గుంటూరుకు చెందిన విశ్రాంత అటవీ శాఖ అధికారి బసవారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు.
గుంటూరు: గుంటూరుకు చెందిన విశ్రాంత అటవీ శాఖ అధికారి బసవారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బసవారెడ్డికి చెందిన 13 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. డిప్యూటీ కన్జర్వేటర్‌గా విధులు నిర్వర్తించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై బసవారెడ్డి కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపైనా దాడులు సాగుతున్నాయి.