200 మంది ఉద్యోగులు గాలిలో.. | 200 employees in the don't desire of govt | Sakshi
Sakshi News home page

200 మంది ఉద్యోగులు గాలిలో..

Published Wed, Jun 4 2014 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

200 మంది ఉద్యోగులు గాలిలో.. - Sakshi

200 మంది ఉద్యోగులు గాలిలో..

సచివాలయంలో వింత పరిస్థితి  వారిని ఏ రాష్ట్రానికి కేటాయించని కేంద్రం
సాధారణ పరిపాలన శాఖ నిర్వాకమే కారణం
తెలంగాణకు చెందిన వారినీ ఆ రాష్ట్రానికి కేటాయించలేదు

 
హైదరాబాద్:కేం రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల పంపిణీ విషయంలో సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ నిర్వాకం కారణంగా చాలా మంది ఉద్యోగుల పరిస్థితి ఎటూ తేలకుండా గాలిలో ఉన్నట్లుంది .కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన జారీ చేసిన ఉద్యోగుల పంపిణీ ఆదేశాల్లో సచివాలయంలో పనిచేస్తున్న సుమారు 200 మంది అధికారులు, ఉద్యోగుల పేర్లు లేవు. తెలంగాణకు చెందిన ఉద్యోగులను కూడా ఆ రాష్ట్రానికి కేటాయించలేదు. రాష్ట్ర ప్రణాళికా శాఖలో డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారులతో పాటు మొత్తం 30 మంది పరిస్థితి ఇలానే ఉంది. మున్సిపల్ శాఖలోను, అలాగే సచివాలయంలోని పలు శాఖల్లో రికార్డు అసిస్టెంట్లను ఏ రాష్ట్రానికి కేటాయించకుండా వదిలేశారు. దీంతో తెలంగాణకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ విషయంపై ఆర్థిక శాఖను సంప్రదించగా కేంద్రం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని బదులిస్తున్నారు.

సర్వీసెస్ అధికారుల నిర్వాకం కారణంగానే ఈ ఉద్యోగులు ఇలా మధ్యస్థంగా మిగిలిపోయారనే విమర్శ వినిపిస్తోంది. కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు సచివాలయంలో రెగ్యులర్‌గా పనిచేయడానికి వీలుంది. అయితే ఇలాంటి అధికారులు, ఉద్యోగులను డిప్యుటేషన్ పేరుతో సాధారణ పరిపాలన శాఖ కేంద్రానికి జాబితా పంపడం వల్లే ఆ అధికారులు, ఉద్యోగులను పంపిణీ చేయలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్లీ తప్పును సరిచేసి జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉందని, అప్పుడే ఆ ఉద్యోగులు, అధికారులను పంపిణీ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరికీ పంపిణీ చేయని అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఉంటారనేది ఆంధ్రప్రదేవ్ పునర్ విభజన - 2014 చట్టం చెపుతోంది. సర్వీసెస్ అధికారుల నిర్వాకం వల్లే తెలంగాణ ఉద్యోగులు, అధికారులను ఆ రాష్ట్రానికి పంపిణీ చేయలేదని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement