
వాట్సాప్‌లో 'ఆ' ఫొటోలు పెట్టి అరెస్టయ్యారు
వాట్సాప్ గ్రూపులో ఇద్దరు వ్యక్తులు బూతు చిత్రాల (పోర్న్) ఫొటోలు, జోక్స్ పెట్టి చిక్కుల్లో పడ్డారు.
న్యూఢిల్లీ: వాట్సాప్ గ్రూపులో ఇద్దరు వ్యక్తులు బూతు చిత్రాల (పోర్న్) ఫొటోలు, జోక్స్ పెట్టి చిక్కుల్లో పడ్డారు. అభ్యంతకరమైన ఫొటోలు, సమాచారం పెడుతుండటంతో వారిద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో వాట్సాప్ గ్రూపు అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు. మహిళల గురించి అసభ్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని వారి గురించి ఓ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను మనోజ్, కుల్దీప్‌గా గుర్తించారు. వారికి స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే అనంతరం వారు పుచీకత్తు సమర్పించడంతో బెయిల్ మీద విడుదలయ్యారు.
నిజానికి మనోజ్ వాట్సాప్ గ్రూపులో ఎలాంటి పోర్న్ వీడియోలు, ఫొటోలు పోస్టుచేయలేదని, కానీ అతను కుల్దీప్‌ను గ్రూపులో చేర్చడమే కాకుండా మహిళల ఫిర్యాదు చేసినా అతన్ని గ్రూపు నుంచి తొలగించేలేదని, అందుకే అడ్మినిస్ట్రేటర్ అయినా అతన్ని కూడా అరెస్టు చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాబట్టి వాట్సాప్ గ్రూపు అడ్మినిస్ట్రేటర్లు తస్మాత్ జాగ్రత అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మీరు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపులో ఇతరులు అభ్యంతరకర సమాచారాన్ని పోస్టుచేసినా.. అందుకు మీరు బాధ్యత వహించాల్సి రావొచ్చు అని చెప్తున్నారు.