
270 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు రూరల్ : ఏజెన్సీ నుంచి మైదానానికి వాహనంలో తరలిస్తున్న 270 కిలోల ఎండు గంజాయిని గురువారం సాయంత్రం పాడేరు పోలీసులు పట్టుకున్నారు. దీనివిలువ రూ.6 లక్షలు ఉంటుం దని అంచనా.జి.మాడుగుల మండ లం బంధవీధి నుంచి బొలేరో వాహనంలో పాడేరు మీదుగా చోడవరానికి గంజాయి తరలిస్తున్నట్టు అందిన ముందస్తు సమాచారం మేరకు పోలీసులు పాడేరు-జి.మాడుగుల ర హదారిలోని కరకపుట్టు జంక్షన్ వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశామని ఎస్‌ఐ సూర్యప్రకాశ్ చెప్పారు. బంధవీధికి చెందిన ఉడిపి వరహాలును అరెస్ట్ చేశారు.