సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆదివారం ప్రారంభించారు. సీఆర్‌డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనానికి కూడా జస్టిస్ రంజన్ గొగోయ్ శంకుస్థాపన చేశారు.
ఇక, హైకోర్టు తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై ఇంతవరకూ పూర్తి స్పష్టత లేదు. ఫిబ్రవరి 15 అనంతరం ఈ భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment