Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

media briefing on Operation Sindoor by Director General of Military Operations1
Operation Sindoor : ప్రారంభమైన DGMOల మీడియా సమావేశం

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ప్రారంభమైంది. ఉగ్రవాదులతోనే మా పోరాటంమనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాంఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌కానీ పాకిస్తాన్‌ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందిఉగ్రవాదానికి అండగా పాక్‌ నిలుస్తోందిఅందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాంఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దేవివిధ రకాల ఎయిర్‌ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాంపాక్‌ వివిధ రాకల డ్రోన్‌లను వినియోగించిందిమనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌తో అడ్డుకున్నాంచైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్‌ భారత్‌పై దాడి చేసిందివాటిని మనం ఆకాశ్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాంపాకిస్తాన్‌లోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడి చేసిందిఈ దాడిలో నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ పూర్తిగా ధ్వంసమైందిసైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్‌ చేసింది

India And Pakistan Ceasefire DGMO Meeting Updates2
డీజీఎంవోల చర్చల్లో ట్విస్ట్‌.. భారత్‌, పాక్‌ చర్చలు వాయిదా..

DGMO Meeting Updatesచర్చలు వాయిదా.. భారత్‌, పాకిస్తాన్‌ డీజీఎంవోల చర్చలు వాయిదా. ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్‌లైన్‌ ద్వారా రెండు దేశాల డీజీఎంవోలు చర్చలు జరపనున్నారు. చర్చలు ప్రారంభం..భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చర్చలు ప్రారంభం,హాట్‌లైన్‌లో భారత్‌, పాక్‌ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్‌ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్‌ డీజీఎంవో హాట్ లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్‌ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు.

Virat Kohli Announces Test Retirement Ahead Of England Tour3
రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ కోహ్లి

అనుకున్నదే జరిగింది.. ఊహాగానాలే నిజమయ్యాయి!.. అవును.. టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ మేరకు.. ‘‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించనే లేదు.ఈ ఫార్మాట్‌ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను.వైట్‌ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి.ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.. కానీ ఇందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది. నిజానికి నేను చేసిన దాని కంటే.. ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.టెస్టు కెరీర్‌ సంతృప్తికరం. నేనెప్పుడు దీని గురించి తలచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివిరిస్తుంది. #269.. ఇక సెలవు’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రంకాగా 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విరాట్‌ కోహ్లి.. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో జమైకా వేదికగా టీమిండియా ఆడిన తొలి టెస్టులో క్యాప్‌ అందుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు.చేదు అనుభవం తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో పది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొని 15 రన్స్‌ మాత్రమే చేయగలిగాడు. అయితే, ఈ చేదు అనుభవం తర్వాత కోహ్లి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.టీమిండియా మేటి టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. కెప్టెన్‌గానూ సంప్రదాయ క్రికెట్‌లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయం అందించాడు.తన కెరీర్‌లో మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 31 అర్ధ శతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254.రోహిత్‌తో పాటే..కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా రోహిత్‌ టెస్టులకు గుడ్‌ బై చెప్పిన ఆరు రోజులకే తానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాగా గత కొంతకాలంగా రోహిత్‌, కోహ్లి టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి చివరగా పెర్త్‌లో ఆస్ట్రేలియా మీద తన టెస్టు సెంచరీ సాధించాడు. ఇక రోహిత్‌, కోహ్లి వన్డేలలో మాత్రం కొనసాగనున్నారు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్‌ క్రికెటర్లు!

Debate On Chandrababu Selling Amaravati Land For 20K Crore Per Acre4
బిల్డప్‌ బాబాయ్ బడాయి!

అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్‌ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Ex Army chief Manoj Naravane Says War is not Bollywood movie5
యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్‌ సీరియస్‌

ఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్‌ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్‌ సినిమా కాదు.. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే తాజాగా మాట్లాడుతూ.. ‘భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అందరూ మాట్లాడుతున్నారు. అసలు యుద్ధం అంటే ఏం తెలుసా?. యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా అనుకుంటున్నారా?. యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదు. యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయినా దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తాను. యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారు. తెలివితక్కువ వాళ్ల వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా.. దాన్ని నివారించేందుకే మనం మొగ్గు చూపాలి. ఇప్పుడు చాలామంది పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా.. చర్చలతోనే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటాను. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి పూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి పరిస్థితులు ఉంటాయి. ఇవేవీ మిగతా వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. కొన్నిసార్లు దాడుల కారణంగా పిల్లలు సైతం తీవ్రంగా గాయపడతారు. యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. యుద్ధమంటే ఖరీదైన వ్యాపారం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌ సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్‌పై తీవ్రమైన చర్చ జరిగింది.మరోవైపు.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ ఒప్పందానికి భారత్‌ ఎందుకు ఒప్పుకుందని అటు ప్రతిపక్షాలు, సోషల్‌ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా భారత్‌కు జరిగిన లాభమేంటి? అని కామెంట్స్‌ చేశారు.

Kohli Test Retirement: BCCI Reaction Goes Viral, Fans Slams Never Be6
కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ ట్వీట్‌.. మండిపడుతున్న అభిమానులు

భారత టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli Retirement) సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు భారమైన హృదయంతో వెల్లడించాడు.బీసీసీఐ ట్వీట్‌ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కోహ్లికి కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్‌ చేసింది. ‘‘టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసిపోయింది.. కానీ వారసత్వం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుంది.టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు. అయితే, టీమిండియాకు ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. థాంక్యూ విరాట్‌ కోహ్లి’’ అంటూ కోహ్లి ఫొటోలు పంచుకుంది.దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా?అయితే, బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడికి వీడ్కోలు పలికే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో వరుస వైఫల్యాలకు కేవలం ఆటగాళ్లనే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ చురకలు అంటిస్తున్నారు.కాగా గత కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్‌ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2025ని 3-1తో చేజార్చుకుంది.రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి కూడాఈ రెండు సిరీస్‌లలోనూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి కూడా విఫలయ్యాడు. పెర్త్‌లో సెంచరీ బాదినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్‌ స్టంప్‌ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో దాదాపు ఎనిమిది సార్లు ఒకే రీతిలో అవుటయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగి.. అక్కడా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో రోహిత్‌, కోహ్లిల ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసేంత వరకు మాత్రం జట్టుతో ఉంటారని అంతా భావించారు. అంతలోనే బుధవారం రోహిత్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా.. తాజాగా కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు.కాగా రోహిత్‌ను వైదొలగాల్సిందిగా ముందుగానే సెలక్టర్లు కోరగా.. కోహ్లిని మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కోహ్లి కెప్టెన్సీ చేపట్టాలనే ఉద్దేశంతో ఉండగా.. ఇందుకు బీసీసీఐ నిరాకరించిందని బోర్డు సన్నిహిత వర్గాలు చెప్పడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.బలవంతంగా రిటైర్‌ అయ్యేలా చేశారనిమరోవైపు.. కోచ్‌గా గౌతం గంభీర్‌ విఫలమైనా ఎలాంటి చర్యలు చేపట్టని బీసీసీఐ.. రోహిత్‌, కోహ్లిలను మాత్రం బలవంతంగా రిటైర్‌ అయ్యేలా చేసిందని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఈ ఇద్దరూ.. ముఖ్యంగా టెస్టుల్లో భారత్‌ను అగ్రపథంలో నిలిపిన కోహ్లికి మైదానంలో ఘనంగా వీడ్కోలు పలకాల్సింది పోయి... ఇలా సోషల్‌ మీడియాలో సాధారణ ఆటగాళ్లలా రిటైర్మెంట్‌ ప్రకటించే దుస్థితి కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పది వేల పరుగులు చేస్తానంటూఒకవేళ కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకుంటే ఈ ఏడాది ఆరంభంలోనే సిడ్నీ టెస్టులోనే వీడ్కోలు ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పటికిప్పుడు వీరిద్దరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని కనిపిస్తోందంటున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగులు చేస్తానంటూ కోహ్లి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. కాగా కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 9230 పరుగులు చేశాడు. ఈ మైలురాయికి 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్‌ క్రికెటర్లు!

Congress Youth Leaders Block BJP MP Etela Rajender House7
తెలంగాణలో టెన్షన్‌.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

సాక్షి, మేడ్చల్‌: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్‌లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్‌స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను. డిస్‌స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Operation Sindoor: History Of Indian Army Uniforms Through The Decades8
ఇండియన్‌ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఇదే..!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ నాలుగు రోజుల పాటు పాక్‌ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత సైన్యం ధ్వంసం చేసింది. అలాగే పాకిస్తాన్‌ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది భారత్‌. గత శనివారమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేగాదు భారత్‌ ఉగ్రమూకల్ని మట్టుబెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అలాగే ఇండియన్‌ ఆర్మీ పవర్‌ ఏంటో దాయాది దేశానికి తెలిసి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి గస్తీ కాస్తూ.. ఆహర్నిశలు దేశాన్ని రక్షిస్తున్నా మన సైనికులు యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్‌ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఎదురులేని ధైర్యసాహసాలకు గర్వకారణమైన మన భారత సైనికుల యూనిఫాం..చూడగానే ఎక్కడ లేని దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒక్కసారిగా మన అటెన్షన్‌ కూడా గౌరవంతో కూడిన బాధ్యతగా వ్యవహరించేలా మారిపోతుంది. అలాటి ఆర్మీ యూనిఫాం వలస పాలన నుంచి ఎలా రూపుదిద్దుకుంటూ..సరికొత్త మార్పులతో వచ్చింది..?. పైగా సైనికులకు సౌకర్యంగా ఉండేలా ఫ్యాబ్రిక్‌ తీసుకురావడమే గాక ఆ రంగులనే ఎంచుకోవడానికి గల రీజన్‌ ఏంటో చూద్దాం..!.75 ఏళ్ల క్రితం..భారతీయ సాయుధ దళాల యూనిఫాంల మూలం వలసరాజ్యాల వారసత్వంగా వచ్చింది. మొదట్లో బ్రిటిష్ సైనిక సంప్రదాయం కొనసాగించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్‌ను తన బలమైన కోటగా మార్చుకున్న తర్వాత దేశాన్ని మూడు ప్రెసిడెన్సీలుగా విభజించింది. అవి బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పుడ మన భారతీయ సైనికులు బ్రిటిష్ సహచరుల మాదిరిగానే పాక్షికంగా ఎరుపు రంగు యూనిఫాంలు ధరించేవారు. అయితే ఈ ఎరుపు రంగు వల్ల యుద్ధభూమిలో చాలా స్పష్టంగా కనిపించేవారు. దాంతో విపరీతమైన ప్రాణనష్టం జరిగేదట. అప్పుడే యూనిఫాంలో మార్పు అవసరం అనేది గుర్తించారట. ఖాకీ ఎప్పుడు వచ్చిందంటే..1848లో, అధికారులు సర్ హ్యారీ బర్నెట్ లమ్స్‌డెన్, విలియం స్టీఫెన్ రైక్స్ హాడ్సన్ భారతదేశంలోని బ్రిటిష్ వలస దళాల కోసం ఖాకీ యూనిఫామ్‌లను ప్రవేశపెట్టారు. ఉర్దూలో దుమ్ము రంగు అని అర్థం వచ్చే "ఖాకీ",రంగు భారతీయ ప్రకృతి దృశ్యంతో బాగా కలిసిపోయింది. పైగా దీని కారణంగా ప్రాణ నష్టం తగ్గిందట కూడా. 1857 భారత తిరుగుబాటు సమయానికి, భారతదేశం అంతటా బ్రిటిష్ దళాలు ఖాకీని విస్తృతంగా స్వీకరించాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలను ప్రభావితం చేసి..క్రమంగా వరల్డ్‌ ఫీల్డ్ యూనిఫామ్‌ల రంగుగా మారింది.స్వేచ్ఛకు సంకేతంగా మార్పు..1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని కాస్తా ఇండియన్ ఆర్మీగా పేరు మార్చారు. అలాగే పాక్‌ నుంచి వేరై..దేశభక్తిని సూచించేలా ఆలివ​ ఆకుపచ్చ రంగుని ఎంచుకుంది.అలాగే బ్రిటిష్ యూనిట్ చిహ్నాలు, ర్యాంక్ బ్యాడ్జ్‌లను తీసేసి జాతీయ చిహ్నాలతో భర్తీ చేశారు. ఇక పాక్‌ సైన్యం నెలవంకను ఎంచుకుంటే..భారత్‌ తమ సైన్యం కోసం అశోక చిహ్నాన్ని తీసుకుంది. సైనిక సవాళ్లను అధిగమించడం కోసం..1980లు–1990ల సమయంలో భారత సైన్యం చాలా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుండేది. ముఖ్యంగా ఈశాన్య జమ్యూ కశ్మీర్‌ వంటి క్లిష్ట భూభాగాలలో సైనికులు యూనిఫాం కనిపంచకుండా ఉండేలా చేయాలసి వచ్చేది. అందుకోసం 1980లలో ఆర్మీ మట్టితో కూడిన ఆకుపచ్చ రంగులను, గోధుమ రంగులను ప్రవేశ పెట్టింది. ఇవి సైనికులను అడవులు, కొండప్రాంతా ప్రకృతి దృశ్యాలలో కలిసిపోయేందు ఉపకరించింది. 2000ల ప్రారంభంలో మరింతగా మార్పులు చేశారు..2000ల ప్రారంభం నాటికి, భారత సైన్యం PC DPM (డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ మెటీరియల్) యూనిఫామ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఫ్రెంచ్ సైన్యంలో ఉపయోగించిన నమూనాల నుంచి ప్రేరణ పొందింది. భారతీయ అవసరాలకు అనుగుణంగా, పిక్సెల్ లాంటి నమూనాతో ఆకర్షణీయమైన లుక్‌తో డిజైన్‌ చేశారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌తో సహా సైనికుడు లుక్‌కి ఓ ప్రేరణగా నిలిచింది. అయితే ఇది అడవులు వంటి ఎత్తైన ప్రాంతాలలో బాగా పనిచేసినప్పటికీ..రాజస్థాన్‌ వంటి ఎడారి రాష్ట్రాల్లో ఇది సరైనది కాదని తేలింది. 2022: యూనిఫాంలో ఒక మైలురాయి మార్పుప్రస్తుతం భారత సైన్యం ధరిస్తున్న యూనిఫాం మార్పు 2022లో జరిగింది. ఆర్మీ దినోత్సవం నాడు భారత సైన్యం తన తాజా డిజిటల్ కామఫ్లాజ్ యూనిఫామ్‌ను ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది. తేలికగా, గాలిని పీల్చుకునేలా త్వరగా ఆరిపోయే కాటన్-పాలిస్టర్ మిశ్రమంతో తీసుకొచ్చింది. ఇది ఆధునిక సైనిక అవసరాలకు అనువగా ఉండటమే గాక అడవుల నుంచి ఎడారుల వరకు అన్ని భారతీయ భూభాగాలను అనుగుణంగా ఏకరీతిలో ఉండేలా డిజైన్‌ చేశారు.(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..)

Telugu Movies Streaming On OTT In May 3rd Week 20259
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే

మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో గతవారం రిలీజైన సింగిల్, శుభం చిత్రాలే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గర మూవీస్ ఏం లేవు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) ఉన్నంతలో 8 సినిమాలు-సిరీసులు మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజులు ఉండొచ్చు. ఈ వారం చూడదగ్గ వాటిలో మరణమాస్, నెసిప్పయ, భోల్ చుక్ మాఫ్ చిత్రాలు ఉన్నంతలో చూడొచ్చని అనిపిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 12-18 వరకు)నెట్ ఫ్లిక్స్సీ4 సింటా (తమిళ సినిమా) - మే 12హాట్ స్టార్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 13హై జునూన్ (హిందీ సిరీస్) - మే 16వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17అమెజాన్ ప్రైమ్భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) - మే 16సోనీ లివ్మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15సన్ నెక్స్ట్ నెసిప్పయ (తమిళ సినిమా) - మే 16బుక్ మై షో స ల టే స ల న టే (మరాఠీ సినిమా) - మే 13మనోరమ మ్యాక్స్ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) - మే 12(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా)

End of the iPhone Era AI Powered Innovations and Industry Shifts10
ఐఫోన్‌ అంతరించనుందా..?

ఏఐ ఆధారిత టెక్నాలజీలు చివరికి స్మార్ట్‌ఫోన్ల స్థానాన్ని భర్తీ చేయగలవని, వినియోగదారులు వ్యక్తిగత పరికరాలతో సంభాషించేలా ఈ సాంకేతికతలు కీలక మార్పులు తెస్తాయని యాపిల్‌ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్డీ క్యూ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో ఐఫోన్ లభ్యతపై ఈ ప్రభావం ఉండనుందని చెప్పారు. ఇటీవల యాంటీట్రస్ట్ ట్రయల్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఐపాడ్ ఒకప్పుడు మ్యూజిక్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగం తగ్గిపోయింది. చివరకు ఐపాడ్‌లను నిలిపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి ఏఐ-ఆధారిత ప్రత్యామ్నాయాలు మనం కమ్యూనికేట్ చేసే సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారుతుంది. ఈ మార్పు రానున్న రోజుల్లో ఐఫోన్లను రిప్లేస్‌ చేసే అవకాశం ఉంది’ అని ఎడ్డీ ‍క్యూ తెలిపారు.యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీలు‘వచ్చే తరం కంప్యూటింగ్‌లో ముందుండాలనే లక్ష్యంతో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీలను అన్వేషిస్తోంది. మెటా వంటి కంపెనీలు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఏఐ ఇంటిగ్రేటెడ్ వేరబుల్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్లకు మించి మెరుగైన సామర్థ్యం, అంతరాయం లేని కనెక్టివిటీని ఈ టెక్నాలజీలు అందించే అవకాశం ఉంది. వాయిస్ కంట్రోల్డ్‌ అసిస్టెన్స్‌, రియల్-టైమ్ కాంటెక్స్ట్‌వల్‌ అవేర్‌నెస్‌, అడాప్టివ్ ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ వంటి ఆవిష్కరణలు వచ్చే రోజుల్లో ప్రామాణికంగా మారవచ్చు’ అని క్యూ అన్నారు.ఇదీ చదవండి: బలంగా ఎదిగేందుకు భారత్‌ సిద్ధంయాపిల్ విజన్‘ఐఫోన్ యాపిల్‌కు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్, స్మార్ట్ డివైజ్ ఎకోసిస్టమ్స్‌లో యాపిల్ సాధించిన పురోగతితో కంపెనీ వ్యూహాత్మకంగా తదుపరి తరం కంప్యూటింగ్‌లో ముందంజలో ఉంది’ అని క్యూ చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement