అంతా అవినీతే..
ఎమ్మెల్యే నారాయణస్వామి
తిరుపతి మంగళం: ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వా మి ఆరోపించారు. గురువారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ కొత్త రాజధాని పేరుతో వేల ఎకరాల భూ ములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొంటున్నారన్నారు. అందులో 25 శాతం రాజధాని నిర్మించి, మిగిలిన భూములను సింగపూర్ సంస్థలకు అ ప్పగించి, రూ.వేల కోట్లు దండుకునేందుకు చంద్రబాబు ప్రణాళిక రూ పొందించారని ఆరోపించారు. ప్రపంచదేశాల్లో తన గొప్పను చాటుకోవడానికి గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
గోదావరి పుష్కరాలకు వ చ్చిన భక్తులకు కనీస వసతులు కల్పిం చడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే 28మంది భక్తులు తొక్కిసలాటలో మృతి చెందారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ని జంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై గూండాయిజం చేస్తున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
ఇదంతా చూస్తుంటే ఎవరికి నచ్చినట్లు వారు చేయండి, ఏదైనా వస్తే తాను చూసుకుంటానని చంద్రబాబే ఆ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చినట్లు ఉన్నారన్నారు. మహిళా తహశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందన్న స్వార్థంతో కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామంటూ కాలయాపన చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.