హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే పదినిముషాలు పాటు వాయిదా పడ్డాయి. శనివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్.. ఐకేపీ, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.
మరో మార్గంలో ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ సూచించారు. ఐకేపీ ఉద్యోగుల సమస్యల అంశం తీవ్రమైనదే అయినప్పటికీ...అత్యవసరంగా చర్చించాల్సింది కాదని అన్నారు. అయితే వాయిదా తీర్మానం తిరస్కరించినా కనీసం మంత్రితో సమాధానమైనా చెప్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని వాయిదా తీర్మానంపై సమాధానం చెప్పేది లేదని స్పష్టం చేశారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ అసెంబ్లీని పది నిమిషాలు వాయిదా వేశారు.
చర్చకు వైఎస్ఆర్ సీపీ సభ్యుల పట్టు, అసెంబ్లీ వాయిదా
Published Sat, Dec 20 2014 9:34 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement