ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో మంగళవారం శ్రీ దేవీశరన్నవరాత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు సోమవారం తెలిపారు.
శ్రీశైలం (కర్నూలు జిల్లా) : ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో మంగళవారం శ్రీ దేవీశరన్నవరాత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు సోమవారం తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీశైలాలయప్రాంగణాన్ని విద్యుత్ అలంకరణలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు.
ప్రధాన రాజగోపురం మొదలుకొని భ్రమరాంబాదేవి ఆలయగోపురాలు, స్వామివార్ల ఆలయప్రాంగణం విద్యుత్ వెలుగులతో కనువిందు చేస్తున్నాయి. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సమూర్తులను పుష్పాలంకృతశోభితంగా చేయడానికి చేమంతి, బంతి, అస్టర్,కార్నెహన్,గులాబి, నందివర్ధనం, గన్నేరు, దేవగన్నేరు, లిల్లీ తదితర పూలతో స్వామిఅమ్మవార్లను అలంకరించనున్నారు.