్ల మల్సూర్‌లను అరెస్టు చేసి రిమాండ్ చేశామని డీఎస్పీ వివరించారు. ఈకేసులో ఏ–4 గా ఉన్న మరో నిందితుడు కత్తుల వీరయ్య పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు బైక్‌లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించిన శాలిగౌరారం సీఐ నాగదుర్గ ప్రసాద్, కేతేపల్లి ఎస్ఐ బి.రామక్రిష్ణ, ఏఎస్ఐ గిరి, సిబ్బంది రాము, శ్రీరాములు, జానీలను డీఎస్పీ అభినందించారు. -
సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఆత్మహత్యాయత్నం
వైఎస్ఆర్ జిల్లా, వేముల : విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగి శివసాగర్‌రెడ్డికి కరోనా ఎఫెక్ట్ పడింది. ఇదేదో కరోనా వైరస్ బారిన పడ్డారని అను కుంటే పొరపడినట్లే. కరోనా వైరస్ గురించి గ్రూపు లో పెట్టడమే అతని ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టు ఉద్యోగి శి వసాగర్రెడ్డి డ్యూటీ ఇవ్వకపోతే పురుగుల డబ్బా తో ఆత్మహత్య చేసుకుంటానని ట్రాన్స్‌కో ఇన్చార్జి ఏఈ సుబ్బరాయుడుకు తెలిపారు. అయినా ఏఈ స్పందించకపోవడంతో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఉన్న తోటి సిబ్బంది అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లెకు చెందిన శివసాగర్‌రెడ్డి వేముల మండలం వి.కొత్తపల్లె సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 12న విధులలో ఉన్న ఆయన కరోనా వైరస్ గురించి వి ద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. అధికారుల గ్రూప్‌లో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడంపై ట్రాన్స్‌కో అధికారులు ఆ గ్రహించారు. సోమవా రం విధులకు హాజరైన శి వసాగర్రెడ్డికి రికార్డు అ ప్పగించవద్దని విధులలో ఉన్న మరో ఆపరేటర్‌కు ఆదేశాలు ఇచ్చారు. కరోనా వైరస్ గురించి గ్రూప్ లో పెట్టడంపై వివరణ ఇవ్వాలని అధికారులు ఆపరేటర్ శివసాగర్‌రెడ్డికి సూచించారు. ఇందుకు శివసాగర్‌రెడ్డి అంగీకరించలేదు. వివరణ ఇస్తేనే విధుల్లోకి తీసుకుంటామని ట్రాన్స్‌కో అధికారులు కరాకండిగా చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు పురుగుల డబ్బాతో వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను బెదిరించాడు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించకపోవడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి సిబ్బంది అడ్డుకొని పురుగుల డబ్బా లాక్కున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో ఆరా తీసినట్లు సమాచారం. -
‘వాట్సాప్’ అడ్మిన్లూ బహుపరాక్!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమయ్యే పుకార్లకు వాటి అడ్మిన్లు బాధ్యత వహించాల్సి వస్తుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా వీడియో క్లిప్పింగ్‌ను ఫార్వర్డ్ చేసే ముందు పక్కాగా సరిచూసుకోవాలని సూచించారు. ఇటీవల మార్ఫింగ్ చేసిన, ఎక్కడెక్కడిలో కలిపి జోడించిన వీడియోలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయన్న ఆయన ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి గ్రూప్ అడ్మిన్ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అలా కాకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగర షీ–టీమ్స్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, శుక్రవారం చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న రన్స్‌కు హోంమంత్రి మహమూద్ అలీ అతిథులుగా హాజరవుతున్నారని అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పెట్రోలింగ్ వాహనాల వద్ద కేసులు నమోదు విధానం ప్రారంభించామని, ఇప్పటి వరకు 156 ఎఫ్ఐఆర్లు, 893 పెట్టీ కేసులు రిజిస్టర్ అయినట్లు కొత్వాల్ వివరించారు. అలాగే నగరంలో వృద్థులకు ఆసరాగా ఉండటానికి పోలీసుస్టేషన్ల వారీగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్నామని, త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. (హాయ్.. నేను విజయ్ దేవరకొండ అంటూ..) -
కాంగ్రెస్ వాట్సాప్‌లో టీఆర్ఎస్, బీజేపీల ప్రచారం
నారాయణఖేడ్: మున్సిపోల్స్ ప్రచారానికి కాంగ్రెస్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రచారం ఆశ్చర్య పరుస్తుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం కాంగ్రెస్ ‘మున్సిపల్ కాంగ్రెస్ ఎన్‌కేడీ’అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఈ గ్రూప్‌నకు ‘ఇన్వైట్ లింక్’ ఇవ్వడంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నేతలు సైతం యాడ్ అయ్యారు. ఆపై తమ పార్టీకి ఓటేయాలనే ప్రచార చిత్రాలను పోస్ట్ చేశారు. టీఆర్ఎస్కు ఓటేయాలని వీడియోలు, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బీఫారాలు ఇచ్చే ఫొటోలు, టీఆర్ఎస్ అభ్యర్థి ఫొటోలు పోస్ట్ చేశారు. అలాగే బీజేపీకి ఓటేయాలంటూ ఆ పార్టీ అభిమాని సైతం వీడియోను పోస్ట్ చేశారు. -
రాంగ్ కాల్ రోమియోలు.. మెసేజ్‌లు, ఫొటోలు
కావలికి చెందిన దేవి (పేరు మార్చాం)కి చెందిన ఫోన్ నంబరుకు నెల రోజులుగా వాట్సాప్‌లో ఓ నంబరు నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయి. మెసేజ్‌లతో పాటు అశ్లీల వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నాడు. ఆ మెసేజ్‌లు చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వాట్సాప్ మేసేజ్‌ల వేధింపులపై కావలి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో మెసేజ్‌లు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో అసభ్యకరమై సందేశాలు వచ్చాయి. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమెనే అనుమానించి వేధించడం ప్రారంభించారు. నువ్వు వాడికి తెలియకపోతే నీ నంబరు ఎలా తెలుస్తుంది.. నీకెలా అంత ధైర్యంగా పంపిస్తాడంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. సంతోషంగా సాగిపోతున్న ఆమె కుటుంబంలో కలతలు చోటు చేసుకోవడంతో ఆమె మానసికంగా నరకాన్ని చవిచూస్తోంది. ఎవరో చేసిన తప్పుకు ఆమె శిక్ష అనుభవిస్తోంది. సాక్షి, నెల్లూరు: మహిళలకు ఇంటా.. బయటే కాదు.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోనూ భద్రత లేకుండా పోతోంది. సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో రాంగ్ కాల్ చిచ్చు రగులుతోంది. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. పోకిరీలు మహిళలను టార్గెట్ చేసి వారిని లొంగదీసుకునేందుకు ‘మిస్డ్ కాల్’ వలలు విసురుతున్నారు. మహిళల అభద్రతాభావాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్ ఐడీలతో సిమ్‌లు సేకరిస్తున్నారు. ఏదొక నంబర్లకు కాల్ చేస్తున్నారు. ఎవరిదో మిస్డ్ కాల్ వచ్చిందని తిరిగి చేస్తే.. అది మహిళ గొంతు అయితే రాంగ్ కాల్ వచ్చిందంటూ మాటలు కలుపుతున్నారు. ఆ నంబర్లకు వాట్సాప్ ఆప్షన్ ఉంటే.. దానికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. వీరి మెసేజ్‌లకు ఎవరైనా తిరిగి రెస్పాండ్ అయితే.. ఆ మెసేజ్‌లను అడ్డం పెట్టుకునిబ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లోని కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలు సేకరించి, వాటి ద్వారా అశ్లీల వీడియోలు, ఫొటోలుగా మార్ఫింగ్ చేసి వారికే పంపించి ఆర్థికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చాలా వరకు పోలీస్స్టేషన్లకు వెళ్లడం లేదు. వీలైనంత వరకు సిమ్ నంబర్లు మార్చేసుకోవడం, ఖాతాలను బ్లాక్ చేసుకోవడం చేస్తున్నారు. కూలిపోతున్న కాపురాలు.. కుటుంబాల్లో కలతలు రాంగ్ కాల్ రోమియోలు చేష్టలకు కొన్ని కుటుంబాల్లో కలతలు చోటు చేసుకుంటుంటే.. మరి కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణే.. నెల్లూరు భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన మహిళ ఉదంతం. ఇంకా వెలుగుచూడని ఘటనలు ఎన్నో ఉన్నాయి. అశ్లీల వీడియోలు, చిత్రాలతో మహిళలను మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు. కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్తే ఎక్కడ అపార్థం చేసుకుంటే.. ఏ పరిస్థితులకు దారి తీస్తాయో అనే భయంతో కుమిలిపోతున్నారు. ఈ పోకిరీల వలలో పడి కొందరు మహిళలు మోసపోయి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. వేధించడానికి ఆయుధంగా.. తమను ఇబ్బంది పెట్టిన మహిళలను వేధించడానికి కూడా కొందరు ఆయుధంగా వాడుకుంటున్నారు. కావలి మహిళకు పంపుతున్న మెసేజ్‌లు చూస్తుంటే.. ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆమె భూవివాదం విషయంలో నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేతతో పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇలాంటి మెసేజ్‌లు రావడంతో ఆ చోటా టీడీపీ నేతే తనను టార్గెట్ చేసి, వాట్సాప్‌లో అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పంపిస్తున్నట్లు అనుమానిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు చెప్పినా.. మహిళల భద్రత విషయంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. కానీ మహిళలపై ఇలాంటి వేధింపుల విషయంలో పోలీసులు ఏ మాత్రం కఠిన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కావలికి చెందిన దేవి వాట్సాప్‌లో వేధింపుల విషయంలో గత డిసెంబర్ 10న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక పోలీసులు విచారణ కూడా చేపట్టకపోగా ఆ నంబర్‌ను బ్లాక్ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. పోలీసుల ప్రవర్తన వల్ల మహిళలు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఏటా మహిళలపై వేధింపుల ఫిర్యాదులు తగ్గుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నా వాస్తవంగా పోలీసుల తీరుపై నమ్మకం లేక వెలుగులోకి తేలేకపోతున్నారు. -
తిరుమల లడ్డూపై వాట్సాప్‌లో దుష్ప్రచారం
తిరుమల : తిరుమల లడ్డూ, టీటీడీపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు గురువారం తిరుమలలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ‘తిరుపతి లడ్డా లేదా జీసెస్ లడ్డా?’ అనే శీర్షికతో డిసెంబర్ 29న వాట్సాప్‌లో ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమైంది. దీన్ని టీటీడీ ఖండించింది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వాట్సాప్‌లో ఈ సమాచారాన్ని పంపిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇలాంటి అవాస్తవ సమాచారం ఇకపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కాకుండా నిలువరించేందుకు క్రైం నంబర్ 2/2020 యూ/ఎస్ 500, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద టీటీడీ విజిలెన్స్ అధికారులు నమోదు చేశారు. -
వాట్సాప్‌లో గ్రూపులను టార్గెట్ చేసే బగ్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లోని వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేసే బగ్‌ను తాము గుర్తించినట్లు వాట్సాప్ వెల్లడించింది. దీని బారిన పడకుండా ఉండేందుకు తాజా వెర్షన్ 2.19.58కు అప్డేట్ చేసుకోవాలని మంగళవారం సూచించింది. బగ్ కారణంగా గ్రూపుల్లోని మెసేజులు శాశ్వతంగా డిలీట్ అవుతున్నాయని తెలిపారు. హ్యాకర్లు వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించి వెబ్ డీబగ్గింగ్ టూల్ ద్వారా గ్రూపుల్లో ప్రత్యేక పారామీటర్లు ఉన్న సందేశాలు పంపుతున్నారని తెలిపారు. దీనివల్ల గ్రూప్ క్రాష్ అయ్యి పనిచేయడం ఆగిపోతోందని వాట్సాప్ ప్రొడక్ట్ వల్నెరబిలిటీ రీసెర్చ్ చెక్ పాయింట్స్ హెడ్ ఓడెడ్ వనును తెలిపారు. అయితే ఈ హ్యాకింగ్ ప్రక్రియను సాగించే హ్యాకర్లు ఆయా గ్రూపుల్లో సభ్యులై ఉంటారని చెప్పారు. ఈ బగ్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వినియోగదారులు వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. -
వాట్సాప్ విజేతలు
వాట్సాప్‌లో దగ్గరివాళ్లంతా కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం ఒక ఆత్మీయ బంధం. వాట్సాప్‌లో ఒక గ్రామం పేరుతో గ్రూప్ క్రియేట్ చేసుకుని అభివృద్ధి వివరాలను తెలియ చేసుకోవడం ఓ సామాజిక బంధం. అలాగే వాట్సాప్‌ను చక్కగా వినియోగించుకుని వ్యక్తిగత నైపుణ్యాలకు మార్కెటింగ్ కల్పించుకోవడం ఒక వ్యాపార బంధం. ఈ బంధంతో వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న గృహిణులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. వారి నుంచి స్ఫూర్తిని పొందుదాం. నెల్లూరు పట్టణంలో చీరల షోరూమ్ నడుపుతున్న తుంగా భారతినే తీసుకోండి. ఆమె బిజినెస్ వాట్సాప్ ద్వారా చాలా వేగంగా జరిగిపోతోంది. ‘‘మొదట్లో నేను హాబీగా ఫ్రెండ్స్‌కు, బంధువులకు వాళ్లకు నప్పే విధంగా డ్రస్‌లు డిజైన్ చేయించి ఇచ్చేదాన్ని. నా పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత రోజంతా ఖాళీ అనిపించేది. దాంతో రెండేళ్ల కిందట పూర్తి స్థాయిలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. ఇప్పుడు ‘విఆర్కే’ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నాను. నా కస్టమర్లు ఎక్కువమంది విదేశాల్లో ఉన్నారు. అందరం వాట్సాప్ గ్రూప్‌తో కనెక్ట్ అయి ఉన్నాం. కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఆ రోజే ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో షేర్ చేస్తే, తెల్లవారి నిద్ర లేచేసరికి ఆర్డర్లు రెడీగా ఉంటాయి. వాళ్ల సందేహాలు కూడా. వాటన్నింటికీ ఓ గంటలో మా టీమ్ రిప్లయ్ ఇచ్చేస్తుంది. ఆర్డర్లుగా వచ్చిన చీరలకు వర్క్ బ్లవుజ్ కూడా రెడీ చేయించి సోమవారం కొరియర్ చేస్తే గురువారానికి అమెరికాకు చేరిపోతాయి. ఆ వీకెండ్ పార్టీకి కట్టేసుకుంటారు. మొత్తం టాస్క్ పది రోజుల నుంచి రెండు వారాల్లో పూర్తయిపోతుంది’’ అని చెప్పారు భారతి. ఢిల్లీలో మరాఠా భోజనం అభిలాష ఐదేళ్ల కిందట ఇంట్లో వంటలు చేసి ఢిల్లీలోని మరాఠీయులకు సప్లయ్ చేయడం మొదలు పెట్టాలనుకుంది. మెల్లిగా దాన్నే వ్యాపారంగా మలుచుకుంది. పెద్ద పెద్ద క్యూజిన్లు, కాంటినెంటల్ ఫుడ్ రెస్టారెంట్ల కాలంలో కూడా అభిలాష ఫుడ్ బిజినెస్ విస్తరించింది. వాట్సాప్ అనే లాంచింగ్ పాడ్ మీదనే తన వ్యాపారం సాగుతోందని చెప్పింది అభిలాష. ‘‘నేను గృహిణిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేదాన్ని. చాలా మంది మహిళలు ఏదో ఒక అభిరుచితో ఉండడాన్ని గమనించాను. నేను ఖాళీగా రోజు గడిపేస్తున్నాననిపించింది. ఏదైనా చేద్దామంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు వంట చేయడం ఇష్టం. కాబట్టి తెలిసిన పని, ఇష్టమైన పనిలోనే ప్రవేశించాలనుకుని ఓ రోజు నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లందరికీ ‘సంప్రదాయ మార్వాడీ భోజనాన్ని వండుతాను’ అని మెసేజ్ పెట్టాను. ‘మాకు కావాలంటే మాక్కావాలంటూ..’ అని నేను ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. అలా మొదలైన నా భోజన వ్యాపారం ఇప్పుడు పది వాట్సాప్ గ్రూపులతో నడుస్తోంది. ఒక్కో గ్రూప్‌కి 250 మంది లెక్కన నా ఫుడ్ కస్టమర్లతో పది గ్రూపులున్నాయిప్పుడు. డెబ్బై శాతం వ్యాపారం వాట్సాప్ ఆర్డర్ల ద్వారానే సాగుతోంది. అన్నీ ‘టేక్ అవే’నే! ఇలానే మరికొందరు షబ్రి హోమ్ డెకోర్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్న గుంజన్ది కూడా ఇదే బాట. ఫేస్బుక్, వాట్సాప్‌లోనే వ్యాపారం జరుగుతోంది. వాట్సాప్ ద్వారా కస్టమర్ ప్రశ్నలకు బదులిస్తూ వారిని సమాధానపరచడం ద్వారా నిశ్శబ్దంగా జరిగిపోతోందని చెప్తోంది గుంజన్. పన్నెండేళ్ల పాటు ముంబయిలో అడ్వరై్టజ్‌మెంట్ ఫర్మ్‌లో పని చేసిన ఆమె ఇతర ఉద్యోగాలకంటే ఇదే బాగుందని చెప్పింది. ‘యునిక్ త్రెడ్స్’ షణ్ముఖ ప్రియది కూడా వాట్సాప్ విజయమే. చంటి బిడ్డను చూసుకునే వాళ్లు లేక ఈ తమిళమ్మాయి ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. జీవితాన్ని నిరుపయోగంగా గడుపుతున్నాననే భావన వేధించినంత కాలం వేధించిందామెను. పాపాయి పెద్దయిన తర్వాత ముప్పై వేలతో మొదలైన వస్త్ర వ్యాపారం ఇప్పుడు పదహారు వాట్సాప్ గ్రూపులతో నడుస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రీతి సిన్హా అయితే బిడ్డ పుట్టినప్పుడు తాను పెరిగిన బరువు తగ్గడానికి అనుసరించిన మార్గంలోనే వ్యాపారాన్ని ఎంచుకుంది. ‘గ్రీన్ అండ్ మోర్’ పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టింది. బరువు తగ్గడానికి, శక్తి పెరగడానికి డాక్టర్లు సూచించిన ఆహారాన్ని కస్టమర్ ఆరోగ్యానికి తగినట్లు వండి సప్లయ్ చేస్తోందీమె. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. మీలోనూ ఏదో చేయాలన్న తపన ఉంది. భారతి, అభిలాష, ప్రియాంక, గుంజన్, షణ్ముఖ ప్రియ, ప్రీతీ సిన్హా.. ఆ తర్వాతి పేరు మీదే ఎందుకు కాకూడదు? – వాకా మంజులారెడ్డి సరిహద్దు దాటిన కళ ప్రియాంక తన వస్త్ర వ్యాపారాన్ని వాట్సప్ యుగానికి ముందే మొదలు పెట్టింది. గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమైంది. రోజంతా నాలుగ్గోడల మధ్య ఉంటూ, ఏ పనీ చేయకుండా గడపడం ఆమెకు దుర్భరంగా తోచింది. చదువుకునే రోజుల్లో హాబీగా నేర్చుకున్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్నే ప్రవృత్తిగా మార్చుకుంది. పిల్లలతో పాటే ఆమె వ్యాపారమూ ఎదిగింది. పెయింటింగ్ చేయడానికి అనువుగా చీరల ప్యాటర్న్లు చేనేతకారులకు ఇచ్చి మరీ తయారు చేయించేది. ఇందుకోసం తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సప్ ద్వారా ప్యాటర్న్లు పంపించడంతో శ్రమ తగ్గిపోయింది. సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. గుర్గావ్లోనే ఉంటూ బెంగాల్ నుంచి న్యూ జెర్సీ వరకు తన క్లయింట్లతోనూ, తనకు పని ఇస్తున్న చేనేతకారులతోనూ కాంటాక్ట్‌లో ఉంటోంది. షో రూమ్ ద్వారా జరిగే వ్యాపారం కంటే వాట్సప్ ఆర్డర్లు, విక్రయాలే ఎక్కువ అంటోంది ప్రియాంక. -
అత్తగారి స్ఫూర్తితో వాట్సాప్‌లో ఉపాధి
సోషల్ మీడియా అనేది రెండువైపుల పదునైన కత్తి. దీన్ని సరిగా ఉపయోగించుకోకపోతే చెత్తను బహుమతిగా ఇవ్వగలదు. ఉపాధికి కొత్త దారులనూ వేయగలదు. వాట్సప్‌ను ఉపయోగించినప్పుడు షణ్ముగప్రియ గుర్తించింది అదే. ఉపాధికి అనువైన మార్గం వేసుకుంది. తనతో పాటు మరికొంతమందికి ఆదాయ వనరుగా మారింది. నాలుగేళ్లలో దాదాపు మూడుకోట్ల రూపాయల టర్నోవర్‌ని సాధించింది. ఫణ్ముగప్రియది చెన్నై. ఇప్పుడు రోజుకు 100 నుంచి 150 చీరల వరకు అమ్ముతోంది. అదీ ఆర్డర్ల మీద. పండగరోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. సీజన్ బట్టి నెలకు 22 లక్షల ఖరీదు చేసే చీరలను అమ్ముతుంది ప్రియ. 2014లో ప్రారంభించిన ఈ చీరల బిజినెస్‌కు ఆమె వాట్సప్గ్రూప్నే కీలకంగా ఎంచుకుంది. మొదట 20 మంది బంధుమిత్రులను ఓ గ్రూప్‌గా యాడ్ చేసింది. ఇప్పుడు వేలాదిమంది వినియోగదారులతో స్థానికంగానే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చీరలను ఆన్లైన్ ఆర్డర్ల మీద సరఫరా చేస్తోంది. ఆమె సంస్థ పేరు యునిక్ థ్రెడ్స్. సిబ్బందితో ప్రియ ప్రత్యేకతలపై దృష్టి ఆన్లైన్ వ్యాపారంలో వృద్ధిపొందాలంటే చీరలు ప్రత్యేకంగా ఉండాలి. కస్టమర్లను ఆకట్టుకోవాలి. అందుకు ఆమె తన దగ్గర ఇద్దరు చేనేత కార్మికులను నియమించుకుంది. వారి చేత ప్రత్యేకత గల చీరలను నేయిస్తుంది. అంతేకాదు వారిద్వారా ప్రత్యేక డిజైన్లు గల చీరలను తెప్పిస్తుంది. వారి సలహాతో ఏ రంగులు, ఎలాంటి డిజైన్ల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతారు అనే విషయాల పట్ల ప్రియ అవగాహనæ కల్పించుకుంది. నాణ్యత, రంగులపై దృష్టి పెట్టింది. వచ్చిన ఆర్డర్లను గడువులోగా వినియోగదారులకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఆమె చీరల బిజినెస్ వృద్ధిలోకి రావడం ప్రారంభించింది. ఇంటినే షాప్‌గా మార్చి ప్రియ ఇప్పుడు 11 వాట్సప్ గ్రూప్‌లను నిర్వహిస్తోంది. టెలిగ్రామ్నూ ఉపయోగిస్తోంది. ఫేస్బుక్ గ్రూపుల్లో చీరలను మార్కెట్ చేసేందుకు ఎనిమిది మందిని ఏర్పాటుచేసుకుంది. సోషల్‌మీడియా ద్వారా వచ్చిన ఆర్డర్లను బట్టి బిజినెస్ చూసుకుంటుంది. తన బిజినెస్ ఏ విధంగా వృద్ధిలోకి వచ్చిందో ప్రియకు బాగా తెలుసు. తన ఇంటి మొదటి అంతస్తులో గోడౌన్ కమ్ షాప్‌ను ఏర్పాటు చేసింది. కొనుగోలుదారులు ఇక్కడకు వచ్చి తమకు కావల్సిన చీరలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్ చీరలు ఇక్కడే ప్యాకింగ్ అవుతాయి. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్యాకేజీలు బయటకు వెళ్తాయి. వేర్వేరు కొరియర్ కంపెనీల ద్వారా కస్టమర్లకు చీరలను అందిస్తుంటుంది ప్రియ. ఉద్యోగాన్ని వదిలి షణ్ముగప్రియ చీరలు అమ్మడానికి ఆమె అత్తగారే స్ఫూర్తి. ఆమె ఇంటింటికి వెళ్లి చీరలు అమ్ముతూ ఉండేది. ప్రియ ఉద్యోగం చేస్తూ ఉంటే అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ఆమె చనిపోయారు. తన మూడేళ్ల కొడుకును, ఇంటిని చూసుకోవడానికి వేరే గత్యంతరం లేక ఉద్యోగం మానుకుంది. ‘కానీ, భర్త ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవదు.. ఎలా..?’ అని ఆలోచించింది. అత్తగారిని గుర్తుతెచ్చుకొని కొన్ని ఎంపిక చేసుకున్న చీరలను బ్యాగుల్లో పెట్టుకొని బంధుమిత్రుల ఇళ్లకు తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉండేది. ఆ సమయంలోనే 20 మందితో వాట్సప్ గ్రూప్స్ స్టార్ట్ చేసింది. ఇల్లిల్లూ తిరగడంతో పాటు వాట్సప్ గ్రూప్ ద్వారా వచ్చిన చీరల ఆర్డర్లు తీసుకునేది. దీంతో చీరల అమ్మకాల్లో వేగం పెరగడం గమనించింది.ప్రియ దగ్గర చీరల డిజైన్లు ప్రత్యేకతను ఇష్టపడిన కస్టమర్లు ఏటికేడాది పెరుగుతూ ఇప్పుడు మూడు కోట్ల విలువైన బిజినెస్ చేసేంతగా ఎదిగింది. ప్రియ భర్త తను చేసే ఎమ్ఎన్సి కంపెనీ జాబ్‌కు రిజైన్ చేసి, ఆమెకు తోడుగా నిలిచాడు. – ఎన్.ఆర్. -
ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసిన పోలీస్.. ఆఖరికి
సాక్షి, నెల్లూరు: పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన డీసీఆర్బీ ఏఎస్సై శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సస్పెండ్ చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసరావు ఇటీవల డీసీఆర్బీ వాట్సాప్ గ్రూప్‌లో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఆ గ్రూపులో ఉన్న పోలీసు అధికారులు వీటిని గుర్తించి రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసి ఏఎస్సైను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగిని ఆదేశించారు. దీంతో మూడురోజుల క్రితం ఏఎస్సైని సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
ఎక్కువ ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్ చెప్పేస్తుంది!
వాట్సప్‌లో ఒక మెసేజ్ ఎక్కువసార్లు ఫార్వార్డ్ చేయబడితే అది యూజర్‌కు తెలిసే విధంగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘ఫ్రీక్వెట్లీ ఫార్వాడెడ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌తో చాలాసార్లు ఫార్వాడ్ చేసిన మెసేజ్‌ను సులభంగా గుర్తించొచ్చు. ఎక్కువసార్లు ఫార్వాడ్ చేయబడిన మెసెజ్‌లు ‘రెండు బాణాలతో కూడిన ప్రత్యేక చిహ్నం’తో కనిపిస్తాయి. తమ మెసేజ్‌ను ఇతరులకు తరచుగా ఫార్వాడ్ చేస్తే యూజర్‌కు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఐదు కంటే ఎక్కువసార్లు ఫార్వాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ లేబుల్ కనబడుతుంది. వాట్సాప్ ‘ఫార్వార్డ్’ లేబుల్‌కు అదనంగా 'ట్యాప్'ను అందుబాటులోకి తెచ్చింది. మెసేజ్‌లు సుదీర్ఘంగా ఉంటే యూజర్ దానిని చదివేందుకు వీలుగా 'ట్యాప్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో యూజర్ అనుభూతిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్టు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లతో నకిలీ వార్తలను గుర్తించడం, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకుండా ఆపడం తేలిక అవుతుంది. వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి తన చెల్లింపు సేవ అయిన ‘వాట్సాప్ పే’ను భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కాగా, వాట్సాప్ భారతదేశంలో 400 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. -
వాట్సాప్ ఆప్తుల సాహితీ దీప్తి
ఒకే రకం పక్షులు ఒకే కొమ్మ మీదకు చేరుతాయన్న లోకోక్తి ఉండనే ఉంది. జీవితాన్ని గమనిస్తే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. కళల కోణంలో చూస్తే.. ఒకే దృక్పథం ఉన్న కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఒకే గూటికి చేరడం అనేక సందర్భాలలో అగుపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం విస్తరిస్తున్న ఈ రోజుల్లో.. సాహిత్యంపై ఉన్న అభిరుచి, అనురక్తి ఒకే వాట్సాప్ గ్రూప్ గూటికి చేరుస్తోంది. అలా పరిచయమయ్యారు వారంతా.. ‘ప్రియమైన రచయితలు’గా సాహితీ బంధాన్ని కలుపుకొన్నారు. ఒకరినొకరు చూడకుండానే ప్రగాఢ అనుబంధాన్ని ప(పె)ంచుకున్నారు. మూడున్నరేళ్లు ఇలా సాహితీ సంబంధ బాంధవ్యాలు పెనవేసుకున్నాక.. వారంతా సింహాచలం వేదికగా శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు. ఒకరినొకరు చూసి, ప్రత్యక్ష పరిచయం చేసుకుని, కవితలు, కథలు, కబుర్లు చెప్పుకుని.. ఆనందభరితులయ్యారు. విశాఖపట్నం , సింహాచలం(పెందుర్తి): మూడున్నరేళ్లుగా పెరిగిన సాహితీ లత విరబూసి, పరిమళాలు విరజిమ్మిన సుగంధ సందర్భమది. ఆ శుభ తరుణం అందరినీ పరవశింపజేసింది. ఇన్నాళ్లూ ముఖ పరిచయం లేకున్నా.. ఒకరికొకరు సాహిత్యం ద్వారా ఎంతో ఆప్తులైతే.. ఇప్పుడు ప్రత్యక్ష పరిచయం కలగడంతో ఆనందం అవధులు మీరింది. సింహాచలంలో రెండు రోజులుగా జరిగిన ‘ప్రియమైన రచయితలు’ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వాట్సాప్ గ్రూప్ ద్వారా పెరిగిన పరిచయం మరింత ప్రగాఢం కావడానికి ఈ సమావేశం దోహదపడింది. గ్రూప్‌లో కొందరు ఇప్పటికే కవులు, కథకులుగా లబ్ధ ప్రతిష్టులైతే.. కొందరు రచనా ప్రక్రియలో తప్పటడుగులు వేస్తున్న వారు కావడంతో గ్రూప్ ద్వారా తప్పులు సరిదిద్దుకోవడానికి, రచనా సామర్థ్యానికి మెరుగులు దిద్దుకోవడానికి ఇన్నాళ్లుగా ఆస్కారం ఏర్పడింది. సాహిత్యంపై పట్టు పెంచుకునేందుకు కావాల్సిన సలహాలు, సూచనలను పెద్దల నుంలచి అందుతూ ఉండడంతో వారికి ఈ వేదిక ఎంతో ప్రియమైనదైంది. ఇలా మూడున్నరేళ్లుగా సాగిన అనుబంధం.. ఒకే వేదికపై కలుసుకోవడంతో కొత్త చివుళ్లు తొడిగింది. శని, ఆదివారాల్లో సింహాచలంలో జరిగిన సమావేశం సాన్నిహిత్యాన్ని పెంచడమే కాదు.. ఒకరి అనుభూతులను, అనుభవాలను, రచనలను, కవితలను నేరుగా ఒకరితో ఒకరు పంచుకోవడానికి వీలు కల్పించింది. సాహిత్యంపై పట్టు సాధించేందుకు కావాల్సిన సూచనలను పెద్దల నుంచి పొందడానికి ఆస్కారమిచ్చింది. భవిష్యత్తులో సాహితీ ప్రక్రియలో మరింత ముందడుగు వేయడానికి దోహదపడింది.. సాహిత్య సమ్మేళనం పేరిట సింహాచలంలోని బృందావనం కల్యాణ మండపం అక్షరాలా సాహితీ సుగంధాలను వ్యాపింపజేసింది. మెయిన్ అడ్మిన్ కృషి ఫలితం ఎక్కడెక్కడో ఉంటున్న ఇంతమంది కవులు, కథకులు ఒకే వేదికపై కలుసుకోవడానికి ముఖ్యకారణం వాట్సాప్ గ్రూప్‌ల మెయిన్ అడ్మిన్, సింహాచలం ప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత ఇందూరమణ. రచయిత, కవిగా పేరుగాంచిన ఇందూరమణ దేశ, విదేశాల్లో ఉన్న కవులు, కథకులను కలిపి సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేయాలని భావించారు. మూడున్నరేళ్ల క్రిందట కవులు, కథకుల పేరిట రెండు వాట్సాప్ గ్రూప్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆయన ఆగ్రూపుల్లో తనకు తెలిసిన కవులను, కథకులను సభ్యులుగా చేర్చారు. వారికి ఎవరెవరు తెలుసో వారందరినీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారు. ఇలా దేశంలో పలు రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్న సాహితీప్రియులు కవులు, కథకుల గ్రూపుల్లో చేరారు. ఇలా రెండు గ్రూపుల్లో కలిసి 500మంది వరకు పెరిగారు. వీరందరినీ ఒకేవేదికపై తీసుకొచ్చి సాహిత్య సమ్మేళనం నిర్వహించాలని ఇందూ రమణ భావించారు. గడిచిన మూడునెలలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో ఈనెల 27, 28 తేదీల్లో ప్రియమైన రచయితలు (కవులు–కథకుల సమూహం) పేరిట సాహిత్య సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. హాజరైన సాహితీ ప్రియులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. -
వాట్సాప్ గ్రూప్‌లో కీచులాట
యశవంతపుర (బెంగళూరు): వాట్సాప్ గ్రూప్‌లో గుడ్‌నైట్, గుడ్‌మార్నింగ్ సందేశాలు పెట్టొద్దని చెప్పిన గ్రూప్ అడ్మిన్ మహిళతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగడంతో పాటు అసభ్యపదజాలంతో ఆడియో పోస్టు చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బెంగళూరు నగరంలోని పీణ్య పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... నాగసంద్రకు చెందిన సామాజిక కార్యకర్త అయిన ఓ మహిళ తనకు పరిచయం ఉన్న రణధీర నాయక నెంబర్‌ను గ్రూప్‌లో చేర్చారు. రోజు గ్రూపులో గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ సందేశాలు రావటంతో రణధీరనాయకను ఇటువంటివి పోస్టు చేయద్దని అడ్మిన్‌గా ఉన్న మహిళ విజ్ఞప్తి చేశారు. దీంతో అతను ఏకంగా మహిళకు ఫోన్ చేసి వాగ్వాదానికి దిగాడు. అంతటితో వదలకుండా రణధీరనాయక్ ఓ ఆడియోను పోస్టు చేశాడు. అందులో మహిళను బెదిరిస్తూ అనుచితంగా మాట్లాడారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రణధీరనాయక్ కోసం గాలింపు చేపట్టారు. -
‘షేర్’ ఖాన్లు జాగ్రత్త!
ఒడిశా, బిహార్, జార్ఖండ్ నుంచి 500 మంది బిచ్చగాళ్ల వేషంలో బయల్దేరారు. వీరు చిన్నారులను చంపి వారి అవయవాలను మెడికల్ కాలేజీలకు విక్రయిస్తున్నారు అంటూ కొన్ని పోస్టులు, ఫొటోలు కొంతకాలంగా వాట్సాప్ గ్రూపుల్లో కలకలం రేపుతున్నాయి. మీ ప్రాంతంలో నరమాంస భక్షకులు యాచకుల రూపంలో సంచరిస్తున్నారంటూ, మనిషి మాంసం కాల్చి తింటున్నారంటూ మరోపోస్టు కూడా వైరల్‌గా మారుతోంది. సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి ఈ పోస్టుల్లోని ఫొటోలేవీ మనదేశానికి సంబంధించినవి కావు. కేవలం ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి కొందరు ఆకతాయిలు వాటికి స్థానికత రంగు పులిమి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వీటిపై అవగాహన లేక చాలామంది ఎడాపెడా వాటిని వైరల్ చేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఎవరు కొత్తవారు కనబడినా.. ఈ పోస్టుల పుణ్యమాని వారిని అనుమానించాల్సిన పరిస్థితి. అదీ చీకటి పడ్డాక ఎవరు చిన్నారులను పలకరించినా.. వారిని కిడ్నాపర్లుగా భ్రమించి ఎడాపెడా చితకబాదే ప్రమా దాలు పుష్కలంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఇలాగే మూకహత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఎక్కడి ఫొటోలతోనో.. ఇక్కడ దుష్ప్రచారం వాస్తవానికి ఆ పోస్టులకు మనదేశానికి ఎలాంటి సంబంధం లేదు. బిచ్చగాళ్ల ఫొటో కర్ణాటకలో కొందరు దొంగలను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఫొటోలు. మరికొన్ని 2017లో బ్రెజిల్ జైల్లో జరిగిన అల్లర్లకు సంబంధించినవి. ఇంకొన్ని థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ లాంటి ఆగ్నేయాసియా దేశాల్లో జరిగిన సామూహిక హత్యలకు సంబంధించిన పాత చిత్రాలు. ఇలాంటి పోస్టుల ఫలితంగా బిచ్చగాళ్లకు భద్రత లేకుండా పోతోంది. ఊరూరా తిరిగి వస్తువులు అమ్ముకుని బతికే చిల్లర వ్యాపారులను కిడ్నాపర్లుగా భావించి జనాలు కొట్టి చంపే ప్రమాదముంది. మరోవైపు మనదేశానికి ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చే యాత్రికుల ప్రాణాలకూ ముప్పు పొంచి ఉంది. ఎక్కడో ఎవరో మహిళ గాయపడితే.. పాతబస్తీలో ఫలానా వర్గంపై దాడి చేశారంటూ కూడా ఫొటోలు వైరల్ చేస్తూ కొన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పోస్టులే తెలంగాణ లో కనిపించే సరికి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి పోస్టులు వైరల్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పోస్టులు పెట్టే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ జాగ్రత్తలు పాటించండి.. 1 గ్రూపులో ఇలాంటి పోస్టులు పెట్టవద్దని హెచ్చరించండి. అయినా పోస్టులు పెడితే.. వారిపై మీరే పోలీసులకు సమాచారం ఇవ్వండి. 2 ఫేక్‌న్యూస్‌ను గుర్తించేందుకు గూగుల్‌లో ఆప్షన్ ఉంది. మనకు వచ్చిన పోస్టు లేదా ఫొటోను గూగుల్‌లో అప్లోడ్ చేసి సెర్చ్‌చేస్తే.. దాన్ని తొలుత ఎవరు.. ఎక్కడ నుంచి పోస్టు చేశారు? తదితర విషయాలన్నీ ఇట్టే తెలిసిపోతాయి. 3 ఓ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచేలా, అగౌరవ పరిచేలా వచ్చే పోస్టులను చూసిన వెంటనే షేర్ చేయవద్దు. అది పోలీసులు నేరంగా పరిగణిస్తారు. 4 వచ్చిన పోస్టు, ఫొటో కొత్తదా పాతదా అన్నది కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 24 గంటల న్యూస్‌చానళ్లు, వెబ్‌చానళ్లు, న్యూస్‌యాప్స్ వచ్చిన ఈ రోజుల్లో అందులో కాకుండా పోస్టుల రూపంలో ఎలాంటి కొత్త వార్తలూ రావని తెలుసుకోవాలి. 5 పోస్టుల్లో ఉండే విదేశీయుల్ని కూడా సులభంగా గుర్తు పట్టవచ్చు. ఆగ్నేయాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రజలు మనదేశంలోకి రావడం, హత్యలకు పాల్పడటం అంత సులువు కాదు. కాబట్టి వారిని గుర్తించగానే ఇలాంటి పోస్టులను షేర్ చేయకుండా వదిలేయడమే మంచిది. -
ఇక స్విగ్గీ, జొమాటోలకు ‘ఎసరు’!
సాక్షి, బెంగళూరు: హఠాత్తుగా వేసవి వర్షాలు పలకరించడంతో బెంగళూరు వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇంకా కురుస్తున్న చినుకుల మాటున వీస్తున్న సన్న గాలులకు మట్టి పరిమళాలు వచ్చి ముక్కును తాకుతుంటే డాక్టర్ జయశ్రీ గోపాలన్ మైమరచిపోతున్నారు. మహాదేవపురలోని అపార్ట్మెంట్, 15వ అంతస్తులో నిలబడి వర్షపు జల్లులకు పులకించిపోతున్న ఆమెకు హఠాత్తుగా ఆకలి గుర్తుకు వచ్చింది. ‘అబ్బా! ఈ వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటేనా!’ అనుకోగానే ఆమె నోటిలో నీళ్లూరాయి. ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉంది. తాను ఒక్కదాని కోసం ఇప్పుడు బజ్జీలు చేసుకోవాలా? అనుకున్నట్లున్నారు. వెంటనే చేతిలోకి సెల్ తీసుకున్నారు. అందులో ‘స్నాక్స్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌నకు ‘స్నాక్స్ ఏమున్నాయి ?’ అంటూ మెస్సేజ్ పెట్టారు. ‘ఎనిమిది ప్లేట్ల ఆలు, ఉల్లిపాయ బజ్జీలు చేస్తున్నాను. ఇప్పటికే ఆరు ఆర్డర్లు వచ్చాయి, మీకు కావాలంటే ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి, అరగంటలో పంపిస్తాను’ అంటూ వెంటనే సమాధానం వచ్చింది. జయశ్రీ వెంటనే ఓ ప్లేట్ ఆర్డర్ ఇచ్చారు. 20 నిమిషాలు తిరక్కుండానే టిఫిన్ డబ్బాలో వేడి వేడి బజ్జీలు పట్టుకొని ఆ వంట మనిషి పిల్లవాడు వచ్చి ఇచ్చాడు. 30 రూపాయల బిల్లు తీసుకొని వెళ్లిపోయాడు. ‘ఆహా! ఎంత బాగున్నాయి. అచ్చం నేను చేసికున్నట్లే ఉన్నాయి’ అంటూ జయశ్రీ వాటన్నింటిని తినేసింది. ఇలా అడిగిన వారికి అడిగినట్లుగా ఉదయం ఇష్టమైన టిఫిన్లు, మధ్యాహ్నం మంచి భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ చేసి పెడుతోంది అదే ఆపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న ఓ వంటామే. ఆ అపార్ట్మెంట్లో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. బిజీబీజీగా ఉండే ఆ కుటుంబాలు ఎక్కువ సార్లు ఈ వంటామేపైనే ఆధారపడుతున్నారు. ఇరుగు పొరుగు అపార్ట్మెంట్ల వారు కూడా ఈ మధ్య ఆ వంటామనే ఆశ్రయిస్తున్నారట. ఇలాంటి వంటామే ఒక్క మహాదేవపురలోనే కాదు, సర్జాపూర్, బన్నేర్‌గట్టా, హెన్నూర్ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లకు విస్తరించారు. పక్క పక్కనే ఉన్న ఆపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారందరితోని వాట్సాప్‌లో స్నాక్స్ అనో, బ్రేక్‌ఫాస్ట్ అనో, లంచ్ అనో, డిన్నర్ అనో, హోం ఫుడ్ అనో ఓ గ్రూప్‌ను చేసుకొని వంటామెలు (కొన్ని చోట్ల వంటాయనలు కూడా ఉండవచ్చు) మంచి ఓ హోమ్ ఫుడ్‌ను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారితోనే కొంత పెద్ద మొత్తంలో ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్ పుట్టుకొచ్చింది. దీన్ని రచనా రావు, అనూప్ గోపీనాథ్, అకిల్ సేతురామన్ ఇదివరకే ఏర్పాటు చేయగా, కొత్తగా ఊటాబాక్స్, మసాలా బాక్స్ అనే గ్రూపులు పుట్టుకొచ్చాయి. ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్‌లో 20 వేల మంది ఉండగా, పూటకు రెండున్నర వేల ఆర్డర్లు వస్తున్నాయట. అందరిదీ ఒకటే సూత్రం. హోం ఫుడ్. రుచితోపాటు పరిశుభ్రతను పాటించడం, బయట హోటళ్ల కంటే తక్కువ రేటుకు విక్రయించడం వల్ల వీటి ప్రాబల్యం పెరుగుతోంది. ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బెంగళూరు ఆహార పరిశ్రమలో ఈ పూటకూళ్ల పరిశ్రమలు రేపు ప్రముఖ పాత్ర వహించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్విగ్గీ, జొమాటోలాంటి ఆహార సరఫరా సంస్థలకు ఈ పూటకూళ్లమ్మలను చూసి భయం పట్టుకుందట. ఈ ఆహార సరఫరా సంస్థల బిజినెస్ దేశవ్యాప్తంగా 30 కోట్ల డాలర్లకు చేరుకోగా, అందులో 32 శాతం వాటా ఒక్క బెంగళూరు నుంచే వస్తోందట. ఇప్పుడు దానికి చిల్లు పడుతుందన్నది వారి చింత. ఫుడ్‌కు పేరుపోందిన కోరమంగళ ప్రాంతంలోనే దాదాపు 500 రెస్టారెంట్లు ఉన్నాయని, అవి ఉన్నంత వరకు తమకు ఢోకాలేకపోవచ్చని కూడా వారు భావిస్తున్నారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు ఓ పూటకూలమ్మ పుట్టుకొస్తే ఆహార పరిశ్రమలో గుత్తాధిపత్యం మాత్రం తగ్గుతుంది. అపార్ట్మెంట్ వాసుల అభిరుచులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ‘ఇంటి వంట’కు కూడా మరింత వన్నె తేవచ్చు. కాకపోతే ఇలాంటి వాటికి ఆర్డర్ ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక వంటకాల కోసం ఓ రోజు ముందుగా కూడా ఇవ్వాల్సి రావచ్చు. -
శాంతిభద్రతల పరిరక్షణకు ‘వాట్సాప్’
శ్రీకాకుళం రూరల్: మీ ప్రాంతంలో ఏదైనా భయానక సంఘటన జరిగిందా...గ్రామాల మధ్య కొట్లాటలు, నగరంలోని ట్రాఫిక్ సమస్య కనిపించాయా...ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా.. ఇక అలాంటి సంఘటనలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిందేనని చెబుతున్నారు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్. జిల్లా ప్రజలకు ఓ వాట్సాప్ నంబర్‌ను మంగళవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. సంఘటన ప్రాంతం, జరిగిన తీరును ఫొటో, వీడియో తీసి నేరుగా పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయవచ్చు. వెంటనే దగ్గరిలో ఉన్న స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరించే దిశగా జిల్లా ఎస్పీ తన సిబ్బందిని అప్రమత్తం చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. వాట్సాప్ నంబర్ 630 9990 933 ఇప్పటివరకూ డయల్ 100కు ఫోన్ చేస్తే కేవలం ఫిర్యాదులు స్వీకరించే పోలీసులు ఇక నుంచి 630 9990 933 వాట్సాప్ నంబర్‌తో ఎక్కడైనా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాల సమాచారం అందించి పోలీసులకు ప్రజలు సహకరించవచ్చు. కేవలం వాట్సాప్‌లో అత్యవసర సమాచారం, ఫిర్యాదు మాత్రమే పంపించాలని వీటితో పాటు ఫొటోలు, విడియోలు కుడా షేర్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రధానంగా ఈవ్‌టీజింగ్, ట్రాఫిక్ సమస్యలు, మారక ద్రవ్యాలు రవాణా, పేకాట, బాలికల అక్రమ రవాణా, అనుమాస్పద వ్యక్తుల సంచారంతో పాటు ఆయా ప్రాంత పరిసరాల్లో తగాదాలు వంటివి ఫొటో ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్ ద్వారా తగు సమాచారం పంపిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. -
ఎన్నికల క్షేత్రంలో 87 వేల వాట్సాప్ గ్రూపులు
మరో పదిహేను రోజుల్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు 87 వేలకు పైగా వాట్సాప్ గ్రూపులు పని చేస్తున్నాయట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల నిపుణుడు అనూప్ మిశ్రా తెలిపారు. ప్రభుత్వ పథకాల నుంచి దేశభక్తి, హిందూత్వ వరకు ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ గ్రూపులు ప్రచారం చేస్తున్నాయని ఆయన అంటున్నారు. ఆయన లెక్కల ప్రకారం ఒక వాట్సాప్ గ్రూప్‌లో గరిష్టంగా 256 మంది యూజర్లు ఉంటారు. అంటే 87 వేల గ్రూపులు కలిసి దాదాపు 2 కోట్ల 20 లక్షల మందికి పైగా యూజర్లకు నేరుగా సమాచారాన్ని అందిస్తాయి. అంతేకాకుండా వాట్సాప్‌లోని ఒక యూజర్ ఒక మెసేజ్‌ను గరిష్టంగా ఐదుగురికి పంపవచ్చు. ఆ ప్రకారం 2.2 కోట్ల మంది ఒక్కొక్కరు ఐదుగురికి మెసేజ్‌లు పంపడం ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలరు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు అసలైన సమాచారం అందేందుకు వాట్సాప్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. తప్పుడు సమాచారాన్ని,కల్పిత వార్తలను అడ్డుకోవడానికి లక్ష మందికి శిక్షణ ఇచ్చి నియమించుకుంది.అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నైతిక నియమావళిని పాటించేందుకు సమ్మతించింది. -
వాట్సాప్‌లో పోస్ట్.. గ్రూప్ అడ్మిన్‌తోపాటూ ఒకరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్(మల్కాజ్‌గిరీ): వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు గ్రూప్ అడ్మిన్‌తోపాటూ, పోస్ట్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జొమాటోలో డెలివరీ బోయ్‌గా పని చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి లాయల్ పార్ట్నర్స్ ఎమర్జెన్సీ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. గత నెల26న గ్రూప్ సభ్యుడైన మొహమ్మద్ మునీర్ జాతీయ జెండా తగలబెడుతున్న ఫోటోను పోస్ట్ చేయడంతో అదే గ్రుప్ సభ్యుడైన వెంకట రామ రెడ్డి అనే వ్యక్తి మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రూపు అడ్మిన్ వెంకటేష్, మెసేజ్ పోస్ట్ చేసిన వ్యక్తి మొహమ్మద్ మునీర్‌పై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
గ్రూపులో తగాదాలతో మనస్తాపం చెందిన అడ్మిన్..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): నలుగురికి మంచి చేయాలని పరితపించిన ఓ ట్రావెల్ నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో సభ్యులకు ఆపద వస్తే ఆదుకునే నిర్వాహకుడు.. గ్రూపులో తగాదాలతో మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన కేజీహెచ్‌లో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన మహాపాత్రుని మధు స్థానికంగా ఓ క్యాబ్(ట్రావెల్)ను నడుపుతున్నాడు. ట్రావెల్ యజమానులు, కార్ల డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి వారికి ఏదోలా సేవ చేయాలన్న దృక్పథంతో కార్ ప్రొగ్రెసివ్ ట్రేడ్ యూనియన్(సీపీటీయూ) పేరిట వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఎక్కడైనా కారు ప్రమాదానికి గురైనా.. ఆ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు నష్టం కల్గినా.. వెంటనే ఆ ఏరియా కారు డ్రైవర్లు, ట్రావెల్స్‌కు ఫోన్ చేసి సాయం చేసేలా అప్రమత్తం చేసేవాడు. అతను చేస్తున్న సేవలకు అనతి కాలంలోనే స్పందన వచ్చింది. మూడు గ్రూపుల్లో 250 మంది చొప్పున సభ్యులుగా చేరారు. ప్రస్తుతం మూడు వాట్సప్ గ్రూపులుగా ఈ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిం చింది. ఎంతో మందికి ఉపయుక్తంగా మారింది. అయితే గ్రూపు బాగా నడుస్తోందన్న సమయంలో ఓ ఐదుగురు సభ్యులు చిచ్చు పెట్టారు. చేస్తున్న సేవలకు ప్రతి గ్రూపు సభ్యుడి నుంచి డబ్బులు వసూలు చేయాలని మధుపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో వారు మధును తిట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారి మాటలు తట్టుకోలేక చినముషిడివాడలోని తన ఇంటి నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ తన చావుకు కారణాలు వివరిస్తూ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. దీంతో గ్రూప్ సభ్యులు అతనిని వెతకడం ప్రారంభించారు. పెందుర్తి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న మధును కొందరు గుర్తించారు. 108 వాహనం ద్వారా కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం కేజీహెచ్ భావనగర్ వార్డులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. -
నువ్వెంతా? నీ నాయకుడెంతా?.. వాట్సాప్ లొల్లి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో వాట్సాప్ గ్రూప్‌లు దద్దరిల్లుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక వాట్సాప్‌లోనైతే.. చిన్ననాటి స్నేహితులు, పది, ఇంటర్, డిగ్రీ, ఊరు.. మండలం.. జిల్లా, పార్టీలు ఇలా అనేక గ్రూప్‌లు. ఈ ప్రతి గ్రూప్‌లో ఇప్పుడు ఒక్కటే చర్చ.. తెలంగాణ ఎన్నికలు. వాదనలు.. ప్రతివాదనలు. తమ పార్టీ గెలుస్తుందంటే.. తమ పార్టీ గెలుస్తుందనే పిడివాదనలు. నాయకుల మాటల తూటాలు.. అవినీతి ఆరోపణలు.. మేనిఫెస్టోలు.. బహిరంగ సభల హైలెట్స్ ఇలా ప్రతి ఒక్కటి కుప్పలు.. తెప్పలుగా షేర్ అవుతునే ఉన్నాయి. ఇక పార్టీలకు అనుకూలంగా ఉండే సర్వే రిపోర్టులకు అయితే కొదవేలేదు. తమ నాయకుడు స్పీచ్ ఇరగదీసిండు.. అని ఒకరు ఓ వీడియో షేర్ చేయగానే.. దానికి బదులుగా మా నాయకుడేమన్న తక్కువనా? అని మరోకరు ఇంకో వీడియోను పోస్ట్ చేస్తున్నారు. తమ అభిమాన నాయకులను పల్లెత్తు మాట కూడా అననిస్తలేరు. తామే అభ్యర్థులగా బరిలోకి దిగినట్లు.. తమ నాయకున్ని అంటే తమనే అన్నట్లు ఫీలవుతున్నారు. ఈ తరహా చర్చతో ఎన్నికలపై కొంత అవగాహన వస్తున్నప్పటికీ.. వారి సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అప్పటి వరకు మంచి మిత్రులుగా ఉన్నవారు.. ఈ తరహా వాదనలతో శత్రువులుగా మారుతున్నారు. అన్నా.. తమ్ముడు.. కాక, మామా అని అప్యాయంగా పిలుచుకునేవారు.. ఎన్నికల పుణ్యమా.. నువ్వెంత? నీ నాయకుడెంతా? అని దుర్భాషలాడుకుంటున్నారు. ఈ తరహా చర్చలతో ఆగ్రహాలకు లోనై భౌతికంగా కూడా దాడులు చేసుకుంటున్నారు. మా నాయకుడు అధికారంలోకి వస్తే.. నీ సంగతి చూస్తా అని హెచ్చరించుకుంటూ.. మంచి సత్సంబంధాలను దెబ్బతీసుకుంటున్నారు. గ్రామాల్లో ఈ తరహా వాట్సాప్ ప్రభావం మరి ఎక్కువగా ఉంది. వాట్సాప్ స్టేటస్.. వాట్సాప్ స్టేటస్‌ల్లో చాలా మంది తమ అభిమాన పార్టీకి మద్దతుగా వీడియోలు.. ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయా పార్టీలకు ఓటేయ్యాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరహా స్టేటస్‌లతో తాము ఏ పార్టీకి మద్దతుగా ఉన్నామో బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారు. ప్రత్యర్థి నాయకుల టంగ్ స్లిప్‌లు.. సినిమా సీన్స్ తరహా స్పూఫ్‌ల వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పార్టీలు కూడా.. సోషల్ మీడియాతో ప్రజలకు మరింత సులవుగా చేరువవచ్చని, ముఖ్యంగా యువకులను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్న రాజకీయ పార్టీలు.. తమకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులు కోవడంలేదు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విటర్లో యాక్టీవ్‌గా ఉన్న నాయకులు.. ఇప్పడు వాట్సాప్ గ్రూప్‌లతో కార్యకర్తలకు మరింత దగ్గరవుతున్నారు. ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను గ్రూప్‌ల్లో కార్యకర్తలకు చేరువేస్తూ అలర్ట్ చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఓ టీమ్‌నే సిద్దం చేసుకుని ప్రచారంలో దూకుడును ప్రదర్శిస్తున్నారు. యూట్యూబ్‌లో.. ఇక యువత గంటల తరబడి కాలక్షేపం చేసే యూట్యూబ్‌ను కూడా రాజకీయ పార్టీలు వదలడంలేదు. ఇప్పటికే టీవీలు.. పత్రికల్లో ప్రకటనలతో ఊదరగొడుతున్న నాయకులు.. యూట్యూబ్‌ను కూడా వదిలిపెట్టడం లేదు. యూట్యూబ్‌లో ఏ వీడియోను క్లిక్ చేసినా కొన్ని సెకన్ల పాటు ప్రకటన వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. యువకులు చేరువగా ఉండే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. షేర్ చాట్.. టిక్‌టాక్, సమోసా, హలో తదితర స్మార్ట్ మొబైల్ యాప్స్‌లో కూడా అకౌంట్స్ క్రియేట్ చేసి.. వారి ప్రచార వీడియోలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. -
వాట్సప్..హ్యాట్సాఫ్!
ఒంగోలు టౌన్: కంభం పట్టణంలోని ఆల్ఫా స్కూల్లో ఇద్దరు విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వారికి హైదరాబాద్ చూడాలన్న ఆశ కలిగింది. ఇంట్లో నుంచి స్కూల్కంటూ బయల్దేరారు. వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారని అనుకున్నారు. మధ్యాçహ్నం వేళ స్కూల్ నుంచి వారి ఇళ్లకు ఫోన్లు వచ్చాయి. మీ అబ్బాయి ఈ రోజు స్కూల్‌కు రాలేదన్నది ఫోన్ సారాంశం. దీంతో వారి గుండెలు ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఉదయం స్కూల్‌కు వెళ్లిన వారు మధ్యాహ్నం వరకు ఆచూకీ లేకపోవడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని హెల్ప్ ప్రోగ్రాం ఆఫీసర్ బీవీ సాగర్‌కు ఫోన్ చేయడం, అప్రమత్తమైన బీవీ సాగర్, చైల్డ్‌లైన్ (1098) జిల్లా కో ఆర్డినేటర్ పి. మంత్రునాయక్ ఈ విషయాన్ని రాష్ట్రంలోని చైల్డ్‌లైన్ గ్రూప్‌కు పాస్ చేసి ఇరవై నాలుగు గంటల్లోపు ఆ ఇద్దరు విద్యార్థులను గుర్తించి వారి బంధువులకు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. ఇదీ.. జరిగింది స్మార్ట్ ఫోన్లు వినియోగించే వాటిలో వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్ కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా మేలు చేస్తూ ఉంటోంది. అందుకు ఉదాహరణే కంభంలోని ఇద్దరు విద్యార్థుల వ్యవహారం. ఆ ఇద్దరిలో ఒక విద్యార్థి తన ఇంట్లో ఉంచిన ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు. శనివారం ఉదయం తన స్నేహితుడితో కలిసి కంభంలో రైలు ఎక్కాడు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రైలు ఎక్కారు. ఆ రైలు శనివారం రాత్రికి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకొంది. అప్పటికే వారిద్దరు మిస్ కావడంతో చైల్డ్‌లైన్ గ్రూపులోని వాట్సాప్ ద్వారా రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లకు ఫొటోలతో సహా సమాచారం అందించారు. అప్పటికే కాచిగూడ రైల్వే పోలీసులు ఆ ఇద్దరు విద్యార్థుల ఫొటోలను చూసి రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్నారు. దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసిన ఆ ఇద్దరు విద్యార్థులు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారంలో కూల్‌డ్రింక్స్, మజ్జిగ దుకాణం వద్దకు చేరుకున్నారు. రైల్వే పోలీసులు వారిని గుర్తించి దగ్గరకు తీసుకొని విచారించారు. తాము కంభం నుంచి హైదరాబాద్ చూద్దామని ఇళ్లల్లో చెప్పకుండా వచ్చామని చెప్పడంతో వారిని తమ వద్ద ఉంచుకున్నారు. వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, ఒక విద్యార్థి బంధువు కాచిగూడలో వైద్యునిగా పనిచేస్తుండటం, హుటాహుటిన అక్కడకు చేరుకోవడం, అక్కడి చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ వారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచడం, ఇక్కడి బాలల సంక్షేమ కమిటీతో మాట్లాడి విద్యార్థులను వారి బంధువులకు అప్పగించడం, ఆదివారం కంభంలోని వారి తల్లిదండ్రులకు విద్యార్థులను అప్పగించడం చకచకా జరిగిపోయాయి. తమ పిల్లల గురించి సకాలంలో సమాచారం చేరవేసి తమకు చేర్చిన బీవీ సాగర్, మంత్రునాయక్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
సిమ్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త!
సాక్షి, ఉలవపాడు : సాధారణంగా సిమ్ కొంటే కొనేవారి వివరాలు సదరు షాపునకు అందజేస్తే అక్కడి నుంచి నేరుగా సంబంధిత నెట్వర్క్ మెయిన్ ఆఫీస్‌కు వెళ్లేవి. అక్కడి నుంచి సిమ్‌ని యాక్టివేట్ చేసే వారు. ఈ ఇద్దరి మధ్య మాత్రమే మన వివరాలు ఉండేవి. అలాంటి సమయంలోనే ఎన్నో తప్పులు దొర్లాయి. ఇప్పుడు కొత్తగా వేలిముద్రతో సిమ్‌లు అందజేస్తున్నారు. ఈ సమయంలో మనకు సంబంధించిన వివరాలు మొత్తం వచ్చేస్తున్నాయి. దాని ఆధారంగా సిమ్‌లు అమ్ముతున్నారు. కానీ ఇటీవల కొన్ని టెలికమ్ కంపెనీలు తమ వద్ద కొన్న సిమ్‌లు తీసుకున్న వారిని నిలబెట్టి ఫొటో తీస్తున్నారు. తర్వాత వారి ద్వారా పూర్తి చేసిన సమాచారం మొత్తాన్ని ఆయా కంపెనీల గ్రూప్‌ల్లో పోస్టు చేస్తున్నారు. ఈ గ్రూప్‌ల్లో జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని సెల్‌షాపు యజమానులు ఉంటారు. అంటే ఎక్కడైనా ఓ వ్యక్తి సిమ్ కొంటే దానికి సంబంధించి అతని ఫొటోతో పాటు అన్ని వివరాలు బహిర్గతం చేస్తున్నారు. ఇది కంపెనీల తప్పనిసరి కాదని పలు షాపు యజమానులు చెబుతున్నారు. వారు కేవలం ఎన్ని సిమ్‌లు అమ్మారని అడుగుతున్నారు. కానీ కొందరు అన్ని వివరాలు పెట్టి తాము సిమ్‌లు అమ్మిన వారిని కూడా చూపిస్తున్నారని తెలిపారు. సదరు వ్యక్తి ఇలా సిమ్ కొనే సమయంలో షాపులో నిలబెట్టి మరీ ఫొటోలు తీస్తున్నారు. అలా అయితేనే సిమ్ ఇస్తామని కొందరు యజమానులు చెబుతున్నారు. ప్రధానంగా అక్షరాస్యత లేని వారిని ఇలా చేస్తున్నారు. దీని వలన ఈ గ్రూపులో ఉన్న వారెవరైనా ఈ సమాచారం తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుకలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా బహిర్గతం ఇలా వాట్సాప్ గ్రూప్‌లో సిమ్ కొన్న వారి సమాచారం మొత్తం పెడుతున్నారు. ఈ గ్రూప్‌లో చూస్తే సిమ్ కొన్న వ్యక్తి ఫొటో వస్తోంది. ఆ తర్వాత అతను సిమ్ దరఖాస్తులో పూర్తి చేసిన సమాచారం మొత్తం పోస్టు చేస్తున్నారు. ఆధార్ ఆధారంగా వారి ఇంటి అడ్రస్సు కూడా బహిర్గతమవుతోంది. ఇక పుట్టిన తేదీతో సహా తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకుంటున్న సిమ్ నంబర్ వివరాలు, అవసరం కోసం ప్రస్తుతం వాడుతున్న నంబరుతో సహా అన్ని వివరాలు గ్రూప్‌లోకి వస్తున్నాయి. గ్రూప్‌లో వందల మంది షాపుల యజమానులు ఉంటారు. ఈ సమాచారం మొత్తం అందరికీ వస్తుంది. వారు డౌన్లోడ్ చేసుకుని మరే ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. మహిళలు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. ఆందోళనలో వినియోగదారులు సిమ్‌లు కొన్న తర్వాత ఇలా గ్రూప్‌లో పెడుతున్నారని చాలామందికి తెలియదు. తెలుసుకున్న తర్వాత వారు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆధార్ నంబర్ ఉపయోగించుకుని ఏం చేస్తారోనని భయం పట్టుకుంది. ఇక గ్రూప్ సభ్యుల్లో అందరూ ఒకేలా ఉండరు. మహిళల ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు వారికి కాల్ చేయడం, మెసేజ్ చేయడం వంటివి జరుగుతాయోమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సిమ్ అమ్మిన వారు ఇలా సమాచారం బహిర్గతం చేయడం మంచి పద్ధతి కాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమాచారాన్ని బహిర్గతం చేయడంతో ఎలాంటి అసాంఘిక పనులైనా వారి మీద మరొకరు చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు. వినియోగదారుల వివరాలు సెల్ షాపుల యజమానుల గ్రూప్‌లో పెట్డడం నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం: సెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం మంచిది కాదు. సిమ్ కంపెనీల యజమానులు అలా ఎందుకు చేస్తున్నారో విచారించి చర్యలు తీసుకుంటాం. - వైవీ రమణయ్య, ఎస్ఐ, ఉలవపాడు -
ఫొటో షేర్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలతో కొందరు అకతాయిలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తిని నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడిని దాద్రికి చెందిన రహిషుద్దీన్గా గుర్తించారు. రహిషుద్దీన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్‌లో బాబా రాందేవ్ ఫొటోను షేర్ చేశారు. అయితే దీనిపై ఆ గ్రూప్‌లోని కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రహిషుద్దీన్ బాబా రాందేవ్ ప్రతిష్టను దిగజార్చేలా.. ఫొటో మార్ఫింగ్‌కు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ స్పందిస్తూ.. మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్‌ను అవమానపరచడానికి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా నిందితుడు మాత్రం స్నేహితుడు పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని చెబుతున్నాడు. -
31 జిల్లాలను అనుసంధానిస్తూ.. వాట్సప్ గ్రూప్
సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది వరకు సమాచారాన్ని చేరవేసేందుకు, అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ‘కాప్ కనెక్ట్’ పేరుతో డీజీపీ మహేందర్ రెడ్డి ఒక వాట్సప్ గ్రూప్‌ను సోమవారం ప్రారంభించారు. కేవలం పోలీసుల కోసమే ఈ ప్రత్యేక వాట్సప్ గ్రూప్ రూపొందించారు. మొత్తం 31 జిల్లాల 63 వేల మంది సిబ్బందికి ఏకకాలంలో సమాచారం అందించేందుకు ఈ వాట్సప్ గ్రూప్ ఉపయోగించనున్నారు. సాధారణ వాట్సప్ గ్రూప్‌లాగే ఇందులో చాటింగ్, ఆడియో, వీడియో, లొకేషన్ షేరింగ్ చేయవచ్చు. పోలీస్ నెట్‌వర్క్‌లో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ గ్రూప్ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీలో భాగంగా పోలీసింగ్ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. -
వాట్సప్ అడ్మిన్లకు హెచ్చరిక
సాక్షి, సిటీబ్యూరో : వాట్సప్‌లో ఏదో ఓ గ్రూప్ క్రియేట్ చేసో, సభ్యుల కోరిక మేరకో, ‘బాధ్యతలు’ అప్పగించడంతోనో అడ్మిన్‌గా మారారా? జర జాగ్రత్త çసుమా.! ఏమాత్రం తేడా వచ్చినా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఆ గ్రూప్‌లో సర్క్యులేట్ అయ్యే అభ్యంతరకర సందేశాలు, వీడియోలకు మీరే పూర్తి బాధ్యులవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్న వదంతుల నేపథ్యంలో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి గ్రూపులకు అడ్మిన్లుగా ఉన్నవారూ బాధ్యులుగా మారతారని, వారిపైనా చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. ఇప్పటి వరకు సరదాకు, సమాచార మార్పిడికి, యోగక్షేమాలు కనుక్కోవడానికి పరిమితమైన సోషల్ మీడియా ఒక్కసారిగా వివాదాస్పదమైంది. పక్షం రోజులుగా దీని కేంద్రంగా సాగుతున్న కిడ్నాపింగ్ గ్యాంగ్స్, దోపిడీ ముఠాల పుకార్లే ఇందుకు కారణం. వీటి కారణంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, చేతులు దాటుతుండటంతో పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. సోషల్ మీడియాలో ఎన్నో రకాలున్నా వాట్సప్ ఓ ప్రభంజనంలా మారింది. యూజర్ ఫ్రెండ్లీ కావడంతో అత్యధికులు దీన్నే వినియోగిస్తున్నారు. కేవలం సంక్షిప్త సందేశాలు మాత్రమే కాకుండా నిర్ణీత ప్రమాణంలో ఉన్న వీడియోలు, ఆడియోలు సైతం పోస్ట్/షేర్ చేసుకునే అవకాశం దీనిలో ఉంది. అత్యధికులు వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ యాప్ అత్యంత కీలకంగా మారిపోయింది. ఎక్కడికక్కడ గ్రూపులు ఏర్పాటు... వాట్సప్ వినియోగదారులతో పాటు గ్రూపుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. ఒకే సందేశం/వీడియో/ఆడియోలను ఒకేసారి అనేక మందికి పంపడానికి, పరస్పర భావ మార్పిడికి ఎవరికి వారు వీటిని క్రియేట్ చేస్తున్నారు. స్నేహితులు, ఒకే ప్రాంతానికి చెందిన వారు, భావసారూప్యత ఉన్నవాళ్లు... ఇలా ఎవరికి వారు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ వాట్సప్ గ్రూపుల్ని క్రియేట్ చేస్తున్నాయి. వాట్సప్‌కు అడ్వాన్డŠస్ వెర్షన్ అయిన వాట్సప్ వెబ్ వచ్చిన తర్వాత వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అధికారిక కార్యకలాపాల కోసం ఏర్పాటవుతున్న గ్రూపులతో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ప్రైవేట్ గ్రూపులతోనే ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. అత్యంత కీలకంగా అడ్మిన్... వాట్సప్‌లో ఏదైనా గ్రూప్‌ను క్రియేట్ చేయడం అనేది ఒకరి చేతిలో ఉంటుంది. సదరు గ్రూప్‌నకు అడ్మిన్‌గా బాధ్యతలు స్వీకరించే ఆ వ్యక్తి తన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారిలో ఎంపిక చేసుకున్న సభ్యులతో దీన్ని ఏర్పాటు చేస్తాడు. అవసరం, తనకు నమ్మకం ఉన్న, సత్సంబంధాలను బట్టి ఆ సభ్యుల్లో కొందరిని అడ్మిన్స్‌గా చేస్తూ యాడింగ్, రిమూవింగ్ అధికారాలు కల్పిస్తాడు. ఇలాంటి అడ్మిన్స్లో ఎవరైతే తొలుత గ్రూప్‌ను క్రియేట్ చేస్తారో (ప్రధాన అడ్మిన్)గా ఉండేవారే అత్యంత కీలకం. ఈ గ్రూపుల్లో కేవలం అడ్మిన్‌కు మాత్రమే కాకుండా అందులో ఉండే సభ్యులందరికీ షేరింగ్ చేసే సౌలభ్యం ఉంటుంది. దీనికి అడ్మిన్ అనుమతి, ప్రమేయం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే చాటింగ్స్, పోస్టింగ్స్, షేరింగ్స్ అనేవి అడ్మిన్ అనుమతి, ప్రమేయం లేకుండానే సాగిపోతుంటాయి. కచ్చితంగా పర్యవేక్షణ ఉండాల్సిందే... ఓ వాట్సప్ గ్రూప్‌లో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉన్నట్లే... ప్రతి సభ్యుడూ ఆ గ్రూప్‌తో పాటు మరికొన్నింటిలోనూ సభ్యుడిగా కొనసాగుతుంటాడు. ఫలితంగా ఓ గ్రూప్‌లో పోస్ట్ అయిన వీడియో క్షణాల్లో అనేక గ్రూపుల్లోకి వెళ్లిపోతుంది. పుకార్ల విషయంలో ఇలాంటి సదుపాయమే కొంపముంచుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు గ్రూప్ అడ్మిన్ బాధ్యుడిగా మారతాడు. ఆ గ్రూప్‌లో జరుగుతున్న కార్యకలాపాలతో పాటు షేరింగ్ అవుతున్న అంశాలనూ అతడే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరైనా అభ్యంతరకర పోస్టింగ్స్, షేరింగ్స్ చేస్తుంటే వారిని రిమూవ్ చేయాల్సిన బాధ్యత కూడా అడ్మిన్‌కు ఉంటుంది. అలా కాని పక్షంలో గ్రూప్ వల్ల ఏదైనా జరిగితే అడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిని పోస్ట్, షేర్, ఫార్వర్డ్ చేసిన సభ్యుడు సైతం చర్యలకు బాధ్యుడు అవుతాడు. ‘ఫార్వార్డెడ్ ఏజ్ రిసీవ్డ్’, ‘ప్లీజ్ క్రాస్ చెక్’ అంటూ నోట్ పెట్టినంత మాత్రాన ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఆ గ్రూపు సభ్యుడు లేదా ఇతరులెవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యుడితో పాటు అడ్మిన్ పైనా కేసు తప్పదు. ఆధారాలు దొరికితే అరెస్టే... గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో... ప్రధానంగా వాట్సప్‌లో పుకార్లు పెరిగాయి. కిడ్నాపింగ్ ముఠాలు, దోపిడీ గ్యాంగులు వచ్చాయంటూ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. ఇది ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా పరిస్థితులు చేతులు దాటేలా, అమాయకులు ఇబ్బందులు పాలయ్యేలా, ప్రజా జీవితానికి భంగం కలిగించేలా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రచారం చేయడం నేరం. ఇలాంటివి షేర్ చేసిన వారితో పాటు ఆయా గ్రూపుల అడ్మిన్లూ నేరం చేసినట్లే అవుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాపై పూర్తి నిఘా ఉంచాం. బాధ్యుల్ని 24 గంటల్లోగా గుర్తించేస్తాం. సరైన ఆధారాలు చిక్కితే గ్రూప్ అడ్మిన్స్నూ అరెస్టులు చేస్తాం. – అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ -
అనుమానించి.. హతమార్చి
‘వారు ఉత్తరాది వ్యక్తులా.. అయితే కొట్టి చంపేయి. అనుమానంగావ్యవహరిస్తున్నారా.. హతమార్చేయి’. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ధోరణినడుస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ప్రజలు నిర్ధాక్షిణ్యంగా నలుగురి ప్రాణాలు తీశారు. మరోఆరుగురిని తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలుజేశారు. చిన్నారులనుఅపహరించే ఉత్తరాది ముఠా రాష్ట్రంలో తిరుగుతోందనే ప్రచారమే ఈదురాగతాలకు కారణమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: వీధుల్లో సంచరిస్తూ చిన్నారులను ఎత్తుకెళ్లే ఉత్తరాది ముఠా రాష్ట్రంలో తిష్టవేసి ఉందనే వార్త ఇటీవల వాట్సాప్‌లో వైరలైంది. మొదట్లో ఇది కేవలం పుకార్లని ప్రజలు కొట్టిపారేశారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పదేపదే ఈ సమాచారం ప్రచారం కావడంతో ప్రజలు భీతిల్లడం ప్రారంభించారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు కనపడితే మరింత అనుమానంగా చూడడం మొదలెట్టారు. వేసవి సెలవులు కావడంతో పలు ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితులకు ఇళ్లకు వచ్చిన పిల్లలు వీధుల్లో ఆడుకోవడంతో ఇదే అవకాశంగా తమ పిల్లలను ఎక్కడ ఎత్తుకెళతారోననే భయం రానురానూ ప్రజల్లో పెరిగిపోయింది. గ్రామాల్లోకి కొత్త మనుషులు వస్తే వారిని వెంబడించి దారుణమైన తీరులో దాడులకు పాల్పడడంతో సుమారు పదిమందికి పైగా ఉత్తరాది వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు మృత్యువాతపడ్డారు. గుడియాత్తంలో వారం క్రితం జరిగిన వివాహ వేడుకలో వంటపని నిమిత్తం ఉత్తరాది యువకుడు ఒకరు వచ్చాడు. రోడ్డుపై నడిచి వెళుతుండగా అతడిని దొంగగా అనుమానించి ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 30వ తేదీన ఎంవీకుప్పంలో ముగ్గురు ఉత్తరాది మహిళలను కిడ్నాప్ ముఠాగా అనుమానించి తీవ్రంగా కొట్టారు. వేలూరు, ఆరణి సేదరంపట్టు గ్రామాల్లో ఉత్తరాది యువకులను కొట్టి తరిమేశారు. వేలూరు జిల్లా వానియంబాడి, రాణీపేట, భాగ్యం, చెన్నై, షోళింగనల్లూరుల్లో యువకులను విద్యుత్ స్తంభానికి కట్టివేసి దాడికి పాల్ప డ్డారు. తమిళనాడు వాసులకు తప్పని తిప్పలు ఇదిలా ఉండగా, ప్రజల్లో నెలకొన్న కిడ్నాప్ ముఠా భయానికి తమిళనాడుకు చెందిన వారు సైతం బాధితులుగా మారిపోతున్నారు. చెన్నై పల్లవరానికి చెందిన రుక్మిణి అమ్మాల్ (51) తన బంధువులతో కలసి తిరువన్నామలై పోరూర్ సమీపంలోని ఆలయంలో కులదైవాన్ని కొలుచుకుని తిరుగు ప్రయాణంలో చిన్నారులకు చాకెట్లు పంచడంతో ఆమెను కిడ్నాప్ ముఠాగా అనుమానించారు. ప్రజలంతా చుట్టూచేరి విచక్షణారహితంగా దాడులు చేయడంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమెతో ఉన్న వారిని దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన 62 మందిపై హత్య, హత్యాయత్నం కేసులు పెట్టి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో39 మంది కోసం గాలిస్తున్నారు. పళవేర్కాడులో మరో వ్యక్తి బలి రుక్మిణీ అమ్మాల్ సంఘటన నుంచి రాష్ట్రం తేరుకోకముందే తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులో బుధవారం జరిగిన ఇదేరకమైన సంఘటనలో గుర్తుతెలియని వ్యక్తి ప్రజల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వ్యక్తి పళవేర్కాడుకు వచ్చి అనేక వీ«ధుల్లో తిరగడం ప్రారంభించాడు. అతడిని గమనించిన స్థానికులు నిలదీయడంతో స్పష్టమైన సమాధానం చెప్పలేదు. దీంతో అతడు పిల్లలను ఎత్తుకుపోయేవాడని నిర్ధారించుకుని రోడ్డునపడేసి కాళ్లూ, చేతులతో చితక్కొట్టారు. బలహీనంగా ఉన్న అతను ప్రజలకొట్టిన దెబ్బలకు స్పృహతప్పి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. ఆ మృతదేహన్ని ఒక తాడుకు కట్టి పళవేర్కాడు చెరువుకు సమీపంలోని ఫ్లై్లవోవర్ బ్రిడ్జికి వేలాడదీశారు. ఇంతలో ఈ సమాచారం పోలీసులకు చేరడంతో శవాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. మానసిక వైకల్యం కలిగిన ఆ యువకుడు కొన్ని రోజుల్లో పళవేర్కాడులో సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. తిరుమలైవనం పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు పాల్పడినవారి కోసం గాలింపు చేపట్టారు. ఈలోగా పొన్నేరిలో కిడ్నాప్ ముఠా రహస్యంగా దాక్కుని ఉన్నట్లు కలకలం రేగింది. పొన్నేరి పోలీస్‌స్టేషన్ సమీపంలోని చెట్ల పొదల్లో ముఠా ఉన్నట్లు అనుమానించిన సుమారు 500 మంది యువకులు గుమికూడి బుధవారం రాత్రి టార్చ్లైట్ల వెలుగులో వెతికారు. ఎవరూ కనపడకపోవడంతో లోన ఎవరైనా ఉంటే బయటకు రప్పిచేందుకు చెట్లపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనుమానితులపై ప్రజలే దాడులు చేయడం, కొట్టి చంపడం వంటి సంఘటనలతో పోలీస్‌శాఖ బెంబేలెత్తిపోతోంది. భయం భయంగా ఉత్తరాది యువకులు తమ ఊర్లలో ఉద్యోగాలు లేక ఉపాధి నిమిత్తం వందల సంఖ్యలో ఉత్తరాది యువకులు తమిళనాడులో బతుకుతున్నారు. ఉత్తరాదికి చెందిన బిక్షమెత్తుకునేవారు, వీధుల్లో తిరుగుతూ వస్తువులను అమ్మే చిన్నపాటì వ్యాపారం, మానసిక రోగులు, హిజ్రాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీంతో పొట్టకూటి కోసం తమిళనాడులో పనిచేసుకుంటున్న ఉత్తరాది వారు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఉత్తరాది వారిని ఉద్యోగాలకు పెట్టుకున్న సంస్థలు వారికి గుర్తింపుకార్డును జారీ చేస్తే దాడుల నుంచి వారికి రక్షణ లభిస్తుందని పోలీసులు సూచించారు. ఉత్తరాది వ్యక్తులు కనపడితే పట్టుకుని అప్పగించండి, దాడులు చేయవద్దని ప్రజల్లో ప్రచారం చేస్తోంది. -
వాట్సప్ గ్రూప్‌లో లెక్చరర్ అశ్లీల పోస్టులు
భాగ్యనగర్‌కాలనీ: బ్రిగ్గింగ్ టు గెదర్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపులో చిన్నారుల పట్ల అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్న ఓ వ్యక్తిని గురువారం కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుషాల్ అలియాస్ పవర్ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతను క్రియేట్ చేసిన గ్రూపులో చిన్నారులను అశ్లీల పదజాలంతో పోస్టులు పెడుతున్నాడని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావుకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే కుషాల్పై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పోస్ట్‌లు పెట్టినట్లు లె లియటంతో కుషాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వాట్సప్ ‘గురు’..!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి...విధి నిర్వహణలో తీరిక లేని పనులు...దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన కమిషనరేట్‌కు బాస్ కావడంతో నిరంతరం శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలై ఉండాల్సిన పరిస్థితి...అయినా దేశంలో అత్యున్నతమైన పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గురువు అవతారమెత్తారు. సివిల్స్ పరీక్షలో కీలకమైన ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సలహాలు, సూచనలను వాట్సాప్ గ్రూప్‌ల ఏర్పాటు ద్వారా అందించారు. ఇప్పటికే ‘సివిల్స్ గురు’గా అవతారమెత్తిన మహేష్ భగవత్ మార్గదర్శనంలో తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) విడుదలైన ఫలితాల్లో దాదాపు పది మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులకు ఆయన సలహాలు అందించారు. ఇందులో పాటిల్ సుమిత్‌కుమార్ సుభాష్ రావు(7వ స్థానం), కాజోల్ పాటిల్ (11), ఆనంద్‌రెడ్డి (41), తవల్నిఖిల్ దశరథ్ (46), జాదవ్ సుదర్శన్ (47), కస్తూరి ప్రశాంత్ (56), శ్వేత (70), షిండే అమిత్ లక్ష్మణ్ (73), సతీశ్ ఆశోక్ (79), మానే శశాంక్ సుధీర్ (100) విజేతలుగా నిలిచారు. సివిల్స్ ఫలితాల్లో 84 మంది... మహేష్ భగవత్ సలహాలను పాటించిన 300 మందిలో 84 మంది గతేడాది సివిల్స్ ఫలితాల్లో అర్హత సంపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో ఆయన లోగడ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమేగాక సందేహాలను నివృత్తి చేశారు. ఆయన సలహాలు పొందిన వారిలో పుణేకు చెందిన వైశ్ణవి గౌడ్ 11వ ర్యాంక్ సాధించడం విశేషం. తొలి 100 ర్యాంకుల జాబితాలో ఆరుగురు స్థానం పొందారు. ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ తనయుడు ముజామిల్ ఖాన్ (22), ఒంగోలుకు చెందిన రిజ్వాన్ భాషా షేక్ (48), స్వప్పిల్ పాటిల్ (55), అన్వేష్ రెడ్డి (80), పర్జీత్ నాయర్ (87), శోడిశెట్టి మాధవి (104), పోలుమెట్ల అభిషేక్ (373), కపిల్ జీబీ గేడ్(401), శరత్చంద్ర ఆర్రోజు (425), వాసగిరి శిల్ప (547), రంజిత్ (555), మధుసూదన్‌రావు (588), కుమార్ చింత (608), పిన్నని సందీప్‌కుమార్ (732), నర్ర చైతన్య (733), బి.రవితేజ (741), కాపల పవన్‌కుమార్ (799), నరేశ్ మన్నే (979), ప్రేమ్ ప్రకాశ్ (1015), శాలిని (1047) వీరిలో ఉన్నారు. భవిష్యత్‌లోనూ అండగా... గతేడాది మొత్తం 1099 మంది సివిల్స్ ఎంపిౖకైతే వారిలో నేను సలహాలిచ్చిన 84 మందికి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో నా మార్గదర్శనంలో సలహాలు, సూచనలు అందుకున్న పది మంది అభ్యర్థులు విజేతలుగా నిలవడం గర్వంగా భావిస్తున్నా. భవిష్యత్‌లోనూ వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా మరెంతో మంది అధికారులను వెలుగులోకి తెస్తా. అండగా ఉంటా. – మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
పిల్లల నీలిచిత్రాల ముఠా గుట్టు రట్టు
న్యూఢిల్లీ: పిల్లల నీలిచిత్రాలకు (చైల్డ్ పోర్నోగ్రఫీ) సంబంధించిన అంతర్జాతీయ రాకెట్‌ను సీబీఐ గురువారం భగ్నం చేసింది. వాట్సాప్‌లో ఓ గ్రూప్‌లో పిల్లల నీలిచిత్రాలు షేర్ అవుతుండటాన్ని గుర్తించిన సీబీఐ మూడు నెలలపాటు శ్రమించి ఈ ముఠా పనిపట్టింది. ఆ గ్రూప్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువకుడు నిఖిల్ వర్మ అడ్మిన్‌గా ఉండటంతో అతణ్ని సీబీఐ అరెస్టు చేసింది. ఈ గ్రూప్‌లో అమెరికా, చైనా, న్యూజిలాండ్, మెక్సికో, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా తదితర దేశాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. వీడియోలు అప్లోడ్ చేస్తున్న ఐపీ అడ్రస్‌లను గుర్తించిన సీబీఐ.. ఢిల్లీ, ముంబై, నోయిడా, కన్నౌజ్‌లలోని ఐదు ప్రదేశాల్లో గురువారం దాడులు చేసింది. పిల్లల నీలిచిత్రాలను చూడటం, రికార్డు చేయడం, ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం నేరం. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమనా విధించొచ్చు. -
కన్యత్వ పరీక్షలకు చెక్
సాక్షి, పూణే : నవదంపతుల మొదటిరాత్రి పెళ్లికూతురికి శీల పరీక్ష నిర్వహించే అనాగరిక సంప్రదాయానికి చెక్ పెడుతూ పూణే నగరానికి చెందిన కంజర్భట్ వర్గానికి చెందిన యువకులు ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. వీరంతా ‘స్టాప్ ది వి రిచువల్’ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి కన్యత్వ పరీక్షలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా యువకుల గ్రూపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ట్రిపుల్ తలాక్, గోప్యత హక్కుపై ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేశామని..వీటికి వచ్చిన సానుకూల స్పందనతో కన్యత్వ పరీక్ష వంటి దురాచారంపై అవగాహనతో ముందుకొచ్చామని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వివేక్ తమైచెకర్ చెప్పారు. గ్రామాల్లో మహిళ అనుమతి తీసుకోకుండానే ఈ దురాచారాన్ని కొనసాగిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శీల పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని టాటా ఇనిస్టిటూట్యట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో పీజీ చేస్తున్న తమైచెకర్ పేర్కొన్నారు. -
సీఎం.. చింపాంజి
హుబ్లి (సాక్షి, బెంగళూరు): సీఎం సిద్ధరామయ్యను చింపాంజితో పోలుస్తూ హుబ్లి–ధారవాడ మహిళా కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ మోహన హిరేమని షేర్ చేసిన మార్ఫింగ్ చేసిన ఫో టో చర్చనీయాంశమైంది. ఏకంగా సీఎం ఫోటోను అదే పార్టీ నాయకురాలు పార్టీ గ్రూప్‌లోనే పోస్ట్ చేయడంతో ఆమెపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు డీ.కే.శివకుమార్, వినయ్ కులకర్ణి, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ తదితరులు సభ్యులుగా ఉన్న గ్రూపులో ఈ ఫోటో పెట్టడం విశేషం. దీనిపై హుబ్లి–ధారవాడ నగర జిల్లాధ్యక్షుడు అల్తాఫ్ స్పందిస్తూ కార్పొరేటర్ మోహన హిరేమని తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేం పెట్టలేదు : తమ నాయకుడైన సిద్ధరా మయ్య అవహేళనకరంగా ఉన్న ఫోటోను తాము పోస్ట్ చేయలేదని, ఈ ఘటనతో త మకు సంబంధం లేదని కార్పొరేటర్ మోహన హిరేమని చెబుతున్నారు. -
నలభై ఏళ్ల నిరీక్షణ.. వాట్సప్ కలిపింది..
టీ.నగర్ (చెన్నై): నలభై ఏళ్ల కిందట ఉద్యోగ వేటలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి వాట్సాప్ గ్రూప్ ద్వారా శుక్రవారం కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. తిరునల్వేలి జిల్లా వికె.పురం గ్రామానికి చెందిన అబ్దుల్ రహమాన్‌కు భార్య మీరా, కుమారులు ఇబ్రహీం, అబ్దుల్ హమీద్, ఇస్మాయిల్, బషీర్ అహ్మద్, కుమార్తె జైనన్బు ఉన్నారు. పెద్ద కుమారుడు ఇబ్రహీం 1977లో తన 35వ ఏట ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత అతని గురించి సమాచారం తెలియలేదు. ఇలా ఉండగా గత వారం నెల్లై జిల్లా వాట్సాప్ గ్రూప్‌లో వికె.పురానికి చెందిన ఇబ్రహీం మహారాష్ట్రలోని సతారా జిల్లా, కరాత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం వ్యాపించింది. దీన్ని గమనించిన కుటుంబీకులు అందులో పేర్కొన్న వ్యక్తిని సంప్రదించి మహారాష్ట్రలోని కరాత్‌కు వెళ్లి ఆస్పత్రిలో ఇబ్రహీంను కలిశారు. అక్కడ ఇబ్రహీం స్నేహితులు ఉగేష్, రాజా, ఖాజా ఉన్నారు. అతన్ని శుక్రవారం వికే.పురంలోని ఇంటికి తీసుకువచ్చారు. పక్షవాతంతో ఉన్న ఇబ్రహీంకు ప్రస్తుతం 75 ఏళ్లు. -
గ్రామ పంచాయితీ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో ఓ గ్రామ పంచాయితీ జారీ చేసిన ఆదేశాలు కాస్త విడ్డూరంగానూ.. చర్చనీయాంశంగానూ మారాయి. టాయ్లెట్లలో పిల్లల ఫోటోలను తీసి వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేయాలని పంచాయితీ పెద్దలు స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించారు. ధామటారి జిల్లాలోని ఓ గ్రామ పంచాయితీ అధికారులు ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను కలుపుకుని సుమారు 355 పాఠశాలలకు ఈ ఉత్తర్వులు అందాయంట. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఆయా స్కూళ్లలో టాయ్ లెట్ల నిర్మాణాలను చేపట్టగా.. వాటి పనితీరు... పిల్లలు వాటిని సరిగ్గా వినియోగిస్తున్నారా? లేదా? శుభ్రత తదితర విషయాలపై స్పష్టత కోసమే ఈ ఆదేశాలను ఇచ్చినట్లు పంచాయితీ పెద్దలు చెబుతున్నారు. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైపోయాయి. ఇది ముమ్మాటికీ పిల్లల హక్కులను భంగం కలిగించటం అవుతుందని.. పైగా స్కూల్ సిబ్బంది కూడా ఈ ఆదేశాలను ఇబ్బందిగా భావిస్తున్నారని టీచర్లు చెబుతున్నారు. -
వాట్సాప్‌లో రెండు సరికొత్త ఫీచర్లు!
న్యూఢిల్లీ : మెసేజింగ్ సర్వీసుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్, మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటలోకి తేవడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల ఐఫోన్లలో యూట్యూబ్ వీడియోలను సంభాషణ మధ్యలో ఉండగానే ప్రత్యక్షంగా చూసేలా, రెండోది లాక్ రికార్డింగ్ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా గ్రూపు మెసేజ్‌లలో వ్యక్తిగత సందేశాలలు పంపే వీలు కల్పించనుంది. ప్రస్తుతం సరికొత్త ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. గ్రూపులో ప్రైవేట్ చాటింగ్ వాట్సాప్‌లో గ్రూప్ చాటింగ్ చేస్తుండగా.. ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు గ్రూపులోకి ఒక్క యూజర్‌కు వ్యక్తిగతంగా సందేశం పంపడానికి కొచ్చ ఫీచర్ త్వరలో అందిస్తామని సంస్థ ప్రకటించింది. రిప్లై ప్రైవేట్లీ (Reply Privately) అనే ఆప్షన్ ద్వారా గ్రూపు నుంచి మనకు కావలసిన వ్యక్తికి సందేశాలు పంపాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. వాట్సాప్ వెబ్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వాట్సాప్ బీటాఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ వెబ్‌లో పిక్చ్ ఇన్ పిక్చర్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వీడియో చూస్తునే వాయిస్ కంట్రోల్ చేయడం, ప్లే/పాస్ బటన్, టైమ్‌లైన్ స్లైడర్ వాడవచ్చు. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో కంటెట్ చూస్తున్నప్పుడు.. అదే స్క్రీన్ మీద అందే విండోలో యూజర్లతో ఎంచక్కా చాటింగ్ చేసుకోవచ్చు. -
కత్తిపోట్లకు దారితీసిన వాట్సాప్ మెసేజ్
-
కత్తిపోట్లకు దారితీసిన వాట్సాప్ మెసేజ్
హైదరాబాద్: వాట్సాప్ గ్రూపులో మెసేజ్ ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రోహిత్(20), భువనేశ్వర్(20) మైసమ్మగూడలోని నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరు తమ స్నేహితులతో కలసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల రోహిత్, భువనేశ్వర్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గురువారం రాత్రి భువనేశ్వర్ ‘శుక్రవారం రోహిత్‌ను నేను కొట్టబోతున్నాను’ అంటూ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. దీన్ని చదివిన రోహిత్ శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలసి నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మాటు వేసి, బస్సు దిగుతున్న భువనేశ్వర్‌పై కత్తితో దాడి చేశాడు. ముఖం, చేతులు, నడుముకు గాయాలు కావడంతో అతడిని కళాశాల యాజమాన్యం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. దాడిని అడ్డుకునేందు కు ప్రయత్నించిన మరో విద్యార్థి కూడా గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని యాజమాన్యం దాచేందుకు ప్రయత్నించినా ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. రోహిత్‌తోపాటు అతని నలుగురు స్నేహితులు భువనేశ్వర్‌ను గట్టిగా పట్టుకుని కత్తితో దాడికి పాల్పడినట్లు క్షతగాత్రుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
పాలన.. కొత్త పుంతలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పాలన కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, శాఖాపరమైన పురోగతి నివేదికలతో పాటు పర్యవేక్షణ కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. ఇటీవల జిల్లాల సంఖ్యతో పాటే అన్ని శాఖల్లోనూ జిల్లా అధికారుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో జిల్లాస్థాయి అధికారులతో సమన్వయం, సూచనలు, ఆదేశాల జారీ, పర్యవేక్షణ వంటివి సజావుగా సాగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయి. అధికారులకు రోజువారీ కార్యకలాపాలపై అందులోనే సలహాలు, సూచనలిస్తూ క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి. ఇలా నిర్ణయం.. అలా అమలు గతంలో రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరాలంటే చాలా సమయం పట్టేది. నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు పోస్టు ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో పంపేవారు. ఆ పరిస్థితికి స్వస్తి పలుకుతూ వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా ఉత్తర్వుల కాపీలను పంపుతున్నారు. అంతేకాకుండా శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలు, పురోగతి అంశాలను సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో ప్రత్యేకంగా ఒక డిప్యూటీ డైరెక్టర్ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని నిమిషాల్లో చేరవేస్తున్నారు. ఒక విధంగా గ్రూపు సభ్యులకు సంబంధిత వాట్సాప్ గ్రూపును అనుసరించడం రోజువారీ విధుల్లో భాగమైపోయింది. ఇదే తరహాలో గిరిజన సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖలు సైతం రాష్ట్రస్థాయి వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్నాయి. పక్కాగా నిర్వహణ రాష్ట్ర శాఖలు తమ వాట్సాప్ గ్రూపుల నిర్వహణలో జాగ్రత్త వహిస్తున్నాయి. వీటిలో రాష్ట్ర శాఖ కమిషనర్/డైరెక్టర్, ఆ తర్వాత స్థాయిలో ఉండే అదనపు డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో పాటు జిల్లా అధికారులు మాత్రమే ఉంటారు. ఒక నిర్ణయాన్ని గ్రూప్‌లో అప్డేట్ చేసిన వెంటనే దాన్ని జిల్లా స్థాయి అధికారులు (గ్రూప్ సభ్యులు) అందరూ చూశారా.. లేదా.. అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా సమాచారాన్ని చూడనట్లు గుర్తిస్తే వెంటనే వారికి ఫోన్ చేసి మరీ విషయాన్ని చేరవేస్తున్నారు. దీంతోపాటు నిర్ణయాలను ఆయా అధికారుల మెయిల్ ఐడీలకు సైతం పంపుతున్నారు. అయితే అధికారులు కార్యాలయంలోనే కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నా వాట్సాప్ ద్వారా చూడడం సులభతరం కావడంతో ఉన్నతాధికారులు దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గోప్యమైన అంశాలేమైనా ఉంటే.. వాటిని సదరు అధికారి వ్యక్తిగత వాట్సాప్, ఈ–మెయిల్‌కు పంపుతున్నారు. శాఖాపరమైన వాట్సాప్ గ్రూప్‌ను కార్యాలయ పనివేళల్లో తప్పనిసరిగా అనుసరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం గమనార్హం. సులభం.. కచ్చితం కూడా.. గతంలో పది జిల్లాలున్నప్పుడు సమాచారం ఇవ్వాలంటే ఫోన్ చేసేవాళ్లం. జిల్లాల సంఖ్య పెరగడంతో ఫోన్లో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఇందులోనే అన్నీ వివరిస్తున్నాం. జిల్లా స్థాయి అధికారులు దీంతో సకాలంలో స్పందిస్తున్నారు. – వి.సర్వేశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ -
వాట్సాప్ గ్రూప్ అశ్లీల వీడియో.. ఎంపీపై ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ గ్రూప్ లో అసభ్య వీడియోను పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ఎంపీ. ఫతేగఢ్ సాహిబ్ స్థానంలో ఆప్ తరపున పోటీ చేసి ఎంపీగా పోటీ చేసిన హరిందర్ సింగ్ ఖల్సా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మధ్య ఓ వాట్సాప్ గ్రూపులో ఆయన అశ్లీల వీడియోను పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోకు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ అంటూ కాప్షన్ కూడా పెట్టారు. దీంతో అదే గ్రూపులో సభ్యురాలిగా ఉన్న రేణు సోనియా అనే మహిళ ఎంపీపై మండిపడగా, వెంటనే గ్రూప్ నుంచి హరిందర్ అన్ జాయిన్ అపోపోయాడు. ఈ వ్యవహారంపై రేణు సోనియా పలువురు మానవ హక్కుల కార్యకర్తలను వెంటపెట్టుకుని మరీ వెళ్లి లూథియానా డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఆయన ఇలాంటి పిచ్చి పనులు చేయటం సరికాదన్న ఆమె.. పైగా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకపోవటంపై రేణు మండిపడుతున్నారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్‌ను పరిశీలించిన పోలీస్ శాఖ ఖన్నా ఎస్ఎస్పీ నవజోత్‌సింగ్ మహల్‌కు విచారణ బాధ్యతలు అప్పజెప్పింది. అది పొరపాటున జరిగింది: హరిందర్ సింగ్ మహిళ ఆరోపిస్తున్నట్లుగా తానే వీడియో వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయలేదని.. అది పొరపాటున జరిగిందని ఎంపీ హరిందర్ సింగ్ చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం తాను ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లానని.. ఆ సమయంలో స్నేహితుడి ఇంట్లో బస చేసిన తాను ఫోన్‌ను పక్కన పడేశానని చెప్పారు. అయితే కొందరు యువకులు తన ఫోన్ లో అసభ్య వీడియో డౌన్లోడ్ చేసి.. గ్రూప్‌లో పోస్ట్ చేశారని, వెంటనే తన భార్య వాట్సాప్ అన్ ఇన్స్టాల్ చేయమని సూచించగా.. తాను ఆ పని చేశానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కొందరు ఆప్ మహిళా కార్యకర్తలు కావాలనే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని హరిందర్ చెబుతున్నారు. -
బంధాలు దూరం.. అంతా వాట్సాప్‌లోనే ...
సాక్షి, శ్రీనగర్: లడక్ లోని తుర్తుక్ గ్రామం.. 43 ఏళ్ల గులాం హుస్సేన్ అనే సామాజిక కార్యకర్తకు శనివారం తన సోదరి నర్గీస్ దగ్గరి నుంచి ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. అందులో తనకు పుట్టిన బిడ్డ ఫోటోలను ఆమె వాట్సాప్‌లోనే పంపంగా, గులాం వాయిస్ మెసేజ్‌లో ఆశీర్వదించాడు. అయితే ఆ సంభాషణల్లోని(సందేశాలు) భావోద్వేగాల తాలుకు లోతు మాత్రం వేరేలా ఉంది. కారణం తాము భవిష్యత్తులో కలుస్తామో లేదో అన్న భయం వారిలో నెలకొనటమే. నర్గీస్-హుస్సేన్ కుటుంబాలు సరిహద్దు వివాదంతో నాలుగు దశాబ్దాల క్రితమే విడిపోయారు. 1971 యుధ్ద సమయంలో నాలుగు గ్రామాలు నియంత్రణ రేఖ వెంబడి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించబడి అటు-ఇటు విడిపోయాయి. అందులో తుర్‌తుక్‌తోపాటు ప్రస్తుతం నర్గీస్ నివసిస్తున్న స్కర్దు ప్రాంతం(గిల్గిట్-బల్టిస్థాన్) ఉన్నాయి. అప్పటి నుంచి ఒకరి కుటుంబాలు ఒకరి ముఖం చూసుకోలేదు. 1989 లో హజ్ యాత్ర సందర్భంగా తన తండ్రి సోదరుడు అబ్దుల్ ఖదీర్ ను కలుసుకుని రోదించిన విషయాన్ని ఈ సందర్భంగా హుస్సేన్ గుర్తు చేసుకుంటున్నాడు. ఇలా వీరి ఒక్క కుటుంబమే కాదు. సుమారు 15000 కుటుంబాలు లడక్ వద్ద ఏర్పడ్డ కంచె మూలంగా ఏళ్ల తరబడి ముఖాలు చూసుకోకుండా ఉండిపోయారు. నిత్యం వేల సంఖ్యలు సైన్యం పహారా కాస్తుంటుంది. వీరుంటున్న ఉళ్ల మధ్య ఫోన్‌కాల్స్ కనెక్ట్ కావు, రహదారులు మూసేసి ఉంటాయి. చివరకు వీసాలు కూడా తిరస్కరణకు గురవుతూ వస్తున్నాయి. కానీ, వాట్సాప్ పుణ్యమాని తమలాంటి ఎన్నో కుటుంబాలు తిరిగి దగ్గరవుతున్నాయని హుస్సేన్ చెబుతున్నారు. ‘ కంచె వేరు అయిన మేం ప్రతీరోజు కలుసుకుంటూనే ఉంటున్నాం. వాట్సాప్‌లో ఆడియో, వీడియో, ఫోటోల రూపంలో సందేశాలను పంపుకుంటున్నాం. త్వరలో మేం మళ్లీ కలుస్తామన్న ఆశ ఉంది’ అంటూ హుస్సేన్ చెబుతున్నారు. ఇక వీరిలో చాలా మట్టుకు ప్రజలు హమ్ సబ్ కబ్ మిలేంగే? పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకుని అందులో సంభాషించుకుంటున్నారని ముసా చులుంకా అనే పాక్ పాత్రికేయుడు తెలిపారు. ఇంట్లో జరిగే శుభకార్యల దగ్గరి నుంచి చావు వార్త దాకా ఇలా ప్రతీ విషయాన్ని సందేశాల రూపంలో తెలియజేసుకుంటున్నారు. సరిహద్దులు మమల్ని వేరే చేసినా సోషల్ మీడియా మాత్రం మమల్ని మళ్లీ కలుపుతోందంటూ ఆ గ్రూప్‌లోని వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే శాశ్వతంగా కలిసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా? అనే ఎదురు చూస్తున్నామని వారంటున్నారు. మరోపక్క ప్రభుత్వాలు కూడా వీళ్లు మళ్లీ కలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మధ్యే పీపుల్స్ ఫోరం ఆఫ్ డివైడెడ్ ఫ్యామిలీస్ అండ్ పీస్ అనే సంస్థ జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసి ఈ అంశంలో చొరవచూపాలని విజ్ఞప్తి చేయగా, ఆమె సానుకూలంగా స్పందించారు కూడా. -
రాళ్ల వర్షం కురిపిస్తే పైసలు.. పాక్ నుంచి ఆపరేట్
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు బలగాలు తీసుకునే చర్యలకు ఎలా భంగం కలుగుతుందో విశ్లేషణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులకు కీలక సమాచారం తెలిసింది. జమ్ముకశ్మీర్‌లోని యువతను పాకిస్థాన్ నుంచి రెచ్చగొడుతున్నట్లు స్పష్టమైంది. కశ్మీర్ ప్రాంతంలో సోషల్ మీడియా పనిచేస్తున్న తీరును గమనించగా మొత్తం 28 వాట్సాప్ గ్రూప్‌లు కశ్మీర్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉండగా వీటిల్లో దాదాపు ఐదువేల మంది కశ్మీర్ యువత ఉన్నారని, అయితే, వీటి అడ్మినిస్ట్రేటర్లు మాత్రం పాక్‌లో ఉన్నారని, వారే వీటిని ఆపరేట్ చేస్తున్నారని గుర్తించారు. ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాహ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, వారే కశ్మీర్ యువతను రెచ్చగొట్టే బలగాలపై రాళ్ల దాడి చేస్తున్నారని కనుగొంది. 'కశ్మీర్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో పాకిస్థాన్ నెంబర్లను మేం గుర్తించాం. వీటిల్లో జమాద్ ఉద్ దవాహ్‌కు చెందిన వాళ్లున్నారు. చేయాల్సిన పనులు, రెచ్చగొట్టే నినాదాలు, ప్రచారం చేయాల్సిన అంశాలు వాటిల్లో ఉన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్ కొంతమంది యువతకు జమాత్ ఉద్ దవాహ్తో సంబంధం ఉందని స్పష్టమైంది. అంతేకాదు, ఇలా రాళ్లు విసురుతున్న వారికి వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కాన్ఫరెన్స్ చెల్లింపులు చేస్తోంది' అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. -
ఆ ఫొటో పెట్టారని వాట్సప్ అడ్మిన్ అరెస్టు!
బెంగళూరు: కర్ణాటకలో ఓ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టయ్యాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్‌లో ఓ పోస్టు పెట్టినందుకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునన్నారు. కర్ణాటకలో వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడిని అరెస్టు చేయడం ఇదే ప్రథమం. ఉత్తర కన్నడ జిల్లాలోని మురుదేశ్వర్ ప్రాంతానికి చెందిన సన్నథమ్మ నాయక్ (30) ’ద బాల్సే బాయ్స్’పేరిట ఓ వాట్సప్ గ్రూప్‌ను నడుపుతున్నాడు. ఆటో డ్రైవర్ అయిన అతను ఇటీవల ప్రధాని మోదీ మీద అసభ్యకరమైన పోస్టు పెట్టడమే కాకుండా.. అశ్లీలంగా, అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ప్రధాని మోదీ ఫొటోను కూడా సర్క్యులేట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
రాళ్లు విసిరేందుకు 300 వాట్సాప్ గ్రూపులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న అల్లర్లు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నవేనని మరోసారి స్పష్టమైంది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి శాంతిభద్రతలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న బలగాలపైకి రాళ్లు విసురుతున్న ఆందోళనకారులు ఎప్పటికప్పుడు ముందుగా అనుకోనే దాడులకు దిగుతున్నట్లు తాజాగా తెలిసింది. దాదాపు 300 వాట్సాప్ గ్రూపుల ద్వారా తమను తాము నియంత్రించుకుంటూ ఆందోళన కారులు బలగాలపై రాళ్లదాడికి దిగుతున్నట్లు సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి సమాచారం అందుతోంది. ఇందులో 90శాతం వరకు వాట్సాప్ గ్రూపులు ఇప్పటికే మూసివేశారని కూడా సమాచారం. ప్రతి ఒక వాట్సాప్ గ్రూపులో 250 మంది ఉన్నట్లు కూడా తెలిసింది. బలగాలు అడుగు వేస్తే వెంటనే ఆ సమాచారాన్ని చేరవేసేలా వాట్సాప్ గ్రూపులను కొనసాగిస్తున్నారు. ‘వాట్సాప్ గ్రూపుల్లో ఎవరున్నారో, వాటిని నడిపేదెవరో మా దగ్గర సమాచారం ఉంది. అందులో ఇప్పటికే చాలామందిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. దీనికి మంచి స్పందన కూడా వస్తోంది’ అని చెప్పారు. సోమవారం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యి ప్రస్తుతం కశ్మీర్ పరిస్థితులపై చర్చించనున్నారు. -
వాట్సాప్‌లో కామెంట్.. ఉద్యోగం ఊడింది
నగరంలోని ప్రతిష్టాత్మకమైన కేఎంసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న సునీల్ వాగ్మేర్‌ను చితకబాదుతున్నారన్న విషయం తెలిసి ముంబై పోలీసులు ఆయన్ని రక్షించడానికి హుటాహుటిన కాలీజీకి వెళ్లారు. అక్కడ ఆయన్ని బాదుతున్నది ఎవరో కాదు, ఆయన సహచర అధ్యాపకులు, విద్యార్థులు. చేయిచేసుకున్న వారిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు బాధితుడైన సునీల్ వాగ్మేర్‌ను అరెస్ట్ చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని 295 ఏ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఆయనపై దాడిచేసిన వారిపై చర్య తీసుకోవాల్సిన కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్ సునీల్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన చేసిన తప్పేమిటంటే ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ఫిబ్రవరి 19వ తేదీనే అధికారికంగా జరుపుకున్నాం, మళ్లీ మార్చి 15వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నారు’ అంటూ తన వాట్సాప్ గ్రూప్‌లో తన సహచర అధ్యాపకులను ప్రశ్నించడమే. మార్చి 16న కాలేజీకి వచ్చిన ప్రొఫెసర్ సునీల్‌ను పట్టుకొని ఆయన సహచర అధ్యాపకులు, హిందూ విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు చితకబాదారు. కొంతమంది హిందుత్వ వాదుల ఒత్తిడి మేరకు పోలీసులు బాధితుడినే అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ జయంతిపై వివాదం ఈనాటిది కాదు. ఈ వివాదం ఇతర వర్గాల మధ్యన కాకుండా హిందూ వర్గాల మధ్యనే ఉండడం విశేషం. మహారాష్ట్రలో గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం కొంత మంది ఫిబ్రవరి 19వ తేదీన శివాజీ జయంతిని జరుపుకుంటారు. ఎక్కువ మంది ప్రజలు మాత్రం ఫల్గుణ మాసం మూడోరోజు తదియ నాడు జయంతిని జరుపుకుంటారు. తిథి ప్రకారం ఈసారి శివాజీ జయంతి మార్చి 15 తేదీన వచ్చింది. దాన్ని ప్రశ్నించడం సునీల్‌ది తప్పయింది. తిథి ప్రకారమే శివాజీ జయంతిని జరుపుకోవాలన్నది శివసేన మొదటి నుంచి చేస్తున్న వాదన. శివాజీ స్వయంగా మొఘల్ చక్రవర్తుల కాలంలో ఇస్లాం క్యాలెండర్‌ను తిరస్కరించినప్పుడు ఇతర దేశాలకు చెందిన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శివాజీ జయంతిని జరుపుకోవడం ఏమిటన్నది శివసేన ప్రశ్న. 1582లో ప్రపంచంలో చాలా దేశాలు ప్రామాణికంగా గుర్తించిన క్యాలెండర్ ‘గ్రెగోరియన్ క్యాలండర్’. అప్పటి పోప్ గ్రెగోరియన్ పేరిట వచ్చిన ఈ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో వచ్చే తేడా 0.002 శాతం మాత్రమే అయినందున నాటి కాలంలో గణిత పండితులు ఎక్కువ మంది దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. శివాజీ 16వ శతాబ్దంలో పుట్టారన్నది నిజమే అయినా.. ఏ సంవత్సరం, ఏ తేదీన పుట్టింది ఎవరికీ తెలియదు. ఆయన రాజ కుటుంబంలో కాకుండా శివాజీ భోన్స్లే అనే పోలీసు సుబేదార్కు పుట్టడమే అందుకు కారణం. రాజకుటుంబంలో పుట్టి ఉంటే కచ్చితంగా పుట్టిన రోజు నమోదయ్యేది. 1627లో పుట్టారని కొంత మంది, 1630లో పుట్టారని కొంత మంది చరిత్రకారులు చెబుతున్నారు. సంఘ సంస్కర్త లోకమాన్య తిలక్ 1980లో మొదటి సారిగా శివాజీ జయంతికి ప్రాచుర్యం కల్పించారు. అప్పటి నుంచి శివాజీ జయంతిపై వివాదం మరింత పెరిగింది. 2000 సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదానికి తెరదించేందుకు చరిత్రకారులతో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ ఫిబ్రవరి 19వ తేదీనే ఖరారు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును సెలవుదినంగా పాటిస్తోంది. అయినా వివాదం మాత్రం అలాగే కొనసాగుతోంది. రెండు తీదీలు వసంత మాసంలోనే వస్తున్నాయి కనుక ఏ రోజైనా జరుపుకోవచ్చని కొందరు సూచిస్తుండగా, రెండు రోజులూ జరుపుకోవచ్చని అహింసావాదులు సూచిస్తున్నారు. సునీల్‌పై దాడిని ఖండించని శివసేన మాత్రం, శివాజీ గొప్ప నాయకుడని, ప్రతిరోజు ఆయన జయంతిని జరుపుకోవచ్చని చెప్పింది. -
ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు!
-
వైరల్ వీడియో: ఏడుస్తూనే.. లెట్స్ డూ కుమ్ముడు!
అది ఎక్కడి దృశ్యమో తెలియదు. ఆ పాప ఎవరో కూడా ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ, ఆ చిన్నారి వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అతి తక్కువ కాలంలోనే వాట్సప్, ఫేస్‌బుక్‌లతో పాటు యూట్యూబ్‌లో కూడా విపరీతంగా ఫేమస్ అవుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందంటారా.. మంచం మీద ఎవరో ఒక వ్యక్తి పడుకుని, తన పొట్టమీద ఆ చిన్నారిని కూర్చోబెట్టుకున్నారు. ఆయన బహుశా ఆ చిన్నారికి అత్యంత సమీప బంధువు అయి ఉంటారు. ఆ పాప మాత్రం తన తల్లి కోసం ఏడుస్తోంది. ఆ పాప చేత ఏడుపు మాన్పించడానికి ఆయన 'అమ్మడూ' అనగానే... ఆ చిన్నారి కొంత ఏడుపు కలగలిసిన గొంతుతోనే 'లెట్స్ డూ కుమ్ముడూ' అంటోంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. అలా ఎన్నిసార్లు అడిగినా ఆ చిన్నారి పాట పాడుతూనే ఉంటోంది. మధ్యలో అమ్మ గుర్తుకొచ్చినప్పుడు మాత్రం మళ్లీ అమ్మ కావాలని ఏడుస్తూ అడుగుతోంది. గ్రీన్ కలర్ గౌను వేసుకుని ఉన్న ఆ చిన్నారి పాటను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. వాట్సప్ గ్రూపులలో ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. -
వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియోల కలకలం
సాక్షి, సిటీబ్యూరో: ఓలా ఉబర్ క్యాబ్ డ్రైవర్స్ కమ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేసిన ఇద్దరు డ్రైవర్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బొడుప్పల్కు చెందిన కందడి రఘుపాల్‌రెడ్డి, ఎంకే నగర్‌కు చెందిన సిద్దమ్ శ్రీధర్‌లను అరెస్టు చేసి, వారి నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్బీనగర్ హస్తినాపురం బ్యాంక్ కాలనీకి చెందిన . శ్రీనివాస్ తెలంగాణ కార్ డ్రైవర్ ఓనర్స్ అసోసియేషన్(టీసీడీవోఏ) పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఇందులో 111 మంది వాట్సాప్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఇందులో సభ్యులుగా ఉన్న డ్రైవర్లు రఘుపాల్‌రెడ్డి, సిద్దమ్ శ్రీధర్ అశ్లీల వీడియోలు, ఫొటోలు పొస్టు చేయడంతో ఇతర డ్రైవర్లు వాట్సాప్ అడ్మినిస్ట్రేటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శ్రీనివాస్ ఈ నెల 14న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ నేతృత్వంలోని బృందం నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వారిని పోలీసులు ప్రశ్నించగా సరదా, తమాషా కోసమే చేసినట్లు సమాధానమిచ్చారు. వాట్సాప్ గ్రూప్‌ల్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేయడం నేరం కిందికి వస్తుందని, ఆయా వాట్సాప్ గ్రూప్‌ల్లోని సభ్యులు అభ్యంతరం చెబితే చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
నంద్యాలలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కామ పిచ్చి
-
స్నేహం పేరిట బ్లాక్మెయిల్
⇒ స్నేహితురాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ⇒ వారి స్నేహితులతోనూ పరిచయాలు ⇒ అసభ్యకర ఫొటోలు చూపించి బెదిరింపులు.. ⇒ రూ.లక్షల్లో వసూలు చేసి జల్సాలు సాక్షి, జగిత్యాల: అతడిది ఆకట్టుకునే అందం.. ఖరీదైన డ్రెస్సులు.. అదిరిపోయే బైక్.. ఐ ఫోన్.. మల్టీమీడియాలో దిట్ట.. ఇలా తనకున్న ప్రత్యేకతలతో అమ్మాయిలకు స్నేహం పేరిట వల వేశాడు. వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. ఇలా రూ. లక్షల్లో వసూలు చేశాడు. ఓ యువతి ఫిర్యాదు చేయడంతో జగిత్యాల పోలీసులు ఆ మాయలోడిని అరెస్టు చేశారు. కేసు వివరాలను జగిత్యాల సీఐ ప్రకాశ్ శుక్రవారం విలేకరులకు వివరించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన కసాడి మల్లయ్య కుమారుడు కసాడి వంశీకృష్ణ(21) జగిత్యాలలో 9వ తరగతి చదివాడు. పై చదువుల కోసం కరీంనగర్, హైదరాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో జగిత్యాలలో తాను చదివిన అమ్మాయిలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ అమ్మాయిల ద్వారా వారి స్నేహితురాళ్లనూ ఫోన్లో పరిచ యం చేసుకుని వారినీ గ్రూప్‌లో చేర్చాడు. వారిలో ఒక్కొక్కరిని వేర్వేరుగా కలుస్తూ.. వారిలో కొందరితో అసభ్యంగా ఫొటోలు దిగాడు. మరికొన్నింటిని తనకున్న మల్టీమీడియా పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేశాడు. సదరు ఫొటోలను అమ్మాయిల తల్లిదం డ్రులకు చూపిస్తానని, నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. అమ్మాయిల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు.. కెమెరా.. విలువైన మొబైల్ రాబట్టాడు. వచ్చిన డబ్బులతో హైదరాబాద్, గోవాలో జల్సా చేశాడు. ఇతని ఆగడాలు భరించలేక ఓ బాధిత యువతి ఈ నెల 5న నేరుగా జిల్లా ఎస్పీ అనంతశర్మను కలిసింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలో దిగిన సీఐ ప్రకాశ్ బృందం శుక్ర వారం బస్టాండ్ ప్రాంతంలో వంశీకృష్ణను అరెస్టు చేసింది. విచారించగా.. ఇప్పటి వరకు 15 మందిని బ్లాక్మెయిల్ చేసినట్లు ఒప్పుకున్నాడు. -
వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు!
సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ ద్వారా పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళలకు కొత్త జీవితాన్ని అందించాలని ఉద్దేశ్యంతో సౌదీ అధికారులు ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. మహిళలకు పెళ్లిళ్లు ఫిక్స్ చేయడం కోసం వాట్సాప్‌ను సాధనంగా ఎంచుకుని ఓ గ్రూపును క్రియేట్ చేశారు. పాలిగమీ పేరుతో ఎనిమిది మంది సౌదీ అధికారులు ఈ గ్రూప్‌ను రూపొందించారు. ఈ గ్రూప్‌లో ఇప్పటికే 900 మంది మహిళలు రిజిస్ట్రర్ చేసుకున్నారు. పాలీగమీ విశేషమేమిటంటే.. దానిలో విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, పెళ్లికాని వారు పేర్లు నమోదుచేసుకోవచ్చు. మక్కా సిటీలో ఎక్కువగా డైవర్స్ కేసులు పెరిగిపోతుండటాన్ని గమనించిన అధికారులు, వారికో తోడు అందించాలనే ఉద్దేశంతో ఈ ఐడియాతో ముందుకొచ్చారు. సౌది మహిళలతో పాటు యెమెన్, మోరోకో, సిరియా, పాలస్తీనా, ఈజిస్ట్, నైజీరియా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్‌లోని మహిళలు కూడా ఈ వాట్సాప్ గ్రూప్‌లో పేర్లను నమోదుచేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో పేర్లు నమోదుచేసుకున్న మహిళలు రెండో, మూడో, నాలుగో భార్యగైనా వెళ్లడానికి వారికి తాము సిద్దమని పేర్కొన్నట్టు తెలిసింది. నమోదు జాబితా ప్రకారం దీనిలో అతిపెద్ద వయసున్న అమ్మాయికి 55 సంవత్సరాలు కాగ, తక్కువ వయసున్న అమ్మాయికి 18 సంవత్సరాలు. ఎత్తు ప్రకారం చూసుకుంటే, 4'7" నుంచి 5'10" ఎత్తు ఉన్న మహిళలున్నారు. కొంతమంది మహిళలు తమకు కావాల్సిన అబ్బాయిలు ఎలా ఉండాలి, ఎలాంటి వాటిని అంగీకరించాలో కూడా ఆ గ్రూప్‌లో పేర్కొన్నారు. ఉచిత సర్వీసు ఫీజుతో వారికి పెళ్లి కుదుర్చుతామని మ్యారేజ్ అధికారులు చెప్పారు. -
అభ్యంతరకరంగా మోదీ ఫొటో పెట్టి..
ముజఫర్‌నగర్: వాట్సాప్ గ్రూప్ లో ఓ వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్చి పెట్టి బుక్కయ్యాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. తివారీ అనే పోలీసు అధికారి వివరాల ప్రకారం ముజఫర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ప్రధాని మోదీ ఫొటోను అభ్యంతరంగా మార్చి దానిని వాట్సాప్ గ్రూప్ లో పెట్టి అవమానించాడు. ఇది గమనించిన ఓ బీజేపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆ ఫొటోను కూడా పోలీసులకు చూపించాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
‘వాట్సప్’ విప్లవం
విషయ సేకరణలో కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం గ్రూప్ ఛాటింగ్‌తో యువత హల్చల్ పోలీసులు, జర్నలిస్టులకు చక్కటి కమ్యూనికేషన్ ‘యాప్’ సమాచార, సాంకేతిక (ఐటీ) రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఇంటర్నెట్ రాకతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఇంటర్నెట్టే సంచలనమనుకుంటే.. దాని ఆధారంగా వచ్చిన ‘సోషల్ నెట్వర్కింగ్’ సైట్లు మరో సంచలనం. ఇప్పుడు ‘ఫేస్బుక్’, వాట్సప్, ట్విట్టర్ హవా సాగుతోంది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వాట్సాప్ చక్కటి ‘యాప్’గా ఇది ఉపయోగపడుతోంది. ఇప్పుడొస్తున్న ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ వాట్సప్ తప్పనిసరిగా ఉంటోంది. దీన్ని ఉద్యోగులు, యువత దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుంది. పోలీసులు, జర్నలిస్టులకు సైతం చక్కటి కమ్యూనికేషన్ ‘యాప్’గా వాట్సప్ ఉపయోగపడుతోంది. – మహబూబ్‌నగర్‌క్రైం/అలంపూర్ రూరల్ ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘వాట్సప్’ సందడి చేస్తోంది. పల్లెలను సైతం పలకరిస్తోంది. వినియోగదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్ కలిగివున్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. దీనిద్వారా సందేశాలు, ఫొటోలు, వీడియోలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ‘కాలింగ్’ ఆప్షన్ కూడా రావడంతో బంధువులు, స్నేహితులతో ఎంచక్కా మాట్లాడుతున్నారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులతో కమ్యూనికేషన్ నడపడానికి వాట్సప్‌ను సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. మనకు బాగా తెలిసిన వారితో గ్రూప్‌గా ఏర్పడి కమ్యూనికేషన్ నడిపించవచ్చు. పోలీసులు, జర్నలిస్టులు సైతం.. విషయాన్ని సేకరించి అందరికంటే ముందే తానే చేరవేయాలన్న కుతూహలం యువతలో బలంగా ఉంది. అందుకే వాట్సప్లను ఉపయోగిస్తూ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏకకాలంలో క్షణాల్లో అందరికీ ఒకేసారి విషయాన్ని చేరవేయగలుగుతున్నారు. నేరాలకు చెక్ పెట్టేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వాట్సప్ ద్వారా జిల్లా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణమే వాట్సప్ ద్వారా సమాచారం తెలియజేయాలని పోలీసు ఇప్పటికే సిబ్బందిని ఆదేశించారు. జర్నలిస్టులు సైతం వార్తలు, ఫొటోల సేకరణకు, వాటిని ప్రచురణ కేంద్రాలకు పంపడానికి వ్యాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఏవైనా సంఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్నా తక్షణమే సమాచారం పంపగలుగుతున్నారు. ఆరోగ్య సమస్యలు సైతం.. మరోవైపు స్మార్టుఫోన్లు ఎక్కువగా వాడటం మంచిది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. సెల్ఫోన్లు చూస్తూ ఎక్కువగా వాట్సప్ ఛాటింగ్ చేయడం ద్వారా అతినీలిలోహిత కిరణాల నుంచి కంటి సమస్యలు అలాగే మెడ నొప్పులు, నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ దామోదర్‌రెడ్డి చెబుతున్నారు. వాట్సప్ ఉపయోగాలివీ.. క్షణాల్లో ఫొటోలు, వీడియోలు, ఆడియోలు పంపవచ్చు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా సందేశాలు పంపవచ్చు. మిత్రులు, బంధువులు ఆపదలో ఉన్నప్పుడు ఆ విషయం తెలుసుకుని..రక్షించేందుకు ప్రయత్నించవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తొలి ఏడాది ఉచితంగా వాడవచ్చు. స్మార్ట్, ఫీచర్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. జాగ్రత్తలు తప్పనిసరి వాట్సప్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకతాయిలు ఫొటోలు తీసి గ్రూపులలో పెడుతుంటారు. దీనిపై నిఘా ఉంచాలి. ఫోన్ ఎవరికి పడితే వారి చేతికి ఇవ్వరాదు. ఓ పాస్వర్డ్ ఉంచుకుని సెల్‌ను వాడాలి. వేగంగా.. వాస్తవంగా.. వేగంగా..వాస్తవంగా ఉండే విషయాలను వాట్సప్ ద్వారా విలువైన సమాచారం సమాజానికి చేరవేయాలని గ్రూప్ తయారు చేశాను. నా ఆలోచన మంచి సత్ఫలితాలనిచ్చి ప్రముఖుల మన్ననలు పొందాను. గ్రూప్‌లో ఉన్నతాధికారులు ఉండటం ద్వారా వెంటనే సమస్యలు తెలిసిపోతోంది. – ఎం.ప్రభాకర్, గ్రూప్ అడ్మిన్ ప్రశ్నించే వేదిక.. ప్రస్తుత కాలంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ విషయంపై ప్రశ్నించడానికి వాట్సప్ ఒక మంచి వేదికగా మారింది. ఇలాంటి టెక్నాలజీ ద్వారా చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ మందికి చేరవేసే సిస్టమ్‌గా పనిచేస్తోంది. ఇది చాలా మందికి ఎంతో మేలు కలిగిస్తోంది. ఇలాంటి టెక్నాలజీ ప్రతి ఒక్కరూ మంచి కోసం ఉపయోగించుకోవాలి. – పృథ్విరాజ్, ఫార్మసీ విద్యార్థి నేరాలు అదుపు చేసేందుకు.. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో పోలీస్ శాఖకు వాట్సఫ్ చాలా కీలకంగా మారింది. ఏ మూలన నేరం జరిగిన క్షణాల్లో పోలీస్ ఉన్నతాధికారులకు తెలుస్తోంది. జిల్లాలో వాట్సప్ ద్వారా చాలా ఫిర్యాదులు వచ్చాయి. నేరాలు చేసిన వాళ్ల వివరాలు, గుర్తు తెలియని మృతదేహాల వివరాలు పోలీస్ శాఖ వాట్సప్ గ్రూప్‌లో పోస్టు చేయడం వల్ల సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. జిల్లా పోలీస్ శాఖ నుంచి అధికారికంగా ఓ వాట్సన్ నంబర్‌ను కూడా ప్రజలకు ఇచ్చాం. దీని ద్వారా ప్రజలు ఎక్కడ ఏం జరిగినా ఆ దానికి మెసేజ్ రూపంలో పంపించడానికి ఏర్పాటు చేశాం. –డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహబూబ్‌నగర్ -
మంత్రివర్గం కోసం ఓ వాట్సప్ గ్రూప్!
ఆయన ఓ రాష్ట్ర మంత్రి. తన సహచర సభ్యులంతా కలిసి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుగా వాట్సప్‌లో ఓ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇది జరిగింది పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో. సుపరిపాలన కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని భావించిన షా.. 'కేబినెట్' అనే పేరుతోనే ఈ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. అందులో మంత్రులతో పాటు సలహాదారులు, ప్రత్యేక సహాయకులు.. వీళ్లంతా కూడా ఉన్నారట. ఇంతకీ ఈ గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలుసా.. సాక్షాత్తు సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రే! కేబినెట్లోని మంత్రులంతా తమ తమ కార్యకలాపాలు, సమస్యల గురించి ఈ వాట్సప్ గ్రూపులో తెలియజేయాలని ఆయన చెప్పారు. దాంతో తమ పర్యటనలు, సమావేశాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలన్నింటినీ మంత్రులు ఈ గ్రూపులో షేర్ చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. -
గ్రూప్ పేరు మార్చి.. గొడవ పడి!
పుణే : వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లకే కాదు ఘర్షణలకూ దారితీస్తోంది. కేవలం గ్రూప్ పేరు మార్చినందుకు ఓ కాలేజీలో రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలవ్వగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన పుణేలోని గర్ వేర్ కాలేజీ సమీపంలో జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అక్షయ్ దింకర్ గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీబీఏ చదువుతున్న సంకేత్ సాలుంకే(22) పుట్టినరోజు గురువారం కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు కొంతమంది విద్యార్థులు తమ కాలేజీ వాట్సాప్ గ్రూప్‌లో సబ్జెక్టు లైన్ ను మార్చారు. సంకేత్ పేరు మీద సబ్జెక్ట్ ను పెట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సబ్జెక్ట్ లైన్‌ను మార్చాడు. దీనిని సంకేత్ స్నేహితుడు దింకర్ వ్యతిరేకించాడు. దీంతో రెండు గ్రూపుల మధ్య మొదలైన గొడవ.. ఘర్షణకు దారితీసింది. తర్వాత రోజు కాలేజీలో ఎదురుపడిన రెండు గ్రూపులు పరస్పరం దాడిచేసుకున్నాయి. సంకేత్తోపాటు, అతని నలుగురు నలుగురి స్నేహితులపై ప్రత్యర్థి గ్రూపు ఆయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో దింకర్ తీవ్రంగా గాయపడ్డాడని ఇన్ స్పెక్టర్ చెప్పారు. ప్రస్తుతం దింకర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సంకేత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 22 మంది వ్యక్తులపై ఈ కేసు నమోదైంది. ఐదుగురిని అరెస్ట్ చేసి, ఐపీసీ సెక్షన్ కింద అభియోగాలు మోపారు. -
వాట్సాప్ గ్రూప్ పెట్టాలంటే.. లైసెన్స్ తీసుకోవాలి!
శ్రీనగర్: వాట్సాప్‌లో గానీ, ఫేస్బుక్లో గానీ యూజర్లు ఎవరైనా ఉచితంగా గ్రూప్ ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, స్థానిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని.. వాట్సాప్ గ్రూపులపై ఉక్కుపాదం మోపాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్‌లో ఒక గ్రూప్‌ను నడిపించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, లైసెన్స్ లాంటి ధ్రువపత్రం సంబంధిత అధికారుల నుంచి పొందాలని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో యూజర్ల ప్రైవసీని వాట్సాప్ కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ముప్తి మెహబూబా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అల్లర్లకు ఆజ్యం పోస్తున్న సోషల్ మీడియా వేదికలపై ఉక్కుపాదం మోపాలని తాజాగా నిర్ణయించింది. దీంతో వాట్సాప్‌లో గ్రూప్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న నిబంధన కలిగిన తొలి ప్రాంతం ప్రపంచంలో ఇదే కావొచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. 'సోషల్ మీడియా న్యూస్ ఏజెన్సీస్ నిర్వాహకులందరూ తమ గ్రూప్‌లలో వార్తలు పోస్టు చేసేందుకు సబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని డివిజనల్ కమిషనర్ గురువారం ఆదేశాలు ఇచ్చారు' అని ప్రభుత్వ ప్రకటన ఒకటి మంగళవారం వెల్లడించింది. కశ్మీర్లో ఏ చిన్న అలజడి జరిగినా రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హంద్వారాలో కాల్పుల నేపథ్యంలో మూడురోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా వాట్సాప్ గ్రూపులపై కూడా ఆంక్షలు విధించడంపై కశ్మీర్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతా అత్యాధునిక సాంకేతికతతో ముందుకుసాగుతుంటే.. సోషల్ మీడియా వినియోగం విషయంలోనూ తమపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. -
వాట్సాప్‌లో 'ఆ' ఫొటోలు పెట్టి అరెస్టయ్యారు
న్యూఢిల్లీ: వాట్సాప్ గ్రూపులో ఇద్దరు వ్యక్తులు బూతు చిత్రాల (పోర్న్) ఫొటోలు, జోక్స్ పెట్టి చిక్కుల్లో పడ్డారు. అభ్యంతకరమైన ఫొటోలు, సమాచారం పెడుతుండటంతో వారిద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో వాట్సాప్ గ్రూపు అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు. మహిళల గురించి అసభ్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని వారి గురించి ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను మనోజ్, కుల్దీప్‌గా గుర్తించారు. వారికి స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే అనంతరం వారు పుచీకత్తు సమర్పించడంతో బెయిల్ మీద విడుదలయ్యారు. నిజానికి మనోజ్ వాట్సాప్ గ్రూపులో ఎలాంటి పోర్న్ వీడియోలు, ఫొటోలు పోస్టుచేయలేదని, కానీ అతను కుల్దీప్ను గ్రూపులో చేర్చడమే కాకుండా మహిళల ఫిర్యాదు చేసినా అతన్ని గ్రూపు నుంచి తొలగించేలేదని, అందుకే అడ్మినిస్ట్రేటర్ అయినా అతన్ని కూడా అరెస్టు చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాబట్టి వాట్సాప్ గ్రూపు అడ్మినిస్ట్రేటర్లు తస్మాత్ జాగ్రత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మీరు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపులో ఇతరులు అభ్యంతరకర సమాచారాన్ని పోస్టుచేసినా.. అందుకు మీరు బాధ్యత వహించాల్సి రావొచ్చు అని చెప్తున్నారు. -
చూడు తమ్ముడూ!
విషయాన్ని సుత్తి లేకుండా.. సూటిగా చెప్పడం చేతకాని వారెందరో.. వాట్సప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ దగ్గర అడ్డంగా బుక్కై పోతుంటారు. విషయ పరిజ్ఞానం ఉన్నా.. సింపుల్‌గా చెప్పడం తెలియని మేధావుల మెసేజ్‌లకు వాట్.. వాట్.. అనే రిప్లైలు వస్తుంటాయి. ఇంకొందరుంటారు.. అల్రెడీ ఫోన్లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న స్మైలీ బొమ్మలను రిప్లైగా పంపుతూ.. అదే క్రియేటివిటీ అని ఫీలైపోతుంటారు. భాషలో రాయలేని విషయాలెన్నో.. ఒక్క బొమ్మ చెప్పేస్తుంది. అలాంటి బొమ్మల కొలువుతో వచ్చేసింది.. దేఖ్ భాయ్ ఆండ్రాయిడ్ యాప్. ఇది ఆన్లైన్ ప్రపంచంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో రాజ్యమేలుతోంది. ఈ మధ్య.. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్.. ఇత్యాది మెసేజ్ ఓరియెంటెడ్ ఆన్లైన్లో కొత్తగా కొన్ని చిత్రాలు విచిత్ర సంభాషణలతో కిక్కెక్కిస్తున్నాయి. మాటలకందని ఎన్నో భావాలు ఒక్క హావభావంతో ఎదుటివారికి చేరిపోతాయి. ఇదే సూత్రాన్ని పాటిస్తూ రూపొందించిన దేఖ్భాయ్ యాప్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. కళ్లుమూసుకుని, ఓ చెయ్యెత్తి ఏదో సీరియస్‌గా చూస్తున్న ఓ గుండు బొమ్మపై.. దేఖ్ భాయ్ అని రాసుంటుంది. సందర్భోచితంగా మీరేదైనా మెసేజ్ రాసుకోవచ్చు. తర్వాత దాన్ని షేర్ చేస్తే చాలు. ఇందులోని ఇన్‌బిల్ట్ మెసేజ్‌లు కూడా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. హస్తీ హస్తీ.. దోస్తీ దోస్తీ.. ‘దేఖ్ భాయ్.. పైసే మాంగేతో ఫ్రెండ్షిప్ ఖతమ్’ (డబ్బులడిగావో.. దోస్తీ కట్) ఇదో రకం చిలిపి హెచ్చరిక సందేశం. దీన్ని పంపి చూడండి.. అట్నుంచి నవ్వులే రిప్లైగా వస్తాయి. బాయ్ బొమ్మ మాత్రమే కాదు.. ఓ పెద్దావిడ సీరియస్‌గా హితవు పలుకుతున్నట్టు ఉండే బొమ్మ.. కోపం, సంతోషం, హాస్యం.. ఇలా రకరకాల భావాలకు తగ్గట్టుగా ఉన్న బొమ్మలు ఇందులో ఉన్నాయి. పెద్దావిడ విషయానికి వస్తే.. ‘దేఖ్ బేటా..’ అని మొదలవుతుంది మెసేజ్. ‘దేఖ్ బేటా.. సోజా వర్నా ఫోన్ కో ఆగ్ లగాదూంగీ’ (పండుకో.. లేకపోతే ఫోన్‌కు నిప్పెట్టేస్తా..!) ఇలాంటి సరదా వార్నింగులెన్నో ఈ పెద్దావిడ బొమ్మను అడ్డం పెట్టుకుని పంపించేయొచ్చు. సెలబ్రిటీ హంగులు.. దేఖ్ భాయ్ ప్రస్థానానికి మూలం గుజరాతీ ‘జో బకా’ (చూడు మిత్రమా). ‘జో బకా’ మెసేజ్‌లు ఆన్లైన్లో ఎప్పట్నుంచో చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన దేఖ్ భాయ్ సిరీస్‌కు ఈతరం యువత రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతోంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ బొమ్మలేకాదు.. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, బాబా రాందేవ్, రాహుల్ గాంధీ, రజనీకాంత్.. ఇలా ఫేమస్ పర్సనాలిటీల చిత్ర విచిత్రమైన క్యారికేచర్లు కూడా ఈ సరదా సందేశాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బొమ్మలకు బ్యాక్ గ్రౌండ్లో కనిపించే ఎల్లో కలర్‌ను కూడా కస్టమైజ్డ్ గా మీ కిష్టమైన రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇన్‌బిల్ట్ బొమ్మలే కాదు.. కస్టమైజ్డ్గా ఫొటోలు కూడా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంది. ఏ ఎక్స్ప్రెషన్స్నైనా పలికించే బొమ్మలు ఉన్నాయి కదా అని దేఖ్ భాయ్‌ని ఎడాపెడా వాడేస్తే లాభం లేదంటారు హ్యూమరిస్టులు. ఆ భావానికి తగ్గ భాషను పలికించగలిగితేనే కిక్కు డోసు పెరుగుతుందని చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం ‘దేఖ్ భాయ్.. సోచ్ మత్.. డౌన్లోడ్ కర్..!!’.